భారతదేశంలో బ్యాన్‌ చేసిన ఆహార పదార్థాలు ఇవే..! | These Foods Are Banned in India | Sakshi
Sakshi News home page

భారతదేశంలో బ్యాన్‌ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!

Published Thu, May 9 2024 1:21 PM | Last Updated on Thu, May 9 2024 1:37 PM

These Foods Are Banned in India

భారతదేశం విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటుంది. విభిన్న పాక శాస్త్రాలను ప్రొత్సహించి రుచులను ఆస్వాదిస్తుంది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్‌ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ). ఆ ఆహార పదర్థాలేంటీ? ఎందుకు వాటిని బ్యాన్‌ చేశారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.

పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) భారతదేశమంతటా కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా బ్యాన్‌ చేసింది. అవేంటంటే..

చైనీస్‌ పాల ఉత్పత్తులు..
చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు, కాలుష్య సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి రాడవంతో ఎప్‌ఎస్‌ఎస్‌ఏఐ 2008లో చైనీస్‌ పాల ఉత్పత్తులు, శిశు ఫార్ములాతో సహా భారతదేశం నిషేధించింది. ప్రోటీన్‌ స్థాయిలన పెంచేలా మెలమైన్‌ విషపూరిత రసాయనం వంటి కలుషితాలను గుర్తించడంతోనే నిపుణులు చైనీస్‌ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తాయని పరిశోధనలో తేలింది కూడా. 

జన్యు పరంగా మార్పు చెందిన ఆహారాలు..
పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం, ఆరోగ్య ప్రమాదాల ఆందోళన నేపథ్యంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, ఆహారా సాగు, దిగమతులపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ..ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ చలా కఠిన షరతులతో ఉంటుంది. దీర్థకాలికా ఆరోగ్యం పర్యావరణ పరిణామాలపై ప్రభావం చూపిస్తాయనేది పలువురు నిపుణులు వాదన. 

పోటాషియం బ్రోమేట్‌..
2016లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ పోటాషియం బ్రోమేట్‌ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి స్థితిస్థాపక తోపాటు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. అయితే దీనివల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా థైరాయిడ్‌ కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుందని, ముఖ్యంగా బ్రెడ్‌ వంటి బేకరీ ఉత్పత్తుల్లో దీని వినియోగాన్ని నిషేధించమని అధికారులు సూచించారు.

పండ్లను పక్వానికి వచ్చేలా చేసే కృత్రిమ కారకాలు..
పండ్లను కృత్రిమంగా పండిచేందుకు వాడే కాల్షియం కార్బైడ్‌, ఇథిలీన్‌ గ్యాస్‌ వంటి రసాయన కారకాలు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భారతదేశం వీటిని నిషేధించింది. ఈ కాల్షియం కార్బైడ్‌ పండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియలో ఎసిటిలిన్‌ వాయువుని విడుదల చేస్తుందని, ఇది కేన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. 

పోయ్‌ గ్రాస్‌
పోయ్‌ గ్రాస్‌ దాని ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ఆందోళన కారణంగా నిషేదించారు. ఇది బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేయాలను పెంచడానికి బలవంతంగా ఈ గ్రాస్‌ని ఇవ్వడంపై జంతు సంక్షేమవాదు ఆందోళనలు లేవనెత్తారు. ఇది అవమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ పోయ్‌ గ్రాస్‌ అమ్మకం, దిగుమతిని నిషేధించడం జరిగింది. రెసిపీల కోసం వాటిని హింసించేలా ఇలాంటి గ్రాస్‌తో ఫీడ్‌ చేయడం అనేది హింసతో సమానమని చెబుతోంది. 

రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్
రెడ్ బుల్ కెఫిన్, టౌరిన్ వంటివి ఇతర ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దీనిలో కెఫీన్‌ కంటెంట్‌ కారణంగా 2006లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భారతదేశమంతటా నిషేధించింది. నిజానికి కెఫిన్‌ వినియోగం సురక్షితమైన ఈ రెండ్‌బుల్‌ ఎనర్జీ డ్రింక్స్‌ అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, నిర్జలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఎక్కువ. 

సస్సాఫ్రాస్ ఆయిల్‌
సాసఫరస్ ఆయిల్‌లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నందున 2003లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ స్థాయిలు పరిమితికి మించి ఉండటంతో హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండటంతోనే అధికారులు దీన్ని నిషేధించారు. 

చైనీస్ వెల్లుల్లి..
2019లో చైనా నుంచి దిగుమతి చేసిన వెల్లుల్లిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళనలు రావడంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  ఈ చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. ఈ వెల్లుల్లిలో పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు నిపుణుల. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రజలు హానికరమైర రసాయనాలకు గురికాకుడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నారు అధికారులు. 

బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ..
బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించడం జరగుతుంది.  ఉదాహరణకు సిట్రస్-ఫ్లేవర్ సోడాలు, సువాసనల కోసం వినియోగిసత​ఆరు.  ఈ నూనెలో బ్రోమిన్ ఉంటుంది. ఇది నాడీ సంబంధిత లక్షణాలు,  థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలకు దాస్తుంది. అందువల్ల దీన్ని ఆహారం, పానీయాలలో వినియోగించటాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. 

కుందేలు మాంసం..
ప్రధానంగా జంతు సంక్షేమం, మతపరమైన ఆందోళనల కారణంగా కుందేలు మాంసం భారతదేశంలో నిషేధించడం జరిగింది. జనాభాలో మెజారిటీగా ఉన్న హిందువులు కుందేలును పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అందువల్దాల దీన్ని మాంసాన్ని ఇక్కడ ఎవరూ తినరని చెప్పొచ్చు . జంతు సంక్షేమ నిబంధనల దృష్ట్యా కుందేలు మాంసం అమ్మకాలను నిషేధించింది భారత్‌.

అందువల్ల ఇలాంటి పదార్థాలు పొరపాటున కనిపించిన కొనద్దు. ఎక్కడైన విక్రయిస్తున్నట్లు తెలిసినా సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయండి. అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన వంతుగా కృషి చేద్దాం.

(చదవండి: బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement