వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ కోట్లకొద్దీ డబ్బుని ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక తన ప్రయోగాల్లోని పురోగతిని, ఎదురవ్వుతున్న సమస్యలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటునే ఉన్నారు. అలాగే ఇటీవల యవ్వన రూపం పొందే క్రమంలో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా షేర్ చేశారు బ్రయాన్.
"ప్రాజెక్ట్ బేబీ ఫేస్"లో భాగంగా ముఖానికి ఇచ్చిన కొవ్వు ఇంజెక్షన్లు అలెర్జీ ఇచ్చి మంటతో విలవిలలాడినట్టు వాపోయారు. అయితే ఏడు రోజుల తర్వాత ముఖం సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు ఎందకయ్యా ఇలాంటి ప్రయోగాలు..బాగున్న ఆరోగ్యాన్ని కోట్టు ఖర్చు పెట్టి పాడుచేసుకుంటున్నావంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అదిమరువక మునుపే అతడి డైట్‌ప్లాన్ నెట్టింట తెగ హాట్ టాపిక్ మారింది. టెక్ మిలియనీర్ గతంలో తన నాలుగు రోజుల డైట్ ప్లాన్‌ని షేర్ చేశారు. ఆ డైట్ ప్లాన్‌లోని ఆహారపదార్థాల కారణంగా నెట్టింట చర్చలకు తెరలేపాయి. వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టడానికి ఏడాది ఏకంగా రూ. 16 కోట్లు ఖర్చుపెట్టే జాన్సన్ డైట్ ప్లాన్‌లో మా భారతీయ వంటకాల అంటూ జోకులు మొదలయ్యాయి.
చివరికి అన్ని కోట్లు ఖర్చుపెట్టి.. భారతీయ వంటకాలే డైట్‌లో భాగమయ్యాయి..దీనికే అంత ఖర్చు అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఇంతకీ బ్రయాన్ డైట్‌లో ఉన్న వంటకాలేంటో చూస్తే..చిక్‌పీ వెజిటబుల్ ఫ్రిటాటా , లెమన్ రెడ్ లెంటిల్ సూప్, వెజిటబుల్ స్టైర్ ఫ్రై విత్ కాలీఫ్లవర్ రైస్ తదితరాలతో కూడిన గిన్నెల ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతోనే ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది.
ఎందుకంటే అవన్నీ భారతీయ టిఫిన్ బాక్స్‌లను పోలినట్లుగా ఉండి..అచ్చం భారతీయ వంటకాల వలే కలర్‌ఫుల్‌గా కనిపించడంతో భారతీయ సంప్రదాయ ఆహారమే గొప్పది, ఆయర్వేద సూత్రాలతో కాలానుగుణంగా వండుకుంటారు భారతీయులు అంటూ చర్చలకు దారితీసింది నెట్టింట. భారతీయ వంటకాలు కీర్తీ గడించడం ఇది మొదటిసారి కాదు గతంలోనూ పాశ్చాత్యులు మన వంటకాలను సూపర్‌ఫుడ్స్ జాబితాలో చేర్చి మరీ ప్రశింసించన సందర్భాలు అనేకం.
పురాత పద్ధతులే వెల్‌నెస్ సాధనకు మొదటి మెట్టు అనేందుకు టెక్ మిలియనీర్ డైటే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. మన పూర్వీకులు తయారు చేసిన వంటకాలే ఎంత ఆరోగ్యకరమైనవి యవ్వనంతో కూడిన ఆరోగ్యానికి ప్రతిక అని సగర్వంగా చెబుతూ పోస్టుల పెట్టారు. నిజానికి భారతీయ వంటకాల్లో నెయ్యి, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, కొన్ని మసాలా దినుసులు లేకుండా పూర్తిగాదు. అందులో ఉపయోగించే ప్రతిది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించేవే.
(చదవండి: చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..!)
Comments
Please login to add a commentAdd a comment