
టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడానికి, యవ్వనంగా ఉండేందుకు కోట్ల కొద్దీ సొమ్మును కుమ్మరిస్తున్నాడు. తన జీవసంబంధమైన వయస్సును తగ్గించుకోవడానికి 30 మంది శాస్త్రవేత్తలు, వైద్యుల బృందం మద్దతుతో, విపరీతమైన మందులు, వ్యాయామం, అనేక చికిత్సల ద్వారా వయసును తగ్గించుగాకలిగాడు. అయితే, అతని తాజా యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బ్రయాన్ జాన్సన్ స్వయంగా ఇన్‌స్టాలో వివరించాడు.
యవ్వన రూపాన్ని పొందే క్రమంలో ముఖానికి కొవ్వు ఇంజక్షన్ వికటించి, అతని ముఖం ఎర్రగా ఉబ్బిపోయింది. మీకెప్పుడైనా ఇలా జరిగిందా అంటూ తన ఫోటోలను జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. డోనర్ ఇచ్చిన కొవ్వును ఇంజెక్ట్ చేసే ప్రయత్నంలో తన ముఖం ఎర్రగా వాచిపోయిందని తెలిపాడు. దీన్నే "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అంటారు. ముఖంలో మంట మొదలైందనీ, ఆ తర్వాత మరింత అధ్వాన్నంగా మారిపోయిందని తెలిపాడు. ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య అని వివరించాడు. అయితే అతని కఠినమైన 1,950-కేలరీల డైట్‌తో గణనీయమైన బరువు తగ్గిన తర్వాత ఈ పరిణాం చోటు చేసుకోవడం గమనార్హం. ఏడు రోజుల తర్వాత, తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని పేర్కొన్నాడు తదుపరి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలపై తమ టీం పని చేస్తోందన్నాడు.
కాగా బ్రయాన్ జాన్సన్ ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్‌మెంట్, యాంటీ యాజింగ్ మందులు చికిత్సలతో తన చర్మ వయస్సుతోపాటు, గుండె, లివర్ శరీరంలోని ప్రతీ భాగం వయస్సును తగ్గించుకున్నట్టు ఇంతకు ముందే ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర
Comments
Please login to add a commentAdd a comment