Uttarkhand
-
ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం
ఢిల్లీ : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు పెను హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. విధుల నిమిత్తం రాజీవ్ కుమార్‌తో పాటు ఉత్తరాఖండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విజయ్‌కుమార్ జోగ్దండ్లు హెలికాప్టర్లో మున్సియరికి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మార్గం మధ్యలో అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రయాణం గతితప్పింది. దీంతో పైలెట్ హెలికాప్టర్‌ను ఉత్తరఖండ్‌లోని మున్సియరీకి సమీపంలోని మారుమూల ప్రాంతమైన రాలంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.ఈ ఘటనలో ఇద్దరు అధికారులతో పాటు పైటల్ క్షేమంగా ఉన్నారని, ఎలాంటి గాయాలు కాలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఎయిర్ లిఫ్టింగ్.. నదిలో పడిపోయిన హెలికాప్టర్
డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్‌తో అధికారులు లిఫ్ట్ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.‘‘ఎంఐ-17 హైలికాప్టర్ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్‌ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్‌కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw— Press Trust of India (@PTI_News) August 31, 2024 -
ఉత్తరాఖండ్‌లో కూలిన సిగ్నేచర్ బ్రిడ్జ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్ బ్రిడ్జ్ కూలిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదని అధకారులు తెలిపారు. ఉత్తరఖండ్ రుద్రప్రయాగ్‌లోని నార్కొట గ్రామ సమీపంలో భద్రినాథ్‌పై నిర్మిస్తున్న సిగ్నేచర్ వంతెన కూలిపోయింది. ఇటువంటి సిగ్నేచర్ వంతెన రాష్ట్రంలో నిర్మించటం తొలిసారి కావటం గమనార్హం. ఈ వంతెనను ఆర్సీసీ డెవలపర్స్ కంపెనీ సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.Under-construction Signature Bridge in Uttarakhand's Rudraprayag has collapsed. The same bridge had collapsed on July 20, last year, after heavy rain.#Uttarakhand #Rudraprayag #SignatureBridge pic.twitter.com/I3Sf0lpvfE— Vani Mehrotra (@vani_mehrotra) July 18, 2024 ‘ఈ వంతెన ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు కూలిపోయింది. అయితే పునాది గట్టినాగే ఉన్నప్పటికీ వంతెన టవర్ కుప్పకూలింది. ఈ ఘటనపై టెక్నికల్ కమిటి దర్యాప్తు చేస్తోంది. కూలిపోవడానికి గల కారణాలను కనుగొంటున్నారు’ అని అధికారులు తెలిపారు. సాధారణంగా రోజు 40 మంది కార్మికులు వంతెన నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ రోజు ఎవ్వరు లేకపోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధకారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు మీడియాతో మాట్లాడారు. ‘ఈ వంతెన నిర్మాణ పనులు చాలా నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణాన్ని హైవే అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టును మరో కంపెనీ ఎందుకు ఇవ్వకుడదు?’ అని అన్నారు. -
ఉత్తరాఖండ్- నేపాల్ సరిహద్దుల మూసివేత.. కారణమిదే!
ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా, ఉత్తరాఖండ్- నేపాల్ సరిహద్దులను నేటి(మంగళవారం) సాయంత్రం 5 గంటల నుండి 72 గంటల పాటు మూసివేయనున్నారు. అలాగే సరిహద్దు భద్రత కోసం ఎస్ఎస్బీ సిబ్బందిని నియమించారు. ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటల నుండి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్- నేపాల్ సరిహద్దులను మూసివేయనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఓటింగ్ ప్రకియ ముగిసిన తర్వాత భారత్-నేపాల్ సరిహద్దులు తెరవనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేపాల్ నుంచి భారత్ వచ్చేందుకు లేదా నేపాల్ వెళ్లడానికి ఆర్మీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నేపాల్.. ఉత్తరాఖండ్‌తో పలు సరిహద్దులను పంచుకుంటుంది. ఈ సరిహద్దులన్నింటిలో ఆర్మీ సిబ్బందిని మోహరించారు. -
76 రోజుల తర్వాత ఉత్తరకాశీ సొరంగం పనులు షురూ!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్యారా సొరంగంలో ప్రమాదం చేసుకున్న 76 రోజుల తరువాత తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బార్కోట్ వైపు నుంచి ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా రోడ్డు సొరంగంలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా సొరంగం మధ్య షట్టరింగ్ పనులు ప్రారంభించారు. అలాగే సిల్క్యారా వైపు నుంచి సొరంగం ముఖద్వారం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సమాచారాన్ని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ప్రాజెక్ట్ మేనేజర్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాకు తెలిపారు. రానున్న 15 రోజుల్లో ఈ పనులు మరింత వేగవంతం కానున్నాయి. సొరంగంలోని సున్నిత ప్రదేశాల్లో ఎస్కేప్ టన్నెల్స్ రూపంలో పైపులు వేస్తున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం, సిల్క్యారా వైపు ముఖద్వారం మధ్య దాదాపు 100 మీటర్ల సున్నిత ప్రాంతంలో రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ టన్నెల్ ద్వారా కార్మికులను పనులు చేసేందుకు లోపలికి పంపుతున్నారు. 2023, నవంబర్ 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. 17 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన దరిమిలా నవంబర్ 12 నుంచి సొరంగ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ సొరంగంలో ఇంకా 480 మీటర్లు మేర తవ్వాల్సి ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ పలువురు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న తరువాత సొరంగం పనులకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో సొరంగం ముఖద్వారం నుంచి సిల్క్యారా వైపు 100 మీటర్ల సెంటర్ వాల్ (సెపరేషన్ వాల్) షట్టరింగ్ పనులు జరుగుతున్నాయని నిర్మాణ పనులు చేపడుతున్న గజ కంపెనీ అధికారులు తెలిపారు. -
'అది కోట్ల ఆశల విజయం'.. దిగ్గజ వ్యాపారవేత్తల స్పందన
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ గ్రూప్‌నకు చెందిన హర్ష్ గోయెంకా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా మంగళవారం ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్పందించారు. ఉత్తరాఖండ్‌లో 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను సురక్షితంగా రక్షించడంతో ఆపరేషన్ పూర్తయింది. నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో కార్మికులు 17 రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయారు. దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. చివరకు మంగళవారం అందరినీ విజయవంతంగా బయటకుతీశారు. దాంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రెస్క్యూ సిబ్బంది, కార్మికులకు అభినందనలు తెలిపారు. రెస్క్యూ వర్కర్లకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన ఎక్స్ ఖాతా ద్వారా సెల్యూట్ చేశారు. ఈ పోరాటంలో కోట్లాది మంది దేశప్రజల ఆశ ఫలించిందని ఆయన అన్నారు. 17 రోజుల పాటు ధైర్యం కోల్పోకుండా తిరిగి వచ్చిన 41 మంది కార్మికుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో సహా ఈ రెస్క్యూ మిషన్‌లో భాగంమైన అందరికీ అభినందనలు చెప్పారు. దేశ ప్రగతికి బాటలు వేసే ఈ కార్మిక సోదరులందరికీ మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. जीवन और मृत्यु के मैराथन संघर्ष के बीच यह करोड़ों देशवासियों के ‘उम्मीद’ की जीत है। 17 दिन तक एक सुरंग से बिना हिम्मत हारे वापिस लौटने वाले सभी 41 श्रमिकों के आत्मबल को मेरा प्रणाम। NDRF और SDRF की टीमों समेत इस रेस्क्यू मिशन को सफल बनाने वाले हर एक सदस्य को साधुवाद। हम देश की… — Gautam Adani (@gautam_adani) November 28, 2023 మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ విజయవంతం కావడంలో 'రాథోల్ మైనర్ల' పాత్రను ప్రశంసించారు. అధునాతన డ్రిల్లింగ్ పరికరాల తర్వాత, వీరు కీలకంగా మారి చివరి నిమిషంలో కార్మికులను కాపాడారని కొనియాడారు. ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ పరిస్థితిని వివరించినందుకు అభినందనలు తెలిపారు. And after all the sophisticated drilling equipment, it’s the humble ‘rathole miners’ who make the vital breakthrough! It’s a heartwarming reminder that at the end of the day, heroism is most often a case of individual effort & sacrifice. 🙏🏽👏🏽👏🏽👏🏽🇮🇳 #UttarakhandTunnelRescue pic.twitter.com/qPBmqc2EiL — anand mahindra (@anandmahindra) November 28, 2023 ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా 41 మంది ప్రాణాలను కాపాడటంలో శ్రమించినందుకు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఇండియాకు వ్యతిరేకంగా రన్నులు కొట్టారన్నారు. కానీ అదే దేశానికి చెందిన డిక్స్ మాత్రం ఇండియాలోని 41 మంది కార్మికులను కాపాడేందుకు శ్రమించారని తెలిపారు. #Maxwell digs a hole against India #INDvsAUS But hey, an Aussie led a different kind of dig saving 41 lives! 💪 My gratitude to NDRF , SDRF, Army, our rat miners and all those involved in this incredible rescue mission. 🇮🇳🇮🇳 #UttarakhandTunnelRescue — Harsh Goenka (@hvgoenka) November 28, 2023 బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా రెస్క్యూ వర్కర్లను ప్రశంసించారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డానికి వీరోచితంగా పోరాడిని సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు. Uttarkashi Tunnel Rescue Operation Live Updates: All Workers Rescued Safely - Heroic and outstanding sense of duty displayed by rescuers. Enduring resilience displayed by those rescued. Makes our nation proud🙏🙏👏👏👏 https://t.co/q2vqmUTRsG — Kiran Mazumdar-Shaw (@kiranshaw) November 28, 2023 -
ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చే విషయంలో కీలక పురోగతి. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ఉన్న కార్మికులు ఎట్టకేలకు వెలుగు చూసే క్షణాలు సమీపిస్తున్నాయి. దీంతో అక్కడంతా ఉత్కంఠ వాతావారణం నెలకొంది. ఈ ఉద్వేగభరిత క్షణాలకోసం కుటుంబ సభ్యులతో పాటు, రెస్క్యూ ఆపరేషన్ టీం ఎదురు చూస్తున్నారు. టన్నెల్లో అమర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. మరోవైపు కార్మికులు బైటికి వచ్చిన వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధిత మెడికల్ ఆఫీసర్లు కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సిల్క్యారా సొరంగం ప్రవేశ ద్వారం వద్ద నలభై ఒక్క అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా కార్మికులను సమీప వైద్య శాలలకు తరలిస్తారు. ఇందు కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. తద్వారా బయటికి వచ్చిన కార్మికులదరిన్నీ హుటాహుటిన ఈ సొరంగం నుండి 30 కి.మీ దూరంలో ఉన్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తారు. కార్మికులకు స్వాగతం పలికేందుకు పూలమాలలు కూడా సిద్ధం చేశారు. #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel rescue: Rishikesh AIIMS on alert mode for medical services. A 41-bed ward including trauma center ready. A team of cardiac and psychiatric specialist doctors including trauma surgeon ready. Three helicopters can be landed simultaneously at… pic.twitter.com/Xesrf1zc6u — ANI (@ANI) November 28, 2023 ఒక్కో వ్యక్తిని బయటకు తీయడానికి మూడు నుండి ఐదు నిమిషాలు పడుతుంది. కాబట్టి, మొత్తం 41 మంది కార్మికులను రక్షించేందుకు నుండి నాలుగు గంటల సమయం పడుతుందని ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూపై NDMA సభ్యుడు లెఫ్టినెంట్జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ చెప్పారు. ప్రతి కార్మికుడికి సత్వర వైద్య సంరక్షణ అందించేలా 41 ఆక్సిజన్‌తో కూడిన పడకలతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. వర్కర్లు అందర్నీ రెస్క్యూ చేయనున్నట్లు కార్మికులకు తక్షణ వైద్యం సహాయం అందించేందుకు అంబులెన్సులు కూడా చేరుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రస్తుత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న వారికి యూపీ ప్రభుత్వం తరపున ప్రభుత్వ సమన్వయకర్త అరుణ్ మిశ్రా ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే కార్మికులంతా బైటికి రానున్నారని తెలిపారు. VIDEO | "It will take about three to five minutes to pull out one individual each. So, it will take about three to four hours to rescue all 41 workers," says Lt Gen (Retd) Syed Ata Hasnain, NDMA member, on Uttarkashi tunnel rescue.#UttarkashiTunnelRescue #SilkyaraTunnelRescue pic.twitter.com/AJ7bHXOVIS — Press Trust of India (@PTI_News) November 28, 2023 बाबा बौख नाग जी की असीम कृपा, करोड़ों देशवासियों की प्रार्थना एवं रेस्क्यू ऑपरेशन में लगे सभी बचाव दलों के अथक परिश्रम के फलस्वरूप श्रमिकों को बाहर निकालने के लिए टनल में पाइप डालने का कार्य पूरा हो चुका है। शीघ्र ही सभी श्रमिक भाइयों को बाहर निकाल लिया जाएगा। — Pushkar Singh Dhami (@pushkardhami) November 28, 2023 -
Cloudburst: యాభై మందికిపైగా మృతి
ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు ఉత్తరాదిన జల ప్రళయాన్ని సృష్టించాయి. వర్షాలకు తోడు అకస్మిక వరదలు పోటెత్తడంతో ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యక్తం చేశాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కొండల్లో నుంచి వచ్చిన వరద నీటితోపాటు కొట్టుకువచ్చిన బురద, మట్టి వందలాది ఇళ్లను నేలమట్టం చేసింది. #WATCH | River flowing in full spate along road to Prashar Lake in Mandi district of Himachal Pradesh pic.twitter.com/01MxFkRmC6 — ANI (@ANI) August 14, 2023 41 మంది మృతి హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలతో పలుచోట్ల కొండచరియలు పేకమేడల్లా విరిగిపడుతున్నాయి.https://www.sakshi.com/telugu-news/national/954-police-medals-including-63-telugu-sates-onn-independence-day-eve-1735070 ఇప్పటి వరకు ఈ రకమైన ఘటనల్లో 41 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోవడం, నదుల నీటి మట్టం పెరిగి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. చదవండి: 954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక #UPDATE | A total of 41 people have lost their lives in Himachal Pradesh due to landslides and incessant rainfalls in the region. Search and rescue operation is underway: CMO Himachal Pradesh https://t.co/I7BYA9rsmQ — ANI (@ANI) August 14, 2023 జల ప్రళయానికి సాక్ష్యం తాజాగా మండీ జిల్లాలో భారీ వర్షంతో ఆకస్మిక వరదలు వచ్చి ఏడుగురు కొట్టుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్వయంగా ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు. వీడియో చూస్తుంటే అక్కడ జల ప్రళయం ఎలా ఉంది అనటానికి సాక్ష్యంగా నిలుస్తోంది. చదవండి: తండ్రీకొడుకుల్ని బలిగొన్న నీట్.. స్టాలిన్ ఆవేదన #UPDATE | A total of 41 people have lost their lives in Himachal Pradesh due to landslides and incessant rainfalls in the region. Search and rescue operation is underway: CMO Himachal Pradesh https://t.co/I7BYA9rsmQ — ANI (@ANI) August 14, 2023 కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి అంతకుముందు భారీ వర్షాలకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది చనిపోయారు. సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో ఆదివారం ఆకస్మిక వరదలు సంభవించడంతో రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. మరో ఘటనలో సిమ్లా నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం వద్ద కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మరణించారు. #WATCH | Solan, Himachal Pradesh: Restoration work underway by administration near Chakki Mod after a landslide occurred near Shimla-Kalka highway (Parwanoo). pic.twitter.com/lBkyv64c5G — ANI (@ANI) August 14, 2023 ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు సోలన్ జిల్లాలోని బలేరా పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. రామ్‌షెహెర్ తహసీల్‌లోని బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి మరో మహిళ చనిపోయింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హమీర్‌పూర్‌లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా జిల్లావాసులందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. #WATCH | Rise in water level of river Ganga in Rishikesh due to heavy rainfall in Uttarakhand pic.twitter.com/ghdSjc6FVs — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 విద్యాసంస్థలు బంద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 14 (సోమవారం) మూసివేస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను దూరంగా వెళ్లాలని ఆయన కోరారు. అలాగే ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర పర్యటనను టూరిస్టులు వాయిదా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం మరోవైపు వర్షాలతో అల్లకల్లోమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వరద కారణంగా సంభవించిన మరణాలు చాలా బాధాకరమైనవని పేర్కొన్నారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం వరదల కారణంగా రాష్ట్రంలో 752 రోడ్లను మూసేశారు. వరదలు కొండచరియలు విరిగిపడటం వల్ల హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో రూ. 7020.28 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ఆదివారం పేర్కొన్నారు. #WATCH | Uttarkhand CM Pushkar Singh Dhami is conducting an aerial survey of Mohanchatti, the disaster-affected area of Yamkeshwar block of Pauri district. pic.twitter.com/v2ERGRMF5M — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 621 రోడ్లు మూసివేత మండి, సిమ్లా, బిలాస్పూర్ జిల్లాల్లోని 621 రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. సిమ్లాను చండీగఢ్‌ను కలిపే సిమ్లా-కాల్కా జాతీయ రహదారిపై రహదారి గత రెండు వారాలుగా పదే పదే కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా ప్రభావితమైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గత 48 గంటల్లో కురిసిన వర్షాల దెబ్బకు బియాస్, దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. మాన్, కునా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. హమీర్‌పుర్‌లో భవనాలు దెబ్బతిన్నాయి. పంటలు నీట మునిగాయి. కేదార్నాథ్ యాత్ర నిలిపివేత మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంతో గత 48 గంటల్లో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు దెబ్బతిన్నాయి. రెండు రోజులపాటు కేదార్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. గంగా నది మట్టం కూడా పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారని తెలిపారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami says "Several places have been damaged in the last 48 hours, due to incessant rainfall in the region. Roads have washed away, bridges have been damaged. Kedarnath Yatra has been stopped for the next 2 days. Water level in Ganga River is… https://t.co/0plFr17Pny pic.twitter.com/61aVP9SD84 — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 14, 2023 ఎడతెరిపి లేని వర్షాలతో ట్రాఫిక్ జామ్ కొండచరియలు విరిగిపడి, జాతీయ రహదారులతోపాటు వివిధ రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-ఛంబా నేషనల్ హైవేను అధికారులు మూసివేశారు. హరిద్వార్‌లో గంగానది 294.90 మీటర్ల వద్ద ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. చమోలీ జిల్లాలోని త్రాలి, నందానగర్ ఘాట్ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ప్రభావితం అయ్యాయి. పిండర్, నందాకిని నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఓ మోటార్‌బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. -
పర్వతాలు పిలిచాయి
‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్ మ్యూర్. ఒకానొక సమయంలో శాలిని సింగ్‌కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్‌లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్.... లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్ పీజీ కాలేజీలో శాలిని సింగ్ బీఏ స్టూడెంట్. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని. 19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు. ఎన్సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్‌లో శాలిని సింగ్ సీనియర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జమ్ములోని పహల్గామ్లో గత సంవత్సరం బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్డ్ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని. ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్ పునీత్ శ్రీవాస్తవ. ‘శాలిని విజయం ఎన్సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని. ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది శాలిని సింగ్ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని! -
రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో..
ఒక చోట అని కాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు డ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్డు భదత్రకు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రోడ్డు భద్రతకు సంబంధించి నిత్యం అధికారులు జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తమ జీవితాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టుతున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్ అగస్త్య చౌహాన్ మరణించాడు. ఉత్తరాఖండ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసి అయిన అగస్త్య చౌహాన్ ప్రొఫెషనల్ బైకర్. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే మోటార్‌బైక్ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని టప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకు చేరుకోగానే.. గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని సాధించడానికి ప్రయత్నించాడు. బైక్ వేగంగా దూసుకుపోతున్న సమయంలో అతడు ఒక్క సారిగా తడబడ్డాడు. దీంతో అగస్త్య బైక్ అదుపుతప్పి యమునా ఎక్స్‌ప్రెస్‌వే డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం దాటికి అతను ధరించి ఉన్న హెల్మెట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. మొదటిసారిగా ఈ సాహసం చేసిన అగస్త్య దుర్మరణం చెందడంతో అతని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా అగస్త్యకు ‘PRO RIDER 1000’ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీనికి 1.2 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. వేగంగా బైక్ నడుపుతూ స్టంట్లు చేస్తున్న వీడియోలను తన ఛానెల్లో అప్లోడ్ చేసేవాడు. ప్రమాదం జరగడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. వేగంగా వాహనాలు నడపడం ప్రమాదకరం అని తన ప్రతి వీడియోకు హెచ్చరికలు సైతం జారీ చేసేవాడు. చివరికి అదే వేగంతో తన ప్రాణాలు కోల్పోయాడు. -
యువకుడిని చితకబాదిన మంత్రి, సిబ్బంది.. వీడియో వైరల్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ప్రేమ్‌చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి అనుచరులు కూడా అతడిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ రిషికేశ్ పట్టణంలో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో సురేంద్రసింగ్ నెగీ అనే వ్యక్తి తన బైక్‌తో మంత్రి వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు నుంచి కిందకు దిగిన మంత్రి ప్రేమ్‌చంద్.. నేగిపై సీరియస్ అయ్యారు. అనంతరం, నేగిపై చంపచళ్లుమనిపించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇంతలో, మంత్రి సిబ్బంది.. నేగిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ దాడిపై మంత్రి స్పందించారు. నేగి.. నన్ను అసభ్య పదజాలంతో తిట్టడంతో నా సిబ్బంది దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇలాగేనా ప్రవర్తించేది? అని కాంగ్రెస్ మండిపడింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, లేదా సీఎం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. Uttarakhand Cabinet Minister Premchand Agarwal fighting with youth in Rishikesh, then later his bodyguards also beat up the youth! pic.twitter.com/GxvNzuLk1O — Yash (@Yashfacts28) May 2, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ అడ్డాపై కాంగ్రెస్ కన్ను -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
-
ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.. వివరాలు.. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణిస్తుంది. దాదాపు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు షేర్ ఘడి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 100 అడుగుల లోతులో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్ డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడ్డారు. గాయాలయ్యాయి. సమాచారం వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొన్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల (ITBP) సహాయంతో గాయపడిన వారిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించామని ముస్సోరీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు అమ్మాయిలు మరణించారు. మరొకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Uttarakhand | Many feared injured after a roadways bus lost control and fell off the gorge on Mussoorie-Dehradun route. Rescue operation underway. Police, fire service team & ambulance on the spot. More Details awaited. pic.twitter.com/LZWvg3riML — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 2, 2023 -
పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో హమ్మద్‌పూర్ ఝల్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ తన వాహనాన్ని నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్‌ను కాపాడాడు. దీంతో ఇప్పటికీ సుశీల్ మాన్ సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంత్‌ను కాపాడిన సుశీల్ మాన్‌ను జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పంత్ ప్రస్తుతం రిషికేష్ లోని ఏయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతడు స్వదేశంలో జరిగే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు పంత్ దూరం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతడే? -
వీడియో: రజినీ స్టైల్లో ట్రాఫిక్ క్లియర్.. రోడ్డుపై ఆయనుంటే సందడే వేరు!
సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు.. చూడగానే నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని వీడియోలు ఆవేదనకు గురిచేస్తాయి. కాగా, ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. వాహనాలను మళ్లించే ఆయన యూనిక్ స్టైల్ చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న సిటీ హార్ట్ ఆసుపత్రి వద్ద హోంగార్డ్ జోగింద్ర కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు వస్తున్న వాహనాలను వినూత్న రీతిలో నియంత్రిస్తున్నాడు. నలువైపుల వస్తున్న వాహనాలను క్లియర్ చేయడానికి ఆయన డ్యాన్స్ చేస్తూ చూపించిన సైగలు హైలెట్ అని చెప్పవచ్చు. #WATCH | Uttarakhand: Jogendra Kumar, a Home Guard deployed as a Traffic Police personnel near City Heart Hospital in Dehradun, controls the vehicular movement of traffic in a unique way. pic.twitter.com/zy2yyrhMio — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2022 ఇలా వినూత్న రీతిలో ఆయన వాహనదారులను మళ్లించడం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. నేను అతడిని ప్రతీరోజూ చూస్తాను. ఆఫీసులకు వెళ్తున్న ఎంతో మందిని ఆయన ఉత్తేజపరుస్తాడు. ఆయనను దేవుడు చల్లాగా చూడాలంటూ కామెంట్స్ చేశాడు. -
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఐదు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలు బంద్
దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఐదు రహదారులను అధికారులు మూసివేశారు. ఇక, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అప్రమతమయ్యారు. బాగేశ్వర్, తెహ్రీ, పౌరి, పితోరాఘర్, నైనిటాల్ జిల్లాల్లో 1-12వ తరగతి వరకు పాఠశాలలు, అన్ని అంగన్వాడీ కేంద్రాలు బుధవారం మూసివేసినట్టు తెలిపారు. ఇక, డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలకు జూలై 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. #WATCH उत्तराखंड: बारिश की वजह से टनकपुर में एक स्कूल बस पानी के तेज़ बहाव में बह गई। pic.twitter.com/BQYlA7dqVb — ANI_HindiNews (@AHindinews) July 19, 2022 ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం జోషిమత్‌లోని పుర్సరి వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్-58 కుంగిపోయింది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటిచింది. Only driver was present in the bus at the time of the incident on Tuesday morning. #Champawat #UttarakhandRains pic.twitter.com/wQ4GYwiuag — TOI Cities (@TOICitiesNews) July 19, 2022 -
భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి
రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని రామ్ నగర్ ప్రాంతం వద్ద ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ధేలా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణిస్తుండగా వారిలో ఓ బాలిక కూడా ఉంది. బాధితులంతా పంజాబ్‌కు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కాగా గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ధేలా నది ఉప్పొంగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ నీటి ప్రవాహం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని కుమావోన్ రేంజ్ డీఐజీ ఆనంద్ భరన్ తెలిపారు. ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఎర్టిగా కారు శుక్రవారం ఉదయం 5 గంటలకు కార్బెట్ వైపు వెళుతోంది. వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ధేలా గ్రామంలోని నది వంతెనపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు నీటిలో కొట్టుకుపోయింది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా నదిపై వంతెన నిర్మాణం లేకపోవడంతో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. చదవండి: రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి -
ఉత్తరాఖండ్ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం
Bypoll Results: చంపావత్ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్లతో విజయకేతనాన్ని ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా గహ్తోరి డిపాజిట్ కోల్పోయారు. కాగా ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అయ్యింది. కాగా మే 31న ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 3న వెలువడ్డాయి. ధామి గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. చంపావత్ నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి మరింత కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. అలాగే ‘‘చంపావత్ ఉపఎన్నికలో ఓట్ల ద్వారా మీరు కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలతో నా హృదయం చాలా ఉద్వేగానికి లోనైంది. నేను మాట్లాడలేకపోతున్నాను’’ అని తన విజయం తర్వాత ముఖ్యమంత్రి ధామి ట్వీట్ చేశారు. కేరళలోని త్రిక్కాకర నిజయోకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ఉమా థామస్ విజయం సాధించారు. ఒడిశాలోని బ్రజరాజ్నగర్లో బీజేడీ అభ్యర్థి అలకా మొహంతి గెలుపొందారు. ఉత్తరాఖండ్, ఒడిశాలో అధికార పార్టీ అభ్యర్ధులే విజయం సాధించగా.. కేరళలో ప్రతిపక్ష యూడీఎఫ్‌కు విజయం దక్కింది. గత సాధారణ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు గాను 47 చోట్ల బీజేపీ జయకేతనం ఎగరేసి రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు పరిమితమైంది. ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామికి మాత్రం ఓటమి పాలయ్యారు. ఖతిమా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన భువన చంద్ర కప్రీ విజయం సాధించారు. అయినప్పటికీ పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలల్లో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటి చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ధామి కోసం చంపావత్ స్థానం నుంచి విజయం సాధించిన హేమేష్ కర్క్‌వాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. -
చెలరేగిన అయ్యప్ప, పృథ్వీరాజ్.. కుప్పకూలిన ఉత్తరాఖండ్
తుంబా: ఆంధ్ర పేసర్లు బండారు అయ్యప్ప (4/37), పృథ్వీరాజ్ (3/27) ధాటికి రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఇ’లో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలింది. కునాల్ చండీలా (52; 6 ఫోర్లు, 1 సిక్స్), కమల్ సింగ్ (42; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఆంధ్ర 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (25), షేక్ రషీద్ (10) క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL 1st Test: శ్రీలంకతో టీమిండియా తొలిపోరు.. కోహ్లి మెరిసేనా..? -
బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. బుధవారం ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్‌ను ఢిల్లీలో కలిశారు. సాయంత్రం విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలని ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఆమోదిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం తన తండ్రి బీజేపీలో చేరడంతో ఇప్పుడు తనకు కూడా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అయితే దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
ఒకేసారి 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్
-
ప్రతి జిల్లాలో వైద్య కళాశాల
రిషికేశ్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్‌లను నెలకొల్పే దిశగా కృషి కొనసాగుతోందని వివరించారు. పీఎం కేర్స్ ఫండ్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 35 ప్రెషర్ స్వింగ్ అబ్సార్ప్షన్(పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను మోదీ గురువారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ‘ఎయిమ్స్’ ఈ కార్యక్రమానికి వేదికగా మారింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు.. కరోనా మహమ్మారి ఉనికి తొలిసారిగా బయటపడినప్పుడు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉండేదని, ఇప్పుడు వాటి సంఖ్య 3,000కు చేరిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని 10 రెట్లు పెంచామన్నారు. కొత్త ప్లాంట్లతో కలిపి పీఎం కేర్స్ ఫండ్ కింద ఇప్పటిదాకా 1,150 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి జిల్లాకు వీటితో సేవలు అందుతాయన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 93 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 100 కోట్ల మార్కును దాటుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగవంతమైన వ్యాక్సినేషన్ భారత్‌లో కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చేదాకా ప్రభుత్వం ఎదురుచూడడం లేదని, ప్రభుత్వమే వారి వద్దకు వెళ్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లో ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తోందని తెలిపారు. -
పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్
-
గ్రామ జనాభా 1500.. ప్రతి ఇంట్లోనూ పనీర్
పాతికేళ్ల క్రితం ఆ ఊళ్లో ఉపాధి అవకాశాలు లేవు. బతుకు తెరువుకు పెద్ద పట్టణాలకు వలస వెళ్లేవారు. ఉన్నవే పాతిక కుటుంబాలు. పశు సంతతి వారి జీవనాధారం. ఆ ఊరు పేరు రౌతు కి బెలీ. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లోని తెహ్రీ జిల్లాలో ఉండేది. ఆడ, మగ పొరుగున ఉండే ముస్సోరీ ప్రాంతానికి వెళ్లి పాలమ్ముకొని, ఆ వచ్చిన ఆదాయంతో జీవించేవారు. పాతికేళ్లుగా ఆ గ్రామ ప్రజలు పడిన కష్టానికి ఇప్పుడు తగిన ఫలితం వస్తోంది, కుటుంబాలు పెరిగాయి. ఊరు పేరు కూడా మారిపోయింది. వారి జీవన విధానాన్ని మార్చేసిన ఘనత పనీర్‌కు దక్కింది. రౌతు కి బెలీ కాస్తా ‘పనీర్ విలేజ్’గా స్థిరపడిపోయింది. ఇప్పుడు ‘పనీర్ విలేజ్’లో 250 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 1500. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ పనీర్‌ను తయారుచేస్తారు. ఇక్కడి పనీర్‌కు టెహ్రీ, డెహ్రాడూన్, ముస్సోరితోపాటు ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. పర్వత ప్రాంతాల్లో ఉపాధి కోసం కష్టపడుతున్న సమయంలో పనీర్ వీరి జీవనోపాధిగా మారింది. నిరాటంకంగా పనీర్‌ను తయారుచేస్తూ, ఎగుమతులు చేస్తూ ప్రతి కుటుంబం సుమారు 15000 వేల రూపాయల నుంచి 35,0000 వేల రూపాయల వరకు సంపాదిస్తోంది. ప్రయోగాల ఫలితం గ్రామంలో 90 శాతం కుటుంబాలు పశుసంర్థకంలో పాల్గొంటాయి. పనీర్ విలేజ్ గ్రామస్తుల్లో మహిళలు మాట్లాడుతూ–‘పనీర్ వ్యాపారం ప్రారంభానికి ముందు ముస్సోరీ, డెహ్రాడూన్లలో పాలు అమ్మేవాళ్లం. ఆ సమయంలో ముస్సోరీలోని మార్కెట్లో పనీర్ అమ్ముతున్న కొంతమందిని చూసినప్పుడు మేం కూడా ప్రయోగాలు చేయడం ప్రారంభించాం. కొంతకాలానికి మస్సోరీ ప్రజలు మా పనీర్ రుచిని ఇష్టపడ్డారు. దీంతో డిమాండ్ పెరిగింది. ఇప్పుడు గ్రామస్తులు పాల ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టడానికి బదులు పనీర్ తయారీ, అమ్మకం పైనే దృష్టి పెట్టారు’ అని వివరించారు. ఆగిపోయిన వలసలు గ్రామ పెద్ద భండారీ మాట్లాడుతూ ‘కిలో పనీర్‌ను రూ.220 నుంచి పొరుగు గ్రామాల్లో రూ.240 వరకు అమ్ముతున్నారు. గ్రామాన్ని రహదారికి అనుసంధానించడం కూడా రాకపోకలకు సౌలభ్యం పెరిగింది. దీంతో మార్కెట్ సులువు అయ్యింద’ని వివరించారు. పనీర్ వ్యాపారం బాగా ఉండటంతో గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు వలస వచ్చే యువకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఉపాధి అవకాశాల కోసం ఇతర పెద్ద పట్టణాలకు వలస వెళ్లడం దాదాపుగా ఆగిపోయింది. బతుకు దెరువు కోసం పుట్టి పెరిగిన ఊరిని వదలాల్సిన అవసరం లేనంతగా ఎదగాలంటే.. ఉన్నచోటనే అవకాశాల కల్పనకు కృషి జరగాలి. ఈ కోణంలో గ్రామీణ ప్రజానీకం దృష్టి పెడితే పల్లె ప్రగతి వేగవంతంగా సుసాధ్యం అవుతుంది. చదవండి: మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ పాగా చదవండి: 'స్విస్ టైమ్ బ్యాంక్' ఎంటో తెలుసా? -
ఉత్తరాఖండ్ కోచ్‌గా వసీమ్ జాఫర్
ముంబై: ఆటగాడిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత టెస్టు జట్టు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఇకపై కోచ్‌గా కనిపించనున్నాడు. ఉత్తరాఖండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికైనట్లు అతడే స్వయంగా మంగళవారం తెలిపాడు. ఈ పదవిలో జాఫర్ ఏడాదిపాటు కొనసాగనున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశవాళీ క్రికెట్లో కొనసాగిన అతడు ముంబై, విదర్భలకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది మార్చిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జాఫర్... కోచ్ పదవి తనకు ఒక సవాల్‌లాంటిదని అభిప్రాయపడ్డాడు. ‘నేను మొదటిసారి ఒక జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి ఒక సవాల్ లాంటిది. ఉత్తరాఖండ్ జట్టుతో కలిసి పనిచేయడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని జాఫర్ పేర్కొన్నాడు.