బాత్‌రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | hidden cameras Big Twist in Prasanna Sankar Dhivya Sashidhar Case | Sakshi
Sakshi News home page

బాత్‌రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published Mon, Apr 7 2025 9:32 PM | Last Updated on Mon, Apr 7 2025 9:32 PM

hidden cameras Big Twist in Prasanna Sankar Dhivya Sashidhar Case

చెన్నైకి చెందిన టెక్‌ బిలియనీర్‌,  రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్(Prasanna Sankar) దంపతులు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్.. తన భర్తే పెద్ద కా*పిశాచి అని దివ్యా శశిథర్(Dhivya Sashidhar) పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. 

ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాండ్‌స్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. 

ప్రసన్నపై దివ్య సంచలన ఆరోపణలకు దిగింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్‌కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే అన్నట్లు చూసేవాడని తెలిపింది. ‘‘కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా నాతో బలవంతంగా సెక్స్ చేశాడు. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. బాత్‌రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవాడు. రోజూవారీ కార్యకలాపాల సమయంలో చిత్రీకరించేవాడు.  సంపదపై పన్నులు పడొద్దని నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడు. 

.. ఒక వేళ నాతో శృంగారంలో పాల్గొనకుంటే, బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడు. తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అనూప్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు. భావోద్వేగమైనది మాత్రమే’’ అని ఆ ఇంటర్వూ‍్యలో తెలిపారామె. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలే అని ఖండించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement