
ఆఫ్రికా అడవుల్లో జల్లికట్టు
తమిళసినిమా: జల్లికట్టు చిత్రం ఆఫ్రికా అడవుల్లో రూపొందుతోంది. అక్కడ కెన్యాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్ర యూనిట్ ఎంతో వ్యయప్రాయాసాలకోర్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెన్యా ప్రాంతంలోని పళాగుడగళ్ అనే అడవిలో నివసించే మసాయ్‌మార అనే గ్రామంలోని అటవీ వాసుల జీవన విధానాన్ని జల్లికట్టులో ఆవిష్కరిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ ఆధునిక యుగంలో కూడా ఆ మసాయ్‌మార గ్రామంలో ప్రాచీన జీవన విధానాన్నే అక్కడి ప్రజలు అనుసరిస్తున్నారని, గత జనవరిలో మెరీనా తీరంలో జల్లికట్టు పోరాటంలో యువత విజయం సాధించిన విషయం తెలిసిందేనని, అయితే ఇక్కడ జల్లికట్టు పోటీల ఎద్దులకు, మసాయ్‌మార అడవుల్లోని ఎద్దులకు ఒక పోలిక ఉంటుందని చెప్పారు. నవ దర్శకుడు సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమెరికాలో నివశిస్తున్న ప్రవాస భారతీయులు అహింస పతాకంపై గణపతి మురుగేశన్, జయపాల్ నటేశన్, సింగపూర్‌కు చెందిన గురుశరవణన్‌లతో కలిసి నిరుపమ నిర్మిస్తున్నారు.