
ప్రముఖ టెక్ ఎంట్రాప్రెన్యూర్ ప్రసన్న శంకర్ నారాయణ ఇంటి వ్యవహారం.. మొత్తంగా రచ్చకెక్కింది. అరెస్ట్ భయంతో పరారీలో ఉన్న ఆయన.. సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ చేశారు. అది కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఈ రచ్చ కాస్త శాంతించింది.
చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్ నారాయణ(Prasanna Sankar Narayana).. ప్రముఖ హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ 'రిప్లింగ్' సహ వ్యవస్థాపకుడు. అంతేకాదు.. అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య దంపతులు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలైంది. అయితే..
.. దివ్య, అమె కుమారుడు అమెరికా పౌరులు. ఈ నేపథ్యంలో, భరణంగా నెలకు రూ. 9 కోట్లు చెల్లించాలని దివ్య డిమాండ్ చేయగా, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈలోపు హఠాత్తుగా సీన్ చెన్నైకి మారింది.
భారత్‌కు వచ్చిన దివ్య
అమెరికా కోర్టు ప్రసన్నకు ప్రతి వారాంతంలో కుమారుడితో గడిపేందుకు అనుమతినిచ్చింది. వారం క్రితం దివ్య తన కుమారుడితో అమెరికా నుంచి చెన్నైకి వచ్చింది. అమెరికా కోర్టు ఆదేశాల మేరకు, ప్రసన్న తన స్నేహితుడు గోకుల్ ద్వారా కుమారుడిని వీకెండ్ లో తీసుకువెళ్ళాడు. అయితే, దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని చెన్నై పోలీసులకు(Prasanna Sankar) ఫిర్యాదు చేసింది.
అయితే.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది.అయితే కుమారుడు తనతో సంతోషంగా ఆడుకుంటున్నాడని ప్రసన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దివ్య ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, డబ్బుల కోసం డిమాండ్ చేశారని ప్రసన్న ఆరోపించాడు. రూ.25 లక్షలు డిమాండ్ చేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదమైంది.
కొడుకును కిడ్నాప్ చేసినట్టు తన భార్య దివ్య ఫిర్యాదు చేయడంతో, ప్రస్తుతం తాను చెన్నై పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని.. పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తన మొబైల్ ఫోన్ లొకేషన్, కారు, యూపీఐ, ఐపీ అడ్రస్ లను ట్రాక్ చేస్తున్నారని ప్రసన్న శంకర్ ఆరోపించారు. చివరకు.. పోలీసుల హామీతో ఆయన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు.

దివ్య ఏమన్నారంటే..
ప్రసన్న శంకర్ ఒక కామ పిశాచి అని భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. రహస్యంగా మహిళల వీడియోలు రికార్డు చేసేవాడని తెలిపారు. ఈ కారణంగానే అతడు సింగపూర్ లో అరెస్టయ్యాడని, ఆ తర్వాత విడుదలయ్యాడని వివరించారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా బదలాయించుకున్నాడని ఆరోపించారు.
English Translation of @myprasanna 's video:
"My name is Prasanna. I was born and brought up in Chennai. I went to US and founded a 10B dollar company. I'm a Tech Entrepreneur. Recently me and my wife got divorced and we had 50/50 custody of our son after signing a MOU.." https://t.co/uxSvgS1Xar— 7y913.acc (@aayeinbaigan) March 23, 2025
అయితే.. తన భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గొడవలు జరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా, తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు దివ్య ఫిర్యాదు చేసిందని... అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదైందని వివరించారు. అమెరికా పోలీసులు, కోర్టు ఈ ఆరోపణలను విచారించి, అవి నిరాధారమైనవని తేల్చి తనకు అనుకూలంగా తీర్పునిచ్చాయని అన్నారు. ఆ తర్వాత కూడా... నేను దాడి చేసి అత్యాచారం చేసినట్టు, నగ్న వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నట్టు దివ్య తనపై సింగపూర్‌లో ఫిర్యాదు చేయగా, సింగపూర్ పోలీసులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.