మ్యాగీ నూడుల్స్‌పై సుప్రీం కోర్టుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ నిషేధ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నెస్లే ఇండియాను.. సమస్యలు మళ్లీ చుట్టుముడుతున్నాయి. మ్యాగీ నూడుల్స్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులివ్వడాన్ని సవాలు చేస్తూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.. తాజాగా సుప్రీం కోర్టుకు వెళ్లింది. పరీక్షల కోసం ల్యాబరేటరీలకు కంపెనీ ఇచ్చిన శాంపిల్స్ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసింది.
పైగా.. తాజా శాంపిల్స్‌ను అందించే పనిని హైకోర్టు తటస్థ సంస్థకు కాకుండా వాటిని తయారు చేసే నెస్లే అప్పగించడాన్ని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన పిటీషన్‌లో సవాలు చేసింది.