ఎయిర్‌ లిఫ్టింగ్‌.. నదిలో పడిపోయిన హెలికాప్టర్‌ | Helicopter Being Airlifted By Mi-17 Crashes In Uttarakhand Kedarnath, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Kedarnath Helicopter Crash: ఎయిర్‌ లిఫ్టింగ్‌.. నదిలో పడిపోయిన హెలికాప్టర్‌

Published Sat, Aug 31 2024 11:15 AM | Last Updated on Sat, Aug 31 2024 12:50 PM

Helicopter being airlifted by MI-17 crashes in Uttarakhand

డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్‌ను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్‌ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్‌నాథ్‌ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్‌ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్‌తో అధికారులు లిఫ్ట్‌ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్‌ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

‘‘ఎంఐ-17 హైలికాప్టర్‌ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్‌ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్‌కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్‌ బ్యాలెన్స్‌ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement