tech entrepreneur
-
హాట్‌టాపిక్‌గా టెక్ మిలియనీర్ డైట్ ! కేవలం భారతీయ వంటకాలే..
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ కోట్లకొద్దీ డబ్బుని ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అదీగాక తన ప్రయోగాల్లోని పురోగతిని, ఎదురవ్వుతున్న సమస్యలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటునే ఉన్నారు. అలాగే ఇటీవల యవ్వన రూపం పొందే క్రమంలో ఎదురైన చేదు అనుభవాన్ని కూడా షేర్ చేశారు బ్రయాన్. "ప్రాజెక్ట్ బేబీ ఫేస్"లో భాగంగా ముఖానికి ఇచ్చిన కొవ్వు ఇంజెక్షన్లు అలెర్జీ ఇచ్చి మంటతో విలవిలలాడినట్టు వాపోయారు. అయితే ఏడు రోజుల తర్వాత ముఖం సాధారణ స్థితికి వచ్చినట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు ఎందకయ్యా ఇలాంటి ప్రయోగాలు..బాగున్న ఆరోగ్యాన్ని కోట్టు ఖర్చు పెట్టి పాడుచేసుకుంటున్నావంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అదిమరువక మునుపే అతడి డైట్‌ప్లాన్ నెట్టింట తెగ హాట్ టాపిక్ మారింది. టెక్ మిలియనీర్ గతంలో తన నాలుగు రోజుల డైట్ ప్లాన్‌ని షేర్ చేశారు. ఆ డైట్ ప్లాన్‌లోని ఆహారపదార్థాల కారణంగా నెట్టింట చర్చలకు తెరలేపాయి. వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టడానికి ఏడాది ఏకంగా రూ. 16 కోట్లు ఖర్చుపెట్టే జాన్సన్ డైట్ ప్లాన్‌లో మా భారతీయ వంటకాల అంటూ జోకులు మొదలయ్యాయి. చివరికి అన్ని కోట్లు ఖర్చుపెట్టి.. భారతీయ వంటకాలే డైట్లో భాగమయ్యాయి..దీనికే అంత ఖర్చు అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఇంతకీ బ్రయాన్ డైట్లో ఉన్న వంటకాలేంటో చూస్తే..చిక్పీ వెజిటబుల్ ఫ్రిటాటా , లెమన్ రెడ్ లెంటిల్ సూప్, వెజిటబుల్ స్టైర్ ఫ్రై విత్ కాలీఫ్లవర్ రైస్ తదితరాలతో కూడిన గిన్నెల ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతోనే ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే అవన్నీ భారతీయ టిఫిన్ బాక్స్‌లను పోలినట్లుగా ఉండి..అచ్చం భారతీయ వంటకాల వలే కలర్ఫుల్గా కనిపించడంతో భారతీయ సంప్రదాయ ఆహారమే గొప్పది, ఆయర్వేద సూత్రాలతో కాలానుగుణంగా వండుకుంటారు భారతీయులు అంటూ చర్చలకు దారితీసింది నెట్టింట. భారతీయ వంటకాలు కీర్తీ గడించడం ఇది మొదటిసారి కాదు గతంలోనూ పాశ్చాత్యులు మన వంటకాలను సూపర్‌ఫుడ్స్ జాబితాలో చేర్చి మరీ ప్రశింసించన సందర్భాలు అనేకం. పురాత పద్ధతులే వెల్నెస్ సాధనకు మొదటి మెట్టు అనేందుకు టెక్ మిలియనీర్ డైటే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. మన పూర్వీకులు తయారు చేసిన వంటకాలే ఎంత ఆరోగ్యకరమైనవి యవ్వనంతో కూడిన ఆరోగ్యానికి ప్రతిక అని సగర్వంగా చెబుతూ పోస్టుల పెట్టారు. నిజానికి భారతీయ వంటకాల్లో నెయ్యి, పసుపు, అల్లం, పచ్చిమిర్చి, కొన్ని మసాలా దినుసులు లేకుండా పూర్తిగాదు. అందులో ఉపయోగించే ప్రతిది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించేవే. (చదవండి: చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..!) -
యవ్వనం కోసం మిలియనీర్ పాట్లు : వికటించిన ప్రయోగం, కానీ!
టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి, యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకోవడానికి 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం, అనేక చికిత్సల ద్వారా వయసును తగ్గించుగాకలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్ స్వయంగా ఇన్‌స్టాలో వివరించాడు.యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అంటూ తన ఫోటోలను జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. డోనర్ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో తన ముఖం ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అంటారు. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే అతని కఠినమైన 1,950-కేలరీల డైట్‌తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత ఈ పరిణాం చోటు చేసుకోవడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నాడు తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై తమ టీం పని చేస్తోందన్నాడు. View this post on Instagram A post shared by Bryan Johnson (@bryanjohnson_) కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్మెంట్, యాంటీ యాజింగ్ మందులు చికిత్సలతో తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర -
ఐపీవో కింగ్ అశోక్ సూతా : మరో జాక్‌పాట్
సాక్షి, బెంగళూరు : డిజిటల్ టెక్నాలజీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ బంపర్ ఐపీవో ద్వారా కంపెనీ కోఫౌండర్ అశోక్ సూతా తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశ సమాచార సాంకేతిక సేవల పరిశ్రమకు మార్గదర్శకుడిగా పేరొందిన సూతా రెండు అతిపెద్ద ఐపీవోలను విజయవంతం చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశంలోని అతిపెద్ద, విప్రో లిమిటెడ్‌తో సహా మూడు అవుట్సోర్సింగ్ కంపెనీలకు నాయకత్వం వహించిన అశోక్ సూతా తాజాగా మరో జాక్‌పాట్ కొట్టేశారు. ఈ వారంలో ఆయన స్టార్టప్ కంపెనీ హ్యాపీస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ 151 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ కావడం ఆయన వ్యాపార దక్షతకు అద్దం పట్టింది. 23.3 మిలియన్ల షేర్లను ఆఫర్ చేయగా 3.51 బిలియన్ షేర్లకు బిడ్లను సాధించింది. దీంతో తొలిసేల్ లోనే ఈ దశాబ్దంలో దేశంలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. తన వాటాలో కొంత భాగాన్ని అమ్మడం ద్వారా 140 కోట్ల రూపాయలను ఆయన సాధించారు. వచ్చే వారం షేర్ల ట్రేడింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అశోక్ సూతా విశ్వసనీయతే ఈ రికార్డు ఐపీవోలకు కారణమని ముంబైలోని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి అభిమన్యు వ్యాఖ్యానించారు. తాజా ఐపీవో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, సంస్థాగత, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. ఈ ఐపీవో ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ భారతీయ మార్కెట్లో ప్రీమియాన్ని ప్రతిబింబిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి దీపక్ జసాని అన్నారు. అశోక్ సూతా ప్రస్థానం అశోక్ సూతా (77) 1942 నవంబర్ 12న జన్మించారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టా పొందిన సూతా 1965లో శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం 1984 నుంచి 1999 వరకు విప్రో ఇన్ఫోటెక్ ప్రెసిడెంట్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ఐఐటి రూర్కీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సూతా విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీని ఆకర్షించారు. తన నూతన ఐటీ బిజినెస్ కోసం సూతాను ఎంపిక చేశారు. తరువాతి14 సంవత్సరాలలోఅంచలంచెలుగా ఎదిగి విప్రో వైస్ చైర్మన్ అయ్యారు సూతా. తద్వారా దేశంలో టాప్ 3 ఐటీ కంపెనీల్లో ఒకదానిగా నిలిపారు. అయితే విప్రోనుంచి బయటికి వచ్చిన ఆయన మరో 9 మంది విప్రో ఉద్యోగులతో కలిసి1991లో మరో ఐటీ కంపెనీ మైండ్ ట్రీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా 2007 మార్చిలో ప్రకటించిన ఐపీవో 100 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయ్యి బ్లాక్‌బస్టర్ ఐపీవో సాధించడంతోపాటు, విలువైన కంపెనీగా మైండ్ ట్రీని తీర్చిదిద్దారు. ఇక 2011లో బెంగూళరులో హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ పేరుతో మరో కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించారు. అంతేకాదు ఐపీవోలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. నిధుల సమీకరణలో ఆయన శైలి, ఐటీ రంగంలో అపారమైన అనుభవం హ్యాపియెస్ట్ ఐపీవోకు కలిసి వచ్చిన అదృష్టమని పరిశోధకులు అంటున్నారు. -
స్ఫూర్తి చీకటి ఖండంలో వెలుగురేఖ!
రెండు దశాబ్దాల కిందట అతడు... చదువు మానేసిన మొద్దబ్బాయి. ఇంట్లో వాళ్ల పాలిట ఒక తలనొప్పి. ఎలా బతుకుతాడో అని భయపడేవారు అమ్మానాన్నా. హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయలేకపోయిన అతడి బతుకు చీకటిమయం అవుతుందని అనుకునేవారంతా. కానీ అతడు చీకటి ఖండంలో ఒక వెలుగురేఖలా ప్రసరిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఎలక్ట్రానిక్స్ రంగంలో దాక్కొన్న సంపద అంతా ఇంతా కాదు. తోడుకొనే చేవ ఉండాలి కాని.. ఎంతైనా సంపాదించవచ్చన్న విషయాన్ని నిరూపించిన ఎంతోమంది ‘టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్’లో ఒకరు ఆశిష్ థక్కర్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టెక్నాలజీ సంబంధిత వ్యాపారం చే సే వ్యక్తి తను కూడా ఆ దేశంతో పాటు అభివృద్ధి చెందవచ్చు, అభివృద్ధి బాటలో ఆ దేశం కన్నా వేగంగా నడవొచ్చు అని నిరూపిస్తున్నాడీయన. ఆఫ్రికన్ దేశం ఉగాండాలో ఐదు వేల డాలర్ల సొమ్ముతో వ్యాపారాన్ని ప్రారంభించి మల్టీమిలియనీర్‌గా ఎదిగాడు మిస్టర్ థక్కర్. వాళ్ల తాతగారు 19వ శతాబ్దంలోనే ఉగాండాకు తిండి గింజలు ఎగుమతి చేసే వ్యాపారం చేసేవారట. తర్వాత థక్కర్ తండ్రి కూడా ఆ వారసత్వాన్ని కొనసాగించారు. ఆ వ్యాపారం కోసం ఉగాండాకు చేరింది వీరి కుటుంబం. అయితే ఆ దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోవడంతో అక్కడి ఆసియన్లందరికీ కష్టాలు మొదలయ్యాయి. దీంతో 1973లో థక్కర్ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లిపోయింది. చిన్నప్పట్నుంచీ ఇంట్లో అంతా వ్యాపారస్తుల్నే చూశాడేమో... థక్కర్‌కు చదువు మీద మనసు నిలవలేదు. హైస్కూల్ దశలోనే పుస్తకాలు వదిలేశాడు. పైగా మనోడిని ఉగాండా తెగ ఆకర్షించసాగింది. అప్పటికే కుటుంబం బ్రిటన్ వచ్చేసి పాతికేళ్లు గడిచిపోయాయి. అయినా కూడా అతడి మనసు అటే లాగింది. తాత, తండ్రులు వ్యాపారం చేసిన ఆ దేశంలో ఈ మూడో తరం థక్కర్ దశ కూడా తిరగాలని రాసి పెట్టి ఉందో ఏమో... ఐదు వేల డాలర్ల రుణం తీసుకొని 1995లో చీకటి ఖండంలో అడుగుపెట్టాడు పన్నెండేళ్ల ఆశిష్. హార్డ్‌డ్రైవ్‌లు, ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్ డిస్క్, రామ్‌లను దుబాయ్ నుంచి తెప్పించుకొని ఉగాండాలో అమ్మడం మొదలు పెట్టాడు థక్కర్. అప్పటికది చెప్పుకోవడానికి పెద్ద బిజినెస్ ఏమీ కాదు. కానీ, 19ఏళ్లు గడిచే సరికి ఏటా రెండు వందల మిలియన్ డాలర్ల లాభాలను సాధించే స్థాయికి చేరింది అతడి వ్యాపారం. ఉగాండాతో మొదలై ఇప్పుడు మొత్తం 21 ఆఫ్రికా దేశాల్లోకి వేళ్లూనుకొంది ఇతడి సామ్రాజ్యం. ఇప్పుడతడి వయసు 31 సంవత్సరాలు! అతడి కంపెనీ విలువ 720 మిలియన్ డాలర్లు. అతడి వద్ద 8,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపారవేత్తలు కూడా థక్కర్‌ను ఒక గొప్ప వ్యాపారవేత్త అని అంటారు. అతడి సమర్థత అద్వితీయం అని అంటారు. ఆశిష్ థక్కర్ అంటే అతడు చీకటి ఖండంలో వ్యాపార మార్గాన్ని చూపిన వెలుగు రేఖ అని పొగడ్తలతో ముంచెత్తుతారు. థక్కర్ సాధించిన విజయాన్ని బట్టి చూస్తే ఈ ప్రశంసలు వందశాతం నిజమేనని చెప్పవచ్చు!