ఆత్మవిమర్శ అవసరం
సందర్భం
ఆ ఘటన ఆశ్చర్యభరితం. ఎర్రకోట నుంచి నరేంద్ర మోదీ బయటకు వచ్చిన వెంటనే దూరదర్శన్ జాతీయ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం. టీవీ తెరపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షమయ్యారు. తన కార్యాలయం నుంచి ఆయన కూడా మరోసారి 69వ స్వాతంత్య్ర దినోత్సవం గురించి మాట్లాడుతూ కనిపించారు. తర్వాతి వంతు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ది. ఆ తర్వాత ఉన్నట్లుండి.. ప్రతి సంవత్సరం జాతినుద్దేశించి ప్రధాన మంత్రులు ప్రసంగించే స్థలమైన ఎర్రకోటపై ఒక డాక్యుమెంటరీ ప్రసారమైంది.
వ్యవస్థపై బాధ్యత మోపుతూనే, గణతంత్ర రిపబ్లి క్‌లోని పౌరులకు గరిష్ట ప్రయోజనాలను కల్పించేందు కోసం తప్పులను సరిదిద్దే ప్రయత్నాల గురించి తొలి ఇరువురు వక్తలూ చేసిన ప్రసంగాల ఒరవడి గుర్తించ దగినది. మోదీ దృష్టి దేశంపై ఉండగా, కేజ్రీవాల్ దృష్టి జాతీయ రాజధానికే పరిమితమయింది. ప్రజల సంక్షే మానికి కఠినశ్రమ, సమగ్రత ఎంతగా తోడ్పాటుని స్తాయి అనే అంశంపై ఆయన దృష్టిపెట్టారు. మరోవైపు న మోదీ మొత్తం దేశ జనాభాను ‘125 కోట్ల నా టీమ్ ఇండియా’గా అభివ ర్ణించడం అందరినీ కదిలించింది. కేజ్రీవాల్ మాత్రం తానెంచుకున్న పరిధికి కట్టుబడ్డారు.
ఏమైనప్పటికీ వీరిరువురూ ప్రస్తుతం చారిత్రక తీర్పు శిఖరంపై నిలిచి ఉన్నారు. ఒకరేమో ఏక పార్టీ మెజారిటీని కలిగి సంకీర్ణంలో అనేకమంది ఇతరులను భాగస్వాములుగా చేసుకుని ఉన్నారు. మరొకరేమో శాసనసభ మొత్తంగా తన పార్టీ సభ్యులతోనే నిండి పోయి ఉన్న ప్రభుత్వానికి అధినేతగా ఉంటున్నారు. వీరిరువురూ తామేం చేయదల్చుకుంటే అది చేయగలిగి న స్థితిలో ఉన్నారు. కానీ ఇరువురూ నేటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రతాప్ భాను మెహతా రాసిన ట్లుగా నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేయకూడదా అనే ధోరణిలో కొట్టుకుపోతున్నారు. అయితే మెహతా ఆ వ్యాసంలో ఆమ్‌ఆద్మీ పార్టీపై కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పడ్డారనుకోండి.
ప్రస్తుతం మోదీమయమైపోయి ఉన్న బీజేపీ తన దైన నష్టాన్ని, మానసిక భారాన్ని ఇప్పటికే కలిగి ఉంది. మోదీ ఆహార్యం పార్లమెంటరీ తత్వంతో లేదనీ, మొర టైన, ఆకస్మిక ప్రశ్నలు సంధించే సమూహంతో అది వ్యవహరించలేదనీ మెహతా ఆ వ్యాసంలో రాశారు. ‘పార్లమెంటును సీరియస్‌గా తీసుకోవడానికి మోదీ నిరాకరించడంతో శక్తిలేని ప్రతిపక్షానికి కాస్త ఊతమిచ్చి నట్లయింది. మోదీ పార్లమెంటులో తన స్థానంలో కూ ర్చుని ఉన్నట్లయితే ఆయన పార్టీ వీధులకెక్కవలసి వచ్చేది కాదు.’ తానూ, తన పార్టీ తప్పుకు ప్రతితప్పు కు సంబంధించిన మొండితనంలో కాంగ్రెస్‌తో పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ‘తాను గత ఎన్నికలను కోల్పోలేదని, తననుంచి ఎన్నికలను దొంగిలించుకుపోయార’న్న చందంగా అది ఆలోచిస్తు న్నదని కూడా మెహతా రాశారు.
రైటయినా, తప్పయినా సరే.. కేజ్రీవాల్ కూడా ఈ తప్పుకు ప్రతి తప్పు ఆటలో వెనుకబడిలేరు. తన వెనుక కూడా ప్రభుత్వం ఎవరనే విషయాన్ని నిర్ణయిం చడానికి భీషణ కాంక్షా నృత్యం చేస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉన్నారు మరి. కేజ్రీవాల్ కార్యాలయానికి సంబద్ధతే లేదని ఈ లెఫ్టినెంట్ గవర్న ర్ ప్రకటించడం రాజ్యాంగ లోపం. దాంతో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడానికి బదులుగా కేజ్రీవాల్ కూడా నజీబ్ మూర్ఖత్వంతో పోటీపడుతున్నారు. ఈ ఇరువురూ చక్కగా చర్చలకు ప్రయత్నించి ప్రజాగ్ర హం నుంచి బయటపడి ఉండవచ్చు. కానీ ప్రదర్శనలకు కూడా రాజకీయాలు కావాలి మరి.
గత 15 నెలలుగా తన ప్రభుత్వ ప్రయోజనాలపై పడి ఊగుతున్న ప్రధాని తాము లాభపడ్డామన్న భావ నను ప్రజలకు అందించగలిగారా? ఎర్రకోట ప్రాకా రాన్ని ఎన్నికల ర్యాలీలా కాకుండా జాతిని విశ్వాసం లోకి తీసుకునే కార్యక్రమంగా ఆయన చేయగలిగారా? తన ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందన్న ఆరోపణ కూడా రాలేదని మోదీ మాట్లాడ వచ్చు కానీ దేశవ్యాప్తంగా అవినీతి వ్యవహారాలు కాస్తం త కూడా బలహీనపడలేదు.
నిరుపేదల వైద్య అవసరాలను తీర్చడానికి మొహల్లా క్లినిక్‌లను తన ప్రభుత్వం ఏర్పరుస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్లినిక్‌లలో ఎయిర్ కండిషన్ తోపాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయని, పైగా ఇక్కడ వైద్య సేవ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. తన స్వాతంత్య్ర దినోత్స వ ప్రసంగంలో, ప్రతి క్లినిక్‌ని రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పరుస్తామని చెప్పారు. ఆ ఖర్చుతో ఢిల్లీ ప్రభుత్వం అలాంటి 25 క్లినిక్‌లను ఏర్పర్చగలదు. కాని ఈ 24 క్లినిక్‌లకయ్యే ఖర్చు ఎక్కడికి మాయమవుతున్నట్లో మరి. ఈ విషయంపై మీకెంత సందేహం ఉందో నాకూ అంతే సందేహం ఉంది. ఇలాంటి కుంభకోణాలు దేశ మంతా కొనసాగుతూనే ఉన్నాయి.
సగటు మనిషి మాత్రం కేంద్రం, రాష్ట్రాలు, లేదా తన ప్రాథమిక అవసరాలతో వ్యవహరిస్తున్న మునిసి పాలిటీలలో వేటి కారణంగా ఈ మోసం జరుగుతోం దన్న అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. చురు కైన లేదా బాగా నిర్వహిస్తున్న సంస్థల ద్వారా ఆ సౌక ర్యాలు తనకు అందుతున్నాయా అని కూడా సగటు మనిషి పట్టించుకోవడం లేదు కానీ తన జీవితం మా త్రం తననుంచి దొంగిలిస్తున్న కిరాయిదార్ల వల్ల కష్టాల పాలవుతోందన్న విషయం అతడికి బాగా తెలుసు. ఈ విషయమై కేజ్రీవాల్ ప్రస్తావించిన ఒక ఉదాహరణ మోదీ ప్రకటనలన్నింటికన్నా ఎక్కువగానే చెప్పింది.
మనలో లంచం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఆ కేన్సర్ ఇంకా అంతరించిపోలేదని, కనీస స్థాయికి అది తగ్గిపో లేదని కూడా తెలుసు. మన జీవితాల్లోని ప్రతి కోణాన్ని అది తాకింది. లంచం ఇవ్వాల్సిందిగా మనల్ని కోరు తూ, డిమాండ్ చేస్తూ లేదా బెదిరిస్తూ వస్తున్న వారికి కూడా అది మాయం కాలేదని తెలుసు. ఎందుకంటే తమ దురాశను వదిలిపెట్టడానికి వారిష్టపడటం లేదు. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల ఉన్నతాధికార వర్గానికి అవినీతిపై ఉత్తేజభరితమైన సెషన్లను నిర్వ హించి, సామాన్యుల్లాగే జీవించమని, సంపదల పట్ల వ్యామోహాన్ని వదులుకోవాలని బోధించారు. కాని అన్ని ధర్మోపదేశాల్లాగానే ఇదీ అటకెక్కేసింది.
భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ, ఆప్ నేటికీ తమ పరిపా లనను వేగవంతం చేయడంలో కొట్టుమిట్టులాడు తూనే ఉన్నారు. వారు ఎంత సేపటికీ అవినీతిని వ్యవస్థీకృత వాస్తవం (మోదీ దాన్ని వ్యాధి అని పిలిచారు) గానే మాట్లాడుతున్నారు తప్పితే, అది కూడా నివారించగలిగిన ఒక దీర్ఘ వ్యాధి అని చెప్పలేకపోతున్నారు. అవును ఇది నిరాశావాదమే. కానీ ఆశా వాదానికి ఇప్పుడు ఎక్కడైనా చోటుందా? స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అవినీతి నిర్మూలన గురించి మనం వింటూ రావడం లేదా? బహుశా, ఇకపై కూడా మనం దాన్ని వింటూనే ఉండవచ్చు.
- మహేష్ విజాపుర్కార్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. ఈమెయిల్: mvijapurkar@gmail.com)