ప్రముఖ సైట్‌పై ప్రభుత్వ నిషేధం | DOT Bans We Transfer Site In India | Sakshi
Sakshi News home page

‘వీ ట్రాన్స్‌ఫర్’‌ను నిషేధించిన డాట్‌

Published Sun, May 31 2020 11:15 AM | Last Updated on Sun, May 31 2020 11:25 AM

DOT Bans We Transfer Site In India - Sakshi

వీ ట్రాన్స్‌ఫర్‌.కామ్

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ ఫైల్‌ షేరింగ్‌ సైట్‌ ‘వీ ట్రాన్స్‌ఫర్‌.కామ్‌’పై టెలికమ్యూనికేషన్స్‌‌ శాఖ(డాట్‌) నిషేధం విధించింది. జాతి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొద్దిరోజుల క్రితం సైట్‌లోని ఓ మూడు యూఆర్‌ఎల్స్‌ను నిషేధించాలంటూ డాట్‌ ఇంటర్‌నెట్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీచేసింది. అనంతరం మూడవ నోటీసులో సైట్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ సర్వీస్‌ ప్రొవైడర్లు తమ వినియోగదారులకు ఈ సైట్‌ను‌ అందుబాటులో లేకుండా చేశాయి. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ సైట్‌ను నిషేధించిందో తెలియరాలేదు. ( సరికొత్త వెర్షన్‌లో జూమ్‌ యాప్‌..)

కాగా, వీ ట్రాన్స్‌ఫర్‌ సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల యూజర్లు ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ సైటు భారత్‌లో విపరీతమైన ప్రాచూర్యాన్ని పొందింది. దీని‌ ద్వారా దాదాపు 2జీబీ సైజు గల ఫైళ్లను ‘వీ ట్రాన్స్‌ఫర్‌’లో ఎటువంటి అకౌంట్లు అవసరం లేకుండా ఎదుటి వ్యక్తి ఈ మెయిల్‌కు పంపించవచ్చు. ఉచితంగా ఫైళ్లను పంపించుకునే అవకాశం ఉండటంతో నెటిజన్లు దీనిపై ఎక్కువగా మొగ్గుచూపారు. ( పబ్జి ప్రియులకు శుభవార్త )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement