ధిక్కారం మన హక్కా?
విశ్లేషణ
సమాజానికి సంప్రదాయాలుంటాయి. కానీ మనం చట్టాలకు లోబడి వ్యవ హరించాలి. మూకుమ్మడిగా చట్టాన్ని ధిక్కరించి కోడిపందేలు, జల్లికట్టు నిర్వహించదలిచే వారిలో ఎంతమందిపై కోర్టు ధిక్కార నేరం మోపగలరు?
దేశం ప్రస్తుతం నోట్ల రద్దు నిర్ణయం గురించి చర్చి స్తోంది. నలుపు, తెలుపుల గురించిన ఈ గొడవ మధ్య మనం పట్టించుకోని మరో ముఖ్య సమస్య ఉంది. చట్టం, న్యాయ వ్యవస్థల పట్ల, అధికారం పట్ల చూపాల్సిన గౌరవం వార్తా శీర్షికల్లోనో, టీవీ ‘బ్రేకింగ్ న్యూస్’లోనో తప్ప మరెక్కడా కనబడక పోవడం ఒక ప్రధాన ధోరణిగానే ఉంది. దీనికీ, నోట్ల రద్దుకు ఎలాంటి సంబంధమూ లేదు.
తమిళనాడులో ప్రజలు జల్లికట్టు సమస్యపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం వీటిలో తాజాది. చెదురు మదురుగానే అయినా ఆ క్రీడను నిర్వహించడానికి, సంప్రదాయం పేరిట జంతువుల పట్ల చూపే క్రూరత్వాన్ని చెల్లుబాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అలాంటిదే మరో ధిక్కారం ఆంధ్రప్రదేశ్‌లోని కోడి పందేలు. ఇక మన జవాన్లు... అధ్వాన మైన తిండి, సుదీర్ఘమైన పనిగంటలు, సీని యర్ అధికారుల కుక్కలను తిప్పుకురావడం తదితర విషయాలలోని తమ దుస్థితిని నేరుగా బహిరంగ ప్రసారం చేయడానికి పూనుకోవడం మరొకటి. ఇది, స్థావరాల స్థాయిలోని బలగాల అధికార వ్యవస్థ దౌష్ట్యం కావచ్చు. కానీ శ్రేణులు ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడాలని భావించడం ఆందోళనకరం.
అధికారులు ప్రతిసారీ కోర్టుల ఆదేశానుసారం చట్టాన్ని గౌరవించేలా చేయడానికి హామీని కల్పిం చడం కృషి చేయాల్సి రావడం అత్యంత విషాదకరం. అందులోనూ వారు ప్రతిసారీ సఫలం కారు. కోర్టు తీర్పుపై అసమ్మతిని తెలపడం ఆమోదనీయమే గానీ, ధిక్కరించడం కాదనే విషయాన్ని ప్రజలు విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది.
నేడు మన పార్లమెంటుకు లభిస్తున్న గౌరవం కంటే ఎక్కువ గౌరవం కోర్టులపట్ల చూపాల్సి ఉంది. పార్లమెంటు వెసులుబాటుకు తగినంత అవకాశాన్ని కల్పిస్తుంది. హడావుడిగానో లేక హఠాత్తుగానో నిర్ణ యాలు జరగవు. కోర్టు ఆదేశాలు చెల్లకుండా చేయ డానికి ఆర్డినెన్స్‌ను తెమ్మని కోరడం రాజకీయవేత్త లకు సులువైపోయింది. ఒక వర్గంగా వారంతా తమ తమ భావజాలానికి అనుగుణంగా... షాబానో కేసులో జరిగినట్టుగానే కోర్టు తీర్పులకు అడ్డుపడు తూనే ఉంటారు. ఇది సమాజంలోని మన నడవ డికపై ప్రభావం చూపే తీవ్ర సమస్య. సమాజానికి సంప్రదాయాలుంటాయి. కానీ మనం నియమ నిబంధనలకు లోబడి, మరీ ముఖ్యంగా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరంకుశ చట్టాన్ని ధిక్కరించవచ్చు, కాకపోతే ఆ పని చేయా ల్సింది కోర్టులలోనే.
మరో సమస్యాత్మకమైన పరిణామాన్ని మనం పట్టించుకోకుండా తోసిపుచ్చవచ్చు. కానీ అది మనకే ప్రమాదకరం. అది, సరిహద్దు భద్రతా బలగం, కేంద్ర రిజర్వు పోలీసు, సశస్త్ర సీమా బల్, సైన్యం జవాన్లు తమ అసంతృప్తిని గురించి బహిరంగంగా వ్యక్తంచేయడం. అందుకు వారు సామాజిక మాధ్య మాలను వాడటం పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచి స్తుంది. సాయుధ బలగాలలోని అసంతృప్తి ప్రమాద కరమైనది. సందేశాన్ని పంపినవారిని శిక్షించడానికి ముందు... వారి ‘క్రమశిక్షణా రాహిత్యానికి’ కారణా లేమిటో చూసి, వాటిని పరిష్కరించే పనిచేయాలి. సిబ్బంది సమస్యల పరిష్కార యంత్రాంగం సక్ర మంగా పనిచేయడంలేదనేది స్పష్టమే. పదవీ విర మణ చేసిన సీనియర్లు ‘ఒక ర్యాంకుకు ఒకే పెన్షన్’ కోరిక సాధన కోసం వీధుల్లోకి వచ్చిన తీరును చూసి వారు ధైర్యం తెచ్చుకుని ఉండొచ్చు.
‘పౌర జీవితం’లో, అంటే దేశంలోని సైనికేతర విభాగాలలో ఏం జరుగుతోందనేది జవాన్లకు తెలియ కుండా అడ్డుకోవడం అసాధ్యం. సుదీర్ఘమైన ఆ ఆందోళన గురించి సైనికులకు తెలిసింది. వారు ఆందోళన చేయాల్సి రావడం వల్ల బ్యారక్‌లలోని జవాన్లకు... భారత అధికార వ్యవస్థ అమర జవాన్ల పట్ల బహిరంగంగా గౌరవాన్ని ప్రదర్శిస్తుందే తప్ప సజీవంగా ఉన్న హీరోలను మాత్రం పట్టించుకోదని స్పష్టం చేసి ఉంటుంది. దురదృష్టవశాత్తూ, ఇలా బహిరంగంగా మాట్లాడటం ద్వారా వెలుగులోకి వచ్చిన చెడుగులను నిర్మూలించడం కంటే వాటిని బయటపెట్టిన వారిని లక్ష్యం చేసుకుని శిక్షించడమే సులువు. ఎంతైనా వారు క్రమశిక్షణారాహిత్యంతో ప్రవర్తించాలని అనుకున్న వ్యక్తులు. కాబట్టి బలగాలు వారిని సహించలేవు. మరైతే సామూహికంగా చట్టాన్ని, కోర్టులను ధిక్కరించి కోడిపందేలు, జల్లికట్టు నిర్వహించాలనుకునే సమూహాల మాటేమిటి?
వారిలో ఎంత మందిపై కోర్టు ధిక్కార నేరం మోపు తారు లేదా మోపగలరు? అందరికీ తెలియక పోయినా ఇలా విస్మరించిన కోర్టు తీర్పులు బహుశా చాలానే ఉండి ఉంటాయి. ఉదాహరణకు, ట్రక్కు లలో నుండి బయటకు పొడుచుకు వచ్చే చువ్వలు పలువుర్ని హతమార్చాయి. ఈ విషయంలో అత్యు న్నత న్యాయస్థానం అధికారులను హెచ్చరించింది. ఆ ఆదేశాల ధిక్కరణను మీలో ఎందరు చూసి ఉండరు? మనం జీవితాన్ని మనకు అనువైన విధంగా గడపాలని నిర్ణయించుకున్నామా?
మహేష్ విజాపృకర్
ఈమెయిల్: mvijapurkar@gmail.com