టాప్ టెక్ బిలియనీర్లలో ప్రేమ్‌జీ, నాడార్
ప్రపంచ టాప్-20 టెక్ బిలియనీర్లలో భారత్ నుంచి విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ నాడార్ ఉన్నారు. ఫోర్బ్స్ ‘టెక్నాలజీ రంగం టాప్-100 సంపన్నులు’ జాబితాలో మెక్రోసాఫ్ట్ సహ వ్యవ స్థాపకుడు బిల్‌గేట్స్ (79.6 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాతి స్థానాల్లో ఎలిసన్ (50 బిలియన్ డాలర్లు), జెఫ్ బిజోస్ ఉన్నారు. ప్రేమ్‌జీ (17.4 బిలియన్ డాలర్లు) 13వ స్థానంలో, నాడార్ (14.4 బిలియన్ డాలర్లు)14వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఎస్‌బీహెచ్‌తో శ్రీరామ్ జట్టు
సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇందుకోసం శ్రీరామ్ ఆటోమాల్‌తో ఎస్‌బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా ద్వారా కొనే అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వాహనాలకు రుణాలను అందిస్తుంది.
బేస్ రేటుకే గ్రామీణులకు గృహ రుణం
బేస్ రేటుకే (బ్యాంక్ కనీస రుణ రేటు) గ్రామీణులకు గృహ రుణం అందించాలని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. రూ.15 లక్షల వరకూ ఈ రుణ వెసులుబాటు గ్రామీణులకు లభించనుంది. ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.7 శాతం. ప్రభుత్వ రంగంలో తనకు వ్యాపార ప్రత్యర్థిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేస్‌రేటుకే (9.7 శాతం) రుణ రేటును అందిస్తున్న నేపథ్యంలో- ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి తాజా నిర్ణయం వెలువడింది.
చైనా కరెన్సీ డీవాల్యూ
చైనా సెంట్రల్ బ్యాంక్, దేశ కరెన్సీ యువాన్ మారకం విలువకు కోత(డీవాల్యూ) పెట్టింది. పీబీఓసీ డాలర్‌తో యువాన్ మారకం విలువను గురువారం 1.1%, బుధవారం 1.6% తగ్గించింది. మంగళవారం నాటి 2% తగ్గింపుతో కలుపుకుంటే మొత్తం దాదాపు 4% కోత విధించినట్లయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తున్న చైనా.. 1994 తర్వాత తమ దేశ కరెన్సీ విలువను ఇంత భారీగా తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో బుధవారం మన దేశీ కరెన్సీ ఏకంగా 59 పైసలు క్షీణించి 64.78 స్థాయికి పడిపోయింది.
శ్రీసిటీలో షావొమీ స్మార్ట్‌ఫోన్ల తయారీ
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావొమీ భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థతో జట్టు కట్టింది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటులో రూపొందించిన రెడ్‌మీ2 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ. 6,999.
37 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగి రూ.2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసిక పరోక్ష పన్ను వసూళ్లు రూ.1.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జూలైలో రూ.40,802 కోట్లుగా ఉన్న పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది అదే సమయంలో రూ.56,739 కోట్లకు పెరిగాయి.
ఉక్కు దిగుమతి సుంకం పెంపు
ప్రభుత్వం బుధవారం ఇనుము, ఉక్కు, రాగి, నికెల్‌పై దిగుమతి సుంకాలను 2.5 శాతం మేర పెంచింది. చైనా, కొరియా, జపాన్ నుంచి భారీ దిగుమతుల నేపథ్యంలో కేం ద్రం ఈ బేసిక్ మెటల్స్ దిగుమతులపై సుంకాలను పెంచింది. కొన్ని లాంగ్, ఫ్లాట్ స్టీల్ ప్రొడక్టుల దిగుమతులపై కేంద్రం జూన్‌లో బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ)పెంచింది. దీనితో ఫ్లాట్ స్టీల్ ప్రొడక్ట్స్ దిగుమతులపై సుంకం 7.5 శాతం నుంచి 10 శాతానికి చేరింది. లాంగ్స్‌పై ఈ రేటు 7.5 శాతానికి ఎగసింది. తాజా నిర్ణయంతో ఈ రేట్లు పెరగనున్నాయి.
టెల్కోల స్పెక్ట్రం షేరింగ్‌కు ఆమోదం
కాల్ డ్రాప్ సమస్యను తగ్గించే దిశగా ఒకే బ్యాండ్‌విడ్త్‌లో టెలికం స్పెక్ట్రం షేరింగ్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టెలికం సంస్థలు స్పెక్ట్రంను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే స్పెక్ట్రం లీజింగ్‌కు మాత్రం అనుమతించలేదు.
రూ.10 వేల కోట్ల ఎఫ్‌డీఐలకు ఆమోదం
నాట్కో ఫార్మా, మైలాన్ ల్యాబొరేటరీస్, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా 23 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటి విలువ రూ. 10,379 కోట్లు ఉంటుంది. వీటిల్లో క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచే ప్రతిపాదన ఉంది.
ఎయిర్‌ఏషియాలో టాటాల వాటా అప్!
చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా ఇండియాలో టాటా సన్స్ తన వాటాలను 41.06 శాతానికి పెంచుకోనుంది. ప్రస్తుతం ఇది 30 శాతంగా ఉంది. 21 శాతం వాటాలు ఉన్న టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ నుంచి టాటా సన్స్ అదనపు వాటాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న హీరో గ్రూప్ సహ వ్యవస్థాపకులు, హీరో సైకిల్స్ చైర్మన్ ఒ.పి.ముంజాల్(87) గురువారం కన్నుమూశారు.
నియామకాలు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌కి
- భారతీయుడైన సుందర్ పిచాయ్ (43) సీఈఓగా నియమితులయ్యారు.
- ప్రముఖ రియల్టీ పోర్టల్ హౌసింగ్.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా జాసన్ కొఠారి బాధ్యతలు చేపట్టారు.
- వీబీహెచ్‌సీ వ్యాల్యూ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ పీఎస్ జయకుమార్ (53) బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్‌గా నియమితులయ్యారు.
- ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేష్ శర్మ కెనరా బ్యాంక్ చీఫ్‌గా నియమితులయ్యారు.
- ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ ఎంఓ రెగో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు.
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కిషోర్ కారత్ పిరాజి ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంత సుబ్రమణ్యన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్‌గా
నియమితులయ్యారు.
డీల్స్..
- సఇంజనీరింగ్ డిజైన్ సేవల సంస్థ అరిసెంట్.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సెమీ కండక్టర్లు, సాఫ్ట్‌వేర్ సిస్టమ్ డిజైన్ కంపెనీ స్మార్ట్‌ప్లేను కొనుగోలు చేసింది.
- సప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ హీరో సైకిల్స్ యూకేకు చెందిన అవోసెట్ స్పోర్ట్స్ కంపెనీలో అధిక వాటాను కొనుగోలు చేసింది.
- సమొబైల్ ట్రావెల్ సెర్చ్ సంస్థ ఇక్సిగొ దేశీ బ్యాక్‌ప్యాకింగ్ ట్రావెలర్స్‌ను కొనుగోలు చేసింది.
గతవారం బిజినెస్
Published Mon, Aug 17 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement