ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్‌బైజాన్‌లో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవాడనికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు. అందులో ఎవరు ఉన్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. భారీ పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని ఇరాన్ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయి
టెహ్రాన్ టైమ్స్ ప్రకారం.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment