Fraud
-
బాబు మోసం.. నోరుమెదపని ఎమ్మెల్యేలు, ఎంపీలు
-
రూ.100 కోట్లు..‘గాడిద పాలు’
సాక్షి, హైదరాబాద్: ‘గాడిద పాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. గాడిదల ఫామ్ పెట్టుకుంటే మీ నుంచి లీటరు గాడిద పాలను రూ.1,600 చొప్పున మేమే కొంటాం. మంచి లాభాలు ఆర్జించవచ్చు’అని నమ్మించి ది డాంకీ ప్యాలస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు, మరికొంత మంది బాధితులు ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా ముక్కడల్ గ్రామంలో ‘డాంకీ ప్యాలస్’అనే సంస్థ ఉంది.వీళ్లు గాడిదలు, గాడిద పాల వ్యాపారం చేస్తారు. గాడిద పాలతో లాభాలు ఆర్జించవచ్చని యూట్యూబ్‌లో బాగా ప్రచారం చేశారు. దీనికి ఆకర్షితులైన పలువురు రైతులు ఆ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునేవారు రూ.5.5 లక్షలు ముందుగా చెల్లించాల్సి ఉంటుందని, ఆపై గాడిదలను తామే కొనుగోలు చేసి ఇస్తామని, ఒక్కో లీటరు పాలకు రూ.1,600 చొప్పున చెల్లిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. గాడిదలను గుజరాత్ నుంచి కొనుగోలు చేయడానికి ఒక్కోదానికి రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు.ఇదిలా ఉండగా ప్రారంభ సమయంలో కొందరికి 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు సక్రమంగానే పాలకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. దీంతో ఈ వ్యాపారం బాగుందని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 400 మందికి పైగా రైతులు ఫ్రాంచైజీలు తీసుకున్నారు. దీంతో డాంకీ ప్యాలస్ సంస్థ ప్రతినిధులు ఒకొక్కరి నుంచి రూ.20 లక్షలు మొదలు రూ.70 లక్షల వరకు కట్టించుకున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం.. ఆపై బెదిరింపులు మొదట్లో బాగానే ఉన్నా.. గత 18 నెలల నుంచి పాల బిల్లుల చెల్లింపులో జాప్యం మొదలైంది. బిల్లులు అడిగితే సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు దిగడం మొదలు పెట్టారు. దీంతో తిరునెలవేలి జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలను కలసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసులు డాంకీ ప్యాలస్ ప్రతినిధులను గట్టిగా హెచ్చరించారని, రైతులకు న్యాయం చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని వెల్లడించారు.దీంతో డాంకీ ప్యాలస్ ప్రతినిధులు దాదాపు 200 మంది రైతులను వాట్సాప్ గ్రూపుల్లో బెదిరించారని చెప్పారు. తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని, మీరేం చేయలేరని, చంపేస్తామని మెస్సేజ్‌లు పెట్టారని బాధితులు వాపోయారు. తామంతా సుమారు రూ.100 కోట్ల వరకు మోసపోయామని పేర్కొన్నారు. కాగా, ఏడాది క్రితం రూ.10 కోట్ల చెక్కు యూరప్ నుంచి వచి్చందని, ఆ డబ్బులు రాగానే అందరికి చెల్లింపులు చేస్తామని చెప్పారని వెల్లడించారు.చాలా మందికి చెక్కులు ఇచ్చారని, అయితే తమ బ్యాంకు ఖాతాల్లో చెక్‌లను డిపాజిట్ చేస్తే బౌన్స్ అయ్యాయని తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఏపీ మంత్రి లోకేశ్‌కు వినతి పత్రం ఇచ్చామని, తమ బాధలను కేటీఆర్ ట్విట్టర్లో చూసి స్పందించారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్లు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.ఆదుకోకుంటే.. ఆత్మహత్యే శరణ్యం మేం రైతులం. పాలు అమ్ముకుని బతుకుదాం అనుకున్నాం. రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. డాంకీ ప్యాలస్ వాళ్లు మోసం చేశారు. రూ.లక్షలు పెట్టి గుజరాత్లో కొనుగోలు చేసిన వందలాది గాడిదలను మేపలేక వదిలేస్తున్నాం. అవి చచి్చపోతున్నాయి. చేసిన అప్పులు తీర్చడానికి మాకు వేరే దిక్కులేదు. ప్రభుత్వాలు ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నాం. - తేజస్విని, బాధితురాలు, అనంతపురం (ఏపీ) -
డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఓ స్టార్ హోట ల్లో అమెరికన్ కాన్సులేట్ సెట్ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రానుంది. ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం.. అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్ పటేల్ అనే ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్ వేశాడు.హైదరాబాద్ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్ చంద్ శివార్లలోని ఓ స్టార్ హోటల్లో బాంక్వెట్ హాల్ బుక్ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్ కాన్సులేట్ బ్రాంచ్ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిన మీన్‌చంద్ మరో హోటల్లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు. -
బోర్డు తిప్పేసి.. రూ.7 వేల కోట్లు కొట్టేసి..
సాక్షి, హైదరాబాద్: ఒకటి రెండు కాదు ఏకంగా రూ.7 వేల కోట్ల స్కాం జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపించి పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టింది అస్సాంలోని గువాహటికి చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలోనూ కార్యాలయం ఉంది. నగరానికి చెందిన వందలాది మంది ఇన్వెస్టర్లు డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించకుండా బిచాణా ఎత్తివేయడంతో లబోదిబోమంటూ బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ)లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 23 వేల మంది పెట్టుబడులు అస్సాంకు చెందిన దీపాంకర్ బర్మన్ 2018లో డీబీ స్టాక్ బ్రోకింగ్‌ను ప్రారంభించారు. ఈ సంస్థకు గువాహటితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబైలోనూ కార్యాలయాలున్నాయి. పెట్టుబడులపై ఏడాదికి 120 శాతం, ఆరు నెలలకు 54 శాతం, మూడు నెలలకు 27 శాతం, నెలకు 8 శాతం చొప్పున వడ్డీ ఇస్తామని ప్రకటించారు. దీంతో స్థానికులతోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కొంతకాలం పాటు వడ్డీ చెల్లించిన ఈ సంస్థ.. ఈ ఏడాది జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. అధిక వడ్డీ ఆశ చూపించి మన దేశంతో పాటు ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్ల నుంచి కూడా డిపాజిట్లు సేకరించారు. సుమారు 23 వేల మంది పెట్టుబడులు పెట్టారు. గత నెలలో పుప్పాలగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పంచాక్షర్ రూ. 11 లక్షలు, గంటాడి హరి రూ. 88.50 లక్షలు, విశ్వజీత్ సింగ్ రూ. 36.80 లక్షలు, పి.రాజు మహేంద్ర కుమార్ రూ. 26 లక్షలు, వందపాటి లక్ష్మి రూ. 64.50 లక్షలు.. ఇలా డీబీ స్టాక్ బ్రోకింగ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయామని పలువురు బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీపాంకర్ బర్మన్, అతని సహచరులపై చీటింగ్‌తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆగస్టు 21న బర్మన్ అస్సాంలోని ఆఫీసు బోర్డు తిప్పేసి గువాహటి నుంచి పరారయ్యారు. దీంతో పాన్ బజార్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్వెస్టర్లు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని పోలీసులు సూచించారు. బర్మన్ ఆ్రస్టేలియాలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. -
కూటమి నిర్వాకాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీటాస్త్రాలు
-
నిండా ముంచిన జయభేరి సంస్థ..
