incoming calls
-
ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు - ఎందుకంటే?
టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలంటి వాటికి స్పందించవద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) వెల్లడించింది. ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పొందుతున్న మరో ఎత్తుగడ ఇదని డాట్ తెలిపింది. సమస్యల పరిష్కారం పేరుతో.. సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలియజేస్తూ.. సంస్థ ఎప్పుడూ ఫోన్ చేసి అలంటి వాటిని ఎంటర్ చేయమని చెప్పదని స్పష్టం చేసింది. *401# కాల్ చేస్తే ఏమవుతుంది! నిజానికి *401# నెంబర్ ఎంటర్ చేయగానే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్ళిపోతాయని, కాల్ ఫార్వార్డ్‌కు మీరు పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుందని డాట్ పేర్కొంది. మీ కాల్స్ మోసగాళ్ళు రిసీవ్ చేసుకుంటే.. అవతలి మీ స్నేహితులను లేదా బంధువులను మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబరుకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయవద్దని డాట్ హెచ్చరించింది. ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ సంచలన నిర్ణయం - అది లేకుంటే ఫాస్ట్‌ట్యాగ్ డీయాక్టివేట్ ఒకవేళా మీ మొబైల్ ఫోనులో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయి ఉంటే.. వెంటనే సెట్టింగులోకి వెళ్లి డీయాక్టివేట్ చేసుకోండి. లేకుంటే సైబర్ నేరగాళ్లు సులభంగా మీ కాల్స్ రిసీవ్ చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. -
లాక్డౌన్.2 : జియో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ కష్టాల వేళ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా మే 3వరకు లాక్డౌన్ పొడిగించిన వేళ జియో ప్రీపెయిడ్ చందాదారులు ఇన్కమింగ్ కాల్స్ స్వీకరిస్తూనే ఉండేలా ఊరటనిచ్చింది. రీచార్జ్ ప్లాన్ల గడువు ముగిసినప్పటికీ ఇన్కమింగ్ కాల్స్ విషయంలో జియో కస్టమర్లందరికీ ఎలాంటి అంతరాయం వుండదని ప్రకటించింది. తమ వినియోగ దారులదరికీ ఈ అవకాశం అందుబాటులో వుంటుందని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎప్పటివరకు ఈ చెల్లుబాటు అమల్లో వుంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే లాక్డౌన్ ప్రారంభం నుంచి గడువు ముగిసినా, రీచార్జ్ చేసుకోని ప్రతి ఒక్కరికీ పొడిగించిన చెల్లుబాటు లభిస్తుందో లేదో కూడా స్పష్టత లేదు. (జియో ఫైబర్: రూ.199కే 1000 జీబీ డేటా) ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన చందాదారులందరికీ మే 5 వరకు ఇన్ కమింగ్ కాల్స్ చెల్లుబాటును పొడిగించిన తరువాత జియో కూడా తన వినియోగదారులకు ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఎయిర్టెల్ కూడా మే 3వ తేదీ వరకు అన్ని ప్రీపెయిడ్ ఖాతాదారులకు ఇన్కమింగ్ కాల్స్ సేవల్లోఅంతరాయం వుండదని ప్రకటించింన సంగతి విదితమే. (హాలీవుడ్ సంస్థతో బాలీవుడ్ 'ఏరోస్' విలీనం) కాగా కరోనా మహమ్మారి విస్తరణ, లాక్ డౌన్ కారణంగా దేశీయ టెలికాం సంస్థలుఇప్పటికే వినియోగదారులకు పలు వెసులుబాట్లను కల్పించాయి. ప్రధానంగా ఏటీఎంల ద్వారా రీచార్జ్ చేసుకునే సౌలభ్యంతోపాటు, ఆన్ లైన్ రీచార్జ్ చేసుకోలేని వినియోగదారులకు రీచార్జ్ చేయడం ద్వారా సంబంధిత యూజర్ కమిషన్ పొందే ఆఫర్ ను కూడా తీసుకొచ్చాయి. (భారీగా తగ్గిన బంగారం ధర : ఈ అక్షయ తృతీయకు కొనేదెలా?) -
ఇన్కమింగ్ కాల్ రింగ్ ఇకపై 30సెకన్లు!!
న్యూఢిల్లీ : మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్‌కు చేసే ఇన్కమింగ్ కాల్స్ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది. ల్యాండ్‌లైన్స్‌కు చేసే కాల్స్‌కు అయితే 60 సెకన్ల పాటూ ఉండాలని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ నిర్దేశకాలు జారీచేయడానికి ముఖ్య కారణం ఇప్పటివరకు టెలికాం కంపెనీలు పోటాపోటీగా ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించడమే. వాస్తవానికి గతంలో ఇన్ కమింగ్ రింగ్ సమయానికి ఎలాంటి పరిమితి లేదు. ఎవరైనా కాల్ చేస్తే 45 సెకండ్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్కనెక్ట్ అయ్యేది. మొదట ఇన్ కమింగ్ కాల్ రింగ్ సమయాన్ని జియో 25 సెకన్లకు తగ్గించింది. అనంతరం ఎయిర్టెల్, వొడాఫోన్ కూడా అదేవిధంగా 25 సెకన్లకు తగ్గించాయి. దీంతో వినియోగదారులు ఫోన్ ఎత్తేలోపే లైన్ కట్ అవుతండడంతో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఇకపై కాల్ ఎత్తకపోయినా లేదా రిజక్ట్ చేసినా.. ఇన్కమింగ్ వాయిస్ కాల్స్ అలర్ట్‌కు ఈ సమయాభావాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆపరేటర్లకు తెలిపింది. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయంతో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న పోటీకి తెరపడినట్టే. -
ఓన్లీ ఇన్ కమింగ్..!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) పద్దతిలో లోకల్ కాల్స్‌గా మార్చే కాల్ రూటింగ్ ఎక్స్ఛేంజ్లు ఇక్కడి కాల్స్‌ను (ఔట్ గోయింగ్) బయటి దేశాలకు పంపలేవు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటి మాత్రమే లోకల్ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి (ఇన్కమింగ్) అందించగలవు. నగరంలోని మూడు చోట్ల అక్రమ ఎక్ఛ్సేంజ్‌లు ఏర్పాటు చేసి, రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ మొత్తం ఎగ్గొట్టడానికే... విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్ కాల్ అక్కడి ఎక్స్ఛేంజి నుంచి నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్‌కు చేరతాయి. అక్కడ నుంచి ఇంటర్నేషనల్ గేట్ వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్ రిసీవ్ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్‌లు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకోవడానికి అక్కడి కాల్ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే సూత్రధారులంతూ విదేశాల్లోనే ఉంటారు. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్ రూటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్ విదేశాలకు వెళ్ళాలంటే (ఔట్ గోయింగ్) కచ్చితంగా అది సర్వీస్ ప్రొవైడర్ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్ పైనా ఏజెన్సీల నిఘా ఉంటుంది. అనునుమానాస్పద దేశాలు, వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే వాటిని ట్యాప్ కూడా చేస్తారు. ఇందుకు ఉపకరించే సాధనాలు దేశలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్‌వే ఐఎల్‌డీ ఆపరేటర్లకు ఉంటుంది. వారికి చిక్కకుండా హైటెక్ పద్దతిలో ఇంటర్నేషనల్ కాల్స్‌ని వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పద్దతిలో లోకల్ కాల్స్‌గా మారుస్తుంటారు. రూటింగ్ జరిగేది ఇలా... విదేశీ ఆపరేటర్లు ఇక్కడి ఏజెన్సీలకు డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించే విధంగా ఓ విధానాన్ని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంత మందికి ఇంటర్నెట్ ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తారు. అలా ఏర్పాటయిన తరవాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్‌వే ఆఫ్ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మారిపోతుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారిని ఎరవేసి ఏర్పాటు చేయించిన అత్యాధునిక పరికరాలకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే గేట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్‌గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలకు చేరుతుంది. స్థానికంగా (లోకల్) బోగస్ వివరాలతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులను సేకరించి ఈ సీడీఎమ్ఏ ఎఫ్‌డబ్ల్యూటీలను తయారు చేస్తారు. గేట్‌వే నుంచి వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్‌గా మారిపోయి ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డునకు చెందిన నెంబరు (లోకల్) నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వారికి కనిపిస్తుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి సైతం కాల్‌ఛార్జ్ తగ్గుతుంది. దేశంలోని అనేక ఆపరేటర్లను రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటున్నాయి. ఈ కారణంగానే ప్రాధాన్యం... ఆదివారం సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన ముఠాకు సంబంధించిన సమాచారం వారికి నిఘా వర్గాల నుంచి అందింది. పాక్ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంటాయి. దీనికోసం వారు ‘హనీ ట్రాప్’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటారు.అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపి స్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్ చేయడానికి కాల్ రూటింగ్ విధానాన్నే వినియోగిస్తారు. -
వోడాఫోన్ దివాలీ ఆఫర్
ముంబై: ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఈ దీపావళినుంచి నేషనల్ రోమింగ్ చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. తమ యూజర్లకు దేశవ్యాప్తంగా ఉచిత ఇన్కమింగ్ కాల్స్ అందించే ప్లాన్ ను ప్రకటించింది. రిలయన్స్ జియో ఎంట్రీ వార్‌లో భాగంగా వోడాఫోన్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ దీపావళినుంచి వోడాఫోన్ వినియోగదారులు, దేశంలో ఎక్కడైనా రోమింగ్ చింతలేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని వోడాఫోన్ కమర్షియల్ డైరెక్టర్ సందీప్ కటారియా తెలిపారు. నేషనల్ అవుట్ గోయింగ్ చార్జీలు హోం చార్జీలతో సమానం ఉన్నప్పటికీ ఇన్ కమింగ్ చార్జీల భయం వినియోగదారులను పీడిస్తున్నట్టు తమ కన్జ్యూమర్ రీసెర్చ్ లో తేలిందన్నారు. అందుకే తమ యూజర్ల సౌలభ్యంకోసం ఈ నిరణయం తీసుకున్నామన్నారు. రెండు కోట్ల మందికి పైగా ఉన్న తమ వినియోగ దారులకు దీని వల్ల లబ్ది చేకూరనుందని కటారియా పేర్కొన్నారు.