outdated
-
India Mobile Congress 2023: కాంగ్రెస్.. కాలం చెల్లిన ఫోన్
న్యూఢిల్లీ: 2014 అనేది కేవలం ఒక తేదీ కాదని, దేశంలో అదొక పెనుమార్పు అని ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన ఫోన్‌గా అభివరి్ణంచారు. 2014లో దేశ ప్రజలు ఆ ఔట్‌డేటెడ్ ఫోన్‌ను వదిలించుకున్నారని, ఇండియా దశ దిశ మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కాలం తీరిన ఫోన్లలో ఎన్నిసార్లు బటన్లు నొక్కినా, స్తంభించిన స్క్రీన్‌ను ఎన్నిసార్లు తట్టినా ఎలాంటి ఫలితం ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రీస్టార్ట్ చేసినా, చార్జింగ్ పెట్టినా, బ్యాటరీ మార్చినా ఆ ఫోన్ పనిచేయదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. పనికిరాని ఫోన్ తరహాలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. అలాంటి సమయంలో దేశానికి సేవ చేసే అవకాశాన్ని ప్రజలు తమకు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు. గతంలో మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతిదారుగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన దేశంలోనే ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. భారత్‌లో 5జీ మొబైల్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని, ఇక 6జీ సరీ్వసులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1న 5జీ టెక్నాలజీని ప్రారంభించామని, దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2జీ సేవల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న టెలికాం స్పెక్ట్రం కుంభకోణాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 4జీ సేవలను తీసుకొచ్చిన తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 6జీ టెక్నాలజీలో ప్రపంచాన్ని మనమే ముందుకు నడిపిస్తామన్న విశ్వాసం తనకు ఉందన్నారు. దేశవ్యాప్తంగా 100 ‘5జీ ల్యాబ్‌లు’ యూపీఏ సర్కారు పాలనలో మొబైల్ ఫోన్ల తయారీ రంగాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైన్ఫోన్ల తయారీదారుగా మారిందని అన్నారు. అలాగే ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని తెలియజేశారు. ఇండియాలో తయారైన ఫోన్లను ప్రపంచమంతటా ఉపయోగిస్తుండడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో మన దేశం ఏడాది వ్యవధిలోనే 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరిందని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానం, వేగంతో ప్రజల జీవనం సులభతరం అవుతోందన్నారు. విద్య, వైద్యం, టూరిజం, వ్యవసాయం వంటి రంగాల్లో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి సమాజంలో ఒక్కరికీ చేరాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడి, వనరులు, సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల కోసం దేశవ్యాప్తంగా త్వరలో 100 ‘5జీ ల్యాబ్‌లు’ అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. -
అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు
‘‘సెన్సార్ బోర్డ్ రూల్ ప్రకారం చూస్తే ఏ సినిమా కూడా విడుదల కాదు. సెన్సార్ వాళ్లు అన్ని రూల్స్‌ను నా సినిమా మీదే ప్రయోగిస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఓటు వేసి మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమా చూడాలో? చూడకూడదో తెలియదా? ఆ విషయాన్ని ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్లు చూసి చెప్పాలా? నా దృష్టిలో సెన్సార్ అనేది అవుట్ డేటెడ్’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ కారణాల వల్ల కాలేదు. ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా మార్చారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఏ కులాన్ని, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను. ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను.. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. చిత్ర సహనిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ –‘‘మా సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్ 14న సెన్సార్‌కి పంపించాం. ఎలాంటి కారణం చూపకుండా సెన్సార్ వారు ఇంతవరకూ సినిమా చూడలేదు. అందుకే కోర్టును ఆశ్రయించడంతో వారంలోపు సినిమా చూసి, ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. ఎవర్నీ కించపరిచేలా ఉండదు’’అన్నారు అజయ్ మైసూర్. ఈ చిత్రానికి సహ నిర్మాత: నట్టి కరుణ. -
74 శాతం ఏటీఎంల పరిస్థితి అంతే..!
న్యూఢిల్లీ : ఏటీఎంలలో ఈ మధ్య పెద్ద ఎత్తున్న మోసాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మోసాలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం అవి అవుట్ డేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేయడమేనట. దేశంలో కనీసం 74 శాతం ఏటీఎంలు అవుట్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తున్నాయని, దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 25 శాతం మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏటీఎంలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల అసమర్థతపై తలెత్తిన ప్రశ్నలు సందర్భంగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. 75 శాతం వరకు ఏటీఎంలు అన్సపోర్టెడ్ సాఫ్ట్‌వేర్‌తో నగదును పంపిణీ చేస్తున్నాయని.. దీంతో మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపింది. దేశంలో చాలా వరకు ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే ఉన్నాయని, 89 శాతం వాటికి చెందినవేనని పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఏటీఎంలలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు విపరీతంగా అందినట్టు కూడా చెప్పింది. రిజర్వు బ్యాంక్ వద్ద పలు ఫిర్యాదులు దాఖలైనప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఇంకా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం లేదు. గత నెలలో ఆర్బీఐ ఓ అడ్వయిజరీ నోట్‌ను సైతం జారీ చేసింది. నగదును సరఫరా చేసే సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు కాలంలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు మోసాలపై అథారిటీల వద్ద 25వేల వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మధ్యన హ్యాకర్లు కొత్త కొత్త పద్ధతులతో హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. వీటి నుంచి బయటపడటానికి బ్యాంకులు తమ సిస్టమ్‌లను పూర్తిగా అప్టూడేట్ చేయాల్సి ఉంది. -
నూడుల్స్ ధ్వంసానికి సుప్రీంను ఆశ్రయించిన నెస్లే
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది. గడువు తీరిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేయాల్సి అవసరం ఉందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అంగీకరించకపోడంతో సుప్రీంను ఆశ్రయించినట్టు పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రాలతో, జస్టిస్ సి నాగప్పన్ లతో కూడిన బెంచ్ ముందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది గతంలో హైకోర్టులో నెస్లే లేవనెత్తిన సమస్యే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి వాయిదా వేశారు. -
కాలంచెల్లిన మైనింగ్లను గుర్తించండి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో కాలంచెల్లిన మైనింగ్ ప్రాంతాలను గుర్తించి పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపించాలని గనులు, భూగర్భశాఖ రాష్ట్ర సంచాలకులు బీఆర్వీ సుశీల్‌కుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మైనింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గుర్తించిన 32 పెద్దతరహా గనులకు జియో కోఆర్డినేట్ ద్వారా లొకేషన్ ఇవ్వాలని, ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు. రసీదులు, నిధుల కేటాయింపువంటి అంశాలపై రికన్సిలేషన్ చేసి రిపోర్టును పంపాలన్నారు. అలాగే ఏజీ ఆడిట్‌కు సంబంధించి ఒక ప్యారా పెండింగ్‌లో ఉందని, దాన్ని సరిచేసి రిపోర్టును వారంలోపు పంపించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో మైనింగ్ సర్వేయర్ రామలింగయ్య, రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లు హాజరయ్యారు. -
డొక్కు డొక్కు
కాలం చెల్లిన బస్సులు.. రోడ్లపై చక్కర్లు ఆర్టీసీ నిర్వాకంతో తరచూ ప్రమాదాలు ప్రయాణికుల ప్రాణాలు గాల్లో 618 బస్సుల్లో 160 కాలం డొక్కువే.. నెలన్నర వ్యవధిలోనే ఐదు బస్సు ప్రమాదాలు ప్రయాణికుల బెంబేలు డొక్కు బస్సులతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. కాలం చెల్లిన బస్సులు రోడ్లపై చక్కర్లు కొడుతుండడంతో అవి ఎప్పుడు?.. ఎక్కడ?.. ప్రమాదానికి గురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. గత్యంతరం లేక చాలాచోట్ల డొక్కు బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ‘సురక్షితంగా గమ్యానికి చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలి’... అనే మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఆచరణలో మాత్రం ఆర్టీసీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. డొక్కు బస్సులను యథేచ్ఛగా రోడ్లపై తిప్పుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నెలన్నర వ్యవధిలోనే ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీరు మారకపోతే ఆర్టీసీకి ప్రయాణికులు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. మెదక్: కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. నెలన్నర రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఐదు బస్సు ప్రమాదాలు జరిగాయి. ఇందులో రెండు బస్సులు కాలం చెల్లినవి కావడం గమనార్హం. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, దుబ్బాక డిపోలకు గాను మొత్తం 618 బస్సులు ఉన్నాయి. ఇందులో 176 అద్దెబస్సులుండగా, సంస్థకు చెందినవి 442 బస్సులున్నాయి. ఆర్టీసీకి చెందిన 442 బస్సుల్లో 160 బస్సులు కాలం చెల్లినవి కాగా మిగతా 282 బస్సులు మాత్రమే కండిషన్లో ఉన్నాయి. నిబంధనలు ఇలా... నిబంధనల ప్రకారం 7.50 లక్షల కిలోమీటర్లు తిరిగిన డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను, 6.50 లక్షల కిలో మీటర్లు తిరిగిన సూపర్ లగ్జరీ బస్సులను ఆర్డీనరీ బస్సులుగా మారుస్తారు. 12లక్షల కిలో మీటర్లు తిరిగిన ప్రతి బస్సు కాలం చెల్లినట్టుగా గుర్తిస్తారు. జిల్లాలో ఇప్పటికే 160 ఆర్డీనరీ బస్సులు కాలం చెల్లినవి ఉండగా వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. తరచూ ప్రమాదాలు... డొక్కు బస్సులను తిప్పడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. రోడ్డుపై వెళ్లాల్సిన బస్సులు అదుపుతప్పి పక్కకు తిరుగుతున్నాయి. నెలరోజుల్లో జిల్లాలో నాలుగు బస్సు ప్రమాదాలు జరిగాయి. అందులో 50మంది వరకు గాయపడగా, ఒకరు మృతి చెందారు. కేవలం కాలం చెల్లిన బస్సులను నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. – గత మే 20వ తేదీన సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్డీనరీ బస్సు (నం.ఏపీ28జెడ్409) సంగారెడ్డి నుంచి మెదక్‌కు సుమారు 45మంది ప్రయాణికులతో బయల్దేరింది. మెదక్ పట్టణానికి 13కిలో మీటర్ల దూరంలో ఉండగా కొల్చారం మండలం పొతన్‌శెట్టిపల్లి గ్రామ శివారులో చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మెదక్ మండలం పేరూర్‌కు చెందిన భూలక్ష్మి కాలు బస్సులోనే తెగిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మరో ఐదుగురు రమావత్ కిషన్, సాలి, విఠల్, అజ్మిర, పద్మజా తలలు పగిలి తీవ్ర గాయాలు కాగా, 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. – ఇదే నెలలో చేగుంట మండలం 44వ జాతీయ రహదారిపై వల్లూరు శివారులోగల నర్సరీ సమీపంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. – కౌడిపల్లి మండలం రాయిలాపూర్ గేటు సమీపంలో మెదక్–నర్సాపూర్ ప్రధాన రహదారిపై మెదక్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు మెదక్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు కిందికి వెళ్లి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. – అదే నెలలో నర్సాపూర్–తూప్రాన్ ప్రధాన రహదారిపై గజ్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హన్మంతాపూర్ వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. – రామాయంపేట శివారులో సైతం జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లాకు చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనగా 20మంది గాయపడ్డారు. ఇలా కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో ఐదు బస్సు ప్రమాదాలు చోటుచేసుకోగా, రెండింటిలో కాలం చెల్లినవి కావడంతోనే జరిగినట్లు ప్రమాద స్థలంలో డ్రైవర్లు తెలిపారు. గ్యారేజీలో ఉండాల్సిన బస్సులు రోడ్లపై తిరుగుతోండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులతో నడిపిస్తున్నాం... జిల్లాలో 160 పల్లె వెలుగు బస్సులు కాలం చెల్లినవి ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ నడిపిస్తున్నాం. ప్రభుత్వం 1,200 బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. అందులో వందకుపైగా బస్సులు జిల్లాకు రానున్నాయి. అవి వస్తే జిల్లాలో బస్సుల కొరత ఉండదు. నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు సైతం వారి అభివృద్ధి నిధుల నుంచి ఆర్టీసీ డిపోల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధులు వస్తే డిపోలు మరింత అభివృద్ధి చెందుతాయి. – రఘునందన్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, సంగారెడ్డి -
కాలం చెల్లిన వంటనూనెతో పలువురికి అస్వస్థత
మంచాల: కాలంచెల్లిన వంటనూనెతో చేసిన ఆహార పదార్థాలు తిని.. పలువురు అస్వస్థతకు గురైన సంఘటన మంచాలలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నారెడ్డి విజయ్‌భాస్కర్ ఇంట్లో ఓ శుభకార్యం ఉండడంతో శ్రీగణేష్ సూపర్మార్కెట్లో దుకాణంలో గోల్డెన్ ప్యూర్ కంపెనీ పేరుతో ఉన్న మంచినూనె ప్యాకెట్లను ఆదివారం కొన్నాడు. వీటితో ఆహార పదార్ధాలు తయారుచేశారు. అయితే భోజనం చేస్తున్న సమయంలోనే ఓ రకమైన వాసన వచ్చిందని తెలిపారు. అప్పటికే అన్నం తిన్న ఐదారుగురు వాంతులు చేసుకోవడంతో.. ఇదేమిటా? అని పరిశీలించారు. తేదీ దాటిపోయిన నూనెను వాడడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకున్నారు. 2015 ఆగస్టు 8న ప్యాక్ చేసిన నూనెను 6 నెలలలోపే విక్రయించాలి. కానీ 10 నెలలు దాటిన నూనెను వ్యాపారి తమకు అంటగట్టాడని విజయ్‌భాస్కర్ మండిపడ్డారు. ఈ విషయమై దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మంచాల సీఐ గంగాధర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వచ్చి సూపర్మార్కెట్లో పరిశీలించగా పది నెలల కాలం దాటిన ఆయిల్ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు సీఐ తెలిపారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.