మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది. గడువు తీరిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేయాల్సి అవసరం ఉందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అంగీకరించకపోడంతో సుప్రీంను ఆశ్రయించినట్టు పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రాలతో, జస్టిస్ సి నాగప్పన్ లతో కూడిన బెంచ్ ముందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఇది గతంలో హైకోర్టులో నెస్లే లేవనెత్తిన సమస్యే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి వాయిదా వేశారు.