Jallikattu
-
తిరుపతి జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు (ఫోటోలు)
-
జల్లికట్టు చిన్నారి పట్టు
‘జల్లికట్టు’ అంటే ఎద్దును లొంగదీసుకుని దాని కొమ్ములకున్న అలంకరణలను సొంతం చేసుకోవడం. జల్లికట్టు ఎద్దులకు ΄పౌరుషం ఎక్కువ. కొమ్ములకు వాడి ఎక్కువ. తమ మూపురాలను తాకనివ్వవు. అందుకే ఈ మనిషి–పశువు క్రీడ తరాలుగా తమిళనాడులో ఉంది. జల్లికట్టులో దించబోయే ఎద్దుకు తర్ఫీదు ఇస్తూ పదేళ్ల యజిని వార్తల్లోకి ఎక్కింది. రాబోయే సంక్రాంతికి యజిని.. ఎద్దు‘నన్బన్’ చాలా పెద్ద వార్తలనే సృష్టించనున్నాయి.రాబోయే‘΄పొంగల్’కి తమిళనాడులో జల్లికట్టు ధూమ్‌ధామ్‌గా జరగనుంది. మదురై, తంజావూరు, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో ΄పొంగల్ నుంచి మొదలై వేసవి వరకు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పల్లెవాసులు కూడా వేలాదిగా వీటిలో పాల్గొంటారు. తమ ఎడ్లను తెచ్చి పాల్గొనేలా చేస్తారు. మన కోళ్ల పందేలకు కోడిపుంజులను తీర్చిదిద్దినట్టే ఇందుకై ఎడ్లనూ తీర్చిదిద్దుతారు. రైతు కుటుంబాల్లో తండ్రులు వారికి తోడు పిల్లలు ఈ పనిలో నిమగ్నమవుతారు. అలాంటి రైతు కూతురే పదేళ్ల వయసున్న యజిని.ఎద్దు– మనిషిమదురైలోని మంగులం అనే గ్రామంలో శ్రీనివాసన్ అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని జల్లికట్టులో పాల్గొనేలా చేస్తున్నాడు. ‘జల్లికట్టు’లో ‘జల్లి అంటే రెండు కొమ్ములకు అలంకరణ వస్త్రాలు ‘కట్టు’ అంటే కట్టడం. రెండు కొమ్ముల మధ్య వెండి లేదా బంగారు నాణేలు కూడా కడతారు. ఆటగాళ్లు పరిగెడుతున్న ఎద్దును తాకి, మూపురం పట్టి నెమ్మదించేలా చేసి ఆ అలంకరణలను, నాణేలను సొంతం చేసుకుంటారు. ఎన్ని సొంతం చేసుకుంటే అంత వీరుడిగా గుర్తింపు. అలాగే ఈ వీరులకు చిక్కకుండా వారి మీద కొమ్ము విసిరి తరిమికొడితే ఆ ఎద్దుకు అంతటి ఘనత. ‘మా ఎద్దు కూడా అంతటి గొప్పదే. చాలా మెడల్స్ సాధించింది’ అంటుంది యజిని.పాపకు స్నేహితుడుయజినికి ఐదేళ్లుండగా తండ్రి ఎద్దులను కొన్నాడు. వాటిలో ఒకదానికి యజిని‘నన్బన్’ (స్నేహితుడు) అనే పేరు పెట్టింది. రోజూ దానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం, కబుర్లు చెప్పడం ఇదే పని. ‘నేను దగ్గరికి వెళితే ఏమీ చేయదు. పిలవగానే వచ్చేస్తుంది’ అంటుంది యజిని. గత మూడేళ్లుగా జల్లికట్టులో తండ్రితో పాటు నన్బన్ను తీసుకొని వెళుతోంది యజిని. ‘వాడివాసల్ (స్టార్టింగ్ పాయింట్) నుంచి మా నన్బన్ పరుగు అందుకోగానే చాలామంది ఆటగాళ్లు దాని మూపురం పట్టుకోవాలని, కొమ్ములు అందుకోవాలని ట్రై చేస్తారు. కాని మా నన్బన్ అందరి మీదా బుసకొట్టి దూరం పోయేలా చేస్తుంది. ఆట గెలిచాక బుద్ధిగా నా వెంట ఇంటికి వస్తుంది. ఆ ఎద్దు – ఈ ఎద్దు ఒకటేనా అన్నంత డౌట్ వస్తుంది’ అంటుంది యజిని.ట్రైనింగ్జల్లికట్టు కోసం ట్రైనింగ్ యజిని ఇస్తోంది తండ్రితో పాటు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దును రోజూ వాకింగ్‌కి, స్విమ్మింగ్‌కి తీసుకెళ్లాలి. తడి నేలలో, మెత్తటి నేలలో కొమ్ములు గుచ్చి కొమ్ములు బలపడేలా చేయాలి. దీనిని ‘మన్ కుథల్’ అంటారు. ఇక మంచి తిండి పెట్టాలి. ఇవన్నీ యజిని చేస్తోంది. ‘నేను ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నా. గవర్నమెంట్ జల్లికట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎద్దుకు ఎటువంటి అపాయం కలక్కుండా రూల్స్ పెట్టింది. అందుకే నన్బన్ను నేను ధైర్యంగా పోటీకి తీసుకెళ్తా’ అంటోంది యజిని. -
కుప్పంలో జల్లికట్టు నిర్వహణ.. 10 మందికి గాయాలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ జల్లికట్టు నిర్వహణ జరిగింది. చెక్కునత్తం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన జల్లికట్టు
పూతలపట్టు (చిత్తూరు జిల్లా): జల్లికట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, కొట్టాలలో చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. ఆడిజాతర పురస్కరించుకుని కొట్టాలలో గురువారం మారెమ్మ జాతర జరిగింది. ఇందులోనే జల్లికట్టును నిర్వహించారు. దీనికి మండల, తమిళనాడు సరిహద్దు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులొచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగాపాళ్యంకు చెందిన దిలీప్‌కుమార్ (40)పైకి దూసుకెళ్లింది. కొమ్ములతో బలంగా పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించిన మునిరత్నం, సెల్వరాజ్, పళణివేలు, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిత్తూరు మండలం, తమ్మింద గ్రామంలో పదేళ్లుగా కాపురం ఉంటున్నారు. -
సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మళ్లీ ఆశలు.. ఈ ఏడాదిలో ప్రారంభం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కంగువా'. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. కానీ, కంగువా విడుదలై తేదీని మేకర్స్ ప్రకటించలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో సూర్య తన 44వ చిత్రాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.సూర్య ప్రధాన పాత్రలో 'వాడివాసల్' చిత్రాన్ని డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటికి కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఉన్నారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జల్లికట్టు నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో తన పాత్ర కోసం సూర్య జల్లికట్టుపై శిక్షణ కూడా తీసుకున్నారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్, ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ విడుదలై (తెలుగులో విడుదల) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ను కూడా ఆయన పూర్తిచేశాడు. సూర్య, వెట్రిమారన్ ఇద్దరూ ఇప్పుడు తమ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకుని ఉన్నారు. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వాడివాసల్ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని ఉన్నట్లు సమాచారం. -
‘జల్లికట్టు’లో సీఎం జగన్ ఫొటో
పలమనేరు(చిత్తూరు జిల్లా): తమిళనాడు వాసులు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం జల్లికట్టు మైలేర్ల సీజన్ కొనసాగుతోంది. మైలేర్లలో వేగంగా పరుగెత్తిన ఎద్దుకు బహుమతులు రూ.10 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పటిదాకా పరుగు పందెంలో కచ్చితంగా గెలిచే ఎద్దులకు కొండ గుర్తుగా రజనీకాంత్, విజయ్, సూర్య ఫొటోలను మాత్రం కొమ్ములకు ప్రభలను కట్టి పందేల్లో వదిలేవారు. ఇప్పుడు వేలూరు, క్రిష్ణగిరి, తిరప్పత్తూరు జిల్లాలోని చాలాచోట్ల జరిగే జల్లికట్టు, మైలేర్లలో ఆంధ్రా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న ప్రభలతో ఎద్దులు కనిపిస్తున్నాయి. పందేలు జరిగేచోట సైతం మైక్‌లో కామెంటరీ చేసేవాళ్లు ఆంధ్రా టైగర్ జగన్ వద్దాండ్రా, సిద్ధం అంటూ పొగడటం విశేషం. -
Jallikattu 2024 Latest Images: చిత్తూరులో ఉత్సాహంగా ‘జల్లికట్టు’ పోటీలు (ఫొటోలు)
-
మొదలైన జల్లికట్టు.. తమిళనాట సందడే సందడి!
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల నిర్వహణకు అవనియాపురంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మదురైలో జల్లికట్టు నిర్వహణకు ముందుగా పోటీలో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ చేశారు. జల్లికట్టును తమిళనాట ఇరుతఝువుతాల్ అని కూడా పిలుస్తారు. జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే సంప్రదాయక క్రీడ. దీనిలో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. జల్లుకట్టును తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా పరిగణిస్తారు. #WATCH | Tamil Nadu: Jallikattu competition begins in Avaniyapuram of Madurai. pic.twitter.com/CqRrInypX9 — ANI (@ANI) January 15, 2024 అయితే జల్లికట్టు పోటీలలో పాల్గొనేవారు ఒక్కోసారి తీవ్రంగా గాయపడుతుంటారు. ఇటువంటి పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక అధికారులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో పలువురు గాయపడుతున్నారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో అవనియాపురంలో నిర్వహించిన జల్లికట్టుపోటీల సమయంలో 60 మంది గాయపడ్డారు. #WATCH | Tamil Nadu: Health check-up of bulls held in Madurai for the Jallikattu competition. pic.twitter.com/nvfJQVMaIn — ANI (@ANI) January 15, 2024 ఇది కూడా చదవండి: దేశవ్యాపంగా సంక్రాంతి సందడి -
ప్రాంతానికో ప్రత్యేకం
సాక్షి, అమరావతి: సంక్రాంతి సంబరాలను ఒక్కో ప్రాంత ప్రజలు ఒక్కో తరహాలో నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు.. కోనసీమలో ప్రభల తీర్థం.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు విన్యాసాలు.. కొన్నిచోట్ల పతంగులు ఎగురవేయడం వంటివి నిర్వహిస్తుంటారు. హోరాహోరీ తలపడే పందెం కోళ్లు సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర మొదలవుతాయి. భోగి రోజున మొదలై çసంక్రాంతి, కనుమ వరకు మూడు రోజులపాటు ఊరువాడా పెద్దఎత్తున జరిగే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. కోడి పందేల బరుల పక్కనే పేకాట, కోతాట, గుండాట వంటివి ఏర్పాటు చేయడంతో జూదాల జాతరను తలపిస్తాయి. ఏడాదిపాటు పహిల్వాన్ తరహాలో కోళ్లను మేపి.. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పందేల బరిలో దించుతారు. కోనసీమ ప్రభల తీర్థం సంక్రాంతి వేళ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కనుల పండువగా జరుగుతుంది. కోనసీమలో 80 వరకు ప్రభల తీర్థాలు నిర్వహిస్తుండగా.. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గతేడాది దేశ రాజధానిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లోనూ ఇక్కడ ప్రభలను ప్రదర్శించారు. బండ్ల లాగుడు.. పరుగు పందెంలో ఎడ్లు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలను రైతులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్ల జతకు బరువైన బండలు కట్టి నిర్దేశించిన ప్రాంతానికి ఏది ముందు చేరితే ఆ ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. దీంతోపాటు పలు విభాగాల్లో ఎడ్లను పరిగెట్టించి ముందుగా గమ్యానికి చేరుకున్న వాటిని విజేతగా ప్రకటిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడా ఈ పందేలు జరుగుతాయి. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోను ఈ తరహా పోటీలు భోగి రోజున ప్రారంభించి మార్చి వరకు కొనసాగిస్తారు. ‘జల్లికట్టు’తో పశువుల పండుగ తమిళనాడులోని జల్లికట్టు మాదిరిగా చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. రంకెలేస్తూ పరుగులు తీసే కోడె గిత్తలను పట్టుకోవడానికి యువత ఉత్సాహంగా ఉరకలేస్తుంటారు. ఆ సంస్కృతి చిత్తూరు జిల్లాలోనూ ఎక్కువగా కన్పిస్తుంది. తమిళనాడులో కనుమ రోజున జల్లికట్టు నిర్వహిస్తే.. మన రాష్ట్రంలో సంక్రాంతి ముందు నుంచి పశువుల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తోంది. -
ఆల్‌రౌండర్‌గా అందరినీ తనపైపు తిప్పుకున్న శాంతి బాలచంద్రన్
ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చే వాటిలో ముందుండేది సినిమా ఇండస్ట్రీనే. అలా కోలీవుడ్‌లో సినిమాకు అవసరమైన అన్ని విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటూ ఎదుగుతున్న నటి శాంతి బాలచంద్రన్. ఈమె సమీపకాలంలో నటించిన వెబ్ సిరీస్ స్వీట్ కారం కాఫీ. అమెజాన్ ప్రైమ్ టైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఇందులో నివీ పాత్రకు ప్రేక్షకులు, విమర్శల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. (ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు) ఇకపోతే అధికారికంగా ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుకు పంపబడ్డ జల్లికట్టు చిత్రంలో సోఫియా పాత్రలో నటించిన శాంతి బాలచంద్రన్ నటన ప్రత్యేకంగా నిలిచిపోయింది. అలా వైవిధ్యమైన, ఛాలెంజ్‌తో కూడిన పాత్రల్లో. నటిస్తూ సినీ వర్గాల దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ఈమె నటనతో పాటు రచనా, నాటక రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒబ్లివిన్ అనే సంగీత ఆల్బమ్ ద్వారా గీత రచయితగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఏఆర్ రెహామాన్ విడుదల చేసిన ఈ సంగీత ఆల్బమ్ కు మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం ఒక చిత్రానికి సహ దర్శకురాలిగా పని చేస్తున్నారు. అదే విధంగా నటిగా పలు చిత్రాలు చేతిలో ఉన్నాయని, వాటిగురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని నటి శాంతి బాలచంద్రన్ పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించనున్నట్లు ఈమె చెప్పారు. -
జల్లికట్టుకు జై
న్యూఢిల్లీ/చెన్నై: ఎద్దులు, దున్నలు, గేదెలతో నిర్వహించే జల్లికట్టు, ఎడ్ల పందేలు, కంబళ వంటి జంతు క్రీడల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చి ంది. ఈ క్రీడలు జంతు హింస పరిధిలోకి రావని స్పష్టంచేస్తూ గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన రిజర్వ్ చేసిన తీర్పును బుధవారం వెల్లడించింది. ఈ క్రీడల నిర్వహణకు అనుగుణంగా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన సవరణ చట్టాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ‘ రాష్ట్రాల్లో చేసిన ఆయా సవరణ చట్టాల్లోని నియమ నిబంధనలు ఖచ్చి తంగా అమలయ్యేలా చూసే బాధ్యత జిల్లా మేజిస్ట్రేట్/ సంబంధిత కార్యనిర్వహణ వర్గానిదే. శతాబ్దాలుగా తమిళనాట జల్లికట్టు క్రీడ కొనసాగుతోంది. ఇందుకు అనుగుణంగా ఆ రాష్ట్ర శాసనసభ చట్టంలో జోక్యం చేసుకునే ఉద్దేశం సుప్రీంకోర్టుకు లేదు. తమిళనాడు సవరణ చట్టంపై మేం తీసుకున్న నిర్ణయమే మహారాష్ట్ర, కర్ణాటక సవరణ చట్టాలకూ వర్తిస్తుంది. ’ అని ధర్మాసనంలోని జడ్జీలు తన తీర్పులో స్పష్టంచేశారు. కాగా, ‘తమిళుల సాహసం, సంస్కృతికి దర్పణం ఈ క్రీడ. ఈ తీర్పు తమిళనాడు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. రాష్ట్ర చట్టాన్ని కోర్టు సమర్థించినందుకు సూచికగా వచ్చే జనవరి పొంగళ్ సీజన్లో విజయోత్సవ వేడుక చేస్తాం’ అని తీర్పు అనంతరం తమిళనాడు సీఎం స్టాలిన్ ట్వీట్‌చేశారు. కాగా, తీర్పుపై జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జల్లికట్టులో జనం చస్తున్నా అమూల్య సంప్రదాయమంటూ కోర్టు క్రూరమైన క్రీడను పరిరక్షిస్తోంది. తీర్పుపై న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తాం’ అని పెటా ఇండియా వ్యాఖ్యానించింది. -
జల్లికట్టుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జల్లికట్టును అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది. ఇది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జట్టికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జంతువులతో కూడిన క్రీడలను అనుమతించేందుకు మహారాష్ట్ర & కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన ఇలాంటి చట్టాలను అత్యన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. కాగా జల్లికట్టు వంటి క్రీడలను సుప్రీంకోర్టు 2014లో నిషేధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఈ రాష్ట్రాలు ఇటువంటి క్రీడలకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా చట్టాలను సవరించాయి. ఇవి వారసత్వ క్రీడలని పేర్కొన్నాయి. 2017లో జల్లికట్టును అనుమతిస్తూ కొన్ని సవరణలు చేసి తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసింది. ఈ సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేస్తూ జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది. చదవండి: ఆర్బీఐ కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం -
బెట్.. కొట్లాట రసపట్టు
సాక్షి, అమరావతి: శునకం.. వరాహం.. అశ్వం.. ఎద్దు.. ఒంటె.. కోడి.. బుల్ బుల్ పిట్ట.. పక్షా, జంతువా కాదు.. బరిలో ఉందంటే దుమ్ము దులపాల్సిందే. ప్రత్యర్థిని మట్టికరిపించాల్సిందే. అనాది కాలం నుంచి మన దేశంలో జంతువులు, పక్షుల పోటీలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలు... ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని జంతువులు, పక్షులతో పోటీలు సంప్రదాయమైంది. జంతు హింసను నిరోధించే చట్టాలున్నప్పటికీ ఏళ్ల తరబడి అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన జంతువుల పందేలు, పోటీలపై ఓ లుక్కేద్దాం.. పౌరుషానికి ప్రతీక కోడి పుంజులు కోడి పందేలకు ఘనమైన చరిత్రే ఉంది. సింధు నాగరికత నుంచి మొదలెడితే.. భారత్, చైనా, పర్షియా, గ్రీకు నాగరికతల్లోను వీటిని నిర్వహించిన ఆధారాలున్నాయి. పల్నాడు, బొబ్బిలి యుద్ధంలో కోడి పుంజుల పోరు చరిత్ర అందరికీ తెలిసిందే. కోడి పుంజుల పందేలను పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి బరిలోకి దించుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రముఖంగాను, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజు కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది. తమిళంలో ‘వెట్రికాల్’ అని, తుళులో ‘గోరిక్ కట్ట’ అని కోడి పందాలను పిలుస్తారు. కర్ణాటకలోని ఉడుపి, కేరళలోని కాసర్గోడ్లలోనూ కోడి పందాలను నిర్వహిస్తుంటారు. కోడి పందాల పేరుతో కోడి పుంజులను దారుణంగా హింసిస్తున్నారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది. జంతు సంరక్షణ చట్టం ఉల్లంఘిస్తున్న కోడి పందేలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా సంప్రదాయం, సరదా పేరుతో కోడి పందేలు.. బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. కంబాళ.. భళా భళ దున్నలను కాడికి కట్టి రేసు నిర్వహించడాన్ని కన్నడ భాషలో కంబాళ అంటారు. ఖాత్రి కంబాళ అనేది మంగళూరు ఖాత్రిలోని మంజునాథ ఆలయ పరిసరాల్లో నిర్వహించేవారు. దీన్నే థీవర కంబాళ అని కూడా పిలిచేవారు. 300 ఏళ్ల క్రితం నిర్వహించిన ఈ వేడుకకు ఆనాటి అలూబ రాజులు కూడా హాజరయ్యేవారు. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంబాళను నిర్వహిస్తుంటారు. సాధారణంగా బురద నేలలు, వరి పొలాల్లో ఈ రేసు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనే రైతులు కొరడా ఝుళిపిస్తూ రెండు దున్నలతో వేగంగా పరుగులు తీస్తారు. పందెంలో గెలిచిన వారికి బంగారం, వెండి నాణేలతో పాటు విలువైన బహుమతులు ఇస్తారు. ఈ పోటీపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు వేస్తుంటారు. కేరళలోనూ వరికోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో కొరడాలను ఉపయోగించడంపై జంతు హక్కుల కార్యకర్తలు మొదట్నుంచీ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో జల్లికట్టు, కంబాళ పోటీల్లో జంతువులను హింసించ కూడదని 2014 మే 7న సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఒంటెల రేసు.. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా పుష్కర్‌లో గుర్రం, ఒంటెల పరుగు (రేసు) పందేలు నిర్వహిస్తుంటారు. వీటిలో విజేతలకు నేరుగా రాజస్థాన్ ప్రభుత్వమే నగదు బహుమతిని అందిస్తుంటుంది. ఈ రేసులో గెలిచేందుకు ఒంటెలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈ రేసులకు ముందుగా గిరిజనుల నృత్యాలు, ఒంటెల అందాల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించిన ఒంటెను విజేతగా ప్రకటిస్తారు. ఎద్దుల ఆట కట్టించే జల్లికట్టు.. బుసలు కొడుతూ పరుగులు తీసే బలమైన ఎద్దులను లొంగదీసుకునే క్రీడే జల్లికట్టు. సింధు నాగరికత, తమిళ్ సాహిత్యంలోను జల్లికట్టుకు సంబంధించిన ఆధారాలున్నాయి. ప్రాచీన తమిళనాడులోని ‘ముల్లై’ ప్రాంతంలో నివసించే తెగల్లో జల్లికట్టు సర్వసాధారణం. తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారు. నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3,500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కి ఉన్నాయి. స్పెయిన్‌లో జరిగే బుల్ ఫైట్‌కు దగ్గరగా జల్లికట్టు ఉంటుంది. అయితే జల్లికట్టులో ఎద్దులను చంపరు. తమిళనాడులోని గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోను జల్లికట్టు నిర్వహిస్తారు. శునకాల కొట్లాట.. ఇంగ్లాండ్‌లో 18వ శతాబ్దంలో శునకాల కొట్లాట పోటీలను నిర్వహించేవారు. తర్వాత భారత్‌కు ఈ పోటీలు చేరాయి. ఈ పోటీల కోసం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాల నుంచి ప్రత్యేకంగా కుక్కలను తీసుకువస్తుంటారు. ఢిల్లీ శివారు ప్రాంతాలతోపాటు గురుగ్రామ్, నోయిడాలలోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పంజాబ్, హరియాణాల్లో ధనవంతులు సరదా కోసం ఇలాంటి పోటీలను నిర్వహించే సంప్రదాయం పెరుగుతోంది. కుక్కల కొట్లాటలో రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. పందేల్లో దింపే కుక్కలను రోజుల తరబడి ఆహారం పెట్టకుండా బోనులో బంధిస్తారు. ఒక్కసారిగా వాటిని వదులుతారు. అప్పటికే ఆకలితో తీవ్ర కోపంతో రగిలిపోయే కుక్కలు ప్రత్యర్థి కుక్కలపై భయానకంగా దాడులు చేస్తాయి. ఒక్కోసారి వీటిలో ఒక్కోసారి ప్రత్యర్థి కుక్కలు చనిపోతుంటాయి. గెలిచిన కుక్క యజమానికి రూ.లక్షల్లో నగదు బహుమతులు అందిస్తుంటారు. వీటిపైనా సుప్రీం కోర్టు నిషేధం ఉంది. బుల్ బుల్ పక్షుల పోటీ పూర్వం అస్సాం రాజు స్వర్గదేవ్ బ్రహ్మథ సింఘ పక్షుల పోటీలు ఎంతో ఇష్టంగా నిర్వహించేవారని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా పక్షులను పెంచేవారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాతి కాలంలో ఇది ఒక సంప్రదాయంలా మారింది. సంక్రాంతి సమయంలోనే అస్సాంలో భోగలి బిహు వేడుక నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో హయగ్రీవ మాధవ ఆలయానికి సమీపంలో బుల్బుల్ పక్షుల పందేలు నిర్వహిస్తారు. ఈ పందాల కోసం పక్షులకు గ్రామస్తులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ పోటీల్లో పక్షులు కూడా గాయపడుతుంటాయి. పోటీల్లో ఓడిపోయిన పక్షుల ముక్కు ముందు భాగాన్ని కత్తిరిస్తారు. దీంతో మరోసారి మళ్లీ ఇవి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ పక్షుల పోటీపై నిషేధం విధించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, 2016లో ఈ పోటీ నిర్వహించకుండా గువాహటి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎద్దుల బండ్ల రేసు.. మహారాష్ట్రలో ఎద్దుల బండ్ల రేసులను శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరాన్ని ఎద్దుల బండ్లపై ఎవరైతే వేగంగా చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో చాలా మంది రైతులు పాల్గొంటారు. వినాయక చవితి సమయంలో ఎక్కువగా ఈ పోటీలను నిర్వహిస్తారు. ఇవి తమ సంప్రదాయమని నిర్వాహకులు చెబుతుంటారు. పోటీ కోసం కొన్ని ఎద్దులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. మహారాష్ట్రతో పాటు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొన్ని ప్రాంతాల్లోనూ ఈ రేసు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 2014లో సుప్రీం కోర్టు నిషేధం విధించింది. కానీ, స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఈ పోటీలు జరుగుతూనే ఉన్నాయి. -
జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని హైవే దిగ్బంధం
హోసూర్(తమిళనాడు): కృష్టగిరి జిల్లా హోసూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. జల్లికట్టు పోటీలకు అనుమతి ఇవ్వకపోవడంతో చెన్నై-బెంగళూరు హైవేను వందలాది మం గ్రామస్తులు దిగ్బంధించారు. దాంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన పోలీసులపై గ్రామస్తులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో మూడు పోలీసు వాహనాలు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. గ్రామంలో జల్లికట్టు నిర్వహణ అనుమతులకు సంబంధించి జిల్లా యంత్రాంగం తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు నిరసనకు దిగారు. -
జల్లికట్టు పోటీలో అపశ్రుతి..నలుగురు మృతి
దక్షిణాదిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మేరకు ఎద్దులతో నిర్వహించే జల్లికట్టు పోటీల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఆదివారం కర్ణాటకలో శివమొగ్గలో ఒక ప్రమాదం జరగగా, శనివారం షికారిపురలో మరో ప్రమాదం జరిగింది. ఈమేరకు కర్ణాటకలో ఆదివారం నాడు ఎద్దు మీదకు దూకడంతో గాయపడ్డ 34 ఏళ్ల వ్యక్తి సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు, అలాగే మరో వ్యక్తి ఎద్దులు గుంపు మీదకు దూసుకురావడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే తమిళనాడులోని పాలమేడులో జరిగిన జల్లికట్టులో క్రీడాకారుడు అరవింద రాజన్(24) అనే యువకుడుని ఎద్దు ఢీ కొట్టి చంపగా, తిరుచ్చిలో ఒక ప్రేక్షకుడు 25 ఏళ్ల వ్యక్తి ఎద్దు దాడిలో మృతి చెందాడు. అసలు ఈ జల్లుకట్టు అనేది ఒక ప్రమాదకరమైన సాంప్రదాయ క్రీడ. ఇక్కడ శక్తిమంతమైన యువకులు బలమైన ఎద్దులపై ఆధిపత్య చెలాయించడానకి ప్రయత్నించే ఒక సరదాతో కూడిన ప్రమాదకరమైన క్రీడ. ఈ పోటీలో ఎద్దులు క్రీడా మైదానంలోకి ప్రవేశించగానే అక్కడే ఉండే యువకులు వాటిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ముపురం పట్టుకుని కౌగలించుకోవడానికి యత్నిస్తారు. ఆ సమయంలో వారికే కాకుండా అక్కడ చూస్తున్నవారికి, పక్కనున్నవారు గాయపడే అవకాశాలు ఎక్కువ. రూ. 3 లక్షల పరిహారం ప్రకటించిన స్టాలిన్ జల్లికట్టులో జరిగిన ఈ ఘటనలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ పోటీల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకు చెరో రూ. 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. (చదవండి: రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం) -
పొంగల్ పండుగ హుషారు.. కోడెగిత్తలతో జల్లికట్టు షురూ!
-
ఆకట్టుకుంటున్న ‘జల్లికట్టు’
తమిళసినిమా: 2019లో విడుదలై కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో పాటు జాతీయ అవార్డును గెలుచుకుని, ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లిన మలయాళ చిత్రం జల్లికట్టు. ఇది ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. లిజో జోస్ బెల్లిసేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆంటోని వర్గీస్, సెంపన్ వినోద్ జోస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గిరీష్ గంగాధరన్ చాయాగ్రహణను, దీపు జోసెఫ్ సంగీతాన్ని అందించారు. దీనిని ఏఆర్ ఎంటర్టైన్మెంట్ పతాకం ద్వారా అమిత్‌కుమార్ అగర్వాల్ తమిళంలోకి అనువదించారు. ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ టైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక గేదె ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం అని నిర్మాత తెలిపారు. ఒక కుగ్రామంలో కసాయిశాలకు అమ్మడానికి తీసుకొచ్చిన గేదె కట్లు తెంచుకుని పారిపోతుంది. దానిని పట్టుకోవడానికి ఆ గ్రామ ప్రజలంతా చేసే ప్రయత్నమే ఈ చిత్రం అని తెలిపారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. -
సుమత్రా స్టైల్లో జల్లికట్టు.. ఎవరినీ విజేతగా ప్రకటించరు!
ఆ బురద, అందులో పరుగెత్తుతున్న ఎడ్లు, చుట్టూ జనాలను చూస్తుంటే ఇదేదో జల్లికట్టు పోటీలాగుందే.. అనిపిస్తోంది కదా. అవును అలాంటిదే. అయితే జరిగింది మాత్రం ఇండోనేసియాలోని పశ్చిమ సుమత్రాలో. ఆట పేరు ‘పాకు జావి’. కరోనా వల్ల ఆగిన ఈ క్రీడకు మళ్లీ అక్కడి ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ నెలలో పోటీలు మొదలయ్యాయి. అక్కడి తనహ్ దాతర్ ప్రాంతంలో ఏటా వరి కోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఓ వరిపొలంలో దాదాపు 60 నుంచి 250 మీటర్ల మేర బురద ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు. రెండు ఎడ్లను ఓ నాగలికి కట్టి దానిపై ఎడ్లను నడిపే వ్యక్తి నిలబడతాడు. కింద పడకుండా ఎడ్ల తోకలను పట్టుకుంటాడు. పేరుకే ఇది ఎద్దుల పోటీ అయినా ఇందులో నేరుగా ఎద్దులేమీ పోటీ పడవు. ఎవరినీ విజేతగా ప్రకటించరు. (చదవండి: పెంపుడు పంది కోసం న్యాయపోరాటం) అయితే ఆ పోటీని చూడటానికి వచ్చిన వాళ్లు ఎడ్ల వేగం, సామర్థ్యం లెక్కగట్టి వాటిని సాధారణం కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. తనహ్ దాతర్ ప్రాంతంలోని ప్రజలు ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా సర్కారు మద్దతుతో ఈ ఆటను చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా వస్తున్నారు. (క్లిక్: వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’) -
మగువల తెగువ.. జల్లికట్టు.. కొత్తరూటు
ఎర్ర తువ్వాలును గాల్లో గిర్రాగిర్రా తిప్పుతూ.. పొగరుతో బుసలు కొట్టే బసవన్నలను కనుసన్నలతో శాసిస్తూ.. క్రీడాకారులకు వాటిని చిక్కకుండా దౌడు తీయించే సాహస క్రీడా చాణక్యాన్ని ప్రదర్శించడంలో మగువలు సైతం తెగువ చూపుతున్నారు. వీరత్వం పురుష పుంగవులకే పరిమితం కాదని.. నారీమణుల ధీరత్వం సైతం మగధీరులకు ఏ మాత్రం తీసిపోదని ఎలుగెత్తి చాటుతున్నారు. సాహస క్రీడ జల్లికట్టు పోటీల్లో తమిళ తంబిలతో తలపడుతూ వారికే సవాల్ విసురుతున్నారు. మధురై పౌరుషానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. సాక్షి, చెన్నై: సంస్కృతి.. సంప్రదాయాలు.. కళలు.. ఆలయాలు.. వారసత్వ సంపదల వంటి విభిన్న విశేషాల సమాహారంతో నిండిన రాష్ట్రం తమిళనాడు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులపై తిరగబడ్డ వీర నారీమణి వేలునాచ్చియార్, తన భర్తకు జరిగిన అన్యాయంపై తిరగబడి మధురైను తగులబెట్టిన కన్నగి లాంటి వారెందరో తమిళ మంగై (తమిళ నారీమణి)లుగా చరిత్రకెక్కారు. వీరత్వానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన వారే కాకుండా.. దేశ రాజకీయాలతోపాటు ప్రాధాన్యతా రంగాల్లోనూ సత్తా చాటుతున్న మంగైలు ఎందరో ఈ గడ్డపై పుట్టారు. తమిళనాట అత్యంత భయంకరమైన సాహస క్రీడగా పేరొందిన జల్లికట్టులోనూ ప్రవేశిస్తూ ఇక్కడి మహిళలు మధురై వీరత్వాన్ని, పౌరుషాన్ని చాటుతామంటూ తెరపైకి వస్తున్నారు. బరిమే సవాల్ తమిళ గడ్డపై పూర్వం వరుడిని ఎంపిక చేసుకునేందుకు జల్లికట్టు క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో యువతుల్ని మెప్పించేందుకు యువకులు ఈ సాహసాన్ని ప్రదర్శించగా.. రానురాను ఇదో రాక్షస క్రీడగా మారింది. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున ప్రారంభమయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలలపాటు జిల్లాల వారీగా తమిళనాడు వ్యాప్తంగా జరిగేది. ప్రతి జిల్లాలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు తమ వీరత్వాన్ని చాటుకునేందుకు జల్లికట్టు బరిలోకి దిగేవారు. ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు రానురాను ఎద్దులను హింసించడం పెరిగింది. పొగరెక్కిన ఎద్దుల దాడిలో ఎన్నో మరణాలు సైతం చోటుచేసుకున్నాయి. బసవన్నలు బుసలు కొట్టేవిధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడంతో జల్లికట్టుపై ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధించింది. సంప్రదాయ సాహస క్రీడను తిరిగి సాధించుకునేందుకు 2017లో యావత్ తమిళావణి మహోద్యమంతో కదం తొక్కింది. జల్లికట్టును మళ్లీ సాధించుకున్న తర్వాత తమిళ వీర మంగైలు సైతం సత్తా చాటుకునే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎద్దులను మచ్చిక చేసుకుని శిక్షణ ఇవ్వడంతోపాటు వాటిని జల్లికట్టుకు సిద్ధం చేయడం మొదలెట్టారు. అయితే, వీరికి క్రీడా మైదానంలోకి కొన్నేళ్లుగా అవకాశం దక్కలేదు. దీంతో వారంతా వాడివాసల్ (ప్రవేశ మార్గం) వెనుకకే పరిమితమయ్యారు. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళ మగువలు క్రీడా మైదానంలో అడుగు పెట్టి సత్తా చాటారు. అందుకే తిరస్కరించా.. నాకు ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. వీరత్వాన్ని చాటుకున్న తర్వాతే బహుమతి తీసుకోవాలన్నది నా లక్ష్యం. అందుకే తిరస్కరించాను. ప్రతిరోజు నా తమ్ముడు(ఎద్దు)తో రెండు గంటలపాటు పొలంలో సాధన చేయిస్తాను. వాడికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. ఈసారి తమ్ముడు తీవ్రంగానే పోరాటం చేశాడు. వచ్చేసారి గెలిచి తీరుతాడు. – యోగదర్శిని, అవనియాపురం ఆ ఉద్యమం స్ఫూర్తిగా.. 2017లో జరిగిన జల్లికట్టు ఉద్యమమే నాకు స్ఫూర్తి. నాన్నతో పట్టుబట్టి ఓ ఎద్దును కొనిపించి శిక్షణ ఇచ్చాను. చెరువు, నీటి పరీవాహక ప్రదేశాలు, మట్టి దిమ్మెలు అధికంగా ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ సాధన చేయిస్తున్నా. అందుకే వాడిద్వారా బంగారు నాణెం బహుమతిగా లభించింది. ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో మరింత ముందుకు దూసుకెళ్తా. – స్నేహ, అలంగానల్లూరు తమిళనాట ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ మధురై జిల్లా అవనియాపురం వేదికగా భోగి రోజున జరిగిన జల్లికట్టులో అదే ప్రాంతానికి చెందిన 9 తరగతి విద్యార్థినులు అన్నలక్ష్మి, నిషా, పదో తరగతి విద్యార్థిని యోగదర్శిని తొలిసారిగా క్రీడా మైదానంలోకి తమ ఎద్దులతో దూసుకొచ్చారు. అన్నలక్ష్మి, నిషా వద్ద శిక్షణ పొందిన ఎద్దులు బుసలు కొడుతూ క్రీడాకారులకు చిక్కకుండా ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. యోగదర్శిని ఎద్దు క్రీడాకారులకు చిక్కడంతో ఆ బాలికకు నిర్వాహకులు ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. అయితే, యోగదర్శిని ఆ బహుమతిని తిరçస్కరించి.. ‘మరోసారి కలుద్దాం.. కచ్చితంగా గెలుద్దాం’ అంటూ వాడివాసల్ వేదికగా ప్రతిజ్ఞ చేసి వెళ్లింది. ప్రస్తుతం తమిళనాట అంతటా ఇదే హాట్ టాపిక్. ఆ మరుసటి రోజున పాలమేడులో కొందరు బాలికలు తమ ఎద్దుల్ని వాడివాసల్ నుంచి బయటకు రప్పించి మెరిశారు. ఇక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో సోమవారం జరిగిన జల్లికట్టులో స్నేహ అనే 16 ఏళ్ల బాలికతో పాటుగా మరో ఇద్దరు బాలికలు తమ ఎద్దులతో వచ్చి బంగారు నాణేలను గెలుచుకెళ్లారు. ఇదే సందర్భంలో తమిళ సంప్రదాయాల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని.. మన సంస్కృతిని భావితరాలకు సైతం అందించాలంటే ప్రతి నారీ జల్లికట్టులో భేరీ మోగించాల్సిందేనని పిలుపునిచ్చారు. దీనినిబట్టి చూస్తే భవిష్యత్‌లో మగధీరులకు జల్లికట్టు పోటీల్లో మరింత పోటీ తప్పదన్న మాట. -
రంకేసిన.. పౌరుషం.. బుసకొట్టిన బసవన్న.. కార్తీక్‌కు కారు గిఫ్ట్
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మదురై జిల్లా అలంగానల్లూరులో బసవన్నలు బుసకొట్టాయి. జల్లికట్టులో భాగంగా రంకెలేసిన పోట్లగిత్తలను క్రీడాకారులు లొంగదీశారు. తమ వీరత్వాన్ని చాటే రీతిలో వాడివాసల్ వైపుగా దూసుకెళ్లారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ.. ఇంటిళ్లిపాది ఆనందోత్సాహలతో పెద్ద పండుగను జరుపుకున్నారు. ఇక, సోమవారం మదురై జిల్లా అలంగానల్లూరులో తమిళుల సాహస క్రీడ జల్లికట్టు ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి! సెలవుల్లో సరదాగా.. ఈసారి పెద్ద పండుగకు సెలవులు సాధారణం కంటే ఎక్కువగా రావడంతో ప్రజల తమ తమ స్వస్థలాలకు వెళ్లి ఆనందోత్సహాలతో గడిపారు. గురువారం భోగి, శుక్రవారం సంక్రాంతి, శనివారం గోమాతలకు పూజలతో కనుమ పండుగను జరుపుకున్నారు. ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలుతో కావడంతో ప్రపంచ ప్రసిద్దిగాంచిన అలంగానల్లూరు జల్లికట్టును సోమవారం నిర్వహించారు. తమిళుల సంప్రదాయ, సాహాస క్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టు కట్టుదిట్టమైన భద్రత, కరోనా ఆంక్షల నడుమ జరుపుకోవాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు.. అలంగానల్లూరు జల్లికట్టులో 700 ఎద్దులు, 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 8 రౌండ్లతో ఇక్కడ పోటీలు జరిగాయి. ఉదయం ఆరున్నర గంటలకు మునియాండి స్వామి ఆలయంలో పూజల అనంతరం వాడివాసల్ మైదానంలో మంత్రులు మూర్తి , పళని వేల్ త్యాగరాజన్, ఎమ్మెల్యే వెంకటేషన్, కలెక్టర్ అనీష్ శేఖర్ జెండా ఊపినానంతరం ఎద్దులు వాడివాసల్ నుంచి దూసుకొచ్చాయి. కరోనా కట్టుబాట్ల నడుమ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కొమ్ములు తిరిగిన బసవన్నలు బుసలు కొడుతూ రంగంలోకి దిగాయి. ఆల్ రౌండర్‌కు కారు.. ఉదయం నుంచి నువ్వా..నేనా అన్నట్టుగా సాగిన పోటీలు సాయంత్రం ముగిశాయి. ఆల్ రౌండర్ ప్రతిభ ప్రదర్శించడమే కాకుండా 21 ఎద్దుల్ని పట్టుకున్న కరుప్పాయూర్కు చెందిన కార్తీక్ అనే యువకుడికి డీఎంకే యువజన నేత ఉదయ నిధి స్టాలిన్ తరపున కారును బహుమతిగా అందజేశారు. అలాగే, ఉత్తమ ప్రదర్శన చేసిన ఎద్దు యజమాని కైకురిచ్చి తమిళ్ సెల్వన్‌కు సైతం కారు బహుకరించారు. అలాగే, 19 ఎద్దుల్ని పట్టుకున్న అలంగానల్లూరు రాం కుమార్‌కు రెండో బహుమతి, 13 ఎద్దుల్ని పట్టుకున్న చిత్తాలంకుడికి చెందిన గోపాలకృష్ణన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా, తిరుచ్చి జిల్లా పులియం పాడిలో అనుమతి లేకుండా జరిగిన జల్లికట్టును పోలీసులు అడ్డుకున్నారు గ్రామస్తులు రాళ్ల దాడి చేయడంతో ఎస్ఐ ఇలంగోవన్‌తో సహా మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే, పుదుకోట్టైలో అధికారుల అనుమతితో జల్లికట్టు ప్రశాంత వాతావరణంలో జరిగింది. అలాగే, సేలం ఆత్తూరులోనూ జల్లికట్టు హోరాహోరీగా సాగింది. కాగా, పండుగ నిమిత్తం స్వస్థలాలకు వెళ్లిన జనం చెన్నై వైపుగా తిరుగు పయనం అయ్యారు. దీంతో చెన్నై శివారు మార్గాల్లో వాహనాలు కిలో మీటర్లకొద్దీ బారులుదీరాయి. భారీగా బహుమతులు ఒక్కో రౌండ్‌కు సీఎం స్టాలిన్ చిత్రంతో కూడిన పలు వర్ణాలతో కూడిన డ్రెస్ కోడ్ నెంబర్లతో దూసుకొచ్చిన క్రీడాకారులు ఎద్దుల పొగరును అణచి వేస్తూ.. తమ పౌరుషాన్ని చాటుకున్నారు. గెలిచిన క్రీడాకారులకు సీఎం స్టాలిన్ తరపున బంగారు నాణెలు, ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బంగార ఉంగరాలను అందజేశారు. అలాగే, పాల్గొన్న అన్ని ఎద్దుల యజమానులకు బంగారు నాణెం అందజేశారు. ఇక, సెల్ఫోన్లు, బిందెలు, వాషింగ్ మిషన్లు, బీరువాలు, మంచాలు, ఎల్ఈడీ టీవీలు, ఏసీలు, ఫ్యాన్లు, సైకిళ్లు, స్టీలు, వెండి పాత్రలు వంటి ఆకర్షణీయమైన బహుమతుల్ని విజేతలకు నిర్వాహకులు అందజేశారు. అయితే, ఈ పర్యాయం కూడా ఎక్కువగా క్రీడాకారులతో పాటుగా బసవన్నలు బహుమతుల్ని తన్నుకెళ్లాయి. కాగా, క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా 80 ఏళ్ల వృద్ధురాలు సుందరమ్మాల్ నృత్యం చేస్తూ ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
Jallikattu: సైరా.. బసవా.. సైసైరా బసవా
పరుగులు పెట్టే బసవన్నల పొగరణిచేందుకు.. కాలుదువ్వే కోడెగిత్తలను కట్టడి చేసేందుకు తమిళయువత సిద్ధమైంది.. ఎగిరిదూకే ఎద్దులను లొంగదీస్తూ.. వీరత్వాన్ని చాటే ఈ జల్లికట్టుకు అలంగానల్లూరు వేదికవుతోంది. లక్షలాది కళ్లలో ఆనందం నింపేందుకు, బహుమతులు ఒడిసిపట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన కుర్రాళ్లు సైరా.. బసవా.. సైసైరా బసవా అంటూ తొడగొడుతున్నారు. సాక్షి, చెన్నై: ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో తమిళ యువత వీరత్వాన్ని చాటే జల్లికట్టుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో ఆల్‌రౌండ్ విజేతగా నిలిచే వారికి సీఎం స్టాలిన్ నేతృత్వంలో కారును కానుకగా సమర్పించనున్నారు. జల్లికట్టు అంటే అలంగానల్లూరే.. మహోద్యమంతో తమ సంప్రదాయ క్రీడకు అను మతి సాధించుకున్నా, కోర్టు విధించిన ఆంక్షల్ని నిర్వాహకులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా కరోనా థర్డ్‌వేవ్‌తో జల్లికట్టు సాగేనా అన్న ప్రశ్న కూడా ఎదురైంది. అయితే, నిబంధనలు మరింత కఠినం చేసి జల్లికట్టుకు మార్గాన్ని ప్రభుత్వం సుగమం చేసింది. భోగి రోజున పుదుకోట్టైలో, పొంగల్ పండగ రోజున అవనీయాపురంలో, కనుమ పండగ రోజున పాలమేడులో జల్లికట్టు హోరెత్తింది. ఇక, ఆదివారం కానుంపొంగళ్ రోజున ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆలంగానల్లూరులో జల్లికట్టుకు జరగాల్సి ఉన్నా, సంపూర్ణ లాక్డౌన్ అడ్డొచ్చింది. దీంతో ప్రభుత్వ నేతృత్వంలో అలంగానల్లూరు జల్లికట్టును సోమవారం నిర్వహించేందుకు నిర్ణయించారు. తేని, దిండుగల్, మదురై, శివగంగై, విరుదు నగర్, తిరుచ్చి, రామనాథపురం, తూత్తుకుడి, తంజావూరు జిల్లాల నుంచి పేరు గడించిన రైతులు, ప్రజా ప్రతినిధులకు చెందిన రంకె లేస్తూ బసవన్నలు ఇక్కడి కదనరంగంలోకి దిగనున్నాయి. చదవండి: (Weekend Curfew: బెంగళూరులో నిశ్శబ్దం) ఇక్కడి మునియాండి స్వామి, ముత్తాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం జల్లికట్టును ప్రారంభిస్తారు. తొలుత మునియాండి స్వామి ఆలయ ఎద్దును వదులుతారు. దానిని పట్టుకునేందుకు యువ క్రీడా కారులు శ్రమించాల్సిందే. అనంతరం ఒకదాని తర్వాత ఒకటి చొప్పున వచ్చి ఎద్దులు దూకుడుగా ముందుకు సాగుతాయి. తామేమీ తక్కువ తిన్నామా.. అన్నట్టు క్రీడా కారులు వాటిని పట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇక కరోనా నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రీడాకారుల, ఎద్దుల యజమానులు, నిర్వహకులు, ఇప్పటికే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లను సమర్పించారు. ఇక, సంక్రాంతి సంబరాలను ఇళ్లల్లోనే జరుపుకున్న జనం, కానుం పొంగల్ రోజున పర్యాటక ప్రాంతాలకు తరలి రావడం ఆనవాయితీ. అయితే, ఈసారి సండే లాక్ డౌన్ రూపంలో కానుం పొంగల్ కళ తప్పింది. శతాబ్దాలుగా.. జల్లికట్టుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రాచీనకాలంలో తమకు నచ్చిన వారిని వరుడుగా ఎంపిక చేసుకునేందుకు ఈ క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి సంప్రదాయ బద్ధంగా సాగుతూ వస్తున్న ఈ క్రీడ మంజు విరాట్, వడి మంజు విరాట్, వెల్లి విరాట్, వడం విరాట్ పేర్లతోనూ పిలుస్తుంటారు. సల్లి కాసు–కట్టు, సల్టికాసు కట్టుగా, సల్లికట్టుగా.. చివరకు జల్లికట్టుగా రూపాంతరం చెందింది. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు ఆరంభం అయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలల పాటుగా వివిధ జిల్లాల వారీగా జరిగేది. ఒక్కో జిల్లాల్లో ఈ క్రీడ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులూ ఉన్నారు. వీరిలో తమ వీరత్వాన్ని చాటుకునేందుకు కదన రంగంలోకి దుకే వారు కొందరైతే, ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు దూసుకొచ్చే వారు మరికొందరు. అయితే ఈ క్రమంలో ఎద్దులను హింసించడం బాగా పెరిగిందనే కారణంతో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధించింది. అయితే తమ సాహస క్రీడను మహోద్యమంతో 2017లో మళ్లీ తమిళులు సాధించుకున్నారు. -
చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు
-
చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు సంబరాలు
రంగంపేట: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. జల్లికట్టుకు ప్రసిద్ధి గాంచిన జిల్లాలోని రంగంపేటలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వేలాదిగా జనం తరలివచ్చారు. రంగంపేటతో పాటు సమీపంలోని పుల్లయ్య గారి పల్లి లో ఈరోజు జల్లికట్టు సంబరాలు జరుగుతున్నాయి. కోడిపందాలు కనుగుణంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని స్థానిక ప్రజా ప్రతినిధులు రంగంపేట ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డితో పాటు సర్పంచ్ ఎర్రయ్య స్పష్టం చేస్తున్నారు. -
నవ్యక్రాంతి.. తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి
సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో జనవరి నెలలో 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ వస్తుంది. తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా పండుగ చేస్తాము. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ ఇది. సంక్రాంతి నాడు కొత్త అల్లుళ్ళతో బంధుమిత్రులతో ఇల్లు, మనసు ఆనందంతో కళకళలాడుతుంది. కనుమ నాడు ఇంతటి పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలను అలంకరించి, పూజించి, చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు. ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. సంక్రాంతినాడు ఇంటి ముందు కళ్ళాపి చల్లి, అందమైన పెద్ద రంగవల్లులను తీర్చిదిద్దుతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, చుట్టూరా రేగుపళ్ళు, చెరుకు ముక్కలు వేసి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు డబ్బులిస్తారు, ధాన్యాన్నిస్తారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక. ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ, చిందులు వేస్తూ వస్తాడు. అలాగే చిందులేస్తూ, హరినామం గానం చేస్తూ, తంబూరా మీటుతూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీను. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ప్రార్ధిస్తారు. బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వులుండలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ పందాలు, కొన్ని ప్రాంతాల్లో జల్లెకట్టు వంటివి ఆడి ఆనందిస్తారు. పండుగ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేసి ఆనందిస్తారు. సాధారణంగా అందరూ సంక్రాంతి పండుగకు ముందు రోజు అరిశలు, చక్కిలాలు, నువ్వులుండలు, పాలకాయలు, జంతికలు వంటివి చేస్తారు. పండుగ రోజున పరమాన్నం, బొబ్బట్లు, పులిహోర లాంటివి చేస్తారు. అన్నింటినీ దైవానికి నివేదించి, బంధువులకు, ఇంటి చుట్టుపక్కల వారికి, ఇంట్లో పనిచేసే వారికి పంచిపెడతారు. మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను కనుమనాడు పూజిస్తారు. పుడమి తల్లిని పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది’ అంటారు కనుక కనుమ నాడు గారెలు, ఆవడలు తప్పకుండా భుజిస్తారు. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మన మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా అత్యధిక శాతం మంది జరుపుకునే గొప్ప పండుగ ‘నవ్య సంక్రాంతి పండుగ‘. పెద్ద పండగ ఎలా అయింది? సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి మారటం వలన ప్రకృతిలో కూడా ప్రతి నెల స్పష్టమైన మార్పును సంతరించుకుంటుంది. ఈ మార్పు మానవ జీవితంపైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగ గా జరుపుకుంటున్నాము అంటే, దానికి అనేక కారణాలున్నాయి. అప్పటి వరకు ఉన్న చలి మకర సంక్రమణంతో తగ్గుముఖం పడుతుంది. వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, సుందరమైన, ఆహ్లాదకరమైన వసంత కాల ఆగమనానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభ మవుతుంది. దక్షిణాయనంలో పగళ్ళు తక్కువ, రాత్రిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఉత్తరాయణంలో పగళ్ళు ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఇది గొప్ప మార్పు. ఆనందకరమైన, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని కలిగించే మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. దక్షిణాయనం సాధనా కాలం, ఉపాసనా కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి సూర్యుని రథ గమనంలో మార్పు వల్ల ఎండ వేడిమి నెమ్మదిగా పెరగటం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభ కార్యాలను జరిపిస్తాము. కనుకే ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని ‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాము. పెద్దలకు తర్పణలు విడుచుకునే పర్వదినం ఇది. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే శ్రీ సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత సంస్కృత ఆచార్యులు -
వీడిన ఉత్కంఠ.. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: తమిళనాడు సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై ఉత్కంఠ వీడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్టున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతోపాటు జల్లికట్టు కార్యక్రమ నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతించింది. అలాగే పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్ సామర్థ్యానికి (ఏది తక్కువ అయితే అది) అనుమతి ఇచ్చింది. పోటీదారులు, ప్రేక్షకులు రెండుడోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, పోటీల ప్రారంభానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. చదవండి: తమిళనాడులో భర్త ఇంటి ముందు యువతి ధర్నా అయితే రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో జల్లికట్టు కార్యక్రమాన్ని టీవీలలో చూడాలని, పెద్దఎత్తున గుమిగూడకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కాగా మధురై జిల్లాలో ఈనెల 14 నుంచి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. కనుమ పండుగ రోజున జల్లికట్టును అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే ఈ పోటీలను చూడడానికి భారీ సంఖ్యలో జనం హాజరవుతారు. చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం! -
కాలుదువ్విన కోడెగిత్తలు
చంద్రగిరి: సంక్రాంతి సమీపిస్తోన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని కొత్తశానంబట్ల గ్రామంలో ఆదివారం పరుష పందేలు (జల్లికట్టు)ను నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజున ప్రతి ఏడాది పరుష పందేలను నిర్వహించడం ఇక్కడ ఆనవాయితి. వేడుకలను తిలకించడానికి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. పశువులకు నల్లని దారాన్ని నడుముకు కట్టి, బుడగలు, పుష్పాలతో వాటిని అందంగా అలంకరించి, బరిలోకి దింపారు. ఆవులు, ఎద్దులు, కోడెగిత్తలను గుంపులు గుంపులుగా పరుగులెత్తించారు. జోరుగా దూసుకువచ్చే కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి చిత్రాలతో కూడిన పలకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోడెగిత్తలకు కట్టిన చెక్కపలకలను సొంతం చేసుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు. పరుష పందేరాల్లో భాగంగా పశువుల యజమానులు తమ కోడెగిత్తలను అదుపు చేయడంపై భారీగా పందేలు కాశారు. తన ఎద్దును అదుపు చేసిన వారికి ఒక ఎకరా పొలం రాసిస్తానంటూ ఓ వ్యక్తి పందెం కట్టడం విశేషం. మరికొందరైతే పట్టు వస్త్రాలు, నగదులను పందేలుగా పెట్టారు. కోడెగిత్తలను అదుపుచేసే సమయంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. -
మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు; లక్ష్మణరేఖ దాటి ప్రవర్తించబోం..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో జల్లికట్టు క్రీడలో ఇకపై నాటు ఎద్దులను మాత్రమే వినియోగించాలని నిర్వాహకుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఇందుకు తగ్గ తీర్పును గురువారం వెలువరించింది. తమిళుల సాహసక్రీడగా జల్లికట్టు ప్రపంచప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికుల రూపంలో నిషేధాన్ని కొన్ని సంవత్సరాలు ఎదుర్కొన్నా, చివరకు మహోద్యమం ద్వారా ఈ క్రీడను తమిళులు మళ్లీ దక్కించుకున్నారు. ఏటా సంక్రాంతి పర్వదినం వేళ కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఈ క్రీడ నిర్వహిస్తున్నారు. కాగా ఒక్కియం తురై పాక్కంకు చెందిన శేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో జల్లికట్టులో కేవలం నాటు ఎద్దులను మాత్రమే ఉపయోగించాలన్న వాదన తెర మీదకు వచ్చింది. వాదనల అనంతరం హైకోర్టు బెంచ్ స్పందిస్తూ, జల్లికట్టు క్రీడలో కేవలం నాటు ఎద్దుల్ని మాత్రమే ఉపయోగించాలని, విదేశీ, స్వదేశంలోని ఇతర జాతుల ఎద్దులను, ఆవుల్ని ఉపయోగించకూడదని తీర్పు ఇచ్చారు. ఈమేరకు పశువైద్యుడి సర్టిఫికెట్‌ను ఎద్దుల యజమానులు సమర్పించాలని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన పక్షంలో కోర్టు ధిక్కార కేసు తప్పదని హెచ్చరించారు. లక్ష్మణ రేఖదాటి స్పందించబోం.. స్పీకర్ అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలు లక్ష్మణ రేఖ లాంటిదని, దానిని దాటే విధంగా తాము జోక్యం చేసుకోలేమని మద్రాసు హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అసెంబ్లీలో సభ్యులందరికీ.. సమానంగా పరిగణించాలని, ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకూడదంటూ కోయంబత్తూరుకు చెందిన లోకనాథన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ, ఒక సభ్యుడు ఎక్కడ.. ఎలా.. కూర్చోవాలి, ఎంత సేపు మాట్లాడాలి అన్న వ్యవహారాలన్నీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తాము వ్యాఖ్యానించబోమని తేల్చి చెప్పారు. చదవండి: MK Stalin: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం! -
ప్రాణం తీసిన సాహస క్రీడ
సాక్షి, చెన్నై: సాహస క్రీడ జల్లికట్టులో విషాదం నెలకొంది. అలంగానల్లూరులో గాయపడ్డ క్రీడాకారుడు ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం శివగంగైలో జరగిన మంజు విరాట్ (ఎద్దులను వదలడం)లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎద్దులు పొడవడంతో ఇద్దరు మరణించారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని తిలకించి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కన్నదాసు, కుప్పన్ అనే ఇద్దరు యువకులు ప్రమాదంలో అదే రోజు రాత్రి మరణించారు. ఇక, అలంగానల్లూరులో జరిగిన క్రీడలో గాయపడ్డ నవమణి మృతిచెందాడు. గోపీకి చికిత్స అందిస్తున్నారు. కోయంబత్తూరులో ఆదివారం రెక్లా పోటీలు హోరెత్తాయి. ఇందులో విజేతలకు కారు, బుల్లెట్ బహుమతిగా ఇచ్చారు. అలాగే, రవాణామంత్రి విజయభాస్కర్ కరూర్‌లో రెక్లా పోటీల్లో స్వయంగా గుర్రపుస్వారీతో అందర్నీ ఆకట్టుకున్నారు. కృష్ణగిరిలో ఆదివారం జరిగిన మంజు విరాట్‌లో యాభై మందికి పైగా గాయపడ్డారు. ఇదిలాఉండగా, కానం పొంగల్ సందర్భంగా జనం ఇంటి నుంచి సందర్శనీయ ప్రాంతాలకు తరలి రావడం ఆనవాయితీ. అయితే, ఈ సారి ఈ పర్యటనకు ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఆదివారం జనం సందర్శనీయ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల వైపు పోటెత్తారు. -
జల్లికట్టు : ఉత్సాహం రంకేసింది
-
రంకెలేసిన ఉత్సాహం..
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు జోష్‌గా ప్రారంభమయ్యాయి. రంకెలేస్తూ పరుగులు పెడుతున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు జల్లికట్టు వీరులు ఉరకలేసారు. కొందరు విజేతలుగా నిలవగా మరికొందరు తీవ్రగాయాలకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అలాగే శుక్రవారం మాట్టు పొంగల్‌ను కోలాహలంగా జరుపుకున్నారు. పొంగల్ పండుగలో భాగంగా మదురై జిల్లా అవనియాపురంలో గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జల్లికట్టు పోటీలు జరిగాయి. 922 కోడెగిత్తలతోపాటు, 430 మంది జల్లికట్టు వీరులో టోకెన్లు పొందారు. మంత్రి సెల్లూరురాజా నేతృత్వంలో జిల్లా కలెక్టర్ అన్బళగన్, ఎమ్మెల్యేలు రాజన్‌సెల్లప్ప, శరవణన్ జెండా ఊపి జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. గంటకు 50 మంది వీరులను జల్లికట్టు చట్రంలోకి అనుమతించారు. విజేతలకు ఖరీదైన గృహోకరణ వస్తువులు, సైకిల్, మొబైల్ఫోన్లను బహూకరించారు. అలాగే మదురై జిల్లా పాలమేడులో శుక్రవారం జల్లికట్టు పోటీలను రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ప్రారంభించారు. ఒక్కో రౌండ్‌కు 75 మంది చొప్పున 639 మంది వీరులు పాల్గొన్నారు. కరోనా సర్టిఫికెట్ పొందిన వారిని మాత్రమే పోటీలకు అనుమతించారు. మాట్టు పొంగల్‌లో భాగంగా చెన్నైలో శుక్రవారం 120 పశువులు, గొర్రెలకు పూజలు చేశారు. కానుం పొంగల్‌ను పురస్కరించుకుని శనివారం కడలి అంచుల్లో ఆటపాటలపై ప్రభుత్వం నిషేధం విధించింది. చెన్నై మెరీనాబీచ్, కోవలం, నీలాంగరై బీచ్‌లు, మహాబలిపురం పర్యాటక కేంద్రం ప్రాంతాలకు చేరుకోరాదని, ఆంక్షలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్‌శాఖ హెచ్చరించింది. చెన్నై మెరీనాబీచ్‌లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటూ సందర్శకులకు అనుమతి లేదు. గాయాలు.. కత్తిపోట్లు.. మదురైలో జల్లికట్టు పోటీకి కోడె గిత్తలను తరలించే విషయంలో గొడవ తలెత్తగా అరుణ్‌కుమార్ (29), దేవేంద్రన్ (25) కత్తిపోట్లకు గురయ్యారు. ఈకేసులో కార్తికేయన్ (18), ప్రకాష్ (18) అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు జిల్లాలో జల్లికట్టు రిహార్సల్స్‌లో పాల్గొని విజేతగా నిలిచిన కోడె గిత్తలను ఆటో ఢీకొట్టడంతో వాటి వీపు ఎముకలు విరిగిపోయాయి. పశువైద్యులు వాటికి ఏడుగంటలపాటు శస్త్రచికిత్స చేశారు. మదురై జిల్లా పాలమేడు, అవనియాపురంలో గురు, శుక్రవారాల్లో జరిగిన జల్లికట్టు పోటీల్లో కోడెద్దులు కుమ్మడంతో వందమందికి పైగా వీరులు గాయపడ్డారు. సంక్రాంతి పండుగ సందర్బంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రూ.416 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. గురువారం ఒక్కరోజు రూ.269 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. రూ.56.39 కోట్ల మద్యం అమ్మకంతో తిరుచ్చిరాపల్లి ప్రథమస్థానంలో నిలిచింది. -
జల్లికట్టులో విషాదం.. ఇద్దరు మృతి
చెన్నై: జల్లికట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నేర్లగిరిలో ఆదివారం ఉదయం నుంచి జోరుగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి భారీగా జనం చేరుకున్నారు. భవనాలపై ఎక్కి జల్లికట్టు పోటీలను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ భవనం కులడంతో మెడమీద ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి:జల్లికట్టుకు గ్రీన్‌సిగ్నల్ -
జల్లికట్టుకు గ్రీన్‌సిగ్నల్
చెన్నై: సాంప్రదాయికంగా నిర్వహిస్తోన్న ప్రసిద్ధ జల్లికట్టు క్రీడను జరుపుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మకర సంక్రాంతి సందర్భంలో వచ్చే నెలలో ఈ క్రీడ జరుపుకుంటారు. అయితే కోవిడ్ –19 నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తూ జల్లికట్టు క్రీడను జరుపుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. క్రీడా ప్రాంతంలోకి అడుగిడే ముందు ప్రేక్షకులు థర్మల్ స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీరంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను ధరించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రీడలో భాగస్వాములయ్యే వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. -
మూవీ మాఫియా ఇళ్లల్లో దాక్కుంది
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ రూటే సెపరేటు. మనసులో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తుంటారు. ఈ కారణంగా ఆమెను అభినందించేవాళ్లూ ఉన్నారు.. విమర్శించేవాళ్లు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఆమె మాటలు, పోస్టులు వివాదాలకు దారి తీస్తూ తీవ్ర దుమారం సృష్టిస్తుంటాయి. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై, అక్కడి సినీ ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో మండిపడ్డారామె. 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ‘ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో భారతదేశం తరఫున మలయాళ సినిమా ‘జల్లికట్టు’ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా టీమ్‌ను ప్రశంసిస్తూ కంగన ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖులను కూడా విమర్శించారు. ‘‘అందరిపై అధికారం చెలాయించాలని చూసే బుల్లీడవుడ్ (బుల్లీ అంటే ర్యాగింగ్ అనొచ్చు... బాలీవుడ్ ‘బుల్లీడవుడ్’ అని కంగనా ఉద్దేశం) గ్యాంగ్‌కు సరైన ఫలితాలు వచ్చాయి. భారతీయ చిత్రపరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది మాత్రమే కాదు.. మూవీ మాఫియా గ్యాంగ్ ఇళ్లలోనే దాక్కుని, జ్యూరీని తన పనిని తాను చేసేలా చేసింది. ‘జల్లికట్టు’ చిత్రబృందానికి అభినందనలు’’ అని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
ఆస్కార్‌కు ‘జల్లికట్టు’.. కంగన స్పందన
ముంబై: ఆస్కార్ అవార్డుకు మన దేశం నుంచి మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంపిక చేయడాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వాగతించారు. ‘జల్లికట్టు’ టీమ్‌ను ఆమె అభినందించారు. 93వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మన దేశం తరపున ‘జల్లికట్టు’ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మాఫియా చెక్ పెట్టి, ఆస్కార్ పోటీకి మంచి సినిమాను ఎంపిక చేశారని బాలీవుడ్ ‘క్వీన్’ కంగన పేర్కొన్నారు. పనిలో పనిగా బాలీవుడ్ మాఫియాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ నాలుగు కుటుంబాలకే పరిమితం కాదని, మూవీ మాఫియా గ్యాంగ్‌ను కాదని మంచి సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేశారని ట్వీట్ చేశారు. కంగన ఆరోపణలు చిత్ర సీమకే పరిమితం కాలేదు. ఒక వైపు బాలీవుడ్ పెద్దలను మరోవైపు రాజకీయ ప్రముఖలను టార్గెట్ చేస్తూ ఎప్పుడు వార్తలలో నిలుస్తోంది. గత నెలలో కంగన, మహరాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య మాటల యుద్ధం కోటలు దాటింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ అనుమానాస్పద మృతి కేసు విషయమై ముంబై నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఉద్ధవ్ ఠాక్రే.. కంగనపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ మాటల యుద్ధం కొనసాగుతుండగానే మరోసారి బాలీవుడ్ మాఫియాను ఎండగట్టింది కంగన. All the scrutiny/ bashing Bullydawood gang got is finally yielding some results, Indian films aren’t just about 4 film families, movie mafia gang is hiding in their houses and letting juries do their job and congratulations team #Jallikattu https://t.co/kI9sY4BumE — Kangana Ranaut (@KanganaTeam) November 25, 2020 -
ఆస్కార్ అవార్డ్‌ను దున్నుతుందా?
పోటీ మొదలయింది. ఆస్కార్ పరుగులోకి ఒక్కొక్కటిగా సినిమాలను ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. లీజో జోస్ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం. ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లకు మంచి పేరు లభించింది. 2019, అక్టోబర్ 4న ‘జల్లికట్లు’ విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బూసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో. ప్రతీ ఏడాది మన దేశం నుంచి పంపే సినిమాయే మన రేసు గుర్రం. ఆ గుర్రం గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. ఈ ఏడాది మన రేసు గుర్రం, ఈ దున్న. ఆస్కార్ జ్యూరీ ఎంపిక చేసే తుది జాబితాలో మన సినిమా ఉండాలని, ఆస్కార్ తీసుకురావాలని అందరం చీర్ చేద్దాం. హిప్ హిప్ బర్రె! ఎంట్రీగా పోటీపడ్డ సినిమాలు ఈ ఏడాది మన దేశం తరఫు నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లేందుకు పలు సినిమాలు ఇవే అని ఓ జాబితా బయటకు వచ్చింది. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, హన్సల్ మెహతా ‘చాలెంజ్’, ‘ది డిసైపుల్’, ‘మూతాన్’, ‘కామ్యాబ్’, ‘షికారా’, ‘బిట్టర్ స్వీట్’ వంటి సినిమాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఉపయోగించలేదు. యానిమేట్రానిక్స్ ద్వారా దున్న బొమ్మలను తయారు చేశారు. సుమారు మూడు నాలుగు దున్నలను తయారు చేశారు ఆర్ట్ డైరెక్టర్ గోకుల్ దాస్. ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షలు అయిందట. -
ఆస్కార్ బరిలోకి ‘జల్లికట్టు’
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న మలయాళ చిత్రం ‘జల్లికట్టు’కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. ఉత్తమ అంతర్జాతీయ భాషా చిత్రాల కెటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ సినిమా ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్, టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మనుషులు, జంతువుల మధ్య బావోద్వేగ పూరిత సన్నివేశాలను కళ్లకు కట్టినట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జల్లికట్టు కథేంటి లిజో జోస్ పెలిసెరి దర్శకత్వంలో ఆంటోని వర్గీస్, చెంబన్ వినోద్ జోసే, సబుమోన్ అబ్దుసామద్ శాంతి బాల చంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో.. ఓ కుగ్రామంలో ఓ దున్న సృష్టించిన విన్యాసాలను అద్భుతంగా చూపించారు. కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలందరికి గొడ్డు మాంసం అంటే ఇష్టం. గొడ్డుమాంసం లేనిదే వారికి ముద్ద దిగదు. ఆంటోనీ అనే వ్యక్తి ఉరందరికి బీఫ్ సరఫరా చేస్తుంటాడు. అతను తెచ్చి అమ్మె అడవి దున్న మాంసం అంటే అక్కడి వాళ్లందరికి పిచ్చి. అలా ఓరోజు.. అడవి దున్న ని కబేళాకి తరలించి, దాని మాంసం విక్రయిద్దాం అనుకునేలోపు.. అది తప్పించుకుంటుంది. అడవిని ధ్వంసం చేస్తూ, మనుషుల్ని గాయపరుస్తూ.. దాగుడుమూతలు ఆడుతుంది. దాన్ని పట్టుకునేందుకు ఊరంతా ఏకమై తిరుగుతారు. ఎలాగైనా దాన్ని చంపి మాంసం తలా ఇంత పంచుకోవాలనుకుంటారు. మరి ఆ దున్న వారికి దొరికిందా? ఈలోపు ఏం జరిగింది? ఎంత నష్టపరచింది? అన్నదే కథ. -
జల్లికట్టు ఎద్దుకు విగ్రహం
సాక్షి, చెన్నై: తమిళనాట సాహసక్రీడ జల్లికట్టుకు ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తూ పుదుకోట్టైలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. జల్లికట్టు ఎద్దు పొగరును క్రీడాకారుడు అణగదొక్కే రీతిలో రూపొందించిన ఈ విగ్రహాన్ని గురువారం సీఎం పళనిస్వామి ఆవిష్కరించారు. సీఎం పళనిస్వామి పుదుకోట్టై పర్యటన నిమిత్తం ఉదయం చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలోమంత్రులు వెల్లమండి నటరాజన్, వలర్మతి, విజయభాస్కర్, తిరుచ్చి కలెక్టర్ శివరాజ్ సీఎంకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుదుకోట్టైకు సీఎం పయనం అయ్యారు. (పది రోజుల్లో చిన్నమ్మ విడుదల!) విరాళిమలైలో ఐటీసీ సంస్థ ఆహార ఉత్పత్తి పరిశ్రమల విస్తరణ పనుల్ని ప్రారంభించారు. అనంతరం విరాళిమలై కామరాజ నగర్ జంక్షన్లో జల్లికట్టు ఎద్దు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల పుదుకోట్టై జిల్లాలో 110 చోట్ల జరిగిన జల్లికట్టు గిన్నిస్ రికార్డులోకి ఎక్కడంతో, ఆ గుర్తింపుతో పాటు జల్లికట్టు ఎద్దుకు, క్రీడాకారుడికి గౌరవాన్ని కల్పించే విధంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. రంకెలేస్తున్న ఎద్దును లొంగదీసుకునే క్రీడాకారుడి రూపంలో ఈ విగ్రహాన్ని కొలువుదీర్చారు. ఈ సందర్భంగా బారులు తీరిన జల్లికట్టు ఎద్దులను సీఎం పరిశీలించారు. ఆ ఎద్దుల ముక్కుతాడు పట్టుకున్నారు. ఎడ్లబండిలోకి ఎక్కి, తోలుకుంటూ ముందుకు సాగారు. అక్కడే జరిగిన రైతుల సమస్యల పరిష్కార కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. రైతుగా రైతు కష్టాలు తనకు తెలుసునని పేర్కొంటూ, పుదుకోట్టై వాసుల కల త్వరలో సాకారం అవుతుందని ప్రకటించారు. కావేరి – వైగై – గుండారుల అనుసం«ధానం త్వర లో జరిగి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కరోనా, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీక్షకు సీఎం హాజరయ్యారు. -
నటుడు సూరీకి జల్లికట్టుతో సంబంధం ఏంటి?
సినిమా: జల్లికట్టు తమిళ పారంపర్య క్రీడ. అంతే కాకుండా ఇది తమిళుల వీరత్వానికి చిహ్నం. ఈ జల్లికట్టును కేంద్రం నిషేధిస్తే తమిళులందరూ ఒకతాటిపై పోరాడి మళ్లీ సాధించుకున్న విషయం తెలిసిందే. అలాంటి జల్లికట్టుకు ప్రముఖ హాస్యనటుడు సూరికి సంబంధం ఏమిటి అన్నది ఇక్కడ చర్చనీయాంశం. ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుడిగా రాణిస్తున్న సూరి త్వరలో కథానాయకుడిగా అవతారం ఎత్తనున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన జల్లికట్టు ఎద్దులతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అవుతున్నాయి. ఇటీవల పలువురు కరోనా బాధితులను నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్న సూరి, తన పిల్లలతో కలిసి కరోనాపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. కాగా మదురై సమీపంలోని రాజాకూర్ గ్రామానికి చెందిన సూరి ఇటీవల స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ తమ జల్లికట్టు పందెపు ఎద్దుతో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి అందులో ఊరంతా లాక్డౌన్ లో ఉన్న సమయంలో ఊరంతా నిలవదు సూచించే మా జల్లికట్టు కరుప్పన్ అని ట్యాగ్‌లైన్ పోస్ట్ చేశారు. దీని గురించి సూరి పేర్కొంటూ తమ కరుప్పన్ (జల్లికట్టు ఎద్దు) ఇప్పటి వరకూ 40 జల్లికట్టు పోటీల్లో పాల్గొని అన్ని పోటీల్లో గెలుపొందిందని చెప్పారు. పందెంలో ఒక్కరూ కూడా తమ ఎద్దును టచ్ కూడా చేయలేక పోయారని చెప్పారు. తమ ఎద్దు సాధించిన బహుమతులు ఈ ఊళ్లో పెళ్లిళ్లు, వంటి విశేష వేడుకల్లో బహుమతిగా వారికి అందించడం జగుగుతుందని నటుడు సూరి తెలిపారు. ప్రస్తుతం తమ కరుప్పన్ బాధ్యతలను తన సోదరుడు చూసుకుంటున్నాడు అని ఆయన చెప్పారు. -
జల్లికట్టు ఎద్దును రాళ్లతో కొడుతూ టిక్‌టాక్!
చెన్నై : టిక్‌టాక్ వీడియో కోసం మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు జల్లికట్టు ఎద్దును దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఈ అమానుష ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరికి చెందిన వెట్రివేల్ అనే వ్యక్తికి కాశీ ఈశ్వర అనే జల్లికట్టు ఎద్దు ఉంది. కొద్దిరోజుల క్రితం అది గాయాలపాలై మృతి చెందింది. ప్రమాదవశాత్తు అది మరణించి ఉండొచ్చని వెట్రివేల్ భావించాడు. అయితే గురువారం ముగ్గురు తాగుబోతు యువకులు ఎద్దు చుట్టూ చేరి రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసిస్తున్న ఓ టిక్‌టాక్ వీడియోను అతడు చూశాడు. ఆ వెంటనే ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెట్రివేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( అందుకే కోట్ల ఆస్తి ఆ ఏనుగులకు రాశా! ) ఆ వీడియోలో.. కొందరు తాగుబోతు యువకులు చెట్టుకు కట్టేసి ఉన్న ఎద్దు చుట్టూ చేరారు. దాన్ని రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసించసాగారు. అది ఆగ్రహంతో వారిపై ఉరకటానికి ప్రయత్నించి. ఈ నేపథ్యంలో రాళ్లు దాని ముఖానికి తగల సాగాయి. దీంతో తల భాగంలో తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రెండు కొమ్ములు కూడా దెబ్బతిన్నాయి. ( జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి ) -
నక్కతో జల్లికట్టు : 11మందికి జరిమానా
చెన్నై, తిరువొత్తియూరు: నిబంధనలకు విరుద్ధంగా గుంటనక్క జల్లికట్టు నిర్వహించిన 11 మందికి అటవీశాఖ అధికారులు జరీమానా విధించారు. సేలం జిల్లా వాళపాడి దాని పరిసర ప్రాంతాలలో 30 మందికిపైగా గ్రామ ప్రజలు 200 సంవత్సరాలుగా సంప్రదాయరీతిలో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలని గుంట నక్కతో జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గుంటనక్క జల్లికట్టుకు అటవీశాఖ వారు నిషేధం విధించారు. ఈ క్రమంలో వాళపాడి సమీపం చిన్నమనాయకన్ పాళయంలో శనివారం డప్పు వాయిద్యాలతో గుంట నక్కతో జల్లికట్టు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం మారియమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించి తరువాత 20 మంది ప్రజలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుంట నక్క కోసం వల వేసి వేచి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో గుంట నక్క వలలో చిక్కుకుంది. శనివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గుంట నక్కను రెండు కి.మీ దూరం గ్రామాలలో తిరగనిచ్చి మారియమ్మన్ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. తరువాత నక్కకు పూలమాల వేసి జల్లికట్టు నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న వాళపాడి అటవీశాఖ ఉద్యోగులు చిన్నమనాయకన్ పాళయంకు చేరుకుని నిబంధనలను అతిక్రమించి నక్కతో జల్లికట్టు జరిపిన 11 మందిపై కేసు నమోదు చేశారు. వారికి రూ.55వేలు జరిమానా విధించారు. -
జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి
వెల్లూరు : సంక్రాంతి సంబరాల్లో భాగంగా తమిళనాట జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో కొన్ని చోట్ల అపశ్రుతులు చోటుచేసుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఎద్దులు పొడవడంతో ఇప్పటికే నలుగురు మృతిచెందగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. అయితే వెల్లురులో మాత్రం జల్లికట్టు పోటీ జరిగే చోట విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారిపైకి ఎద్దు దూసుకోచ్చింది. అక్కడ జనాలను అదుపుచేస్తున్న పోలీసును వెనకనుంచి దూసుకొచ్చిన ఎద్దు ఢీకొట్టింది. కొమ్ములతో పైకి లేపడంతో.. ఆ పోలీసు కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటనలో పోలీసుతో పాటుమరికొంతమంది ప్రజలు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరిలించారు. జల్లికట్టు పోటీల కోసం 200 ఎద్దులను ఒకచోట చేర్చడంతో వాటిని అదుపు చేయడం కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆవేశంగా బయటకు దూసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీస్ అధికారిని ఎద్దు ఢీ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సంక్రాంతి సంబరాలు: రంకెలేసిన ఉత్సాహం
సాక్షి, చంద్రగిరి/వెదురుకుప్పం: మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగలో మూడో రోజైన గురువారం జిల్లాలోనే ఎడ్ల పందేల(జల్లికట్టు)కు ప్రసిద్ధి చెందిన రంగంపేట గ్రామంలో జల్లికట్టు నిర్వహించారు. వీక్షించడానికి మండలం నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. దీంతో రంగంపేట గ్రామం జనసంద్రమైంది. గ్రామ ప్రారంభం నుంచి చివరి వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. గ్రామంలోని పశువులను పందేలకు వదలడంతో యువకులు కేరింతలు కొడుతూ వాటిని నిలువరించేందుకు పోటీపడ్డారు. మహిళలు సైతం మేడలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. పశువులకు కట్టిన పలకలను సొంతం చేసుకునే ప్రయత్నంలో పలువురు యువకులు గాయాలపాలయ్యారు. సుమారు 4 గంటల పాటు ఉల్లాసంగా జల్లికట్టు సాగింది. ఎడ్ల పందేలు తిలకించడానికి చెట్టు పైకి ఎక్కిన జనం పందేలను తిలకించిన మోహన్‌బాబు పశువుల పందేలను శ్రీవిద్యానికేతన్ అధినేత, సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు, నటుడు మంచు మనోజ్ తిలకించారు. మోహన్‌బాబు పశువుల పందేలను తిలకించడానికి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. మాంబేడులో.. వెదురుకుప్పం మండలం మాంబేడులో జల్లికట్టు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు కోడెగిత్తలను నిలువరించడానికి ఉత్సాహం చూపారు. -
చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు జోరు..
-
తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. విషాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే జల్లికట్టు ప్రాంగణానికి ఎద్దులు, ఔత్సాహికులు చేరుకున్నారు. ఈ రోజు పాలమాడులో పోటీల్లో పాల్గొనడానికి 700 ఎద్దులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని అధికారులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఎద్దులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రప్రజలంతా ఈ పోటీలను వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అందుబాటులో ఉంచారు. బుధవారం జరిగిన జల్లికట్టు పోటీల్లో 32 మంది గాయపడ్డారు. విషాదం చెన్నై: తిరుచ్చి సురయూర్లో గురువారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు పోటీల్లో భాగంగా ఎద్దులు జనంపైకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. -
రంగంపేటలో వేడుకగా జల్లికట్టు!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సంప్రదాయ క్రీడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఇక్కడి వీధులన్ని కిక్కిరిసిపోయాయి. మేడలు, మిద్దెలు ఎక్కి జనం జల్లికట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారు. సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌బాబు కూడా జల్లికట్టును తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. ఓ మిద్దెపై నుంచి వారు జల్లికట్టు ఉత్సవాన్ని తిలకించారు. ప్రస్తుతం జల్లికట్టు జోరుగా సాగుతోంది. జల్లికట్టులో భాగంగా పరిగెత్తుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ వేడుకలో ఎప్పటిలాగే చిన్న చిన్న అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. దూసుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న గాయాలపాలవుతున్నారు. ఎద్దులను అదుపుచేసే క్రమంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, జల్లికట్టు ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లా కూడా గుర్తుకు వస్తుంది. పశువుల పండుగ పేరుతో నిర్వహించే ఈ జల్లికట్టుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి సందర్బంగా నిర్వహించే ఈ జల్లికట్టును తిలకించడాని వేలాదిమంది వస్తారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు చాలా ప్రాంతాలలో జరుగుతున్నా... చంద్రగిరి మండలం రంగంపేట హైలెట్ గా నిలుస్తోంది. ఇవాళ ఉదయాన్నే పశువులకు పూజలు చేస్తారు. అనంతరం కోడిగిత్తలను అలంకరిస్తారు. కొమ్ముల మధ్య చెక్క పలకలు, కొమ్ములకు కొత్త తవళ్లు చూడతారు. గుంపులు గుంపులుగా వీధిలోకి వదులుతారు. కొమ్ములు తిరిగిన కోడె గిత్తలు పరుగులు తీస్తుంటే వాటిని నిలువరించడానికి యువకులు పోటీ పడతారు.. ప్రాణాలను సైతం లెక్క చేయరు. ఎందుకంటే కోడె గిత్తలను నిలువరించిన వారిని సాహస వంతులుగా ఈ ప్రాంత వాసులు భావిస్తుంటారు. అందుకే యువకుల కేరింతల మధ్య కోడె గిత్తలను పట్టుకోవడానికి పోటీ పడతారు. ఈ దృశ్యాలను తిలకించదానికి రంగంపేటకు వేలమంది హాజరవుతారు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి జల్లికట్టును ఓ పండుగలా చేసుకొంటారు. -
జల్లికట్టులో అపశ్రుతి : 32 మందికి గాయాలు
మధురై : తమిళనాడులోని అవనియపురంలో సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైన కొద్ది గంటలకే 32 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడిన నలుగురిని మధురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఎద్దులను యువకులు నిలువరించే క్రమంలో ఈ విషాదం చోటుచేసుకుందని సమాచారం. కాగా, తమిళనాడులో ఈనెల 31 వరకూ జరిగే జల్లికట్టులో 2000కి పైగా ఎద్దులు పాల్గొంటాయి. అవనియపురంలో ఏడు వందల ముప్పై ఎద్దులు, అలంగనల్లూరులో 700 ఎద్దులు, పలమెడులో 650 ఎద్దులు ఈ ఏడాది సాంప్రదాయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. -
సంక్రాంతి సంబరాల్లో విషాదం
చిత్తూరు, రామకుప్పం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎద్దుల పోటీలు ఏర్పాటు చేశారు. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభమైన కొంత సేపటికే అనుకోని ఘటనతో విషాదం ఎదురైంది. ఎద్దును నిలువరించే క్రమంలో 89–పెద్దూరుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన రామకుప్పం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.మండలంలోని పెద్దబల్దారు, చిన్నబల్దారు, కవ్వంపల్లె మధ్యలో ఉన్న భారతంమిట్టలో సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామస్తులు ఎడ్ల పందేలు ఏర్పాటు చేశారు. గెలుపొందిన ఎద్దులకు భారీగా బహుమతులను ప్రకటించారు. దీంతో స్థానికంగా ఉన్న ఎద్దులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీగా చేరాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఎడ్ల పందేలను చూడటానికి జనం తరలివచ్చారు. పరుగుపందెం ప్రారంభమైన కాసేపటికి మెరుపు వేగంతో దూసుకువచ్చిన ఓ ఎద్దు కొమ్ములతో 89–పెద్దూరుకు చెందిన అబ్దుల్‌బాషా (28)ను ఢీకొట్టింది. మెడ భాగంలో కొమ్ము దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే రక్తపుమడుగులో కుప్పకూలాడు. తీవ్రంగా గాయపడిన బాషాను స్థానికులు హుటాహుటిన పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూబాషా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 8 మందిపై కేసు నమోదు పోలీసుల ఆదేశాలను ఖాతరు చేయకుండా ఎడ్ల పరుగుపందెం నిర్వహించిన ఏడుగురిపై, ఎద్దు యజమానిపై కేసు నమోదు చేసినట్లు కుప్పం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్, రామకుప్పం ఎస్ఐ ప్రసాద్‌రావు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా జల్లికట్టు, ఎడ్ల పరుగుపందెం నిర్వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చ రించారు. మనుషుల ప్రాణాలను ఫణంగా పెట్టి నిర్వహిస్తున్న ఈ ఆచారానికి ప్రజలు, రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం చేయూత అబ్దుల్‌బాషా కుటుంబాన్ని ట్రైనీ కలెక్టర్ పృథ్వీ తేజ్ పరామర్శించారు. ఎద్దుల పోటీల్లో యువకుడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నా రు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు. -
తంబీల జల్లికట్టు!
-
ఘనంగా జల్లికట్టు సంబరాలు
-
చంద్రగిరి మండలంలో జల్లికట్టు సంబరాలు
-
చంద్రగిరి మండలంలో జల్లికట్టు సంబరాలు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం కందులవారుపల్లిలో జల్లికట్టు సంబరాలు ఘనంగా జరిగాయి. కోడెగిత్తలను ఉరికిస్తూ యువత ఈ వేడుకలో పాల్గొన్నారు. కోడెగిత్తలను పట్టుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నించారు. ఎద్దుల కొమ్ములకు ఉన్న బహుమతులు పొందేందుకు ఎగబడ్డారు. అయితే, కోడె గిత్తల వేగాన్ని అందుకోలేక యువకులు కొంత బేజారెత్తిపోయారు. ఈ క్రమంలో పోటీలో పాల్గొన్న పలువురు యువకులకు గాయాలయ్యాయి. జల్లికట్టు వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
రక్తం చిందే ఆ ఆటపై ఎంతో ఆసక్తి!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆడు బగాంగ్’ అన్నది ఒక ఆటవిక ఆట. అందులో గాయాలవుతాయి. వాటిలో నుంచి రక్తం చిమ్ముతుంది. గాయానికో లెక్క. ఎన్ని గాయాలయితే చూసే వారికి, బెట్ కాసేవారికి అంత ఆనందం. ఇది మనుషులు ఆడే ఆట కాదు. మనుషులు ఆడించే ఆట. తమిళనాడులో జల్లికట్టు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందేల లాంటిదేగానీ కొంత తేడా. తమిళనాడులో గేదెల మధ్య, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల మధ్య ఆటలు సాగితే అక్కడ కుక్క, అడవి పంది మధ్య హింసాత్మక పోటీలు జరుగుతాయి. ‘ఆడు బగాంగ్’ అన్నది ఇండోనేసియాలో కనిపించే గ్రామీణ క్రీడ. ఇది ఇప్పుడు ఎక్కువగా జావా రాష్ట్రంలో కనిపిస్తోంది. చిత్తడి చిత్తడిగా ఉన్న ఓ ప్రదేశం చుట్టూ గుండ్రంగా తడికెలతో ఓ దడి కడతారు. అందులోకి శిక్షణ ఇచ్చిన కుక్క పిల్లలను, అడవి పందులను బరిలోకి దింపుతారు. అవి వీరావేశంతో కొట్లాడుకుంటుంటే దడి చుట్టూ నిలబడి వందలాది మంది ప్రజలు చూస్తుంటారు. ఆ సందర్భంగా ఆనందంగా తాగే వారు తాగుతుంటే బెట్ కాసే వారు భారతీయ కరెన్సీలో వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కాస్తారు. ఈ క్రీడను మగవారితోపాటు మహిళలు, పిల్లలే కాకుండా పోలీసులు, సైనికులు కూడా ఆసక్తిగా తిలకిస్తారు. ఇందులో బెట్టింగ్ ఒక సైడే ఉంటుంది. పందెంలో పాల్గొంటున్న ఓ కుక్క, తన ప్రత్యర్థి అడవి పందికి ఎన్ని గాయాలు చేస్తుందన్నదే లెక్క. పంది ప్రాణాలపై కూడా పందెం కాస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో అడవి పంది పోరాడే శక్తిని కోల్పోయినప్పుడు ఆ పందిని బరి నుంచి తప్పించి మరో పందిని ప్రవేశపెడతారు. పందిని తెచ్చి బరిలో ప్రవేశ పెట్టే వారికి కూడా పందెం నిర్వాహకులు కొంత డబ్బు చెల్లిస్తారు. వారి పందికి ఎన్ని గాయాలైతే అంత డబ్బు లెక్కగట్టి ఇవ్వడంతోపాటు వాటికి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా చెల్లిస్తారు. ఈ గ్రామీణ క్రీడను రక్తి కట్టించేందుకు కుక్కలను బలిష్టంగా మేపడమే కాకుండా వాటికి తగిన శిక్షణ ఇస్తారు. కేవలం ఈ పోటీల కోసమే బలమైన కుక్క జాతుల మధ్య క్రాస్ బ్రీడింగ్ ద్వారా కుక్క పిల్లలను పుట్టిస్తారు. బెట్టింగ్ రాయుళ్లకు, పందిని తీసుకొచ్చే వారికి ఏ మాత్రం డబ్బు గిట్టుబాటు అవుతుందో తెలియదుగానీ కుక్కల యజమానులు మాత్రం లక్షల కొద్దీ రూపాయలు సంపాదిస్తున్నారు. జీవకారుణ్య కార్యకర్తల డిమాండ్ మేరకు ఇండోనేసియా ప్రభుత్వం 2017లో ఈ క్రీడను రద్దు చేసింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను నగర మేయర్లకు అప్పగించడంతో వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాల్లాగా ఆ దేశంలో ఈ పోటీలు యధేశ్చగా కొనసాగుతున్నాయి. ‘కప్’ల పేరిట కూడా ఈ పోటీలను నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మద్యం తాగడాన్ని అక్కడి షరియా చట్టం నిషేధించినప్పటికీ ఈ పోటీలప్పుడు ప్రజలు మాత్రం జాతి, మత భేదాల్లేకుండా ఆనందంగా తాగడం కనిపిస్తోంది. 1960 నుంచి ఈ పోటీలు అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట రైతులు అడవి పందుల నుంచి తమ పంట పొలాలను కాపాడుకునేందుకు కుక్కలను పెంచేవారు. అవి వాటిని తరిమి తరిమి కొట్టేవి. ఈ వేటను ఆనందించిన రైతుల నుంచే ఈ పోటీలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. -
తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
-
తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత
చెన్నై: తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జల్లికట్టు నిర్వహించటానికి పోలీసులు అనుమతి నిరాకరించటం పెను ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. హోసూరు సమీపంలోని మదకొండపల్లిలో బుధవారం జల్లికట్టు నిర్వహించటానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తారనే ఉద్దేశ్యంతో భారీ ఏర్పాట్లు సైతం చేశారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు జల్లికట్టుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన సందర్శకులు పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు, నిర్వాహకుల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన వేలాది మందిని పోలీసులు తరిమి కొట్టడానికి లాఠీచార్జ్ చేయటంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఘర్షణ వాతావరణంతో రెండు రాష్ట్రాల సరిహద్దులు వేడక్కాయి. -
జల్లికట్టుకు ‘గిన్నిస్’లో చోటు
సాక్షి, చెన్నై: తమిళుల సాహసక్రీడ జల్లికట్టు గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం పుదుకోట్టై జిల్లా విరాళిమలైలో జరిగిన జల్లికట్టుకు గిన్నిస్ ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు సర్టిఫికెట్ అందజేశారు. అయితే, ఈ క్రీడ తిలకించేందుకు వచ్చిన ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఎద్దులను అదుపులోకి తెచ్చేందుకు యత్నించి 31 మంది గాయాలపాలయ్యారు. గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలన్న ప్రయత్నంలో భాగంగా విరాళి మలైలో జల్లికట్టుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. 1,354 ఎద్దులను రంగంలోకి దించిన నిర్వాహకులు వీటిని పట్టుకునేందుకు మాత్రం 424 క్రీడాకారులనే అనుమతించారు. తొలుత 2,000కుపైగా ఎద్దులను బరిలోకి దించాలని భావించినప్పటికీ సమయాభావం కారణంగా కుదరలేదు. పోటీలో ఎద్దుల సంఖ్య ఎక్కువ, పాల్గొనేవారి సంఖ్య తక్కువ కావడంతో క్రీడాకారులతో పాటు సందర్శకులకు కూడా వైద్య బీమా కల్పించారు. ఎద్దులతో జరిగిన పోరులో దాదాపు 31 మంది గాయపడ్డారు. తిలకించేందుకు వచ్చిన వారిపైకి ఎద్దులు దూసుకు పోవడంతో రాము(25), సతీష్(43) అనే వారు ప్రాణాలు కోల్పోయారు. బసవన్నలను అదుపు చేసిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కాగా, భారీ ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు దక్కినందుకు లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
గిన్నీస్ రికార్డు జల్లికట్టులో తీవ్ర విషాదం
సాక్షి, చెన్నై : గిన్నీస్ బుక్ రికార్డు కోసం అధికారులు ఏర్పాటు చేసిన అతిపెద్ద జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఇద్దరు మృతి చెందారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించగా.. 41మంది గాయపడ్డారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 21 ఎద్దులను పట్టుకుని తిరుచ్చికి చెందిన మురుగానందం మొదటిస్థానంలో, పదహారు ఎద్దులను పట్టుకుని కాట్టురుకు చెందిన కార్తీ రెండో స్థానంలో నిలుచున్నాడు. పలు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ జల్లికట్టు కార్యక్రమంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. -
అతిపెద్ద జల్లికట్టులో.. విషాదం
సాక్షి, చెన్నై : గిన్నీస్ బుక్ రికార్డు కోసం తమిళనాడులో అధికారులు ఏర్పాటు చేసిన అతిపెద్ద జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో జల్లికట్టులో ఎద్దు కుమ్మేయటంతో పుదుకోటైకి చెందిన రాము అనే వ్యక్తి మృతిచెందారు. విరాళీమలైలో సీఎం పళణిస్వామి ఆదివారం జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. దీనిలో 2500 ఎద్దులు, 3వేల మంది యువకులు పాల్గొన్నారు. -
గిన్నీస్ బుక్ వేటలో జల్లికట్టు
చెన్నై: గిన్నీస్ బుక్ రికార్డు కోసం తమిళనాడులో అతిపెద్ద జల్లికట్టును అధికారులు ఏర్పాటు చేశారు. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో సీఎం పళణిస్వామి ఆదివారం జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. దీనిలో 2500 ఎద్దులు, 3వేల మంది యువకులు పాల్గొన్నారు. జల్లికట్టు ఎద్దు మృతి.. నామక్కల్ జరిగిన జల్లికట్టుకు కొల్లిమలైకు చెందిన మణికంఠన్ తన ఎద్దు తీసుకెళ్లాడు. ఈ ఎద్దు వాడివాసల్ నుంచి వెలుపలికి రాగా, దాని వేగానికి భయపడిన వీరులు పట్టుకోలేకపోయారు. దీంతో ఎద్దు పరుగులు తీస్తూ మైదానానికి వెలుపల ఉన్న 50 బావిలో పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న అగ్నిమాపకసిబ్బంది హుటాహుటిన ఆ ఎద్దును బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందింది. -
జల్లికట్టు.. రికార్డ్ పట్టు!
-
తమిళనాడులో జల్లికట్టు జోరు!
-
ప్రారంభమైన జల్లికట్టు.. ఇద్దరి పరిస్థితి విషమం
చెన్నై: తమిళనాడులో పొంగల్ వేడుకల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జల్లికట్టు నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు వేడుకలను వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. పుదుకొట్టే జిల్లా తసంగుర్చిలో తొలి జల్లికట్టు పోటీలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రారంభించారు. జల్లికట్టు పోటీలో భాగంగా 300 ఎద్దులను అదుపు చేయడానికి 400 మంది యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని పుదుకోట్టె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిత్తూరులో ఘనంగా జల్లికట్టు వేడుకలు.. చిత్తూరు: సంక్రాంతి పండగను పురస్కరించుకుని తమిళనాడుతో పాటు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జల్లికట్టులో పాల్గొనేందుకు యువత ఉత్సహం కనబరుస్తున్నారు. జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న జలికట్టు వేడుకలకు భారీగా జనాలు తరలివచ్చారు. పోటీలో భాగంగా పశువులను పట్టుకునేందుకు యువకులు రంగంలోకి దిగుతున్నారు. జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన యువత కేరింతలు కొడుతూ ఉత్సహంగా గడుపుతున్నారు. అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చినవారికి రేఖలచేను గ్రామ యువత అన్నదానం చేసింది. -
తమిళనాడులో జల్లికట్టు జోరు!
సాక్షి, చెన్నై: తమిళనాడులో పొంగల్ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు. జల్లికట్టులో పాల్గొనేందుకు 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2600 ఎద్దులు ఈసారి జల్లికట్టులో పాల్గొంటున్నాయి. -
జల్లిపట్టు
-
ఆకట్టుకున్న జల్లికట్టు ఉత్సవం...!
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి మండలం కొత్తశానంబట్లలో జల్లికట్టు ఉత్సవం ఆకట్టుకుంది. గుంపులుగా పరిగెడుతున్న గిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు యువకులు. సంక్రాంతి సందడి కొత్త ఏడాది వచ్చిన తొలిరోజే ప్రారంభమైంది. సంక్రాంతికి నాందిగా జల్లికట్టు ఉత్సవాన్ని ఈసారి నూతన సంవత్సరాది రోజునే ఏర్పాటు చేశారు. -
చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఉత్సవం
-
టాలీవుడ్ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర వ్యాఖ్యలు
-
కొడుకులా ఓ కుటుంబాన్ని ఆదుకున్న రియల్ హీరో
సాక్షి, చెన్నై : జల్లికట్టు ఉద్యమంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ బాసటగా నిలిచాడు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ గత ఏడాది చెన్నైలోని మెరీనా తీరంలో ప్రారంభమైన ఉద్యమం తమిళనాడు వ్యాప్తంగా ఊపందుకుంది. ఆ సమయంలో విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంధ సంస్థలు, సినీనటులు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సేలంలో జరిగిన రైల్‌రోకోలో యోగేశ్వరన్ (17) రైలింజన్ పైకి ఎక్కడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. అతడి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లిన లారెన్స్ మృతుడి తల్లిదండ్రులను పరామర్శించి, ఇంటికి పెద్ద కుమారిడిలా ఉంటానని హామీ ఇచ్చాడు. చిన్నతనంలోనే చనిపోయిన యోగేశ్వరన్ కుటుంబ సభ్యుల కోసం ఇంటిని నిర్మిస్తానని తరచూ చెప్పేవాడు. ఇది తెలుసుకున్న లారెన్స్ ఉత్తర అమ్మాపేటలో స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటిని నిర్మించాడు. రూ.22 లక్షలతో నిర్మించిన ఇంటి తాళాలను లారెన్స్ మృతుడు యోగేశ్వరన్ కుటుంబసభ్యులకు అప్పగించాడు. నేను చేసింది సాయం కాదు, ఇది నా బాధ్యత అని లారెన్స్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటుకుంటున్న లారెన్స్ ఈ నిర్ణయంతో అభిమానుల మనసును మరోసారి గెలుచుకున్నారు. -
జల్లికట్టు..పెటా పట్టు
జల్లికట్టు క్రీడకు మార్గం సుగమం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’(పెటా) వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్బెంచ్కు శుక్రవారం పిటిషన్‌ను బదలాయించింది. జల్లికట్టుపై నిషేధం తీసుకురావాలని పెటా పట్టుదలతో పోరాడుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జంతు సంక్షేమ సంరక్షణ చట్టం పరిధిలోని జంతువుల జాబితాలో ఉన్న ఎద్దులను ఆ జాబితా నుంచి కేంద్రం తొలగించడంతో రాష్ట్రంలో జల్లికట్టు క్రీడ యథావిధిగా సాగుతోంది. అయితే తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషేధం విధించాలని జంతు సంక్షేమ సంఘం గతంలో ఒక పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు ముగిసిన తరువాత 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషే«ధం విధించింది. తమిళనాడు ప్రజల ఆచార, వ్యవహరాల్లోనూ, ప్రాచీన సంప్రదాయక్రీడైన జల్లికట్టులోనూ జోక్యం తగదని నినాదాలు చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ 2017 జనవరి 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. చెన్నై మెరీనా తీరంలో విద్యార్థులు, యువజనులు లక్షలాదిగా తరలివచ్చి నిరవధిక ఆందోళనకు దిగారు. పిల్లలు పెద్దలు, యువతీ యువకులు మెరీనాతీరం చేరుకున్నారు. జల్లికట్టు ఉద్యమంలో ఆందోళనకారులు ఉడుంపట్టు మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించి తనవైపునకు తిప్పుకుంది. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అదే ఏడాది జనవరి 20వ తేదీన జల్లికట్టుపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రగవర్నర్‌కు అందజేశారు. గవర్నర్ సదరు ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ఆమోదానికి పంపడం వెంటనే ఆమోద ముద్ర పడడం చకచకా జరిగిపోయాయి. దీంతో 22వ తేదీన మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు క్రీడలు ఉత్సాహంగా సాగాయి. ఆనాటి నుంచి రాష్ట్రంలో పొంగల్ పండుగల దినాల్లో జల్లికట్టు క్రీడలు యథావిధిగా జరుగుతున్నాయి. అయితే పన్నీర్‌సెల్వం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను పెటా తీవ్రంగా గర్హిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై బదులివ్వాల్సిందిగా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వం వివరణతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ కేసు న్యాయమూర్తి రోహింగ్టన్ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది. జల్లికట్టుపై మధ్యంతర నిషేధం విధించలేమని, అయితే ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్‌కు బదలాయిస్తున్నట్లు న్యాయమూర్తి రోహింగ్టన్ తెలిపారు. -
చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం
-
నన్యాలలో జల్లికట్టు.. ఒకరు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలం నన్యాలలో జరగుతున్న జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. ఎద్దు ఒకటి జనంలోకి వచ్చి కుమ్మడంతో కుప్పంలోని చందం ఎస్ సీ కాలనీకి చెందిన గుణశేఖర్(22) మృతిచెందారు. గుణశేఖర్ జల్లికట్టు వీక్షించడానికి చందం ఎస్సీకాలనీ నుంచి నన్యాల వచ్చారు. -
కోలాహలంగా జల్లికట్టు..
సాక్షి, సేలం: తమిళ సాంప్రదాయ క్రీడ జల్లికట్టును సేలంలో బుధవారం వేడుకగా నిర్వహించారు. రంకెలేస్తూ పరుగులు తీసిన ఎద్దులను అణచివేసి యువకులు తమ వీరత్వాన్ని చాటుకున్నారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపం కూలమేడులో ఏటా పొంగల్ సందర్భంగా జల్లికట్టు నిర్వహిస్తారు. ఈ ఏడాది బుధవారం జల్లికట్టు వేడుకగా జరిగింది. ఇందుకు జిల్లా నిర్వాహకం అన్ని ఏర్పాట్లు చేసింది. ముందస్తు చర్యలు: ముందస్తు చర్యగా జల్లికట్టులో పాల్గొనే యువకులకు శారీరక దృఢత్వ సర్టిఫికేట్లను అందజేశారు. పదునుగా ఉన్న జల్లికట్టు ఎద్దుల కొమ్ములను పశువైద్యులు మందంగా తయారు చేశారు. కూలమేడులో జల్లికట్టు జరిగే ప్రాంతంలో అంబులెన్స్, 15 మంది వైద్యులు, సిబ్బందితో వైద్య సేవలను ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజన్ అధ్యక్షతన 500 మందికి పైగా పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొన్నారు. ప్రారంభించిన కలెక్టర్: జల్లికట్టు సందర్భంగా సుప్రీంకోర్టు సూచనలను తప్పక పాటిస్తామంటూ జల్లికట్టులో పాల్గొన్న యువకులచే కలెక్టర్ రోహిణీ బాజీ బగారే ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఆమె పచ్చజెండా ఊపి జల్లికట్టును ప్రారంభించారు. ఈ పోటీలో 450ఎద్దులు వాడివాసల్ నుంచి బయటకు దూసుకొని రాగా, 300మంది వీరులు ఎద్దులను ఎదురొడ్డి, కొమ్ములు పట్టి అణచి వేసి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. ఈ పోటీలు మూడు విభాగాలుగా నిర్వహించారు. గెలుపొందిన వీరులకు, ఎద్దుల యజమానులకు సర్టిఫికేట్లు, బహుమతులను అందజేశారు. ఈ పోటీలో 40 మంది యువకులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని సేలం జీహెచ్‌కు తరలించారు. -
రంకెలేసి.. ప్రాణం తీసి
తమిళనాడు ప్రజలకు ప్రీతిపాత్రమైన జల్లికట్టులో అపశుృతి చోటుచేసుకుంది. ఎద్దులదాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలో జల్లికట్టు ఉత్సాహంగా సాగుతోంది. అలంగానల్లూరులో జల్లికట్టును సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలూ, వడలూ పాయసాలు కంటే జల్లికట్టు క్రీడలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అసలు జల్లికట్టు కోసమే ఎదురుచూస్తుంటారు. జల్లికట్టు కోసమే బాగా బలిష్టంగా పెంచుతున్న ఎద్దును క్రీడావలయంలోకి వదలడం, ఆవి రెచ్చిపోతూ పరుగులు పెడుతుంటే వాటిని అణిచి అదుపుతోకి తీసుకున్న యువకులను విజేతలుగా ప్రకటిస్తారు. చూపరులకు అత్యంత ప్రమాదకరంగా కనపడే ఈ క్రీడలో పాల్గొనేందుకు తమిళనాడు యువకులు ఏ మాత్రం భయం లేకుండా ఉత్సాహం చూపుతారు. అయితే జల్లికట్టుకు వినియోగించే ఎద్దులకు మద్యం తాగిస్తారని, రెచ్చగొట్టేందుకు మరెన్నో చేస్తారని ప్రచారం ఉంది. అలాగే ఎద్దులను అదుపుచేసే క్రమంలో వాటిని హింసిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు, జంతుప్రేమికులు కోర్టుకెక్కారు. జల్లికట్టు క్రీడ ముసుగులో జంతువులను హింసిస్తున్నారంటూ ‘పీపుల్స్ ఫర్ ది ఎతికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) లేవనెత్తిన అభ్యంతరం మేరకు సుప్రీం కోర్టు రెండేళ్ల క్రితం నిషేధం విధించింది. జల్లికట్టు క్రీడపై నిషేధం విధించడాన్ని రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోయారు. జల్లికట్టు తమ ప్రాచీన సంప్రదాయ క్రీడగా అభివర్ణిస్తూ నిషేధం ఎత్తివేయాలంటూ గత ఏడాది ఆందోళన మొదలుపెట్టారు. చెన్నై మెరీనాబీచ్‌లో వేలాది ప్రజలు, యువతీ యువకులు, విద్యార్థ్ది సంఘాలు సంయుక్తంగా సాగించిన జల్లికట్టు పోరాటం యావత్‌దేశ దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచింది. పన్నీర్‌సెల్వం నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఆర్దినెన్స్ తేవడం, రాష్ట్రపతి ఆమోదించడంతో జల్లికట్టుపై నిషేధం తొలగిపోయింది. దీంతో గత ఏడాది జల్లికట్టును కోలాహలంగా జరుపుకున్నారు. ఇక ఈ ఏడాది విషయానికి వస్తే 14వ తేదీనే జల్లికట్టు క్రీడలు మదురై జిల్లా ఆవనియాపురంలో, 15వ తేదీ పాలమేడులో ప్రారంభమయ్యాయి. జల్లికట్టు క్రీడకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై జిల్లా అలంగానల్లూరులో క్రీడాపోటీలను ముఖ్యమంత్రి ఎడపాడి , ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మంగళవారం ప్రారంభించారు. జల్లికట్టు క్రీడను కాపాడుకోవడం మన కర్తవ్యమని ఎడపాడి పేర్కొనగా, జల్లికట్టు కోసం అలంగానల్లూరులో శాశ్వతమైన మైదానం ఏర్పాటుకు కృషి చేస్తామని పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు. విజేతలకు కారు, బంగారు నాణేలు రూ. కోటి విలువైన ఆకర్షిణీయమైన బహుమతులు ప్రకటించారు. ఎవ్వరూ అదుపు చేయలేని ఎద్దుల యజమానులకు సైతం బహుమతులు అందజేశారు. 1,241 మంది జల్లికట్టు వీరులు, 1060 ఎద్దులతో నిర్వహించిన అలంగానల్లూరు జల్లికట్టు క్రీడలను వీక్షించేందుకు ఎప్పటి వలే పెద్ద సంఖ్యలో విదేశీయులు సైతం వచ్చారు. కొన్ని ఎద్దులకు రాష్ట్ర మంత్రుల పేర్లు పెట్టి బరిలోకి దింపడం విశేషం. అరియలూరు జిల్లా జయంకోటై్ట పుదుచ్చావడి గ్రామంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జల్లికట్టు నిర్వహించారు. కోర్టు నిబంధనల ప్రకారం జల్లికట్టుకు ఎంపిక చేసిన మైదానం విస్తీర్ణం సరిపోదు, సమీపంలో నివాసగృహాలు ఉన్నాయనే కారణాలతో జిల్లా కలెక్టర్, ప్రజాపనుల శాఖ అధికారులు సోమవారం రాత్రి అనుమతి నిరాకరించారు. అయితే అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులు మంగళవారం యథావిధిగా జల్లికట్టు నిర్వహించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 14నే ప్రారంభమైన మరణ మృదంగం: తమిళులు పొంగల్ అని పిలుచుకునే సంక్రాంతి పండుగ రోజుల్లో జల్లికట్టును జరుపుకుంటారు. ఈనెల 14వ తేదీన మదురై జిల్లా అవనియాపురంలో జల్లికట్టు క్రీడలు నిర్వహించగా ఆరుగురు జల్లికట్టు వీరులు, 22 మంది వీక్షకులు గాయపడ్డారు. ఈనెల15వ తేదీన పాలమేడులో రెండోరోజు జల్లికట్టు పోటీలు జరుగగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న ఎమకలాపురానికి చెందిన కాలిముత్తు(19)ను ఎద్దు పొడవడంతో మరణించాడు. అలాగే తిరుచ్చిరాపల్లి మనకోటై్టలో మంగళవారం జరిగిన జల్లికట్టులో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న సోలైపాండి (26) అనే వ్యక్తి ఎద్దు పొడిచి ప్రాణాలు కోల్పోయాడు. శివగంగై జిల్లా శిరవయల్ గ్రామంలో మంజువిరాట్ పోటీలు మంగళవారం జరిగాయి. ఈపోటీలో భాగంగా ఎద్దులు, ఆవులను పెద్ద సంఖ్యలో ఒకేసారి వదులుతారు. ఈ పశువులు ఉరకలేస్తూ పరుగులుపెడుతూ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. దీంతో రామనాథన్ (38), కాశీ (25) అనే ఇద్దరు మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
మహిళలకు జల్లికట్టు
సేలం: నామక్కల్ జిల్లా, తిరుచెంగోడు ఇలంజర్ మండ్రం ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా మహిళలు, పిల్లలకు కోడి పందెం(మహిళల జల్లికట్టు) పోటీని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తిరుచెం గోడులోని నందవనం వీధిలో ఈ పోటీ నిర్వహించారు. ఇందులో ఒక వృత్తంలో ఒక కోడి పుంజు కాలిని ..మహిళ కాలిని తాడుతో కట్టి ఉంచుతారు. మహిళ కళ్లకు గంతలు కడతారు. ఆ మహిళ నిమిషంలోపు ఆ కోడి పుంజును పట్టుకోవాలి. ఈ పోటీల్లో విజేతలకు ఆసక్తికరమైన బహుమతులు అందజేశారు.ఈపోటీని మహిళల జల్లికట్టుగా పిలుస్తుండడం విశేషం. రెక్లా రేసు.. నామక్కల్ జిల్లా, తిరుచెంగోడులోని సీహెచ్‌పీ కాలనీ, కొల్లపట్టి, కరట్టుపాళయం సానార్ పాళయం కమిటీల ఆధ్వర్యంలో పొంగల్ సందర్భంగా రెక్లా(గుర్రాల)పోటీలు నిర్వహించారు. పోటీల్లో సేలం, ఈ రోడ్, కోవై, తిరుచ్చి జిల్లాలకు చెందిన 42 గుర్రాలు పోటీ పడ్డాయి. ఇందులో ఏడు కి.మీ దూరం పందెం, 44 ఇంచుల ఎత్తు గుర్రాలు, పెద్ద గుర్రాలు, చిన్న గుర్రాలు వంటి నాలుగు విభాగాల పోటీల్లో యువకులు పాల్గొన్నారు. లండన్‌కు చెందిన యోగా శిక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. -
తమిళనాడులో జోరుగా సంప్రదాయ క్రీడ
-
పట్టురా.. పట్టు.. జల్లికట్టు..!
సాక్షి, చెన్నై: సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ జోరుగా సాగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తమిళులు జల్లికట్టును జోరుగా నిర్వహించారు. జల్లికట్టు ఎద్దులు హింసకు గురి అవుతున్నాయని జంతుప్రేమికులు గగ్గోలు పెట్టడంతో గతంలో సుప్రీంకోర్టు ఈ క్రీడపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఆంక్షలులేని వాతావరణం ఉండటంతో తమిళులు రెట్టించిన ఉత్సాహంతో జల్లికట్టు ఆటలో పాల్గొన్నారు. కోడెద్దులను మైదానంలోకి వదిలి.. వాటిని అదుపుచేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటనల్లో పలుచోట్ల హింస కూడా చోటుచేసుకుంది. పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం మదురై జిల్లాలోని అలంగనల్లూరులో మంగళవారం జరిగిన జల్లికట్టు క్రీడలో సీఎం ఎడపాటి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. జల్లికట్టు కోసం ముస్తాబు చేసిన ఎద్దులకు మొక్కి వారు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ అట్టహాసంగా జరిగిన జల్లికట్టు క్రీడకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. అపశృతి.. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్ కలెక్షన్ పాయింట్ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు. -
జల్లికట్టు అదిరింది!
-
జల్లికట్టులో యువకుడు మృతి
పలమేడు: తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్ కలెక్షన్ పాయింట్ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు. -
జల్లికట్టు పోటీల్లో విషాదం ఒకరు మృతి
-
దూసుకొస్తున్న ఎద్దులు.. యువకుల ఢీ.. ‘జల్లి’ షురూ
సాక్షి, చెన్నై : సంక్రాంతి పర్వదినం ఇటు తెలుగు ప్రాంతానికి కోడి పందాలను తీసుకురాగా అటు తమిళ రాష్ట్రానికి జల్లికట్టు తీసుకొచ్చింది. తమిళనాడులోని మధురైలోగల అవనీయపురంలో జల్లికట్టు ప్రారంభమైంది. దాదాపు 200 ఎద్దులను రంగంలోకి దించారు. రంకెలేస్తూ పరుగులు తీస్తూ దూసుకొస్తున్న ఎద్దులకు ఎదురెళ్లి వాటిని లొంగదీసేందుకు యువకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జల్లికట్టు అంటే తమిళనాడు ప్రజలకు ప్రాణం అనే విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ క్రీడ నిర్వహణపై సుప్రీంకోర్టులో వివాదం నడుస్తుండగా ప్రత్యేక అనుమతులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడను నిర్వహించింది. తాజగా, ఎలాంటి నిషేధాజ్ఞలు లెక్కచేయకుండానే తమిళనాడులోని పలు గ్రామాల్లో జల్లికట్టును ప్రారంభించేశారు. అనధికారికంగా పలువురు నాయకులు వీటిని ప్రారంభిస్తున్నారు. ఇక, తెలుగు ప్రాంతాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జల్లికట్లును ప్రారంభించారు. -
గ్రామాల్లో మొదలైన జల్లికట్టు సందడి
-
దామరకుప్పంలో జల్లికట్టు జోష్
సాక్షి, వెదురుకుప్పం : కుర్రకారు హుషారు...ఉరకలేసిన కోడె గిత్తలు...అరుపులు కేకలతో జనం చప్పట్లు... ...జన ప్రవాహాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయిన ఎడ్లు... ఇదీ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దామరకుప్పం గ్రామంలో సోమవారం జరిగిన ఎడ్ల పందేలు హోరెత్తించిన తీరు. సై అంటే సై అన్నట్లు ఉత్సాహభరితంగా సాగిన జల్లికట్టు యువతలో నూతన జోష్ ను నింపింది. హోరాహోరీగా సాగిన పరుష పందేలతో సంక్రాంత్రి సంబరాలు మొదలయ్యాయి. యువత ఆధ్వర్యంలో పరుష పందేలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా పచ్చికాపల్లం, ఎర్రమరాజుపల్లె, కొమరగుంట పరిసర గ్రామాలతో పాటు మండలంలోని నలుమూలల నుంచి యువకులు పెద్దఎత్తున పరుష పందేనికి హాజరయ్యారు. ఇందులో భాగంగా పశువులకు పలకలు కట్టి జనంపైకి వదిలారు. కోడె గిత్తలు రంకెలేసుకుంటూ జన ప్రవాహాన్నిచీల్చుకుంటూ యువతకు చిక్కకుండా పరుగులు తీశాయి. ఉరకలేస్తూ దూసుకుపోయిన కోడె గిత్తలను నిలువరించేందుకు ఉత్సాహంతో యువత సకల ప్రయత్నాలు చేశారు. కొన్ని ఎడ్లు యువత చేతిలో చిక్కుకున్నా పౌరుషం గల పశువులు యువత హుషారును లెక్కచేయకుండా దూసుకెళ్లాయి. పశువుల జోరుకూ యువత హుషారుకు మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పశువులదే పైచేయిగా నిలిచింది. ఎడ్ల దూకుడుకు జనం బెంబేలెత్తి పోయారు. ఎడ్ల వేగాన్ని నిరోధించే క్రమంలో కింద పడి కొందరు గాయాలపాలయ్యారు. నువ్వా..నేనా..! సోమవారం దామరకుప్పం గ్రామంలో జరిగిన జల్లికట్టు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఉదయం 10 గంటలకే చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో యువత గ్రామానికి చేరుకున్నారు. అంతకు ముందే ఎడ్లకు పలకలు, బెలూన్లు, స్వామి వారి చిత్రాలు అతికించి తయారు చేసిన పలకలతో సిద్ధం చేశారు. ఈక్రమంలో యువత అల్లి వద్ద పలకల కోసం నిలబడ్డ క్రమంలో నిర్వాహకులు ఎడ్లను పరుగు పందేనికి ఉసిగొల్పారు. దీంతో కోడెగిత్తలు రంకెలేసుకుంటూ పరుగులు తీశాయి. కోడెగిత్తలు ద్విచక్రవాహనాలపై దూసుకుపోవడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి మిద్దెల పై నుంచీ పశువుల పందేలను ఆసక్తికరంగా తిలకించారు. -
అమ్మాయిల మెప్పు కోసం జల్లికట్టు ..
సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండడంతో సాహస క్రీడ జల్లికట్టుకు ఇప్పటినుంచే దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు. రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులుదిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈసారి మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రతా ఆంక్షల మధ్య సాగనుంది. ఆమేరకు అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) కార్యాచరణ రూపొందిస్తోంది. ఏ ఒక్క ఎద్దు హింసకు గురికాకుండా. ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు నిబంధనల రూపకల్పన చేస్తోంది. అతి నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడలను నిర్వహించేందుకు ఏడబ్ల్యూబీఐ ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, చెన్నై: ‘ముత్యాల ముగ్గులు, రంగ వల్లులు, గొబ్బెమ్మలు.. బోగి మంటలు, పొంగళ్లతో ఇంటిల్లి పాది సంబరాలు’ ఇది సంక్రాంతి సందడి. అయితే, తమిళనాట ఈ సంబరాలకు తోడుగా వీరత్వాన్ని చాటే సాహస క్రీడ జల్లికట్టుకు పెద్ద పీట వేయడం ఆనవాయితీ. రంకెలు వేసే బసవన్నల పొగరును అణచివేస్తూ, తమ పౌరుషాన్ని చాటుకునే క్రీడాకారులతో ఈ క్రీడ సాగుతుంది. అయితే, ఈ సారి ఈ జల్లికట్టు మరింత కట్టుదిట్టమైన నిబంధనలు, భద్రత ఆంక్షల మధ్య సాగనుంది. ఇందుకు తగ్గ కార్యాచరణను అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియ (ఏడబ్ల్యూబీఐ) రూపొందిస్తున్నది. రాష్ట్రంలో సాహస, సంప్రదాయ క్రీడగా జల్లికట్టు పేరుగడించింది. ఈ క్రీడ ఎప్పటి నుంచి సాగుతోందో అన్నది ఓ ప్రశ్నగానే మిగిలింది. ఒకప్పుడు తమకు నచ్చిన వారిని వరుడుగా ఎంపిక చేసుకునేందుకు ఈ క్రీడను యువతులు వేదికగా చేసుకున్నట్టు చరిత్ర చేబుతోంది. అప్పటి నుంచి సంప్రదాయబద్ధంగా సాగుతూ వస్తున్న ఈ క్రీడను మంజు విరాట్, వడి మంజువిరాట్, వెల్లి విరాట్, వడం విరాట్ పేర్లతోనూ పిలుస్తుంటారు. ‘‘సల్లి కాసు–కట్టు, సల్టికాసు కట్టుగా, సల్లికట్టుగా ...చివరకు జల్లికట్టుగా’ ఈ సాహస క్రీడ రూపాంతరం చెందినట్టుగా పురాణాలు చెబుతుంటాయి. తొలి నాళ్లల్లో యువతుల్ని మెప్పించేందుకు యువకులు సాహసాన్ని ప్రదర్శిస్తే, రాను రాను ఇదో రాక్షసక్రీడగా మారిందని చెప్పవచ్చు. సంక్రాంతి సందర్భంగా కనుమనాడు ఆరంభం అయ్యే ఈ క్రీడ ఒకప్పుడు ఆరు నెలల పాటు వివిధ జిల్లాల వారీగా జరిగేది. ఒక్కో జిల్లాల్లో ఈ క్రీడ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న యువకులు ఉన్నారు. తమ వీరత్వాన్ని చాటుకునేందుకు కదన రంగంలోకి దుకే వారు కొందరు అయితే, ఆకర్షణీయమైన బహుమతుల్ని తన్నుకెళ్లేందుకు దూసుకొచ్చే వారు మరి కొందరు. ఈ క్రమంలో కదన రంగంలోకి దిగే ఎద్దులను హింసించడం పెరిగింది. తప్పించుకునే క్రమంలో క్రీడా కారులపై తమ ప్రతాపాన్ని ఎద్దులు చూపించడం, వాటి దాటికి బలైన వారెందరో ఉన్నారు. అలాగే, కదనరంగంలో దిగే బసవన్నలు రంకెలు వేసే విధంగా వాటికి మద్యం, సారా వంటివి పట్టిస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జంతు ప్రేమికులు రంగంలోకి దిగడం వ్యవహారం కోర్టుకు చేరింది. దీంతో జల్లికట్టుకు దూరంగా రెండేళ్లు గడపాల్సిన పరిస్థితి. కోర్టు స్టే విధించడంతో జల్లికట్టు ఇకలేనట్టే అన్న పరిస్థితి తప్పలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది ఆరంభంలో దేశమే తమిళనాడు వైపుగా చూసే స్థాయిలో సాగిన ఉద్యమంతో మళ్లీ జల్లికట్టు తమిళుల సొంతం అయింది. జల్లికట్టు కట్టుదిట్టం: గట్టి భద్రత నడుమ ఈ సారి జల్లికట్టును జరుపనున్నారు. అయినా, జల్లికట్టుకు నిషేధం లక్ష్యంగా పీట తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ సంక్రాంతి పర్వదినం వేళ సమీపిస్తుండడంతో ఇప్పటి నుంచే సాహస క్రీడ జల్లికట్టుకు దక్షిణాదిలోని గ్రామాలు సిద్ధం అవుతున్నాయి. ఎవరికీ పట్టుబడని రీతిలో, ఎవరైనా దూసుకొస్తే, వారిని ఎదుర్కొనే విధంగా ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే పనిలో రైతులు నిమగ్నం అవుతున్నారు. ఇప్పటి నుంచి వాటికి మంచి ఆహారంతో పాటు, శిక్షణ మెళకువల్ని ఇస్తూ గెలుపు బావుటాకు వాటి యజమానులు సిద్ధం అవుంటే, రంకెలేసే ఎద్దులకు ముక్కుతాడు వేయడానికి క్రీడాకారులు తమ మెళకువలకు మెరుగులు దిద్దేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో మళ్లీ జల్లికట్టు వివాదంలోకి ఇరుక్కోని రీతిలో ఈ సారి మరింత కట్టుదిట్టంగా నిబంధనల అమలు మీద ఏడబ్ల్యూబీఐ దృష్టి పెట్టింది. ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఆర్ గుప్తా ప్రధానంగా జల్లికట్టుకు కొత్త ఆంక్షలు, నిబంధనల రూపకల్పన మీద దృష్టి పెట్టారు. ఏ ఒక్క ఎద్దు హింసించ బడకుండా ఉండే రీతిలో, ఏ క్రీడాకారుడు గాయపడకుండా ఉండేందుకు తగ్గట్టుగా ఈ సారి నిబంధనల రూపకల్పన సాగనుంది. అతిపెద్ద మైదానం, భారీ భద్రతతో, సందర్శకుల భద్రత నిమిత్తం ప్రత్యేక గ్యాలరీలతో పాటుగా అన్ని రకాల నిబంధనల్ని జిల్లా యంత్రాంగాల ద్వారా సక్రమంగా అమలు చేయించి, క్రీడల్ని నిర్వహించే విధంగా ముందుకు సాగునున్నారు. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త నిబంధనలు నివేదిక రూపంలో చేరనుంది. ఆ తదుపరి నిర్వాహకులు, క్రీడాకారులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్యాచరణతో ఈ సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టును విజయవంతం చేయబోతున్నారు. -
జనవరిలో జల్లికట్టు ప్రీమియర్ లీగ్
సాక్షి, చెన్నై : ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రీఎంట్రీతో తెగ సంబరపడుతున్న తమిళవాసులకు మరో సూపర్ లీగ్ సందడి చేయనుంది. తమిళనాడులోని సంప్రదాయ క్రీడైన జల్లికట్టు ప్రీమియర్ లీగ్ వచ్చే జనవరి 7 నుంచి ప్రారంభంకానుంది. ఈ లీగ్‌ను తమిళనాడు జల్లికట్టు పెరవై, చెన్నై జల్లికట్టు అమైప్ప సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ పోటీలు సంక్రాంతికి ముందు జనవరి 7 నుంచి ఈస్ట్‌కోస్ట్ రోడ్లో జరగనున్నాయి. అయితే ఈ ప్రీమియర్ లీగ్ నిర్వహణ గురించి జల్లికట్టుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జంతుహక్కుల సంఘాలు ఇంకా స్పందించలేదు. పెటా పిటిషన్‌తో మార్చి 7, 2014న సుప్రీంకోర్టు ఈ ఆటలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమిళనాడు ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. వారికి సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో దిగివచ్చిన కేంద్రం1960 చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. -
తమిళనాడులో మళ్లీ జల్లికట్టు జగడం
-
కేంద్రం సవరణ.. జల్లికట్టుపై మళ్లీ టెన్షన్!
సాక్షి, చెన్నై : జల్లికట్టు ఆటపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 1960 యానిమల్స్ యాక్ట్‌ను సవరించటంతో వచ్చే సంక్రాంతికి ఈ పోటీల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు వెల్లడించింది. కేంద్ర సవరణతో ఒక్క జల్లికట్టు మాత్రమే కాదు.. రెక్లా(ఎండ్ల బండ్ల పోటీలు) కూడా నిర్వహించుకోవచ్చని అడ్వొకేట్ జనరల్ విజయ్ నారాయణ్ డివిజన్ బెంచ్‌కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే (వచ్చే నెల 7న తేదీ ఆ ప్రాంతంలో) నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. పెటా పిటిషన్‌తో మార్చి 7, 2014న సుప్రీంకోర్టు ఈ ఆటలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమిళనాడు ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులతో మెరీనా బీచ్ నిండిపోయింది. వారికి సినీ పరిశ్రమ మద్దతు లభించింది. చట్ట సవరణ తీసుకురావాలంటూ ఏకంగా నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఆందోళన తీవ్రం కావడంతో కేంద్రం దిగివచ్చింది. 1960 చట్టాన్ని సవరిస్తూ జల్లికట్టుకు అనుమతి ఇచ్చింది. కేంద్రం నిర్ణయంతో జల్లికట్టు నిర్వాహకుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. జంతు ప్రేమికులు మాత్రం మండిపడుతున్నారు. కేంద్రం తీరుపై జంతు పరిరక్షణ సంఘం పెటా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ఆఫ్రికా అడవుల్లో జల్లికట్టు
తమిళసినిమా: జల్లికట్టు చిత్రం ఆఫ్రికా అడవుల్లో రూపొందుతోంది. అక్కడ కెన్యాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్ర యూనిట్ ఎంతో వ్యయప్రాయాసాలకోర్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెన్యా ప్రాంతంలోని పళాగుడగళ్ అనే అడవిలో నివసించే మసాయ్మార అనే గ్రామంలోని అటవీ వాసుల జీవన విధానాన్ని జల్లికట్టులో ఆవిష్కరిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ ఆధునిక యుగంలో కూడా ఆ మసాయ్మార గ్రామంలో ప్రాచీన జీవన విధానాన్నే అక్కడి ప్రజలు అనుసరిస్తున్నారని, గత జనవరిలో మెరీనా తీరంలో జల్లికట్టు పోరాటంలో యువత విజయం సాధించిన విషయం తెలిసిందేనని, అయితే ఇక్కడ జల్లికట్టు పోటీల ఎద్దులకు, మసాయ్మార అడవుల్లోని ఎద్దులకు ఒక పోలిక ఉంటుందని చెప్పారు. నవ దర్శకుడు సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమెరికాలో నివశిస్తున్న ప్రవాస భారతీయులు అహింస పతాకంపై గణపతి మురుగేశన్, జయపాల్ నటేశన్, సింగపూర్‌కు చెందిన గురుశరవణన్లతో కలిసి నిరుపమ నిర్మిస్తున్నారు. -
250 ఎద్దులు, 300 మంది యువకులు బరిలోకి..
సేలం(చెన్నై): రాష్ట్రంలో గత జనవరిలో జల్లికట్టుపై నిషేధం విధించిన సమయంలో నామక్కల్ జిల్లాలోని కుమారపాళయం ప్రాంత ప్రజలు 5వేల మందికి పైగా ఆరు రోజులపాటు ఆందోళనలు చేపట్టారు. తర్వాత కేంద్రప్రభుత్వం జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించింది. దీంతో జల్లికట్టు నిర్వహణకు అనుమతి లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కుమారపాళయంలో కూడా జల్లికట్టు నిర్వహణకు హైకోర్టులో అనుమతి పొంది, జిల్లా నిర్వాహకుల సమ్మతంతో శనివారం కుమారపాళయం సమీపంలో ఉన్న వళయాగనూర్ గ్రామంలో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను నామక్కల్ జిల్లా కలెక్టర్ మాయం ఆసియా అధ్యక్షత వహించారు. ఇందులో విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, సమాజ సంక్షేమ శాఖ మంత్రి సరోజ పాల్గొని జల్లికట్టు పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో దిండుగల్, మదురై, నామక్కల్, సేలం అంటూ చుట్టుపక్కల పలు ప్రాంతాలకు చెందిన 250 ఎద్దులు బరిలోకి దిగాయి. 300 మందికి యువకులు పాల్గొని సాహసోపేతంగా ఎద్దులను లొంగదీసుకున్నారు. గెలుపొందిన వీరులకు ఫోన్, టేబుల్, మిక్సీ, గ్రైండర్ వంటి పలు బహుమతులను అందజేశారు. యువకుల పట్టుకు చిక్కని ఎద్దుల యజమానులకు రూ. 10 వేలు బహుమతిగా అందజేశారు. ఎద్దులను పట్టిన వీరుల్లో ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. జల్లికట్టు పోటీల ప్రదర్శన కారణంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అన్నదాతకు ‘సుప్రీం’ అండ
మేం చేయాల్సిన పనుల్లో న్యాయవ్యవస్థ జోక్యం పెరిగిందని తరచుగా ప్రభు త్వాలు ఆరోపిస్తాయి. ఈమధ్య పార్లమెంటులో సైతం ఇలాంటి విమర్శలే వినిపిం చాయి. కానీ అక్కడికి కూతవేటు దూరంలో జంతర్‌మంతర్ దగ్గర దాదాపు నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్న తమిళనాడు రైతుల ఘోషను మళ్లీ సుప్రీంకోర్టే పట్టించుకోవాల్సివచ్చింది. వారి కోసం ఏమీ చేయలేరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సివచ్చింది. ఇంతవరకూ చేసిందేమిటో వచ్చే నెల 2లోగా వివరాలు దాఖలు చేయాలని న్యాయస్థానం కోరింది. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా గురువారం ధర్మాసనం వ్యక్తపరిచిన ఆవేదన గమనించదగ్గది. జల్లికట్టు నిషేధం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఎంత చురుగ్గా కదిలాయో, సుప్రీంకోర్టు ఉత్తర్వులను వమ్ము చేయడానికి ఎలా తాపత్రయపడ్డాయో అందరికీ తెలుసు. ఓట్లతో ముడిపడి ఉండే ఏ సమస్య విషయంలోనైనా ప్రభుత్వాలు చూపే ఆదుర్దా మిగిలిన అంశాల్లో గల్లంతుకావడమే మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం. తమిళనాడు ప్రభుత్వం సంగతలా ఉంచి బుధవారంతో ముగిసిన పార్లమెంటు సమావేశాలకు సైతం తమిళ రైతుల గోడు పట్టలేదు. చాన్నాళ్ల తర్వాత తొలిసారి అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ సమావేశాలు ఫలవంతంగా ముగిశాయని విశ్లేషకులు విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. కీలకమైన సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుతో సహా 21 బిల్లుల్ని పార్లమెంటు ఆమోదించింది. మరెన్నిటినో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై దౌర్జన్యం చేసిన తమ ఎంపీని విమానాల్లో ఎక్కనీయక పోవడంపై ఆగ్రహించిన శివసేన లోక్‌సభలో దాదాపు మళ్లీ అలాంటి పరిస్థితుల్నే సృష్టించి ఆ నిషేధాన్ని తొలగింపజేసుకుంది. కానీ తమిళనాడు రైతుల గోడు మాత్రం కంఠ శోషగానే మిగిలిపోయింది. వారి ఆందోళనపై తమకు సానుభూతి ఉన్నదని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్రం నుంచిగానీ, పార్లమెంటునుంచి గానీ రైతులకు హామీ లభించలేదు. వాస్తవం ఇలా ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలు ఎంత గొప్పగా జరిగి ఏం లాభమని తమిళ రైతులనుకుంటే అది వారి తప్పు కాదు. తమిళనాడులో మాత్రమే కాదు... దేశంలో ప్రతి రైతూ ఎంతటి దుర్భర స్థితిలో సాగు యజ్ఞాన్ని సాగిస్తున్నాడో పాలకులకు తెలియనిదేమీ కాదు. నానా టికీ పెరుగుతూ పోతున్న సాగు వ్యయం ఒకపక్క, అంతకంతకూ దిగజారుతున్న దిగుబడి ధరలు మరోపక్క రైతును కుంగదీస్తుంటే... పగబట్టినట్టు వ్యవహ రిస్తున్న ప్రకృతి వారిని ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో బ్యాంకులకు వేలకు వేలు బకాయిలు పడటం, వడ్డీతోసహా చెల్లించాలని తాఖీదులు రావడంతో దిక్కుతోచక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత నూటయాభై సంవ త్సరాల్లో కనీవినీ ఎరుగనంత స్థాయిలో అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ఆ ప్రాంతానికి ప్రాణప్రదమైన ఈశాన్య రుతుపవనాలు వరసగా మూడో ఏడాది కూడా రైతులను దగా చేశాయి. ఈశాన్య రుతు పవనాల వర్షపాతంలో 62 శాతం లోటున్నదంటే పరిస్థితులెలా ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు. నిజానికి 2012–13లో కూడా ఇలాంటి స్థితి వారికెదురైంది. కానీ అప్పట్లో మెట్టూరు డ్యాంనుంచి దాదాపు మూడు నెలలపాటు ప్రభుత్వం నీరందించడంవల్ల పంటల్ని రైతులు కాపాడుకోగలిగారు. కానీ ఈసారి ఆ డ్యాంలో సైతం నీరు తక్కువుంది. అటు సుప్రీంకోర్టు ఎన్నిసార్లు కర్ణాటక రాష్ట్రానికి ఆదేశాలిచ్చినా ఆ డ్యాంకు కావేరీ నదీజలాలు విడుదల కాలేదు. ఫలితంగా తమిళనాడులో కాల్వలు సైతం ఎండిపోయి పంట పొలాలకు చుక్క నీరు లేకుండా పోయింది. వేలకు వేలు అప్పు తెచ్చి తాము వేసిన పంటలు కళ్లముందు ఎండిపోతుంటే, పశువులు సైతం దాహార్తికి ప్రాణాలు విడు స్తుంటే నిస్సహాయులైన రైతులు ఏం చేయాలి? తమ గోడు ఎవరికీ పట్టడం లేదన్న ఆవేదనతో ఇప్పటివరకూ 50మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మొదటినుంచే వారు ఆందోళన బాటపట్టారు. చివరకు దేశ రాజధాని నగరంలో తమ గోడు వినిపిద్దామని జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కపాలాలను ప్రదర్శించారు. అర్ధనగ్నంగా ఊరేగింపు తీశారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద తమ గోడు వినిపించడం సాధ్య పడలేదన్న ఆగ్రహంతో చివరకు ప్రధాని కార్యాలయం ముందు బట్టలు విప్పు కుని నిరసన తెలిపారు. ఎన్ని చేసినా వారి ఆందోళన పాలకుల్ని తాకలేక పోయింది... ఎంత విషాదం! చిత్రమేమంటే, అసెంబ్లీ ఎన్నికలొచ్చిన ఉత్తర ప్రదేశ్‌లో రైతులకు అడగకపోయినా బీజేపీ పెద్ద మనసు చేసుకుని మేనిఫెస్టోలో రుణమాఫీ ప్రకటించింది. అందువల్ల ఆ పార్టీకి అక్కడ అధికారం దక్కింది. ఎన్నికలు ఇప్పట్లో లేని తమిళనాట సరిగ్గా అదే డిమాండ్‌తో అరచి గీపెట్టినా, ఢిల్లీ వీధులకెక్కినా ఫలితం లేకపోయింది. ఏమనాలి దీన్ని? రైతులు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. రుణమాఫీ చేయాలం టున్నారు. కావేరీ నదీజలాల బోర్డు ఏర్పాటు చేయమంటున్నారు. నదుల అను సంధానం అవసరమంటున్నారు. కొంత హెచ్చుతగ్గులతో దేశమంతా వ్యవ సాయ సంక్షోభం ఆవరించి ఉంది. అందరికీ అన్నం పెట్టే రైతన్న అర్థాకలితో బతు కీడుస్తున్నాడు. తన గోడు వినేవారు లేరని తల్లడిల్లుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన పాలకులు దాన్ని అరకొరగానే కానిచ్చారు. నిజానికిది ఎన్నికలతో ముడిపెట్టి ఆలోచించాల్సిన సమస్య కాదు. మొత్తంగా వ్యవసాయంపై పాలకుల ఆలోచనా సరళి మారితే తప్ప పరిష్కారం కానిది. కేవలం ఆ సమస్యపై కూలంకషంగా చర్చించడానికి పార్లమెంటు, అసెం బ్లీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ఏం చేస్తే సమస్యను అధిగమించ వచ్చునో గుర్తించాలి. నిర్దిష్టమైన కాలావధితో కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలి. దీన్ని అత్యవసర సమస్యగా పరిగణించి పరిష్కారానికి పూనుకోనట్ట యితే పరిస్థితి చేయి దాటుతుందని పాలకులు గ్రహిస్తారని ఆశిద్దాం. -
కమల్.. దారెటు?
► అభిమాన సంఘాల నేతలతో సుదీర్ఘ చర్చలు ► రాజకీయాల దిశగా అడుగులు! ► అదేమీ లేదన్న అభిమానులు సాక్షి ప్రతినిధి, చెన్నై: సకలకళావల్లవన్ కమల్‌హాసన్ ఇక రాజకీయాల్లో తన కళను ప్రదర్శించనున్నారా ? రాజకీయ పార్టీని స్థాపించడమో, మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడమో వంటి నిర్ణయం ద్వారా ప్రజాజీవితంలో కాలునిడనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఈ ప్రశ్నలపై జవా బులకు ఊతమిచ్చే విధంగా ఆది వారం తన అభిమాన సంఘాల నేతలతో కమల్‌హాసన్ సమావేశమై కలకలం సృష్టించారు. బహుభాషా నటుడు కమల్‌హాసన్ ఇటీవల తరచూ రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. జయలలిత మరణించిన తరువాత నుంచే కమల్ వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పుకనబడుతోంది. రాష్ట్రంలో ఉద్ధృతంగా సాగి దేశ ప్రజలను తనవైపునకు తిప్పుకున్న జల్లికట్టు ఉద్యమానికి మద్దతిస్తూ గట్టిగా స్పందించారు. అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ తరువాత పన్నీర్‌సెల్వం పదవీచ్యుతుడు కావడం, సీఎం అయ్యేందుకు శశికళ పావులు కదపడం, చిన్నమ్మ జైలు కెళ్లడం, ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడడం వంటి రాజకీయ పరిణామాల సమయాల్లో సైతం కమల్ తన వాదనను వినిపించారు. విశ్వరూపం సినిమా విడుదలను అడ్డుకుంటూ జరిగిన రాజకీయంపై విసుగుచెందిన కమల్‌హాసన్ దేశాన్ని విడిచి వెళ్లిపోతానని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. తమిళనాడులో నివసించేందుకే ఇష్టపడని కమల్ వైఖరిలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలపై, ప్రజాసమస్యలపై గతంలో ఎన్నడూ అంతగా స్పందించని కమల్‌హాసన్ అకస్మాత్తుగా తన ధోరణిని మార్చుకోవడం వెనుక బలమైన అంతరార్థం దాగి ఉందని అందరూ విశ్వసిస్తున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తనకు రాజకీయాలు తెలియవు, అందులోకి ప్రవేశించాలనే ఆలోచన కూడా లేదు, ప్రజల మేలుకోరుతూ కొన్ని విషయాలపై మాట్లాడుతున్నానని బదులిచ్చారు. కమల్ వ్యవహారశైలికి అనుగుణంగా విమర్శలు చేసిన నేరంపై ఆయన అభిమాని ఒకరు ఇటీవల కటకటాల పాలయ్యాడు. అభిమాని అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన కమల్‌హాసన్ ప్రజలు తనవైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. అభిమాన సంఘాలతో చర్చలు: ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ చెన్నై అళ్వార్‌పేట ఎల్డామ్స్ రోడ్డులోని తన కార్యాలయంలో అభిమాన సంఘాల నేతలతో ఆదివారం సమావేశమై చర్చలు జరిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగిన సుదీర్ఘ చర్చల్లో కమల్‌హాసన్ సంక్షేమ సంఘం నిర్వాహకులు, సంఘానికి చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ కు సంఘం నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం. సంఘం కార్యకలాపాలను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు, రాజకీయాలను ప్రస్తావించలేదని ఒక అభిమాని తెలిపాడు. మీడియా ప్రతినిధులను కలుసుకునే ఆలోచన కూడా కమల్‌కు లేదని ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా కమల్ కార్యాలయం ముందు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఎద్దులు కుమ్మేశాయ్.. ప్రాణాలు తీసిన జల్లికట్టు
పుదుక్కొట్టాయ్: తమిళనాడులోని ఓ ప్రాంతంలో నిర్వహించిన జల్లికట్టు విషాదంగా మారింది. ఇందులో పాల్గొన్న వ్యక్తులను ఎద్దు కుమ్మేయడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 56మంది గాయాలపాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం తిరువప్పూర్ జిల్లాలో ఆదివారం నేపథ్యంలో ఆటవిడుపుగా జల్లికట్టు నిర్వహించారు. అదే సమయంలో ఇక్కడ ఉన్న ఆలయంలో ఉత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద మొత్తంలో చుట్టుపక్కల నుంచి జల్లికట్టును చూసేందుకు వచ్చారు. సరిగ్గా క్రీడను ప్రారంభించగా ఎద్దులను అదుపుచేసేందుకు ప్రయత్నించే క్రమంలో అవి తిరగబడ్డాయి. పాల్గొన్నవారితోపాటు చూస్తున్నవారిపైకి కూడా అవి లంఘించడంతో జనాలు బెంబేలెత్తిపోయారు. తొలుత గాయపడినవారిని ఆయా ఆస్పత్రులకు తరలించడంతోపాటు మొబైల్ అంబులెన్సుల్లో చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రాణాలుకోల్పోయారు. -
‘జల్లికట్టు’ యువత కొత్త పార్టీ
సాక్షి, చెన్నై: జల్లికట్టు ఉద్యమానికి నేతృత్వంవహించిన యువతలోని పలువరి ఆధ్వర్యంలో‘ నాదేశం...నాహక్కు’ పేరుతో తమిళనాడులో శనివారం కొత్త పార్టీ ఆవిర్భవించింది. రుంబాక్కంలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ పార్టీని ప్రకటించారు. ఇందులో కన్వీనర్లుగా ఎబినేజర్, సత్య, ప్రవీణ, సుకన్య, కార్తీ, స్వతంత్ర దేవి, ప్రకాష్, ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఈ పార్టీ జెండాను జాతీయ పతాకం తరహాలో రూపొందించారు. మధ్యలో సంకెళ్లు తెంచుకున్న యువకుడి చిత్రాన్ని పొందుపరిచారు. -
జల్లికట్టు తరహాలో నిరుద్యోగ ర్యాలీకి ప్లాన్!
హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీ-జేఏసీ) ఈ నెల 22న చేపట్టిన నిరుద్యోగ ర్యాలీని తమిళనాడు జల్లికట్టు తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు నిర్ణయించిందని పోలీస్ శాఖ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో సోమవారం ఉదయం నిరుద్యోగ ర్యాలీ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు పోలీస్ శాఖను ఆదేశించింది. ర్యాలీ నిరాకరణకు గల కారణాలను హైదరాబాద్ పోలీస్ శాఖ హైకోర్టుకు సమర్పించింది. ఆ నివేదకలో ఏం పేర్కొందంటే 'ఇప్పటికే జేఏసీపై 31 కేసులు ఉన్నాయి. ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశముందని ఇంటలిజెన్స్ రిపోర్ట్‌లో తేలింది. ఈ ర్యాలీ కోసం జేఏసీ చైర్మన్ కోదండరామ్ 31 జిల్లాల్లో 131 ప్రాంతాల్లో పర్యటించారు. ఒక్కో ప్రాంతం నుంచి వెయ్యి మందిని తరలించేందుకు ప్లాన్ చేశారు. జల్లికట్టు తరహాలో ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల గ్రేటర్ పరిధిలో అనుమతి ఇవ్వలేం. మరో చోట ర్యాలీ నిర్వహిస్తే అభ్యంతరం లేదు' అని తేల్చి చెప్పింది. హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
మద్దతు కాదు కృతజ్ఞతే!
పెరంబూర్: ఇప్పటి వరకూ నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా వార్తల్లో కనిపించిన రాఘవ లారెన్స్ తాజాగా రాజకీయాల్లో నానుతున్నారు. ఈ మధ్య తన వాళ్లకు ఇబ్బందులు ఏర్పడితే, అవసరం అయితే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన కలకలానికి ఆస్కారం కల్పించిన లారెన్స్ ఇటీవల ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంను కలవడంతో మరోసారి టాక్ ఆఫ్‌ది పాలిటిక్స్‌గా మారారు. తమిళనాట రాజకీయాలు గరం గరంగా సాగుతున్న సమయంలో పలువురు రాజకీయవాదులు, సినీ ప్రముఖులు పన్నీర్‌సెల్వంను కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు. నటుడు లారెన్స్ కూడా ఆయన్ని కలవడంతో మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లారెన్స్ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపలేదని, అసలు ఒక పార్టీకి మద్దతిచ్చే స్థాయి స్టార్ నటుడిని కానన్నారు. ఇంకా చెప్పాలంటే తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని అన్నారు. తాను జల్లికట్టు క్రీడ నిర్వహించే విషయం గురించి అడగ్గా ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వెంటనే అందుకు అనుమతించారని, అందుకు కృతజ్ఞతలు చెప్పడానికే ఆయన్ని కలిశానని తన ట్విట్టర్లో స్పష్టం చేశారు. -
‘కంబళ’ బిల్లు ఆమోదం
బెంగళూరు: సంప్రదాయ దున్నపోతుల పందెం (కంబళ), ఎడ్ల పందేలకు చట్టబద్ధ కల్పిస్తూ తెచ్చిన బిల్లును కర్ణాటక అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 1960నాటి జంతుహింస నిరోధక చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేసే విషయంలో సవరణలు ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలూ మద్దతు పలికాయి. జల్లికట్టు కోసం ఉద్యమించిన తమిళనాడు ప్రజల బాటలో కన్నడిగులు కూడా కంబళ కోసం ఆందోళన చేయడం తెలిసిందే. కంబళలో జంతుహింస లేదని, ప్రజల కోరిక మేరకు దీన్ని అనుమతిస్తున్నామని మంత్రి మంజు చెప్పారు. ఆర్డినెన్స్ బాట పట్టకుండా ఆటకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
విజయోత్సవం
► 18న కొవ్వొత్తులతో ప్రదర్శన ► నటుడు రాఘవ లారెన్స్ పిలుపు ► వీరోచితంగా అలంగానల్లూరు జల్లికట్టు టీనగర్: ఈనెల 18వ తేదీన జల్లికట్టు విజయోత్సవాలను జరుపుకునేందుకు నటుడు రాఘవ లారెన్స్ తమిళ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఇళ్ల ముందు కొవ్వొత్తులు, టార్చిలైట్లు వెలిగించి ప్రదర్శన నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఇలా తెలిపారు. తమిళుల సంప్రదాయక్రీడగా పేరొందిన జల్లికట్టుపై నిషేధం తొలగించడంతో ఈ ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకోవడానికి అందరికీ ఆసక్తిగా ఉందన్నారు. అలంగానల్లూరులో జల్లికట్టు పోటీని తిలకించేందుకు స్థానిక ప్రజల పిలుపుతో మెరీనా ఆందోళనలో పాల్గొన్న యువకులు 300 మందితో వెళ్లేందుకు నిర్ణయించామని, అనేక ఏళ్ల తర్వాత జరుగుతున్న ఉత్సవం కావడంతో జనరద్దీని దృష్టిలో ఉంచుకుని కేవలం నలభై మందితో అలంగానల్లూరు చేరుకున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల ఆహ్వానానికి కృతజ్ఞతలని తెలుపుకుంటున్నానని అన్నారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వీలుకానందున తనకు బాధ కలిగిందన్నారు. వారి అసంతప్తిని పోగొట్టే విధంగా ఈ జల్లికట్టు విజయోత్సవాన్ని ఫిబ్రవరి 18వ తేదీన జరుపుకుందామని తెలిపానని, అందుకు వారు సమ్మతించినట్లు తెలిపారు. ఈ సంతోషంలో ప్రజలందరూ పాల్గొనాలని నిర్ణయించామని, ఇందుకు వేదికగా మెరీనాబీచ్‌ను అనుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దష్ట్యా అది వీలుకాదని తెలిసినందున వేరొక చోట జరుపుకోనున్నట్లు తెలిపారు. ప్రపంచ తమిళులందరూ ఈ ఉత్సవాలను వారున్న ప్రాంతాల్లో జరుపుకునేందుకు పిలుపునిచ్చారు. కూలి కార్మికుల నుంచి సాంకేతిక సమాచార స్నేహితులతో కలిపి జల్లికట్టు కోసం గళం విప్పిన అందరూ ఈ విజయోత్సవాలలో భాగం పంచుకోవాలని కోరారు. అనుకున్నది సాధిస్తామని, సాధించిన దాన్ని చారిత్రక విజయంగా వేడుక చేసుకుందామన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన: ఈనెల 18వ తేదీన సాయింత్రం ఏడు గంటల నుంచి 7.15 గంటల వరకు ఎవరికీ ఎటువంటి అభ్యంతరం కలగని విధంగా ప్రపంచ తమిళులందరం కలిసి ఇళ్ల డాబాలపై లేదా ఇళ్ల ముంగిళ్లలో కొవ్వొత్తులు, లేదా సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి ప్రశాంతంగా వేడుకలు జరుపుకుందామన్నారు. వీరోచితంగా అలంగానల్లూరు జల్లికట్టు: నామక్కల్ సమీపంలోగల అలంగానల్లూరులో జల్లికట్టు పోటీలు ఆదివారం వీరోచితంగా జరిగాయి. ఇందులో 200లకు పైగా ఆంబోతులు రంకెలేస్తూ కదనరంగంలోకి దూకాయి. 150 మంది క్రీడాకారులు పాల్గొని ఆంబోతులను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ పోటీలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో జల్టికట్టు బందాలు ఏర్పాటయ్యాయి. ఈ బందాల్లో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ఎస్పీ, నామక్కల్ అసిస్టెంట్ కలెక్టర్ ఇతర అధికారులు ఉన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇలావుండగా పుదుచ్చేరి లాస్పేట్టై ఠాకూర్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం జల్లికట్టు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లా కలెక్టర్ సత్యేంద్ర సింగ్ ఇందుకు అనుమతి నిరాకరించారు. ఇలావుండగా అలంగానల్లూరు జల్లికట్టులో రంకెలేసిన ఎద్దులు, క్రీడాకారులను చూసి పరవశం చెందినట్లు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కార్యకర్తలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
అలంగనల్లూరులో జోరుగా జల్లికట్టు
21 మందికి తీవ్ర గాయాలు సాక్షి, చెన్నై: తమిళనాడు మదురై జిల్లా అలంగనల్లూరులో శుక్రవారం జల్లికట్టు జరిగింది. ఈ సందర్భంగా 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 60 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విజేతలకు కారు, బుల్లెట్ వాహనాలు, బహుమతులిచ్చారు. నిఘా నీడలో జల్లికట్టు: అలంగనల్లూరులో కట్టుదిట్టమైన ఆంక్షలు, నిఘా కెమెరాల కనుసన్నల్లో జల్లికట్టు జరిగింది. తేని, దిండుగల్, మదురై, శివగంౖగై, విరుదు నగర్, తిరుచ్చి, రామనాథపురం, తూత్తుకుడి, తంజావూరు, సేలం, నామక్కల్ జిల్లాల నుంచి ఆంబోతులను కదనరంగంలోకి దించారు. గెలిచిన ప్రతి క్రీడాకారుడికి, ఎద్దుకు బంగారు నాణెంతో బహుమతులిచ్చారు. జల్లికట్టును కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ , డీఎంకే నిర్వాహక కార్యదర్శి స్టాలిన్ వీక్షించారు. తాము అధికారంలోకి వచ్చాక జల్లికట్టును శాశ్వతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని స్టాలిన్ అన్నారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు వేదిక ఇదికాదని తిరస్కరించారు. -
జోరుగా రాజకీయపట్టు.. హుషారుగా జల్లికట్టు..
చెన్నై: తమిళనాట రాజకీయ పరిస్థితులు అటు మీడియా, ఇతర రాష్ట్రాల ప్రజలు, తమిళ పార్టీలకు మాత్రమే చెందిన కేడర్ వర్గాలు తప్ప అక్కడి సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఉత్కంఠను కలిగించడం లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం నీకా నాకా అంటూ శశికళ, పన్నీర్‌సెల్వం తగువులాడుకుంటుండా నిత్యం అమ్మా అమ్మా అంటూ కలవరించే కొంతమంది తమిళ తంబీలు మాత్రం ఏం చక్కా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటి వరకు కేంద్రంపై, సుప్రీంకోర్టుపై పోరాడి తెచ్చుకున్న తమ సాంప్రదాయ క్రీడ జల్లికట్టుతో సేద తీరుతున్నారు. వీరెవ్వరూ తమిళ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని ఈ ఆట జరుగుతున్న తీరు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. ‘సూపర్ సూపర్ సూపర్.. ఈ ఎద్దును ఎవరు బందించగలిగితే ఈ సిల్క్ చీర ఉచితం అంటూ గట్టిగా కేకలు.. 19 నుంచి 25 వయసుగలవారు రంకెలేస్తూ కొమ్ములు విసురుతూ దూసుకొస్తున్న నందులను అణిచివేసేందుకు వాటి వెనుక సవారీ చేస్తూ దూసుకెళుతున్నారు. జల్లికట్టుకు ప్రసిద్ధిగాంచిన మధురై, అలంగనల్లూర్ ప్రాంతాల్లో జల్లికట్టు జరుగుతోంది. ఇదే సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా జల్లికట్టు క్రీడను తొలుత ముఖ్యమంత్రి ప్రారంభించాలి. ఆ లెక్కన ప్రస్తుతం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం దానికి పచ్చజెండా ఊపాలి. అలాగే, ఆయా నియోజవర్గాల స్థాయిలో పలువురు ఎమ్మెల్యేలు ఈ క్రీడను ప్రారంభించి ప్రజలతో సరదాగా గడపడం ఆనవాయితీ. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఈసారి గతంలో ఎన్నడూ లేనిది మధురై జల్లికట్టుకు స్టాలిన్ హాజరై ప్రారంభించాడు. అలాగే, ఇంకొన్ని చోట్లకు కూడా స్టాలిన్ మాత్రమే వెళ్లాడు. దీంతో ప్రజలు ఇక అన్నాడీఎంకేను పక్కకు పెట్టి తమ ఆలోచనలు డీఎంకే వైపు మళ్లిస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే, పార్టీ గొడవ అయినందున వాళ్లే తేల్చుకుంటారని, ఆ గొడవతో తమకెందుకనే రీతిలో కూడా పోరాటాలు చేసే సామాన్య ప్రజానీకం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఏం చక్కా వాళ్లు జల్లికట్టుతో ఎంజాయ్ చేస్తున్నారు. సంబంధిత కథనాలు చదవండి.. (మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!) గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. శశికళ దిష్టి బొమ్మల దహనం శశికళ కాదు కుట్రకళ విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం! 'జయ వారసుడు' హీరో అజిత్ ఎక్కడ? శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్? పన్నీర్ సెల్వానికి అనూహ్య మద్దతు! -
బసవన్నల రంకెలు
► పాలమేడులో జల్లికట్టు సందడి ► నేడు అలంగా నల్లూరులో సాక్షి, చెన్నై : రంకెలేసే బసవన్నలు, వాటి పొగరు అణచి వేసే క్రీడాకారుల పౌరుషంతో సాహస క్రీడ జల్లికట్టు గురువారం పాలమేడులో జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మదురై జిల్లా అలంగానల్లూరులో శుక్రవారం కోలాహలంగా జల్లికట్టు సాగనుంది. ఇందుకుతగ్గ ఏర్పాట్లు సర్వం సిద్ధం అయ్యాయి. తమిళుల సంప్రదాయ, సహాస క్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టును పోరాడి మరీ దక్కించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టం, ఇందుకు రాష్ట్రపతి ఆమోదం వెరసి జల్లికట్టుపై విధించబడి ఉన్న అడ్డంకులన్నింటిని తొలగించాయి. మదురై జిల్లా అవనీయాపురం వేదికగా, రెండు రోజుల క్రితం జల్లికట్టుకు శ్రీకారం చుట్టారు. అవనీయాపురంలో ఏడు వందల ఎద్దులు రంకెలు వేస్తూ కదనరంగంలోకి దూసుకెళ్లాయి. అవనీయాపురం తదుపరి పాలమేడులో గురువారం జరిగిన జల్లికట్టు వీరత్వాన్ని చాటింది. ఉదయం ఆరున్నగర గంటలకే పెద్ద ఎత్తున జన సందోహం వాడి వాసల్‌కు తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కొమ్ములు తిరిగిన బసవన్నలు రంకెలేస్తూ రంగంలోకి దిగాయి. ముందుగా నమోదు చేసిన పశువులను మాత్రమే జల్లికట్టుకు అనుమతించారు. టోకెన్లు పొందిన క్రీడాకారులను మాత్రమే క్రీడా రంగంలోకి పంపించారు. ఎద్దులు జనం లోకి చొచ్చుకు వెళ్లకుండా, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు జల్లికట్టును ప్రారంభించారు. పాలమేడు గ్రా మంలోని మహాలింగ స్వామి మఠం వద్ద ఏర్పా టు చేసిన వాడివాసల్కు ప్రత్యేక పూజలు జరి గాయి. ఆలయంలో విశేష పూజల అనంతరం వాడి వాసల్ నుంచి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున రంగంలోకి ఎద్దులు దిగాయి. వాటి పొగరును అణచివేస్తూ క్రీడాకారులు తమ పౌరుషాన్ని చాటి బహుమతుల్ని తన్నుకెళ్లారు. గెలి చిన క్రీడాకారులకు సెల్‌ఫోన్ లు, బిందెలు, బీరు వా, మంచాలు, వాషింగ్ మిషన్లు, ఏసీ, ఫ్యాన్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, బుల్లెట్, బంగారు నాణేలతో పాటు ఆకర్షణీయమైన బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. 850 ఎద్దులు పాల మేడుకు తరలివచ్చాయి. ఇందులో అనేక ఎద్దు తు క్రీడకారుల చేతికి చిక్కకుండా తమ యజ మానులకు బహుమతుల్ని సాధించి పెట్టాయి. నేడు అలంగానల్లూరులో: జల్లికట్టు అంటే..అలంగా నల్లూరు అన్న విషయం తెలిసిందే. మదురైలో జల్లికట్టుకు ప్రసిద్ది చెందిన ఈ గ్రామంలో శుక్రవారం సాహస క్రీడకు సర్వం సిద్ధం అయిం ది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరు జల్లికట్టు వీక్షణకు వేలాదిగా దేశ విదేశాల నుంచి జనం తరలి వచ్చే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఇక్కడ సాహస క్రీడ రసవత్తరంగా సాగబోతోంది. ఇక్కడ పదిహేను వందల ఎద్దులు వాడివాసల్ నుంచి దూసుకురాబోతున్నాయి. విచారణ : జల్లికట్టుకు మద్దతుగా సాగిన ఉద్యమ అల్లర్లపై రిటైర్డ్ న్యాయమూర్తి రాజేశ్వరన్ గురువారం విచారణ చేపట్టారు. బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. -
మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు ప్రారంభం
-
కాలుదువ్వి.. రంకెలేసి..
► జల్లికట్టు జోష్.. ► పౌరుషాన్ని చాటిన క్రీడాకారులు ► 50 మందికి గాయాలు ► బహుమతులే..బహుమతులు ►అవనీయాపురం, నామక్కల్‌లలో పండుగ సందడి సాక్షి, చెన్నై: తమిళుల సాహసక్రీడ జల్లికట్టు ఆదివారం అవనీయాపురం, నామక్కల్‌లలో వీరత్వాన్ని చాటే రీతిలో సాగింది. రంకెలు కొట్టే బసవన్నల పొగరును అణచివేసే విధంగా తమ సాహసాన్ని ప్రదర్శించి బహుమతుల్ని తన్నుకెళ్లారు. కొన్ని ఎద్దులు క్రీడాకారుల చేతికి చిక్కకుండా తమ యజమానుల్ని విజేతలుగా నిలబెట్టాయి. తమిళుల సంప్రదాయ, సాహసక్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టును సంక్రాంతి పర్వదినాల్లో శతాబ్దాల తరబడి దక్షిణాది జిల్లాల్లో కోలాహలంగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అయితే, జంతు ప్రేమికులు కన్నెర్ర చేయడం, సుప్రీంకోర్టు తీర్పు వెరసి రెండేళ్లు జల్లికట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఏడాది కూడా సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టుకు దూరంగా ఉన్నా, విద్యార్థి ఉద్యమంతో జల్లికట్టుకు విధించిన నిషేధపు ముడులు తెగాయి. రాష్ట్రం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పడడంతో ఇక, జల్లికట్టులో రంకెలు వేస్తూ ఎద్దులు, క్రీడాకారులు వీరత్వాన్ని చాటుకునే పనిలో పడ్డారు. వీరత్వం చాటిన జల్లికట్టు : ప్రతి ఏటా మదురై జిల్లా అవనీయాపురంలో జరిగే అధికారిక జల్లికట్టుతో సాహస క్రీడకు శ్రీకారం చుడతారు. ఆ దిశగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే అవనీయాపురం జనసంద్రంలో మునిగింది. ఎటుచూసినా మదురై, శివగంగై, విరుదునగర్, దిండుగల్, తిరుచ్చి, ఈరోడ్, కరూర్, పుదుకోటై, తేని, తూత్తుకుడి, తంజావూరు జిల్లాల నుంచి వచ్చిన కొమ్ములు తిరిగిన బసవన్నలు బుసలు కొడుతూ కన్పించాయి. తొమ్మిది వందల రిజిస్ట్రేషన్లు రాగా, అందులో ఏడు వందల యాభై ఎద్దులను వైద్య తదితర పరీక్షల అనంతరం జల్లికట్టులో రంకెలు కొట్టేందుకు అనుమతి ఇచ్చారు. ముందుగా టోకెన్లు పొందిన క్రీడాకారులను మాత్రమే క్రీడారంగంలోకి అనుమతించారు. సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్, మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు జల్లికట్టును ప్రారంభించారు. తొలుత అవనీయాపురంలోన నాలుగు ఆలయాలకు చెందిన ఎద్దులను కదనరంగంలోకి దించారు. వీటి పొగరును అణచివేయడానికి క్రీడాకారులు తీవ్రంగానే ప్రయత్నించారు. తదుపరి ఒక్కో ఎద్దులను వాడి వాసల్ (జల్లికట్టు జరిగే ప్రవేశద్వారం) నుంచి వదలి పెట్టారు. భద్రత నడుమ: ఎద్దులు జనంలోకి చొచ్చుకు వెళ్లకుండా , ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. కోర్టు ఆగ్రహానికి గురి కాని రీతిలో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. ప్రారంభోత్సవ సమయంలో క్రీడాకారుల చేత నిబంధనల్ని తప్పనిసరిగా పాటించి తీరుతామని కలెక్టర్ వీరరాఘవులు ప్రతిజ్ఞ చేయించారు. భద్రత ఏర్పాట్ల నడుమ మధ్యాహ్నం వరకు జల్లికట్టు సాగగా, క్రీడా కారులు తమ పౌరుషాన్ని ప్రదర్శించారు. చిన్న పొరబాటు వచ్చినా, నిబంధనల్ని ఉల్లంఘించినా అట్టి క్రీడాకారుల్ని తక్షణం బయటకు పంపించేశారు. బహుమతుల జోరు : రంకెలేస్తూ వాడి వాసల్ నుంచి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున రంగంలోకి దిగిన ఎద్దుల పొగరును అణచివేస్తూ క్రీడాకారులు తమ పౌరుషాన్ని చాటి బహుమతుల్ని తన్నుకెళ్లారు. గెలిచిన క్రీడాకారులకు సెల్‌ఫోన్ లు, బిందెలు, పాత్రలు, రేడియో సెట్లు, బీరువా, మంచాలు, వాషింగ్ మిషన్లు, ఏసీ, ఫ్యాన్లు, మిక్సీ, సైకిళ్లు, స్టీలు, వెండి పాత్రలు, మోటార్ సైకిళ్లతో పాటు ఆకర్షణీయమైన బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. క్రీడాకారుల చేతికి చిక్కని బసవన్నలు సైతం ఆకర్షణీమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. రంకెలేసే బసవన్నలు కొన్నింటిని క్రీడాకారులు పట్టుకోగా, మరికొన్ని ఎద్దులు క్రీడాకారులతో కలసి రంకెలేస్తూ ఉత్సాహంగా ముందుకు వెనక్కు ఉరకలేస్తూ సహకరించాయి. వేలాదిగా తరలి వచ్చిన జనం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జల్లికట్టును ఆనందోత్సాహాలతో తిలకించారు. ఇక్కడ ఎద్దుల దాడిలో 50 మంది క్రీడాకారులతో పాటు ఓ వృద్ధుడు స్వల్పంగా గాయపడ్డారు. ఇక, నామక్కల్లోనూ జల్లికట్టులో బసవన్నులు దూసుకొచ్చాయి. క్రీడాకారులు వాటిని పట్టుకునేందుకు దూసుకెళ్లారు. ఇక, ఈ జల్లికట్టును అనేక మీడియా ప్రత్యక్ష ప్రసారాలు చేయడంతో ఎక్కడ చూసినా వాటిని వీక్షించే జనం ఎక్కువే. అలాగే, అవనీయాపురంలో తమకు పండుగ రోజు అన్నట్టుగా ఆనందోత్సాహాల్లో అక్కడి ప్రజలు మునిగారు. -
జల్లికట్టులో అపశ్రుతి
రామచంద్రాపురం(చిత్తూరు): జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నేతకుప్పం గ్రామంలో ఆదివారం జరుగుతున్న జల్లికట్టులో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. జల్లికట్టును తమ కెమరాల్లో బంధించడానికి యత్నిస్తున్న ఇద్దరు యువకులకు కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
ఇక రంకెలే!
► మదురైలో జల్లికట్టు కోలాహలం ► నేడు అవనీయాపురంలో శ్రీకారం ► సర్వం సిద్ధం ► 9న పాలమేడు ► 10న అలంగానల్లూరులో ► ఆరున క్రీడాకారులకు టోకెన్లు సాక్షి, చెన్నై : మదురై జిల్లాలో జల్లికట్టు కోలాహలం నెలకొంది. ఆదివారం అవనీయాపురం వేదికగా జల్లికట్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సర్వం సిద్ధం చేశారు. వందలాది బసవన్నలు వాడి వాసల్ మీదుగా రంకెలేస్తూ క్రీడాకారులతో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక, తొమ్మిదో తేదీన పాలమేడు, పదో తేదీన అలంగానల్లూరులో జల్లికట్టు సాగనుంది. ఇందుకుగాను ఆరో తేదీ నుంచి క్రీడాకారులకు టోకెన్లు, ఎద్దుల రిజిస్ట్రేషన్లు సాగనున్నాయి. ఇక, తమ సంప్రదాయ, సాహస క్రీడ కనుమరుగైనట్టేనా అన్న ఆందోళనలో పడ్డ జల్లికట్టుకు ప్రఖ్యాతి గాంచిన మదురైలో ప్రస్తుతం ఆనందకర వాతావరణం నెలకొంది. విద్యార్థి ఉద్యమంతో ప్రభుత్వం దిగి రావడం, కోర్టు సైతం పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో ఇక, జల్లికట్టులో రంకెలు కొట్టేందుకు బసవన్నలు, రంకెలేస్తూ, వాటికి ముక్కుతాడు వేసితమ సాహసాన్ని చాటుకునేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. జల్లికట్టు తమిళుల సంప్రదాయ, సాహస క్రీడ అయినా, జల్లికట్టు అంటే, మదురై జిల్లా అన్నది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాల్లో జల్లికట్టును తొలుత అవనీయాపురంలో తదుపరి పాలమేడులో, అనంతరం ప్రపంచ ప్రసిద్ధి చెందిన అలంగానల్లూరులో నిర్వహించడం సంప్రదాయం. ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టుకు దూరంగా ఉద్యమం సాగింది. అందుకే, మంచి మూహూర్తంతో ఆదివారం నుంచి మదురై జిల్లాలో వారం రోజుల పాటు జల్లికట్టు సందడి చోటు చేసుకోనుండంతో అక్కడి ప్రజలకే కాదు, రాష్ట్రంలో ప్రతి మూలా ఉన్న తమిళుడికీ ఆనందమే. ఇక రంకెలే: అవనీయాపురం వేదికగా ఉదయం ఎనిమిది గంటలకు జల్లికట్టుకు శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. క్రీడాకారులకు, ఎద్దుల యజమానులకు కట్టుదిట్టమైన ఆంక్షల్ని, నిబంధల్ని విధించారు. నిఘా నేత్రాల నీడలో జల్లికట్టు గురునాథ ఆలయం మైదానం వాడి వాసల్ వద్ద సాగనుంది. గ్యాలరీల నుంచి జనం వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.తొలుత ఆలయ ఎద్దు, తదుపరి గ్రామపెద్ద ఎద్దు రంకెలేస్తూ కొడుతూ వాడి వాసల్ నుంచి దూసుకు రానున్నాయి. వాడి వాసల్ నుంచి పదిహేను మీటర్ల తదుపరి ఎద్దుల్ని పట్టే విధంగా క్రీడాకారులకు ఉపదేశాలు ఇచ్చారు. ఎద్దును హింసించే విధంగా ఏ క్రీడాకారుడైనా వ్యవహరిస్తే, ఇక, అతడికి మరో అవకాశం అన్నది లేనట్టే. అవనీయాపురం తదుపరి నామక్కల్లోనూ ఈ సారి జల్లికట్టు సందడికి శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేసి ఉండడం విశేషం. అలంగానల్లూరులో: మదురై పాలమేడులో 9న, అలంగానల్లూరులో పదో తేదీన జల్లికట్టు సాగనుంది. ఇందుగాను ఎద్దులు రిజిస్ట్రేషన్లు, క్రీడాకారులకు టోకెన్లు సోమవారం నుంచి పంపిణీ చేయనున్నారు. వాడి వాసల్ వద్ద ఏర్పాట్లలో జల్లికట్టు నిర్వహణ కమిటీలు నిమగ్నమయ్యాయి. సీఎంతో పాటుగా పలు పార్టీల నాయకులు సైతం హాజరు కానుండడంతో అందుకు తగ్గ ప్రత్యేక ఏర్పాట్లలో నిర్వహకులు ఉన్నారు. అలంగానల్లూరులో అయితే, ఈ ఏడాది క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులు ఎదురు చూస్తున్నాయి. ఈ విషయంగా నిర్వాహకులు సుందరరాజ్, సుందర రాఘవన్, గణేష్ పేర్కొంటూ, ఈ ఏడాది కారు, మోటారు బైక్, బుల్లెట్, ట్రాక్టర్ వంటి బహుమతులతో పాటు పలు రకాల వస్తువులు బహుమతులుగా పంపిణీ చేయడానికి నిర్ణయించినట్టు వివరించారు. స్టాలిన్ కు ఆహ్వానం : పాలమేడు, అలంగానల్లూరుల్లో జల్లికట్టుకు హాజరు కావాలని కోరుతూ ఆయా నిర్వహక కమిటీల పెద్దలు శనివారం డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు ఆహ్వానం పలికారు. చెన్నైకు చేరుకున్న నిర్వాహకులు అన్నాఅరివాలయంలో స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈసందర్భంగా నిర్వాహకులు చెల్లదురై, రఘుపతి మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ కు ఆహ్వానం పలికామని, ఆయన జల్లికట్టు వీక్షణకు రానున్నారని తెలిపారు. చిక్కిన ఖాకీలు : ఆటోలకు నిప్పు పెట్టిన పోలీసులు చిక్కారు. ఆ ముగ్గుర్ని ఎట్టకేలకు గుర్తించారు. జల్లికట్టు ఉద్యమం చివరి రోజున ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కొన్నిచోట్ల పోలీసులే వాహనాలకు నిప్పుపెట్టడం, ప్రజల్ని చితక్కొట్టడం వంటి దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థల్లో ఉన్న నిఘా నేత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. రుద్రపురంలో ఆటోడ్రైవర్‌ను చితక్కొట్టడం, నిప్పు పెట్టడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాల్లో హల్ చల్చేశాయి. ఆ వీడియోల ఆధారంగా నిప్పుపెట్టిన పోలీసుల్ని గుర్తించారు. ఓ పోలీసు ఉన్నతాధికారికి సహాయకుడిగా ఉన్న తూత్తుకుడికి చెందిన కానిస్టేబుల్ రంగరాజన్, ఎంజీయార్ నగర్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ లక్ష్మి అలియాస్ మహాలక్ష్మి, అన్నానగర్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ గుణ సుందరిగా వారిని శనివారం గుర్తించారు. ఇక, వీరిపై ఎలాటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. -
అవసరమైతే రాజకీయాల్లోకి వస్తా : లారెన్స్
చెన్నై : ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ జల్లికట్టు పోరాటంలో విద్యార్థులకు మద్దతుగా నిలిచి పోరాటంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రిని కలిసి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని జల్లికట్టు విజయోత్సవాన్ని నిర్వహించాలని ఆయన మూడు కోరికలను వ్యక్తం చేశారు. కాగా మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జల్లికట్టులో పాల్గొన్న యువకులతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిని కోరిన కోరికలకు ఆయన పాజిటివ్‌గా స్పందించారని తెలిపారు. తాను సామాజిక సేవలో ఇప్పటి వరకు 135 మంది పేదలకు ఉచిత శస్త్ర చికిత్స అందించానని, 200ల మందికి పైగా ఆర్థికసాయంతో పాటు విద్యాసాయం చేస్తున్నానన్నారు. అలాగే 60 మంది అనాథలకు తన ఆశ్రమంలో సంరక్షణా బాధ్యతలను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. కాగా తనకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని అయితే తనను నమ్ముకున్న వారికి అభద్రతా భావం కలిగితే భవిష్యత్తులో రాజకీయపార్టీని నెలకొల్పడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. కాగా తన ఇయక్కంలో ఏ పార్టీకి చెందని వారికి అవకాశం వుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జల్లికట్టు పోరాటంలో మృతి చెందిన మణికంఠన్ అనే యువకుడి కుటుంబానికి రూ.10 లక్షలు విరాళాన్ని అందించనున్నట్లు తెలిపారు. -
జల్లికట్టు ‘హింస’పై దర్యాప్తు కమిషన్
- విధ్వంసకారులను వదిలిపెట్టం: సీఎం సెల్వం చెన్నై: జల్లికట్టు ఉద్యమం సమయంలో విధ్వంసానికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేదిలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్ సహా పలు జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల్లో నిందితులను గుర్తించి, శిక్షిస్తామని చెప్పారు. నాటి హింసాకాండపై దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ‘హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహించే దర్యాప్తు కమిషన్.. నేటి నుంచి వారంలోగా నివేదికను సమర్పింస్తుంది. ఆ నివేదికలోని అంశాల ఆధారంగా విధ్వంసకారులపై చర్యలు తీసుకుంటాం’అని సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. నాటి ఘటనల్లో చెన్నైకి చెందిన 21 మంది విద్యార్థులను, ఇతర జిల్లాలకు చెందిన మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీఎం తెలిపారు. ఆటోలకు నిప్పుపెట్టింది పోలీసులేనా? జల్లికట్లు ఆందోళన హింసాయుతంగా మారిన తర్వాత.. పోలీసులే ఆటోలకు నిప్పు పెట్టినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ రేపిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను లింక్ చేస్తూ పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఖాకీ దుస్తుల్లో ఆటోకు నిప్పుపెట్టినవాళ్లు నిజం పోలీసులుకాదని తమిళనాడు హోం శాఖ ఒక ప్రకటన చేసింది. దీంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది. కాగా, ఈ వీడియోలను కూడా దర్యాప్తు కమిషన్ పరిశీలించనుందని, ఆటోలకు నిప్పుపెట్టింది పోలీసులేనని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. -
ఆమోదం
► జల్లికట్టు ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర ► జల్లికట్టు అభిమానుల ఆనందహేల ► ‘అల్లరి’ పోలీసులపై వేటు ► అల్లర్ల వెనుక కుట్ర : విపక్షాల ఆగ్రహం తమిళనాడు ప్రజలకు దేశ రాజధాని నుంచి సోమవారం శుభవార్త అందింది. ఈ శుభవార్త చెవిన పడగానే రాష్ట్ర ప్రజలు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడమే ప్రజల ఆనందానికి కారణం. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల ప్రాచీన సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై కొన్నేళ్ల క్రితం విధింపబడిన నిషేధం రాష్ట్ర ప్రజలను తీరని ఆవేదనకు గురిచేసింది. ఆవేదన ఆగ్రహంగా మారి ఆం దోళనలకు దారితీసింది. మూడేళ్లుగా పొంగల్ పండుగ సమయాల్లో జల్లికట్టు ఆందోళనలు సాగుతూ చల్లారిపోతున్నాయి. అయితే ఈ ఏడాది జల్లికట్టు ఉద్యమంలోకి క్రీడాకారులు, అభిమానులేగాక విద్యార్థినీవిద్యార్థులు సైతం రంగప్రవేశం చేశారు. దీంతో చెన్నై మెరీనా బీచ్ తీరమే వేదికగా చేసుకుని సాగించిన ఆందోళనలు ఆకాశాన్ని అంటాయి. తమ డిమాండ్‌ను సాధించేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని జల్లికట్టుపై పట్టుపట్టారు. భార్యా పిల్లలతో కుటుంబాలు సైతం మెరీనాతీరానికి తరలిరాగా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీఎం పన్నీర్‌సెల్వం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. జల్లికట్టు ఉద్యమంపై అడ్డంకులను తొలగిస్తూ ఈ నెల 22వ తేదీన ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. అయితే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి విద్యార్థి సంఘాల నేతలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆందోళనను విరమింపజేసేందుకు 23వ తేదీ తెల్లవారుజామున పోలీసు ఉన్నతాధికారులు తమవంతు ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు, ఉద్యమకారుల మధ్య చర్చలు బెడిసికొట్టాయి. పోలీసులపై రాళ్లు రువ్వడంతో ప్రారంభమై లాఠీచార్జీ, భాష్పవాయి ప్రయోగాలు, గాలిలోకి కాల్పులు, పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాల దగ్ధం తదితర అవాంఛనీయ సంఘటనలవైపు ఉద్యమం మళ్లింది. చెన్నై మెరీనాతీరంలోని కొందరు ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన మరికొందరిని జైళ్లలోకి నెట్టారు. ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపగా జల్లికట్టు ఉద్యమకారులు ఇంటి బాట పట్టారు. అల్లర్ల సమయంలోనే జల్లికట్టు ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ద్వారా రాష్ట్రపతికి చేరుకుంది. అలాగే ఆర్డినెన్స్ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం కాపీని సైతం రాష్ట్రపతికి పంపారు. దీంతో జల్లికట్టు ఉద్యమానికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడంతో కథ సుఖాంతమైంది. ‘అల్లరి’ పోలీసులపై త్వరలో వేటు జల్లికట్టు అల్లర్లను అవకాశంగా తీసుకుని అక్రమాలకు పాల్పడిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన చెన్నై నగరంలో పలు విధ్వంసక చర్యలు చోటుచేసుకోగా వీటిల్లోని 35 సంఘటనలను కొందరు సెల్‌ఫోన్ ద్వారా వీడియోలో చిత్రీకరించి వాట్సాప్‌లో పెట్టారు. రోడ్డు వారగా నిలిపి ఉన్న ఆటోకు ఒక మహిళా కానిస్టేబుల్ నిప్పుపెట్టడం, మరికొందరు పోలీసులు రోడ్లపై నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు వాట్సాప్‌ల ద్వారా ప్రసారం కావడం పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. వాట్సాప్ దృశ్యాల ద్వారా పోలీసులను గుర్తించారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు. నిలిచి ఉన్న ఒక ఆటోకు నిప్పుపెట్టిన మహిళా కానిస్టేబుల్, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసినవారిపై త్వరలో సస్పెన్షన్ వేటు పడనున్నట్లు తెలిసింది. రెండు వారాలు వాయిదా చెన్నై మెరీనాతీరంలో అల్లర్ల ఆరోపణలపై అరెస్టయిన వారికి బెయిల్ మంజూరుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో రెండు వారాలు వాయిదా పడింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాల్సిందిగా కోరుతూ ఈ నెల 23వ తేదీన పోలీసులు జరిపిన చర్చలకు సమ్మతించని ఉద్యమకారులు అల్లర్లకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్ల సమయంలో ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 280 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. బదులు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీస్‌శాఖ చేసిన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి మహాదేవన్ కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాల ఆగ్రహం ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమంలో ఉద్రిక్తతలు సృష్టిం చి కుట్రపూరితంగా అణచి వేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమంలో ఉద్దేశ పూర్వకంగా పోలీసులే అల్లర్లు సృష్టించారని టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సోమవారం ఆరోపించారు. వారం రోజులపాటూ శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేస్తున్న వారిని చెదరగొట్టే ఉద్దేశంతోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారని ఆయన అన్నారు. పోలీసుల జోక్యానికి నిరసనగా ఉద్యమకారులు సముద్రతీరంలోకి వెళ్లగా వారికి రక్షణగా నిలిచిన మత్స్యకారులను సైతం అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. 23వ తేదీ జరిగిన అల్లర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన కోరారు. జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంపై పార్లమెంటులో గళం విప్పుతానని రాజ్యసభ సభ్యురాలు (డీఎంకే) కనిమొళి సోమవారం తెలిపారు. -
వాచ్: జల్లికట్టు సంబరం మొదలు!
-
వాచ్: జల్లికట్టు సంబరం మొదలు!
తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు సంబరం మళ్లీ మొదలైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ తమిళనాడు ప్రభుత్వం బిల్లును ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని కరుంగులం గ్రామంలో ఆదివారం స్థానికులు జల్లికట్టు క్రీడను ఘనంగా నిర్వహించారు. క్రీడలో భాగంగా సంప్రదాయబద్ధంగా ముస్తాబుచేసిన ఎద్దులను అదుపుచేసేందుకు యువత పోటీపడ్డారు. 'జల్లికట్టు' ప్రమాదకరమైన క్రీడ అని, దీనిని నిషేధించాలని పెటా ఉద్యమించడంతో సుప్రీంకోర్టు దీనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, తమ సంప్రదాయమైన ‘జల్లికట్టు’ పోటీలను శాశ్వతంగా అనుమతించాలంటూ తమిళనాడు యువత పెద్ద ఎత్తున ఉద్యమించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి.. మొదట ఆర్డినెన్స్, ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లును ఆమోదించడంతో ఈ క్రీడకు లైన్ క్లియర్ అయింది. దీంతో తమిళనాడులోని పలు గ్రామాల్లో 'జల్లికట్టు'ను ఉత్సాహంగా నిర్వహించేందుకు యువత సిద్ధమవుతున్నారు. -
హీరో సూర్యకు పెటా సారీ
చెన్నై: తమిళ హీరో సూర్యకు పెటా (ద పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి పూర్వా జోషిపురా క్షమాపణలు చెప్పారు. సూర్య కేవలం తన రాబోయే చిత్రం ఎస్3 (ఇప్పుడు సీ3గా పేరు మర్చారు) ప్రచారం కోసమే జల్లికట్టును సమర్థిస్తున్నారని గతంలో పూర్వ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా సూర్య తన లాయర్ ద్వారా ఆమెకు నోటీసులు జారీ చేయించారు. దీంతో క్షమాపణలు కోరుతూ సూర్య లాయర్‌కు ఆమె ఒక లేఖ పంపారు. -
కేంద్రంవల్లే జల్లికట్టు
► రాష్ట్రంపై నిర్లక్ష్యం లేదు ► కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల జల్లికట్టు కోర్కెను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం ఇచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్డినెన్స్ సలహా, రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం తోడ్పాటు వల్లనే జల్లికట్టులోని అడ్డంకులు తొలగిపోయాయని ఆమె తెలిపారు. అలాగే వర్దా తుపాను సహాయం, జల్లికట్టు సాదనలో కేంద్రానికి ఎంతమాత్రం వివక్ష లేదని ఆమె అన్నారు. చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జల్లికట్టు ఉద్యమం సాగుతున్న తరుణంలో సీఎం పన్నీర్‌సెల్వం ఢిల్లీకి వచ్చినపుడు ప్రధాని మోదీ ఆయన్ను కలుసుకున్నారని, అలాగే పార్లమెంటు ఉపసభాపతి తంబిదురైతో జల్లికట్టు అంశంపై తాను సైతం అనేకసార్లు మాట్లాడానని తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి తంబిదురై సహా అన్నాడీఎంకే పార్లమెంటు బృందం ప్రధానిని కలవలేకపోవడాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని కేంద్రం దూరంగా పెట్టిందని ఆరోపించడం సబబు కాదని అన్నారు. జల్లికట్టుకై ఆర్డినెన్స్ ను తీసుకురండి, తాము సహకరిస్తామని సలహా సీఎంకు ఇచ్చింది కూడా మోదీనేనని ఆమె చెప్పారు. సలహాతో సరిపెట్టక రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ ఆమోదానికి కూడా మోదీ చొరవచూపారని ఆమె తెలిపారు. జల్లికట్టుపై నిషేధం విధించి రెండేళ్లు కావస్తుండగా తమిళనాడు ప్రభుత్వం ఏనాడో నిర్ణయం తీసుకుని ఉండొచ్చుకదా, జాప్యానికి కేంద్రం కారణమా అని ఆమె ప్రశ్నించారు. జల్లికట్టు ఆర్డినెన్స్ కు సహకరించిన ప్రధాని మోదీపై తంబిదురై విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆమె చెప్పారు. జల్లికట్టు ఉద్యమం చివరి రోజుల్లో సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. జాతీయ పతాకాన్ని దగ్ధం చేయడం, మోదీ దిష్టిబొమ్మ దహనాలు ఎవరిపని అని ఆమె ప్రశ్నించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించేందుకు జరుగుతున్న విచారణలో వాస్తవాలు వెలుగుచూడగలవని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. పోలీసులు తప్పు చేసి ఉంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. వర్దా తుపాను సహాయక చర్యల్లో సైతం కేంద్రం రాష్ట్రాన్ని పక్కన పెట్టిందని విమర్శలు సత్యదూరమని పేర్కొన్నారు. స్పష్టమైన ఆరోపణలు చేస్తే జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ప్రగతిశీల భారత్ సాధ్యమని అన్నారు. జల్లికట్టుకు తాము ఆమోదం తెలిపామని తమిళ కాంగ్రెస్ చెప్పడం శోచనీయమని అన్నారు. నిషే«ధానికి కారణమైన కాంగ్రెస్ అనుమతి ఎలా ఇవ్వగలదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అద్దాల భవనంలో కూర్చుని ఎదుటి వారిపై రాళ్లు విసరడం క్షేమం కాదని ఆమె హితవు పలికారు. -
జల్లికట్టు పిటిషన్ల విచారణ 31న
- సుప్రీంకోర్టు యూఢిల్లీ, సాక్షి, చెన్నై: జల్లికట్టుపై దాఖలైన అన్ని పిటిషన్లను జనవరి 31న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు అసెంబ్లీ చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ కొనసాగింది. జల్లికట్టుపై మధ్యంతర దరఖాస్తులకు అనుమతించిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం అన్నింటిని జనవరి 31న విచారిస్తానని తెలిపింది. మరోవైపు జల్లికట్టును అనుమతిస్తూ జనవరి 6 ఇచ్చిన నోటిషికేషన్ ను ఉపసంహరించుకుంటామని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఇప్పటికే కోర్టుకు ఆ విషయాన్ని వెల్లడించామని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గుర్తు చేశారు. ఆ అంశంపై వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనమే విచారణ కొనసాగిస్తుందని జస్టిస్ మిశ్రా చెప్పారు. హింసకు విద్రోహ శక్తులే కారణం: పన్నీరు సెల్వం జాతి, సంఘ విద్రోహ శక్తులతో పాటు అతివాద శక్తులే జల్లికట్టు ఆందోళనల్లో హింసకు కారణమని తమిళనాడు ఆరోపించింది. ప్రదర్శనను పక్కదారి పట్టించిన దుష్ట శక్తుల్ని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని సీఎం పన్నీర్ సెల్వం చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నకు బదులిస్తూ చెన్నై నగరంలోని పలు ప్రాంతాల నుంచి విద్రోహ శక్తులు ఉద్యమకారులతో కలిసిపోయి ఆందోళన విరమణకు అంగీకరించలేదన్నారు. వారిలో కొందరు ప్రత్యేక తమిళనాడు డిమాండ్‌ను లేవనెత్తారని, మరికొందరు ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు చూపుతూ రిపబ్లిక్ డేను బహిష్కరించాలంటూ నినాదాలు చేసినట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. సీఎం సమాధానం సంతృప్తికరంగా లేదంటూ స్టాలిన్ సహా డీఎంకే సభ్యులంతా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. -
షాకింగ్ విషయాలు చెప్పిన పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకింగ్ విషయాలు చెప్పారు. మొన్న జరిగిన జల్లికట్టు ఉద్యమంలో కొందరు తమిళులు ప్రత్యేక తమిళదేశం కావాలని డిమాండ్ చేశారని, నిరసనకారులు ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు కూడా చూపించారని వివరించారు. శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సెల్వం మాట్లాడుతూ మెరినా బీచ్ తో జల్లికట్టుకోసం జరిగిన ఆందోళనలో కొంతమంది అల్ కాయిదా ఉగ్రవాది లాడెన్ ఫొటో చూపించారని తెలిపారు. అలాగే, గణతంత్ర దినోత్సవాన్ని కూడా బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. జల్లికట్టు ఉద్యమం ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసు బలగాలను ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ సమాధానం చెప్పారు. కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు జల్లికట్టు ఉద్యమంలో చేరాయి. పరిష్కారం చూపిన తర్వాత కూడా రిపబ్లిక్ డే వరకు ఉద్యమం చేద్దాం అని కొందరు రెచ్చగొడుతుంటే అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను. కొన్ని గ్రూపులు కావాలనే నల్లజెండాలు పనిగట్టుకొని ప్రదర్శించాయని, వారిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు చెప్పారు. అయితే, ఆరోజు జరిగిన హింసపై జ్యుడిషియల్ దర్యాప్తు చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేయగా ప్రభుత్వం నిరాకరించడంతో వారు వాకౌట్ చేశారు. -
‘‘పదుగురాడు మాట’’
జీవన కాలమ్ సంప్రదాయాలు జాతి మనుగడలో, సంవత్సరాల రాపిడిలో క్రమంగా రూపు దిద్దుకుంటాయి. వీటికి నిబంధనలు ఉండవు. ఆచారమే ఉంటుంది. కొండొకచో అర్థం కూడా ఉండదు. అనుభవమే ఉంటుంది. దశాబ్దాల కిందట–రాజారామమోహన్‌రాయ్– సతీసహగమనాన్ని ఎదిరించినప్పుడు–కొందరు షాక య్యారు. కొందరు అడ్డం పడ్డారు. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే–ఆ దురాచారం ఎంత అర్థరహి తమో, దురన్యాయమో అందరికీ అవగతమౌతుంది. ఆచారం ఆ కాలానిది. మనిషి తన సంస్కారంతో, సహేతుకమైన విచక్షణతో తనని తాను సంస్కరించు కుంటూ పోతాడు. పోవాలి. అదీ నాగరికత మనకి ఇచ్చిన సంపద. ఒకప్పుడు ఆదిమానవుడు పచ్చి మాంసం తిన్నాడు. నిజానికి తోటి మనుషుల్నే తిన్నాడు. ఇప్పటికీ కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో cannibals ఉన్నారంటారు. అయితే ఈనాటి మాన వుడు తన అవసరాలకి, ఆహారానికి ఎంత గొప్ప పరిణతిని సాధించాడు? జల్లికట్టు నాయకరాజుల కాలంలో ప్రారంభమ యిందని చరిత్ర. ‘జల్లి’ అంటే నాణాలు. ‘కట్టు’ అంటే కట్టడం. ఎద్దు కొమ్ములకి నాణాల సంచీని కట్టేవారట. ధైర్యం ఉన్న కుర్రాళ్లు దాని వెంటబడి మూపును కరుచుకుని–సంచీని దక్కించుకోవడం క్రీడ. నిజానికి సింధు నాగరికత నాటి చెక్కడాలలో ఈ క్రీడ ఛాయలు కనిపిస్తాయి. జల్లికట్టు బహుశా–ఆ రోజుల్లో సంక్రాంతికి పంట ఇంటికి వచ్చినప్పుడు–ఆ ఆనందాన్ని అనుభ వించడానికి పొగరుబోతు గిత్తలతో–కుర్రాళ్లు విశాల మైన మైదానాల్లో ఆటలాడేవారేమో! అప్పుడు గిత్తలు తిరగబడేవి. కొందరికి దెబ్బలు తగిలేవి. అయినా అదొక క్రీడగా చెల్లుబాటయి ఉండేది. ఆ రోజుల్లోనూ పిల్లల్ని వారించే పెద్దలు ఉండి ఉండొచ్చు. అయినా ఉడుకు రక్తంతో ‘మా సర దాలకు అడ్డురాకండి’ అన్న కుర్రకారు ఉండి ఉండ వచ్చు. అంతవరకే. కాలం మారింది. ఒకప్పటి అహింసాయుతమైన ఆచారం ముమ్మరమయి, ఎద్దులకు సారా పట్టి, కళ్లల్లో కారం జల్లి, తోకలు కత్తిరించి, కొరికి, రెచ్చ గొట్టి–వందలాది మందిని చూసి బెదిరి పరిగెత్తే ఎద్దును వెంటాడి–దాని పరుగు ‘ఆత్మరక్షణ’ కన్న విషయం మరిచిపోయి–‘జల్లికట్టు’ మా జాతికి ప్రతీక అని పంజా విప్పే ‘పార్టీ’ల చేతుల్లోకి ఉద్యమం వెళ్లి పోయింది. మొన్న మెరీనా బీచ్‌లో ఉద్యమం చేసిన వందలాది యువకులకు ‘జల్లికట్టు’ అంటే ఏమిటో తెలియదని ఓ పత్రిక స్పష్టంగా రాసింది. 2010–2014 మధ్య కనీసం 11 వందల మంది ఈ క్రీడల్లో గాయపడ్డారు. కనీసం 17 మంది చచ్చి పోయారు. ఇవి పత్రికలకు అందిన లెక్కలు. అసలు నిజాలు ఇంకా భయంకరంగా ఉండవచ్చు. 2014లో సుప్రీం కోర్టు జీవకారుణ్య సంస్థ ప్రమేయంతో ఈ క్రీడని నిషేధించింది. 2017లో ఆ తీర్పుని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జాతిగా తమిళులు ఆవేశపరులు. ఆవేశానికి ఏనాడూ ‘విచక్షణ’ చుక్కెదురు. ‘జల్లికట్టు’ అహిం సాయుతంగా జరిగే క్రీడ–అని వాక్రుచ్చిన నేప థ్యంలో రెండురోజుల క్రితం పుదుక్కోటై్టలో ఇద్దరు చచ్చిపోయారు. 28 మంది గాయపడ్డారు. తన మీద దూకే వందలాది మంది నుంచి నిస్స హాయంగా తప్పించుకుపోవాలనే జంతువు కళ్ల నుంచి కారే కారం నీళ్లూ, ముక్కు నుంచి కారే రక్తమూ, కడుపులో కలవరపెట్టే మాదక ద్రవ్యాలూ మెరీనా బీచ్‌లో ‘జాతి గర్వకారణమ’ని గగ్గోలు చేసే ప్రజానీకానికి ఎందుకు కనిపించడం లేదో, ఒక్క సుప్రీంకోర్టుకే ఎందుకు కనిపిస్తున్నాయో మనకు అర్థమౌతుంది. తమిళనాడులో సమర్థమయిన నాయకత్వం ఉంటే ఏమయేదో మనకు తెలీదు. ఇవాళ ఉన్న నాయ కత్వాన్ని నిలుపుకోవడానికి రాష్ట్రానికి కేంద్రం మద్దతు కావాలి. కేంద్రానికి–మారిన నాయకత్వంతో పొత్తు కావాలి. ఫలితం–జల్లికట్టుని చట్టబద్ధం చేసిన ఆర్డినెన్స్. సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టే మార్గం దొరికింది కనుక–ఇప్పుడిక కర్ణాటకలో కంబాల క్రీడకి (అప్పుడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యగారు, సదా నందగౌడ నోరు విప్పారు), ఆంధ్రప్రదేశ్‌లో కోడి పుంజుల ఆటకి, అస్సాంలో బుల్బుల్ పందాలకు, మహారాష్ట్రలో ఎద్దుబళ్ల పందాలకూ, ఉత్తరాఖండ్‌లో గేదెల్ని పరిగెత్తించి వేటాడే సంబరాలకూ–కనీసం ఐదారు ఆర్డినెన్సుల కోసం ఎదురుచూడవచ్చు. ప్రజాభిప్రాయానికి తరతరాల సంప్రదాయం పెట్టుబడి. చట్టానికి–కేవలం జరిగే అనర్థమే కొలమానం. ‘విచక్షణ’ క్రూరమయిన నిర్ణయాలు చేస్తుంది. ప్రజాభిప్రాయం దానికి దొంగదారులు వెదుకుతుంది. ‘‘శాస్త్రం ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానూ’’ చెప్తుంది అన్నారు పింగళి నాగేంద్ర రావుగారు ‘మాయాబజార్’లో. శాస్త్రం స్థానంలో ‘చట్టం’ అన్న మాటని చదువుకుని మనం నోరు మూసుకోవడం తక్షణ కర్తవ్యం. గొల్లపూడి మారుతీరావు -
జల్లికట్టుకు మరో చిక్కు
• తమిళనాడు చట్టాన్ని సవాల్ చేసిన జంతుహక్కుల కార్యకర్తలు • పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం • 30న విచారణ న్యూఢిల్లీ: సంప్రదాయ జల్లికట్టు క్రీడకు మరోసారి న్యాయపరమైన సవాల్ ఎదురైంది. జల్లికట్టును పునరుద్ధరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించచడాన్ని సవాల్ చేస్తూ జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) సహా ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరిచింది. ఈ నెల 30వ తేదీన ఏడబ్ల్యూబీఐతోపాటు, ఇతర సంస్థలు దాఖలుచేసిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తాం’అని ధర్మాసనం పేర్కొంది. జల్లికట్టు పేరిట జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ అంతర్జాతీయ జంతు కారుణ్య సంస్థ పెటా చేసిన వాదనను సమర్థించిన ధర్మాసనం. గత ఏడాది చివరిలో ఈ సంప్రదాయ క్రీడను నిషేధించడం తెలిసిందే. అయితే జల్లికట్టు సంక్రాతి(పొంగల్) సందర్భంగా నిర్వహించే క్రీడ కావడంతో పండుగ వేళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెరీనా బీచ్ వేదికగా గతవారం భారీ నిరసనలు జరిగాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ మరునాడే అసెంబ్లీలో జల్లికట్టుకు అనుకూలంగా తీర్మానం చేసింది. జల్లికట్టు పోస్టర్ వద్ద త్రివర్ణపతాకంలా నిలిచిన చెన్నైలోని ఎవర్విన్ పాఠశాల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తుందనే అనుమానాల నేపథ్యంలో సుప్రీకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై తమిళ సర్కారు జారీచేసిన ఆర్డినెన్స్ తాతాలికమైనదేఅయినా, శాసన సభ ఆమోదంతో అది చట్టంగా మారిందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులును సుప్రీంకోర్టులో సవాల్‌చేసే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం జల్లికట్టు బిల్లుకు రక్షణ లభిస్తుందని, అందువల్ల జల్లికట్టు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కట్జూ వ్యాఖ్యానించారు -
మూడు వేల ఏళ్ల క్రితమే ‘జల్లికట్టు’
తమిళనాడులో ‘జల్లికట్టు’ పోటీలను శాశ్వతంగా అనుమతించాలంటూ అక్కడి ప్రజలు ఓపక్క ఆందోళన కొనసాగిస్తుంటే మరోపక్క జల్లికట్టు ద్రవిడ సంప్రదాయమా, హిందూ సంప్రదాయమా? అంటూ మేథావుల మధ్య చర్చ జరుగుతోంది. జల్లికట్టు ద్రవిడ సంప్రదాయమని, సంఘం సాహిత్యం నాటి కాలం నుంచే, అంటే రెండువేల సంవత్సరాల కాలం నుంచే అమల్లో ఉందని, జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు వాదిస్తున్నారు. జల్లికట్టు హిందూ సంప్రదాయమని, ఈ క్రీడను నిషేధించడం హిందూత్వం మీద దాడి చేయడమేనని హిందుత్వ మేథావులు వాదిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ భూభాగంలో ఉన్న మొహెంజొదారోలో మూడువేల సంవత్సరాల క్రితం దొరికిన ముద్ర (సీల్)లో జల్లికట్టు బొమ్మ ఉందని సింధూ నాగరికతపై అధ్యయనం చేసిన ప్రముఖ ప్రపంచ చరిత్రకారుల్లో ఒకరైన ఐరావతం మహదేవన్ తెలియజేశారు. ఆ ముద్రలో ఎద్దు లేదా దున్నపోతు మనుషులను తన కొమ్ములతో ఎత్తి పడేస్తున్నట్లు ఉంది. సింధూ నాగరికతకు సంబంధించిన పత్రాలు కూడా ద్రవిడ భాషలో రాసినవేనన్నది ఆయన వాదన. ప్రాచీన తమిళ భాషా చిహ్నాలకు, హరప్పా కాలం నాటి భాషాచిహ్నాలకు దగ్గరి పోలికలు చాలా ఉన్నాయని మహదేవన్ తన అధ్యయనంలో తేల్చారు. 1964లో యూరీ క్నోరోజొవ్ నాయకత్వంలో ఓ రష్యా బృందం, ఫిన్లాండ్కు చెందిన మరో పురాతత్వ చరిత్రకారుల బృందం సింధూ లిపిపై అధ్యయనం చేసి దాన్ని ద్రవిడ భాషగానే తేల్చాయి. ఫిన్లాండ్ బృందంలో పాల్గొన్న నాటి హెల్సింకి యూనివర్సిటీ ఇండాలజిస్ట్ అస్కో పర్పోలా సింధూ లిపిలో ఉన్న పదాలు లేదా శబ్ద చిత్రాలను ద్రవిడ భాషలోని చిత్రాలతో పోల్చి చూసి రెండూ ఒకే భాషలోనివని తేల్చారు. ‘ది రూట్స్ ఆఫ్ హిందూయిజం, ది ఎర్లీ ఆర్యన్స్ అండ్ సివిలైజేషన్’ అనే పుస్తకంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. సింధూ లిపి ద్రవిడ భాషలో ఉన్నందున సింధూ నాగరికత ద్రవిడులదని, ఆర్యులు అక్కడికి తర్వాత వచ్చారన్నది ఐరావతం మహదేవన్, ఆస్కో పర్పోలాలతోపాటు మరో సింధూ స్కాలర్ బ్య్రాన్ వెల్స్ వాదన. ఇలినాయి యూనివర్శిటీలో లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి, ప్రస్తుతం గూగుల్ రిసెర్చ్ విభాగంలో పనిచేస్తున్న రిచర్డ్ స్పోర్ట్, హార్వర్డ్ యూనివర్శిటీలో సంస్కృత భాషా పరిశోధకుడిగా పనిచేస్తున్న మైఖేల్ విట్జెల్ ఈ ద్రవిడ వాదనతో వ్యతిరేకిస్తున్నారు. అసలు సింధూ స్క్రిప్టు అనేదే బూటకమని, సింధూ నాగరికత మూలాలు ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయన్నది వీరిద్దరి అభిప్రాయం. జల్లికట్టు వివాదం పుణ్యమా అని ప్రాచీన నాగరికత, భాషలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సింధూ నాగరికత ద్రవిడులదా, హిందువులదా లేదా ఆర్యులదా అన్నది పక్కన పెడితే మొహెంజొదారోలో దొరికిన ముద్రను బట్టి జల్లికట్టు సంప్రదాయం మూడువేల సంవత్సరాల క్రితమే ఉన్నట్లు తెలుస్తోంది. -
జల్లికట్టుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం
న్యూఢిల్లీ: వివాదాస్పద జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు బుధవారం మరో నిర్ణయాన్ని వెల్లడించింది. జల్లికట్టును పునరుద్ధరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించచడాన్ని సవాలు చేస్తూ జంతు సంక్షమ బోర్డు(ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా- ఏడబ్ల్యూబీఐ) సహా ఇతర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరిచింది. ‘జనవరి 30న (సోమవారం) ఏడబ్ల్యూబీఐ, ఇతర సంస్థలు వేసిన అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తాం’అని సుప్రీం ధర్మాసనం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జల్లికట్టు పేరుతో జంతువులను యధేచ్ఛగా హింసిస్తున్నారంటూ అంతర్జాతీయ జంతు కారుణ్య సంస్థ పెటా వ్యక్తం చేసిన వాదనను సమర్థించిన కోర్టు.. గత ఏడాది చివర్లో సంప్రదాయ క్రీడను నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టు సంక్రాతి(పొంగల్) సందర్భంగా నిర్వహించే క్రీడ కావడంతో పండుగ వేళ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. మెరీనా బీచ్ వేదికగా గతవారం భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన ఆర్డినెన్స్ జారీచేసింది. మరునాడే అసెంబ్లీలో జల్లికట్టుకు అనుకూలంగా తీర్మానం చేసింది. ఆర్డినెన్స్‌కు చుక్కెదురవుతుందా? జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందనే అనుమానాల నేపథ్యంలో సుప్రంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుపై తమిళ సర్కారు జారీచేసిన ఆర్డినెన్స్ తాత్కలికమైనదేఅయినా, శాసన సభ ఆమోదంతో అది చట్టంగా మారిందని కట్జూ గుర్తుచేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులును సుప్రీంకోర్టులో సవాలుచేసే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం జల్లికట్టు బిల్లుకు రక్షణ లభిస్తుందని, కాబట్టి జల్లికట్టు అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని కట్జూ వ్యాఖ్యానించారు. -
ఎంజీఆర్ బతికుంటే ఇలా జరిగేదా?
జల్లికట్టుపై కమల్ హాసన్ సాక్షి, ప్రతినిధి, చెన్నై: జల్లికట్టు కోసం పోరాడుతున్న తమిళనాడు విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగాలను ప్రముఖు నటుడు కమల్ హాసన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘విద్యార్థులనే కాకుండా మహిళలను, బాలలను కూడా బలవంతంగా తరలించారు. ఎంజీఆర్ (దివంగత సీఎం) బతికుంటే ఇలా జరిగేదా? ఆయన విద్యార్థులను కలసి మాట్లాడేవారు. సీఎం పన్నీర్ సెల్వం కూడా అలా చేసి ఉండాల్సింది. జల్లికట్టుకు అడ్డంకుల్లేకుండా శాశ్వత చట్టం చేయాలని 20 ఏళ్లుగా కోరుతున్నాం. ఈ ఆటను నిషేధించినవారు పల్లెలపై దాడి చేసే మదపుటేనుగులను ఎందుకు నిషేధించడం లేదు?’ అని ప్రశ్నించారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. సాధారణ స్థితికి: జల్లికట్టు మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలతో సోమవారం అట్టుడికిన తమిళనాడులో మంగళవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు పలు ప్రాంతాల్లో అదనపు పోలీసు పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. జల్లికట్టు కోసం శాశ్వత చట్టం తేవాలని వందమంది నిరసనకారులు బీచ్‌లో ధర్నా చేశారు. అరెస్ట్ చేసిన తమ వందమంది సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి వడపళని పోలీస్‌స్టే షన్ ను ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో జల్లికట్టులో ఓ ఎద్దు పొడవడంతో ఒక పోలీసు చనిపోయాడు. జల్లికట్టును అనుమతిస్తూ 2016లో జారీచేసిన నోటిఫికేషన్ ను వాపసు తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. -
కలకలం
► అల్లర్ల వెనుక అదృశ్య శక్తులు ► పోలీసులపై అనుమానాలు ► వాట్సాప్ వీడియోలో దృశ్యాలు ► మెరీనాలో మళ్లీ ఆందోళనకారులు ► జల్లికట్టు ఎద్దుదాడిలో ఇద్దరు మృతి జల్లికట్టు ఉద్యమం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిందా? అల్లర్లను సృష్టించేందుకు పోలీసులే ప్రత్యేక పాత్ర పోషించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియా వాట్సాప్ ద్వారా ప్రచారంలోకి రావడం కలకలాన్ని రేపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుకు అనుమతి కోరుతూ చెన్నై మెరీనాబీచ్ తీరంలో ఈనెల 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 20వ తేదీన జల్లికట్టు ఉద్యమకారులు చేపట్టిన బంద్ అనూహ్యరీతిలో సక్సెస్ అయింది. బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. అయినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. 21వ తేదీన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన తరువాత ఆందోళన విరమించాల్సిందిగా సీఎం పన్నీర్‌సెల్వం కోరారు. అయితే శాశ్వత చట్టం తెచ్చేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉద్యమకారులతో చర్చలు జరిపారు. అయినా వారు ససేమిరా అనడంతో సోమవారం నాడు బలవంతంగా వారిని పంపివేసే ప్రయత్నం చేశారు. దీంతో మెరీనాతీరంలో స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్రమేణా పరిస్థితి తీవ్రరూపం దాల్చగా చెన్నై ఐస్ హౌస్ పోలీస్‌స్టేషన్ కు నిప్పు, వందలాది వాహనాల దగ్ధం, పోలీసులపై పెట్రో బాంబులు విసరడం వంటి చర్యలతో నగరం రణరంగంగా మారిపోయింది. పోలీసులు గాల్లోకి కాల్పులు, భాష్పవాయువు ప్రయోగాలు చేయాల్సివచ్చింది. కాగా, సుమారు వందమందికి పైగా యువకులు సోమవారం రాత్రి వడపళని పోలీస్‌స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి చెదరగొట్టారు. అలాగే మరికొంత మంది అసాంఘిక శక్తులు ఆరంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ లోకి చొరపడి సీసీ కెమెరా, కిటికీలను పగులగొట్టారు. అలాగే ఆరుంబాక్కంలోని ఒక ప్రముఖ హోటల్‌కు స్వల్పంగా ఆస్తినష్టం కలిగించారు. రెండు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి మెషిన్లను ధ్వంసం చేశారు. ఏటీఎంలలో నగదు లేకపోవడంతో చోరీ చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే ఆర్కాడు నుంచి వేలూరుకు వెళుతున్న ప్రభుత్వ బస్సును సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు విద్యార్థులు పెట్రో బాంబులు విసిరి పారిపోయారు. అయితే బాంబులు పేలక పోవడంతో బస్సులోని 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బైటపడ్డారు. అయితే బస్సు కండక్టర్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆందోళనకారులతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి చర్చలు ఫలించగా జల్లికట్టు ఉద్యమాన్ని విరమించారు. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించిన జల్లికట్టు ఆర్డినెన్స్ ను గవర్నర్ విద్యాసాగర్‌రావు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. మదురై జిల్లా అలంగానల్లూరు, పాలమేడు, అవనియాపురంలలో వరుసగా వచ్చేనెల 1,2, 5వ తేదీల్లో జల్లికట్టు క్రీడను జరుపుతున్న దృష్ట్యా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పోలీసులే పాత్రధారులా: సోమవారం నాటి అల్లర్లకు పోలీసులే తెరవెనుక పాత్రధారులనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో పార్క్‌చేసి ఉన్న ఆటోలకు ఒక పోలీస్ కానిస్టేబుల్ నిప్పుపెడుతున్న వీడియో రాష్ట్రంలో హల్చల్ చేసింది. ప్లాస్టిక్ సంచుల్లో పెట్రోలు తీసుకుని పోలీసులే స్వయంగా ఆటోపై చల్లి నిప్పుపెడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. సమీపంలోని ఒక మిద్దెపై నుంచి తన సెల్‌ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి ‘ పోలీసులే తగులబెడతారా, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది’ అంటూ ఆంగ్లంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న మాటలు వినపడుతున్నాయి. ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని ఉద్రిక్తతల వైపు మళ్లించేందుకు పోలీసులే పథకం వేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అంతేగాక విద్యార్థుల ముసుగులో కొన్ని అ సాంఘిక శక్తులు విధ్వంసక చర్యల్లో పాల్గొన్నట్లు సందేహిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులే పాల్పడడం దురదృష్టకరమని సదరు వీడియోను ఉద్దేశించి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. నటుడు కమల్‌హాసన్ సైతం ఆ వీడియోను చూశానని పేర్కొం టూ పోలీస్ చర్యల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సోమవారం నాటి అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాల్సింది గా పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. మెరీనాలో అదే సీన్ : చెన్నై మెరీనా బీచ్‌లో వందల సంఖ్యలో జల్లికట్టుపై ఉద్యమకారులు మంగళవారం కూడా ఆందోళనను కొనసాగించారు. సోమవారం నాటి అల్లర్ల నేపథ్యంలో అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడిచిపెట్టాలని, వారిపై పెట్టిన కేసులను వాపసు తీసుకోవాలని డిమాండ్లపై ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని వారు చెప్పారు. అంతేగాక ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తరువాతనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఆందోళకారులను అదుపుచేసేందుకు వందమందికి పైగా పోలీసులను బందోబస్తు పెట్టి చర్చలు జరుపుతున్నారు. వంద మందికి పైగా అరెస్ట్: జల్లికట్టు ఉద్యమంలో భాగంగా ఉద్రిక్తతలు సృష్టించారనే ఆరోపణలపై చెన్నై నగరానికి చెందిన వందమందికి పైగా యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మూరు, అన్నాసమాధి, ఐస్‌హౌస్, అన్నాశాలై, మైలాపూర్, ట్రిప్లికేన్, వడపళని, కీల్పాక్, కొట్టూరుపురం తదితర 15 ప్రాంతాలకు చెందిన వారు అరెస్టయిన వారిలో ఉన్నారు. అలాగే పోలీసులపై దాడి చేసిన ఆరోపణలపై మరో 11 మందిని అరెస్ట్ చేశారు. చెన్నైలో సోమవారం నాటి అల్లర్లలో 232 వాహనాలు ధ్వంసంకాగా, 160 చోట్ల రాస్తారోకోలు జరిగాయని, అదనపు కమిషనర్ సహా 96 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీస్‌స్టేషన్ కు నిప్పుపెట్టిన 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ మైలాపూరు పోలీస్‌స్టేషన్ ను ఆందోళనకారలు మంగళ వారం ముట్టడించారు. అసాంఘిక శక్తుల నుంచి పోలీ సులను రక్షించేందుకు చెన్నై ఎమ్కేపీ నగర్‌కు చెందిన ప్రజలు వారికి సాధారణ వస్రా్తలు ఇచ్చి ప్రజల్లో కలిసిపోయేలా చేసి ఆదుకున్న సంగతి వెల్లడైంది. పోలీస్ సహా ఇద్దరు మృతి: విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో సోమవారం జరిగి న జల్లికట్టు ఒక పోలీసు ప్రాణాలను హరించింది. 50కి పైగా ఎద్దులను వాడివాసల్ గుండా వదిలారు. వందమందికి పైగా జల్లికట్టు వీరులు ఆ ఎద్దులను తమ అదుపులోకి తీసుకునేందుకు వాటి వెంట పరుగులు పెట్టా రు. పుదుపట్టికి చెందిన ఒక ఎద్దు అకస్మాత్తుగా జనంలోకి చొచ్చుకుని వచ్చి తోసేయడం ప్రారంభించింది. అక్కడే బందోబస్తులో ఉన్న అదే గ్రామానికి చెందిన ఏఆర్ పోలీసు జయశంకర్ (26)ను కొమ్ములతో ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని ప్రభు త్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం మదురైకి తరలిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. జయశంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే పుదుక్కోట్టై జిల్లా రాపూసల్‌లో జల్లికట్టు సమయంలో కరుప్పయ్య (30)ను ఎద్దు పొడవడంతో తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందు తూ సోమవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. -
ఆ ఇద్దరిపై వేటుపడనుందా?
పెటా ఇప్పుడు చాలా మందికి శిరోభారంగా మారింది. ఇంతకు ముందు ఆ సంస్థతో సంబంధాలు పెట్టుకుని ప్రచారకర్తలుగా వ్యవహిరించిన వాళ్లిప్పుడు అయ్యయ్యో మాకెలాంటి సంబంధాలు లేవంటూ తప్పించుకుంటున్నారు. కారణం పెటా అన్నది తమిళనాడుకిప్పుడు ఒక తీవ్రవాద సంస్థగా మారింది. దాన్ని తరిమికొట్టేదాకా నిద్రపోం అంటున్నారు తమిళులు. పెటా గురించి చెప్పాలంటే మూగజీవాల సంరక్షణ సంస్థగా సినీ ప్రముఖులను ఆకర్షించి వారికి ప్రసార బాధ్యతలు అప్పగించి తద్వారా మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలోనూ బలంగా నాటుకుపోయిన సంస్థ. తొలుత నటి ఐశ్వరాయరాయ్ను అంబాసిడర్‌గా నియమించుకుని దేశంలోని గ్రామ గ్రామాలకు వ్యాపించింది. తమిళ, తెలుగు నటీనటులను వాడుకుని వారికి అవార్డులు అందిస్తే తన ప్రచారాన్ని విస్తరించుకుంది. పలువురు తారలు పెటా అనే ఆంగ్ల అక్షరాలతో కూడిన టీషర్టులను ధరించి ప్రచారం చేసి ఆ సంస్థ వ్యాప్తికి సహకరించారు. కోలీవుడ్‌లో త్రిష ఇటీవల తమిళుల ఆగ్రహానికి గురైన నటి త్రిష అలానే పెటా చట్రంలోకి వచ్చారు. ఇప్పుడేమో తనకు పెటాకు ఎలాంటి సం బందం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఇక నటుడు ధనుష్ కూడా పెటా సంస్థ నుంచి అవార్డును అందుకున్నారు. ఆయనా ఇప్పుడు ఆ అవార్డును స్వీకరించడం అవమానంగా భావిస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. జల్లికట్టు నిషేధానికి పెటా కారణం అవుతుందని, విద్యార్థులు పెటాను ఒక తీవ్రవాద సంస్థగా దానికి వ్యతిరేకంగా ఇంతగా పోరాడతారని అప్పట్లో ఈ తారలు ఆలోచించి ఉండరు.పెటాకు సపోర్టు చేసిన నటీనటుల్ని విద్యార్థులు సోషల్ మీడియాలో విమర్శలతో దుమ్ము దులిపేశారు. ముఖ్యంగా త్రిష గురించి ముద్రించిన పోస్టర్లు చిత్ర పరిశ్రమలో పెనుసంచలనాన్నే కలిగించాయి. దీంతో చిత్ర పరిశ్రమ అంతా పెటాకు వ్యతిరేకంగా గళం ఎత్తుడం మొదలెట్టింది. ఇటీవల నడిగర్ సంఘం నిర్వహించిన మౌనపోరాటంలో త్రిష సహా పలువురు సినీ తారలు పాల్గొని జల్లికట్టుకు మద్దతు పలికారు. బహిష్కరణ డిమాండ్ కాగా ఆ సయమంలోనే పెటాకు సపోర్టు చేసిన నటీనటుల్ని నడిగర్‌సంఘం నుంచి బహిష్కరించాలనే ఓత్తిడి సభ్యుల నుంచి పెరిగింది. పెటా నుంచి వైదొలగని తారలను సంఘం నుంచి బహిష్కరించాలని దర్శకుడు చేరన్ రాసిన లేఖలో డిమాండ్ చేశారు. దీంతో కొందరు పెటా నుంచి వైదొలగినట్లు సంఘ నిర్వాహకుడొకరు తెలిపారు. అయితే నటి కాజల్‌అగర్వాల్, తమన్నా, ఎమీజాక్సన్ ఇప్పటికీ పెటాలో కొనసాగుతుండడంతో పాటు నడిగర్‌సంఘం నిర్వహించిన మౌనపోరాటంలో పాల్గొనలేదు. ఇంగ్లిష్ బ్యూటీ సంఘంలో సభ్యురాలు కాదు. ఇక తమన్నా, కాజల్అగర్వాల్లపై బహిష్కరణ వేట వేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది.ఈ వ్యవహారంలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు నడిగర్‌సంఘం నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
ఇలాంటి ప్రజాగ్రహానికి పగ్గాలేవి?
డేట్లైన్ హైదరాబాద్ జల్లికట్టు మీద నిషేధం శాశ్వతంగా తొలగించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటు. ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు, కర్ణాటకలో బర్రెల కొట్లాట ఇట్లా దేశమంతటా ఏదో పద్ధతిలో పాత సంప్రదాయం, ఆచారం తలెత్తి కేంద్ర ప్రభుత్వం కాళ్లకు బంధాలు వెయ్యడం ఖాయం. ఆ సమస్యతో ఏకీభావం ఉన్నా, లేకున్నా దాని పరిష్కారానికి తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఎంచుకున్న మార్గం కచ్చితంగా అనుసరణీయమే. మిగిలిన ప్రభుత్వాలు కూడా సెల్వం ప్రభుత్వ మార్గాన్ని అనుసరిస్తే మంచిది. తమిళనాడు పురాతన సంప్రదాయం జల్లికట్టు మీద విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా చెన్నై మెరీనా బీచ్‌లో జరుగుతున్న ఆందోళన దేశంలో మరికొన్ని ఉద్యమాలకు కొత్త ఊపిరిని ఇవ్వబోతున్నట్టు కనిపిస్తున్నది. దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూస్తున్న ఒక సమస్య మీద వేల సంఖ్యలో జనం కదిలి రావడం, జనాగ్రహానికి వెరచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, ప్రజల భావోద్వేగాల దృష్ట్యా కొద్దికాలం ఆగండని సుప్రీంకోర్టును కేంద్రం వేడుకోవడం, హడావుడిగా శాసనసభ సమావేశం నిర్వహించి బిల్లు ఆమోదించడం ఒక కోణంలో నుంచి చూస్తే అద్భుతమైన దృశ్యం. అత్యంత శక్తిమంత మైన రాజ్యాన్ని ధిక్కరించి నిలిచి ప్రజలు విజయం సాధిస్తే ప్రజాస్వామ్య ప్రియులు ఎవరికైనా అద్భుతంగానే అనిపిస్తుంది. ఇదొక్కటేనా సమస్య? ఒక సమస్య మీద ప్రజలు ఒక్కటై ప్రభుత్వాల మెడలు వంచడం ఆహ్వానించదగ్గ విషయమే అయినా, తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత గత వారం మెరీనా బీచ్‌లో సాగించిన ఉద్యమానికి మూలమైన సమస్య మాత్రం సమర్థనీయం కాదు. పక్షులతో కత్తులాట నిర్వహించడం, నోరులేని అమాయక జంతువులతో పరుగు పందాలు సాగించి ఆనందించడం ఒక వికృత క్రీడ. ప్రపంచవ్యాప్తంగా పశుపక్ష్యాదులను క్రీడల పేరుతో హింసించడం సరికాదని ప్రజలు ఉద్యమిస్తున్న వేళ తమిళనాడులో జరిగిందీ, జరుగుతున్నదీ సమర్థనీయం కాదు. ఇటువంటి దారితప్పిన ఒక ఉద్యమానికి సంఘంలో ప్రముఖులూ, రాజకీయ పక్షాలూ మద్దతుగా నిలవడం ఏవగింపు కలిగిస్తుంది. ఇంతకంటే చాలా తీవ్రమైన ప్రజాసమస్యల విషయంలో ఈ సెలబ్రిటీలు ఎందుకు నోరు మెదపరు? దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక సమస్యల మీద ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి, వాటి గురించి వీళ్లు ఎందుకు మాట్లాడరు? తమిళనాడు విషయమే తీసుకుందాం. అక్కడ పేదరికం వికటాట్టహాసం చేస్తున్నది. నిజానికి జయలలిత అక్కడి జనం దృష్టిలో 'అమ్మ'గా స్థిరపడిపోవడానికి కారణం ఆ పేదలకు ఆమె విదిలించిన కొన్ని పథకాలే. పేదరికాన్ని శాశ్వతంగా పారదోలేందుకు ఆమె కూడా చేసిందేమీ లేదు. అంత తీవ్రంగా ఉన్న పేదరికం మీద, నిరుద్యోగం మీదా అన్నిటికీ మించి అవినీతికి నిలయంగా మారిన రాజకీయ వ్యవస్థ మీదా నిరసనగా ఈ యువత ఎందుకు రోడ్ల మీదకు రాలేదు? జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకించి గెలిచిన స్థాయిలో ఈ సమస్యల మీద ఎందుకు యుద్ధం చెయ్యలేదు? తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టు నిషేధ వ్యతిరేక ఉద్యమం పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నది. అందులో ప్రధానమైనది న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం. ప్రజాగ్రహానికి వెరచి ప్రభుత్వాలు లొంగి వచ్చి విజ్ఞప్తి చేస్తే న్యాయస్థానాలు నిర్ణయాలను మార్చు కోవడమో, వాయిదా వేసుకోవడమో జరగడం ఈ సందేహానికి తావిస్తున్నది. జంతు హింస సరికాదు నిన్న మొన్నటి దాకా జయలలిత నీడన పెరిగిన పన్నీర్ సెల్వం ప్రభుత్వం జనాభిప్రాయానికి విలువనిచ్చి ఈ సమస్యను పరిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాగా కేంద్రంతో ఘర్షణ మంచిది కాదు, ఆందోళనలు చెయ్యకూడదు అని హితబోధలు చెయ్యలేదు. నిజానికి దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ, మరే ముఖ్యమంత్రీ కేంద్రానికి ఇంతగా జీహుజూర్ అన్నట్టు వ్యవహరించడంలేదు. పన్నీర్ సెల్వం వెంటనే ఢిల్లీ వెళ్లారు, ప్రధానమంత్రికి సమస్యను వివరించారు. ఇద్దరి నిర్ణయం మేరకే ఆర్డినెన్స్ వచ్చింది. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. జల్లికట్టు మీద నిషేధం అనేది చాలా చిన్న సమస్య, అనాదిగా వస్తున్న ఒక ఆచారానికి సంబంధించింది. నిజానికి తమిళనాడు ప్రజలు యావన్మందీ ఈ దురాచారాన్ని, కాలం చెల్లిన సంప్రదాయాన్ని సమర్థిస్తూ ఉన్నారనడానికి వీల్లేదు. జల్లికట్టు మీద నిషేధం శాశ్వతంగా తొలగించినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే పొరపాటు కూడా. ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు, కర్ణాటకలో బర్రెల కొట్లాట ఇట్లా దేశమంతటా ఏదో పద్ధతిలో ఏదో ఒక పాత సంప్రదాయం, ఆచారం తలెత్తి కేంద్ర ప్రభుత్వం కాళ్లకు బంధాలు వెయ్యడం ఖాయం. పశువులనూ, పక్షులనూ హింసించే పద్ధతు లకు స్వస్తి చెప్పాలంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను తేలికగా తీసుకోడానికి వీల్లేదు. ఆ రెండు ఉద్యమాలు ఒక్కటేనా? సరే, జల్లికట్టు నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట జరిగిన ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్న వారిని అభినందించాల్సిందే. ఆ సమస్యతో ఏకీభావం ఉన్నా, లేకున్నా దాని పరిష్కారానికి తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా యువత ఎంచుకున్న మార్గం కచ్చితంగా అనుసరణీయమే. మిగిలిన ప్రభుత్వాలు కూడా పన్నీర్ సెల్వం ప్రభుత్వం మార్గాన్ని అనుసరిస్తే మంచిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో తననో, కేంద్రాన్నో రక్షించుకునే ధోరణి వదిలేసి రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజెప్పి ప్రత్యేక హోదా తెచ్చే ప్రయత్నం చేసి ఉండాల్సింది. చంద్రబాబునాయుడే చెప్పినట్టు రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళనకూ, జల్లికట్టు కోసం జరుగుతున్న ఆందోళనకూ పోలికలేదు. జల్లికట్టు సమస్య తాత్కాలికం, ప్రత్యేక హోదా కోట్లాది మంది ఆంధ్ర ప్రజల, ముఖ్యంగా యువత భవిష్యత్తును నిర్ణయించే సమస్య. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రెండుసార్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన నాటి నుంచి ప్రతిపక్షాలది ఉద్యమబాట, ప్రభుత్వానిది రాజీ పాట. ప్రధాన ప్రతిపక్షం అనునిత్యం ప్రత్యేక హోదా కోసం ఉద్యమ బాటనే సాగుతున్నది. పార్లమెంట్ లోపలా బయటా ప్రతిపక్షం ఆందోళన చేస్తుంటే అధికార పక్షం మంత్రి పదవులను కాపాడుకునే ప్రయత్నంలో తలమునకలై ఉంది. ప్రతిపక్ష నేత ఆమరణ నిరాహార దీక్ష, కాంగ్రెస్ కోటి సంతకాలు, వామపక్షాల నిరసన ఆందోళనలు; చివరికి 2014 ఎన్నికల్లో మిత్రుడిగా ఉండి, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేందుకు తన వంతు సాయం చేసిన ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా మీరు తెచ్చిన ప్యాకేజీలు పాచి పోయిన లడ్డూలతో సమానం, అవి ఏమీ వద్దు ప్రత్యేక హోదా తీసుకురండి అని నిలదీస్తున్నాడు. ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం మాత్రం అశేష ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా నీరో చక్రవర్తిని, అతడి ధోరణిని మరిపింపచేస్తున్నారు. అంతేకాదు, తమకు ఏమైనా సమస్యలుంటే, కేంద్రాన్ని నిలదీసే శక్తి లేకపోతే, మిన్నకున్నా బాగుండేది, అట్లా చెయ్యక పోగా ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షం చేస్తున్న ప్రతి ఉద్యమాన్ని అణచివేసే, బురద జల్లి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గాల్సిందే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం రామకృష్ణా బీచ్ సహా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపునకు అన్ని ప్రతిపక్షాలూ కలిసొచ్చే వాతావరణం ఏర్పడింది. జనసేన నేత పవన్ కల్యాణ్ సహా అన్ని పార్టీలు రేపటి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఇది నిన్న మొన్న తమిళ నాడును కుదిపేసిన జల్లికట్టు నిషేధ వ్యతిరేక ఉద్యమ రూపు తీసుకోనుందనే మాట వినిపిస్తున్నది. మంచిదే, బధిరులకు వినిపించాలంటే భారీ విస్ఫో టనం అవసరమని స్వాతంత్య్ర పోరాటంలో షహీద్ భగత్ సింగ్ పార్లమెంట్ మీద తాను బాంబు వేయడాన్ని సమర్థించుకుంటూ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. దావోస్ నుంచి తిరిగొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి మళ్లీ ఒకసారి కేంద్రంతో తగువుకు తానూ సిద్ధంగా లేనని స్పష్టంగా చెప్పారు. ఆయన పార్టీ నాయకులేమో చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన హింస విశాఖ ఆర్కే బీచ్‌లో కూడా జరగాలని అనుకుంటున్నారా అని సన్నాయి నొక్కులు నొక్కుతు న్నారు. నాలుగు రోజులపాటు ప్రశాంతంగా సాగిన చెన్నై ఆందోళన కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు చొరబడి, పోలీసులు కూడా ప్రతిచర్యకు దిగిన తరు వాతే హింసాత్మకమైంది. జల్లికట్టు సమస్య పరిష్కారం కోసం పన్నీర్ సెల్వం అనుసరించిన పద్ధతి వదిలేసి ఆయన ప్రభుత్వంలోని పోలీసులు ఆందో ళనను విచ్ఛిన్నం చెయ్యడానికి ఎంచుకున్న పద్ధతిని అనుసరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి తలొగ్గాల్సిందే అని జల్లికట్టు ఉద్యమం మరోసారి రుజువు చేసింది, ఆంధ్రప్రదేశ్లోనయినా అంతే. అది గుర్తించకపోతే ప్రభుత్వానికి భంగపాటు తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ వ్యవస్థనూ, పౌర సమాజాన్ని ఒక్క తాటి మీదకు తీసుకొచ్చి జల్లికట్టు ఉద్యమంతో పోల్చదగిన మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి శాంతి యుత ఆందోళనలు నిర్వహించిన జేఏసీ అధ్యక్షులు కోదండరాం తెలం గాణలో జల్లికట్టు ఉద్యమ తరహాలో భారీ నిరుద్యోగుల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అంత బలమైన ఉద్యమాన్ని ముందుకు ఉరికించిన తెలంగాణ ఉద్యమ నాయకత్వమే జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవడాన్ని పాల కులందరూ గ్రహిస్తే మంచిది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
అశ్విన్ రైలెక్కాడు...
చెన్నై: భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సొంతగడ్డపై కొత్త అనుభవం ఎదురైంది. మూడో వన్డే తర్వాత అతను కోల్‌కతా నుంచి సోమవారం చెన్నై చేరుకున్నాడు. అయితే జల్లికట్టు వివాదం కారణంగా రోడ్లన్నీ స్థంభించిపోవడంతో అక్కడినుంచి తన కారులో ఇంటికి చేరుకోవడం అసాధ్యంగా కనిపించింది. దాంతో అశ్విన్ మెట్రో రైల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి తన ఇల్లు ఉన్న వెస్ట్ మాంబళంకు అతను ట్రైన్లో ప్రయాణించాడు. సహచర ప్రయాణీకులు కూడా అశ్విన్ తమతో పాటు రైలులో రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘ఇలాంటి పరిస్థితులే మనల్ని ప్రజా రవాణా వ్యవస్థను వాడేటట్లు చేస్తాయి. నన్ను భద్రంగా తీసుకెళ్లిన ఎయిర్ పోర్ట్ పోలీసులకు కృతజ్ఞతలు’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. -
‘వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులు’
-
‘వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులు’
చెన్నై: జల్లికట్టుపై ఆందోళన సందర్భంగా పోలీసులు ఆటోలకు నిప్పు పెట్టిన ఘటనపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ మండిపడ్డారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగించిందని, దీనిపై పోలీసు శాఖ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జల్లికట్టు కోసం 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. మెరీనా బీచ్ లో సోమవారం జరిగిన ఘటనలు బాధించాయని చెప్పారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపైనా పోలీసులు దౌర్జన్యం చేశారని వాపోయారు. పోలీసులే విధ్వంసానికి పాల్పడడం శోచనీయమని, వాళ్లు పోలీసులు కాదు, నాలాగే నటులని వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. మూగజీవాల హక్కులపై తనకు అవగాహన లేదన్నారు. ఎద్దులు కూడా పెంపుడు జంతువులేనని అన్నారు. జల్లికట్టుతో పోల్చుకుంటే ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారని తెలిపారు. జల్లికట్టుపై సీఎం పన్నీరు సెల్వం వ్యవహరించిన తీరు బాగుందని కమల్ ప్రశంసించారు. ఇది జల్లికట్టు కోసం జరుగుతున్న పోరాటం కాదని సంస్కృతి పరిరక్షణకు జరుగుతున్న ప్రజా ఉద్యమం అని వివరించారు. మనుషులు మధ్య అడ్డుగోడలు అవసరం లేదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ‘సరిహద్దులు అనేవి మనమే సృష్టించుకున్నాం. వీటిని కూలగొట్టాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్ ను ద్వేషించను. ఒకవేళ నేను 1924లో పుట్టివుంటే మహాత్మ గాంధీ ముందు కూర్చుని భారత్, పాకిస్థాన్ కలిసికట్టుగా ఉండాలని అడిగేవాడిని. దేనిపైనా నిషేధం విధించడం సరికాదు. నియంత్రణ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాన’ని చెప్పారు. -
చెన్నైలో సంచలనం రేపుతున్న వీడియో క్లిప్‌లు
-
జల్లికట్టు పోటీలకు 24 నిబంధనలు
కేకేనగర్: జల్లికట్టు పోటీ జరపడానికి అనుకూలంగా తమిళనాడు జంతు హింస నిరోధక చట్టంలో సవరణలు చేసి రాష్ట్ర గవర్నర్ అంగీకారంతో కూడిన అత్యవసర చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1960లో తీసుకు వచ్చిన చట్టం 59లో సబ్‌సెక్షన్ –2లో సవరణ చేయడానికి ప్రభుత్వ ఆదేశం మేరకు పశు సంవర్థక శాఖ ప్రభుత్వ కార్యదర్శి కగన్ దీప్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జల్లికట్టు పోటీ జరిగే సమయంలో అనుసరించాల్సిన నిబంధనల ప్రకటనను విడుదల చేశారు. ప్రైవేటు సంస్థల కమిటీల తరఫున జల్లికట్టు జరిపేందుకు ముందు కలెక్టర్‌కు రాతపూర్వకంగా సమాచారం తెలియజేయాలి. జల్లికట్టు పోటీల్లో పాల్గోనే వ్యక్తులు, ఎద్దుల వివరాలను ముందస్తుగా కలెక్టర్ వద్ద నమోదు చేసి నిర్ధారించుకోవాలి. జల్లికట్టు జరిపే స్థలాన్ని కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలనలు జరిపి అనుమతి ఇవ్వాలి. ► జల్లికట్టు పోటీలో పాల్గొనడానికి తీసుకు వచ్చిన ఎద్దులకు మత్తుమందు ఇచ్చారా, చిత్రవధ చేశారా అనే విషయాలపై వెటర్నరీ వైద్యులు పరీక్షలు జరపాలి ► పోటీలలో పాల్గోనే ఎద్దులు ఆరోగ్యంగా ఉన్నాయని వైద్యుల సమాచారం మేరకు కలెక్టర్ అనుమతి ఇవ్వాలి ► ఎద్దులు ఉన్న స్థలాన్ని సీసీ కెమెరా ద్వారా పరిశీలించాలి. జల్లికట్టు జరిగే పోటీ దృశ్యాలను సీసీ టీవీ కెమెరాల్లో నమోదు చేయాలి ► ఎద్దులకు నీరసంగా, ఉద్వేగంగా ఉన్న పక్షంలో పోటీకి వాటిని అనుమతించరాదు ► ఎద్దులకు సారాయి వంటి మత్తుపదార్థాలను ఇచ్చారా అని పరిశీలించి జల్లికట్టు జరిగే పోటీకి అనుమతించరాదు ► పోటీ జరిగే ప్రాంతానికి వచ్చే ముందు ఎద్దు ముక్కుకు ఉన్న తాడు తీసివేయాలి ► మైదానం 50 చదరపు మీటర్లు ఉండాలి. అందులోనే పోటీ దారులు ఎద్దులను పట్టుకోవాలి ► పోటీ జరిగే మైదానంలో ఎద్దు వచ్చినప్పుడు దానికి అడ్డుగా నిలబడకూడదు ► మైదానం లోపల ఎద్దు వచ్చే 10 మీటర్లు, 30 నిమిషాలు, మూడు సార్లు అది దూకినప్పడు దాన్ని పట్టుకోవాలి. ఎద్దును అదుపు చేసే సమయంలో దాని తోకను కొమ్ములను పట్టుకోరాదు. ఎద్దు పరిగెత్తకుండా ఉండే విధంగా దాన్ని అడ్డుకోరాదు ► ఎద్దుకు గాని, పోటీ దారునికిగాని దెబ్బలు తగలకుండా ఉండేందుకు మైదానంలో 15 మీటర్లు వరకు కొబ్బరి పీచును పరచాలి ► మైదానం లోపలికి వచ్చే ఎద్దు 15 మీటర్లు దాటి వెళ్లిన తరువాత పోటీదారులు ఎద్దును వంద మీటర్లు వరకు ఎలాంటి అడ్డంకులు ఉంచరాదు. ► జల్లికట్టు పోటీకి యజమానులే ఎద్దులను తీసుకురావాలి ► పోటీ ముగిసిన ఎద్దుకు 20 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. ఆ తరువాత ఎద్దు యజమానులు ఎద్దును తీసుకువెళ్లాలి. ► పోటీ మైదానంలో ఇరువైపులా అడ్డును ఏర్పాటు చేసి 8 అడుగుల ఎత్తుకు అనగా ఎద్దులు దాటని విధంగా ప్రేక్షకులకు కుర్చీలను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని కలెక్టర్ నిర్ధారణ చేయాలి. ► మైదానంలో ప్రేక్షకులు ఎంతమంది కూర్చోవచ్చు అనే దాని గురించి ప్రజాపనుల శాఖ అధికారుల వద్ద నుంచి సర్టిఫికెట్ పొందాలి వంటి 24 నిబంధనలు అందులో ఉన్నాయి. -
హోదా కోసం ఎందాకైనా ?
-
గాడి తప్పుతున్న జల్లికట్టు
-
జల్లికట్టు బిల్లుకు ఆమోదం
చెన్నై: జల్లికట్టు కోసం తమిళులు చేస్తున్న ఆందోళనలకు కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు దిగివచ్చాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై.. జల్లికట్టు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో అన్నా డీఎంకే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం లభించింది. జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించిన సంగతి తెలిసింది. కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తిరిగి తమిళనాడుకు పంపగా, ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. కాగా జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో తమిళులు శాశ్వత పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. -
గాడి తప్పుతున్న జల్లికట్టు
న్యూఢిల్లీ: తమిళనాడు సంప్రదాయక క్రీడైన ‘జల్లికట్టు’ను అనుమతించాలంటూ అహింసాత్మకంగా ఆందోళన ప్రారంభించిన తమిళ ప్రజలు ఇప్పుడు దానికి శాశ్వత పరిష్కారం కల్పించాలంటూ హింసకు దిగుతున్నారు. తమిళనాడు ప్రజలు సోమవారం బస్సులను తగులబెట్టడంతోపాటు చెన్నై నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. వారి ఆందోళనకు జడిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం ఆదివారం మధురై సమీపంలోని అలంగనల్లూరు వద్ద ‘జల్లికట్టు’ను ప్రారంభించలేక పోయిన విషయం తెల్సిందే. జల్లికట్టు అనుమతికి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విజయం సాధించిన తమిళ ప్రజలు అంతటితో ఎందుకు సంతప్తి పడలేకపోతున్నారు. అహింసాత్మకంగా ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆందోళన నిర్వహించిన వారెందుకు ఇప్పుడు హింసామార్గం వైపు మళ్లుతున్నారు? భవిష్యత్తులో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు జల్లికట్టును శాశ్వతంగా అనుమతిస్తూ చట్టం తీసుకరావాలని వారు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం ప్రాథమిక స్వరూపాన్ని తప్ప ఎన్నిచట్టాలనైనా, చివరకు రాజ్యాంగ సవరణలనైనా సమీక్షించేందుకు, వాటిని సరిచేయాల్సిందిగా ఆదేశించేందుకు భారత న్యాయవ్యవస్థకు అధికారం ఉంది. అలాంటప్పుడు శాశ్వత చట్టం అంటూ ఏదీ ఉండదు. శాశ్వత పరిష్కారమూ ఉండదు. ఆందోళనకారులకు ఇది ఎంతవరకు తెలుసున్న విషయాన్ని పక్కన పెడితే ‘జనవరి 26, తమిళులకు చీకటి రోజు, భారత గణతంత్య్ర దినోత్సవాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం’ అన్న నినాదాల పోస్టర్లు, అక్కడక్కడ వేలుపిళ్లై ప్రభాకరన్ ఫొటోలు పట్టుకొని మెరీనా బీచ్‌లో తమిళులు ఆందోళన చేస్తుండడం గమనార్హం. దీనర్థం ఆందోళనలోకి తమిళజాతీయవాద శక్తులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. జాతీయవాద శక్తుల్లోకి ఆందోళన వెళ్లినట్లయితే తమిళనాడులో 2009, మే 17 ఉద్యమం, 2013లో జరిగిన విద్యార్థుల ఉద్యమం పునరావతమయ్యే అవకాశం ఉంది. ఆ రెండు సందర్భాల్లో బలమైన ముఖ్యమంత్రులు ఉండడం వల్ల ఆ ఉద్యమాలు సమసిపోయాయి. ఇప్పుడు పన్నీర్ సెల్వం బలమైన నాయకులు కాకపోవడం వల్ల ప్రత్యేక తమిళ ఉద్యమానికి ఇదే సరైన సమయమని తమిళ జాతీయ వాద శక్తులు భావించే అవకాశం ఉంది. హిందీ భాషకు, వేద సంస్కతికి వ్యతిరేకంగా ప్రత్యేక తమిళ ఉద్యమాలు పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. ఉత్తరాది నాయకులు ఎక్కువగా ఉన్న అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీ పార్టీలను వ్యతిరేకించే సంస్కతి తమిళ ప్రజలది. ఎందుకంటే ఉత్తరాది ప్రజలు ఆర్యులని, వారు ద్రావిడులపై దండయాత్ర చేసి దక్షిణాదిని దురాక్రమించుకున్నారన్నది వారి విశ్వాసం. తమిళనాడు చరిత్రలో రెండోసారి దారుణ కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నందున రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతప్తి నెలకొని ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలించినా కావేరీ జలాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయకపోవడం పట్ల కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందీ, సంస్కతం భాషలను ప్రోత్సహించడం కూడా వారిని కన్నెర్ర చేస్తోంది. తమిళ భాషను అధికార భాషగా గుర్తించాలంటూ వారు ఎప్పటి నుంచో ఆందోళన కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళుల ఆందోళనను సామరస్యంగా పరిష్కరించలేక పోయినట్లయితే మరోసారి జాతీయవాద ఉద్యమం చెలరేగే ప్రమాదం ఉంది. ––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
జల్లికట్టుకు ఏపీ ప్రత్యేక హోదాకు పోలికేంటి?
- కేంద్రాన్ని డిమాండ్ చేయబోనన్న ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి: తమిళనాడులో జరుగుతోన్న జల్లికట్టు ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్‌కు పోలిక ఏమిటో అర్థం కావడంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నాడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి చెందిన నాయకులు.. నేడు విచిత్రంగా లేఖలు రాస్తున్నారు’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావును ఉద్దేశించి విమర్శలు చేశారు. అమరావతిలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన సీఎం ఏపీకి హోదా కోసం కేంద్రంతో గొడవపెట్టుకోనని మరోసారి చెప్పారు. ‘రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన అంశాలను నూటికి నూరు శాతం నెరవేర్చుతున్నాం. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లాగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్న రాష్ట్రం దేశంలో మరొకటిలేదు. నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ప్రత్యేక హోదా కోసమో, మరొకదానికోసమో కేంద్రంతో గొడవపడుతూ కూర్చోలేను. అయినా, గొడవలు పెట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందా? అభివృద్ధి జరుగుతుందా?’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ జనవరి 26న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ పిలుపుపై కూడా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘వైజాగ్‌లో కొవ్వొత్తులు కాగడాలు పట్టుకుని తిరిగితే ఏం వస్తుంది? మా పాలనలోనే వైజాగ్ విశ్వనగరంగా ఎదిగింది’ అని సీఎం వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని భారతదేశంలో తీసుకురావడం తన ఘనతేనని సీఎం చెప్పుకున్నారు. ఇండియాలో మొబైల్ లావాదేవీలు పెరిగాయని, విశాఖను సైబర్ సెక్యూరిటీ, ఫిన్ టెక్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని రూపొందిస్తున్నామని చంద్రబాబు వివరించారు. -
సినీ నటుడు కమల్ హాసన్ ఫైర్
తమిళ సినీ నటులు సూర్య, విజయ్ బాటలోనే ప్రముఖ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా పెటాపై మండిపడ్డారు. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జంతు హక్కుల సంస్థ పెటా తీరుపై మండిపడ్డారు. భారతీయ ఎద్దులను అణచివేసే అర్హత పెటాకు లేదని విమర్శించారు. కావాలంటే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాలో నిర్వహించే బుల్ రైడింగ్ రోడియోస్ను నిషేధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. ఎట్టకేలకు ప్రజలకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలుస్తున్నదని, నాయకుల రోజులు పోయాయని ఆయన పేర్కొన్నారు. వినయంతో కూడిన మార్గఅన్వేషకులు, సామాజిక సంస్కరణవేత్తలు మనకు కావాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు అంతటా జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపు దాల్చిన సంగతి తెలిసిందే. మెరీనా బీచ్‌లోని ఆందోళన చేస్తున్న యువతను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తమిళనాడు అంతటా నిరసనలు ఎగిసి పడుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
జల్లికట్టుపై కోయంబత్తూర్‌లో ఆందోళన
-
మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..
-
మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..
చెన్నై: నిన్నటిదాకా నినాదాలతో హోరెత్తిన చెన్నై మెరీనా బీచ్‌లో ఇప్పుడు బెదిరింపుల కేకలు వినిపిస్తున్నాయి. జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ కలకలం చెలరేగింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు సోమవారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు బీచ్‌ను ఖాళీచేయించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు "మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాం.."అని బెదిరించారు. మూకుమ్మడిగా జాతీయగీతాన్ని ఆలపిస్తూ పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినాసరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఒకవైపు బీచ్‌ను ఖాళీ చేయిస్తూనే, అటువైపునకు వచ్చే దారులన్నింటినీ మూసేశారు. ఆందోళనలకు నేతృత్వ వహిస్తోన్న బృందం ఒకటి పోలీసులతో మాట్లాడుతూ.. చట్టాన్ని గౌరవిస్తామని, అయితే మధ్యాహ్నం దాకా నిరసనలకు అనుమతినివ్వాలని, ఆ తర్వాత స్వచ్ఛందంగా నిరసన విరమిస్తామని వేడుకున్నారు. కానీ అందుకు పోలీసులు అంగీకరించేదు. "మీ లక్ష్యం నెరవేరింది. జల్లికట్టుకై ఆర్డినెన్స్ వచ్చింది. ఆట కూడా మొదలైంది. కాబట్టి మీరు ఆందోళన విరమించి, వెళ్లిపోండి"అని హెచ్చరించారు. అప్పటికీ వెనక్కి తగ్గని నిరసనకారుల్లో కొందరు సముద్రంవైపునకు పరుగెత్తే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని, బలవంతంగా వ్యాన్లు ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. శాశ్వతపరిష్కారం లభించేదాకా బీచ్‌నుంచి కదిలేదిలేదని బైఠాచించిన నిరసనకారులకు స్థానిక మత్స్యకారులు కూడా తోడవ్వడంతో పోలీసుల ప్రయత్నాలు జఠిలమయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు దారుణంగా కొడుతున్నారని కొందరు యువకులు మీడియాతో అన్నారు. చెన్నైతోపాటు మధురై జిల్లాలోనూ జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. -
జల్లికట్టు విషాదం: ఇద్దరి మృతి
నిరసనలో మరొకరు ► తమిళనాడులో తిరిగి ప్రారంభమైన జల్లికట్టు ► సీఎంకు నిరసనల సెగ.. ఆలంగానల్లూరులో ఆట ప్రారంభించకుండా చెన్నైకి వెళ్లిపోయిన సెల్వం సాక్షి, చెన్నై/మదురై: తమిళనాడు ప్రజల సంప్రదాయ క్రీడ జల్లికట్టు ఆదివారం తిరిగి ప్రారంభమైంది. పుదుకోట్టై జిల్లా రాపూసల్‌లో ఒక ఎద్దు పొడవడంతో ఇద్దరు చనిపోగా, 50 మందికిపైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మోహన్ , రాజా అనే వ్యక్తులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఆటకు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. మరోపక్క ఆట నిర్వహణకు శాశ్వత పరిష్కారం కావాలంటూ మదురైలో జరిగిన నిరసనలో పాల్గొన్న చంద్రమోహన్ (48) అనే వ్యక్తి డీహైడ్రేషన్ కు గురై చనిపోయాడు. నిషేధిత జల్లికట్టు నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డి నెన్స్ తీసుకురావడం తెలిసిందే. జల్లికట్టుకు ప్రసిద్ధికెక్కిన మదురై జిల్లా అలంగానల్లూరులో ఆదివారం ఆటను ప్రారంభించేందుకు మొదట మదురైకి వెళ్లిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి నిరసనల సెగ సోకింది. సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేంతవరకు ఆటను జరగనివ్వబోమని అలంగానల్లూరులోని నిరసనకారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన కాసేపు మదురై హోటల్లోనే ఉండిపోయారు. అలంగానల్లూరులో కాకుం డా దిండిగల్ జిల్లా నాతం కోవిల్పట్టిలో ఆయన ఆటను ప్రారంభిస్తారని భావించారు. అయితే అక్కడా నిరసనలు జరగడంతో సీఎం తిరిగి చెన్నైకి వెళ్లిపోయారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ఆట నిర్వహణకు శాశ్వత పరిష్కారం. ఆటపై నిషేధం పూర్తిగా తొలగిపోయింది. సోమవారం నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్ ను చట్టంగా మారుస్తాం. అలంగానల్లూరులోని స్థానికులు నిర్ణయించిన రోజున అక్కడ ఆట జరుగుతుంది’ అని సీఎం చెప్పారు. జల్లికట్టును ప్రారంభించేందుకు జిల్లాలకు వెళ్లిన పలువురు మంత్రులు కూడా ప్రజల నిరసనతో వెనుదిరిగారు. ఆర్డినెన్స్ కు ఆటంకాలూ ఎదురవకుండా సుప్రీంకోర్టులో రాష్ట్ర ›ప్రభుత్వం కేవియేట్ పిటిషన్ దాఖలు చేసింది. శాశ్వత పరిష్కారం కావాల్సిందే.. జల్లికట్టు నిర్వహణకు అన్ని అడ్డంకులూ తొలగిస్తూ శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిందేనని ఆట మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం కావాలంటూ చెన్నై మెరీనా బీచ్‌లో ఆదివారం ఆరో రోజూ నిరసన కొనసాగించారు. ఆర్డినెన్స్ నేపథ్యంలో ఆందోళనను మార్చి 31వరకు వాయిదా వేద్దామని జల్లికట్టు ఉద్యమ నేతల్లో కొందరు పిలుపుచ్చారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని యువత, విద్యార్థులు చెప్పారు. కంబళను నిర్వహించి తీరతాం బెంగళూరు: కర్ణాటక హైకోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ చిత్తడి పొలాల్లో దున్నపోతుల పందేన్ని(కంబళ) ఈ నెల 28న మంగళూరులో నిర్వహించి తీరతామని నిర్వాహకులు స్పష్టం చేశారు. జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తినిచ్చిందని కంబళ కమిటీ అధ్యక్షుడు అశోక్ రాయ్ అ న్నారు. పెటా పిటిషన్ పై హైకోర్టు గత ఏడాది నవంబర్‌లో కంబళపై స్టే విధించింది. -
ఇక సమరమే!
► నేటి నుంచి సభా పర్వం ► అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ► గవర్నర్ ప్రసంగంతో శ్రీకారం ► సభా మందిరంలో మార్పులు చేర్పులు ► 24న అమ్మకు సంతాపం ► 25న జల్లికట్టు ముసాయిదా సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమరానికి సర్వం సిద్ధమైంది. జల్లికట్టు ప్రకంపనల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సభాపర్వం వాడివేడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్(ఇన్ )విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సోమవారం పది గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక, ఈనెల 24న అమ్మ జయలలిత మృతికి సంతాపం తీర్మానం, 25వ తేదీన జల్లికట్టుకు మద్దతుగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించే విధంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలం విషయంగా ముసాయిదాలు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికారంలోకి వచ్చినానంతరం దివంగత సీఎం జయలలిత నేతృత్వంలో గత ఏడాది బడ్జెట్ సమావేశాలు సాగాయి. తదుపరి చోటుచేసుకున్న పరిణామాలతో అమ్మ జయలలిత ఆసుపత్రి పాలు కావడం, చివరకు అందర్నీ వీడి అనంత లోకాలకు చేరడం చోటు చేసుకున్నాయి. సీఎంగా అమ్మ నమ్మిన బంటు పన్నీరుసెల్వం పగ్గాలు చేపట్టినా, రాష్ట్రంలో పాలన అంతంత మాత్రమే. ఇక, జల్లికట్టు నినాదం పన్నీరుసెల్వం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోనే పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో తొలి అసెంబ్లీ సమావేశానికి తగ్గ ఏర్పాట్ల మీద సీఎం పన్నీరుసెల్వం దృష్టి పెట్టారు. ఆయా విభాగాల్లోని కేటాయింపులు, పథకాల తీరు తెన్నుల మీద మంత్రులు సమీక్షలు ముగించి, ప్రతి పక్షాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సభాపర్వం తేదీని రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశానికి తగట్టు సర్వం సిద్ధమైంది. ఇక సమరమే...జల్లికట్టు ప్రకంపన తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశం అవుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు బలమైన ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. దీంతో సభాపర్వం వాడి వేడిగా సాగే అవకాశాలు ఎక్కువే. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే తొలి సమావేశం కావడంతో, ఇందులో ఏదేని కొత్త పథకాలను ప్రకటించేనా అన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. అమ్మ పథకాల కొనసాగింపుతో పాటు, ఇతర పథకాల మీద పన్నీరు దృష్టి పెట్టేనా అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. అమ్మ జయలలిత లేని తొలి సమావేశం కావడంతో ఇక, అన్నాడీఎంకే వర్గాల్లో అమ్మ భక్తి ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక, ఈ ఏడాదిలో తొలి సమావేశాన్ని ప్రారంభించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం 9.50 గంటలకు అసెంబ్లీ ఆవరణకు చేరుకుంటారు. స్పీకర్ ధనపాల్, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఆయనకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలుకుతారు. పది గంటలకు సరిగ్గా గవర్నర్ ఆంగ్ల ప్రసంగం ప్రారంభం అవుతుంది. తదుపరి ఆ ప్రసంగాన్ని స్పీకర్ ధనపాల్ తమిళంలో అనువదిస్తారు. ఇంతటితో తొలి రోజు సభ ముగుస్తుంది. తదుపరి స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, ముసాయిదాల గురించి సమీక్షించి ఇందులో నిర్ణయం తీసుకుంటారు. రేపు అమ్మకు సంతాపం: అందరి అమ్మ జయలలిత భౌతికంగా దూరమైనానంతరం జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సంతాప తీర్మానం, సందేశాలు సభలో సాగించాల్సి ఉంది. రెండో రోజు మంగళవారం అమ్మ జయలలిత మృతికి సంతాప తీర్మానం, నేతల ప్రసంగాలు ఉంటాయి. అదే రోజు మాజీ మంత్రి కోశిమణితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ గవర్నర్ బర్నాల, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రోల మృతికి సంతాపంగా మౌనం పాటించనున్నారు. ఈ ప్రక్రియతో రెండో రోజు సభ ముగియనుంది. ఇక మూడో రోజు బుధవారం నుంచి సభలో వాడివేడి ప్రసంగాలు సాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా, చర్చలు, జల్లికట్టు ముసాయిదా సభ ముందు కు రానున్నాయి. అలాగే, స్థానిక సంస్థల ఎన్నిక లు ఆగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ సభలోముసాయిదాను దాఖలు చేయనున్నారు. ఇక, అమ్మ జయలలిత సీఎంగా ఉన్న సమయంలో శాసనసభ పక్ష నేతగా పన్నీరు సెల్వం వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన సీఎం పగ్గాలు చేపట్టిన దృష్ట్యా, శాసన సభ పక్షనేతగా ఎవరు వ్యవహరిస్తారోనన్న ఎదురుచూపులు అన్నాడీఎంకేలో పెరిగాయి. ఇక, అమ్మ సభలో లేని దృష్ట్యా, మందిరంలో కొన్ని మార్పులు చేర్పులు జరి గినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.అసెం బ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా, అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సమాయత్తమయ్యే విధంగా డీఎంకే శాసనసభా పక్ష సమావేశం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగనుంది. -
రంకెలేసిన తంబి
► ఓ పక్క నిరసన..మరోపక్క రంకెలేసిన బసవన్న ► తెరుచుకున్న వాడి వాసల్ ► తిరుచ్చి, పుదుకోట్టైలలో జల్లికట్టు జోరు ► పుదుకోట్టైలో ఇద్దరి బలి ► అలంగానల్లూరులో సీఎంకు వ్యతిరేకత ► పోటెత్తిన మెరీనా తీరం నిషేధపు కట్లు తెంచుకున్నా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా జల్లికట్టు విషయంలో తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. శాశ్వత పరిష్కార నినాదం మిన్నంటింది. అత్యవసర ఆర్డినెన్స్ తో ఆదివారం కొన్నిచోట్ల బసవన్నలు రంకెలే శాయి. మరెన్నో చోట్ల వ్యతిరేకత తప్పలేదు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరులో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సీఎం పన్నీరు సెల్వం వెనుదిరగాల్సి వచ్చింది. పుదుకోట్టైలో నిర్వహించిన సాహసక్రీడలో రంకెలేసిన ఎద్దుల దాడిలోఇద్దరు క్రీడాకారులు బలి అయ్యారు. సాక్షి, చెన్నై : తమిళుల సాహస, సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు పట్టు బడుతూ సాగుతున్న నిరసనల గురించి తెలిసిందే. మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుతూ శనివారం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా తమిళ తంబీలు పట్టు వీడడం లేదు. కంటి తుడుపుచర్యతో మాకేంటి, శాశ్వత పరిష్కారం లక్ష్యం అంటూ జల్లికట్టు మద్దతు ఉద్యమాన్ని కొనసాగిస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. సెలవు రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తినా, ఎక్కడికక్కడ బలగాల్ని మోహరింప చేస్తుండడం గమనార్హం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగి తీరుతామని మద్దతుదారులు ప్రకటించడం విశేషం. ఇక, ఆర్డినెన్స్ తో ఆదివారం జల్లికట్టుకు శ్రీకారం చుట్టి తీరుతానంటూ ముందుకు సాగిన సీఎం పన్నీరు సెల్వంతో పాటు పలువురు మంత్రులకు వ్య తిరేకత తప్పలేదు. అలంగానల్లూరులో సీఎం పన్నీరు సెల్వం పాచికలు పారలేదు. అన్ని చో ట్ల వాడి వాసల్ తెరచుకున్నా, కొన్ని చోట్ల మా త్రమే బసవన్నలు రంకెలేస్తూ దూసుకొచ్చాయి. అటు ఆట : నిషేధపు కట్లు తెంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో దక్షిణాదిలోని జల్లికట్టుకు పేరు గడించిన తిరుచ్చి, మదురై, దిండుగల్, శివగంగై జిల్లాల్లో, డెల్టా పరిధిలోని తంజావూరు, పుదుకోట్టై జిల్లాల్లో జల్లికట్టుకు, పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్, నామక్కల్‌లలో రెక్లాతో ఎడ్ల పందేలకు చర్యలు తీసుకున్నారు. ఆటకు తగ్గ అన్ని ఏర్పాట్లతో ముందుకు సాగినా, వ్యతిరేకత మాత్రం తప్పలేదు. తిరుచ్చి మనప్పారైలో మూడు, నాలుగు రోజులుగా నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టు సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక, కట్లు తెంచుకోవడంతో ఆదివారం మరింత ఉత్సాహంతో జల్లికట్టులో ఎద్దులతో కలిసి క్రీడాకారులు రంకెలు వేస్తూ తమ సత్తాను చాటుకున్నారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను నిర్వాహకులు అందజేశారు. పుదుకోట్టైలోని ఇలుపురు సమీపంలోని రాపూసల్ గ్రామంలో జల్లికట్టును మంత్రులు విజయభాస్కర్, పాండియరాజన్ ప్రారంభించారు. వాడివాసల్ నుంచి ఎద్దులు దూసుకొచ్చాయి. ఉత్సాహంగా, ఆనందోత్సాహాలతో జల్లికట్టు సాగింది. అయితే, ఎద్దుల్ని పట్టుకునే క్రమంలో లక్ష్మణ పట్టికిచెందిన మోహన్, ఉడుక్కురుకు చెదిన రాజా అనే క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇదే ప్రాంతంలో మరో యాభై మంది స్వల్పం గా గాయపడ్డారు. ఆగమేఘాలపై ఏర్పాట్లు చేయడంతోనే భద్రత కరువైందని, పాలకుల తీరుతో ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయని సహచర క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక, రామనాథపురంలో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో రెండు రోజులుగా జల్లికట్టు సాగినా, ఆదివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎద్దులు దూసుకొచ్చాయి. ఇక, కోయంబత్తూరు కొడీస్సియా మైదానంలో రెక్లా పోటీలను మంత్రి ఎస్పీ వేలుమణి జెండా ఊపి ప్రారంభించారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో రెక్లా పోటీలను మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. రెక్లా పోటీలకు వచ్చిన మంత్రులకు జల్లికట్టు మద్దతు దారుల సెగ తగిలింది. వారిని బుజ్జగించి బయట పడేలోపు మంత్రులకు ముచ్చెమటలు తప్పలేదు. ఇటు పట్టు : జల్లికట్టుకు ప్రసిద్ది గాంచిన అలంగానల్లూరులో ‘ఆట’కు శ్రీకారం చుట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే సాగాయి. శాశ్వత పరిష్కారం నినాదంతో వాడివాసల్ వైపుగా ఏ ఒక్కర్నీ యువత, గ్రామస్తులు, మద్దతుదారులు వెళ్లనివ్వ లేదు. జల్లికట్టుకు జెండా ఊపుతానంటూ మదురైకు రాత్రికి రాత్రే పరుగులు తీసిన సీఎం పన్నీరుసెల్వం నిరాశతో వెనుదిరగక తప్పలేదు. జోరు వాన కురిసినా మద్దతుదారులు ఏ మాత్రం వెనక్కు తగ్గని దృష్ట్యా, ఆగమేఘాలపై జల్లికట్టు నిర్వాహకుల్ని పిలిపించి బుజ్జగించేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఫలితం శూన్యం. వాడివాసల్ తెరిచే ఉందని, ప్రజలు ఎప్పుడు కోరితే, అప్పుడు జల్లికట్టుకు సిద్ధమని మదురై జిల్లా కలెక్టర్ వీరరాఘవులు ప్రకటించారు. దిండుగల్ జిల్లా నత్తం, సాత్తూరు, సేలం ఆత్తూరు, తంజావూరులో జల్లికట్టుకు ఏర్పాట్లు సాగినా, వ్యతిరేకతతో రద్దు చేసుకోక తప్పలేదు. ఇక, జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతుగా సెలవు రోజు పెద్ద ఎత్తున జన సమూహం తోడు కావడం విశేషం. ఈరోడ్‌లోని వీరప్పన్ పాళయంలో బీజేపీ నేతృత్వంలో జల్లికట్టుకు సాగిన ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీ శాయి. యువత తిరగ బడడంతో, ఓ సందర్భంలో రాళ్లు రువ్వడంతో అక్కడికి వచ్చిన అధికారులు, బీజేపీ వర్గాలు పరుగులు తీశారు. మదురై మేలూరులో వర్షంలోనూ నిరసన కొనసాగగా, రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు మద్దతు ఉద్యమంలో శాశ్వత పరిష్కారం నినాదం మిన్నంటింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా స్పం దించిన జంతు సంరక్షకుడు రాధా రాజన్ ఇరకాటంలో పడ్డారు. బీసెంట్‌నగర్‌లోని ఆయన ఇంటిని డీఎండీకే వర్గాలు ముట్టడించాయి. ఇదే శాశ్వతం : అలంగానల్లూరులో జల్లికట్టుకు జెండా ఊపేందుకు వెళ్లి నిరాశతో చెన్నైకు చేరుకున్న సీఎం పన్నీరు సెల్వం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రూపొందించిన ఆర్డినెన్స్ శాశ్వతం అని, ఇది తాత్కాళికం మాత్రం కాదు అని స్పష్టం చేశారు. అన్ని చోట్ల వాడివాసల్ తెరచుకుందని, జల్లికట్టుకు అనుమతుల్ని కలెక్టర్లు ఇస్తున్నారని, జిల్లాల ఎస్పీలు భద్రతను కల్పిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చట్ట, నిబంధనలమేరకు ముందుకు సాగుతోందని, ఆర్డినెన్స్ కు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి , రాష్ట్రపతి ఆమోదం పొంది తీరుతామని స్పష్టం చేశారు. అత్యవసరంగా తీసుకొచ్చిన చట్టానికి చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ నియమ నిబంధనలు సిద్ధం అయ్యాయని, ప్రభుత్వ గెజిట్‌లో అన్ని వివరాలను ప్రకటించామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టు మద్దతుదారులు ఎందుకు ఏకీభవించడం లేదన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ› ఆ కారణం ఏమిటో మీకే తెలుసు అంటూ పన్నీరు ముందుకు సాగారు. ఇక, ఆర్డినెన్స్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాని రీతిలో సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఉండడం ఆహ్వానించ దగ్గ విషయం. సరైన వివరణ ఇవ్వండి : జల్లికట్టు కోసం ప్రత్యేకంగా అత్యవసర ఆర్డినెన్స్ తీసుకు రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ పని ముందే చేసి ఉంటే, ఇంత పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చి ఉండేది కాదన్నారు. అయితే, ఇదే శాశ్వతం అని ప్రకటనలు చేయడం కాదు అని, ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించేందుకు తగ్గ పూర్తి వివరణను సీఎం పన్నీరుసెల్వం జల్లికట్టు మద్దతు దారులుకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయంగా మద్దతుదారుల వద్దకు సీఎం వెళ్లాలని సూచించారు. గతంలో జల్లికట్టు విషయంగా సాగిన నాటకీయ నిర్ణయాలతోనే ప్రస్తుతం, ప్రభుత్వ నిర్ణయంతో జల్లికట్టుమద్దతు దారులు ఏకీభవించడం లేదన్న విషయాన్ని సీఎం గుర్తెరగాలని హితవు పలికారు. జల్లికట్టుకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా నినాదం మిన్నంటింది. ఆదివారం ఎక్కడిక్కడ ఆందోళనలు సాగాయి. చెన్నై మెరీనా తీరంలో జన సందోహం పోటెత్తింది. యువత, విద్యార్ధులు ఆందోళనల బాటలో ఉదృ్ధతంగా దూసుకెళ్తుండడంతో సోమవారం నుంచి కళాశాలలు, పాఠశాలలు తెరచుకోనున్నడం గమనార్హం. దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నమ్మకాన్ని కలిగించేలా ఉన్నాయి. మార్చి 31వరకు సంయమనం పాటిద్దాం. అంతవరకు ఉద్యమాన్ని వాయిదా వేద్దామంటూ ఆదివారం రాత్రి 10గంటల సమయంలో జల్లికట్టు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన నిర్వాహకులు చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ నిర్వాహకులు చెన్నై ప్రెస్‌క్లబ్ వేదికగా ఈ ప్రకటన చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వెనకేసుకొచ్చే రీతిలో ఉండడం గమనార్హం. అదే సమయంలో వీరి చర్యలను తప్పుబట్టేవారు తెరమీదకు వస్తున్నారు. దీంతో జల్లికట్టు ఉద్యమం సోమవారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. కొందరు విద్యార్థులయితే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని మెరీనాతీరంలో బైఠాయించారు. -
నయనే చెప్పాలి
నటి నయనతారపై దర్శకుల ఒత్తిడి పెరుగుతోంది. అలాంటి ఒత్తిడిని ఆమె ఆనందంగా స్వాగతిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే నయనతార తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మాయ చిత్రం తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఈ అమ్మడి తలుపుతడుతున్నాయన్నది తెలిసిందే. ప్రస్తుతం నయన నటిస్తున్న చిత్రాల్లో ఆ తరహా చిత్రాలే అధికం. పలు చిత్రాల్లో నటించిన నయనతార ఇప్పటివరకూ ఒకే ఒక్క చిత్రంలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. మిగతా వాటికి అరువుగొంతే. ఆ ఒక్క చిత్రం తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో నటించిన నానుమ్ రౌడీదాన్ . ఆ చిత్రానికి నయనతార సొంతంగా చెప్పిన డబ్బింగ్ చాలా ప్లస్ అయ్యిందన్నారు. ఈ భామ తాజాగా సెంట్రిక్ పాత్రల్లో నటిస్తున్న అరమ్, దోరా చిత్రాలకు తననే డబ్బింగ్ చెప్పాలని దర్శకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందట. నయన కలెక్టర్‌గా నటిస్తున్న చిత్రం అరమ్. మింజూర్ గోపీ దర్శకుడు. ఈయన తెలుపుతూ నయనతార తమిళ భాషను చాలా ఫ్లూయంట్‌గా మాట్లాడతారన్నారు. తమ చిత్రానికి ఆమె డబ్బింగ్ ఎస్సెట్ అవుతుందన్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం దోరా. దాస్ రామసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్ కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రానికి నయనతార డబ్బింగ్ చెప్పాలని దర్శకుడు కోరుకుంటున్నారట. అందుకు నయనతార కూడా సమ్మతించినట్లు సమాచారం. దీంతో తమిళంలో నయనతార చిత్రాలకు ఆమె సొంత గొంతునే వినవచ్చునంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇటీవల నడిగర్‌సంఘం జల్లికట్టుకు మద్దతుగా నిర్వహించిన మౌనపోరాటానికి డుమ్మా కొట్టిన ఈ కేరళ బ్యూటీ మెరీనాతీరానికి వెళ్లి ప్రజల పోరాటానికి మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారిందన్నది గమనార్హం. -
అర్ధరాత్రి.. గుట్టుగా ఆందోళనస్థలికి సూపర్ స్టార్!
జల్లికట్టు ఆందోళనకు విజయ్ మద్దతు తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా వేలాదిమంది యువత జరిపన ఆందోళనకు మద్దతుగా తమిళ సినీ నటుల సంఘం నడిగర్ మౌన నిరసన ప్రదర్శన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తోపాటు పలువురు తమిళ అగ్రనటులు పాల్గొన్నారు. అయితే, ఇందులో తమిళ అగ్రహీరో, ఇలయదళపతి విజయ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అదే రోజు రాత్రి విజయ్ మేరినా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న లక్షలమంది యువతకు ఆయన మద్దతు పలికారు. వారితో కలిసి నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా నినాదాలు చేశారు. జల్లికట్టు ఆందోళనకు ముఖ్యకేంద్రంగా ఉన్న చెన్నైలోని మెరీనా బీచ్‌కు రహస్యంగా వచ్చిన విజయ్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. తాను పాల్గొనడం వల్ల అందరి దృష్టి తనపై పడి.. ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇలా గుట్టుగా పాల్గొన్నారని సన్నిహత వర్గాలు తెలిపాయి. నడిగర్ సంఘం జరిపిన మౌనప్రదర్శనను యువత తప్పుబట్టారు. తాము జోరుగా చేస్తున్న ఆందోళన నుంచి మీడియా దృష్టిని ఇది మరలుస్తుందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో నేరుగా యువత మనోగతానికి అనుగుణంగా వారితో కలిసి విజయ్ ఆందోళనలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అర్థరాత్రి మేరినా బీచ్‌లో కనిపించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
జల్లికట్టుకు బ్రేక్.. ఆపింది తమిళ తంబీలే
-
జల్లికట్టుకు బ్రేక్.. ఆపింది తమిళ తంబీలే
చెన్నై: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మళ్లీ బ్రేక్ పడింది. మూడేళ్ల నిషేధపు కట్టు తెంచుకొని పూర్వవైభవంతో సందడి మొదలవుతుందనుకున్న వేళ మరోసారి అంతరాయం ఏర్పడింది. అయితే, ఈసారి అడ్డుకుంది మాత్రం తమిళ తంబీలే. జల్లికట్టు తమిళుల సంప్రదాయ క్రీడ అనే విషయం తెలిసిందే. మూగజీవాలను ఈ ఆట పేరుతో వేధిస్తున్నారని పెటా కోర్టుకు ఇంకొన్ని స్వచ్ఛంద సంస్థలు కోర్టుకు వెళ్లడంతో గత మూడేళ్లుగా ఈ క్రీడపై నిషేధం కొనసాగుతోంది. దీంతో ఈసారి తమిళులలంతా ఒక్కటై తమ సంప్రదాయ క్రీడకు అడ్డుచెప్పొద్దని నినదిస్తూ గత నాలుగు రోజులుగా రాష్ట్రమంతటా ఆందోళనలు చేస్తున్నారు. దీనికి అనూహ్య మద్దతులభించడంతోపాటు ఆందోళన ఉదృతం అయింది. ఈ నేపథ్యంలో ఈ ఆట నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా దానిని గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభమైంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభించేందుకు రాగా జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం వచ్చే వరకు క్రీడను ప్రారంభించవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ క్రీడను ప్రారంభించకుండానే ముఖ్యమంత్రి సెల్వం అలంగానల్లూరు నుంచి వెనుదిరిగారు. విద్యార్థులతో ఆయన మధ్యాహ్నం భేటీ అవనున్నారు. మరోపక్క, మంత్రులు కూడా ఉదయం 11గంటల ప్రాంతంలో తమ జిల్లాలో ఈ క్రీడను ప్రారంభించాల్సి ఉండగా అక్కడ కూడా నిలిచిపోయాయి. -
లంఘించిన బసవన్నలు.. జల్లికట్టూ షురూ
-
కట్టు తెంచుకున్న జల్లికట్టు
-
చిన్నమ్మ మంతనాలు
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ ఆగమేఘాలపై పార్టీ సీనియర్లను పోయెస్ గార్డెన్‌కు పిలిపించారు. సీఎం పన్నీరుసెల్వం తో పాటు పది మందికి పైగా మంత్రులు పోయెస్ గార్డెన్‌కు శుక్రవారం రాత్రి పరుగులు తీశారు. పార్టీ పరంగానూ, జల్లికట్టు విషయంగానూ వీరితో చిన్నమ్మ మంతనాలు సాగాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం పార్టీ పరంగా పట్టుకు చిన్నమ్మ శశికళ తీవ్రంగానే దూసుకెళ్తోన్నారు. జిల్లాల వారీగా సమీక్షలతో కసరత్తుల్ని ముగించారు. పార్టీ బలోపేతంతో పాటు, ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలకు తగ్గ చర్యల్ని తీసుకుని, ఆ దిశగా ముందుకు సాగే పనిలో ఉన్నారు. అదే సమయంలో చిన్నమ్మ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీపా వెన్నంటి నిలిచే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు దీపా పేరవై బాట పడుతుండడం, తృతీయ శ్రేణి కేడర్ పెద్ద సంఖ్యలో అటు వైపుగా కదులుతుండటంతో వారిని నివారించేందుకు తగ్గవ్యూహ రచనలో చిన్నమ్మ ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పెనలా జల్లికట్టు ఉద్యమం ఎగసి పడడంతో అత్యవసరంగా పరిస్థితిని చిన్నమ్మ సమీక్షించి ఉండడం గమనార్హం. చిన్నమ్మ మంతనాలు : చిన్నమ్మ పార్టీ పగ్గాలు చేపట్టినానంతరం ఆ పార్టీ కోశాధికారి, సీఎం పన్నీరు సెల్వం తీవ్ర సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్టు సంకేతాలుఉన్నాయి. పలువురు మంత్రులు బహిరంగంగానే చిన్నమ్మ మా సీఎం అంటూ స్పందిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నట్టుగా తీవ్ర ప్రచారం రాష్ట్రంలో సాగుతోంది. ఈ సమయంలో ఆగమేఘాలపై సీఎం పన్నీరు సెల్వంను పోయెస్ గార్డెన్‌కు చిన్నమ్మ పిలిపించారు. అలాగే, పది మందికి పైగా మంత్రులు పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కారు. పార్టీలో సీనియర్లతో చర్చ అన్నట్టుగా ఈ సమావేశం సాగినా, సీఎం పన్నీరు సెల్వంతో పాటు సీనియర్ మంత్రులు, ఆయా జిల్లాలకు కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న దిండుగల్ శ్రీనివాసన్, ఎడపాడి పళని స్వామి, తంగమణి, ఎస్పీ వేలుమణి, డి.జయకుమార్, ఎంసీ సంపత్, కామరాజ్, కడంబూరు రాజు, ఓఎస్ మణి, సరోజ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి గంట పాటు చిన్నమ్మతో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా పార్టీ , ప్రభుత్వానికి తలవంపులు రానివ్వకుండా జాగ్రత్తలు పడాలని, జల్లికట్టు విషయంలో యువత పెద్ద ఎత్తున ఏకం, కావడం, దీని వెనుక ఉన్న శక్తుల గురించి ఆరా తీసే విధంగా చిన్నమ్మ మంతనాలు సాగి ఉండడం గమనించాల్సిన విషయం. చిన్నమ్మతో భేటీ తదుపరి శనివారం జల్లికట్టు విషయంలో పన్నీరు ప్రభుత్వం ఆగమేఘాల మీద పావుల్ని కదపడం విశేషం. -
దేశం గర్వించేలా చేస్తున్నారు
యువకుల పోరాటాన్ని సినిమాకు చెందిన వారు దోచుకోకూడదంటున్నారు నటుడు కమలహాసన్. తమిళనాట జల్లికట్లు ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. పారంపర్య క్రీడ జల్లికట్టు తమిళుల వీరత్వానికి చిహ్నం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకునేది లేదు అంటూ తమిళనాడులో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రజానీకం ఆందోళన బాట పట్టారు. జల్లికట్టును ఎలాంటి ఆంక్షలు లేకుండా సాధించుకుంటామన్న లక్ష్యానికి దిశగా ఇప్పటికే చేరుకున్నారు. వారికి తమిళసినిమా మద్దతుగా నిలిచింది. ఆది నుంచి జల్లికట్టుకు సపోర్ట్ చేస్తున్న విశ్వనటుడు కమలహాసన్ యువత పోరాట పఠిమను ప్రశంసించారు. జల్లికట్టు వ్యవహారంలో ప్రపంచం మనల్ని చూస్తోంది. ఇక్కడ నేను మానవతా దృష్టితో చూస్తున్నది యువత కూటమిని కాదు నవ ఉన్నత ఉపాధ్యాయ కూటమిని. వారికి ప్రణమిల్లుతున్నాను. జల్లికట్టు కోసం తమిళనాడులో జరుగుతున్న ఆందోళన శిఖరాగ్రస్థాయికి చేరుకుంది. మండే ఎండలను, కురిసే మంచును, వర్షాలను లెక్కచేయకుండా రేయింబవళ్లు పోరాడుతున్నారు. ప్రపంచం మనల్ని చూస్తోంది. భారతదేశం గర్వించేలా చేస్తున్నారు. మీరు లక్ష్య సాధన విషయంలో దృఢంగా ఉండండి. 1930లో సంఘటిత శక్తితోనే మద్రాస్ ఏర్పడింది. అది 2017లో మరోసారి విజయవంతంగా సాగుతోంది. రాజకీయ పార్టీలు, టీవీ ప్రచారాలను దృష్టిలో పెట్టుకోండి. సామాజిక మాధ్యమాల ద్వారా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. అహింసామార్గంలో పోరాడి లక్ష్యాన్ని చేరుకోండి. సినీ నక్షత్రాలు యువత పోరాటానికి మద్దుతుగా మాత్రమే నిలబడండి. వారి పోరాటాన్ని తస్కరించరాదన్నదే నా అభిప్రాయం అని కమలహసన్ జల్లికట్టుకు పోరాడుతున్న యువతను ఉద్దేశించి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
మాస్క్‌తో మెరీనాకు దళపతి
జల్లికట్టు పోరాటం తమిళనాట ఉదృ్ధత స్థాయికి చేరిన విషయం తెలిసిందే. యువత ప్రారంభించిన ఈ పోరాటం ఈ స్థాయికి చేరుతుందని మొదట ఎవరూ ఊహించలేదు. అలాంటిది జల్లికట్టు పోరాటం ఒక్కసారిగా ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఈ పోరాటాన్ని ఏ రాజకీయ పార్టీలు, పోలీసు బలగాలు కట్టడి చేయలేని పరిస్థితి. తమిళులు స్వచ్ఛందంగా చేస్తున్న పోరాటం ఇది. ఈ పోరాటం ఇష్టంలేని కొందరు కూడా మద్దతు పలకాల్సిన పరిస్థితి. అయితే కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్ జల్లికట్టుకు తాము సైతం అంటూ గొంతు కలిపింది. జల్లికట్టుకు మద్దతుగా నిరసనల కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం శ్రుకవారం మౌనపోరాటం చేసింది. ఇది విజయవంతం అయ్యిందనే చెప్పాలి. ఇందులో సినీ కళాకారులు భారీగా పాల్గొన్నారు. అయితే సంఘ బహిష్కరణకు గురైన మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగై చంద్రశేఖర్ లాంటి వారు ఈ మౌన పోరాటానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే జల్లికట్టుకు వ్యక్తిగతంగానూ మద్దతు పలికిన సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, విశాల్, కార్తీ లాంటి వారు మౌన పోరాటంలో పాల్గొన్నారు. అలాంటిది ఇళయదళపతి విజయ్ నటీనటుల సంఘం మౌన పోరాటానికి డమ్మా కోట్టారు. అయితే శుక్రవారం రాత్రి మెరీనా ప్రాంతానికి వెళ్లి అక్కడ జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్న యువతను కలిసి సంఘీభావాం తెలిపారు. అదీ ముఖానికి ముసుగుతో వెళ్లారు. నటీనటుల మౌన పోరాటంలో పాల్గొనని విజయ్ ముసుగుతో మెరీనాకు వెళ్లి జల్లికట్టుకు మద్దతుగా నిలవడంలో మర్మమేమిటన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
కట్టు తెంచుకున్న జల్లికట్టు
• తమిళనాడు ఆర్డినెన్స్‌కు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆమోదం • నేడు ఆటను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం • సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటున్న నిరసనకారులు • అప్పటి వరకు మెరీనా బీచ్ నుంచి కదలబోమని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టు మూడేళ్ల నిషేధపు కట్లు తెంచుకుని తిరిగి పూర్వవైభవంతో సందడి చేయనుంది. ఆట నిర్వహణకు అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. ఆర్డినెన్స్ రాకతో ఆదివారం రాష్ట్రంలో జల్లికట్టు అట్టహాసంగా తిరిగి ప్రారంభం కానుంది. ఆటకు ప్రసిద్ధిగాంచిన మదురైజిల్లా అలంగానల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం ఉదయం జెండా ఊపి క్రీడను ప్రారంభిస్తారు. ఆట కోసం 350 ఎద్దులను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. జల్లికట్టు కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడం, బంద్‌తో రాష్ట్రం స్తంభించడంతో.. తమిళనాడు ప్రభుత్వ ముసాయిదా ఆర్డినెన్స్‌ను కేంద్రం శుక్రవారం ఆమోదించడం తెలిసిందే. మెరీనా బీచ్‌లో నిరసనలో ప్లకార్డు చేతపట్టుకున్న చిన్నారి జంతుహింస నిరోధక చట్టం–1960లోని ప్రదర్శన జంతువుల(పెర్ఫామింగ్ యానిమల్స్) జాబితా నుంచి ఎద్దులను తొలగించేందుకు సవరణ కోసం ఈ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనికి రాష్ట్రపతి తెలిపిన ఆమోదం శుక్రవారం రాత్రి తమకు చేరిందని, ఆటపై నిషేధం తొలగినట్లేనని సీఎం తెలిపారు. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్ శాశ్వత పరిష్కారమని, దీని స్థానంలో బిల్లును, జంతుహింస నిరోధక చట్టానికి సవరణను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. ఆట విషయంలో మద్దతిచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. ఫోన్లోనూ కృతజ్ఞతలు తెలిపారు. ఆగని నిరసనలు ఆర్డినెన్స్‌పై జల్లికట్టు మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం కావాలని, అంతవరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. చెన్నై మెరీనా బీచ్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శాశ్వత పరిష్కారం లభించేంతవరకు బీచ్ నుంచి కదలబోమని అక్కడున్న 2 లక్షల మంది ఉద్యమకారులు చెప్పారు. జల్లికట్టుకు మద్దతుగా వళ్లువర్‌కోట్టంలో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ నిరాహార దీక్ష చేశారు. అన్ని యత్నాలూ చేస్తున్నాం: మోదీ తమిళ ప్రజల సాంస్కృతిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రధాని మోదీ శనివారం ట్వీట్ చేశారు. సుసంప్ననమైన తమిళనాడు సంస్కృతిని చూసి గర్వపడుతున్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పెటాకు సూర్య నోటీసులు జల్లికట్టుకు తాను మద్ధతు ఇవ్వడంపై జంతు సంరక్షణ సంస్థ (పెటా) నిర్వాహకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు సూర్య స్పందించారు. జల్లికట్టు పోరాటానికి సూర్య వంత పాడటం ఆశ్చర్యంగా ఉందని, తన సినిమా ప్రచారానికి దీన్ని వాడుకుంటున్నారని సంస్థ నిర్వాహకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సూర్య తన న్యాయవాది ద్వారా ఆ సంస్థకు నోటీసులు పంపారు. -
జల్లికట్టు కనికట్టు
త్రికాలమ్ తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు జల్లికట్టు సుగ్రీవాజ్ఞ (ఆర్డినెన్స్) ముసాయిదాను ఆమోదించడంతో సముద్రతీరంలో అలజడి సద్దుమణిగింది. చెన్నై మెరీనా బీచ్ నిరసనధ్వనులతో హోరెత్తడానికీ, యువజనంతో పోటెత్తడానికీ కారణం ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారకులు ఎవరు? తప్పు ఎవరిది? అమలు సాధ్యం కాని తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానానిదా? వాటిని అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వానిదా? కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రజలదా? ఈ ఉదంతం నుంచి నేర్చుకోవలసిన గుణపాఠాలు ఏమిటి? సముద్రతీరంలో ఉద్యమించిన వారిలో అత్యధికులు జల్లికట్టు క్రీడను చూసి ఉండరు. ఎడ్లను తాకి ఉండరు. సోషల్ మీడియా విశ్వరూపం ఉద్యమకారులలో రైతులు తక్కువ. కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న యువతీ యువకులు ఎక్కువ. సాఫ్ట్వేర్ ఉద్యోగులూ ఉన్నారు. నినాదాలు చేయడం, ధిక్కారస్వరం వినిపించడం కనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద ప్రదర్శనలు లేవు. మెరీనాలో యువతరం సంబరం చేసుకున్నట్టు దృశ్యాలు సూచించాయి. యువ శక్తి కొట్టవచ్చినట్టు కనిపించింది. రాజకీయ నాయకులను దగ్గరికి రానీయ లేదు. సినీ తారలనూ దూరంగానే పెట్టారు. ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తు న్నామంటూ యువతీయువకులు ఎవ్వరి నుంచీ సహాయం స్వీకరించలేదు. మదురై నుంచీ, కోయంబత్తూరు నుంచీ, ఇతర దూరప్రాంతాలనుంచీ వచ్చిన వారి కోసం భోజన ఏర్పాట్లు చేయడానికి కొందరు ముందుకు వచ్చారు. ఆత్మ గౌరవం ఉద్యమం చేస్తున్నవాళ్ళం ఇతరుల సాయం స్వీకరించలేమంటూ వారు తేల్చి చెప్పారు. ఇది సోషల్ మీడియా శక్తిని చాటిన ఉద్యమం. కేవలం సోషల్ మీడియా సందేశాలతో, పురమాయింపులతో ప్రేరణ పొంది చదువు లకూ, వ్యాపారాలకూ విరామం ప్రకటించి, ఉద్యోగాలకు సెలవు పెట్టి వేలాది మంది ఉద్యమంలో చేరారు. శాంతియుతంగా ప్రదర్శనలు జరిపారు. ఇది కేవలం జల్లికట్టు ఆటమీద మోజుతోనో, సంస్కృతీ సంప్రదాయాలపట్ల మక్కువతోనో జరిగిన పోరాటం మాత్రమే కాదు. తమ సంస్కృతినీ, సంప్ర దాయాలనూ, ప్రయోజనాలనూ, ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసే చర్యలను సహించేది లేదంటూ తమిళులు మరోసారి తెగేసి చెప్పిన సందర్భం. 1930ల నుంచి 1960ల వరకూ సాగిన హిందీ వ్యతిరేక ఉద్యమంతో దీన్ని పోల్చవచ్చు. తమి ళులు హిందీ భాషకి వ్యతిరేకం కాదు. హిందీని తమపైన రుద్దడానికి వ్యతిరేకం. దక్షిణ భారత హిందీ ప్రచారసభ కేంద్ర కార్యాలయం చైన్నైలోనే ఉంది. చాలా మంది తమిళులు హిందీ నేర్చుకున్నారు. హిందీని విధిగా నేర్చుకోవాలని 1940 లలో రాజగోపాలాచారి నిర్ణయించినప్పుడూ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు అదే విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించినప్పుడూ ప్రజలు వ్యతిరేకిం చారు. 1964లో హిందీని అధికార భాషగా ప్రకటించినప్పుడు తిరుగుబాటు తారస్థాయికి చేరింది. హిందీని రుద్దడాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ అత్యంత ఉధృతంగా, హింసాత్మకంగా ఉద్యమం జరిగింది మద్రాసు రాష్ట్రం లోనే. ఇద్దరు విద్యార్థులు ఆత్మాహుతి చేసుకుంటే చలించిన నాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తమిళ రాజ కీయాలలో తిరుగుబాటు స్వభావం ఆద్యంతం కనిపిస్తుంది. నాయకులకు పాద నమస్కారాలు చేసే దృశ్యాలూ ఆ రాష్ట్రంలోనే కనిపిస్తాయి. ఇది విచిత్రం. జస్టిస్ పార్టీ పుట్టుక, ఆత్మగౌరవ, అస్తిత్వ ఉద్యమాలు, ద్రవిడ ఉద్యమం, హిందీ పట్ల వ్యతిరేకత, ఉత్తరాది పట్ల అసమ్మతి, కేంద్రం ఆధిపత్యాన్ని సహించని నైజం, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం–అన్నీ ఉద్వేగభరితంగా, ఉధృతంగా సాగినవే. గుండెల్లో గుబులు ఇప్పుడు తమిళనాడులో ఒకటిన్నర శతాబ్దంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని కరవు కరాళనృత్యం చేస్తోంది. కావేరీ జలాలు విడుదల చేయడానికి కర్ణాటక పేచీ పెట్టడం, ముళ్ళపెరియార్ డ్యాంను నియంత్రిస్తామంటూ కేరళ ప్రభుత్వం హెచ్చరించడం, శ్రీలంకలో తమిళులు వేల సంఖ్యలో బలైన అనంతరం కూడా వివక్షకు గురి అవుతుంటే సింహళీయుల పార్టీతో కేంద్ర ప్రభుత్వాలు స్నేహం చేయడం తమ ఆత్మగౌరవానికి భంగం కలిగినట్టు తమిళులు భావిస్తున్నారు. 1991లో రాజీవ్ హంతకులకు తమిళనాడులో మద్దతు లభించడానికి కారణం కూడా ఈ భావనే. తమిళ ప్రయోజనాల విషయంలో, స్వయం నిర్ణయాధికారాల విషయంలో ఏ మాత్రం రాజీపడని జయలలిత మరణించడం, కరుణానిధి వయోభారంతో పగ్గాలు కుమారుడు స్టాలిన్‌కు అప్పగించడంతో తమిళులలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడినట్టుంది. గుండెల్లో గుబులు పుట్టింది. తమిళుల ఆవేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారు. మతం పేరుతో జాతీయతాభావాన్ని ఉద్దీపింపజేయడంలో సిద్ధహస్తులైనవారికి సాంస్కృతిక ఉద్యమస్ఫూర్తి అత్యంత శక్తిమంతమైనదని తెలుసు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వినతిని మోదీ వెంటనే ఆమోదించారు. తీర్పును పునఃపరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. సుప్రీంకోర్టు సైతం భేషజాలకి పోకుండా వారం రోజులు గడువు మంజూరు చేసింది. జల్లికట్టు క్రీడను కొనసాగించడానికి అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్రం ఏకీభవించింది. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అన్ని ఆమోదాలూ, అనుమతులూ చకచకా రావడానికి కారణం తమిళ పౌరుషంపైన బాధ్యులందరిలోనూ ఉన్న అవగాహన. స్వయంనిర్ణయాధికారాల కోసం సాగిన ద్రవిడ ఉద్యమం సమసిపోయినప్పటికీ సాంస్కృతిక అస్తిత్వ భావనలు బలం గానే ఉన్నాయి. తమిళ ప్రజలు దేశంపట్ల జాతీయభావన కంటే తమ ప్రాంతం పట్ల నిబద్ధతను ఎక్కువగా ప్రదర్శిస్తారని ఆదం జీగ్‌ఫెల్డ్ 2004 సార్వత్రిక ఎన్ని కల తీరుతెన్నులను పరిశోధించి రాసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్’ తీర్మానించింది. ఈ రచయిత నిర్వహించిన సర్వేలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తమిళులలో 90 శాతంమంది దేశం కంటే తమిళనాడు పట్లనే ప్రథమ విధేయత కలిగి ఉంటామని స్పష్టం చేశారు. తమ ప్రాంతం తర్వాతనే దేశం అన్నది వారి వాదన. అమెరికా ఫస్ట్ అంటూ శుక్రవారం 45వ అధ్యక్షుడుగా ప్రమాణం స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ అమెరికా కంటే కాలి ఫోర్నియా ప్రధానం అనే ప్రజలు ఉన్నారు. సమాఖ్య స్ఫూర్తికి అది విరుద్ధం కాదు. 1950 దశకం ఆరంభంలో అవిభక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవా లంటూ ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం తెలుగువారు చేసిన ఉద్యమం ఉధృతికి జవహర్లాల్ నెహ్రూ దిగివచ్చారు. ప్రాంతీయభావన ఎంత బలీయమైనదో ఇటీవల ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన ఉద్యమం నిరూపించింది. తమిళులు కానీ ఆంధ్రులు కానీ తెలంగాణ ప్రజలు కానీ దేశాన్ని వ్యతిరేకించడం లేదు. తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటారు. కానీ వారి ప్రాంతీయ అస్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమ ప్రాంతాన్ని పరాయి పాలకులు ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా అయిదు వేల సంవత్సరాలుగా వారి సంస్కృతీసంప్రదాయాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చాయని తమిళులు గర్వంగా చెప్పుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల, అన్ని జాతుల, అన్ని భాషల సంగతీ అంతే. అదే భారతీయత. హింసాత్మక క్రీడ ప్రతి ఏటా జనవరి మాసంలో నాలుగు రోజులు జరుపుకునే సంక్రాంతి వేడుక లలో భాగం జల్లికట్టు. ఇది ప్రధానంగా మదురై, కోయంబత్తూరులో జరుపుకునే క్రీడ. ముందు వ్యవసాయం ఫలప్రదం కావడానికి దోహదం చేసిన ఎడ్లకు కృత జ్ఞతలు చెబుతూ వాటిని ఆలింగనం చేసుకునే వేడుకగా మొదలై, ఎడ్ల మధ్య పోటీగా మారి, అనంతరం పశువుకీ, మనిషికీ మధ్య పోటీగా రూపాంతరం చెందింది. పాత రోజులలో ఎద్దు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి ఎద్దును ధైర్యంగా ఎదిరించి కొమ్ములు వంచి వాటిని తీసుకున్నవారిని ధీరులుగా గుర్తించేవారు. ఎద్దును ఓడించి ఆధిక్యం చాటుకోవడంగా మారింది. 1960లలో శివాజీగణేశన్ ఎద్దును లొంగదీసుకునే గ్రామీణ యువకుడుగా నటించిన సినిమా ఈ క్రీడపైన మోజు పెంచింది. ఎద్దును రెచ్చగొట్టడం, హింసించడం ఎక్కువైంది. జంతువులనూ, పశువులనూ ప్రేమించేవారు హింసాత్మకమైన ఈ క్రీడను నిషేధించాలంటూ కోర్టుకు వెళ్ళారు. 2014 మే 7న జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించింది. ఆ తర్వాత రెండేళ్లు కొన్ని మార్పులతో జల్లికట్టు వంటి క్రీడను అనుమతిస్తూ కేంద్ర అడవులూ, పర్యావరణ శాఖలు ప్రకటన జారీ చేశాయి. దీన్ని పశుసంక్షేమ మండలి, పశువులనూ, జంతువులనూ మానవీ యంగా చూసుకోవాలని కోరుకునే సంస్థ–పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) వ్యతిరేకించాయి. 2016 జనవరి 16న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రకటనపైన ‘స్టే' ఇచ్చింది. ‘కావాలంటే కంప్యూటర్లో ఎద్దు లతో కుస్తీ పట్టే ఆటలు ఆడుకోండి. ఎద్దులను హింసించడం ఎందుకు?’ అంటూ కేసు విచారణ దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. కేంద్రంపై పోరాటం సుప్రీంకోర్టు వైఖరికి నిరసనగా విద్యార్థులు ఉద్యమం ప్రారంభించారు. కళాశా లల నుంచి నేరుగా మెరీనా బీచ్‌కు చేరుకున్నారు. జల్లికట్టును అనుమతించాల న్నది ఒక్కటే వారి డిమాండ్. భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఐదుసార్లు జారీ చేయిం చిన ప్రధాని మోదీకి జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి అభ్యంతరం ఏమిటంటూ ప్రశ్నించారు. ఒక రోజు పోలీసులు హడావిడి చేశారు. స్టాలిన్ నాయకత్వంలో డిఎంకె కార్యకర్తలు వీధులలో ప్రదర్శనలు నిర్వహిం చారు. రైల్‌రోకో చేశారు. బంద్ పాటించారు. కాంగ్రెస్ సైతం సంఘీభావం ప్రక టించింది. కమల్‌హాసన్, రజనీకాంత్, ధనుష్, రెహ్మాన్, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ సంఘీభావం ప్రకటించడంతో ఉద్యమం ఊపందుకున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకు క్లాసులకు ఎగనామం పెట్టి మెరీనా బీచ్‌కు వెళ్ళడానికి అనుమతులు ఉన్నాయి. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వ్యతిరేకులు ఈ ఉద్యమం వెనక ఉన్నారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మోదీని వ్యతిరేకించేవారి మద్దతు ఉన్న దని చెప్పేవారు కొందరు. జల్లికట్టుకు దళితులు దూరం ఈ క్రీడలో పాల్గొనడానికి దళితులు ప్రయత్నించిన ప్రాంతాలలో ఆటనే ఆపి వేసిన వైనాన్ని దళిత నాయకులు గుర్తు చేస్తున్నారు. దళితులు పెంచిన ఎద్దులను ఈ క్రీడలో పాల్గొనడానికి సంపన్న, ఆధిక్య కులాలు అనుమతించవు. ఫేస్బుక్ పోస్టింగ్‌లలోనూ దళిత వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జల్లికట్టు కావా లని కోరుకునేవారికి సంఖ్యాబలం ఉంది. ప్రజలను సమీకరించే వ్యవస్థ ఉంది. జల్లికట్టు వ్యవహారంలో లబ్ధిపొందాలని కోరుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి. పన్నీర్‌సెల్వం సమయజ్ఞత ప్రదర్శించి ఢిల్లీ వెళ్ళి పరిస్థితి వివరించి ప్రధాని మద్దతు సంపాదించగలిగారు. శశికళ ముఖ్యమంత్రి కావడం మోదీకి ఇష్టం లేదనే అభిప్రాయం ఉంది. పన్నీర్‌సెల్వం బలహీనపడకుండా ప్రధాని చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతిని, సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం చేత ఆర్డినెన్స్ జారీ చేయించడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో న్యాయస్థానాలను తప్పుపట్టడానికి లేదు. చట్టం ప్రకారం నిర్ణ యాలు ప్రకటించడం వాటి వి«ధ్యుక్తధర్మం. సవ్యంగా అమలు కానీ వరకట్న నిషేధం చట్టాన్నీ, అవినీతి నిరోధక చట్టాన్నీ అమలు చేయాలని కోరినట్టే తమిళ నాడులో జల్లికట్లు, ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ళపందాలూ, మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందాలూ నిషేధించడం నాగరిక సమాజంలో అవసరమని కోర్టు భావించింది. జల్లికట్టు ఆడాలనుకునేవారు ఎడ్లను హింసించకుండా, దేశవాళీ పశుసంపద వృద్ధి కావడానికి వీలుగా ఈ క్రీడను మలచుకోవాలి. ఇందులోని పాశవికతను పరిహరించాలి. పశువులను హింసించడం అమానవీయమంటూ ప్రచారం చేయడం ద్వారా ఇటువంటి క్రీడలను సంస్కరించే ప్రయత్నం జంతు పేమికులు చేయాలి. సంప్రదాయలనూ, ఆచారాలనూ రక్షించుకుంటూనే మారుతున్న నాగ రికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. దేశంలో వర్థిల్లుతున్న వైవి ధ్యాన్ని గౌరవించడం దేశ సమైక్యతకీ, సమగ్రతకీ దోహదం చేస్తుంది. ఎవరు తెగే వరకూ లాగినా అందరూ నష్టపోతారు. బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్న వారు ఈ విషయంలో విజ్ఞత ప్రదర్శించడం అభినందనీయం. కె. రామచంద్రమూర్తి -
హాలీవుడ్ సినిమాలోనూ ‘జల్లికట్టు’
న్యూఢిల్లీ: తమిళుల సంప్రదాయక క్రీడ ‘జల్లికట్టు’ జంతువులను హింసించడం కిందకు వస్తుందా, లేదా అన్న అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో లస్సే హాల్స్టార్మ్స్ దర్శకత్వం వహించిన హాలివుడ్ చిత్రం ‘ఏ డాగ్స్ పర్పోస్’ విడుదలవుతోంది. ఇందులో ప్రధాన పాత్రయిన కుక్క ఐదు దశాబ్దాలపాటు పలు అవతారాలెత్తి పలువురు యజమానుల వద్ద పెరుగుతూ ఉంటోంది. ఈ పలు జీవితాల కాలాల్లో ‘ప్రేమ–మరణం’ అనే అంశాల చుట్టూ కుక్క మదిలో మెదిలే ఆలోచనల సమాహారమే సినిమా ఇతివత్తం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు, ముఖ్యంగా జంతు ప్రేమికులకు కన్నీళ్లు తెప్పించింది. ఈ సినిమాను ప్రోత్సహించాలని పెటా లాంటి సంస్థలు కూడా నిర్ణయించాయి. ఈ సినిమా షూటింగ్ కోసం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలోకి బలవంతంగా దించేందుకు ప్రయత్నిస్తుంటే అది తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించడానికి సంబంధించిన సన్నివేశం వీడియోను అమెరికా ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ ‘టీఎంజీ’ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. జంతువులను హింసిస్తారా ? అంటూ ఇప్పుడు జంతు ప్రేమికులు ఈ సినిమాపై మండిపడుతున్నారు. ఈ సినిమాను బహిష్కరించాలంటూ పెటా ఏకంగా ప్రజలకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా హాలివుడ్ చిత్రాలకు జంతువులను సరఫరా చేస్తున్న ‘బర్డ్స్ అండ్ యనిమల్స్ అన్లిమిటెడ్’ సంస్థపై పెటా కేసు కూడా పెట్టింది. ఆ కుక్కకు ఎలాంటి ప్రాణాపాయం కలుగుకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటూ సినిమా నిర్మాతలు ఎంత మొత్తుకుంటున్న సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు చెలరేగుతున్నాయి. సినిమా షూటింగ్‌ల కోసం వివిధ రకాల జంతువులను వినియోగించడం, అందుకోసం వాటిని గంటల తరబడి బోనుల్లో నిర్బంధించడం, శిక్షణలు ఇవ్వడం ద్వారా హింసించడం ‘ఈ డాగ్ పర్పోస్’ సినిమాకే పరిమితం కాలేదు. పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్న హారీ పాటర్ సిరీస్, ది బ్యాట్ మన్ రిటర్న్స్, గుడ్‌లక్ చుక్ లాంటి సినిమాల షూటింగ్ సందర్భంగా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. అలా అని ఈ జంతు హింస హాలివుడ్ సినిమాలకే పరిమితం కాలేదు. బాలీవుడ్, ప్రాంతీయ భాషా చిత్రాల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. తెలుగులో ఎస్వీ కష్ణారెడ్డి తీసిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ పాటలో నటించిన విషయం తెలిసిందే. ఆ పాట చిత్రీకరణ కోసం ఓ పులిని ఉపయోగించారు. అయితే ఆ పులి ఎవరిని కరవకుండా ఉండేందుకు దాని మూతికి కుట్లు వేశారంటూ వార్తలు రావడంతో అప్పట్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఆయన భార్య అమల జంతు ప్రేమికురాలవడం, బ్లూక్రాస్ సొసైటీ ని నిర్వహిస్తుండడం వల్ల గొడవ ఎక్కువ జరిగింది. మారుతున్న నాగరికత ప్రకారం మనమూ మారాలని, సినిమా షూటింగ్‌ల కోసమైన జంతువులను హింసించరాదని సామాజిక కార్యకర్తలు వాదిస్తున్నారు. జంతువులు చెప్పినట్లు వినాలంటే వాటిపై కొంత ఒత్తిడి తీసుకరాక తప్పదని సినిమా నిర్మాతలు వాదిస్తున్నారు. నిజమైన జంతువులకు బదులు యానిమేషన్ ద్వారా అవసరమైన జంతువులు సష్టించుకోవచ్చన్న వాదన కూడా జంతు ప్రేమికులు చేస్తున్నారు. అది అంత వర్జనాలిటీకి దగ్గరగా ఉండదన్నది నిర్మాతల ప్రతి వాదన. కొత్తగా వచ్చిన ‘ది జంగిల్ బుక్’లో అడవితో సహా అన్ని జంతువులు యానిమేషన్‌తో సష్టించినవే. ఎక్కడ కూడా అది నిజమైన జంతువులు కావన్న భావన ప్రేక్షకులకు కలగదు. అందుకని నాగరికతతోపాటేకాదు, ఆధునిక సాంతికతకతోపాటు మనమూ మారాలి. -
ఏపీ నేతలపై ఎన్నో సందేహాలు: పవన్
-
ఏపీ నేతలపై ఎన్నో సందేహాలు: పవన్
హైదరాబాద్: తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ తరహాలోనే పవన్ కూడా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని సూచించారు. మన రాజకీయ నేతలు కూడా ఇటువంటి సంఘీభావాన్ని ప్రదర్శించాలన్నారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ లేఖను ట్వీట్ చేశారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో 'ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా' సాధించాలని పిలుపునిచ్చారు. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్ధత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంతవరకు స్ఫూర్తి పొందుతారనే దానిపై తనకు కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా ప్రజలు మాత్రం రాజీపడబోరని తనకు గట్టి నమ్మకం ఉందని పవన్ ప్రస్తావించారు. జల్లికట్టుపై నిషేధానికి నిరసనగా లక్షలాదిమంది మెరీనా బీచ్ చేరినప్పటికీ ఎక్కడా అసాంఘిక సంఘటనలు జరగకపోవడం హర్షించదగ్గ విషయమని, మన ద్రవిడ సంస్కృతిపై తమిళుల మక్కువ, వారు దానిని కాపాడుకున్న వైనాన్ని పవన్ కొనియాడారు. 'ఇది సరైన సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం. జల్లికట్టు నిషేధంపై తమిళనాడులో అంకురించిన ఉద్యమం గతంలో జరిగిన హిందీ వ్యతిరేఖ ఉద్యమంలా మారకముందే కేంద్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించడంతో దేశ సమగ్రతకు భంగం తప్పింది. భారత సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యాన్ని మున్ముందు గౌరవించకపోతే ఇటువంటి ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉంది. తమిళుల పోరాట పటిమను ఈ ఉద్యమం ప్రతిబించింది. కులమతాలకు అతీతంగా తమిళులంతా ఏకమై జల్లికట్టుకు వ్యతిరేకంగా నినదించడం స్ఫూర్తిదాయకం' అని పవన్ తన లేఖలో వివరించారు.