need
-
పంజాబ్‌లో ‘ఉచిత రేషన్’ ఎలా అందిస్తున్నారు?
రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది. పంజాబ్‌లో ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. మొదటి దశలో పంజాబ్‌లోని 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమ పిండిని ఉచితంగా అందజేస్తారు. మిగిలిన రేషన్ సరుకులను దఫదఫాలుగా అందించనున్నారు. పంజాబ్‌లో 38 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 20, 500 ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,500 మందికి పైగా యూత్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. మొదటి దశలో 25 లక్షల కుటుంబాలకు రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నెలా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందుకోవచ్చు. లబ్ధిదారులు గోధుమపిండి స్థానంలో ఇతర అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు లబ్ధిపొందవచ్చు. -
10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం!
మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అవమానాలు కూడా ఎదురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ 10 అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చిపెడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సమయం, శక్తి వృథా: మీకు అవసరం లేని చోటికి వెళ్లడం వలన లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ విలువైన సమయం, శక్తి వృథా అవుతాయి. దీనికి బదులుగా మీ నైపుణ్యాలను అవసరమయ్యే విషయాలపైనే కేంద్రీకరించండి. తద్వారా మీ శక్తిసామర్థ్యాలు సద్వినియోగం అవుతాయి. 2. గుర్తింపునకు దూరం కావడం: మీరు అవసరం లేని చోటికి వెళ్లినప్పుడు, లేదా మీ సామర్థ్యాన్ని అనవసరం లేని విషయాలపై కేంద్రీకరించినప్పుడు మీకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీకు సహకారం అందకపోగా, మీ గుర్తింపు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. 3. ఇతరుల వ్యక్తిగతాల్లోకి తొంగిచూడటం: మీకు అవసరం లేనప్పుడు ఇతరుల వ్యక్తిగతాల్లోకి చొరబడకపోవడమే ఉత్తమం. ఇతరుల వ్యక్తిగతాలను గౌరవించండి. ఎదుటివారు మీ సహాయం కోసం ప్రత్యేకంగా అడగనంత వరకు వారి వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లకండి. 4. ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కడం: మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కే ప్రయత్నం చేయకండి. వారి నైపుణ్యాలపై నమ్మకం ఉంచండి. వారి బాధ్యతలను వారు స్వతంత్రంగా నిర్వహించేలా చూడండి. ఇందుకు అవసరమైతేనే సహకారం అందించండి 5. ఉనికికే ప్రమాదం: మీరు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుని, ఇతరులు మీ ఉనికిపై ఆధారపడే భావాన్ని వారిలో కల్పించవద్దు. ఇది ఇతరుల ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే వారు తమ స్వంత నైపుణ్యాలను, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి బదులు మీపై ఆధారపడే స్వభావాన్ని ఏర్పరుచుకోవచ్చ. తద్వారా మీ ఉనికికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. 6. లక్ష్యానికి దూరం కావడం: మీరు అవసరం లేని విషయాలలో అతిగా జోక్యం చేసుకుంటే మీ ఆసక్తులు, లక్ష్యాలకు దూరమై అన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం, మీకు నిజమైన ప్రయోజనాలను అందించగల ప్రయత్నాలను కొనసాగించడం ఎవరికైనా చాలా అవసరం. 7. అతిశయోక్తులకు దూరంగా ఉండటం: మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవడం, వర్ణించుకోవడం వలన మీ అత్యవసరాలను, శ్రేయస్సును నిర్లక్ష్యం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన పనితీరు, జీవిత సమతుల్యతను కాపాడుకునేందుకు మనం ఏమిటో మనం తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. 8. వనరుల దుర్వినియోగం: మీరు మీ దగ్గరున్న వనరులను మీకు అవసరం లేని అంశాలపై మళ్లించినప్పుడు.. అది సమయం అయినా, డబ్బు అయినా వృథాకు దారితీస్తుంది. మీ దగ్గరున్న వనరులను ద్విగుణీకృతం చేసుకునేందుకు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. 9. కార్యకలాపాలకు అంతరాయం: మీరు లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ కార్యకలాపాలకు, ఇతరుల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. మీరు కోరుకునే మార్పు, మెరుగుదల కోసం ఇప్పటికే ఉన్న ప్రక్రియలను కొనసాగించాలి. సంబంధిత ప్రోటోకాల్‌లను గౌరవించడం కూడా అవసరమే. 10. చివరికి మిగిలేది: మీరు అవసరం లేని విషయాల్లో తరచూ జోక్యం చేసుకోవడం వల్ల అది నిరాశకు దారితీస్తుంది. మీ ప్రయత్నాలను అనవసరమైన విషయాలపై పెట్టి, సమయం వృథా చేసుకోకుండా, విలువైన, అర్ధవంతమైన మార్పును కలిగించగల అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు -
మంచి మాట: అన్వేషణ ఏమిటి? ఎందుకు?
అన్వేషణ ఓ సాహసకృత్యం, ప్రయాణం, వేట, డేగ కన్ను, లోచూపు. ఒక కొత్తపుంత, అద్భుత సృజన, చింతన, సత్యశోధన, నిత్యసాధన, తపన. జ్ఞాన సముపార్జన. అన్వేషణ ఒక జీవిత పోరాటం. అన్వేషణ జీవితంలో అతి ముఖ్యమైన అంతర్భాగం. ప్రతి ప్రాణికి తప్పనిది, తప్పించుకో లేనిది. అయితే దీనిలో స్థాయీభేదముంటుంది. దీన్నే దృష్టి అంటాం. ఇది ఎవరి కెలా ఉంటుందనేది వారి వారి జీవిత నేపథ్యం, భౌగోళిక, సామాజికాంశాలతో పాటు చదువుల సారం మీద కూడ ఆధారపడుతుంది. హృదయ సంస్కారం కూడ ఈ అన్వేషణలో చేర్చతగ్గ ముఖ్యాంశమే. మన ఉనికికి భౌతికరూపమైన ఈ శరీరాన్ని పోషించుకునేందుకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునే యత్నంతో అన్వేషణ ప్రారంభమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అత్యంతావశ్యకమైనది. పక్షులు సైతం తమ పిల్లలకోసం ఆహారాన్ని సంపాదించి నోటిలో పెట్టటం సాధారణ దృశ్యం. ఆదిమానవుడు ప్రకృతి, సూర్యోదయ, చంద్రోదయాలను, మెరుపులను ఉరుముల శబ్దాన్ని రుతు మార్పులను చూసి, జంతువులను చూసి ఎంతగానో భయపడ్డాడు. క్రమేణా భయాన్ని వీడుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఈ మార్పులు సహజమన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. జీవితం నేర్పిన ఈ జ్ఞానం అతడికి ఆలోచనా శక్తినిచ్చింది. ఇదీ ఒక అన్వేషణే. ఎంతో గొప్పదైనది. మానవ సమూహాల సంఖ్య పెరిగిన కొద్దీ అహారవసరాలు పెరిగాయి. నివాసాల అవసరాలు వచ్చాయి. ఇది వ్యవసాయానికి, ఇళ్ల నిర్మాణానికి దారి తీసాయి. మనిషి భయం, అవసరం అతడిని కొత్త మార్గాలను, పద్ధతులను కనిపెట్టేటట్టు చేసింది. చేస్తూనే ఉంటుంది. ఇది మనిషికి ఉన్న ఆలోచనా శక్తి వల్ల వచ్చింది. మనిషికున్న ఈ అన్వేషణా మేధ ఎప్పటికప్పుడు నూతన ఒరవళ్ళకు శ్రీకారం చుడుతూనే ఉంటుంది. ‘అవసరం’ అన్వేషణను ప్రేరేపించే అంశాలలో మొట్టమొదటిది. రెండవది ‘ఆసక్తి లేదా ‘జిజ్ఞాస.’ మనిషికి ఉత్సకత ఉండాలి. ఇది ప్రశ్నించేటట్టు చేస్తుంది. ప్రతిదాన్ని నిశితంగా, లోతుగా చూసే చూపునిస్తుంది. అది ప్రకృతి పరమైనది కావచ్చు. లేదా ఆత్మానుగతమైనదీ కావచ్చు. ఒక శాస్త్రవేత్త, ఒక సిద్ధార్థుడు దీనికి మనకు గొప్ప నిదర్శనంగా నిలుస్తారు. ఈ సృష్టి ఎలా ఏర్పడింది.. జీవపరిణామం ఏమిటన్నది ఒకరి ఆలోచన అయితే, మరొకరిది ఈ సృష్టిలో మనిషి ఆస్తిత్వమేమిటి, చావు పుట్టుకల చట్రం నుండి బయటపడేదెలా అన్న ఆలోచనమరొకరిది. మార్గాలేవేరు అంతే. ఇద్దరూ మేధోమధనం చేసేవారే. ఇరువురూ జ్ఞానసాధకులే, సత్యశోధకులే. సామాన్యులకు అర్థం కాని, తట్టని జీవిత రహస్యాలను విడమరచి చెప్పే మాన్యులే. ఈ అన్వేషణ శక్తి సహజాతం కానప్పుడు అలవరచుకోవటం కష్టం. ఎవరైతే ఆ శక్తి లేదనుకుంటారో వారు ప్రయత్నం చెయ్యాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలనగా చూడాలి. మనుషుల ప్రవర్తనను గమనిస్తూ విశ్లేషణ చేసుకోవాలి. ఈ అన్వేషణ అనే లోతైన సముద్రంలో తార్కికత, గొప్ప అవగాహనా శక్తి, కఠోర శ్రమలతోపాటు గొప్ప జిజ్ఞాస తోడు చేసుకుని ఈదగలిగితే రత్నాలు.. మణులు, మాణిక్యాలు దొరుకుతాయి. అయితే, ఇంతటి సాధన.. శోధన కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వారికే జగతి జేజేలు పలుకుతుంది. అన్వేషణకు మార్గమే కాదు లక్ష్యం కూడ సరైనదిగా ఉండాలి. వక్రమార్గంలో స్వార్థపూరితంగా చేసే అన్వేషణ ప్రపంచానికి ఏ ప్రయోజనాన్నీ ఇవ్వకపోగా చేటు చేస్తుంది. వ్యక్తికైనా, సమాజానికైనా, దేశానికైనా, పరశువేది, అమృతం గురించి అన్వేషించిన వాళ్ళ జీవితాలు ఎలా వృథా అయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. కొన్నిదేశాలు చేసే ప్రయోగాలు, శాస్త్రపరిశోధనలు మానవాళికెంత హాని కలిగించాయో మనకు తెలుసు. అందుకనే అన్వేషణకు ఉత్తమ లక్ష్యం ఉండాలి. అప్పుడే ఉత్తమ సాధనాపథం అమరుతుంది. ఉత్తమ సాహిత్యం చదువుతున్నప్పుడు ఈ అన్వేషణ అనే వివేచనా నయనం అవసరం. అప్పుడే ఆ కవి లేదా రచయిత సృజనలోని విశిష్టతను పసిగట్టగలం. ఆ కావ్యంలోని భాషా సొబగులను.. కవి భావనా పటిమను, కవి చూసిన సాహితీ లోతులను.. ఆ కావ్యప్రయోజనాన్ని అర్థం చేసుకోగలం. లోపాలను చూడగలిగే విమర్శనాశక్తికి ఈ అన్వేషణ గొప్ప సాధనమవుతుంది. అన్వేషణంటే కొందరి భావన కొత్త ప్రదేశాలను సందర్శించటం, కొత్త వ్యక్తులను కలవటం. వారి సంస్కృతిని దాని గొప్పదనాన్ని చూడగలగటం. అనుసరణ యోగ్యమైతే స్వీకరించటం. రక్త సంబంధీకులు, స్నేహితులు, హితులు, శ్రేయోభిలాషులు, ఇరుగుపొరుగు, ముఖ పరిచయం కలవారు... ఇలా అనేకమంది తో సాగేదే మన ఈ జీవితనౌక. దీనిలో మనతో, మన భావాలతో, మన ధోరణితో ఒదిగి మనతో ఎక్కువకాలం పయనించ గలిగే వారి కోసం మనం అన్వేషించాలి. మనకు కష్టం కలిగినవేళ నేనున్నాననే వారి చేతి స్పర్శ, బాధపడే సమయాన మనకొరకు చెమ్మగిల గల నయనం, మనం తలను వాల్చేటందుకు ఒక భుజం, మనం తలవాల్చ గల ఎద మనకు కావాలి. ఒక సహచర్యం ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకోసం ప్రతి ఒక్కరూ వెతకాలి. ఆస్తికులకి అన్వేషణ అంటే ఆత్మ శోధన. ఆత్మతత్వమేమిటో తెలుసుకోవాలనే తపన. జీవాత్మ, పరమాత్మల సంబంధం, సంలీనం కోసం ఆరాటం. నాస్తికులకు, మానవతా వాదులకు మాధవ సేవ కన్నా మానవ సేవ ముఖ్యం. అన్నార్తుల, బాధార్తుల, అనాథలను ఆదుకోవాలనే తపన వీరిది. ఇది కూడా ఒక విధమైన అన్వేషణే. ఇది కూడా అలవర చుకోవలసిన అన్వేషణమే. విద్యను గరిపే గురువులకు అన్వేషణాశక్తి ఎంత అవసరమో దానిని నేర్చుకునే విద్యార్థులకు అది అంతే ఆవశ్యకం. గురువు తన జ్ఞానాన్ని నిత్యవసంతం చేసుకోవాలి. క్లిష్టమైన అంశాలను శిష్యులకు బోధించే సులభమైన పద్ధతులను వెతకాలి. శిష్యులు కూడ గురువు అందిస్తున్న జ్ఞానాన్ని తరచి చూసే అలవాటు చేసుకోవాలి. ఈ రకమైన అన్వేషణ వల్ల తాను పొందే జ్ఞాన సత్యాసత్యాలు తెలుస్తాయి. పరిశోధకులకు ఈ అన్వేషణ చాలా అవసరం. అంతవరకూ ప్రపంచం విశ్వసిస్తున్న ఒక నిజాన్ని, ఒక సిద్ధాంతాన్ని త్రోసిరాజని నిరూపణ చేసే శక్తి అన్వేషణ మనిషికిస్తుంది. అసలు నిజమేమిటో ప్రపంచానికి చాటాలంటే మనకెంతో స్థైర్యం ఉండాలి. చరిత్రను పరిశీలిస్తే ఎంతోమంది వేదాంతులు, తత్త్వవేత్తలు, సిద్ధాంతకర్తలు, శాస్త్రవేత్తలు తాము శోధించి తెలుసుకున్న సత్యాన్ని తమ ప్రాణాలను సైతం లెక్కచేయక జగతికి ప్రకటించి జగత్విఖ్యాతులై ప్రాతః స్మరణీయులయ్యారో తెలుస్తుంది. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
బ్యాడ్ బ్యాంక్‌లు ఎక్కువే కావాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న మొండి బకాయిల సమస్య పరి ష్కారానికి పలు బ్యాడ్ బ్యాంకుల అవసరం ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలించాలంటూ పరిశ్రమల మండలి సీఐఐ కోరింది. బడ్జెట్ ముందు ప్రభుత్వానికి వినతిపత్రం రూపంలో పలు సూచనలు చేసింది. బ్యాంకుల బ్యాలన్స్షీట్లలోని నిరర్థక ఆస్తుల కొనుగోలుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)ను అనుమతించాలని కోరింది. ‘‘కరోనా పరిణామం తర్వాత మార్కెట్ ఆధారితంగా సరైన ధర నిర్ణయించే యాంత్రాంగం అవసరం. అంతర్జాతీయంగా, దేశీయంగా నిధుల లభ్యత భారీగా ఉన్నందున ఒకటికి మించిన బ్యాడ్ బ్యాంకులు ఈ సమస్యను పారదర్శకంగా పరిష్కరించగలవు. రుణ క్రమాన్ని తిరిగి గాడిన పెట్టగలవు’’ అంటూ సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్‌కోటక్ చెప్పారు. మార్కెట్ ఆధారిత బలమైన యంత్రాంగం ఉంటే.. ప్రభుత్వరంగ బ్యాంకులు తమ మొండి బకాయిలను ఎటువంటి భయాలు లేకుండా విక్రయించుకోగలవన్నారు. స్వచ్ఛమైన బ్యాలన్స్ షీట్లతో అప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకోగలవని.. దాంతో ప్రభుత్వం మూలధన నిధుల సాయం చేయాల్సిన అవసరం తప్పుతుందని సూచించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుండడంతో పరిశ్రమ నుంచి రుణాల కోసం వచ్చే డిమాండ్లను బ్యాంకులు తీర్చాల్సి ఉంటుందన్నారు. -
తనంతటివాడు
అతను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. సైన్స్ అంటే ఇష్టం. ఒక రోజున ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ హెమ్ప్రీ డేవీ ఉపన్యాసం వినేందుకు వెళ్లాడు. డేవీని కలిశాడు. ‘మీ ప్రయోగశాలలో ఏదయినా ఉద్యోగం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అన్నాడు. డేవీ అతని ఉబలాటాన్ని గమనించి, తన ప్రయోగశాలలో చేర్చుకున్నాడు. ఒకరోజు రాత్రి డేవీ తన ల్యాబ్‌లో ఏదో ద్రావణాన్ని తయారు చేస్తున్నాడు. ఇంతలో ఆయనకు అత్యవసరంగా బయటకు వెళ్లవలసిన పని పడింది. దాంతో ఆయన ‘నేను ఈ ద్రావణంతో కొత్త ప్రయోగం చేయబోతున్నాను. అందుకు దీన్ని చేతితో కదుపుతూ ఉండాలి. నీవు దీనిని నేను వచ్చేంతవరకూ కదుపుతూ ఉండు. నేను త్వరగానే వస్తా’ అని చెప్పి బయటికి వెళ్లాడు. ఆ కుర్రాడు ఆ ద్రావణాన్ని కదిపే పని ప్రారంభించాడు. అలా గంటలు గడిచిపోతున్నా, విసుగూ విరామం లేకుండా అతను ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా వచ్చాడు డేవీ. ఏకాగ్రతతో తన పనిలో ఏమాత్రం లోటు రానివ్వకుండా ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్న తన యువ శిష్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఆజ్ఞాపాలన, ఉత్సాహం గల ఈ కుర్రాడు పెద్దయ్యాక ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని గ్రహించి, మరింత వాత్సల్యంతో అతనికి పాఠాలు చెబుతూ, తనంతటివాడిగా తయారు చేశాడు. డేవీ అంచనా వమ్ము కాలేదు. ఆ కుర్రాడు అనతికాలంలోనే డైనమో ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగాడు. రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి, చిరస్మరణీయుడయ్యాడు. అతనే మైఖేల్ ఫారడే. – డి.వి.ఆర్. -
క్రెడిట్ కార్డు మోసం: డబ్బులు పోతే ఏం చేయాలి?
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో క్రెడిట్, డెబిట్ కార్డుల అక్రమ లావాదేవీలు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కార్డు యజమానికి తెలియకుండా కార్డు విదేశాలలో స్వైపింగ్ కావడం, కస్టమర్ల లక్షల కొద్దీ డబ్బులు పోగొట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఖాతాదారుల ప్రమేయం, ఓటీపీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఆన్లైన్ షాపింగ్ తదితర ప్రాంతాల్లో కార్డు స్వైపింగ్ కావడం మరింత ఆందోళన సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల ప్రమేయం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి డబ్బులు మాయమైతే ఏం చేయాలి. దీనికి ఆర్బీఐ ఇటీవలి మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి. ఒకసారి చూద్దాం! ఇలాంటి లావాదేవీలను గుర్తించినపుడు ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదు. అనుమానిత లావాదేవీ జరిగినట్టు గుర్తించిన వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి లేదా బ్యాంకుకు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. అలాగే బ్యాంకు అంబుడ్స్మెన్లలో ఫిర్యాదు చేయడంతో పాటు సైబర్‌క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. తద్వారా మీ కార్డుపై మీకు తెలియకుండా జరిగిన లావాదేవీలకు మీరు బాధ్యులు కారు. అలాంటి కేసులలో వినియోగదారుడికి ఎలాంటి నష్టం కలగకుండా, భారం పడకుండా చర్యలు తీసుకోవడంతో వెంటనే తాత్కాలికంగా మరో కార్డును వినియోగదారుడికి అందించే ఏర్పాటు కూడా చేస్తుంది. ఆ తరువాత వినియోగదారుడి కార్డు ఎక్కడ ఉపయోగించారనే విషయంపై బ్యాంకు ఆరా తీస్తుంది. వినియోగదారుడి ప్రమేయం లేకుండా జరిగిన లావాదేవీలకు సంబంధించి వాస్తవంగా మీకు తెలియకుండా జరిగిందా? కావాలనే మీరు చేయించారా? అనే విషయాలపై కూడా కనుగొంటుంది. కస్టమర్లు ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో తమ ప్రమేయం లేకుండా జరిగే లావాదేవీలకు సంబంధించి మూడు రోజుల్లో బ్యాంకు లేదా ఆర్బీఐకి తెలియజేస్తే, దానికి సంబంధించిన సొమ్మును 10 రోజుల్లోపు తిరిగి చెల్లిస్తుంది. కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే థర్డ్ పార్టీ మోసాలకు బ్యాంకు ఖాతాదారు ఎలాంటి నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. అయితే కార్డు లేదా ఆన్లైన్ లావాదేవీ నుంచి డబ్బు కోల్పోయినట్లయితే మూడు పనిదినాల్లోగా దాన్ని బ్యాంకుకు తెలియపరచాల్సి ఉంటుంది. ఒక వేళ మోసాన్ని నాలుగు నుంచి ఏడు పనిదినాల్లోగా తెలియజేసినట్లయితే, బ్యాంకు ఖాతాదారు గరిష్టంగా రూ.5000 నుంచి రూ.25 వేల వరకూ నష్టాన్ని భరించాల్సి రావచ్చు. అది ఖాతా రకం, క్రెడిట్ కార్డు పరిమితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఖాతాదారు నిర్లక్ష్యం( ఓటీపీ, సీవీవీ లాంటి వివరాలు వెల్లడించడం ద్వారా) కారణంగా మోసం జరిగిన సందర్భంలో నష్టాన్ని బ్యాంకు భరించదు. అది ఖాతాదారే భరించాల్సి ఉంటుంది. కానీ అనధికారిక లావాదేవీ గురించి బ్యాంకుకు తెలియజేసిన వెంటనే మళ్లీ ఏదైనా అనుమానస్పద లావాదేవీ జరిగితే ఆ నష్టాన్ని బ్యాంకు భరిస్తుంది. ఏదైనా మోసపూరిత లావాదేవీ జరిగిన తర్వాత బ్యాంకు ఖాతాదారు సదరు బ్యాంకుకు నివేదిస్తే, ఆ అనధికారిక లావాదేవీకి సంబంధించిన సొమ్మును బ్యాంకు 10 పనిదినాల్లోగా ఖాతాదారు బ్యాంకు ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. ఎంత సొమ్ము వెనక్కు వస్తుందనే అంశం అనధికారిక లావాదేవీ జరిగిన రోజు ఎంత డబ్బు మినహాయించబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన దేశంలో క్రెడిట్ కార్డుతో జరిగే లావాదేవీలలో ఓటీపీ, పిన్ తప్పని సరిగా ఉంటాయి. ఆన్లైన్లో కార్డు వివరాలను ఉపయోగించి జరిగే లావాదేవీలలో ఓటీపీ, కార్డును నేరుగా ఉపయోగించి జరిగే లావాదేవీలలో పిన్ నెంబర్ తప్పని సరిగా ఉపయోగించాలి. అయితే అంతర్జాతీయంగా కొన్ని దేశాలలో ఆన్లైన్లో జరిగే లావాదేవీలకు ఓటీపీ అనేది తప్పనిసరి కాదు. ఇలాంటి లావాదేవీలు కార్డు నెంబరు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలు ఉంటే సరిపోతుంది. దీనినే సైబర్ చీటర్లు ఆసరాగా చేసుకుంటున్నట్లు పోలీసులు, బ్యాంకు అధికారులు అనుమానిస్తున్నారు. కార్డుపైనే ఈ వివరాలు ఉండడంతో ఇవి తస్కరణకు గురయ్యే అవకాశాలుంటాయి. దీంతో కార్డును ఎవరికి ఇవ్వకపోవడం, ఎక్కడ పడితే అక్కడ స్వైపింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలి. -
ఆరోగ్యానికి క్రీడలు అవసరం
* డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ హబీబ్ బాషా * నలందాలో టాలెంట్ హంట్ 2కే 16 ప్రారంభం సత్తెనపల్లి: ఆరోగ్యం కోసం క్రీడలు అవసరమని గుంటూరు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ హబీబ్‌బాషా చెప్పారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలోని నలందా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం టాలెంట్ హంట్ 2కే 16 ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ అబ్రహంలింకన్ అధ్యక్షత వహించారు. హబీబ్‌బాషా మాట్లాడుతూ ఒలంపిక్్స పోటీల్లో రజత పతకం సాధించిన పి.వి.సింధు తెలుగు రాష్ట్రాలకు గౌరవం తెచ్చిందని కొనియాడారు. క్రీడాకారులకు ఉన్న మానసిక పరిజ్ఞానం మరెవరికీ ఉండదన్నారు. క్రీడలు లేనిదే జీవితం ఉండదని చెప్పారు. అన్ని రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు ప్రవేశపెట్టామని, నగదు రహిత లావాదేవీలను విద్యార్థులు ప్రొత్సహించాలని సూచించారు. నలందా విద్యాసంస్థల చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించే క్రీడా పోటీల్లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులు మీ మధ్యలో నుంచే రావాలంటూ ప్రేరణనింపారు. క్రీడలనేవి శారీరక, మానసిక ధృడత్వానికే కాకుండా జాతీయ సమైక్యతా స్ఫూర్తిని నింపుతాయన్నారు. నలందా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ స్కిల్ లేదా ఉన్నత విద్య ఉంటేనే భవిష్యత్తులో రాణించ గలుతారన్నారు. ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని చేరు కోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్స్ సరిత సంపతి, ఎ.వాణి, డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 60 కళాశాలల నుంచి 55 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. బాల, బాలికలకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు, బాలికలకు అదనంగా టెన్నికాయిట్ పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక విభాగంలో గ్రూప్, సోలో డ్యాన్సులు, పాటల పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. బాలికల కబడ్డీ పోటీల్లో విన్నర్‌గా నరసరావుపేట వాగ్దేవి కలాశాల, రన్నర్‌గా సత్తెనపల్లి క్రిష్ణవేణి, టెన్నికాయిట్‌లో విన్నర్‌గా సత్తెనపల్లి క్రిష్ణవేణి, రన్నర్‌గా నగరం ఎస్డబ్ల్యూ జూనియర్ కళాశాల జట్లు నిలిచాయి. కార్యక్రమంలో పీఈటీలు చంద్రవాస్, నాగిరెడ్డి, కళాశాల వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నూడుల్స్ ధ్వంసానికి సుప్రీంను ఆశ్రయించిన నెస్లే
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది. గడువు తీరిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేయాల్సి అవసరం ఉందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అంగీకరించకపోడంతో సుప్రీంను ఆశ్రయించినట్టు పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రాలతో, జస్టిస్ సి నాగప్పన్ లతో కూడిన బెంచ్ ముందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది గతంలో హైకోర్టులో నెస్లే లేవనెత్తిన సమస్యే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి వాయిదా వేశారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
పాతాళగంగ (మన్ననూర్) : కృష్ణా పుష్కరాల్లో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారులు మధుసూదన్‌నాయక్, డాక్టర్ వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం పాతాళగంగ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సిబ్బందితో వారు మాట్లాడారు. 12రోజులపాటు నిర్వహించే పుష్కరాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కృష్ణవేణి, వనమయూరి, మన్ననూర్లోని వనమాలికలో వీఐపీల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశామన్నారు. మీడియా పాయింట్ వద్ద రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోని, ఉపసర్పంచ్ ప్రసాద్, నాగర్‌కర్నూల్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, అచ్చంపేట ఆర్టీసీ డీఎం నారాయణ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ రఘునందన్, సీఐ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. -
'ఇక మాటల్లేవ్.. కాంగ్రెస్‌కు మేజర్ సర్జరీ తప్పదు'
న్యూఢిల్లీ: ఇక చర్చలు, అంతర్మథనాలు అవసరంలేదని కాంగ్రెస్ పార్టీకి మేజరీ సర్జరీ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. 2014 నుంచి ఏఐసీసీ సెక్రటరీల మార్పు జరగలేదని ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దిగ్విజయ్ స్పందిస్తూ .. 'ఈ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి.. ఊహించలేదు కూడా. మేం చేయాల్సింది చేశాం.. ఇక అంతర్మథనంలాంటివి లేవు. కాంగ్రెస్ కు మేజర్ సర్జరీ కోసం మేం ముందుకు వెళ్లాలి' అని ఆయన అన్నారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 543లోక్ సభ స్థానాల్లో 44 సీట్లు మాత్రమే గెలుచుకునే తీవ్ర అవమానం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో ఎలాంటి మార్పు జరగలేదు. రాహుల్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత మార్పులు చేయాలని భావించినా అది కూడా నానాటికి వెనక్కే పోతోంది. -
పరిశుభ్రమైన వాతావరణం అవసరం
నెల్లూరురూరల్ : అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణం అవసరమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని 37వ డివిజన్ క్రాంతినగర్, 38వ డివిజన్ పొట్టేపాళెంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఐదేళ్లలో అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. పేద కుటుంబాల్లోని పిల్లలందరూ చదువుకోవాలన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలెందరో మేధావులు అయ్యారన్నారు. ప్రస్తుత ప్రధాని కూడా ఒకప్పుడు పేదవాడేనని పేర్కొన్నారు. అర్హులకు ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చూస్తామన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచారన్నారు. రైతు, డ్వాక్రా, రుణాల మాఫీ, యువకులకు నిరుద్యోగ భృతి హామీని సీఎం ఆచరణలో అమలు చేయాలన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. పొట్టేపాళెం హైస్కూల్లో అదనపు గదులు మంజూరు చేయాలని బొమ్మిరెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరడంతో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయం: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుంటే వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలి తప్ప మిగతా సమయాల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు. అర్హులైన పింఛన్‌దారుల్లో ఒక్కరికి తొలగించినా సహించబోమన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రి నారాయణ సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పజల కష్టాలు తెలుసుకునేందుకు ఎల్లప్పుడు వారికి అం దుబాటులో ఉంటామన్నారు. పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఉంటామన్నారు. అనంతరం పెన్షన్లు పంపిణీ చేశారు. 37వ డివిజ న్లో కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాసయాదవ్, లేబూరు పరమేశ్వరరెడ్డి, ఏకసిరి ప్రశాంత్‌కిరణ్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు తాటివెంకటేశ్వరరావు, నాయకులు బుర్రా వెంకటేశ్వర్లుగౌడ్, మహేష్ పాల్గొన్నారు. వాటర్‌ప్లాంట్ ప్రారంభం పొట్టేపాళెంలో నిర్మించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్‌ను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు లాంఛనప్రాయంగా ప్రారంభించారు. -
క్లిక్ చేస్తే చాలు..
డిచ్పల్లి, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఆధార్’పై సామాన్య జనాలకు అనుమానాలెన్నో తలెత్తుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల రాయితీలకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఆధార్‌పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం మిగిలిన అంశాల్లో కొంత వెనక్కు తగ్గినా, వంట గ్యాస్ సిలిండర్ విషయంలో మాత్రం ఖచ్చితం గా ఆధార్ నమోదు కోరుతోంది. వంటగ్యాస్‌కు సంబంధించి రాయితీ సొమ్మును పొందడానికి వినియోగదారుడు ఆధార్‌నంబరు, బ్యాంకు ఖా తా నంబరును గ్యాస్ కంపెనీలకు సమర్పిం చా ల్సి ఉంటుంది. ఈమేరకు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని చాలామంది వినియోగదారులు ఇప్పటికే తమ ఆధార్‌నంబర్లను గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకర్లకు అందజేశారు. వినియోగదారులకు సిలిండర్‌కు సంబంధించిన సబ్సిడీ నేరుగా వారి ఖతాల్లో జమవుతుంది. ఈ నగదు బదిలీ పథ కం జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమైంది. ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు సదు రు గ్యాస్ ఏజెన్సీకి అందాయా లేదా.. బ్యాంకు నంబరు సక్రమంగానే ఉందా.. తప్పు గా నమో దు అయ్యిందా.. అన్నీ సక్రమంగా ఉన్నా రాయి తీ ఖాతాలో జమ అవుతుందా.. లేదా? ఇలా ఎన్నో రకాల అనుమానాలు విని యోగదారుల్లో అందోళన రేకెత్తిస్తున్నాయి. ఒక వేళ ఆధార్ నంబరు గ్యాస్ కనెక్షన్‌కు జత కాకపోతే ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ వివరాలు తెలుసుకోవాలనే సందేహాలతో వినియోగదారులు అయోమయంలో పడిపోతున్నారు. విని యోగదారుల అందోళనను దృష్టిలో ఉంచుకుని ఆయా గ్యాస్ ఏజెన్సీలు ప్రత్యేకంగా ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత) పోర్టల్‌ను ఏర్పాటు చే శాయి. ఈ విషయ మై స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ పరిధిలోని వినియోగదారులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సదుపా యం ఉన్న వినియోగదారులు ఇంటి వద్దే నేరు గా తమ ఆధార్ నెంబరు ఏజెన్సీలో నమోదు, బ్యాంకుతో అనుసంధానం వివరాలను తెలుసుకునే వీలు ఏర్పడింది. మీ గ్యాస్ డీలరుకు సం బంధించిన ఇంటర్నెట్ వెబ్సైట్ (భారత్, ఇం డేన్, హెచ్‌పీ కంపెనీల్లో ఏదైతే దానిని..) ఎంచుకోవా లి. గ్యాస్ కంపెనీకి చెందిన ట్రాన్స్పరెన్సీ ఫోర్టల్‌ను ఎంచుకోవాలి. ఇందుకోసం గూగుల్ సెర్చ్ ఉపయోగపడుతుంది. గూగుల్ హోం పేజీలో మనకు కావాల్సిన గ్యాస్ కంపెనీ పేరు ఎంటర్ చేయగానే అందులో కంపెనీకి సంబంధించిన వివరాలతో పాటు ట్రాన్స్పరెన్సీ పోర్టల్‌కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. టాన్స్పరెన్సీ పోర్టల్‌ను ఎంచుకున్న అనంతరం రాష్ట్రం, జిల్లా, డిస్ట్స్రిబ్యూటర్ పేరు ఎంటర్ చేయాలి. ఆపై వినియోగదారుడి గ్యాస్ కనెక్షన్ నెంబరు ఎంటర్ చేయగానే ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా అనుసంధానం వివరాలు తెలుసుకోవచ్చు. గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ‘ఆధా ర్ లింకింగ్ స్టేటస్ ఇన్ ఎల్పీజీ’, ‘ఆధార్ లిం కింగ్ స్టేటస్ ఇన్ బ్యాంక్స్’, మేసేజ్ అనే వివరా లు ఉంటాయి. ఆధార్ వివరాలు గ్యాస్ డీలర్ల వ ద్ద, బ్యాంకులో అనుసంధానమై ఉంటే ఆకుపచ్చ రంగులో కన్పిస్తుంది. లేదంటే ఎరుపు రంగు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఆధార్ నం బరు అనుసంధానమైతేనే ప్రభుత్వ రాయితీ వినియోగదారుడి ఖాతాలోకి జమవుతుందని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.