Mahesh Vijapurkar
-
పరువు తీసిన విశ్వసనీయత
ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనాలను ప్రత్యర్థులు కేజ్రీవాల్ క్షమాపణలతో సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకు పోయింది. తెలుగుదేశం కుట్రపన్నుతోం దని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు 1980ల ఆరంభంలో ఆరోపించారు. దానికి సంబంధించిన లిఖిత పూర్వక వివరాలు ‘తగిన సమయంలో’ వెల్లడిస్తానని తర్వాత ముఖ్యమంత్రి, గవ ర్నర్ పదవులు చేపట్టిన ఈ నేత ప్రకటించారు. అయితే, తర్వాత ఆయన ఆ పని చేయ లేదు. ‘‘ మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే ఇప్పుడే ఈ ఆరోప ణను నిరూపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?’’ అని కర్నూలు విలేకరుల సమావేశంలో ప్రశ్నించాను. ఈ విషయం నేతల విశ్వసనీయతకు సంబంధించినది. అనేక పత్రికలు ఆయన ఆరోపణను ప్రచురించాయి. కానీ, ఆయన చెప్పిన విషయాన్ని నేను పనిచేస్తున్న ‘ద హిందూ’ పత్రికలో రాయడానికి నేను ఇష్టపడలేదు. అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు. పుకార్లు వ్యాప్తి చేసే సంస్థలు కూడా నెమ్మదిగానే పనిచేసేవి. ఇప్పటిలా ఇంటర్నెట్లో నిరాధార ఆరోపణలు, వార్తలు వ్యాప్తి చేయడం నాడు ఊహించడానికి కూడా అసాధ్యం. అబ ద్ధాలు, అవాస్తవాలతో ప్రజాభిప్రాయాన్ని విజయవం తంగా కోరుకున్న విధంగా మలచుకోవడం ఇప్పుడు పద్ధతి ప్రకారం జరుగుతోందనే వాస్తవం మనకు తెలుసు. పరిస్థితులు ఎంతగా మారిపోయాయంటే నేడు ఏది సత్యమో కనీసం నమ్మదగిన సమాచారంగా కూడా మనకు తెలియడం లేదు. అంటే, నిజం అనేది నిర్ధారిం చుకోదగిన లేదా అందుబాటులో ఉన్న వాస్తవం స్థాయికి దిగజారిపోయింది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రజలు అర్థం చేసుకుని, నిర్ణయించుకునే సమాచారం ఇలా పంపిణీ అవుతోంది. ఇక వాట్సాప్ ద్వారా వాయు వేగంతో వచ్చిపడే అంశాల్లో ఏది సమాచారం? ఏవి గాలి కబుర్లో తేల్చుకోవడం కష్టం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు తప్ప మొత్తం సీట్లను కైవసం చేసుకున్నాక దేశంలో అత్యంత నమ్మదగిన రాజకీయ నాయకుడిగా అవతరించారు. అన్ని పార్టీలూ ఆప్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయనే కారణంగా ప్రజలు కేజ్రీవాల్ మాటలు నమ్మారు. అప్పట్లో ఆప్‌ను అప్రదిష్ట పాల్జేయడానికి స్టింగ్ ఆపరేషన్ పేరిట రూపొందించిన వీడియోలను ఇష్టారాజ్యంగా మార్చేసి అన్ని రాజకీయపక్షాలూ చేయని ప్రయత్నాలు లేవు. సామాన్యుడికి నిర్ణాయక శక్తి ఉండే కొత్త తరహా రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న రోజులవి. కేజ్రీవాల్ అప్పుడు చేసిన ఆరోపణలన్నిటినీ జనం విశ్వ సించారు. రాజకీయనాయకులు, పార్టీలు మోసపూరిత కుయుక్తులతో ఓట్లు సంపాదించి అధికారంలో కొన సాగుతూ ఆటలాడుకుంటారన్న విషయం మనలాంటి సామాన్య ప్రజానీకానికి తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రను దెబ్బదీయడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ తన ఆరోపణలను రుజువు చేసు కోలేకపోయారు. ఫలితంగా వీటికి సంబంధించి దాఖ లైన పరువునష్టం దావాలపై విచారణ ముగియక ముందే ఆయన ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పుకోవాల్సివచ్చింది. సామాన్య ప్రజానీకం ముఖ్య విషయాలను రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయకుండా తామే స్వయంగా నిర్ణ యించే వేదికలా ఆమ్ఆద్మీ పార్టీ నాకు కనిపించింది. కేజ్రీవాల్ నేడు విశ్వసనీయత కోల్పోవడంతో ఓ ఆదర్శ రాజకీయ వేదికగా ఆప్ బలహీనమైంది. ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్‌ను పూర్తిగా లొంగిపోయిన నేతగా చిత్రిస్తున్నారు. నలుగురికి క్షమాపణలతో కేజ్రీవాల్ పరువు పోయింది! ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ క్షమా పణ చెప్పారు. అంతకు ముందు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీఠియాకు, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ కొడుకు అమిత్ సిబ్బల్‌కు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సివచ్చింది. జైట్లీ–ఢిల్లీ క్రికెట్ క్లబ్ సంబంధంపైన, పంజాబ్‌లో మాదకద్రవ్యాలకు మజీఠియాకు ఉన్న వ్యవహారంపైన తాను చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ నిరూపించు కోలేకపోయారు. ఆయనపై ఇంకా ఇలాంటి కేసులు చాలా ఉన్నందున పరిపాలనపై దృష్టి పెట్టడానికే ప్రత్య ర్థులకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారని సమర్థించు కోవడం తేలికే. ఆప్‌లో నానాటికీ పెరుగుతున్న అంతర్గత కీచు లాటలను అదుపు చేసి పార్టీని సమైక్యంగా ఉంచ డానికి పరువునష్టం కేసుల నుంచి త్వరగా బయటపడితే మేలని కేజ్రీవాల్ భావించి ఈ పనిచేశారని కూడా వివరించ వచ్చు. అయితే, కేజ్రీవాల్ ఇతర రాజకీయ నాయకుల మాదిరి ఎదిగిన నేత కాదు. ఆయన అనుసరించిన కొత్త తరహా రాజకీయాలను ఓడించడానికి అన్ని పార్టీలూ రహస్యంగా చేతులు కలిపాయి. ఆయన అందరికీ సవా లుగా, ముప్పుగా నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు కేజ్రీ వాల్ క్షమాపణల కారణంగా అన్ని పక్షాలూ లబ్ధిపొందు తాయి. ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవ ర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనా లను ఆయన క్షమాపణలతో ప్రత్యర్థులు సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకుపోయింది. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు mvijapurkar@gmail.com -
నిషేధం అమలయ్యేనా?
విశ్లేషణ ప్లాస్టిక్ నిషేధంలో సానుకూల కారణమేదంటే.. తయారీదారు, సరఫరాదారుతోపాటు వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో జాప్యమే నిషేధం అమలులో ప్రధాన అవరోధం. ప్లాస్టిక్ వినియోగంపై నిషేధానికి సంబంధించిన అనుభవం సానుకూలంగా మాత్రం లేదు. మహారాష్ట్రలోని దాదాపు అన్ని మునిసిపల్ కార్పొరేషన్లలో 20 మైక్రాన్లకంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ పదార్థాలను నిషేధించారు కానీ, రెండు సాధారణ కారణాల వల్ల ఈ నిషేధం ఉల్లంఘనకు గురవుతోంది. ఒకవైపు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్లడం సౌకర్యవంతంగా ఉండటం, మరోవైపు ప్లాస్టిక్ నియంత్రణ యంత్రాంగం నిబంధనలను పట్టించుకోకపోవడం. ప్లాస్టిక్ మురుగుకాలువలను అడ్డుకుంటుంది. బహిరంగ స్థలాలను చెత్తతో నింపుతుంది. డంపింగ్ కేంద్రాలలో ప్లాస్టిక్ పోగుపడుతోంది. ప్రతి సంవత్సరం నగరాల్లో వరదలకు భారీవర్షాలు కారణం కాదు. మురుగుకాలవలను ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డుకోవడం వల్లే కారణమని తెలిసిందే. ఇప్పుడు ఉన్నట్లుండి మహారాష్ట్ర ప్రభుత్వం ఉగాది (గుడిపర్వ) నుంచి ప్లాస్టిక్ నిషేధంపై జీవో జారీ చేసింది. కానీ ఇది ఎలా అమలవుతుందన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఈ నిషేధం ఎందుకు పనిచేస్తుందో, ఎందుకు పని చేయదో చెప్పడానికి ప్రాథమికంగా రెండు కారణాలున్నాయి. సానుకూల కారణమేదంటే, ప్లాస్టిక్ తయారీదారు, సరఫరాదారు మీదే కాకుండా వినియోగదారుపై కూడా జరిమానా విధిస్తారు. అందుకే ఇప్పటికే జనాభాలోని ఒక చిన్న విభాగం ఈ కొత్త నిబంధనకు కట్టుబడాలని నిర్ణయించుకుంది. పర్యావరణ కారణాలపై కాదు కానీ జరిమానా భయంతోనే అన్నది నిజం. ఎందుకంటే ప్లాస్టిక్‌ని వినియోగించినందుకు తొలిసారి తప్పు కింద రూ. 5,000లు రెండో తప్పుకు రూ. 10 వేలు జరిమానా విధిస్తారు, ఇక మూడో తప్పుకింద రూ. 25,000ల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మరో కోణం ఏదంటే, ప్లాస్టిక్ నిషేధ యంత్రాంగం పనితీరులో జాప్యం కారణంగా ప్లాస్టిక్ సంచులను చాలా షాపులు ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నాయి. నిఘా యంత్రాంగం క్రియాశీలం అయ్యేంతవరకు వీటిని ఉపయోగిస్తూనే ఉంటారు. ప్లాస్టిక్ చెత్తను సేకరించే కేంద్రాలను నెలలోపు ఏర్పర్చి వినియోగించిన ప్లాస్టిక్ వ్యర్థాలను వాటిలో ఉంచాలని అన్ని ప్రభుత్వ సంస్థలకూ ఆదేశాలు వెళ్లాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందని ప్రశ్నార్థకమే. ఇలా సేకరించిన చెత్తలో ప్లాస్టిక్ సంచులు, స్పూన్లు, థర్మోకోల్ వంటివి ఉంటాయి. వీటిని విస్తృతంగా వినియోగిస్తున్న రీత్యా వీటి నిషేధం పెద్ద లక్ష్యమే అవుతుంది. అదే సమయంలో ఇప్పటికే తయారీదారుల వద్ద ఉన్న ప్లాస్టిక్ నిల్వలను అవి అమ్ముడయేంతవరకు మార్కెట్లోకి తీసుకురావచ్చని ప్రభుత్వం అనుమతించింది. ఒక నెలలో ఈ నిల్వలన్నీ ఖాళీ చేయాలనడం అయోమయం కల్గించే వైరుధ్యమే. పెద్దపెద్ద బాటిళ్లు కాకుండా నీటిని నిల్వచేసిన అర్ధ లీటర్ బాటిళ్లను వదిలించుకోవలసిన చెత్తగా ప్రకటించడం గందరగోళం కలిగిస్తోంది. ఇది తర్క విరుద్ధంగా ఉంది. బ్రాండ్ ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశం చెబుతోంది. ప్యాక్ చేసిన ప్లాస్టిక్ పట్ల జాగ్రత్త వహించాల్సిన బాధ్యత రిటైలర్లమీదే ఉంటుందని 2016లో ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవానికి పూర్తిగా విఫలమైంది. అందుకే ఇప్పుడు కూడా వాటిని మినహాయించారు. మరింత చిక్కు ఏమిటంటే పాల ప్యాకెట్లతో వ్యవహరించవలసి రావడం. పాల ప్యాకెట్లను డెయిరీలు సేకరించి వాటిని మళ్లీ రీసైకిల్ చేస్తుం టాయి. అయితే అసంఘటిత రంగంలో సాగుతున్న పాల పంపిణీ రంగం ఈ కొత్త ఆదేశాలతో ఎలా వ్యవహరిస్తుందన్నది అస్పష్టమే. పాల ప్యాకెట్లు, బాటిళ్ల తయారీదారులను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోలేదు. పునర్వినియోగానికి సిద్ధం కావలి సిందిగా వీరికి ప్రభుత్వం చెప్పడం లేదు. పైగా ఇలాంటి వాటిని ఏర్పర్చుకోవడం రాత్రికి రాత్రే జరిగిపోదు. ఒక బ్యాగ్ రీసైకిల్ చేసే ప్రక్రియలో 50 పైసలు పాల డైరీకి వెళుతుంది. అలాగే, బ్యాటిల్ తయారీదారులు 500 మిల్లీ లీటర్ల బ్యాటిల్‌కి రూపాయి లెవీ వసూలు చేస్తారు. ముందే చెప్పినట్లుగా ప్రభుత్వాదేశం ప్రకారం ప్లాస్టిక్ బ్యాటిల్స్ పునర్వినియోగ వసతుల ఏర్పాటు చట్టం చేసినంత సులభమైన విషయం మాత్రం కానే కాదు. పైగా ఇక నుంచి ఆహారం రుచి కూడా కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత దానిలోని దినుసుల రుచి మారిపోవచ్చు లేదా మార్పులేకుండా ఉండవచ్చు. కానీ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలు అనే మంచి ఉద్దేశం కూడా మహారాష్ట్రకు పెద్ద సమస్యే అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే 1000 బ్యాటిల్స్ తయారీ సంస్థలను మూసివేసింది. వాటిలో 500 సంస్థలు చాలా పెద్దవి. రోజుకు మహారాష్ట్రలో 30 లక్షల నీటి బ్యాటిళ్లు అమ్ముడవుతుంటాయి. వీటన్నింటినీ కలిపితే సంవత్సరానికి అయిదు లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం పోగుపడుతుంది. దీన్ని ఉన్న పళానా తొలగించడం అన్నదే ప్రధాన సమస్య. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
నిజాయితీకి నిదర్శనాలు
విశ్లేషణ దమ్ముంటే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బదిలీ చేయాలంటూ థానే మునిసిపల్ కమిషనర్ చేసిన సవాలు నేతలకు షాక్ కలిగించింది. నిబంధనలకు కట్టుబడే అధికారుల ధోరణి పెరుగుతుండటం అభినందనీయం. మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారుల్లో బలపడుతున్న ఒక ధోరణి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరముంది. వారు నియమ నిబంధనలకు కట్టుబడటానికి ప్రయత్నిస్తూ, తమకు అప్పగించిన విధుల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నారు. జనం దృష్టికి వచ్చిన తాజా ఉదంతం ఏమిటంటే, థానె మునిసిపల్ కమిషనర్ ఇటీవలే కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో.. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, దమ్ముంటే తనను బదిలీ చేయాలంటూ సవాలు చేశారు. ఇది తొలిసారి జరిగిన విషయం ఏమీ కాదు. కొన్ని నెలల క్రితం కూడా ఆ అధికారి తాను ముఖ్యమంత్రిని కలిసి బదిలీ చేయించుకుంటానని సర్వ సభ్య సంఘానికి తెలియజేశారు. కాని అతడి ప్రతిపాదనను అప్పట్లో అంగీకరించలేదు. ఇప్పుడు తనపై అవిశ్వాస ప్రకటన చేయాలన్న అతడి డిమాండ్ పట్ల కూడా రాజకీయ నేతలు కలవరపడలేదు. సంజయ్ జైస్వాల్ అనే ఆ అధికారి మరికొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇలాంటి అదికారి విషయంలోనూ వారు నిలకడతనాన్ని పాటించలేదు. పైగా వారు అతడిని అప్రతిష్టపాలు చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎదుగుతున్న లేక ముంబైలాగా కిక్కిరిసిపోయి, జనసమ్మర్థంగా ఉంటున్న థానే నగరం రాజకీయ నేతలకు, మధ్య దళారీలకు అద్భుతమైన అవకాశాలను ఇస్తోంది. నిర్మాణ రంగం ఇక్కడ అతి పెద్ద పరిశ్రమగా మారడంతో రాజకీయ నేతలే దళారీలుగా మారుతున్నారు. నగరం ఎదుగుతున్నట్లయితే, నూతన గృహాల నిర్మాణం వేగం పుంజుకుంటుంది. నగరం ఇప్పటికే ఇరుగ్గా మారి ఉన్నట్లయితే చట్టాలను అతిక్రమించాల్సి ఉంటుంది. అనేక పెద్ద నగరాల్లో నిర్మాణరంగ వాణిజ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాని వాటా కలిగి ఉంటున్నారని చెబుతున్నారు. థానేలో దాదాపు 20 లక్షల మంది జనాభాతో మహారాష్ట్రలో గుర్తించదగిన నగరంగా విస్తరిస్తోంది. కానీ ఇరుగ్గా మారుతుండటంతో నగర పాలనను సమర్థంగా నిర్వహించాల్సిన అవసరమెంతైనా ఉంది. ఇప్పుడు సుపరిపాలన కావాలి. కానీ తమ వ్యక్తిగత అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన రాజకీయనేతలు పురపాలక సంస సమర్థ నిర్వహణపై ఆసక్తి చూపడం లేదు. తనకంటే ముందు పనిచేసిన ఐఏఎస్ అధికారి టి. చంద్రశేఖర్ లాగే జైస్వాల్ కూడా ప్రజానుకూల అధికారి. 2000ల మొదట్లో ఐఏఎస్ అధికారి టి. చంద్రశేఖర్ రాజ కీయ నేతల అడ్డంకులను ఎదుర్కొని థానే నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పించారు. ప్రజాపక్షపాతిగా, నగరాభివృద్దే లక్ష్యంగా కార్యాచరణకు పూనుకున్నారు. అందుకే జైస్వాల్ నేతల దారిలో ముల్లు అయి కూర్చున్నారు. నగర ఆదాయ మార్గాలను పెంచారు. వీటన్నింటితో ప్రజలు అతడి వెన్నంటే నిలిచారు. పైగా నగరంలోని స్వార్థ ప్రయోజన శక్తులను అడ్డుకుంటూ బహిరంగ ప్రకటనలు పంపిణీ చేశారు కూడా. రక్షణ కోసం పురపాలక సంస్థ ఖర్చుతో ప్రైవేట్ బౌన్సర్లను నియమించుకున్న ఏకైక పురపాలక సంస్థ అధినేత బహుశా ఆయనే కావచ్చు. అక్రమ నివాసాలను తొలగిస్తున్నప్పుడు లేక కూల్చివేస్తున్నప్పుడు అతడిని దూషిం చడమే కాకుండా తన డిప్యూటీపై దాడి చేశారు కూడా. జైస్వాల్ ఒంటరి కాదు. నవీ ముంబై కార్పొరేషన్ అధిపతి తుకారాం ముండే కూడా రాజకీయ నేతలకు తలవంచని పాపానికి కొద్దికాలంలోనే బదిలీకి గురయ్యారు. పింప్రి నుంచి చించ్వాద్కు అక్కడి నుంచి నాసిక్కి తరచుగా తన విషయంలో జరిగిన బదిలీలను ఆయన కిమ్మనకుండా, సాహసోపేతంగా స్వీకరించారు కానీ ప్రజాస్వామ్యంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని రాజకీయ నేతలు తోసిపుచ్చరాదని ఈ ఉదంతాలు తెలుపుతున్నాయి. వ్యక్తుల కంటే సంస్థలు చాలా ముఖ్యమైనవి. ఇకపోతే మహేష్ జగాడే ఉదంతాన్ని తీసుకోండి. రాజకీయ నేతలకు వంగి నమస్కారాలు పెట్టకపోవడంతో ఈ అధికారిని కూడా చాలాసార్లు బదిలీలపై పంపారు. ఆహారం, మందుల సంస్థ కమిషనర్ స్థాయిలో ఉన్న తనను జిల్లా స్థాయికి కుదించివేశారు. కానీ ఏ పదవిని అలంకరించినా, స్వార్థ ప్రయోజన శక్తులకు లొంగకుండా తన పని విషయంలో ఆయన రాజీలేకుండా వ్యవహరించారు. మహారాష్ట్రలో పలువురు నిజాయితీ పరులైన అధికారులున్నారు. అవినీతిమయమైన వ్యవస్థ లొసుగులను చక్కదిద్దారు. ఉదాహరణకు దేశంలోనే అతిపెద్దదైన నగరాల్లో ఒకటైన ముంబై పురపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన డిఎమ్ శుక్తాంకర్, చాలాకాలం తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన ఎస్ఎస్. టినైకర్ ఇద్దరూ పురపాలన అనేది పౌరుడి కేంద్రకంగానే ఉండాలని రాజకీయనేతలు, కాంట్రాక్టర్లు తెలుసుకునేలా చేశారు. చంద్రశేఖర్, జైస్వాల్, ముండే వంటివారు ఉత్తమ అధికారులుగా మహారాష్ట్ర నగర పాలనపై తమ ముద్ర వేశారు. మహారాష్ట్రకే కాదు దేశంలోని ప్రతి స్థాయిలోనూ ఇలాంటి మంచి అధికారులు తప్పక పనిచేయాలి. అధికారులు నిబంధనలకు పూర్తిగా కట్టుబడి పనిచేసే ఈ ధోరణి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నట్లుంది. మొదటిగా నగర పాలనకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే నగరాలు పౌర జీవితాల సమ్మేళనం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేశ్ విజాపుర్కర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ప్రజలకు దక్కని ప్రయోజనాలు!
ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ స్వార్థ ప్రయోజనాలు పట్టుసాధిస్తున్నాయి. ప్రజలు నష్టపోయే ప్రక్రియలనే అమలు చేస్తూ వస్తున్నారు. ఈ అసంబద్ధ పరిణామం సంభవించని ప్రాంతం దేశంలో ఎక్కడైనా ఉందా? ఎన్నికైన ప్రజాప్రతినిధి తనను ఎన్నుకున్న ప్రజలనే పట్టించుకోకుండా పోతే ఏం జరుగుతుంది? ఎన్నికైన వారికి ఏమీ కాదు. ఎందుకంటే మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అతడు లేక ఆమెకు తమదైన మార్గాలు ఉండి ఉంటాయి. కులం, డబ్బు, పరి చయాలు, పోలింగ్ సమయంలో అందించే ప్రోత్సాహ కాలతోపాటు గతంలో కండబలం ప్రదర్శించేవారు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఉపయోగించేవారు కూడా. సిద్ధాంతాలు అనేవి కేవలం నటన మాత్రమే, లేదా అవి సీజన్లో అద్దే ఫ్లేవర్ల లాంటివి. ఇవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. మన దేశంలో అయితే దానిపట్ల నమ్మకంతో పనిలేకుండా ఓట్లు సాధించే శక్తి ఉన్నంతవరకు సిద్ధాంతం మారుతూనే ఉంటుంది. హరియాణా ఎమ్మెల్యే గయాలాల్ 1967లో కేవలం పక్షం రోజుల్లోనే మూడుసార్లు పార్టీలు మారినప్పుడు ప్రజాగ్రహం పెల్లుబికింది. చివరకు తన పేరుతో ఆయారాం, గయారాం పేరు కూడా ఇలాంటివారికి స్థిరపడిపోయింది. సైద్ధాం తిక నిబద్ధతే పార్టీలు మారడానికి కారణం కాకపోవచ్చు లాభం ఆశించి పార్టీలు మారటం అనేది ఆధునిక భారత రాజకీయాల్లో తెలియని విషయమేమీ కాదు. ప్రస్తుతం ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి త్వరగా మారిపోతున్నారు. దీని ఉద్దేశం సొంత సీటును కాపాడుకోవడం మాత్రమే కాదు. కుటుంబ పరిరక్షణ కోసం కూడా ఫిరాయిస్తున్నారు. పార్టీలు మారటం అనేది ఇప్పుడు కుటుంబ వ్యాపారంగా మారిపోయింది. దీంతో నియోజకవర్గాలు కూడా వారసత్వంగా తయారయ్యాయి. కాబట్టి ప్రజా ప్రతినిధి అనే పదానికి ఇప్పుడు కాలం చెల్లిపోయింది. దీంట్లో ప్రజలు రెండో స్థానంలోకి పడిపోయారు. దేశంలో చాలా నియోజకవర్గాలు ఇప్పుడు వారసత్వ జమానాలుగా మారాయి. పలువురు జాతీయ నేతలు కూడా దీంట్లో భాగమే. కనీసం ఒక జాతీయ పార్టీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగితే ఆ పార్టీ నేతలు భోజనాల బల్ల వద్ద విస్తరించిన పెద్ద కుటుంబంలా కనిపిస్తుంటారు. ప్రజలకు దీంతో ఏవగింపు కలుగుతోంది. రాజకీయాల్లో భవన నిర్మాతలు ప్రవేశించడంతో మేం ఇక ఎవరిని సంప్రదించాలి అని సామాజిక కార్యకర్తలు ఆవేదన చెందుతుంటారు. 1,560 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి వారు పోరాడుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు ఇది మునకలో ఉంటుంది. ఒకప్పుడు మాగాణినేలగా ఉన్న దీన్ని తర్వాత ఉప్పు తయారీకి లీజుకిచ్చేశారు. బృహన్ ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో వాసై–విరార్‌లో ఉంటున్న భూమి ఒక అభివృద్ధి కేంద్రంగా గుర్తింపు పొందింది. చెరువులు, కుంటలను ఆక్రమించి కాలనీలుగా మార్చిన హైదరాబాద్ తరహాలోనే వాసై–విరార్ ప్రాంతాన్ని కూడా గత సంవత్సరం వర్షాలు ముంచెత్తాయి. ముంబై ఇప్పుడు రుతుపవనాల సమయంలో ఏర్పడే జలాశయాలను కోల్పోయింది. వాటిని ముట్టకుండా ఉండి ఉంటే నగర ప్రాంతాలకు అది ఊపిరి పోసేది. కాని రాజకీయాలతో కలగలిసిన రియల్ ఎస్టేట్ లాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం నగరంలోని అనేక ప్రాంతాల్లో తిష్ట వేసింది. వాసై–విరార్ కేసును చూస్తే, ఆ నియోజకవర్గం, పురపాలక సంస్థ దాదాపుగా ఒక కుటుంబం యాజమాన్యంలో ఉంది. వీరు భారీస్థాయిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో, నిర్మాణ రంగంలో మునిగితేలుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామీణ పట్టణ ప్రాదేశిక వాతావరణాన్ని ప్రజలు కోల్పోతున్నారు. ప్రజా ప్రతినిధులు తమ సొంత వ్యాపార ప్రయోజనాలను కాకుండా తమ నియోజకవర్గ సామూహిక ప్రయోజనాలను గౌరవించాలని ప్రజలు భావిస్తున్నారు. కానీ మన రాజకీయ, పాలనా నీతి నేపథ్యాన్ని చూస్తే సొంత ప్రయోజనాలే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంటాయి. కానీ అలా జరగకూడదు. వరదల నుంచి తమకు రక్షణ కావాలని ప్రజలు కోరితే దానికి న్యాయం చేకూర్చాలి. అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షను తోసిపుచ్చకూడదు. గత 30 ఏళ్లలో, సుదూరంలోని పట్టణ శివార్లలో ప్రజలకు గోదాములను కట్టి ఉంచేవారు. ఒక ప్రణాళిక, పథకం లేకుండా ఎదుగుతున్న ముంబైకి అవి శ్రామికులను అందించేవి. అభివృద్ధి అంటే 1,560 ఎకరాల భూమిని గ్రోత్ సెంటర్ కోసం తీసుకుని మొత్తం నగర ప్రాంతాన్నే ప్రమాదంలో ముంచెత్తడం అని కాదు అర్థం. ఆ ప్రాంతం ఇప్పటికే జనంతో నిండి ఉంటే, ఈ భూమిలో జరిగే కొత్త ఆర్థిక కార్యాచరణ లేవనెత్తే సంక్షోభానికి నగరం చెల్లించవలసిన మూల్యం ఎంత? ఇందుకు రాజకీయ వర్గాన్ని మాత్రమే తప్పుపట్టే పనిలేదు. నగర ప్లానర్లు, ప్రభుత్వం కలిసే ఆ వృద్ధి కేంద్రం ఏర్పాటును ప్రతిపాదించాయి. ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ స్వార్థ ప్రయోజనాలు ప్రస్తుతం పట్టుసాధిస్తున్నాయి. ఉన్నతాధికారవర్గం, ఆర్థిక ప్రయోజనాలు చివరకు ప్లానింగ్ కూడా అంతిమంగా ప్రజలు నష్టపోయే ప్రక్రియలనే అమలు చేస్తూ వస్తున్నాయి. ఈ అసంబద్ధ పరిణామం సంభవించని ప్రాంతం దేశంలో ఎక్కడైనా ఉందేమో వెనక్కు తిరిగి ఆలోచించండి. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
‘ఆరోగ్య సంరక్షణ’ కలేనా?
2016లోనే ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ప్రకటించారు. కానీ అది అమలులోకి రాలేదు. 2017 బడ్జెట్ ప్రసంగంలో దీన్ని ప్రస్తావించలేదు. మళ్లీ కొత్త పథకం తేవడంలో అర్థం ఏమిటి? జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకంలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం’ అనే అస్పష్టమైన పదాలున్నాయి. ఇది ఇటీవల పార్లమెంటుకు సమర్పిం చిన కేంద్ర బడ్జెట్ స్వయంగా చాటుకున్న పదబంధం. ఈ కార్యక్రమం పరిధిలోకి 10 కోట్ల కుటుంబాలు రానున్నాయి. కుటుంబానికి సగటున 5గురు సభ్యులని భావిస్తే మొత్తం 50 కోట్లమంది భారతీయులు అంటే జనాభాలో మూడోవంతు మంది ఈ పథకం కిందికి వస్తారు. ఏడాదికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమాగా పొందటం అంటే భారతీయ కుటుంబాలకు నిజంగానే అదొక వరం. దేశంలో చాలామంది అతి స్వల్పమాత్రపు వైద్య ఖర్చులను కూడా భరించలేని స్థితిలో ఉంటున్నారు. మంచి ఆరోగ్య సేవలందించే ఆసుపత్రి వద్దకు ప్రయాణ ఖర్చులు భరించడం కూడా చాలామందికి కష్టమవుతోంది. తమ వేతనాలు కోల్పోవలసిరావడం, కుటుంబాలు ఎదుర్కొనే విషాద పరిస్థితుల గురించి చెప్ప పనిలేదు. కుటుంబంలో సంపాదనపరుడికి వైద్యఖర్చుల భారం మరణంతో సమానమే. దురాశాపరులైన వడ్డీ వ్యాపారుల నుంచి, ఇతరత్రా వైద్య ఖర్చులకోసం తీసుకునే రుణాలను కుటుంబాలు తట్టుకోలేవు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన జాతీయ ఆరోగ్య బీమా ఎప్పుడు, ఎలా అమలు చేస్తారన్నది మనకు తెలీదు. ఈ భారీ పథకానికి అయ్యే వ్యయం గురించి.. ప్రభుత్వం మనకు తెలియపర్చడం లేదు. ఎంత వ్యయం అవుతుందనే అంశాన్ని స్పష్టం చేయకుంటే ఏ ప్రకటనైనా సరే పురుడు పోసుకోవడం కష్టం. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో తెలీదు. ఎందుకంటే 40 శాతం ఖర్చును అవే భరించాలి. అయితే ఏ రాష్ట్రం కూడా దీన్ని దాటవేయాలని భావించదు. కానీ ఇందుకోసం ప్రభుత్వాలు తమ ఆర్థిక వనరులను పునర్నిర్మించుకోవలసి ఉంటుంది. ఇది అంత సులభం కాదు. ఒక బ్లాగులో ప్రచురించిన పరిశోధనా పత్రం ఈ పథకం అమలు గురించి తీవ్ర సందేహాలను వ్యక్తపరిచింది. ఈ పరిశోధనా పత్ర రచయిత్రి మీటా చౌదరి ఒక ఫ్యాకల్టీ మెంబర్. ఆమె అభిప్రాయం ప్రకారం, ‘2016 లోనే ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం గురించి ప్రకటించారు. ప్రతి బీపీఎల్ కుటుంబానికి ఏటా రూ. 1 లక్ష వరకు ఆసుపత్రి ఖర్చులను ఈ పథకం కింద అందించడమవుతుంది. కానీ ఆ పథకం అమలులోకి రాలేదు. పైగా 2017 బడ్జెట్ ప్రసంగంలో దీని ప్రస్తావన కూడా చేయలేదు. ఆనాటి పాత భావనను నేడు కొత్త భావనలో కలిపేశారని మనం భావించినప్పటికీ, అది ఇప్పటికీ కాగితంమీది భావనగానే ఎందుకు మిగిలి ఉందనే ప్రశ్నకు సమాధానాలు లేవు. పైగా ఈ పథకాన్ని ప్రారంభించడానికి అవసరమైన నిధుల పరిమాణం, ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తారు, దాన్ని అమలు చేయడానికి ఎంత సమయం పడుతుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఆరునెలల్లోపు ఈ పథకాన్ని అమలు చేస్తారన్న అంచనా ఉంటోంది. ఈ అంశంలో అర్థం చేసుకోవలసిన మరొక విషయం కూడా ఉంది. ప్రైవేట్ రంగంలోని ఆసుపత్రులన్నీ ఖర్చుల విషయంలో, అనవసరమైన ప్రక్రియల నిర్వహణలో పేరుమోసి ఉన్నాయి. బీమా సంస్థలు వాటిలో కొన్నింటిని అనుమతించనప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు ఉద్దేశపూర్వకంగా పెంచే ఇతర ఖర్చులు కూడా రోగులపై పడే అవకాశముంది. దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు ఏటా రూ. 5 లక్షలను ఆరోగ్య సంరక్షణ కింద అందించడం నిజంగా వరంలాంటిది. అయితే ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ రంగమే దీనిద్వారా లబ్ధి పొందుతుంది. ఇప్పటికే వీటి సామర్థ్యం అవసరానికి మించి పెరిగిపోయి ఉన్నప్పటికీ ఈ కొత్త మార్కెట్‌ను వేగంగా వినియోగించుకునే అవకాశం వీటికే ఉంది. విరాళాల ద్వారా నిర్వహిస్తున్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దేశీయంగా ఎంతో బలహీనంగా ఉంది. కొనసాగుతున్న కొద్ది సంస్థలను పాలనాపరంగా, వైద్యపరంగా కూడా పేలవంగా నిర్వహిస్తున్నారు. వైద్యుల కొరత, మందుల కొరత, డిమాండ్‌తో పోలిస్తే ఎప్పటికీ సరిపోలని అతి తక్కువ నిష్పత్తితో ఉండటం వంటివి ప్రభుత్వ వైద్య వ్యవస్థలకు వినాశ హేతువులుగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఆరోగ్య పథకాలను, వ్యవస్థలను ఎలా నడుపుతున్నాయనేది తెలిసిన విషయమే. కాబట్టి ప్రభుత్వ వైద్య వ్యవస్థలో మార్పులకు సంబంధించిన ప్రకటనలు అమలులో మాత్రం నత్తనడక సాగిస్తాయి. దీంతో అధిక బిల్లులతో ప్రజల ఊపిరి తీసే ప్రైవేట్ రంగం మరింత పెరుగుతూనే ఉంటుంది. జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాలకు ప్రభుత్వం కేటాయించేది పెద్దగా ఉండకపోవడం, ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెరుగుదలకు రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం వంటి వాటి నేపథ్యంలో కనీసం రూ. 1.5 లక్షల ఆరోగ్య పథకానికి రూ. 1,200 కోట్ల కేటాయించడం కూడా చాలా పెద్ద లక్ష్యమే అవుతుంది. ప్రైవేట్ రంగం, వితరణశీలురు ఆరోగ్య సంరక్షణకు ఇస్తున్న తోడ్పాటు నిధుల కేటాయింపులో ప్రభుత్వ నిబద్ధతను సందిగ్ధావస్థలోకి నెడుతున్నాయి. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
మన నగరాలపై కుక్కకాటు
విశ్లేషణ 1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు. ఈ వ్యాసం రెండు రకాల శునక ప్రేమికులకు నచ్చదు. శునకాలను గారాబంగా పెంచుకునేవారు, పెంచకున్నా వీధికుక్కలకు తిండి పెట్టేవారు. మొదటి విభాగంలో మళ్లీ రెండు రకాల వాళ్లున్నారు. పురపాలక సంస్థలనుంచి శునకాలకు లైసెన్స్ తీసుకునేవారు (వీరి సంఖ్య చాలా తక్కువ). అసలు అలాంటి ఆలోచనే చేయనివారు. ఏ పురపాలక సంస్థ అయినా సరే పెంపుడు జంతువులు లేదా వీధికుక్కలు లేక రెండింటి జనాభాను తన పరిధిలో అదుపులోకి తీసుకోగలదు అంటే నమ్మశక్యం కాదు. ఏరకంగా తీసుకున్నా సమాజంలో పెంపుడు కుక్కల కంటే వీధికుక్కల జనాభానే ఎక్కువ. పైగా వీధుల్లో కుక్కలకు తిండిపెట్టడాన్ని వ్యతి రేకించడం అనేది పెద్ద నేరం కిందే లెక్క. అలా చేస్తే జంతువులపై క్రూరత్వ నివారణ సమితి మీపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. నేను శునక ప్రేమికుడిని కాదు. కానీ పెంపుడు కుక్కల యజమానులు, వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారి హక్కులను నేను గుర్తిస్తాను. కానీ వారు కొంచెం బాధ్యతతో వ్యవహరించాలన్నది పలువురి అభిప్రాయం. మీ పెంపుడు కుక్క మీ ముఖం నాకుతూ, మీ పరుపుమీదే పడుకుంటూ ఉన్నప్పుడు మల విసర్జనకు దాన్ని బయటకు ఎందుకు తీసుకెళ్లాలి? తమ కుక్కలు వీధుల్లో మలవిసర్జన చేయడం కోసం కొంతమంది రోజువారీగా కొందరికి డబ్బులిస్తుంటారు. వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారు ఆ చర్యను ఎవరైనా వ్యతిరేకిస్తే మూకుమ్మడిగా వచ్చి మాట్లాడుతుం టారు. సాధారణంగా ఇలాంటివారు ఒకేచోట కుక్కలకు తిండిపెడుతుంటారు కాబట్టి వీధికుక్కల ప్రేమికులకు, ఆ వీధికుక్కలకు కూడా అక్కడే తామేదో శాశ్వత నివాసముంటున్నట్లుగా తిష్టవేయడం పరిపాటిగా అవుతోంది. ఇలాంటి ప్రాంతాలే కుక్క కాట్లకు నెలవులుగా ఉంటాయి. వీధుల్లో కుక్కలకు తిండిపెడుతున్నవారిని ఆ కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయిస్తుంటారా అని అడిగి చూడండి చాలు. ఏ ఒక్కరూ దీనికి నేరుగా సమాధానం ఇవ్వరు. పైగా ఎవరినైనా ఏ కుక్క అయినా కరిచిందా, దానివల్ల ఎవరైనా బాధపడ్డారా అంటూ వాదిస్తుంటారు, ఎదురుప్రశ్నలు వేస్తుంటారు. పైగా కుక్కల జనాభా వృద్ధిని నిలిపేందుకు తగు చర్యలు తీసుకోవడంలో పురపాలక సంస్థకు సహకరించే పని కూడా చేయరు. పురపాలక సంస్థలు కుక్కలను నపుంసకంగా మార్చడంలో ఘోరంగా విఫలమవుతుండటం మరొక విషయం. కానీ శునక ప్రేమికులు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. వీరికి రోడ్డుపైన లేక పక్కన కుక్కలు మలవిసర్జన చేయడం అభ్యంతరం అనిపించదు. కానీ ఆ పక్కనే నడిచి వెళ్లేవారికి ఇది మహా ఇబ్బంది కలిగిస్తుంటుంది. కుక్క విసర్జితాన్ని తీసివేసేం దుకు ఏ ఒక్కరైనా గెరిటలాంటిది తీసుకెళతారా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. మనదేశంలో మనుషులు బహిరంగ మల విసర్జన చేయకుండా నివారించడం అలవిగాని పని అని మనకు తెలుసు. స్వచ్ఛభారత్ సర్‌చార్జి ద్వారా ప్రభుత్వ ప్రచారానికి మనం డబ్బు చెల్లిస్తున్నందున ఈ లక్ష్యం మనపై భారం వేస్తోంది కూడా. కానీ కుక్కలను, ప్రత్యేకించి వీధికుక్కలను ప్రేమించడం అనేది కొద్దిమేరకు పౌర బాధ్యతకు కూడా హామీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా ముంబైలో కుక్క కాటు వల్ల రేబిస్‌కు గురై చాలామంది చనిపోయారు. కుక్కకాటు మరణాల సంఖ్య భీతిగొలిపేదిగా ఉంది. 1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు. దీంతో వీధికుక్కలపై మనమే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వార్త నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళలో కుక్క కాటుకు గురి అయిన వారికి చెల్లిస్తున్న పరిహారం మితిమీరుతోందని, కొన్ని ప్రత్యేక కేసుల్లో అయితే రూ.20 లక్షల రూపాయల దాకా చెల్లించాల్సి వస్తోందని కేరళ ప్రభుత్వం సమీక్షించింది. కుక్కకాటు బాధితులకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. మునిసిపాలిటీలే వీటిని చెల్లిస్తున్నందున వీటిపై మరింత బాధ్యత పెట్టే అవకాశం లేదని తేల్చేసింది. కానీ మనం చూడాల్సింది కుక్కకాటు చెల్లింపులు మితిమిరిపోయాయా అని కాదు. తమ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమవుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇది చిన్న విషయం కాదు. మన దేశంలో దాదాపు మూడు కోట్ల వీధికుక్కలున్నాయి. 20 వేలమంది ప్రతి సంవత్సరం రేబిస్‌తో మరణిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే, మనుషులు నడవడానికి చోటు లేదు కానీ, 1994–2015 మధ్య కాలంలో 13 లక్షల కుక్క కాట్లు నగరంలో నమోదయ్యాయి. దేశంలోని ప్రతి నగరం, పట్టణం కూడా కుక్కకాట్లకు సంబంధించి సంతోషం కలిగించని గణాంకాలను కలిగిఉంటున్నాయి. ఉదాహరణకు భివండీలో రెండవ తరగతి విద్యార్థి ధీరజ్ యాదవ్ ఉదంతం భయం గొలుపుతుంది. చెత్త నిల్వ కేంద్రంలో ఆడుకుంటున్న ధీరజ్ అనుకోకుండా కుక్కపై పడ్డాడు. తోడుగా ఉన్న తొమ్మిది ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క అతడిని ఎంతగా కరిచిందంటే స్థానిక ఆసుపత్రి అతడిని పెద్దాసుపత్రికి తరలించాల్సిందిగా సిఫార్సుచేసింది. చివరకు ధీరజ్ మరణించాడు. కొన్నేళ్ల క్రితం తొమ్మిదేళ్ల షాహిద్ నసీమ్ సయ్యద్ ముఖం, చేతులు, వక్షంపై 100 కుక్కకాట్లు పడ్డాయి. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఇళ్లు చూపే అంతరాలు
ముంబైలో మురికివాడల ఉనికిని చాలామంది గుర్తించనప్పటికీ నగర ఆర్థిక వ్యవస్థకు బాగా దోహదం చేస్తున్న పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోరాదు. నిజానికి మురికివాడలు లేకుంటే ముంబై స్తంభించిపోవచ్చు. విశ్లేషణ భూమ్మీద సంపన్నులు, పేదల మధ్య అంతరం మరీ కొట్టొచ్చినట్లు కనిపించే నగరం ఉందంటే అది ముంబైనే అని చెప్పాలి. దేశంలోనే అతి సంపన్నుడైన ముఖేష్ అంబానీ నివసిస్తున్న 27 అంతస్తుల నివాస భవనం ఇక్కడే ఉంది. 36 ఫ్లోర్లతో టెక్స్టైల్ టైకూన్ గౌతమ్ సింఘానియా నిర్మించిన భారీ భవంతీ ఇక్కడే ఉంది. అనిల్ అంబానీ 19 ఫ్లోర్ల భవనంలో ఉంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్ తన కుటుంబం కోసం తొమ్మిదంతస్తుల భవంతి నిర్మించుకున్నారు. ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా ఏడు ఫ్లోర్లతో కూడిన నివాసంలో కుటుంబంతో ఉంటున్నట్లు తెలిసింది. ఈ సామాజిక శ్రేణిలో ఉంటున్న ఇతరులకు కూడా అద్భుత భవనాలు ఉన్నాయి కానీ పైన చెప్పిన ఆకాశ హర్మ్యాలు వీరికిలేవు. ఈ సంపన్నుల సంపదపై లేక వారి డాంబికాలతో నాకు పేచీ లేదు. కానీ ఇదీ కొన్ని పోలికలకు తావిస్తోంది. నందన్ నీలేకని రాసిన ‘ఇమేజింగ్ ఇండియా: ఐడియాస్ ఫర్ ది న్యూ సెంచురీ’ పుస్తకంలో ఆసియాలోనే అతి పెద్ద మురికివాడగా చెబుతున్న ధారవిలో ఉన్న తుక్కు, తోలు, రీసైక్లింగ్ పరిశ్రమ సంవత్సరానికి 1.7 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని సృష్టిస్తోందని తెలిపారు. ఇది అంబానీ నూతన గృహ నిర్మాణానికి పెట్టినంత వ్యయానికి సమానమని అంచనా. ఈ ఆకాశహర్మ్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా, కనిపించని గుడిసెలు ముంబైలో అధిక భాగంలో వ్యాపించి ఉన్నాయి. వర్ధిల్లుతున్న ఆర్థిక వ్యవస్థతో అతి పెద్దనగరంగా ముంబైకి ఉన్న ప్రతిష్టను ఇది పలుచబారుస్తోంది. మురికివాడల శ్రమతో ముంబై ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న తోడ్పాటును ఆర్థికవేత్తలెవరూ అర్థం చేసుకోలేదు. మురికివాడలు లేకుంటే ముంబై నగరం స్తంభించిపోవచ్చు. మురికివాడల పునరావాస ప్రాధికార సంస్థ ముంబై నగరంలో 12.5 లక్షల గుడిసెల్లో 62 లక్షల మంది గుడిసెవాసులు ఉన్నట్లు తేల్చింది. 1995కి ముందునుంచీ నగరంలో ఉన్న గుడిసె వాసులకు ఉచితంగా గృహాలను కల్పిస్తామని మొదట్లో చెప్పారు. తర్వాత దానిని 2000 సంవత్సరం వరకు పొడిగించారు. ఇక్కడ చెప్పొచ్చే అంశం మురికివాడల ఉనికి, నత్తనడకన నడుస్తున్న వాటి పునరావాసం మాత్రం కాదు. మురికి వాడలు, గుడిసెవాసుల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఇక్కడ చర్చనీయాంశం. ఇటీవలే నగరంలోని అసల్ఫా మురికివాడ సుందరీకరణలో భాగంగా దాని వెలుపలి గోడలకు రంగులద్దారు. గుడిసెవాసుల జీవితాలకు కాస్త రంగులద్దడం అన్నమాట. కంటికి వికారంగా ఉండే వారి జీవితాలను పరోక్షంగా చిన్నచూపు చూసే చర్య ఇది. మురికివాడలకు వెలుపల ఉన్నవారు నగరంలో మురికివాడలు ఉన్నాయన్న విషయాన్ని నమ్మేందుకు కూడా ఇష్టపడరు. పైగా నగరాన్ని వృద్ధి చేయడంలో వారి పాత్రను గుర్తించాలని కూడా వీరు భావించరు. అనియత రంగంలో చాలాభాగం మురికివాడల నిర్వహణలోనే సాగుతోంది. మీ ఇళ్లలో పనిమనుషులు, మీ డ్రైవర్లు లాగే ఫైవ్ స్టార్ హోటల్స్‌లో వెయిటర్లు కూడా ఈ మురికివాడలకు చెందినవారే. చాలా సందర్భాల్లో వీరు నివసించే గుడిసెలు కుటుంబం మొత్తానికి కూడా 100 నుంచి 140 చదరపు అడుగులకు మించి ఉండవు. పునరావాసం కింద వీరికి కల్పిస్తున్న గృహాలు 225 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంటే వారు ఇంతవరకు నివసిస్తున్న నివాస ప్రాంతం ఇప్పుడు రెట్టింపు అవుతుం దన్నమాట. కానీ ఇవి కూడా వారికి అందటం కష్టమే. ఎందుకంటే వీరికి గృహాలను నిర్మించి ఇవ్వవలసిన బిల్డర్లు, డెవలపర్లు మురికివాడల్లో నిర్మాణ హక్కులను పొందడమే కాకుండా అనుమతించిన మేరకు గుడిసె వాసులు కాని వారికి ఇలా కట్టిన గృహాలను అమ్ముకుం టారు. దీనికి వీరు గుడిసెవాసులకు డబ్బు చెల్లిస్తారు. గత రెండు దశాబ్దాల్లో ఉచితంగా 1.7 లక్షల మందికి గృహ నిర్మాణ పథకాలు మంజూరయ్యాయి. వీటిలో 1,441 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. కానీ ఇవన్నీ అమలై ఉంటే నగర గృహ కల్పన విధానంపై ఇది ప్రభావం చూపి పేదలకు మెరుగైన జీవితాన్ని అందించే అవకాశముండేది. ఇప్పుడు ప్రభుత్వం గుడిసెవాసులకు 322 చదరపు అడుగులలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తలుస్తోంది. ఈ అదనపు స్థలంలో కుటుంబాలు కాస్త సౌకర్యవంతంగా ఉంటాయి. మొదట్లో 100–140 చదరపు అడుగుల్లో ఉన్న స్లమ్ యూనిట్లు తర్వాత పునరావాసంలో 225 చదరపు అడుగులకు పెరిగాయి. తర్వాత వీటిని 269 చదరపు అడుగులకు పెంచారు. ఈ పెంపుదల ప్రభుత్వం ఉదారంగా తీసుకున్నది కాదు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 322 చదరపు అడుగుల పరిమితిని విధించింది మరి. అందుచేత, భూమి లభ్యతపైనే ఇంటి పరిమాణం ఆధారపడుతుంది. ముంబైలో ఇళ్లలో 10 శాతం మాత్రమే సగం జనాభా ఉంటున్న మురికివాడల స్వాధీనంలో ఉన్నాయి. అందుకే ముంబైలో కొన్ని అతి భారీ భవంతులు ఉండగా మరికొన్ని బతకడానికి మాత్రమే సరిపోయే పరిమాణంలో ఉంటున్నాయి. చివరకు మురికివాడలకు దూరంగా ఉండే ప్లాట్లలోని వారు కూడా ప్రధానమంత్రి అవాస్ యోజన పథకంలో తలపెట్టనున్న పరిణామం కలిగిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
కనుమరుగౌతున్న పొగ గొట్టాలు
ముంబై గత వైభవ చిహ్నాలుగా నిలిచిన బట్టల మిల్లుల పొగగొట్టాలు ఒక్కటొకటిగా అంతరిస్తుంటే వాటి కంటే ప్రమాదకరమైన విషవాయువులను వెదజల్లుతున్న నగల తయారీ గొట్టాలు పెనుసమస్యకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు ముంబైలో దాదాపు 80 టెక్స్టైల్ మిల్లులుండేవి. మొదటి ప్రపంచ యుద్ధ కాలం వరకు నగరంలో ప్రధాన పారిశ్రామిక కార్యాచరణ పత్తిని దుస్తులుగా మార్చడంగానే ఉండేది. నల్లమందు వ్యాపారంలోని మిగులుతో ఇవి 1850ల మధ్యలో వృద్ధి చెందాయి. ఇటీవలి వరకు దాదాపు 200 అడుగుల ఎత్తున్న బట్టల మిల్లుల పొగ గొట్టాలు ముంబై నగరానికి విశిష్ట చిహ్నంగా ఉండేవి. ప్రముఖ కార్మిక నేత దత్తా సామంత్ నేతృత్వంలో 1982లో మిల్లు కార్మికులు విఫల సమ్మెను చేపట్టాక ముంబై మిల్లులు పనిచేయడం ఆగిపోయింది. దీంతో పరిస్థితి మారిపోయింది. 1990లో ప్రభుత్వం మిల్లులకు చెందిన భూములను రియల్ ఎస్టేట్‌లోకి మార్చడానికి అనుమతించింది. దీంతో ముంబై ఉజ్వల గతానికి చిహ్నంగా నిలిచిన ఎల్తైన చిమ్నీల స్థానంలో ఇప్పుడు ఆఫీసులు, మాల్స్, గృహసముదాయాలతో కూడిన ఆకాశాన్నంటే టవర్లను ఎవరైనా చూడవచ్చు. కష్టంతో అయినా సరే, మీకు మంచి గైడ్ దొరి కితే, ముంబైలో ఇంకా మిగిలివున్న ఒకటీ, రెండు మిల్లుల గొట్టాలను మీరు గుర్తించవచ్చు. కానీ ఇవి కూడా త్వరగానో, తర్వాతో కూల్చివేతకు సమీపంలో ఉన్నాయి. భూమి కోసం తహతహలాడుతున్న నగరంలో ఖాళీ స్థలాలకు విలువ పెరుగుతోంది. కానీ ఇప్పుడు ఎల్తైన చిమ్నీలు కాకుండా, మరెన్నో పొగగొట్టాలను నగరంలో చూడవచ్చు. కానీ ఇవి చిన్నపాటి స్థలంలో ప్రధానంగా అత్యంత రద్దీ ఉండే దక్షిణ ముంబైలోని కల్బాదేవి ప్రాంతంలో కనిపిస్తాయి. అయితే ఈ చిమ్నీలు బంగారాన్ని నగలుగా మార్చే యూనిట్లకు సంబంధించినవి. ఇక్కడ తయారైన నగలను వలస వచ్చిన మహిళలు ఉపయోగిస్తుంటారు. ఇవి సమీపంలోని జవేరి బజార్‌కు తరలి వెళతాయి. దేశంలోని అతి పెద్ద బంగారం మార్కెట్ ఇదే. ఇవి కల్బాదేవి ఆవరణలో ఈ తయారీ యూనిట్లున్నాయి కాబట్టే ఇక్కడినుంచి జవేరి బజార్‌కు తరలించడం సులభం. కానీ ఇక్కడి ఇతర నివాస ప్రాంతాలకు దీనివల్ల కలుగుతున్న అసౌకర్యం కానీ, ఆరోగ్యానికి కలుగుతున్న ప్రమాదం గురించి కానీ ఆలోచించరు. బట్టల మిల్లులకు చెందిన పొగగొట్టాలు చిమ్మే పొగలాగా కాకుండా, ఈ నగల తయారీ గొట్టాలు వాటినుంచి విషవాయువులను వెదజల్లుతాయి. ఈ పొగ గొట్టాలు సమీపంలోని పాతవీ, అతి చిన్నవి అయిన నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంటున్నాయి. చావల్స్ అని పిలుస్తున్న ఈ చిన్న అపార్ట్మెంట్లు నగరంలోని తొలి సామూహిక గృహాలకు సంకేతాలు. ఒక ఉమ్మడి వరండాలో విడి గదులు ఉంటాయి. వీటి చివరలో ఉమ్మడి మరుగుదొడ్లు ఉంటాయి. ఇవి ప్రారంభంలో మిల్లులకు సమీపంలో బట్టల మిల్లుల కార్మికులకు నివాసం కల్పించాయి. తర్వాత బట్టల మిల్లులకు వెన్నెముకగా ఉండే విస్తరిస్తున్న నగర ఆర్థిక వ్యవస్థకు సేవ చేసేందుకు వచ్చినవారికి ఆశ్రయం కల్పించాయి. ఈ చిన్న చిన్న గదులు ఇరుగ్గా, గాలి తక్కువగా, సౌకర్యాల లేమితో ఉంటున్నందున జనాభా గణన అధికారులు వీటిని సులువుగా మురికివాడలుగా గుర్తించేవారు. ఈ గృహాలు అక్కడి మొత్తం ప్రాంతాన్ని ప్రమాదకరంగా మార్చేశాయి. ఈ నగల తయారీ యూనిట్లలో యాసిడ్లను, పెద్ద సంఖ్యలో ఎల్పీజీ సిలెండర్లను నిలువ చేస్తారు. ముడి బంగారాన్ని వీటితో కరిగించి ఒక రూపానికి తెస్తారు. ఈ క్రమంలో వచ్చే వాయువులు అగ్నిప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఈ ఇళ్లకు చెందిన మెట్లు సాధారణంగా కొయ్యతో చేసి ఉంటాయి. ఇది మరీ ప్రమాదకరం. బంగారం వేడి చేసేటప్పుడు వచ్చే పొగలు ఇక్కడ రోజువారీ సమస్యగా మారిపోయాయి. ఇక్కడ అగ్నిప్రమాదాలు ఏర్పడే సమస్యే కాదు. ఇక్కడి రోడ్లు ఇరుగ్గా ఉండటంతో ఫైర్ ఇంజన్లు లోపలికి రాలేవు. ఇటీవల సంభవించినట్లుగా అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం ఇక్కడ పెనుసవాలు. నగల వ్యాపారం చేసే జిల్లాల నుంచి వచ్చే రోజువారీ జనాలు మరిన్ని సమస్యలకు కారణమవుతుంటారు. ఈ నగల తయారీ యూనిట్లను తొలగించాలని ముఖ్యమంత్రి పురపాలక సంస్థను ఆదేశించినప్పటికీ, పసిడి రంగానికి చెందిన సంపన్న, శక్తివంతమైన శక్తులే ఈ యూనిట్ల వృద్ధికి కారకులని పురపాలక సంస్థకు తెలుసు కాబట్టి ఇక్కడ నివాసముంటున్న వారు పరిస్థితి మార్పుపై పెద్దగా ఆశలు పెట్టుకోరు. నగల తయారీ గొట్టాలను తొలగించాలని ఆదేశించి అమలు చేసినా, మళ్లీ అవి ఎలాగోలా ఏర్పడుతుండటంతో పురపాలక అధికారులు హేళనకు గురవుతుంటారు. బులియన్ మార్కెట్ చాలా కఠోరమైంది. మొండిపట్టు గలది. బాంద్రా–కుర్లా కాంప్లెక్స్ లోని అత్యంత విలువైన డైమండ్ మార్కెట్లోని స్థలాలను వీరు కొనుగోలు చేసినప్పటికీ గత దశాబ్దంగా వీటిలో నివసించిన వారే లేకపోయారు. ఎందుకంటే జవెరీ బజార్ వారి వ్యాపారానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంది. వ్యాపారానికి ముఖ్యమైనది సామీప్యతే కదా. కాబట్టి ఈసారి ఈ సమస్య పరిష్కారం అటు ముఖ్యమంత్రికీ, ఇటు మునిసిపల్ కార్పొరేషన్‌కీ పరీక్షే మరి. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆ ఆగ్రహం సమర్థనీయం!
చీలికలు పేలికలుగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని దళితులు కొత్త సంవత్సరం తొలిరోజున తమ శక్తి ఏమిటో చూపించారు. కోరెగాంలో జరిగిన ఘటనపై వారి అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చడం అంత సులభం కాదు. రెండు వందల ఏళ్ల క్రితం, ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలు కోరెగాం వద్ద ఒక యుద్ధాన్ని గెలుచుకున్నాయి. దాంతో మూడో ఆంగ్లో– మరాఠా యుద్ధం ముగిసింది. ఈ విజయంతో భారత ఉపఖండ యజమానులుగా బ్రిటి ష్వారు తమ స్థానాన్ని స్థిరపర్చుకున్నారు. పైగా, ఈ యుద్ధంతో పీష్వాల పాలనను సైనిక కమ్యూనిటీకి చెందిన మహర్లు ఖతం చేసినట్లుగా వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. శివాజీ అనంతరం మరాఠా సామ్రాజ్యాన్ని పీష్వాలు నడిపారు. సమతకు పట్టం కట్టిన శివాజీ పాలనకు భిన్నంగా పీష్వాలు బ్రాహ్మణిజం సంప్రదాయాలతో కులతత్వం అద్దారు. బ్రిటిష్ సైన్యం స్థానికులు, ఇంగ్లిష్ వాళ్లు రెండింటితో కూడి ఉండేది. ఎక్కువమంది భారతీయులే. రెండు జాతులకు సంబంధించిన సైనికులను కలిపి రూపొందించిన బెటాలియన్లు లేదా ప్లటూన్లు చాలా తక్కువ. కానీ ఇరు జాతుల సైనికులను కలిపి విశాల ప్రాతిపదికన బ్రిటిష్ సైన్యం అనేవారు. బ్రిటిష్ సైన్యంలో స్థానికులు ఎందుకు చేరారంటే ఇక్కడి పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటులో భాగమై ఉండవచ్చు లేదా జీవిక కోసం అయినా అయి ఉండవచ్చు. మెహర్లను సైన్యంలో చేర్చుకోవడానికి పీష్వా యంత్రాంగం తిరస్కరించడంతో, మరాఠాలను అణచివేయాలని చూస్తున్న బ్రిటిష్ వారితో చేతులు కలపాలని మెహర్లు నిర్ణయించుకున్నట్లు ప్రస్తుతం కథనాలు చెబుతున్నాయి. కోరెగాం స్థూపంలో పేర్కొన్న మృత సైనికులలో 22 మంది మెహర్లే అన్న వాస్తవం దీనికి సమర్థనగా కనిపిస్తోంది. ఆనాడు కోరెగాంకు వెళ్లిన సైనిక దళాల్లో ఎక్కువమంది మెహర్లే. బ్రిటిష్ వారు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యూహం పన్నారా? దీనిని చరిత్రకారులు అధ్యయనం చేయాల్సి ఉంది. బీఆర్ అంబేడ్కర్ 1927 జనవరి 1న కోరెగాం స్మారకస్థూపాన్ని సందర్శించినప్పటి నుంచి, ఆ తర్వాత జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులలో కూడా.. బ్రిటిష్ వారి తరఫున జరిగిన యుద్ధాల్లో అస్పృశ్యులే గెలిచారని ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ అంబేడ్కర్ కన్నా ముందు నుంచే దళితులు ఆ స్థూపాన్ని సందర్శించేవారు. కానీ దళితులు వీధుల్లోకి వచ్చి హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కొత్త సంవత్సరం మరాఠాలు కొత్త యుద్ధం ప్రారంభించినట్లయింది. జేమ్స్ లియన్ శివాజీపై రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు మొదలెత్తినప్పటి నుంచి, దళిత ప్రజా సంఘాలు మహారాష్ట్రలో ప్రాధాన్యత సంతరించుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దళితులను కొట్టిన సంఘటన వారికి మరాఠాలపై అమిత ఆగ్రహం కలిగించింది. పైగా ఒక దళితుడి స్మారక స్థూపాన్ని ధ్వంసం చేయడంతో మహారాష్ట్రలో దళితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను వధించిన మరాఠా పాలకుడు శంభాజీ దేహాన్ని ఎవరైనా తాకితే తీవ్రపరిణామాలు ఉంటాయని ఔరంగజేబ్ చేసిన హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా శంభాజీ అంత్యక్రియలను ఆ దళితుడు నిర్వహించాడు. దళితులు ఈ రెండు సంఘటనలలో తమ పాత్రకుగాను గర్వపడుతుంటారు. ఒకటి– మరాఠా పాలకుడి తరపున పాలించే పీష్వాలను ఓడించడం. రెండు– మరాఠాల పనుపున మొఘల్ రాజునే ధిక్కరించిన ఘటన. కాబట్టి ఇప్పుడు సమస్య సంక్లిష్టంగా తయారైంది. దీని మొత్తం సారాంశం ఏమిటంటే, మహారాష్ట్ర ఇప్పుడు కులతత్వంతో ఉడికిపోతోంది. అస్పృశ్యతా నిరోధక చట్టాన్ని పలుచబారేలా చేసి, భూమిపై యాజ మాన్యం కలిగి ఉన్నప్పటికీ తమకు కూడా కోటా వర్తింపు చేయాలని మరాఠాలు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాల కోటాలో తమకూ వాటా కావాలంటున్న మరాఠాల డిమాండ్లతో దళితులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పుడు మరాఠాలు, దళితులు ఇద్దరూ కూడా ప్రస్తుత బీజేపీ పాలనను పీష్వా పాలనగానే చూస్తున్నారు. పైగా ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణుడు కూడా. వీటి మధ్య ఇతర వెనుకబడిన కులాలు నిరాశకు గురవుతున్నాయి. మహారాష్ట్రలో దళితులు ఒక రాజకీయ బృందంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన పలు చీలిక బృందాలుగా చెల్లాచెదురైపోయారు. దళితులు సంఘటితమైతే అది రాష్ట్ర సామాజిక, ఆర్థిక వేదికపై నిస్సందేహంగా కొత్త రేఖను ఏర్పరుస్తుంది. దళితుల్లోని ఒక వర్గం ప్రయోజనాలను ఇది తటస్థపరుస్తుంది. ఉదా. హిందూత్వ వాదులతో పొత్తు కుదుర్చుకుని మొదట శివసేనతో కలిసిన దళితనేత రామ్‌దాస్ అథవాలే తరువాత బీజేపీతో చేతులు కలపడానికి దాన్ని వదిలిపెట్టేశారు. తమ సంఖ్యాపరమైన బలాన్ని సంఘటితం చేసుకోవాలంటే దళితులు తమదైన రాజకీయ వేదికను ఏర్పర్చుకోవాలి. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో అథవాలే మాత్రమే దళిత రాజకీయాలనుంచి లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ కొత్త పరిణామం బీజేపీయేతర, శివసేనేతర కూటములను ఇంకా బలపరుస్తుంది. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ తదుపరి ఎన్నికలకు ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం గురించి చర్చించింది కూడా.అయితే ఈ సానుకూల ఫలితాలు ఎలా ఉన్నా, చీలి కలు పేలికలుగా ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని దళితులు కొత్త సంవత్సరం తొలి రోజున మొదటిసారిగా తమ శక్తి ఏమిటో చూపించారు. ఈ విషయమై దళితుల అసంతృప్తిని చల్లార్చడం అంత సులభం కాదు. కోరెగాంకు 3 కిలోమీటర్ల దూరంలోని వధుబద్ర క్లో గోవింద్ మెహర్ సమాధిని ధ్వంసం చేసి అగౌరవపర్చిన ఘటన పట్ల మీడియా మొదట్లో పరమ నిర్లక్ష్యం ప్రదర్శించింది. చివరకు కోరెగాంలో దళితులపై దాడులను కూడా పట్టించుకోకపోగా, ముంబై వంటి నగరాల్లో బంద్‌లు అనేవి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తాయని మీడియా చెప్పడంతో దళితులు కుపితులైపోయారు. మహారాష్ట్రలోని కుల నిర్మాణాల్లో భూకంపం వంటి పెను కదలిక చోటు చేసుకుంటోది కానీ దాని రాజకీయ ప్రభావాలను మాత్రం ఎవరూ సరిగా అర్థం చేసుకోవడం లేదు. దీని పట్లే దళితులు అయిష్టత ప్రకటిస్తున్నారు. వారి ఆగ్రహ ప్రదర్శన అర్థం చేసుకోదగినదే. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆలయాలలో సంబరాలా?
విశ్లేషణ కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయాల్లోకి అర్ధరాత్రి భక్తులను అనుమతిం చడంపై నిషేధాన్ని న్యాయస్థానాలు సమ్మతించకపోవచ్చు.. కానీ, మన పూజా స్థలాలను మన కష్టాలు తెలుపుకునే చోటుగా మాత్రమే ఉంచాలి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంగా భక్తులు ఆలయాల్లో అర్ధరాత్రిపూట చేసే పూజ లను, దైవ సందర్శనలపై నిషేధించడానికి గత వారం మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అదేవిధంగా, హైదరాబాద్‌లోని హైకోర్టు కూడా భక్తుల హక్కులను ఎత్తిపట్టింది. ఈ రెండింటి మధ్య పోలికకు ప్రాధాన్యముంది. అంతకుముందు హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి నూతన సంవత్సరం సందర్భంగా ఆలయం లోపల తనకు ఎవరైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినట్లయితే వారిని శిక్షిస్తానని హెచ్చరించారు. ఎందుకంటే నూతన సంవత్సరం అనేది ఇంగ్లిష్ సంప్రదాయమే కానీ భారతీయ సంప్రదాయాలతో దానికి సంబంధం లేదట. ఎవరైనా తనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపితే వారిచేత ఆరు గుంజీళ్లు తీయిస్తానని ఆయన అన్నారు. ఆలయ సందర్శనకు వచ్చేవారు గర్భగుడి చుట్టూ ప్రశాంతతకు భంగం కలిగించకూడదంటూ ఆలయ పూజారి భక్తులను హెచ్చరించడంలో తప్పేమీ లేదు. నూతన సంవత్సరాది నాడు అలాంటి భక్తుల వైఖరి ఇతర భక్తులను ఇబ్బంది పెడుతుంది. వేడుకలను జరుపుకోరాదని చెప్పడం ఒక ఎల్తైతే , తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పినవారిని శిక్షిస్తానని చెప్పడం మరొక ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా జార్జియన్ కేలండర్ ప్రకారం జరుపుకునే కొత్త సంవత్సరాదిని తోసిపుచ్చడం భావ్యం కాదు. మన విశ్వాసాలతో పాటు ఇతర విశ్వాసాలు కూడా ప్రజలపై పనిచేస్తుంటాయి. పైగా మనందరికీ చాలా సులభంగా అర్థమయ్యే కేలండర్ అది. ఈ ప్రపంచంలో వారాంతాలను ఎలా నిర్ణయిస్తున్నారు? మన వారాంతపు సెలవు దినం ఏదో మనం ఎలా తెలుసుకోగలం? మనకు వేతనం వచ్చే రోజు ఎప్పుడని రూఢిగా చెప్పగలం? ఎందుకు ఇప్పుడు గందరగోళం సృష్టించడం? ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. ముస్లింలు తమదైన లూనార్ కేలండర్‌ని అనుసరిస్తారు. హిందువుల పర్వదినాల్లాగే ముస్లింల పర్వదినాలు కూడా జార్జియన్ కేలండర్‌కు భిన్నమైన తేదీల్లో జరుగుతుం టాయి. పంచాంగం ఒక స్వయంసిద్ధ గణకుడిలాగా సమాచారం అందిస్తుంది. ఇది జార్జియన్ కేలండర్ లాగే రోజులు, తేదీలను లెక్కిస్తుంది. హిందువులు తమ పంచాంగానికి, ముస్లింలకు తమ సంప్రదాయాలకు కట్టుబడినట్లయితే, ఈద్ పండుగ ఏ తేదీన వస్తుందో ఎవరికి తెలుసు? బ్యాంక్ సెలవు ఎప్పుడు? పాఠశాలకు, కాలేజీకి, ఆఫీసుకు మనం ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు? లేదా మన అంగడిని ఎప్పుడు తెరువకూడదు వంటివి మనకు ఎలా తెలుస్తాయి? దీపావళి ఎప్పుడు వస్తుందో, తమ పర్వదినం ఎప్పుడు వస్తుందో ముస్లింలు ఎలా తెలుసుకోగలుగుతారు? ఇలాంటి ప్రశ్నలు సాదాసీదాగానే కనిపిస్తాయి కానీ, మన రోజువారీ జీవితాల్లో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జార్జియన్ కేలండర్ మినహా మరే ఇతర కేలండర్ లేని క్రైస్తవులు వారు భారతీయులైనప్పటికీ తక్షణమే ఇంగ్లిష్ వాళ్లయిపోతారా? నిస్సందేహంగా ఇదొక అసంబద్ధ విషయం. మన దేశం రెండు రకాల జీవితం గడుపుతున్న ఈ సందర్భంలో, మన పంచాంగం ఇస్లాం పర్వదినాలను సూచించడం లేక ఇస్లామిక్ పంచాంగం కూడా హిందూ పర్వదినాలను సూచించడం పెద్ద విషయమేమీ కాదు. కాగా, జార్జియన్ కేలండర్ రెండు మత విశ్వాసాలకు చెందిన పర్వదినాలను తనలో కలుపుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇది సులభంగా ఉపయోగించే కేలండర్‌గా మారింది. మరోవైపున రెండు మతాలకు చెందిన సంకుచిత నాయకులు మనకంటూ ఒక ఉమ్మడి కేలండర్‌ను అనుమతించనంతగా మనం వేరుపడిపోయాం. నూతన సంవత్సరాదికి కాకుండా ఉగాదికి ఆలయ పూజారి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, మనం జార్జియన్ కేలండర్‌ని పాటిస్తున్నందున, ఆయనకు అలా చెప్పే హక్కు, అధికారం ఉంటాయి. అయితే చాలామంది రెండు పర్వదినాలనూ జరుపుకోవాలని భావిస్తున్నారు. కాగా, డిసెంబర్ 31, జనవరి 1 సంబరాల పేరిట తిని, తాగి జనం పాటించే భోగాలను ఆలయంలోకి తీసుకురావడం చిలుకూరు బాలాజీ ఆలయ పూజారికి అభ్యంతరకరమైతే దాన్ని అర్థం చేసుకోవలసిందే మరి. మన పూజా స్థలాలను మనం దేవుడిని అభ్యర్థించే చోటుగా, ప్రశాంతంగా, హుందాగా ఉంచాల్సిన అవసరం ఉంది. పూజా స్థలాల్లో మనం ఇతరులతో గట్టిగా సంభాషించం. పైగా ఆలయ ప్రశాంతతకు అంతరాయం కలిగించకూడదు. అజాన్ మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా మన సొంత గలాభా అనేది గర్భగుడి ప్రశాంతతను చెదరనివ్వకూడదు. మన ప్రవర్తన వాంఛనీయమైనదిగా ఉండాలి. అలాంటి ప్రవర్తనను పాటించాలి అనుకుంటున్న ఆలయ పూజారికి నా మద్దతు ఉంటుంది. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ప్రపంచానికి ప్లాస్టిక్ విపత్తు
ప్లాస్టిక్ మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చింది, దాని పర్యవసానాలు పట్టించు కోండి, ప్రకృతే దాని సంగతి చూసుకుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు. పర్యావరణ స్పృహగల ముంబై పౌరులు కేవలం వంద వారాంతపు రోజుల లోనే అక్కడి ఒక బీచ్ నుంచి 90 లక్షల కేజీల ప్లాస్టిక్‌ను సేకరించారు. పోటు మీదున్నప్పుడు సముద్రం లోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్ చెత్త ఇది. మునిసిపాలిటీ దాన్ని అక్కడి నుంచి తరలించి ఏ గోతుల్లోనో కప్పెట్టెయ్యలేనంత భారీ పరిమాణం ఇది. దీంతో నిరుత్సాహానికి గురైన పౌరులు ఇక మనం చేయగలిగేదేమీ లేదని ఆ పని ఆపేశారు. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకో వాల్సి వచ్చింది. ఇది ముంబైలోని ఒక బీచ్ కథ మాత్రమే కాదు. నిరాటంకంగా సముద్రంలోకి గుమ్మరించిన ప్లాస్టిక్ దాదాపు ప్రతి బీచ్లోనూ ఇలా ఒడ్డుకు కొట్టుకు వస్తూనే ఉంటుంది. మందం ఎంతో ఇంకా కచ్చి తంగా లెక్కగట్టని ప్లాస్టిక్ ద్వీపాలు ప్రధాన సముద్రా లలో ఉన్నట్టు వివిధ కథనాలు తెలిపాయి. అవి ఒడ్డుకు కొట్టుకు రాని ప్లాస్టిక్ దీవులు. మానవ శరీ రాల్లోకి సైతం చొర బడగల స్థాయికి ఇప్పుడు ప్లాస్టిక్ శిథిలమ వుతోందని కనుగొన్నారు. 1950ల నుంచి ప్రపంచం 9 లక్షల కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసింది. ఇందులో 9 శాతాన్ని మాత్రమే రీసైకిల్ చేశారు. అంటే ఇంత భారీగా ఉత్ప త్తయిన ప్లాస్టిక్ ఉపయోగంలో ఉన్నది లేక కాస్త ముందు వెనుకలుగా చెత్తగా పారేయాల్సినది, లేక కప్పేసిన గోతుల్లో ఉన్నది. లేదంటే కాలువలు, నదులు, సముద్రాలలో లేదా ముళ్ల పొదలకు గుచ్చు కునో ఉంటుంది. ఇది, స్వీయ పరాజయంలో మాన వులు సాధించిన ఘనత. భూగోళపు జీవితంలోని ఆంత్రోప్రోసిన్ (ప్రకృతిని మానవులు ప్రభావితం చేసే) శకంలో మానవులు చేజేతులా ప్రపంచాన్ని నాశనం చేసుకునే ప్రధాన దశ ఇది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తయారైన 9 లక్షల కోట్ల టన్నుల భారీ ప్లాస్టిక్లోంచి దాదాపు 100 వారాల్లో ఒకే ఒక్క చిన్న బీచ్‌లోనే తొంబై లక్షల కేజీల ప్లాస్టిక్ బయటపడింది. ఆట వస్తువుల నుంచి పారి శ్రామిక వస్తువులు, పాల సంచుల వరకు అన్నిటికీ ప్లాస్టిక్‌నే వాడేలా యుద్ధానంతర కాలంలో మన ప్రవర్తన మారిపోయింది. చిన్న కొత్తిమీర కట్టకు కూడా ప్లాస్టిక్ సంచిని స్వీకరిస్తున్నాం. దీని పర్యవ సానాలేమిటో ప్రపంచం అర్థం చేసుకోవడం ఇప్పుడే మొదలై ఉండవచ్చు. బయటపడటం సులువేమీ కాని పరిస్థితిలో మనంతట మనమే ఇరుక్కున్నట్టున్నాం. ఈ నేపథ్యం నుంచి చూస్తే, 2018 మధ్యకల్లా ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం పథకం ఆహ్వానించదగినది. కానీ ఆ లక్ష్యాన్ని సాధించడం కష్టం కావచ్చు. ప్లాస్టిక్ సంచుల తయారీ, పంపిణీలోనే పెను మార్పు రావడం అందుకు అవసరం. సార్వత్రికంగా అంతా ప్లాస్టిక్‌కు బాగా అలవాటుపడిపోయిన మనుషులు తమ అల వాట్లను మార్చుకోవాలని ఆశించడం కష్టమే. పాకె ట్లకు బదులుగా పాలను సీసాల్లో పంపిణీ చేయవచ్చా వంటి సమంజసమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిని శుభ్రం చేసి తిరిగి ఉపయోగించడానికి చాలా నీరు అవసరం అవుతుంది. తాగడానికి, సాగుకే నీరు అవసరంగా ఉంది. కొత్త ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండాలంటే మన జీవితాలనే పూర్తిగా పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంటుంది. గుడ్డ బ్యాగులు పట్టుకుని మార్కెట్‌కు వెళ్లడం, ప్లాస్టిక్ సీసాల్లోని నీటిని తాగడానికి నిరాక రించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ బాటిల్ నీరే పరిశుభ్రమైనదని విశ్వసించే స్థితికి మనం చేరాం. పౌర సంస్థ సరఫరా చేసే నీటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అది మరింత విద్యుత్ వినియోగంతో కూడినది, మన కర్బన వినియోగాన్ని పెంచేది. మనం కొనే ప్రతి వస్తువూ ప్లాస్టిక్‌తో చుట్టి నదే, రోడ్డు పక్క చాయ్ వాలా ఇచ్చే టీ కూడా వాడి పారేసే ప్లాస్టిక్ కప్పులోనే. పునర్వినియోగానికి పనికిరాని, లేదా రీసైకిల్ చేయడం కష్టమయ్యే ప్లాస్టిక్ సంచులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ఉంది. చెత్త ఏరుకునే వారు సైతం వాటిని పనికిరానివిగానే చూస్తారు. నిషేధం విధిస్తే పౌరులు తమంతట తామే దాన్ని పాటిస్తారని అధికారులు విశ్వసించారు. అదేసమయంలో కారణాలేవైనా వాటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. మురికివాడల్లోని కార్ఖానాల్లో సైతం అవి తయారవుతున్నాయి. మనం అంతా పెరగనిచ్చిన విపత్తు ఇది. బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ఒక సంపా దకీయంలో ‘‘అసలు సమస్య ప్లాస్టిక్ కాదు, మనమే. ఆ అద్భుతమైన పదార్థాన్ని మనం తిరస్కరించలేం. దాన్ని చెత్తగా చూడటానికి బదులు అపురూపమైనదిగా వ్యవహరిస్తుంటాం’’ అని పేర్కొంది. అంటే, ప్లాస్టిక్‌ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అది మానవ ఉపయోగంలోకి ఎలా వచ్చిందనే దానితో సహా పట్టించుకుని, ప్రకృతే దాని సంగతి చూసు కుంటుందని నిర్లక్ష్యంగా పారేయకుండా విలువగా వాడుకోండి. నాగరికతలు విఫలమైతే, ప్రకృతి వాటిని సరిదిద్దలేదు. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పద్మావతిపై ఎందుకీ కన్నెర్ర?
ఇంతటి ఆగ్రహానికి గురికాదగ్గది ఏదీ ఆ సినిమాలో లేదని దాన్ని చూసిన మీడియా ప్రతినిధులు చెబుతున్నారు. సినిమా చూడకుండానే, సెన్సార్ కాకముందే ప్రదర్శిస్తున్న ఈ అర్థరహిత అసహనం ఎటు దారి తీస్తుంది? రెండు దశాబ్దాల క్రితం, స్వలింగ సంపర్కసంబంధం గురించి తీసిన ఫైర్ సినిమా చిక్కుల్లో పడింది. అది, మన దేశంలో తీసిన అలాంటి మొట్ట మొదటి సినిమా. మితవాదవర్గానికి చెందిన వారు ఆ సినిమాను ప్రదర్శిం చడానికి వీల్లేదంటూ నిరస నకు దిగారు. ఆ సినిమా నిర్మాతపైన, నటీనటులపైన కోపంతో ఆ యూనిట్ తదుపరి చిత్రం వాటర్ సెట్లను ధ్వంసం చేశారు. అది ‘భారత సంస్కృతికి వ్యతిరేకమై న’దంటూ రాజకీయవేత్తలు ఆ గూండాయిజాన్ని వెనకే సుకొచ్చారు. ఇప్పుడు, సెన్సార్ సర్టిఫికెటైనా లభించని పద్మావతి సినిమాపై కూడా అలాంటి ఆగ్రహాన్నే తిరిగి ప్రదర్శిస్తున్నారు. సినిమాలోని పద్మావతి ప్రచారంలో ఉన్న జానపదగాథల్లోని వ్యక్తే తప్ప, విశ్వసనీయమైన చరిత్రలోని వ్యక్తికాదనీ, ఒకరిని మరొకరుగా పొరబడ రాదనీ గుర్తించడానికి సైతం నిరాకరించేటంత తీవ్ర ఉద్రేకంతో వ్యక్తమౌతున్న ఈ సామూహిక అనుచిత ప్రవర్తనకు నేడు మనం అలవాటుపడిపోయాం. ఈ దురభిమానులు సినిమాను చూడనైనా చూడ కుండానే తమ తప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తు న్నారు. బహిరంగంగానూ, టీవీల్లోనూ ఆ నటీనటుల ముక్కులను కోస్తామని బెదిరిస్తున్నారు, నిర్మాత, ప్రధాన నటి తలలకు రూ. 10 కోట్ల బహుమతి ప్రకటించారు. రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వం తెలివి తక్కువగా అవసరమైన కత్తిరింపులు చేయకుండా ఆ సినిమా విడుదలను అనుమతించరాదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను కోరింది. కథను చెప్పడంలో సిని మాకు ఉండే కళాత్మకమైన స్వేచ్ఛకూ, వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకూ కూడా వ్యతిరేకమైన అసహనం నేడు సుస్పష్టంగా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై తీసిన ఎన్ ఇన్సిగ్నిఫికేంట్ మ్యాన్ అనే డాక్యుమెంట రీకి సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దానిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, కోర్టు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉన్న హక్కును ఎత్తి పట్టింది. అయినా అది పద్మావతి వ్యతిరేక బృందాల ఉద్రేకాన్ని చల్లార్చలేకపోయింది. ఈ అసహనం 15 రోజుల్లోనే పెను దుమారంగా మారింది. గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన న్యూడ్ (మరాఠీ), ఎస్. దుర్గ (మలయాళం) సినిమాల ప్రదర్శనను సమా చార, ప్రసార మంత్రిత్వశాఖ నిలిపివేస్తున్నట్టు ప్రక టించింది. ఎందుకో కనీసం ఒక్క వాక్యం వివరణనైనా ఇవ్వలేదు. ఈ రెండూ సెన్సార్ సర్టిఫికేట్లతో విడుదల య్యాయి కూడా. చూడబోతే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు సెన్సార్ సర్టిఫికెట్లన్నా, తామే ఏర్పాటు చేసిన జ్యూరీ ఎంపిక అన్నా లెక్క లేన ట్టుంది. దీనికి నిరసనగా జ్యూరీ సభ్యులు వరుసగా చేస్తున్న రాజీనామాల పరంపరగానీ, తామే ఏర్పాటు చేసిన సంస్థలు, ప్యానెళ్లను విలువలేకుండా చేస్తూ ఇష్టా నుసారం చేసిన ఈ నిర్ణయాల పట్ల నిరసనగానీ ఆ మంత్రిత్వశాఖ అంతరాత్మను ఏమాత్రం ఇబ్బంది పెట్టినట్టు లేదనుకుంటా. తగు కత్తిరింపులు లేనిదే పద్మావతి విడుదలకు అనుమతిని ఇవ్వరాదంటూ స్మృతి ఇరానీకి వసుంధరా రాజే రాసిన లేఖలో ఇది స్పష్టంగానే కని పించింది. ఎలాంటి వివరణా లేకుండానే న్యూడ్, ఎస్. దుర్గ సినిమాలను తొలగించడం కచ్చితంగా నిరంకుశ వైఖరే. అవి రెండూ అంతర్జాతీయంగా ప్రశంసలను, గుర్తింపును పొందినవి. అవి అశ్లీలతను లేదా మహిళల పట్ల అసభ్యతను చూపినవి కావు. ఎస్. దుర్గ చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పద్మావతి సినిమాను తీసిన వారుగాక మరెవరూ ఇంతవరకూ ఆ సినిమాను చూసిందే లేదు. కొందరు ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు దాన్ని ప్రద ర్శించి చూపారు. అలా చూసినవారంతా ఆ చిత్రంపై ఇలా మాటల దాడులను, నిరసన ప్రదర్శలను సాగిం చాల్సినది, తలలకు, ముక్కులకు వెలలు కట్టాల్సినది సినిమాలో ఏమీ లేదని అంటున్నారు. ఆందోళనకారు లకు విచక్షణారహితంగా సమయాన్ని, స్థలాన్ని కేటా యిస్తూ మీడియా అగ్నికి ఆజ్యం పోస్తోంది. అందు వల్లనే కావచ్చు నిర్మాతలు మీడియాకు సినిమాలో ఏమి ఉందో తెలియాలని అనుకున్నట్టుంది. సెన్సార్ బోర్డు ఈ అంశాన్ని అనుమానాస్పద దృష్టితో చూస్తోంది. అది అన్ని వేపులనుంచీ చుట్టి ముట్టివేతకు గురై ఉంది, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా సినిమా చూడని నిరసన కారుల పక్షం వహించాయి, కారణం ఏదైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోంది, నిర్మాతలు ఏది ఏమైనా త్వరగా విడుదల చేయాలని చూస్తున్నారు. ముందు ఏమి జరగనుందో ఎవరికీ తెలియదు. సినిమాను ‘‘అనుమతించడానికి’’ ముందు బ్లాక్ మెయిల్ చేసి, నిరసన తర్వాత అనుమతించటం జరు గుతుందా? అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? కర్ణీ సేన ఒక సినిమాకు ప్రచారం లభించేట్టు చేయడం కోసం సంకేతాత్మక నిరసన తెలిపి, నెలరోజులపాటూ రక్షణను కల్పించడానికి అంగీకరించడాన్ని ఇండియా టుడే ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బయటపెట్టింది. దాన్ని మీడియా విస్మరించింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆదర్శ ఓటరు అంతరంగం
భావజాలం నేడు అవకాశవాదానికి ముసుగ్గా ఉంటోంది. వ్యక్తిగత ప్రయోజ నాల కారణంగా వ్యక్తులు ఒక పక్షాన్ని వీడి, మరో పక్షాన చేరిపోవడం స్పష్టం గానే కనిపిస్తుంది. పార్టీ ఆశయాలకంటే గెలుపే ఎక్కువగా లెక్కలోకి వస్తోంది. శతాధిక వృద్ధుడు శ్యామ్ శరణ్ నేగీ నిజంగానే అద్భు తమైన వ్యక్తి. ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చేలా ఉత్తే జితులను చేయడం కోసం ఎన్నికల కమిషన్ ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడంలో ఆశ్చర్య మేమీ లేదు. హిమాచల్‌ప్రదేశ్ వాసి నేగీ స్వాంతంత్య్రానంతరం జరిగిన తొలి సార్వ త్రిక ఎన్నికల్లో ఓటు చేసిన ఏకైక వ్యక్తేమీ కాడు. కానీ అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ తప్పని సరిగా ఓటు చేస్తూ వస్తున్న ఏకైక వ్యక్తి. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటు చేయడానికి వచ్చినçపుడు ఆయనకు ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగతం పలికారు. వృద్ధుడు, దుర్బ లుడైన ఆయనను కల్పా పోలింగ్ స్టేషన్‌కు తీసుకు రావడానికి రవాణా సదుపాయాన్ని కూడా కల్పిం చారు. మరెవరైనా, అంటే ఏ అభ్యర్థో లేదా పార్టీనో ఇలా ఓటర్ను పోలింగ్ బూత్‌కు తరలించడం నిషిద్ధం. అది, ఓటర్లను ప్రలోభపెట్టడం అవుతుంది. కానీ, ఓటు విలువపై నేగీ ఉంచిన నమ్మకాన్ని గౌరవించాలని ఎన్నికల కమిషన్ ఈ ఏర్పాటు చేసింది. సగటు పోలింగ్ రేటు 65 శాతాన్ని దాటడం కష్ట మయ్యే మన దేశంలో ఇతరులకు ఆదర్శంగా నేగీ నిలు స్తారు. ప్రత్యేకించి, ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొన డానికి బదులు, పడక కుర్చీ విమర్శకులుగానే ఉండి పోయే పట్టణ మధ్యతరగతి వారిలోని చాలా మంది ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. దేశ భవి తను నిర్ణయించడంలో తన ఓటు నిర్ణయాత్మకమైనది కావ చ్చునని ఓటరు అర్థం చేసుకోవాలి. ఓటరుగా తన పౌర ధర్మాన్ని పాటించాలనేదానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టుబడి ఉండటం మాత్రమే కాదు, ‘‘రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయి’’ అని ఆయన గుర్తించారు. అయితే, ఆ విషయాన్ని ఆయన అంతకంటే వివరించలేదని ఓ మరాఠీ వార్తాపత్రికలో చదివాను. అయినా, ఆయన వ్యాఖ్యను నేను బెదిరింపులు, బుజ్జగింపుల రాజకీయాల్లోకి దేశం జారిపోయినట్టు కనిపించడంపై చేసినదని వ్యాఖ్యానిస్తాను. అభ్యర్థిని ఎంచుకోవడానికి తనకున్న హక్కును ఉపయోగించు కోవడానికి ఓటర్లు ఎంత దృఢంగా కట్టుబడినాగానీ, ఎంచుకోవడానికి వారి ముందు ఉండే అభ్యర్థుల జాబితా ఏమంత ఆకర్షణీయమైనదిగా ఉండటం లేద నేది ఆయన వ్యాఖ్యకు అర్థమని అనుకుంటాను. దేశం కంటే కుటుంబాన్నే ముందుంచడం, నియోజకవర్గాల్లో వంశపారంపర్య రాజకీయ వారసత్వాన్ని పెంపొందిం పజేయడం నేడు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ధోరణి. బహుశా అది ఆ వృద్ధునికి చికాకు కలిగించిందేమో. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయ పార్టీలపై వంశపారంపర్య ఆధిపత్యపు నమూనా నుంచే నియోజకవర్గాల్లో అవినీతి, వంశపారంపర్య ఆధి పత్యాలు కూడా పుట్టుకొచ్చాయి. నెహ్రూ–గాంధీ కుటుంబం, ములాయంసింగ్, లాలూప్రసాద్ యాద వ్ల కుటుంబాలు, పవార్ కుటుంబీకులు వగైరాలు ఉన్నత స్థాయిలవి. ఆ స్థాయిలలోనే ఇది జరుగు తుంటే, నియోజకవర్గం స్థాయిలోని అంతకంటే అతి చిన్న నేతలు కూడా ఇది సరైనదేనని అనుకుంటారు. వాస్తవంగానూ, వ్యక్తిగతంగానూ అది వారికి ఉపయో గకరమైనది. మరి అలాంటప్పుడు ఓటరు ఎందుకు ఓటు వేయాలి? కారణాలు చెప్పాలంటే బారెడంత జాబితా ఉంది. వాటిలో కొన్ని ఇవి: హక్కుగా ప్రభుత్వం చేయాల్సిన పనిని అధికార యంత్రాంగపు కాలయా పన, లంచాల డిమాండ్లు లేకుండానే ఓటరుకు రాజ కీయవేత్త చేయించి పెడతాడు. తద్వారా ఓటరుకు వ్యక్తిగతంగా లబ్ధి కలుగుతుంది కాబట్టి ఓటు వేయొచ్చు. లేదంటే సదరు నేత ఓటరుకు ఏదైనా చట్టవిరుద్ధమైన పనిని చేసి పెట్టవచ్చు, అందుకు కృతజ్ఞతగా ఓటు వేయాలి. లేకపోతే ఆ రాజకీయవేత్త ఆగ్రహాన్ని చవి చూడాలి. లేదా, నిబంధనల ప్రకారం సరైన పనిని చేయడం కంటే గుట్టుచప్పుడు కాకుండా హాని చేయగలిగిన శక్తివంతుడైన రాజకీయవేత్త దృష్టి లో మంచి అనిపించుకోవడం కోసమే కావచ్చు. ఎప్పుడు ఏ విధివశాన ఓటరు, రేపటి ఎన్నికల పోరాట యోధుడిని ఆశ్రయించక తప్పని పరిస్థితి సంభవిస్తుందో ఎవరికి తెలుసు. వారి దృష్టిలో బుద్ధి మంతుల్లా ఉండటం ఉపయోగకరం. అంతకంటే విస్తృ తమైనదైన భావజాలం, అభ్యర్థుల ఎంపికలో నిర్ణయా త్మకంగా ఉండే అవకాశాలు చాలా సందర్భాల్లో అతి స్వల్పం. నిజానికి భావజాలం నేడు అవకాశవాదానికి ముసుగుగా ఉంటోంది. వ్యక్తిగత ప్రయోజనాల కార ణంగా వ్యక్తులు ఒక పక్షాన్ని వీడి, మరో పక్షాన చేరిపోవడం స్పష్టంగానే కనిపిస్తుంది. పార్టీ ఏ ఆశ యాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబు తోందో, వాటికంటే గెలుపే ఎక్కువగా లెక్కలోకి వస్తోంది. ఒక భావజాలానికి నిన్నటి ప్రత్యర్థి, సరిగ్గా అందుకు విరుద్ధమైన భావజాలానికి నేడు కొత్త అనుయాయిగా మారుతున్నాడు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆకాశ హర్మ్యాల దిగువన...
విశ్లేషణ ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్లో భాగమైన శివారు ప్రాంతాలు కూడా నివాసగమ్యంగా లేవు. భౌగోళికంగా, జనాభా పరంగా ముంబైని రెండురకాలుగా విభజించాల్సి ఉంటుంది. ఒకటి నియతమైనది, సభ్యమైనది. రెండోది మురికివాడలకు సంబంధిం చినది. ఇలాంటి విభజనకు తగిన కారణాలున్నాయి. దాదాపు నగరంలోని సగం జనాభా మురికివాడల్లోనే నివసిస్తోంది. మురికివాడల్లో నివసించనివారి మధ్యన మురికివాడల్లో ఉంటున్నవారు ఎల్లప్పుడూ ‘వారు’ గానే ఉండిపోతారు. ముందుభాగంలో పూర్తిగా అద్దాలు పరిచిన భవంతులు నగర ప్రాంతంలోని ఆకాశంలోకి ఎగబాకి ఉంటాయి. అయితే మురికివాడలు అంటే తప్పకుండా భూమికి ఆనుకుని ఉంటాయని భావించనవసరం లేదు. ఇవి చాలావరకు రెండు అంతస్తులతో కూడి ఉంటాయి. కానీ ఇవి పెద్దగా కనిపించవు. వాస్తవానికి ఇవి తమతమ స్థానాల్లో తాము ఉంటున్నప్పటికీ పరస్పరం కలిసిపోయి ఉంటాయి. అయినప్పటికీ ఈ స్థితి ‘వారిని’ ‘మనంగా’ మార్చడం లేదు. నగరం జనసమ్మర్దంతో కిటకిటలాడుతూ ఉండటానికి మురికివాడల జనాభానే తప్పుపడుతుంటారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నగరంలోని మురికివాడలన్నీ కలిసి నగర భూభాగంలో పదిశాతం కంటే తక్కువ స్థానంలో ఏర్పడి ఉన్నాయి. ఇంత తక్కువ స్థలంలో ఇంత జనాభా కిక్కిరిసి ఉంది కాబట్టే మురికివాడలు కిటకిటలాడుతుంటాయి. ప్రతి 100 లేదా 125 చదరపు అడుగుల్లో ఐదుగురు నివసిస్తుంటారు. ధారవి ప్రాంతంలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు, స్థానిక రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఈ మురికివాడలు కనిపిస్తాయి. ఇక కొత్త ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడటం అసాధ్యం. పైగా సాధారణ గృహనిర్మాణ రంగం బహుళ అంతస్తుల రూపంలో కొత్త వర్గీకరణ విధానాన్ని రంగంలోకి తీసుకువచ్చింది. నేలను ఆనుకుని ఉండే మురికివాడలు ఇటుక గోడలు, తగరపు రేకుల పైకప్పులతో ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా ఎత్తుగా కనిపించే ఇళ్లు మూడు వరుసలతో ఉంటాయి. ఇవి కూడా దాదాపుగా తగరపు పైకప్పుతోనే ఉంటాయి. ఇవి నేలకు ఆనుకుని ఉన్న ఇళ్ల మధ్యలో పైకి సాగి వచ్చినట్లుంటాయి. ఇటీవలే కూల్చివేతకు గురైన బాంద్రా సమీపం లోని మురికివాడలు పూర్తిగా నిలువుగా ఉండి నాలుగు అంతస్తులతో కూడి ఉండేవి. పురపాలక చట్టాలు మురికివాడల్లో నివాసాలకు 14 అడుగుల ఎత్తువరకు అనుమతించాయి కాబట్టి ఈ పరిధిలోనే ఉండే కుటుంబాలు కొంతమేరకు మరింత సౌకర్యంగా ఉంటాయి. దీంతో పై అంతస్తులో ఉన్న ఇళ్లను అద్దెకు ఇస్తుంటారు. ఇది అటు కిరాయి మార్కెట్‌కు, ఇటు మురికివాడల్లో స్థలం కొరత కొనసాగింపునకు సంకేతంగా నిలుస్తోంది. నివాసాల ఎత్తును 20 అడుగుల వరకు అనుమతించడానికి చేసిన ప్రతిపాదన దశాబ్ద కాలంగా నలుగుతూనే ఉంది. బాంద్రాలో జరిగిన విధ్వంసం వంటిది చోటు చేసుకున్నప్పుడే మురికివాడల గురించిన చైతన్యం ఆకస్మికంగా ఏర్పడుతూ ఉంటుంది. గృహరుణాలు అందుబాటులో ఉన్నా, మధ్యతరగతి ప్రజలకు కూడా గృహనిర్మాణం భారీ ఖర్చుతో కూడి ఉంటున్నందునే మురికివాడలు ఉనికిలో ఉన్నాయని మర్చిపోతుం టారు. ముంబై నగరాన్ని నివసించడానికి కాకుండా జీవించడానికి తగిన గమ్యంగా వలస ప్రజలు ఎంచుకుంటున్నారనే వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. నగర కార్పొరేషన్లో భాగంగా చేసిన సుదూరంలోని శివారు ప్రాంతాలు కూడా నివాసానికి అనుకూలమైన గమ్యంగా ఆకర్షించడం లేదు. ముంబై మురికివాడల గురించి ముఖం చిట్లించుకునేవారు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నారనే చెప్పాలి. మురికివాడలను తీసేయండి. అప్పుడు సబర్బన్ రైళ్లకు అంతరాయం కలి గితే ఎలా ఉంటుందో అలా ముంబై నగరం స్తంభించిపోయిన మజిలీలాగా మారిపోతుంది. మీ డ్రైవర్, మీ పనిమనిషి, మీ క్యాబ్ డ్రైవర్, మీ ఆటోరిక్షావాలా, షాప్ అటెండెంట్లు, చిరువ్యాపారులు మొదలైన వారందరూ ఈ మురికివాడల నుంచే వస్తుంటారు. మురికివాడలు అసభ్యకరంగానే కనిపిస్తాయి. అవును. అవి చూసేవారి కళ్లకు పుండులాగే కనిపిస్తాయి. కానీ కోటిమంది జనాభాలో సగం మందికి అవి నివాసప్రాంతాలుగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే 1996లో మురికివాడల పునరావాస పథకాన్ని ప్రారంభించారు. ఉచిత భవంతులలో వారికి ఇళ్లను కట్టివ్వడం, దీనికోసం ఫ్రీ మార్కెట్లో అమ్ముకునేందుకు గృహనిర్మాతలకు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి అనుమతించడం ఈ పథకం ఉద్దేశం. అయితే వేలాది పునరావాస ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉండిపోయాయి. ఎందుకంటే భవననిర్మాతలు ఈ ప్రాజెక్టులకు అనుమతి మాత్రమే పొంది, వాటిని సొంతం చేసుకుంటారు. తర్వాతెప్పుడో లాభం పొందేందుకు దాన్ని అలాగే వదిలేస్తారు. ఉన్నట్లుండి రాజకీయనేతలు చొరబడతారు, భవన నిర్మాతలతో కుమ్మక్కవుతారు. మరోవైపు ముంబై మురికివాడలు నిలువుగా పైకి పెరుగుతుంటాయి. ఎవరికీ ప్రయోజనం లభించదు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
హాకర్ల సమస్య పరిష్కారం?
విశ్లేషణ అధికారులు పూనుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచగలరు. హఠాత్తుగా వీధి వ్యాపారులు మటుమాయం కావడమే అందుకు నిదర్శనం. కానీ, వీధి వ్యాపా రుల విధానాన్ని తేలేకపోతే వారి జీవనోపాధి హక్కుకు భంగం కలుగుతుంది. రెండు ఘటనలు, ముంబై ప్రాంత స్థానిక రైల్వే స్టేషన్ల లోకి ప్రయాణికుల రాకపో కలు, స్టేషన్ లోపలి కదలికలు స్వేచ్ఛగా సాగడానికి ఉన్న అడ్డంకులను తొలగించాయి. ఒకటి, ఎల్ఫిన్‌స్టోన్ స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాట. మరొ కటి, స్టేషన్ల బయటా లోపలా ఉండే వీధి వర్తకులు (హాకర్స్) 15 రోజులలోగా ఖాళీ చేయాలని రాజ్ ఠాక్రే జారీ చేసిన హెచ్చరిక. అలా చేయక పోతే, పరిణామాలు హింసా త్మకంగా ఉండగలవని ఆయన సంకేతించారు కూడా. వీధి వ్యాపారులతో తలెత్తున్న ఈ సమస్య పట్ల అధి కారులు ఎప్పటికప్పుడు అలసత్వం చూపుతూ వస్తు న్నారు. ఒక సందర్భంలోనైతే ప్రజలు వారిని ఆదరించ రాదని కోరుతూ, ఆ బాధ్యతను వారి మీదకే నెట్టేశారు. ఎంత గట్టి చర్యలను చేపట్టినా వీధి వ్యాపారులు మొండి కేస్తున్నారని తరుచుగా అధికారులు చెబుతుండేవారు. కాబట్టి ప్రజలు తమను తామే తప్పు పట్టుకోవాలని అర్థం. వీధి వ్యాపారులు మొండివారు నిజమే, కానీ అధి కారులు పట్టుదలతో ప్రయత్నించారనడం మాత్రం నిజం కాదు. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని నవనిర్మాణ్ సమితి కొంత కాలంగా పలుకుబడిని కోల్పోతోంది. దాని క్యాడర్ పునాది బలహీనపడింది. పని ప్రదేశాలకు సురక్షి తంగా Ðð ళ్లి రావడం అనే సమస్య సరిగ్గా సమయానికి వారి చేతికి అందివచ్చింది. రాజ్, రైల్వే కార్యాలయాలను సందర్శించి వచ్చి ‘‘15 రోజుల్లోగా వీధి వ్యాపారులను తొలగించకపోతే మా తదుపరి మోర్చా శాంతియుతంగా జరగకపోవచ్చు’’ అని చెప్పారు. ఇది అందరి మనసు ల్లోని ఆందోళనను తాకింది. రాజ్ వ్యతిరేకించే బిహార్, యూపీ వారు సహా ప్రతి ప్రయాణికుడి హృదయాన్నీ ఆయన మీటారు. ఈ సమస్య అంత సార్వత్రికమైనది మరి. ఇది, తెలివి ఉన్నా చాకచక్యంలేని ముంబై నగర నిర్వహణా వ్యవస్థలోని ఒక ముఖ్య బలహీనతకు సంబంధించినది. వీధివర్తకుల సంఖ్య ఎంతో కూడా తెలియని నగర పాలక సంస్థల నిర్వహణకు సంబంధించిన ఈ బలహీనత... విధానాలు సహా అన్ని స్థాయిలలో వీధి వర్తకులతో వ్యవహరించే అందరిలోనూ ఉంది. అయితే, ఈ కాలమ్‌లో రాజ్ ఠాక్రేపై కంటే ఎక్కు వగా వీధి వర్తకులపైనే దృష్టిని కేంద్రీకరిద్దాం. సమస్యా త్మకమైన ముంబై నగర జీవితంలో వారు ఒక భాగం. అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ పుట్టుకొచ్చేసి వీధి వర్తకులు స్టేషన్లకు వెళ్లివచ్చే దారులను, కాలినడక వంతెనలను, వీధి పక్క పాదచారుల బాటలను ఆక్రమిం చేస్తుంటారు. ప్రయాణికులు వారి సమస్యగురించి చికాకు పడుతూనే వారిని ఆదరిస్తుంటారు. అందుబాటులోని దుకాణాలుగా వ్యవహరిస్తూ వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థలో భాగమై పోయారు. వలస వచ్చినవారికి, ఇటీవలి కాలంలో స్థానికులకు సైతం అది తేలికగా, త్వరితగతిన సంపాదించుకోగలిగిన జీవనోపాధి కావడమే అందుకు కారణం. నగర ప్రాంత స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు బహుశా వీరికి సంబంధించిన గణాంకాలను లెక్కలోకి తీసుకుని ఉండరు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్ ధరల మూలంగా చిన్న ఇంటి దుకాణం పెట్టుకోవడం కూడా అసాధ్యంగా మారింది. ఇది కూడా వారి ఉనికికి కారణం. పార్లమెంటు, వీధి వ్యాపారంపై చట్టపరమైన నిబం ధనలను, రూపొందించింది. వీధి వ్యాపారుల జీవనో పాధి హక్కుకు రక్షణను కల్పించే తీర్పును సుప్రీం కోర్టు 2014లోనే ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వీధి వ్యాపార విధానాన్ని ఇంతవరకు రూపొందించనే లేదు. వారు చెల్లించే రూ. 2,000 కోట్ల విలువైన ముడుపులే ఇందుకు కారణమని, కనీసం ఒక వీధి వ్యాపారుల ట్రేడ్ యూనియన్ చెప్పింది. ఆ సంఖ్య బహుశా ఎక్కువగా చేసి చెప్పనది కావచ్చు. కానీ, వీధి వ్యాపారులతో వ్యవహరించే శాఖకు చెందిన ఉద్యోగులు ఉంటారు కాబట్టి స్వార్థ ప్రయో జనం ఉన్నది నిజమే. వీధి దుకాణదారులను తొలగిం చాక, వారు జరిమానా చెల్లించేసి తిరిగి వస్తారు, జరిమా నాల పెంపుదల వారిని నిరోధించేదిగా ఏం పని చేయక పోగా, లంచాల మొత్తంలో పెరుగుదలకు కారణమౌ తుంది. ముంబై నగర జనాభాను బట్టి చూస్తే చట్టప్రకా రమే మూడు లక్షల మంది వీధి వ్యాపారులను వారి వృత్తులను కొనసాగించుకోడానికి అనుమతించవచ్చు. రహదారుల పక్క కాలిబాటలకు, రోడ్లపై పయ నించే వారికి కనీసమైన అటంకం మాత్రమే కలిగించే విధంగా వారిని వేరే చోట్లకు తరలించడంతోపాటూ, వారి ప్రయోజనాలను కూడా కాపాడటం సులువేమీ కాదు. ప్రధాన రహదారులకు దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతాల నివాసులు వారిని ఆహ్వానించరు. వీధివ్యాపారులూ అలాంటి చోట్లకు వెళ్లాలని కోరుకోరు. వీధి వ్యాపారాలు చేస్తున్నామని చెప్పే వారిలో చాలా మంది ఇంత జాగా సంపాదించుకోవాలనుకునే నకిలీ వ్యాపారులని ఒక సర్వేలో తేలింది. అధికార యంత్రాం గం నివారించగలిగిన తలనొప్పులే ఇవన్నీ. ప్రస్తుతానికే అయినా రైల్వే స్టేషన్ల లోపల, చుట్టూతా ఉండే వీధి వర్తకులంతా రాత్రికి రాత్రే ఒక్కరూ కనబడకుండా మటుమాయం కావడం అనే ఘటన.. అధికారులు కోరుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచ గలరనే భరోసాను మనకు తిరిగి కల్పించాలి. అయితే, వీధి వ్యాపారుల విధానాన్ని రూపొందించడంలో అన వసర జాప్యం చేయడం వల్ల నగర జనాభాలోని గణ నీయమైన భాగపు జీవనోపాధి హక్కుకు భంగం కలి గించినట్టు అవుతుంది. కావాలంటే ఆ చట్టాన్ని ప్రశ్నించ వచ్చుగానీ, అలాంటి చట్టం ఉన్నదని విస్మరించలేం. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆలోచించి ‘ఫార్వార్డ్’ చేయండి!
విశ్లేషణ ‘‘విచక్షణాశక్తిని అతి తక్కువకు కుదించడంగా సోషల్ మీడియా మారిపోయింది. మా దేశంలో విచక్షణా శక్తి మరీ అధ్వానమైనంత తక్కువగా ఉంది’’ అన్నాడు ఒక మిత్రుడు. చివరకు ఎవరైనా అదే నిర్ధారణకు వస్తారు. ముంబై వాసులు దిటవు గుండెల వారు. ఎలాంటి ఇబ్బందినైనా త్వరితగతిన అధిగమించగలుగుతారు. 1993 నాటి మతకల్లోలాలను, ఆ తదుపరి సంభవించిన ముంబై వరుస బాంబు దాడు లను, చివరికి 2005 నాటి కుంభవృష్టి సృష్టించిన ఉప ద్రవాన్ని కూడా వారు తట్టుకోగలిగారు. అయితే, ఆనాటి కుంభవృష్టి మాత్రం వారి మనస్సుల్లో సజీవంగా నిలి చిపోయింది. భారీ వర్షాలు పడ్డప్పుడల్లా వారు ఆందో ళనకు గురవుతుంటారు. ఆగస్టు 29న కూడా అదే జరి గింది. నగరం తిరిగి కోలుకుని యథాత«థ స్థితికి చేరింది. ఆ రోజున ఒక డాక్టర్ మూతలేని ఓ మ్యాన్‌హోల్‌లో పడి, కొట్టుకుపోయిన ఘటనకు కారణాలను నగర ప్రభు త్వానికి, కోర్టులకు వదిలేశారు. సెప్టెంబర్ 20న ఆ ప్రాంతంలో మరోమారు గాలివానలు కురిసినప్పుడు అనవసరమైన భయం వ్యాపించింది. ఆ భయానికి కారణం సామాజిక మాధ్యమాలు. ఆ రోజున మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు తుఫాను కేంద్రం ముంబైను తాకుతుందనే ఒక సందేశం సోషల్ మీడి యాలో చక్కర్లు కొట్టడంతో ఆందోళన తారస్థాయికి చేరింది. కార్యాలయాలన్నీ ఖాళీ అయిపో యాయి. భారీ వర్షాలకు ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ముందే మూసే శారు. కానీ, ఆగస్టులో విద్యామంత్రి పంపిన ట్వీటర్ సందేశాన్ని ఎవరో కొందరు సెప్టెంబర్ 20న తిరిగి ట్వీట్ చేశారు. అసలు తుపాను ఏర్పడే పరి స్థితులు పెంపొందుతున్నాయనే ప్రకటనే వెలువడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సందే శాలు ఉద్దేశపూర్వకంగా చేసిన తుంటరి పనుల కోవకు చెందుతాయి. తుపాను పరిస్థితులు నిజం గానే పెంపొందడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టింది. దాని కదలికలను చక్కగా గుర్తించగలిగారు. కాబట్టి అది హఠాత్తుగా ప్రజలపైకి వచ్చి పడలేదు. అంతకు ఒక వారం ముందు, ఆహారం, నీళ్లు, పాలు, మందులు తదితరాలను నిల్వ చేసుకోమని ప్రజలు కోరుతూ మరో సందేశం చక్కర్లు కొట్టింది. అది కూడా ఒక్క కుదుపు కుదిపేసింది. తుపాను హెచ్చరిక ఏదీ జారీ చేయలేదనే వివరణతో మునిసిపల్ కార్పొ రేషన్, పోలీçసులు ప్రకటించారు. కానీ, ముంబై వాసులు తాము దేన్ని నమ్మదలుచుకునారో దాన్నే... ఎక్కడ నుంచి వచ్చిందో తెలియని ఓ వాట్సాప్ సందేశాన్ని నమ్మారు. ఎందుకైనా మంచిదని ప్రజలు జాగ్రత్త వహిం చారని దీని గురించి అనుకోవచ్చు. కానీ ఇది రెండు కీలక అంశాలను సూచిస్తోంది. ఒకటి, క్షీణిస్తున్న మీడియా విశ్వసనీయత. టీఆర్పీ రేటింగ్‌ల కోసం దేనినైనా సరే సంచలనాత్మకం చేయా లని కొత్త వార్తా చానళ్లు పడే ఆరాటం దీనికి కారణం. రెండు, ఏ ప్రయోజనాలనూ ఆశించని వారు ఇతరులకు సహాయం చేయాలనే కోరికతో పంపినది కాబట్టి సోషల్ మీడియా సందేశం నమ్మదగినదనే విశ్వాసం. బూటకపు వార్తల ప్రచారానికి ఎక్కువగా వాడేది సోషల్ మీడి యానే. కాగా, సంప్రదాయక మీడియాను బూటకపు వార్తలను వ్యాపింపజేసిదిగా చూస్తున్నారు. వాతావరణ సంస్థ కార్యాలయం వారి చిత్రాల సహాయంతో నేను ఈ తుపాను పుకార్లను అదే సామా జిక మధ్యమాన్ని వేదికగా చేసుకుని ఎదుర్కొన్నాను. ‘సామాజిక మాధ్యమాల’కు వంచించగల సామర్థ్యం ఉన్నదనడం ఎక్కువ మందినేం చికాకు పెట్టలేదు. సామాజిక మాధ్యమాలను వాడుకుని నిరాధారంగా అబ ద్ధాలను, అతిశయోక్తులనూ చెబుతూ ప్రత్యర్థులపైన ఎలా అప్రతిష్టపాలు చేశారో కొందరు గుర్తు చేశారు. ఇది ‘సామాజికమైనది’ కాదు, ‘అసామాజికమైనది’ అనేది చికాకు పడ్డవారందరి సాధారణాభిప్రాయం. వాటిని ఉపయోగిస్తున్నది అందుకోసమేనని వారి వాదన. సరిచూసుకోలేని సమాచారం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుండగా, తాము సమకూర్చుకునే సమాచారం విశ్వసనీయతను రూఢిచేసుకునే ఏర్పాట్లున్నాయని ఆశిం చగల వ్యవస్థాగత మీడియా ఇప్పడు అనుమానాస్పదమై నదిగా మారింది. ‘‘మీరు నా పై ఆరోపణ చేస్తారా? మీరు అదే చేశారుగా, మీరు చెయ్యలేదూ?’’ అనే ఇలాంటి కుతర్కపు చర్చలు సైతం ఇతర వేదికలపై సాగుతున్నాయి. ఈ కపట తర్కం, ముఖ్యమైన సమస్యలను విస్మరించి సమాజానికి అపారమైన నష్టాన్ని కలు గజేస్తుంది. ఊరి బావి వద్ద ఊసుపోత కబుర్లు తక్కువ హానికరం. అవి ప్రచారమయ్యే క్రమంలో మరిన్ని మసాలాలను పులు ముకునే క్రమంలో అతిశయోక్తులకు దారి తీస్తాయి. ఇదొక ముఖ్యాంశమే. కానీ దాని భౌగోళిక ప్రాంతం తక్కువ. మెరుపు వేగంతో సామాజిక మాధ్యమాలు సరిహద్దు లను దాటుతాయి. వార్తా పత్రికలు, టీవీల వార్తలపై ఆధారపడేవారు ‘‘ఇది వాట్సాప్‌లో వచ్చింది. టీవీలో ఎందుకురాలేదు?’’ అని అడుగుతారు. ఇటీవలే హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక మిత్రుడు ‘‘చిట్టచివరకు ఒక భీకర శక్తి వేళ్లూనుకుంది. అది నిజం గానే భయం పుట్టించేది’’ అన్నాడు. మరో మిత్రుడు ‘‘విచక్షణాశక్తిని అతి తక్కువకు కుదించడంగా సోషల్ మీడియా మారిపోయింది. మా దేశంలో విచక్షణా శక్తి మరీ అధ్వానమైనంత తక్కువగా ఉంది’’ అన్నాడు. చివ రకు ఎవరైనా అదే నిర్ధారణకు వస్తారు. సందేహాస్ప దమైన సందేశాలను ఎలాంటి ఆలోచనాలేకుండా ఫార్వార్డ్ చేయడాన్ని పక్కన పెడితే... సోషల్ మీడియా వల్ల ముఖ్యమైన, సహాయకరమైన ప్రయోజనాలు ఉన్న మాట నిజమే. కాకపోతే, వాటిలో సభ్యులుగా చేరే వారు ‘ఫార్వార్డ్’ కీ నొక్కడానికి ముందు ఒకటికి రెండుసార్లు తీవ్రంగా ఆలోచించాలి. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
అక్కడ జీవితమే ఒక సర్దుబాటు
విశ్లేషణ జనంతో నిండి ఉండే కోచ్‌లలో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు శరీరాలు నొక్కుకుంటూ, తోసుకుంటూ చేయవలసిన దుర్భర ప్రయాణపు అనుభవం ముంబై ప్రజల ప్రధాన లక్షణం. వీరికి మరో ప్రత్యామ్నాయం లేదు కూడా. ప్రజలు తమ నగరాలకు ఒక గుణశీలతను కల్పిస్తూ వాటిని తీర్చిదిద్దుతారా లేక నగరాలు తమ నివాస ప్రజల ‘ప్రవర్తన’ను తీర్చిదిద్దుతాయా? ఒకటి మరొకదాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ ముంబైలో మాత్రం అవినీ తిపరులైన శక్తులు బలవంతంగా తమపై రుద్దుతున్న పథకాలకు సంబంధించి ప్రజలకు ఎంచుకునే అవకాశాలు చాలా తక్కువ. నగర ప్రజలు ఎలా సర్దుకుపోవాలో నేర్చుకుంటారు. ప్రత్యేకించి ముంబై బతకడానికే తప్ప నివసించడానికి తగిన అవకాశం కాదు. రాజకీయనేతలు, అవినీతిపరులైన అధికార వర్గం ద్వారా ఏర్పడుతున్న మానవ నిర్మిత సంక్షోభాన్ని చాలావరకు నగర ప్రజలు సహించాల్సి ఉంటుందనే దీనర్థం. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నత్తనడక నడుస్తూ కాల వ్యవధిని పాటిం చని బస్సుల కోసం ముంబై ప్రజలు బస్టాండులలో క్యూ కట్టరు. అదేసమయంలో నిత్యం తోసుకుంటూ పెనుగులాడుతూ ప్రయాణించవలసిన రైలు ప్రయాణాన్నే వీరు ఎంచుకోవలసి ఉంటుంది. ముంబైలో ఏ స్థానిక రైలులో అయినా ప్రవేశిం చేటప్పుడు తోసుకోవడం, పెనుగులాడటం చాలా సాధారణమైన అనుభవం. రైలులో ఉన్నవారు దిగటం కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. ఎందుకంటే కొత్త వారు బోగీలో ప్రవేశించడానికి అది కొంత స్థలాన్ని కల్పిస్తుంది మరి. ఈ మొత్తం క్రమం 20 సెకన్లలోపే ముగుస్తుంది. పెద్ద స్టేషన్లలో మాత్రం రైళ్లు కాస్త ఎక్కువసేపు అంటే 30 నుంచి 45 సెకన్లవరకు నిలుస్తాయి. అంటే ప్లాట్‌ఫామ్‌ల మీద ఉన్న ప్రయాణికులకు సెకను సమయం కూడా చాలా విలువైనదే. రెప్పపాటు కాలంలో గుంపు కోచ్ నుంచి దిగుతూ, లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇది ప్రతి పనిదినాన కనీసం 80 లక్షలమంది ప్రయాణించే బృహత్ వ్యవస్థలో ప్రతి నిమిషం కనిపించే నియంత్రిత ఉపద్రవం అన్నమాట. ఆదివారాలు, సెలవుల్లో మాత్రమే ప్రయాణికుల సంఖ్య తగ్గుతుంటుంది. జనం రద్దీతో నిండిపోయే కోచ్‌లలో నిలబడి ప్రయాణిస్తున్నప్పుడు శరీరాలు నొక్కుకుంటూ, తోసుకుంటూ చేయవలసిన దుర్భర ప్రయాణపు అనుభవం ముంబై ప్రజల ప్రధాన లక్షణం. వీరికి మరో ప్రత్యామ్నాయం లేదు కూడా. ఒక చోట నివాసముంటూ మరొకచోటికి వెళ్లి పనిచేసి తిరిగి రావడం తప్పదు. పనే ముఖ్యం కాబట్టి దానికి సంబంధించినంతవరకు అన్ని రాజీలూ, సర్దుబాట్లూ క్రమంలోనే ఉంటాయి. ఇక రెండో తరగతి కోచ్‌లలో ముగ్గురు ప్రయాణించే సీటులో నాలుగో ప్రయాణికుడు కాస్త బతి మిలాడుకుని సీటులో కూర్చోవచ్చు. అయితే అతడు సగం సీటులోనే కూర్చోవాల్సి ఉంటుంది. కానీ నిలబడి చిత్రహింసలు అనుభవించే స్థితితో పోలిస్తే ఇది పెద్ద ఉపశమనమే. మొదటి తరగతి కోచ్‌లో ఇలాంటి సర్దుబాటుకు అవకాశమే ఉండదు. వీటిలో ప్రయాణించేవారు మురికివాడల మధ్య గేటెడ్ కమ్యూనిటీలో నివసించేవారే. నగరంలో తిరిగే రైళ్లను దక్షిణాన కొలాబా, ములంద్, దషిర్, ఉత్తరాన మంకుర్డ్ మధ్య మునిసిపల్ పరిధులకు పరిమితం కాని బృహన్ ముంబైకి సంబంధించిన అతి సూక్ష్మప్రపంచంగా చెప్పవచ్చు. మూడింట రెండు వంతుల మంది ముంబైలో నివసిస్తుండగా, మిగిలిన ఒకవంతు మంది మెట్రో ప్రాంతంలో నివసిస్తుంటారు. ఎనిమిది నగర కార్పొరేషన్లలో, 23 కౌన్సిల్స్‌లో మెట్రో ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతాలన్నింటి వైఖరి ఒకటే. జనాభా పరిమాణం ప్రజలకు సంబంధించిన అనేక లక్షణాలను నిర్దేశిస్తూ ఉంటుందనడానికి బోలెడు సాక్ష్యాలు. వీటిలో కొన్ని వారిని నిత్యం బలీయంగా ప్రభావితం చేస్తుంటాయి. పెరుగుతున్న ధరలతో కుంగిపోతున్న చిన్నచిన్న అపార్ట్మెంట్లకే ఇది పరిమితం కాదు. జీవితం ఇక్కడ నిత్యం సర్దుబాట్లతోనే సాగుతుంది. మనుషులు నడిచే పై వంతెనలను ఉపయోగించేటప్పుడు కూడా ఈ తరహా సర్దుబాటు కనిపిస్తూనే ఉంటుంది. రైల్వే స్టేషన్లలో నడవాల్సిన మార్గం పట్ల అవగాహన లేని లేదా నగరానికి కొత్త అయిన ప్రయాణీకులు కుడివైపునే నడుస్తుంటారు. ప్రయాణీకులను సులువుగా దాటుకుంటూ పోవడానికి జనం ఎప్పుడూ ఎడమవైపే నడుస్తుంటారు. కానీ ఆ దారుల మధ్యే హాకర్లను అనుమతిస్తూ ప్రయాణ మార్గాన్ని అడ్డుకునే అధికారులను కూడా మీరు లెక్కించవచ్చు. కొంతమంది ప్రయాణికులు కాలుమీద కాలు వేసుకుని రైలులో ప్రయాణిస్తుంటారు. ఇలా కాలుమీద కాలు వేసుకుని కూర్చోవడం ప్రయాణికులకు కాస్త సౌకర్యాన్ని కల్పించవచ్చు కానీ, వేలాడుతున్న మోకాలు రైలు ఒకవైపునకు ఒరిగినప్పుడల్లా ఎదుటి సీటులో కూర్చున్న ప్రయాణికుడికి తగులుతూ ఉంటుంది. ఇవి ముంబైవాసుల రైలు మర్యాదల్లో భాగమే. రైళ్లలో సౌకర్యాలకు దూరమైన గుంపులు పెట్టే బాధలతో పాటు వ్యక్తులు కూడా ప్రయాణికులకు మరింత భారాన్ని జోడిస్తుంటారు. కానీ ఎవరూ ఇలాంటి స్థితిపట్ల ఫిర్యాదు చేయరు. ఇదే ముంబై స్ఫూర్తి పట్ల ఎప్పుడూ దురభిప్రాయం కలిగించే లక్షణం. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పరిశుద్ధ నగరం పగటి కలా?
విశ్లేషణ వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించిన కాలువలను చెత్తతో నింపేసి, అది నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు, అందుకు కారణమైన తమను తప్పుపట్టుకోకుండా నగర పాలన సంస్థ వైపు వేలెత్తి చూపుతుంటారు. బహిరంగ ప్రదేశాలను చెత్త చేస్తున్నందుకు 14 లక్షల మందిని హెచ్చరించి, 5 లక్షలకంటే ఎక్కువ మందికి జరిమానాలు విధించి ఒక్క ఏడాదిలోనే రూ. 8.27 కోట్లను జరిమానాలుగా వసూలు చేశారంటే... ఆ నగరం చెత్తకు పూర్తి అతీ తంగా కాకపోయినా, మరింత పరిశుభ్రమైనదిగా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ దేశంలోనే అతి పెద్ద, సుసంపన్న పట్టణ ప్రాంతమైన ముంబై విషయంలో అలా జరగలేదు. నగర పరిశుభ్రతపై అన్ని హెచ్చరికలను జారీ చేశాక గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జరిమానాలు విధించడం మొదలెట్టాయి. నగర పాలక సంస్థ ఉద్యోగులు, ఔట్ సోర్స్డ్ ఉద్యోగులు యూనిఫారాలు ధరించి, రసీదు పుస్తకాలు పట్టుకుని నిర్లక్ష్యంగా నగరాన్ని చెత్త చేసే వారిపై కన్నేసి ఉంచుతున్నారు. ఆ నగర జనాభా 1.24 కోట్లు. పగటి వేళల్లో అంతకంటే గణనీయంగా ఎక్కువ జనాభాతో కిటకిటలాడిపోతుంటుంది. శివారు ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా జనం పని చేయడం కోసం నిత్యం ముంబైకి వస్తుంటారు. శివారు ప్రాంతాలు నిజానికి సొంత స్థానిక పరిపాలనా సంస్థలు గల ఇతర నగరాలే. నగర పాలక సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన పథకాలలో ఎక్కడా కిక్కిరిసిన మురికివాడలు కానరావు. బ్రహ్మాండమైన ఈ నగరంలోని గొప్ప వైరుధ్యం ఇది. 300 మంది ఉపయోగించే ఒక్కో మరుగుదొడ్డి శుద్ధికి అతి కొద్దిగానే నీరు లభ్యం కావడం, చెత్త చెదారం వగైరాలను తరలించేవారు లేకపోవడం వంటివి ఈ మహా నగర పారిశుద్ధ్య సమస్యలకు అదనం. పారిశుద్ధ్య పరిరక్షకులు ఈ మురికివాడలను సందర్శించరు. జనం ఎక్కువగా తిరిగే స్టేషన్లలాంటి ప్రాంతాలకే వారు పరిమితమవుతారు. ప్రకాశవంతమైన, ఉజ్వలమైన ముంబై అనే భావనకు మురికివాడలు ఒక వైరుధ్యంగా నిలుస్తాయి. కార్యాలయాలుండే అద్దాల టవర్లు, నివాసాలుండే ఆకాÔ¶ హర్మ్యాలకు ఆనుకునే మురికివాడలుంటాయి. చెత్తకు నిలయంగా పేరు మోసిన నగరంలోని ఆ పది శాతం ప్రాంతంలోని మురికివాడలు నగర జనాభాలో సగానికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. నగర ప్రణాళికల నమూనాలలో ఎక్కడా వాటికి చోటుండదు. ముంబైని పరిశుభ్రమైన నగరమని అనలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది, మురికివాడల నుంచి చెత్తను తీసుకుపోవడం, అక్కడ నివసించేవారికి తాగునీటిని, దాదాపుగా పనికిరాకుండా ఉండే ఉమ్మడి మరుగుదొడ్లకు నీటిని అందించడానికి సంబంధించిన సమస్యలు నగర నిర్వాహకుల దృష్టికి సుదూరం నుంచైనా కానరావు. బిల్డర్ల దృష్టిలో మురికివాడలంటే అక్కడివారికి ప్రత్యామ్నాయ గృహవసతిని కల్పించి, బహిరంగ మార్కెట్ కోసం అదనపు నిర్మాణాలను నిర్మించి భారీ లాభాలతో జేబులు నింపుకునే రియల్ ఎస్టేట్ ఆస్తులు. అంతేగానీ జనావాసాలు మాత్రం కావు. దక్షిణ ముంబై, నగరంలోని అతి గొప్ప ప్రాంతం. వలస కాలం నాటి భవనాలు, వ్యాపార ప్రాంతాలు, సముద్ర తీరానికి అభిముఖంగా ఉండే ప్రాంతాలు, భారీ మైదానాలు అక్కడే ఉంటాయి. పారిశుద్ధ్య పరిరక్షకులు (క్లీన్ అప్ మార్షల్స్) విధుల్లో ఉన్నా అక్కడి బహిరంగ ప్రదేశాలు సైతం శుభ్రంగా ఉండవు. వీధిలో ఏమైనా పారేసినందుకు లేదా ఉమ్మినందుకు రూ. 200, మలమూత్ర విసర్జనకు రూ. 200, పెంపుడు కుక్క మలమూత్ర విసర్జన చేయడాన్ని అనుమతించినందుకు రూ. 500 జరిమానాలను విధిస్తున్నారు. సదరు పౌరులు వారితో వాదులాడినా చాలావరకు జరిమానాలను చెల్లిస్తున్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, దుకాణాలను ఏర్పాటు చేసుకుని పాదచారులు వాటిని ఉపయోగించుకోనివ్వకుండా చేసే వీధుల్లోని చిన్నవ్యాపారులు ఇప్పుడు జాగ్రత్తగా తమ వ్యర్థాలను చెత్తబుట్టలో వేస్తున్నారు. కాబట్టి ఒకప్పటి కంటే నగరం ఇప్పుడు మరింత శుభ్రంగా ఉందని నగర పరిపాలనా విభాగం చెప్పుకోవచ్చు. కానీ అది, మొత్తంగా ఈ కథనంలోని ఒక భాగం మాత్రమే. ఇది నా ఇల్లు కాకపోతే చాలు, చెత్తా చెదారం పడేసి మురికిమయం చేయదగిన ప్రాంతమేననే ప్రజల వైఖరి ఈ కథనంలోని మరో భాగం. ఆసక్తికరంగా, ఈ జరిమానాల గురించిన అధికారిక గణాంక సమాచారంతో మీడియా నివేదిక వెలువడిన రోజునే మరో కథనం కూడా వెలువడింది. అది, నగరంలోని ప్రధానమైన కాలువలలో చెత్త పడేయడాన్ని నిరోధించడానికి వాటిపై పాలీకార్బనేట్ (దృఢమైన «థర్మో ప్లాస్టిక్) షీట్లను కప్పే పథకం గురించినది. ఈ కాలువలు నిజానికి వరద నీరు బయటకు పోవడానికి ఉద్దేశించినవి. కానీ అవి అతి పెద్ద చెత్త పడేసే స్థలాలుగా మారాయి. కాలువల్లో చెత్త పేరుకుపోయి, నీటి ప్రవాహాన్ని అడ్డగించినప్పుడు ప్రజలు... అందుకు కారకులైన తమను తప్పుపట్టుకోకుండా నగర ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతుంటారు. పౌరులు గొంతును శుభ్రపరచుకుని ఎక్కడబడితే అక్కడ ఊసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగానే పరిశుభ్రత కానరాదు. అలా ఊసేట ప్పుడు అది దారిన పోయేవారిపై పడకుండా ఉండటం అరుదు. ఇద్దరూ దీనికి ఎంతగా అలవాటు పడిపోయారంటే పాన్, తంబాకు నమిలేవారు ఆ పనిని... పారి శుద్ధ్య పరిరక్షకుల కంటపడితే తప్ప... సర్వసాధారణమనే భావిస్తుంటారు. పరిశుభ్రతను అలవాటుగా చేయడానికి బహుశా ఇప్పుడున్న దానికి వేల రెట్ల బలమైన భారీ బలగం అవసరం కావచ్చు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
సెంట్రల్ హాలుకు అవమానం?
విశ్లేషణ మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా? లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి దిగజారిపోతున్నాయా? రెండూ కావచ్చు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అర్ధరాత్రి ప్రారంభించడం.. 1947ని అవమానించేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. జవహర్లాల్ నెహ్రూ సుప్రసిద్ధమైన ప్రసం గం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ‘తో అధికార మార్పిడి జరిగిన సందర్భం అది. జీఎస్టీ ప్రారంభోత్సవ ఘటనను బహిష్కరిం చడం ‘సైద్ధాంతిక‘ పరమైనదని కాంగ్రెస్ చెప్పుకుంది. సెంట్రల్ హాల్ అనేది సంసద్ భవన్లో ఒక భాగం. ఇక్కడే లోక్‌సభ, రాజ్యసభ కూడా ఉన్నాయి. ఇక్కడినుంచి చర్చ, వాదన ద్వారా, ఏకాభిప్రాయం లేదా వోటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఉభయ సభలు సమావేశమైనప్పుడు సెంట్రల్ హాల్ నుంచే రాష్ట్రపతి ప్రసంగిస్తారు. మన రాజ్యాంగాన్ని కూడా ఇక్కడే ఆమోదించారు. అందుచేత సెంట్రల్ హాల్ అలనాటి ఉజ్వల ఘటనలకు సంబంధించిన మ్యూజియం కాదు. పార్లమెంటరీ వ్యవహారాల నిర్వహణకు చెందిన కీలకమైన స్థలం. పార్లమెంటులో ప్రసంగించేందుకు ఏ ముఖ్య నేతనయినా ఆహ్వానించినప్పుడు సెంట్రల్ హాల్లోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్ ఆనంద్ శర్మ ‘అవమానం’ అని మాట్లాడుతున్నారంటే దానిని జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ తరఫున చేసిన సానుకూల సమర్థనగానే చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటు పట్ల రాజకీయ వర్గం వైఖరిని పరి శీలించడానికి ఈ పరిణామం ఒక కారణాన్ని మనకు అందిస్తుంది. కాంగ్రెస్ కానీ, మరే ఇతర పార్టీ కాని సెంట్రల్ హాల్ పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించే సందర్భాల్లో దానిలో జరిగే కార్యక్రమాల పట్ల ఆ పార్టీల వైఖరి ఇలా ఉండదు. సెంట్రల్ హాల్ పట్ల గౌరవ ప్రదర్శన అనేది లోక్ సభ, రాజ్యసభల్లో వ్యవహారాలను నిర్వహిస్తున్న పార్టీల వైఖరి బట్టి ఉండకూడదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవలే పార్లమెంటేరియన్లను తీవ్రంగా మందలించారు. ‘‘మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. పార్లమెంటులో వ్యవహారాలను నిర్వహించడానికి మీరున్నారు.’’ పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయాలు కలిగించడం అమోదించదగినది కాదు. ఉభయ సభల్లో గలాభా కొనసాగడం వల్ల గంటల కొద్దీ అమూల్య సమయం వృథా కావడం కొనసాగుతోందని, ఇలా కొనసాగితే సెంట్రల్ హాల్లో ఆమోదం పొందిన రాజ్యాంగం సూచించినట్లుగా పార్లమెంటు ఉద్దేశమే ఓటమికి గురవుతుందనడానికి రాష్ట్రపతి వద్ద బోలెడు రుజువులున్నాయి కూడా. రాష్ట్రపతి ఆగ్రహాన్ని పౌరుల తీవ్ర వ్యాకులతతో సరిపోల్చవచ్చు. పార్లమెంటు కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చడం తప్ప ఎంపీలనుంచి మరేమీ ఆశించలేమని పౌరులు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారు. బీజేపీకి చెందిన అరుణ్ జైట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కపటధోరణితో వాదిస్తూ, విచ్ఛిన్నపర్చటం, అవరోధాలు కల్పించడం ప్రయోజనకరమైనవేననీ, పార్లమెంటు సజావుగా సాగిపోతే ప్రభుత్వం చర్చల ద్వారా తప్పించుకునే అవకాశముంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చని రాజకీయ పార్టీని చూడటం ఇప్పుడు చాలా కష్టం. కాబట్టి పార్లమెంటులో ఏ ప్రదేశానికైనా సరే అవమానం జరిగిందని ఏ రాజకీయ నేత అయినా మాట్లాడుతున్నాడంటే అది అబద్ధం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పార్లమెంటు కార్యకలాపాలను మృదువుగా సాగేటట్లు చేసి ఉంటే, కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలక సంకీర్ణ కూటమిని కూడా అలాగే ఉండాలని డిమాండ్ చేస్తే అది నిజాయితీ ప్రదర్శించినట్లు లెక్క. చర్చకు, వాదనకు సంబంధించిన వేదికను నిత్య ప్రతి ష్టంభన వేదిక స్థాయికి కుదించకూడదు. పార్లమెంటు కార్యకలాపాలను పదే పదే విచ్ఛిన్నపర్చే అలవాటును కొనసాగిస్తూ సెంట్రల్ హాల్ గౌర వం గురించి పేర్కొనడం అసంబద్ధమైన విషయం. ఒకప్పుడు ప్రతిపక్షం వాకౌట్ చేయడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే పద్ధతిగా ఉండేదని అనిపిస్తుంది. సంఖ్యాబలం లేని ప్రతిపక్షం మెజారిటీ సాధిం చేందుకు ప్రయత్నిస్తుందనీ, విచ్ఛిన్నకర విధానాలతో వ్యవహరించేందుకు ప్రభుత్వానికి ఎప్పుడూ ఓ మార్గం ఉంటుందనుకోవడం తప్పుడు అవగాహన మాత్రమే. అత్యధిక భాగం నిరక్షరాస్యులుగా ఉన్న దేశ జనాభాచే ఎన్నికైన తొలి లోక్‌సభ ఉన్నట్లుండి పెద్దమనిషి తనంలోకి మారిపోయి పార్లమెంటు కార్యకలాపాల్లో ఒక గంట సమయం కూడా వృథాపర్చకుండా గడపటం సూచ్యార్థంగా కనబడుతుంది. ఆనాడు అలా జరిగిందంటే ఆనాటి నేతల నడవడికే కారణం. గత శీతాకాల సీజన్లో 16వ లోక్‌సభ సమయంలో 30 శాతం, రాజ్యసభ సమయంలో 35 శాతం కేవలం విచ్ఛిన్నకర చర్యలవల్లే వృథా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఉనికిలోకి వస్తున్న ప్రశ్న ఏదంటే, మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా మనం పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా అన్నదే. లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి తీవ్రంగా పతనమవుతున్నాయా? రెండూ కావచ్చు. కానీ రాజకీయ ప్రపంచపు ద్వంద్వత్వంలో రెండు విరుద్ధ రాజకీయాల మధ్య సహకారం అనేది చిట్టచివరి అంశంగా మారుతోంది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పేదింటికి అవమానపు ముద్ర
పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే. ఆవశ్యక ఆర్థిక వనరులు కొరవడితే ఎవరైనాగానీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది లేదా వచ్చే కొద్దిపాటి రాబడికి అల్పస్థాయి జీవన ప్రమాణాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మానవాభివృద్ధి సూచికను కొలిచే మూడు కొలబద్ధలలో ఒకటి, ఆదాయం. డబ్బు లేకపోయాక మిగతా రెండిటిని... ఆరోగ్యాన్ని, పాఠశాలల్లో నేర్చుకోగల జ్ఞానాన్ని పొందడం కష్టమౌతుంది. కాబట్టి పేదరికాన్ని అతి పెద్ద అసౌకర్యమని చెప్పుకోవచ్చు. కానీ అది దాన్ని తక్కువ చేసి చెప్పడం అవుతుంది. పేదలను ప్రభుత్వం కేవలం ఒక గణాంకంగా చూడటం ద్వారా వారికి సంబంధిం చిన మానవాంశను నిర్మూలించి, పుండుకు కారం రాసినట్టుగా అవమానిస్తుంటే.. అంతకంటే హీనమైనదిగా మారుతుంది. ‘పేద’ పేటెంటు కాదగిందే కావచ్చుగానీ, పేదలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం పేదలు తమ ఇంటి ముందు గోడలపై ప్రజా పంపిణీ వ్యవస్థ సహా వారు వేటికి అర్హులో సూచించే నోటీసులను రాయించుకునేలా చేసి అవమానించే చర్యలు చేపట్టింది. ఇది పూర్తిగా మతిలేని పని. దీంతో పేదలను వేలెత్తి చూపి, ఆదాయాల రీత్యాగాక, వారికి ఇంకా సొంతంగా మిగిలిన వాటిని కూడా హరించి వేయడం జరుగుతుంది. అందులో వారి వల్ల సమాజానికి ఉన్న ఉపయోగం ఒకటి. పేదలుగా గుర్తించేవారి ఆదాయ స్థాయి ఏమిటో గ్రామమంతటికీ తెలిసిందే. అయినా వారి ఇంటి గోడలపై దాన్ని రాయడం వెనుక ఉన్న ఉద్దేశం రికార్డులను నమోదు చేయడం కాదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీకి రేషన్ పొందేవారికి ఇప్పటికే రేషన్ కార్డులున్నాయి. వారి స్థానం ఏమిటో గుమాస్తాలు రిజిస్టర్లలో జాగ్రత్తగా నమోదు చేసి ఉంటారు. పరిపాలనాపరమైన ఈ పూర్తి వెర్రిబాగులతనానికి రాజస్థాన్ ప్రభుత్వం ఇంతవరకు సమంజసమైన వివరణను ఇవ్వలేదు. పేదలను సర్వే చేయడానికి వచ్చే ఇన్స్పెక్టర్ల దృష్టిని ఆకర్షించడం కోసం వారు తమ గోడలకు ఈ రంగు ముద్రలను వేయించుకోవాలనేట్టయితే.. అంతిమంగా అది అత్యాధునికమైన ఈ పంపిణీ వ్యవస్థలోని అధికారగణం నిజాయితీ గురించి చాలానే చెబుతుంది.ఇప్పటికే పీకల లోతు పేదరికంలో మునిగి ఉన్న పేదలు తమ ఇంటి గోడలకు ఈ రంగులు, రాతలు వేయించుకోగలరని ఆశించడం మరో మతిమాలిన పని. ఒకవేళ ప్రభుత్వమే అందుకు ఆర్థిక వనరులను సమకూరుస్తుండి ఉంటే, ఏదో ఒక స్థాయిలో డబ్బు చేసుకునే రాకెట్ ఏదో నడుస్తుండి ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇంటి గోడలపై పచ్చ రంగు మాసికలను వేసే ఈ కార్యక్రమాన్ని... బహుశా పైలట్ ప్రాజెక్టుగా కామోసు భిల్వారా జిల్లాలోని పేదల ఇళ్లకు పరిమితం చేశారు. దీనికి ముందే, ప్రభుత్వాధికారులకు సర్వసాధారణంగా మారిన ఈ తోలు మందపుతనం మధ్యప్రదేశ్‌లో కనిపించింది. పేదరికం నేరమన్నట్టుగా పేదలు ముద్రలు వేసుకోవడం అవసరమైంది. ఇలాంటి మూర్థత్వానికి హేతువు ఏమిటో మాత్రం అంతుబట్టడం లేదు. గొప్ప సంపన్నులను బహిరంగంగా వారి ఆదాయపు పన్ను రిటర్నులను బహిరంగపరచాలని కోరితే, అది వారి ప్రైవసీపై దాడి అంటూ తక్షణమే గగ్గోలు పుడుతుంది. బ్యాంకులకు భారీ మొత్తాల్లో ప్రజాధనాన్ని బకాయిపడ్డ వారి సమాచారాన్ని బహిర్గతం చేయడం బ్యాంకు పరపతి క్రమాలను దెబ్బ తీస్తుందని రిజర్వ్ బ్యాంకు, సుప్రీం కోర్టుకు చెప్పింది. మొండి బకాయిదార్లయిన కార్పొరేట్ల పేర్లను వెల్లడించి, వారిని అవమానించడానికి అది తిరస్కరించింది. కార్పొరేట్లు అంతరాత్మగలిగిన మానవులు కారు. అయినా అవి ఎగవేతదార్లుగా సుప్రీంకోర్టు ముందు గుర్తింపును పొందడాన్ని ప్రజా వ్యవహారాలకు సంబంధించిన సమస్యగా భావించి పట్టించుకున్నాయి. కానీ రాజస్థాన్లోగానీ, మరెక్కడైనాగానీ పేదలు మనుషులు కాబట్టి, వారికి మనసులు ఉంటాయి. ఈ అంశాన్నే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పేదలైన కారణంగానే పేదలను అంత మొరటు పద్ధతిలో చులకన చేయవచ్చు అన్నట్టుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ప్రతి బడ్జెట్లోనూ కేటాయింపులను చేస్తుండటమే గాక, క్రమం తప్పకుండా కొత్త పథకాలను కూడా ప్రారంభిస్తున్నాయి. కాబట్టి పేదలు ఎన్నడో లేకుండా పోయి ఉండాల్సింది. కానీ అవేవీ పని చేయకపోవడం వల్లనే పేదలు ఇంకా పేదలుగా మిగిలారు. పేదరిక రేఖ స్థాయిగా సూచించిన ఆదాయానికి మించి ఒక్క రూపాయి సంపాదించినా గణాంక రీత్యా అలాంటి వారు పేదరికం నుంచి బయటపడిపోయినట్టే. కాబట్టే పేదల జనాభా కుచించుకుపోతోంది. అందువలన పేదరిక నిర్మూలనా కార్యక్రమాల రూపకల్పన, అమలుతో ముడిపడి ఉన్న వారంతా... కేంద్ర మంత్రుల నుంచి, గ్రామ పెద్దల వరకు తమ వైఫల్యాన్ని సూచించేలా తమ ఇళ్లకు ఆరెంజ్ రంగు వేయిం చుకోవాల్సిన సమయం బహుశా ఇదే కాదా? పేదరిక నిర్మూలన కార్యక్రమ సాఫల్యతకు హామీని కల్పించలేకపోయిన వారి వైఫల్యం కూడా... పేదలు తమ ఇంటి ముందు గోడలపై తమ స్థాయిని తెలిపే రంగు ముద్రలు వేయించుకోవడం అంతటి వెక్కిరింతే. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఆయన దారే వేరు
విశ్లేషణ నారాయణ రాణేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల ద్వారా లభించగల అత్యు న్నత పదవిౖయెన ముఖ్య మంత్రిగా పని చేసినా, ఆయన చుక్కాని లేని నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతున్న రాజకీయ వేత్త. శివసేనను వదిలిపెట్టే శాక ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారు. శివసేన ఆయన తిరిగి పార్టీలోకి రావాలని కోరుకోవడమూ లేదు. రాణే స్వతం త్రంగా, సూటిగా వ్యవహరించే మనిషి. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ అశోక్ చవాన్‌కు ఆ పదవిని కట్టబెట్టింది. అసమ్మతిని వ్యక్తంచేసిన రాణేను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన కాళ్లావేళ్లా పడి తిరిగి పార్టీలోకి ప్రవేశించారు. కానీ ఆ పార్టీలోని ఇతరులకు పెద్ద తలనొప్పిగా మారారు, ఆయనా సౌఖ్యంగా ఉన్నది లేదు. అయినా కాంగ్రెస్ ఆయనను పార్టీలోనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌లో అసౌకర్యంగా ఉండటంతో రాణే భార తీయ జనతా పార్టీ వాకిటికి చేరారు లేదా దగ్గరయ్యారు. అయితే తలుపులు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఆయన ప్రవేశానికి ఆ పార్టీలో కొంత విముఖత ఉన్న దనిపిస్తోంది. పూర్తిగా ‘ఎన్నికలపరమైన ప్రతిభ’ లేదా ఎన్నికల్లో గెలవగల సామర్థ్యం ఉన్నవారినే పార్టీలోకి తీసుకుంటామంటున్నా... అభ్యంతరకరమైన నేపథ్యా లున్న ఎందరికో బీజేపీ దేశవ్యాప్తంగా తలుపులు తెరి చింది. రాణేను అనుమతించడం జరిగి, ఒక్కసారి ఆయన పార్టీలోకి ప్రవేశించారూ అంటే క్రమశిక్షణకు కట్టుబడరనీ, తిరిగి అత్యున్నతమైన ముఖ్యమంత్రి పద విని చేజిక్కించుకోవడానికి సమయం కోసం వేచి చూçస్తూ నిరంతరం ప్రకంపనాలను సృష్టిస్తుంటారనీ రాష్ట్ర బీజేపీలోని అత్యున్నతస్థాయి నాయకత్వ శ్రేణు లకు భయం ఉంది. మనోహర్ జోషి స్థానంలో బాల్ ఠాక్రే, రాణేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిం చారు. అయితే 1999 ఎన్నికల్లో శివసేనను తిరిగి అధికా రంలోకి తేవటంలో ఆయన విఫలమయ్యారు. రాణే దేన్నీ లెక్కచేయని దురుసు మనిషి. తాను ఏమైనా మాట్లాడాలని నిర్ణయించుకుంటే చాలు, నీళ్లు నమలకుండా సూటిగా చెప్పేస్తారు. ఉద్ధవ్ ఠాక్రే శివ సేనను నడుపుతున్న తీరును చూసి నిరాశచెంది ఆయన ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన తనపై భౌతిక దాడులు జరుగుతాయనే భయం లేదన్నారు. శివసేన అత్యున్నత నాయకత్వంతో ఘర్షణ పడి, పార్టీని వీడే తిరుగుబాటుదార్లకు తరచుగా పట్టే గతి అదే.‘‘సేనలో ఉన్నప్పుడు పార్టీ వీధి కార్య కలాపాలను నడిపినది నేనే’’ అన్నారు రాణే. కాంగ్రెస్ లోనూ ఆయన తనకు పరిస్థితి కాస్త సౌఖ్యంగా ఉండేలా చేసుకుంటున్నది లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ)తో ఎన్నికల అనంతరం చెలిమి చేస్తున్న కాంగ్రెస్ ప్రస్తుతం రైతులను కలుసుకునే కార్యక్రమాన్ని చేప ట్టింది. ఆ కార్యక్రమం సజావుగా సాగడం లేదని, దయ నీయస్థితిలోని రైతులు దాని పట్ల స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తృణీకారంతో ఆయన దానికి దూరంగా ఉన్నారు. ఆయన తనకు తోచిందే చేసే స్వతంత్ర వ్యక్తిత్వంగల మనిషి. తనకు మేలు చేసినందుకు ఆయన ఎవరికీ ఏవిధం గానూ రుణపడి లేరు. వీధుల్లోని శివ సైనికుని స్థాయి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చేరారంటే అందుకు కారణం ఆయన నేర్పరితనమే. ముఖ్య మంత్రిగా విజయవంతమౌతూ వినమ్ర ప్రియభాషిగా పేరు తెచ్చుకుంటున్న జోషితో బాల్ ఠాక్రే అసౌకర్యంగా ఉన్నారని పసిగట్టడంతోనే ఆయన ఆ స్థానం కోసం కృషి మొదలెట్టేశారు. బహుశా ఆయన ఎవరితోనైనా ఒప్పందం అంటూ కుదుర్చుకుని ఉంటే అది ఒక్కసారే కావచ్చు. ఈ వైచిత్రి, రాణే వృద్ధిలో భాగమే. నేడు దారి తెన్నూ లేకుండా కొట్టుకుపోతున్నా, ఆయన తన సొంత జిల్లా సింధుదుర్గ్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన ఎంత ఆత్మవిశ్వాసం గల మనిషంటే శివసేనను వీడిన వెంటనే ఆయన ఒక ఉప ఎన్నికలో శాసనసభకు గెలిచి, తాను ముఖ్యుడిననే అంశాన్ని రుజువుచేసి చూపారు. ఆయన సామ్రాజ్యం కేవలం వ్యాపారానికే పరి మితం కాలేదు, ఒక రాజకీయ కుటుంబం ప్రారం భమైంది. ఆయన ఒక కుమారుడు నీలేష్ 2009లో రత్నగిరి–సింధుదుర్గ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరో కుమారుడు నితేష్ రాష్ట్ర శాసన సభ సభ్యునిగా ఉన్నారు. నితేష్ కార్మిక సమస్యలను కొంత మేరకు పట్టించుకునే ఒక ఎన్జీఓను నడు పుతున్నారు. అది కూడా శివసేనలాగే మాట్లాడుతుంది, అదే పద్ధతులను అనుసరిస్తుంది. రాణే తన ప్రయోజనా లను, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోడానికి ఒక మరాఠీ దినపత్రిక ‘ప్రహార్’ను (మృత్యు ఘాతం) ప్రారంభించారు. ఆ పత్రిక పేరే ఆయన శైలి రాజ కీయాలను సూచిస్తుంది. ఆ పత్రిక వృత్తినైపుణ్యంతోనే పని చేయాలని యత్నిస్తోంది. అయితే చాలా మంది రాజకీయవేత్తలు, రాజకీయపార్టీలు ఎంచుకున్న మార్గ మైన టెలివిజన్ రంగంలోకి రాణే ప్రవేశించలేదు, సమీప భవిష్యత్తులో అది జరిగేట్టూ లేదు. అయితేనేం, ఆయన సమరశీలత నిత్యం కనబడుతుంటూనే ఉంటుంది. మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
గతి తప్పిన నగరాభివృద్ధి
విశ్లేషణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దాదాపు సగం పట్టణీకరణ చెందాయి. అయినా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో మూడో వంతు మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నగరాలు మరింత వృద్ధి చెందుతున్నాయి, చిన్న పట్ట ణాలు నగరాలుగా మారుతున్నాయి. అయినా మనకు నగరాల నిర్మాణంపై సుస్పష్టమైన అవగాహన లేదు. స్వాతంత్య్రానంతరం చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, కాండ్లా నగరాలను నిర్మించారు, ప్రపం చంలోనే అతి పెద్ద కొత్త నగరం నవీ ముంబై నిర్మా ణంలో ఉంది. ఇక అమరావతి నగర నిర్మాణం కొత్త ప్రాజెక్టు. అయినా దేశవ్యాప్తంగా పట్టణాల నిర్వహణ అధ్వానంగానే ఉంది. ‘ప్రణాళిక’ అని పిలిచేది ఉన్నా, మనం మాత్రం ‘అభివృద్ధి’ వైపే కొట్టుకుపోతున్న ట్టుంది. ముంబైలో దాదాపు ఒక ఏడాదిగా కొత్త కట్టడాల నిర్మాణాన్ని హైకోర్టు నిషేధించింది. నిర్మాణ క్రమంలో పోగుబడే రాళ్లూరప్పలు తదితరాలను తరలించే మార్గ మేదీ ఆ నగరానికి లేదు మరి. ముంబైకి ఆనుకుని ఉన్న థానేలో కూడా అలాంటి ఆంక్షే ఉంది. ఆ నగరం నీటి సరఫరా సమస్యను పరిష్కరించలేకపోవడం అందుకు కారణం. ఆ నగర పాలక వ్యవస్థ నీటి సరఫరాపైగాక ఇతర అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తోంది, అదీ నగర కేంద్రితమైనదే. ఢిల్లీలోని చాలా విస్తృత ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా సదుపాయం లేదు. కాబట్టి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయడానికి ఆ నగరానికి జల్ బోర్డ్ ఉంది. హైదరాబాద్ పరిస్థితీ అదే. బిల్డర్–డెవలపర్లు పాటించాల్సిన నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. కానీ, పౌర పరిపాలనా సంస్థలు మాత్రం తమ బాధ్యతను విస్మరిస్తాయి. నీటి సరఫరా, నిర్మాణ పనుల వల్ల పోగుబడే చెత్తను తరలించడం వంటివి తాము పట్టించుకోవాల్సినవేనని వారు భావిస్తున్నట్టు కన బడదు. తప్పనిసరిగా చెత్తను సేకరించుకు వెళ్లడం సహా ఇలాంటి విషయాలలోని లోటుపాట్లు ఒక నగరం లేదా పట్టణంలో ఉండేవారికి ఎవరికైనా చిర్రెత్తించేవే. కొన్ని పట్టణాలు, నగరాలలోపల నామమాత్రపు బస్సు సర్వీసులు సైతం లేవు. దీంతో ప్రైవేటు వాహ నాలతో రోడ్లు కిక్కిరిసివుంటాయి. అన్ని విధాలా తగి నంతగా సంతృప్తికరంగా ఉన్న ఒక్క నగరమైనా కనబడటం కష్టమే. అయినా ప్రజలు గుంపులు గుంపు లుగా బతుకు తెరువుల కోసం నగరాలకు, పట్టణా లకు ఎగబడతారే తప్ప, జీవించడానికి అవి సము చితమైనవని మాత్రం కాదు. వారు పట్టణ ప్రాంతా లను విస్తరింపచేయడమే కాదు, అధ్వానంగా మారు స్తారు. ఇక యూరోపియన్ పట్టణాలు, నగరాలతో సరితూగే వాటి గురించి మాట్లాడనవసరమే లేదు. ఈ నేపథ్యం నుంచి చూస్తే, ‘స్మార్ట్ సిటీ’ అనే భావన ఓ చిన్న బ్యాండ్ ఎయిడ్ పట్టీ లాంటిదే. ఎంతో కొంత ఉపయోగకరమే కాబట్టి వాటిని ఆహ్వానించా ల్సిందే గానీ, అది సరిపోదు. ఏ అంశానికి సంబం ధించి నగరాలు, పట్టణాలు డిమాండు కంటే వెనుకబడి ఉండరాదు. పేరుకుపోయిన పాత పనులు దిగ్భ్రాంతి కరమైనంత భారీ ప్రమాణంలోనివి. పెద్ద నగర ప్రాజెక్టులో భాగమైన నవీ ముంబైలో మూడో వంతు మురికివాడలే. ఆ నగరం విషయంలో ఏదీ సజావుగా సాగు తున్నట్టు అనిపించదు. ఏం చేసినా గానీ అది డిమాం డు–సప్లయి రేఖ కంటే వెనుకబడే ఉంటుంది. చాలా వరకు నగరాలు, పట్టణాలలో సేకరించని చెత్త, పాద చారుల హక్కులకు తిలోదకాలిచ్చేస్తూ ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు, వీధులను ముంచెత్తే ట్రాఫిక్ నత్తనడక సాగుతుండటం, రోడ్ల మీద గుంతలు, మురికి వాడలే గాక గూడు కరువు కావడం, అందుబాటులో లేని వసతి సదుపాయాలు కనీసంగా ఉండే ప్రతికూలాం శాలు. అయినా మనది వేగంగా పట్టణీకరణ సాగుతున్న దేశం. ఈ లోటుపాట్లన్నీ అసలు నగరాలకు స్వాభావిక మైనవే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. మన ప్రణాళికా రచన, విధానాల అమలు ఎంత అధ్వానంగా ఉంటాయో ఇది వేలెత్తి చూపుతుంది. ఆర్థికపరమైన ప్రతిబంధకాల వంటి కారణాలు కూడా ఉండవచ్చు గానీ... అవినీతి, అధ్వానమైన అమలు అనే రంధ్రా లను పూడ్చుకోగలిగితే ఆ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. చివరకు ఇదంతా కలసి ప్రజా జీవితంలో కానరాకుండా పోయిన నిజాయితీ వద్దకు చేరుస్తాయి. విపత్కరమైన ఈ క్షీణత కొనసాగడాన్ని అను మతించడానికి పౌరులు సుముఖంగా ఉండటం మరిం తగా ఆందోళనకలిగించే అంశం. అయినా పట్టణాలు, నగరాలు వృద్ధి చెందుతూనే ఉంటాయి. గతానుభ వంపై ఆధారపడి పౌరులలో నెలకొన్న నిరాశావాదం, సుపరిపాలన కొరవడటం కొనసాగుతూ ఉండటం, పౌరులకు ఇంతకంటే మెరుగైనదానికి దేనికీ అర్హత లేదని, ఇప్పటికే వారికి చాలా చేసేశామని పాలక వర్గా లలో ఉన్న విశ్వాసాల పర్యవసానమిది. కాబట్టి ఇక మార్పు దేనికి? వ్యాసకర్త: మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
సేవాపన్ను మాయాజాలం!
విశ్లేషణ సేవాపన్ను చెల్లించడం తప్పనిసరి కాదని, రెస్టారెంట్ల యజమానులు బిల్లులో ఖాళీ చోటును వదిలిపెడితే, తాము పొందిన సేవకు ద్రవ్యపరమైన విలువను చెల్లించడంపై కస్టమర్లే నిర్ణయించుకుంటారని కేంద్ర మంత్రి సూచించారు. బిల్లు భారీగా ఉన్నప్పటికీ, మంచి ఆహారాన్ని ఆస్వాదించి, చక్కటి సేవను పొందిన కస్టమర్.. వెయిటర్‌కు టిప్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. తాను పొందిన సేవకే ఆ అభినందన కాబట్టి మీకు సేవ చేసిన వ్యక్తికి ఆ టిప్ అందుతుంది లేదా అందాలి కూడా. వెయిటర్ హోటల్లో ఉద్యోగి అయినప్పటికీ టిప్ తనకే అందుతుంది. చాలా కాలంగా ఇలాగే జరుగుతూ వస్తోంది కూడా. అయితే హోటల్ పరిశ్రమ దీన్ని మరోలా చూస్తోంది. మీకు సేవలందించిన వెయిటర్‌కి మీరు టిప్ ఇస్తారా లేదా అనేది మీ ఛాయిస్. కానీ టిప్‌తో సంబంధం లేకుండా బిల్లులో పొందుపర్చే సేవా పన్నును మాత్రం మీరు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అలాగని ఇది కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రతి వస్తువుపైనా క్రమానుగతంగా విధించే సేవా పన్ను వంటిది కాదు. మీడియాలో పేర్కొన్న అనేక వాదనల బట్టి, సేవా పన్ను అనేది వెయిటర్‌కి మాత్రమే వెళ్లడం లేదని, ఆ హోటల్లోని చెఫ్, క్లీనర్ వంటి మంచి సేవలను అందించిన ప్రతి ఒక్కరికీ వెళుతున్నట్లు కనిపిస్తుంది. పైగా యజమాని కూడా దాంట్లో కొంత భాగాన్ని తీసుకుంటాడని అనుమానం ఉంది. గతంలో అయితే చాల ప్రాంతాల్లో వెయిటర్‌కి తక్కువ జీతం ఇచ్చేవారు. తగిన సేవతో కస్టమర్‌ని అతడు సంతృప్తిపర్చినట్లయితే, టిప్ మొత్తంగా లేదా దాంట్లో చాలా భాగం తనదే అవుతుందని చెప్పేవారు. కాబట్టి సిబ్బంది ఖర్చుల చెల్లింపు భారం యజమాని నుంచి బదిలీ అయ్యేది. ఇప్పుడు మనం సేవా పన్ను కూడా అలాగే ఉంటుందని మనం ఊహించవచ్చు. బిల్లులో ఈ చార్జిని సూచించారు. ఇది తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం కాదని కేంద్రం చెప్పడానికి ముందు, అది సేవా పన్నువంటిదేనని దానిని చెల్లిం చాల్సి ఉంటుందని రెస్టారెంట్లకు వచ్చే పలువురు సందర్శకులు లేదా కస్టమర్లు భావించేవారు. పైగా చాలావరకు ఆ సేవా రుసుము అనేది వెయిటర్కే పోతుందనుకునేవారు. కానీ ఆ టిప్‌ను కూడా ఉద్యోగులు, యజ మానులూ అందరూ పంచుకునేవారని ఇంతవరకు మనకు తెలీదు. ఇప్పుడు కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్.. సేవాపన్ను చెల్లించడం తప్పనిసరి కాదని, దాన్ని చెల్లించాలా వద్దా అనే విషయాన్ని కస్టమర్ నిర్ణయించుకుంటారని, రెస్టారెంట్ యజమానులు బిల్లులో కాస్తంత ఖాళీ చోటును వదిలి పెడితే తాము హోటల్ సిబ్బంది నుంచి పొందిన సేవకు ద్రవ్యపరమైన విలువను చెల్లించాలా వద్దా అనే విషయాన్ని కస్టమరే నిర్ణయించుకుంటారని సూచించారు. పైగా, రెస్టారెంట్ యజమానులు బిల్లుల్లో తాము విధించిన సర్వీస్ చార్జిని తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడు సేవా రుసుమును దానికీ వర్తింపజేయాలా వద్దా అనేది కస్టమరే నిర్ణయించుకుంటాడు. అంటే ఈ సర్వీస్ చార్జీని కూడా తాము చెల్లించాలా వద్దా అనేది కస్టమరే తేల్చుకుంటాడు. ప్రజారంగంలో పనిచేస్తున్న రెస్టారెంట్ యజమానులకు మొత్తంమీద ఈ సూచన బాగానే ఉన్నట్లుంది. తాము హోటల్లో ఆరగించే పదార్ధాలపై సర్వీస్ చార్జీ ఉంటుందని ముందుగానే కస్టమర్లకు సూచించినట్లయితే, అప్పటి నుంచి సర్వీస్ చార్జి విధించని రెస్టారెంట్లకు మాత్రమే అలాంటి కస్టమర్లు వెళతారని వీరంటున్నారు. ఈ సేపా పన్ను లేదా లెవీపీ తొలి అధికారిక దృష్టికోణం ఈ సంవత్సరం జనవరి నెలలోనే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి తట్టింది. ఇప్పుడు దాన్ని ఒక తప్పనిసరి అవసరంలాగా పొందుపరుస్తూ. అధికారికంగా ప్రకటించారు. ఇకపై హోటల్లో అందుకున్న సేవలకు గాను సర్వీస్ చార్జి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం కస్టమరే తేల్చుకుని నిర్ణయించుకోవడానికి తగిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తాజాగా ట్వీట్ చేశారు. ఈ మార్గదర్శక సూత్రాల ఉల్లంఘనను ఎవరైనా అతిక్రమించినట్లయితే స్థానికంగా ఉండే కన్సూమర్ కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఇలాంటి ఫిర్యాదులతో వ్యవహరించడానికి ఒక సాధికార సంస్థ ఏర్పాటుకు కొత్త చట్టం అనుమతిస్తుంది. ఇది నిజంగానే విచిత్రమైనదే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది గుర్రం ముందు బండిని కట్టడం లాంటిదే. ఏదేమైనా ప్రస్తుతం ఒక పరిణామానికి మీరు సిద్ధపడాల్సిందే మరి. వంటగది నుంచి మీ టేబుల్ వద్దకు ఆహారం తీసుకురావడం తమ పని కాదని ప్రకటిస్తూ దానికోసం కస్టమర్‌కి సర్వీస్ చార్జిని విధిస్తున్న రెస్టారెంట్లు ఇకపై సేవారుసుమును పొందుపరుస్తూనే మరోవైపున దానిని దాచిపెట్టే సమగ్ర బిల్లును ఎంచుకోవచ్చు. వాస్తవం ఏమిటంటే సేవా పన్నును కలిపిన అలాంటి బిల్లులను నేను గతంలో బలవంతంగా చెల్లించి ఉన్నాను. నాకు తెలిసిన ఒక చార్టర్డ్ అకౌం టెంట్‌తో దీన్ని తనిఖీ చేసినప్పుడు, ఆహారం ధరలు, సర్వీస్ చార్జి వివరాలను స్పష్టంగా హోటల్ యజ మానులు అధికారులకు తెలియపరుస్తున్నంతవరకు అలాంటి బిల్లు అనుచితమైంది కాదని ఆయన చెప్పారు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
క్లౌడ్‌సోర్సింగ్‌తో కుడ్య చిత్రకళ
విశ్లేషణ కుడ్య చిత్రకళలో ఇది కొత్త నియంత్రిత ప్రక్రియ. చూసేవారికి వెంటనే సందే శాన్ని అందించడానికి జట్టంతా కలసి కళా సృజనను నిర్వహించడం. సృజనాత్మక ఉద్వేగాలను కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏకత్వాన్ని సాధించడం. బిల్హార్, మహాబలేశ్వర్ పంచాగ్ని ప్రాంతంలోని ఒక గ్రామం. అక్కడ పండించే స్ట్రాబెర్రీ పండ్లను కొనుక్కోవడం కోసం పర్యాటకులు అక్కడికి రావడం పరిపాటే. గ్రామంలోని పాతికకు పైగా గోడలపై చిత్రాలను గీయ డానికి పెద్ద చిత్రకారుల బృందం అక్కడకు వచ్చింది. ‘స్వత్వ,’ వాట్సాప్ ఆధారిత సాంప్రదాయేతర చిత్రకళాకారులు, చిత్ర కళారాధకుల అనుసంధాన సంస్థ. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే పుస్తకాలను భద్రపరచడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వివిధ గృహాల గోడలపై తమ రంగులు, కుంచెలకు పని చెప్పే బాధ్య తను పురమాయించింది. ఇలా పుస్తకాలను భద్రపరచే ఇళ్లు తదితర ప్రదేశాలలో ఒక చోట బాల సాహిత్యం, మరో చోట మహిళలకు సంబంధించినవి, ఇంకో చోట రుషిపుంగవుల రచనలు వగైరా ఉంటాయి. ప్రభుత్వం అందించిన పది వేల పుస్తకాలను 22 చోట్ల భద్ర పరచడానికి వీలుగా వాటిని వేరు చేశారు. ‘పుస్తకాంచె గావో’ (మరా ఠీలో పుస్తకాల గ్రామం) భారీ లక్ష్యంతో చేపట్టిన పథకం. ఇది రెండు ఉద్దేశాలతో చేపట్టినది. మహాబలేశ్వర్, పంచాగ్ని పర్యాటకులు అక్కడ కాలం వెళ్లబుచ్చి పోవడం గాక, పుస్తకాలతో కాలక్షేపం చేసే అవకాశాన్ని కూడా కల్పించడం, అది ఆ ప్రాంత వాసులలో పఠనాసక్తిని ప్రేరేపించగలదనే ఆశ సైతం ఉంది. రెండు బస్సులలో శుక్రవారం ఉదయం వచ్చి, ఆది వారం రాత్రికి తిరిగి వెళ్లిన 70 మంది చిత్రకళాకారు లలో వివిధ స్థాయిల ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నవారు న్నారు. వారిలో ఒకడినైన నాకు, నూతనమైన ఈ చిత్రకళను క్రౌడ్‌సోర్సింగ్... ప్రపంచంతో పంచుకోవా ల్సినదనిపిస్తోంది. కుడ్య చిత్రకళలో ఇది ఒక కొత్త నియంత్రిత ప్రక్రియను సృష్టిస్తోంది. ఇది గోడలను కంటికింపైన రంగులతో నింపి వెళ్లడానికి మించినది. ఇది వ్యక్తులు తమ సృజనాత్మక వాంఛల వెంటపడి చిత్రించుకుపోవడం కాదు. అందుకు భిన్నంగా చూసే వారికి వెంటనే ఒక సందేశాన్ని అందించడం కోసం ఒక జట్టు మొత్తం కలసి కళా సృజనను నిర్వహించడం. కాబట్టి, ఇది సృజన్మాత్మక ఉద్వేగ ప్రవాహాలను క్రమ పద్ధతిలో కవాతు చేయించడం, వ్యక్తీకరణలో ఏక త్వానికి హామీని కలగజేయడం. అయితే అందుకు పీడ కలా సదృశమైన సరఫరాలు, నియంత్రణ, నిర్వహణ తదితర ఏర్పాట్లు అవసరం. ప్రతి వ్యక్తి తన లోలోపలి స్వీయత్వాన్ని వెలికి తెచ్చేలా చేయాలని స్వత్వ కోరుకుంటుంది. ఈ కృషిలో పాల్గొనదలచిన ఔత్సాహికులలో ఏ ఒక్కరినీ స్వత్వ వద్దన్నది లేదు. ప్రధానంగా థానే కేంద్రంగా పనిచేసే స్వత్వకు ఇండోర్, పుణేల వంటి సుదూర ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తలు వచ్చి చేరడం మహో త్తేజాన్ని కలిగించింది. సామాజిక మాధ్యమాల పుణ్య మాని ఇది సాధ్యమైంది. ఈ పర్యటనలో బడి వసతి గృహంలో ఉంటూ, పిల్లల స్నానాల గదిలో ఒకేసారి ఆరుగురు స్నానాలు చేస్తూ గడ్డు జీవితం గడపాల్సి వచ్చింది. సుప్రసిద్ధులు, చెప్పుకోదగిన గుర్తింపున్న కళాకారులు కొత్తవాళ్లతో భుజాలు రాసుకునే కాదు, ఆవేశాలను పూసుకు తిరిగారు. థానే మునిసిపాలిటీ మద్దతుతో పలు గోడలపై చిత్రాలను వేసేటప్పుడు చూసేవారు ఎవరైనా బ్రష్‌తో చేయి కలుపుతానంటే ఆహ్వానించారు. ఇలాంటి ఔత్సాహికులు చేసే పొరపాట్లను సీని యర్ కళాకారులు చడీచప్పుడు లేకుండా సరిచేసేవారు. లేదంటే తక్షణమే లేదా ఆ తర్వాత ఉప యోగకరమైన సూచనను చేసే వారు. అయితే దాని ఉద్దేశం మాత్రం ప్రోత్సహించడమే. అయితే, థానేకు 250 కిలోమీటర్ల దూరంలోని బిల్హార్లో చేపట్టిన ఈ సాహసం అందుకు భిన్న మైనది. కేవలం మూడు రోజు ల్లోనే అంతా చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లిన బృందం లోని వారు ఒకరికొకరు పరిచయ మైనది బస్సు ఎక్కేటప్పుడు, వారి నైపుణ్యాలతో పరి చయమైనది గోడల మీద బొమ్మలు వేసే పని చేయడం మొదలయ్యాకే. ప్రతి జట్టులోని వారికి నేతృత్వం వహించడానికి ఒక అనుభవజ్ఞుడైన కళాకారులు ఉండే వారు. ఆయన లేదా ఆమె తమ జట్టు సభ్యులు ఒక్కొ క్కరిలో ఉన్న భిన్న నైపుణ్యాలతో కూడిన ప్రతిభను ఒకే సమష్టి సృజనాత్మకతగా వ్యక్తమయ్యేలా మార్గదర్శ కత్వం వహించాల్సివచ్చింది. అలా పెంపొందిన సృజ నాత్మక సమన్వయం వల్ల జట్లు దాదాపు ప్రతిరోజూ రాత్రింబవళ్లూ పని చేశాయి. రంగులు, కుంచె చేయగల అద్భుతాలకు విభ్రాం తులై, ముందు ముందు ఏమైనా చేయవచ్చనుకున్న వారు సైతం జట్లలో చేరారు. అలాంటి వారు కేవలం అదీ ఇదీ అందిం^è డం, తెచ్చి ఇవ్వడం లాంటి పనులు చేయడానికి వెనుకాడలేదు. ఆ తరువాత వాళ్లు చిత్ర కళను తమంతట తాముగానే నేర్చుకుంటామని లేదా చిత్రకళ కోర్సులో చేరుతామని చెప్పారు. కొన్ని సంద ర్భాల్లో ప్రముఖులైన సీనియర్లు వాట్సాప్ ద్వారా తమ మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తామని ముందుకొచ్చారు. చిత్రలేఖనాన్ని 64వ ఏట మొదలుపెట్టిన నేను ఇంకా దాన్ని కొనసాగిస్తుండటానికి వారు సహాయపడ్డారు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
బిల్డర్ల నగరం ముంబై
విశ్లేషణ ముంబై నగర నిధులు భారీగా బ్యాంకుల్లో మూలుగుతున్నా అది అప్పులు చేస్తుంది, వడ్డీలు కడుతుంది. వాటిని సముచితంగా వినియోగిస్తే పౌరులకు సత్వరమే అవసరమైన సదుపాయాలను అందించగలరు. కానీ ఆ పని చేయరు. ముంబై మునిసిపల్ కార్పొ రేషన్‌పై నియంత్రణ కోసం రాజకీయ పార్టీలన్నీ తహ తహలాడుతాయి. అందుకు కారణం సుసంపన్నమైన ఆ నగర పాలక సంస్థ ఖజానా చేతికి అందుతుందనే ఆశే అనే భావన ఉంది. అది తప్పుడు అభిప్రాయమేం కాదు. ఆ నగర భారీ బడ్జెట్ రూ. 37,000 కోట్లు. అయి నాగానీ, అందులోంచి దొంగిలించగలిగినది మాత్రం తక్కువే. అదెలాగంటారా.. మొత్తం బడ్జెట్లో అత్యధిక భాగం వేతనాలకు, రుణ చెల్లింపులకు, పురపాలక సంస్థ నిర్వహణకే పోతుంది. అది 70 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది. ఇక మిగిలే భాగం నుంచే పౌరులకు అన్నిటినీ సమకూర్చాలి. ఆ పనిని అది అరకొరగానో లేక అంటీ ముట్టనట్టుగానో చేస్తుంది. 2015–16 వరకు గడచిన దశాబ్దకాలంలో ముంబై పుర పాలక సంస్థ సగటున ఏడాదికి 19.33 శాతం మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణల కోసం ఖర్చు చేసింది. జనాభా, అవసరాలు తప్ప మిగతా అన్నీ కొరతగానే ఉండే ఈ నగరానికి అది శోచనీయ మైనంత తక్కువ మొత్తం. అయినాగానీ, ప్రజలను మెప్పించడానికి భారీ కేటాయింపులను మాత్రం చేస్తుం టారు. చేసే ఖర్చు మాత్రం ఆ దరిదాపులలో ఎక్కడా ఉండదు. అంటే, అంకెల రీత్యా చూస్తే, కొల్లగొట్టడానికి మిగిలేది చాలా చిన్న మొత్తమే, అది ఎందుకూ చాలేది కాదు. కాకపోతే బొత్తిగా నాణ్యతలేని రోడ్లను నిర్మించే వారు, ఏటా వాటికి మరమ్మతులు చేయాల్సిన వారు అయిన కాంట్రాక్టర్ల నుంచి నేతలకు, అధికారులకు ముడుపులు అందుతాయి. అయితే, నియమ నిబంధన లను విరుద్ధంగా భవన నిర్మాణాలను అనుమతించడం ద్వారా, అలాంటి ఇతర కట్టడాలకు నిర్మాణ అనుమతు లను జారీ చేయడం, మొదలైనవాటి ద్వారానే వారికి అధికంగా డబ్బు రాలుతుంది. అందు వల్లనే ముంబైకి ‘‘ప్రజల నగరం’’గా గాక, ‘‘బిల్డర్ల నగరం’’గా పేరు. ఇలా అధికారంలో ఉన్న అన్ని స్థాయిల వారికి అక్రమ పద్ధతుల్లో డబ్బు అందడాన్ని ఎంత ఉదారంగా చూసినా, మాఫియా అనడం తప్పు కాదు. ఇక్కడ అక్రమ ధనం చేతులు మారేది నగర పాలక సంస్థ నిధుల నుంచి కాదు, మరెవరో ఇచ్చేది. కాబట్టి ఈ అక్ర మాలను మాఫియా అనడం సమంజసమే. అయితే, ఇది రియల్ ఎస్టేట్ వ్యయాలను పెంచి, ఫ్లాట్ ధరను పెంచుతుందనే వాస్తవం మాత్రం మిగులుతుంది. ముంబైవాసులకు అవి దాదాపుగా అందుబా టులో ఉండవు. ఎవరు అధికారంలో ఉన్నా చిన్న వీధుల్లో బహుళ అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని అనుమతిస్తారు. మౌలిక సదుపాయాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇక్కడ కాకపోతే అక్కడ, ఎక్కడో ఒక చోట పౌరులు ఎవరి ధన పిపాసకో మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాకపోతే ఈ రంగంలో ధన పిపాస మరీ అసాధారణమైన భారీ స్థాయిలో ఉంటుంది. ఫలానా ఫలానా జేబుల్లోకి ఇంతింత అంటూ పుచ్చుకోడానికి బదులుగా అక్రమార్జనాపరులు బిల్డర్లతో భాగస్వామ్యా ల్లోకి ప్రవేశిస్తున్నారు. నిర్మాణ నిబంధనలు అనుమ తించే దానికంటే కొన్ని అంతస్తులను అధికంగా నిర్మించి, సదరు అధికారినో లేక రాజకీయవేత్తనో బిల్డర్లు భాగస్వామిగా చేసుకుంటున్నారు. అంతేతప్ప బేరసారాలు ఉండవు. అయితే ఇక్కడో చిక్కుముడీ ఉంది. కాంట్రాక్టర్లకు నిధుల మంజూరు నుంచి, చెత్త తరలింపు, రోడ్ల నిర్మాణం వగైరా ప్రతి చోటా జిత్తుల మారితనం ప్రయోగించినా ఇష్టానుసారం ఖర్చు చేయ డానికి లభించేవి చిన్న మొత్తాలే. అయినాగానీ ఆ నగరానికి భారీ చరాస్తులు ఉండటమే విడ్డూరం. అవి వాణిజ్య బ్యాంకుల్లో ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్లు. డిపాజిట్ చేసే మొత్తాలు భారీవి కాబట్టి బ్యాంకర్లు వడ్డీరేట్లపై బేరసారాలు సాగిస్తారు. తాజా సమాచారం ప్రకారం నగర పాలక సంస్థకు రూ. 61,510 కోట్ల ఫిక్సెడ్ డిపా జిట్లు ఉన్నాయి. వీటిని సముచితమైన రీతిలో మదుపు చేస్తే నగర అవసరాలను సత్వరంగా తీర్చడానికి సరి పోయేవే. ఈ డిపాజిట్లలో ప్రావిడెంట్ ఫండ్, మిగులు ని«ధులు ఒక భాగం. అయినా మిగతా మొత్తం నమ్మ శక్యం కానంతటి పెద్దది. నగర ప్రభుత్వం అంత పెద్ద భారీ నిధులను నిరు పయోగంగా ఉంచడమేమిటనేది మాత్రం బహిరంగ చర్చకు నోచుకోలేదు. ఈ ఆస్తులపై ఏడాదికి 7 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి వచ్చినా, అది పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని అందుబాటులోకి తెస్తుంది. అయినా నగర ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కడుతుంది. నగదు మిగులు అందుబాటులో ఉన్నా అప్పులు చేయాల్సిన అవసరం ఏమిటో వివరించరు. చూడబోతే ముంబై నగరం బ్యాంకుల ద్రవ్యత్వాన్ని కాపాడటం కోసం నిర్మించాల్సిన పౌర సదుపాయాలను లేదా పౌర సేవలను మెరుగుపరచడాన్ని పరిత్యజించిందని అనిపి స్తుంది. నగర ప్రభుత్వానికి చెందిన ఇంతటి భారీ మొత్తాలు బ్యాంకులకు ఎలా చేరాయనే విషయమై ప్రజ లకు జవాబుదారీ వహించేవారు లేరు. దాన్ని పట్టించు కునే వారు ఎవరూ లేరు. బడ్జెట్లో కేటాయించిన డబ్బును ఖర్చు చేయకపోవడం వల్లనే ఆ నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయనేది స్పష్టమే. కేటా యించిన నిధులను ఖర్చు చేయలేకపోవడం ఏటా జరిగేదే. ప్రణాళికాబద్ధంగా కార్యకలాపాలను సాగిం చడం మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణాపరమైన శక్తిసామర్థ్యాలకు మించిన పని అనే దీనర్థం. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ఈ పొత్తు కత్తి మీద సాము
విశ్లేషణ పదవులకు దూరంగా ఉండి, బీజేపీ నిఘాదారుగా ఉంటుందని ఫడ్నవిస్ అన్నారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడకుండా ఉండాలి. ఆ స్థాయి నైతికతను ప్రదర్శించే అవకాశం తక్కువే. ముంబై మేయర్ పదవి కోసం భారతీయ జనతా పార్టీతో శివసేన హోరాహోరీ పోరు సాగించింది. బీజేపీపై అది ఆఖరు క్షణంలో ఆధిక్యతను సాధించి ఓడించింది. అయినా తాము వంచనకు గురయ్యామని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు భావిస్తుండాలి. అతి సంపన్న వంతమైన ఆ నగర పాలక సంస్థను గెలుచుకో వడం ద్వారా సమకూరే ప్రయోజనాలన్నింటినీ పొందాలని రెండు పార్టీలూ తాపత్రయపడ్డాయి. గతంలోనైతే శివసేనకు లభించిన రెండు ఓట్ల స్వల్ప ఆధిక్యత కనీసం మేయర్ పదవికి పోటీ పడటానికి సరిపోయేది. తక్కువ ఓట్లున్న పార్టీ నామ మాత్రంగా అభ్యర్థులను నిలబెట్టేది. గ్రేటర్ ముంబై కార్పొరేషన్ కోసం సాగిన విద్వేషపూరిత ప్రచారం తర్వాత ఉద్ధవ్‌కు సంబంధించి అదే సహజమైన ముగింపు అయి ఉండేది. అయితే పోటీపడుతున్న రెండు పక్షా లలో దేనితోనూ కలిసేది లేదని ఇతర పార్టీలు తిర స్కరించాయి. దీంతో బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తమ వ్యూహ రచనను మార్చారు. నగర పాలక సంస్థలోని అన్ని పదవులకు పోటీ నుంచి బీజేపీ దూరంగా ఉంటుందని ప్రకటిం చారు. అయితే ఈ వ్యూహంలో ఇమిడివున్న పలు అంతరార్థాల కారణంగా శివసేన తన తిట్ల దండకాన్ని తిప్పి రాయాల్సి వస్తుంది. పురపాలక సంస్థలో తమ పార్టీ లాంఛన ప్రాయమైన ప్రతిపక్షంగా ఉండదని, ఆ సంస్థ లోని పారదర్శకతపై, తప్పులపై నిఘా వేస్తుం దని బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభు త్వంలో శివసేన భాగస్వామి రూపంలోని ప్రతి పక్షంగా వ్యవహరించేది. ఇప్పుడు శివసేన సృష్టించే ఆ తలనొప్పి బాగా తగ్గిపోయింది. ఎంతగానో ఆశపడ్డ నగర ప్రభుత్వమనే ఆట వస్తువు లభించింది కాబట్టి శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగే అవకాశం సన్నగిల్లిపోయింది. పంచాయతీరాజ్ సంస్థలకు జరిగిన ఎన్ని కల్లో బీజేపీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గణ నీయ విజయాలను సాధించింది. దీనికి కారకు డైన ఫడ్నవిస్ ముంబై మునిసిపల్ కార్పొరేష న్పై నియంత్రణను సాధించలేని తమ అశక్త తను ఒక విధమైన గెలుపుగా మలిచారు. కార్పొ రేషన్ పదవులపై శివసేనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినందువల్ల బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వా నికి ఇక ఎలాంటి ముప్పూ లేదు. అయినా, శివ సేన తన కాల్పనిక ఆత్మ గౌరవాన్ని కాపాడుకో డానికి తరచుగా గుర్రుమంటూ ఉండవచ్చు. ఉదాహరణకు, పౌర పాలనలో పారదర్శక తకు హామీని కల్పించడం కోసం పదవీ విరమణ చేసిన ముగ్గురు అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటును పౌర పాలనా సంస్థల న్నిటికీ వర్తింప జేయాలని శివసేన కోరుతోంది. ఇదే ప్రమాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశాలకు కూడా వర్తింపచేసి, ప్రతిపక్ష నేతను, మీడియాను ఆ సమావేశాలకు అనుమ తించాలని ఇటీవల శివసేన కోరింది. దీంతో పారదర్శకత గురించి ఎక్కువగా మాట్లాడే బీజేపీ అయోమయంలో పడింది. అలాంటి పారదర్శకత అవసరమే కావచ్చు. కానీ అవి తేలికగా వచ్చేవిగానీ లేదా తేలికగా అమలయ్యేవి గానీ కాకపోవచ్చు. రాజ కీయవేత్తలు దృష్టిని కేంద్రీకరించేది తాము అందుకున్న పదవుల నుంచి వ్యక్తిగత ప్రయోజ నాలను సాధించుకోవడంపైనే తప్ప, పరిపాల నపై కాదు. బీజేపీ, తన సొంత క్యాడర్లను, ప్రత్యేకించి 82 మంది కార్పొరేషన్ సభ్యులను అవినీతికి పాల్పడకుండా ఉండాలని, తమ నిఘా నేత్రాల ముందే అవినీతి జరగకుండా నివారించాలని కోరాల్సి ఉంటుంది. వారు ఆ స్థాయి నైతికతను ప్రదర్శించే అవకాశం తక్కువే. అయినా ఆ పని చేశామని అది చెప్పుకోవచ్చు కానీ పాలనా యంత్రాంగపు నాణ్యతను పౌరులు సులువుగానే గ్రహించగలుగుతారు. బీజేపీ సాధించామని చెప్పుకునే సుపరి పాలనను పౌరులు తమకు అనుభవంలోకి వచ్చే వాస్తవాలతో పోల్చి చూస్తారు. పగిలిపోయి, దురాక్రమణలకు గురైన రోడ్డు పక్క పాద చారుల బాటలపై వారు రోజూ నడుస్తుంటారు. అవి అలా ఉండాల్సినవి కాదు. సకాలంలో, సరి పడేటంత లభించని నీటి కోసం పౌరులు పడి గాపులు పడాల్సి వస్తోంది. పరిస్థితి అలా ఉండా ల్సినది కాదు. చెత్తను ఎప్పటికప్పుడు తరలిం చాలి. కానీ అది జరగదు. పౌరులకు గతుకులు, గుంతలు లేని రోడ్లపై ప్రయాణం కావాలి. కానీ అతి తరచుగా జరిగే రోడ్ల మరమ్మతులు వాస్త వంగా కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవడానికేనని, ఎవరితో కలసి వారు ఆ పని చేస్తారో మీకు తెలుసు. ఎవరితో కుమ్మక్కై చట్టవిరుద్ధమైన భవనం నిర్మిస్తున్నారో పౌరుల కళ్లకు కనబడు తూనే ఉంటుంది. కాబట్టి ఫడ్నవిస్ తనకు తానే ఒక సవాలును విసురుకున్నారు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పదవి కన్నా గౌరవం మిన్న కాదా?
విశ్లేషణ శివసేన , బీజేపీలు కలసి పారదర్శక పాలనను అందించలేవు. బీజేపీ ప్రతి పక్షంలో ఉంటే అందుకు ప్రయత్నించవచ్చు అది గౌరవప్రదమైనది. కానీ రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేది ఎవరు? బడ్జెట్ రీత్యా చూస్తే ముంబై కన్నా పెద్ద మునిసిపల్ కార్పొ రేషన్ లేదు. దాని వార్షిక బడ్జెట్ రూ. 37,000 కోట్లు. అదింకా పెరుగు తోంది. అయినా దుష్పరిపా లన అనే తీవ్ర రుగ్మత దాన్ని పట్టి పీడిస్తూనేవుంది. ఆ సంస్థ, అభివృద్ధి కోసం కేటా యించిన నిధులలో సగం కంటే ఎక్కువ ఎన్నడూ ఖర్చు చేసి ఎరుగదు. దీనికి తోడు దేశంలోని అన్ని పరిపాలనా సంస్థల విలక్షణతైన అవినీతి ఇక్కడా పౌర పాలనకు సంబంధించిన అన్ని అంశాలలోనూ కనిపి స్తుంది. రోడ్లే అందుకు ఉదాహరణ. దీనిపై నియంత్రణ కోసం శివసేన, బీజేపీలు పోటీ పడ్డాయి. పౌర పరిపాలనా సంస్థకు జరిగిన తాజా ఎన్నికల్లో బీజేపీ(82) కంటే శివసేన(84) రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. రెండూ సంఖ్యా బలాన్ని మెరుగుపరుచుకున్నాయి. ఇప్పుడవి మేయర్ పదవి కోసం పోటీపడుతున్నాయి. 227 మంది సభ్యు లున్న కార్పొరేషన్‌లోని అతి పెద్ద పార్టీగా శివసేన ఆ హక్కు తనకే ఉందని భావిస్తోంది. కానీ మేయర్ పదవిని దక్కించుకోడానికి లేదా కార్పొరేషన్‌పై నిర పేక్ష అధికారాన్ని సాధించడానికి అదే సరిపోదు. నగర పాలనలో పారదర్శకతకు పట్టంగడతా మన్న వాగ్దానం వల్లనే ఓటర్లు పెద్ద నోట్ల రద్దును పట్టిం చుకోకుండా బీజేపీకి ఇంతటి గౌరవం దక్కేలా చేశారు. నగర ప్రభుత్వపు వంచనాత్మక పద్ధతులను సరిచేయ డానికి హైకోర్టు పదే పదే జోక్యం చేసుకున్న మాట నిజం. అది ఆ సంస్థకు తీవ్ర అవమానకరం. శివసే నపై బీజేపీ అభిప్రాయం ఎలా ఉన్నా, మునిసిపల్ కార్పొరేషన్ పని తీరుకు హైకోర్టు ఆదేశాలే గీటురాయి. ఏదో ఒకలా ఒప్పందాలు కుదుర్చుకుని తమ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోగలుగుతుందనే ఆశ బీజేపీలో తొంగిచూస్తోంది. తమకు శత్రువుగా మారిన మిత్రుడితో కలవడానికైనా అది సిద్ధంగా ఉంది. ఆ పార్టీలు రెండింటి మధ్యా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంబంధాలకు తగ్గట్టే బీజేపీతో శివసేన వ్యవహరించే ముప్పు ఉంది. ఇది బహుశా బీజేపీ చేసే పెద్ద తప్పు కావచ్చు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఒకరి పైకి ఒకరు కత్తులు దూసుకున్నా అవి రెండూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో అవి భాగస్వాములుగా నిలవకపోగా ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి విద్వే షపూరిత ప్రచారాన్ని సాగించాయి. ఇది, శివసేన తన శక్తు లను సంఘటితపరుచుకునేలా చేసింది. బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసింది. కానీ రెండూ మెజా రిటీ రీత్యా త్రిశంకు స్వర్గంలోనే ఉన్నాయి. ఈ స్థితిలో బీజేపీ, తాను ఏ వాగ్దానంతో పోటీ చేసిందో ఆ పార దర్శకతను గౌరవించాలే తప్ప మేయర్ పదవి కోసం పాకులాడకూడదు. ప్రతిపక్షంగా నగరానికి మెరుగైన పాలనను అందించాలని శివసేనను గట్టిగా కోర వచ్చు. తద్వారా అది తన 82 సీట్ల బలమనే ప్రతికూల తను అనుకూలతగా మలుచుకోగలుగుతుంది. అదే జరిగితే బీజేపీ గౌరవం మరింత ఇనుమడి స్తుంది. ఆ తర్వాత అది రాజకీయ పార్టీలకు అలవాటైన రీతిలో∙ఒప్పందాలను.. శివసేనతో సైతం కుదుర్చుకో వచ్చు. 2014లో శివసేన చేసింది ఇదే. అప్పుడది రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడానికి తిరస్కరించింది. ఆ తర్వాత హఠాత్తుగా పదవులపై మక్కువతో ప్రభు త్వంలో చేరింది. కయ్యాలమారి భార్యాభర్తల కాపు రంలా కలహాలు సాగుతూనే ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మైత్రి విచ్ఛిన్నమైన తర్వాతే బీజేపీ ముంబై కార్పొరేషన్లో నిఘాదారు పాత్రను పోషించ సాగింది. అంతకు ముందు రెండు దశాబ్దాలూ అది శివసేనతో అధికా రాన్ని పంచుకుంది. కాబట్టి అది కూడా సహ నేరస్తురా లిగానే ఉంది. బీజేపీ తన తప్పును అంగీకరించ కపోగా, శివసేనను బలవంతపు వసూళ్ల పార్టీగా, మాఫియా పార్టీగా సైతం విమర్శించింది. కార్పొరేష న్ను పాలించే ఏ పార్టీ అయినా బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా ఉండటం అరుదే. అలా అని లంచా లను స్వీకరించడాన్ని ఒక జీవన విధానంగా, ప్రామాణి కమైనదిగా ప్రజలు ఆమోదించాల్సిందేనని కాదు. శివసేనకు నగరంపై పూర్తి నియంత్రణను కట్ట బెట్టకుండా ఓటర్లు దాన్ని శిక్షించడమే కాదు, బీజేపీకి దాదాపుగా దానితో సమాన హోదాను కల్పించారు. అలా అని గత రెండేళ్లుగా కత్తులు దూసుకున్న ప్రత్యర్థు లిద్దరూ పౌర పరిపాలనాధికారాలను వాటాలు వేసు కుని పంచుకోవాలని కాదు. సంఖ్యా బలం రీత్యా బీజేపీ ప్రతిపక్షంగా ఉండి తప్పుడు పద్ధతులకు పాల్పడే అవకాశం ఉన్న పాలక పక్షానికి కళ్లెం వేయాలి. ప్రత్యర్థితో చేతులు కలపడం కంటే మేయర్ పద విని కోరుకోకుండటమే బీజేపీకి గౌరవప్రదమైనది. ఆ రెండూ కలవడం అంటే నగర పాలక సంస్థలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయడమే. 227 మంది సభ్యు లున్న కార్పొరేషన్లో శివసేన, బీజేపీలు కలిస్తే 166 మంది కార్పొరేటర్ల భారీ ఆధిక్యత లభిస్తుంది. శివ సేన, బీజేపీలు కలసి పారదర్శక పాలనను అందించ లేవు. బీజేపీ ప్రతిపక్షంగా ఉంటే అందుకు హామీని కల్పించడానికి ప్రయత్నించవచ్చు, తన ఎన్నికల ప్రణా ళికకు కట్టుబడీ ఉండవచ్చు. అది నిజంగా కూడా గౌరవప్రదమైనది. కానీ రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేది ఎవరు? - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
మురికివాడ ఓటు విలువ!
విశ్లేషణ మురికివాడల వాసులకే ప్రజాస్వామిక విధుల పట్ల ఎక్కువ శ్రద్ధని మంగళవారం తేలడం ఖాయం. వారు తప్పక ఓటు చేయాలి, ఓటు చేసినటై్టనా కనిపించాలి. స్థానిక రాజకీయవేత్త ప్రాపకానికి హామీని కల్పించేలా ఓటు చేస్తే మరీ మంచిది. భాగస్వామ్య ప్రజాస్వా మ్యంతో ఓ తంటా ఉంది. అది ఓటరు నిర్లిప్తత. ఓటు వేయని ఈ వర్గమే రాజ కీయాలను గురించి అతి ఎక్కు వగా పట్టించుకుంటుంది. నేటి రాజకీయాల తీరును విమర్శిం చడమూ, మొత్తంగా ఈ వ్యవ స్థలో రాజకీయ నేతలకు తప్ప ప్రజలకు ఏ విలువా లేదన్నట్టు వ్యాఖ్యానిం^è డం, తప్పు పట్టడం, నిందించడమూ మానరు. పౌరులుగా తమకు ఉన్న హక్కులలో ఓటు వేయాల్సిన బాధ్యత కూడా ఒక టని విస్మరిస్తారు. ఓటు వేయనందుకు జరిమానాలు విధించడం ద్వారా తప్పనిసరి ఓటింగును అమలు చేయ డాన్ని నిరంకుశత్వ చర్యగా చూస్తుంటారు. పౌరులు తమ బాధ్యతను తాము నెరవేర్చడం నుంచే ఫిర్యాదు చేసే హక్కు పుట్టుకొస్తుంది. ఎన్నికల రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే ఈ వైఖరి... ఇప్పటికే పలు రుగ్మతలను ఎదుర్కొంటున్న మన రాజకీయ వ్యవస్థకు మరింత హానిని కలుగజేస్తుంది. ముంబై ఈ ధోరణిని పదేపదే ప్రదర్శించింది. 2009 పురపాలక ఎన్నికల్లో అక్కడ 41 శాతం ఓటింగే నమోదైంది. కొన్ని వార్డుల్లో స్థానిక ఎన్నికల పోలింగ్ 21 శాతానికి సైతం దిగజారింది. ఓటింగు తక్కువగా నమో దయ్యే వార్డులలో అది 30–35 శాతా నికి అటూ ఇటుగా ఉంటుంది. రాజకీయాల వల్ల సంపన్నులు మరింత సంపన్నులు కావడమే జరగడం, గూండాలు రాజకీ యాల్లో పాల్గొనడం వంటి అంశాలు రుచించకపోవడం సమంజసమే. ఎన్నికల పట్ల విముఖతలో అవీ భాగమే. అయితే, శాసనసభ, పార్లమెంటులకు భిన్నంగా పురపా లక సంస్థ స్వయంపాలనా సంస్థ. కాబట్టి వివేకవంత మైన, విజ్ఞతాయుతమైన పౌర ప్రయోజనాలు పైచేయి సాధించాల్సి ఉంటుంది. ఏటా రూ. 37,000 కోట్ల బడ్జె ట్ను దుర్వినియోగం చేసే సంస్థకు ‘‘జీవన నాణ్యత’’ అనే భారీ పణాన్ని ఒడ్డాల్సి ఉంటుంది. అధ్వానమైన పౌర సదుపాయాలు, రాజకీయ దురాశ ఈ నగరాన్ని జీవించరాని S భయానక ప్రదేశంగా మార్చేశాయి. ఈ నగరం అన్ని రకాల స్త్రీపురుషులకు, అన్ని రకాల శక్తిసామర్థ్యాలకు జీవనోపాధిని కల్పించేదే తప్ప, నివాసంగా ఎంచుకోదగిన ప్రాంతం మాత్రం కాలేదు. ప్రజలకు సేవలను అందించడానికి స్పష్టంగా నిర్దేశించిన నిబంధనలున్నాయి. కానీ సంపన్నులకు మాత్రం లెక్కలోకి వచ్చేది డబ్బే. మీరు ఎంచుకున్న వారే లంచాల క్రీడకు పాల్పడుతూ మీ నమ్మకాన్ని వమ్ము చేస్తుండటం ఎన్నికల ప్రక్రియనే పరిహాసాస్పదం చేస్తుంది. ఇంతకూ ఓటు ధర ఎంత? మధ్యతరగతి కూడా ఈ బాపతులో చేరిపోతోంది. లోక్‌సభ, శాసనసభ లేదా మునిసిపల్ ఎన్నికలు ఏవైనాగానీ ఓటు చేసి తీరాలనే మరో విలక్షణ వర్గమూ ఉంది. సాంప్రదాయానుసారం మురికివాడల వాసులే ప్రజాస్వామిక విధుల పట్ల ఎక్కువ శ్రద్ధాసక్తులుగలవా రని మంగళవారం పోలింగ్‌లో తేలడం దాదాపు ఖాయం. అయితే, ప్రజాస్వామిక బాధ్యతను నెరవేర్చడ మనే గౌరవప్రదమైన ఉద్దేశం మాత్రమే వారు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడానికి కారణంగా చూప డం సరైనది కాదు. ప్రాపకపు వ్యవస్థ అనేదే అక్కడి రాజ కీయాలకు చోదకశక్తి, అదే వారిని ఆకర్షిస్తుంది. వారు ఓటు చేయాలి, ఓటు చేసినటై్టనా కనిపించాలి. గూండా లాంటి స్థానిక రాజకీయ వేత్త ప్రాపకం కొనసాగుతుం దని హామీని కల్పించే విధంగా ఓటు చేస్తే మరీ మంచిది. సాధారణ చట్టాలు, నిబంధనలు సైతం మురికి వాడల్లో అంత తేలిగ్గా ఏమీ అమలుకావు. అవి నగరం లోనే మరో చీకటి నగరంగా ఉంటాయి. అద్దాల ధగధ గలతో మెరిసిపోయే ఆకాశహర్మ్యాలను లేదా చిన్నవే అయినా ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న గేటెడ్ కమ్యూని టీలను ముంబై నగరపు విలక్షణతని తప్పుగా చూపి స్తుంటారు. కానీ దాదాపుగా ఆ నగర జనాభాలోని ప్రతి ఇద్దరిలో ఒకరు నివసించేది మురికివాడల్లోనే. ఈ నగరాన్ని నడిపించేది మురికివాడలే. వాటన్నింటినీ మూసేసి చూడండి.. మొత్తంగా ముంబై నగరమే కుప్ప కూలి, అరాచకత్వం నెలకొంటుంది. మురికివాడల వాసులను తొలగించడం, మురికివాడలలోని నివాసా లను కూల్చేయడం అనే ముప్పు పెద్దగా ఎదురుకాదు. చాలావరకు మురికివాడలకు రక్షణ ఉంటుంది. మురికి వాడలకు పురపాలక సంస్థ అందించే సేవలు అధ్వా నంగా ఉంటాయి. కాబట్టి అక్కడి వారికి ఎవరో ఒకరి ప్రాపకం కావాలి. తన సొంత గూండాలు, వాటర్ ట్యాంకర్లలాంటి సమాంతర సేవల నిర్వహకుల నిర్మా ణం ఉండే స్థానిక రాజకీయవేత్తే అలాంటి పెద్ద దిక్కు అయి ఉంటాడు. మురికివాడలలో ఉండని వారికి పౌరసేవలు బాగా అందుతుంటాయి. మురికివాడల వాసులు ఎప్పుడు, ఎంతగా అందుతాయో ఇతమిత్థంగా తెలియని సేవల కోసం వారికంటే ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది. మురికి వాడ నివాసాన్ని బాగు చేయించుకోవాలన్నా ‘రక్షణ డబ్బు’ చెల్లించాల్సిందే. మురికివాడ వాసికి సంబం« దించిన న్యాయమైన కేసునే అయినా పోలీసులు పట్టిం చుకోవాలంటే ఎవరో ఒక రాజకీయవేత్త నోటి మాట రికమెండేషన్ కావాల్సిందే. ఒక వ్యక్తి సదరు రాజకీయ వేత్తకు ఓటరైనాగానీ లేదా ఓటరు కాగలవాడే అయినా కావాలి. లేకపోతే వేధింపులు తప్పవు. పొరుగువారు తమపై ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా ఉండేలా ఒదిగి ఒదిగి బతకాల్సి వస్తుంది. అందువల్లనే రాజకీయ వేత్తలు, మురికివాడల వాసులు కూడా మురికివాడ ఓటుకు విలువను ఇస్తారు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
రచ్చకెక్కిన కలహాల కాపురం
విశ్లేషణ శివసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సంబంధం ఎలాంటిదనే ప్రశ్నకు మీరు ఈ మూడు జవాబుల్లో దేన్ని ఎంచుకుంటారు? 1. ఎన్నిక లకు ముందు భాగస్వామ్య పక్షాలు, 2. ఎన్నికల తర్వాతి భాగస్వామ్య పక్షాలు, 3. ప్రత్యర్థి పక్షాలు. వీటిలో ఏది ఎంచుకున్నా మీ జవాబు సరైనదే అవుతుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక శివసేన సభ్యుడు కేబినెట్ మంత్రిగా ఉన్నారు. కేంద్రంలో అది బీజేపీకి ఎన్నికల పూర్వపు భాగస్వా మిగా ఉంది. 2014 శాసనసభ ఎన్నికల తర్వాత అది మహారాష్ట్రలో బీజేపీకి ఎన్నికల తర్వాతి భాగస్వామి అయింది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆ పార్టీ మంత్రులున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన పుర పాలక సంస్థలు, 23 జిల్లా పరిషత్తుల ఎన్నికల్లో అవి ఒకదానిపైకి ఒకటి కత్తులు దూస్తున్న వైరి పక్షాలుగా ఉన్నాయి. ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, అవునా? శివసేన ఇకపై ఏపార్టీతోనూ ఎన్నికల తర్వాత ఎలాంటి పొత్తును పెట్టుకోదని ఇటీవల ఆ పార్టీ ఆ ప్రకటించింది. అయినా ఈ స్థితితో ఆ రెండు పార్టీలు హాయిగానే ఉన్నాయని అనిపిస్తోంది. పైగా శివసేన ఎన్నికలకు ముందటి, తర్వాతి కూటమి నుంచి బయటకు పోతా నని సైతం సూచించింది. అది ప్రస్తుతం ముంబై మునిసి పల్ ఎన్నికల్లో బీజేపీతో ఎలాంటి ఆటంకాలు లేని ఏ అడ్డూ అదుపూలేని పూర్తి స్థాయి యుద్ధం సాగిస్తోంది. ఈ ఎన్నికల్లో దక్కే నజరానా తక్కువదేం కాదు... మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై పీఠం. ‘గూండా’ పదం సహా వాడగలిగిన ప్రతి విమర్శ నాత్మక విశేషణాన్ని, శ్లేషను ఉపయోగించారు. మన రాజకీయాల తీరును బట్టి చూస్తే ఈ తీరును అర్థం చేసు కోవడం కష్టమేమీ కాదు. ‘‘ఫిబ్రవరి 23న ఎన్నికల ఫలి తాల వరకు వేచి చూడండి’’ అనే మాటను తరచుగా వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం అందరికీ కొట్ట వచ్చినట్టు తెలిసి వస్తుంది. రెండూ ప్రత్యర్థిని చిత్తు చేస్తామనే అంటున్నాయి. శాసనసభ మధ్యంతర ఎన్నికల గురించి మాట్లా డేంత వరకు కూడా శివసేన పోయింది. ప్రస్తుతం జరు గుతున్నవి మినీ సార్వత్రిక ఎన్నికలు. కాబట్టి శివసేన తన బలం ఎంతో ప్రదర్శించి చూపగలనని విశ్వసి స్తోంది. బీజేపీ తీరు కూడా అలాగే ఉంది. అయితే, మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న అది మిగతా రెండు న్నరేళ్లు శివసేన మద్దతు లేకుండా ఎలా అధికారం నెరప గలుగుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పడం పట్ల విముఖతను కనబరుస్తోంది. ఒకవేళ మధ్యంతర ఎన్నికలే జరిగేట్టయితే... బాల్ ఠాక్రే జ్ఞాపకాలు, పోస్టర్ల మీద ఆయన చిత్రాలతో బహు ముఖ పోటీలో 66 సీట్లను సాధించిన శివసేన ప్రభుత్వం నుంచి ఎందుకు బయటకు రావడం లేదు? ఈ రౌండు ఎన్నికల ప్రచారం ముగిసే రోజుకు గానీ పరస్పర విరు ద్ధమైన మాటల తదుపరి తనకు ౖపైచేయి లభిస్తుందని అది ఆశిస్తోంది. స్థానిక ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా వస్తే అప్పుడు శివసేన ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే సంకటాన్ని ఎదుర్కొంటుంది. బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నా శివసేన ప్రభుత్వాలలో కొనసాగుతోంది. కానీ మహారాష్ట్రలో అది బీజేపీని నిత్యం దుమ్మెత్తిపోయడం తారస్థాయికి చేరింది. ఇలాంటి వైఖరికి మరేదైనా కూటమైతే దాన్ని సాగనంపేసేదే. కానీ అలాంటి పని చేస్తే కలిగే పర్య వసానం గురించిన ఆందోళన బీజేపీకి ఉంది. ‘‘ఈ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుంది’’ అనే డాబుసరి మాటలతో దాన్ని అది కప్పిపుచ్చుకంటోంది. 288 మంది సభ్యులున్న శాసనసభలో బీజేపీకి ఉన్నది 133 ఎంఎల్ఏలే. సభలో ఓటింగ్ జరిగిన ప్రతిసారీ కనీసం ఓ డజను ఓట్లను సంపాదిస్తే తప్ప ఆ ప్రభుత్వం మనలేదు. ఏ పార్టీ తనతో చేయి కలుపుతుందనే విష యంలో దానికే స్పష్టత లేదు. శివసేన ఒకప్పుడు మహారాష్ట్ర అధికార కూటమికి సీనియర్ భాగస్వామిగా నేతృత్వం వహించేది. 2014 నుంచి అది ఆ హోదాను అంతవరకు జూనియర్ భాగ స్వామిగా ఉన్న బీజేపీకి వదులు కోవాల్సి వచ్చింది. ప్రతిపక్షంగా ఉండటం పట్ల విముఖతతో అది అందుకు అంగీకరించాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సంర ంభంలో బీజేపీ, శివసేనతో రెండు కారణాల వల్ల తెగ తెంపులు చేసుకుంది. ఒకటి, మోదీ గెలుపు నేపథ్యంలో తనకిక భాగస్వాముల అసరం లేదు. రెండు, ఒకవేళ శివసేనతో సంబంధాలు పెట్టుకున్నా మహారాష్ట్ర రాజకీ యాల్లో బీజేపీదే ప్రథమ స్థానమని అది అంగీకరించాలి. రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన ఈ ద్రోహం గురించి తీవ్రంగా మండిపడుతూ కొద్ది కాలం ప్రతిపక్షంగా ఉంది. కానీ ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరి అధికారం పంచుకోవడమనే ప్రలోభానికి లోనైంది. అయితే, అది తన భాగస్వామి హోదాను గుర్తించి, తద నుగుణంగా నడచుకోవడానికి బదులు అంతర్గత ప్రతి పక్షంలానే ఇంతవరకు వ్యవహరిస్తూ వచ్చింది. భార త్లో మనం తరచుగా చూసే ఒకే పార్టీలోని అసమ్మతి గ్రూపులాగా పనిచేస్తూ వచ్చింది. ఒక్కముక్కలో చెప్పాలంటే, అదో కలహాల కాపురం. ఆ కలహాలు ఇప్పుడు రచ్చకెక్కి, ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. అవును, లేకపోతే మధ్యంతర ఎన్నిక లకు ఎందుకు దిగరు? - మహేశ్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
అంతరార్థం ఏమిటి?
విశ్లేషణ రాజకీయ పార్టీలు రకరకాల కారణాలతో ఏర్పడుతుంటాయి. వాటిలో ఒకటి నల్లధనాన్ని అక్రమంగా చలామణి చేయడమని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అలాంటి దాదాపు రెండు వందల పార్టీల గుర్తింపును రద్దు చేసింది. పార్టీల ఏర్పాటుకు ఇతర కారణాలూ ఉంటాయి. పార్టీలోని వ్యక్తిగత, భావజాల వివాదాలు, వారసత్వ పోరాటాలు వంటివి కూడా వాటిలో ఉంటాయి. ములాయంసింగ్ యాదవ్ చేతులెత్తేయకపోతే రెండు సమాజ్‌వాదీ పార్టీలుండేవే. పదేళ్ల క్రితం రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను ఏర్పాటు చేయడంతో శివసేన చీలిపోయింది. అదో ప్రత్యేకవాద పార్టీ. తమ పార్టీ అది కాక మరేదో అన్నట్టుగా అది నటించిందీ లేదు. మౌలికంగా మరాఠీలే ఆ పార్టీ ఓటర్లు. అది, తమది బాల్ ఠాక్రే నిర్మించిన పార్టీగా చెప్పుకుంటుంది. అయితే ఈ పార్టీ ఏర్పాటుకు అసలు కారణం నేడు రాజ్ మేనబావ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వ వారసత్వ సమస్య వల్ల మాత్రమే ఎమ్ఎన్ఎస్ ఏర్పడింది. ఇద్దరూ మరాఠీలే కాబట్టి, వారు ఐక్యం కావాలని రెండు పార్టీల కేడరూ కోరుకుంటున్నారని ఎప్పుడూ వారికి సూచనలు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలు మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. కలసి పనిచేయడం కాదుగదా, కనీసం ఇద్దరి మధ్య అగాధాన్ని పూడ్చే ప్రయత్నమైనా వారిలో ఏ ఒక్కరూ చేయలేదు. స్థానిక పౌర పరిపాలనా సంస్థల నుంచి శాసనసభ వరకు అన్ని స్థాయిల్లోని ఎన్నికల రాజకీయాల్లోనూ వారు ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అయితే, ముంబైసహా పది ప్రధాన పౌర పురపాలన సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్ ఠాక్రే హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ప్రవర్తించారు. రాజ్ తన బావ ఉద్ధవ్‌కు ఏడు సార్లు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. ఉద్ధవ్ ఎక్కడ, ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా అంగీకరించి రెండు పార్టీల మధ్య ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలనేదే ఈ చర్య వెనుక ఉన్న S ఉద్దేశం. రాజ్ పంపిన దూతను సైతం ఉద్ధవ్ కలవలేదు. మరో నేతను కలిసినా ఎలాంటి ఫలితమూ లేకపోయింది. ఇది, ఎంత హఠాత్తుగా మొదలైందో అంత హఠాత్తుగానే ముగిసిపోయిన ప్రధాన పరిణామం. బలహీనపడుతున్న ఎమ్ఎన్ఎస్ నేత వేసిన ఈ ఎత్తుగడ ఆయనలోని నిస్పృహను సూచిస్తోంది. నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్లో మూడొంతుల మంది కార్పొరేటర్లు, అంటే 40 మంది ఉన్న ఎమ్ఎన్ఎస్ ఆ సంస్థను నియంత్రిస్తోంది. కానీ అక్కడి ఆ పార్టీ ప్రతినిధులు శివసేనలోకో లేక బీజేపీలోకో ఫిరాయిస్తున్నారు. 2009లో 13గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2014 నాటికి ఒకటికి పడిపోయింది. ఏ ప్రాతినిధ్య సంస్థలోనైనా ఎంత మంది ప్రజాప్రతినిధులున్నారు అనే దాన్ని బట్టే ఒక పార్టీ బలాన్ని లెక్కిస్తారు. అంతేగానీ ఏ సమస్యపైనైనా అది ఎంత ప్రభావాన్ని నెరపగలుగుతుందనేదాన్ని బట్టి కాదు. సేన, ఎమ్ఎన్ఎస్లకు సొంత రాజకీయ రంగ స్థలిౖయెన ముంబైలో పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కీలకమైనది. దాదర్ శివసేనకు కీలక ప్రాంతం. గత ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఠాక్రే కుటుంబీకులు నివసించే ది, శివసేన ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఉన్నది ఆ ప్రాంతంలోనే. ఈ ఘోర పరాజయం రాజ్‌కు మింగుడు పడటం కష్టమే. ఇకపై శివసేన ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు కలిసేది లేదని ఆ పార్టీ ముందుగానే ప్రకటించిందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం అవసరం. అయినా రాజ్ ఠాక్రే సర్దుబాట్ల కోసం పాకులాడారు. బీజేపీకి, సేనకు మధ్యనే ప్రధానంగా సాగే ఎన్నికల పోరులో మరాఠీ ఓట్లు చీలిపోకూడదనేదే తమ ఉద్దేశమని వివరించ డానికి ఆయన తంటాలుపడ్డారు. ఇదో చిన్నపాటి బెదిరింపే కాదు, ఆ పునాదిని నిలబెట్టుకోగలిగే ఆశలు లేవని ఎమ్ఎన్ఎస్ అంగీకరించడం కూడా. అయితే రాజ్ ఇలా ఉద్ధవ్‌కు సంకేతాలను పంపడం అతి చాకచక్యంగా వేసిన ఎత్తు అని ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో శివసేన ఓడిపోతే... మరాఠీ భూమిపుత్రులతో శివసేన జూదం ఆడాలని ప్రయత్నిం చిందనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది అనేదే రాజ్ ఉద్దేశమని అంటున్నారు. బీజేపీని మహారాష్ట్రేతరుల పార్టీగానే చూస్తుంటారు. అది వాస్తవాలపై ఆధారపడి ఏర్పడ్డ అభిప్రాయం కానవసరం లేదు. అయినాగానీ బీజేపీ చేతిలో ఓటమి కంటే ఎక్కువగా మరాఠీ అస్తిత్వాన్ని గాయపరచేది మరొకటి ఉండదు. ఒక రాజకీయ పరిణామం జరిగిన తర్వాత దానికి కారణాన్ని చెప్పడం అవసరం. శివసేన ఓటమిని వివరించడానికి జరిపే విశ్లేషణగా అది తెలివైన ఎత్తే కావచ్చు. కానీ అసలీ కాళ్లబేరంలో రాజ్ ఠాక్రే తాను ద్వేషించే నాయకుని పార్టీతోనే మైత్రిని కోరి తన బలహీనతను ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చిందో అది వివరించదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ను అది తక్కువగా చేసి చూపింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పౌరులవి కాని పుర పాలక సంస్థలు
విశ్లేషణ పోలింగ్ బూత్ నుంచి బయటకు రావడంతోనే ఓటరు బాధ్యత ముగిసి పోతుంది. ఇకపై వారు మాట్లాడటానికి లేదు. పౌర పాలనా వ్యవహారాల్లో తాము భాగస్వాములం కామన్న నిర్ధారణకు పౌరులు దాదాపుగా వచ్చేశారు. ముంబై సహా మహారాష్ట్రలోని పది ప్రధాన నగరాలకు త్వరలోనే ఎన్ని కలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నాకు సికింద్రాబాద్ మేయర్‌గా పని చేసిన డాక్టర్ యశ్వంత్ రావు తిమ్మరాజు గుర్తుకొ స్తున్నారు. అర్ధ శతాబ్దికి ముందు ఆయన రోజుకు రెండు సార్లు ఆసుపత్రిని నడిపేవారు. ఆ మధ్యలో వీలు చేసుకుని మునిసిపల్ కార్యాలయానికి మళ్లి వస్తుండేవారు. అందుకు ఆయన తన సొంత కారునే వాడేవారు. అప్పట్లో పురపాలక సంస్థ అధికారులకు కార్లను ఇచ్చేవారు కాదు. అప్పట్లో సుందర నగరమైన హైదరాబాద్‌కు ప్రత్యే కంగా ఒక మునిసిపాలిటీ ఉండేది. అది సాదా సీదా కాలం కాబట్టో ఏమో... మునిసిపల్ వ్యవహారాల కోసం తిమ్మరాజు పూర్తి కాలం వెచ్చించాల్సి వచ్చేది కాదు. అది రాజకీయాలకు అతీతమైన బాధ్యతగా ఉండేది. ఆశ్రితులు, రాజకీయ ప్రాపకం ఉండేవి కావు. నగరాలనుగాక, వాటి చుట్టూ తిరిగే రాజకీ యాలను మాత్రమే పట్టించుకునే నేటి రోజుల్లో అది మహా విచిత్రమే. మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న పది నగరాల్లో ఏదీ బాగా పనిచేస్తున్నది కాదు. సేవల విస్తృతి నుంచి నాణ్యత వరకు ప్రతి విషయంలో పౌరులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఏ సామాజిక ఆడిట్ జరిపినా తేలుతుంది. నగర పాలక సంస్థలు డబ్బు చేసుకునే రాజకీయాలను నడిపే వేదికలుగా మారడమే అందుకు కారణం. ఇదంతా ఆయా పార్టీల భావజాలాన్ని విస్తరింపజేయడం అనే సాకు తోనే జరుగుతుంటుంది. ఒక మామూలు మనిషి కార్పొరేటర్‌గా మొదటి రెండేళ్లు పనిచేసేసరికే సంప న్నుడై పోతాడు. తమ నగరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని పౌరులకు తెలియక కాదు. ఒక పార్టీకి ఓటు చేస్తేనో లేదా ఒక పార్టీని గద్దె దించితేనో తేడా ఉంటుందని భావిస్తున్నట్టయినా వారు నటించరు. ఏదైనా మార్పు వచ్చినా అది సాధారణంగా యథా తథ స్థితిని తెచ్చేదే. ఒకటో రెండో అరుదైన పట్ట ణాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. మన నగ రాలు ఇక మారవని పౌరులు రాజీపడిపోవడం వల్లనే అవి మరింత అధ్వానంగా మారుతున్నాయి. రాజకీయాల వంతుకు వస్తే... ప్రత్యేకించి ఈ పది నగరాల ఎన్నికల బరిలో ఉన్న పార్టీలన్నీ నగ రాన్ని అధ్వానంగా నడçపుతూ బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయని బాపతే. ప్రత్యేకించి ఇది, దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన ముంబై నగర పుర పాలక సంస్థకు మరింతగా వర్తిస్తుంది. ఎవరో నగ రాన్ని బాగు చేస్తారని ఆలోచించరు... అంతా మెరు గుపరుస్తామనే వారే. అది చేయరేమని ఎవరూ అడ గక పోవడమే విచిత్రం! పౌరులు దీన్ని రాజకీయ మల్లయోధుల క్రీడగా చూస్తుంటారనిపిస్తుంది. విజేతే మొత్తం కొల్ల సొత్తునంతా ఎగరేసుకుపోతాడు. వీక్షకులకు... పారిశుద్ధ్యం లోపించిన వీధులు, క్రమం తప్పుతూ సాగే నీటి సరఫరా, అరకొర సిబ్బందితో, సదుపాయాలు లేని ఆసుపత్రుల వంటి చిల్లర కాసు లను దులపరిస్తారు. మార్క్సిజం, లేదా హిందుత్వ లేదా ప్రాంతీయ అస్తిత్వాలు వగైరా ఏ ఇజమూ నగర పరి పాలన విషయంలో మినహాయింపు కాదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రాతినిధ్య ప్రాతిపదికపైన పని చేసేవి, పురపాలక సంస్థలు ‘‘స్వయంపాలక’’ సంస్థలు అనే విషయాన్నే మరచిపోయాం. పోలింగ్ బూత్ నుంచి కాలు బయటకు పెట్టడం తోనే ఓటరు బాధ్యత ముగిసి పోతుంది. ఇకపై వారు మాట్లాడటానికి లేదు. వారు ఎన్నుకున్న వారు గొప్ప వారు, శక్తివంతులు అయిపోతారు. ఇక వారు అనుగ్ర హించినది పుచ్చుకోవడమే. ఎవరైనా ఏదైనా పౌర సదుపాయాన్ని కల్పించినా.. అది వారు దయదలచి చేసేదే తప్ప, వారి విధి కాదు. పౌర పాలనా వ్యవహా రాల్లో తాము భాగస్వాములం కామన్న నిర్ధారణకు పౌరులు దాదాపుగా వచ్చేశారు. ప్రజా ప్రయోజనాల పట్ల పట్టింపు ఉన్న పౌరులు కొందరు పురపాలక ఎన్నికల్లో ‘‘పౌర అభ్య ర్థులు’’గా బరిలోకి దిగినా.. అది ముఖ్య వార్తాంశమే అవుతుంది తప్ప, తోటి పౌరులు వారిని ప్రోత్సహిం చరు. వారికి ఓటు వేయడం అంటే దాన్ని వృథా చేయడమేనని భావిస్తారు. అలాంటి స్వతంత్రులు గెలిచినా, రాజకీయ కార్పొరేటర్లు వారిని పనిచేయని స్తారా? అని విస్తుపోతుంటారు. గత దశాబ్ద కాలంలో ముంబై అలాంటి ఒకే ఒక్క స్వంతంత్రుడు, ఒక రాజకీయ పార్టీ మద్దతున్న మరో స్వతంత్రుడు కార్పొరేటర్లు కావడాన్ని చూసింది. అలాంటి పౌర సమష్టి కూటములు స్వభావ రీత్యానే నిర్ధిష్ట రూపం లేనివి. అవి ఆర్థిక సమస్యలతో సతమతమౌతాయి. అవి రాజకీయాలకు దూరంగా ఉండేవి. కాబట్టి వాటికి రాజకీయ పార్టీల ప్రాపకం లభించకపోవడం అనే అననుకూలత కూడా ఉంటుంది. ఓటర్లకు కావా ల్సింది కూడా ప్రాపకమే అనిపిస్తుంది. అక్రమ కట్టడా లను క్రమబద్ధీకరించడం లేదా కొత్త ఆక్రమణలను అనుమతించడం వంటి తమ వ్యక్తిగత కోరికల కోసం నియమ నిబంధనలను వంచడం గురించి మాట్లాడు తారు. అంతేగానీ నగరం బాగుపడటం గురించి మాత్రం కాదు. మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
ధిక్కారం మన హక్కా?
విశ్లేషణ సమాజానికి సంప్రదాయాలుంటాయి. కానీ మనం చట్టాలకు లోబడి వ్యవ హరించాలి. మూకుమ్మడిగా చట్టాన్ని ధిక్కరించి కోడిపందేలు, జల్లికట్టు నిర్వహించదలిచే వారిలో ఎంతమందిపై కోర్టు ధిక్కార నేరం మోపగలరు? దేశం ప్రస్తుతం నోట్ల రద్దు నిర్ణయం గురించి చర్చి స్తోంది. నలుపు, తెలుపుల గురించిన ఈ గొడవ మధ్య మనం పట్టించుకోని మరో ముఖ్య సమస్య ఉంది. చట్టం, న్యాయ వ్యవస్థల పట్ల, అధికారం పట్ల చూపాల్సిన గౌరవం వార్తా శీర్షికల్లోనో, టీవీ ‘బ్రేకింగ్ న్యూస్’లోనో తప్ప మరెక్కడా కనబడక పోవడం ఒక ప్రధాన ధోరణిగానే ఉంది. దీనికీ, నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధమూ లేదు. తమిళనాడులో ప్రజలు జల్లికట్టు సమస్యపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం వీటిలో తాజాది. చెదురు మదురుగానే అయినా ఆ క్రీడను నిర్వహించడానికి, సంప్రదాయం పేరిట జంతువుల పట్ల చూపే క్రూరత్వాన్ని చెల్లుబాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అలాంటిదే మరో ధిక్కారం ఆంధ్రప్రదేశ్‌లోని కోడి పందేలు. ఇక మన జవాన్లు... అధ్వాన మైన తిండి, సుదీర్ఘమైన పనిగంటలు, సీని యర్ అధికారుల కుక్కలను తిప్పుకురావడం తదితర విషయాలలోని తమ దుస్థితిని నేరుగా బహిరంగ ప్రసారం చేయడానికి పూనుకోవడం మరొకటి. ఇది, స్థావరాల స్థాయిలోని బలగాల అధికార వ్యవస్థ దౌష్ట్యం కావచ్చు. కానీ శ్రేణులు ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడాలని భావించడం ఆందోళనకరం. అధికారులు ప్రతిసారీ కోర్టుల ఆదేశానుసారం చట్టాన్ని గౌరవించేలా చేయడానికి హామీని కల్పిం చడం కృషి చేయాల్సి రావడం అత్యంత విషాదకరం. అందులోనూ వారు ప్రతిసారీ సఫలం కారు. కోర్టు తీర్పుపై అసమ్మతిని తెలపడం ఆమోదనీయమే గానీ, ధిక్కరించడం కాదనే విషయాన్ని ప్రజలు విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. నేడు మన పార్లమెంటుకు లభిస్తున్న గౌరవం కంటే ఎక్కువ గౌరవం కోర్టులపట్ల చూపాల్సి ఉంది. పార్లమెంటు వెసులుబాటుకు తగినంత అవకాశాన్ని కల్పిస్తుంది. హడావుడిగానో లేక హఠాత్తుగానో నిర్ణ యాలు జరగవు. కోర్టు ఆదేశాలు చెల్లకుండా చేయ డానికి ఆర్డినెన్స్‌ను తెమ్మని కోరడం రాజకీయవేత్త లకు సులువైపోయింది. ఒక వర్గంగా వారంతా తమ తమ భావజాలానికి అనుగుణంగా... షాబానో కేసులో జరిగినట్టుగానే కోర్టు తీర్పులకు అడ్డుపడు తూనే ఉంటారు. ఇది సమాజంలోని మన నడవ డికపై ప్రభావం చూపే తీవ్ర సమస్య. సమాజానికి సంప్రదాయాలుంటాయి. కానీ మనం నియమ నిబంధనలకు లోబడి, మరీ ముఖ్యంగా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరంకుశ చట్టాన్ని ధిక్కరించవచ్చు, కాకపోతే ఆ పని చేయా ల్సింది కోర్టులలోనే. మరో సమస్యాత్మకమైన పరిణామాన్ని మనం పట్టించుకోకుండా తోసిపుచ్చవచ్చు. కానీ అది మనకే ప్రమాదకరం. అది, సరిహద్దు భద్రతా బలగం, కేంద్ర రిజర్వు పోలీసు, సశస్త్ర సీమా బల్, సైన్యం జవాన్లు తమ అసంతృప్తిని గురించి బహిరంగంగా వ్యక్తంచేయడం. అందుకు వారు సామాజిక మాధ్య మాలను వాడటం పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచి స్తుంది. సాయుధ బలగాలలోని అసంతృప్తి ప్రమాద కరమైనది. సందేశాన్ని పంపినవారిని శిక్షించడానికి ముందు... వారి ‘క్రమశిక్షణా రాహిత్యానికి’ కారణా లేమిటో చూసి, వాటిని పరిష్కరించే పనిచేయాలి. సిబ్బంది సమస్యల పరిష్కార యంత్రాంగం సక్ర మంగా పనిచేయడంలేదనేది స్పష్టమే. పదవీ విర మణ చేసిన సీనియర్లు ‘ఒక ర్యాంకుకు ఒకే పెన్షన్’ కోరిక సాధన కోసం వీధుల్లోకి వచ్చిన తీరును చూసి వారు ధైర్యం తెచ్చుకుని ఉండొచ్చు. ‘పౌర జీవితం’లో, అంటే దేశంలోని సైనికేతర విభాగాలలో ఏం జరుగుతోందనేది జవాన్లకు తెలియ కుండా అడ్డుకోవడం అసాధ్యం. సుదీర్ఘమైన ఆ ఆందోళన గురించి సైనికులకు తెలిసింది. వారు ఆందోళన చేయాల్సి రావడం వల్ల బ్యారక్‌లలోని జవాన్లకు... భారత అధికార వ్యవస్థ అమర జవాన్ల పట్ల బహిరంగంగా గౌరవాన్ని ప్రదర్శిస్తుందే తప్ప సజీవంగా ఉన్న హీరోలను మాత్రం పట్టించుకోదని స్పష్టం చేసి ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ఇలా బహిరంగంగా మాట్లాడటం ద్వారా వెలుగులోకి వచ్చిన చెడుగులను నిర్మూలించడం కంటే వాటిని బయటపెట్టిన వారిని లక్ష్యం చేసుకుని శిక్షించడమే సులువు. ఎంతైనా వారు క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించాలని అనుకున్న వ్యక్తులు. కాబట్టి బలగాలు వారిని సహించలేవు. మరైతే సామూహికంగా చట్టాన్ని, కోర్టులను ధిక్కరించి కోడిపందేలు, జల్లికట్టు నిర్వహించాలనుకునే సమూహాల మాటేమిటి? వారిలో ఎంత మందిపై కోర్టు ధిక్కార నేరం మోపు తారు లేదా మోపగలరు? అందరికీ తెలియక పోయినా ఇలా విస్మరించిన కోర్టు తీర్పులు బహుశా చాలానే ఉండి ఉంటాయి. ఉదాహరణకు, ట్రక్కు లలో నుండి బయటకు పొడుచుకు వచ్చే చువ్వలు పలువుర్ని హతమార్చాయి. ఈ విషయంలో అత్యు న్నత న్యాయస్థానం అధికారులను హెచ్చరించింది. ఆ ఆదేశాల ధిక్కరణను మీలో ఎందరు చూసి ఉండరు? మనం జీవితాన్ని మనకు అనువైన విధంగా గడపాలని నిర్ణయించుకున్నామా? మహేష్ విజాపృకర్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
పిల్లల సమస్యలు పెద్దలవి కావా?
విశ్లేషణ గతవారం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో దాదాపు 50 మంది పిల్లలు క్రీడా మైదానం కోసం జిల్లా కలెక్టర్‌ను కలుసుకోవాలని ప్రయత్నించారు. ఈ దుస్సాహసానికిగానూ వారు మూడు గంటలు జైల్లో గడపాల్సి వచ్చింది. క్రీడా మైదానాలు ఇకనెంత మాత్రమూ పాఠశాలలకు తప్పక ఉండాల్సిన సదు పాయం కావు. విద్యార్థులు తరగతి గదుల నాలుగు గోడలకు పరిమితమౌతు న్నారు. భూమికి కొరత ఉండి, విలువ బాగా ఎక్కు వగా ఉన్న పట్టణప్రాంతాలకు పరిమిత మైన సమస్య కాదిది. గ్రామీణ ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి. అక్కడ పిల్లలకు చెట్ల కింద బహిరంగంగా పాఠాలు చెబుతుండటం చూస్తే ఆశ్చర్యం కలగదు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి క్రీడా మైదానాలు తోడ్పడ తాయి. కాబట్టి పాఠశాలలకు అవి ఆవశ్యకమని తెలియా ల్సినవారందరికీ తెలుసు. అసలు క్రీడా మైదానం లేని పాఠశాల, పాఠశాలే కాదు. కానీ అందుకు అయ్యే ఖర్చు ఎక్కువనే సాకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. చుక్క లను అంటేంతటి భారీ ఫీజులను వసూలు చేసే ప్రైవేటు విద్యారంగమూ అదే సాకు చూపుతుంది. ఆ పాఠశాలలకు కూడా క్రీడా దినాలు అనేవి ఉంటాయి. నామమాత్రంగా ఆ లాంఛనం పట్ల గౌరవం చూపాలన్నట్టు కొద్దిపాటి బహిరంగ స్థలంలో ఆ తతంగం కానిచ్చేస్తారు. ఒక్కోసారి గతంలో ఎన్నడో క్రీడా మైదానంతో ఏర్పాటు చేసిన ఏ పాఠశాలలోనో ఆ తంతు ముగిస్తారు లేదా అసలు అదీ చేయరు. తల్లి దండ్రులు ఈ విషయమై ఆందోళన చెందడం అరుదు. పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటూ ఉంటారు. కాస్త ఉన్నత స్థితిలో ఉంటే భవనాల డ్రైవింగ్, పార్కింగ్ స్థలాల్లో ఆడుకుంటారు. టీవీ, వీడియో గేమ్స్ ఆడటం పిల్లలను ఇంటివద్ద కూడా నాలుగు గోడల మధ్య ఉంచేయడానికి సమంజసమైన సమర్థనలు కాజాలవు. గతవారం కనీసం ఒక ప్రాంతంలో... మధ్యప్రదే శ్‌లోని శివపురిలో పిల్లలు క్రీడా మైదానంలో ఆడుకోవ డానికి తమకున్న హక్కును సాధించుకోడానికి కార్యా చరణకు దిగారు. అందుకు వాళ్లు ఎంతో బాధాకరమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. దాదాపు 50 మంది పిల్లలు క్రీడా మైదానం కోసం జిల్లా కలెక్టర్‌ను కలుసుకోవాలని ప్రయత్నించారు. ఈ దుస్సాహసానికి గానూ వారు మూడు గంటలు జైల్లో గడపాల్సి వచ్చింది. దిగ్భ్రాంతికరమైన మొరటుదనానికి పిల్లలు గుర య్యారు. దీన్ని తలదన్నినట్టుగా రాజ్యాంగపరంగా ఆ పిల్లల హక్కుల పరిరక్షకుడైన అధికారి ఇది జరుగుతుం డగా చూస్తూ, ప్రేక్షకునిలా నిలిచారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన కనబడకపోయేస రికి పిల్లలు ఆయనను ఒక బహిరంగ కార్యక్రమంలో కలుసుకునే ప్రయత్నం చేశారు. ‘‘వాళ్లను తీసుకు పొండి’’ అని మాత్రమే అన్నాడాయన. పోలీసులు మాత్రం తమదైన శైలిలో వాళ్లను ఓ పోలీసు వాహనంలో కుక్కేసి జైలు అధికారులకు అప్పగించారు. పిల్లలు ఆ జైలు గోడలను తేరిపార చూస్తూ దాదాపు మూడు గంటలు గడపాల్సి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇదంతా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అధికారి అక్కడే ఉండి చూస్తూనే ఉన్నారు. పిల్లలు నిరసన తెలుపుతుండటాన్ని తాను చూశానని, కాకపోతే వారిని ‘‘అంత ఉద్రేకపూరితమైన స్థితిలో అక్కడకు తెచ్చి నవారు ఎవరో’’ తెలుసుకోవాలనే ఆరాటంలో ఉన్నానని ఆ అధికారి చెప్పారట. ఇప్పుడిక బాలల హక్కుల ఉల్లం ఘన సమస్యను ఆయన వద్దకు తీసుకుపోవడం ఎలా? పిల్లలను అలా ఉసిగొలిపింది ఎవరనేదాని గురించి ఆయన ఎక్కువ ఆందోళనతో ఉన్నారే తప్ప... ప్రభుత్వ యంత్రాంగం ఆ బాలలను ఏం చేసిందనే దాని గురించి మాత్రం కాదు. అయితే పోలీసు కమిషనర్ మాత్రం విభిన్న కథ నాన్ని వినిపిస్తున్నారు. ‘‘నిరసన తెలుపుతున్న ఆ విద్యా ర్థులంతా మైనర్లు. వారిలో కొందరు బాగా చదువుకున్న విద్యార్థులూ ఉన్నారు. వాళ్లు పదే పదే నిరసన తెలప డానికి వస్తూనే ఉన్నారు’’ అన్నారాయన. ‘‘పదే పదే నిరసన తెలపడానికి వస్తూనే ఉన్నారు’’ అనే మాటలను గమనించండి. ఆ సమస్య చాలా కాలంగా ఉన్నదని, ఇంత వరకు దాన్ని పరిష్కరించలేదని ఆ మాటలకు అర్థం. పిల్లలను ఆ దుస్థితికి మనం ఎందుకు ఈడ్చి నట్టు? చూడబోతే పిల్లల సమస్యలు పెద్దలవి కాదన్న ట్టుంది. కొన్ని నెలల క్రితం, మహారాష్ట్ర చంద్రపూర్‌లో బండెడు బరువున్న... బహుశా గాడిద బరువు.. స్కూల్ బ్యాగ్‌లను వీపుల మీద మోసుకుంటూ ఒక పాఠశాల విద్యార్థులు తమ గోడు చెప్పుకోడానికి స్థానిక ప్రెస్ క్లబ్‌కు వచ్చారు. పాత్రికేయులు వారి ధైర్యానికి ఆశ్చర్య పోయారు. ఆ 12 ఏళ్ల పిల్లలు, తాము రోజూ ఎనిమిది సబ్జె క్టులకు సంబంధించిన 16 పుస్తకాలను, కొన్ని సార్లు అంతకంటే ఎక్కువ పుస్తకాలను మోయాల్సి వస్తోం దంటూ... 5 నుంచి 7 కేజీల బరువుండే ఆ భారాన్ని మోయడం తమకు ఎలా అలసట కలిగిస్తుందో వివరిం చారు. ఆ బరువుకు వాళ్లు తాము తీసుకుపోయే వాటర్ బాటిల్, లంచ్ బాక్స్‌ల బరువును కలపడం మరచి పోయారనేది స్పష్టమే. వాళ్ల తరగతి గదులున్నదేమో మూడో అంతస్తులో. ఆ పిల్లలు అప్పటికే ఆ పాఠశాల అధికారులకు తమ మోత బరువును తగ్గించాలని విన్నపం చేసినా ఫలితం లేకపోయింది. ఒక కమిటీ నివేదిక ప్రాతిపదికపై బొంబాయి హైకోర్టు స్కూలు బ్యాగుల బరువును తగ్గించాలని ఆదేశించింది కూడా. అయినా ఆ ఆదేశాల అమలు పని ఇంకా జరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు ఈ నిత్య చిత్రహింసను అనుభవిస్తూనే ఉన్నారు. (వ్యాసకర్త : మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com ) -
విగ్రహ స్థాపనతో సరా?
విశ్లేషణ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహ స్థాపనతో శివాజీని స్మరించడమా? లేక గ్రామాలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలంటూ, రైతుల స్వావలంబ నపై శివాజీ చెప్పిన పాలనా సూత్రాలను అలవర్చుకోవడమా.. ఏది అవసరం? ముంబైలోని మెరీనా డ్రైవ్ వద్ద సముద్ర తీరం నుంచి 3.5 కిలోమీటర్ల లోపల నిర్మిం చనున్న శివాజీ విగ్రహ స్థాపనకు మహారాష్ట్ర బడ్జెట్లో ఇంతవరకు ఒక్క నయాపైసా కూడా కేటాయించలేదు గానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రెండురోజుల క్రితం ఆ ప్రాంతంలో జలపూజ కూడా చేసేశారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఎవరికీ పెద్దగా కనిపించనంత దూరంలో నిర్మించనున్న శివాజీ స్మారక విగ్రహ ప్రాజెక్టుకు ప్రస్తుత ధరల్లో రూ. 3,500 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. దూరం నుంచి కనబడే దాదాపు 190 మీటర్ల పొడవైన ఈ విగ్రహ స్థాపనకు దీవిలో భూమిని సిద్ధం చేయాల్సి ఉంది. శత్రుపూరిత దృష్టితో సాగుతున్న తన భాగస్వామి శివసేనతో కలిసి పాలిస్తున్న బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పేరు తానే కొట్టేయాలనే దృష్టితో ఈ భారీ విగ్రహ స్థాపన పట్ల ఆత్రుత ప్రదర్శిస్తోంది. ఈ ప్రాజెక్టు చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ముంబై పురపాలక ఎన్నికలు 2017 మార్చి నెలలో జరగనున్నందున ఇది విస్తృత ప్రచారానికి నోచుకుంటోంది. ఈ ఎన్నికల్లో శివసేనపై తన నియంత్రణను కొనసాగించాలన్నది బీజేపీ అభిమతం. ఏడాదికి రూ. 3.5 లక్షల కోట్ల లోపు బడ్జెట్‌కు పరి మితమైన రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల పరిమాణం, తీసుకునే రుణం నేపథ్యంలో చర్చ సహజమే కానీ వ్యతిరేకులు ఇప్పటికీ అస్త్రసన్యాసం చేయలేదు. సముద్రంలో తమ కదలికలకు అడ్డుపడుతుందని, చేపల వేటకు అంతరాయం కలిగిస్తుందనీ మత్స్యకారులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. దీవిలో భూమిని పైకెత్తడం ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి పర్యావరణ ఉద్యమకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణ మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలిపినప్పటికీ, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. మొఘలులను వెనక్కు నెట్టిన యుద్ధవీరుడిగా వెలుగులోకి వచ్చిన సమయానికి శివాజీ పూజనీయ వ్యక్తి అయిపోయాడు. శివాజీని గౌరవించడం అనేది మహారాష్ట్ర ప్రజల రక్తంలో ఇంకిపోయింది. కేవలం ఒక చారిత్రక పురుషుడిగా మాత్రమే కాకుండా మరాఠీల ఆత్మాభిమాన ప్రతీకగా శివాజీ అవతరించాడు. మరాఠీ సంస్కృతిలో భాగమైపోయాడు. అతడి దరిదాపుల్లోకి వచ్చే నాయకులే లేకుండా పోయారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి శివాజీకి భౌతికంగా కట్టే నిర్మాణం ఊతకర్రగా ఉండదు. శివాజీని అగౌరవించే వ్యక్తి పని పట్టేంతవరకు వారు నిద్రపోరు. అయితే ఈ విషయంలో న్యాయబద్ధమైన ప్రశ్న మిగిలే ఉంది. మరొక 20 మీటర్ల ఎత్తుకు పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్న పొడవైన విగ్రహాన్ని స్థాపిం చడం కంటే శివాజీని గౌరవించడానికి మరింత ఉత్తమమైన మార్గాలు లేవా? శివాజీ గెలుచుకున్న కోటలు, పర్వతశ్రేణుల్లో, పశ్చిమ తీరప్రాతంలో అదృశ్యమైపోయిన అలనాటి ఆనవాళ్లను పునాదులనుంచి తిరిగి నిర్మించడం ద్వారా మరింత ఉన్నతంగా ఆయన స్మృతి చిహ్నాలను నిర్వహించలేమా? శివాజీ జన్మించిన శివనేరి కోట పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయితే ఈ నిర్లక్ష్యం ఈ ఒక్కదానికే పరిమితం కాలేదు. శివాజీ జీవితకాలంలో కోటలనేవి తన సైనిక వ్యూహంలో ప్రధానభాగంగా ఉండేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పరిచితమైన భారతీయ కోటలు బహుశా రాజస్థాన్‌లో అమేర్, మెహ్రాన్ ఘర్ వంటివి మాత్రమే. మహారాష్ట్రకు సంబంధించినంతవరకు శివాజీ కోటలు జానపద గాథల్లో మాత్రమే నిలిచి ఉంటున్నాయి. శివాజీ పట్టాభిషిక్తుడైన, అనంతరం సమాధి స్థలంగా ఉన్న అతడి అధికార కేంద్రం రాయగడ్ తప్పితే మిగతా ఏ కోటలూ ఇవ్వాళ సజీవ వాస్తవంగా కనిపించడం లేదు. వీటిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి శివాజీ విగ్రహ స్థాపనకు ప్రతిపాదిస్తున్న రూ. 3,500 కోట్ల వ్యయంలో అత్యంత చిన్న భాగాన్ని వెచ్చించినా సరిపోతుంది. అతి స్వల్ప ఖర్చుతోకూడిన ఇతర మార్గాల్లో కూడా శివాజీని గౌరవించవచ్చు. రాష్ట్రంలో ఆయన పాలనావిధానాలను అనుసరించడం ద్వారా ప్రభుత్వం శివాజీని గౌరవించవచ్చు. అదెలా అనేది ఏమంత తెలీని విష యం కాదు. ఉత్తమ పాలనకు మార్గం గురించి తన సుబేదార్లలో ఒకరికి శివాజీ అత్యంత సమగ్రమైన నోట్ రాసి ఉన్నాడు. అది ప్రజా కేంద్రకమైనది. ‘గ్రామం నుంచి గ్రామానికి వెళ్లు’ అని శివాజీ రాశాడు. ‘గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని అంచనా వేయమ’న్నాడు. ఇచ్చిన రుణాలను వ్యవసాయం నిలదొక్కుకున్నప్పుడే వసూలు చేయాలన్నాడు. రైతులను స్వావలంబనవైపు నడిపేందుకు పెట్టే ఖర్చు ‘ప్రభుత్వానికి ఆమోదనీయమే’ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను దీంతో పోల్చి చూద్దాం. 2015లో ప్రతి లక్షమంది జనాభాలో 3.3 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుసుకున్నప్పుడు మీకు మొత్తం పరిస్థితి అవగతమవుతుంది. తన యంత్రాంగాన్ని అనుసరించాల్సిందిగా మరాఠా చక్రవర్తి ఆదేశించిన ప్రాథమిక పాలనా సూత్రాలను కూడా ఇవ్వాళ నిర్లక్ష్యపరిచారు. అధికారం అనేది అధికారం కోసమే, శక్తిమంతుల కోసమే అనేది ప్రభుత్వ పాలనలో భాగమైపోయింది. ఇప్పుడు ఎవరైనా శివాజీని కలుసుకుని తమకు మార్గాన్ని చూపించాలని కోరినట్లయితే, ‘మీరు నన్ను స్మరించాలనుకుంటే ప్రజలకోసం పనిచేయండి’ అని మాత్రమే చెప్పేవాడు. దీనికి బదులు విగ్రహమా, విగ్రహ స్థాపనా? వాస్తవానికి శివాజీ తన కోటలను కూడా అలంకరించలేదు. శివాజీ మూర్తిమత్వాన్ని, ఆయన అలవర్చుకున్న సారాంశాన్ని కాకుండా విగ్రహరూపంలోనే ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నారేమో అని అనుమానించాల్సి ఉంది. (వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com ) -
పేరు మార్పుల జోరు
విశ్లేషణ స్థానికతను చాటుకోవాలంటూ ఇంగ్లిషు వారి పేరున్న ప్రతిదానికీ భారతీయుల పేర్లను, ఇక ఇప్పుడైతే మరాఠీల పేర్లను పెట్టడం ఎంత వ్యర్థమో అధికారులకు తెలియడం లేదు. మహారాష్ట్రలోని స్థలాలు, సదుపాయాలు, సంస్థల పేర్ల మార్పిడి జోరు ఎడతెరిపి లేకుండా సాగుతోంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫూలే వర్శిటీగా మారింది. ఇతర విశ్వవిద్యాలయా లకు కూడా అలాగే కొత్త పేర్లు వచ్చాయి. ఇదంతా బొంబాయి ముంబైగా మారిన చాలా కాలం తర్వాతే జరిగింది. కొత్తగా ఒక స్థానిక రైల్వే స్టేషన్ మార్పిడి జరిగింది. బొంబాయి గవర్నర్‌గా పనిచేసిన (1853–60) జాన్ ఎల్ఫిన్‌స్టోన్ పేరిట ఉన్న అది ప్రభాదేవి స్టేషన్ అయింది. అయితే జాన్ ఎలిఫిన్స్టోన్ పట్ల గౌరవాన్ని, ఆయన జ్ఞాపకాలను చాటుకోవడానికి ఆయన పేరును ఒక వంతెనకు, స్టేషన్‌కు, జౌళి మిల్లుకు కూడా పెట్టారు. గొట్టాల ద్వారా నీటి సరఫరా వ్యవస్థను ఆ నగరంలో మొట్టమొదట ఏర్పాటు చేసినది ఆయనే. ది బొంబాయి గ్రీన్ అంచున నిలిచిన ఆసియా టిక్ సొసైటీ ఆఫ్ ముంబై అతి పురాతన సంస్థలలో ఒకటి. 1804లో దానికి పునాది వేశారు. ఆ ప్రదేశం పేరు ఎలిఫిన్స్టోన్ సర్కిల్ అయింది. స్వతంత్రం వచ్చిన వెంటనే ఆయన పేరును చెరిపేశారు. బొంబాయి క్రానికల్ సంపాదకుడు బెంజమిన్ హార్నిమన్ స్మారక చిహ్నంగా దాన్ని మార్చారు. హార్నిమన్ భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతునిచ్చారు. ఈ పేరు మార్పిడులు జరుగుతున్నది మహ నీయులుగా కొత్తగా ఆవిర్భవించే వారి పేర్లను పెట్టడానికి కొత్త స్థలాలు దొరకక కాదు, జాతీయ వాదం ఉప్పొంగడం వల్ల. తాజాగా పేరు మార్చిన స్టేషన్‌ను ప్రజలు చాలా ఏళ్లపాటూ పాత, సుపరిచి తమైన పేరుతోనే పిలుస్తారు. ముంబైని ఇంకా బొంబాయి అని పిలుస్తున్న వారు ఉన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్‌గా (సీఎస్టీ) పేరు మార్చిన విక్టోరియా టెర్మినస్ (వీటి)ను కూడా. ఆ సీఎస్టీ పేరును తిరిగి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌గా(సీఎస్ఎమ్టీ) మారుస్తున్నారు. ‘మహరాజ్’ లోపించడమంటే ఆ మరాఠా సామ్రాట్ పట్ల అపచారమేననే తప్పుడు అవగాహనే ఇందుకు కారణం. శివాజీ రాష్ట్రానికే ఆదర్శ ప్రతీక అనడంలో సందేహం లేదు. ఆయనను ప్రేమగా శివబా అని పిలుచుకుంటారు. పండాపూర్లోని దేవుని పేరిట మహా రాష్ట్రను విఠల అని పిలిచేవారు. తుకారాం సైతం ఆయనను కొలిచాడు. ముంబై తీరంలో సము ద్రంలో బ్రహ్మాండమైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండగా ‘మహరాజ్’ చేర్చాలనడం నిర్హేతు కమైనది. ఇది సంకుచిత ప్రాంతీయ సెంటిమెంట్లను సొమ్ముచేసుకోవాలని ప్రాకులాడటమే. స్థానికతను చాటుకోవాలంటూ ఇంగ్లిషు వారి పేరున్న ప్రతిదానికీ భారతీయుల పేర్లను, ఇక ఇప్పు డైతే మరాఠీల పేర్లను పెట్టడం ఎంత వ్యర్థమో స్థానిక ప్రయోజనాలకు దాసోహం అంటున్న అధి కారులకు తెలియడం లేదు. దక్షిణ ముంబైలోని ప్రధాన కూడ లిలో గుర్రమెక్కి ఉన్న కింగ్ ఎడ్వర్డ్-7 విగ్రహాన్ని 1960లలో తొలగించారు. కాలా ఘోడా (నల్ల గుర్రం)గా ఆ విగ్రహం సుప్రసిద్ధమైనది. చరిత్రంత నిరర్థకమైనది ఏదీ లేదన్నట్టుగా చేశారీ ఈ పని. ఆ కాలా ఘోడా విగ్రహాన్ని విక్టోరియా గార్డెన్లో ఓ మూల పారేశారు. శివాజీ తల్లి జిజాబాయిని మరచి పోకూడదన్నట్టుగా దానికి జిజామాతా ఉద్యాన్ అని కొత్త పేరు పెట్టారు. స్థానికులు దాన్ని ఎప్పటి నుంచో రాణీబాగ్గా పిలిచేవారు. ప్రజా స్మృతుల తీరు విచిత్రంగా ఉంటుంది. కాలా ఘోడా విగ్రహాన్నయితే తొలగించారుగానీ ఇప్పుడు అక్కడ ఒక నల్ల గుర్రం విగ్రహాన్ని పెట్టక తప్పేట్టు లేదు. ఏటా అక్కడ కాలా ఘోడా పండుగ జరుగు తుంటుంది మరి. బొంబాయిని ముంబైగా మార్చినట్టుగా ఎలిఫిన్ స్టోన్ స్టేషన్‌కు కూడా దాని పాత పేరును పెట్టి ఉంటే అర్థం చేసుకోగలం. కానీ అంతకు ముందు అక్కడ స్టేషనే లేదు.1853లో బోరి బందర్ నుంచి థానేకు మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ప్రారంభమైనప్పుడే దానికి ఆ పేరు పెట్టారు (బోరిబందర్ అంటే ఇప్పుడు సీఎస్టీగా ఉండి సీఎస్ఎమ్టీగా మార బోతున్న వీటీ). 300 ఏళ్ల క్రితం నాటి ప్రభాదేవి గుడికి గుర్తుగా దాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. కాకపోతే దీనివల్ల దాదర్ స్టేషన్ పేరును చైత్య భూమిగా మార్చాలనే ఒత్తిడి మరింత పెరుగుతుంది. చైత్యభూమి దాదర్ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని, సముద్ర తీరాన ఉన్న డాక్టర్ అంబేడ్కర్‌ను దహనం చేసిన స్థలం. ఏటా దళితులు డిసెంబర్ 6న అక్కడికి తీర్థయాత్రలా సాగుతారు. అక్కడికి కూతవేటు దూరంలోని పాడుబడ్డ ఒక జౌళిమిల్లు ఆవరణనంతటినీ భారత రాజ్యాంగ నిర్మాత బ్రహ్మాం డమైన స్మృతి చిహ్నంగా మారుస్తున్నారు. అయితే అదేమీ దాదర్ పేరు మార్పు డిమాండును బలహీ నపరచదు. రాజకీయాలే కొలబద్ధ అయినప్పుడు ఏదైనా సాధ్యమే. -మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
అగ్రకులాలకు వేధింపులా?
విశ్లేషణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989ని మహారాష్ట్రలో అత్యాచారాల చట్టంగా పిలవడం పరిపాటి. అదే ఇప్పుడు ఆ రాష్ట్రంలో వివాదాంశంగా మారింది. ఆధిపత్య కులంగా ఉన్న మరాఠాలు తాము సైతం వెనుకబడి ఉన్నామని, తమకూ రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. దళితులు తమను వేధించడానికి అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. చారిత్రకంగా అణచివేతకు గురవుతున్న దళితులు, తాము అత్యాచారాలకు గురవుతున్నా చాలా సందర్భాల్లో తమ కేసులను పోలీసు స్టేషన్లు నమోదు చేసుకోవడం లేదని, ఇక ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరచినట్టు రాష్ట్ర పౌర హక్కుల పరిరక్షణ విభాగానికి ఇంతవరకు ఒక్క ఫిర్యాదైనా అందలేదు. బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో దళితులు, కలుపుకుపోయే స్వభావం లేని హిందూ మతాన్ని విడనాడి బౌద్ధాన్ని స్వీకరించినప్పటి నుంచి వారి పట్ల ద్వేష భావం ఉంది. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును మహా మానవుని (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్) పేరిట మార్చడానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రాజకీయ చతురుడైన శరద్ పవార్ వంటి నేతకే ఆ పేరు మార్పు కష్టమైంది. నవ బౌద్ధులు సమరశీలత కలిగినవారే అయినా అహింసావాదులు, ఆత్మగౌరవం కలిగినవారు అయిన సామాజిక వర్గం. అది, రిజర్వేషన్లను కోరుతున్న మరాఠాల మధ్య ఉన్న ఏకత్వ భావనంత బలంగా కూడా ఉంది. మరాఠాలు సామాజిక, రాజకీయ ఆధిపత్యం గల సామాజిక వర్గం. అయినా వారు తాము వెనుకబడి ఉన్నామనడానికి... వ్యవసాయ కమతాలను కోల్పోవడం, అధ్వానంగా ఉన్న పంట దిగుబడులు, ఇతరులతో పోలిస్తే ఉద్యోగిత స్థాయి అల్పంగా ఉండటం వంటి పలు కారణాలున్నాయి. రిజర్వేషన్లు కల్పించినా, కల్పించకపోయినా వారి ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవలసినదే. మరాఠాల రిజర్వేషన్ల సమస్య ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. కాబట్టి రిజర్వేషన్లు కావాలనే మరాఠాల కోరిక న్యాయబద్ధమైనదేనని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలను ఒప్పించాల్సి ఉంటుంది. కానీ అది అత్యాచారాల చట్టాన్ని ఉపసంహరించుకోవడం గానీ లేదా ‘‘దుర్వినియోగం’’ కాకుండా దాన్ని మార్చడం గానీ చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. కాకపోతే అలా చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయవచ్చు. ఆ చట్టం పదును తగ్గించమనడం సహా ఇంకా ఏమైనా చేయాలంటే పార్లమెంటులో చట్టం చేయమని కోరగలుగుతుంది. కానీ దళితులు నిజంగానే అణచివేతకు, అత్యాచారాలకు గురువుతున్నవారు. ఓటర్లలో వారు చెçప్పుకోదగిన భాగంగా ఉన్నారు. అందువల్ల అత్యాచారాల చట్టం సవరణకు ఇతర రాష్ట్రాలు, పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉండకపోవచ్చు. మరాఠాలు కోరుతున్న కోటాలను సాధించడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరాఠాలకు భరోసా ఇస్తున్నారు. అయితే అత్యాచారాల చట్టం విషయానికి వచ్చేసరికి ఆయన దానిలోని ఏ అంశాన్నీ నీరుగార్చేది లేదనే దృఢ వైఖరితో ఉన్నారు. అయితే, ఆ చట్టం దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటూ, దళితుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఆయన ఒక శాసనసభా కమిటీని ఏర్పాటు చేశారు. అత్యాచారాల చట్టం కఠినమైనదనడంలో సందేహం లేదు. దాన్ని మరింత బలోపేతం చేసేలా మరి కొన్ని నేరాల జాబితాను ఒక బిల్లు ద్వారా ఆ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ బిల్లు చట్టంగా రూపొంది కొన్ని నెలలే అయింది. తమ రాష్ట్రంలో ఏడాదికి 1,400 నుంచి 2,000 వరకు కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారు. అయితే దళిత కార్యకర్తలు ఈ సంఖ్య మిగతా రాష్ట్రా లతో పోలిస్తే తక్కువే అంటున్నారు. ఈ చట్టాన్ని దాదాపు ఉపయోగించనే లేదన్నంత స్వల్పంగా, ఒక్క శాతం కేసులే నమోదైతే...అగ్ర కులాలను వేధించడానికి దాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడ? అని దళితుల ప్రశ్న. వేధింపులు అంటే కేసులు పెట్టడమే కాదు, ఆ చట్టం కింద కేసులు పెడతామని బెదిరించడం కూడా. ఏదేమైనా ఇప్పటికీ రాష్ట్రంలో ఈ చట్టంకింద కేసుల విచారణకు తగినన్ని ప్రత్యేక న్యాయస్థానాలే ఏర్పాటు కాలేదు. ఒక కేసును నమోదు చేశారంటే... అది ఆ వ్యక్తిని తాను అమాయకుడినని నిరూపించు కునే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియకు కట్టిపడేస్తుంది. కానీ దాదాపుగా దళితులు ఎవరికీ తమ కేసులను కొనసాగించడానికి సరిపడేటన్ని వనరులు ఉండనే ఉండవు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
నగదు రహిత జీవితం
విశ్లేషణ పెద్ద నోట్ల రద్దు ప్రకటించి దాదాపు నెల రోజులవుతోంది. మీ డబ్బు ఉన్నట్లుండి చిత్తుకాగితంగా మారిపోయింది. మీ ఏటీఎం నుంచి కానీ, మీరు ఖాతా తెరిచిన బ్యాంకు నుంచి కానీ డబ్బు తీసుకోలేరు. నగదు లేని జీవితం విభిన్నంగానూ, భయంకరమైన అసౌకర్యంగాను ఉంటుంది కాబట్టి ఎంతో కొంతల మొత్తాన్ని తీసుకోవడానికి ఎవరైనా ఘర్షించవలసిందే. మీ నిర్ణయం తప్పు అని నరేంద్రమోదీకి చెప్పడానికి కూడా మీరు సిద్ధం. కొద్దికాలంపాటు నగదు లేని జీవితానికి అలవాటుపడిన వారికి మల్లే.. ఉన్నట్లుండి నగదు లేకపోవడం అనే స్థితిని పోల్చలేం. మీ పనిమనిషి, డ్రైవర్, వంటమనిషి, వ్యవసాయ కూలీ, వడ్రంగి, తోలుపనివాడు మొదలైనవారికి నెలలో రెండోభాగం ప్రారంభం అయ్యే సమయానికి పెద్దగా తేడా కనిపించలేదు కాని జీవితం మరింత భారమవడం ప్రారంభమైంది. వారి జీతాలను చెల్లించారు కానీ వారు రూ. 2,000ల బ్యాంకు నోటును ఉపయోగించలేరు. చిన్న నోట్ల కొరత తీవ్రం కావడంతో వారు కోరుకున్న వాటిని ఆ పెద్ద నోటు అందించలేదు. సులభ లావాదేవీలకు రూ. 100, రూ. 50, రూ. 10ల నోట్లు తగినంతగా లేవు. వారి చిన్న చిన్న అవసరాలను ఒకే చోట కొనుక్కోలేరు. వారున్న ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉండే షాపులనుంచే వారు కొంటుంటారు. తమ మొబైల్ బిల్స్‌ని వారు ప్లాస్టిక్ డబ్బుతో చెల్లించలేరు. సేవారంగంలోని ఈ తక్కువ జీతం సంపాదించేవారు ప్రస్తుతం నగదు రహిత స్థితిపై మీ కలవరాన్ని చూసి సంతోషిస్తుంటారు. ఎందుకంటే ప్రతి నెలా 10వ తేదీ తర్వాత వారి చేతుల్లో డబ్బు ఉండటం అనేది అసాధారణ విషయంగానే ఉంటుంది. నెల పొడవునా తగి నంత డబ్బు వారు ఎన్నడూ చూడలేరు. గత వారంలో రూ. 2,000 బ్యాంకు నోట్ల రూపంలో వారికి చెల్లించిన జీతాలు కంటికి కనిపిస్తాయి కానీ అంత సులభంగా వారు ఆ నోట్లను ఉపయోగించలేరు. అది కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ వారెలాగోలా ఓర్చుకుంటారు. ఎందుకంటే వారికి జీవితమంటేనే కష్టాలతో కూడుకున్నది. ఇది మరొక కష్టం మాత్రమే. సాధారణంగా మీకు అప్పులివ్వడానికి వ్యతిరేకించే కిరాణా కొట్టు యజమాని మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును ఆమోదించడానికి సిద్ధపడవచ్చు. వారిలో కొందరు నిర్దయులు ఈ సౌకర్యం కల్పించినందుకు గాను మీ బిల్లుపై 2-3 శాతం రుసుము విధించవచ్చు. అనేక లావాదేవీల్లో పెద్ద నోట్లకు చిల్లర పొందడానికి మీరు అవసరానికి మించి కొనుగోలు చేయవలసి రావచ్చు. మీ అవసరాల కొనుగోలుకు రూ.350లు చాలుననుకుంటే, మీరు రూ. 700లకు కొనుగోలు చేస్తే తప్ప మీకు రూ.1,300ల చిల్లర లభించకపోవచ్చు. జీవితం ఉన్నట్లుండి నూతన సాధారణ స్థితికి చేరుతోంది. తమ ఖర్చులు ఎలా తగ్గిపోయాయి అనే విషయంపై ప్రజలు మాట్లాడుతున్నారు. నవంబర్ నెల అక్టోబర్ నెలలా లేదు. గత నెల తొలి వారం తర్వాత పెద్ద నోట్ల రద్దు ఉనికిలోకి వచ్చింది. డబ్బులు డ్రా చేసి ఎప్పటిలాగే ఖర్చుపెట్టుకున్నారు. కానీ సంకట స్థితి మాత్రం అనుభవంలోకి వచ్చేసింది. చిన్న నాణేలు పిల్లల హుండీల్లోకి వెళ్లిపోయాయి. మీరు రూ.10ల కాగితం ఇచ్చినా సరే.. దుకాణాదారులు దానికి కూడా చిల్లర లేదని చెప్పేస్తున్నారు. మీ ప్యాంట్ జేబులో లేక మీరు పట్టుకెళ్లే బ్యాగుల్లో బరువుగా అనిపించే 1, 2, 5, 10 రూపాయల నాణేలకు ఆ మరుసటి దినమే ఉన్నట్లుండి ఇంత ప్రాముఖ్యత ఏర్పడుతుందని ఎవరు భావించారు? రూ. 2,000లకు తక్కువ విలువ ఉన్న ద్రవ్యాన్ని దేన్నైనా బ్యాంకు అందిస్తోందా అంటే అవి రూ.10 ల నాణేలు మాత్రమే.. అవే ఇప్పుడు గౌరవనీయమైనవిగా మారారుు. ఇవి ఉన్నవారు జాగ్రత్తగా ఖర్చుపెడుతున్నారు. కరెన్సీ నోట్ల సరఫరా ఎప్పుడు మెరుగుపడుతుందో ఎవరికి తెలుసు? ఈ పరిస్థితి మధ్యతరగతి ఖర్చులను తగ్గిస్తోంది. ఇది తాత్కాలికం మాత్రమే. బ్యాంకులు సెల్ఫ్ పేరిట రాసిన చెక్కును గౌరవించాల్సిందే. ప్రజలు కొనుగోళ్లను పూర్తిగా వదిలేయలేదు కానీ వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి కాస్త తగ్గుముఖం పట్టాక, జీవితం యధాస్థితికి రావచ్చు. కానీ చాలామందికి అది గతంలోలాగే ఉంటుంది. ఇంతవరకు బ్యాంకు ఖాతాలు లేని వారు తాము గతంలో జనధన్ బ్యాంకు ఖాతాలు తెరవనందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతుంటారు. అక్రమార్జనపరులు జనధన్ ఖాతాల్లో తమ నగదును బదిలీ చేసి ఉంటే, ఆ నగదు పేదల ఖాతాల్లోనే కొనసాగించేలా చూస్తానని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. జనధన్ ఖాతాల్లోకి వచ్చి పడిన ఈ అదనపు నగదు ఎవరో ఒక పన్ను ఎగవేతదారు అక్రమార్జనే అయి ఉంటుంది కనుక దాన్ని ఖాతాదారులు తిరిగి వెనక్కు ఇవ్వవద్దని మోదీ సూచించారు. కానీ పేదల విషయానికి వస్తే తర్వాత వారికి దక్కే నగదు కంటే ఇప్పుడు వారికి దక్కే నగదే చాలా ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. భవిష్యత్తులో వచ్చి పడే దానికంటే ఇప్పుడు తమ చేతికి దక్కేదాని పట్లే వారికి ఆకర్షణ ఉంటుంది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com -
ప్రజాప్రతినిధులకు గుణపాఠం
విశ్లేషణ రాజకీయాలు, అక్రమార్జన కోసం రాజకీయం చేయడం పౌర జీవితం పాలిట శాపం. అవి నగరాలను, పట్టణాలను జీవింపశక్యం కానివిగా చేశాయి. అక్రమ నిర్మాణాలు, అధ్వానమైన రోడ్లు వగైరాలు ఈ అనర్థాన్ని కళ్లకు కడుతుంటాయి. కొత్త నవీ ముంబై కమిషనర్‌గా నియమితులైన తుకారాం ముండే ఉదయం నడకకు వెళ్లిన ప్పుడు పౌరులు తమ సమస్యలు వినిపిస్తూ ఉంటే నిర్ఘాంతపో వాల్సి వచ్చింది. అధ్వానమైన ఫుట్‌పాత్‌లు, బస్సు సర్వీసులు, నీటి సరఫరా, మురుగు కాలు వలు, చెత్త, మురికివాడలు వగైరా... వారు ఏకరువు పెట్టిన సమస్యలను వార్డు కార్యాలయాలకు లేదా కార్పొరేటర్ల ద్వారా కార్పొరేషన్‌కు చెబితే సరిపోతుంది. కానీ ఎక్కడో ఏదో తప్పు జగిందని అనిపిస్తోంది. ఒకటి, కార్పొరేషన్ ఆ నగరం కోసం లేదా నగర పౌరుల కోసం పనిచేయడం లేదు. ప్రజలకూ, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు మధ్య బంధం తెగిపోయింది. స్థానిక ఎన్నికల్లో నగరం పట్ల చిత్తశుద్ధికి తప్ప భావజాలానికి తావు లేదు. అయినా ప్రజా ప్రతినిధులు వచ్చే మునిసిపల్ ఎన్ని కల్లో నగర సంక్షేమంపైగాక, తమ భావజాలంపై ఆధారపడి ఓట్లు అడుక్కోవడమో లేక కొనుక్కోవడమో చేస్తారని అనిపిస్తోంది. కాబట్టే ముండే రోజువారీ కాలి నడక కాస్తా అధికారిక విధుల్లో భాగంగా మారిపోయింది. పౌర సమస్యల పరిష్కారం కోసం ఆయన చేపట్టిన చర్యలు ఓ అరుదైన పర్యవసానానికి దారి తీశాయి. గత వారంSకమిషనర్‌పై విశ్వాస రాహిత్య తీర్మానానికి అను కూలంగా 104 మంది కార్పొరేటర్లు ఓటు చేయగా, ఆరు గురు మాత్రం ఆయనకు మద్దతు తెలిపారు. ఈ తీర్మా నాన్ని ఆమోదించడంలో అన్ని రాజకీయ పార్టీల కార్పొ రేటర్లు ఒక్కటయ్యారు. అయినా, ఈ తీర్మానం ప్రజాస్వా మిక సంస్థల పరిరక్షణ కోసం చేపట్టిన చర్య అనే వాదనను అంగీకరించను. ఇది నిజానికి, నగర కమిషనర్లు, రాజకీయ వేత్తలు కుమ్మక్కయ్యే తమ పద్ధ్దతుల పరిరక్షణ కోసం చేప ట్టిన చర్య మాత్రమే. ఎనిమిదేళ్ల కంటే తక్కువ కాలంలోనే ఎనిమిది బది లీలను చూసిన కర్తవ్యదీక్షాపరుడైన ఐఏఎస్ అధికారి ముండే... ఈ వ్యవహారం అంతటికీ మూలం ఏమిటనే దాన్ని పట్టుకున్నారు. నిర్దిష్టంగా కేటాయింపులు లేకుండా, స్థూల పద్దుల కింద రూ. 2,000 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. తద్వారా కార్పొరేటర్లకు అనువైన రీతిలో నిధుల మళ్లింపునకు వీలుండేలా చేశారు. మునిసిపల్ చట్టాల ప్రకారం కమిషనర్∙పరిపాలకుడు మాత్రమే, ఇక మేయర్లది నామ మాత్రపు పాత్రే. ముండే నగర పాల కునిగా తన అధికారాలను ఉపయోగించసాగారు. ఐదు నెలల్లో మిన్ను విరిగి మీద పడింది. ఒక స్మారక చిహ్నానికి చలువరాతి తాపడం చేయడానికి రూ. 2 కోట్ల ప్రణాళిక అనవసరమంటూ దాన్ని రద్దు చేశారు. రూ. 167 కోట్ల సోలార్ పార్క్ విషయంలోనూ అదే పని చేశారు. కొను గోలుదారు ఎవరూ లేకుండా దాన్ని చేపట్టడమే అందుకు కారణం. ఆ ప్రాజెక్టు ప్రణాళికలో కొనుగోలుదా రుని వెతికే అంశం సైతం లేదు. కచ్చితమైన చర్యలను చేపట్టడంతో పక్కనే ఉన్న ముంబైలో మునిసిపల్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడిన దృష్ట్యా ముండే కొరతగా ఉన్న నిధులను పౌర సదుపాయాలకు మళ్లించాలని నిర్ణ యించారు. పురపాలక సంస్థలు స్థానిక స్వయం పరిపాలనా సంస్థలు. కాబట్టి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పూర్తిగా పక్కన పెట్టేయడం ప్రజాస్వామ్యంలో జరగదగినది కాదు. కానీ, నగరాన్ని, నగర అవసరాలను తక్కువ ప్రాధాన్యం గలవిగా చూడటం ద్వారా కార్పొరేటర్లు తమంతట తామే ఆ పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. వారు అతిశయాన్ని నేర్చుకున్నారు. తమ నగరానికి సేవ చేయాలనే నిబద్ధతకు బదులుగా తమకు అనువైన ప్రత్యేక ప్రయోజన బృందా లను ఏర్పరచుకున్నారు. చాలా ఇతర నగరాలలో కూడా నవీ ముంబై కనిపిస్తుండటం విచారకరం. ముండేపై విశ్వాస రాహిత్య తీర్మానాన్ని కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఆమోదించకపోవడం, కమిషనర్‌ను మార్చడం జరగకపోవచ్చని సంకేతించడం సంతోష కరం. మునిసిపల్ చట్టాన్ని అనుసరించి కమిషనర్‌ను నియ మించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఎవరిని నియమిస్తారు, ఎంత కాలానికి అనే వాటిని నిర్ణయించేది నగర పాలక సంస్థ కాదు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పట్ల ‘‘గౌరవం’’తో ఉండాలని మాత్రమే ముండేకు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా నగరంపై ఆయన తన దృష్టిని కేంద్రీకరిస్తుండటం వల్ల కార్పొరేటర్ల అహాలు తునాతునకలై పోయాయి. మహారాష్ట్రలో ఇంతకు ముందు కూడా కొందరు కమి షనర్లు ముండేలాగానే ప్రజాప్రతినిధులతో ఘర్షణ పడాల్సి వచ్చింది. కార్పొరేటర్లను దూరంగా ఉంచి నిబంధనల ప్రకారం ముంబై కమిషనర్‌గా పనిచేసిన సదాశివ తినాయ్ కార్, పుణెకు సంబంధించి అరుణ్ భాటియా అలాంటి వారే. టీ చంద్రశేఖర్‌కు థానే నగరం కోసం పని చేసినం దుకు విశ్వాస రాహిత్య తీర్మానం బహుమతిగా దక్కింది. రాజకీయాలు, అక్రమార్జన కోసం రాజకీయం చేయడం పౌర జీవితం పాలిట శాపం. అవి నగరాలను, పట్టణాలను జీవింపశక్యం కానివిగా చేశాయి. అక్రమ నిర్మా ణాలు, అధ్వానమైన రోడ్లు వగైరాలు ఈ అనర్థాన్ని కళ్లకు కడుతుంటాయి, అనుభవంలోకి తెస్తుంటాయి. నగర పాలక సంస్థ లక్ష్యాల ప్రాధాన్యాలను మార్చడమే ముండే చేసిన తప్పు. అంతే. ఇది, ‘ప్రజలు ఎన్నుకున్న ప్రతి నిధులకు గుణపాఠం’. ( వ్యాసకర్త : మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు mail : mvijapurkar@gmail.com) -
‘ముష్కిల్’ చెప్పే పాఠం
విశ్లేషణ మన ప్రజలు తమ అభిప్రాయాలను పాక్ ప్రజలకు నేరుగా తెలపొచ్చు. పాక్‌తో క్రికెట్‌కు నిరాకరణ ద్వారా పాక్షికంగా ఇది జరిగింది. అయితే, పాక్ నటులపై వేటుకు బెదిరింపులు అభ్యంతరకరం. ఒక రాజకీయ పార్టీ ఆ పని చేయడం హేయం. కరణ్ జోహార్ ‘యే దిల్ హై ముష్కిల్’ అక్టోబర్ 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మధ్యవర్తి త్వం వహించి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధి నేత రాజ్ థాక్రేకు, కరణ్ జోహార్‌కు మధ్య శాంతి నెల కొనేట్టు చేశారు. కాకపోతే, థాక్రే కోరినట్టుగా సైనిక సంక్షేమ నిధికి కరణ్ జోహార్, సినీ పరిశ్రమలు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారా అనే విషయంలోనే విభేదాలు న్నాయి. ఏదేమైనా ప్రాయశ్చిత్తంగా ఎంతో తెలియని విరాళం చెల్లింపుతోనే పరిష్కారం కుదిరినట్టు అనిపిస్తోంది. అయితే క్లైమాక్స్ ముగిసిపోలేదు, అదింకా మొదలు కావాల్సి ఉంది. కాబట్టి కథ ఇక్కడే మలుపు తిరిగేది. పాకిస్తానీ నటుడు ఫవద్ ఖాన్ నటించినా గానీ ఆ సినిమాను టిక్కెట్లు కొని చూస్తారా? లేదా? అనేదే సినీ ప్రేక్షకులలో ఎవరు ‘‘దేశభక్తులు’’ లేదా ‘‘జాతీయవా దులు’’ అని తేల్చేది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా, లేదా? అనేదే పాక్ కళాకారులతో సినిమాలు తీయడం లేదా వారిని ప్రదర్శనలకు పిలిచే ధోరణికి వ్యతిరేకులకు నిజమైన పరీక్ష అవుతుంది. గోడ మీద కూచున్న వారిని సైతం వారు సృష్టించిన ప్రజాభిప్రాయం ఆ సినిమాను ప్రదర్శించే థియేటర్లకు దూరంగా ఉంచగలదా? అనేది వేచి చూడాలి. ఆ సినిమాను ‘అనుమతించాలి’ అని ఎంఎన్ఎస్ నిర్ణయించినా, ఒకేS తెర ఉండే థియేటర్లు మాత్రం వెనక్కు తగ్గలేదు. కాగా, మల్టిప్లెక్స్ థియేటర్లు తమ ఆస్తులకు ప్రభుత్వం రక్షణను కల్పిస్తుందనే ఆశా భావంతో ఉన్నాయి. ‘‘ప్రస్తుతం ప్రజల సెంటిమెంటు’’ పాక్‌కు వ్యతిరేకంగా ఉన్నదని ఒక తెర థియేటర్లవారు అంటున్నారు. కానీ, తమ ఆస్తులకు జరిగే నష్టం గురించి గుసగుసలాడుతున్నారు. ఇది, అతిగా జాగ్రత్త వహించడం లేదా సంఘర్షణాత్మక ధోరణిగల ఆ పార్టీ క్యాడర్లలోని దురుసువారి వల్ల ముప్పు ఇంకా ఉండవచ్చని అనుమా నించడం. ఇలా తమ ‘దేశభక్తి’ని, ‘జాతీయవాదా’న్ని బాహాటంగా ప్రదర్శించేది ఎంఎన్ఎస్ ఒక్కటే కాదు. ఒక ధోరణిని నిర్ణయించగల అంశంగా ప్రజాభి ప్రాయం ఎంత బలంగా ఉన్నదనే దానికి కొన్ని సూచికలు న్నాయి. ఉదాహరణకు, పాక్‌కు చైనా మద్దతు పలుకు తోంది కాబట్టి చైనా వస్తువులను బహిష్కరించాలి అనే పిలుపునే తీసుకోండి. ఐరాస ఉగ్రవాద జాబితాలో పాక్ ఉగ్రవాదు లను చేర్చడానికి చైనా ‘‘సాంకేతిక కారణాలు’’ చూపి, అభ్యంతరం తెలిపింది. అది భారత ప్రజల సెంటి మెంటును దెబ్బతీసింది. దాని ఫలితాలను అప్పుడే చూస్తు న్నాం. రాజస్తాన్‌లో చైనా వస్తువుల లావాదేవీలు 40 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. వాటిలో చైనా తయారీ దీపావళి బాణసంచా నుంచి విద్యుత్ దీపాల వరకు ఉన్నాయి. ఢిల్లీ ప్రధాన బాణసంచా మార్కెట్లలో కూడా అదే ధోరణి కనబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే దేశం చైనా వస్తువులన్నింటినీ బహిష్కరించే విధంగా ఇంకా జాగృతం కాలేదు. ఇంకా వాడుతున్న వాటిలో సెల్ఫోన్లు, మొబైల్ చార్జర్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇలా దాదాపు ప్రతిదీ ఉంది. వీటిలో అంతర్జాతీయమైనవి, మరీ కచ్చితంగా చెప్పాలంటే అమెరికన్ లేదా దక్షిణ కొరియా బ్రాండ్ల వస్తువులు కూడా ఉన్నాయి. అయితే ఈ చైనా వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని పెంపొందింపజే యడం ప్రభావాన్ని చూపిందనే అనుకుంటున్నా. అది, చైనా పట్ల ప్రజల్లో ఉన్న అసమ్మతిని వ్యక్తం చేస్తోంది. ప్రజ లకూ గొంతు ఉన్నదనీ, తమకు కావాల్సిన దాన్ని వారు ఎంచు కోగలరని అది అందిస్తున్న సందేశం. పాక్ నటులను తీసుకున్నందుకు బాలీవుడ్‌పై రేగిన ఆగ్రహం కూడా అలాంటిదే. అది, తమ సినిమాల్లోకి పాకి స్తానీలను తీసుకున్న వ్యక్తులకు తప్ప మొత్తంగా సినీ పరి శ్రమను చావుదెబ్బ తీసి సంక్షోభంలోకి నెట్టేసేదేం కాదు. ఇది కూడా, కొంత ప్రాధాన్యం ఉన్న సందేశాన్ని ఇస్తోంది. ఎందువల్లనంటే దేశానికి–దేశానికి మధ్య సంబంధాలకు సంబంధించి, ప్రత్యేకించి పాక్‌తో సంబంధాల విషయంలో ప్రజలకు–ప్రజలకు మధ్య సంబంధాలకు ప్రాధాన్యం ఉన్న దనే వారికి వారు పౌర సమాజంపైన, అధికారిక వ్యవస్థ పైనా బలమైన ప్రభావం చూపగలిగి ఉన్నారు. మరి భారత ప్రజలు తమ అభిప్రాయాలను పాక్ ప్రజలకు తెలి యజేయకూడదా? చేయవచ్చనే అనుకుంటున్నా. ద్వైపా క్షికంగా భారత్‌లో జరగాల్సిన క్రికెట్ కార్యక్రమాల విష యంలో పాక్షికంగా ఇది జరిగింది. పాక్ క్రికెట్ జట్టు ఇక్కడ ఆడటం లేదు. ప్రపంచకప్ తదితర కార్యక్రమాల్లో పాక్‌తో మనవాళ్లు మూడో దేశంలో ఆడు తున్నారు. ఇలా తుపాకీ పేల్చకుండానే సందేశాన్ని పంపగల అవకాశాన్ని వదులు కోకూడదు. అయితే, ఆ లక్ష్య సాధనకు పనిముట్టుగా బెదిరింపు లను పనిముట్టుగా వాడటం ఈ వ్యవహారంలోని చేదు వాస్తవం. జోహార్‌ను ‘‘చితక బాదుతా’’మని ఎంఎన్ఎస్ సినీ విభాగపు నేత ఒకరు బెదిరించారు. జోహార్ సిని మాను ప్రదర్శించాలని యోచిస్తున్న మల్టిప్లెక్స్‌లను తేలి కగా ధ్వంసం చేయొచ్చనే విషయాన్ని వారు గుర్తుంచు కోవాలని ఆ నేత హెచ్చరించారు కూడా. ఒక రాజకీయ పార్టీ ఇలాంటి పనికి పాల్పడటం అతి హేయమైనది. దుర దృష్టవశాత్తూ దేశం అలాంటి సంస్కృతితో సర్దుకుపోవ డాన్ని నేర్చుకుంటోంది. ( వ్యాసకర్త : మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు mail : mvijapurkar@gmail.com) -
నిశ్శబ్దం వెనుకనున్న నిజాలు..
విశ్లేషణ మహారాష్ట్రలో ఈ ఏడాది ఎప్పటిలా కాక, ఏదో తెలియని కొంత భయం ఆవహించింది. 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడిన సందర్భంగా ఆ సంస్థ అధి పతి మోహన్ భాగవత్ నాగపూర్ వార్షిక బహిరంగ సభలో ప్రసంగిం చారు. అంతేకాదు, ఉద్ధావ్ థాకరే ముంబైలో జరిగిన మరో బహిరంగ సభలో శివసేన జన్మదినో త్సవం సందర్భంగా ఉపన్యసించారు. రాష్ట్రంలో మరొక భారీ కార్య క్రమం కూడా జరిగింది. అయితే ఎవరూ దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. అది, హిందూ మతపు అవమానకరమైన అంచులలోని ఆరు లక్షల మంది బీఆర్ అంబేడ్కర్ నేతృ త్వంలో బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భాన్ని సంస్మ రిస్తూ జరిగిన కార్యక్రమం. ఆర్ఎస్ఎస్, శివసేన పుట్టినది విజయ దశమి రోజున. అలాగాక, 1956 అక్టోబర్ 14న ఆ సామూహిక మత మార్పిడి సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్ర మమది. ఈ సామూహిక ప్రజాకార్యక్రమాలకు మీడియాలో చోటు లభించింది. కాకపోతే, ఆర్ఎస్ఎస్, శివసేనలకే అవి చాలా వరకు పరిమితమయ్యాయి. సామూహిక మతమార్పిడి 60వ వార్షిక సంస్మరణ సహా ఈ మూడూ ఒకేసారి వచ్చాయి. ఈ విషయాన్ని మీడియా ఎలా చూసింది అనే దాని వల్ల, వర్తమాన సందర్భం వల్ల ఈ ఏక కాలీనతకు కొంత ప్రాధాన్యం ఉంది. మొదటి రెండిటికీ లైవ్ టీవీ కవరేజీ సైతం లభించింది. అయితే ఎప్పటిలాగే భారీగా తరలి వచ్చిన దళిత సమ్మేళనానికి మాత్రం పాద సూచిక మాత్రపు చోటు మాత్రమే ఇచ్చారు. బౌద్ధ దీక్షా దినమూ, ఆర్ఎస్ఎస్ అధిపతి ఉపన్యాసమూ ఒకే నగరం-నాగపూర్‌లో జరిగాయి. అయినా దళిత కార్యక్ర మాన్ని పట్టించుకోలేదు. మీడియా అలా చెయ్యాలని ముందే అనుకుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. మీడియా దేన్న యినా విస్మరించిందంటే ఆ కార్యక్రమం తక్కువ సందర్భోచి తమైనదనో లేదా దాని ఉద్దేశం, సామీప్యత, లేదా పాఠక జనం ఆసక్తి రీత్యా ఆసక్తికరమైనది కాదనో అర్థం. లేదా అందులో కొత్తదనమేమీ లేకపోయి ఉండాలి. అంబేడ్కర్ అంతటివారు కానీ, అలాంటి వారు కానీ ప్రస్తుతం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయినా ఒక తరం నవ బౌద్ధులు, ఆ తదుపరి తరాల వారు తాము ‘మహామానవుడు’ అని పిలుచుకునే వ్యక్తిని స్మరించుకోవడానికి అక్కడకు వచ్చారు. దళితులు ఎప్పుడూ గమనంలోకి తీసుకోవాల్సిన సమస్య గానే ఉన్నారు. దళితులు అనే ఆ పద మే బౌద్ధానికి వెలుపల ఉన్నవారితో సహా అగ్ర కులాల వేధింపులకు గురయ్యే వారికం దరికీ వర్తిస్తుంది. గతంలో అంబేడ్కర్ కాలంలో జరిగినట్టు గానే, అణచివేస్తున్న కులాల వారిది మోసకారితనమని చెప్పా లని అనుకున్నందుకు ఈ ఏడాది వారు అధ్వాన స్థితిని ఎదు ర్కొంటున్నారు (గుజరాత్లో చూసినట్టుగా). గ్రామాల్లోని పశు కళేబరాలను తీసుకుపోవడం లేదా వాటి చర్మాలను వలవడం చేయరాదని వారు నిశ్చయించుకున్నారు. ఉనాలో గోసంరక్ష కులు తమపై దాడి చేసిన తర్వాతనే అలా చేశారు. ఆ తదుపరి వార్తా నివేదికలు వెల్లువెత్తాయి. పశు కళేబరాలను తొలగిం చడం ఆపేశాక ఆ దళితుల జీవనోపాధి పరిస్థితి ఏమవు తోంది? లేదా రాజుకునే గ్రామాల్లో పరిస్థితి ఏలా ఉంది తెలి యదు. పట్టణం లేదా నగరంలోనైతే మత ఉద్రిక్తతలు రాజు కోడానికి మీడియా ప్రేరేపణ కావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా అతి తేలిగ్గా ఉద్రిక్తతలు రాజుకునే గ్రామాల్లో వివిధ మతస్తుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనే విషయమూ అంతే. నీచమైనదిగా చూసినా, దళితుల సంప్రదాయక బాధ్య తను వారు బహిష్కరిస్తుండటం వల్ల నెలకొన్న పరిస్థితితో అగ్ర కులాలు ఎలా వ్యవహరిస్తున్నాయో.. అగ్రకులాల దృష్టి కోణం నుండైనా తెలుసుకోవాలని బాహ్య ప్రపంచం కోరుకుంటోంది. అదీ తెలియడం లేదు. ఒక మరాఠా బాలికపై దళితులు అని ఆరోపిస్తున్నవారు జరిపిన అత్యాచారాన్ని ట్రిగ్గర్‌గా వాడుకుని మరాఠాలు హఠా త్తుగా ప్రజా ఆందోళనకు దిగారు. తమకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ మొదలుపెట్టిన వారు.. మెల్లగా ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల (నిరోధక) చట్టం, 1989ని నీరుగార్చాలని అన సాగారు. ఆ విషయాన్ని మీడియా చాటింది. ప్రకాష్ అంబే డ్కర్ వంటి దళిత నేతలు ప్రతి ఆందోళనకు దిగకుండా వారిం చినా, దళితులు, ఆదివాసులలో అశాంతి రగులుతోంది. వారు మిలిటెంటు ఆందోళనకు దిగి, అమీతుమీ తేల్చుకోడానికి దిగొచ్చు. అయితే ఆ చట్టాన్ని మరాఠాలు ఆరోపిస్తున్నట్టు ‘‘దుర్వినియోగం కాకుండా నివారించడం కోసం’’ నీరుగార్చే యడం అంత తేలికేం కాదని వారు గ్రహిస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లభించకపోయినా అత్యా చారాల చట్టం వారి పాత సమస్య కాబట్టి ఏవో కొన్ని తాయి లాలు లభించినంత మాత్రాన మరాఠాలు సంతోషపడక పోవచ్చు. 1980లలో మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును అంబేడ్కర్ వర్సిటీగా మార్చడాన్ని మరాఠాలు అంత తేలికగా ఏం తీసుకోలేదు. దళితులు ఆ విముఖతను తమ సొంత అస్తిత్వపు గుర్తింపు కోసం చేస్తున్న కృషికి అడ్డంకిగా చూశారు. రెండు వర్గాల మధ్య విభజన అప్పుడు ముందుకు వచ్చింది. అయితే అది అప్పటి నుంచి లోలోపల రాజుకుంటూనే ఉంది. అందువల్ల ముందు ముందు కొంత సంఘర్షణ తలెత్త నుంది. కానీ అన్ని విషయాల్లోలాగే ఏ సామాజిక సమస్య లోనైనా రాజకీయాలు కలగలిసిపోతాయి. మరాఠాల కోటా డిమాండు లేదా అత్యాచారాల చట్టాన్ని నీరుగార్చడం కావచ్చు లేదా అత్యాచారాల చట్టం కింద తమ ఫిర్యాదులను అధికా రులు విస్మరిస్తున్నారనడం కావచ్చు.. చాలా కాలంగా ఇలా ఆరోపిస్తున్న దళితులు నేడు హఠాత్తుగా తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడం కావచ్చు.. ఏ సామాజిక సమస్యలోనైనా రాజ కీయాలు కలగలిసి పోవాల్సిందే. ఎందుకంటే సామాజిక సమ స్యలను సాధనంగా వాడుకోవడానికి తప్ప రాజకీయాలకు సామాజిక సమస్యలతో ఎలాంటి సంబంధమూ లేదు. మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
‘బంధుత్వ’ భారతం
విశ్లేషణ ఎవరు ఎవరికి ఎంత లంచం చెల్లించడానికి ఇష్టపడతారు అన్నట్టుగానే.. ఎవరు ఎవరికి ఎంత తెలుసు అనే దానిపై ఆధారపడి మన అధికార వ్యవస్థ పనిచేస్తుంది. పంజాబ్‌కు చెందిన ఎస్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు అసాధారణ మైన లెటర్ హెడ్ గురించి కూమీ కపూర్ గత వారం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాశారు. సిద్ధుకున్న పలుకుబడి ఎక్కడిదో ఎవరికీ ఏ అనుమానం లేని విధంగా ‘‘ప్రకాశ్‌సింగ్ బాదల్ (పంజాబ్ ముఖ్యమంత్రి) నిజమైన బావమరిది’’అని ఆ లెటర్‌హెడ్‌పై ఉంది. ఇది విశ్వసనీయమైనదేనని నేను స్వతంత్రంగా రూఢీ చేసుకోలేదు. అయినా ఒక సాదా సీదా విషయాన్ని ఇది విశదం చేస్తుంది. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించి పట్టుబడ్డ సగటు భారతీయుడి విలక్షణమైన ప్రతిస్పందన ‘‘నేనెవర్నో తెలుసా?’’ అన్నదే. నిజానికి ఎవరూ తనంతట తానుగా ఏమీ కానక్కర్లేదు. పేరుప్రతిష్టలుండి, పలు కుబడిని ప్రయోగించగలిగిన మరొకరు తెలిసి ఉంటే సరి. ఆశ్రితపక్షపాతం అంటేనే బంధుత్వం లేదా అనుబంధం కారణంగా లబ్ధిని పొందడం. కాకపోతే ‘‘నకిలీ’’ బావమరిది కూడా ఉండొచ్చు కాబట్టి, ఇక్కడ ‘‘ నిజమైన’’ అనడం ఆ బంధుత్వాన్ని చక్కగా మెరుగుదిద్దింది. మరెవరైనా కాపట్యంతో ఆ బంధు త్వాన్ని కట్టబెట్టుకోవాలని చూస్తే తప్ప, ఎవరైనా బావమరిది కావచ్చు లేక కాలేకపోవచ్చు. కానీ సీఎం బావ మరిది అనే బంధుత్వ బంధాన్ని నొక్కి చెప్పడమంటే ముఖ్యమైనది తాను కాదు, తన బంధువని చెప్పు కోవడమనే అర్థం. యశోదాబెన్ మోదీకి విజిటింగ్ కార్డు ప్రింట్ చేయించుకోవాల్సిన అవసరం వచ్చి, దానిపై నేటి ప్రధాన మంత్రి భార్య అని అచ్చేయించుకున్నారని ఊహించుకోండి. వైవాహిక జీవితానికి దూరంగా ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఇప్పుడామె ఆ పనిచేస్తే హాస్యాస్పదం అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఆమె తెలుసు. అసలు మోదీ ప్రధానిౖయెన తర్వాతనే వారి వివాహ బంధాన్ని తెరపైకి తెచ్చారు. ఎవరో ఒకరికి బంధువు కావడం లాభకరమే కాదు, తల బరువు కూడా. అడక్కపో యినా అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. అన్నిటికి మించి ప్రభుత్వ, ప్రైవేటు ముఖ్య కార్యాలయాలన్నిట్లోకి అది ప్రవేశ మార్గం అవుతుంది. అయితే అది ఆ రాజకీయ సంబం ధంపై ఆధారపడి ఉంటుంది. అంటే రాజకీయ పదవులు వారికి సులువుగా వారసత్వంగా సంక్రమించడమే. రాజకీయాల్లో అలాంటి ఉదాహరణలు ఎల్లెడలా కనిపిస్తాయి. ములా యంసింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీనే తీసుకోండి. ఆ పార్టీలో మంచి పలుకుబడిగల అమర్‌సింగ్ ‘‘బయటివాడు’’. సోదరుడు, కొడుకు, కోడలు అంతా ప్రజా ప్రతినిధులు. కాకపోతే దూరపు సంబంధం లేదా బంధుత్వం ఉన్నంత మాత్రానే పనులు జరిగి పోతాయని అనుకుంటేనే అది తలబరువు అవుతుంది. ఎవరు ఎవరికి ఎంత లంచం చెల్లిం చడానికి సుముఖంగా ఉంటారన్నట్టుగానే.. ఎవరు ఎవరికి ఎంత తెలుసు అనే దానిపై ఆధారపపడే మన భారత అధికార వ్యవస్థ పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఆ ‘తెలియడం’ అనేది అధికారిక పదవుల్లో ఉన్న వ్యక్తికి బంధువుగా ఉన్న వారికి ఎక్కువగా అనుకూల మైనది. అయితే భార్య తరఫు వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కావాలంటే బిహార్ లోని రబ్రీదేవిని అడగండి. ఆమెకు సోదరుడైనందుకు అనిరు«ద్ ప్రసాద్ (సాధుయాదవ్) కు కొంత ఊరట కలిగించే మేలు జరిగింది. ఆయన పార్టీని వీడాల్సి రావడమే కాదు, 2014 ఎన్నికల్లో రబ్రీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఆమె మరో సోదరుడు సుభాష్ యాదవ్ కూడా పార్టీ మారారు. బావమరిది కావడమే ఎప్పుడూ సరిపోదు. లాలూ ప్రసాద్ పిల్లలు ఎప్పుడైనా అలా చేయగలరా... ఊహించండి. సంబంధాలను ఉపయోగించుకుని పనులు జరిపించుకోవడం మన వ్యవస్థలో సాధా రణమే. హక్కులు, బాధ్యతలకు సంబంధించిన విస్పష్టమైన ఏర్పాట్లున్నప్పటికీ చట్టబద్ధ మార్గమెప్పుడూ ఎంచుకోదగిన సరైన మార్గం కాదనే నేటి విశ్వాసం. ఆ మార్గం ఎప్పడూ కష్టభరితమైనదే. మరోమార్గం, ఏ స్థాయిలోని వారైనా పర్వాలేదు, అధికారం ఉన్నవారితో బంధుత్వం ఉన్న ఎవరినైనా ఆశ్రయించడమే ఉత్తమం. మంచి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి, మీరే తనకో తలనొప్పి అవుతారని భావిస్తే తప్ప అదే శ్రేయస్కరం. (వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : mvijapurkar@gmail.com) -
పేదలు మనుషులు కారా?
అధికారిక వ్యవస్థ మాత్రమే కాదు.. సమాజంలో భాగమై ఉంటున్న మనం కూడా దేశంలోని నిస్సహాయుల వెతలపట్ల స్పందించడం లేదు. పేదలు ఇక్కడ మనుషులు కారు. వారు ఆత్మ లేని సంఖ్యలు మాత్రమే. ఆదాయాల్లో అసమా నత్వం అనేది ఒక ప్రపంచ వ్యాప్త దృగంశం అనే చెప్పాలి. ఉదాహరణకు ఒకరు సంపదతో కంపు గొడుతున్నప్పటికీ మరొ కరు నిరుపేదగా ఉండని విధంగా యూరప్‌లో కొన్ని దేశాల జీవన ప్రమా ణాలుంటున్నాయి. జాతి వివక్షాపరమైన కొన్ని పక్ష పాతాలు ఉంటున్నప్పటికీ మనం చూస్తున్న మేరకు, ఆ దేశాలలో వ్యక్తులతో వ్యవహరించే పద్ధతిలో ఒక సమానతా భావం ఉంటోంది. కానీ పేదలను మనుషులుగా చూడకపోవడం భారత్‌లో మనం చాలా స్పష్టంగా చూస్తుంటాము. పురాతన నాగరికతా ప్రాతిపదికన మనది ఆధునిక దేశంగా మనకు మనమే పిలుచుకుంటున్నప్పటికీ, పేదలను మనం ప్రాణంలేని జడ పదార్థాలుగా చూస్తూనే ఉన్నాం. చివరకు చావులో కూడా ఈ రెండు వర్గాల ప్రజల మధ్య వ్యత్యాసం ఉంటోంది. సంప న్నుడు చనిపోతే చక్కగా అంత్య క్రియలు జరగడమే కాదు.. ఆ కమ్యూని టీకి చెందిన మూలస్తంభం కుప్ప గూలిపోయినట్లు భావిస్తుంటారు. అదే పేదల విషయంలో అయితే వారు బికారి స్థాయి అంత్యక్రియలకు కూడా నోచుకోలేరు. వీరు చెట్టు మీంచి రాలిపడి, కాలికింద నలిగిపోయే ఆకులా కనిపిస్తుంటారు. మీరట్‌లో ఒక మహిళ చనిపోయిన తన పిల్లవా డితో పాటు రాత్రంతా ఆసుపత్రి వెలుపల గడ పాల్సి వచ్చింది. ఎందుకంటే జిల్లా సరిహద్దులను దాటడానికి అంబులెన్సులకు అనుమతి లేదు. నిబం ధనలు అడ్డొచ్చాయన్నమాట. అదే సంపన్నులు లేదా మధ్యతరగతి వ్యక్తులు ఇలాంటి సందర్బాల్లో ప్రైవేట్ అంబులెన్స్‌ని కిరాయికి తీసుకుంటారు లేదా డ్రైవర్‌కు లంచమిచ్చి పని జరిపించుకుం టారు. ప్రైవేట్ వాహనం అంటే ఒక ట్రిప్పుకు రూ.2,500లు చెల్లించుకోవల్సిందే. కాన్పూర్‌లో అయితే వ్యాధిగ్రస్తుడైన తండ్రిని ఆసుపత్రిలో ఒక విభాగం నుంచి మరొక విభా గానికి తీసుకుపోవడానికి కనీసం స్ట్రెచ్చర్ని కూడా ఇవ్వలేదు. చివరకు కుమారుడి భుజాలమీదే అతడు చనిపోయాడు. ఇక ఒడిశాలో అయితే ఒక వ్యక్తి చని పోయిన తన భార్యను స్వస్థలం తీసుకెళ్లడానికి 12 కిలోమీటర్ల దూరం ఆమె శవాన్ని మోసుకెళ్లాడు. ఇక్కడా ఆసుపత్రి అతడికి వాహనం కేటాయించ లేదు. మరొక కుటుంబాన్ని మధ్యలోనే వాహనం లోంచి దింపేయటంతో చనిపోయిన వ్యక్తిని మోసు కుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అంబు లెన్స్‌లో బతికి ఉన్న వ్యక్తి చనిపోతే వారిని గమ్య స్థలం చేర్చడం దాని బాధ్యత కాదన్న మాట. ఇలాంటి ఘటనలు వార్తలైనప్పుడు అధికార వర్గాలు సంజాయిషీతో సరిపెట్టుకుంటాయి. ఒక కేసులో మృతుడి బంధువు కాస్సేపు కూడా వేచి ఉండలేక శవాన్ని ఆదరా బాదరాగా తీసుకెళ్లాడని అధికారులు చెప్పారు. కానీ వాహనం కోసం గంట వేచి ఉండటం కంటే 12 కిలోమీటర్లు నడవటం ద్వారా వారికేం మేలు జరిగినట్లు? అధికారుల చవక బారు వాదనలు ఈ ఘటన సందర్భంగా ప్రదర్శిం చిన అగౌరవాన్ని, అనాదరణను సరిదిద్దలేవు. పోస్ట్‌మార్టమ్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఒడిశాలోని మరో ఆసుపత్రిలో 80 ఏళ్ల వృద్ధ మహిళ శవం నడుం విరగ్గొట్టారు. తర్వాత వారు ఆమె దేహాన్ని ఒక కర్రకు కట్టి మోసుకెళ్లారు. అలాంటి ఘటనల్లో అధి కారిక వ్యవస్థమాత్రమే స్పందనా రాహిత్యాన్ని ప్రదర్శించటం లేదు, సమాజంలో భాగమై ఉంటున్న మనం కూడా నిస్సహా యుల వ్యథల పట్ల స్పందించడం లేదు. మధ్యప్రదేశ్‌లో భార్య శవాన్ని దహనం చేయడానికి తగినన్ని డబ్బులు లేకపోవ డంతో అతడిని వెనక్కు పంపించేశారు. భార్య శవదహనంకి తను చెల్లించలేనంత రుసుమును ఆ పంచాయతీ డిమాండు చేయడంతో అంత్యక్రియల కోసం ఆ భర్త చెత్తను ఏరుకోవలసి వచ్చింది. తమిళనాడులోని ఉలుందుర్పేటలో బాధిత కుటుంబానికి శవదహనం కోసం మంజూరైన రూ.12,500లను విడుదల చేయడం కోసం రెవెన్యూ అధికారులు అడిగిన లంచాన్ని చెల్లించడా నికి మృతుడి కుమారుడు, మరి కొందరు యువ కులు బిక్షాటన చేస్తూ కొత్తపద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలెన్నో వెలు గులోకి రాకపోయి ఉండవచ్చు. మీడియా ఇలాగే స్పందించేటట్లయితే, మన దేశంలో పేదల పట్ల ప్రదర్శిస్తున్న క్రూర, అమాన వీయ వైఖరికి చెందిన పలు కథనాలు ఇంకా వెలు వడుతూనే ఉంటాయి. పేదలూ మనుషులే. కానీ వారిని గణాంకాల్లో ఉపయోగించడానికి ఆత్మలేని సంఖ్యలుగా మాత్రమే చూస్తుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన దారిద్య్ర రేఖకు ఎగువన ఒక్క రూపాయి అధికంగా వ్యక్తుల ఆదాయాలు ఉన్నట్లయితే, అతడు లేక ఆమె ఇక పేదవర్గంలో భాగం కారు. కానీ వారి జీవితాల్లో మాత్రం అణుమాత్రం తేడా ఉండదు. మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్ : mvijapurkar@gmail.com -
తీర్పులపై తిరస్కారం
విశ్లేషణ కృష్ణాష్టమి సందర్భంగా జరుగుతున్న దహిహండి కార్యక్రమాలు రాజకీయ ప్రదర్శనగా మారిపోయాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణుడు వెన్న దొంగిలించాడే కానీ విదూషక పాత్ర పోషించలేదన్నది. న్యాయ విచారణను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురైనప్పుడు సాధా రణంగా మన రాజకీయ నేతలూ, పార్టీలూ తమకు న్యాయ వ్యవస్థ అంటే ఎనలేని విశ్వాసం ఉం దని, తీర్పుకోసం వేచి ఉంటా మని చిలక పలు కులు వల్లిస్తుంటారు. కానీ కోర్టు ఎదుట హాజరు కావడానికి ముందు కూడా వారు న్యాయస్థానాన్ని ఏమాత్రం ప్రశ్నించలేకపోతున్నందున వీరి చిలక పలుకులు ఇప్పుడు మీడియా ముందు గొట్టిమాట లుగా కనిపిస్తున్నాయి.తీర్పు నేతలకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా, ఇప్పటికీ తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని మాట్లాడుతూనే వారు అప్పీలుకు ప్రయత్ని స్తారు. కానీ షా బానో కేసు వంటి ఉదంతాల్లో న్యాయవ్యవస్థ తీర్పులను మొదట ఒక ఆర్డినెన్సు ద్వారా, పార్లమెంటు తోసిపుచ్చుతూ ఉంటుంది. తర్వాత ఆ తీర్పును పూర్తిగా వెనక్కు మళ్లించే పాత్రను శాసనాధికారం పోషిస్తుంది. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు (దహిహండి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ల ఎత్తు 20 అడు గులకు మించి ఉండరాదని, 18 ఏళ్లలోపు వయస్సు వారు ఆ పిరమిడ్లలో భాగం కాకూడదని బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీ వల ఎత్తిపట్టినప్పుడు మహారాష్ట్రలో దాదాపు ఇలాగే జరిగింది.తీర్పు వెలువడగానే, మహారాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి దహిహండి కార్యక్రమం ఒక సాహస క్రీడ అంటూ తీర్మానం జారీ చేసింది. కాని సాంప్రదాయం ప్రకారం ఇది మతపర కార్యక్ర మంగా ఉన్నందున అలాంటి పరిమితులు మనోభా వాలను గాయ పర్చవచ్చని అదే రోజు ప్రారంభంలో ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఇది రెండు నాలి కల వ్యవహారమే కాకుండా న్యాయ ప్రక్రియకు ఎంతో దూరం జరుగుతుంది కూడా. అయితే అనూహ్య పరిణామం ఏమంటే, కోర్టు తీర్పును అత్యంత పరిహాసాస్పదంగా తోసిపుచ్చిన ఘటన చోటు చోసుకోవడమే. రాజ్‌థాకరే నేతృ త్వంలో శివసేన నుంచి చీలివచ్చిన మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన కోర్టు తీర్పును ధిక్కరించాలని నిర్ణయిం చుకుంది. మనిషిపైన మనిషిని ఎత్తుగా నిలబె డుతూ సాగే ఈ క్రీడ కు ప్రధాన కేంద్రంగా ఉన్న థానేలో జరిపిన భారీ కార్య క్రమాన్ని అడ్డుకునేవారే లేకపోయారు.న్యాయవ్యవస్థ తీర్పులను గౌరవించడం అంత రించిపోతున్న స్థితిలోకి దేశం వెళ్లిపోతుందా అనే సీరియస్ చర్చకు ఇది దారితీయాలి. అత్యున్నత న్యాయస్థానంలో ఇలాంటి చర్యకు వ్యతిరేకంగా ఈప్పీల్ చేయడానికి బదులుగా స్వార్థపర శక్తులు ఆ తీర్పును ప్రతి ఘటించే లేదా ధిక్కరించే మార్గాన్ని ఎంచుకున్నాయి. కానీ పార్టీలు ఈ అపరాధం నుంచి తప్పించుకోలేవు. బంద్‌పై నిషేధాన్ని ధిక్కరించిన శివసేకు బాంబే హైకోర్టు గతంలో జరి మానా విధిం చింది కూడా. ప్రధానంగా రాజ్‌థాకరే నిర్ణయం వల్లే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ధిక్కారానికి గురైంది. కోర్టు తన తీర్పు ప్రకటించిన గంటల్లోపే రాజ్‌థాకరే దాన్ని మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ అభ్యంతరం చెప్పారు. తిరస్కారం ఎంత పతాక స్థాయికి వెళ్లిందంటే ఉట్టి కొట్టే ఒక గోవిందుల బృందం ముంబైలో 40 అడుగుల ఎత్తు తాకేలా 11 అంతస్తుల మానవ పిరమిడ్‌ను నిర్మించేసింది. ఇది ఒకానొక ఘటన మాత్రమే కాదు. చాలా మంది కోర్టు ఆదేశాన్ని ధిక్కరించడానికే నిర్ణయించు కున్నారు. ఇక అధికారులు దాన్ని అడ్డుకునేందుకు బదులుగా అలాంటి ఘటనలను వీడియో తీసి ఊర కుండిపోయారు. ఇకపోతే థానే, ముంబై పురపాలక ఎన్నికల్లో శివసేనను అధిగమించి అధికార పగ్గాలు స్వీకరించాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ విష యంలో ప్రజాగ్రహానికి గురికావలసి ఉంటుందనే భీతితో మౌనంగా ఉండిపోయింది. ఉట్లు కొట్టడానికి సంబంధించిన ఈ దహి హండి కార్యక్రమాలు మత పరమైన సాంప్రదా యంగా కాకుండా రాజకీయ ప్రదర్శనగా మారి పోయాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై వ్యాఖ్యా నిస్తూ బాల కృష్ణుడు కొంటె చేష్టలకు పాల్పడి వెన్న దొంగిలించాడు తప్పితే విదూషక పాత్ర పోషించ లేదని ఎత్తి చూపింది.ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయనేతలే కీలక ఆర్గనైజర్లుగా ఉంటున్నారు. ఉట్ల ప్రదర్శనను నిర్వహిస్తున్న వీరికి చెందిన ట్రస్టులు మతపరమైన పండుగ అనే విశ్వాసం ఇప్పుడు పెద్ద ప్రదర్శన స్థాయికి చేరిందని మాట్లాడుతున్నాయి. అయితే దాని మూలాలు మతంలోనే ఉండవచ్చు కానీ బాల దేవుడి కొంటె చేష్టలను కొత్తగా అనుకరిస్తున్నప్పుడు అది పూర్తిగా మరో రకంగా కనిపిస్తూండటం గమనార్హం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేశ్ విజాపుర్కార్ ఈమెయిల్ : mvijapurkar@gmail.com -
మట్టికాళ్ల మహా నగరాలు
ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవన్నీ పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి చేరుతాయి. రవాణా, రోడ్లు, పాద చారుల బాటలు, మార్కెట్లు ఇలా దాదాపు ప్రతిదీ సమస్యాత్మకమే. ఈ ఫిబ్రవరిలో లాతూరులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో మన రైల్వేలు మీరజ్ నుంచి 100కు పైగా నీటి రైళ్లను నడి పాయి. తర్వాత, హఠాత్తుగా శుభవార్త వచ్చింది. వానలు కురిసి లాతూరు మంచినీటి అవసరాలను తీర్చే రెండు నీటి వనరులు పూర్తిగా నిండాయి. నీటి సంక్షోభం ‘దాదాపుగా ముగిసి పోయింది’ అని మునిసిపల్ అధికారులు ఆనందంగా చెప్పారు. నీటి ఎద్దడి ఆ నగరపు సామాజిక, ఆర్థిక జీవి తాన్ని కల్లోలపరిచింది. దీంతో తిరిగి ‘సాధారణ’ జీవితం గడపవచ్చని అంతా అశగా ఎదురు చూశారు. అయితే ఈ ‘శుభవార్త’కు మరో భయపెట్టే కోణం కూడా ఉంది. ‘‘15 రోజులకు ఒకసారి చొప్పున అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా కావడం ప్రారంభం అవు తుంది. ‘ఇది ఇంతవరకు అనుసరిస్తున్న పద్ధతి, లాతూరువాసులు దీనికి అలవాటు పడ్డారు. రెండు గంటలకుపైగా నీటిని సరఫరా చేస్తాం. ఆ నీటిని ప్రజలు ఇళ్లలోని చిన్న ట్యాంకులలోనూ, పాత్రలు, తదితరాలలో దాచుకుంటారు. ఆ నీరు 15 రోజులకు సరిపోతుంది’ అని పౌర పరిపాల నాధికారులు తెలిపారు’’ అని ఇండి యన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. రెండు వారాలకు ఒకసారా? అది సాధారణమా? తాగడానికి, కడగడానికి, ఉతకడా నికి, మరుగుదొడ్లలో వాడడానికి 15 రోజులకు సరిపడా నీటిని నిల్వచేసుకోగా ఇళ్లలో మిగిలే స్థలం ఎంతో ఊహించండి. తీవ్ర పారిశుద్ధ్య సమస్యతో లాతూరు నగరం మునిగిపోకుండా మిగిలి ఉండటమే ఆశ్చర్యం. ఈ విషయం రెండు అంశాలను ప్రతిఫలిస్తోంది. ఒకటి, పట్టణ నిర్వహణా ప్రమాణాలు అధమ స్థాయిలో ఉన్నాయి. భారతదేశం పట్టణీకరణ చెందడం వల్ల పెరు గుతున్న జనాభాకు అనుగుణంగా సేవలు పెరగడం లేదు కాబట్టి ప్రమాణాలు మరింతగా దిగజారుతు న్నాయి. రెండు, పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుం దని ప్రజలు ఆశించడం లేదు. మెరుగుపరచమని అధికా రులపై ఒత్తిడి తేవడం లేదు. అధికారులు, ప్రణాళికా వేత్తల నిర్లక్ష్యం, పౌరుల నిస్సహాయత కలసి దేన్నయినా సహించడంగా మనకు కనబడుతోంది. ఆవశ్యక సేవల న్నిటినీ పూర్తిగా అందించలేకపోతున్నా మనం మన పట్ట ణాలను, నగరాలను నిర్మాణంలో ఉన్నవిగా చూస్తుం డటం విచిత్రం. ఢిల్లీకి బస్తీలున్నాయి, ముంబైకి మురికి వాడలున్నాయి, అంత కంటే చిన్న పట్టణాలకు సైతం వాటికి తగ్గ మురికి ఉంది. ఈ మురికివాడలకు బయట ఉండే అస్తవ్యస్త పరి స్థితులు సుపరిచితమైనవే... మరీ ఘోరమైన రోడ్లు, నాణ్యతాపరంగా, పరిమాణంపరంగా కూడా అధ్వాన నీటి సరఫరా, నామమాత్రపు వీధి దీపాలు, కాలువ లు, నోళ్లు తెరిచి ఉండే మ్యాన్‌హోల్స్. నగరంలో ఏం ఉంటా యని ఆశిస్తారో అవేవీ నగరాల్లో కనబడవు. పట్టణంలో లేదా చిన్న పట్టణంలోనైనా పరిస్థితి ఇదే. గ్రామాలు పట్టణాలుగా, ఆ తదుపరి నగరాలుగా వృద్ధి చెందుతాయి, మునిసిపల్ కౌన్సిల్స్ కార్పొరే షన్లుగా ఉన్నత స్థాయికి చేరుతాయి. అయినా భూగర్భ నీటి పారుదల మార్గాలు మాత్రం ఉండవు. ఉన్నా, తగు రీతిలో ఘన వ్యర్థాల నిర్వహణ ఉండదు. ఈ పట్టణ ప్రాంతాలలోనే ఢిల్లీ బస్తీలు, ముంబై మురికివాడల వంటినిర్లక్ష్యానికి గురైన అథోఃప్రపంచాలూ ఉంటాయి. అయినా మన సింధూ నాగరికత ఎంతగా అభివృద్ధి చెందిన దో చెప్పుకుంటాం. ఆ నగరాల్లో ఎప్పుడూ పారే నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంకుడు గుంతలు ఉండేవని మరచిపోతాం. పట్టణవాసులు ఈ అల్పస్థాయి ప్రమాణాలను ఎందుకు అంగీకరిస్తున్నారు, ఏళ్ల తరబడి ఈ సమస్యలు సలుపుతుండటాన్ని, మరింతగా దిగజారిపోతుండ టాన్ని ఎందుకు అనుమతిస్తున్నట్టు? నీరు పునరుత్పాద కమైనదే అయినా ఆ నీటి వనరును కనుగొని, సక్ర మంగా సంరక్షించి, సమర్థవంతమైన ఉపయోగకం కోసం తగు రీతిలో వాడుకోవాల్సి ఉన్నది, నిజమే. అయితే, ఎప్పుడో ఒకసారి ఆ వనరుకు కొరత ఏర్పడు తుంది లేదా వినాశకరమైనంత ఎక్కువగా వచ్చిపడు తుంది. కానీ కాలువలు, పారిశుద్ధ్యం మాత్రం ప్రకృతిపై ఆధారపడినవి కావు. మన పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి దాదాపుగా ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవి అన్నీ చేరు తాయి. రవాణా, రోడ్లు, పాదచారుల బాటలు, మార్కెట్లు ఇలా ప్రతిదీ సమస్యాత్మకమే. ఈ మౌలిక సదుపాయాలు కొరవడినా ‘స్మార్ట్ నగరాలు’ అని మాట్లాడటం హాస్యాస్పదం. అయినా ఈ మట్టి కాళ్లతోనే మన తలలను నక్షత్రాల మధ్య నిలపగల మని విశ్వ సిస్తాం. రెండు వారాలకు ఒకసారి నీటి సరఫరా ‘సాధా రణం’ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ( వ్యాసకర్త: మహేశ్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు) ఈ మెయిల్ mvijapurkar@gmail.com -
అనర్హులలో ఓ టాపర్..!
విశ్లేషణ అర్హత లేకున్నప్పటికీ బిహార్‌లో 12వ తరగతి పరీక్షల్లో టాపర్ల జాబితాలో చోటు సాధించిన విద్యార్థులలో ఒకరి అరెస్టు వ్యవహారం తీవ్ర సమస్యగా పరిణమించింది. జ్ఞానుల్లా నటించ డంతో పాటుగా, చదు వుపట్ల మొగ్గుచూపని వీరు ఈ కుంభకోణానికి పాల్పడిన ముఠా సభ్యులేనా? బిహార్ రాష్ట్ర విద్యా మండలి అధిపతి లోకేశ్వర్ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా, ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాసిన కళాశాల ప్రిన్సిపల్ ఈ ఉదంతంలో అరెస్టు కావడాన్ని ఎవరైనా అవగతం చేసుకుంటారు. ఇంతవరకూ అరెస్టయిన 20 మంది విద్యా ర్థులు కోర్టుద్వారా నాన్ బెయిలబుల్ వారంట్ కూడా అందుకున్నారు. పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులపై రహస్య పరిశోధన నిర్వ హించిన ఒక టీవీ చానెల్.. ఆ విద్యార్థులు సాధా రణ ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేకపోయారని కనుగొన్నది. ఇది బట్టబయలు కావడమే పెద్ద అవ మానకరమైన విషయం కాగా, ఆ విద్యార్థులు వంచనకు బలైనవారిగా తప్ప మరోలాగా కనిపిం చడం లేదు. వారికి లభిస్తున్న ప్రచారం వెలుగులో వారి దోషం బయటపడటం లేదు. ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు ఒక దళారీని పట్టుకుంటారు. విద్యార్థులు అగ్రస్థానం పొందడానికి మార్కులను అధికంగా వేసేందుకు అంగీకరించే ఒక మూల్యాంకన పర్యవేక్షకులు కూడా ఉండే ఉంటారు. ఆ ఎవరో ఒకరిలో చాలా వరకు తల్లిదండ్రులే ఉండి ఉంటారు లేదా, పరీక్షా పత్రాలను దిద్దిన మందమతులతో పాటు టాప్ ర్యాంకుకు బదులుగా ఫెయిల్ కావలసిన తప్పు దారి పట్టిన విద్యార్థులు కూడా ఉండే ఉంటారు. చూసీచూడనట్లు వదిలేసిన టీచర్లు, ప్రిన్సిపల్స్‌ని కూడా మరికొన్ని స్టింగ్ ఆపరేషన్లు ప్రదర్శించాయి. ఈ కుంభకోణం విస్తృతరూపంలో కనిపిస్తోంది. బిహార్ రాష్ట్రంలోని తల్లిదండ్రులు తమ పిల్లలు కాపీ కొట్టడానికి వారికి సమాధాన పత్రాలు సరఫరా చేసే విషయం జగమెరిగిన సత్యమే. అక్కడ పరీక్షలను పర్యవేక్షించే ఉపాధ్యాయులు ప్రమాణాలను పాటించరు లేదా ఉపేక్ష ప్రదర్శిస్తుం టారు. ఇదంతా నిజాయితీగా కష్టపడకుండానే రివార్డులకోసం ప్రయత్నించే వ్యవస్థకు సంబంధిం చిన కుతంత్రాన్నే చూపిస్తుంది. విద్యార్థులు కూడా దీంట్లో భాగమే. ఈ దఫా టాపర్ కుంభకోణంలో డబ్బు కూడా తనవంతు పాత్ర పోషించినట్లుంది. పదోతరగతి పరీక్షల్లో పాసయిన వారి శాతాన్ని 39.5 నుంచి 72.25 శాతానికి పెంచడానికి పంజాబ్ విద్యామండలి దాదాపు లక్షమంది విద్యా ర్థులకు 27 గ్రేస్ మార్కులను అనుగ్రహించింది. ఇంతకుముందు సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్తీర్ణతా శాతం 48.22 నుంచి 65.21కి పెరిగింది. పాస్ అయిన విద్యార్థుల నాణ్యతను కాకుండా గణాంకాలను మెరుగుపర్చడానికి ఇదొక దిగ్భ్రాం తిపర్చే మార్గం. అధికారికంగానే విజయాల మరీ చికలను ఇలా సృష్టించారు. ఇలాంటి విద్యార్థులు పేలవమైన విద్యనే పొందుతారు కాబట్టి దీర్ఘ కాలంలో నష్టపోయేది వీరే. ఈ విషయంలో బిహార్‌ది ఒక నేరపూరిత ఉదంతం కాగా, పంజాబ్‌ది మాత్రం నాణ్యతకు నీళ్లువదలి రాష్ట్ర ఉత్తీర్ణతా గణాంకాలను మెరుగుప రచడానికి సంబంధించింది. తదుపరి విద్యాస్థా యితో అంటే ఈ సందర్భంలో జూనియర్ కాలే జీలో పోటీపడటం చాలా కష్టమయ్యేలా, విద్యార్థు లకు పూర్తి హాని కలిగిస్తున్న ఈ వ్యవహారం గురించి ఎవ్వరూ ఏమీ ఆలోచించడం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే పిల్లలతో పాటు మోసపో తున్నదెవరు? సందేశం చాలా స్పష్టంగానే ఉంది. ‘భయపడవద్దు బేటా, నీ లోపాలకు మేము అడ్డు కట్ట వేయడమే కాకుండా కృత్రిమంగా నీకు మెరు గులు దిద్దుతాం కూడా’. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాక, నోట్‌బుక్‌ల నుంచి యూనిఫాంల వరకు ప్రతిదీ సంబంధిత స్కూల్ నుంచే తప్పక కొనాలని తల్లిదండ్రులకు యాజమాన్యాలు చెబుతున్నట్లు చిత్రించిన ఒక కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడి యాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఇక్కడ కూడా డబ్బుపరమైన ప్రయోజనం దాగి ఉంది. మరి ‘చదువు మాటేమిటి’ అని తల్లిదండ్రులు అడిగినప్పుడు, ‘స్కూల్ బయట ట్యుటోరియ ల్స్‌లో చేర్పించండి’ అనే సమాధానం వస్తోంది. అలాంటి ట్యూషన్లను భారీ ఫీజులతో అంది స్తున్నవారు నగర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. వీరు పాఠశాలలు తమ ప్రధాన బాధ్యతలనుంచి తప్పుకోవడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ తరహా ట్యుటోరియల్స్ ఏదైనా సబ్జెక్టులో బలహీనంగా ఉండి సహాయం అవసరమైన విద్యా ర్థికి తోడ్పడకపోగా, రెగ్యులర్ వర్క్‌షాపు లను నిర్వహిస్తుంటాయి. ఇక్కడ ఇతరులతో పోటీ పడేం దుకు గంటలకొద్దీ సమయాన్ని విద్యార్థులు వెచ్చిం చాల్సి ఉంటుంది. సాధారణంగా మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ కోర్సులకోసం లేదా ఐఐటీల్లో ప్రవేశా నికి కష్టపడుతున్న విద్యార్థులు వీటిలో చేరుతుం టారు. ఒక సబ్జెక్టులో వెనుకబడి ఉండే విద్యార్థు లను ఇవి విస్మరిస్తుంటాయి. ఇలాంటి వారు ఫలి తాలను సాధించలేక వెనకబడిపోతారు. ట్యుటోరియల్స్ అనే దినదిన ప్రవర్థమాన మవుతున్న పరిశ్రమ కోసం తల్లిదండ్రుల అర్ధాంగీ కారం ఒక వ్యక్తీకరణగా ఉంటోంది. ఉదాహర ణకు రాజస్థాన్‌లోని కోట గుర్తుకొస్తుందా? ఇక పాఠశా లలు గేటు ముందు బోర్డుతో కూడిన ఆవరణగా మాత్రమే ఉంటాయి. ఆ లోపల ఏం జరుగు తుందో, ఏం జరగదో మీరు పట్టించుకోరు. వీరం దరూ వ్యవస్థ బాధితులే. కానీ మనం మాత్రం నాణ్యతను ప్రోత్సహించడానికి అవి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు నటిస్తుంటాము. వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
బీజేపీ, ‘సేన’ల కయ్యాల కాపురం
- విశ్లేషణ బీజేపీ, శివసేనల మధ్య నేటి మైత్రి... విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లాడ కుండానే తిరిగి చేస్తున్న సంసారం వంటిది. ఈ బంధం గతానికి సంబంధించినది, అధికారంలోకి తిరిగి రావాల్సిన అవసరంతో ఏర్పడినది. దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలలో లాగే కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా బలహీనపడింది. నరేంద్ర మోదీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రివాజుగా ఆ పార్టీ భార తీయ జనతా పార్టీ ప్రభు త్వానికి ప్రతిపక్షం పాత్రను పోషిస్తోంది. అయినా అది నిస్తేజంగానే ఉంది. కాంగ్రెస్‌కు ఒకప్పటి భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సైతం అంత కంటే మెరుగ్గా లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి శివసేన ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు ఆ స్థానంలోకి ప్రవే శించగల శక్తిని సమకూర్చుకుంటోందనే అనుమా నాలను అది రేకెత్తిస్తోంది. ప్రభుత్వంలో చేరకుండా, తప్పుకోకుండా శివ సేన వారాల తరబడి తాత్సారం చేస్తుండటంతో బీజేపీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు... బయట నుంచి మద్దతును ఇస్తామంటూ ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఈ పరిణామం శివసేనపై విచిత్రమైన రీతిలో ప్రభా వాన్ని నెరపింది. సందు దొరికితే చాలు ఎన్సీపీ తన స్థానంలోకి చొరబడిపోతుందనే భయం దానికి పట్టుకుంది. దీంతో అది తన సొంత బ్రాండు హిందుత్వనూ, దాని పట్ల శ్రద్ధనూ తగ్గించింది. ఆవశ్యకంగానే చతుర్ముఖ పోటీగా సాగిన ఎన్నికల పోరులో మంచి ఫలితాలనే సాధించగలిగిన శివ సేన అలాంటి స్థితిలో పడటం విచారకరమే. భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య నేడున్న మైత్రిని విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లి చేసుకోకుండానే తిరిగి చేస్తున్న సంసారంతో తప్ప మరి దేనితోనూ పోల్చలేం. ఈ బంధం గతానికి సంబంధించినది, అధికారంలోకి తిరిగి రావాల్సిన అవసరం వల్ల ఏర్పడినది. ఇక వైరం, సుదీర్ఘ వైవా హిక జీవితం తర్వాత 2014లో విడిపోవడం నుంచి పుట్టుకొచ్చినది. అప్పటి పెళ్లిలో బీజేపీ ఛోటా భాగ స్వామి. సంప్రదాయక హిందూ వివాహంలో భర్త పట్ల భార్య వినమ్రంగా, విధేయంగా ఉండాల్సిందే. ఒకరినొకరు ఎరుగని వారేమీ కాని ఈ జంట మధ్య పోరు రోజురోజుకూ విద్వేషపూరితమైన దిగా, అమర్యాదకరమైనదిగా దిగజారుతున్న అను చిత సన్నివేశం మహారాష్ట్రలో నేడు ప్రదర్శితమౌ తోంది. 2014 శాసనసభ ఎన్నికల వరకు వారు మిత్రులు గానే ఉన్నా... ఆ ఎన్నికల్లో వారు ప్రతి మాటలోనూ విద్వేషం ఉట్టిపడేలా ఒకరితో ఒకరు పోరాడారు. వారిక శాశ్వతంగా విడిపోయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే, బీజేపీ ఉండాల్సి నట్టు వినమ్రంగా, విధేయమైన భాగస్వామిగా ప్రవర్తించే నడవ డికను శివసేన అలవరుచుకున్నట్టు అనిపించింది. కానీ అలవరచుకోలేదు. గుడ్డు, గుడ్డుతో వేసిన అట్టు కూడా తనకు దక్కాలని శివ సేన నిర్ణయించుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అది డిసెంబర్ 2014లో మోసపూరితంగా చేరింది. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా అది బీజేపీని దూషించసాగింది. అది సతాయింపును మించిపోయింది. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు శివసేన అంతర్గత ప్రతిపక్షం. ప్రతిపక్ష బెంచీలలోని కాంగ్రెస్, ఎన్సీపీలు నెరవేర్చాల్సిన బాధ్యతలను అది వాటికి తప్పించింది. అవి రెండూ ప్రతిపక్షమనే భావనకు అస్పష్టమైన నీడ లుగా మిగిలాయి. గతవారం బీజేపీ, శివసేనలు తమలోని చెడు నంతా బయట పెట్టుకున్నాయి. శివసేన సాగిం చిన విమర్శల దాడిని బీజేపీ కూడా అంతే తీవ్రమైన మాటలతో తిప్పికొట్టింది. అవి తిట్లకు లంకించుకోవడం అందులో భాగం మాత్రమే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామే. సోషల్ మీడియాలో విద్వేషపూరిత మైన పోస్టర్లు వెలిశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సైతం ఆ మిత్రపక్షం వదిలిపెట్టలేదు. ఇది సాధారణంగా కూటమిలోని సాధారణమైన అంత ర్గత కుమ్ములాటలను, ఒకరినొకరు దెప్పి పొడుచు కోవడాలను మించిపోయింది. తమది పవిత్రమైన పార్టీ, మచ్చలేని చరిత్ర అన్నట్టుగా ఏక్నాథ్ ఖడ్సే చేత శివసేన బలవం తంగా రాజీనామా చేయించింది. దీంతో ఈ రభస ఖడ్సే సొంత పట్టణం జల్గావ్లో వీధులకు సైతం ఎక్కింది. శివసేన జిత్తులమారితనానికి పాల్పడటమే గాక బీజేపీతో పోరుకు దిగడం ద్వారా అది ఎన్సీపీ బలాన్ని క్షీణింపజేసే అవకాశాన్ని కోల్పో తోంది. బీజేపీకి కయ్యాలమారి భాగస్వామిగా ఉండ టానికి బదులుగా అది భరోసాను కల్పించే దిగా ఉండి 1999 నుంచి 2014 వరకు ఎన్సీపీ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తులను కోరాల్సింది. ఎన్సీపీ ప్రముఖ నేత మాజీ మంత్రి ఛగన్ భుజబల్, అతని సమీప బంధువు ఇంకా బె యిల్ లేకుండా నిర్బంధంలోనే ఉన్నారు. అంత కంటే చిన్నపాటి కుంభకోణంలో అతని కుమారులలో ఒకరిపై కూడా కన్నేసి ఉంచారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ మాజీ రాష్ట్ర అధినేత, మంత్రి సునీల్ తత్కారేలపై దర్యాప్తులు బలహీనంగా ఉన్నాయి. అయితే శివసేన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై, ప్రత్యేకించి 2017లో ఎన్నికలు జరగ నున్న బంగారు గుడ్లూ, బాతూ కూడా అయిన ముంబై స్థానిక ప్రభుత్వ ఎన్నికలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. బీజేపీకి ఎలాంటి అవకా శమూ లేకుండా చేయాలని కత్తులు దూస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ముందు కేంద్రంలో భాగస్వామి అయిన శివసేనకు స్థానిక సంస్థలపై ఉన్న పట్టును తప్పించడం వైపు బీజేపీ మొగ్గు చూపుతోంది. కాబట్టి శివసేన అలా భావించడాన్ని అర్థం చేసుకోగలం. దీంతో అది ఎన్సీపీని తక్కువ ప్రాధాన్యంగల ప్రత్యర్థిగా పరిగణిస్తోంది. కాస్త ముందో వెనుకో శివసేన ఇందుకు చింతించాల్సి రావచ్చు. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
అవినీతిపై రాజకీయం పైచేయి!
విశ్లేషణ దావూద్ ఇబ్రహీంతో ఫోన్ కాల్స్ సంబంధాలపై ఆరోపణలు వచ్చిన మంత్రి ఖడ్సేని తప్పించాలని బీజేపీ నిర్ణయించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే సత్వర క్లీన్ చిట్ ఇచ్చేశారు. భారత్‌లో స్వలాభం కోసం తమ కార్యాలయాలను దుర్వి నియోగపర్చని రాజకీయ నాయకులున్న ఒక్క ప్రభు త్వాన్ని పేర్కొనండి చాలు. రాష్ట్రాలకు కేంద్రంలోని ప్రభు త్వాలకు మధ్య సత్యవర్తనం వర్సెస్ అవినీతికి సంబంధిం చిన పోటీలో స్థాయీ భేదమే తప్ప పెద్దగా తేడా కనిపించబోదని నేను పందెం కాయ గలను. అత్యంత అవినీతికర ప్రభుత్వం కంటే తక్కువ అవినీతికర ప్రభుత్వం మంచిదని ప్రజలు ఆమోదిం చేశారు కూడా. ప్రజాస్వామ్యంలోని వైచిత్రి, విషాదం ఏమిటంటే తమను తాము పాలించుకునే హక్కును ప్రజలనుంచి లాగేసుకుని ‘భారత ప్రజలమైన మేము’ అనే పేరుతో వారిని ఒక రాజ్యాంగానికి దాఖలు పర్చ డమే. ఎన్నికలు ముగియగానే, రాజకీయనేతలు, రాజకీ యాలకు ప్రతి విషయంలోనూ ప్రాధాన్యత లభిస్తుం టుంది. ప్రజలేమో అలా నిలబడి గమనిస్తుంటారు. కొన్నిసార్లు నిస్సహాయంగానూ, కొన్నిసార్లు తమను తాము ఓదార్చుకుంటూనూ. అవినీతి రహిత పాలనను వాగ్దానం చేసి కేంద్రంలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు, అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీకి ఏక్నాథ్ ఖడ్సే వంటి సీనియర్ మంత్రిని సులువుగా కటాక్షించడం, ప్రోత్సహించడం చాలా కష్టమవుతుంది. తనపై అవినీతి ముద్రపడింది, అయిదుగురు రాజకీయేతర వ్యక్తులు అతడిపై సమర శంఖం ఊదారు. వీరిలో ఒక జాలరి, ఒక విద్యావేత్త, ఒక కార్యకర్త, ఒక భవన నిర్మాణకర్త, ఒక నీతిమంతుడైన హ్యాకర్ ఉన్నారు. చివరి వ్యక్తి అయితే నేరుగా దావూద్ ఇబ్రహీం ఇంటి ఫోన్లకు, ఈ సీనియర్ మంత్రి మొబైల్ ఫోన్‌కు మధ్య నడిచిన కాల్స్ వివరాల గుట్టుమట్లను వెలికితీసింది. మహారాష్ట్ర మంత్రిమండలి నుంచి ఈ మంత్రిని తప్పించాలని బీజేపీ - అంటే నరేంద్రమోదీ, అమిత్ షా అని చదువుకోవాలి- నిర్ణయించడంలో ఆశ్చర్యపడవల సిందేమీ లేదు. అయితే కొన్ని వార్తా పత్రికలు ప్రత్యే కించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డాక్యుమెంట్లను సమీక్షించి మరీ నిర్దిష్ట వాస్తవాలను బయటపెట్టిన అంశాన్ని నిర్లక్ష్యపరుస్తూ సదరు మంత్రిని నైతిక కారణాలతో రాజీనామా చేయడానికి వీరు దారి కల్పించారు ఈ క్రమంలో తాను మీడియా విచారణకు బలయ్యానని కూడా ఈ మంత్రి చెప్పుకున్నారు. పైగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదరు మంత్రికి మద్దతుగా ప్రకటన చేశారు. ఆ సమయంలో కొంతమంది మంత్రులు కూడా హాజరు కావటం గమనార్హం. మాఫియా నేతతో ఫోన్‌కాల్స్ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండకపోవ డానికి ఖడ్సే మరీ కొత్త రాజకీయ నేత ఏమీ కాదు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయన రాజ కీయాల్లో ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగానూ, రెండు సార్లు అంటే 1995-99లో, ఇప్పుడూ ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోతో మంత్రిగా కూడా వ్యవహరించారు. తన కోడలు రక్షను 26 ఏళ్ల అతి పిన్న వయస్సులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్థాయి రాజకీయ పలుకుబడి ఉంది. రెవెన్యూ, వ్యవసాయంతోపాటు పది శక్తివంతమైన మంత్రిత్వ శాఖలు చేతిలో ఉండగా రాజకీయ ఫలాలను అందుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే మరి. మునుపటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వాలకు ప్రత్యే కించి భూ కుంభకోణాల్లో ఊపిరాడనీయకుండా చేస్తూ వాస్తవాలను శోధించడంలో తీవ్రంగా శ్రమించిన ఖాడ్సే మరోవైపున దేవేంద్ర ఫడ్నవిస్‌ను అలంకరించిన ముఖ్య మంత్రి పదవిని కూడా లెక్కచేయనితనంతో గప్పాలు కొట్టుకునేవారు. సీఎం తనకంటే జూనియర్ అనే విష యాన్ని ఎత్తిచూపేందుకు ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టేవారు కాదు. గత ప్రభుత్వ ప్రకటనలను తుత్తునియలు చేస్తూ వాస్తవాలను బయటపెట్టడంలో ఫడ్నవిస్‌కు ఖడ్సే సహకరించారు కూడా. ఒక మంత్రి సహాయకుడిని అరెస్టు చేయడం, మరొకరిపై దర్యాప్తు జరుగుతుండటం, సాక్షాత్తూ మంత్రే కుంభకోణాల ఆరోపణలకు గురవటం (వీటిలో అతి పెద్దది ఏదంటే ఆయన భార్య, అల్లుడు మార్కెట్ ధర కంటే కనీసం పది రె ట్లు తక్కువ ధరకు కారుచౌకగా రూ. 31 కోట్లకే విలువైన భూమిని కొనుగోలు చేయడం) ఈ భూమిని ఇప్పటికే పారిశ్రామిక విభాగాలకు అప్ప గించారు, అవి దాన్ని ఉపయోగిస్తున్నాయి కూడా. కానీ గత 40 ఏళ్లుగా భూమి యజమాని మాత్రం నష్ట పరిహారాన్ని పొందలేదు. అలాంటి అవకాశాలను ఎవరయినా ఎలా దొరక బుచ్చుకోగలరు? ప్రభుత్వ సహాయం, రెవెన్యూ శాఖ అధిపతిగా ఉండటం వల్లే, అసలు యజమానికి కాకుండా కొత్త యజమానికి నష్టపరిహారం చెల్లించ వల సిందిగా కోరటం సాధ్యపడింది. ఈ అంశం అవినీతికి చెందినదైనప్పటికీ, ఆ ఇద్దరి మధ్య నడిచిన ఫోన్ కాల్స్ నిజమే అయిన ప్పటికీ, ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఒక ఓబీసీ నేతను అవమానించ కోరుతున్నాడని, రాజకీయ ప్రయోజనాల కోసమే భూ కుంభకోణాన్ని బయట పెట్టారని పేర్కొంటూ స్థానిక మీడియా ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం రాజకీయ సమస్యగా మాత్రమే చూస్తుండటం దురదృష్టకరం. పైగా దివంగత గోపీనాథ్ ముండే తర్వాత బీజేపీలోని ఏకైక ఓబీసీ నేతగా ఉంటుం డటం వల్ల సదరు మంత్రి రాబోయే నెలల్లో పార్టీకి సమస్యగా మారవచ్చు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రకటించిన రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఈ వ్యవహారం నిగ్గు తేల్చడానికి కాస్త సమయం పడుతుంది కానీ, అయి దుగురు విభిన్న వ్యక్తులు ఐదు విభిన్న ఆరోపణలు చేయడం, కొన్ని పత్రాలు, ఫైళ్లు ఇప్పటికే కనిపించలేదని తేలడం వంటి వాటి కారణంగా ఈ సమస్య రాజ కీయాల్లో చాలా కాలంపాటు కొనసాగే అవకాశముంది. చివరకు కరాచీ, ఖాడ్సే ఫోన్ మధ్య నడిచిన కాల్స్ విషయంలో కూడా పోలీసులు సత్వరం క్లీన్ చిట్ ఇవ్వ డమే కాకుండా దాన్ని ఏటీఎస్ (ఉగ్రవాద నిరోధక స్క్వాడ్)కి పంపేశారు. ఇక ఏటీఎస్ తన సొంత వనరులమీద కాకుండా సంబంధిత హ్యాకర్ సహా యంపై ఆధారపడాలని చూస్తున్నట్లుంది. అవినీతిపై రాజకీయం పైచేయి సాధించే తీరు ఇదే మరి. -మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
చెడులోనూ దాగి ఉన్న మంచి?
విశ్లేషణ ప్రజలు నీటికోసం అల్లాడుతున్నందున నాచు కలిసిన, మురికి నీళ్లు తీసు కొచ్చినా ఖర్చయిపోతాయి. తమకు రావాల్సిన వాటా నీటిని పొందన ప్పుడు దొరికే ప్రతి నీటి బిందువుకూ తనదైన లెక్క ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో బ్రాండెడ్ నీటి బాటిల్‌కు బ్లాక్ మార్కెట్ రేటు పలుకుతుంది. ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పి. సాయినాథ్ 1999లో రచించిన ‘ఎవ్రీ బడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్’ నిరంతరం సవరించి లేదా కొత్త పేరుతో ప్రచు రించదగిన విశిష్ట రచన. ఎందుకంటే భారత సమా జానికి సంబంధించిన ఘోరాతి ఘోరమైన రహస్యాల మేలిముసుగును ఆయన ఈ పుస్తకంలో విప్పి చెప్పినప్పటికీ ఈ దేశం తన మార్గాన్ని మార్చు కోవడం గురించి పాఠాలు నేర్చుకోలేదు. ఆ పుస్త కంలో వివరించిన వాటికంటే ఇంకా అన్వేషించ వలసిన అవమానకరమైన అంశాలు దేశంలో అనేకం ఉన్నాయి. గత బుధవారం వరకు మహా రాష్ట్రలో 29,600 గ్రామాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం వీటిలో ఒకటి. కరువు ప్రకటన అనేది నిబంధనలను క్రియా శీలం చేయవలసిన అవసరాన్ని ముందుకు తీసుకు వస్తుంది. అంతకంటే ముందు ప్రభుత్వం కేంద్ర నిధులకోసం ప్రయత్నించడంపై తన ఉద్దేశాన్ని సూచిస్తుంది. విచిత్రం ఏమిటంటే కరువు ఉపశమన చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దం పాటిస్తూ, ప్రభుత్వ భాగస్వామి అయిన శివసేనను కరువుపై గావుకేకలు వేయడానికి అనుమతిస్తోంది. వచ్చే ఎన్నికల్లో దీన్ని ప్రచారాంశంగా మలుచుకోవడానికి గానూ ప్రజల బాధలపట్ల ప్రతిపక్షం అనుసరించ వలసిన పద్ధతి ఇదేనా? తాగునీరు లేనప్పుడు, పంటలు పండన ప్పుడు, ప్రభుత్వం ఎందుకు వేచి ఉంటోందన్నది మాయగా ఉంది. ఉడిగిపోయిన పశువులను రైతులు కబేళాలకు అప్పగించకుండా నిషేధం విధిం చడం వల్ల వారిపై ఆర్థిక భారం మరింతగా పెరుగు తోంది. మూర్ఖులు మాత్రమే గ్రామీణ ఆర్థిక వ్యవ స్థను ఇలాంటి ప్రయత్నాలతో ఆటంకపర్చే విష యంలో విజ్ఞతను చూడగలరు. పాలనిచ్చే పశువులు కూడా పశుగ్రాసం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో గడ్డి లేక అవి కూడా వట్టిపోయాయి. డబ్బు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నీటి కొరత కోసం సంసిద్ధంగా ఉంటున్న ప్రైవేట్ రంగం సన్నాహక చర్యలతో కరువుపై ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనను పోల్చి చూడండి. నీటి కొరత తీవ్రత గురించిన సమాచారం అందుకున్న వెంటనే ప్రైవేట్ యజమానులు ధరపెట్టి మరీ అమ్మడం కోసం కొత్త నీటి ట్యాంకర్లను కొనేశారు. ఒక్క థానే జిల్లాలోనే 500 కొత్త నీటి ట్యాంకర్లను నమోదు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తనదైన పద్ధతుల్లో వ్యవహరిస్తూ పోయింది. ప్రైవేట్ ట్యాంకర్లు తీసుకొస్తున్న నీటి వనరుల మూలం గురించీ లేదా నీటి నాణ్యత గురించి పట్టిం చుకోవద్దు కానీ నీటి అమ్మకాల్లోని భారీ లాభాలను పెరిగిన ట్యాంకర్ల సంఖ్యే సూచిస్తోంది. ప్రజలు నీటికోసం అల్లాడుతున్నారు కాబట్టి నాచు కలిసిన, మురికి నీళ్లు తీసుకొచ్చినా అవి ఖర్చయిపోతాయి. తమకు రావలసిన వాటా నీటిని (అది కూడా వారి కనీస అవసరాలకంటే తక్కువే) పొందలేనప్పుడు దొరికే ప్రతి నీటి బిందువుకూ తనదైన లెక్క ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో బ్రాండెడ్ నీటి బాటిల్ బ్లాక్ మార్కెట్ రేట్లతో అమ్ముడవుతుంది. మరొక రోజు ఒక చిన్న రైల్వే రిజర్వాయర్ నుంచి నీటిని తోడుకుని వస్తున్న ఒక ట్యాంకర్ దొరికింది. ఆ నీటిని అమ్మితే ట్యాంకర్ యజమానికి రూ.800లు వస్తుంది. అంటే అమ్మిన ఈ ఉత్పత్తి చౌర్యానికి గురయిన ఉత్పత్తి అన్నమాట. ఇలాగే రైల్వే వ్యాగన్లు ప్రారంభంలో లాతూర్కు నీటిని తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ ట్యాంకర్ల వ్యాపారం దానిలోకి జొరబడాలని చూసింది. ఇలాంటి కార్యకలాపాలను ట్యాంకర్ మాఫియా అని పిలుస్తున్నారు. సంవత్సరాలుగా వీళ్లు నగ రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి చెందుతూ వస్తు న్నారు. పరిశ్రమ అవసరాలకోసం డబ్బు తీసుకుని మరీ అధికారులు ట్యాంకర్లలో నీటి పంపిణీ చేస్తున్న తతంగాన్ని ఇటీవలే టీవీలు స్ట్రింగ్ ఆపరేషన్ల ద్వారా చూపించాయి కూడా. ఉపాధితో అనుసంధానమై ఉంది కనుక పరిశ్ర మలకు నీటి సరఫరా అవసరమైనదే కానీ బీర్ తయారీదారులకు నీటి సరఫరాను తగ్గించవల సిందిగా కోర్టులు ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చి ంది. నీటి ధరవరలను పోల్చి చెబుతూ మరాఠీ వార్తా పత్రిక లోక్‌సత్తా తెలిపిన వివరాలు దిగ్భ్రాం తి కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల, 13 లీటర్ల కుండ లేదా పాత్రలోని నీళ్లను ప్రైవేట్ నీటి వ్యాపారుల వద్ద కొంటే ఐదు రూపాయలు ఖర్చవుతోంది. కానీ మద్యపానీయ తయారీదారులు అదే నీటికి లీట ర్కు నాలుగు పైసల చొప్పున చెల్లిస్తున్నారు. లాతూర్‌లో 6 వేల లీటర్లు పట్టే ట్యాంకర్ నీటికి రూ.1,300ల వెల పలుకుతోంది. అంటే లీటర్‌కు 22 పైసలు అన్నమాట. ప్రభుత్వ ట్యాంకర్ నీటిని ఉచితంగా ఇచ్చినప్పటికీ దాని ఖరీదు మాత్రం లీటర్‌కు 30 పైసలు పడుతోంది. అందుకే నిర్దిష్టై మెన నీటి రంగం మరింత సమర్థవంతమైనదని ఇది తెలుపుతోంది. అయితే బేరసారాల్లో భాగంగా ప్రభుత్వం నీటి ప్రైవేటీకరణను అనుమ తించింది. మాఫియా కనుక రంగంలోకి దిగకపోతే, నీటి దాడులు జరిగే ప్రమాదం ఉంది. అంటే చెడులో కూడా మంచి అంశాలున్నాయన్నమాట. వింతైన విషయమే కావచ్చు కాని ఇది నిజం. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
జీవ జలాలను గౌరవిద్దాం!
విశ్లేషణ మన దేశంలోని నదుల జాబి తాను ఓసారి చూడండి, చాలా పొడవుగా ఉంటుంది. ప్రతి నదీ ఆ పరివాహక ప్రజలకు ఒక్కొక్క అర్థాన్నిచ్చేదై ఉంటుంది లేదా గంగానదిలాగా సువిశాల మైదాన ప్రాంతాల వ్యవసాయానికి ఆధా రమై ఉంటుంది. చాలా నదులు బంగాళాఖాతంలో, కొన్ని అరేబియా మహాసము ద్రంలో కలుస్తాయి. కాగా కచ్, రాజస్థాన్ వంటి ఉత్తరాది పాక్షిక మెట్ట ప్రాంతాల్లోని నదులు... జీవ ప్రదాతలుగా నదుల పాత్రను నొక్కిచెబుతున్నట్టు అంతర్గతంగానే ప్రవహిస్తాయి. అయినాగానీ, మనం ఏమంత ఫలదాయకంగాని సాగునీటి వసతి కోసం నదుల మీద డ్యాములు నిర్మించ డానికి మించి వాటి గురించి పెద్దగా ఆలోచించం. కానీ మన పట్టణం లేదా గ్రామం పక్కగా పారే నదులను కలుషితం మాత్రం చేస్తాం. పౌరులకు జీవజలమైన శుభ్రమైన మంచి నీటిని సరఫరా చేయాలని స్థానిక ప్రభుత్వాలను ఆదే శిస్తాం... మనం మాత్రం మరో ఆలోచనే లేకుండా నదుల్లోకి వ్యర్థాలను కుమ్మరించేస్తుంటాం. అవి ఆ వ్యర్థాలను దిగు వకు ప్రవహింపజేసి ఇతరులకు హాని చేస్తాయి. అయినా మనం వాటిని పవిత్ర మైనవిగా పిలవ డానికి సంకోచించం. మనల్ని పరిశుద్ధం చేసుకోవడం కోసం నదుల్లో స్నానాలూ చేస్తాం, అడ్డూఅదుపూ లేకుండా వాటిని మురికిగానూ చేస్తాం. వాటిని పరిశుభ్రం చేసే ప్రయత్నం ఎన్నడూ సఫలం కాలేదు. నదు లను ఎంతగా కలు షితం చేసేశా మంటే, మనం చేయగలిగినది వాటిని పరిశుభ్రం చేయడం గురించి మాట్లాడటం మాత్రమే. గంగానదిని శుద్ధి చేస్తా మనే మాట ఎంత కాలంగా వినడం లేదు? ఇప్పుడిక మిగతా నదులన్నీ యమునలా దాదాపు గంగతో పోటీపడే స్థాయిలో కలుషితమైపోయాయి. ఢిల్లీ సమీప ప్రాంతాల్లో అవి నురగలు కక్కుతుంటాయి. బహుశా అవి ఎండిపోయి నప్పుడు మాత్రమే శుభ్రంగా కనిపిస్తాయ నుకుంటాను. ఇటీవలి కాలంలో వాటి పూడిక కూడా సమ స్యగా మారింది. హఠాత్తుగా మనం ఇప్పడు నీరు చాలా ముఖ్యమైనదని గుర్తించాం. చాలా రాష్ట్రాల్లో బావులు, నదీ గర్భాలు కూడా ఎండిపోయేంతగా ఈ ఏడాది నీటికి కరువు ఏర్పడటమే అందుకు కారణం. ట్యాంకర్లలో వచ్చే నీళ్ల కోసం పెద్దవాళ్లే కాదు, పిల్లలు సైతం నీటి పోరాటాలు చేయాల్సి వస్తోంది. అలా సరఫరా చేసే నీరు ఎక్కడి నుంచి తెస్తున్నదో వాటిని ఉపయోగించేవారికి తెలియకపోవడం ఘోర మైన తప్పు. నీటిని మన మనుగడకు అవసరమైన ముఖ్య సరుకుగా గుర్తించడానికి మనం గతంలో కూడా చేరువయ్యాం. నీటిని సంరక్షిస్తూ జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరాన్ని లెక్క చేయని అవివేకానికి సంబంధించి ప్రతి కరువూ దేశానికి గుణ పాఠమే. వచ్చేసారి వానలు సమృద్ధిగా కురిస్తే చాలు, గత ఏడాది ఎంత దుర్భరంగా గడిచిందో, పంటలు దెబ్బ తిని ప్రజలు ఎలా వేరే ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చిందో, కొద్దిగా తాగునీటి కోసం ఎంత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చిందో మనమందరం విస్మరిస్తాం. కొన్ని నెలలు గడిచేసరికి, ఎంత దయనీయంగా బతికామనే జ్ఞాప కాలు ఆవిరైపోతాయి. మళ్లీ నీటికి కరువు వచ్చే వరకు గుర్తుకురావు. ఉత్తమ నీటి నిర్వహణకు ఉదాహరణగా చెప్పే అన్నా హజారే గ్రామం రాలేగావ్‌సిద్ధిలో సైతం ఈసారి బోరు బావులు ఎండిపోయాయి. అతిగా నీటిని తోడేయడం వల్లనే మిగతావి కూడా ఎండి పోయాయని గుర్తించిన హజారే వాటికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. కానీ ఆ గ్రామం అందుకు ఒప్పుకోలేదు. ఆయన గ్రామాన్ని నమూనాగా చూపి ప్రభుత్వం ఇతర ప్రాంతాలలో కూడా అలాంటి గ్రామాలను తయారు చేయాలని కోరింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రావడానికి దశాబ్దాల ముందే మహారాష్ట్రకు సొంత ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ఉండేది. ఇంకుడు గుంతల నిర్మాణం అందులో భాగంగా ఉండేది. వర్షాలు బాగా కురిసిన ఏడాది భూగర్భంలోని నీటి బ్యాంకును అది రీచార్జ్ చేస్తుంది. అయినా బోరు బావులను మరింత లోతుగా తవ్వాల్సి వస్తోంది. 200 అడుగుల లోతుకు మించి తవ్వరాదనే చట్టం అమల్లోకి వచ్చింది. కానీ స్థానిక అధి కారులు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇంతకూ ఆ ఇంకుడు గుంతలు ఏమయ్యాయి? లంచగొండి యంత్రాంగం అవి నిర్మాణం కాకుండా చేసి ఉండాలి. ఇది హజారే నమూనాతో ఉన్న సమస్య కాదు, మనం నీటితో ఎలా వ్యవహరి స్తున్నామనే దానికి సంబంధించినది. నీరు పుష్కలంగా ఉన్న ప్పుడు మనం దాన్ని విలువలేనిదిగా లెక్క చేయనే చేయం. నీటి కొరత మొదలైన ప్పుడు ఆ సంక్షోభాన్ని ఎలాగో ఒకలా అధిగ మిస్తామని విశ్వసిస్తాం. ఈసారి, అది అంత తేలికగా ఏం జరగడం లేదు. బహుశా ఆ ప్రకృతే జీవజలంపట్ల మన్నన చూపమని మనల్ని కోరు తున్నట్టుంది. అదృష్టవశాత్తూ ఈ విషయం పట్ల గుర్తింపు అక్కడక్కడా కనిపిస్తోంది. నీటిని సంరక్షించడానికి ఏమైనా చేసినవారికి లేదా చేస్తున్నవారికి ఒక టీవీ చానల్ అవార్డులను ప్రదానం చేసింది. మహారాష్ట్రలో నానాపాటేకర్-మార్కండ్ అనాస్పురేల ‘నామ్’ వంటి స్వచ్ఛంద సంస్థలు చిన్న చిన్న నదులను విశాలం చేస్తున్నాయి. ఆ ఇద్దరు నటులు అందరి నుంచి చందాలు వసూలు చేస్తున్నారు. ఒక రిక్షావాలా జేబులో ఎంతుంటే అంతా ఇచ్చేస్తే, ఒక రచయిత్రి తన పారితోషి కాన్ని ఇచ్చేస్తారు. అతి తక్కువ ఖర్చుతో, ఎంతో వేగంతో ఆ పని జరిగేలా తోడ్పడుతున్నారు. మన ముందున్న సమస్య సరళమైనదే. నీటి వినియోగ దారులంగా మనం నీటి వనరులతో ఎలా వ్యవహరిస్తున్నా మనేది ఆలోచించడం లేదు. సంక్షోభం తలెత్తినప్పుడు లేదా సంక్షోభం మధ్య ఉండగా సైతం, కొంత నీటిని నదికి దిగువన ఉన్నవారి కోసం వదులు కోవాలంటే గగ్గోలు పెట్టేయవచ్చు... నాసిక్ నీటిని మరఠ్వాడాకు పంపుతుంటే జరిగినట్టు. అంతేగానీ అక్కడ తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుండగా, ఇక్కడ నాసిక్ ఘాట్లలో ఆ అరుదైన నీటితో మతాచారం కోసం స్నానాలు చేస్తున్నందుకు బాధైనా కలుగదు. వారికి బుద్ధి చెప్పడానికి కోర్టులు కలుగ జేసుకోవాల్సి వచ్చింది. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
వివక్షకు రక్షణగా నిలుస్తారా?!
‘ఇది మీ సొంత చట్టం. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ పై ఉంది’ అని హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేయాల్సి వచ్చింది. ఈ తీర్పు తదుపరి ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన మహిళలను పాలనా యంత్రాంగం అడ్డగించడం విషాదకరం. సుప్రసిద్ధ శనీశ్వరాలయ ప్రవేశాన్ని కోరుతూ మహిళలు కొన్ని వారాల క్రితం ఉద్యమించారు. లైంగిక వివక్ష సమస్యను లేవనెత్తారు. ఆ సందర్భం గా ముఖ్యమంత్రి జోక్యం సహా చాలానే సంప్ర దింపులు జరిగాయి. అగ్ర రాజకీయ నేతల కృషి వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేలా ఏవో కొన్ని చర్యలు చేపడుతున్నట్టు సంకేతించడానికే పరిమితమైంది. అంతేగానీ, ఆ వివక్షను అంతం చేయడానికి మాత్రం కాదు. కావాలనుకుంటే వారు ఆ పని చేయగలిగేవారే. శనీశ్వరాలయం ఉన్న శనిసింగనాపూర్ గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పరిధిలోనిది. ఆరు దశాబ్దాల క్రితమే ‘బహిరంగ ప్రార్థనా స్థలాలలో ’ భక్తులమధ్య ‘ఎలాంటి వర్గ, బృందాల’ వివక్షా పాటించరాదని ఆ రాష్ట్రంలో చట్టం చేశారు. నాటి మహారాష్ట్ర హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశ అధికార) చట్టం, 1956 హిందువులు, జైన్లు, సిక్కులు, బౌద్ధులకు అందరి కీ వర్తించేది. కాబట్టి మహిళలు ఈ విషయంలో లింగవివక్షను అంతం చే యాలని కోరినప్పుడు ఆ చట్టాన్ని శక్తివంతంగా ఆచరణలోకి తేవడమే ప్రభుత్వం చేయాల్సి ఉన్న పని. కానీ ‘చట్టంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు అందుకు అనుమతిస్తున్నాయి’ కాబట్టి వాటిని అమలుచేసి మహిళల ఆలయ ప్రవేశానికి అవకాశాలను కల్పించాలనీ, ‘అందుకు అడ్డుపడుతున్న వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని’ గత వారాంతంలో బాంబే హైకోర్టు ఆదేశించేవరకూ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. సాధారణంగా ప్రభుత్వాలు అప్పటికే ఉన్న చట్టాలను చూపుతూ కొన్ని కర్తవ్యాలను నెర వేర్చడంలో తాము అశక్తులమని కోర్టులకు చెబు తుంటాయి. వాటిని నెరవేర్చాల్సిందేనని కోర్టులు పట్టుబడితే... అవి ఆ చట్టాలను సవరించే ప్రయ త్నం చేస్తాయి. మహిళలు నృత్యం చేసే డ్యాన్స్ బార్లను తిరిగి తెరవనివ్వాలనే కోర్టు ఆదేశాలు అమలు కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తోందో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఆ అంశాన్ని అభ్యంతరకరమైన లేదా అనైతిక ప్రవర్తన గా చూస్తే ... సుప్రీంకోర్టు అందుకు భిన్నంగా యోచించింది. నైతికంగా సరైన చట్టాలను అమలు చేసే ఆ ప్రభుత్వ హయాంలో మహిళా కార్యకర్తలు ఆలయ ప్రవేశం కోసం కోర్టు జోక్యాన్ని కోరాల్సిన అవసరమే రాకూడదు. ఆరు దశాబ్దాల క్రితం నాటి ఆ చట్టం అర్థరహితమైనదని భావిస్తే దాన్ని ఎప్పు డో సమీక్షించి ఉండాల్సింది. చట్టాన్ని మాత్రం అలా గే ఉంచి దాని అమలును పట్టించుకోరు. ఇలాంటి కారణంవల్లే కొన్ని చోట్ల దళితులకు ప్రార్థనా స్థలాలలోకి ఇప్పటికీ ప్రవేశం ఉండటం లేదు. అంబేడ్కర్, జ్యోతిబా, సావిత్రీబాయిలను చూపి మహారాష్ట్ర... తమది ‘ప్రగతిశీల’రాష్ట్రమని చెప్పుకుంటుంది. కానీ ఈ 21వ శతాబ్దిలో సైతం అక్కడ నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే అనే ఇద్దరు సుప్రసిద్ధ హేతువాదులు హత్యకు గురయ్యారు. హంతకులు ఇంకా దొరకనే లేదు. మహిళలను విద్యావంతులను చేయడం ద్వారా సంప్రదాయకత కోరల నుంచి మహిళలను ఉన్నత స్థితికి తేవాలనేదే ఫూలే కృషి ముఖ్య సారం. వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలలో అన్ని రకాల భావజాల ధోరణులకు చెందినవారూ కనిపించారు. కానీ మహిళల ఆలయ ప్రవేశానికి హామీనిచ్చే ప్రగతిశీల చ ట్టాన్ని హైకోర్టు గుర్తు చేసేవరకు బూజు పట్టిపోనిచ్చారు. ‘ఇది మీ సొంత చట్టం. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని గుర్తుచేయాల్సి వచ్చింది. చూడబోతే వరుసగా వచ్చిన ప్రభుత్వాలు విశ్వాసాలు, నమ్మకాలు, ఆనవాయితీలను అంతం చేసే ఆ చట్టం కంటే వాటి అమలుకే ప్రాధాన్యం ఇచ్చినట్టుంది. కోర్టు తీర్పుతో పునరుత్తేజితులైన మహిళలు శనివారం ఆలయంలో ప్రార్థనలకు ప్రయత్నిం చగా... స్థానిక పాలనా యంత్రాంగం వారిని అడ్డ గించడం ఈ వ్యవహారంలోని విషాద ఘట్టం. లిఖి త పూర్వక ఆదేశాలు తమకు అందలేదని సాకు చూపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహిళా కార్యకర్తలపై ‘దాడులు జరగ కుండా’ కాపాడటానికే వారిని అడ్డుకోవాల్సి వచ్చిం దని సమర్థించుకున్నారు. ఆయన కోర్టు ఆదేశాలను ‘గౌరవిస్తాం’ అన్నారే తప్ప అమలుచేయలేదు. ‘దాడిచేయడమా?’ ఆ రాష్ట్రంలో సనాతనత్వం ప్రజా జీవితంపై పట్టుబిగిస్తోంది. అక్కడ వాలంటైన్స్ డే జరుపుకోలేరు, జంటలు చేతులు పట్టుకుని బీచ్లవంటి ప్రదేశాల్లో కనిపించడానికి వీల్లేదు. ఆ ప్రభుత్వానికి తనదైన సొంత నైతిక దృష్టి ఉంది. కాబట్టి అధికార స్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నా ఫర్వాలేదు. చట్టాన్ని ఓడించడానికి ఉన్న మార్గాలు రకరకాలు. నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆ ఆలయం స్త్రీ, పురుషులిద్దరినీ సమానత్వ దృష్టితో చూడటం ప్రారంభించింది. మగాళ్లకు సైతం గర్భగుడి ప్రవేశాన్ని నిషేధించింది! జనవరిలో మహిళలు ప్రవేశించడానికి ప్రయత్నించగా, ఆలయ ధర్మకర్తల బోర్డు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి నిర్ణయానికి వదిలేసింది. చివరికి జరిగింది ఇదీ! (వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు) -
ఆదిమ ఏకాంతం ఎన్నాళ్లు?
విశ్లేషణ అండమాన్‌లోని జరావా తెగ ప్రజల నిర్బంధ ఏకాంత వాసాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ వారికి తమ మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? లేదా? ఇటీవల అండమాన్ జరావా తెగకు వార్తా పత్రికల్లో కాస్త చోటు లభ్యమవుతున్నట్లు కనిపిస్తోంది. జరావా యేతర పురుషుడితో సంపర్కం ద్వారా ఈ తెగ మహిళ ఒక పాపను ప్రసవించింది. అయితే ఆ పాప హత్యకు గురైంది. ఈ హత్యను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలా? లేక, జరావా తెగ అంతరించి పోకుండా కాపాడాలన్న తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ హత్యోదంతాన్ని పట్టించుకోకుండా ఉండిపోవాలా? శిక్షించడం ద్వారా ఒక జరావాను కోల్పోయినట్లయితే అది వారి సంఖ్యను తగ్గించే అవకాశముంది. ఒక్క మనిషి తగ్గిపోయినా సరే వారి సంఖ్య తగ్గిపోతుంది. దాదాపు 50 వేల సంవత్సరాలుగా జరా వాలు అండమాన్ ప్రాంతంలో వేటతో ఆహా రాన్ని సేకరించుకునేవారుగా మనుగడ సాధిస్తు న్నారు. క్షీణిస్తున్న వారి సంఖ్య రీత్యా అండమాన్ లోని ఓంజె తెగలాగా వీరినీ రక్షిత జాబితాలోకి చేర్చారు. వారి విశిష్ట, ప్రత్యేక లక్షణాల కారణం గా ఏ ఇతర గుంపులో కలిసినా సరే వీరికి హాని కలిగే అవకాశముంది. అందుకే, ‘బయటి వ్యక్తుల కనీస జోక్యం’తో ‘తమదైన భవిష్యత్తును ఎంచుకోవడానికి’ జరావాలను అనుమతించి నట్లు సర్వైవల్ ఇంటర్నేషనల్ పేర్కొంది. జరావాలను వారి ఆవాస ప్రాంతాల్లోనే ఉంచుతూ వాటి సరిహద్దుల్లో గార్డులను నియమించడం ద్వారా వారిని బయటి వ్యక్తుల కు దూరంగా ఉంచడం అనేది ప్రభుత్వం అనుసరించే విధానపు ముఖ్య లక్షణంగా ఉంటోంది. ఒక దశలో సుప్రీంకోర్టు సైతం జరావాలు నివసించే ప్రాంతం గుండా వెళ్లే రోడ్‌ను సైతం నిలిపివేయాలని ఆదేశించింది. గిర్ జంతు సంరక్షక కేంద్రంలోని సింహాలను చూస్తున్న విధంగా బయటి వ్యక్తులు జరావా లను చూడటానికి సఫారీకి వెళుతున్నారు. వారెక్కడ ఉంటున్నారో అక్కడే అలాగే ఉండేవిధంగా, జరావాలకు ప్రభుత్వం కలిగిస్తున్న రక్షణ నిష్క్రియాత్మకంగానే ఉంది. 1990ల ప్రాంతంలో జరావాలు అడవుల నుంచి బయటకు వచ్చి, తమ తెగ కానివారితో, బయటివారితో సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించారు. దేశంలోని ఇతర తెగలను ప్రధాన స్రవంతిలో కలిపేందుకోసం సక్రియాత్మకమైన, నిర్ణయాత్మకమైన మద్దతు నిచ్చేవారు. వీరికి కోటాలు ఉండేవి. బడ్జెట్లు ఉండేవి. అన్ని ప్రజాప్రాతినిధ్య సంస్థల్లో ప్రాతినిధ్యం కూడా ఉండే ది. మరొకవైపున, జరావాలను నిర్బంధ ఒంటరితనంలో ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. అధికారిక విధానం ప్రకారం జరావాలను సంరక్షిస్తున్నారు. వారి రక్తసంబంధాన్ని, సంస్కృతిని భద్రపర్చడానికి మానవ విజ్ఞాన శాస్త్ర రీత్యా తగు కారణాలు ఉండవచ్చు.. కానీ వారికి మనుగడ విషయంలో తమదైన అవకాశం, ఎంపిక ఉందా? వారు ఏం ఎంపిక చేసుకునేది ఏది? మనకేమీ తేలీదు. ఎందుకంటే అలాంటి అవకాశాన్ని, ఎంపికను మనం అసలు కనుగొనలేదు. అలాంటి అవకాశం వారికి ఉంటే, పార్సీలుగా ప్రధాన స్రవంతిలో ఉంటూనే తమ విశిష్ట లక్షణాలను అలాగే నిలిపి ఉంచుకునేవారా? ఇతరులతో పోలిస్తే తాము విశిష్టత కలిగి ఉన్నామనే విషయం పట్ల వారు జాగరూకతతో ఉంటున్నారని, కొత్తగా పుట్టిన బిడ్డను ఒక జరావా తెగ వ్యక్తి చంపివేసిన ఘటన సూచిస్తోంది. రహస్య సంబంధం వారిని మశూచి బారిన పడవేస్తున్నందున, వారిని బహిర్గతం చేసినట్లయితే తెగమొత్తానికే నష్టం కలుగుతుందని మనం గ్రహిస్తున్నాం. తక్కిన ప్రపంచం నుంచి పూర్తిగా దూరం పెట్టినందుకే వారిపట్ల ఆసక్తి ఏర్పడుతోందా? వారు మన ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదని చాలా తక్కువగానే వారికి తెలుసనేది స్పష్టం. మనలో ప్రతి ఒక్కరికీ దఖలుపడిన హక్కుల గురించి కూడా వారికి తెలిసింది చాలా తక్కువే. విచిత్రం ఏమిటంటే, వారిని రంగంలో ఉంచేందుకోవడమే? మనం సమయాన్ని, శక్తిని, వనరులనూ వెచ్చిస్తున్నాం. ఇది ఊరగాయల సీసాలో ముక్కల్లాగే తలపిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే వారి తరపున మనం నిర్ణయాలు తీసుకోవడమే అన్యాయం, అసమంజసం. మన గణతంత్ర రాజ్యంలో వారు భాగంగా లేరనిపించేలా ఇది ఉంటోంది. జరావాలను ఉన్నట్లుండి ప్రపంచం ముందుకు తీసుకురావటం వల్ల సొంత ప్రయోజనాలున్న బయటివారు వారికి పూర్తిగా హాని కలిగించేలా చేస్తుంది. సొంత ప్రయోజనాలు అంటే జరావాలు ఆధారపడి ఉన్న అడవులు లేదా వారి ఓట్లు వంటివి. వీటిలో రెండోదానికి అంత ప్రాముఖ్యత ఉండక పోవచ్చు. ఎందుకంటే జరావాల మొత్తం సంఖ్య 300 లేక 400 మాత్రమే. అయితే తక్కిన భారత్‌తో పోలిస్తే తమ పరిస్థితి గురించి అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేసే స్థాయిలో వారికి విద్య గరిపే విషయంలో కూడా ఎలాంటి గట్టి ప్రయత్నం జరిగి ఉండలేదు. వారి సమ్మతితో పనిలేకుండా మనం నిర్ణయిస్తున్నాం కాబట్టి నేను నైతిక ప్రశ్నను లేవనెత్తుతున్నాను. కానీ అత్యంత చిన్న స్థాయి లోని వారి పరిమాణం రీత్యా వారు ఇప్పటికే మనల్ని ఉనికిపరంగా భయపెడుతున్న సామా జిక బృందంగా ఉంటున్నారు. ఏరకంగా చూసిన ప్పటికీ వారి భవిష్యత్తు అనిశ్చితంగానే ఉంది. అయినప్పటికీ ప్రస్తుత విధానం ప్రకారం వారు తమదైన చిన్న ప్రాంతానికి పరిమితమై ఉండాల్సిందే. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
నిన్నటి హీరో నేటి విలన్!
విశ్లేషణ విజయ్ మాల్యా ఎన్ని తప్పులు చేసినా, ఎంపీలలో ఒక సెలబ్రిటీనే. ఆయన వారిలో ఒకరు కాడు, వారిలోని ఉన్నత శ్రేణికి చెందిన వాడు. తమలో ఒకడే అయిన అతగాడు హఠాత్తుగా విలన్‌గా ఎలా మారిపోయాడు? మాల్యా, మహారాజా లా జీవించిన వ్యాపార వేత్తగానే ఎక్కువగా కనిపించేవాడు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆర్థిక వ్యవహారాలలో లాగా తప్పుడు వ్యాపా ర నిర్ణయాలు తీసుకు న్నారు. ఆ తప్పుల వల్ల మాల్యా ప్రధాన కార్య రంగమైన లిక్కర్ వ్యాపార ప్రయోజనాలు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 750 కోట్ల డాలర్ల వరకు వచ్చిన ఆ నష్టాల నుంచి ఆయన ఐదేళ్లకుగానీ బయటపడలేదు. ఆ లిక్కర్ సామ్రాజ్యాధినేత అన్ని రాజ కీయపార్టీలతోనూ సంబంధాలున్న రాజకీయ వేత్త కూడా. కర్ణాటక నుంచి ఆయన రెండు దఫా లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది రెండవ దఫా. మొదటిసారి ఆయనను జనతాదళ్ (లౌకిక వాద) రాజ్యసభకు పంపగా, బీజేపీ, కాంగ్రెస్‌లు మద్దతిచ్చాయి. అవసరమైన దాని కంటే ఎక్కువ ఓట్లు రావడమే ఆయనకున్న వ్యాపార- రాజకీయానుబంధాన్ని చాలా వరకు చెబు తుంది. ఆయనలాంటి వారిని, వారికున్న వనరు లను చూశాక, కాదు అని చెప్పడం కష్టం. కింగ్‌ఫిషర్ ఎయిర్వేస్కు బ్యాంకులు అంత భారీ ఎత్తున రుణాలను ఇవ్వడాన్ని, వాటిలో కొంత భాగాన్ని అవి షేర్లుగా మార్చుకోవడాన్ని ఇది కొంత వరకు వివరించవచ్చు. రూ. 9,000 కోట్ల భారీ రుణం ఉన్నా మాల్యాను ఆ బ్యాంకులు సహా అంతా ఎంతో గౌరవంగా చూశారు. అందుకు భిన్నంగా, తమిళనాడుకు చెందిన రైతు జీ బాలన్ అప్పు చెల్లించ లేదని ఒక ప్రైవేటు బ్యాంకు ఏజెంట్లు, పోలీసులు కలిసి అతన్ని చావ బాదారు. పలువురు ఇతర రైతులు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. బ్యాం కుల నుంచి అప్పు తీసుకునేవారిలో స్పష్టంగానే రెండు రకాల వారుంటారు. నిర్దాక్షిణ్యంగా అప్పు తిరిగి చెల్లించేంతవరకు వెంటపడాల్సినవారు ఒక రకం బకాయిదారులు. ఇక అప్పులు తిరిగి చెల్లించలేకపోయినా, మళ్లీ అప్పులివ్వాల్సిన మాల్యాలాంటి వారు రెండో రకం. అప్పుల్లో మునిగిన రైతు మృత్యువు ఒడిలో దాక్కోవాలని చూస్తాడు. బ్యాంకుల క్రియాశీలంగాలేని ఆస్తులు పేరుకుపోయేలా చేసేవారు పారిశ్రామికరంగ నేతలవుతారు. వ్యాపారవేత్తలు ఎంపీలు కావడం గురించి పెద్దగా చర్చే జరగలేదు. మాల్యా వారిలో ఒకరు. ఏ పార్టీకీ చెందకుండానే ఇంకా పలువురు సభ్యు లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాంటి వారు చట్టనిర్మాణ సంస్థలోకి ప్రవేశానికి మార్గాన్ని కొనుక్కున్నారే మోనని భయం. ఎంపీ మాల్యా ఆ పదవికి ఎన్నిక కావడం వల్ల లభిస్తున్న గౌరవం వల్ల, ఈ ప్రపంచంలోని అతి పవిత్రమైన ఉన్నత వర్గ బృందాలలో ఆయన అత్యంత పలుకుబడి గలవారు కావడం వల్లనే ఆయన ఎంత పెద్ద అప్పు ఎగవేత దారైనా రక్షణ లభించడమే వైచిత్రి. భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్‌ను తలపెట్టేటప్పుడు ఆ.. విషయంలో జోక్యం చేసుకోవద్దని, వాటిని నిర్వహించడమెలాగో ప్రైవేటు రంగానికి తెలుసని ప్రభుత్వానికి చెప్పగల ధైర్యం ఆయనది. తన ఎయిర్‌లైన్స్‌లో ప్రజాధనాన్ని పెట్టడంలోనూ బహుశా ఆయన అలాంటి మాటలే చెప్పి ఉండొచ్చు. లోక్‌సభ, రాజ్యసభల సమావేశాలను గమనించేవారిలో ఎవరూ... ముఖ్యమైన చర్చలు జరుగుతుండగా మాల్యా వెనుక బెంచీలలో ఉండటమైనా చూశామని చెప్పలేరు. అయితే జూన్ 2010 నుంచి మార్చి 2016 మధ్య ఆయన హాజరు 30 శాతమని రాజ్యసభ ప్రొసీడింగ్స్ (పీఆర్ఎస్) చెబుతున్నాయి. పౌర విమాన యానం, లిక్కరుకు సంబంధించిన సమస్యలపై ఆయన ప్రశ్నలను లేవనెత్తారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ చెబుతోంది. అయితే పీఆర్ఎస్ సమా చారం ప్రకారం ఆయన 216 ప్రశ్నలు లేవ నెత్తారు. ఆ విధంగా చూస్తే, ఆయన ‘‘క్రియాశీల’’ ఎంపీ. ఇంతకూ ఆయన సభకు ఎలా హాజర య్యారనేదే కీలకమైన అంశం. అంటే ఆయన రిజిస్టర్లో సంతకం పెట్టి, రాజ్యసభ కార్యకలాపాలు జరిగే హాలులోకి ప్రవేశించ కుండా వెళ్లిపోగా, ఆ మరుసటి రోజునే ఆయన గురించి చర్చ జరిగీ ఉండొచ్చా ? ఆయన ఎక్కడికో తెలియని గమ్యానికి విమానంలో వెళ్లిపోయిన కారణంగా ఆగ్రహం వెలిబుచ్చిన ప్రతిపక్షంలోని ఆయన సహ ఎంపీలకు మాల్యా అప్పుల ఎగవేతదారని తెలియదా? ఆయన గమ్యం లండన్ కావ చ్చు లేక బహమాస్ కావచ్చు. కానీ ఆయన అంతకు ముందు రోజు వరకు వారితో భుజాలు రాచుకు తిరిగాడు. విజయ్ మాల్యా ఎన్ని తప్పులు చేసినా, ఎంపీలలో సైతం ఆయన సెలబ్రిటీనే అయి ఉండాలి. ఆయన వారిలో ఒకడు కాదు, వ్యాపారవేత్త కాబట్టి వారిలోని ఉన్నత శ్రేణికి చెందిన వాడు. తాను మీడియాపై ‘‘సహాయం, ఉపకారాలు, సర్దుబాట్లు’’ కురిపించడం గురించి ఆయన ట్వీట్ చేశాడు. అతగాడు చచ్చేంత ఆకర్షణను, ప్రచారాన్ని కొనుక్కున్నాడు. ఒక సినిమా పత్రికలో ప్రయోజనాలను కూడా కొన్నాడు. బ్యాంకులు అతను దేశం విడిచి పోరా దంటూ ఆయనపై ఆంక్ష విధించడానికి ముందు వరకు రోజుకో విమానంలో తిరిగాడు. తమలో ఒకడే అయిన అతగాడు హఠాత్తుగా ప్రతిపక్షానికి విలన్‌గా ఎలా మారిపోయాడు? మాల్యాకు ఒక విమాన సంస్థ ఉన్నా, పౌర విమానయానంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా ఉండేవాడు. ఇప్పుడాయన వాణిజ్య కమిటీ ప్యానల్లో ఉన్నారు. వ్యాపార వేత్తగా ఉంటూ రాజ్యసభకు ఎన్నికై, కమిటీలలో ఉన్న ఎంపీ గురించి ఎథిక్స్ కమిటీ దృష్టి పెట్టాల్సింది. అలా అని వ్యాపారవేత్తలు కాని రాజకీయవేత్తలకు ఏ ప్రయోజనాలూ ఉండవని కాదు. కానీ హఠాత్తుగా అంతా సచ్ఛీలురై పోయారు. అదే విడ్డూరం అనిపిస్తోంది. - మహేశ్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ఆ తొమ్మిది మంది మాటేమిటి?
సియాచిన్‌లో మంచు గడ్డల కింద కప్పడి పోయిన లాన్స్ నాయక్ హనుమంతప్ప, తర్వాత ఆసుపత్రిలో మరణించాడని తెలిసిందే. ఆయనకు నివాళులర్పించడం సము చితం, అందుకు ఆయన అర్హుడే. సగం విగతజీవిగా ఉన్న ఆయనను దేశమంతా ఊపిరి బిగబట్టి చూసింది. ఆయనను గుండె దిటవుగల యోధునిగా అభివర్ణించి దేశం కోసం ఆ సైనికులు చేసిన త్యాగాలను జాతి గుర్తించింది. సియాచిన్ మంచుకొండలపై అత్యంత ప్రమాదకర విధులను నిర్వహిస్తూ హనుమంతప్పతో పాటూ మరణించిన తొమ్మిది మంది సహ సైనికులు ఆయనకంటే తక్కువ వారు అవుతారా? వారికి గుర్తింపు లేకుండా పోవాల్సిందేనా? వారి గురించి మీడియా తెలిపిన దాన్ని బట్టి చూస్తే, వారి పేర్లు గుర్తుండటమూ కష్టమే. ఆ మాటకొస్తే, వాతావరణ సంబంధమైన కారణాలతో 2015 డిసెంబర్ మధ్య వరకు ఆ మంచుకొండలపై ప్రాణాలు కోల్పోయిన దాదాపు 869 మంది సైనికుల గురించి గుర్తుంచుకోవడమూ కష్టమే. నాటకీయతను అల్లడానికి ఉపకరిస్తుందనుకునే ఏ విషయం వెంటైనా మీడియా ఉద్వేగంతో కొట్టుకుపోతుంటుంది. దాని వల్ల లబ్ధిని పొందే వారు... ఈ సందర్భంలో సైన్యం... సంస్థాగతమైన తమ ధీరోదాత్త, సాహస సంస్కృతికి ఒక వ్యక్తిని ఉత్ప్రేక్షగా మార్చడాన్ని అభ్యంతరపెట్టదు. తాత్కా లికమైనదిగా లేదా చంచలమైనదిగా ఉండే మీడి యా ఆసక్తిని ఉపయోగించుకోగలగడం చక్కటి ప్రజాసంబంధాల నిర్వహణ అవుతుంది. కానీ సైన్యం అలాంటి ప్రచారాన్ని కోరుకోదనడంలో అనుమానమే లేదు. ఒక సంక్షోభం, దాని పర్యవసానాలకు సంబంధించి, తోటి సహచరుల నుంచి వేరుచేసి ఒకే ఒక్క వ్యక్తిపై దృష్టిని కేంద్రీకరింపజేసినందుకు మీడియా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సున్నా కంటే తక్కువ అతిశీతల పరిస్థితుల్లో గాలి ఇరుక్కున్న మంచుగడ్డల సందులో చిక్కుబడి పోకపోవడమూ, యోగాసనాలు వేసి ఉండక పోవడమూ మిగతా వారు చేసిన తప్పా? ఠీవిలోసింహంలాగా, ఒక బృందంలో ఎప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఉన్నవారు ఒకరుంటారు. ఆ ఒక్కరే అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సైన్యం, రెండు ముందస్తు షరతులపై ఆధారపడి పని చేస్తుంది. నాయకత్వ శ్రేణికి కట్టు బడి ఉండటం ద్వారా విజయం సాధించే పక్షంగా నిలవడం. ఇక రెండవది, సమష్టి కృషి. మంచు కొండ చ రియ విరిగిపడ్డప్పుడు, ఆ బృందంలో ప్రతి ఒక్కరూ తమ గురించి తామే గాక, తమ తోటి సైనికుని గురించి కూడా ఆలోచించే ఉంటారు. తామంతా చనిపోగా, తనకు ఒక్కడికే దిటవు గుండె గల యోధునిగా గుర్తింపు లభించడాన్ని హనుమంతప్ప కొపడ్ సైతం ఇష్టపడకపోవచ్చు. ఆయనే గనుక బతికి ఉంటే తన అదృష్టానికి, తనకు లభించిన శిక్షణకు ధన్యవాదాలు అర్పించేవాడు, తన తోటి సైనికుల కోసం దుఃఖించేవాడు. ఈశాన్య భారతంలో వలే మన సైన్యం అంతర్గత శాంతి పరిరక్షణ విధులను సైతం నిర్వహిస్తోంది. వారక్కడ సైనిక విధులను నిర్వహిస్తున్నది సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం కిందనే అయినా, పలు నష్టాలను చవిచూస్తున్నారు. కశ్మీర్ లోయలో మన సైన్యం, బీఎస్ఎఫ్తో కలసి మిలిటెన్సీతోనూ, ఉగ్రవాదులతోనూ తలపడుతోంది. కొన్ని సందర్భాలలో అది పౌరులపై దౌష్ట్యానికి పాల్పడు తోందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నా ప్రాణ నష్టాలను చవి చూస్తోంది. అలా మరణిస్తున్న సైనికులపై మీడియా ఇంతటి ఆసక్తిని కనబరచదు. సైనికులకు సంబంధించి ఏం జరిగినా దానికి అది అలవాటుగా మారిపోవడమే అందుకు కారణం. ఒక మిలిటెంట్ ఒక సైనికుడ్ని పేల్చేసినా అది దైనం దిన ఘటనే అయిపోతుంది. అందులో నాటకీయత కనబడదు. నాటకీయతకు అవకాశమున్న దేన్నయి నా మీడియా లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తూ, రుచికరంగా వడ్డించడమే 24/7 వార్తా ప్రసారాలలో విలువను నిలబెట్టగల ఔషధమని భావిస్తోంది. ఏదేమైనా మీడియా ఒక ఘటనను లేదా వ్యక్తిని లేదా ఇద్దరినీ తెగనాడేటప్పుడైనా లేదా కీర్తించేటప్పుడైనా గావు కేకలు పెట్టడం మానే యడం మంచిది. అలా అరవడం ఆ కథనం నిజ ప్రమాణాలను వక్రీకరిస్తుంది. దీనివల్ల అప్పుడ ప్పుడూ ప్రయోజనాలూ ఉంటాయి. అన్ని సందర్భా ల్లోనూ కాదని గుర్తుంచుకోవాలి. ఒక ఆడపిల్లపై జరిగిన పాశవిక అత్యాచారంపట్ల మీడియా చూపిన ఆసక్తి, అదృష్టవశాత్తూ మహిళల దుస్థితిపై దేశాన్ని జాగృతం చేయడానికి తోడ్పడింది. మీడియా ఆమెను నిర్భయ పేరుతో ప్రచారం చేసింది. కానీ ఆమెకు ఆ పేరును పెట్టినది దాని అర్థాన్ని బట్టికాదు. ఆ క్షణంలో ఆమె ఉన్న పరిస్థితులూ, మహిళలను మగాళ్లు తృణీకారంతో చూసేలా, భోగ వస్తువుగా, పైశాచిక ఆనందాన్నిచ్చే వస్తువుగా సైతం భావించేలా మలచిన సమాజమూ కలసి ఆమెను నిస్సహాయురాలిని చేశాయి. నిజానికి ఆ ఘోర అత్యాచార ఘటన తదుపరి మహిళలపై అత్యాచారాల సమస్యను చేపట్టి ముందుకు నడచిన ఇతర మహిళలే నిర్భయలు. తమ గొంతులు విప్పాలని, బహిరంగంగా, మూకుమ్మడిగా ఎలుగెత్తాలని వాళ్లు నిశ్చయించుకున్నారు. ఏవి వార్తలు, ఏవి కావని చూసే భిన్న పద్ధతు లు ఉన్నాయి. విషయ పరిజ్ఞానం గల పౌరులు ప్రజాస్వామ్యానికి ఆవశ్యకం. కాబట్టి ప్రజలకు అవసరమైన, నమ్మదగిన, ఉపయోగకరమైన సమాచారాన్ని అందించడం ఒక పద్ధతి. వివాదాలను ప్రేరేపించి, ప్రజా సమస్యలపై నిలువునా రెండు పూర్తి వ్యతిరేక దృక్పథాల శిబిరాలుగా చీల్చి అమర్యాదకరంగా పోట్లాడు కునేలా చేయడం మరో పద్ధతి. ఇక మూడోది, వివాదాన్ని వినోద కార్యక్రమంగా మార్చేయడం. వార్తల పేరిట మీడియా మీకు అందిస్తున్నవి వాస్తవంగా మీ జీవితాలలో ఏమైనా మార్పును కలుగజేస్తాయా అని మీకు అనుమానం రాలేదా? సియాచిన్ మంచు కొండచరియ తుంచేసిన మిగతా తొమ్మిది మంది సైనికుల మృతి మీడియాను తాకనట్టుగా... ఆ వార్తలలో అత్యధికం మీ జీవితాన్ని తాకేవి కానే కావని అనిపించలేదా? మీడియా ద్వారా తరచుగా మనకు లభించేవి అనావశ్యక విషయాల హిమపాతాలే. విశ్లేషణ; మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
కంటి తుడుపు పట్టింపు
విశ్లేషణ భారత జనాభాలో రెండు శాతానికి పైగా వికలాంగులు. ఇతర దేశా లతో పోలిస్తే మన దేశంలో వికలాంగుల శాతం తక్కువే. కానీ సంఖ్య రీత్యా మూడు కోట్ల వరకు ఉన్న వివిధ రకాల వికలాంగులంటే ఓ మధ్యస్త స్థాయి దేశ జనాభా అంత. ఇదేమీ పట్టించుకోకుండా వదలేయ గలిగేది కాదు. ఆందోళన కలిగించాల్సిన వాస్తవం, ఏమైనా చేయాల్సి ఉన్న విషయం. ‘బెస్ట్’ అనే పొట్టి పేరుతో పిలిచే ముంబై ముని సిపల్ రవాణా వ్యవస్థ వైఖరి మాత్రం అందుకు విరుద్ధమనిపిస్తుంది. వికలాంగులకు ఎక్కడం, దిగ డం సులువుగా ఉండే లో-ఫ్లోర్డ్ బస్సులను ప్రవేశ పెట్టడానికి వ్యతిరేకంగా అది తీర్మానం చేసింది. ఏదో కంటి తుడుపుగా అలాంటి కొన్ని బస్సులను నడిపితే చాలనేదే దాని సాధారణ వైఖరిగా ఉంది. బస్సులన్నిటినీ వికలాంగులకు అనువైనవిగా ఉండేట్టు చేసి, తద్వారా గర్వించదగ్గ గుర్తింపును సాధించాలనే మంచి ఆలోచన మాత్రం వారికి పుట్టలేదు. పేవ్మెంట్లన్నీ రోడ్డు మీది నుంచి ఒకే ఎత్తులో ఉండేలా చేయాలనీ, బస్సుల్లోకి ఎక్కి దిగడం సులువుగా అవి పేవ్మెంట్ అంచుకు దగ్గరగా ఆగేలా చేయాలనీ తన మాతృసంస్థయైన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబైని కోరాలనే యోచన సైతం దానికి రాలేదు. వాస్తవంలో వికలాంగులు బస్సులోకి ముందు ద్వారం గుండా ఎక్కి, దిగాల్సిందే. వారికి కేటా యించిన సీటు సరిగ్గా ముందు టైరుకు ఎగువన ఉంటుంది. వికలాంగుల పట్ల మనకున్న శ్రద్ధ ఆపాటిది... అసలంటూ అది ఉంటే. రోడ్డు పక్క పాదచారులు నడిచే బాటలు మునిసిపల్ సంస్థల ప్రమాణాలకు తగ్గట్టుండవు. అలాంటివి ఉన్న సందర్భాల్లో కూడా... ఒక్క నడవడానికి తప్ప, పార్కింగ్ నుంచి వ్యాపారాల వరకు వాటికి ఇతర ఉపయోగాలుంటాయి. ఈ నామమాత్రపు పట్టిం పునకు తగ్గట్టు 42,000 బస్సుల్లో ఓ 30 బస్సులంటే పెద్దగా లెక్కలోకొచ్చేవి కావు. వికలాంగులకు అవి మరింత ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చేయ డం ఎలా? అనేది ఎన్నడూ బహిరంగ చర్చకు రాలేదు. విమానాశ్రయంలో సైతం సమస్యను ఎదుర్కొనే వికలాంగులకు టీవీ చానల్ అందు బాటులో ఉండటం గురించి చెప్పనవసరమే లేదు. ఒక దేశంగా మనం వికలాంగుల పట్ల సాను కూల వైఖరిని చూపే బాపతు కాదు. అంధులను ‘విజ్యువల్లీ ఇంపైర్డ్’ అనీ, బధిరులను ‘హియరింగ్ -ఛాలెంజ్డ్’ అనేసి, వారికి ఆ పాటి గౌరవ ప్రదర్శన చాలని భావిస్తాం. ఇక చేతల్లోనైతే, సమస్యలనె దుర్కొనే ఈ ప్రజా సమూహం పట్ల రవ్వంత గౌరవమైనా చూపం. వారి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనదంతా చేయడానికి బదులు మనం కంటి తుడుపువాదంలో లోతుగా కూరుకుపోయాం. ఉదాహరణకు, ముంబై నగర రైళ్లలో వికలాం గుల కోసం కంపార్ట్మెంట్లో ఒక భాగాన్ని రిజర్వు చేసి, కాలి నడక వంతెనలకు బాగా దగ్గరగా అవి ఆగే ఏర్పాటు చేశారు, అంతే. కిటకటలాడే జనం మధ్య నుంచి వారు ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కడం ఎలా? అసలా వంతెన మెట్లు ఎక్కి దిగేదెలా? అనేది ఎవరికీ పట్టలేదు. తమను ఎత్తుకుని మోయడానికి వాళ్లు పోర్టర్లను పెట్టుకోలేరు. ఆ రైళ్లు వర్ణనాతీత మైనంత అసాధారణంగా కిక్కిరిసి ఉంటాయని ఎవరైనా అంగీకరించాల్సిందే. అయినాగానీ, ఆరో గ్యవంతుడైన ఏ వ్యక్తీ ఆ కంపార్ట్మెంట్ను దురా క్రమించే ప్రయత్నం చేయడు. అంటే సమాజం వికలాంగుల పట్ల శ్రద్ధ చూపుతోందిగానీ, అధికా రులు, సేవలను అందించేవారికి మాత్రమే అది లేదని అర్థం. వైకల్యమంటే ఏమిటో సామాన్యునికి తెలుసు. అధికారులకు మాత్రం చాలా విషయాల్లో అదీ ఒకటి, అంతే. ఈ శతాబ్ది మొదటి దశాబ్దిలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. నెలల తరబడి ఆయన రెండు కాళ్లూ కట్లతో ఉండాల్సి వచ్చింది. సెక్రటేరియట్లో ఆయన లిఫ్ట్‌లను చేరుకోవడం కోసం వాలు దారిని (ర్యాంప్) నిర్మించారు. అసెంబ్లీ హాల్లో ట్రెజరీ బెంచీల వరకూ కూడా వాలు దారి వేశారు. కొట్ట వచ్చినట్టున్న ఈ మార్పులను చూసి ఏ సభ్యుడూ... ఆయనలాంటి మిగతా వారికి కూడా ఏ ఇబ్బందీ కలుగకుండా ఇలాంటి శ్రద్ధ చూపిస్తారా? అని అడగ లేదు. పాటిల్‌ది తాత్కాలిక వైకల్యమే. నేను ఈ విష యాన్ని లేవనెత్తేవరకు, ఆయన సైతం ప్రభుత్వ భవ నాలైనా వికలాంగులకు అనువుగా ఉండేలా చేయ డానికి నామమాత్రపు నిధులను కేటాయించలేదు. కాళ్లూచేతుల తొలగింపునకు గురైనవారి నుంచి అంధత్వం, బధిరత్వాల వరకు వైకల్యాలు విభిన్న మైన వి. అందరికీ చక్రాల కుర్చీ లేదా ఊత కర్రలు అవసరం లేకపోవచ్చు. బహుశా బ్రెయిలీ మాత్రమే వికలాంగులకు కల్పించిన ఏకైక ప్రత్యేక సదుపా యం కావచ్చు. ఆటిజం, హైపర్ యాక్టివ్ సిండ్రోమ్ మొదలైన వాటికి కూడా మద్దతు అవసరమని గుర్తించడం అవసరం. ఆటిజంతో బాధపడుతున్న బాలుడిని బయటకు తీసుకుపోవడానికి వెంట ఓ టీచర్‌ను పంపడానికి జేబులు ఖాళీ అయ్యేంత భారీ ఫీజును వసూలు చేసే ఒక స్కూలు గురించి నాకు తెలుసు! ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సురక్షి తంగా నడవగలిగే ఫుట్‌పాత్ వంటి చిన్న సదు పాయాలను సైతం వికలాంగులకు నిరాకరి స్తున్నాయి. రోడ్డు పక్క గతుకులతో కూడిన గరుకైన పాదచారుల బాటమీద ఊతకర్రలతో నడవడాన్ని లేదా చక్రాల కుర్చీని ఉపయోగించడాన్ని ఊహించు కోండి. ఇక తెల్ల బెత్తాన్ని ఉపయోగించేవారు పడితే, ఒక్కోసారి మూతలేని మ్యాన్హోల్లోనైనా పడ వచ్చు. ఎక్కడైనా ఫుట్పాత్లుంటే, అవి కుంటి తనం, అంధత్వం లాంటివేవీ లేని సాధారణ వ్యక్తులను సైతం గాయపరచి, వైకల్యానికి గురిచేయవచ్చు. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
పేరు మార్చితే పిలుపు మారునా?
విశ్లేషణ: స్థలాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలు వాటిని వాడుకగా ఎలా పిలుస్తుంటారో ఆ పేర్లు మారవు. ముంబైలోని మహాత్మాగాంధీ రోడ్డులోని ఒక భాగం పేరు సాధారణ వాడుకలో ఎప్పటికీ ‘మెరైన్ లైన్స్’ గానే ఉంటుంది. అలాగే సుభాష్ చంద్రబోస్ రోడ్డును ‘మెరైన్ డ్రైవ్’ అనే అంటారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు పొడవునా ఉన్న కట్ట ట్యాంక్బండ్గానే ఉంటుంది. భారత రైల్వే సర్వీసులు ప్రారంభమైన స్టేషన్‌గా ఘనత వహించిన విక్టోరియా టెర్మినస్ (ముంబై) పేరును అప్పుడే ఛత్రిపతి శివాజీ టెర్మినస్‌గా మార్చేశారు. దానికి పొట్టి పేరైన ‘వీటీ’ స్థానంలో ‘సీఎస్టీ’ జనం వాడుకలోకి వచ్చేసింది. ఆ తర్వాత, అంతవరకు కేవలం ముంబై ఎయిర్‌పోర్ట్‌గానే ఉన్న డొమెస్టిక్ విమానాశ్రయానికి కూడా ఆ మహారాష్ట్ర యోధుని పేరు పెట్టారు. ఒక రోజున, నేను యూరప్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా, విమానం ముంబైలో దిగుతున్నప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రకటన కాస్తా ‘‘మనం త్వరలోనే ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో దిగబోతున్నాం’’ అని వచ్చింది. విమానంలో రాత్రి తాగిన వోడ్కా అయోమయానికి తెల్లారే ముందటి నిద్ర మబ్బుతోడై... విమానం రైల్వే స్టేషన్లో దిగడమా? అని ఆశ్చర్యపోయాను. ఆ పేరు మార్పు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని నాకు తెలిసినా, మార్చిన విషయాన్ని యూరప్‌లోని పేపర్లు తెలుపలేదు. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, కనీసం మహారాష్ట్రలోనైనా ఇక ముందు అలాంటి గందరగోళం తలెత్తే అవకాశం తక్కువ. మహారాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట ఏ రెండు స్మారక స్థలాలకు ఒకే పేరు పెట్టకూడదని నిర్ణయించింది. మున్నాభాయ్ కనిపెట్టినట్టు మహాత్మాగాంధీ పేరిట చాలానే స్మారక చిహ్నాలున్నాయి. కానీ నిజాయితీ, ధైర్యం అనే ఆయన సూత్రాలను ఒంటబట్టించుకున్నవాళ్లు మాత్రం లేరు. ఆ కారణంగానే దేశం నైతిక విలువల విషయంలో దిగజారిపోయింది. అదేసమయంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ.... ఇకపై అన్ని విమానాశ్రయాలకు అవి ఏ నగరాలు, పట్టణాలకు సేవలనందిస్తుంటే ఆ పేర్లతోనే గుర్తించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఆ కొలబద్ధతో చూస్తే హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావాలి. బేగంపేటలో ఉన్న చిన్న విమానాశ్రయం, ఎన్టీ రామారావు ఎయిర్పోర్ట్ కావడానికి ముందు ఆ పేరుతోనే ఉండేది. వాస్తవానికి, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరుపెట్టాలంటూ తలెత్తిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. మన రైల్వే స్టేషన్లకు అవి ఉన్న స్థలాల పేర్లనే పెట్టాలి అనేది కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన వెనుకనున్న వాదన. ప్రయాణికులకు, ప్రత్యేకించి మొదటిసారి ప్రయాణికులకు ఎక్కడ దిగాలో తెలిపే అద్భుతమైన, సరళమైన పద్ధతి అదే. కానీ నిజానికి అన్ని స్టేషన్లకు అలా అవి ఉన్న స్థలాల పేర్లే లేవు. నేను కనీసం ఒక ఉదాహరణనైనా చెప్పగలను. అది, మహారాష్ట్రలోని నాందేడ్. నాందేడ్ రైల్వే స్టేషన్ అసలు పేరు ‘‘హుజూర్ సాహెబ్ నాందేడ్’’. సిక్కు గురువులలో ఒకరైన గురు గోవింద్‌సింగ్ 18వ శతాబ్ది మొదట్లో ఆ పట్టణాన్ని సందర్శించారు. ఆయన అక్కడ ఉండగా లంగర్‌ను (తరతమ భేదాల్లేకుండా అందరికీ భోజనాన్ని వండి వడ్డించే సిక్కు పవిత్ర స్థలం) ఏర్పాటు చేసి వెళ్లారు. తర్వాత ఆ ప్రదేశంలో గురుద్వారాను నిర్మించారు. అది సిక్కు మతస్తులకేగాక, ఇతరులకు కూడా పవిత్ర ప్రార్థనా స్థలం. కేవలం ‘నాందేడ్’ అంటే సరిపోదని మీకు ముందే తెలిసి ఉంటే తప్ప, ఐఆర్టీసీ వెబ్సైట్ ద్వారా మీరు నాందేడ్‌కు టిక్కెట్టు కొనాలని చూస్తే అదో పెద్ద పనే అవుతుంది. స్థలాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలు వాటిని వాడుకగా ఎలా పిలుస్తుంటారో అది మాత్రం మారదు. ముంబైలోని మహాత్మాగాంధీ రోడ్డులోని ఒక భాగం పేరు సాధారణ వాడుకలో ఎప్పటికీ ‘మెరైన్ లైన్స్’ గానే ఉంటుంది. అలాగే సుభాష్‌చంద్రబోస్ రోడ్డును ‘మెరైన్ డ్రైవ్’ అనే అంటారు. అధికారికమైన పేరు ఏమైనాగానీ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు పొడవునా ఉన్న కట్ట ట్యాంక్బండ్గానే ఉంటుంది తప్ప మారదు. కొన్ని పేర్లు ప్రజల ఆదిమ జ్ఞాపకంలో పాతుకుపోతాయి. వాటికి కొత్త పేర్లు తగిలించినంత మాత్రాన అవి మారవు. ఢిల్లీలో ఎంత మంది ఆటో రిక్షావాలాను ‘డాక్టర్ అబ్దుల్ కలాం రోడ్డు’కు తీసుకుపొమ్మని అడుగుతారో, ఎందరు తుగ్లక్ రోడ్టుకు తీసుకుపొమ్మని అడుగుతారో మీరే గమనించండి. పేర్లను మార్చడం ఎంత వ్యర్థ ప్రయాసో మీకే విశదమౌతుంది. తుగ్లక్ రోడ్డు అనేదే ప్రజల వాడుకలో ఉంటుందని నేను పందెం కాస్తాను. అందుకు కారణం తుగ్లక్ గొప్పవాడు కావడం, కలాం తక్కువవాడు కావడం కాదు. ప్రజల వాడుకలో ఉండటమే అందుకు కారణం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
తన కాలానికి ముందు నడిచిన రైతు నేత
నివాళి ‘రైతు ఇంక ఏమాత్రం రైతుగా మిగలని రోజు వస్తుంది’ అంటూ కర్నూలుకి చెందిన రాజకీయనేత మద్దూరి సుబ్బారెడ్డి తరచుగా చేస్తూవచ్చిన హెచ్చరికను నేను శరద్ జోషితో పంచుకున్నప్పుడు నాతో ఏకీభవించారు. ’మీరు కర్నూలులో ఆ సత్యాన్ని గ్రహించారు. నేను కూడా ఆ విషయాన్నే చెబుతూ వస్తున్నాను’ అన్నారు. కానీ ఈ హెచ్చరికల్లో వేటినీ ఎవరూ పట్టించుకోలేదు. వినిపించుకోలేదు. రాజకీయ పక్షపాతం నేపథ్యంలో రైతు సమస్యలు పరిష్కారం కావని జోషి నిత్యం చెబుతూనే వచ్చారు. మహారాష్ట్రలోని పుణేలో 80 ఏళ్ల వయస్సులో కన్నుమూ సిన రైతు నేత శరద్ జోషి కాలానికి ముందున్న వ్యక్తి. వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు చెల్లించాలనీ, అదే సమయంలో, తాను ఏ పంటలు పండించుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకు ఉండాలని ప్రబోధించిన వ్యక్తి జోషి. ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి నామమాత్రపు పెంపుదలతో కూడిన ధాన్య సేకరణ ధరలను నిర్ణయిస్తుం డటంవల్ల వ్యవసాయానికి ఆటంకం కలగడమే కాకుండా వ్యవసాయాన్ని ప్రతిఫలం లేనిదిగా మార్చివేస్తోందని ఆయన నొక్కి చెప్పారు. ‘‘మాకు సరైన ధర చెల్లించండి. మా గ్రామాల్లో ప్రభు త్వాన్ని మేం కోరుకోం. మంచి వేతనం పొందే ఉపాధ్యాయు లతో మేం మా సొంత ప్రైవేట్ పాఠశాలలను నడిపించుకో గలం. పనిచేయని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులకు బదులుగా ఫీజులు చెల్లించి మరీ వైద్యసేవలు పొందగలం’’ అంటూ జోషి హేతుపూర్వక వివరణ ఇచ్చారు. రైతులు గడుపుతున్న జీవితం తీరును ఆయన మాటలు చెబుతాయి. ఆయన ప్రతిపాదన వడ్డీవ్యాపారుల పీడన నుంచి రైతు లోకాన్ని బయట పడేస్తుంది. 1980లలో ఉల్లి ధరలు కుప్పగూలినప్పుడు, నాసిక్ సమీపంలోని లాసల్గావ్ మార్కెట్‌ను శరద్ జోషీ మూసివే యించారు. అది దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్. రైతులు తాము అమ్మలేని ఉత్పత్తులను వెనక్కు తీసుకెళ్లేందుకు ట్రక్కర్లకు డబ్బులు కూడా చెల్లించలేక నిరసన తెలుపుతూ తమ వ్యవసాయ ఉత్పత్తులను రహదారుల మీదే పడవేసి వెళ్లిపోయేవారు. అప్పుడే ఆయన స్వేచ్ఛా మార్కెట్‌ను సమ ర్థించే సిద్ధాంతవేత్తగానే కాకుండా, ఆందోళనకారుడిగా మారి రైతు సమర్థకుడిగా వెలుగులోకి వచ్చారు. రాజకీయ నేతలు, రాజకీయాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నది ఆయన అభిప్రాయం. తాను అన్నమాటలో మరీ అంత తప్పేమీలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఉల్లి ధరలు చుక్కలంటినప్పుడు, శరద్ జోషి పేరును పోలి ఉన్న శరద్‌పవార్ ‘అధిక ధరలు ఉన్నాయంటే రైతులకు ప్రయోజనం కలుగుతోందని అర్థం’ అంటూ పరా చకాలాడారు. పవార్ స్పష్టంగానే వినియోగదారుల తోలు వలుస్తున్న మధ్య దళారీలను మర్చిపోయారు. జోషి ఉద్దేశంలో తగిన ధరలు అంటే రైతుల సంక్షేమం పునాదిగా ఉండాలి. ఎం.ఫిల్ పూర్తి చేసి భారతీయ తపాలాశాఖ ఉద్యోగిగా ఉండి ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అయిన యూనివర్శల్ పోస్టల్ యూనియన్‌లో పనిచేసిన ఈయన రైతు సమస్యను తన జీవిత లక్ష్యంగా ఎందుకు ఎంచుకున్నట్లు? ఎందుకంటే ఐక్యరాజ్యసమితిలో దశాబ్దం పాటు పనిచేసిన కాలంలో వ్యవసాయ రుణాల కోసం భారతీయ నేతలు బిక్షాపాత్ర పట్టుకుని తిరగటాన్ని జోషి చూస్తూవచ్చారు. అయినా రైతులు ఎందుకు సంతోషంగా ఉండలేకపోయారు? వ్యక్తి గత వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా రైతులు ఆత్మ హత్యలకు పాల్పడటానికి ముందు రోజుల మాట ఇది. తర్వాత ఆయన భారత్‌కు తిరిగివచ్చి భూమి కొను గోలు చేసి వ్యవసాయం ప్రారంభించారు. బతకడానికి వ్యవ సాయం తగిన వృత్తిగా లేదేమో అన్న భయాలను ఆయన పక్కన బెట్టేశారు. ‘రైతు ఇంక ఏమాత్రం రైతుగా మిగలని రోజు వస్తుంది’ అంటూ కర్నూలుకి చెందిన రాజకీయనేత మద్దూరి సుబ్బారెడ్డి తరచుగా చేస్తూవచ్చిన హెచ్చరికను నేను జోషితో పంచుకున్నప్పుడు ఆయన నాతో ఏకీభవిం చారు. ‘మీరు కర్నూలులో ఆ సత్యాన్ని గ్రహించారు. నేను కూడా ఆ విషయాన్నే చెబుతూవస్తున్నాను’ అన్నారు. కానీ ఈ హెచ్చరికల్లో వేటినీ ఎవరూ పట్టించుకోలేదు. వినిపిం చుకోలేదు. గ్రామాల్లో తాను నిర్వహించిన లెక్కలేనన్ని సమావే శాల్లో జోషీ ప్రారంభంలోనే చెబుతూ వచ్చిన మాటేమి టంటే, రాజకీయ పక్షపాతం నేపథ్యంలో రైతు సమస్యలు పరిష్కారం కావనే. తన కేంపెయిన్‌లో చేరదల్చుకున్నవారు ‘‘తమ రాజకీయ తొడుగులను, జెండాలను ఇంటివద్దే వది లేసి రావాల’’ని ఆయన తేల్చి చెప్పేవారు. రైతు సమస్య లపై పోరాట నిమగ్నత రాజకీయ విశ్వాసాలకు అతీతంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం. అయితే తనకు తాను గా విధించుకున్న నిబంధన నుంచి ఆయనే తప్పుకోవాల్సి వచ్చింది. తన పోరాట రంగస్థలాన్ని దేశంలో ప్రధాన పంచాయతీ అయిన పార్లమెంటుకు తీసుకుపోవడానికి ఆయన శివసేన మద్దతు కోసం కూడా ప్రయత్నించారు. ఒకప్పుడు ఇదే శివసేనను ఆయన ‘మతతత్వం’ పునాదిగా పెరిగిన ‘రాబందులు’గా వర్ణించారు. లోక్‌సభలో రైతు సమస్యకు అనుకూల ఓటును పొంద డానికి పలు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన రాజ్యసభ తలుపులు తట్టారు. కమ్యూనిస్టులకు లాగే ఈయన కూడా రైతులను నిరంతరం సమీకరించడంపైనే విశ్వాసం పెట్టుకు న్నారు. ఆయన వెన్నంటి నడిచినప్పుడు తాను నిర్వహించే కేంపెయిన్ ఎంతో భిన్నంగా ఉండేది. రైతు సమావేశాలను ఎక్కడైనా ఇళ్లలోపలే నిర్వహించేవారు. పెద్ద గదిలోనో, లేదా మిద్దెపైనో స్థలం విశాలంగా ఉంటే అక్కడకూడా సమా వేశాలు నిర్వహించేవారు. లౌడ్ స్పీకర్ల అవసరం ఉండేది కాదు. ఆయన ఖర్చులు కూడా తక్కువే. కేంపెయిన్ చేస్తున్న ప్పుడు ఎవరు ఏది పెడితే దాన్నే ఆరగించేవారు. రాజాజీ స్వతంత్ర పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసు కుపోవడానికి జోషి ‘స్వతంత్ర భారత్ పక్ష్’ అనే సొంత పార్టీని ఏర్పాటు చేయవలసివచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని సోషలిజం పేరుతో ప్రమాణ స్వీకారం చేయవల సిందిగా బలవంతం చేయవలసిన అవసరం లేదంటూ జోషి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదారవాద సమర్థకుడికి సోషలిజం అనే పదం చేదుమాత్రలా ఉంటుం దని ఆయన ఉద్దేశం. దీనికి సంబంధించి ఆయన రాజ్య సభలో ఒక ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇందిరాగాంధీ హయాంలో ‘లౌకికవాదం’ అనే పదాన్ని చొప్పించి నందున రాజ్యాంగంలో ‘సోషలిజం’ అనే పదం కొనసాగుతోంది. అయితే ఉచిత విద్యుత్తు, రుణ మాఫీలను డిమాండ్ చేయడంలో ఒక స్పష్టమైన వైరుధ్యాన్ని ఆయనలో గమనిం చవచ్చు. ధరవరలపై ప్రభుత్వ విధానాల కారణంగా రైతు లు తీవ్రమైన ఆర్థిక అసమగ్రతా స్థాయిల్లో కూరుకుపోతు న్నంత కాలం ఈ డిమాండ్ చేయవలసిందేనని ఆయన అభి ప్రాయం. రైతు సమస్యలపై లాబీ చేస్తున్నామని చెప్పుకునే ఇతరుల్లాగా కాకుండా, అయన అధిక ధరల డిమాండ్ వద్దే ఆగిపోయేవారు కాదు. రైతులకు ప్రయోజనం కలిగించే ఏకైక సాధనంగా స్వేచ్ఛామార్కెట్ కోసం ఆయన కేంపె యిన్ చేశారు. రైతులు లబ్ధి పొందితే ఇతరులూ ప్రయో జనం పొందుతారన్నది ఆయన విశ్వాసం. ఆయన సాగించిన రైతు సమీకరణలో ఆసక్తికరమైన అంశం ఏదంటే, ఆయన కేంపెయిన్లలో ప్రముఖ పాత్ర వహించిన కార్యకర్తలందరూ ఆయన తోటే కొనసాగేవారు కాదు. విభేదాల కారణంగా వారు తమ తమ మార్గాలను ఆశ్రయించేవారు కానీ రైతు సమస్యను మాత్రం ముందుకు తీసుకెళ్లేవారు. అందుకే ‘షేత్కారి సంఘటన’ను ముద్రిం చిన పోస్ట్‌బాక్స్ ఎరుపు రంగు పిన్ను ధరించడం వారు కొన సాగించేవారు. ఆయన సంస్థ సార్వత్రికమైనదని దీనర్థం. విభే దాలవల్ల వారు విడిపోయనప్పటికీ అదేమంత పెద్ద విషయం కాదు మరి. - మహేశ్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
మృత్యురేఖలవుతున్న పట్టాలు
గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు. ముంబైకి సంబంధించిన పలు విషయాలు సాధార ణంగా భారీ సంఖ్యలతో కూడి ఉంటాయి. నగర జనాభా 1.24 కోట్లు. దాదాపు సగం జనాభా మురికివాడల్లో ఉంటూ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుంటుంది. నగరపాలక సంస్థకు చెందిన రవాణా శాఖ దాదాపు 4 వేల బస్సులను నడుపుతుంటుంది. దాని ప్రతిష్టాత్మకమైన స్థానిక రైళ్లు ప్రతిరోజూ 70 లక్షలమంది ప్రయాణికులను తీసుకుపోతుంటాయి. వీటిలో దాదాపు 2,913 రైళ్లు తమ తమ ట్రాక్‌లపై రోజుకు 20 గంటలపాటు సాగిపోతుంటాయి. నగరం లోపలినుంచే కాకుండా శివార్ల నుంచి ప్రయాణించి వచ్చే వారిని కూడా రెండు గంటలపాటు అటూ ఇటూ రవాణా చేస్తున్న రైల్వేలను ఈ అంశమే నగర ఆర్థిక కార్యాచరణలో కీలకంగా చేస్తోంది. ప్రయాణం మాత్రం అమానుషమైన పరిస్థితుల్లో సాగుతుంటుంది. పరిమితికి మించిన జనం రైళ్లలో ఏ స్థాయిలో కిక్కిరిసి ఉంటారంటే, రైల్వేలు దానికి కొత్త వ్యక్తీకరణను కూడా కనుగొనవలసి వచ్చింది. ఈ పరిస్థితిని ‘రద్దీవేళల్లో కిక్కిరిసిన జనం సూపర్ రాపిడి’ అంటూ రైల్వేలు పిలుస్తున్నాయి. కోచ్‌లలోకి ప్రవేశించే చోట, లోపలకి దూరడమో లేదా పడిపోవడమో తప్పదనిపించే స్థితిలో, కిందినుంచి రైల్లోకి ఎవరో ఒకరు తోసుకుని ప్రవేశించి మిమ్మల్ని అడ్డుకోకముందే మీరు రైల్లోంచి దిగాల్సి ఉంటుంది. రైలులోపల జనం పరస్పరం ఎంత దగ్గరగా కరుచుకుని ఉంటారంటే అది రోజువారీగా జరిగే నిర్బంధ ఉపద్రవాన్ని, పీడనను తలపిస్తుంది. రైల్లో సీటు దక్కించుకోవడం అంటే అది వరమే మరి. సీటు అంచులో కూర్చోవడానికి మీకు అవకాశం ఇస్తే మీ సహ ప్రయాణీకులకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. రైలు లోపల మీరు పొందగలిగేది అదే. కాని అది ఇతరుల దయ మాత్రమే. సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ముంబై లోకల్ రైళ్లు నడుస్తుంటాయి. కాలానుగుణంగా వాటి పొడవు కూడా పెరుగుతూ వస్తోంది. మొదట్లో ఇవి 9 కోచ్‌లతో ఉండగా తరవాత వీటి సంఖ్య 12 కోచ్‌లకు పెరిగింది. ఇంకా ఎక్కువమందికి అవకాశం కల్పించడం కోసం కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం కోచ్‌ల సంఖ్య 15కు పెరిగింది. కానీ నేటికీ ప్రయాణికులకు ఉపశమనం లేదు. రైలు ప్రయాణం ఇప్పటికీ అభద్రతతోనే సాగుతోంది. కిక్కిరిసి ఉండటం చేత ప్రయాణికులు రైళ్ల నుంచి పడిపోతుంటారు. అంటే కొంతమంది తలుపు అంచుల వద్ద కడ్డీని పట్టుకుని మునిగాళ్లపై వేలాడుతూ ప్రయాణిస్తుంటారని దీనర్థం. గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు. ఇక్కడ కేవలం రైల్వేనే నిందించడానికి లేదు. పాదచారులకోసం నిర్మించిన వంతెనలు చాలినంతగా లేవు. వీటిని సైతం రైల్వేలనే అంటిపెట్టుకుని ఉండే హ్యాకర్లు అడ్డుకుంటుంటారు. నిస్సందేహంగా అవసరం లేని సమయంలో పట్టాలు దాటేవారు తప్పు దారి పట్టినవారే అయి ఉంటారు. కొంతమంది తప్పుదారి పట్టిన కుర్రాళ్లు తమ సాహస ప్రవృత్తిని చాటుకునేందుకోసం రైలు తలుపుల వద్ద ఉన్న కడ్డీని పట్టుకుని వేలాడుతూ ఒకకాలిని ప్లాట్‌ఫాం మీద మోపి ప్రదర్శన చేస్తుంటారు. అయితే మృతుల జాబితాలో వీరి సంఖ్య పెద్దగా లేదు కాబట్టి రైలు ప్రమాద మృతుల సంఖ్య పెరగటానికి సంబంధించి ఇలాంటివారిపై నింద మోపలేము. పని స్థలానికి వెళ్లడానికి లేదా ఇళ్లకు వెళ్లడానికి ఆత్రుతగా ఉండే ప్రయాణికులు రైలు కదులుతున్నప్పుడు కూడా ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తర్వాతి రైలు కూడా తక్కువ రద్దీతో వస్తుందనడానికి లేదు. కాబట్టి రైల్వేలు తగిన నిర్వహణ వనరుల్లేక సతమతమవుతూ, ఆదివారం మరమ్మతుల కోసం కొన్ని సర్వీసులను మూసివేస్తున్నప్పటికీ, మెట్రోపాలిటన్ ప్రాంత జీవనరేఖగా పిలుస్తున్న స్థానిక రైళ్లలో భద్రత అనేది అత్యంత ఆవశ్యకమైనదిగా మారింది. కొత్తగా రూపొందించిన రైలుపెట్టెలు ఉండవలసిన దానికంటే ఎత్తుగా ఉండటంతో రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంలకు మధ్య ఖాళీలు ఉంటూ కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్పుడు కీలకమైన వివరణలు ఎలా పక్కకు పోతున్నా యన్న దాన్ని ఇంకా స్పష్టం చేయడం లేదు. ఇలా రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంకు మధ్య ఖాళీలవల్ల ప్రయాణికులు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు జారిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు అడపాదడపా కాకుండా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరగవు, వాటిని మనుషులే చేస్తారు అనే వాదనకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. అలాగే ఫుట్‌బోర్డు మీద నిలిచి ప్రయాణించేవారు కదులుతున్న రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. కానీ పశ్చిమ లేదా మధ్య రైల్వే ఇలాంటి వాటిని తమ తప్పిదంగా అంగీకరిస్తున్నట్లు లేదు. రైల్వే తన నిర్వహణా తీరును మెరుగుపర్చుకో వాలని ముంబై హైకోర్టు పదే పదే సూచిస్తోంది. తాజాగా ఒక ఘటనపై కోర్టు వ్యాఖ్యానిస్తూ, రైల్వే వ్యవస్థలో ఒక్క ప్రాణ నష్టం జరిగినా అది ఆమోదనీయ గణాంకం కాదని తేల్చి చెప్పింది. ఫ్లాట్‌ఫాంల ఎత్తును పెంచాలని, రైల్వే కారణంగా గాయపడిన వారికి రైల్వే స్టేషన్లలో వైద్య సౌకర్యం అందించాలని, రవాణా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తీసుకె ళ్లడానికి అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ముంబై కోర్టే తరచుగా రైల్వే శాఖకు చెపాల్సివస్తోంది. మొత్తంమీద చూస్తే, రైలు ప్రయాణికులకు రైల్వేలే ప్రయోజనం చేకూర్చాలని న్యాయస్థానాలు చెప్పాల్సి రావడమే ఒక విషాద గాథ. - మహేశ్ విజాపూర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
కేరళలో ‘కంపెనీ’ రాజ్యం!
సందర్భం అత్యున్నత ప్రగతి సూచికలను సాధించిన కేరళలో సైతం అభివృద్ధిపరంగా నేటికీ వెనుకబాటుతనం కొనసాగుతోంది. మరింత మెరుగైన పార్టీని లేదా కంపెనీని ప్రత్యామ్నాయంగా కిళంబాలం గ్రామం ఎంచుకోవడం దీని ప్రతిఫలనమే. నరేంద్రమోదీ పరాజయాన్ని మినహాయిస్తే, బిహార్ ఎన్ని కల ఫలితాలు మరో లక్షణాన్ని కనబర్చాయి. అభివృద్ధికి సంకే తంగా ప్రజలు పిలుచుకునే నితీశ్‌కుమార్ కులతత్వ లాలూప్రసాద్ యాదవ్ పార్టీ కంటే తక్కువ స్థానాలు గెల్చుకున్నారు. పైగా మోసానికి ఫలితంగా లాలూ దోషిగా తీర్పుకు గురై, తన ఓటు హక్కును, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కూడా కోల్పోయినప్పటికీ తనకే అధిక స్థానాలు వచ్చాయి. ఈ దఫా గెలిచిన శాసన సభ్యులలో సగంమందిపై నేరారోపణలు ఉన్నాయి. అదే సమయంలో, కేరళలో ఒక వినూత్న పరిణామం నెలకొంది. వెయ్యికోట్ల విలువైన కార్పొరేట్ కంపెనీ అన్నా-కిటెక్స్ (దుస్తుల తయారీ, ఎగుమతి సంస్థ) కిళక్కంబాళం గ్రామ పంచాయతిని తన అధీనంలోకి తెచ్చుకుంది. దీని ఆధ్వర్యంలోని ట్వంటీ20 ట్రస్టు ఈ గ్రామ పంచాయతీకి చెందిన అన్ని స్థానాలకు అభ్యర్థులను స్పాన్సర్ చేసింది. దాదాపు అన్ని స్థానాల్లో వీరే గెలిచారు. తర్వాత కంపెనీ ఏంచేసిందంటే ఈ గ్రామ పాలనా వ్యవస్థను రాజకీయంగా నియంత్రిస్తూ, తాత్కాలికంగా మాత్రమే అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది పనిచేసేలా అడ్డంకులు సృష్టించింది. ఈ కంపెనీ గ్రామానికి సంబంధించిన నీటి వనరులను కలుషితం చేస్తోందని ఇదివరకటి గ్రామ పంచాయతీ ఆరోపించింది. ఈ వ్యవ హారం ఇప్పుడు న్యాయస్థానం పరిశీలనలో ఉంది. దీని ఫలితంగా కంపెనీ ఓటర్లను ప్రభావితం చేసి తనకు ఎదురు నిలుస్తున్న వారిని స్వాధీనపర్చుకుంది. ఇదంతా ఒకమేరకు చట్టబద్దంగానే జరిగినట్లు పైకి కనబడుతుంది. ఎంతమందికి, ఎంత మొత్తాన్ని పంచిపెట్టారన్నది ప్రపంచానికి ఏమాత్రం తెలియని వ్వకుండా ఇండియాలోని కార్పొరేట్ కంపెనీలు, వాణిజ్య సంస్థలు మన రాజకీయ నేతలకు, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తుంటాయి. మీకు ఆశ్రీత పెట్టుబడిదారీ విధానం అంటే తెలిసే ఉంటుంది. ఒక గ్రామ పంచాయతీనే తన అధీనంలోకి తెచ్చుకోవడానికి కంపెనీ రెండేళ్లపాటు బహిరం గంగానే సమాయత్తమైంది. గ్రామంలో రహదారుల నిర్మాణానికి, నీటి సరఫరా కల్పనకు, ప్రత్యక్షంగా ఆరోగ్య సేవలందించడానికి, విద్యాపరమైన తోడ్పాటుకు కంపెనీ రెండేళ్లలో 28 కోట్ల రూపాయలు వెచ్చించింది. మీడియా వార్తల ప్రకారం, ఈ గ్రామ పంచాయతీ నాలుగేళ్లలో 22 కోట్లు ఖర్చుపెట్టింది. కంపెనీ తన ట్రస్టు అయిన ట్వంటీ20 ద్వారా గ్రామ పంచాయితీకి అందించిన సేవలకు ఏమాత్రం తగ్గకుండా ఇదివరకటి పంచాయతీలు కూడా తమకు ప్రయోజనాలు కలిగించాయన్న విషయాన్ని ఓటర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టీఐఎస్ఎస్) సంస్థ కేంద్ర ప్రభుత్వం కోసం నిర్వహించిన అధ్యయనం ప్రకారం అభివృద్ధి వైపుగా పథకాలు రచించి, అమలు చేసి, పర్యవేక్షించడం వైపుగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కేరళలోనే ఇలా జరగటం గమనార్హం. పైగా కేరళ పరిశ్రమలకు ఎర్రతివాచీ పరచని రాష్ట్రమని అందరికీ తెలుసు. ఇక్కడనుంచి ఎగుమతి అవుతున్న మానవ పెట్టుబడి ద్వారా (వలస కార్మికులు) దేశంలోకి రూపాయలు, దీరామ్‌లు, రియాల్స్తోపాటు డాలర్ల రూపంలో కూడా వస్తున్న విదేశీ మారక ద్రవ్యమే కేరళ ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటోంది. రాజకీయనేతలకు తువ్వాలు పరిచి వారి నుంచి ప్రయోజనాలను కొనుక్కోవడానికి బదులుగా ఈ కంపెనీ తన హక్కుల కోసం లేచి నిలబడింది. అన్యా యంగా ఉంటోందని అది భావిస్తున్న రాజకీయ వ్యవస్థను అది ఎండగట్టదల్చుకుంది. కేరళలోని ప్రతి రాజకీయ పార్టీకి చెందిన స్థానిక నేతలు కిటెక్స్ ఎంటర్ ప్రైజెస్ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి అనుకూలంగా వ్యవహరించారు. అలాగే ఉత్తర ప్రదేశ్‌లోని మరో గ్రామం కథ చూద్దాం. ఈ గ్రామంలో వాస్తవాధికారం గ్రామ వైద్యుడి చేతిలో ఉంటుంది. ఆయనది చట్ట వ్యతిరేక అధికారం. వెనుకబడిన కులానికి చెందిన తన సేవకు డిని ఆయన గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని చేశాడు. స్థానిక విద్యా బోర్డు ఎన్నికలను మోసపూరితంగా నిర్వహించారు. దీని ద్వారా వచ్చే ప్రయోజనాలను మాత్రం తన కుమారుడికి, మనవడికి సమానంగా పంచిపెట్టారు. ప్రజాస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం అంటే ఇదే. రాజకీయనేతలు ఏం చేస్తునారన్నది ప్రజలు పట్టించుకోరు. రెండు దశాబ్దాల క్రితం ఈ ఉదంతం దూరదర్శన్ టీవీలో హిందీ సీరియ ల్గా వచ్చింది. రాజకీయ పార్టీలు, నేతలు మన ప్రగతికి నిజమైన ఉపకరణాలని, ప్రతి విషయంలోనూ వారి పాత్ర ప్రధానంగా ఉంటుందని ఇండియాలో మనం నమ్ము తుంటాం. తేడా అల్లా ఏమిటంటే ఓటర్లు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తుంటారు. తర్వాత అన్ని కాంట్రాక్టులూ రాజకీయ నేతలకు, వారి కుటుంబాలకు మాత్రమే దక్కుతుంటాయి. కేరళలోని కిళంబాలం గ్రామ పంచాయతీ తనకు సహాయకారిగా లేదని భావించినందువల్లే కిటెక్స్ ఎంటర్ప్రైజెస్ ఆ పంచాయతీని రద్దు చేసి కొత్త అధికారిక వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించు కుంది. ఇక్కడే దాని ప్రయోజనం దాగి ఉంది. తనకు అనుకూలంగా ఉండే పాలనా వ్యవస్థను కలిగి ఉంటే పోలా అని అది భావించింది. ఇప్పుడు కంపెనీకి కావలసిన అవసరాలన్నీ దాని అధీనంలోని గ్రామ పంచాయతీ ఎజెండాలో ఉన్నాయి. రెండేళ్లపాటు కంపెనీ ట్రస్టు చేసిన సహాయ కార్యక్రమాల కారణం గా రాజకీయ దొరలు, యజమానుల కంటే ఈ కంపెనీయే మంచిదని భావించి గ్రామస్తులు దానికి ఓటేశారు. కాని ఇది సరైందేనా? నిస్సందేహంగా ఇది ప్రగతికోసం ప్రజల ఆకాంక్షకు మరోరకం వ్యక్తీకరణే. ప్రజలకు ఉపయో గపడే పనులను చేపట్టటానికి బదులుగా భావజా లపరమైన విభజనపైనే మరింత దృష్టి పెడుతున్న రాజకీయ పక్షాల వైఖరికి ఇది చెంపపెట్టు లాంటిది. సామాజిక పరంగా అత్యున్నత ప్రగతి సూచికలను సాధించిన కేరళలో సైతం అభివృద్ధిపరంగా నేటికీ వెనుకబాటుతనం కొనసాగుతోంది. మరింత మెరు గైన పార్టీని లేదా కంపెనీని ప్రత్యామ్నాయంగా కిళం బాలం గ్రామం ఎంచుకోవడం దీని ప్రతిఫలనమే. ప్రధానంగా వామపక్ష రాష్ట్రంగా ఉండే కేరళ జనాభా లో కొద్ది భాగం ఇప్పుడు పెట్టుబడిదారులవైపు తిరుగుతూ దారితప్పుతూండటం విశేషం. -మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
పీడకులకూ రిజర్వేషన్లేనా?
రిజర్వేషన్ ఒక పిల్లాడికి కాలేజీ డిగ్రీని పొందడంలో, ఉద్యోగాన్ని, తర్వాత ప్రమోషన్‌ను పొందటంలోనూ సహాయపడవచ్చు. కానీ వెనుకబడిన సామాజిక బృందం మొత్తానికి ఇతర వర్గాలతో సమాన స్థాయికి రిజర్వేషన్ తీసుకురాలేదు. విద్య, ఉద్యోగ రంగాల్లో తన సామాజిక వర్గం రిజర్వే షన్లను పొందనట్లయితే, కోటా విధానాన్నే పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుందని అహ్మదాబాద్ ర్యాలీలో హార్దిక్ పటేల్ ప్రకటించి నప్పుడు,అది ప్రారంభంలో, అప్పుడే ఎక్కడినుంచో ఊడి పడిన నవజాత నేత నుంచి వచ్చిన వాగాడంబర పదజాలంగా కనిపించింది. అయితే, వార్తాపత్రికల ఇంటర్వ్యూలలో, ప్రత్యేకించి ‘ది హిందూ’లో ‘మాకూ కావాలి లేకపోతే ఎవరికీ ఉండకూడదు’ అంటూ పటేల్ పదే పదే నొక్కి చెప్పినప్పుడు మొత్తం విషయం కొత్త రూపు దాల్చింది. దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లలో కుల ప్రాతి పదిక వ్యవస్థకు వ్యతిరేకంగా వినిపిస్తున్న మర్మ రధ్వనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. అయితే ఈ పరిస్థితి ఎంతవరకు వెళతుంది, ఎక్కడ ముగుస్తుం ది అనేది ఊహామాత్రంగానే ఉంటోంది. సాధారణంగా చూస్తే కాస్త సంపన్న సామాజిక వర్గాలకు చెందినట్లు కనిపిస్తున్నప్పటికీ రాజస్థాన్ జాట్‌లూ, మహారాష్ట్ర మరాఠాలు సైతం తమకూ రిజర్వేషన్ కావాలని ఎప్పటినుంచో డిమాండు చేస్తూవస్తున్నారు. ఈ వాస్తవం ఒక కొత్త దృక్కోణంకి సంబంధించి అందరి కళ్లూ తెరిపించాలి: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యవస్థ అందిరికీ ఆమోదనీయంగా ఉంటోందా? ప్రతి ఒక్క పటేల్, జాట్ లేక మరాఠా వ్యక్తి సంప న్నుడు కాకపోవచ్చు లేదా ఇతరులతో సమానంగా వీరందరినీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలంటే రిజర్వేషన్ కోటా రూపంలో మద్దతు అవసరం లేకపో వచ్చు. అయితే అన్ని సామాజిక వర్గాలలో ఇలాంటి మద్దతు అవసరమైన వారు ఉండవచ్చు కానీ అనుమ తించిన దామాషాలో ఎదురవుతున్న అడ్డంకులు (సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లను 49 శాతానికి మించకూడదని ఆదేశించింది) వీరి అవకాశాలను హరించివేస్తున్నాయి. షెడ్యూల్ కులాలు, తెగలకు మల్లే వీరు కూడా చాలా కాలంగా వెనుకబడి ఉంటున్నారు. పార్లమెంటు, శాసనసభల్లో రాజకీయ ప్రాతిని ధ్యం కోసం షెడ్యూల్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధనలు రూపొందించినప్పుడు, మొదట్లో దాన్ని పదేళ్ల కాలానికే పరిమితం చేశారు. కానీ తర్వాత దీన్ని క్రమానుగతంగా పెంచుకుంటూ వచ్చారు. విద్య, ఉపాధిలో ప్రవేశానికి సంబంధించినంతవరకు అది తాత్కాలికమే కానీ దీనికి నిర్దిష్టమైన ఏర్పాటు ఉండేది కాదు. స్థిర హక్కులను వెనక్కి తీసుకోవడానికి కష్టమ య్యే విధంగా వీటిని శాశ్వతంగా కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నాయి. కోటా కారణంగా అధికారంలోకి వచ్చిన వారు ఆ విధానాన్ని విరమిం చడానికి ఇష్టపడటం లేదు. ఈ కోణంలోంచే హార్దిక్ పటేల్ దృక్పథం కాస్త సందర్భసహితంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ అధికారంలోకి తుపాను లా దూసుకువచ్చినప్పుడు దానికి ముఖ్య కారణాలలో ఒకటి ఏమిటంటే కాంగ్రెస్ పాలనలో ఓబీసీలను నిర్లక్ష్యం చేయడం, ఎస్సీలు, ఎస్టీలను బలిపించడం అని అప్పట్లో పేర్కొనేవారు. తమను వ్యవస్థ పక్కకు తోసివేసిందని పటేల్ వర్గీయులు భావిస్తున్నారు కాబట్టే తమ హక్కును సాధించుకోవడానికి చూస్తున్నారన్న వాదనను గుజరాత్ పరిణామాలు తీసుకువస్తున్నాయి. ఇవి రాజస్థాన్‌లో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు చేసినట్లుగానే ఉన్నాయి. వెనుకబడిన వర్గాలతో పోల్చి చూసుకున్నప్పుడు నష్టపోతున్న స్థితిలో తమను తాము కుదించుకోవడమే పరిహాసప్రాయంగా ఉంటోంది. తమకు తాము కొత్త ముద్రలో చూసుకోవడానికి క్రియా శీలకంగా ప్రయత్నిస్తున్నందుకు వారేమీ ఆందోళన చెందటం లేదు. పురుష లక్షణం ఇప్పుడు నిస్స హాయతను ప్రకటిస్తోంది. ఈ అంశంపై ప్రాంతీయ వార్తా చానల్లో ఒక మరాఠా వ్యాఖ్యాతను ప్రశ్నిం చారు. అందుకు ఆ వ్యాఖ్యాత ఇచ్చిన వివరణ ఆశ్చర్యం కలిగించింది. మరాఠాలు అత్యంత క్రియాశీలకంగా రాజకీయాల్లో మునిగితేలినందున వారు విద్యను నిర్లక్ష్యం చేశారని, వారి గత సంపద ఆవిరైపోయిం దన్నది ఆ వివరణ సారాంశం. అందుకే తమ సామా జిక వర్గానికి కోటా కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ అజ్ఞానం నుంచి వారు తమకు తాముగా విముక్తి పొందాలి. అందుకే వారు కొత్తగా కనుక్కున్న నిస్సహాయత్వంలోకి తమను తాము జార్చుకోవడాన్ని అనుమతించేసుకుంటున్నార న్నది పెద్దగా గుర్తింపు పొందలేదు. అయితే మరాఠాలు ఒకప్పుడు పాలకులుగా ఉండేవారు. అధికార చట్రంలో వీరికి విస్తృత ప్రాతినిధ్యం ఉండేది. స్పష్టంగానే, స్వాతంత్య్రానంతరం తాము పొంది న ప్రయోజనాలనుంచి ఇప్పుడు దూరమైనట్లు పటేళ్లు భావిస్తున్నట్లుంది. 1950ల ప్రారంభంలో కౌలుదార్లుగా పనిచేస్తున్న దశ నుంచి వారు భూ యజమానులుగా మారారు. వ్యవసాయానికి వీరు కొత్త శక్తినిచ్చారు. సౌరాష్ట్రలో వేరుశనగ సాగు మిగులుకు దారితీసి అది పరిశ్రమలోకి వెళ్లింది. వారెంత శక్తివంతులయ్యారంటే 1980ల మధ్యలో గుజరాత్లో రగుల్కొన్న మత ఘర్షణ లకు, రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకు పటేళ్లే కారణ మని తప్పుపట్టారు. కాని ఇప్పుడు ఈ పటేళ్లే పూర్తి వ్యతిరేక దిశకు మారి తమకే కోటాలు కావాలని కోరు కుంటున్నారు. కాని ఆ కోటాలను కొత్త రీతిలో చూస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా మన దేశం తన పౌరులకు సమానావకాశాలు కల్పించలేకపోతోందంటే, ఎస్సీలు, ఎస్టీలు ఇప్పటికీ వెనుకబడి ఉంటున్నారంటే మనల్ని మనం పాలించు కోవడంలో తీవ్రమైన తప్పు జరుగుతోంది. కోటా కల్పించిన తర్వాత కూడా ఒక ఎస్సీ లేక ఎస్టీ నేటికీ ప్రయోజనం పొందలేకపోతున్నారు కానీ, పీడక వర్గాలుగా మనం చెప్పుకుంటున్న వారు తమ మాజీ పీడితుల నుంచి ప్రస్తుతం అభద్రతను ఫీలవుతుండట మే విచిత్రం. కొంతవరకు బ్రాహ్మణులు కూడా తమ దురవస్థను చాటి చెబుతున్నారు. రిజర్వేషన్ అనేది ఒక పిల్లాడికి కాలేజీ డిగ్రీని పొం దడంలో, ఉద్యోగాన్ని, తర్వాత ప్రమోషన్‌ను కూడా పొందటంలో సహాయపడవచ్చు. కానీ పీడిత కమ్యూ నిటీ మొత్తాన్ని ఇతర వర్గాలతో సమాన స్థాయికి రిజర్వేషన్ తీసుకురాలేదు. రిజర్వేషన్ అనేది తమ సొంత సామాజిక బృందాలకు వారిని ప్రతినిధులుగా చేయవచ్చు. పార్లమెంటు, అసెంబ్లీలలో రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. కానీ తామెక్కడి నుంచి వచ్చారో ఆ పీడిత వర్గాలతో సంబంధం లేని ఒక క్రీమీలేయర్‌ను రిజర్వేషన్ సృష్టించిపెట్టింది. పీడిత వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న వారు వారికి మీటగా మాత్రమే ఉంటున్నారు. అంతకు మించి ఈ క్రీమీలేయర్‌కు ప్రాధాన్యం లేదు. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
ఆత్మవిమర్శ అవసరం
సందర్భం ఆ ఘటన ఆశ్చర్యభరితం. ఎర్రకోట నుంచి నరేంద్ర మోదీ బయటకు వచ్చిన వెంటనే దూరదర్శన్ జాతీయ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం. టీవీ తెరపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్షమయ్యారు. తన కార్యాలయం నుంచి ఆయన కూడా మరోసారి 69వ స్వాతంత్య్ర దినోత్సవం గురించి మాట్లాడుతూ కనిపించారు. తర్వాతి వంతు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ది. ఆ తర్వాత ఉన్నట్లుండి.. ప్రతి సంవత్సరం జాతినుద్దేశించి ప్రధాన మంత్రులు ప్రసంగించే స్థలమైన ఎర్రకోటపై ఒక డాక్యుమెంటరీ ప్రసారమైంది. వ్యవస్థపై బాధ్యత మోపుతూనే, గణతంత్ర రిపబ్లి క్లోని పౌరులకు గరిష్ట ప్రయోజనాలను కల్పించేందు కోసం తప్పులను సరిదిద్దే ప్రయత్నాల గురించి తొలి ఇరువురు వక్తలూ చేసిన ప్రసంగాల ఒరవడి గుర్తించ దగినది. మోదీ దృష్టి దేశంపై ఉండగా, కేజ్రీవాల్ దృష్టి జాతీయ రాజధానికే పరిమితమయింది. ప్రజల సంక్షే మానికి కఠినశ్రమ, సమగ్రత ఎంతగా తోడ్పాటుని స్తాయి అనే అంశంపై ఆయన దృష్టిపెట్టారు. మరోవైపు న మోదీ మొత్తం దేశ జనాభాను ‘125 కోట్ల నా టీమ్ ఇండియా’గా అభివ ర్ణించడం అందరినీ కదిలించింది. కేజ్రీవాల్ మాత్రం తానెంచుకున్న పరిధికి కట్టుబడ్డారు. ఏమైనప్పటికీ వీరిరువురూ ప్రస్తుతం చారిత్రక తీర్పు శిఖరంపై నిలిచి ఉన్నారు. ఒకరేమో ఏక పార్టీ మెజారిటీని కలిగి సంకీర్ణంలో అనేకమంది ఇతరులను భాగస్వాములుగా చేసుకుని ఉన్నారు. మరొకరేమో శాసనసభ మొత్తంగా తన పార్టీ సభ్యులతోనే నిండి పోయి ఉన్న ప్రభుత్వానికి అధినేతగా ఉంటున్నారు. వీరిరువురూ తామేం చేయదల్చుకుంటే అది చేయగలిగి న స్థితిలో ఉన్నారు. కానీ ఇరువురూ నేటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రతాప్ భాను మెహతా రాసిన ట్లుగా నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేయకూడదా అనే ధోరణిలో కొట్టుకుపోతున్నారు. అయితే మెహతా ఆ వ్యాసంలో ఆమ్ఆద్మీ పార్టీపై కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పడ్డారనుకోండి. ప్రస్తుతం మోదీమయమైపోయి ఉన్న బీజేపీ తన దైన నష్టాన్ని, మానసిక భారాన్ని ఇప్పటికే కలిగి ఉంది. మోదీ ఆహార్యం పార్లమెంటరీ తత్వంతో లేదనీ, మొర టైన, ఆకస్మిక ప్రశ్నలు సంధించే సమూహంతో అది వ్యవహరించలేదనీ మెహతా ఆ వ్యాసంలో రాశారు. ‘పార్లమెంటును సీరియస్‌గా తీసుకోవడానికి మోదీ నిరాకరించడంతో శక్తిలేని ప్రతిపక్షానికి కాస్త ఊతమిచ్చి నట్లయింది. మోదీ పార్లమెంటులో తన స్థానంలో కూ ర్చుని ఉన్నట్లయితే ఆయన పార్టీ వీధులకెక్కవలసి వచ్చేది కాదు.’ తానూ, తన పార్టీ తప్పుకు ప్రతితప్పు కు సంబంధించిన మొండితనంలో కాంగ్రెస్‌తో పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ‘తాను గత ఎన్నికలను కోల్పోలేదని, తననుంచి ఎన్నికలను దొంగిలించుకుపోయార’న్న చందంగా అది ఆలోచిస్తు న్నదని కూడా మెహతా రాశారు. రైటయినా, తప్పయినా సరే.. కేజ్రీవాల్ కూడా ఈ తప్పుకు ప్రతి తప్పు ఆటలో వెనుకబడిలేరు. తన వెనుక కూడా ప్రభుత్వం ఎవరనే విషయాన్ని నిర్ణయిం చడానికి భీషణ కాంక్షా నృత్యం చేస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉన్నారు మరి. కేజ్రీవాల్ కార్యాలయానికి సంబద్ధతే లేదని ఈ లెఫ్టినెంట్ గవర్న ర్ ప్రకటించడం రాజ్యాంగ లోపం. దాంతో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడానికి బదులుగా కేజ్రీవాల్ కూడా నజీబ్ మూర్ఖత్వంతో పోటీపడుతున్నారు. ఈ ఇరువురూ చక్కగా చర్చలకు ప్రయత్నించి ప్రజాగ్ర హం నుంచి బయటపడి ఉండవచ్చు. కానీ ప్రదర్శనలకు కూడా రాజకీయాలు కావాలి మరి. గత 15 నెలలుగా తన ప్రభుత్వ ప్రయోజనాలపై పడి ఊగుతున్న ప్రధాని తాము లాభపడ్డామన్న భావ నను ప్రజలకు అందించగలిగారా? ఎర్రకోట ప్రాకా రాన్ని ఎన్నికల ర్యాలీలా కాకుండా జాతిని విశ్వాసం లోకి తీసుకునే కార్యక్రమంగా ఆయన చేయగలిగారా? తన ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అవినీతి జరిగిందన్న ఆరోపణ కూడా రాలేదని మోదీ మాట్లాడ వచ్చు కానీ దేశవ్యాప్తంగా అవినీతి వ్యవహారాలు కాస్తం త కూడా బలహీనపడలేదు. నిరుపేదల వైద్య అవసరాలను తీర్చడానికి మొహల్లా క్లినిక్‌లను తన ప్రభుత్వం ఏర్పరుస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్లినిక్‌లలో ఎయిర్ కండిషన్ తోపాటు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉంటాయని, పైగా ఇక్కడ వైద్య సేవ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. తన స్వాతంత్య్ర దినోత్స వ ప్రసంగంలో, ప్రతి క్లినిక్‌ని రూ.5 కోట్ల వ్యయంతో ఏర్పరుస్తామని చెప్పారు. ఆ ఖర్చుతో ఢిల్లీ ప్రభుత్వం అలాంటి 25 క్లినిక్‌లను ఏర్పర్చగలదు. కాని ఈ 24 క్లినిక్లకయ్యే ఖర్చు ఎక్కడికి మాయమవుతున్నట్లో మరి. ఈ విషయంపై మీకెంత సందేహం ఉందో నాకూ అంతే సందేహం ఉంది. ఇలాంటి కుంభకోణాలు దేశ మంతా కొనసాగుతూనే ఉన్నాయి. సగటు మనిషి మాత్రం కేంద్రం, రాష్ట్రాలు, లేదా తన ప్రాథమిక అవసరాలతో వ్యవహరిస్తున్న మునిసి పాలిటీలలో వేటి కారణంగా ఈ మోసం జరుగుతోం దన్న అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. చురు కైన లేదా బాగా నిర్వహిస్తున్న సంస్థల ద్వారా ఆ సౌక ర్యాలు తనకు అందుతున్నాయా అని కూడా సగటు మనిషి పట్టించుకోవడం లేదు కానీ తన జీవితం మా త్రం తననుంచి దొంగిలిస్తున్న కిరాయిదార్ల వల్ల కష్టాల పాలవుతోందన్న విషయం అతడికి బాగా తెలుసు. ఈ విషయమై కేజ్రీవాల్ ప్రస్తావించిన ఒక ఉదాహరణ మోదీ ప్రకటనలన్నింటికన్నా ఎక్కువగానే చెప్పింది. మనలో లంచం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఆ కేన్సర్ ఇంకా అంతరించిపోలేదని, కనీస స్థాయికి అది తగ్గిపో లేదని కూడా తెలుసు. మన జీవితాల్లోని ప్రతి కోణాన్ని అది తాకింది. లంచం ఇవ్వాల్సిందిగా మనల్ని కోరు తూ, డిమాండ్ చేస్తూ లేదా బెదిరిస్తూ వస్తున్న వారికి కూడా అది మాయం కాలేదని తెలుసు. ఎందుకంటే తమ దురాశను వదిలిపెట్టడానికి వారిష్టపడటం లేదు. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల ఉన్నతాధికార వర్గానికి అవినీతిపై ఉత్తేజభరితమైన సెషన్లను నిర్వ హించి, సామాన్యుల్లాగే జీవించమని, సంపదల పట్ల వ్యామోహాన్ని వదులుకోవాలని బోధించారు. కాని అన్ని ధర్మోపదేశాల్లాగానే ఇదీ అటకెక్కేసింది. భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ, ఆప్ నేటికీ తమ పరిపా లనను వేగవంతం చేయడంలో కొట్టుమిట్టులాడు తూనే ఉన్నారు. వారు ఎంత సేపటికీ అవినీతిని వ్యవస్థీకృత వాస్తవం (మోదీ దాన్ని వ్యాధి అని పిలిచారు) గానే మాట్లాడుతున్నారు తప్పితే, అది కూడా నివారించగలిగిన ఒక దీర్ఘ వ్యాధి అని చెప్పలేకపోతున్నారు. అవును ఇది నిరాశావాదమే. కానీ ఆశా వాదానికి ఇప్పుడు ఎక్కడైనా చోటుందా? స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అవినీతి నిర్మూలన గురించి మనం వింటూ రావడం లేదా? బహుశా, ఇకపై కూడా మనం దాన్ని వింటూనే ఉండవచ్చు. - మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు. ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
దాతల స్థానంలో కబ్జాకోర్లు
సందర్భం ముంబై పురపాలక సంస్థ 1888 నాటి శాసనం ద్వారా ఏర్పడక ముందే ఆ నగరం పలు సౌకర్యాలను అందించే వారి కోసం వెతికేది. ఇలా నగరానికి సహాయ పడినవా రిలో ఇద్దరు ఎన్నిక కాని నేత లు.. జంషెడ్జీ జేజేభాయ్, జగ్గునాథ్ సుంకర్‌సేట్ ఉన్నా రు. నగరానికి అవసరమైన ఆసుపత్రుల నుంచి కళాశా లలతోపాటు పలు సంస్థలను నిర్మించడంలో తోడ్ప డటంతో జేజేభాయ్ పేరిట పలు స్మారక స్థూపాలు వెలి శాయి. కాగా, సుంకర్‌సేట్ డబ్బు, భూములను ఇచ్చా రు. ముంబైలో తొలి రైల్వే మార్గాన్ని నిర్మిస్తున్నప్పుడు బుకింగ్ కార్యాలయం కోసం తన నివాసాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించారు కూడా. దానశీలి అయిన సుంకర్‌సేట్ (1803-1865)ని పూర్తిగా విస్మరించారు. ఆయన జ్ఞాపకార్థం ఒక సరైన ప్లాట్ లేదా భూమిని కూడా ముంబై పురపాలక సంస్థ అందజేయలేకపోయింది. తాను జీవించిన శతాబ్దంలో మహాదాతగా వెలిగిన వ్యక్తిని గురించి దానికి పట్టింపు కూడా లేకుండా పోయింది. ఇది ఆయన 150వ వర్థంతి సంవత్సరం. విషాదం ఏమిటంటే పలుకుబడి గలవారు ప్రభుత్వ స్థలాలను కొల్లగొడుతుంటే పురపాలక సం స్థకు కించిత్ అభ్యంతరం కూడా ఉండదు. జేజేభాయ్ ముంబై నగరానికి చేసిన సేవలతో సుప్రసిద్ధులయ్యారు. పలు ప్రజా సంస్థలను ఏర్పర్చ డంలో ఆయన అందించిన తోడ్పాటులో ‘జేజే’ ఒక భాగం. బ్రిటిష్ వారు ఆయనకు సర్ బిరుదును బహూ కరించారు. జీవించి ఉండగానే ఆయనను జ్యేష్ఠుడు అని ప్రకటించారు. ఇక సుంకరసేట్ విషయానికి వస్తే, ఏషి యాటిక్ సొసైటీ మెట్లదారి వద్ద ఆయన భారీ విగ్ర హాన్ని నెలకొల్పి గౌరవించారు. ముంబైలో పలు సంస్థలను నిర్మించడానికి వీరూ, ఇతరులూ చేసిన సహాయాలు ఇప్పటికీ నగరంలో కని పిస్తుంటాయి. నెహ్రూ కోరికపై టాటాలు నిర్మించిన టీఐఎఫ్ఆర్ బహుశా వీటిలో చివరిది. కానీ ముంబై నగరం స్వభావం నేడు విషాదంగా మారిపోయింది. ఇది ఇప్పుడు స్వచ్ఛందంగా ఇచ్చేవారి నగరంలా కాకుం డా, కబ్జా చేసుకునే వారి నగరంలా మారిపోయింది. పాలనాధికారులు, రాజకీయనేతల రూపంలో ఈ కబ్జా దారులు పుట్టుకొస్తున్నారు. బ్రిటిష్ హయాంలో శ్రేష్ట మైన నగరంగా వెలుగొందిన ముంబై నేడు దోచుకునే వారి పాడి ఆవుగా మారిపోయింది. వలస ప్రజల వెల్లువతో స్వప్న నగరంగా భాసిల్లిన ముంబైని అప్పుడు, ఇప్పుడు అని పోల్చి చూడాలి. శతా బ్దం క్రితం చేతిలో నయాపైసా లేకున్నా, కేవలం కల లతో అడుగుపెట్టేవారికి ఈ పెద్ద నగరం విశాల హృద యంతో అక్కున చేర్చుకునేది. దేశంలోనే ఉత్తమ నగ రంగా ఉండేది. నగరంలోని పిల్లలందరికీ ప్రాథమిక విద్య అందజేస్తూ, మానవ వనరుల అభివృద్ధి విధానా న్ని కలిగి ఉండేది. నగరం, దాని భవిష్యత్తు, అభివృద్ధి పైనే అందరూ దృష్టి పెట్టేవారు. అప్పట్లో పాఠశాలలకు వెళ్లే మొత్తం విద్యార్థులలో సగం మంది పురపాలక సంస్థ నిర్వహించే పాఠశాలల్లోనే చదువుకునేవారు. ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో ఇ-ఎయిడ్స్ (సహా యకాలు)ని ఉపయోగించడం కోసం బిడ్ ప్రకటించి 25 వేల ట్యాబ్లెట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనిపై వస్తున్న ఆరోపణ ఏదంటే, శివసేన అజమాయి షీలో ఉన్న బృహన్ ముంబై పురపాలకసంస్థ ఈ ట్యాబ్ లెట్లను ఒక్కోదాన్ని రూ.6,850లకు కొనుగోలు చేసిం ది. వాస్తవానికి దాంట్లో సగం ధరకే అవి లభిస్తున్నాయి. అసలు కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసినవారికి రూ.8.5 కోట్లు దండుకునే అవకాశం లభించినట్లే. అలాంటి 11 వేల పాఠశాలల్లో ఉన్న 4.5 లక్షల మంది పిల్లలకు ట్యాబ్‌లను అందించినట్లయితే జరిగే మోసం స్థాయిని ఎవరైనా ఊహించుకోవచ్చు. గ్రామపంచాయితీలు మొదలుకొని స్వయం పాల నా సంస్థల ప్రయోజనాలు గత కొన్ని దశాబ్దాలుగా ఎలా మారుతూ వస్తున్నాయో ఇది తెలియపరుస్తోంది. ముంబై పురపాలక సంస్థ ప్రస్తుతం శివసేన పాడి ఆవుగా మారిపోయిందంటే ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు. కొని చిన్న రాష్ట్రాల కంటే ఎక్కువ వార్షిక బడ్జెట్‌తో ఉన్న ముంబై పురపాలక సంస్థలో తమ పట్టు నిలుపుకు నేందుకు జరిగే పోటీ తీవ్రంగా ఉంటోందంటే ఆశ్చర్యం లేదు. పైగా, వివిధ స్థాయీ సంఘాలలో కీలక పదవుల కోసం జరిగే ప్రయత్నాలు కూడా అంతే బలంగా ఉంటు న్నాయి. పార్టీ బాస్‌లతో అంటకాగేవారికి మాత్రమే ఆ పదవులు అందుబాటులో ఉంటాయి. మరి పాడి ఆవులు నమ్మినబంట్ల చేతుల్లోనే ఉండాలి కదా! రహదారులనే తీసుకోండి. రుతుపవనాలు మొద లయ్యే తొలిదినాల్లో కురిసే వర్షపుజల్లులకే ముంబై రహ దారులు కకావికలమవుతుంటాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే రహదారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. నాసి రకం రహదారులే దీనికి కారణం. కాంట్రాక్టర్లు తక్కువ ధరకు బిడ్ దాఖలు చేస్తారు, దురాశాపరులకు చెల్లింపు లు చేస్తుంటారు కాబట్టే నాణ్యత ఉండదు. ఎక్కడ చూసి నా గుంటలే ఉంటాయి. కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నప్పటికీ కొత్త పేర్లతో బిడ్డింగ్ దాఖలు చేయనీ కుండా వారిని ఎవరూ ఆపలేరు. హైకోర్టు నాణ్యత గురించి ఆదేశాలు జారీ చేస్తుంటుంది కానీ, పురపాలక సంస్థ వాటిని లెక్కలోకి కూడా తీసుకోదు. అలాగే రుతుపవనాలకు ముందు మురికి కాలువ ల పూడిక తీయకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ముం బై నగరంలో వరద వెల్లువెత్తుతుంటుంది. ప్రతి ఏటా కాంట్రాక్టులను మంజూరు చేస్తారు. పని మాత్రం జర గదు. చెల్లింపులు మాత్రం జరిగిపోతుంటాయి. మురికి నీరు పైకి పొంగటం అనేది కాంట్రాక్టర్ల లోపాలనే ఎత్తి చూపుతున్నప్పటికీ వర్షాలతో సమస్తమూ కొట్టుకుపో తుందని బిడ్ దాఖలు చేసేవారి పరమ విశ్వాసం మరి. బహుశా ఈ ప్రక్రియ వచ్చే సంవత్సరం, ఆ వచ్చే ఏడా ది కూడా పునరావృతమవుతూనే ఉంటుంది. ముంబై పురపాలక సంస్థలో జరుగుతున్న ఇలాంటి అక్రమాల జాబితాను ఇంకా చూపించవచ్చు. కానీ దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదన్నదే వాస్తవం. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) ఈమెయిల్: mvijapurkar@gmail.com -
బాబీగానే ఉండనివ్వండి..!
సందర్భం విదేశాల్లో ప్రతి విజయగాథలోనూ ‘ఇండియన్’ కోసం చూసే మానసిక స్థితి నుంచి మనం బయటపడాలి. మన తీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లినవారు మనవారు కానే కారు. అతడు అతిపెద్ద సవా లును స్వీకరించాడు. కానీ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్షుడు లేదా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి కి అభ్యర్థి అవుతాడో లేదో మనకు తెలీదు. అమెరికాలో ఒక రాష్ట్ర గవర్నర్‌గా, కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన భార త సంతతికి చెందిన తొలి వ్యక్తిగా తను వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షు డవుతారని కూడా భావిస్తున్నారు. తన రంగు పట్ల పెద్దగా పట్టింపులేని బరాక్ ఒబామాలాగే, జిందాల్ మూలం విషయంలో కూడా అమెరికన్లకు పెద్దగా పట్టింపు ఉండకూడదు. అలా ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. అయితే, భారత సంతతి అమెరికన్‌గా తన గుర్తింపును తృణీకరించినందున బాబీ జిందాల్ భారత్‌లో వార్తల్లో కొనసాగుతూ వస్తున్నారు. అమెరికాలోనే పుట్టినందున తాను అమెరికా పౌరుడినేనని బాబీ భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం అసంగతమైన విషయం చోటుచేసుకుంది. తన వాదనను నిరూపించుకో వడానికి బాబీ తన అసలు రంగుకంటే ఎక్కువ తెల్లగా ఉండే తైల వర్ణ చిత్రాన్ని ప్రదర్శించు కునేంత వరకు పోయాడు. తాను అమెరికన్‌ని మాత్రమే అని జిందాల్ పేర్కొనడం సరైనదే. అతడిని వ్యతిరేకించడానికి మనమెవ్వరం? అతడు అమెరికాకు వలస వచ్చిన కుటుం బానికి చెందిన వాడు. తను భారత్‌కు చేసిందేమీ లేదు. భారత్‌తో తనకెలాంటి సంబంధమూ లేదు. తన పౌరసత్వ స్థాయికి ‘ఇండియన్’ని జోడించడానికి అతడు తిరస్కరించడం ఏమంత ప్రాధాన్యత కలిగిన విషయం కాదు. యూఎస్ వంటి నానావిధమైన జాతులు కల దేశంలో వివిధ భౌగోళిక మూలాలకు చెందిన ప్రజలు, జాతులు తామెక్కడినుంచి వచ్చామన్నది పెద్దగా పట్టించుకోలేరు. అయితే నల్లజాతి ప్రజలను వేరు చేసి చూపడానికి ‘ఆఫ్రో-అమెరికన్’ వంటి పదబంధాలను వాడే ధోరణి కూడా అక్కడ కొనసాగుతోంది. కానీ అది అమెరికన్ సమస్య. బాబీ జిందాల్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు పీయూష్. తర్వాత అతడు తన పేరును బాబీ అని మార్చుకున్నాడు. పంజాబ్‌లోని మలెర్‌కోట్లా నుంచి తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లిన తర్వాత కొంత కాలానికే బాబీ పుట్టాడు. ఈ విషయంలో తన జాతీయత గురించి తను చెప్పుకునేది నిజమే. తను అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రభుత్వ పదవి చేపట్టాలనుకున్న వ్యక్తి తన జీవితానికి సంబం ధించిన వాస్తవాలకు కట్టుబడాలని కోరుకుంటా డు కాబట్టి ఈ అంశంలో జిందాల్ వైఖరి ప్రశంస నీయమే. ఒక హైపన్తో ‘ఇండియన్’ అనే ఉపసర్గను తన పేరుకు జోడించడం వల్ల పెద్దగా మార్పేమీ జరగదు. అలాగే తన విశ్వాసాలను మార్చుకునే హక్కు కూడా అతడికి ఉంది. అతడు క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు కూడా. ఒక విలక్షణమైన అర్హతతో ముడిపడనటు వంటి గుర్తింపు సమస్య మన దేశంలో భారతీ యులను చికాకుపర్చడం వింతగొలుపుతుంది. అందులోనూ అమెరికాకు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తూ అమెరికా పాస్‌పోర్ట్ లభిస్తే పండు గ చేసుకునేటటువంటి పౌరులున్న మన దేశంలో ఇలా జరగటమే ఒక వింత. అమెరికా పాస్ పోర్ట్ పొందటమం టేనే తమ భారతీయ పౌరసత్వాన్ని వదులు కోవటమని అర్థం. అమెరికాలో ఒక స్టూడెంట్ వీసా, ఉద్యోగం, గ్రీన్ కార్డ్, తర్వాత అక్కడే పౌరసత్వం కోసం భారతీ యులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. దీన్ని ఒకప్పుడు ‘మేథోవలస’ అనేవాళ్లు. ప్రతిభ అనేది ప్రపంచవ్యాప్త చలనంగా మారి పోయిన కాలంలో (పైలట్ల కొరత కారణంగా విమానయాన సంస్థలు దేశీయ మార్గాల్లో విమాన చోదకత్వానికి కూడా అధిక వేతనాలు ఇచ్చి పరదేశీయులను నియమించుకుంటు న్నంత వరకు) ఇదేమంత తీవ్రమైన అడ్డంకి కాదు. మంచి అవకాశాలను పరిమితంగా అందించే పేలవమైన వ్యవస్థల కారణంగా దేశా న్ని కూడా ఇందుకు తప్పుపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటీ.. చివరకు ఐఐఎమ్‌లు, ఐఐటీల స్వతంత్ర ప్రతిపత్తిని కూడా రాజకీయనేతలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో భారత్‌కు ఈ మేథో వలస అవసరమనే ఎవరైనా చెబుతారు. విదేశాల్లోని ప్రతి విజయగాథలోనూ ‘ఇండియన్’ కోసం చూసే మానసిక స్థితి నుంచి మనం బయటపడవలసిన సమయం ఇది. అ యితే ‘ఇండియన్’ అని అండర్లైన్ చేయడం ద్వారా మనది కాని వైభవం కోసం చూడటం అనేది ఒక వేలంవెర్రిలా మారింది (భారత సంతతి వ్యక్తి ఈ బహుమతి గెల్చుకున్నారు, టాప్ కార్పొరేట్ ఉద్యోగం సాధించారు లేదా సైన్స్‌లో అద్భుతమైన ఆవిష్కరణ కనిపెట్టారు వంటివి ఈ కోవకు చెందినవే). పైగా వార్తా పత్రికల్లో ఇలాంటి వార్తలను నిత్యం పేర్కొంటూ వస్తున్నారు. నిజానికి ఇలాంటి వార్తలు అలాంటి గుర్తింపును నొక్కి చెప్పడంతో ప్రారంభమ వుతుంటాయి. ఇలాంటి ఆరాధనా తత్వం ఎంత వింత స్థాయికి చేరుకున్నదంటే, ఇటీవల ఆస్ట్రేలియా లో తన మనవడిని కాపాడటానికి ఒక తాత నడుస్తున్న రైలునుంచి ఎగిరి దుమికితే ఆ వార్త ‘ఇండియన్ గ్రాండ్‌ఫాదర్’ అయి కూర్చుంది. మనవడి కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టబోయిన ఆ వ్యక్తి జాతీయతను ఆస్ట్రేలియన్ వార్తా పత్రికలు వార్త చివరలో మాత్రమే పొందుపర్చాయి. అది నిజంగా సంబరమే అవుతుంది కానీ మన పురా వైభవానికి పరవశిం చడంలా ఉండదు. గూగుల్‌లో ఇండియాలో పుట్టిన వ్యక్తి (ఇండియా బార్న్) అనే పదం కోసం వెతికితే 4,98,00,000 ఫలితాలు కనిపిస్తా యి. అదే భారత సంతతి (ఇండియన్ ఆరిజన్) అనే పదం కోసం వెతికితే 2,75,00,000 ఫలితా లు కనిపిస్తాయి. దీంట్లో గర్వపడాల్సింది ఏముంది? ఒక విషయాన్ని మనం మర్చిపోవద్దు. మన తీరాన్ని, మన గడ్డను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లినవారు ఇకపై మనవారు కానే కారు. ఇక బాబీ జిందాల్ విషయానికి వస్తే ఆయన ఇండియాలో పుట్టనే లేదు. అతడినీ, అతడిలాంటి వారినీ అలాగే ఉండనిద్దాం. మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
ఆ సహానుభూతికి బాధితుల గోడు పట్టదేం?
సందర్భం తమ అభిప్రాయాలను పంచుకోవడానికి వేదికలు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో అభిజిత్ ఒకరు. ఈ బాలీవుడ్ గాయకుడి ట్వీట్ ప్రకారం వీధుల్లో కుక్కల్లా నిద్రపోయేవారు కుక్కల్లాగే చస్తారట. నూరుల్లా షరీఫ్ కేసులో కారు స్పీడ్, ఆల్కహాల్ అనేవి చావుకు ఏమాత్రం కారణాలు కాదన్నమాట. నూరుల్లా షరీఫ్, రవీంద్ర పాటిల్, ముస్లిం షేక్ గురించి బహుశా ఇప్పుడెవరికీ అంతగా తెలిసి ఉండకపోవచ్చు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు కోర్టు ఐదేళ్ల శిక్ష విధిం చడానికే ఈ ముగ్గురే కారకు లు. వీరిలో షరీఫ్... సల్మాన్ కారు గుద్దిన ఘటనలో మరణించాడు. పాటిల్ ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసు బాడీగార్డు. ఇతడిని కోర్టు సహజ, నిష్పాక్షిక సాక్షిగా పేర్కొన్నది. ఇక ముస్లిం షేక్ ఆ ఘటనలో తీవ్రంగా గాయపడగా శస్త్ర చికిత్స చేసి శరీరంలో స్టీల్ రాడ్ అమర్చారు. అయితే ఆ కేసులో పతాక శీర్షిక వార్త సల్మాన్‌ఖాన్ మాత్రమే. ఆ ఘటన అనంతరం పాటిల్ ఒత్తిళ్లనుంచి తప్పించుకోవ డానికి బహిరంగ జీవితం నుంచి కనుమరుగయ్యాడు. అతడిని సర్వీసు నుంచి తొలగించారు కూడా. ఆ తరువాత ముంబైలో ఒక వీధిలో పడిపోయి, ఆసుపత్రి లో చనిపోయాడు. ఇక షేక్ యూపీలోని తన ఊరిలో కటిక దారిద్య్రంలో బతుకుతున్నాడు. సల్మాన్ ‘హిట్ అండ్ రన్’ కేసులో సెలబ్రిటీ ఫ్యాక్టర్ బాధితులను కనిపించకుండా చేసేసింది. మన సమాజం ఎంతగా చీలిపోయి ఉందనే విష యాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రత్యేకించి ఇలాంటి అన్ని ఘటనల్లోనూ ఇతర అంశాల కంటే సెలబ్రిటీ ఫ్యాక్టర్‌నే మీడియా బలంగా ముందుకు తీసుకువస్తున్నది. ఆ వేదికలు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ గాయకుడు అభిజిత్ ఒకరు. వీధుల్లో కుక్కల్లా నిద్రపోయేవారు కుక్కల్లాగే చస్తారని సెలవిచ్చాడు. ఆ కేసులో కారు వేగం, మద్యం చావుకు ఏమాత్రం కారణాలు కాదన్నమాట. ఎందరో తీవ్రంగా దుయ్యబట్టినా అభిజిత్ తన వ్యాఖ్యలకు కట్టుబడటమే కాక టీవీ చానల్స్‌లో సమర్థించుకున్నాడు. పైగా అతడు కూడా మొదట్లో ముంబైకి వచ్చినప్పుడు సంవత్సరం పాటు వీధుల్లోనే గడిపాడట! వీధుల్లో నివసించడానికి అవి పేదవారి ఆస్తి కాదని అతగాడు ఇప్పుడంటున్నాడు. ఇలాంటి ఘటనల్లో చనిపోయినవారు, గాయపడినవారు వారి మూర్ఖత్వపు బాధితులని ఆయన వివరణ. చిన్న, పెద్ద తేడా లేకుండా మన ప్రతి నగరం లోనూ నిరాశ్రయులున్నారు. ఎండ, వాన, ఎముకలు కొరికే చలిలో బతికే దుర్భర జీవితాలకు మన నగరాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇలాంటి దుస్థితి నుంచి తప్పించు కోవడానికి అందరూ అభిజిత్ వంటి అదృష్టవంతులు కారు. ఇలాంటి వారి గురించి సమాజం అరుదుగా మాత్రమే పట్టించుకుంటుంది. ఎందుకంటే వారు మను షుల లెక్కలోకి రారు. కొందరు ప్రముఖులు వీధివాసు లకు ఓటుహక్కు రద్దు చేయించాలని ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ, విజ్ఞతాయుతమైన వాదనకు కట్టుబడి చాలామంది వెనక్కు తగ్గారు. కానీ ఒకే ఒక న్యాయవాది మాత్రం ఈ సమస్యపై ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా డు. బాలీవుడ్ పేదలపై చాలానే సినిమాలు నిర్మించింది. కేఏ అబ్బాస్, రాజ్‌కపూర్ తీసిన ‘శ్రీ 420’, ‘ఆవారా’ సినిమాలు పేదలు, నిరాశ్రయుల జీవితాలకు సంబం ధించినవి. కానీ ఇదే పరిశ్రమ మురికివాడల్లోని జీవితాల గురించి, సమాజంలోని అధోజగత్ సహోదరులు ఉనికి కోసం పోరాడుతుండటం గురించి ‘స్లమ్‌డాగ్ మిలియనీర్స్’ సినిమాలో చూపించినప్పుడు దాన్ని ఏమంత పెద్దగా పట్టించుకోలేదు. అభిజిత్ ఉదంతంపై ఇతరులు మౌనం పాటించారు కానీ, రిషికపూర్ మాత్రం తనకు అవకాశం ఉంటే అభిజిత్‌పై విమర్శలను తటస్థం చేయడానికి ప్రయత్నించే వాడినని చెప్పారు. వ్యక్తిగత సంక్షోభంలో కూరుకునిపోయిన స్నేహితు డిని అతడి మిత్రులు గాలికి వదలేయాలని ఎవరూ భావించరు. సల్మాన్ ఖాన్ పట్ల వ్యవస్థ నిర్దయగా ఉంద నే అర్థం వచ్చేలా ట్వీటర్‌ను ఉపయోగించడం కాకుండా సంఘీభావ వ్యక్తీకరణ అనేది ప్రైవేట్‌గానే ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ లేకున్నప్పటికీ ఆల్కహాల్ సేవించి మరీ కారు డ్రైవ్ చేసిన సల్మాన్ అనేక అబద్ధాలాడి తన్ను తా ను సమర్థించుకున్నట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. ఈ వ్యవహారంలో రాజకీయవాదులు కూడా జోక్యం చేసు కున్నారు. రాజ్‌థాకరే సైతం సల్మాన్‌ను సందర్శించారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయితే సల్మాన్‌పై తీర్పు అనంతరం అతడికి దారి కల్పించే ప్రయత్నం చేశాడు కూడా. అయితే ఈ యోగ్యతలేవీ బాధితుల గురించి ఏమీ చెప్పడం లేదు. ఎవరైనా వారి ప్రస్తావన చేశారు అను కుంటే బాధితుల ఉనికి పట్ల వారు ఫిర్యాదు చేసేవారే. గూడు లేకపోవడం అనే సమస్యను ఎలా చర్చించాలి అనే చర్చను వారు ప్రారంభించటం కాదిది. శరవేగంగా నగరీకరణ, రియల్ ఎస్టేట్ ధరల పెరుగుదల తీవ్ర స్థాయికి చేరుతున్న సందర్భంలో దీన్ని పరిష్కరించ డంలో దేశం ముందు ఎలాంటి మార్గమూ కనిపించటం లేదు. అభిజిత్ కూనిరాగాలు పెడుతున్నాడు. మరో వైపున సల్మాన్ ఖాన్ అభిమానులు అతడున్న భవంతి ముందు వరదలాగా గుమిగూడుతుంటారు. మరి పేదలవల్ల, దరిద్రుల వల్ల దేశానికి ఎంత ఇబ్బందో చూడండి మరి! (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
అమరావతి కారాదు సంక్షోభ నగరి!!
రాశిలోగాక వాసిలో, స్థాయిలో గాక సారంలో గొప్ప నగరాన్ని నిర్మించడం అత్యుత్తమం. గృహ వసతి, రవాణా సదుపాయాల అవస రాల కంటే సరఫరా ముందుండేటట్టు చేయగలిగితే అది సాధ్యమే. తద్విరుద్ధంగా అవసరాలను అనుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సంక్షోభం. అందుకు తావే లేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకాశాన్ని చంద్రబాబు వదులుకోరాదు. మన దేశం ఏమంత ఎక్కువగా కొత్త నగరాలను నిర్మించింది లేదు. స్వాతంత్య్రోదయ కాలంలో నిర్మిం చిన చండీగఢ్ రూపకర్త ఫ్రెంచివా డైన లి కొర్బూజె కాగా, జర్మన్ వాస్తు శిల్పి ఆటొ కొనిగ్స్ బెర్గర్ భువనేశ్వ ర్కు రూపకల్పన చేశారు. ఆపై నిర్మించిన గాంధీనగర్‌పై కోర్బూసి యర్ ప్రభావం ఉంది. ఆ అర్థంలో నవీ ముంైబె , రాయ్‌పూర్‌లు మాత్రమే బహుశా పూర్తి స్వదేశీ నమూనాలుగా లెక్క. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి.. సింగపూర్ నమూనాలతో నిర్మాణం కానుంది. సింగపూర్ ఒక నగర రాజ్యమే తప్ప వలసలతో పట్టణీకరణ దిశగా సాగుతూ అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్ర రాజధాని కాదు. ప్రత్యేకించి ఆ అంశం కారణంగా మనకున్న పరిమిత అనుభవం నేపథ్యం నుంచే అమరావతి ఎలా ఉం డాలో ఊహించుకోవాల్సి ఉంది. మన దేశంలోని ఇతర నగ రాలన్నీ దశాబ్దాలు, శతాబ్దాల తరబడి పరిణామం చెంది నవే. ప్రామాణిక భారత నగరంగా చూపగలిగేదేదీ లేదు. అమరావతి ‘స్మార్ట్’ నగరం కావాల్సిందే. కాకపోతే ఎంత సూక్ష్మబుద్ధితో అందుకు ప్రణాళికను రూపొందిస్తాం, అమ లుచేస్తాం అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. నూతన నగరం శాసనసభ, సచివాలయం, తత్సంబంధిత వివిధ భవనాల సముదాయం ప్రధాన భాగంగా ఉండే ఒక రాష్ట్ర రాజధాని. ప్రత్యేకించి ఆ కారణంగా నిర్మాణానికి ముందే కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి. అమరావతి భవనాల ముందరి భాగాలు ధగధగలాడే గాజుతో కూడినవి కాకూడదు. అలాంటి భవనాలు లోపలి భాగాలను సౌఖ్యవంతం చేయడం కోసం ఖరీదైన, కొరతగా ఉన్న విద్యుత్తును తెగ కబళించేస్తాయి. ఇక రవాణా కార్లపై ఆధారపడినది కాకూడదు. గృహ వసతి, రవాణా వ్యవస్థలే ఒక నగరం నాణ్యత, సమర్థతలకు కొలబద్ధలు. చండీగఢ్ నగర ప్రణాళిక వృద్ధి చెందుతున్న సేవలనందించే వర్గానికి, అల్పాదాయ వర్గాలకు చౌకగా గృహవసతి ఏర్పాట్లను విస్మ రించి తప్పు చేసింది. నగరం చుట్టూ మురికివాడల వలయా న్ని సృష్టించుకుంది. అక్కడ నివసించేవారు ఎంతో వ్యయప్ర యాసలతో, నానా బాధలూ పడి పని కోసం నగరంలోకి వెళ్లి రావాలి. ప్రధానంగా ఉద్యోగుల గృహవసతి సహా ప్రభుత్వ అవసరాల కోసమే తయారైన గాంధీనగర్ కూడా వలసవచ్చే పేద గ్రామీణ ప్రజలను విస్మరించింది. ముంబై నగర విస్తీ ర్ణానికి సమానంగా ఉండే నవీ ముంబై ఆవిర్భావం సుదీ ర్ఘంగా సాగింది. పేరుకు ప్రపంచంలోనే అతి పెద్ద నగరమైనా నేటికీ అది నత్తనడక నడుస్తోంది. అందులో మూడోవంతు భాగం మాత్రమే మునిసిపాలిటీల కిందికి వచ్చింది. మరో మూడో వంతు మురికివాడలే. గ్రామా లను మురికివాడలుగా మారేంతవ రకు నిర్లక్ష్యం చేశారు. వాటిలో సదు పాయాలు శూన్యం, జనసమ్మర్థం ముమ్మరం. త్వరలో వివరాలను వెల్లడించ నున్న అమరావతి భారీ ఎత్తున గృహ వసతి కల్పనకు హామీనిచ్చే బాధ్య తను స్వీకరించాలి. నివాసానికి సిద్ధం గా ఉన్న గృహాలు కనీసం లక్షయినా ఉంటేనే తక్షణమే అది జనావాస నగరంగా మారుతుంది. కొద్దికొద్దిగా పెంచుకుం టూపోయే పద్ధ్దతి ధరలు పెరగడానికి మాత్రమే దారితీస్తుం ది. అలాగాక ప్రభుత్వం మాత్రమే అక్కడుండేట్టయితే... సాయంత్రానికి అది భూత నగరిగా మారుతుంది. రోడ్ల మీద కార్లను నివారించడం, చౌకగా సమర్థవంతమైన రవాణాను సాధ్యం చేయడం అనే రెండు కారణాల రీత్యా ముందు నుం చే ప్రజార వాణా వ్యవస్థను ఎంచుకోవాలి. స్మార్ట్ సిటీ అంటే ఐటీ రంగ ఉద్యోగులకు పార్కింగ్ స్థలాల లభ్యతే కానవస రంలేదు. నగర ప్రజలకు ఎంత చౌకగా గృహవసతిని, రవా ణాను అందిస్తామనేది గీటురాయి కావాలి. హాంకాంగ్ వాసులకు కారు అవసరం లేదు. మెరుగైన ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల ఫ్రాన్స్‌లోని లీయోన్ నగరంలో కార్ల వాడకం 20 శాతం పడిపోయింది. మ్యూనిచ్ కార్ల అవసరమే ఉండన ట్టుగా గృహసముదాయాల ప్రణాళికలను రచిస్తోంది. ప్రభు త్వ రవాణా వ్యవస్థ ఔచిత్యాన్ని లండన్ సైతం గుర్తించింది. హెల్సింకి కార్ల కంటే సైకిళ్లకు ఎక్కువ స్థలాన్ని కేటాయి స్తోంది. ఈ జాబితా చాలానే ఉంది. ప్రపంచం ఎక్కువ జనసమ్మర్థత, ఎత్తై భవనాలు, తక్కువ కార్లపై ఆధారపడే నమూనా దిశగా పయనిస్తోంది. అదే నేటి పట్టణ ప్రణాళికా వివేకంగా పెంపొందుతోంది. కానీ మనం మాత్రం కార్ల వాడకం ఇంకా ఇంకా పెరగాల్సిం దే, రోడ్లు మరింతగా కిక్కిరిసిపోవాల్సిందేనన్న భావనలోనే చిక్కుకుపోయాం. ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మన్నన కొరవ డింది. నగర జీవితాలను భయంకరమైన రోజువారీ ఒత్తిడిమ యంగా మార్చుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు విజ్ఞ తతో రాసిలోగాక వాసిలో, స్థాయిలోగాక సారంలో గొప్ప నగరాన్ని రూపొందించడం అత్యుత్తమం. గృహవసతి, రవా ణా సదుపాయాల అవసరాల కంటే సరఫరా ముందుం డేట్టుగా చేయగలిగితే అది సాధ్యమే. కానీ అవసరాలననుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సం క్షోభం. అందుకు తావేలేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకా శం బాబు ముందుంది. దాన్ని ఆయన వదులుకోకూడదు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేశ్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
విషాద భారతం
రైతు వ్యవసాయానికి అంటిపెట్టుకుని ఉండటం ముందు ముందు కష్టమౌతుందని కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ వేత్త మద్దూరు సుబ్బారెడ్డి మూడు దశా బ్దాల క్రితమే జోస్యం చెప్పారు. నీరు తదితర ఉత్పాదకాలు దాదాపుగా అవస రం లేని తిమ్మారెడ్డి ముల్లును నాటడాని కైనా రైతులు సిద్ధపడతారేగానీ పంటలు పండించరని కూడా ఆయన అన్నారు. అలాగే నేడు రైతాంగం ఇతర వృత్తులకు చేరుతోంది. దాదాపు మూడు లక్షల మం ది రైతులు ఆత్మహత్యలతో వ్యవసాయం నుంచి విముక్తి చెందారు. గణాంకాల రీత్యానే రాజకీయాలు, వార్తల్లో ప్రధానాంశంగా ఉండే భారత వ్యవ సాయ రంగపు నెత్తుటి గాథ ఇది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతాంగానికి అందించే సహా యం బ్యాండ్ ఎయిడ్ పట్టీలు, ఉపశమనకారుల స్థాయిని మించడం లేదు. ఏ ఆశాలేని రైతాంగంలో ఆశలను చిగురిం పజేయడానికి సరిపడేంత ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వాలు కలి గించలేకపోతున్నాయి. విపత్తులలో ఇచ్చే సహాయం సైతం తరచుగా అక్రమార్జనా సాధనంగా మారుతోంది. ఉత్తరప్ర దేశ్ ప్రభుత్వం ఇటీవల రైతులకు సహాయంగా ఇచ్చిన చెక్కు లు తిరిగొచ్చాయి. కొన్ని చెక్కులయితే ఒక భోజనం కొను క్కోడానికి కూడా సరిపోనివి! ఢిల్లీలోని గజేంద్రసింగ్ ఆత్మహత్య దేశ అంతరాత్మను దిగ్భ్రాంతికి గురిచేసిందని అనిపించింది. కానీ అది ప్రధాని నరేంద్ర మోదీ నుంచి... ‘‘లోతుగా వేళ్లూనుకుని’’ ఉన్న వ్యవ సాయ సంక్షోభ కారణాలను గుర్తించాలి, పరిస్థితి ఇలా ఎం దుకు దిగజారిందని ప్రతి ఒక్కరూ ‘‘ఆత్మశోధన చేసుకోవా ల’’నే సందేశాన్ని మాత్రమే రాబట్టగలిగింది. ఆ ఆత్మహత్య తీవ్రస్థాయి చర్చను రేకెత్తించడం ఒక పరిహాసోక్తిలా అనిపి స్తోంది. ఎందుకంటే ఢిల్లీ రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 0.9% మాత్రమే. మహారాష్ర్ట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో అది 11% నుంచి 33% వరకు ఉం టుంది. అక్కడే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. రైతు ఆత్మహత్యకంటే, దాన్ని కళ్లారా చూడ్డమే మనల్ని ఎక్కు వగా కదిల్చినట్టుంది. రోజువారీ సీరి యల్లాగా దాన్ని చూపిన టీవీకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. మోదీ ‘‘ఆత్మశోధన’’ పిలుపుతో రైతాంగం సంతృప్తి చెందుతుందనుకోను. వారికి కావాల్సింది వ్యవస్థను ప్రక్షాళ నం చేయడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారి దగ్గరికి పోవాల్సిన పనే లేకుండా బతకడానికి సరి పడా ఆదాయం. నీటిపారుదల ప్రాజెక్టులు, సబ్సిడీకి ఎరు వుల గురించి ఇంకా మాట్లాడటాన్ని వాళ్లు లెక్క చేయరు. వారు కోరేది వ్యవసాయ మార్కెట్లలో దురాశాపరులైన దళారులు అంతరించా లని. ఉత్పత్తులకు వాస్తవికమైన ధరలు, వడ్డీ వ్యాపారులను నిర్మూలించే బ్యాంకిం గ్ వ్యవస్థ కావాలని. వ్యవసాయ ఉత్ప త్తులను ‘‘పొలం నుంచి నేరుగా కంచం దగ్గరకు’’ చేర్చాల్సిన అవసరం ఉంది. కానీ మన రాజకీయ ఉపరితల నిర్మాణం లో వ్యవసాయ మార్కెట్లు ఒక అంతస్తు. కాబట్టి అది జరిగే అవకాశాలు తక్కువ. రైతులను మృత్యువు ఒడిలోకి నెడుతున్న వి కలుపు మొక్కలను వదిలేసి పంటను మేసేస్తున్న చట్టబద్ధమైన ముళ్ల కంచెలే. రైతుకు అధిక ధరలంటే వినియోగదారుల జీవన వ్యయాల పెరుగుదలేనని అనుకోకండి. ధరలో అధిక భాగాన్ని దిగమిం గేది దళారులే. రైతులూ వినియోగదారులే. వారి ఆదా యాలు, వినియోగం ఆర్థికవ్యవస్థను శక్తివంతం చేస్తాయి. మనల్ని మనమే కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంది. తుపానులు, భూకంపాల్లాంటి విపత్తుల్లో తప్ప ప్రభుత్వాలు త్వరిత చర్యలకు, నిధులను వెచ్చించడానికి ఎందుకు చొరవ చూపవు? ప్రధాని చెప్పిన ‘‘లోతుగా వేళ్లూనుకున్న కారణా లే’’ నేటి సంక్షోభానికి కారణం. మరి దాని పరిష్కారానికి ఈ చొరవ చూపరేం? దళారులపై ఎందుకు చర్యలు తీసుకోరు? రైతులపై ఒత్తిడిని తగ్గించాలని వారిని ఎందుకు కోరరు? విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు తదితరాలు వేటికైనాగానీ గ్రామీణ ప్రాంతాలకంటే నగరాలకే తలసరి కేటాయింపులు ఎక్కువ. అదే రైతులకు తక్కువ వడ్డీకి రుణా లు, రుణమాఫీలంటే చాలు గట్టి ప్రతికూల స్పందనలు రేగు తుంటాయి. ‘సూటూ బూటూ వేసుకున్నవారికే’ అన్ని విశేష హక్కులన్నట్టు... ముడతలుపడ్డ చొక్కాల మొరటు మనుషు లకు ఏమీ అక్కర్లేదంటారు. చెల్లించలేని రుణాలకు రైతులు అత్మహత్యలు చేసుకుంటుండగా, పారిశ్రామికవేత్తలు చెల్లిం చని రుణాల విషయంలో అంతా కళ్లు మూసుకునే వ్యవస్థను మనం ప్రోత్సహించాం. ‘‘నగరవాసులమైన మనం రైతు కోసం ఏమైనా చేస్తాం, అతని భుజాల మీంచి దిగడం తప్ప’’ అని గాంధీజీ ఎప్పుడో అన్నారు. ఆ మాటలను నేను ఈ కాలానికి వర్తించేలా ‘‘ఏమైనా చేస్తామని అంటాం’’ అని మార్చ సాహసిస్తాను. చాలా మంది నేతలు, విధానకర్తలైన ఉన్నతాధికారులు సైతం రైతు నేపథ్యం నుంచి వచ్చినవారే. అయినా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కారం చేయాలనే అభీష్టం కొరవడటమే నేటి భారతావని విషాదం. మహేష్ విజాపుర్కర్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, ఈమెయిల్: mvijapurkar@gmail.com)) -
ఒక మహాత్ముడూ... ఒక అంబేడ్కరూ...!
దేశంలో కెల్లా ఎక్కువ ప్రాచుర్యం గల నేత గాంధీనా లేక అంబేడ్కరా? వర్థంతికో, జయంతికో లాంఛనప్రాయంగా నివాళులు అందుకుంటున్న గాంధీతో పోలిస్తే లక్షలాదిమంది దళితులు అంబేడ్కర్ అనే తమ ఉద్ధారకుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. తల్చుకుంటున్నారు. తేడా అల్లా ఇదే. ముంబైలోని దాదర్ బీచ్ వద్ద ఉన్న చైత్యభూమి సమీపం లో, గతంలో పిండి మిల్లు ఉన్న చోట డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ భారీ స్మారక స్తూపం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ఆమోదించింది. ఎన్డీయే ప్రభుత్వం పిండిమిల్లు భూ మిని కేటాయించింది. బహుశా, మహారాష్ట్రలో బీజేపీ-శివ సేన ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు ఒక రూపం దాల్చ వచ్చుకూడా. కాబట్టి ఈ కీర్తి ఎవరి ఖాతాలోకి వెళ్లాలి? భారీ స్తూపం అనే ఒక్క అంశాన్ని మినహాయిస్తే, ఏ ఒక్కరూ ఈ భారీతనం గురించి నిర్దిష్టమైన అవగాహనతో ఉన్నట్లులేదు. అక్కడ ఒక ఉద్యానవనం, ఆ నేతకు సంబంధించిన మ్యూజి యంతో కూడిన ఎత్తై నిర్మాణాన్ని నెలకొల్పాలా లేక అది దళితుల ఆకాంక్షలను నెరవేర్చే కేంద్రంగా అంటే ఒక హాస్టల్, కోచింగ్ కేంద్రం, గ్రంథాలయంలాగా ఉండాలా? స్తూపం కోసం కేటాయించిన విశాలప్రాంతంలో దళితుల కోసం ఒక పెద్ద సంస్థను ఏర్పర్చవచ్చు. అయితే ‘నాక్కూడా’ అనే రాజకీయ నేతల అవసరాలను ఇది నెరవేర్చకూడదు. ఒక ఆదర్శంలోని సారాంశం కంటే దాని చిహ్నాలే రాజ కీయ పార్టీల నేతలకు ముఖ్యం. వ్యక్తిగత పూజలు, నినా దాలు, చిహ్నాలు భారత రాజకీయాల్లో కలిసే కాపురం చేస్తుం టాయి. వాస్తవానికి ఇవే మన రాజకీయాల్లో కీలకమైనవి. ఇటీవలే మనం అంబేడ్కర్ 124వ జయంతిని జరుపు కున్నాం. దేశంలో ఎక్కువ ప్రాచుర్యంగల నేత గాంధీనా లేక అంబేడ్కరా? అంటూ చర్చ నడుస్తోంది. గాంధీ ప్రతి ఏడాది రెండుసార్లు అంటే అక్టోబర్ 2న, జనవరి 30న పునరుత్థానం చెందుతుంటారు. ఆయనకు హృదయంతో కాకుండా పెదవు లతో మాత్రమే నివాళి అర్పిస్తుంటారు. వీవీఐపీలు హాజరవు తుంటారు కనుక అధికారిక లాంఛనాలతోపాటు మీడియా కూడా కాస్త ఆసక్తి ప్రదర్శిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనూ, ప్రతి గుడిసె లోనూ దళితులు తమ మహానుభావుడికి వందనాలు పలుకు తున్న ఘటనతోనూ, దాదర్ బీచ్‌లో అంబేడ్కర్‌ని సమాధి చేసిన చోటికి ప్రతి ఏటా డిసెంబర్ 6న లక్షలాదిగా దళితులు హాజరవుతూ నివాళి పలుకుతున్న ఘటనతోనూ గాంధీ జయంతి, వర్ధంతిల తంతును పోల్చి చూడండి మరి. ఒక సార్వత్రిక కారణం కోసం పోరాడుతున్నప్పుడు అంబేద్కర్ దళిత ప్రతీకలాగే ఉండేవారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న తమ మహానుభావుడి విగ్రహానికి నివాళి పలికేందుకు ప్రతి ఏడాది ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద నమ్మశక్యం కానంత పెద్ద సంఖ్యలో దళితులు గుమికూడుతుంటారు. ఈ భారీ మేళాలో అంబేడ్కర్ రచించిన పుస్తకాలు, ఆయనపై ఇతరు లు రచించిన పుస్తకాలను ప్రదర్శిస్తుంటారు. ఇంకా ముఖ్యం గా, ఆయన విగ్రహాలు, చిత్రాలను చాలా మంది కొని తీసు కెళుతుంటారు. అంబేడ్కర్, గాంధీలు తమ జీవితకాలంలో జాతికి విశేష సేవ చేసి ఉండొచ్చుకానీ, గాంధేయవాదులం దరికంటే మిన్నగా దళితులు అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొం టారని, అలాగే గాంధీ కంటే అంబేడ్కర్‌కే ఎక్కువ మంది తమ కృతజ్ఞతలను తెలియజేస్తుంటారని ఒక అం చనా. వారి దృష్టిలో ఆయన దైవ సమానుడు. అంబేడ్కర్ జీవించి ఉంటే, ఈ విగ్రహారాధనకు ముగింపు పలకమని చెప్పేవారు. అలాగే దాదాపుగా విస్మృతి గర్భంలో కలిపివేసిన తన భావాలను లాంఛనప్రాయంగా ప్రకటించడం మానుకో వలసిందిగా గాంధీ చెప్పి ఉండేవారు. మున్నాభాయ్ లాగే.. తనను ఆదర్శీకరించవద్దని, తన మార్గాన్ని అవలంబించమని మాత్రమే చెప్పి ఉండేవారు. భారత్‌లో రాజకీయాలు వ్యక్తిగత ఆరాధనలపై ఊగులా డుతుంటాయి. తొలుత గాంధీని, తర్వాత మరొక గాంధీగా మారిన అంబేడ్కర్‌ని వారి ఆదర్శాల ప్రాతిపదికపై కాకుం డా, ఆరాధన తోటే అనుసరిస్తున్నారు. మార్క్స్, లెనిన్ సైతం ఇలాంటి మన్ననలనే అందుకున్నారు. గతవైభవ దీప్తి కోసం వెదుకులాటలో భాగంగా నరేంద్ర మోదీ గుజరాత్లో సర్దార్ పటేల్‌ను పునరుత్థానం చేస్తున్నారు. అంతే తప్ప ప్రతి రోజూ దళితులపై జరుగుతున్న అత్యాచారాలను వీరిలో ఎవరూ నివారించే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. దళిత నేతలు కూడా రాజకీయాల్లో తమ నడవడిక విష యంలో వెనుకబడిపోతున్నారు. తమ నియోజకవర్గాల సమ స్యల పరిష్కారంలో సృజనాత్మకతను ప్రదర్శించని వీరు, వ్యక్తిగత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. నిస్సహాయుల వెతలు పట్టించుకోకుండా తమ అధికారం కోసం తాపత్రయం చెందుతూ దళితుల ఉమ్మడి ప్రయోజ నాలను పక్కనబెడుతున్న తమ నేతల వ్యవహారం గురించి దళితులకు అవగాహన ఉంది. చీలిపోతూ, కలుస్తూ కాలం గడుపుతున్న రిపబ్లికన్ పార్టీలో మరింత ఐక్యతను వారు ఇష్ట పడుతున్నారు. అంబేద్కర్ ఉద్ధారకుడు కాబట్టే ఆయనను ప్రజారాసులు పూర్తిగా ఇష్టపడుతున్నాయి. అసమానతలకు ముగింపు పలకాలని కోరుకుంటున్న అంబేడ్కర్ అనుయా యులు, రాజకీయాల్లో తక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ, ఏ రాజకీయ నేత, ఆయన అనుయాయులు మనదేశంలో ఇంత సాన్నిహిత్యబంధంతో లేరు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) mvijapurkar@gmail.com మహేష్ విజాపుర్కార్ -
ముద్రలూ... హక్కులూ
గోపాల్ గాంధీ, రాజ్‌మోహన్ గాంధీ, తుషార్ గాంధీ వంటి కొద్దిమందిని మినహాయిస్తే, అసం ఖ్యాకులైన మహాత్మాగాంధీ వారసులలో ఎవరైనా గాంధీ టోపీ తమకు చెందుతుందని క్లెయిమ్ చేయడాన్ని ఊహించుకోండి. ఆయన పేరుతో ముడిపడిన జనరంజక సంస్కృతిలోని సంప్రదా యం ద్వారా ఆ టోపీకి బ్రాండ్ విలువ ఏర్పడిం ది. గాంధీ వారసత్వ కుటుంబాలలో కానీ, గాంధీ వాదుల్లో కానీ ఏ ఒక్కరూ ప్రస్తుతం ఆయన టోపీని ధరించడం లేదు. బహుశా అనేకమంది గాంధీవాదులు ఆ టోపీని ఉపయోగించడం లేదు కాబట్టే గాంధీవాదుల్లా నటిస్తున్న గాంధీయేతర రాజకీయవాదులే నేడు రాజ్యమేలుతున్నారు. గాంధీ టోపీపై హక్కులను అడగటం అనేది ఇప్పుడు శక్తివంతమైన ప్రకటన అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర వింద్ కేజ్రీవాల్‌కు గతంలో తానిచ్చిన బ్లూ వేగన్ కారును వెనక్కు పంప వలసిం దిగా కుందాన్ శర్మ ఇటీవలే అడిగేశారు కూడా. ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో శర్మ విసిగిపోయారు. పైగా అంతర్గత ప్రజాస్వామ్యం వంటి సమస్యలపై కేజ్రీవాల్‌తో నేరుగా చర్చించ లేకపోవడం కూడా శర్మకు చికాకు పుట్టింది. కేజ్రీవాల్ ఇప్పుడు సామాన్యులకు అంత సులు వుగా అందుబాటులో లేని నేతగా మారారు. శర్మలాగే మరొక మద్దతుదారైన సునీల్ లాల్ తనదైన బాణీ వినిపించారు. ఒక స్వచ్ఛంద సేవకుడిగా తాను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి లోగోను తయారు చేసి ఇచ్చానని, ఇప్పుడు దాని హక్కులను వెనక్కు తీసుకోవాలనుకుంటున్నా నని బాంబు పేల్చారు. చెప్పినదానికి కట్టుబ డని, తానెలా ఉండాలనుకున్నాడో, అలా ఉండని పార్టీపట్ల ఆశాభంగం చెందిన వ్యక్తి నుంచి వచ్చి న మరొక శక్తివంతమైన ప్రకటన ఇది. ఒక పార్టీగా కాంగ్రెస్ పని ముగిసిపోయింది కాబట్టి, మహాత్మాగాంధీతో తన అనుబంధానికి గుర్తుగా గాంధీ టోపీని ఉపయోగించడాన్ని కాం గ్రెస్ మానుకోవాలన్న డిమాండ్ వినిపించటం లేదు. కాంగ్రెస్ వాదులు కొన్ని సందర్భాల్లో మా త్రమే గాంధీ టోపీని ధరిస్తున్నారు. అయితే గాం ధీ ఆగమనానికన్నా ఎంతో ముందే ఆ టోపీని మహారాష్ట్రలో వాడేవారు. కాకపోతే అది తెల్ల రంగులో ఉండేది కాదు. గాంధీ ధరించి వదిలి వేసిన టోపీని ఆమ్ ఆద్మీ ఒక శక్తివంతమైన బ్రాం డ్గా, గుర్తింపుగా మార్చివేసింది. స్థానిక దర్జీ సైతం దాన్ని సులువుగా కుట్టగలిగేలా, ఖాదీ భండారులో అమ్ముతూ కనిపించేలా ఆ టోపీని ఆమ్ ఆద్మీ ఒక గౌరవ బ్యాడ్జ్‌గా మార్చేసింది. ఇతర పార్టీలు కూడా కాం గ్రెస్‌ను కాకుం డా ఆప్నే అనుకరించి తమ టోపీలపై పార్టీ పేరు వచ్చేలా చూసుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ రెడ్ క్యాప్‌లాగా. చివ రకు బీజేపీ సైతం దాన్ని స్వీకరించింది. ఫార్మాసూటికల్ కంపెనీ తను పేటెంట్ తీసు కున్న మాలిక్యూల్‌ను కొత్త ఔషధంగా మార్కెట్ చేసినట్లుగా ఆప్ మటుకు గాంధీ టోపీకి నిఖార్స యిన మాట్లు వేసింది. ఆప్ అనేది ఒక భావనగా కూడా లేని రోజు ల్లో (క్షమించండి యోగేంద్ర యాదవ్) ఇండియా ఎగెనైస్ట్ కరప్షన్ సంస్థలోని నిబద్ధ భాగస్వాములు జనలోక్‌పాల్ కోసం డిమాండ్ వంటి నినాదాల ను ఆ టోపీపై ముద్రించేవారు. అచిరకాలంలోనే ఆ క్యాప్ పరివర్తన చెందింది. మై ఆమ్ ఆద్మీ హూ.. అని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు గర్వం గా చెప్పుకునేలా చేసింది. కాని మండిస్తున్న ఢిల్లీ ఉక్కపోతలో దాన్ని ధరించడమే ఇప్పుడు సులు వు. అంతేకానీ టీవీల్లో కూడా కార్యకర్తలు ఎవరూ దాన్ని ఇప్పుడు ధరించడం లేదు. ఆప్ తన విలువల వలువలను ఒకటొక్కటిగా వదిలివేస్తున్న తరుణంలో గాంధీ టోపీకి మెరుగులద్ది అది తీసుకొచ్చిన ఆ గొప్ప బ్రాండ్ భవిష్యత్తు ఏమిటి? ఎవరూ ధరించని గాంధీ టోపీలాగే కొన్నాళ్లకు దీని కథ కూడా ముగియనుందా? - మహేష్ విజాపుర్కార్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) mvijapurkar@gmail.com -
‘కష్టకాలం’లో దుష్టచింతన!
సందర్భం ఇతరుల బాధలనుంచి తాము లాభపడటం అనే ఈ భయంకర ధోరణి ఎంతగా విస్తరించిందంటే, పంట నష్టాలు, సహాయ చర్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త పద్ధతులను చేపట్టడం అనివార్యమైపోయింది. వర్షాలు లేదా వాటి పర్యవ సానాల కారణంగా వ్యవసాయరంగంలో సంక్షోభం ఏర్పడటం అనేది భారత్‌లో సర్వ సాధారణ వ్యవహారంలా మారిపోయింది. తదుపరి సంవత్సరంలో మరింత మెరు గుపర్చిన సమర్థతతో ఆ సం క్షోభాన్ని ఎదుర్కోవడానికి బదులుగా, ప్రభుత్వ ఖజా నాను కొల్లగొట్టేందు కోసం మరింత సమర్థవంతమైన మార్గాలను అన్వేషించే ప్రయత్నాలే రానురానూ పెరు గుతున్నాయి. ఎందుకంటే అక్రమంగా వచ్చి పడే డబ్బు నేడు రాజకీయాలను శాసిస్తోంది. ఉన్నతోద్యోగబృదం కూడా దీన్ని చూసీ చూడనట్లుగా ఊరకుండిపోతోంది. స్వచర్మ రక్షణ లేదా అక్రమ సంపదలో తమ వంతు వాటాపై కన్నేయడం దీనికి కారణం కావచ్చు. అకాల వర్షాలు, ఆకస్మిక తుపానుల కారణంగా దేశ వ్యాప్తంగా రబీ సీజన్లో జరిగిన పంట నష్టాల తీవ్రత గురించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవ రించినప్పుడు ఈ విషయం స్పష్టంగా బయటపడింది. కేంద్రం సవరించిన అంచనాల ప్రకారం 75 లక్షల హెక్టా ర్లలోనే పంట నష్టం జరగగా, అంతకుముందు రాష్ట్రాల న్నీ కలిసి 181 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు కేంద్రానికి లెక్కలు పంపాయి. ఈ లెక్కల బాగోతాన్ని తేల్చడానికి ఆయా రాష్ట్రాలను సందర్శించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు వాస్తవ నష్టానికి, లెక్కించిన అంచ నాలకు మధ్య అపారమైన వ్యత్యాసం ఉన్నట్లు కను గొన్నారు. ఈ తేడాకు అనుకోని లోపం కారణం కాదు. ఈ ఘటనను ఒక రైతాంగ కార్యకర్త ఇటీవల విడుదలైన ‘ధాగ్’ అనే మరాఠీ సినిమాలోని ఒక దృశ్యం తో పోల్చి చెప్పారు. గ్రామ శ్మశాన భూమిని నిర్వహిస్తు న్న ఒక వ్యక్తి కుటుంబం ఆ ఊరులో చావు ఘటన సంభ విస్తే తెగ సంతోషపడేది. ఎందుకంటే ఆ వ్యక్తి అంత్య క్రియలకు ఇచ్చే రుసుముతో ఆ పూట ఆ కాటికాపరి కుటుంబం కడుపారా ఆరగించవచ్చు. ఆ ఊరిలో ఎవరై నా ముస్లిం చనిపోతే ఆ కాటికాపరికి పరమ చీకాకు వచ్చేది. ఆ శవం తన ఖాతాలోకి రాదు మరి. ఇలా పంట నష్టాన్ని అతిశయించి అంచనాలు పంపిన రాష్ట్రాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లదే అగ్రస్థానం. ఇవన్నీ బీజేపీ లేదా బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వాలే కావడం గమనార్హం. ఇక ఉత్తరప్రదేశ్ అయితే నమ్మశక్యం కానంత భారీ స్థాయిలో పంట నష్టంపై అధిక అంచనాలను కేంద్రానికి పంపింది. ఈ ఎనిమిది రాష్ట్రాలు కలిపి 75 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా పంపితే దీంట్లో ఒక్క ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే 60 లక్షల హెక్టార్లలో పంట నష్టం అంచనాలను పంపించింది. ఈ 75 లక్షల హెక్టార్ల పంట నష్టం గురించిన అతి అంచనాలను కేంద్రం పసిగట్టడమే కాకుండా తొలి సారిగా దాన్ని బహిరంగపర్చింది. తాము పంపిన అంచ నాలపై ఆధారపడి కేంద్రం తాము కోరుతున్న మొత్తాల ను కచ్చితంగా తగ్గిస్తుందని రాష్ట్రాలకు తెలిసే ఇలా జరుగుతోందనిపిస్తుంది. దీని ప్రాతిపదికన అవి కేంద్రం నుంచి కోరే భారీ మొత్తాల వార్తలు పతాక శీర్షికల్లో వస్తుంటాయి. రైతులు కాస్త ఉపశమనం పొందడానికే తప్ప ఈ వార్తల వల్ల వారికి ఒరిగేదేమీ లేదు. ఇతరుల బాధలనుంచి తాము లాభపడటం అనే ఈ భయంకర ధోరణి ఎంతగా విస్తరించిపోయిందంటే, పంట నష్టాల ను, సహాయ చర్యలను, వాటిని తక్షణం అందించడం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త పద్ధతులను చేపట్టడం అనివార్యమైపోయింది. సహాయ, పునరావాస చర్యలు ఎవరికి చెందాలో వారికి చెందకుండా పోతున్న దృష్టాంతాలు అనేకం మనముందున్నాయి. మన వ్యవస్థ ఇలాంటి వాటిని జల్లెడలాగా లీక్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో చోటు చేసుకునే జాప్యం కూడా చిన్నదేం కాదు. వర్షపాతం పరంగా, వాతావరణ పరం గా, వ్యవసాయ దిగుబడులు క్షీణత పరంగా ఒకటీ లేదా కొన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమ యాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పాలనా పరమైన క్యాలెండర్ సంవత్సరంలో యాదృచ్ఛికంగా సంభవించే ఉత్పాతాలకు కొన్నిసార్లు నిధులను విడుదల చేయలేదు. ఇలాంటి అనేక సందర్భాల్లో రైతులను కేవలం గణాంకా లుగానే తప్ప, మనుషులుగా గుర్తించనంత యాంత్రి కత కొనసాగుతుంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది రాజకీయ నేతలు వ్యవసాయ నేపథ్యం కలిగినవారు లేదా వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారు. అయితే తమ సంపద పన్నేతర వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయమే తప్ప మరొకటి కాదని ప్రదర్శించుకోవడాని కే తప్ప వారి నేపథ్యం రైతాంగానికి ఏమాత్రం ఉప యోగపడటం లేదు. ఈ బాధాకరమైన పరిణామాలకు సమాధానం ఆత్మహత్యలు కాదు. వాటిని పరిష్కరించడానికి నిజా యితీతో చేసే ప్రయత్నం అవసరం. కానీ నిధుల కేటా యింపులే ప్రధానమై, ఫలితాలు అప్రాధాన్యమవుతున్న చోట ఈ ప్రయత్నాన్ని ప్రారంభించడం ఎలా? నిరాశా నిస్పృహలతో వేసారిపోయి సమీపంలోని వేప చెట్టుకు ఉరి బిగించుకోవడాన్ని నివారించాలంటే వేగంగా స్పం దించడం అత్యంత అవసరం. దీనికి కావలసింది ప్రక్రియలో మార్పు కాదు.. మనస్థితిలో మార్పు. 1980ల మొదట్లో నా దృష్టికి వచ్చిన విషయమిది. 1970ల మధ్యలో రాయలసీమ ప్రాంతంలో రూ.49 కోట్ల విలువైన కరువు సహాయక చర్యలతీరును పరిశీలిం చిన ఒక అధికారి ఆ మొత్తాన్ని అక్కడి అధికారులే దిగమింగడాన్ని నాతో ప్రస్తావించారు. బంజరు భూము ల్లో పెరిగిన చెట్లను కూలీలతో తొలగించినట్లు తప్పుడు గా నమోదు చేసిన అధికారులు.. సిమెంట్ స్టాక్‌ను నేతల సాయంతో దారి మళ్లించారని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు రైతులకు మేలు చేకూర్చే సాకుతో కరవు గురించి రూపొందిస్తున్న అతి అంచనాలు అవధులు మీరిన స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్ (పెంగ్విన్, 1996) అనే తన పుస్తకంలో పి సాయినాథ్ ఈ విషయంపై చెప్పినవి నూటికి నూరుపాళ్లూ నిజమే. వాళ్లు కరవును ఎందుకు ప్రేమిస్తున్నారో మనకు తెలుసు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) mvijapurkar@gmail.com