helicopter
-
హెలికాఫ్టర్ ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది. పోర్బందర్ ఎయిర్పోర్ట్ (Porbandar Airport)లో ఘోర హెలికాప్టర్ (helicopter crash porbandar) ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మరణాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రమాదం వెంటనే హెలికాప్టర్ భూమిని ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Helicopter of Indian Coast Guard ALH Dhruv 'crashed' in Porbandar, Gujarat during a routine training sortie.3 crew members DEAD. pic.twitter.com/vt4L025Ifl— RAMULU.B (@vedicramrekha) January 5, 2025 -
ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్‌కు భారీ ఆర్డర్
ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సేవల ఆపరేటర్ పవన్ హన్స్ తాజాగా ఓఎన్జీసీ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓఎన్జీసీ ఆఫ్–షోర్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి నాలుగు హెలికాప్టర్లను పవన్ హన్స్ సమకూరుస్తుంది. ఈ డీల్ విలువ రూ.2,141 కోట్లు. 10 ఏళ్లపాటు పవన్ హన్స్ ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు పవన్ హన్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్హెచ్ఏఎల్ తయారీ అత్యాధునిక ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్లను పవన్ హన్స్ వినియోగించనుంది. ‘దేశీయంగా తయారు చేసిన ధృవ్ ఎన్జీ అనేది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎంకే–3 యొక్క సివిల్ వేరియంట్. ఏఎల్‌హెచ్ ఎంకే–3ని ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సైనిక హెలికాప్టర్లు నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 335 కంటే ఎక్కువ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,75,000 గంటలపాటు గగనతల విహారం చేశాయి’ అని పవన్ హన్స్ తెలిపింది. సంస్థ వద్ద ప్రస్తుతం 46 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి చమురు, సహజ వాయువు అన్వేషణ, పోలీసు, కేంద్ర బలగాలు తరలింపు, యుటిలిటీ రంగంతోపాటు మారుమూల, కొండ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయి. -
PM Modi: మోదీకి తప్పిన ప్రమాదం ?
-
Video: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌ల వాహనాలను సైతం తనిఖీ చేశారు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్‌లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई। भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है। एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024 -
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాప్టర్ చక్కర్లు..
-
తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్ చక్కర్లు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై సోమవారం ఉదయం ఓ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్దం. కానీ ఇటీవల తిరుమలలో అధికంగా విమానాలు, హెలికాప్టర్లు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే సంఘ విద్రోహ శక్తుల నుంచి తిరుమలకు ముప్పు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు అందాయికాగా శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. -
టెన్నిస్ టోర్నమెంట్.. హెలికాప్టర్లలో స్టేడియానికి
గ్వాడలహారా (మెక్సికో): ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు టోర్నీ నిర్వాహకులు ఏకంగా హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో ప్రస్తుతం డబ్ల్యూటీఏ–500 టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోంది.ఇక్కడ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హోటల్స్ నుంచి ప్లేయర్లను నిరీ్ణత సమయంలోగా స్టేడియానికి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గంలో కుదరదని భావించిన గ్వాడలహారా టోర్నీ ఆర్గనైజర్లు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.దీనిపై టోర్నీ డైరెక్టర్ గుస్టావో శాంటోస్కాయ్ మాట్లాడుతూ ప్లేయర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. క్రీడాకారిణులు కూడా ఈ తరహా రవాణా అనుభవాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొన్ని టోర్నీల్లో అప్పుడప్పుడు ప్లేయర్లను ఇలా హెలికాప్టర్లలో వేదిక వద్దకు తీసుకొస్తారు. కానీ రెగ్యులర్‌గా మాత్రం ఈ సదుపాయం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిసారి ప్లేయర్లను చాపర్లలోనే హోటల్ గదుల నుంచి టెన్నిస్ కోర్టులకు తీసుకొస్తున్నారు’ అని డబ్ల్యూటీఏ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలెక్స్ ప్రియర్ తెలిపారు. ఆకాశ మార్గాన త్వరితగతిన వేదికకు చేరుకోవడం ద్వారా ప్లేయర్లంతా ఎలాంటి ప్రయాణ బడలిక లేకుండా మ్యాచ్‌ల బరిలోకి దిగుతున్నారు. గ్వాడలహారా సబర్బన్ సిటీలో రోడ్డు మార్గాలన్నీ రద్దీగా ఉంటాయి. ప్లేయర్లు బస చేసే హోటల్స్ నుంచి టోర్నీ వేదికకు మధ్య దూరం 11 కిలో మీటర్లు ఉంటుంది. అయితే ఈ మాత్రం దూరానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టడంతో నిర్వాహకులు చాపర్లను అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల నాలుగైదు నిమిషాల్లోనే క్రీడాకారిణులు స్టేడియానికి చేరుకుంటున్నారు.చదవండి: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత.. -
రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్.. 22 మంది మృతి
మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ ఘటన విషాదాంతమైంది. హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్ నుంచి చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు.హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.A Vityaz Aero Mil Mi-8 helicopter (RA-25656) impacted terrain at an elevation of 900 m after taking off from the Vachkazhets volcano in Kamchatka Krai, Russia. At least 17 occupants have reportedly died:https://t.co/qGBfRTfp6z pic.twitter.com/fEUPuoUZQ4— Aviation Safety Network (ASN) (@AviationSafety) September 1, 2024 ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి శనివారం(ఆగస్టు31) బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు.వచ్కజెట్స్ సమీపంలో రాడార్ నుంచి హెలికాప్టర్ మాయమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్లు తరచు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ రష్యాలో వాటిని ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం. -
హెలికాప్టర్‌ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్‌ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్‌ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్‌కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్‌కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్‌కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
రష్యాలో హెలికాప్టర్ గల్లంతు
మాస్కో: తూర్పు రష్యాలోని కమ్చత్కాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయింది. హెలికాప్టర్లో ఉన్నవారిలో 19 మంది ప్రయాణికులు కాగా ముగ్గురు సిబ్బంది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ రవాణా ఏజెన్సీ తెలిపింది. ఎంఐ-8టి శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ శనివారం(ఆగస్టు31) కమ్చత్కాలోని వచ్కజెట్స్ అగ్నిపర్వతం వద్ద నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరలేదని సమాచారం. హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానం చేరిన తర్వాత పైలట్ల వద్ద నుంచి రావాల్సిన సమాచారం రాలేదు. హెలికాప్టర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన హెలికాప్టర్ 1960లో తయారైన డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ మోడల్ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ వీటిని రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. -
ఎయిర్ లిఫ్టింగ్.. నదిలో పడిపోయిన హెలికాప్టర్
డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్‌తో అధికారులు లిఫ్ట్ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.‘‘ఎంఐ-17 హైలికాప్టర్ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్‌ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్‌కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw— Press Trust of India (@PTI_News) August 31, 2024 -
నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురి మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో హెలికాప్టర్ కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద హెలికాప్టర్ కొండను ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి బయలుదరి.. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత అధికారులతో సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయనట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఇండియాలో హెచ్125 హెలికాఫ్టర్స్
ఫ్రెంచ్ విమానాల తయారీదారు ఎయిర్‌బస్ భారతదేశంలో హెచ్125 హెలికాఫ్టర్లను అసెంబ్లింగ్ చేయడానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)తో ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 'మేడ్ ఇన్ ఇండియా' హెచ్125ల డెలివరీలు 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024లో ఈ ఒప్పందంపై చేసినట్లు.. ఎయిర్‌బస్ సీఈఓ గుయిలౌమ్ ఫౌరీ అండ్ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటించారు. కంపెనీ భారతదేశంలో హెలికాప్టర్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది పౌర విమానయాన వృద్ధికి తోడ్పడుతుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ అన్నారు.హెచ్125 ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రధాన కాంపోనెంట్ అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ హార్నెస్‌ల ఇన్స్టాలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టమ్ అండ్ ఇంజన్ల ఏకీకరణను చేపడుతుంది. ఇది హెలికాప్టర్ల టెస్టింగ్ వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది.హెచ్125 అనేది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఈ విభాగంలో హెచ్125 అనేది ఇతర హెలికాఫ్టర్ల కంటే ముందు ఉంది. ఈ హెలికాఫ్టర్ స్క్విరెల్ (Ecureuil) కుటుంబానికి చెందింది.హెచ్125 హెలికాఫ్టర్ వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. వీటిని వైమానిక దళాలు మాత్రమే కాకుండా, అగ్నిమాకప, రెస్క్యూ, ఎయిర్ అంబులెన్స్, ప్రయాణీకుల రవాణా వంటి వివిధ కార్యకలాపాలలో కూడా విరివిగా ఉపయోగించారు. ఎవరెస్ట్ శిఖరంపై ల్యాండ్ అయిన ఏకైక హెలికాప్టర్ కూడా ఇదే కావడం గమనార్హం. -
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్‌కు ప్రమాదం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్లో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవాడనికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు. అందులో ఎవరు ఉన్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. భారీ పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని ఇరాన్ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయిటెహ్రాన్ టైమ్స్ ప్రకారం.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. -
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4— ANI (@ANI) May 6, 2024 -
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.బాంబీ బకెట్‌ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్‌గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్‌తో మెటల్ ఫ్రేమ్‌తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి. -
అదుపుతప్పిన అమిత్ షా హెలికాప్టర్.. నేలను తాకబోయి...
పాట్నా: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాకు పెద్ద ప్రమాదం తప్పింది. షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు సోమవారం(ఏప్రిల్29) ఈ ఘటన జరిగింది.ప్రచారం ముగించుకుని అమిత్ షా హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ గాల్లోకి లేచే సమయంలో ఊగిసలాడి కుడివైపుకు వెళ్లింది. ఒక దశలో కిందకు వచ్చి నేలను తాకే దాకా వెళ్లింది. ఇంతలో అప్రమత్తమైన హెలికాప్టర్‌ను పైలట్ నియంత్రణలోకి తీసుకోవడంతో సరైన దిశలో ప్రయాణించింది. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.— Dr. Abhishek Verma (@AbhishekVermaX) April 29, 2024 -
హెలికాప్టర్ వద్దన్నందుకు.. ఎడ్లబండిలో వచ్చి నామినేషన్
పాట్నా:ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్ పర్వంలోనైతే అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తుంటారు.ఈ క్రమంలోనే ఆసక్తికర ఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఇదే తరహాలో బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేసేందుకు హెలికాప్టర్లో వస్తానని అధికారులను అనుమతి అడిగారు. హెలికాప్టర్లో వచ్చి నామినేషన్ వేసేందుకు స్వతంత్ర అభ్యర్థి అమ్రేష్రాయ్కి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన హెలికాప్టర్ నుంచి ఏకంగా ఎడ్లబండి రేంజ్‌కు వచ్చేశారు.ఎడ్లబండిలో ఊరేగింపుగా వచ్చి డ్యాన్సులతో హోరెత్తించి నామినేషన్ దాఖలు చేశారు. హెలికాప్టర్‌కు అనుమతివ్వనందుకే తాను ఎడ్లబండిలో వచ్చి నామినేషన్ వేశానని అమ్రేష్రాయ్ చెప్పారు. ఇదీ చదవండి.. పొలిటికల్ ఎంట్రీపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్‌బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
లద్దాఖ్‌లో ఐఏఎఫ్ అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దీంతో హెలికాప్టర్ దెబ్బతింది. లాద్దాఖ్‌లో కొండచరియలు, ఎత్తైన ప్రదేశాల కారణంగా చాపర్ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేసినట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. లడఖ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ (AOR)లో ఎత్తైన ప్రదేశాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి శిక్షణ ఇచ్చే సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం కోర్టు విచారణకు ఆదేశించింది. -
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్‌లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్‌తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!
రైట్ బ్రదర్స్ విమానాన్న కనిపెడితే..ఈ బ్రదర్స్ కారుని హెలికాప్టర్‌గా మార్చారు. అది తమ జీవనోపాధికి ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇలా మార్పులు చేయాలంటే అధికారులు అనుమతి తప్పనసరి. అది తెలియక ఈ అన్నదమ్ములూ తయారు చేసిన కారు కమ్ హెలికాప్టర్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో అన్నదమ్ములిద్దరు తలలుపట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ను హెలికాప్టర్‌గా మార్చారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఈ అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలా ప్రత్యేకతగా ఉండాలనుకున్నారు. అందుకోసం హెలికాప్టర్ రోటర్ బ్లేడ్‌ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్‌కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. ఇలా కారు కమ్ హెలికాప్టర్లా విలక్షణంగా రూపొందిచారు. పైగా దీనివల్ల తమ కుటుంబానికి మంచి జీవనోపాధిగా ఉంటుందనేది వారి ఆలోచన. ఆ నిమిత్తమే ఈ ఇద్దరు సోదరులు కారుని హెలికాప్టర్లా మార్పుల చేసి చక్కగా రంగులు వేసేందుకు తీసుకువెళ్తుండగా ఊహించని విధంగా పోలీసుల వారిని అడ్డుకుని వాహనాన్ని చీజ్ చేశారు. అయితే ఈ అన్నదమ్ములు కారుని హెలికాప్టర్‌గా మార్చారు గానీ అందుకు అనుమతలు తప్పనసరి. ఇది తెలియకపోవడంతోనే ఈ బ్రదర్స్ అధికారులతో సమస్యను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా ఇలా మార్పులు చేసినందుకు సీజ్ చేశామని చెప్పారు. ఈ మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును పట్టుకున్నట్లు తెలిపారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి ఆర్టీవో విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేసినట్లు వెల్లడించారు." పాండే. అయితే ఈ అన్నదమ్ములు చివరికీ జరిమాన చెల్లించి ఏదోలా వాహనాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. यूपी के अंबेडकर नगर में दो भाईयों ने जुगाड़ से कार को हेलीकॉप्टर बना दिया. डेंट- पेंट कराने जा रहे थे तभी पुलिस ने पकड़ लिया. और गाड़ी(हेलीकॉप्टर) सीज कर दी. pic.twitter.com/wK9QLaFZ1k — Priya singh (@priyarajputlive) March 17, 2024 (చదవండి: పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!) -
కుమార్తెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికిన ఎడిటర్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఓ తండ్రి తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాక, ఆమెను హెలికాప్టర్లో అత్తవారింటికి పంపారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం ఆమెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికారు. సుల్తాన్‌పూర్‌లోని శంకర్‌గఢ్‌కు చెందిన సత్యప్రకాష్ పాండే కుమారుడు సతీష్ పాండేతో శివకు వివాహం జరిగింది. ప్రతాప్‌గఢ్‌లోని రాణి రామ్ ప్రియా గార్డెన్లో వీరి వివాహ వేడుక జరిగింది. అనంతరం కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్లో అత్త వారింటికి పంపించారు. హెలికాప్టర్లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబై నుండి ప్రచురితమయ్యే ‘అభ్యుదయ వాత్సల్యం’ పత్రికకు కృపాశంకర్ తివారీ చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ. -
మేడారం జాతరకు హెలికాప్టర్
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. ఈ సేవలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది. చార్జీలు ఇలా... ఒక్కో ప్యాసింజర్ (అప్ అండ్ డౌన్)కు వీఐపీ దర్శనం రూ. 28,999, జాతరలో ఏరియల్ వ్యూరైడ్ ఒక్కొక్కరికి రూ.4,800. బుకింగ్ ఇలా..: హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 74834 33752, 94003 99999 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఆన్లైన్లో info@helitaxi. com ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి.