Tech billionaires
-
'కీచక బాస్' 5 వేల మంది మహిళలపై లైంగిక వేధింపులు..!
ప్రముఖ టెక్ బిలియనీర్ మైఖేల్ గోగున్ మరోసారి చిక్కల్లో పడ్డారు. తన సొంత సంస్థలో పనిచేసే నలుగురు మాజీ ఉద్యోగులు 135 పేజీల ఫిర్యాదుతో కోర్టును ఆశ్రయించారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని వాపోయారు. తమని వేధించినందుకు కోర్ట్ న్యాయం చేయాలని, 800 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ దావా వేశారు. ఈ దావాపై న్యూయార్క్ పోస్ట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మైఖేల్ గోగున్ 1996 నుంచి 2016 మధ్య కాలంలో సెక్వోయా క్యాపిటల్‌కు చెందిన నాయకత్వం వహించారు. ఆ సమయంలో మైఖేల్ గోగున్ 54 కంపెనీ పెట్టుబడులను కలిపి 64 బిలియన్ల కంటె ఎక్కువ మార్కెట్ వ్యాల్యూ పెరిగింది. అదే సమయంలో 2016లో ఆయనపై లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలపై సెక్వోయా క్యాపిటల్ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఆ తర్వాత సొంతంగా అమింటర్ గ్రూప్ ను స్థాపించాడు. అహర్నిశలు కష్టపడి కంపెనీకి మంచి ఫలితాల్ని రాబట్టారు. అమింటర్ పనితీరుతో టెక్ కంపెనీలు యాపిల్, సిస్కో, గూగుల్, యూట్యూబ్,పేపాల్,ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థలే నిధులు కోసం మైఖేల్ గోగున్ చుట్టూ క్యూ కట్టేవి. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గోగున్ మైఖేల్ గోగున్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే వారు. ముఖ్యంగా మహిళల్ని వేధిస్తున్నారనే ఆరోపణలు ఆయనకు అప్రతిష్టని తెచ్చి పెట్టాయి. తాజాగా గోగున్ చెందిన సంస్థలో పనిచేసిన నలుగురు మాజీ ఉద్యోగులు అతనిపై $800 మిలియన్ల దావా వేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం..135 పేజీల ఫిర్యాదులో మోంటానాలోని వైట్ ఫిష్ పట్టణానికి చెందిన హోటల్స్‌కు తీసుకెళ్లి మహిళల్ని వేధించేవారని బాధితులు పేర్కొన్నారు. గోగున్ 5,000 కంటే ఎక్కువ మంది మహిళల్ని వేధించాడని ఆరోపించారు. ఆ ఆకృత్యాలు జరిగే సమయంలో సైలెంట్‌గా ఉండేందుకు బాధితులకు పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చేవాడని పేర్కొన్నారు. మహిళలపై చెప్పుకోలేని విధంగా దారుణాలకు ఒడిగట్టిన మైఖేల్ పై ఫిర్యాదు చేసేందుకు 135పేజీలు సరిపోవని అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కోర్ట్‌కు విన్నవించారు. కాగా, ప్రస్తుతం ఈ దావాపై విచారణ కొనసాగుతుండగా..త్వరలో కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో తీర్పు వెలువడనుంది. చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు -
టాప్ 10 సంపన్న టెక్ దిగ్గజాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ఇండియా 2017 జాబితాలో టెక్ దిగ్గజాలకు చోటు దక్కింది. డిజిటల్ ప్రపంచంలో సత్తా చాటుతూ లాభాల పంట పండిస్తున్న టెక్ బిలియనీర్ల సంపద వేగంగా పెరుగుతోంది. 2016లో భారత బిలియనీర్ల సంపద 26 శాతం వృద్ధితో 2017 నాటికి 47,900 కోట్ల డాలర్లకు ఎగబాకడం గమనార్హం. భారత బిలియనీర్లలో టెక్ దిగ్గజాలకు గణనీయమైన స్థానం దక్కింది. వీరిలో టాప్ 10 టెక్ బిలియనీర్లను పరిశీలిస్తే... ముఖేష్ అంబానీ రిలయన్స్ జియోతో టెక్నాలజీ స్పేస్‌లో అడుగుపెట్టిన ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్ల జాబితాలో నెంబర్ వన్‌గా నిలిచారు. ముఖేష్ నికర ఆస్తులు రూ రెండు లక్షల కోట్లుగా ఫోర్భ్స్ లెక్కగట్టింది. జియోతో టెలికాం రంగంలో పెనువిప్లవం తీసుకువచ్చిన ముఖేష్ అంబానీ తాజాగా కేవలం రూ 1500కే జియో ఫోన్‌ను ఆఫర్ చేసి సంచలనం సృష్టించారు. ఈ మొత్తం సైతం మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చే సెక్యూరిటీ డిపాజిట్ గానే కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తున్నారు. అజీం ప్రేమ్‌జీ విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఫోర్భ్స్ ఇండియన్ టెక్ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్, ఐటీ సేవల కంపెనీల్లో ఒకటైన విప్రోకు దిశానిర్ధేశం చేసిన ప్రేమ్‌జీ నికర ఆస్తులు రూ 1,20,000 కోట్లని ఫోర్భ్స్ అంచనా. శివ్ నాడార్ టాప్ టెన్ టెక్ బిలియనీర్ల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్ధాపకులు శివ్ నాడార్ మూడో స్ధానంలో నిలిచారు.ఫోర్భ్స్ భారత బిలియనీర్ల లిస్ట్‌లో ఏడవ స్థానంలో ఉన్న శివ్ నాడార్ నికర ఆస్తులు రూ 75,000 కోట్లకు పైమాటే. 1976లో ఆయన చేతులమీదుగా ప్రారంభమైన హెచ్‌సీఎల్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది పనిచేస్తున్నారు. అంతర్జాతీయ టెక్ సంపన్నుల జాబితాలో శివ్ నాడార్ 18వ ర్యాంక్ సాధించడం గమనార్హం. సునీల్ మిట్టల్ ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో టెక్నాలజీ పరిశ్రమ నుంచి భారతి ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తదుపరి స్ధానంలో నిలిచారు. ఫోర్భ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన నికర ఆస్తులు రూ 54,000 కోట్లు. టెలికాం రంగంలో సత్తా చాటిన ఎయిర్టెల్ ప్రస్తుతం రిలయన్స్ జియోతో టారిఫ్ వార్తో ఢీకొంటోంది. ఈ ఏడాది ఆరంభంలో కొటాక్ మహీంద్రా బ్యాంక్‌తో కలిసి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను నెలకొల్పింది. అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ సోదరుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ టెక్ సంపన్నుల జాబితాలో 5వ స్ధానంలో నిలిచారు.ఫోర్భ్స్ అంచనా ప్రకారం అనిల్ అంబానీ నికర ఆస్తులు రూ 20,000 కోట్లు. ఇక ఫోర్భ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం టెక్ బిలియనీర్ల టాప్ 10 లిస్ట్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి, దినేష్ నంద్వానా, నందన్ నిలేకాని, ఎస్ గోపాలక్రిష్ణన్లున్నారు. -
టాప్ టెక్నాలజీ సంపన్నులెవరో తెలుసా..
న్యూయార్క్: సాధారణంగా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల వార్షిక నివేదికను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. 2016కు కూడా వందలమందితో ఆ జాబితాను ప్రకటించింది. అయితే, వీరిలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కుబేరులుగా ఎదిగినవారు చాలామంది ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విలువ ఈ రోజుల్లో అంతాఇంతా కాదు. ఇది వ్యక్తుల అవసరాలు తీర్చడంలో ఎంత వేగంగా ఉపయోగపడుతుందో అంతేవేగంగా దీనిని అందించేవారికి సంపదను కూడా ఆర్జించి పెడుతుంది. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రపంచంలోనే కుబేరులైనవారు ఎంతోమంది ఉన్నారు. వారిలో టాప్ టెన్ జాబితా ఒకసారి పరిశీలిస్తే అందులో తొమ్మిదిమంది అమెరికన్లు ఉండగా చైనా నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒకసారి వివరాలు పరిశీలిస్తే.. 1. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (సంపద 75 బిలియన్ డాలర్లు, అమెరికా) 2. జెఫ్ బెజోస్, అమెజాన్ స్థాపకుడు, సీఈవో (సంపద 45.2బిలియన్ డాలర్లు, అమెరికా) 3. మార్క్ జూకర్ బర్గ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు (సంపద 45.6 బిలియన్ డాలర్లు, అమెరికా) 4. లారీ ఎల్లిసన్, ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు (సంపద 43.6 బిలియన్ డాలర్లు, అమెరికా) 5. లారీ పేజ్, గూగుల్ వ్యవస్థాపకుడు, ఆల్పాబెట్ సీఈవో, (సంపద 35.2డాలర్లు, అమెరికా) 6. సెర్జీ బ్రిన్, అల్పాబెట్ అధ్యక్షుడు (సంపద 34.4 బిలియన్ డాలర్లు, అమెరికా) 7. స్టీవ్ బామర్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో (సంపద 23.5 బిలియన్ డాలర్లు, అమెరికా) 8. జాక్ మా, అలీబాబా వ్యవస్థాపకుడు (సంపద 20.5 బిలియన్ డాలర్లు, అమెరికా) 9. మైఖెల్ డెల్, డెల్ కంపెనీ బోర్డు చైర్మన్ (సంపద 19.8 బిలియన్ డాలర్లు, అమెరికా) 10. మా హువాతెంగ్, టెన్సెంట్ హోల్డింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు (సంపద 16.6 బిలియన్ డాలర్లు, చైనా -
గతవారం బిజినెస్
టాప్ టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, నాడార్ ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో భారత్ నుంచి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఉన్నారు. ఫోర్బ్స్ ‘టెక్నాలజీ రంగం టాప్-100 సంపన్నులు’ జాబితాలో మెక్రోసాఫ్ట్ సహ వ్యవ స్థాపకుడు బిల్‌గేట్స్ (79.6 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాతి స్థానాల్లో ఎలిసన్ (50 బిలియన్ డాలర్లు), జెఫ్ బిజోస్ ఉన్నారు. ప్రేమ్‌జీ (17.4 బిలియన్ డాలర్లు) 13వ స్థానంలో, నాడార్ (14.4 బిలియన్ డాలర్లు)14వ స్థానంలో కొనసాగుతున్నారు. ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇందుకోసం శ్రీరామ్ ఆటోమాల్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా ద్వారా కొనే అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను అందిస్తుంది. బేస్ రేటుకే గ్రామీణులకు గృహ రుణం బేస్ రేటుకే (బ్యాంక్ కనీస రుణ రేటు) గ్రామీణులకు గృహ రుణం అందించాలని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. రూ.15 లక్షల వరకూ ఈ రుణ వెసులుబాటు గ్రామీణులకు లభించనుంది. ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.7 శాతం. ప్రభుత్వ రంగంలో తనకు వ్యాపార ప్రత్యర్థిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేస్‌రేటుకే (9.7 శాతం) రుణ రేటును అందిస్తున్న నేపథ్యంలో- ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తాజా నిర్ణయం వెలువడింది. చైనా కరెన్సీ డీవాల్యూ చైనా సెంట్రల్ బ్యాంక్, దేశ కరెన్సీ యువాన్ మారకం విలువకు కోత(డీవాల్యూ) పెట్టింది. పీబీఓసీ డాలర్‌తో యువాన్ మారకం విలువను గురువారం 1.1%, బుధవారం 1.6% తగ్గించింది. మంగళవారం నాటి 2% తగ్గింపుతో కలుపుకుంటే మొత్తం దాదాపు 4% కోత విధించినట్లయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనా.. 1994 తర్వాత తమ దేశ కరెన్సీ విలువను ఇంత భారీగా తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో బుధవారం మన దేశీ కరెన్సీ ఏకంగా 59 పైసలు క్షీణించి 64.78 స్థాయికి పడిపోయింది. శ్రీసిటీలో షావొమీ స్మార్ట్ఫోన్ల తయారీ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావొమీ భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థతో జట్టు కట్టింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటులో రూపొందించిన రెడ్మీ2 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ. 6,999. 37 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగి రూ.2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసిక పరోక్ష పన్ను వసూళ్లు రూ.1.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జూలైలో రూ.40,802 కోట్లుగా ఉన్న పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది అదే సమయంలో రూ.56,739 కోట్లకు పెరిగాయి. ఉక్కు దిగుమతి సుంకం పెంపు ప్రభుత్వం బుధవారం ఇనుము, ఉక్కు, రాగి, నికెల్‌పై దిగుమతి సుంకాలను 2.5 శాతం మేర పెంచింది. చైనా, కొరియా, జపాన్ నుంచి భారీ దిగుమతుల నేపథ్యంలో కేం ద్రం ఈ బేసిక్ మెటల్స్ దిగుమతులపై సుంకాలను పెంచింది. కొన్ని లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టుల దిగుమతులపై కేంద్రం జూన్‌లో బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ)పెంచింది. దీనితో ఫ్లాట్ స్టీల్ ప్రొడక్ట్స్ దిగుమతులపై సుంకం 7.5 శాతం నుంచి 10 శాతానికి చేరింది. లాంగ్స్పై ఈ రేటు 7.5 శాతానికి ఎగసింది. తాజా నిర్ణయంతో ఈ రేట్లు పెరగనున్నాయి. టెల్కోల స్పెక్ట్రం షేరింగ్‌కు ఆమోదం కాల్ డ్రాప్ సమస్యను తగ్గించే దిశగా ఒకే బ్యాండ్‌విడ్త్‌లో టెలికం స్పెక్ట్రం షేరింగ్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టెలికం సంస్థలు స్పెక్ట్రంను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే స్పెక్ట్రం లీజింగ్‌కు మాత్రం అనుమతించలేదు. రూ.10 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఆమోదం నాట్కో ఫార్మా, మైలాన్ ల్యాబొరేటరీస్, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 10,379 కోట్లు ఉంటుంది. వీటిల్లో క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచే ప్రతిపాదన ఉంది. ఎయిర్ఏషియాలో టాటాల వాటా అప్! చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియాలో టాటా సన్స్ తన వాటాలను 41.06 శాతానికి పెంచుకోనుంది. ప్రస్తుతం ఇది 30 శాతంగా ఉంది. 21 శాతం వాటాలు ఉన్న టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ నుంచి టాటా సన్స్ అదనపు వాటాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న హీరో గ్రూప్ సహ వ్యవస్థాపకులు, హీరో సైకిల్స్ చైర్మన్ ఒ.పి.ముంజాల్(87) గురువారం కన్నుమూశారు. నియామకాలు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి - భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈఓగా నియమితులయ్యారు. - ప్రముఖ రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి బాధ్యతలు చేపట్టారు. - వీబీహెచ్సీ వ్యాల్యూ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ పీఎస్ జయకుమార్ (53) బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమితులయ్యారు. - ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేష్ శర్మ కెనరా బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. - ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎంఓ రెగో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు. - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కిషోర్ కారత్ పిరాజి ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. - భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంత సుబ్రమణ్యన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు. డీల్స్.. - సఇంజనీరింగ్ డిజైన్ సేవల సంస్థ అరిసెంట్.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సెమీ కండక్టర్లు, సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్ కంపెనీ స్మార్ట్‌ప్లేను కొనుగోలు చేసింది. - సప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ హీరో సైకిల్స్ యూకేకు చెందిన అవోసెట్ స్పోర్ట్స్ కంపెనీలో అధిక వాటాను కొనుగోలు చేసింది. - సమొబైల్ ట్రావెల్ సెర్చ్ సంస్థ ఇక్సిగొ దేశీ బ్యాక్‌ప్యాకింగ్ ట్రావెలర్స్‌ను కొనుగోలు చేసింది.