
ఒకప్పుడు మనదేశంలో సంప్రదాయ పానీయంగా ప్రజల మన్ననలను పొందిన గోలీసోడా చూస్తుండగానే కనుమరుగైంది. పెప్సీ, మజా, కోకోలా వంటి ఆధునిక పానీయాల దెబ్బతో జనాలే వాటిని దరిచేరనివ్వలేదు. ఒకప్పుడు టప్ మని శబ్దంతో ఆకర్షణీయమైన దాని ప్యాకేజింగ్‌తో ప్రజల మన్నలను అందుకున్న పానీయం ఇది. 80,90లలో దీనిదే హవా. అంతలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే పానీయంగానే కాకుండా కాస్త భోజనం అరగకపోయినా..కొద్దిగా సోడా తెగ్గుచుకుని తాగేవారు. అంతలా మనలో భాగమైన ఈ గోలీ సోడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా విదేశీయులు సైతం ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వస్తోంది. పైగా అక్కడ దీని డిమాండ్ వెరేలెవెల్‌లో ఉంది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దామా..!.
మన భారత సంప్రదాయ పానీయమైన ఈ గోలీ సోడాకి అమెరికా, బ్రిటన్, యూరప్‌తో సహా గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వాజిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడ విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారని, కామర్స్ మంత్రి పియూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకప్పటి ఐకానిక్ పానీయం గ్లోబల్ వేదికపై ప్రభంజనం సృష్టించేలా అమ్ముడుపోతోందని చెబుతున్నారు.
దాని వినూత్న రీక్రీయేషనే అందుకు కారణమని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో దీనికి అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఉందట. అంతేగాదు ఈ గోలిసోడా మార్కెట్‌కి సంబంధించి భారత్ సరసమైన ధరలతో వ్యూహాత్మక ఎగుమతుల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్మ్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది.
మన భారతీయులు సైతం ఈ గోలీసోడాను ఇష్టపడేది దాని వినూత్న రీతిలో ప్యాకేజ్ అయిన విధానమే. అదే విదేశీయలును కూడా ఆకర్షించడం విశేషం. అందులోనూ దాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక ఓపెనర్‌తో వచ్చే టప్ మనే పేలుడు శబ్దం.. మనల్ని ప్రేమగా గుర్తుంచుకునేలా చేస్తుంది.
అదే ఇప్పుడు మళ్లీ ఇలా రీబ్రాండింగ్ అంర్జాతీయ మార్కెట్‌ని ఆకర్షించి ఆధునాత ఉత్పత్తిగా అవతరించింది. ఇది ఒకరంగా మన భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్‌లతో పోటీపడగలవని ప్రూవ్ చేసింది. అంతేకాదండోయ్ ఈ సోడా మన దేశంలో కూడా మళ్లీ ఇదివరకటి రోజుల్లా అమ్ముడైలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారట అధికారులు. ఇది చూస్తుంటే ఎప్పటికీ..ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అన్న ఆర్యోక్తి గుర్తోస్తోంది కదూ..!.
Bharat's very own GOLI POP SODA returns to wow tastebuds worldwide! 🇮🇳
Kudos to @APEDADOC for promoting the revival of the traditional Indian Goli Soda.
📖 https://t.co/Ask6n6YCCl pic.twitter.com/T7XZmc1xmc— Piyush Goyal (@PiyushGoyal) March 25, 2025