kranthi kumar
-
వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న 'మసూద' ఆర్ట్ డైరెక్టర్
తక్కువ కాలంలోనే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, కలర్ ఫోటో, మసూద ఇలాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ 'ఆర్ట్ డైరెక్టర్' గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ‘వై క్రాంతి కుమార్ రెడ్డి’. అనంతపురం జిల్లా శెట్టూరు గ్రామానికి చెందిన క్రాంతి స్వస్థలం. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దుల్లో కావడంతో కన్నడ భాష కూడా వచ్చింది. ఇంట్లో టీవీ లేకపోవడం, రేడియోలో సినిమా స్టోరీలు, పాటలు వినడంతో సినిమాలపై ఫ్యాషన్ పెంచుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో మూడు డిప్లొమాలు, పీజీ (థియేటర్) పూర్తి చేశారు క్రాంతి కుమార్. హైదరాబాద్‌లో అనేక లఘు చిత్రాలకు పనిచేశారు. నాటకాల కోసం సెట్లను రూపొందించాడు. అతని ప్రతిభ చూసి ‘రజాకార్’ 2014-15లో ఉత్తమ సెట్ డిజైనర్‌గా ‘నంది అవార్డు’ను గెలుచుకున్నాడు. నంది అవార్డుతో మొదలైన గెలుపు క్రాంతి కుమార్‌కు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. అలాగే, మసూద చిత్రానికి ఇంటర్వెల్ సన్నివేశంలో ‘డంప్ యార్డ్’ సెట్‌తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు. క్రాంతి కుమార్ నిరంతరం నేర్చుకోవడం మరియు ఎప్పటికప్పుడు కొత్తదనం వాటి మీద దృష్టి పెట్టడం అతని కెరీర్‌కి విజయం సాధించారు. తన సక్సెస్ పట్ల క్రాంతికుమార్ మాట్లాడూతూ..' సినిమాలో రాణించాలి అంటే ప్రతిభ ఉంటే సరిపోదు. ఓపిక కుడా ఉండాలి. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం అది నా అదృష్టంగా భావిస్తా. ఈ విజయాలన్నింటికీ నా తమ్ముడు, భార్య ప్రధాన కారణం. ' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం 'పేక మేడలు', 'బహిష్కరణ' జీ 5 (సిరీస్) రెండు ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేశారు. అంతేకాదు, రవితేజ బ్యానర్లో విశ్వక్ సేన్ హీరోగా సినిమా, కొత్తవాళ్లతో కర్నూలు సినిమా బ్యాక్‌డ్రాప్‌లో రానున్నాయి. క్రాంతి కుమార్ వరుస అవకాశాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. -
ప్రియుడితో సన్నిహితంగా ఉంటూ.. భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి..
సాక్షి, తాడేపల్లిరూరల్(మంగళగిరి): పండగ వేళ కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి భర్తను కర్కశంగా హతమార్చింది. విచక్షణారహితంగా కొట్టి చంపింది. మంగళగిరి సీఐ అంకమరావు కథనం ప్రకారం మంగళగిరి పట్టణానికి చెందిన వింజమూరు క్రాంతికుమార్ (32) బంగారం పని చేస్తుంటాడు. ఏడేళ్ల క్రితం ఏలూరుకు చెందిన గంగాలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. క్రాంతికుమార్ శనివారం అర్ధరాత్రి వరకు షాపులో ఉండి అనంతరం ఇంటికి వచ్చాడు. సమీప బంధువు అయిన ఏలూరుకు చెందిన మరిడయ్య అనే యువకుడితో కలిసి గంగాలక్ష్మి బెడ్రూంలో సన్నిహితంగా ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. భార్యతో గొడవ పడ్డాడు. మరిడయ్యను నిలదీశాడు. దీంతో వారిద్దరూ ఘర్షణకు దిగారు. ఈ సమయంలో క్రాంతికుమార్‌ను గంగాలక్ష్మితోపాటు మరిడయ్య బయటకు తీసుకొచ్చి మరో వ్యక్తితో కలిసి విచక్షణా రహితంగా రాడ్లతో కొట్టారు. దీంతో క్రాంతికుమార్ బిగ్గరగా కేకలు వేస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కేకలు విని చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి వచ్చేసరికి క్రాంతికుమార్ మృతి చెందాడు. గంగాలక్ష్మి, మరిడయ్యతో కలిసి అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించింది. ఇదే సమయంలో ఘటనాస్థలానికి వచ్చిన మంగళగిరి సీఐ అంకమరావు గంగాలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిడయ్య, మరో వ్యక్తి పరారయ్యారు. క్రాంతికుమార్ సోదరుడు హరి కృష్ణ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లికాక ముందు నుంచే గంగాలక్ష్మి మరిడయ్య మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. గంగాలక్ష్మి భర్తతో కలిసి ఆదివారం ఉదయం పండగకు ఏలూరు పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, మరిడయ్య ఇక్కడకు రావడం, క్రాంతికుమార్‌ను చంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు పథకంలో భాగంగానే హత్య జరిగినట్టు క్రాంతి కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు. చదవండి: (షార్‌లో విషాదం.. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య) -
`సూర్యాస్తమయం` చేయడం గర్వంగా ఉంది
ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `సూర్యాస్తమయం`. శ్రీహార్‌సీన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ‘పదేళ్ల ముందు నిర్మాతగా చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్తమయం` సినిమా చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, అలాగే శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ కి మంచి స్పందన వస్తుండటం చాలా ఆనందం గా వుంది, మా హీరో ప్రవీణ్ రెడ్డి కి నటన పరంగా మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’అన్నాడు. ఈ మూవీ లో అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు హీరో ప్రవీణ్ రెడ్డి. ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ.. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేది మరోసారి ‘సూర్యస్తమయం’తో నిజమైందని అన్నారు. -
సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, సిద్ధిపేట: మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా స్థానికంగా ఉన్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉందంటూ బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే హోటల్లో బస చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బీజేపీ నేతల మధ్య తోపుటలా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని, తనను కొట్టే ప్రయత్నం చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు దళిత బిడ్డలైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సిద్దిపేటలోనీ స్వర్ణ ప్యాలెస్‌లో దాడికి పాల్పటం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్, పోలీసు డిపార్టుమెంట్‌ను కోరుతున్నామన్నారు. -
గెలుపు పంటలు!
యుద్ధభేరి మోగగానే ఆహార భద్రత గురించిన ఆలోచన మదిలో రేకెత్తుతుంది. కష్టకాలంలోనే ఆహార స్వావలంబన మార్గాల అన్వేషణ ప్రారంభమవుతుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటి పంటలు, పెరటి తోటల సాగు దిశగా అడుగులు పడతాయి. తొలి, మలి ప్రపంచ యుద్ధ కాలాల్లోనూ ‘విక్టరీ గార్డెన్స్’ విస్తరించాయని చరిత్ర చెబుతోంది. అమెరికా విధించిన కఠోర ఆంక్షల నడుమ క్యూబా బతికి బట్టకట్టగలిగింది కూడా సేంద్రియ ఇంటిపంటల ద్వారానే. కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడిన ఈ యుద్ధ కాలమూ అందుకు అతీతం కాదు. గోదాముల్లో తిండి గింజలకు కొరత లేదు. కానీ వాటికి మన సేంద్రియ ఇంటిపంటలు కూడా తోడైతేనే సంపూర్ణ ఆహార భద్రత చేకూరేది. అప్పుడే పౌష్టికాహార లోపాన్ని, అనారోగ్యాలనూ మనం గెలవగలం. అందుకే మనకు ఇప్పుడు ఇంటింటా ‘గెలుపు పంటలు’ కావాలి! కరోనా మహమ్మారి విశ్వమానవాళిపై యుద్ధం ప్రకటించగానే ఆహార భద్రత గురించిన తలపులు మదిలో మెదిలాయి. లాక్డౌన్ పునరాలోచనకు పురికొల్పింది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొంతమేరకైనా ఇంటి పట్టున అప్పటికే పండించుకుంటున్న నగరాలు, పట్టణ వాసులు సంతోషించారు. టెర్రస్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడమే మేలన్న భావన మిగతా వారిలోనూ వేరూనుకుంటున్నది. ఈ చైతన్యం మున్ముందు అర్బన్ ఫార్మింగ్ వ్యాప్తికి దోహదం చేస్తుందని ఆర్కిటెక్ట్‌లు, ఆహార నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘మనం తినే ఆహారం ఎంత దూరం నుంచి తరలివస్తున్నది? అక్కడి నుంచి తరలి వచ్చే దారిలో ఎటువంటి అవాంతరాలకు ఆస్కారం ఉంది? ఈ అవాంతరాలను తగ్గించుకునే మార్గాలేమి ఉన్నాయి? అని చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు’ అని థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ లాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ కొచ్చకార్న్ ఒరాఖోమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. బాంకాక్లో ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్ రూఫ్‌టాప్ ఫామ్‌కు రూపుకల్పన చేసిన ఆర్కిటెక్ట్‌గా ఆమె ప్రసిద్ధిపొందారు. తొలి ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత రాకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ ‘విక్టరీ గార్డెన్స్’ పేరిట పంటల సాగు చేపట్టాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా అంతే. అమెరికాలో ప్రతి ఇల్లు, స్కూలు పరిసరాల్లో గజం కూడా ఖాళీ స్థలం వదలకుండా కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష భవనం ఎదుట కూడా కూరగాయలు సాగు చేశారు. 1940వ దశకంలో 2 కోట్ల అమెరికన్ కుటుంబాలు కూరగాయలు ఇంటిపంటలు పండించడం ప్రారంభించారు. నాలుగేళ్లలో 40% కూరగాయలను విక్టరీ గార్డెన్లే వారికి తఅందించాయట. ‘ఇంటిపంటల టవర్’ విశేషం ఏమిటంటే.. దీని పైన, చుట్టూతా కూడా అనేక మొక్కలు పెంచుకోవచ్చు. కంపోస్టు తయారు చేసుకోవచ్చు. టవర్ పైభాగన నీరు పోస్తే చాలు. ♦ అమెరికా కఠోర ఆంక్షల వల్ల క్యూబాకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చమురు దిగుమతి ఆగిపోయింది. ఆ కష్టకాలంలో క్యూబా నగరాలు, పట్టణాల్లో ప్రజలు సేంద్రియ ఇంటి పంటల సాగు ద్వారానే బతికి బట్టకట్టగలిగారు. అంతేకాదు, తాము పండించిన కూరగాయలు, పండ్లు గ్రామాలకు కూడా పంపగలిగారు! ♦ 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు మంది నగరాల్లో నివాసం ఉండబోతున్నారని ఐక్యరాజ్య సమితి అంచానా వేస్తోంది. వీరికి కావాల్సిన కూరగాయలు, పండ్లలో కొంత మేరకైనా అర్భన్ ప్రాంతాల్లోనే పండించే మార్గాంతరాలు వెతకాల్సి ఉందని ఎర్త్ ఫ్యూచర్ అధ్యయనం చెబుతోంది. ♦ భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరీకరణ వేగం పుంజుకున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతవాసుల్లో పౌష్టికాహార లోపం (హిడెన్ హంగర్) పెరుగుతున్నది. కనపడని శత్రువుపై పోరులో మనకు నిండుగా తోడుండేవి ఇంటి పంటలు. ♦ అవును, ఇవే గెలిపించే పంటలు.. మనుషులుగా మనల్ని, దేశాన్ని కూడా! ♦ ఇంటిపంటలు ఎంత మంచివైనా ఇప్పుడు టైం ఎక్కడుందిలే అని ఇక సరిపెట్టుకోలేం!!– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి ‘ఇంటిపంటల టవర్’తో మేలు పట్టణాలు, నగరాల్లో గృహస్తులు టెర్రస్ల మీద కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మా ఇంటిపైన పుదీనా, పొన్నగంటి, గంగవాయిలి, ఎర్రగలిజేరు వంటి ఆకుకూరలు, టమాటా, వంగ వంటి కూరగాయలను అతితక్కువ స్థలంలో ఇమిడిపోయే ‘ఇంటిపంటల టవర్’లో పెంచుతున్నాం. మేం తినడంతోపాటు బంధుమిత్రులకూ పంచుతున్నాం. వంటింటి వ్యర్థాలను ఈ టవర్‌లో వేసి కంపోస్టు తయారు చేస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కుటుంబాల పౌష్టికాహార, ఆరోగ్య భద్రతకు టవర్ గార్డెనింగ్ ఎంతగానో దోహదపడుతుంది. – కె. క్రాంతికుమార్‌రెడ్డి,లక్ష్మి దంపతులు (83096 15657),రామాంతపూర్, హైదరాబాద్అర్బన్ ఫార్మింగ్తోనే ఆహార భద్రత ప్రజలు, ప్రణాళికావేత్తలు, ప్రభుత్వాలు కూడా నగరాల్లో భూమిని ఇప్పుడు ఉపయోగిస్తున్న తీరుపై పునరాలోచన చేయాలి. అర్బన్ ఫార్మింగ్‌కు చోటివ్వాలి. ఇది ఆహార భద్రతను కల్పించడంతోపాటు పౌష్టికాహార లోపాన్ని అరికడుతుంది. వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తినిస్తుంది. మానసిక వత్తిడినీ ఉపశమింపజేస్తుంది.– కొచ్చకార్న్ ఒరాఖోమ్,ప్రముఖ లాండ్స్కేప్ ఆర్కిటెక్ట్,ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్ ఫామ్ రూపశిల్పి, బ్యాంకాక్ -
ఫైర్‌మేన్‌ను అభినందించిన మెగాస్టార్
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ యంత్రంగా అన్ని విధాల శ్రమిస్తోంది. ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్‌మేన్ క్రాంతి కుమార్ ను అభినందించారు. అంతేకాదు క్రాంతి కుమార్‌కు కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేశారు. క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్ సేషన్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని శ్రీ అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు. -
పంట సాగులో ‘క్రాంతి’
రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతో పంట సాగు చేపట్టి విప్లవాత్మక ఫలితాలను సాధిస్తున్నాడు బీటెక్ విద్యార్థి క్రాంతికుమార్. బుక్కరాయసముద్రంలోని కేకే అగ్రహారానికి చెందిన జ్యోతి, నాగేశ్వరరెడ్డి దంపతలు కుమారుడు క్రాంతికుమార్ రెడ్డి ప్రస్తుతం అనంతపురంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ (ద్వితీయ) చేస్తున్నాడు. తమకున్న 13 ఎకరాల పొలంలో వివిధ రకాల పంట సాగు చేపట్టారు. వరిసాగులో సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా ఎకరాకు 45 బస్తాల ధాన్యం పండించగలిగినట్లు కాంత్రికుమార్ తెలిపారు. ఎకరా పొలంలో వరిసాగుకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు పెట్టుబడి అయిందని, పంట దిగుబడి విక్రయిస్తే రూ. 50 వేలు వచ్చినట్లు పేర్కొంటున్నారు. బేర్ యాపిల్, దానిమ్మ, వంకాయ పంటలను కూడా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నట్లు వివరించారు. - బుక్కరాయసముద్రం (శింగనమల) సేంద్రియ ఎరువుల తయారీ ఇలా.. జీవామృతం : పేడ, ఆవు మూత్రం, బెల్లం, సెనగపిండి, దోసెడు గట్టు మన్ను కలిపి ఐదు రోజులు నిల్వ ఉంచిన తర్వాత పొలంపై పిచికారి చేసుకోవాలి. నీమాశ్రమం : వేపాకు, కిలో పేడ, ఆవు మూత్రం బాగా రుబ్బి రెండ్రోజలు తర్వాత పిచికారి చేసుకోవాలి. దశ పరణి కషాయం : వేపాకు, ఉమ్మెత్త ఆకులు, జిల్లేడు ఆకులు, బంతి పూల ఆకులు, తంగేడు ఆకులు, బాగా మిశ్రమం చేసి మూడు రోజుల తరువాత స్ప్రే చేయాలి. మురిపిండి కషాయం : కిలో పిప్పి ఆకు, లీటరు పాలు, వేపాకు కషాయం, ఆవు మూత్రం కలిపి నాలుగు రోజుల తర్వాత పిచికారి చేయాలి. ఇవన్నీ పచ్చ పురుగు, వేరు కుళ్లు తెగుళ్ల నివారణతో పాటు కాయ నాణ్యతకు, పూత రావడానికి ఎంతో ఉపయోగపడతాయి. జీవన ఎరువులే ఎంతో మేలు పంటల సాగులో జీనవ ఎరువుల వినియోగం లాభదాయకం. ప్రతి ఒక్కరూ జీవన ఎరువులను వాడితే పర్యావరణ సమతుల్యతను కాపాడినట్లవుతుంది. పంట దిగుబడి నాణ్యతగా ఉండడంతో పాటు రైతుకు లాభదాయకంగానూ ఉంటుంది. - డాక్టర్ లక్ష్మిరెడ్డి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త -
డాన్స్ చేయలేదని చితకబాదాడు
బాన్సువాడ టౌన్: డాన్స్ చేయనందుకు ఓ డీఎడ్ శిక్షణలో ఉన్న ఓ వ్యక్తి విద్యార్థిని చితకబాదాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 3వ తరగతి విద్యార్థిని దివ్యను డీఎడ్ శిక్షణ పొందుతున్న క్రాంతికుమార్ కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన దివ్య వీపును చూసిన ఆమె తండ్రి ప్రభాకర్ వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తరగతి గదిలో తనను నృత్యం చేయాలని క్రాంతి సార్ కోరాడని.. చేయకపోవడంతో కర్రతో కొట్టాడని విద్యార్థిని దివ్య తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విద్యార్థిని తండ్రి ప్రభాకర్ మీడియాకు చెప్పారు. -
నవ వధువు అదృశ్యం
మారేడుపల్లి: భర్తతో కలిసి నగరానికి వచ్చిన ఓ నవ వధువు కనిపించకుండాపోయింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన వేముల క్రాంతి కిరణ్‌కు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన జ్యోతితో గత నెలలో వివాహమైంది. క్రాంతి కిరణ్ సికింద్రాబాద్‌లో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లేందుకు భార్యతో కలిసి ఆదివారం జూబ్లీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్టాండ్‌కు వచ్చాక జ్యోతి వాష్ రూంకు వెళ్తానని చెప్పి తిరిగిరాలేదు. దీంతో భర్త, బంధువులు చుట్టుపక్కల వారిని వాకబు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్త క్రాంతికిరణ్ మారేడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పార్కింగ్ యాప్
క్రాంతికుమార్‌ను హ్యాకథాన్‌లో గెలిపించిన ప్రాజెక్ట్.. హైదరాబాద్ పార్కింగ్ యాప్. క్రాంతికుమార్ స్వస్థలం ఖమ్మం. తల్లిదండ్రులు కమల, సులోచనరామ. కంప్యూటర్ గేమ్స్ టెక్నాలజీలో యూకే యూనివర్శిటీలో ఎమ్మెస్ చేసొచ్చాడు. అక్కడే ఎడిన్బర్గ్లో కొన్నాళ్లు పనిచేసొచ్చి బెంగళూరు ఐబీఎంలో చేరాడు. తర్వాత ‘పర్ఫెక్ట్ 12’ అనే సొంత కంపెనీ స్థాపించాడు. ఈ యాప్ తయారీలో తనను ఏ ఆలోచన నడిపించిందో క్రాంతి చెబుతూ.. ‘నేను కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఓ రోజు పేపర్లో ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో స్థలం లేక పనికోసం అక్కడికి వచ్చిన వాళ్లంతా తమ వాహనాలను రోడ్డుమీదే నిలుపుతున్నార’నే వార్త చదివాను. పార్కింగ్ స్థలాలు నిర్వహించే జీహెచ్ఎంసీకి పార్కింగ్ స్థలం లేకపోవడమేంటి ?. హైదరాబాద్ నడిబొడ్డున స్థలం లేదు. ఉన్న స్థలాన్ని ఎలా వాడుకోవచ్చనే ఆలోచన నుంచే ఈ యాప్ పుట్టింది. ముందుగా హైదరాబాద్ పరిధిలో ఎన్ని వాహనాలున్నాయి? నిత్యం ఎన్ని కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి? జీహెచ్ఎమ్సీ నిర్వహణలో ఉన్న పార్కింగ్ స్థలాలెన్ని.. ఇలా లెక్కలన్నీ తీశాను. జీహెచ్ఎంసీ 47 పార్కింగ్ స్థలాలను మాత్రమే నిర్వహిస్తుందని తేలింది. అంతే నా హెచ్‌వైడీ పార్కింగ్ యాప్ తయారీకి బీజం పడింది’ అని వివరించారు. ఎలా పనిచేస్తుందంటే.. మీ ఇంటి దగ్గర గానీ, మీ షాప్ ప్రాంగణంలో గానీ, సిటీలో ఇంకెక్కడైనా గానీ మీకు ఖాళీ స్థలం ఉంటే ఆ ప్రదేశాన్ని కార్పొరేషన్‌కి ఇవ్వదలిస్తే ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ మెసేజ్ నేరుగా జీహెచ్ఎంసీ అధికారులకు వెళ్తుంది. వారు మిమ్మల్ని సంప్రదించి ఆ స్థలాన్ని పార్కింగ్‌కి ఇచ్చేట్టుగా మీకు అనుమతి మంజూరు చేస్తారు. అంతేకాదు మీరు పార్కింగ్ నిర్వహించదలచుకుంటే కూడా ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈ పార్కింగ్ స్థల సమాచారం ఈ యాప్ ఉపయోగించే వారికి తెలుస్తుంది. అబిడ్స్ వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు.. వాహనదారులకు ఆ ప్రదేశానికి దగ్గర్లోని పార్కింగ్ ప్లేసెస్ అన్ని ఈ యాప్ చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నగరంలోని పార్కింగ్ ప్లేసెస్ సమస్త సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పటికే ఇది 300 పైగా పార్కింగ్ స్థలాలను గుర్తించింది. అనుమతిలేని చోట్ల పార్కింగ్ దందా చేస్తున్న వాళ్ల మీదా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ఇది త్వరలోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ‘రానున్నది స్మార్ట్ సిటీ కాలం. దీన్ని దృష్టిలోపెట్టుకొనే నగరాల్లోని రిటైల్ స్టోర్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్ మొదలైన వాటికి ‘స్మార్ట్ సొల్యూషన్’ అనే కాన్సెప్ట్‌పై రీసెర్చ్ చేస్తున్నాను. మొబైల్ యాప్సే కాకుండా వెబ్‌యాప్స్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్.. ఇట్లా అన్ని సొల్యూషన్స్ మీదా వర్క్ చేస్తున్నాను’ అని క్రాంతికుమార్ తెలిపారు. -
ముస్లింలకు రిజర్వేషన్లు వైఎస్ చలవే
ధారూరు, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించిందని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 4 శాతం నుంచి 11 శాతానికి పెంచి అమలు చేయనున్నారని వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి క్రాంతికుమార్ అన్నారు. మండలంలోని సర్పన్‌పల్లి, అంతారం గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచార పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చేవెళ్ల లోకసభ అభ్యర్థిగా కొండా రాఘవరెడ్డిని, వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. మహానేత మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని ప్రజలకు దూరం చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే పేదల సంక్షేమం సాధ్యమని, దీనికి తమ పార్టీ రూపొందించిన మెనిఫెస్టోనే నిదర్శనమన్నారు. టీడీపీ నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో ఉచిత కరెంట్ అంటే వైర్లకు బట్టలు ఆరేసుకున్నట్లే.. అన్న ఆయన ఇప్పుడు ఉచిత విద్యుత్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగాల నిషేధాన్ని కొనసాగించి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసిన చంద్రబాబు యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 9 సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజల్ని కష్టాల పాలుచేసిన చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి దివంగత నేత వైఎస్ఆర్ ఆశయం నెరవేర్చేలా దీవించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ీ సపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగరాజ్, నాయకులు రాఘవరెడ్డి, రాజేందర్‌రెడ్డి, పి.రమేశ్, గోవర్దన్‌రెడ్డి, రాంరెడ్డి, బెనర్జీ, రాజిరెడ్డి, నవాజ్‌ఖాన్, రాజునాయక్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'ఆ ఐదుగురు' మూవీ ట్రైలర్ లాంచ్