introspection
-
Parliament Budget Session 2024: ఆత్మపరిశీలన చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించే విపక్ష ఎంపీలు ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రామ్ రామ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శ, ప్రతిపక్షం అనేవి చాలా అవసరం. అయితే నిర్మాణాత్మక ఆలోచనలతో సభను సుసంపన్నం చేసిన వారినే ప్రజలు గుర్తుంచుకుంటారు. అంతరాయం సృష్టించిన వారిని ఎవరూ గుర్తుంచుకోరు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగకుండా అనుక్షణం నిరసనలు, నినాదాలను సభా కార్యకలాపాలను స్తంభింపజేసిన ఆ విపక్ష పార్టీల సభ్యులు తమ ప్రవర్తనను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారు తమ పాత పంథాను విడనాడాలి. వాళ్లు తమ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగినా పాత సెషన్లో వీరు చేసిన వీరంగాన్ని ఎవ్వరూ గుర్తుంచుకోరు‘ అని విపక్ష ఎంపీలను ప్రధాని తప్పుబట్టారు. ‘‘సాధారణంగా ఎన్నికల సమయంలో పూర్తి బడ్జెట్‌ను సమర్పించరు. మేము అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. ఈసారి మళ్లీ మేమే వస్తాం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసి పూర్తి బడ్జెట్‌ను మీ ముందుకు తెస్తాం. ఈసారి ఆర్థిక మంత్రి కొన్ని మార్గదర్శక అంశాలతో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు’ అని మోదీ ప్రకటించారు. ‘అభివృద్ధిలో దేశం అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. సమ్మిళిత, దేశ సర్వోతోముఖాభివృద్ధి ప్రయాణం ఆగదు’’ అని వ్యాఖ్యానించారు. -
Mayawati: మీ సంగతి చూసుకోండి
లక్నో: బీఎస్పీపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసే ముందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు మాయావతి సూచించారు. బీఎస్పీని ఇండియా కూటమిలో చేర్చుకుంటారా అని మీడియా ప్రశ్నించగా ఎన్నికల తర్వాత పొత్తులు మార్చే అలవాటున్న మాయావతి పార్టీని ఎవరు నమ్ముతారని అఖిలేశ్ ప్రశ్నించారు. వీటిపై మాయా మండిపడ్డారు. బీజేపీని బలోపేతం చేస్తూ, వారితో అంటకాగుతున్న అఖిలేశ్ ప్రతిష్ట మంటగలిసిందని విమర్శించారు. 2019 ఎన్నికల ముందు, తర్వాత ప్రధాని మోదీని నాటి ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వదించారని గుర్తు చేశారు. -
మంచి మాట: సమదృష్టి అంటే..?
మానవ జన్మను ఎత్తిన ప్రతి వాడూ సమదృష్టిని అలవరచుకోవాలని మన సనాతన ధర్మం చెబుతోంది. దీనినే సమదర్శనం అని కూడా అంటూ ఉంటాం. సమాజంలో ఎవ్వరికీ ఇబ్బంది కల్గించకుండా, ఎవ్వరినీ హీనంగా చూడకుండా అందరం ఒక్కటేనని, అందరిలోనూ ఆ భగవంతుడు అంతర్యామిగా ఉంటాడనే నిజాన్ని తెలుసుకోగలిగితే మనం సమదృష్టిని అలవరచుకోగలం. అయితే స్వార్ధం మనిషిని సమదృష్టిలో ఉంచకుండా చేస్తోంది. సాధారణంగా స్వసుఖం, స్వాతిశయం అనేవి మనిషిలో స్వార్ధాన్ని ప్రోది చేస్తూ ఉంటాయి. తానొక్కడే సుఖంగా ఉండాలనుకోవడం స్వసుఖం. అలాగే తానొక్కడే అందరికన్నా ఆధిక్యంలో ఉండాలనుకోవడం స్వాతిశయం. నిజానికి స్వార్ధంతో వచ్చే ఈ రెండు గుణాల వల్లనే మనిషి ఎన్నో అనర్ధాలకు, అక్రమాలకు పాల్పడుతుంటాడు. మంచీ, చెడు విచక్షణ మరచి అకృత్యాలు చేసుకుంటూ పోతాడు. సాధారణంగా సుఖంగా ఉండాలనుకోవడం, ఉన్నతస్థితికి చేరుకోవాలనుకోవడం తప్పేమి కాదు. కానీ తన సుఖం కోసం, తన ఉన్నతికోసం స్వార్ధంతో ఇతరులకు ఇబ్బంది కల్గించడం అధర్మమవుతుంది. తనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు తాను ఇతరులకు ఇబ్బందులు కల్గించినట్లుగానే, తన పరిస్థితులు అనుకూలంగా లేనపుడు ఇతరులు కూడా తనకు ఇబ్బందులు కల్గించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ భావన కల్గినపుడు సహజంగానే మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలం. అదేవిధంగా సంకుచిత స్వభావం కూడా సమదృష్టి లేకుండా చేస్తుంది. సంకుచిత భావనల వలన ఇతడు మనవాడు, అతడు పరాయి వాడు అనే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అలాంటి భేదాభిప్రాయాలు ఎన్నో అనర్ధాలకు కారణభూతమౌతాయి. కనుక సంకుచిత భావం లేకుండా ఉదారంగా ఉండగలిగే మానసిక పరిపక్వతను ప్రతి మనిషీ అలవరచుకోవాలి. తనకు అన్నీ ఉన్నా ఎదుటివారికి లేకపోతే ఎద్దేవా చేయడం కానీ, ఎగతాళి చేయడం కానీ కూడదు. ఈరోజున ఏమీ లేకపోవచ్చు. కానీ రేప్పొద్దున వారిని భగవంతుడు కరుణించవచ్చు. వారి కుబేరులు కావచ్చు. లేదా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు. జరగడం అనేది మనచేతుల్లో ఏదీలేదు. కనుక ఎవరినీ ఎందుకూ నొప్పించకూడదు. మనుషుల్లో స్వభావరీత్యా ఒక మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే. ఆలోచనల్లో సరళీకృతం లేకపోవడం, ఆలోచనల్లో తానే అధికుడినని భావించడం, అన్నీ తనకే తెలుసనుకోవడం, ఎదుటివారి మాట తానెందుకు వినాలనుకోవడం లాంటి వన్నీ మనిషి స్వభావాన్ని మార్చివేస్తాయి. అనుకొన్నది జరగకపోతే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం మనిషి స్వభావాన్ని మార్చివేస్తుంది. దానితో అనుకొన్నది కాక మరొకటి ఎదురవుతుంది. అందుకే చుట్టూ సమస్యలు చుట్టుముట్టినా, ఎందరు కావాలని కష్టనష్టాలు కలిగిస్తున్నా, పనిగట్టుకొని హేళన చేస్తున్నా, పుట్టెడు దుఃఖం ఉబికి వస్తున్నా బాధపడడం మానేసి వాటికి దూరంగా వెళ్లిపోయి తమ పని తాము చేసుకోవడం ఉత్తమం. ఎదుటివారు ఏం చేసినా సరే తాను మాత్రం ఎవరికీ అపకారం చేయకుండా ఉండడమే సమదృష్టి. ఒకరికి మేలు చేయగలిగే స్థితిలో, ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా జీవితాన్ని మలుచుకోగలిగిన నాడే సమదృష్టి ప్రస్ఫుటమవుతుంది. అందుకే మన స్వార్థాన్ని అదుపులో పెట్టడానికి, మన మాటలను, చేతలను క్రమబద్ధీకరించడానికి, మన వలన తోటివారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మన సనాతన ధర్మం ఎన్నో నియమాలను ఏర్పరచింది. మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు మానవ ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏదని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు సమాధానం చెబుతూ, ఇతరులు ఏం చేస్తే మనకు కష్టం కలుగుతుందో, దానిని మనం చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మమని చెబుతాడు. సమస్త ప్రాణుల యందు సమ భావం కలిగినవారు, ఇష్టాయిష్టాలకు, సుఖ–దుఃఖాలకు, సంతోష–బాధలకు అతీతంగా ఉండేవారు నిరంతరం జనన మరణ సంసారాన్ని దాటుతారని, వారే భగవంతుని రూపాలని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు. మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, సమదృష్టిని సాధించడం దుర్లభం అవుతుంది. శారీరక ఆహ్లాదం, కోరికలు, ద్వేషాలు నిత్యం అనుభవంలోకి వచ్చినంత కాలం సమదృష్టిని ప్రదర్శించడం దుస్సాధ్యం. ఎవరైతే మనస్సును ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంచుకుంటారో, శారీరక సుఖ–దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతులై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటారో, స్వార్థాన్ని, క్రోధాన్ని, ఐహిక సుఖాలను, ఆర్భాటాలను త్యజించి తమ మనస్సును భగవంతుని యందే లగ్నం చేస్తారో అలాంటి వారు ఈశ్వరునితో సమానంగా మన వేదాలు చెబుతున్నాయి. ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించినా, మనపట్ల అమర్యాదగా ప్రవర్తించినా, మనతో పరుషంగా మాట్లాడినా, మనలను కించపరిచినా సహజంగానే మనకు బాధ కలుగుతుంది. అందుకే అలాంటి పనులను మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండాలి. అదే సమదృష్టి. –దాసరి దుర్గాప్రసాద్ -
ఔను.. మళ్లీ ‘వాళ్ల మాటే’ నెగ్గింది
నిన్నటిదాక పార్టీ జెండా భుజాన మోస్తున్న వాళ్లందరికీ ఎంపీ ‘కేశినేని’ అస్మదీయుడు. ఇవాళ తస్మదీయుడయ్యాడు. తమ క్యాడర్ చేతుల్లోనే అధికారం ఉండాలన్న కాంక్ష, తమ వర్గీయులే పదవుల్లో సాగాలన్న ఉత్సుకతే దీనికి కారణమైంది. విజయవాడ మేయర్ పీఠంపై ఏకంగా తమ కుమార్తెను కూర్చోబెట్టాలన్న నిర్ణయంపై పలువురు వ్యతిరేకించినా చివరకు వాళ్ల మాటే నెగ్గింది. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అవును, మళ్లీ వాళ్ల మాటే నెగ్గిందని విజయవాడ నగర టీడీపీలో మారుమోగుతోంది. చంద్రబాబు సామాజికవర్గం వారికే ప్రాధాన్యమా అనే ప్రశ్న పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా కుమారి కేశినేని శ్వేత గారిని నిర్ణయించడం జరిగింది’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేరిట ప్రకటన విడుదల కావడంతో నగర నేతల్లో అంతర్మథనం ఆరంభమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు అర్బన్‌లోని ముఖ్య నాయకులు కూటమి కట్టి మేయర్ అభ్యర్థి విషయంలో తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలియజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తన కుమార్తె శ్వేతే పార్టీ తరపున మేయర్ అభ్యర్థిని అని చేసిన ప్రకటనను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షు డు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మైనార్టీ సీనియర్ నాయకుడు నాగుల్ మీరా తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పార్టీ సీనియర్ నేతలు మొదలు చంద్రబాబుతో సహా అందరి వద్దా వద్దంటూ కుండబద్దలు కొట్టారు. కానీ శ్వేత పేరును అధిష్ఠానం ఖరారు చేయడంతో పార్టీలో తమ అభి ప్రాయాలకు విలువెంతో స్పష్టమైందని అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. ‘గుంటూరులో కోవెలమూడి రవీంద్ర (నాని), విజయవాడలో కేశినేని శ్వేత... మేయర్ పీఠాలకు వారే అర్హులా? ఓసీల్లో ఇంకెవరూ లేరా? మరెవరూ పనికిరారా? ఆ సామాజిక వర్గం వారికి ఇంకెవరూ సరితూగరా? ’ అనే వాదనను బాహాటంగానే లేవనెత్తారు. పార్టీ రహితమైనప్పటికీ టీడీపీ మద్దతుదారులుగా పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా పరువుపోగొట్టుకున్న నేపథ్యంలో పురపోరులోనైనా గట్టిపోటీ ఇవ్వాలని నగరంలోని ముఖ్య నాయకులు భావించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండేసి అసెంబ్లీ స్థానాలు, ఒక్కో ఎంపీ సీటుతో సరిపెట్టుకుంది. గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీకి దూరమవడంతో పాటు చంద్ర బాబు తీరును సందర్భం వచ్చినప్పుడల్లా తూర్పారపడుతున్నారు. ఇప్పటికే అన్నివిధాలా కునారిల్లిపోయిన పార్టీ తాజా ప్రకటనతో మరింత కుంగిపోవడమే తరువాయని పార్టీ శ్రేణులు నెత్తీనోరూ బాదుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించే విజయవాడ మేయర్ పీఠం ఫలానా వారికే అనే ప్రకటన చేయవద్దని, ఒకవేళ ఎవరి పేరునైనా ముందుగా ప్రకటిస్తే అందరినీ సమన్వయపరచుకుని ముందు కు వెళ్లడం అసాధ్యమని నగర నేతలు అధిష్ఠానానికి వివరించారు. చంద్రబాబు వారి మాటలకు ప్రాధా న్యం ఇచ్చినట్లే వ్యవహరించారు. తాను ఎవరి పేరు ను చెప్పలేదని, కేశినేనికి కూడా హామీ ఇవ్వలేదని నమ్మబలికారు. సమన్వయంతో పనిచేసి మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించాలని హితబోధ చేయడంతో అంతా సర్దుకున్నట్లే భావించారు. ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమవుతున్న తరుణంలో శ్వేత పేరు ప్రకటన టీడీపీకి శరాఘాతమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రెండుగా చీలిన నేతలు! విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. కేశినేని శ్రీనివాస్‌కు గద్దె రామ్మోహన్ వెంట ఉంటున్నారు. బొండా, బుద్దా, నాగుల్‌మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె çపూజితకు ఇచ్చిన టిక్కెట్‌ను కేశినేని నాని మార్చేశారు. ఈ విషయమై బుద్ధా, మీరాలు పట్టుపట్టినా ఎంపీ ససేమిరా అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్ విషయంలోనూ అదే జరిగింది. పేదసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోలేకపోయినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు, జాతీయ కార్యదర్శి కూడా అయిన వర్ల రామయ్య తన అనుచరవర్గం వద్ద అంతర్గత చర్చల్లో వాపోయినట్లు సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. డిప్యూటీ మాజీ మేయర్ గోగుల వెంకట రమణారావు అవినీతిపరుడని, ఆయనకు టిక్కెట్ వద్దేవద్దని మాజీ ఎమ్మెల్యే బొండా, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘు తదితరులు భీష్మించారు. నిరసన ప్రదర్శన నిర్వహించినా ఎంపీ కేశినేని మాటే నెగ్గింది. నగరంలోని ఇతర సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ల మాటలు కనీసం చెల్లుబాటు కానప్పుడు, విలువే లేనప్పుడు తామెందుకు ఆరాటపడాలనే అభిప్రాయాలు ఆయా వర్గాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. కోనేరు శ్రీధర్ మినహా.. విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయరుగా 1981లో టి.వెంకటేశ్వరరావు (రెండుసార్లు) బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత మేయర్లుగా పాలనా పగ్గాలు చేపట్టిన వారిలో అయితా రాములు (రెండుసార్లు) లంకా గోవింద రాజులు, జంధ్యాల శంకర్, పంచుమర్తి అనూరాధలు ఉన్నారు. మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ మేయర్లుగా తాడి శకుంతల, మల్లికా బేగం, ముత్తంశెట్టి రత్నబిందు బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి కోనేరు శ్రీధర్ మేయర్‌గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేతను ప్రకటించడం గమనార్హం. చదవండి: టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు భంగపాటు తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ.. -
'ఇక మాటల్లేవ్.. కాంగ్రెస్‌కు మేజర్ సర్జరీ తప్పదు'
న్యూఢిల్లీ: ఇక చర్చలు, అంతర్మథనాలు అవసరంలేదని కాంగ్రెస్ పార్టీకి మేజరీ సర్జరీ జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. 2014 నుంచి ఏఐసీసీ సెక్రటరీల మార్పు జరగలేదని ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దిగ్విజయ్ స్పందిస్తూ .. 'ఈ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి.. ఊహించలేదు కూడా. మేం చేయాల్సింది చేశాం.. ఇక అంతర్మథనంలాంటివి లేవు. కాంగ్రెస్ కు మేజర్ సర్జరీ కోసం మేం ముందుకు వెళ్లాలి' అని ఆయన అన్నారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 543లోక్ సభ స్థానాల్లో 44 సీట్లు మాత్రమే గెలుచుకునే తీవ్ర అవమానం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో ఎలాంటి మార్పు జరగలేదు. రాహుల్ కు బాధ్యతలు అప్పగించిన తర్వాత మార్పులు చేయాలని భావించినా అది కూడా నానాటికి వెనక్కే పోతోంది. -
ఆత్మవిమర్శ అవసరం
సందర్భం ఆ ఘటన ఆశ్చర్యభరితం. ఎర్రకోట నుంచి నరేంద్ర మోదీ బయటకు వచ్చిన వెంటనే దూరదర్శన్ జాతీయ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం. టీవీ తెరపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షమయ్యారు. తన కార్యాలయం నుంచి ఆయన కూడా మరోసారి 69వ స్వాతంత్య్ర దినోత్సవం గురించి మాట్లాడుతూ కనిపించారు. తర్వాతి వంతు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ది. ఆ తర్వాత ఉన్నట్లుండి.. ప్రతి సంవత్సరం జాతినుద్దేశించి ప్రధాన మంత్రులు ప్రసంగించే స్థలమైన ఎర్రకోటపై ఒక డాక్యుమెంటరీ ప్రసారమైంది. వ్యవస్థపై బాధ్యత మోపుతూనే, గణతంత్ర రిపబ్లి క్లోని పౌరులకు గరిష్ట ప్రయోజనాలను కల్పించేందు కోసం తప్పులను సరిదిద్దే ప్రయత్నాల గురించి తొలి ఇరువురు వక్తలూ చేసిన ప్రసంగాల ఒరవడి గుర్తించ దగినది. మోదీ దృష్టి దేశంపై ఉండగా, కేజ్రీవాల్ దృష్టి జాతీయ రాజధానికే పరిమితమయింది. ప్రజల సంక్షే మానికి కఠినశ్రమ, సమగ్రత ఎంతగా తోడ్పాటుని స్తాయి అనే అంశంపై ఆయన దృష్టిపెట్టారు. మరోవైపు న మోదీ మొత్తం దేశ జనాభాను ‘125 కోట్ల నా టీమ్ ఇండియా’గా అభివ ర్ణించడం అందరినీ కదిలించింది. కేజ్రీవాల్ మాత్రం తానెంచుకున్న పరిధికి కట్టుబడ్డారు. ఏమైనప్పటికీ వీరిరువురూ ప్రస్తుతం చారిత్రక తీర్పు శిఖరంపై నిలిచి ఉన్నారు. ఒకరేమో ఏక పార్టీ మెజారిటీని కలిగి సంకీర్ణంలో అనేకమంది ఇతరులను భాగస్వాములుగా చేసుకుని ఉన్నారు. మరొకరేమో శాసనసభ మొత్తంగా తన పార్టీ సభ్యులతోనే నిండి పోయి ఉన్న ప్రభుత్వానికి అధినేతగా ఉంటున్నారు. వీరిరువురూ తామేం చేయదల్చుకుంటే అది చేయగలిగి న స్థితిలో ఉన్నారు. కానీ ఇరువురూ నేటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రతాప్ భాను మెహతా రాసిన ట్లుగా నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేయకూడదా అనే ధోరణిలో కొట్టుకుపోతున్నారు. అయితే మెహతా ఆ వ్యాసంలో ఆమ్ఆద్మీ పార్టీపై కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పడ్డారనుకోండి. ప్రస్తుతం మోదీమయమైపోయి ఉన్న బీజేపీ తన దైన నష్టాన్ని, మానసిక భారాన్ని ఇప్పటికే కలిగి ఉంది. మోదీ ఆహార్యం పార్లమెంటరీ తత్వంతో లేదనీ, మొర టైన, ఆకస్మిక ప్రశ్నలు సంధించే సమూహంతో అది వ్యవహరించలేదనీ మెహతా ఆ వ్యాసంలో రాశారు. ‘పార్లమెంటును సీరియస్‌గా తీసుకోవడానికి మోదీ నిరాకరించడంతో శక్తిలేని ప్రతిపక్షానికి కాస్త ఊతమిచ్చి నట్లయింది. మోదీ పార్లమెంటులో తన స్థానంలో కూ ర్చుని ఉన్నట్లయితే ఆయన పార్టీ వీధులకెక్కవలసి వచ్చేది కాదు.’ తానూ, తన పార్టీ తప్పుకు ప్రతితప్పు కు సంబంధించిన మొండితనంలో కాంగ్రెస్‌తో పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ‘తాను గత ఎన్నికలను కోల్పోలేదని, తననుంచి ఎన్నికలను దొంగిలించుకుపోయార’న్న చందంగా అది ఆలోచిస్తు న్నదని కూడా మెహతా రాశారు. రైటయినా, తప్పయినా సరే.. కేజ్రీవాల్ కూడా ఈ తప్పుకు ప్రతి తప్పు ఆటలో వెనుకబడిలేరు. తన వెనుక కూడా ప్రభుత్వం ఎవరనే విషయాన్ని నిర్ణయిం చడానికి భీషణ కాంక్షా నృత్యం చేస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉన్నారు మరి. కేజ్రీవాల్ కార్యాలయానికి సంబద్ధతే లేదని ఈ లెఫ్టినెంట్ గవర్న ర్ ప్రకటించడం రాజ్యాంగ లోపం. దాంతో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడానికి బదులుగా కేజ్రీవాల్ కూడా నజీబ్ మూర్ఖత్వంతో పోటీపడుతున్నారు. ఈ ఇరువురూ చక్కగా చర్చలకు ప్రయత్నించి ప్రజాగ్ర హం నుంచి బయటపడి ఉండవచ్చు. కానీ ప్రదర్శనలకు కూడా రాజకీయాలు కావాలి మరి. గత 15 నెలలుగా తన ప్రభుత్వ ప్రయోజనాలపై పడి ఊగుతున్న ప్రధాని తాము లాభపడ్డామన్న భావ నను ప్రజలకు అందించగలిగారా? ఎర్రకోట ప్రాకా రాన్ని ఎన్నికల ర్యాలీలా కాకుండా జాతిని విశ్వాసం లోకి తీసుకునే కార్యక్రమంగా ఆయన చేయగలిగారా? తన ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందన్న ఆరోపణ కూడా రాలేదని మోదీ మాట్లాడ వచ్చు కానీ దేశవ్యాప్తంగా అవినీతి వ్యవహారాలు కాస్తం త కూడా బలహీనపడలేదు. నిరుపేదల వైద్య అవసరాలను తీర్చడానికి మొహల్లా క్లినిక్‌లను తన ప్రభుత్వం ఏర్పరుస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్లినిక్‌లలో ఎయిర్ కండిషన్ తోపాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయని, పైగా ఇక్కడ వైద్య సేవ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. తన స్వాతంత్య్ర దినోత్స వ ప్రసంగంలో, ప్రతి క్లినిక్‌ని రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పరుస్తామని చెప్పారు. ఆ ఖర్చుతో ఢిల్లీ ప్రభుత్వం అలాంటి 25 క్లినిక్‌లను ఏర్పర్చగలదు. కాని ఈ 24 క్లినిక్లకయ్యే ఖర్చు ఎక్కడికి మాయమవుతున్నట్లో మరి. ఈ విషయంపై మీకెంత సందేహం ఉందో నాకూ అంతే సందేహం ఉంది. ఇలాంటి కుంభకోణాలు దేశ మంతా కొనసాగుతూనే ఉన్నాయి. సగటు మనిషి మాత్రం కేంద్రం, రాష్ట్రాలు, లేదా తన ప్రాథమిక అవసరాలతో వ్యవహరిస్తున్న మునిసి పాలిటీలలో వేటి కారణంగా ఈ మోసం జరుగుతోం దన్న అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. చురు కైన లేదా బాగా నిర్వహిస్తున్న సంస్థల ద్వారా ఆ సౌక ర్యాలు తనకు అందుతున్నాయా అని కూడా సగటు మనిషి పట్టించుకోవడం లేదు కానీ తన జీవితం మా త్రం తననుంచి దొంగిలిస్తున్న కిరాయిదార్ల వల్ల కష్టాల పాలవుతోందన్న విషయం అతడికి బాగా తెలుసు. ఈ విషయమై కేజ్రీవాల్ ప్రస్తావించిన ఒక ఉదాహరణ మోదీ ప్రకటనలన్నింటికన్నా ఎక్కువగానే చెప్పింది. మనలో లంచం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఆ కేన్సర్ ఇంకా అంతరించిపోలేదని, కనీస స్థాయికి అది తగ్గిపో లేదని కూడా తెలుసు. మన జీవితాల్లోని ప్రతి కోణాన్ని అది తాకింది. లంచం ఇవ్వాల్సిందిగా మనల్ని కోరు తూ, డిమాండ్ చేస్తూ లేదా బెదిరిస్తూ వస్తున్న వారికి కూడా అది మాయం కాలేదని తెలుసు. ఎందుకంటే తమ దురాశను వదిలిపెట్టడానికి వారిష్టపడటం లేదు. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల ఉన్నతాధికార వర్గానికి అవినీతిపై ఉత్తేజభరితమైన సెషన్లను నిర్వ హించి, సామాన్యుల్లాగే జీవించమని, సంపదల పట్ల వ్యామోహాన్ని వదులుకోవాలని బోధించారు. కాని అన్ని ధర్మోపదేశాల్లాగానే ఇదీ అటకెక్కేసింది. భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ, ఆప్ నేటికీ తమ పరిపా లనను వేగవంతం చేయడంలో కొట్టుమిట్టులాడు తూనే ఉన్నారు. వారు ఎంత సేపటికీ అవినీతిని వ్యవస్థీకృత వాస్తవం (మోదీ దాన్ని వ్యాధి అని పిలిచారు) గానే మాట్లాడుతున్నారు తప్పితే, అది కూడా నివారించగలిగిన ఒక దీర్ఘ వ్యాధి అని చెప్పలేకపోతున్నారు. అవును ఇది నిరాశావాదమే. కానీ ఆశా వాదానికి ఇప్పుడు ఎక్కడైనా చోటుందా? స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అవినీతి నిర్మూలన గురించి మనం వింటూ రావడం లేదా? బహుశా, ఇకపై కూడా మనం దాన్ని వింటూనే ఉండవచ్చు. - మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. ఈమెయిల్: mvijapurkar@gmail.com)