-
ట్రేడింగ్‌లో పెట్టుబడి రూ. 5.4 కోట్లు.. లాభం రూ.15.58 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ట్రేడింగ్‌లో పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఆశ చూపించి ఒకరి నుంచి రూ.5.4 కోట్లు కొల్లగొట్టిన ఇద్దరిని విజయవాడలో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఆ వివరాలను టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శనివారం మీడియాకు తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌నకు సైబర్ నేరగాళ్లు జూన్ 8న ఇన్వెస్టిమెంట్ లింకు పంపారు. దీంతో లింక్ ఓపెన్ చేసి ఆ వ్యక్తి గ్రూపులో చేరాడు. ‘బీ6/ స్టాక్ విజనరీస్’ పేరుతో ఉన్న గ్రూప్‌లో లైదియశర్మ గోల్డ్‌మెన్ స్కీం గురించి వివరించింది. త్వరలో రాబోతున్న మరిన్ని ఐపీఓల గురించి తెలుసుకొని ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.పాన్‌కార్డు, ఆధార్‌కార్డుతోపాటు ఇతర వివరాలతో ఆమె చెప్పిన వెబ్సైట్లో లాగిన్ అయ్యాడు. ఆపై ట్రేడింగ్ మొదలుపెట్టాడు. ప్రముఖ సంస్థలకు సంబంధించిన ట్రేడింగ్ ఆప్షన్స్ వెబ్సైట్లో పొందుపర్చగా, బాధితుడు సులువుగా నమ్మాడు. జూలై 10 నుంచి పలు దఫాలుగా నెలరోజుల్లోనే రూ.5.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. ఇలా వెబ్సైట్లో బాధితుడికి రూ.15.58 కోట్లు లాభం వచ్చినట్టు చూపించింది. దీంతో ఆ అమౌంట్ విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. విత్‌డ్రా సదుపాయం కల్పించాలంటే మరికొంత చెల్లించాలని సైబర్ నేరగాళ్లు బాధితుడ్ని డిమాండ్ చేశారు.దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రాంపల్లి కొండల్రావు, అతని సోదరుడు చంద్రశేఖర్ఆజాద్లను విజయవాడలో అరెస్ట్ చేశారు. వీరిద్దరూ రిక్కి సాఫ్ట్వేర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. నిందితులు ఈ తరహా మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా 26 ఫిర్యాదులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శిఖాగోయల్ ప్రజలకు సూచించారు. -
మాయాలోకపు జీవన నైపుణ్యాలు
మోసం ఏ రూపంలోనైనా మనల్ని మాయలో పడేసే లోకంలో జీవిస్తున్నాం! ఒకరికి ఒకరం ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుని మోసపోవటం అన్నది ఎప్పుడూ కొత్తగా జరుగుతుంది. కాలింగ్ బెల్ కొడతారు. ఫలానా కంపెనీ నుంచి వచ్చాం అంటారు. మనల్ని బుట్టలో పడేసి, ‘సర్దుకుని’ వెళ్లిపోతారు... ఇదొక రకం మోసం! ఎవరో ఒక పెద్ద కంపెనీ నుంచి ఫోన్ చేస్తారు. మీరు ఫారిన్ ట్రిప్‌కి ఎంపికయ్యారని చెబుతారు. ఫలానా చోటుకు రమ్మంటారు. వెళ్లాక అక్కడ మనల్ని పెద్ద వెంచర్లో ఇరికించేస్తారు... ఇది ఇంకో రకం మోసం! ఇక ఓటీపీ మోసాలైతే ఏ మార్గంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయో అంతే పట్టదు. అనుక్షణం జాగ్రత్తగా ఉండటం, ప్రతిదాన్నీ అనుమానించటం జీవితానికి ఇప్పుడు అవసరమైన నైపుణ్యాలు అయ్యాయి!వాట్సాప్‌లో తరచూ మిమ్మల్ని హెచ్చరిస్తూ వస్తుండే సందేశాల వంటిదే ఇది. గడప గడపకూ తిరిగే సేల్స్‌మెన్‌తో జాగ్రత్త, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే కంపెనీల ఆకర్షణీయమైన ఆఫర్ల ఎరకు చిక్కుకోకండి, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మిమ్మల్ని మీ క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ అడిగితే ఇవ్వకండి... అంటూ అప్రమత్తం చేసే మెసేజ్‌లు నాకు నిరంతరం వస్తూనే ఉంటాయి. మీక్కూడా వస్తుంటాయని కచ్చి తంగా చెప్పగలను. అలా వారు ఒక హెచ్చరికగా తప్పించాలనుకున్న సంఘటన గతవారం నా సోదరి కిరణ్ విషయంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటి కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీయగానే ద్వారం ముందు ముగ్గురు వ్యక్తులు కనిపించారు. తాము ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) ఇంజినీర్లమని చెప్పు కున్నారు. గ్యాస్ కనెక్షన్‌ను పరిశీలించేందుకు వచ్చామని చెప్పారు. అదృష్టవశాత్తూ వారిని గుర్తింపు కార్డులు అడగాలన్న ఆలోచన కిరణ్‌కు వచ్చింది. వాళ్లవి చూపించినప్పటికీ, నేననుకోవటం అవి నకిలీవి అయుంటాయని. ఆమె తెలివిగా ఇంకో పని చేసింది. ఆ ఐడీ కార్టులను ఫొటో తీసుకుంది. వారి ఫోన్ నెంబర్లను అడిగి రాసుకుంది. అందుకు వాళ్లు కంగు తిన్నప్పటికీ వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలలేదు. కిరణ్... వాళ్లని వంటింట్లోకి తీసుకొని వెళ్లారు. కానీ, ఇంట్లో పనిమనుషులు కూడా వాళ్లతో పాటు అక్కడ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులు గ్యాస్ పైపులను ‘తనిఖీ’ చేసి, ఆ పైపులలో ఒకటి వారెంటీ గడువును దాటేసింది కనుక దానిని మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. అందుకు కిరణ్, ‘మాది పాతబడిపోతే మిగతా ఫ్లాట్‌లో ఉన్నవాళ్లవీ పాతబడి ఉండాలి కదా! మా గ్యాస్ కనెక్షన్లన్నీ ఒకేసారి బిగించినవి’ అని వారితో అన్నారు. ఆ మాటకు, ఆ ముగ్గురిలో సీనియర్ ఇంజినీర్‌నని చెప్పుకున్న వ్యక్తి ఏ మాత్రం వెరపు లేకుండా పక్క ఫ్లాట్‌లో చెక్ చేసి వస్తానని చెప్పి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత తిరిగొచ్చి, ‘వాళ్ల పైప్ బాగానే ఉంది. కొత్తది మార్చి ఉంటారు, మీక్కూడ కొత్తది వెయ్యవలసిన అవసరం ఉంది’ అని కిరణ్‌తో చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు పైప్‌ను మార్చే పని ప్రారంభించగానే కిరణ్ తన దగ్గరున్న ఐజీఎల్ నెంబర్లకు మెసేజ్ చేయటం మొదలు పెట్టారు. ‘పైపును మార్చాలని, మా ఇంజినీర్లను పంపిస్తున్నామని’ ఐజీఎల్ తనకు ముందే సమాచారం ఇవ్వకపోవటం పట్ల కిరణ్ విసుగ్గా ఉన్నారు. పది, పదిహేను, ఇంకా ఎక్కువ నెంబర్లకే ఆమె మెసేజ్ పెట్టి ఉంటారు. వాటిల్లో ఒకటి ఐజీఎల్ పూర్వపు సీఈవోది అన్నట్లు ఆమెకు గుర్తు. ఆ నెంబర్ల నుండి రిప్లయ్‌లు రావటానికి మరీ అంత సమయం ఏమీ పట్టలేదు. ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఐజీఎల్ పంపినవారు కాదు! వారు మోసగాళ్లు. అంతకన్నా కూడా, ‘వాళ్లను పైపులు మార్చనివ్వకండి’ అని, ‘ఐజీఎల్ సిబ్బంది ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నార’ని హెచ్చరిస్తూ ఐజీఎల్ నంబర్లలో కొన్నింటి నుంచి కిరణ్‌కు వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. ఆ మను షుల్ని తక్షణం బయటికి పంపించేయండి అన్నది వారి నుంచి వచ్చిన స్పష్టమైన సందేశం. నిజంగానే వాళ్లు మోసగాళ్లు! కానీ అప్పటికే వారు పైపును తొలగించి, దాని స్థానంలో మరొక పైపును బిగించారు. చిత్రంగా వాళ్లు ఆ పనికి డబ్బులు అడగలేదు. పైగా వెళ్లిపోయే తొందరలో ఉన్నట్లు కనిపించారు. బహుశా కిరణ్ ఐజీఎల్ వాళ్లతో మాట్లాడినందువల్ల భయపడినట్లున్నారు. తదుపరి గ్యాసు బిల్లులో పైపు మార్పిడి చార్జీలు కలిసి ఉంటాయని చెప్పి బయల్దేరుతూ, అనుకోకుండా కందెన అంటిన ఒక ఫోల్డర్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ఈలోపు ఐజీఎల్ కంపెనీ వాళ్లు కిరణ్‌కి ఫోన్ చేసి, తక్షణం తమ ఇంజనీర్లను ఆమె ఇంటికి పంపుతున్నట్లు చెప్పారు. నిజానికి పూర్వపు సీఈఓ నెంబరు అయివుండవచ్చని మెసేజ్ ఇవ్వటం ద్వారా ఆమె చేసిన ప్రత్యేక ప్రయత్నం ఐజీఎల్ సొంత ఇంజనీర్లు – మెక్ కాయ్ కంపెనీ వాళ్లు – వీలైనంత త్వరగా ఆమె ఇంటికి చేరుకుని, ఆ మోసగాళ్లు బిగించి వెళ్లిన కొత్త పైప్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించటాన్ని సాధ్యం చేసింది. మొత్తానికి మోసం జరగబోయిందన్నది స్పష్టం. కిరణ్ వసంత్ విహార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసిన వెంటనే ఆయన తమ పోలీసులను పంపారు. ఆఫీసర్ స్పందన నిజాయితీగా, చురుకుగా, సౌమ్యంగా ఉందని కిరణ్ చెప్పారు. ఆ ముగ్గురు మోసగాళ్లు తమ ‘పని’ పూర్తి చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఐజీఎల్ ఇంజినీర్లు, పోలీసులు దాదాపుగా ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. మార్చిన పైపు నకిలీది అవటమే కాకుండా, దాని దిగువ భాగం సరిగా బిగించి లేదని ఐజీఎల్ ఇంజనీర్లు కిరణ్‌కు చెప్పారు.అంటే ఒకవేళ గ్యాస్ స్విచ్ ఆన్ చేసి ఉంటే లీక్ అయుండేది.కిరణ్ ఫొటో తీసిన గుర్తింపు కార్డుల్ని, ఆ మోసగాళ్లు వదిలి వెళ్లిన ఫోల్డర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి కిరణ్ తీసుకున్న ఫోన్ నెంబర్లను బట్టి వారిని కనిపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ విధంగా 90 నిమిషాల వ్యవధిలో పరిస్థితి చక్కబడి, నష్టం జరగకుండా ఆగింది. ఇందుకు విరుద్ధంగా జరిగి ఉంటే కిరణ్ దాని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అది మరింత దారుణమైన పరిస్థితిగా ఉండేది. అదృష్టవంతురాలు. అలా జరగలేదు. మూడు విషయాలను ఆమెను రక్షించాయని నేను అంటాను. గుర్తింపు కార్డులను ఫొటో తీసుకోవటం, వాళ్ల ఫోన్ నెంబర్లను అడిగి తీసుకోవటం, ‘మీ ఇంజినీర్లను పంపిస్తున్నట్లు ముందుగా నాకెందుకు సమాచారం ఇవ్వలేద’ని ఐజీఎల్ వాళ్లను ఆమె అడగటం! అన్నిటి కన్నా ముఖ్యంగా ఆ మోసగాళ్లు ‘పాడైపోయిన’ పైపును మార్చే ‘పని’ మీద ఉన్నప్పుడు తన ఇంట్లో పని చేసేవాళ్లు కూడా అక్కడ ఉండేలా జాగ్రత్త పడటం. ఒకవేళ ఆమె ఇవేవీ చేయకపోయుంటే?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్టాక్ మార్కెట్ పేరిట మోసం... రూ. కోటి పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి
పటాన్చెరు టౌన్: స్టాక్ మార్కెట్ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేసి భారీగా నగదు కాజేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు కథనం ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్‌కు చెందిన బెజవాడ నాగార్జున ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన వాట్సాప్‌కు జులై 5న స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మెసేజ్‌ను నాడియా కామి అనే మహిళ పంపితే వివరాలను నమోదు చేశాడు. తర్వాత ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో దఫాలవారీగా ఇన్వెస్ట్ చేసిన నగదు రూ.82 లక్షలతో కలిపి మొత్తంగా వాలెట్లో రూ.కోటీ 30 లక్షలు చూపించారు. ఒక రోజు నగదు డ్రా చేసుకుంటానంటే రూ.17 లక్షలు టాక్స్ చెల్లిస్తేనే అంతా డ్రా చేసుకోవచ్చని నమ్మించారు. దీంతో బాధితుడు అప్పు చేసి, తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి రూ.17 లక్షలు చెల్లించిన తర్వాత అటు వైపు ఉన్న అపరిచిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు, సోమవారం అర్ధరాత్రి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో నగదు వేసిన అకౌంట్లో ఉన్న రూ. 24 లక్షల నగదు హోల్డ్ చేసినట్లు పటాన్చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలపై 1930 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట.. పటాన్చెరు టౌన్: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట ప్రైవేట్ ఉద్యోగి భారీగా నగదు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏఆర్ బృందావన్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి జూన్ 17న ట్రేడింగ్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. లింకును ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేశారు. దీంతో అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. ముందుగా బాధితుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగా మూడు లక్షలు లాభాలు చూపించారు. పలు దఫాలుగా స్నేహితుల వద్ద నగదు తీసుకొని, బంగారం అమ్మి మొత్తం రూ.98.40 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు, వచ్చిన లాభాలు ఇవ్వాలని అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం రాత్రి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు వేసిన అకౌంట్లో ఉన్న రూ. లక్షను హోల్డ్ చేశామన్నారు. -
లక్షలాది అకౌంట్లు.. ఆర్బీఐ ఆశ్చర్యం!!
మోసపూరిత లావాదేవీలు, ఎవర్‌గ్రీనింగ్ రుణాల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాలు ఇటీవల అధికమయ్యాయి. కొన్ని బ్యాంకులు ఇలాంటి లక్షలాది అకౌంట్లను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.బిజినెస్ స్టాండర్ట్ కథనం ప్రకారం.. “గత రెండు సంవత్సరాల్లో మరింత దృష్టి కేంద్రీకరించిన అంశం.. అంతర్గత ఖాతాల నియంత్రణ, నిర్వహణ. కొన్ని బ్యాంకులకు సరైన కారణం లేకుండా లక్షలాది ఖాతాలు కలిగి ఉన్నాయని మేము గుర్తించాం” అని మంగళవారం బ్యాంకుల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, ఆడిటర్లతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్.జె పేర్కొన్నారు.ఈ ఖాతాల్లో కొన్ని మోసపూరిత లావాదేవీలు , రుణాల ఎవర్ గ్రీన్ కోసం వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత ఖాతాలతో దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున వాటిని హేతుబద్ధీకరించాలని, వీలైనంత తగ్గించాలని సీఎఫ్‌లకు స్వామినాథన్ సూచించారు. గత వారం బ్యాంక్ చీఫ్‌లతో జరిగిన సమావేశంలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. మ్యూల్ ఖాతాలను (చట్టవిరుద్ధమైన ఖాతాలు), డిజిటల్ మోసాలను అరికట్టాలని కోరారు. -
అదో దా‘రుణ’ యాప్
సాక్షి, అమరావతి: లోన్ యాప్ మోసాలు ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వివిధ లోన్ యాప్‌లు అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అక్రమ మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ నిర్వాకం వెలుగుచూసింది. ఈ యాప్ సులభంగా రుణాలు ఇస్తామని సామాన్యులను బురిడీ కొట్టిస్తోంది. లోన్ ఇచి్చన అనంతరం భారీ వడ్డీలు వేస్తూ ఖాతాదారులను వేధిస్తోంది. రుణాలు చెల్లించలేని వారి వ్యక్తిగత సమాచారాన్ని దురి్వనియోగం చేస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తోంది.వారి ఫొటోలను మారి్ఫంగ్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో రుణాలు తీసుకున్న వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లకు తమ ఏజెంట్లను పంపించి మరీ దాడులు చేయిస్తూ వారి ఆస్తులను రాయించుకుంటున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్యాప్పై గడచిన ఆరు నెలల్లోనే ఏకంగా 1,062 కేసులు నమోదు కావడం గమనార్హం. నిషేధించినా సరే.. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలపై సైబర్ పోలీసులకు సవాల్‌గా మారింది. వాస్తవం ఏమిటంటే.. ఆ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే నిషేధించింది. ఆ సమాచారాన్ని గూగుల్‌తోపాటు ఇతర సెర్చ్ ఇంజన్ల యాజమాన్యాలకు కూడా సమాచారమిచి్చంది. అయినా సరే.. ఆ యాప్ స్మార్ట్ ఫోన్లలో ఎలా అందుబాటులో ఉంటోందన్నది అంతు చిక్కడం లేదు. గత నాలుగేళ్లలో మొత్తం 1,600 లోన్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వాటిలో అత్యధికం చైనా కేంద్రంగా నిర్వహిస్తున్న యాప్‌లే ఉండటం గమనార్హం. నిషేధించాం కాబట్టి ఇక ఆ యాప్‌లు మోసాలకు పాల్పడలేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కానీ ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్ మోసాలు కొనసాగుతుండటం విస్మయానికి గురి చేస్తోంది.ఆ యాప్‌ను డిలీట్ చేయండి ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సైబర్ పోర్టల్ స్పందించింది. ‘క్యాష్ ఎక్స్పాండ్ యూ’ లోన్ యాప్‌ను తాము నిషేధించినట్టు తెలిపింది. అయినా వివిధ గేట్‌వేల ద్వారా ఆ యాప్ స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉంటున్నట్టు గుర్తించినట్టు పేర్కొంది. కాబట్టి.. మొబైల్ ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లలో ఉన్న ఆ యాప్‌ను డిలీట్ చేయాలని సూచించింది. తద్వారా ఆ యాప్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.నిషేధించినా సరే ఇతర మార్గాల ద్వారా మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటున్న యాప్‌లపై నేషనల్ సైబర్ పోర్టల్ సమగ్ర దర్యాప్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే తగిన కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొంది. లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా మోసపోతే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని నేషనల్ సైబర్ పోర్టల్ కోరింది. -
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా
సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ.. ‘ఏటీవీఎం ఫెసిలిటేటర్’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్.. రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ / డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లలో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. బోగస్ వెబ్సైట్లతో టోకరా.. రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్‌ను కొందరు మోసగాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్సైట్లను సృష్టించి యువతను మభ్య పెడుతున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్‌ను మారి్ఫంగ్ చేసి ఆ నకిలీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదురైల్వే శాఖ స్పష్టికరణ ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్‌కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్‌కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. -
ముంచేసిన ‘మై క్వీన్’
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్ ముంచేసింది. ఒక్క రూపాయి కడితే ఏడు రూపాయలు, రూ.100 కడితే రూ.700 చెల్లిస్తామంటూ వల విసిరి బాధితులకు శఠగోపం పెట్టింది. ప్రైవేటు ఉపాధ్యాయులు, యువత, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు భారీ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొదట్లో వారికి బాగానే డబ్బులు వచ్చాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యజమాని ఎక్కడుంటాడో తెలీదు.. చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా పెద్దారవీడు, తర్లుపాడు, పెద్ద దోర్నాల, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాలకు కూడా ఈ చైన్ లింకు స్కీమ్ విస్తరించినట్టు సమాచారం. మై క్వీన్ యాప్ లింక్ పంపి.. ఒక్క రూపాయి కడితే మరుసటి రోజు రూ.7 అకౌంట్లో జమయ్యేలా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ను రూపొందించారు. ఈ చైన్ సిస్టమ్‌లో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి ‘మై క్వీన్’ యాప్ లింక్ పంపుతారు. ఆ వ్యక్తి మరో కొంత మందిని చేర్పిస్తే వారికి కూడా లింక్‌ను షేర్ చేస్తారు. ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయాలి. రూ.100 ఈ రోజు చెల్లిస్తే 24 గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో రూ.700 జమవుతాయి. దీంతో 24 గంటల్లోనే తాము కట్టిన దానికి 7 రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఒక్క మార్కాపురం పట్టణంలోనే 8 నుంచి 10 వేల మంది సభ్యులుగా చేరి సుమారు రూ.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. గతంలో ఇలాంటి స్కీమ్‌ల విషయంలో మోసపోయినా ప్రజలు లెక్కచేయడం లేదు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ మై క్వీన్ యాప్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. నెల రోజుల్లోనే లక్షాధికారులు కావాలనే దురాశ వారిని తెగించేలా చేస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి కొన్ని రోజుల నుంచి నగదు చెల్లింపులు కావడంలేదని తెలుస్తోంది. ఈ విషయమై మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ప్రజలెవరూ ఇలాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. -
హైదరాబాద్: గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ఓ సాప్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామంటూ నిరుద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులు నుంచి డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. రైల్ వరల్డ్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసింది.సుమారు రూ.5 కోట్లు వసూలు చేసిన రైల్ వరల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసినట్లు సమాచారం. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆన్లైన్ మోసాలకు అంతేలేదు
దేశంలో ఆర్థిక మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. వినియోగదారుల ఆర్థిక డేటా వివరాలు అంగట్లో సరుకులా అమ్ముడవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో పట్టణ భారతీయుల్లో అధిక శాతం మంది క్రెడిట్ కార్డు మోసాలకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఆ తర్వాత.. నిత్యం లావాదేవీలకు కోసం వాడే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సరికొత్త చోరీలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలోని వేలాది మంది డేటా విక్రేతల ద్వారా దేశీయ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారం మార్కెట్లో సులభంగా లభిస్తోందని సోషల్ మీడియా రీసెర్చ్ ఫ్లాట్‌ఫారం సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. సాక్షి, అమరావతిక్రెడిట్ కార్డుల ద్వారా 43శాతం మోసాలు..దేశవ్యాప్తంగా గడిచిన 36 నెలల్లో ఏకంగా 47 శాతం మంది పట్టణ భారతీయులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక మోసాల బారినపడినట్లు నివేదిక పేర్కొంది. 43 శాతం మంది తమ క్రెడిట్ కార్డు ద్వారా.. 30 శాతం మంది యూపీఐ లావాదేవీల ద్వారా మోసపోయారు. క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన మోసాల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు దేశీయ, అంతర్జాతీయ వ్యాపారులు వెబ్సైట్ల ద్వారా అనధికారిక చార్జీల మోతను భరించాల్సి వచి్చంది. బ్యాంకర్ల పేరుతో ఫోన్లుచేసి ఓటీపీలు ద్వారా డెబిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలంటూ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇక యూపీఐ ద్వారా ఆన్లైన్ దోపిడీ విషయంలో ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు చెల్లింపునకు అంగీకరించడానికి పంపించే లింక్‌ను క్లిక్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులను పోగొట్టుకున్నారు. ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆరి్థక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేలి్చచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.అమ్మకానికి క్రెడిట్ కార్డు డేటా.. మరోవైపు.. దేశంలోని వినియోగదారుల క్రెడిట్ కార్డు డేటా సులభంగా అమ్మకానికి అందుబాటులో ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. పాన్‌కార్డు, ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారంతో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్, ఇతర చిరునామాతో క్రెడిట్ కార్డుల వివరాలు కూడా అందుబాటులో ఉండటం సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఒక్క ఏడాదిలో రూ.13,930 కోట్ల దోపిడీ.. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 36వేల కంటే ఎక్కువ ఆర్థిక మోసాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఆరి్థక ఏడాదితో పోలిస్తే 166 శాతం మేర గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఈ మోసాల కేసులు 2022–23లో 13,564 నుంచి 2023–24లో 36,075కి చేరుకున్నాయి. అయితే, ఈ మోసాల విలువ 2023–24లో రూ.13,930 కోట్లకు చేరాయి. అయితే, ఇక్కడ ప్రతి పది మంది బాధితుల్లో ఆరుగురు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. -
ఈవీఎంలతో మోసం చేశారు
ధర్మవరం: ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు కుట్రలు, మోసాలతో జరిగాయని, ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడి గెలుపొందారని తాను అనుకున్నట్లే ప్రజలు కూడా అనుకుంటున్నారని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరావిురెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ధర్మవరంలోని తన నివాసంలో ఈవీఎంల ద్వారా దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో మోసాలు జరిగాయంటూ డెమో ద్వారా వివరించారు. నియోజకవర్గాలలో పోలైన ఓట్లు, ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలా జరగలేదని, దేశంలోని పలు రాష్ట్రాలలో ఈవీఎంల ద్వారా మోసాలు చేసి గెలుపొందారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో మోసాలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలకే కూటమి అభ్యర్థులు 120 సీట్లు గెలిచారు.. 150 సీట్లు గెలిచారంటూ టీవీలలో చూపించారన్నారు. ఇలా చేయడం వల్ల కౌంటింగ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ ఏజెంట్లు బయటకు వెళ్లిపోతే అధికారులతో వన్‌సైడ్‌గా చెప్పించుకోవచ్చని పథకం పన్ని అమలు చేసినట్లు తెలుస్తోందని చెప్పారు. తాను ఓడిపోయిన బాధలో మాట్లాడట్లేదని, తాము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి పోయాయని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇవ్వాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వారు ఏ మాత్రం ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాను ఓడినా ప్రజల కోసం గొంతు వినిపిస్తానన్నారు. కార్యకర్తలెవ్వరూ అధైర్య పడొద్దన్నారు. రానున్న రోజులు మంచిగా ఉంటాయని భరోసా ఇచ్చారు. -
హైదరాబాద్ లో వెలుగు చూసిన కొత్త రకం మోసం
-
నిరుద్యోగులకు భార్య, భర్త టోకరా
-
హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్‌లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్‌పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్‌లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ
-
మేనిఫెస్టో మోసగాడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి.. అందుకోసం వందల హామీలిచ్చి అందలమెక్కుతాడు.. తనను నమ్మి ఓటేసిన ప్రజలను నిలువునా వంచిస్తాడు. హామీలన్నీ చెత్తబుట్టలో పడేస్తాడు. హామీలిస్తే అమలు చేయాలా? అని సమాధానమిస్తాడు. మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు.. మాయమాటలతో ఎన్నికల ముందు తిమ్మిని బమ్మి చేసి కిచిడీ మేనిఫెస్టోతో ప్రజల నమ్మకంతో ఆడుకుంటాడు. ‘చంద్రబాబుకు ఒక శాపముంది.. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది’ అని ఆనాడు అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలు ఎప్పటికీ అక్షరసత్యం.. అందుకే చంద్రబాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. అబద్ధాలు తప్ప నిజం మాట్లాడడు.అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. చంద్రబాబు పాలనలో మహిళలు, వృద్ధుల కష్టాలు, రైతుల కన్నీళ్లను గుర్తు చేసుకోవాలి. బాబొస్తే జాబన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. కొడుక్కి మంత్రి పదవే కట్టబెట్టి నిరుద్యోగులకు మాత్రం కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. మన భవిష్యత్‌ను గుర్తు చేసుకుని.. మన కోసం ఒక మంచి బాట వేసిన జననేతను మళ్లీ గెలిపించుకోవాలి. ఒక్క ఓటుతో చంద్రబాబు అబద్ధాల ప్రపంచాన్ని పటాపంచలు చేయాలి. హామీలతో వంచించే నేతను విశ్వసిస్తే భవిత నాశనమే.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి అమ్ముడపోయి.. ఇప్పుడు ఆ పారీ్టతోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతకు మేనిఫెస్టో కేవలం ఒక కాగితం మాత్రమే.. జగన్ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చే మాట.. ఐదేళ్ల పాలనను చాటిచెప్పే పవిత్ర వాగ్దానం. ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు తాను గెలిచిన ప్రతీసారి ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. 2014లో పదవి కోసం చంద్రబాబు 600కు పైగా హామీలు గుప్పించారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చాక ఆయన రూటే వేరు. హామీల మాటే మరిచిపోతారు.జనంలోకెళ్తే ఎక్కడ తన్ని తరిమేస్తారోనని మేనిఫెస్టోను తన వెబ్సైట్ నుంచి మాయం చేస్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు తొడుగుతూ అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేయడం.. అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ.. ఎప్పుడూ మేనిఫెస్టోను అమలుచేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు మరోసారి.. సూపర్ సిక్స్‌తో కలిపి ఇతర హామీలు ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారు. రుణమాఫీ పేరుతో టోపీ 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్‌లో కలిసి చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ప్రధాన హామీలు 1. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం 2. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ 3. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి 4. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకంలో రూ.25 వేల డిపాజిట్ 5. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం.. పక్కా ఇళ్ల నిర్మాణం 6. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు 7. చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ 8. సింగపూర్‌ను మించి అభివృద్ధి 9. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీ నిర్మాణం ఇలా 650కిపైగా హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీల అమలును తుంగలో తొక్కారు. ఇదేంటని ప్రశి్నస్తే.. కేంద్రం సహకరించలేదంటూ బుకాయించి.. హామీలిస్తే అమలు చేయాలా? అని ఎదురు ప్రశి్నంచారు. ఎన్టీఆర్ హామీలకు బాబు వెన్నుపోటు ఉమ్మడి రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పోడిచి.. అధికారంతోపాటు టీడీపీని కబ్జా చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2 కే కిలో బియ్యం హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేయడంతో పాటు రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. 1999లో అరచేతిలో స్వర్గం 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన విశ్వరూపం చూపించాడు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. 1. కోటి మందికి ఉపాధి 2. 35 లక్షల ఇళ్లు నిర్మాణం 3. దారిద్య్ర నిర్మూలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు 4. పట్టణాల్లో మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు 5. 25 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి సౌకర్యం ఇలా పదుల సంఖ్యలో హామీలిచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయిపై సానుభూతి కలిసొచ్చి ఆ ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. హామీల అమలును మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కేంద్రం సహకరించలేదని బుకాయించారు. ఉచిత విద్యుత్‌పై పరిహాసం అలిపిరి ఘటన నుంచి సానుభూతి పొందడం ద్వారా అధికారంలోకి రావాలన్న ఎత్తుగడతో 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని.. వ్యవసాయ విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని మహానేత వైఎస్సార్ హామీ ఇస్తే అపహాస్యం చేశారు. సేద్యానికి ఉచితంగా విద్యుత్ ఇస్తే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని చంద్రబాబు పరిహాసమాడారు. చంద్రబాబు మోసాన్ని గుర్తించిన జనం అతని పాలనకు చరమగీతం పాడారు. 2009లో తారాస్థాయికి బాబు అబద్ధాలు 2009 ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో చంద్రబాబు మహాకూటమిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో హామీలు 1. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.2 వేల నగదు బదిలీ 2. 50 లక్షల ఉద్యోగాలు 3. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ 4. 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం.. అలా పదుల కొద్దీ హామీలతో ప్రచారంలో ఊదరగొట్టినా అతని నైజం తెలిసి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీని జనం గెలిపించారు. వ్యవసాయానికి ఏడు గంటలకు బదులు 9 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, రేషన్ బియ్యం ఒక్కొక్కరికి 4 కేజీలు కాకుండా 6 కేజీలకు పెంచి ఇస్తామని రెండే హామీలు ఇచ్చిన మహానేత వైఎస్‌ను విశ్వసనీయతకు జనం పట్టం కట్టారు. ప్రత్యేక హోదా అంటూ 2019లో మోసం 2018లో బీజేపీతో విడిపోయి 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. కమిషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకోవడం కోసం ప్రత్యేక హోదాను 2016లో కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు.. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్ పగటిపూటే సరఫరా చేస్తామని.. 2 కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని.. అన్నదాత సుఖీభవలో రైతులకు ఏటా రూ.15 వేలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతానని హామీలు ఇచ్చారు. చంద్రబాబు మోసానికి భయపడిన జనం ఆ ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. కర్ణాటక, తెలంగాణలో విఫలమైన హామీలతో ‘సూపర్ సిక్స్’ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్.. నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాక్షేత్రంలో ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. మళ్లీ బీజేపీ, జనసేనతో జట్టుకట్టారు. కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమల్లో నీరుగారిపోయినా వాటికే సూపర్ సిక్స్ ముసుగేసి ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో ఇంతవరకూ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ అమలు కాలేదు. మిగతా అమలవుతాయో లేదో తెలియదు. -
పక్కాగా కేటుగాడే!
‘‘వ్యవసాయం వల్ల ఉపయోగం లేదు.. వ్యవసాయం చేయడం ఇక దండగ.. భూమిని నమ్ముకోకుండా లాభదాయకమైన వ్యాపారాలు చేసుకోవడం ఉత్తమం.. ఉచితంగా విద్యుత్ ఇస్తే.. ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే.. రైతులకు ఎంత చేసినా కావాలంటారు.. వాళ్లకు ఇంకేం పనిలేదు.’’ – అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్నమాటలివి.అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా మాట్లాడే ఊసరవెల్లి నారా చంద్రబాబు నాయుడు. అ«ధికారమే పరమావధిగా అమలుకు సా«ధ్యం కాని హామీలు గుప్పించడం.. అధికారం రాగానే వాటిని బుట్టదాఖలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో ఆయన ఇచి్చన హామీలే ఇందుకు నిదర్శనం. ‘బ్యాంకులో తనఖా పెట్టిన మీ భార్య పుస్తెలతాడు ఇంటికి రావాలంటే బాబు రావాలి. మీ రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు రావాలి’ అంటూ 2014 ఎన్నికల ముందు ఊరూ..వాడా ప్రచారం ఊదరగొట్టారు. తీరా గద్దెనెక్కాక నిండా ముంచిన వైనం ఇప్పటికీ అన్నదాతలు, డ్వాక్రా మహిళల కళ్లెదుట కదలాడుతోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2014 ఎన్నికల నాటికి రైతులకు ఉన్న రూ.87,612 కోట్ల వ్యవసాయ, బంగారు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానంటూ నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచారు. రుణ మాఫీ సాధ్యం కాదని, ఎగ్గొట్టడంలో భాగంగా ఈ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై నాబార్డు మాజీ చైర్మన్ కోటయ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ప్రకారం కుటుంబానికి రూ.1.50 లక్షలకు మించి మాఫీ చేయబోమని మాట మార్చేశారు.అంతేకాకుండా అనేక షరతులు పెట్టారు. ఎకరాకు నిర్దేశించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, సాగు కోసం తీసుకున్న బంగారు రుణాలు, మీడియం టర్మ్ రుణాలుగా మార్చిన పంట రుణాలు అయి ఉండాలంటూ మెలిక పెట్టారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున గరిష్టంగా రూ.50 వేలకే పరిమితం చేశారు. వ్యవసాయ రుణమాఫీ స్కీమ్ (ఏడీఆర్ఎస్) కోసం బడ్జెట్ అవసరమని 2014 ఆగస్టు 14న జీఓ 174 జారీ చేశారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు నోడల్ ఏజెన్సీగా రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశారు.రూ.50 వేల లోపు ఉన్న రుణాలను వన్‌టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక వేళ అర్హత పొంది, అప్పటికే రుణ వాయిదాలు పూర్తిగా చెల్లించి ఉంటే, ఆ మేరకు మొత్తాన్ని వారి సేవింగ్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని, ఒక వేళ రుణ బకాయిలు ఉండి ఉంటే వాటికి సర్దుబాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలా గుర్తించిన రైతులకు రైతు సాధికార సంస్థ ద్వారా రైతు ఉపశమన అర్హత పత్రాలు పేరిట హంగామా చేశారు. చివరకు మూడు విడతల్లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే విదిల్చారు. 67.42 లక్షల మందికి అర్హత పత్రాలు ఉన్నప్పటికీ ఎగ్గొట్టారు.అర్హత ఉండి రుణాలు చెల్లించిన వారికి పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. రైతు రుణ అర్హత పత్రాలు పొందిన వారు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పైసా సాయం అందలేదు. దీంతో చేసిన అప్పులపై వడ్డీలు సైతం చెల్లించలేక లక్షలాది మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అన్నదాత సుఖీభవ అంటూ హంగామా 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను అధికారంలోకి రాగానే ఏటా రూ.12,500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లపాటు రూ.50 వేలు ఇస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన హామీని కాపీ కొట్టిన చంద్రబాబు ఆ ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు అన్నదాత సుఖీభవ అంటూ రైతన్నలను బుట్టలో వేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఈ పథకం కింద కౌలు రైతులతో పాటు 2 హెక్టార్లలోపు చిన్న, సన్నకారు రైతులకు రూ.15 వేలు, 2 హెక్టార్లకు పైబడిన వారికి రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ 2019 ఫిబ్రవరి 17న జీవో 28 జారీ చేశారు. ఆచరణలోకి వచ్చే సరికి పీఎం కిసాన్ సాయంతో ముడిపెట్టి తొలుత 46.76 లక్షల మందికి రూ.1,000 చొప్పున జమ చేశారు. ఎన్నికలకు నెల రోజుల ముందు వివిధ సాకులతో 3.50 లక్షల మందికి కోతపెట్టి 43.26 లక్షల మందికి రూ.3 వేలు చొప్పున వేశారు. ఇలా నాడు అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు మాత్రమే ఇచ్చి రూ.1,765.29 కోట్లతో సరిపుచ్చారు. 2014లో వ్యవసాయ అనుబంధ రంగాల కోసం 200కు పైగా ఇచి్చన హామీలు బుట్టదాఖలయ్యాయి.ఇప్పుడూ అదే రీతిలో మోసం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మరోసారి రైతులను ఏమార్చేందుకు చంద్రబాబు కొత్త హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రైతు భరోసా ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు 53.58 లక్షల మంది ఉన్నారు. వీరిలో కౌలు రైతులు, అటవీ, దేవదాయ సాగుదారులు 2.68 లక్షల మంది ఉన్నారు. ‘బాబు చెప్పినట్టు ఏటా రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఐదేళ్లలో దాదాపు రూ.లక్ష కోట్లు అవసరం. గతంలో రూ.17 వేల కోట్లే సరిగా ఇవ్వలేకపోయిన ఈ పెద్దమనిషి రైతుల కోసం లక్ష కోట్లు ఇస్తానంటే నమ్మేవారెవరూ లేరు’ అని అన్నదాతలు మండిపడుతున్నారు. -
మహీంద్రా ఫైనాన్స్‌లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
2014లో చంద్రబాబు హామీలేంటి? చేసిన మోసాలేంటి?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా చెబుతారు. హామీలిచ్చి మోసం చేయడంలో ఆయన్ను మించినవారు లేరని దేశమంతా చెప్పుకుంటారు. వర్తమాన భారత రాజకీయాల్లో చంద్రబాబును మించిన మోసపూరిత నేత మరొకరు లేరని అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది. 2014 ఎన్నికలపుడు 600కు పైగా హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో టీడీపీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే మాయం చేశారు. మళ్ళీ మరోసారి ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే మాయం చేసిన నాటి మేనిఫెస్టోకి కొత్తగా పచ్చ రంగులేసి ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తడానికి నానాపాట్లు పడుతున్నారు. చంద్రబాబు అంటేనే దగా, మోసం, కుట్ర, వెన్నుపోట్లు అని అందిరికీ తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగిస్తారు, ఏ స్థాయికైనా దిగజారతారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని భ్రమల్లో ముంచుతారు. ఎలాగూ అమలు చేసేది లేదు కనుక ఎటువంటి హామీలైనా ఇచ్చేస్తారు. అలాగే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన తొలి ఎన్నికల్లో 50 పేజీలతో కూడిన రంగు రంగుల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో 600కు పైగా హామీలిచ్చారు. ఒకవైపు బీజేపీని మరోవైపు పవన్‌కల్యాణ్‌ను పెట్టుకుని ప్రచారం చేసుకుని.. అతికష్టం మీద చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ వెంటనే తన మేనిఫెస్టోను ప్రజలు గుర్తు చేసుకోకూడదని, చదివి ప్రశ్నించకూడదని టీడీపీ వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోను మాయం చేశారు. ఇదీ చంద్రబాబు ఘనత. చెప్పేవాడు చంద్రాబాబు అయితే..వినేవాళ్ళు వెర్రివాళ్ళని ఆయన అనుకుంటారు. అందుకే పదేళ్ళనాడు ఇచ్చిన హామీలు ఎవరికి గుర్తుంటాయిలే..అసలు మేనిఫెస్టోనే మాయం చేశాం కదా..అవి ఎవరికీ తెలియవులే అనుకుని..మరోసారి అంతకంటే ఎక్కువగా..అంతకుమించి అన్నట్లుగా హామీలు గుప్పిస్తున్నారు. ఆనాడు అమలు చేయని హామీల్ని ఈసారి అధికారంలోకి వస్తే గొప్పగా అమలు చేస్తానంటూ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. అప్పటిమాదిరిగానే..ఈసారి కూడా ఒకవైపు కమలం పార్టీని మరోవైపు పవన్ పార్టీని వెంటేసుకుని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్నవాటికంటే మరింత ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నట్లు ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయడానికి రెడీ అయ్యారు చంద్రబాబు. అసలు 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన మోసాల గురించి వివరంగా చూద్దాం. 50 పేజీల మేనిఫెస్టోలో 11వ పేజీ నుంచి 45వ పేజీ వరకు వందలకొద్దీ హామీలు కనిపిస్తాయి. సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా..ప్రతి ఒక్కరి మీదా హామీల సునామీతో విరుచుకుపడ్డారు చంద్రబాబు. కాంగ్రెస్ హయాంలో రైతులంతా నానా కష్టాలు పడ్డారు గనుక అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ మీదే తొలి సంతకం చేస్తానని కూడా చెప్పారు. అయితే 87వేల కోట్లకు పైగా ఉన్న వ్యవసాయ రుణాల్ని పంచ పాండవులు మంచం కోళ్ళ సామెతలా 20 వేల కోట్లకు మాత్రమే రద్దు అర్హత ఉందని తేల్చారు. అదీ ఐదు సంవత్సరాల్లో రద్దు చేస్తామని ప్రకటించారు. నాలుగు విడతలు బ్యాంకులకు చెల్లించి ఐదో విడత చెల్లించకుండానే రైతుల్ని మోసం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు రుణాలు రద్దు కాకపోవడంతో వడ్డీలు మరింతగా పెరిగి లక్షలాది మంది భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయారు. రుణమాఫీ అనేది మోసపూరిత హామీగా చంద్రబాబు రుజువు చేసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రుణమాఫీ గురించి అడిగిన స్వయం సహాయక బృందాల మహిళలను చంద్రబాబు బెదిరించారు. డ్వాక్రా సంఘాల రుణాలు ఒక్క రూపాయి కూడా రద్దు చేయలేదు. ఇంటికి దగ్గరలోనే ఉన్న మద్యం బెల్ట్ షాపుల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ద్వారా రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కాని 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఒక్కటి కూడా రద్దు కాలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలిప్పిస్తామంటూ ఇచ్చిన హామీని చంద్రబాబు విజయవంతంగా మర్చిపోయారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 30 వేల రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. కాని ఒక్కరికి కూడా 30 వేలు కాదు కదా..30 రూపాయలు కూడా ఇవ్వలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఫోన్ ఇవ్వలేదు. పేద కుటుంబాలకు సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది. హైస్కూల్, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇస్తామన్నారు. తన పార్టీ గుర్తు విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క విద్యార్థినికి కూడా సైకిల్ ఇవ్వలేదు. కాలేజ్ విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్స్ ఇస్తామన్నారు. ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో 8వ తరగతి నుంచే ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ పాఠాలు లోడ్ చేసిన ట్యాబ్స్ ఉచితంగా ఇస్తున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ఉద్యోగ మిత్ర పథకం కింద ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ యువతీ యువకులకు వెయ్యి నుంచి రెండు వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కాని నాలుగున్నరేళ్ళు కళ్ళు మూసుకుని సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందు కొద్ది మంది టీడీపీ కార్యకర్తలైన యువతీ, యువకులకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారు. 60 నెలల పాటు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని కేవలం మూడు నెలల పాటు కొద్ది మందికి ఇచ్చి...ఇచ్చేశానంటూ డప్పు కొట్టుకున్నారు చంద్రబాబు. మైనారిటీల కోసం విశాఖ, విజయవాడ, రేణిగుంట ప్రాంతాల్లో మూడు హజ్ హౌజ్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఒక్క చోట కూడా వాటి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక కమిషన్ నియమించి బీసీ వర్గాల రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి రిజర్వేషన్లు ఇవ్వకపోగా రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా హింసించి, అవమానించారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క చోట కూడా అందుకు పూనుకోలేదు. సమాజంలోని ప్రతి వర్గానికీ బోలెడు హామీలిచ్చారు. బీసీ కులాలన్నిటికి నిర్దిష్టమైన హామీలు కురిపించారు చంద్రబాబు. బీసీల అభివృద్ధే తన ధ్యేయమని ప్రచారం చేసుకున్నారు. కాని ఏ ఒక్కరికీ ఎటువంటి సాయమూ చేయలేదు. పైగా చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కరకట్ట మీద అక్రమంగా నివసిస్తున్న ఆయన నివాసానికి నాయూ బ్రాహ్మణులు సమస్యలు పరిష్కారం కోసం వస్తే..వారి తోకలు కత్తిరిస్తానంటూ మీడియా ముందే హూంకరించారు. వారిని దారుణంగా అవమానించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలం ఇచ్చి..ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోగా...వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఇంటి స్థలాలిస్తుంటే అనేక వందల ప్రాంతాల్లో కేసులు వేసి పేదల్ని నానారకాలుగా హింసించిన దుష్ట చరిత్ర చంద్రబాబుది. అన్ని ఆటంకాలు అధిగమించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి, దాదాపు సగానికిపైగా పేదలకు ఇళ్ళు కూడా నిర్మిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో ఓడ రేవులు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ సముద్రంలో కలిసిపోయింది. ఒక్క పోర్టుకు కూడా పనులు ప్రారంభించకపోగా...పోర్టుల విషయంలో కేంద్రంతో కయ్యం పెట్టుకుని కేంద్రం ఇస్తానన్నదాన్ని కూడా కాలదన్నారు చంద్రబాబు. కాని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగు పోర్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మరో పది ఫిషింగ్ హార్బర్లు కూడా జగన్ నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీటి పథకం కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయి చంద్రబాబు మోసాల చిట్టాలో చేరిపోయంది. ఈ విధంగా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే నారా చంద్రబాబునాయుడు...2014లో ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్ని రకాలుగా మోసం చేయవచ్చో అన్ని రకాలూగానూ చేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అధికారంలోకి వచ్చి ప్రజలకిచ్చిన హామీలన్ని తుంగలో తొక్కారు. మళ్లీ ఈసారి కూడా అంతకంటే భారీ హామీలిస్తూ, వైఎస్ జగన్ ఇస్తున్న పథకాలన్నీ అమలు చేస్తానని నమ్మించే కుట్రలకు తెర తీస్తున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్ విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ అయితే..అప నమ్మకానికి, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ప్రజలందరికీ తెలుసు. అందుకే వైఎస్ జగన్ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నపుడు నువ్వు వచ్చి కొత్తగా మాకు చేసేదేంటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా?