divya
-
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడి ముద్దుల కూతురు
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్(Sathyaraj ) కూతురు దివ్య సత్యరాజ్( Divya Sathyaraj) డీఎంకేలో చేరారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్( M K Stalin) సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వాన్ని ఆమె తీసుకున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ డీఎంకే అని, అందుకే తాను చేరినట్టు దివ్య పేర్కొన్నారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. దివ్య రాజకీయాల్లో రావాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె 2019 డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసిన సందర్భంలోనే ఆపార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. ఇది మర్యాద పూర్వక భేటీ అని ఆమె స్పష్టం చేయడంతో రాజకీయ ప్రచారానికి తెర పడింది. ఆ తదుపరి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత పోస్టులు, పోషకాహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ ప్రభావాల గురించి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. (ఇదీ చదవండి: ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి)ఈక్రమంలో సోషల్ మీడియా పోస్టులు అనేకం వివాదాస్పదమవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను ఆమె కలిశారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో డీఎంకే కోశాధికారి టీఆర్‌బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రూ, చైన్నె తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శి శేఖర్‌బాబు ఆమెకు స్టాలిన్ ద్వారా సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం దివ్య మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పోషకాహార నిపుణురాలు అని పేర్కొంటూ, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకం, అల్పాహార పథకం , మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా మరెన్నో పథకాలకు ఆకర్షిస్తురాలైనట్లు వివరించారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ డీఎంకే అని, అందుకే ఈ పార్టీలో చేరానని పేర్కొన్నారు. తన తండ్రి, స్నేహితులు, అందరూ ఎల్లప్పుడు నా వెన్నంటి ఉంటారని వ్యాఖ్యానిస్తూ ఏ బాధ్యతను తనకు అప్పగించినా శ్రమిస్తానని, కష్ట పడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
Divya Arundati : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్పందించిన నటి!
డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్‌లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
ప్రపంచ మూడో ర్యాంకర్‌గా అర్జున్
చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకాలతో అదరగొట్టిన భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) స్టాండర్డ్ ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లోనూ ముందుకు దూసుకొచ్చారు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తెలంగాణకు చెందిన అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకోగా... గుకేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌ను అందుకున్నాడు. అర్జున్ ఖాతాలో 2797 ఎలో రేటింగ్ పాయింట్లు, గుకేశ్ ఖాతాలో 2794 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2831 రేటింగ్ పాయింట్లతో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగుతుండగా... హికారు నకముర (అమెరికా; 2802 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్–100లో భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు.ఐదుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో, ప్రజ్ఞానంద 12వ స్థానంలో ఉన్నారు. విదిత్ సంతోష్ గుజరాతి 22వ ర్యాంక్‌లో, అరవింద్ చిదంబరం 33వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 42వ ర్యాంక్‌లో, నిహాల్ సరీన్ 58వ ర్యాంక్‌లో, రౌనక్ సాధ్వాని 66వ ర్యాంక్‌లో, శ్రీనాథ్ నారాయణన్ 95వ ర్యాంక్‌లో, అభిమన్యు పురాణిక్ 98వ ర్యాంక్‌లో నిలిచారు. నంబర్‌వన్‌గా హంపి మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకొని భారత నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. చెస్ ఒలింపియాడ్‌కు హంపి దూరంగా ఉన్నా ఆమె ర్యాంక్‌లో మార్పు రాలేదు. భారత రెండో ర్యాంకర్‌గా మహారాష్ట్రకు చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ అవతరించింది. ఇన్నాళ్లు భారత రెండో ర్యాంకర్‌గా ద్రోణవల్లి హారిక కొనసాగింది. చెస్ ఒలింపియాడ్‌లో టీమ్ స్వర్ణ పతకంతోపాటు వ్యక్తిగత పసిడి పతకం నెగ్గిన దివ్య నాలుగు స్థానాలు పురోగతి సాధించి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. హారిక 14వ ర్యాంక్‌లో, వైశాలి 15వ ర్యాంక్‌లో, తానియా సచ్దేవ్ 54వ ర్యాంక్‌లో, వంతిక అగరాŠవ్ల్ 58వ ర్యాంక్‌లో ఉన్నారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 76వ ర్యాంక్‌లో, భక్తి కులకర్ణి 82వ ర్యాంక్‌లో, సవితాశ్రీ 99వ ర్యాంక్‌లో నిలిచారు. -
World Oceans Day: సముద్ర సంరక్షణలో...Divya Hegde and Rabia Tewari
సముద్రమంత గాంభీర్యం అంటారు. సముద్రమంత సాహసం అంటారు. సముద్రమంత సహనం అంటారు. అయితే ఇప్పుడు ‘గాంభీర్యం’ ‘సాహసం’ ‘సహనం’ స్థానంలో ‘ప్రమాదం’ కనిపిస్తోంది. కాలుష్యం బారిన పడి తల్లడిల్లుతున్న సముద్రం గుండె చప్పుడు విన్న వాళ్లు బాధ పడుతూ కూర్చోవడం లేదు. సముద్ర కాలుష్యాన్ని నివారించే కార్యక్రమాల్లో భాగం అవుతున్నారు. ‘వరల్డ్ ఓషన్స్ డే’ సందర్భంగా ఓషన్ యాక్టివిస్ట్‌లు దివ్య హెగ్డే, రబియా తివారీ గురించి...గూగుల్ మాజీ ఉగ్యోగి అయిన దివ్యా హెగ్డే కర్నాటక కోస్తాప్రాంతాలలో సముద్ర కాలుష్యం, నివారణ మార్గాల గురించి ప్రచారం చేస్తోంది. క్లైమెట్ యాక్టివిస్ట్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా గుర్తింపు పొందిన దివ్య వివిధ కళారూపాల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది.ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను సముద్రంలోపారవేయకుండా నిరోధించడానికి యక్షగాన ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ యక్షగాన ప్రదర్శనలో ప్లాస్టిక్’ ను రాక్షసుడిగా చూపించారు. ఆ రాక్షసుడిని మట్టికరిపించే శక్తి మానవుడిలో ఉంది అనే సందేశాన్ని ఇచ్చారు.ఈ యక్షగానంలో తడి చెత్త, ΄÷డి వ్యర్థాలపాత్రలను కళాకారులు ΄ోషించారు.సముద్రంపై ప్లాస్టిక్ హానికరమైన ప్రభావాన్ని చూపించేలా ప్లాస్టిక్ అసుర పాత్రను రూపొందించారు.‘కర్ణాటకలో యక్షగానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ బలమైన కళారూపం ద్వారా ΄్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడం నుంచి తడి, ΄÷డి చెత్తను వేరు చేయడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాం. ఈ ప్రచారాల ద్వారా ప్రజలకు మంచి విషయాలను చేరువ చేయడం ఒక కోణం అయితే కళాకారులకు ఆర్థికపరంగా సహాయపడడం మరో కోణం’ అంటుంది దివ్య.‘బేరు’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా తీర్రపాంత వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తోంది దివ్య.వ్యర్థాలను ప్రాసెస్ చేయడం గురించి మహిళలకు శిక్షణ ఇచ్చారు. వీరు ఇంటింటికి వెళ్లి ΄్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. సముద్ర వ్యర్థాలను తగ్గించే విధానాలలో ఇది ఒకటి. తడి చెత్తప్రాసెసింగ్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.వ్యర్థాలను సేకరించడం,ప్రాసెస్ చేయడం ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.మత్స్యకారుల కుటుంబాలలో డిజిటల్ నైపుణ్యాలు పెంచడంపై కూడా ‘బేరు’ దృష్టి పెట్దింది.దీనిలో భాగంగా యూజర్–ఫ్రెండ్లీ వేస్ట్ మేనేజ్మెంట్ యాప్‌ను రూపొందించారు. ‘డోర్–టు–డోర్ వేస్ట్ కలెక్షన్’ కార్యక్రమాలలో మహిళలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.ముంబైకి చెందిన రబియా తివారీ తన భర్త ఇంద్రనీల్ సేన్గు΄్తాతో కలిసి సముద్ర కాలుష్యంపై ΄ోరాడుతుంది. ముంబైలో సముద్రతీర అపార్ట్‌మెంట్‌కు మారినప్పుడు బీచ్‌లో టన్నుల కొద్ది చెత్తను చూసి చలించి΄ోయారు ఈ దంపతులు. ఆ బాధలో నుంచే ‘ఎథికో ఇండియా’ అనే సామాజిక సంస్థను మొదలుపెట్టారు.ఇద్దరు వ్యక్తులతో మొదలైన ‘ఎథికో ఇండియా’ ఆ తరువాత ‘సిటిజెన్ మూవ్మెంట్’ స్థాయికి చేరుకుంది.ఉద్యమం ఊపందుకోవడంతో వాలంటీర్లు మాహిమ్ బీచ్ నుంచి కిలోల కొద్దీ ΄ోగుపడిన సముద్ర వ్యర్థాలను తొలగించారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ఉద్యమంలో భాగం చేసింది ‘ఎథికో ఇండియా’.‘మాహిమ్ బీచ్ క్లిన్ అప్ డ్రైవ్’ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ ఉద్యమం మరికొన్ని ఉద్యమాలకు ద్వారాలు తెరిచింది. ‘ఓపెన్ ఫెస్ట్’ అనేది అందులో ఒకటి. కళల ద్వారా సముద్ర కాలుష్యంపై ΄ోరాడటమే దీని లక్ష్యం.‘ఓపెన్ ఫెస్ట్’లో అంకుర్ తివారీ, మానసీ పరేఖ్, అనురాగ్ శంకర్, చందన బాల కళ్యాణ్, సుమిత్ నాగ్దేవ్లాంటి ప్రముఖ కళాకారులు భాగం అయ్యారు.‘మా ప్రయత్నం ఫలించినందుకు సంతోషం గా ఉంది. అధికారులలో మార్పు వచ్చింది. ప్రక్షాళన కార్యక్రమాల్లో మాతో కలిసి చురుగ్గాపాల్గొంటున్నారు’ అంటుంది రబియా తివారీ. -
పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన నటి
ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేమంటారు. అలాగే బ్రేకప్, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎందుకు వస్తున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్, నటి దివ్య అగర్వాల్ మనసు రెండేళ్లక్రితమే ముక్కలైంది. ప్రియుడు వరుణ్ సూద్‌తో నడిపిన నాలుగేళ్ల ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టింది. తాను కోరుకున్న విధంగా, సొంతంగా జీవించాలనుకుంటున్నా అని 2022 మార్చి 6న బ్రేకప్ వార్తను బయటపెట్టింది.పెళ్లయి మూడు నెలలు కాలేదుతర్వాత వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరికీ 2022లో నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఓ షోలో కూడా తనను అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ పొంగిపోయింది నటి. కానీ అంతలోనే సడన్ షాకిచ్చింది. పెళ్లయిన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో నుంచి తీసేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నాం..మొన్నే పెళ్లయింది? అంతలోనే ఏంటీ ఘోరం? అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం మొన్నే కదా కలిసి నవ్వుతూ ఫోటోలకు పోజిచ్చారు.. ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు కదా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా? -
ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య
సినిమాల్లో శృంగార సన్నివేశాలు అనగానే.. హా ఏముంది ఈజీనే కదా అని చాలామంది అనుకుంటారు. కానీ తెరపై చూసే దానికి తెరవెనక జరిగే దానికి చాలా తేడా ఉంటుందని మనకి తెలియదు. ఇప్పుడు ఆ విషయాల్నే 'మంగళవారం' ఫేమ్ నటి దివ్య పిళ్లై బయటపెట్టింది. అసలు అవి ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అనే వాటి గురించి చాలా ఓపెన్‌గా చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనుభవాల్ని షేర్ చేసుకుంది.'రొమాంటిక్ సీన్ అనగానే ఇద్దరు ముద్దు పెట్టుకోవడం, రొమాన్స్ చేసుకోవడమే కదా ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ సెట్స్‌లో అందరిముందు ఈ సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే దాదాపు 75 కేజీల బరువున్న మనిషి మనపై పడుకుని ఉన్నప్పుడు కెమెరాకు కనిపించే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మైండ్‌లో వేరే ఆలోచన ఏం ఉండదు' (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'అలానే ముద్దుని భలే ఎంజాయ్ చేయడం లాంటిది కూడా ఏం ఉండదు. దీనిబట్టి ఎంత కష్టం అనేది మీరే ఆలోచించండి. అలానే రొమాంటిక్ సీన్స్ కోసం చాలా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. సహ నటుడితో కలిసి ముందు డిస్కస్ కూడా చేసుకోవాలి. సీన్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బంది అనిపించినా సరే ముఖంలో ఆ ఫీలింగ్ చూపించకూడదు' అని దివ్య పిళ్లై చెప్పుకొచ్చింది.దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది. 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సహాయ పాత్రలు చేస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది సూపర్ హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. దీని తర్వాత 'తగ్గేదే లే' అని మరో మూవీ కూడా చేసింది. ప్రస్తుతం 'బజూకా' అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) -
వివాహానికి హాజరై తిరిగొస్తుండగా..
శ్రీపొట్టి శ్రీరాములు: రోడ్డు ప్రమాదం పెళ్లింట అంతులేని విషాదాన్ని నింపింది. వివరాలు.. కందుకూరు పట్టణంలోని విప్ప గుంటలో నివాసముంటున్న రాయని అరుణ (50), రమణయ్య భార్యాభర్తలు. రమణయ్య సుమారు 20 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోవూరు రోడ్డులో టిఫిన్ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన ఇద్దరి పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఈ క్రమంలో కుమార్తె స్రవంతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అశేష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పాల్వంచలోని వరుడి ఇంట్లో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అరుణతో పాటు కుమారుడు వేణుగోపాల్, మేనల్లుడు వినోద్, అతని భార్య తల్లపనేని దివ్య (30), వారి కుమారుడు మణి, మరో బంధువు గుళ్లాపల్లి శ్రావణి (22) కలిసి కారులో కందుకూరు బయల్దేరారు. వాహనాన్ని వేణుగోపాల్ నడిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూరారెడ్డిపాళెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో అరుణ, దివ్య, శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్, వినోద్, మణి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అంతలోనే.. అప్పటి వరకు పెళ్లిలో ఆనందంగా గడిపిన వారు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి, బంధువులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసి కొత్త పెళ్లి కూతురు స్రవంతి కన్నీరుమున్నీరయ్యారు. దివ్య భర్త వినోద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త, తన ఐదేళ్ల కుమారుడు మణితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. మేనత్త కుమార్తె వివాహం కావడంతో వినోద్ కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితమే కందుకూరొచ్చారు. అయితే ఊహించని ప్రమాదంలో దివ్య మృతి చెందారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా.. పెళ్లి కోసమే హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావణి మృతి చెందడం తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మికి మింగుడు పడని ఘటనగా మారింది. శ్రావణి కుటుంబం చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. స్రవంతి పెళ్లి కోసమని శ్రావణి కందుకూరు వచ్చారు. ఇక స్రవంతి సొంత అన్న వేణుగోపాల్ కొద్దిరోజులుగా పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. విశ్రాంతి తీసుకోకుండా అర్ధరాత్రి కారు డ్రైవింగ్ చేస్తూ రావడం.. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అటు తల్లిని కోల్పోయి, ఇటు అన్న హాస్పిటల్ పాలవడంతో స్రవంతి రోదన వర్ణానాతీతంగా ఉంది. మృతదేహాలను గుర్రవారంపాళెం సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున బంధువులు చేరుకున్నారు. ఇవి చదవండి: కట్టేసి, కారం చల్లి.. -
Anny Divya: దివ్యమైన విజయం
స్త్రీల కలలు తరచు సామాజిక నిబంధనల మధ్య పరిమితం అవుతుంటాయి. అలాంటి ప్రపంచంలో అనీ దివ్య అసమానతలను ధిక్కరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో పుట్టి, విజయవాడలో పెరిగిన అనీ దివ్య... బోయింగ్ 777 ను నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్‌గా పేరు పొందింది. ‘మహిళా కమాండర్లలో అతి పిన్నవయస్కురాలిగా చేరాలని కలలు కనలేదు. కానీ, అభిరుచి, అంకితభావం ఆమె కలను సాకారం చేశాయి’ అని చెప్పే ముప్పై ఏడేళ్ల దివ్య... మహిళా శక్తి అంటే ఏమిటో తన విజయగాధ ద్వారా మనకు పరిచయం చేస్తుంది. ‘అమ్మాయిలు పెద్దగా కలలు కనడానికి వీలులేని ప్రదేశం నుండి వచ్చాను’ అని చెప్పే దివ్య 11వ తరగతి వరకు సాధారణ విద్యార్థిని. ఆమె తన కలను సాకారం చేసుకోవడానికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం తప్పనిసరి అని తెలుసుకుంది. అడ్డంకులను అధిగమించాలని నిశ్చయించుకుని, సవాల్‌ను ఎదుర్కొంది. అదే సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. దీంతో ఆమె కలలు స్పష్టంగా ఉన్నాయి అని కుటుంబ సభ్యులకూ అర్ధమైంది. కానీ, ముందుకు వెళ్లే మార్గం సులభంగా లేదు. అందుకు తగినంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. కానీ, ఆమె తండ్రి ఫ్లయింగ్ స్కూల్ ఫీజు కోసం రుణం తీసుకున్నాడు. దీంతో ఆమె అసలు ప్రయాణం మొదలైంది. 17 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చేరింది. 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా నిలిచింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో కో–పైలట్‌గా చేరింది. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్ కోసం లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. పైలట్‌గానే కాదు కెప్టెన్ దివ్య మోటివేషనల్ స్పీకర్ కూడా. విమానయాన రంగంలో తన అనుభవాలు, సవాళ్లను వేదికలపై స్పీచ్లుగా ఇచ్చింది. ముంబై రిజ్వీ లా కాలేజీ నుండి ఎల్ఎల్బీ పట్టా కూడా పొందింది. ఎగతాళి చేసేవారు ‘‘నాన్న ఆర్మీలో ఉద్యోగి అవడంతో మా కుటుంబం పఠాన్‌కోట్‌లో ఉండేది. నేను అక్కడే పుట్టాను. నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు. అలా, నా స్కూల్ చదువు మొత్తం విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక ఉండేది. ఇది తెలిసి ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. పిల్లల్లో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కావా లనే అనుకునేవారు. అదృష్టవశాత్తు నా ఎంపికకు నా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. అయితే, పైలట్ కావాలనే నా నిర్ణయాన్ని బంధువులు, కుటుంబ స్నేహితులు వ్యతిరేకించేవారు. ఇది అమ్మాయిలకు తగిన వృత్తిగా అనుకునేవారు కాదు. సవాల్‌గా తీసుకున్నాను.. ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చు. కానీ, ఇంగ్లీషులో మాట్లాడటం అనేది సమస్యగా ఉండేది. దీంతో ట్రైనింగ్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ తోటి వారి హేళనకు గురయ్యాను. ఒక చిన్న పట్టణం నుండి వెళ్లడం, ఇంగ్లీషులో పట్టులేకపోవడంతో మొదటి రోజు నుండి సవాళ్లు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సీనియర్లు క్లాస్ బయటకు పిలిచి ర్యాగ్ చేసేవారు. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అందుకు సెలవుల్లో నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆంగ్లంలో మాట్లాడటానికి మంచి పట్టు సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి స్కాలర్షిప్ కూడా వచ్చింది. సాధించినప్పుడే మన శక్తి బయటకు తెలుస్తుంది ప్రపంచంలోనే బి777 మహిళా కమాండర్లలో అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. నడిచొచ్చిన దారిని చూసుకుంటే అన్నింటిని ఎలా అధిగమించాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఎవరి ప్రయాణమూ అంత సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మనలోని ఆత్మ విశ్వాసం బయటకు కనిపిస్తుంది. కలలు సామాజిక అంచనాలకు, ఆర్థిక పరిమితులకు పరిమితం కాదని ఆ శక్తి గుర్తు చేస్తుంది. ఒక చిన్న పట్టణం నుండి ఏవియేషన్ కమాండింగ్ ఎత్తుల వరకు ఎదగడంలో నా బలహీనతలపై చాలా పోరాటం చేశాను’’ అని వివరిస్తుంది కెప్టెన్ అనీ దివ్య. -
ప్రియుడిని పెళ్లాడిన బుల్లితెర నటి.. ఆ విషయంలో నెటిజన్ల ట్రోల్స్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇటీవల కొద్ది రోజులుగా పలువురు వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. తాజాగా మరో నటి దివ్య అగర్వాల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో నటి ఏడడుగులు నడిచింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ముంబయిలోని చెంబూర్‌లో జరిగిన వివాహా వేడుకకు సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. 2022లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వీరిద్దరి వివాహానికి ముందు వేడుకలు కాక్టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. తర్వాత దివ్య అగర్వాల్ మెహందీ, హల్దీ వేడుక చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, నిక్కీ తంబోలి, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. కాగా.. హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్-2 తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు రియాలీటీ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఏంటీవీ సీజన్- 10 రన్నరప్, ఏస్ ఆఫ్ స్పేస్ సీజన్- 1, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 విజేతగా నిలిచింది. ఆమె గతంలో వరుణ్ సూద్, ప్రియాంక్ శర్మతో రిలేషన్షిప్లో ఉంది. హల్దీ వేడుకపై ట్రోల్స్ దివ్య తన హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వేడుకలో ఆమె లుక్ కంటే బ్యాక్‌గ్రౌండ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే వెనుక భాగంలో లేస్ చిప్స్ పాకెట్స్ దర్శనమిచ్చాయి. ఇది చూసిన కొందరు తక్కువ బడ్జెట్ డెకరేషన్ కోసం ఇలా చేశారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ రాస్తూ.. 'హల్దీ వేడుక కోసం చిప్స్‌తో అలంకరణ.. బడ్జెట్ అంత తక్కువగా ఉందా?' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
యజమాని వేధింపులు..శానిటైజర్ తాగిన యువతి
-
సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మీర్పేట్ టీచర్స్ కాలనీలోని గత కొంతకాలంగా సెలూన్లో పనిచేస్తున్న దివ్య అనే యువతి (18)పై యజమాని మురళి(35) లైంగిక దాడికి పాల్పడుతుండటంతో ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా ఓ సెలూన్ లో పని చేస్తున్న దివ్యను యజమాని మురళి లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు సమాచారం. మంగళవారం 2024 జనవరి 30న మరళి సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్య(18)ను తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నం చేయగా.. దివ్య బయటికి వచ్చి అరవడంతో మురళి అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. గతంలో పలుమార్లు మురళి దివ్యను లైంగిక దాడి చేశాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
Mangalavaaram: 'మంగళవారం' సినిమాలో ప్రెసిడెంట్ గారి పెళ్లాం ఫొటోలు చూశారా..దివ్యా పిళ్లైకి క్రేజ్ మామూలుగా లేదుగా!
-
మంగళవారం బ్యూటీ.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందంటే?
ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తనకు అచొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో మంగళవారం చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 17న రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది. ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గుట్టుగానే అజయ్ భూపతి మరోసారి తన మార్క్‌ను చూపించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అంతే కాకుండా ఈ చిత్రంలో నటీనటులు కూడా దాదాపుగా సినిమాల్లో కనిపించినవాళ్లే. కానీ ఈ మంగళవారం చిత్రంలో అందరినీ ఆకర్షించిన ఓ క్యారెక్టర్ ఉంది. లీడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్‌పుత్ అయినప్పటికీ.. సినిమా చూసినంత సేపు తన పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? సినిమాల్లోకి ఎలా వచ్చింది? అచ్చం తెలుగుమ్మాయిలా కనిపించిన ఆమె ఇంతకుముందే టాలీవుడ్ సినిమాల్లో నటించిందా? ఆ వివరాలు తెలియాలంటే ఓ లుక్కేద్దాం. పాయల్ రాజ్‌పుత్ తర్వాత మంగళవారం తన అందంతో మెప్పించిన నటి మరెవరో కాదు.. జమీందార్ భార్య. ఈ చిత్రంలో చైతన్యకు భార్యగా తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమెకు ఈ చిత్రం తెలుగులో మొదటి చిత్రమేమీ కాదు. మంగళవారం కంటే ముందే తగ్గేదేలే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. దివ్య ప్రస్థానం ఆమె అసలు పేరు దివ్య పిళ్లై. కేరళకు చెందిన నారాయణ పిళ్లై, చంద్రిక దంపతులకు దివ్య దుబాయ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులది కేరళలోని మావేలికర స్వగ్రామం. దివ్య పిళ్లై రెండవ కుమార్తె కాగా.. దుబాయ్‌లోనే చదువు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ అయిపోయిన వెంటనే ఆమెకు దుబాయి ఎయిర్‌లైన్స్.. అరబ్ ఎమిరేట్స్‌లో ఉద్యోగం వచ్చింది. కలిసొచ్చిన స్నేహితుని పెళ్లి ఎయిర్‌లైన్ సిబ్బందిగా తన కెరీర్‌ను ప్రారంభించిన దివ్యకు అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఆమె తన స్నేహితుడి వివాహానికి వెళ్లగా.. అక్కడ డైరెక్టర్ వినీత్ కుమార్ ఆమెను చూశారు. ఆ తర్వాత 2015 మలయాళంలో పుష్ప విలన్ ఫాహాద్ ఫాజిల్ హీరోగా నటించిన అయల్ నంజళ్ల అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ నటించిన ఊజం చిత్రంలో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ సినిమాలు, మలయాళంలో ఇద్దరు టాప్ హీరోల సరసన చేయడంతో ఫుల్ ఫోకస్ సినిమాలవైపే మళ్లింది. ఎయిర్‌లైన్ సిబ్బందిగా కెరీర్ ప్రారంభించిన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టింది. అంతకుముందు ఎలాంటి నటనా అనుభవం లేకపోయినా వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తోంది. తెలుగులో నవీన్ చంద్ర నటించిన తగ్గదేలే చిత్రంలో కనిపించింది. ఇటీవలే రిలీజైన ఆర్య వెబ్ సిరీస్ ది విలేజ్‌లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా మాస్టర్ పీస్ (2017), సేఫ్ (2019) చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది మంగళవారం సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న దివ్య పిళ్లై ప్రస్తుతం మార్స్ అనే చిత్రంలో నటిస్తోంది. ఆమె సినిమాలతో పాటు మలయాళంలో సీరియల్స్, పలు షోలలో కనిపించింది. మంగళవారం కథేంటంటే? 1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ. -
'నటితో అసభ్య ప్రవర్తన.. ఎయిర్పోర్ట్ అధికారులపై తీరుపై ఆగ్రహం'
ప్రస్తుత కాలంతో మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు సైతం బాధితులవుతున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి కొచ్చిన్ వెళ్తుండగా తన పక్కనే ఉన్న ప్రయాణికుడు వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 10న మంగళవారం జరగ్గా.. తాజాగా నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: ‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!) ఇన్‌స్టాలో దివ్య ప్రభ రాస్తూ.. 'ప్రియమైన మిత్రులారా.. నేను ముంబయి నుంచి కొచ్చికి ఎయిరిండియా ఫ్లైట్‌లో వచ్చా. ఈ ప్రయాణంలో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఫ్లైట్‌లో తోటి ప్రయాణీకుడు తాగిన మత్తులో నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌కు చెబితే.. టేకాఫ్‌కు ముందు నా సీటును మాత్రమే మార్చారు. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత సమస్యను ఎయిర్పోర్ట్ అధికారులకు వివరించాను. వారు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు సహాయ పోస్ట్‌కు వెళ్లమని సలహా మాత్రమే ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశా. ప్రయాణీకుల భద్రత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకుందాం. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిద్దాం. ఈ విషయంలో మీ సపోర్ట్ కావాలి' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్! ) ఈ వేధింపులకు సంబంధించి కంప్లైంట్‌తో పాటు ఎయిరిండియా ప్లైట్ టికెట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని.. అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బంది, అధికారుల స్పందన తనను నిరాశకు గురిచేసిందని దివ్య ప్రస్తావించారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ దివ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. మలయాళ నటి అన్నా బెన్ దివ్యకు మద్దతుగా పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Divyaprabha (@divya_prabha__) -
రొటీన్‌కి భిన్నంగా..! ఆనంద్ మహీంద్రా కూతుళ్ల గురించి తెలుసా?
Anand Mahindra daughters: ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన పూర్తి పేరు ఆనంద్ గోపాల్ మహీంద్రా. ఎయిర్‌క్రాఫ్ట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, విడిభాగాలు , నిర్మాణ పరికరాలు, రక్షణ, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఆర్థిక, బీమా, పారిశ్రామిక పరికరాలు, సమాచార సాంకేతికత, ఆతిథ్యం, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ తదితర అనేక వ్యాపారాలను ఆయన నిర్వహిస్తున్నారు. మహీంద్రా & మహీంద్రా సహ వ్యవస్థాపకుడు జగదీష్ చంద్ర మహీంద్రా వారసుడు ఆనంద్ మహీంద్రా. ఫోర్బ్స్ 2023 నివేదిక ప్రకారం.. ఆయన నెట్‌వర్త్ 2.6 బిలియన్ డాలర్లు (రూ. 21 వేల కోట్లకుపైనే). జర్నలిస్టు అనురాధను పెళ్లాడిన తర్వాత ఈ దంపతులకు దివ్య, ఆలిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినప్పటికీ పలు విభిన్న అంశాలపై స్పందిస్తూ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఆయన కుమార్తెలు మాత్రం ప్రచారాలకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మందికి వీరి గురించి పెద్దగా తెలియదు. రొటీన్‌కి భిన్నంగా.. సాధారణంగా పారిశ్రామికవేత్త పిల్లలు తండ్రి నిర్వహిస్తున్న వ్యాపారాల్లో పాలుపంచుకుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆనంద్ మహీంద్రా కుమార్తెలు మాత్రం వారి తల్లికి చెందిన మ్యాగజైన్లో పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా సతీమణి అనురాధ వెర్వ్, మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్లకు ఎడిటర్‌గా ఉన్నారు. వివాహానికి ముందే ఆమె వెర్వ్ పత్రికను స్థాపించారు. వీరి పెద్ద కుమార్తె దివ్య డిజైన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివారు. 2009లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె వివిధ సంస్థలలో ఫ్రీలాన్సర్‌గా, పార్ట్ టైమ్ ఉద్యోగిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో ఆమె వెర్వ్ మ్యాగజైన్లో ఆర్ట్ డైరెక్టర్‌గా చేరారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక రెండవ కుమార్తె ఆలికా కూడా వెర్వ్ మ్యాగజైన్లో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లుళ్లిద్దరూ విదేశీయులే.. ఆనంద్ మహీంద్రా పెద్ద కుమార్తె దివ్య న్యూయార్క్‌లో మెక్సికన్ సంతతికి చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటాను వివాహం చేసుకున్నారు. అలాగే రెండవ కుమార్తె ఆలికా కూడా ఫ్రెంచ్ జాతీయుడిని పెళ్లి చేసుకున్నారు. ఇలా పూర్తిగా భిన్నమైన సంస్కృతులలో జరిగిన వీరి వివాహాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. -
టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్‌ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్‌లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. జు వెన్జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్‌గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
రైలు నుంచి పడి ట్రాన్స్‌జెండర్ దుర్మరణం
జనగాం : రైలు నుంచి జారి పడి ఓ ట్రాన్స్‌జెండర్ దు ర్మరణం చెందిన సంఘటన రఘునాథపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగెం మండలం ఎల్గూరుస్టేషన్ తూర్పుతండాకు చెందిన ట్రాన్స్‌జెండర్ బాదావత్ అనిల్ అలియాస్ దివ్య (25) సికింద్రాబాద్ నుంచి శాతవాహన రైలులో కాజీపేటకు వస్తుంది. దివ్య రఘునాథపల్లి రైల్వేస్టేషన్ రెండోప్లాట్‌ఫాంపై చేరుకోగానే నెమ్మదిగా రైలు వెళ్తున్న క్రమంలో కిందికి దిగబో తూ ప్రమాదవశాత్తు కాలుజారి రై లు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే రైలులో ప్ర యాణిస్తున్న మృతుడి స్వగ్రామానికి చెందిన బాలు అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తన భర్త నుంచి కాపాడాలంటూ సీఎం స్టాలిన్‌ని కోరిన నటి
కోలీవుడ్‌లో ప్రముఖ బుల్లితెర నటి దివ్య.. తన భర్త అర్ణవ్ నుంచి కాపాడాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించింది. అక్కడ ప్రసారం అయ్యే 'సెవ్వంతి' సీరియల్‌తో నటి దివ్య ఫేమస్ అయింది. గతేడాది బుల్లితెర నటుడు అయిన అర్ణవ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గర్భందాల్చిన సమయంలో తన కడుపుపై అర్ణవ్ తన్నాడని, మానసికంగా హింసించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అర్ణవ్ బెయిల్‌పై విడుదల అయ్యాడు. మరో ఇద్దరు మహిళలను ఆర్నవ్ మోసం చేశాడు? అర్ణవ్ ఇద్దరు మహిళలను మోసం చేశాడంటూ దివ్య ఆడియో విడుదల చేసింది. వారిద్దరిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది. బెయిల్‌పై విడుదల అయిన అర్ణవ్ తన మనుషులు, లాయర్లతో వచ్చి గొడవ పడ్డాడని దివ్య సంచలన ఆరోపణ చేసింది. అర్దరాత్రి ఒక్కసారిగా 15 మందితో తన ఇంటి తలుపు తట్టాడని తెలిపింది. వారందరూ తనను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) అతను బెయిల్‌పై ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆమె ఇలా ఫిర్యాదు చేసింది. 'ప్రస్తుతం అర్ణవ్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నాడు. ఈ సమయంలో అతను నా ఇంటికి రాకూడదు. నన్ను బెదిరించి, నా పాపను చంపడానికి ప్రయత్నించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అతనికి అన్నీ తెలుసు.. అందుకోసం ఒక వ్యక్తిని గూఢచారిగా పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు. నా ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వచ్చి బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆయనపై చర్యలు తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను’ అని దివ్య కన్నీరు పెట్టుకుంది. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) -
నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు: నటి
తమిళ సీరియల్స్‌తో కన్నా వివాదాలతోనే బాగా ఫేమసయ్యాడు నటుడు అర్ణవ్. సహనటి దివ్య శ్రీధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో తనతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే పండంటి పాపాయికి జన్మనిచ్చిన దివ్య తాజాగా మరోసారి అర్ణవ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అర్ణవ్ తనను తాను గేగా పరిచయం చేసుకుని ఓ పైలట్ నుంచి డబ్బులు గుంచి మోసం చేయడమే కాకుండా అతడి చావుకు కారణమయ్యాడని ఆరోపించింది. 10 ఏళ్ల క్రితమే ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్‌ను, అమ్మాయిలతో చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఈ ఆడియో క్లిప్పింగ్స్‌లో ఓ ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ 10 ఏళ్ల క్రితమే తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నాళ్లపాటు సంతోషంగా ఉన్నామని చెప్పింది. తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో తనను వేధించాడని, 8 ఏళ్లు అతడి వేధింపులు భరించానని చెప్పుకొచ్చింది. మొదటి పెళ్లి విషయం దాచిన నటి కాగా దివ్యకు 2013లో ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. పాప కూడా ఉంది. మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చింది. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో సహనటుడు అర్ణవ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా 2022 జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు అంతకుముందే పెళ్లై, ఒక కూతురు కూడా ఉందన్న విషయం అర్ణవ్‌కు తెలిసింది. మరోవైపు చెల్లమ్మ సీరియల్ నటి అన్షితతో అర్ణవ్ ఎఫైర్ నడుపుతున్న విషయం దివ్యకు తెలిసింది. ఒకరిపై మరొకరు నిందారోపణలు దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తనకు తెలియకుండా వేరే వ్యక్తితో కలిసి దివ్య గర్భాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అర్ణవ్. అటు దివ్య కూడా తన భర్తకు వేరే నటితో సంబంధం ఉందని తెలిసి, షూటింగ్ స్పాట్‌కు వెళ్లి నిలదీస్తే కొట్టిందని, భర్త కూడా తనపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. చదవండి: వైభవంగా శర్వానంద్ పెళ్లి, ఫోటోలు చూశారా? గ్లామర్‌కు నో చెప్పను, కానీ వల్గారిటీ మాత్రం.. -
లవ్... క్రైమ్
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా జంటగా మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ ఇచ్చారు. బిజినెస్‌మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బీఎన్కే (బంగారు నవీన్ కుమార్) నిర్మించనున్నారు. దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు బీఎన్కే. ఈ సినిమాకు కెమెరా: పంకజ్ తట్టోడ. -
దివ్యమైన ఐడియా సుమీ!
అమెరికాలో నివసిస్తున్న దివ్య మయ్యా చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ ఇంటర్నెట్ మినీ సెలబ్రిటీగా మారింది. ‘స్కీయింగ్‌కు చీర ధరించడమే కరెక్ట్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అది భారతీయతను ప్రతిఫలించే ప్రతీక మాత్రమే’ అంటుంది దివ్య. దివ్య వీడియోల పుణ్యమా అని ఎంతోమంది మహిళలు చీరె ధరించి స్కీయింగ్ చేస్తూ, భారతీయతను చాటుకుంటూ ‘భేష్’ అనిపించుకున్నారు. చీరె ధరించి స్కీయింగ్ చేయడానికి సంబంధించిన సలహాలు దివ్యను అడుగుతుంటారు. తన ఛాయిస్ మాట ఎలా ఉన్నా... హెల్మెట్, గ్లోవ్స్‌లాంటి సేఫ్టీలను ధరించడం మాత్రం దివ్య మరవదు. చీర ధరించే కాదు లెహెంగా ధరించి కూడా స్కీయింగ్ చేయగలను అంటూ చేసిన వీడియో వైరల్ అయింది. -
Chintala Posavva: దివ్య సంకల్పం
జీవితానికి పరీక్షలు అందరికీ ఉంటాయి. బతుకు పరీక్షాపత్రం అందరికీ ఒకలా ఉండదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో పత్రాన్ని నిర్దేశిస్తుంది ఎవరి పరీక్ష వారిదే... ఎవరి ఉత్తీర్ణత వారిదే. ఆ పరీక్షలో పోశవ్వకి నూటికి నూరు మార్కులు. తన ఉత్తీర్ణతే కాదు... తనలాంటి వారి ఉత్తీర్ణత కోసం... ఆమె నిర్విరామంగా సాగిస్తున్న దివ్యమైన సేవ ఇది. ‘ఒకటే జననం... ఒకటే మరణం. ఒకటే గమనం... ఒకటే గమ్యం’ చింతల పోశవ్వ కోసం ఫోన్ చేస్తే ఆమె రింగ్‌టోన్ ఆమె జీవితలక్ష్యం ఎంత ఉన్నతంగా ఉందో చెబుతుంది. తెలంగాణ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసించే పోశవ్వ ఓ ధీర. జీవితం విసిరిన చాలెంజ్‌ని స్వీకరించింది. ‘అష్టావక్రుడు ఎనిమిది అవకరాలతో ఉండి కూడా ఏ మాత్రం ఆత్మస్థయిర్యం కోల్పోలేదు. పైగా రాజ్యాన్ని ఏలే చక్రవర్తికి గురువయ్యాడు. నాకున్నది ఒక్క వైకల్యమే. నేనెందుకు అనుకున్నది సాధించలేను’ అనుకుంది. ఇప్పుడామె తన కాళ్ల మీద తాను నిలబడడమే కాక, తనలాంటి వాళ్లకు ఉపాధికల్పిస్తోంది. పోరాటం చేస్తున్న వాళ్లకు ఆసరా అవుతోంది. తన జీవితాన్ని సమాజహితానికి అంకితం చేయాలనే సంకల్పంతో పని చేస్తున్న పోశవ్వ సాక్షితో తన జీవనగమనాన్ని పంచుకున్నది. నాన్న వైద్యం... నానమ్మ మొక్కు! ‘‘విధి నిర్ణయాన్ని మార్చలేమనుకుంటాను. ఎందుకంటే మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అయి ఉండీ నేను పోలియో బారిన పడ్డాను. ఆ తర్వాత నాన్న ఆయుర్వేద వైద్యం నేర్చుకుని నాకు వైద్యం చేశారు. నానమ్మ నన్ను గ్రామ దేవత పోచమ్మ ఒడిలో పెట్టి ‘నీ పేరే పెట్టుకుంటా, బిడ్డను బాగు చేయ’మని మొక్కింది. మెడ కింద అచేతనంగా ఉండిపోయిన నాకు ఒక కాలు మినహా మిగిలిన దేహమంతా బాగయిపోయింది. కష్టంగానైనా నాకు నేనుగా నడవగలుగుతున్నాను. నాకు జీవితంలో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని ఎం.ఏ., బీఈడీ చదివించారు. చదువు పూర్తయిన తర్వాత మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్‌లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేదు. ఫీల్డు మీదకు వెళ్లాల్సిన ఉద్యోగం అది. నేను పనిని పరిశీలించడానికి పని జరిగే ప్రదేశానికి వెళ్లి తీరాలి. నేను వెళ్లడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని చోట్లకు మామూలు మనుషులు వెళ్లడం కూడా కష్టమే. ఇతర అధికారులు, ఉద్యోగులు ‘మీరు రాకపోయినా ఫర్వాలేదు’ అంటారు. అయినా ఏదో అసంతృప్తి. ఉద్యోగాన్ని అలా చేయడం నాకు నచ్చలేదు. నెలకు ముప్ఫై వేల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాను. హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీలో సర్ఫ్, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సబీనా తయారీలో శిక్షణ, చిన్న ఇండస్ట్రీతో బతుకు పుస్తకంలో కొత్త పాఠం మొదలైంది. కోవిడ్‌తో కొత్త మలుపు నేను మార్కెట్లో నిలదొక్కుకునే లోపే కోవిడ్ వచ్చింది. మా ఉత్పత్తులు అలాగే ఉండిపోయాయి. దాంతోపాటు వాటి ఉత్పత్తి సమయంలో ఎదురైన సమస్యలు కూడా నన్ను పునరాలోచనలో పడేశాయి. క్లీనింగ్ మెటీరియల్ తయారీలో నీటి వృథా ఎక్కువ, అలాగే అవి జారుడు గుణం కలిగి ఉంటాయి కాబట్టి పని చేసేటప్పుడు దివ్యాంగులకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. అందుకే నీటితో పని లేకుండా తయారు చేసే ఉత్పత్తుల వైపు కొత్త మలుపు తీసుకున్నాను. అవే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆ ప్రయత్నం నేను ఊహించనంతగా విజయవంతం అయింది. ఆ తర్వాత గోమయ గణపతి నుంచి ఇప్పుడు పదకొండు రకాల ఉత్పత్తులను చేస్తున్నాం. అందరూ దివ్యాంగులే. ఇక మీదట ఒంటరి మహిళలకు కూడా అవకాశం కల్పించాలనుకుంటున్నాను. కన్యాదాతనయ్యాను! మా జిల్లాలో ఎవరికి వీల్ చైర్ కావాలన్నా, ట్రై సైకిల్, వినికిడి సాధనాలు, పెన్షన్ అందకపోవడం వంటి సమస్యల గురించి నాకే ఫోన్ చేస్తారు. ఎన్జీవోలు, డీఆర్డీఏ అధికారులను సంప్రదించి ఆ పనులు జరిగేటట్లు చూస్తున్నాను. దివ్యాంగులకు, మామూలు వాళ్లకు కలిపి మొత్తం పన్నెండు జంటలకు పెళ్లిళ్లు చేశాను. వాళ్లలో ఇద్దరికి మాత్రం అమ్మాయి తరఫున పెళ్లి పెద్ద బాధ్యత వహించాల్సి వచ్చింది. నాకు అమ్మాయిల్లేరు, ముగ్గరబ్బాయిలు. ఈ రకంగా అవకాశం వచ్చిందని సంతోషించాను. సంకల్పం గొప్పది! నేను నా ట్రస్ట్ ద్వారా సమాజానికి అందించిన సహాయం ఎంతో గొప్ప అని చెప్పను. ఎంతో మంది ఇంకా విస్తృతంగా చేస్తున్నారు. కానీ నాకు ఉన్నంతలో నేను చేయగలుగుతున్నాను. నా లక్ష్యం గొప్పదని మాత్రం ధీమాగా చెప్పగలను. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. నాకు గత ఏడాది మహిళాదినోత్సవం సందర్భంగా సత్కరించింది. నా కుటుంబ పోషణకు నా భర్త ఉద్యోగం ఉంది. నా దివ్యహస్తం ట్రస్ట్ ద్వారా చేస్తున్న సర్వీస్ అంతా పర్యావరణ పరిరక్షణ, సమాజహితం, దివ్యాంగుల ప్రయోజనం కోసమే’’ అన్నారు. ‘ఉన్నది ఒకటే జననం... అంటూ... గెలుపు పొందే వరకు... అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు... గెలుపు కొరకే బతుకు’ అనేదే ఆమె తొలిమాట... మలిమాట కూడా. ఆదాయం కోసం పర్యావరణానికి హాని కలిగించడానికి వెనుకాడని ఈ రోజుల్లో, పర్యావరణ హితమైన మార్గంలో ఉపాధిని వెతుక్కుంటున్న మా ప్రయత్నాన్ని ఎన్నో సంస్థలతోపాటు ప్రభుత్వం కూడా గుర్తించింది. – వాకా మంజులారెడ్డి -
భర్తకు విడాకులు.. పాపకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
కోలీవుడ్ బుల్లితెర జంట అర్ణవ్-దివ్యలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే! ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తాను గర్భం దాల్చగానే మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అర్ణవ్‌ను అరెస్ట్ చేయించింది దివ్య. గర్భంతో ఉండగా తన కడుపుపై తన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ నటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేసింది. 'ఈ ఎదురుచూపులు ఎంతో ప్రత్యేకమైనవి. గతంలో ఏం జరిగిందనేదానికంటే ఇకమీదట ఎలా ఉండబోతుందనేది నాకు ముఖ్యం. నువ్వు నాకిచ్చిన ప్రేమ, బలం, సపోర్ట్.. అన్నీ అడగకముందే ఇచ్చావు. నాలో భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికీ నేను నీదాన్నేనని మాటిస్తున్నాను. ఎన్నటికీ నీవెంటే ఉంటాను. నా అందమైన చిట్టిత్లలి.. లవ్యూ డార్లింగ్. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు' అని రాసుకొచ్చింది. కాగా సెవ్వంధీ అనే తమిళ సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టింది దివ్య శ్రీధర్. తొలి సీరియల్‌తోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ముందు 2012లోనే దివ్యకు పెళ్లై, పాప కూడా ఉంది. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో అర్ణవ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం మతం కూడా మార్చుకుంది. వీరిద్దరూ గతేడాది జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే ఆమెకు గతంలో పెళ్లై, పాప కూడా ఉందన్న అర్ణవ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. మరోపక్క అర్ణవ్ సహనటితో సంబంధం వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు చేసింది దివ్య. ఇందుకు సంబంధించిన ఆడియోకాల్ కూడా లీకవగా అది సోషల్ మీడియాలో వైరలయింది. View this post on Instagram A post shared by Divya Shridhar (@divya_shridhar_1112) -
'నిద్రపోతుంటే నా నడుము తడిమాడు'.. బుల్లితెర నటి
తమిళ నటి దివ్య గణేశ్ టాలీవుడ్‌కు అంతగా పరిచయం లేదు. తమిళంలో బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆమె సన్ టీవీలో ప్రసారమైన కేలాడి కన్మణి అనే సీరియల్‌తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లక్ష్మీ వందచూ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషించారు. కేవలం సీరియల్స్‌లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా ఆమె నటించారు. ప్రముఖ సీరియల్ సుమంగళిలో అను సంతోష్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె 2019లో విడుదలైన అట్టు అనే తమిళ చిత్రంలో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తనకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. దివ్య మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి ఫ్లైట్‌లో బయలుదేరా. అప్పుడు విమానంలో ప్రయాణికులు కొద్దిమందే ఉన్నారు. నేను చివర్లో కూర్చుని నిద్రపోతూ ఉన్నా. ఆ సమయంలో నా నడుము దగ్గర ఏదో తగులుతున్నట్లు అనిపించింది. మొదట నేను దాని గురించి నేను పట్టించుకోలేదు. పదే పదే అలా అవుతుంటే ఏంటా అని చూశా. నా వెనకాలే కూర్చున్న వ్యక్తి నడుమును తడుముతూ ఉన్నాడు. మొదట నేను ఏదైనా పురుగేమో అనుకున్నా. తర్వాత అసలు విషయం తెలిసి షాక్ తిన్నా. దీంతో వెంటనే పైకి లేచి అతడి చెంపపై చెల్లుమనిపించా.' అంటూ చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే మహిళల పట్ల జరిగే వేధింపులకు అస్సలు భయపడకూడదన్నారు దివ్య గణేశ్. కాగా.. 2022లో దివ్య విజయ్ టీవీలో ప్రసారమయ్యే బాకియలక్ష్మి సీరియల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by divyaganesh (@divya_ganesh_official)