
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: సాహస క్రీడ జల్లికట్టులో విషాదం నెలకొంది. అలంగానల్లూరులో గాయపడ్డ క్రీడాకారుడు ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. శనివారం శివగంగైలో జరగిన మంజు విరాట్ (ఎద్దులను వదలడం)లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎద్దులు పొడవడంతో ఇద్దరు మరణించారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని తిలకించి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కన్నదాసు, కుప్పన్ అనే ఇద్దరు యువకులు ప్రమాదంలో అదే రోజు రాత్రి మరణించారు. ఇక, అలంగానల్లూరులో జరిగిన క్రీడలో గాయపడ్డ నవమణి మృతిచెందాడు. గోపీకి చికిత్స అందిస్తున్నారు. కోయంబత్తూరులో ఆదివారం రెక్లా పోటీలు హోరెత్తాయి.
ఇందులో విజేతలకు కారు, బుల్లెట్ బహుమతిగా ఇచ్చారు. అలాగే, రవాణామంత్రి విజయభాస్కర్ కరూర్‌లో రెక్లా పోటీల్లో స్వయంగా గుర్రపుస్వారీతో అందర్నీ ఆకట్టుకున్నారు. కృష్ణగిరిలో ఆదివారం జరిగిన మంజు విరాట్‌లో యాభై మందికి పైగా గాయపడ్డారు. ఇదిలాఉండగా, కానం పొంగల్ సందర్భంగా జనం ఇంటి నుంచి సందర్శనీయ ప్రాంతాలకు తరలి రావడం ఆనవాయితీ. అయితే, ఈ సారి ఈ పర్యటనకు ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఆదివారం జనం సందర్శనీయ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల వైపు పోటెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment