Department of Telecommunications
-
మొబైల్ నెంబర్ కొత్త సిరీస్.. 160తో మొదలు - ఎందుకో తెలుసా?
ప్రజలు చట్టబద్ధమైన కాల్‌లను సులభంగా గుర్తించడానికి, టెలిమార్కెటర్ల నుంచి వచ్చే అనుచిత వాయిస్ కాల్‌లను అరికట్టడానికి టెలికాం మంత్రిత్వ శాఖ 160xxxxxxx అనే కొత్త నెంబరింగ్ సిరీస్ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ప్రమోషనల్, సర్వీస్, ఇతర లావాదేవీల కోసం కేంద్రం టెలిమార్కెటర్లకు 140xxxxxx సిరీస్ కేటాయించింది. ఇది ఇకపై 160 నెంబర్ సిరీస్‌కు మారుతుంది. అంటే కస్టమర్ రిసీవ్ చేసుకునే టెలిమార్కెటర్ల కాల్ నెంబర్ 160 నెంబర్‌తో మొదలవుతుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) 140 సిరీస్‌ను కాల్ల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న కారణంగా చాలామంది వాటికి రెస్పాండ్ అవ్వరు. కాబట్టి కొన్ని సార్లు ముఖ్యమైన సర్వీస్/లావాదేవీ కాల్లు మిస్ అవుతుంటారు. కాబట్టి ఇకపై అలంటి పొరపాట్లు జరగకుండా డాట్ ఈ 160 నెంబర్ సిరీస్ ప్రవేశపెట్టింది.140 నెంబర్ సిరీస్ ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. వీటన్నింటిని అరికట్టడానికి కేంద్ర కొత్త సిరీస్ నెంబర్ తీసుకువచ్చింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ ఎంటిటీల సర్వీస్/లావాదేవీ వాయిస్ కాల్ల కోసం ఉపయోగించనున్నారు. కాబట్టి ఈ నెంబర్ సర్వీస్/లావాదేవీ కాల్లకు.. ఇతర రకాల కాల్లకు మధ్య స్పష్టమైన భేదం చూపడాన్ని సులభతరం చేస్తుంది.ఆర్బీఐ, సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఎ, ఐఆర్డీఏ వంటి ఫైనాన్షియల్ ఎంటిటీల నుంచి వచ్చే సర్వీస్/లావాదేవీ కాల్లు 1601 నుంచి ప్రారంభమవుతాయి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 160 సిరీస్ నంబర్‌ను కేటాయించే ముందే తప్పకుండా ఖచ్చితమైన ద్రువీకరణను నిర్దారించుకోవాలని డాట్ పేర్కొంది. ఈ నెంబర్ సిరీస్ కేవలం సర్వీస్ / లావాదేవీలకు మాత్రమే ఉపయోగించబడుతుంది. -
ఎస్ఎమ్ఎస్ స్కామర్లపై డాట్ కొరడా.. బ్లాక్‌లిస్ట్‌లో 8 సంస్థలు
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు చేసేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT), కేంద్ర హోమ్ శాఖ సహకారంతో సైబర్ నేరాలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మోసపూరిత కమ్యూనికేషన్లను పంపినందుకు ఎనిమిది ఎస్ఎమ్ఎస్ హెడర్లను బ్లాక్‌లిస్ట్ చేసినట్లు తెలిపింది.గత మూడు నెలల్లో ఈ ఎనిమిది హెడర్ల నుంచి 10,000 కంటే ఎక్కువ మోసపూరిత సందేశాలు వెళ్లాయి. అదే సమయంలో ఈ సందేశాలను పంపించడానికి ఉపయోగించిన 73 ఎస్ఎంఎస్ హెడ్డర్స్, 1522 కంటెంట్ టెంప్లేట్లను డాట్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. కాబట్టి ఈ హెడ్డర్స్ ఇకపై ఎలాంటి మెసేజ్‌లను పంపించలేవు.మోసపూర్తి ఎస్ఎమ్ఎస్ల నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర హోమ్ శాఖ 'సంచార్ సాతీ' కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరైనా మోసపూరిత సందేశాలను అందుకున్నప్పుడు.. లేదా ఇబ్బంది పడుతున్నప్పుడు వారు సంచార సాథీ పోర్టల్‌లోని చక్షు ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా స్పామ్ మీద కంప్లైంట్ చేయడానికి 1909కి కాల్ చేయవచ్చు.. లేదా DND (డు నాట్ డిస్ట్రబ్) అనే సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. -
Ministry of Telecom: తప్పుడు సిమ్‌లు 21 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ) అనుమానం వ్యక్తంచేసింది. రీ–వెరిఫికేషన్ చేసి బోగస్ సిమ్‌లుగా తేలిన వాటిని వెంటనే రద్దుచేయాలని భారతీ ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ టెలికం సంస్థలకు డీఓటీ హెచ్చరికలు జారీచేసింది. సంచార్ సాతీ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డీవోటీకి చెందిన ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఏఐ, డీఐయూ) విశ్లేíÙంచింది. దీంతో దేశవ్యాప్తంగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు యాక్టివేట్ అయి ఉన్నట్లు డీఓటీ విశ్లేషణలో తేలింది. మనుగడలో లేని, తప్పుడు, ఫోర్జరీ, నకిలీ ధృవీకరణ పత్రాలతో ఈ సిమ్‌కార్డులను సంపాదించి యాక్టివేట్ చేసి ఉంటారని ఏఐ, డీఐయూ విశ్లేషణలో వెల్లడైంది. దేశంలో తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ తీసుకున్న వారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు ఈ విశ్లేషణలో వెల్లడైంది. 21 లక్షల సిమ్ కార్డుల్లో కొన్ని అనుమానాస్పద ఫోన్ నంబర్ల జాబితాను విడుదల ఆయా టెలికం కంపెనీలకు డీఓటీ పంపించింది. వాటి ధృవీకరణ పత్రాలను సరిచూసి రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీవెరిఫికేషన్లో ఆ సిమ్‌లు తప్పుడు పత్రాల ద్వారా తీసుకున్నట్లు గుర్తిస్తే ఆ నంబర్లను తక్షణం రద్దు చేయాలని సూచించింది. ఇప్పటి వరకు 1.8 లక్షల మొబైల్ హ్యాండ్సెట్లను పనిచేయకుండా చేశామని డీఓటీ అధికారులు చెప్పారు. అనుమానాస్పద నంబర్లపై దర్యాప్తును సరీ్వసు ప్రొవైడర్లు వేగవంతం చేయాలని డీవోటీ తుది గడువు విధించింది. సైబర్ నేరాలకు దుర్వినియోగం! తప్పుడు పత్రాలతో పొందిన సిమ్‌లను ఆయా వ్యక్తులు సైబర్ నేరాలకు వాడుతున్నట్లు డీఓటీ అనుమానం వ్యక్తంచేసింది. ఒక ప్రాంతంలో తీసుకున్న బోగస్ సిమ్‌ను సుదూర ప్రాంతాల్లో వాడున్నట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో సేకరించిన సిమ్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొట్టే ప్రమాదముంది. సిమ్‌లను సైబర్ నేరాలకు వాడుతున్నట్లు తేలితే వాటిని రద్దు చేయడంతో పాటు ఫోన్‌నూ పనికిరాకుండా చేస్తామని హెచ్చరించింది. -
ఎట్టి పరిస్థితుల్లో *401# నెంబర్‌కు కాల్ చేయొద్దు - ఎందుకంటే?
టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401# డయల్ చేయమని కోరితే అలంటి వాటికి స్పందించవద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) వెల్లడించింది. ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పొందుతున్న మరో ఎత్తుగడ ఇదని డాట్ తెలిపింది. సమస్యల పరిష్కారం పేరుతో.. సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలియజేస్తూ.. సంస్థ ఎప్పుడూ ఫోన్ చేసి అలంటి వాటిని ఎంటర్ చేయమని చెప్పదని స్పష్టం చేసింది. *401# కాల్ చేస్తే ఏమవుతుంది! నిజానికి *401# నెంబర్ ఎంటర్ చేయగానే మీకు రావాల్సిన కాల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు వెళ్ళిపోతాయని, కాల్ ఫార్వార్డ్‌కు మీరు పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుందని డాట్ పేర్కొంది. మీ కాల్స్ మోసగాళ్ళు రిసీవ్ చేసుకుంటే.. అవతలి మీ స్నేహితులను లేదా బంధువులను మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెంబరుకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయవద్దని డాట్ హెచ్చరించింది. ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ సంచలన నిర్ణయం - అది లేకుంటే ఫాస్ట్‌ట్యాగ్ డీయాక్టివేట్ ఒకవేళా మీ మొబైల్ ఫోనులో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయి ఉంటే.. వెంటనే సెట్టింగులోకి వెళ్లి డీయాక్టివేట్ చేసుకోండి. లేకుంటే సైబర్ నేరగాళ్లు సులభంగా మీ కాల్స్ రిసీవ్ చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. -
డేంజర్ యాప్స్‌పై డాట్ పంజా.. డిలీట్ చేసిన గూగుల్, యాపిల్
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోవడంతో.. 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఈసిమ్ యాప్‌లను గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్‌లో (Airalo), హోలాఫ్లై (Holafly), eSIM వంటి యాప్‌లను తొలగించాయి. భారతదేశంలో ఈసిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని, అప్పుడు మాత్రం అధీకృత డీలర్లు విక్రయించుకోవచ్చని, విక్రయించే ముందు తప్పకుండా పాస్‌పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్‌ను కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించింది. విక్రేత కూడా గ్లోబల్ సిమ్ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈసిమ్ విషయాన్ని పక్కన పెడితే.. సింగపూర్‌కు చెందిన ఎయిర్‌లో, స్పెయిన్‌కు చెందిన హోలాఫ్లై రెండు యాప్‌లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: లాంచ్‌కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు, దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం ఈసిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈసిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి DoT ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు, కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు మోసగాళ్లు ఫోన్ చేసి మీ సిమ్ కార్డు సర్వీస్ నిలివేస్తున్నట్లు, ఆలా జరగకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చేయాలని చెబుతున్నారు. ఇలాంటి మోసాలపైన 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DOT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వినియోగదారులకు ఫోన్ చేసి మరి కొన్ని గంటల్లో సిమ్ డీయాక్టివేట్ అవుతుందని, సర్వీస్ నిలిపివేయనున్నట్లు భయపెడుతూ.. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని వివరాలు కావాలని అడుగుతారు. ఇది నిజమే అని నమ్మి వివరాలు వెల్లడిస్తే మోసాలు జరుగుతాయని DOT వెల్లడిస్తూ.. ఎవరూ ఇలాంటి వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఇలాంటి కాల్స్ తరచూ వస్తే, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కి ఫిర్యాదు చేయవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ పేర్కొంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ అరికట్టడానికి కొన్ని సంస్థలతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
మీరు ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పోయిందా? ఇలా కనిపెట్టేయొచ్చు!
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పోతే. ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా అందులో ఉండే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు వేరే వాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. అందుకే ఫోన్ పోయిందని తెగ హైరానా పడిపోతుంటాం. గతంలో ఫోన్ పోయిందంటే.. కొత్త ఫోన్ కొనుక్కోవడం తప్పా..పోయిన ఫోన్‌ను తిరిగి దక్కించుకునే అవకాశం ఉండేది కాదు. ఇదిగో ఈ తరహా సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర టెలికాం విభాగం (dot), సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (ceir) పేరుతో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల సాయంతో పొగొట్టుకున్న ఫోన్‌ను వెతికి పట్టుకోవచ్చు. తొలిసారిగా 2019 సెప్టెంబర్ నెలలో కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. ముందుగా కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా - నగర్ హవేలీ,గోవా, మహరాష్ట్రలో,అదే ఏడాది డిసెంబర్ నెలలో ఢిల్లీలో లాంచ్ చేసింది. చదవండి👉 ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్! ఐఎంఈఐ నెంబర్ ఉందా? కేంద్రం నిర్వహణలో సీఈఐఆర్ వెబ్ సైట్, యాప్స్ పనిచేస్తాయి. వీటిద్వారా కాణీ ఖర్చు లేకుండా ఐఎంఈఐ నెంబర్ సాయంతో మీ ఫోన్‌ను దక్కించుకోవచ్చు. *#06# డయల్ చేస్తే ఐఎంఈఐ నెంబర్‌ను పొందవచ్చు. పొగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి ఎలా పొందాలి? ►సీఈఐఆర్ డేటా బేస్‌లో అన్నీ సంస్థల మొబైల్ ఆపరేటర్లు ఐఎంఈఐ డేటా ఉంటుంది. ఇందుకోసం కేంద్రం మొబైల్ బ్రాండ్స్, నెట్ వర్క్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తుంది. ►సీఈఐఆర్ IMEI నంబర్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేస్తుంది. బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. సిమ్ కార్డ్ మార్చినా ఆ ఫోన్ పనిచేయదు. ►ఒక వేళ ఫోన్‌ను పొగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఫోన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకోవాలి. ►తర్వాత సీఈఐఆర్ పోర్టల్ ఓపెన్ చేస్తే అందులో బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అదే ఆప్షన్లో డివైజ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మీ ఫోన్‌కు సంబంధించిన మొత్తం వివరాలతో పాటు మీరు మీ ఫోన్‌ను చివరి సారిగా పోగొట్టుకున్న సమయం వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం ఎఫ్ఐఆర్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ►యూజర్ సమర్పించిన వివరాల ఆధారంగా పోగొట్టుకున్న మొబైల్‌ను సీఈఐఆర్ బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేసిన ఫోన్లో సిమ్ మార్చి వేరే సిమ్ వేసినా, వినియోగించినా ఐఎంఈఐ సాయంతో ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టేస్తుంది. ►ఫోన్ దొరికిన వెంటనే ఆ ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసేందుకు సీఈఐఆర్ పోర్టల్‌లో అన్ బ్లాక్ ఫౌండ్ మొబైల్‌పై క్లిక్ చేసి రిక్వెస్ట్ ఐడీ, ఫోన్ నంబర్ వివరాలు సమర్పిస్తే ఫోన్‌ను వాడుకోవచ్చు. చదవండి👉 టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే! -
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల అమ్మకానికి ముందే ఐఎంఈఐ నంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ ఆదేశాలు వెలువరించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. దేశీయంగా తయారైన లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్‌కూ ఈ నిబంధన వర్తిస్తుంది. అమ్మకానికి ముందే టెలికం శాఖకు చెందిన ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ పోర్టల్ నుంచి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ధ్రువీకరణ పొందాల్సిందే. ప్రతి మొబైల్‌కూ 15 అంకెల ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది. మొబైల్ పరికరాల గుర్తింపు సంఖ్యను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం నెట్‌వర్క్‌లో ఒకే ఐఎంఈఐతో నకిలీ పరికరాలు ఉండటం వల్ల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సాధ్యం కావడం లేదు. కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి హ్యాండ్సెట్ల విస్తరణను అరికట్టడానికి నకిలీ పరికరాల నియంత్రణకై ఇండియన్ కౌంటర్‌ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ వ్యవస్థను జోడించింది. దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్‌ను నిరోధించే సౌకర్యం మాత్రమే ప్రస్తుతం పోర్టల్‌లో అందుబాటులో ఉంది. చదవండి: బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు! -
5జీ వేలంపై టెల్కోల్లో ఆసక్తి
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు ఉపయోగపడే 5జీ స్పెక్ట్రంపై టెలికం సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయని, వేలంలో ఉత్సాహంగా పాల్గొంటాయని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. 5జీ సర్వీసులతో దేశం ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. స్పెక్ట్రం బేస్ ధరను గణనీయంగా తగ్గించడంతో పాటు, యూసేజీ చార్జీలనూ ఎత్తివేయడంతో టెల్కోలపై ఆర్థిక భారం చాలా మటుకు తగ్గిపోతుందని మంత్రి చెప్పారు. ఇక టెక్ కంపెనీలు సొంతంగా క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం కేటాయించే విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెలికం శాఖ జూలై 26న స్పెక్ట్రం వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనుంది. దీనికి సంబంధించి జూన్ 20న ప్రీ–బిడ్ కాన్ఫరెన్స్‌ను టెలికం శాఖ నిర్వహించనుంది. -
కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..
టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉండేది. ఒకవేళ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది(గతంలో ఎన్నడూ జరగలేదు!). అయితే ఈసారి రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు సవరణ చేయడం విశేషం. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్‌లు కలిగిన ఇతరులు.. కమర్షియల్‌తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్లను భద్రపర్చాలని స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్‌ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్‌ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపర్చాల్సిందే!. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్.. మీరూ కుబేరులు అయిపోవచ్చు! -
భారత్‌లో ఎలన్ మస్క్‌కి ఎదురు దెబ్బ
TRAI Barred Elon Musk's Starlink Broadband Pre Orders in India: అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కి భారీ షాకిచ్చింది భారత ప్రభుత్వం. మానసపుత్రిక స్పేఎస్‌ఎక్స్ అందించే బ్రాడ్‌బాండ్ సర్వీస్‌కు భారత్ నుంచి ముందస్తు ఆర్డర్స్ తీసుకోకుండా నిషేధించింది. అంతేకాదు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్కు ఎవరూ ప్రీ ఆర్డర్లతో సబ్ స్క్రయిబ్ కావొద్దంటూ భారతీయులకు సూచించింది కేంద్ర సమాచార శాఖ. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలతో ఆకట్టుకోవాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలకు విఘాతం కలుగుతోంది. తాజాగా లైసెన్స్ లేకుండా స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రీ ఆర్డర్స్ తీసుకోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో ఇంకా లైసెన్స్ లభించలేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ 99 డాలర్ల(రూ.7,400)తో బేటా వెర్షన్ సేవలను అందించనున్నట్లు, ఆర్డర్లకు దరఖాస్తు పెట్టుకోవాలంటూ భారతీయులను కోరింది. ఈ నేపథ్యంలో ఐదు వేల ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు స్టార్‌లింక్ భారత్ హెడ్ సంజయ్ భార్గవ ఈమధ్యే వెల్లడించారు కూడా. ఈ క్రమంలోనే టెలికమ్యూనికేషన్స్ విభాగం(Department of Telecommunications (DoT).. స్టార్ లింక్ సేవలపై అభ్యంతరాలు లేవనెత్తింది. అంతేకాదు ఇక్కడి రెగ్యులేటర్ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా పని చేయాల్సిందేనని, డాట్ అనుమతులు తప్పనిసరని, లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పేస్ఎక్స్కు సూచించింది. అంతేకాదు స్టార్‌లింక్‌ను ఎవరూ బుక్ చేసుకోవద్దంటూ జనాలకు సూచించింది. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు సంజయ్ భార్గవ నిరాకరించారు. ఇదిలా ఉంటే స్టార్‌లింక్ వెబ్సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంది స్టార్‌లింక్. ఇక భారత్‌లో స్టార్‌లింక్‌కు మొదటి నుంచే ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ బిడ్‌ను తిరస్కరించాలని కోరుతూ బ్రాడ్‌బాండ్ అసోసియేషన్‌లోని వన్‌వెబ్(ఇది కూడా స్పేస్ ఆధారిత సేవలు అందించేదే!), అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ తదితర కంపెనీలు ట్రాయ్, ఇస్రోలకు లేఖలు రాశాయి కూడా. చదవండి: 'జియో' కంటే తక్కువ ధరకే Starlink శాటిలైట్ ఇంటర్నెట్..! -
టెల్కోలకు బ్యాంక్ గ్యారంటీ నిబంధన ఎత్తివేత
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ప్రకటించిన సంస్కరణలను కేంద్రం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తులో నిర్వహించబోయే స్పెక్ట్రం వేలం నిబంధనలను సడలిస్తూ టెలికం విభాగం (డాట్) సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం స్పెక్ట్రం వార్షిక చెల్లింపుల పూచీకత్తుకు సంబంధించి టెల్కోలు ఒక ఏడాది వాయిదా మొత్తానికి సరిపడేంత .. ఫైనాన్షియల్ బ్యాంక్ గ్యారంటీ (ఎఫ్‌బీజీ) ఇవ్వాలన్న నిబంధనను తొలగించింది. అలాగే సర్వీసుల విస్తరణ విషయంలో పనితీరు బ్యాంక్ గ్యారంటీ (పీబీజీ) సమర్పించాలన్న షరతును కూడా ఎత్తివేసింది. వేలంలో పాల్గొనే సంస్థలకు తగినంత ఆర్థిక స్థోమత ఉండేలా అర్హతా ప్రమాణాలను కూడా తగు రీతిలో సవరించనున్నట్లు టెలికం శాఖ పేర్కొంది. భవిష్యత్తులో స్పెక్ట్రంను 30 ఏళ్ల వ్యవధికి కేటాయించనున్నట్లు వివరించింది. గత విడతల్లో విక్రయించిన స్పెక్ట్రం కాలపరిమితిలో (20 ఏళ్లు) ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. 30 ఏళ్ల కాలపరిమితితో స్పెక్ట్రంను కేటాయించే విషయంలో ఆపరేటర్లు ముందుగా జరపాల్సిన చెల్లింపులు, ఇందుకోసం ఇవ్వతగిన మారటోరియం వ్యవధి, వాయిదాలు మొదలైన అంశాలపై తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ను కోరినట్లు డాట్ పేర్కొంది. మరోవైపు, టెల్కోలు కనీసం 10 ఏళ్ల వ్యవధి తర్వాత తమ స్పెక్ట్రంను వాపసు చేయవచ్చని డాట్ తెలిపింది. అయితే, దీని గురించి ఏడాది ముందే తెలియజేయాల్సి ఉంటుందని, సరెండర్ ఫీజు వర్తిస్తుందని పేర్కొంది. సంస్కరణలతో టెల్కోలపై తగ్గనున్న భారం: సీవోఏఐ డీజీ కొచర్ టెలికం రంగంలో కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలను స్వాగతిస్తున్నట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే స్పెక్ట్రం వేలానికి సంబంధించి ఎఫ్‌బీజీ, పీబీజీ నిబంధనలను తొలగించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో ఆపరేటర్లపై ఆర్థిక భారం తగ్గగలదని కొచర్ పేర్కొన్నారు. టెలికం రంగంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడానికి ఇవి తోడ్పడగలవని ఆయన వివరించారు. -
అదే స్పీడు అదే జోరు, 5జీ ట్రయల్స్‌లో ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ నిర్వహిస్తున్న 5జీ పరీక్షల్లో ఇంటర్నెట్ వేగం 1,000 ఎంబీపీఎస్ పైగా నమోదైంది. ముంబైలోని ఫీనిక్స్ మాల్లో జరుగుతున్న లైవ్ ట్రయల్స్‌లో నోకియా తయారీ గేర్స్‌ను వాడుతున్నారు. టెలికం శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా 3500 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎయిర్టెల్ 5జీ పరీక్షలు జరుపుతోంది. కోల్‌కతాలోనూ ట్రయ ల్స్ నిర్వహించనున్నట్టు నోకియా ప్రతినిధి వెల్లడించారు. 1800 మెగాహెట్జ్ బ్యాండ్ లో లైవ్ నెట్‌వర్క్‌లో దేశంలో తొలిసారిగా ఎయిర్టెల్ ఈ ఏడాది ప్రారంభంలో 5జీ పరీక్షలను హైదరాబాద్‌లో విజయవంతంగా జరిపింది. చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ? Exclusive: #Airtel’s #5G trial network goes live in Mumbai’s Phoenix Mall, Lower Parel. 1Gbps speeds. Nokia is the equipment provider for this trial. pic.twitter.com/4vO3RWUbXh — Danish (@DanishKh4n) July 12, 2021 -
మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా?
మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో మీకు తెలుసా?. ఇలా మనకు తెలియకుండానే కొందరి పేరు మీద సైబర్ నెరగాళ్లు సిమ్ లు తీసుకుంటు న్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సిమ్ ద్వారా అనైతిక, అసాంఘిక కార్యక్రమాలకు ఈ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లు చాలా కేసులలో బయటపడింది. ఇలా మీకు తెలియకుండా ఇతరులు సిమ్ తీసుకోవడంతో మీరు మీకు సంబంధం లేని కేసులలో చిక్కుకునే ప్రమాదం చాలా ఎక్కువ. ఇలా మన పేరు మీద లేదా మన వివరాలతో ఎవరైనా మొబైల్ నెంబర్ తీసుకుంటే వాటిని బ్లాక్ చేసే సదుపాయం ఇప్పడు మీకు కల్పిస్తున్నారు. దీని కోసం మీరు విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించిన వెబ్సైట్(https://tafcop.dgtelecom.gov.in)ను సందర్శించాలి. వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి రిపోర్ట్ చేస్తే టెలికం శాఖ తగు చర్యలు తీసుకుంటుంది. ఒకరి పేరు మీద అత్యధికంగా 9 నంబర్లు మాత్రమే ఉండేందుకు వీలుంది అని విజయవాడ టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాబర్ట్ రవి పేర్కొన్నారు. కొందరి పేర్ల మీద అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని. అందుకే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంభించామన్నారు. దీనివల్ల అనధికారికంగా వినియోగిస్తున్న నంబర్లకు చెక్ పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల టెలికం సర్కిళ్లలో ఈ సదుపాయాన్ని ప్రారంభించామని. త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి వస్తుందన్నారు. ఎవరికైనా అనుమానం వెంటనే ఇలా చెక్ చేసుకోవాలని తెలిపారు. చదవండి: సింగిల్ చార్జ్ తో 100 కి.మీ ప్రయాణించే సైకిల్ -
మార్చి నుంచి స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు ఎదురుచూస్తున్న స్పెక్ట్రం వేలం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్చి 1 నుంచి ఆరో విడత వేలం నిర్వహించనున్నట్లు టెలికం శాఖ ఒక నోటీసులో పేర్కొంది. జనవరి 12న ప్రీ–బిడ్డింగ్ సమావేశం నిర్వహించనుండగా, నోటీసులోని అంశాలపై సందేహాలు నివృత్తి చేసుకునేందుకు జనవరి 28 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపింది. వేలంలో పాల్గొనేందుకు ఫిబ్రవరి 5లోగా టెలికం ఆపరేటర్లు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24న బిడ్డర్ల తుది జాబితా ప్రకటిస్తారు. రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే 2,251.25 మెగాహెట్జ్ పరిమాణం స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేయనుంది. 700 మెగాహెట్జ్, 800, 900, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు వీటిలో ఉంటాయి. నాలుగేళ్ల విరామం తర్వాత.. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత స్పెక్ట్రం వేలాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బేస్ ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రెండేళ్ల క్రితమే సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర క్యాబినెట్ గతేడాది డిసెంబర్ 17న ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం నిర్వహించబోయే వేలంలో 5జీ సేవల కోసం ఉపయోగించే 3,300–3,600 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌ను చేర్చలేదు. దేశవ్యాప్తంగా ప్రీమియం 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం బిడ్డర్లు కనీసం రూ. 32,905 కోట్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్పెక్ట్రం వేలానికి ఒక మోస్తరుగానే స్పందన ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.30,000–రూ.60,000 కోట్ల శ్రేణిలో బిడ్లు రావొచ్చని పేర్కొన్నాయి. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రూ.30,000 కోట్లకు మాత్రమే బిడ్లు పరిమితం కావొచ్చనేది జేఎం ఫైనాన్షియల్స్ అంచనా. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రకారం.. రూ. 55,000–రూ. 60,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చు. నిబంధనలిలా.. మొత్తం 22 టెలికం సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ బ్యాండ్, 800, 2,300 మెగాహెట్జ్ బ్యాండ్‌ను వేలం వేయనున్నారు. మిగతా ఫ్రీక్వెన్సీల్లో స్పెక్ట్రంను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయనున్నారు. ముందస్తుగా పూర్తి చెల్లింపులు జరిపేందుకు సిద్ధపడే బిడ్డర్లు .. ఫలితాలు వెల్లడైన 10 రోజుల్లోగా కట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ విడతలవారీగా చెల్లించే విధానాన్ని ఎంచుకుంటే బ్యాండ్ ఫ్రీక్వెన్సీని బట్టి బిడ్డింగ్ మొత్తంలో నిర్దేశిత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 1800, 2,100, 2,300, 2,500 మెగాహెట్జ్ బ్యాండ్లకు సంబంధించి 50 శాతం కట్టాలి. 700, 800, 900 మెగాహెట్జ్ బ్యాండ్ల కోసం 25 శాతం చెల్లించాలి. టెలికం శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసిన పది రోజుల్లోగా చెల్లింపులు జరపాలి. బిడ్డింగ్ మొత్తంతో పాటు సవరించిన స్థూల ఆదాయంపై (వైర్‌లైన్ సేవలు మినహా) మూడు శాతాన్ని స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద కట్టాల్సి ఉంటుంది. కొన్ని సర్కిళ్లలో వొడాఫోన్ దూరం.. తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. కొన్ని సర్కిళ్లలో వేలం ప్రక్రియలో పాల్గొనపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్పెక్ట్రం వినియోగ హక్కులను పునరుద్ధరించుకోవడంపై టెలికం కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌కు సంబంధించి 900 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 12.4 మెగాహెట్జ్ పరిమాణం, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 47 మెగాహెట్జ్ పరిమాణం, ప్రస్తుతం 800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రిలయన్స్ జియో ఉపయోగించుకుంటున్న 44 మెగాహెట్జ్ స్పెక్ట్రం రెన్యువల్‌కు రానున్నాయి. వొడాఫోన్ ఐడియా 900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రంను పునరుద్ధరించుకోవాల్సి ఉంది. ఈ రెన్యువల్స్ కోసం భారతీ ఎయిర్టెల్ సుమారు రూ. 15,000 కోట్లు, రిలయన్స్ జియో రూ. 11,500 కోట్లు వెచ్చించాల్సి రావొచ్చని క్రెడిట్ సూసీ అంచనా వేస్తోంది. -
ప్రముఖ సైట్‌పై ప్రభుత్వ నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫైల్ షేరింగ్ సైట్ ‘వీ ట్రాన్స్ఫర్.కామ్’పై టెలికమ్యూనికేషన్స్ శాఖ(డాట్) నిషేధం విధించింది. జాతి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొద్దిరోజుల క్రితం సైట్‌లోని ఓ మూడు యూఆర్ఎల్స్ను నిషేధించాలంటూ డాట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు నోటీసులు జారీచేసింది. అనంతరం మూడవ నోటీసులో సైట్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు ఈ సైట్‌ను అందుబాటులో లేకుండా చేశాయి. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ సైట్‌ను నిషేధించిందో తెలియరాలేదు. ( సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్..) కాగా, వీ ట్రాన్స్ఫర్ సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల యూజర్లు ఉన్నారు. లాక్డౌన్ సమయంలో ఈ సైటు భారత్‌లో విపరీతమైన ప్రాచూర్యాన్ని పొందింది. దీని ద్వారా దాదాపు 2జీబీ సైజు గల ఫైళ్లను ‘వీ ట్రాన్స్ఫర్’లో ఎటువంటి అకౌంట్లు అవసరం లేకుండా ఎదుటి వ్యక్తి ఈ మెయిల్‌కు పంపించవచ్చు. ఉచితంగా ఫైళ్లను పంపించుకునే అవకాశం ఉండటంతో నెటిజన్లు దీనిపై ఎక్కువగా మొగ్గుచూపారు. ( పబ్జి ప్రియులకు శుభవార్త ) -
రూ 10,000 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్..
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మందలింపు, ప్రభుత్వ డెడ్లైన్ల నేపథ్యంలో మొబైల్ దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రభుత్వానికి బకాయిపడిన రూ 10,000 కోట్లను టెలికాం శాఖకు చెల్లించినట్టు వెల్లడించింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తిచేస్తామని కంపెనీ వెల్లడించింది. భారతి ఎయిర్టెల్, భారతి హెక్సాకామ్, టెలినార్‌ల తరపున మొత్తం రూ 10,000 కోట్లు చెల్లించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తాము స్వయం మదింపు కసరత్తు చేపట్టామని, అది ముగిసిన మీదట సుప్రీంకోర్టులో తదుపరి విచారణ గడువులోగా మిగిలిన బకాయిల చెల్లింపును చేపడతామని స్పష్టం చేసింది. పాత బకాయిలను తక్షణమే చెల్లించాలని టెలికాం శాఖ భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా టెలికాం కంపెనీలను కోరుతూ ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. టెలికాం శాఖ ఆదేశాలకు బదులిచ్చిన ఎయిర్టెల్ తాము ఫిబ్రవరి 20లోగా రూ 10,000 కోట్లు చెల్లిస్తామని, మార్చి 17లోగా మిగిలిన మొత్తం చెల్లిస్తామని పేర్కొంది. ఇక లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీలు సహా భారతి ఎయిర్టెల్ ప్రభుత్వానికి రూ 35,586 కోట్లు బకాయిపడింది. చదవండి : టెల్కోలపై సుప్రీం కన్నెర్ర! -
టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు టెలికం శాఖ (డాట్)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్ డెస్క్ ఆఫీసర్ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, డాట్ డెస్క్ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్ ఆఫీసర్ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏజీఆర్ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్ నోటీసులపై తగు కోర్టులను ఆశ్రయించాలంటూ గెయిల్ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 35,586 కోట్ల బకాయిల్లో సుమారు రూ.10,000 కోట్లు.. వారం రోజుల్లో డిపాజిట్ చేస్తామంటూ ఎయిర్టెల్ వెల్లడించింది. చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా.. దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్‌కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. ‘సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్ జనరల్‌కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది. సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్ ఆఫీసర్ తీరుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, ‘ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్‌ను డిస్మిస్ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. న్యాయవ్యవస్థ, దేశం ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది‘ అని మిశ్రా వ్యాఖ్యానించారు. మిగిలేవి రెండు సంస్థలే..: విశ్లేషకులు టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్ సంస్థ కామ్ ఫస్ట్ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోర్టు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు. అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయిల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా.. శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది. వివాదం ఏంటంటే... లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్లను జనవరి 16న కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్ డెస్క్ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. వొడా–ఐడియా షేరు భారీ పతనం సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.38%, ఎస్బీఐ 2.41%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.77%, యాక్సిస్ బ్యాంక్ 1.5% క్షీణించాయి. క్యూ3 ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ ఐడియా రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించడం తెలిసిందే. -
మూడు నెలల్లో బాకీలు కట్టేయాల్సిందే
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తదితర బాకీలన్నీ కట్టేయాలంటూ టెల్కోలకు టెలికం శాఖ(డాట్) ఆదేశాలు జారీ చేసింది. స్వయం మదింపు ప్రాతిపదికన బకాయిలను తీర్చవచ్చంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లైసెన్సు ఫీజు మొదలైన వాటికి ప్రాతిపదిక అయిన ఏజీఆర్‌ను (సవరించిన స్థూల ఆదాయం) లెక్కించే ఫార్ములా విషయంలో.. ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు అక్టోబర్ 24న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీని ప్రకారం 3 నెలల్లోగా వడ్డీ సహా బాకీలు చెల్లించాలంటూ టెల్కోలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. డాట్ అంతర్గతంగా వేసిన లెక్కల ప్రకారం టెల్కోల నుంచి రూ. 1.33 లక్షల కోట్ల దాకా వసూలు కావాల్సి ఉంది. ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 62,188 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 54,184 కోట్లు, బీఎస్ఎన్ఎల్.. ఎంటీఎన్ఎల్ రూ. 10,675 కోట్లు బాకీ పడ్డాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ.. ఈ బాకీల చెల్లింపులతో మరింత సంక్షోభంలోకి జారిపోతుందని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
టెల్కోలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. వివాదం ఇదీ.. కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 1.4 లక్షల కోట్లపైనే భారం జరిమానాలు, వడ్డీల్లాంటివన్నీ కలిపితే.. సవరించిన ఆదాయాల ప్రకారం టెలికం ఆపరేటర్లు కట్టాల్సిన బకాయిలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పైగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘టెల్కోలు కట్టాల్సిన బకాయిలను మళ్లీ లెక్కిస్తే సుమారు రూ. 1.34 లక్షల కోట్లకు చేరుతుంది. మరో త్రైమాసికం లెక్కలు కూడా జోడిస్తే.. ఇది ఇంకో 4–5 శాతం పెరగవచ్చు‘ అని పేర్కొన్నాయి. 10 రోజుల్లో అందరు ఆపరేటర్స్‌కి డిమాండ్ నోటీసులు పంపిస్తామని, అవి అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్త లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలన్నీ కలిపి భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్–ఐడియా రూ. 40,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అంచనా. జియో కేవలం రూ. 14 కోట్లు కట్టాల్సి రావచ్చు. వొడాఐడియా షేరు కుదేల్.. లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలతో గురువారం వొడాఫోన్ ఐడియా షేరు ఇంట్రాడేలో ఏకంగా 27 శాతం క్రాష్ అయ్యింది. బీఎస్ఈలో ఒక దశలో రూ. 4.10 (52 వారాల కనిష్ట స్థాయి)కి పడిపోయింది. చివరికి కొంత కోలుకుని 23 శాతం నష్టంతో రూ. 4.33 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,793 కోట్ల మేర హరించుకుపోయి.. రూ. 12,442 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, భారతి ఎయిర్టెల్ కూడా ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయినప్పటికీ.. తర్వాత కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్ అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. టెల్కోలపై తీర్పు పెనుభారం మోపుతుందని, కేంద్రం దీన్ని పునఃసమీక్షించాలని ఎయిర్టెల్ తెలిపింది. తీవ్రంగా నిరాశపర్చింది: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. -
పెట్టుబడులు, టెండర్లు ఆపేయండి
న్యూఢిల్లీ: ముందస్తు కొనుగోళ్ల ఆర్డర్లు, ఇప్పటికే ఖరారైన టెండర్లను తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా నిలిపివేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. దీంతో పెట్టుబడి వ్యయాలకు సంబంధించి కొత్త టెండర్లు ప్రకటించాలంటే ముందుగా ఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీసర్ అనుమతులు తీసుకోవాలంటూ అన్ని సర్కిల్స్ హెడ్స్‌కు బీఎస్ఎన్ఎల్ ఆర్థిక విభాగం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ తీవ్ర ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బీఎస్ఎన్ఎల్ తాత్కాలికంగా ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని, ఇప్పటికే పేరుకుపోయిన రుణభారాలను తీర్చే పరిస్థితుల్లో లేదని సర్కిల్ హెడ్స్‌కు పంపిన ఆర్డరులో కంపెనీ పేర్కొంది‘ అని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. పెట్టుబడి వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ డాట్ నుంచి ఆదేశాలు రావడంతో బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు ఆర్డరు జారీ చేసినట్లు వివరించాయి. ప్రైవేట్ టెలికం సంస్థలు ఓవైపున వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుండగా.. వాటితో పోటీపడేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇంకా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అనువుగా భారీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉన్నప్పటికీ అందుకు అవసరమైన పరికరాలు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల సమీకరణ కోసం రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను పంపినప్పటికీ కేంద్రం దానిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాల విస్తరణకు అడ్డంకులుగా మారాయి. 2014–15లో రూ. 672 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించిన బీఎస్ఎన్ఎల్ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,885 కోట్లు, 2016–17లో రూ. 1,684 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జించింది. రిలయన్స్ జియో రాకతో మిగతా టెల్కోల తరహాలోనే బీఎస్ ఎన్‌ఎల్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత భీకరమైన పోటీ నెలకొందంటూ కంపెనీ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఎస్కే గుప్తా గత నెలలో చీఫ్ జనరల్ మేనేజర్స్‌కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న అత్యంత చౌకైన టారిఫ్‌ల కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని అందులో ఆయన పేర్కొన్నారు. -
వంద రోజుల్లో 5జీ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ : కొత్త టెలికాం శాఖ మంత్రిగా సోమవారం బాధ్యతలను స్వీకరించి రవి శంకర్ ప్రసాద్ దూకుడు పెంచారు. మరో వంద రోజుల్లో 5 జీ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే హువావే 5 జీ ట్రయల్స్‌లో పాల్గొనే అంశాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని చెప్పారు. భారతదేశంలో 5 జి ట్రయల్స్ ప్రారంభించడానికి 100 రోజుల గడువుని నిర్ణయించారు . ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే 5 జీ ఆధారిత తదుపరి స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని చెప్పారు. ట్రయల్ మొదలైన తరువాత 5 జిలో పాల్గొనడం అనేది తప్పనిసరికాదు అని, భద్రతా సమస్యలతో సహా ఒక కంపెనీ పాల్గొంటుందా లేదా అనేది సంక్లిష్టమైందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాధాన్యత జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ కీలకంగా ఉంటుందన్నారు. ఎందుకంటే, ఈ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఉనికి సమంజసమని తాను భావిస్తున్నానన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఐటీ, న్యాయశాఖమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. -
మొబైల్ నెంబర్లు డిస్కనెక్షన్ : ప్రభుత్వం క్లారిటీ
న్యూఢిల్లీ : ఆధార్ డాక్యుమెంట్లతో జారీ అయిన 50 కోట్ల మొబైల్ నెంబర్లు డిస్కనెక్ట్ అవుతున్నట్టు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆధార్ డాక్యుమెంట్లతో జారీ చేసిన మొబైల్ ఫోన్ నెంబర్లను డిస్కనెక్షన్ చేయబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ రిపోర్టులు పూర్తిగా అవాస్తవమని, అవన్నీ ఊహాగానాలేనని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ), డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఆ రూమర్లను ప్రజలు నమ్మొద్దని ఇవి సూచించాయి. ఇదంతా ప్రజల్లో భయాందోళన సృష్టించడమేనని పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు ప్రకారం, పాత ఆధార్ ఈకేవైసీ బదులు తాజా కేవైసీతో మొబైల్ నెంబర్ పొందాలనుకుంటే, తొలుత వారి ఆధార్‌ను డీలింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అనంతరం అంతకముందు డాట్ సర్క్యూలర్ ప్రకారం తాజా ఓవీడీని సమర్పించి, మొబైల్ నెంబర్‌ను పొందాలి. కానీ ఎలాంటి పరిస్థితులో కస్టమర్ మొబైల్ నెంబర్‌ను మాత్రం డిస్కనెక్ట్ చేయబోమని తెలిపాయి. కొత్త సిమ్ కార్డులను మాత్రమే ఆధార్ ఈకేవైసీ అథెంటికేషన్ ప్రాసెస్‌తో పొందవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నాయి. పాత మొబైల్ ఫోన్ నెంబర్లను డియాక్టివ్ చేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ ప్రక్రియలో కొత్త సిమ్ కార్డులను పొందవచ్చు. -
నెంబర్ పోర్టబులిటీ ఇక కష్టమే..!
న్యూఢిల్లీ : నెట్వర్క్ నచ్చకపోతే.. ఇన్నిరోజులు మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా మొబైల్ నెంబర్ మార్చుకోకుండానే.. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారేవాళ్లం. కానీ ఇక నుంచి ఈ ప్రక్రియ కష్టతరం అయ్యే అవకాశాలున్నాయట. దేశంలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సేవలను అందిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎంఎన్‌పీ సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేయనున్నాయని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. పోర్టింగ్ ఛార్జీలను భారీ ఎత్తున్న తగ్గించడంతో, ఈ సర్వీసులను నిలిపివేయనున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీఓటీ)కి ఈ కంపెనీలు లేఖ రాసినట్టు రిపోర్టు పేర్కొంది. ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సర్వీసులను నిలిపివేస్తే... వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం ఇక అంత సులువు కాదు. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎంఎన్‌పీ ఫీజులను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ 19 రూపాయల నుంచి 4 రూపాయల వరకు అంటే 80 శాతం మేర తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్‌పీ సేవలు నిలిపివేస్తామని డీఓటీకి తాజాగా రాసిన లేఖలో ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయని రిపోర్టు వెల్లడించింది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా కేవలం ఒకే లైసెన్స్ సర్వీసు ఏరియాలో మాత్రమే కాక, ప్యాన్ ఇండియా నెట్‌వర్క్‌ను మార్చుకోవచ్చు. మరోవైపు ఈ సర్వీసులను కొనసాగించడానికి మరో కొత్త సర్వీసు కంపెనీలకు లైసెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయని టెలికాం వర్గాలంటున్నాయి. వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు, కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం ఎంఎన్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. జియో రాకతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడ్డాయి. దీంతో నెలవారీ ఎంఎన్‌పీ రిక్వెస్టుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఒక్క మార్చి నెలలో మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనలు 19.67 మిలియన్లకు పెరిగాయి. మరోవైపు తమ వినియోగదారులను కాపాడుకొనేందుకు దిగ్గజ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలు కూడా భారీగా తమ టారిఫ్‌లను తగ్గిస్తున్నాయి. -
‘ఆపద బటన్’కు ఓకే
న్యూఢిల్లీ: అత్యవసర సమయాల్లో మహిళలను ఆదుకునేందుకు ఫోన్లలో ‘ఆపద బటన్’ సౌకర్యాన్ని కల్పించేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు అంగీకరించాయి. ఎమర్జెన్సీ అలర్ట్‌లను పంపగలిగే సౌకర్యముండే ఫోన్లు వచ్చే ఏడాది మార్చికల్లా అందుబాటులోకి రానున్నాయి. బటన్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే టెలికమ్యూనికేషన్స్ శాఖ జారీచేయనుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం ప్రకటించారు. ఫోన్లలో కొత్త ఫీచర్ ద్వారా మహిళలకు అదనపు రక్షణ కల్పించగలమని ఆమె అన్నారు. ప్రస్తుతం ప్రజలు వినియోగిస్తున్న ఫోన్లలోనూ ఈ బటన్ ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాలను నెలకొల్పాలని కంపెనీలతో భేటీ సందర్భంగా వారిని కోరినట్లు ఆమె తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘నేషనల్ ఉమెన్ హెల్ప్‌లైన్’ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. పోలీసు, లీగల్, మెడికల్, కౌన్సెలింగ్ ఇలా అన్నిరకాలుగా మహిళలకు ఒకేచోట సాయం అందేందుకు ఈ నంబర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.