ఒక మహిళ విచిత్రమైన మోసానికి పాల్పడింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి ఐడెంటీటిని ఉపయోగించి మోసగించే ప్రయత్నంలో పట్టుబడింది. దీంతో ఆమెకు కోర్టు శిక్ష విధించనుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియన్ మహిళ 33 ఏళ్ల స్టెఫానీ లూయిస్ బెన్నెట్ కారు డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడంతో పట్టుబడింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు ఆమెకు దాదాపు రూ. 88 వేలు జరిమానా విధించారు.
ఐతే ఆమె ఈ ట్రాఫిక్ జరిమానా నుంచి తప్పించుకునేందుకు తాను ఎలాంటి నేరం చేయలేదంటూ ఆన్‌లైన్‌లోనే సదరు ట్రాఫిక్ సంస్థకు తెలిపింది. ఆ సమయంలో తన కారుని నడిపింది యాష్ జెంక్సిన్‌గా పేర్కొంది. అతను సీ వరల్డ్ పైలంట్. అతని ఐడెంట్‌ని ఉపయోగించి.. అతన డెత్ రిపోర్ట్ ఉన్న పూర్తి పేరు, పుట్టిన తేదీని వినియోగించింది. వాస్తవానికి అతను జనవరి 2న గోల్డ్ కోస్ట్ బ్రాడ్‌వాటర్‌లో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా మరో హెలికాప్టర్ ఢీ కొట్టడంతో..అతను సిడ్నీ మహిళ వెనెస్సాటాడ్రోస్, బ్రిటీష్ జంట రాస్, డయాన్ హ్యైస్ అనే ముగ్గురు ప్రయాణికులతో కలసి స్పాట్‌లో చనిపోయాడు.
జెంక్సిన్ మరణించిన కొన్ని వారాల తర్వాత అతని భార్యకు జరిమాన నోటీసులు అందాయి. ఆమె ట్రాఫిక్ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు సదరు మహిళ బెన్నెట్ తతమను తప్పుదారి పట్టించి మోసం చేసిందని గుర్తించారు. ఈ మేరకు సదరు మహిళను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమె నేరం చేసినట్లు కోర్టు ఎదుట అంగీకరించింది.
తాను ఆ మరుసటి రోజు తన వ్యాఖ్యలను ఆన్‌లైన్‌లో వెనక్కి తీసుకునేందుకు యత్నించినా..అందుకు సదరు వెబ్‌సైట్ అంగీకరించలేదని వాపోయింది. తాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొనడం వల్లే ఇలా చేశానిని కోర్టుకి వివరించింది. ఈ మేరకు బెన్నెట్ చేసిన నేరానికి గాను మే 19న శిక్ష ఖరారు చేయనుంది కోర్టు.
(చదవండి: ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం)
Comments
Please login to add a commentAdd a comment