న్యూఢిల్లీ: ఇక చర్చలు, అంతర్మథనాలు అవసరంలేదని కాంగ్రెస్ పార్టీకి మేజరీ సర్జరీ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. 2014 నుంచి ఏఐసీసీ సెక్రటరీల మార్పు జరగలేదని ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దిగ్విజయ్ స్పందిస్తూ ..
'ఈ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి.. ఊహించలేదు కూడా. మేం చేయాల్సింది చేశాం.. ఇక అంతర్మథనంలాంటివి లేవు. కాంగ్రెస్ కు మేజర్ సర్జరీ కోసం మేం ముందుకు వెళ్లాలి' అని ఆయన అన్నారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 543లోక్ సభ స్థానాల్లో 44 సీట్లు మాత్రమే గెలుచుకునే తీవ్ర అవమానం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో ఎలాంటి మార్పు జరగలేదు. రాహుల్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత మార్పులు చేయాలని భావించినా అది కూడా నానాటికి వెనక్కే పోతోంది.
'ఇక మాటల్లేవ్.. కాంగ్రెస్కు మేజర్ సర్జరీ తప్పదు'
Published Fri, May 20 2016 9:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement