తీర్పులపై తిరస్కారం | mahesh vijapurkar opinion on dahi handi | Sakshi
Sakshi News home page

తీర్పులపై తిరస్కారం

Published Tue, Aug 30 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

తీర్పులపై తిరస్కారం

తీర్పులపై తిరస్కారం

విశ్లేషణ

కృష్ణాష్టమి సందర్భంగా జరుగుతున్న దహిహండి కార్యక్రమాలు రాజకీయ ప్రదర్శనగా మారిపోయాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణుడు వెన్న దొంగిలించాడే కానీ విదూషక పాత్ర పోషించలేదన్నది.

న్యాయ విచారణను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురైనప్పుడు సాధా రణంగా మన రాజకీయ నేతలూ, పార్టీలూ తమకు న్యాయ వ్యవస్థ అంటే ఎనలేని విశ్వాసం ఉం దని, తీర్పుకోసం వేచి ఉంటా మని చిలక పలు కులు వల్లిస్తుంటారు. కానీ కోర్టు ఎదుట హాజరు కావడానికి ముందు కూడా వారు న్యాయస్థానాన్ని ఏమాత్రం ప్రశ్నించలేకపోతున్నందున వీరి చిలక పలుకులు ఇప్పుడు మీడియా ముందు గొట్టిమాట లుగా కనిపిస్తున్నాయి.తీర్పు నేతలకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా, ఇప్పటికీ తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని మాట్లాడుతూనే వారు అప్పీలుకు ప్రయత్ని స్తారు. కానీ షా బానో కేసు వంటి ఉదంతాల్లో న్యాయవ్యవస్థ తీర్పులను మొదట ఒక ఆర్డినెన్సు ద్వారా, పార్లమెంటు తోసిపుచ్చుతూ ఉంటుంది.  తర్వాత ఆ తీర్పును పూర్తిగా వెనక్కు మళ్లించే పాత్రను శాసనాధికారం పోషిస్తుంది.

కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు (దహిహండి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ల ఎత్తు 20 అడు గులకు మించి ఉండరాదని, 18 ఏళ్లలోపు వయస్సు వారు ఆ పిరమిడ్లలో భాగం కాకూడదని బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీ వల ఎత్తిపట్టినప్పుడు మహారాష్ట్రలో దాదాపు ఇలాగే జరిగింది.తీర్పు వెలువడగానే, మహారాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి దహిహండి కార్యక్రమం ఒక సాహస క్రీడ అంటూ తీర్మానం జారీ చేసింది. కాని సాంప్రదాయం ప్రకారం ఇది మతపర కార్యక్ర మంగా ఉన్నందున అలాంటి పరిమితులు మనోభా వాలను గాయ పర్చవచ్చని అదే రోజు ప్రారంభంలో ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఇది రెండు నాలి కల వ్యవహారమే కాకుండా న్యాయ ప్రక్రియకు ఎంతో దూరం జరుగుతుంది కూడా.

 అయితే అనూహ్య పరిణామం ఏమంటే, కోర్టు తీర్పును అత్యంత పరిహాసాస్పదంగా తోసిపుచ్చిన ఘటన చోటు చోసుకోవడమే. రాజ్‌థాకరే నేతృ త్వంలో శివసేన నుంచి చీలివచ్చిన మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన కోర్టు తీర్పును ధిక్కరించాలని నిర్ణయిం చుకుంది. మనిషిపైన మనిషిని ఎత్తుగా నిలబె డుతూ సాగే ఈ క్రీడ కు ప్రధాన కేంద్రంగా ఉన్న థానేలో జరిపిన భారీ కార్య క్రమాన్ని అడ్డుకునేవారే లేకపోయారు.న్యాయవ్యవస్థ తీర్పులను గౌరవించడం అంత రించిపోతున్న స్థితిలోకి దేశం వెళ్లిపోతుందా అనే సీరియస్ చర్చకు ఇది దారితీయాలి. అత్యున్నత న్యాయస్థానంలో ఇలాంటి చర్యకు వ్యతిరేకంగా ఈప్పీల్ చేయడానికి బదులుగా స్వార్థపర శక్తులు ఆ తీర్పును ప్రతి ఘటించే లేదా ధిక్కరించే మార్గాన్ని ఎంచుకున్నాయి. కానీ పార్టీలు ఈ అపరాధం నుంచి తప్పించుకోలేవు. బంద్‌పై నిషేధాన్ని ధిక్కరించిన శివసేకు బాంబే హైకోర్టు గతంలో జరి మానా విధిం చింది కూడా.

ప్రధానంగా రాజ్‌థాకరే నిర్ణయం వల్లే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ధిక్కారానికి గురైంది. కోర్టు తన తీర్పు ప్రకటించిన గంటల్లోపే రాజ్‌థాకరే దాన్ని మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ అభ్యంతరం చెప్పారు. తిరస్కారం ఎంత పతాక స్థాయికి వెళ్లిందంటే ఉట్టి కొట్టే ఒక గోవిందుల బృందం ముంబైలో 40 అడుగుల ఎత్తు తాకేలా 11 అంతస్తుల మానవ పిరమిడ్‌ను నిర్మించేసింది. ఇది ఒకానొక ఘటన మాత్రమే కాదు. చాలా మంది కోర్టు ఆదేశాన్ని ధిక్కరించడానికే నిర్ణయించు కున్నారు. ఇక అధికారులు దాన్ని అడ్డుకునేందుకు బదులుగా అలాంటి ఘటనలను వీడియో తీసి ఊర కుండిపోయారు. ఇకపోతే థానే, ముంబై పురపాలక ఎన్నికల్లో శివసేనను అధిగమించి అధికార పగ్గాలు స్వీకరించాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ విష యంలో ప్రజాగ్రహానికి గురికావలసి ఉంటుందనే భీతితో మౌనంగా ఉండిపోయింది.

ఉట్లు కొట్టడానికి సంబంధించిన ఈ దహి హండి కార్యక్రమాలు మత పరమైన సాంప్రదా యంగా కాకుండా రాజకీయ ప్రదర్శనగా మారి పోయాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై వ్యాఖ్యా నిస్తూ బాల కృష్ణుడు కొంటె చేష్టలకు పాల్పడి వెన్న దొంగిలించాడు తప్పితే విదూషక పాత్ర పోషించ లేదని ఎత్తి చూపింది.ఈ కార్యక్రమానికి  పలువురు రాజకీయనేతలే కీలక ఆర్గనైజర్లుగా ఉంటున్నారు. ఉట్ల ప్రదర్శనను నిర్వహిస్తున్న వీరికి చెందిన ట్రస్టులు మతపరమైన పండుగ అనే విశ్వాసం ఇప్పుడు పెద్ద ప్రదర్శన స్థాయికి చేరిందని మాట్లాడుతున్నాయి. అయితే దాని మూలాలు మతంలోనే ఉండవచ్చు కానీ బాల దేవుడి కొంటె చేష్టలను కొత్తగా అనుకరిస్తున్నప్పుడు అది పూర్తిగా మరో రకంగా కనిపిస్తూండటం గమనార్హం.

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేశ్ విజాపుర్కార్
ఈమెయిల్ : mvijapurkar@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement