తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత | High Tension At Karnataka Tamilnadu Border Over Jallikattu | Sakshi
Sakshi News home page

తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత

Published Wed, Feb 20 2019 6:30 PM | Last Updated on Wed, Feb 20 2019 6:58 PM

High Tension At Karnataka Tamilnadu Border Over Jallikattu - Sakshi

దీంతో ఆగ్రహించిన సందర్శకులు పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు, నిర్వాహకుల నడుమ..

చెన్నై: తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జల్లికట్టు నిర్వహించటానికి పోలీసులు అనుమతి నిరాకరించటం పెను ఘర్షణకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. హోసూరు సమీపంలోని మదకొండపల్లిలో బుధవారం జల్లికట్టు నిర్వహించటానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తారనే ఉద్దేశ్యంతో భారీ ఏర్పాట్లు సైతం చేశారు. కానీ చివరి నిమిషంలో పోలీసులు జల్లికట్టుకు అనుమతి నిరాకరించారు.

దీంతో ఆగ్రహించిన సందర్శకులు పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులు, నిర్వాహకుల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన వేలాది మందిని పోలీసులు తరిమి కొట్టడానికి లాఠీచార్జ్‌ చేయటంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఘర్షణ వాతావరణంతో రెండు రాష్ట్రాల సరిహద్దులు వేడక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement