ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు - ఎందుకంటే? | DoT Warns Against That Never To Dial *401# Due To Potential Fraud, Check The Details Inside - Sakshi
Sakshi News home page

ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు - ఎందుకంటే?

Published Mon, Jan 15 2024 7:41 PM | Last Updated on Tue, Jan 16 2024 1:33 PM

DoT Advises Never To Dial 401 Check The Details - Sakshi

టెలికామ్‌ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలంటి వాటికి స్పందించవద్దని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) వెల్లడించింది. ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పొందుతున్న మరో ఎత్తుగడ ఇదని డాట్ తెలిపింది. 

సమస్యల పరిష్కారం పేరుతో.. సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలియజేస్తూ.. సంస్థ ఎప్పుడూ ఫోన్ చేసి అలంటి వాటిని ఎంటర్ చేయమని చెప్పదని స్పష్టం చేసింది.

*401# కాల్ చేస్తే ఏమవుతుంది!
నిజానికి *401# నెంబర్ ఎంటర్ చేయగానే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్ళిపోతాయని, కాల్‌ ఫార్వార్డ్‌కు మీరు పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుందని డాట్ పేర్కొంది. మీ కాల్స్ మోసగాళ్ళు రిసీవ్ చేసుకుంటే.. అవతలి మీ స్నేహితులను లేదా బంధువులను మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబరుకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయవద్దని డాట్ హెచ్చరించింది.

ఇదీ చదవండి: ఎన్‌హెచ్‌ఏఐ సంచలన నిర్ణయం - అది లేకుంటే ఫాస్ట్‌ట్యాగ్‌ డీయాక్టివేట్

ఒకవేళా మీ మొబైల్ ఫోనులో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయి ఉంటే.. వెంటనే సెట్టింగులోకి వెళ్లి డీయాక్టివేట్ చేసుకోండి. లేకుంటే సైబర్ నేరగాళ్లు సులభంగా మీ కాల్స్ రిసీవ్ చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement