![First Indian Air Force Boeing AH 64E Apache Attack Helicopter Makes Maiden Flight - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/28/Helicopter.jpg.webp?itok=TQ3AAM1c)
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరింత శక్తిమంతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఏహెచ్ 64ఈ త్వరలో వాయుసేన అమ్ములపొదిలో చేరనుంది. అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను భారత్‌కు అందజేసింది. మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లకు డీల్ కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లు ఐఏఎఫ్‌కి అందాయి. వచ్చేవారం మరో నాలుగు వస్తాయి. మొత్తం ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు పఠాన్‌కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్ ఆశాభావం వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment