FSSAI
-
ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌తో హై రిస్క్: ఇండస్ట్రీ ఇవి కచ్చితంగా పాటించాల్సిందే!
ఎన్ని హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నా, ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్న మనందరికి భారతదేశ ఆహార నియంత్రణ సంస్థ ఒక హెచ్చరిక లాంటి వార్తను అందించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , మినరల్ వాటర్‌ను "హై-రిస్క్ ఫుడ్" కేటగిరీలో చేర్చింది. అంతేకాదు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరణను తొలగించాలనే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కఠినమైన భద్రతా ప్రోటోకాల్‌ను ఆయా కంపెనీలు కచ్చితంగా పాటించాలని పేర్కొందిఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ ప్రకారం, కొత్త మార్గదర్శకాలకనుగుణంగా ప్రకారం, తయారీదారులు , ప్రాసెసర్లు లైసెన్స్‌లు లేదా రిజిస్ట్రేషన్లను మంజూరు చేయడానికి ముందు తప్పనిసరిగా తనిఖీలు చేయించుకోవాలి. అక్టోబరులో, ప్యాకేజ్డ్ వాటర్‌కి సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన నిబంధనల ప్రకారం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మరియు మినరల్ వాటర్ తయారీ దారులందరూ ఇప్పుడు లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేందుకు తప్పనిసరిగా వార్షిక, రిస్క్ ఆధారిత తనిఖీలు చేయించుకోవాలి.గతంలో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ BIS , FSSAI రెండింటి ద్వారా ద్వంద్వ ధృవీకరణ అవసరాల తొలగించాలి డిమాండ్ చేసింది. కానీ ఈ వాదనలను తోసిపుచ్చిన సంస్థలు తప్పని సరిగా తనిఖీలు చేయించాలని, సంబంధిత ధృవీకరణ పత్రాలను పొందాలనిస్పష్టం చేశాయి. దీనికి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి హై-రిస్క్ ఫుడ్ కేటగిరీలలో వ్యాపారం చేస్తున్నవారు, FSSAI-గుర్తింపు పొందిన మూడవ-పక్ష (థర్డ్‌పార్టీ) ఆహార భద్రతా ఏజెన్సీల వార్షిక ఆడిట్లను పొందాల్సి ఉంటుంది.హై-రిస్క్ ఫుడ్ కేటగిరీల క్రింద వచ్చే ఇతర ఉత్పత్తులు:పాల ఉత్పత్తులు, అనలాగ్స్పౌల్ట్రీతో సహా మాంసం , మాంసం ఉత్పత్తులు,మొలస్క్లు, క్రస్టేసియన్లు , ఎచినోడెర్మ్లతో సహా చేపలు , చేప ఉత్పత్తులుగుడ్లు , గుడ్డు ఉత్పత్తులునిర్దిష్ట పోషక అవసరాల కోసం ఉద్దేశించిన ఆహార ఉత్పత్తులుతయారుచేసిన ఆహారాలు (ప్రిపేర్డ్ ఫుడ్)భారతీయ స్వీట్లుపోషకాలు, వాటి ఉత్పత్తులు (ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే)కాగా ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీళ్లు తాగడం చాలా ప్రమాదమని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాదు, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల ఒక్కోసారి కేన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
భక్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రసాదం మాత్రమే : కర్ణాటక నిర్ణయంపై వివాదం
కర్ణాటక ప్రభుత్వం భక్తులకు నాణ్యమైన 'ప్రసాదం' అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్ మండపాల వద్ద 'ఎఫ్ఎస్ఎస్ఏఐ-ధృవీకరించిన ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 31న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సరికొత్త దుమారం రేగింది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక నిర్ణయమని బీజేపీ అభివర్ణించింది. అయితే, గణేష్ చతుర్థి పండుగ సీజన్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. గణేష ఉత్సవ నిర్వాహకులకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే గణేష్ పందిళ్లలో ప్రసాదం తయారు చేయడానికి అనుమతిస్తారు. పందిళ్లలోఅందించే ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ తప్పనిసరి అని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి రాసిన లేఖలో ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అంతేకాదు అనుమతి లేకుండా ప్రసాదం పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. అనుమతులు తప్పనిసరిబెంగళూరులోని గణేశ మంటప నిర్వాహకులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణతో పాటు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు పోలీసు, నగర పాలక సంస్థ, విద్యుత్ లాంటి స్థానిక అధికారుల అనుమతులను పొందాలి. నిర్వాహకులు పాండల్స్ కోసం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన నిర్దిష్ట పర్యావరణ నిబంధనలను కూడా పాటించాలి. తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర భద్రతా చర్యల్లో భాగంగా వేదిక వద్ద అత్యవసర సంప్రదింపు నంబర్లను ప్రదర్శించాలి.మరోవైపుగణేష్ చతుర్థి ఉత్సవాలకు అనుమతిస్తూ కర్నాటక హైకోర్టు, అధికారుల నిర్ణయాన్ని సమర్థించడంతో బుధవారం హుబ్బళ్లి-ధార్వాడ్‌లోని ఈద్గా మైదాన్‌లో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. -
పాలు, పాల ఉత్పత్తులకు ఏ1, ఏ2 పేర్లు వద్దు: ఎఫ్ఎస్ఎస్ఏఐ
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ కింద A1, A2 పేరుతో పాలు, నెయ్యి లేదా పాల ఉత్పత్తులను విక్రయించడంపై స్పష్టతనిచ్చింది. అన్ని పాల ఉత్పత్తుల మీద ఏ1, ఏ2 క్లెయిమ్‌లను తొలగించాలని వెల్లడించింది.ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ క్లెయిమ్‌లను వెంటనే తమ వెబ్సైట్ల నుంచి తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఇప్పటికే ఈ లేబుల్స్ ముద్రించి ఉంటే.. అలంటి వాటిని తొలగించడానికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. లేబులింగ్స్ అనేవి కస్టమర్లను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని, ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006కు అనుకూలంగా లేదని స్పష్టం చేసింది.ఏ1, ఏ2 పాలలో ప్రోటీన్లు వేరు వేరుగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఈ రెండు కేటగిరీల పాలలోని ప్రయోజనాలపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి తప్పకుండా అందరూ ఈ నియమాలను పాటించాలని.. మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తి లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. -
ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు : కంపెనీ లైసెన్స్ రద్దు
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పందించింది. వివాదానికి కారణమైన ఐస్‌క్రీమ్ తయారీదారు లైసెన్సును రద్దు చేసింది. దీనిపై దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) అధికారులు శుక్రవారం పుణేకు చెందిన ఐస్‌క్రీమ్ యూనిట్లను సందర్శించారు. నమూనాలను సేకరించారని అధికారులు తెలిపారు. అనంతరం ఫార్చ్యూన్ డెయిరీకి చెందిన యమ్మో కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసినట్టు పూణే రీజియన్ ఎఫ్‌డిఎ జాయింట్ కమిషనర్ సురేష్ అన్నపురే తెలిపారు. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఐస్‌క్రీంలో ఆ ‘ముక్క’ చూసి డాక్టర్‌కు కక్కొచ్చినంత పనైంది!తన సోదరి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించిందంటూ ముంబైలోని మలద్ ప్రాంతానికి చెందిన వైద్యుడు బ్రెండన్ ఫిర్రావ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం కోన్ ఐస్‌క్రీమ్ తింటుండగా గట్టిగా ఏదో తగిలింది. వెంటనే అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి చూడగా చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూసి షాకైన ఫిర్రావ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంపెనీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో మలద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఆ ముక్కను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఫిర్రావ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ స్టోరీ నెట్టింట్ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.. -
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్‌లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్మెంట్లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్‌లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
తల్లిపాలతో వ్యాపారానికి అనుమతించబోము
తల్లిపాలతో వ్యాపారం వద్దే వద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తేల్చి చెప్పేసింది. మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తులను విక్రయించరాదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.‘మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించి వివిధ రిజిస్టర్డ్ సొసైటీల నుంచి ఈ కార్యాలయానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006 కింద మానవ తల్లిపాలను ప్రాసెసింగ్ చేయడానికి, విక్రయించడానికి ఎఫ్ఎస్ఎస్ఎఐ అనుమతించదు’ ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఎఐ తెలిపింది.మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006తోపాటు దాని అనుబంధ నియమనిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్బీఓ) హెచ్చరించింది.తల్లి పాలను విక్రయించే ఇలాంటి యూనిట్లకు అనుమతి ఇవ్వవద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సింగ్ అధికారులను కోరింది. 'మదర్స్ మిల్క్/హ్యూమన్ మిల్క్' ప్రాసెసింగ్ లేదా అమ్మకంలో పాల్గొనే ఇలాంటి ఎఫ్‌బీఓలకు ఎలాంటి లైసెన్స్/ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా రాష్ట్ర, కేంద్ర లైసెన్సింగ్ అథారిటీలు చూసుకోవాలని సూచించింది.జాతీయ మార్గదర్శకాల ప్రకారం డోనర్ హ్యూమన్ మిల్క్ (డీహెచ్ఎం)ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. కాంప్రహెన్సివ్ పాలిటీ మేనేజ్మెంట్ సెంటర్స్ (సీఎల్ ఎంసీ)ల్లోని ఆరోగ్య కేంద్రాల్లో చేరిన శిశువులకు దీన్ని అందించవచ్చు. తల్లిపాలను ఇచ్చే దాత ఇందుకోసం ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛందంగా దానం చేయాలి. దానం చేసిన పాలను ఆసుపత్రిలోని నవజాత శిశువులు, ఇతర తల్లుల శిశువులకు ఆహారం అందించడానికి ఉచితంగా ఉపయోగించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. -
తళుకుల మాటున కల్తీమాయ!
ఎవరైనా ఆహారం ఎందుకు తింటారు? బతకడానికి. ఆరోగ్యంగా జీవించడానికి. కానీ.. గ్రేటర్ నగరంలోని హోటళ్లలో తింటే ‘ఆహారంతోనే రోగం’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. హోటళ్లతో పాటు బేకరీలు, రెస్టారెంట్లు, బార్లు, ఐస్‌పార్లర్లు అన్నింటా ఇదే దుస్థితి. ముడిసరుకుల నుంచి తినుబండారాల దాకా, ఫుట్ఫాత్ బండ్ల నుంచి స్టార్‌హోటళ్ల దాకా ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా కల్తీ జరుగుతోంది. దాదాపు గత 40 రోజులుగా అధికారుల తనిఖీల్లో కల్తీ.. శుభ్రత, నాణ్యతల లేమి బట్టబయలవుతున్నాయి. ఇప్పటి దాకా భారీ పెనాలీ్టలు, మూసివేతలు, తగిన శిక్షలు అమలు కాకపోవడం అందుకు ఓ కారణం కాగా, లంచాలకు మరిగిన అధికారులపై చర్యలు లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. నగరంలోని హోటళ్లలో లభించే ఆహార పదార్థాల్లో కల్తీకేదీ కాదు అనర్హం అన్న చందంగా మారింది. ఏ హోటల్ చూసినా ఏమున్నది గర్వకారణం.. అడుగడుగునా ఆహారం నకిలీమయం అన్నట్లు.. గ్రేటర్‌లోని హోటళ్లలో కల్తీ పదార్థాలపై ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వీటిలో కల్తీ ఎక్కువ.. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిలో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి. వీటిలోని కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. మసాలా దినుసుల్లోని గసగసాలు, దాలి్చనచెక్క, లవంగాలు, యాలకులు వంటి వాటిలో 20 శాతం అసలువి కాగా 80 శాతం కల్తీవి కలుపుతారని సమాచారం. వీటితో పాటు జంతు కళేబరాలు, కొవ్వు, ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో వినియోగంలో ఉంది.కల్తీ ఇలా.. మచ్చుకు..– తేనె పేరిట గ్లూకోజ్‌వాటర్‌లో పంచదార పాకం, వార్నిష్, డ్రైఫ్రూట్స్ మిశ్రమం కలిపి విక్రయిస్తున్నారు. రంగుల తయారీలో వాడే యాసిడ్లు, హానికర రసాయనాలతో సోంపు తయారు చేస్తున్నారు. రంగుల పరిశ్రమల్లో వాడే సల్ఫ్యూరిక్ యాసిడ్, వార్నిష్, కుళ్లిన ఆలుగడ్డలతో వెల్లుల్లి పేస్ట్.– ఓల్డ్‌సిటీలోని చావ్‌నీబస్తీలోని గోదాముల్లో జంతు కళేబరాల నుంచి నూనె తయారీని గతంలో గుర్తించారు. ఉప్పుగూడ, బహదూర్‌పురా, ఘాన్సీబజార్, బాలానగర్, మియాపూర్ ,మైలార్‌దేవ్‌పల్లి, టాటానగర్ , మల్లాపూర్, జల్పల్లి, శంకర్‌నగర్ తదితర ప్రాంతాల్లో కల్తీ జరుగుతుండటాన్ని గుర్తించినా పూర్తిగా నిలువరించలేకపోయారు.నిబంధనలకు నీళ్లు.. – ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ)మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు, వాటి లైసెన్సుల వివరాలు జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండాల్సి ఉండగా అమలు కావడం లేదు. తనిఖీలు జరిపి కల్తీని బట్టి చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్థాల ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలి.కల్తీని వెంటనే నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి కానీ ఏదీ లేదు.కాగితాల్లోనే యాప్.. – హోటళ్లలో పరిశుభ్రత నుంచి అన్నీ సవ్యంగా ఉండాలని, లేని పక్షంలో ఆటోమేటిక్‌గానే వేటికి ఎంత జరిమానానో పేర్కొంటూ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెస్తామన్న మాటలు కార్యరూపం దాల్చలేదు. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల నుంచి ఆన్లైన్ ఆర్డర్లపై, క్లౌడ్ కిచెన్లు, హోటళ్ల టేక్అవే విండోల ద్వారా తీసుకుంటున్న ఆహారాల్లోనూ కల్తీపై పలు ఫిర్యాదులందుతున్నాయి. – ప్రతి హోటల్లోనూ ట్రేడ్ లైసెన్సు ఫుడ్ లైసెన్సు సర్టిఫికెట్లు కనిపించేలా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు ఉచితంగా సరఫరా చేయాలి. దాంతోపాటు వివిధ నిబంధనలున్నాయి. వాటిని పాటించకపోతే జీహెచ్ఎంసీ యాక్ట్ మేరకు జరిమానాలు విధించాలి.పకడ్బందీగా అమలు కాని పెనాల్టీలు.. తయారీకి సిద్ధం చేసిన, తయారైన ఆహార పదార్థాలపై దుమ్మూ ధూళి ఉన్నా, కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేకపోయినా, కిచెన్ శుభ్రంగా లేకున్నా, సిబ్బంది చేతులకు గ్లౌజులు, తలకు టోపీ ధరించకున్నా, ఉద్యోగులకు నిరీ్ణత వ్యవధుల్లో హెల్త్ చెకప్‌లు చేయించకున్నా, అపరిశుభ్రత, పగిలిన పాత్రలు వినియోగించినా రూ. 500 నుంచి పెనాలీ్టలున్నాయి. కానీ పకడ్బందీగా అమలు కావడం లేదు.పేరు గొప్ప.. తీరు దయనీయం..దాదాపుగా 40 రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఉల్లంఘనలు గుర్తించిన వాటిల్లో చిన్న వాటి నుంచి పెద్ద సంస్థల వరకున్నాయి. సీట్ల కోసం ప్రజలు వెయిట్ చేసే ప్రముఖ సంస్థలు కూడా వీటిల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్రీమ్‌స్టోన్, నేచురల్స్ ఐస్‌క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ, హౌస్ రాయలసీమ, రుచుల షా, గౌస్ కామత్ హోటల్, 36 డౌన్‌టౌన్ బ్య్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఏయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, సిజ్లింగ్ జోయ్, ఖాన్‌సాబ్, సుఖ్‌సాగర్ రెస్టారెంట్, జంబోకింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, అట్లూరి ఫుడ్స్ ప్రై వేట్ లిమిటెడ్(చట్నీస్ కాఫీహౌస్ అండ్ వెజ్ రెస్టారెంట్),షాన్‌బాగ్ హోటల్ డీలక్స్, గౌరంగ్ డిజైన్స్ ఇండియా ప్రై వేట్ లిమిటెడ్, కృతుంగ పాలేగార్స్ క్విజి, హెడ్‌క్వార్టర్స్ రెస్టో బార్, తదితరమైనవి వీటిల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.Task force team has conducted inspections in the Madhapur area on 23.05.2024. The Rameshwaram Cafe* Urad Dal (100Kg) stock found expired in Mar'24 worth Rs. 16K* Nandini Curd (10kg), Milk (8L) worth Rs. 700 found expired Above items discarded on the spot.(1/4) pic.twitter.com/mVblmOuqZk— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 23, 2024 ఆరోగ్యం ఖతం.. కల్తీ వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. శరీరానికి అవసరమైన పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. తాము పోషకాహారం తీసుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నప్పటికీ, కల్తీవల్ల జీవక్రియలు నిలిచిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. కల్తీ ఆహారంతో అక్యూట్ డయోరియల్ డిసీజెన్ వస్తాయని ఫీవర్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు.రంగంలోకి టాస్‌్కఫోర్స్..వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులందుతుండటంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్ టీమ్స్ దాదాపు 40 రోజులుగా తనిఖీలు జరుపుతున్నాయి. దాదాపు వంద హోటళ్లు, ఇతరత్రా సంస్థల్లో జరిపిన తనిఖీల్లో 90 శాతం నిబంధనల కనుగుణంగా లేవు. కిచెన్, స్టోర్‌రూమ్స్ శుభ్రంగా లేవు, బొద్దింకలు, ఇతరత్రా క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి.ఎక్స్పైర్డ్ ఐటంలు అమ్ముతున్నారు. బ్రాండ్ పేరు ఒకటైతే వేరే సరుకు అమ్ముతున్నారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు, చట్టాల మేరకు 24 కేసులు నమోదు చేశారు. – చెరుపల్లి వెంకటేశ్జరిమానాలు ఇలా (రూపాయలో)..ట్రేడ్ లైసెన్సు ఉన్న ఫొటో కనపడకుంటే - 520 తాగునీరు ఉచితంగా ఇవ్వకుంటే - 1000 వ్యర్థాలను తడి,పొడిగా వేరు చేయకుంటే - 1000 టాయ్లెట్లు శుభ్రంగా లేకుంటే - 5000 టాయ్లెట్లు లేకుంటే - 2000 మురుగునీటి వ్యవస్థ లేకుంటే - 5000 భూగర్భ డ్రై నేజీ లేకుంటే - 10,000 ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేకుంటే - 10.000 భవనం అక్రమ నిర్మాణమైతే - 10,000 పై అంతస్తుల్లో బట్టీలు ఏర్పాటు చేస్తే - 10,000 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ వాడితే - 10,000 కోల్డ్ చాంబర్లో నిర్ణీత ఉష్ణోగ్రత లేకుంటే - 500 వండిన ఆహారపదార్థాలు నిల్వ ఉంచితే - 5002023లో.. అందిన ఫిర్యాదులు : 2885 తనిఖీలు చేసినవి : 1685 జీహెచ్ఎంసీ పరిధిలో లేనివి : 1047 ఇతర కేటగిరీవి : 165 పెండింగ్ : 15 జీహెచ్ఎంసీలో ఉండాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 31 పనిచేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు : 23గత మూడేళ్లలో..లైసెన్సుల జారీ : 33251 వసూలైన ఫీజు : రూ.9,71,02,700 స్ట్రీట్ వెండర్స్ ‘రిజిస్ట్రేషన్లు : 36334 వచ్చిన ఫీజు : రూ.59,48,270 ఫేడ్‌సేఫ్టీపై శిక్షణలిచ్చి జారీ చేసిన సర్టిఫికెట్లు : 1570 ఫిర్యాదు చేసేందుకు..జీహెచ్ఎంసీ పరిధిలో - foodsafetywing.ghmc@gmail.com - Phone no - 04021 11 11 11 దెబ్బతింటున్న కిడ్నీలు..పెచ్చుమీరుతున్న కల్తీ ఆహారంతో క్యాన్సర్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవలి కాలంలో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. మనకు దొరికే ఉప్పు, పాలతో సహా రా మెటీరియల్ అంతా కల్తీనే. వీటిని రెస్టారెంట్లు, హోటళ్లలో మరింత కల్తీ చేస్తున్నారు. ఫుడ్ కలర్స్, కెమికల్స్ అన్నీ అనారోగ్యానికి దారి తీసేవే. ముఖ్యంగా బాయిల్డ్ అయిన ఆయిల్‌తో తయారు చేస్తున్న వంటకాలతో అనారోగ్యసమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. – హితశ్రీ రెడ్డి, డైటీషియన్, నిమ్స్కఠిన చర్యలుండాలి!తక్కువ మొత్తంలో పెనాల్టీలతో పరిస్థితి మారదు. కల్తీ నిర్ధారణ అయినప్పుడు చట్టం మేరకు కఠినచర్యలు తీసుకోవాలి. మొక్కుబడి తంతుగా ఏటా పదిరోజులో, నెల రోజులో కాకుండా తనిఖీలు నిరంతరం జరగాలి. వండిన ఆహారపదార్థాల్లోనే కాకుండా మసాలా దినుసుల్లోనూ కల్తీ జరుగుతోంది. విదేశాలకు పంపిస్తే వాటిని స్వీకరించకుండా వెనక్కు పంపిస్తున్నారు. ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ ఉండాలి.– పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్నిబంధనలు పాటించాలి..హోటళ్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు, ఎఫ్ఎస్ఎస్ఏ, జీహెచ్ఎంసీ నిబంధనలు పాటించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు వాడొద్దు. పరిశుభ్రత పాటించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. కల్తీని గుర్తించినప్పుడు ప్రజలు ఫిర్యాదు చేయాలి.– కె. బాలాజీరాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్శిక్షణ ఉండాలి..ఇటీవలి కాలంలో హోటళ్ల గురించి తెలియని వారు సైతం పెట్టుబడి వనరుగా ఈ రంగంలోకి వస్తున్నారు. ఇంటీరియర్ల కోసం ఎంతో ఖర్చు చేస్తున్న వారు సిబ్బంది శిక్షణ గురించి పట్టించుకోవడం లేదు. రెస్టారెంట్ల ఓనర్లు, సిబ్బందికి అవగాహన ఉండాలి. ప్రతి ఇరవై మంది సిబ్బందికి ఒక ట్రైనర్ ఉండాలి. ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక రోజు శిక్షణతో ఆన్‌లైన్‌పరీక్షతో సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. శిక్షణలు వినియోగించుకోవాలి.– తుమ్మల సంపత్ శ్రీనివాస్, ప్రెసిడెంట్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ -
ఎండీహెచ్, ఎవరెస్ట్‌లకు క్లీన్ చిట్
భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్ సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ రెండు సంస్థల అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లోక్యాన్సర్‌కు కారకమయ్యే ఎథిలీన్ ఆక్సైడ్ (eto) రసాయనాలు లేవని నిర్ధారించింది.కొద్ది రోజుల క్రితం భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ అమ్మకాలు జరుపుతున్న మసాలల పొడుల ఉత్పత్తుల్లో పరిమితికి మించి ఎథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుల మందు ఉన్నట్లు కనుగొన్నామని హాంకాంగ్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (సీఎఫ్ఎస్) ఏప్రిల్ 5న ప్రకటించింది. ఈ ఉత్పత్తులను కొనొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎస్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని, ఈ బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ రీకాల్ చేసింది.అందులో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎమ్‌డీహెచ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్ మిక్స్డ్ మసాలా పౌడర్ ఉన్నాయి.ఎఫ్ఎస్ఏఐ అప్రమత్తంఆ ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ అన్నీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేప్టీ కమిషనర్లు, రిజినల్ డైరెక్టర్లను అప్రమత్తం చేసింది. వెంటనే ఎవరెస్ట్, ఎమ్‌డీహెచ్ మసాల పొడుల శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిపై టెస్టులు చేయాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు మహరాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్‌లలో మసాల దినుసుల శాంపిల్స్‌ను కలెక్ట్ చేశారు.ఇథిలీన్ ఆక్సైడ్ గురించి అన్వేషణపలు నివేదికల ప్రకారం.. అధికారులు మసాల దినుసుల శాంపిల్స్‌ను పరీక్షించారు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో ఇథిలీన్ ఆక్సైడ్ కోసం నమూనాలను పరీక్షించారు.28 ల్యాబ్ రిపోర్టులు అయితే ఇప్పటివరకు 28 ల్యాబ్ రిపోర్టులు అందాయి. ఫుడ్ రెగ్యులేటర్ సైంటిఫిక్ ప్యానెల్ శాంపిల్స్‌ను విశ్లేషించగా వాటిలో ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదని తేలింది.ఆ రెండు కంపెనీలకు క్లీన్ చిట్‌అంతేకాదు ఇతర బ్రాండ్లకు చెందిన మరో 300 మసాలా శాంపిల్స్ పరీక్ష నివేదికలను కూడా విశ్లేషించింది. అయితే భారతీయ ఉత్పత్తులు వినియోగానికి సురక్షితమైనవని చూపిస్తూ క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థం ఆనవాళ్లు లేవని ఎమ్‌డీహెచ్, ఎవరెస్ట్‌లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..
వేసవి కాలం అంటే నోరూరించే మామిడి పండ్ల సీజన్. వీటిని ఇష్టపడని వారెవ్వరుంటారు. అయితే ఆ మామిడి పండ్లను కృత్రిమంగా పండించడంపై ఫుడ్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వ్యాపారస్తులను, పండ్ల వ్యాపరులను ఆహార భద్రత ప్రమాణలు పాటించాని పేర్కొంది. చట్టవిరుద్ధంగా కాల్షియం కార్పైడ్ వంటి రసాయనాలను వినియోగించకూడదని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అసలు కృత్రిమంగా మామిడి పండ్లను పండించేందుకు ఏం ఉపయోగాస్తారు? కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించగలం తదితరాలు గురించి తెలుసుకుందాం.!కాల్షియం కార్బైడ్ అంటే..మామిడిపండ్లు తొందరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్‌ని వినియోగిస్తారు. దీనిలో ఫాస్పరస్ జాడలు కలిగి ఉన్న ఎసిటిలీన్ వాయవుని విడుదల చేస్తుంది. అందువల్ల ఈ రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరం. ఇలా పండించిన పండ్లను తీసుకోవడం వల్ల తలనొప్పి, తరుచుగా దాహం, చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది. వాంతులు, చర్మపు పూతలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అందువల్ల ఇలాంటి కెమికల్స్ వినియోగాన్ని నిషేధించింది. 2011 రెగ్యులేషన్ నిబంధనల ప్రకారం కృత్రిమంగా పండించేందుకు కాల్షియ కార్బైడ్ వినియోగించొద్దని తెలిపింది. ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ వాయువును ఉపయోగించొచ్చని తెలిపింది. ఇథిలిన్ వాయువు కార్బైడ్ వాయువుకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంది. ఇది పండును సహజంగా పండేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఇథిలిన్ వాయువుని గణనీయమైన పరిమాణంలోనే వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది పంట రకం, పరిపక్వత ఆధారంగా ఎంత మేర వినయోగించాలనేది నిర్ణయించడం జరుగుతుంది. చాలా వరకు సుమారు 100 పీపీఎంల వరకు వినియోగించేలా అనుమతి ఇచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. దీన్ని ఎలా గుర్తించాలంటే..ఇక్కడ మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను పండించారా? లేదా సహజమైన రీతీలో పండాయా అనేది ఎలా గుర్తించాలంటే..అందుకు నాలుగు సింపుల్ చిట్కాల ఉన్నాయి. అవి ఫాలో అయిపోండి. అవేంటంటే..ఆకృతిని పరిశీలించటం: మామిడిపండ్లు అసహజంగా ఏకరీతిగా కనిపించి చుట్టూ ఈగలు, కీటకాలు లేకుంటే వాటికి ఘాటైన రసాయనాలను కలిపారని అర్థం. వాటర్ పరీక్ష: కృత్రిమంగా పండిన మామిడి పండ్లు నీటిపై తేలుతుంది. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత మామిడికాయలను ఒక బకెట్ నీటిలో ఉంచండి. అవి సేంద్రియంగా పండించారా లేదా అన్నది తెలిసిపోతుంది. టేస్టీని బట్టి: కృత్రిమంగా పండిన మామిడిపండ్లు సేంద్రీయ వాటితో పోల్చితే తక్కువ జ్యూసీ, తక్కువ బరువుని కలిగి ఉంటాయి. అగ్గిపుల్ల టెస్ట్: ఈ పరీక్ష అత్యంత భద్రతతో నిర్వహించాల్సి ఉంటుంది. అగ్గిపుల్లను వెలిగించి మామిడి పండ్ల దగ్గరకు తీసుకువస్తే..మంటలు లేదా మెరుపులో కూడిన మంట వెదజల్లిన కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టారని అర్థం. (చదవండి: హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!) -
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
భారతదేశం విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటుంది. విభిన్న పాక శాస్త్రాలను ప్రొత్సహించి రుచులను ఆస్వాదిస్తుంది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ). ఆ ఆహార పదర్థాలేంటీ? ఎందుకు వాటిని బ్యాన్ చేశారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారతదేశమంతటా కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా బ్యాన్ చేసింది. అవేంటంటే..చైనీస్ పాల ఉత్పత్తులు..చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు, కాలుష్య సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి రాడవంతో ఎప్ఎస్ఎస్ఏఐ 2008లో చైనీస్ పాల ఉత్పత్తులు, శిశు ఫార్ములాతో సహా భారతదేశం నిషేధించింది. ప్రోటీన్ స్థాయిలన పెంచేలా మెలమైన్ విషపూరిత రసాయనం వంటి కలుషితాలను గుర్తించడంతోనే నిపుణులు చైనీస్ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తాయని పరిశోధనలో తేలింది కూడా. జన్యు పరంగా మార్పు చెందిన ఆహారాలు..పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం, ఆరోగ్య ప్రమాదాల ఆందోళన నేపథ్యంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, ఆహారా సాగు, దిగమతులపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ..ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ చలా కఠిన షరతులతో ఉంటుంది. దీర్థకాలికా ఆరోగ్యం పర్యావరణ పరిణామాలపై ప్రభావం చూపిస్తాయనేది పలువురు నిపుణులు వాదన. పోటాషియం బ్రోమేట్..2016లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ పోటాషియం బ్రోమేట్ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి స్థితిస్థాపక తోపాటు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. అయితే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా థైరాయిడ్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ముఖ్యంగా బ్రెడ్ వంటి బేకరీ ఉత్పత్తుల్లో దీని వినియోగాన్ని నిషేధించమని అధికారులు సూచించారు.పండ్లను పక్వానికి వచ్చేలా చేసే కృత్రిమ కారకాలు..పండ్లను కృత్రిమంగా పండిచేందుకు వాడే కాల్షియం కార్బైడ్, ఇథిలీన్ గ్యాస్ వంటి రసాయన కారకాలు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భారతదేశం వీటిని నిషేధించింది. ఈ కాల్షియం కార్బైడ్ పండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియలో ఎసిటిలిన్ వాయువుని విడుదల చేస్తుందని, ఇది కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పోయ్ గ్రాస్‌పోయ్ గ్రాస్ దాని ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ఆందోళన కారణంగా నిషేదించారు. ఇది బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేయాలను పెంచడానికి బలవంతంగా ఈ గ్రాస్‌ని ఇవ్వడంపై జంతు సంక్షేమవాదు ఆందోళనలు లేవనెత్తారు. ఇది అవమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ పోయ్ గ్రాస్ అమ్మకం, దిగుమతిని నిషేధించడం జరిగింది. రెసిపీల కోసం వాటిని హింసించేలా ఇలాంటి గ్రాస్‌తో ఫీడ్ చేయడం అనేది హింసతో సమానమని చెబుతోంది. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్రెడ్ బుల్ కెఫిన్, టౌరిన్ వంటివి ఇతర ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దీనిలో కెఫీన్ కంటెంట్ కారణంగా 2006లో ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశమంతటా నిషేధించింది. నిజానికి కెఫిన్ వినియోగం సురక్షితమైన ఈ రెండ్‌బుల్ ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, నిర్జలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఎక్కువ. సస్సాఫ్రాస్ ఆయిల్‌సాసఫరస్ ఆయిల్లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నందున 2003లో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ స్థాయిలు పరిమితికి మించి ఉండటంతో హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండటంతోనే అధికారులు దీన్ని నిషేధించారు. చైనీస్ వెల్లుల్లి..2019లో చైనా నుంచి దిగుమతి చేసిన వెల్లుల్లిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళనలు రావడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. ఈ వెల్లుల్లిలో పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు నిపుణుల. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రజలు హానికరమైర రసాయనాలకు గురికాకుడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నారు అధికారులు. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ..బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించడం జరగుతుంది. ఉదాహరణకు సిట్రస్-ఫ్లేవర్ సోడాలు, సువాసనల కోసం వినియోగిసతఆరు. ఈ నూనెలో బ్రోమిన్ ఉంటుంది. ఇది నాడీ సంబంధిత లక్షణాలు, థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలకు దాస్తుంది. అందువల్ల దీన్ని ఆహారం, పానీయాలలో వినియోగించటాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. కుందేలు మాంసం..ప్రధానంగా జంతు సంక్షేమం, మతపరమైన ఆందోళనల కారణంగా కుందేలు మాంసం భారతదేశంలో నిషేధించడం జరిగింది. జనాభాలో మెజారిటీగా ఉన్న హిందువులు కుందేలును పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అందువల్దాల దీన్ని మాంసాన్ని ఇక్కడ ఎవరూ తినరని చెప్పొచ్చు . జంతు సంక్షేమ నిబంధనల దృష్ట్యా కుందేలు మాంసం అమ్మకాలను నిషేధించింది భారత్.అందువల్ల ఇలాంటి పదార్థాలు పొరపాటున కనిపించిన కొనద్దు. ఎక్కడైన విక్రయిస్తున్నట్లు తెలిసినా సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయండి. అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన వంతుగా కృషి చేద్దాం.(చదవండి: బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు) -
మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ
మసాలాలు, సుంగధద్రవ్యాల్లో 10 రెట్లకంటే అధికంగా పురుగుమందుల అవశేషాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతిస్తోందని తెలిపే నివేదికలను సంస్థ తోసిపుచ్చింది. ఆహార పదార్థాల విషయంలో ఇండియాలో కఠినమైన నియమాలు ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.ఇటీవల రెండు ప్రముఖ భారతీయ బ్రాండ్లు ఎండీహెచ్, ఎవరెస్ట్‌ల ఉత్పత్తుల్లో పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఆరోపిస్తూ హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ ఉత్పత్తులను ముందుగా విదేశాలకు ఎగుమతి చేయాలంటే స్థానికంగా ఉన్న ఆహార నియంత్రణ సంస్థలు పూర్తి స్థాయిలో వాటిని పరీక్షించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థ చేసిన పరీక్షల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని తేలడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో సామాజిక మాధ్యమాల్లో భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ పనితీరును ప్రశ్నిస్తూ వార్తలు వైరల్‌గా మారాయి. దాంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ దాని పనితీరుపై స్పష్టతనిచ్చింది.ఇదీ చదవండి: వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయంపురుగుమందుల అవశేషాలకు సంబంధించి గరిష్ట అవశేష స్థాయి (ఎంఆర్ఎల్) అత్యంత కఠినమైన ప్రమాణాల్లో ఒకటి. పురుగుమందుల ఎంఆర్‌ఎల్‌లు వివిధ ఆహార వస్తువులకు వాటి ప్రమాద అంచనాల ఆధారంగా వేర్వేరుగా నిర్ణయిస్తారు. అయితే భారత్‌లో మొత్తం 295 పురుగుమందులు నమోదయ్యాయి. వాటిలో 139 వాటిని మాత్రమే మసాలా దినుసుల ఉత్తత్తిలో వాడేందుకు అనుమతులున్నాయి. -
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
అన్నవరం రైల్వేస్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లోనే తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ సాధించింది. ఇది డివిజన్‌లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ (నాంపల్లి) తర్వాత రెండోదిగా నిలిచింది. ఈ సర్టిఫికెట్ సాధించేందుకు డివిజన్ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. ఆ స్టేషన్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్ యజమానులు, సరఫరాదారులకు ఎఫ్ఏఎస్టీఏసీ (ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్)లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కమర్షియల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి–పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించేవారు. ప్రారంభంలో ప్రీ–ఆడిట్ నిర్వహించి చివరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంతరం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ వరించింది. ఈ సర్టిఫికెట్ సాధించడానికి కృషిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓ మహ్మతుల్లా, ఇతర అధికారులను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
FSSAI: న్యూస్ పేపర్లో ఆహారం ప్యాక్ చేయొద్దు
న్యూఢిల్లీ: వార్తా పత్రికలను (న్యూస్ పేపర్) ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్‌ను ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. అలాగే, న్యూస్ పేపర్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నిబంధనల కఠిన అమలుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలసి పనిచేస్తామని ప్రకటించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు న్యూస్ పేపర్ వినియోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమలవర్ధనరావు కోరారు. ‘‘వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్‌లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఆహారాన్ని కలుíÙతం చేస్తాయి. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలు రావచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రింటింగ్‌కు వాడే ఇంక్‌లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని వెల్లడించింది. ‘‘వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుంది. బ్యాక్టీరియా, వైరస్లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను కలిగించొచ్చు’’అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వార్తా పత్రికలను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వినియోగించకుండా నిషేధిస్తూ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2018లోనే నిబంధనలను నోటిఫై చేయడం గమనార్హం. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికల్లో సాయంతో తొలగించడాన్ని కొందరు చేస్తుంటారు. ఇలా చేయడాన్ని సైతం చట్టం నిషేధించింది. కస్టమర్ల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, చట్ట ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్‌నే ఆహార పదార్థాలకు వినియోగించాలని కమలవర్ధనరావు కోరారు. -
న్యూస్ పేపర్లలో ఆహారం తింటున్నారా? కేంద్ర సంస్థ హెచ్చరిక!
రోడ్డు పక్కన విక్రయించే చిరుతిళ్లు, ఆహార పదార్థాలను సాధారణంగా పాత న్యూస్ పేపర్లలో పొట్లం కట్టి ఇస్తుంటారు. ఇలా న్యూస్ పేపర్లలో ఆహారం తింటే తీవ్రవైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ఆహార పదార్థాల ప్యాకింగ్, సర్వింగ్ కోసం న్యూస్ పేపర్లను ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని వ్యాపారులను, వినియోగదారులను కోరింది. ఈ విషయంలో నిబంధనలను పర్యవేక్షించడానికి, అమలు చేయడానికి రాష్ట్ర ఆహార అధికారులతో ఎఫ్ఎస్ఎస్ఏఐ కలిసి పని చేస్తోంది. ఆహార పదార్థాలను ప్యాకింగ్, సర్వింగ్ చేయడానికి న్యూస్ పేపర్లను ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, ఆహార విక్రేతలను ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో కమల వర్ధనరావు గట్టిగా కోరారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఆహార పదార్థాల ర్యాపింగ్, ప్యాకేజింగ్ చేయడానికి న్యూస్ పేపర్లు ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన దీనివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. న్యూస్ పేపర్లలో ఉపయోగించే ఇంక్ ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగించే బయోయాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేసి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ప్రింటింగ్ ఇంక్‌లలో సీసం, ఇతర భారీ లోహాలతో సహా రసాయనాలు ఉండవచ్చని, ఇవి ఆహారంలో కలసి దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని వివరించింది. అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ వంటి వ్యాధికారక క్రిములు న్యూస్ పేపర్ల ద్వారా ఆహారంలోకి ప్రవేశించి అనారోగ్యాలకు కారణమవుతాయని తెలిపింది. కఠిన నిబంధనలు ఆహార పదార్థాల ప్యాకింగ్‌కి న్యూస్ పేపర్ల వాడకాన్ని నిషేధించే ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్) నిబంధనలు-2018ని నోటిఫై చేస్తూ న్యూస్ పేపర్లను ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించడాన్ని తక్షణమే నిలిపివేయాలని దేశవ్యాప్తంగా వినియోగదారులు, ఆహార విక్రేతలు, వాటాదారులను ఎఫ్ఎస్ఎస్ఏఐ కోరింది. సురక్షితమైన, ఆమోదించిన ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లతో పాటు ఫుడ్-గ్రేడ్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలని సిఫార్సు చేసింది. -
వంట నూనె ఒంటికి మంచిదా? ఎంతవరకు! ఐఐసీటీ మాజీ శాస్త్రవేత్త క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వంట నూనె వినియోగంపై భిన్న వాదనలు ఉన్నాయి. నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని కొందరు అంటారు. అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని మరికొందరు చెబుతుంటారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం వరకు గానుగ (కోల్డ్ ప్రెస్) నూనెనే ఎక్కువగా వినియోగించేవారు. క్రమంగా రిఫైన్డ్ (శుద్ధి చేసిన) ఆయిల్స్ మార్కెట్‌ను ఆక్రమించాయి. ప్యాకేజ్డ్ నూనెల వినియోగం పెరిగిపోయింది. కొన్నాళ్లకు శుద్ధి చేసిన నూనెలు మంచివి కావనే వాదన మొదలైంది. దీంతో మళ్లీ గానుగ నూనె వినియోగం మొదలైంది. అయితే గానుగ నూనెలే మంచివని, శుద్ధి చేసిన నూనెలు మంచివి కావన్న ప్రచారం ఏమాత్రం సరికాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అంటున్నారు. ‘అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకు 2 వేల వరకు కేలరీలు కావాలి. కష్టపడి పని చేసేవారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అయితే అందులో 25 నుంచి 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి..’అని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి నూనె మంచిది, ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 85 శాతం శుద్ధి చేసిన వంట నూనెలే.. ప్రస్తుతం ప్రపంచంలో వాడుతున్న వంట నూనెల్లో 85 శాతం శుద్ధి చేసినవే. రిఫైన్డ్ నూనెల్లో వాడే రసాయనాలు అన్నీ కోడెక్స్ (నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించే అంతర్జాతీయ సంస్థ) నిర్ధారించినవే. కోడెక్స్ సహా మన దేశంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఫారసు చేసిన హాని చేయని రసాయనాల్ని రిఫైనింగ్‌లో వాడుతున్నారు. కాబట్టి ఎలాంటి భయం లేకుండా రిఫైన్డ్ ఆయిల్స్ వాడుకోవచ్చు. అందులో విషం ఉంటుందనేది ఏమాత్రం నిజం కాదు. అంతేకాదు కొన్ని గింజల నుంచి గానుగ పద్ధతిలో నూనెను తయారు చేయలేం. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, కొబ్బరి, కుసుమ గింజలనే గానుగ చేసి నూనె తీయవచ్చు. కానీ పామాయిల్, సోయాబీన్ నూనెలను ఆ పద్ధతిలో తీయలేం. వాటిని రిఫైన్ చేయకుండా వాడలేం. ప్రపంచంలో మూడింట రెండో వంతు పామాయిల్, సోయాబీన్ నూనెలనే వాడతారు. మన దేశంలో ఏడాదికి 23 మిలియన్ టన్నుల నూనె వాడతారు. కానీ మనం 8 మిలియన్ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలినది దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి గానుగ నూనె అందరికీ ఇవ్వలేం. గానుగ నూనె మంచిది కాదని కూడా చెప్పడం లేదు. శుద్ధి చేసిన నూనెలు మంచివి కావని ప్రచారం చేయడమే తప్పు. ఎక్కువ రాదు కాబట్టి గానుగ నూనె ధర ఎక్కువ గింజలను గానుగ ఆడించినప్పుడు వాటి నుంచి నూనె మొత్తం రాదు. దాదాపు 25 శాతం చెక్కలోనే ఉండిపోతుంది. కాబట్టి వాటి ధర ఎక్కువ ఉంటుంది. ఇక శుద్ధి చేసిన నూనెలను తయారు చేసే కంపెనీలు పెద్దమొత్తంలో తక్కువ ధరకు ముడిపదార్థాలు కొంటాయి. పైగా యంత్రాలతో నూనె మొత్తాన్నీ తీస్తాయి. అందువల్ల వాటి ధర తక్కువగా ఉంటుంది. ఇక గానుగ చేసేందుకు వాడే గింజల్లో పుచ్చిపోయినవి ఉంటే వాటి నూనె విషంగా మారుతుంది. ఉదాహరణకు పుచ్చిపోయిన పల్లీలతో నూనె తీస్తే అందులో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. అయితే అవే గింజలను రిఫైన్ చేస్తే ఎఫ్లాటాక్సిన్ పోతుంది. అప్పుడు అది మంచిదవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే రిఫైన్డ్ నూనెల్లో కల్తీ జరుగుతుందని చెప్పడం నిజం కాదు. ఆమ్లాలు సమాన నిష్పత్తిలో ఉండాలి నూనెల్లో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడూ సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఈ మూడూ సమతూకంలో లేకపోతే అనేకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుండాలి. ఒమెగా–3 ఆమ్లాలు అన్ని నూనెల్లో ఉండవు. కేవలం సోయాబీన్, ఆవనూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉంటాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. కాబట్టి ఒమెగా–3 ఉన్న నూనెలను వాడనివారు, ఇతర నూనెలు వాడుతున్నవారు తప్పనిసరిగా అవిసె గింజలు దోరగా వేయించినవి రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి ఒమెగా–3 లభిస్తుంది. కానీ మన వద్ద నిత్యం చేపలు తినే పరిస్థితి ఉండదు. అలాగే అందరూ చేపలు తినరు. కాబట్టి ఆ ఆమ్లాలున్న నూనెలు వాడాలి. ఆలివ్‌నూనెలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 75 శాతం ఉంటాయి. సన్‌ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్లో 50 శాతం వరకు సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. నూనెల మిక్సింగ్ మంచిది రెండు అంతకంటే ఎక్కువ నూనెలను కలిపి వాడాలి. ఒక నూనెలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు సమాన నిష్పత్తిలో లేనప్పుడు, సమాన నిష్పత్తిలోకి తీసుకొచ్చేలా ఏవైనా రెండు అంతకంటే ఎక్కువ నూనెలు ఇంట్లోనే కలిపి వాడుకోవచ్చు. ప్రతి నూనె ప్యాకెట్ మీద ఆ మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తి ఉంటుంది. మూడు ఫ్యాటీ ఆమ్లాల నిష్పత్తితో పాటు నూనెల్లో అతి తక్కువ పరిమాణంలో ఉండే కొన్ని గామా ఒరిజినాల్, టోకోఫిరాల్స్ (విటమిన్–ఈ), పైటోస్టిరాల్ వంటి పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు రైస్బ్రాన్లో ఒరిజనాల్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల గుండెకు మేలు జరుగుతుంది. దాదాపు అన్నింటిల్లోనూ పైటోస్టిరాల్ ఉంటుంది. దీనికి కొలెస్టరాల్ తగ్గించే స్వభావం ఉంది. నువ్వుల నూనెలో సిసీమోల్, సిసీమోలిన్ అనే యాంటీæ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ లేబిలింగ్‌లో చూసుకోవాలి. ప్యాకింగ్‌పై ఉన్న అధికారిక సమాచారంతోనే దాన్ని వాడాలా లేదా తెలుసుకోవచ్చు. నూనె లూజ్‌గా అమ్మకూడదు లూజ్ ఆయిల్ అమ్మడం నిషేధం. చట్ట ప్రకారం నేరం. లూజ్ అంటే ప్యాక్ చేయకుండా కొలిచి అమ్మే నూనె. దీనిని కొనకూడదు. ప్యాకేజ్డ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకెట్లు, ప్లాస్టిక్ సీసాల్లో విక్రయించే నూనెలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉండాలి. పోషక విలువలు, కొలెస్ట్రాల్ వంటివి ఎంతున్నాయో ముద్రించాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉన్న బ్రాండెడ్ కంపెనీలవే వాడాలి. ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఉంటే బ్రాండెడ్ కంపెనీల నూనెలనైనా కొనకూడదు. సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకోవాలి. గడువు తేదీ కూడా చూసుకోవాలి. లైసెన్స్ లేకున్నా, నిబంధనల ప్రకారం నూనె ప్యాకెట్లపై వివరాలు లేకున్నా ఎఫ్ఎస్ఎస్ఏఐ టోల్ ఫ్రీ నంబర్ (1800112100) కు ఫోన్ చేయవచ్చు. -
ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవోగా కమల వర్ధన రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నూతన సీఈవోగా ఐఏఎస్ అధికారి జి.కమల వర్ధన రావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఎండీగా ఉన్నారు. 1990 బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన కమల వర్ధన రావు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు విభాగాలకు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. కేరళ టూరిజం సెక్రటరీగానూ పనిచేశారు. చదవండి: అలర్ట్: ఆధార్ కార్డ్ వినియోగంపై కీలక మార్గదర్శకాలు విడుదల! -
ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు చట్టబద్ధమే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పండ్లను పక్వానికి వచ్చేలా చేసేందుకు ఎథిఫాన్, ఎన్‌రైప్‌ల వినియోగానికి అనుమతిస్తూ ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జారీచేసిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. అనేక పరిశోధనల తర్వాత ఎథిఫాన్, ఎన్‌రైప్ రసాయనాలు ప్రమాదకరం కాదనే విషయం తేలడంతో వాటి వినియోగానికి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఎథిఫాన్, ఎన్‌రైప్ వినియోగానికి అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులు కొట్టేయాలంటూ కాలేజ్ ఆఫ్ పోస్టుగాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ నళిన్ వెంకట్ కిషోర్ కుమార్‌తోపాటు రిటైర్డ్ ఉద్యోగి ఎల్.రమేశ్‌బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, మరో రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘‘పండ్లను మగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్‌రైప్’వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎన్‌రైప్ ద్వారా కూడా ఎథిలీన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఎన్‌రైప్‌ను మాత్రమే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. పరిశోధనలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎథిఫాన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఎన్‌రైప్‌ను వినియోగించాలని కోరుతోంది. ఎథిఫాన్‌ను విక్రయించరాదని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’’అని ధర్మాసనం పేర్కొంది. -
‘పొగాకు నమలడం’ ఆహార నిర్వచనం పరిధిలోకి రాదు
సాక్షి, అమరావతి: ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్ఎస్ఎస్ఏ) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన కిందకు రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. పొగాకును ఆహారంగా ఉపయోగించడంగానీ, ఆహారంగా మానవ వినియోగం నిమిత్తం తీసుకోవడంగానీ జరగదని.. పోషకాహారంగా కూడా స్వీకరించరని స్పష్టంచేసింది. పొగాకు నమలడంవల్ల వచ్చే ఓ రకమైన థ్రిల్ కోసం, ఉత్తేజం కోసమే దానిని ఉపయోగిస్తారని తెలిపింది. అందువల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టంలోని సెక్షన్–3(1)(జే) ప్రకారం పొగాకు నమలడం ‘ఆహారం’ నిర్వచన పరిధిలోకి రాదని తెలిపింది. చూయింగ్ గమ్‌ను ఆహార నిర్వచన పరిధిలో చేర్చిన పార్లమెంట్.. పొగాకు నమలడాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆహారం కింద చేర్చలేదని వెల్లడించింది. మానవ వినియోగానికి పనికొచ్చే దానినే పార్లమెంట్ ఆహారంగా పేర్కొందని గుర్తుచేసింది. పొగాకు ఎన్నటికీ మానవ వినియోగానికి పనికిరాదని హైకోర్టు తెలిపింది. అందువల్ల నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అక్రమ నిల్వ, అమ్మకాలు చేపట్టినందుకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టంతో పాటు పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నిషేధ చట్టం (సీఓటీపీఏ), ఐపీసీ చట్టాల కింద కేసు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలా ఈ చట్టాల కింద పలువురిపై పోలీసులు నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టేసింది. నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు, నిల్వ తదితరాలతో పాటు అక్రమంగా మద్యం, గంజాయి రవాణా చేసినందుకు మరికొందరిపై నమోదు చేసిన కేసులను హైకోర్టు పాక్షికంగా కొట్టేసింది. కానీ, ఏపీ ఎక్సైజ్ చట్టం కింద, ఎన్డీపీఎస్ చట్టాల కింద దర్యాప్తు కొనసాగించవచ్చునని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మూడ్రోజుల క్రితం తీర్పు వెలువరించారు. 130 పిటిషన్లు దాఖలు నిషేధిత పొగాకు ఉత్పత్తుల తయారీ, రవాణా, అమ్మకాలు, నిల్వ, సరఫరా, పంపిణీతో పాటు గంజాయి రవాణా, అమ్మకాలు, అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా పలువురిపై పోలీసులు ఐపీసీ, ఎఫ్ఎస్ఎస్ఏ, సీఓటీపీఏ, ఏపీ ఎక్సైజ్ చట్టంతో పాటు ఎన్డీపీసీఎస్ చట్టాల కింద కేసులు నమోదుచేశారు. తమపై పోలీసులు నమోదు చేసిన ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ సదరు వ్యక్తులు హైకోర్టులో దాదాపు 130 పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తాజాగా తీర్పునిస్తూ.. ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం పొగాకు నమలడం ఆహార నిర్వచన పరిధిలోకి రాదని, ఇదే విషయాన్ని మన హైకోర్టుకు చెందిన బెంచ్‌లు వేర్వేరుగా ఇప్పటికే తీర్పునిచ్చాయన్నారు. అయితే, ఇటీవల మరో సింగిల్ జడ్జి మాత్రం పొగాకు నమలడం ఆహారం కిందకు వస్తుందంటూ తీర్పునిచ్చారని, ఈ తీర్పుతో తాను ఏకీభవించడం లేదన్నారు. పొగాకు నమలడం ఆహారం కిందకు రాదంటూ పిటిషనర్లపై పోలీసులు ఎఫ్ఎస్ఎస్ఏ, సీఓటీఏపీ తదితర చట్టాల కింద నమోదు చేసిన కేసులను కొట్టేశారు. -
ఇకపై వాటిని మిల్క్ అంటే కుదరదు! ఫుడ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక!!
ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్లాంట్లలో తయారవుతున్న బేవరేజెస్‌ని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొనడంపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్నెర్ర చేసింది. ఇకపై వాటిని మిల్క్ ప్రొడక్టులు అంటూ పేర్కొంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఫుడ్ సేఫ్టీ కి ఫిర్యాదులు మార్కెట్లో సోయా మిల్క్, బాదం మిల్క్, కోకోనట్ మిల్క్ ఇలా రకరకాల ఫ్లేవర్లలో కూల్‌డ్రింక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూల్‌డ్రింక్‌ల తయారీలో నిజానికి డెయిరీలలో తయారయ్యే పాలను ఉపయోగించరు. కానీ మార్కెటింగ్ చేసేప్పుడు మాత్రం మిల్క్ ప్రొడక్ట్‌లుగా అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై డెయిరీ సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. దీంతో విచారణ చేపట్టిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ మిల్క్ ప్రొడక్టుల పేరుతో బేవరేజెస్ అమ్ముతున్న ఆయా కంపెనీలపై కన్నెర్ర చేసింది. 15 రోజుల్లోగా మార్చేయండి మిల్క్ ప్రొడక్టుల పేరుతో మార్కెట్లో బేవరేజ్పై ‘మిల్క్ పొడక్టు’ అంటూ ఉన్న అక్షరాలను తీసేయాలని, లేదంటూ కొత్త లేబుళ్లు అంటించుకోవాలని ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. కేవలం పదిహేను రోజుల్లోగా ఈ మార్పులు చేపట్టాలని తేల్చి చెప్పింది. సెప్టెంబరు 3 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుందని పేర్కొంది. భవిష్యత్తులో ఈ ప్రొడక్టులపై మిల్క్ అని ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే ఆన్లైన్లో అమ్ముడవుతున్న బేవరేజెస్‌ను మిల్క్ ప్రొడక్టుల కేటగిరీలో చూపొద్దంటూ ఈ కామర్స్ సంస్థలకు ఆదేశాలు అందాయి. గడువు పెంచండి ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న ఉత్పత్తులపై మిల్క్‌ను తొలగిస్తామని కానీ ఇప్పటికే ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్లిపోయిన ప్రొడక్టుల విషయంలో ఫుడ్ సేఫ్టీ తీర్పు అమలు చేయడం కష్టమని ఈ వ్యాపారంలో ఉన్న సంస్థలు అంటున్నాయి. తమకు గడువు పెంచాలని లేదంటే మార్కెట్లో ఉన్న ప్రొడక్టులను ఈ ఆదేశాల నుంచి మినహాయించాలని కోరుతున్నాయి. లేదంటే తమకు కోట్లలో నష్టం వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాయి. స్పష్టత కావాలి ఫ్యాక్టరీలో తయరయ్యే వస్తువులకు మిల్క్ ప్రొడక్టులు పేర్కొనడం వల్ల తమకు నష్టం వస్తోందని డెయిరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్రమంగా ఈ బేవరేజేస్ మార్కెట్ దేశంలో విస్తరిస్తోందని, ఇప్పుడే ‘ మిల్క్ ప్రొడక్ట్ ’ విషయంలో స్పష్టత తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టం తప్పదనే అంచనాతో డెయిరీలో కఠినంగా వ్యవహారించాయి. మనదేశంలో మిల్క్ ప్రొడక్టుల పేరుతో అమ్ముడవుతున్న బేవరేజేస్ మార్కెట్ విలువ రూ. 185 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. చదవండి: ‘హారన్’ మోతను మార్చే పనిలో కేంద్రం.. ఇక చెవులకు వినసొంపైన సంగీతంతో! -
‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆహార వ్యాపార సంస్థలు ఇకపై తమ ఇన్వాయిస్లు, బిల్లుల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు నంబరు లేదా రిజిస్ట్రేషన్ నంబరును తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట సమాచారం లేకపోవడం వల్ల చాలా మటుకు ఫిర్యాదులు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. తాజా పరిణామంతో నిర్దిష్ట ఎఫ్ఎస్ఎస్ఏఐ సంఖ్యతో ఆహార వ్యాపార సంస్థపై వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడానికి వీలవుతుందని తెలిపింది. ‘‘లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికారులు ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అక్టోబర్ 2 నుంచి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ఆహార వ్యాపార వ్యవస్థ చాలా భారీగా ఉంటుందని, ఆపరేటర్లకు కేటాయించే 14 అంకెల ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరు అంత సులభంగా కనిపించకపోవచ్చని, అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఫలితంగా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలంటే వినియోగదారుకు చాలా కష్టసాధ్యంగా ఉంటుందని పేర్కొంది. నియంత్రణ సంస్థలు సైతం సదరు ఫిర్యాదు మూలాలను గుర్తించి, సత్వరం పరిష్కరించడానికి సాధ్యపడటం లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ప్యాకేజ్డ్ ఆహార ఉత్ప్తతులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబరును తప్పనిసరిగా ముద్రించాల్సి ఉంటున్నప్పటికీ.. రెస్టారెంట్లు, మిఠాయి షాపులు, కేటరర్లు, రిటైల్ స్టోర్స్ వంటివి పాటించడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
తాగునీటిలో కాల్షియం తప్పనిసరి
సాక్షి, అమరావతి: దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్ వాటర్‌కు సంబంధించి జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ప్యాకింగ్ చేసి విక్రయించే లీటర్ మంచి నీటిలో 20 మిల్లీ గ్రాముల కాల్షియం, 10 మిల్లీ గ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. శుద్ధి చేసిన నీటి పేరుతో ఆ నీటిలో శరీరానికి ఉపయోగపడే ఖనిజ లవణాలను కూడా తొలిగిస్తున్నారని, అలా కాకుండా ఆరోగ్యానికి మంచి చేసే ఖనిజ లవణాలు నీటిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఎఫ్ఎస్ఎస్ఏఐని కోరింది. ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా మంచి నీటిని శుద్ధి చేయడానికి వీలుగా ప్లాంట్లలో మార్పులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సమయం ఇచ్చింది. దీంతో ఆక్వాఫినా, హిమాలయన్, బైలే, రైల్‌నీర్, ఆక్సీరిచ్, టాటా వాటర్ వంటి ప్రముఖ బ్రాండ్లన్నీ ఈ నిబంధనలకు అనుగుణంగా జనవరి1 నుంచి మంచినీటిని మార్కెట్లోకి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. కోకోకోలా (కిన్లే) ఇప్పటికే కొత్త నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ నీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. 55% యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే.. దేశీయ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,000 కోట్ల లీటర్ల నీటి విక్రయాలు జరుగుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం..దేశవ్యాప్తంగా 6,000కు పైగా మినరల్ వాటర్ తయారీ సంస్థలుండగా వీటిలో 55 శాతం యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రెండు లీటర్లు, లీటర్, అర లీటర్, పావు లీటర్తోపాటు 15, 20 లీటర్ల బాటిల్స్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా 42 శాతం అమ్మకాలు లీటర్ బాటిల్స్వి కాగా, ఆ తర్వాతి స్థానంలో అరలీటర్, పావులీటర్ల బాటిల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమ విలువ రూ.26 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్యాకేజ్డ్ తాగునీటిలో ఉండాల్సినవి లీటర్‌కు -
విత్తన పరిశ్రమ విరాళం రూ.9 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) సభ్య కంపెనీలు రూ.9 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మొత్తంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.1.97 కోట్లు అందించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్‌కు రూ.2.44 కోట్లు విరాళం ఇచ్చాయి. పీపీఈ, ఆహార పంపిణీ, అవగాహన కార్యక్రమాలకు మిగిలిన మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. సభ్య కంపెనీలైన మహీకో, రాశి, సింజెంటా, క్రిస్టల్, కోర్టెవా కంపెనీలు ఒక్కొక్కటి రూ.1 కోటి ఖర్చు చేస్తున్నాయి. బీఏఎస్ఎఫ్, బేయర్, బయోసీడ్, ఎంజా జేడెన్, హెచ్ఎం క్లాస్, ఐఅండ్‌బీ, జేకే, కలాశ్, నిర్మల్, నోబుల్, ర్యాలీస్, రిజ్వాన్, సీడ్‌వర్క్స్, సవాన్నా, టకీ, టకీట కూడా సాయానికి ముందుకు వచ్చాయి. కాగా, మొత్తంగా బేయర్ ఇండియా రూ.7.2 కోట్లు, డీసీఎం శ్రీరామ్ రూ.10 కోట్లు, జేకే గ్రూప్ రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాయి. -
స్వీట్స్ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి పదార్థాలను దుకాణదార్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధన అమలు చేయాల్సిందిగా ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది.