డాన్స్ చేయలేదని చితకబాదాడు
బాన్సువాడ టౌన్: డాన్స్ చేయనందుకు ఓ డీఎడ్ శిక్షణలో ఉన్న ఓ వ్యక్తి విద్యార్థిని చితకబాదాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 3వ తరగతి విద్యార్థిని దివ్యను డీఎడ్ శిక్షణ పొందుతున్న క్రాంతికుమార్ కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది.
సాయంత్రం ఇంటికి వచ్చిన దివ్య వీపును చూసిన ఆమె తండ్రి ప్రభాకర్ వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తరగతి గదిలో తనను నృత్యం చేయాలని క్రాంతి సార్ కోరాడని.. చేయకపోవడంతో కర్రతో కొట్టాడని విద్యార్థిని దివ్య తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విద్యార్థిని తండ్రి ప్రభాకర్ మీడియాకు చెప్పారు.