Gulf countries
-
గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు -
భారత్ గోలీ సోడాకు విదేశాల్లో ఫుల్ డిమాండ్..!
ఒకప్పుడు మనదేశంలో సంప్రదాయ పానీయంగా ప్రజల మన్ననలను పొందిన గోలీసోడా చూస్తుండగానే కనుమరుగైంది. పెప్సీ, మజా, కోకోలా వంటి ఆధునిక పానీయాల దెబ్బతో జనాలే వాటిని దరిచేరనివ్వలేదు. ఒకప్పుడు టప్ మని శబ్దంతో ఆకర్షణీయమైన దాని ప్యాకేజింగ్‌తో ప్రజల మన్నలను అందుకున్న పానీయం ఇది. 80,90లలో దీనిదే హవా. అంతలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే పానీయంగానే కాకుండా కాస్త భోజనం అరగకపోయినా..కొద్దిగా సోడా తెగ్గుచుకుని తాగేవారు. అంతలా మనలో భాగమైన ఈ గోలీ సోడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా విదేశీయులు సైతం ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వస్తోంది. పైగా అక్కడ దీని డిమాండ్ వెరేలెవెల్లో ఉంది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దామా..!.మన భారత సంప్రదాయ పానీయమైన ఈ గోలీ సోడాకి అమెరికా, బ్రిటన్, యూరప్‌తో సహా గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వాజిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడ విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారని, కామర్స్ మంత్రి పియూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకప్పటి ఐకానిక్ పానీయం గ్లోబల్ వేదికపై ప్రభంజనం సృష్టించేలా అమ్ముడుపోతోందని చెబుతున్నారు. దాని వినూత్న రీక్రీయేషనే అందుకు కారణమని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో దీనికి అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఉందట. అంతేగాదు ఈ గోలిసోడా మార్కెట్‌కి సంబంధించి భారత్ సరసమైన ధరలతో వ్యూహాత్మక ఎగుమతుల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్మ్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది. మన భారతీయులు సైతం ఈ గోలీసోడాను ఇష్టపడేది దాని వినూత్న రీతిలో ప్యాకేజ్ అయిన విధానమే. అదే విదేశీయలును కూడా ఆకర్షించడం విశేషం. అందులోనూ దాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక ఓపెనర్‌తో వచ్చే టప్ మనే పేలుడు శబ్దం.. మనల్ని ప్రేమగా గుర్తుంచుకునేలా చేస్తుంది. అదే ఇప్పుడు మళ్లీ ఇలా రీబ్రాండింగ్ అంర్జాతీయ మార్కెట్‌ని ఆకర్షించి ఆధునాత ఉత్పత్తిగా అవతరించింది. ఇది ఒకరంగా మన భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పోటీపడగలవని ప్రూవ్ చేసింది. అంతేకాదండోయ్ ఈ సోడా మన దేశంలో కూడా మళ్లీ ఇదివరకటి రోజుల్లా అమ్ముడైలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారట అధికారులు. ఇది చూస్తుంటే ఎప్పటికీ..ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అన్న ఆర్యోక్తి గుర్తోస్తోంది కదూ..!.Bharat's very own GOLI POP SODA returns to wow tastebuds worldwide! 🇮🇳Kudos to @APEDADOC for promoting the revival of the traditional Indian Goli Soda.📖 https://t.co/Ask6n6YCCl pic.twitter.com/T7XZmc1xmc— Piyush Goyal (@PiyushGoyal) March 25, 2025(చదవండి: పెళ్లి సంగతి తర్వాత..కౌన్సిలింగ్ ఇప్పించండి..! ) -
అక్కడ సంపాదించి ఇక్కడకు పంపిస్తున్నారు!
ముంబై: అభివృద్ధి చెందిన దేశాల నుంచి ప్రవాస భారతీయులు మాతృదేశానికి పంపిస్తున్న రెమిటెన్స్‌లు (నిధుల బదిలీ) గణనీయంగా పెరుగుతున్నాయి. 2023–24లో 118.7 బిలియన్ డాలర్లను (రూ.10.32 లక్షల కోట్లు) ప్రవాసులు భారత్‌కు పంపించారు. 2010–11లో 55.6 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చి చూస్తే రెట్టింపయ్యాయి. యూఎస్, యూకే తదితర దేశాల్లో స్థిరపడిన భారతీయులు 2023–24లో భారత్‌కు పంపించిన రెమిటెన్స్‌లు గల్ఫ్ దేశాలను మించిపోయినట్టు మార్చి నెలకు సంబంధించి విడుదలైన ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది.భారతీయ నిపుణుల వలసల్లో మార్పులను ఇది ప్రతిఫలిస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగం ఈ నివేదికను రూపొందించింది. అయితే ఇందులోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, ఆర్బీఐ అభిప్రాయాలను ప్రతిఫలించవని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. నివేదికలోని అంశాలు..అంతర్జాతీయ వలసదారుల్లో భారత్‌కు చెందిన వారు 1990లో 66 లక్షలుగా ఉంటే, 2024 నాటికి 1.85 కోట్లకు పెరిగారు. అంతర్జాతీయ వలసదారుల్లో భారత్ వాటా 4.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయుల్లో సగం మందికి గల్ఫ్ సహకార సమాఖ్య (జీసీసీ) కేంద్రంగా ఉంది. ఇంత కాలం భారత్‌కు రెమిటెన్స్‌ల్లో జీసీసీ దేశాల ఆధిపత్యం కొనసాగగా, క్రమంగా ఇది అభివృద్ధి చెందిన దేశాలైన యూఎస్, యూకే, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మొగ్గుతోంది. 2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్‌ల్లో సగంపైన ఈ దేశాల నుంచే ఉంది. పనిచేసే వయసులోని అధిక జనాభాతో 2048 నాటికి భారత్ మానవ వనరులను సరఫరా చేసే కీలక దేశం కానుంది.8.1 శాతం తెలంగాణకు..2023–24లో మొత్తం రెమిటెన్స్‌ల్లో 8.1 శాతం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది.అత్యధికంగా 20.5 శాతం మహారాష్ట్రకు వెళ్లింది. 2020–21లో ఇదే రాష్ట్రం వాటా 35.2 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. రెమిటెన్స్‌ల్లో కేరళ వాటా 10 శాతం నుంచి 19.7 శాతానికి పెరిగింది. తమిళనాడు 10.4 శాతం, కర్ణాటక 7.7% సొంతం చేసుకున్నాయి. 2023–24 రెమిటెన్స్‌ల్లో రూ.5లక్షలు అంతకుమించిన లావాదేవీలు 29 శాతంగా ఉన్నాయి. భారత్‌కు గత ఆర్థిక సంవత్సరం వచ్చిన రెమిటెన్స్‌ల్లో యూఎస్ వాటా 27.7 శాతానికి చేరింది. 2020–21లో ఇది 23.4 శాతంగా ఉంది. అలాగే యూకే నుంచి వచ్చిన రెమిటెన్స్‌లు ఇదే కాలంలో 6.8% నుంచి 10.8 శాతానికి పెరిగాయి. యూఏఈ 19 శాతంతో రెమిటెన్స్‌లకు రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. 2020–21 రెమిటెన్స్‌ల్లో యూఏఈ వాటా 18 శాతంగా ఉండడం గమనార్హం. నిర్మాణ రంగం, హెల్త్‌కేర్, ఆతిథ్యం, పర్యాటకం తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలతో భారత కార్మికులకు యూఏఈ ఆశ్రయమిస్తుంటే.. భారత నిపుణులకు యూఎస్ కీలక ఉపాధి కేంద్రంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ నుంచి ఎక్కువ మంది విదేశీ విద్యకు వెళుతున్నారు. దీంతో దేశ రెమిటెన్స్‌ల్లో ఈ రాష్ట్రాల వాటా క్రమంగా పెరుగుతోంది. ఇదీ చదవండి: మరో టెలికాం కంపెనీ 5జీ సేవలు షురూ..వృద్ధికి పటిష్ట మూలాలుబలమైన ద్రవ్య విధానాలు, మెరుగైన సమన్వయంతో కూడిన పరపతి విధాన కార్యాచరణ, డిజిటల్ వైపు మళ్లేందుకు తీసుకుంటున్న చర్యలు దీర్ఘకాలం పాటు స్థిరమైన ఆర్థిక వృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, బలమైన దేశీ డిమాండ్, స్థిరమైన పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ మూలధన వ్యయాల పెంపు ఇవన్నీ కూడా నిలకడైన ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తాయని తెలిపింది. ‘అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్ల వాతావరణలోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడింది. వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకు తోడు వినియోగం మెరుగుపడడం ఇందుకు సానుకూలించింది’ అని వివరించింది. టారిఫ్‌ల తీవ్రత, వాటి అమలుపై అనిశ్చితి నెలకొన్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశి్చత పరిస్థితుల వల్లే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయటకు వెళ్లిపోతున్నట్టు తెలిపింది. 2024–25 చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) డిమాండ్ బలంగా ఉంటుందని కీలక సూచికలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. -
అరబ్బుల ఇంటికి.. మన అరటి!
పులివెందులూరల్: వైఎస్సార్ జిల్లా పులివెందుల అరటి కాసులు కురిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మంచి డిమాండ్ ఉన్న ఈ అరటి ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ నాణ్యత విషయంలో తగ్గేదే లేదంటోంది. ఈ ప్రాంతంలో సాగయ్యే అరటికి బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వస్తున్నారు.ఢిల్లీ మార్కెట్‌కు అనుకూలంగా ఉన్న తోటలను ఎంచుకుని అరటికాయలను కొనుగోలు చేస్తున్నారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ధరలు నిర్ణయించి కొనుగోలు చేయడం ద్వారా దళారుల బెడద లేకుండా పోయిందని రైతన్నలూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 10 నుంచి 15వేల ఎకరాల్లో ... పులివెందుల ననియోజకవర్గ వ్యాప్తంగా 15వేల ఎకరాల్లో అరటి సాగు ఉంటే ఇందులో 10వేల ఎకరాల్లో గెలలు మొదటి కోతకు రానున్నాయి. నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, వేముల, వేంపల్లె మండలాల్లో అధికంగానూ, తొండూరు, సింహాద్రిపురం మండలాల్లో తక్కువగా అరటి సాగు అవుతోంది. ఒకసారి సాగు చేస్తే మూడు పంటలు తీయవచ్చన్న ఉద్దేశంతో రైతులు అరటిని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా మే, జూన్, జూలై నెల్లో సాగుచేస్తారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకు వచ్చేలా సాగు చేయడం ద్వారా ధరలు ఉంటాయని రైతులు అంటున్నారు. ఎకరాకు రూ.60వేలు పైనే పెట్టుబడులు అరటి సాగులో పెట్టుబడులు కూడా అధికం అవుతున్నాయి. ఎకరా సాగు చేయాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల వరకు పెట్టుబడులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అరటి నాటిన మొదలు గెలలు కోతకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాగుచేసిన 11 నెలలకు గెలలు కోతకు వస్తాయి. సాగులో పెట్టుబడులు అవుతున్నప్పటికీ ఆదాయం ఉంటుందనే రైతులు అరటిని సాగుచేస్తున్నారు. డ్రిప్పు ద్వారా నీటి తడులతో పాటు ఎరువులు అందించడం ద్వారా నాణ్యమైన అరటి ఉత్పత్తులు అందుతున్నాయి. సాగులో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయి. ఒక్కో గెల 10 నుంచి 12 చీప్‌లు వేస్తుందని రైతులు అంటున్నారు. వారం రోజుల పాటు అరటి కాయల నిల్వ ... పులివెందుల నుంచి అరటిని ఢిల్లీకి తరలించాలంటే వారంరోజులు పడుతుంది. పక్వానికి వచ్చిన గెలలను కొట్టి చీపులను వేరుచేస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వారంపాటు నిల్వ ఉండడంతో ఢిల్లీకి చెందిన వ్యాపారులు పులివెందుల అరటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కోసారి అరటి గెలలను లారీకి లోడ్ చేసి ఢిల్లీకి తరలిస్తారు. ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేసరికి అరటి గెలలు దెబ్బతినవని, కాయలు నాణ్యతగా ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అరటికాయలను శుద్ధిచేసి ప్యాకింగ్ ... పులివెందుల నుంచి అరటి కాయలను ఢిల్లీకి తరలించాలంటే శుద్ధి చేసి ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో తోటల వద్దకు కూలీలు వెళ్లి అరటి గెలలు తీసుకువచ్చి చీపులను వేరుచేస్తారు. వీటిని బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో శుద్ధి చేస్తారు.అలా శుద్ధిచేసిన చీపులను అట్టపెట్టెలో కవరు వేసి అందులో అరటి కాయలను ఉంచి ప్యాకింగ్ చేస్తారు. ఒక్కో అట్టపెట్టెలో 15కిలోల చొప్పున అరటికాయలను ప్యాక్ చేస్తారు. తోటల వద్దనే తూకాలు వేసి అట్టపెట్టెలను సీజ్ చేస్తారు. అరటికాయలతో ఉన్న అరటి పెట్టెలను లోడ్ చేసి ఢిల్లీ మార్కెట్‌కు తరలిస్తారు. గల్ఫ్ దేశాలకు పులివెందుల అరటిపులివెందుల ప్రాంతంలో పండిన అరటికి ఢిల్లీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా ఈ సీజన్లోనే ఇక్కడ అరటి కాయలను తరలిస్తారు. నెలకు 10నుంచి 15వేల టన్నుల మేర కాయలు ఢిల్లీ మార్కెట్‌తో పాటు గల్ఫ్ దేశాలు అరబ్, ఇరాక్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్తాయి. ఇక్కడ పండించిన అరటి నాణ్యతగా ఉండడం, వారం రోజుల పాటు నిల్వ ఉండడం వల్ల ఢిల్లీ మార్కెట్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో డిమాండ్ ఉంటుంది. – రామమల్లేశ్వరరెడ్డి, అరటి రైతు -
ఇది చట్టబద్ధ హత్య!
పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసపోయే కార్మికుల విషాద గాథలు మనకు కొత్తగాదు. జీవితాలు సవ్యంగా వెళ్తే సరేగానీ... ఒకసారంటూ సమస్యల్లో చిక్కుకుంటే అక్కడ నరకం చవి చూడక తప్పదని తరచు వెల్లడయ్యే ఘోర ఉదంతాలు చెబుతాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబూధాబీలో చేయని నేరానికి ఉరికంబం ఎక్కిన ఉత్తరప్రదేశ్ యువతి షెహజాదీ ఉదంతం మరింత దారుణమైనది. నాలుగు నెలల శిశువును హత్య చేసిందని ఆరోపిస్తూ మోపిన కేసులో ఆమె వాదనలన్నీ అరణ్య రోదనలు కాగా చివరకు గత నెల 15న అక్కడి ప్రభుత్వం ఆ యువతి ఉసురు తీసింది. జవాబుదారీతనం ఏమాత్రం లేని వ్యవస్థలతో నిండిన యూఏఈలో వలస కార్మికులకు వీసమెత్తు విలువుండదు. వారి ప్రాణాలకు పూచీ ఉండదు. కానీ మన దేశం నుంచి వలసపోయే వారిలో అత్యధికులు ఎంచుకునేది యూఏఈనే. ఒక లెక్క ప్రకారం అక్కడ 35 లక్షలకు పైగా భారతీయ వలస కార్మికులున్నారు. ఆ దేశ జనాభాలో వీరి వాటా దాదాపు 33 శాతం. ఈ కార్మికుల్లో అత్యధికులు నివసించేది అబూధాబీలోనే. వలస కార్మికుల రక్షణ కోసం మన దేశం చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా అవి చాలినంతగా లేవు. మనకు యూఏఈతో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలున్నాయి. ప్రవాసీ బీమా యోజన కింద తప్పనిసరి ఇన్సూరెన్స్ పథకం ఉంది. కార్మికుల హక్కులు కాపాడటానికీ, వలసల క్రమబద్ధీకరణకూ ఈ–మైగ్రేట్ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ షెహజాదీని కాపాడలేకపోయాయి. చిన్ననాడు ముఖంపై కాలిన గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించుకోవాలని ఆరాటపడి ఆమె ఒక మాయగాడి వలలో చిక్కుకుంది. యూఏఈలో ఉన్న తన బంధువుల ద్వారా అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని అతగాడు నమ్మించి షెహజాదీ నుంచి రూ. 3 లక్షలు, బంగారు నగలు తీసుకుని ఆమెను 2021 చివరిలో అబూధాబీకి పంపాడు. శస్త్రచికిత్స మాట వదిలి ఒక ఇంట్లో పని మనిషిగా చేర్చాడు. ఆ ఇంటి యజమాని భార్య ఒక శిశువుకు జన్మనిచ్చాక అదనంగా శిశు సంరక్షణ భారం కూడా పడింది. నాలుగు నెలలున్న శిశువు వ్యాక్సిన్ వికటించి మరణిస్తే షెహజాదీపై హత్యా నేరం మోపారు. 2022 డిసెంబర్లో ఈ ఘటన జరిగిన నాటి నుంచీ దర్యాప్తు పేరుతో ఆమెను జైలు పాలు చేసిన పోలీసులు 2023 ఫిబ్రవరిలో లాంఛనంగా అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తంతు నడిపించి ఆమెను దోషిగా తేల్చారు. ఈ క్రమమంతా మన ప్రభుత్వ యంత్రాంగం, యూఏఈలోని మన రాయబార కార్యాలయం ఏం చేశాయన్నదే ప్రశ్న. శిశు మరణానికి కారణం స్పష్టంగా కనబడు తోంది. ఒక్కోసారి వ్యాక్సిన్లు శిశువులకు ప్రాణాంతకం కావటం అసాధారణమేమీ కాదు. ఆ మరణం వ్యాక్సిన్ వల్ల జరిగిందా లేక షెహజాదీయే శిశువుకు హాని తలపెట్టిందా అన్నది పోస్టు మార్టం జరిపితే వెల్లడయ్యేది. కానీ ఆ శిశువు తండ్రి అందుకు ఒప్పుకోలేదట. కనుక షెహజాదీని కోర్టులు దోషిగా నిర్ధారించాయి! సరైన ప్రయత్నాలు జరిపివుంటే న్యాయం జరిగేదేమో! రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని అన్ని స్థాయుల్లోనూ మొరపెట్టుకుంటూనే ఉన్నామని, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నామని కానీ సరైన స్పందన లేదని షెహజాదీ తండ్రి షబ్బీర్ ఖాన్ అంటున్నారు. ఆఖరికి తమ కుమార్తె బతికుందో లేదో చెప్పమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప నిజమేమిటో వెల్లడి కాలేదు. శస్త్ర చికిత్స కోసం వెళ్లిన యువతిని బలవంతంగా పనికి కుదుర్చుకోవటమేగాక ఆమెపై హత్యా నేరం మోపటం, కింది కోర్టు విధించిన శిక్షను ఉన్నత న్యాయస్థానం కనీస ఆలోచన లేకుండా ఖరారు చేయటం అమానవీయం. ప్రభుత్వం అంతకన్నా బాధ్యతారహితంగా వ్యవహరించింది. గత నెల 15న మరణశిక్ష అమలు చేయగా, 17న రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు సైతం కేసును పరిశీ లిస్తున్నామన్న జవాబే ఇచ్చింది. మరణశిక్ష అమలైనట్టు 28నగానీ మన రాయబార కార్యాలయానికి చెప్పలేదు. కేసు విషయంలో చేయగలిగిందంతా చేశామని మన విదేశాంగ శాఖ వివరిస్తోంది. ఆమె తరఫున క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయించామని, చట్టాలు కఠినంగా ఉండటంతో కాపాడలేక పోయామని అంటున్నది. కానీ రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం, ఇతరత్రా హక్కుల సంఘాల దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. ఉసురు తీసేముందు చివరి కోరికగా తల్లిదండ్రులతో మాట్లాడించినా అది రెండు నిమిషాల ముచ్చటే అయింది. సంపన్నవంతమైన దేశంలో కాయకష్టం చేస్తే మంచి సంపాదన ఉంటుందని భావించి చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. కానీ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అత్యంత దారుణమైన పరి స్థితుల్లో పనిచేయాలని, అక్కడ అమల్లోవున్న కఫాలా వ్యవస్థ ప్రకారం వారి వీసాలు యజమానులకు అనుసంధానించి వస్తాయని, దిగినవెంటనే వారు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంటారని, అందువల్ల మరోచోట పని వెదుక్కోవటం అసాధ్యమని చాలామందికి తెలియదు. అధిక గంటలు పనిచేయించుకోవటం, వేతనాలు ఎగ్గొట్టడం, సామాజిక భద్రత పథకాలు లేకపోవటం వలస కార్మి కుల బతుకును దుర్భరం చేస్తోంది. ఈ విషయంలో యూఏఈతో మాట్లాడి తగిన చట్టాలు అమలయ్యేలా చూడటం, అక్కడ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న మన కార్మికుల వివరాలు ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావటం అవసరమని చెప్పాలి. వలసపోయే కార్మికులకు అక్కడ పొంచివుండే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలి. షెహజాదీని కాపాడుకోలేక పోయినా, ఆ స్థితి మరెవరికీ రాకుండా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
వలస కార్మికుల మృత్యు ఘోష
మోర్తాడ్ (బాల్కొండ): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన కర్న గణేశ్ (55) రెండ్రోజుల కిందట సౌదీ అరేబియాలో గుండెపోటుతో మరణించాడు. వారం రోజుల కిందనే ఒమన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రాజన్న అనే వలస కార్మికుడు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై బ్రెయిన్‌డెడ్‌తో మృత్యువాత పడ్డాడు. ఇలా గల్ఫ్ దేశాల్లో తెలంగాణ (Telangana) జిల్లాలకు చెందిన వలస కార్మికులు అనారోగ్యం, మానసిక ఒత్తిడితో గుండెపోటుకు గురై చనిపోతూనే ఉన్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఏడాది కాలంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతర్, ఒమన్ (Oman), బహ్రెయిన్, కువైట్, ఇరాక్లలో దాదాపు 200 మంది వలస కార్మికులు వివిధ కారణాలతో మరణించారు. గతంలో కంటే మరణాల సంఖ్య రెండేళ్ల నుంచి పెరగడంతో కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించకపోవడంతోనే ప్రమాదం పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది.అంపశయ్యపై ప్రవాసీల ఆరోగ్యంగల్ఫ్ దేశాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వలస కార్మికుల్లో అత్యధికులు తక్కువ నైపుణ్యం గల అల్పాదాయ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తాము పని చేసేచోట అనారోగ్యం పాలైతే ఖరీదైన వైద్యం అందుకోలేని దుస్థితిలో ఉన్నారు. వైద్య ఖర్చులను భరించలేక ఎడారి దేశాల్లో వలస కార్మికులు మృత్యువాత పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎల్లలు దాటి విదేశాలకు వలస వెళ్లిన వారికి అంతర్జాతీయ సూత్రాల ప్రకారం ఆరోగ్య హక్కు ఉన్నా దీనిపై అవగాహన లేకపోవడం, విదేశాంగ శాఖ దృష్టి సారించకపోవడం, కంపెనీ యాజమాన్యాల నిర్లక్ష్యంతో వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణ గాలిలో దీపంలా మారింది.చదవండి: ఆదిలాబాద్ కా అమితాబ్ అధిక పనిగంటలు, తీవ్ర ఒత్తిడి, విశ్రాంతి లేకుండా జీవనం సాగిస్తుండటంతో వలస కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారు. గడిచిన రెండు నెలల్లో 20 మంది బ్రెయిన్‌డెడ్‌తో మరణించినట్లుగా నమోదవడం గమనార్హం. పనిచేసే చోట భద్రత లేకపోవడం, నైపుణ్యం లేక ప్రమాదాలకు గురి కావడం వలస కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది.ప్రవాసీ బీమాలో ‘ఆరోగ్యం’కరువు దేశం నుంచి గల్ఫ్‌తో సహా 18 దేశాలకు వలస వెళ్తున్న ఈసీఆర్ కేటగిరీ (10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన) వారికి భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం తప్పనిసరి విధానంలో అమలు చేస్తుంది. ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్న ఈ బీమా పథకంలో ఆస్పత్రి ఖర్చులకు సంబంధించిన అంశం లేకపోవడంపై కార్మిక సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వలస కార్మికుల అనారోగ్య మరణాలు, ఆత్మహత్యలను నిరోధించడానికి విదేశాంగ శాఖ ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు. -
విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్ సింగ్ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్లో ఖాట్మండూ రూట్లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్స్ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
గల్ఫ్ వలసజీవిత సారం
‘ఆడు జీవితం’ అనే మలయాళ పదం గత కొన్ని నెలల నుండి ప్రపంచమంతా తెలిసిపోతూ ఉంది. మలయాళీ భాషలో మొదటిసారి 2008లో ఈ పేరుతో వచ్చిన నవల ఎంతో ప్రజాదరణ పొంది రెండు వందల యాభైకి పైగానే ముద్ర ణలను పొందింది. ఇది భార తీయ సాహితీ ప్రపంచంలో ఒక గొప్ప విషయం. వలస వెళ్ళిన నజీబ్ అనే ఒక మలయాళీ దుర్భరమైన జీవితా నుభవాలను ఆధారంగా... ‘బెన్యా మిన్’ అనే మలయాళ రచయిత ‘ఆడు జీవితం’ నవల రాశారు. కేరళ సాహిత్య అకాడెమీ 2009లో ఈ పుస్తకానికి పురస్కారాన్నిచ్చి గౌరవించింది. అత్యంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఈ నవల కేరళ చలనచిత్ర రంగాన్నీ వదలలేదు. ఫలితంగా ‘ఆడు జీవితం (ది గోట్ లైఫ్)’ అనే సినిమా తయారై ఈ సంవత్సరం మార్చిలో విడుదలైంది. ప్రింట్ రూపంలో వచ్చిన పుస్తకానికి ఎంత మన్నన దొరికిందో అంతకి మించి సినిమాకీ పేరు వచ్చింది. అవార్డులతో పాటు, వందకోట్లు వసూళ్లని దాటేసి చరిత్రపై చరిత్రను లిఖిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ముందు ముందు ఇంకా ఏయే రూపాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించు కొంటుదో కాలమే చెబుతుంది. ఆడు జీవితం పలు భారతీయ బాషల్లోకి అను వాదమైంది. కొన్ని ఇతర దేశాల బాష (థాయ్, నేపాలీ, అరబిక్)ల్లో కూడా వచ్చింది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలమంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. నలభై యాభై ఏళ్లుగా వలస వెళుతున్నారు. తిరిగొస్తు న్నారు. మూడు తరాల నుండి వెళుతూ వస్తున్నారు. వీరిలో ఎందరో నజీబ్ మాదిరిగా ఎన్నో అవస్థలు పడ్డారు. హింసలకు గురయ్యారు. ఎడారుల్లో దుర్భర మైన జీవితాలను గడిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల్ని మెరుగు పరచడానికి నానా కష్టాలు పడి ఎంతో కొంత సంపాదించుకొని ప్రాణాల్ని చేతిలో పెట్టుకొని తిరిగొ స్తున్నారు. వెళ్ళినవారికి సంబంధించిన ఎన్నో వైవిధ్య మైన నేపథ్యాలు దొరుకుతాయి. నైపుణ్యం లేని వారు, చదువు కొన్నవారు, ఒంటరి మహిళలు, యువ సము దాయాలకు చెందిన వారు ఎన్నోరకాల పనులు చేసి జీవితా నుభవాలను జీర్ణించుకొన్నారు. ఇవి అక్షర రూపంలో తెలుగు సాహిత్యలోకంలోకి అడుగుపెట్టాలి. మా పక్క ఊళ్ళో ఉండే భీమన్న తన కష్టాల్ని చెబితే కళ్ళల్లో నీళ్లొస్తాయి. ఎక్కడో తనకు ఏమాత్రం తెలియని ఎడారిలో ఒంటెల్ని చూసుకొనే పని. ఒంటెల పాలు పితకడం కూడా రోజువారీ పనుల్లో ఒకటి. అయితే ఒంటెల ఎత్తు గేదెలు, ఆవుల కన్నా ఎంతో ఎక్కువ. కాబట్టి పాలు పితికే వారు కూర్చోలేరు, నిల్చోనూలేరు. మధ్యలో కాళ్లని కొంచెం వంచి పాలని పితకాలి. ఈ విషయాన్ని భీమన్న చెబుతుంటే ఆయన కళ్ళలో తడి, మాటల్లో వేదన! గల్ఫ్ దేశాల్లో పనిచేసి వచ్చిన వారి జీవితాల్లోకి రచయితలు, రచయిత్రులు తొంగిచూడాలి. ఓపిగ్గా కూర్చుని వారి జీవితానుభవాల్ని విని కథలు, నవలలు, కవితలుగా రాయాలి. ఒక విహంగ దృష్టితో చూస్తే ఇలాంటి కథా వస్తువులపై రావ లసినంతగా రచనలు రాలేదని పిస్తుంది.ఈ మధ్య పత్రికల ద్వారా చాలా కథలు, నవలల పోటీల నిర్వహణ జరుగుతోంది. గల్ఫ్ వలస ప్రజలపైనే ప్రత్యేక పోటీలు నిర్వహిస్తే ఎన్నో వైవిధ్య జీవన రేఖలు, చిత్రాలు అక్షరాల్లో రూపం పోసుకొని పాఠకులకు అందించవచ్చు. ఎంతో విలువైన జీవన పార్శా్వలు దొరుకుతాయి. పత్రికలు ఈ విషయాన్ని ఆలోచించి కొన్ని పోటీలు వీటినే అక్షరబద్ధం చేయడానికి పెడితే తెలుగు సాహిత్య సంపద వైవి«ధ్యాన్ని సంతరించుకుంటుంది. ఒక సముదాయపు జీవితానుభవాలను తెలుసుకొన్న వారమవుతాము. డా‘‘ టి. సంపత్ కుమార్ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
కట్ ఆఫ్ డేట్ మార్చండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గడచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తేదీని కట్ ఆఫ్ డేట్‌గా మారిస్తే వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేÔశాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళుతున్నారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకురావడానికి కూడా వారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన వ్యక్తి చనిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబభారం మోయలేక కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి కట్ ఆఫ్ డేట్‌ను మార్చాలని పలువురు కోరుతున్నారు. ఎడారి దేశాల్లో తెలం‘గానం’గల్ఫ్ దేశాల్లో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమానికి జైకొట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్‌లో బతుకుదెరువుకు వెళ్లి రకరకాల కారణాలతో ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వం సాయం అందించాలనే డిమాండ్ ఉంది. అందుకోసం అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేరళ పాలసీని అమలు చేస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందించేందుకు విధివిధానాలను ఇటీవల వెల్లడించింది. అయితే కట్ ఆఫ్ డేట్ తో చాలా కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గడచిన పది నెలల కాలంలో తెలంగాణకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో దాదాపు 160 మంది చనిపోయినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.విధివిధానాలు ఇలా...ప్రభుత్వం ఈ నెల 7న జారీ చేసిన జీవో 216 ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య, పిల్ల లు లేదా తల్లిదండ్రులు మృతుడి డెత్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు క్యాన్సల్ రిపోర్టు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలతో నేరుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకో వాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తు, సరి్టఫికెట్లను పరిశీలించిన తర్వాత ఆర్థిక సాయం మంజూరవుతుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, కత్తర్, సౌదీ అరేబీయా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు వెళ్లి చనిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 తర్వాత చనిపోయిన వారు మాత్రమే అర్హులని ఆ జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. -
గల్ఫ్ దేశాల్లో ఎందుకు మలయాళీలు ఎక్కువ?
కేరళ ప్రజలు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ప్రవాసం ఉండే విషయం తెలిసిందే. కువైట్‌లో ఉండే విదేశీయుల్లో 80 శాతం దాకా మన దేశంలోని కేరళ నుంచి వెళ్ళినవారే. గల్ఫ్ దేశాల్లోని అవకాశాల్ని మొట్టమొదటగా గుర్తించి వాటిని అంది పుచ్చుకోవడం వల్ల వారి ఆధిపత్యం అక్కడ అనేక రంగాల్లో కొనసాగుతోంది. 1972 నుంచి 1983 మధ్య కాలంలో వచ్చిన గల్ఫ్ బూమ్‌ను మలయాళీలు బాగా వినియోగించుకున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, సాంకేతిక నైపుణ్యం గల కోర్సులు చేయడం వల్ల చాలామంది క్లర్కులుగా, ఆర్కిటె క్టులుగా, నిర్మాణ రంగంలో సూపర్వైజర్లుగా, ఇంజినీర్లుగా మంచి అవకాశాల్ని పొందగలిగారు. మొదటితరం వారు ఆ తర్వాత తమ బంధువుల్ని, స్నేహితుల్ని తీసుకువెళ్లారు. యూఏఈలో 7,73,624 మంది, కువైట్‌లో 6,34,728 మంది, సౌదీ అరేబియాలో 4,47,440 మంది, ఖతర్‌లో 4,45,000 మంది, ఒమన్‌లో 1,34,019 మంది, బహ్రెయిన్‌లో 1,01,556 మంది మలయాళీలు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు పంపించే విదేశీ మారకద్రవ్యం వల్ల కేరళ రాష్ట్రపు ఆర్థిక చిత్రపటం మారిపోయిందని చెప్పాలి. ప్రతి ఏటా రమారమి 60,000 కోట్ల రూపాయలు కేరళకు వస్తుంటాయి. తాము ఆ దేశాల్లో పనిచేసి సంపాదించిన ధనంలో ప్రతి ఒక్కరు కొంత వెనక్కి తమ కుటుంబాలకు పంపిస్తుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే మలయాళీ ప్రజలు గల్ఫ్‌లో ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల నుంచి అరబ్బు దేశాలతో కేరళకు సముద్ర మార్గాల ద్వారా వ్యాపారం జరగడం ప్రధాన కారణం. కేరళలో పెద్ద పరిశ్రమలు తక్కువ. పర్యావరణంపై ప్రజల చైతన్యం ఎక్కువ. ట్రేడ్ యూనియన్ల ప్రభావం వల్ల పెద్ద పెట్టుబడిదారులు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి మంచి సంపాదన ఎక్కడ ఉన్నా సగటు మలయాళీ ప్రవాసిగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. యువతులు కూడా దూర ప్రదేశాలు వెళుతుంటారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, ఇంకా దేశంలో ఎక్కడ అవకాశాలు ఉన్నా వెళుతుంటారు. ముఖ్యంగా నర్సింగ్ వృత్తి పరంగా చూస్తే దేశ విదేశాల్లో కేరళ నర్సులకు మంచి డిమాండ్ ఉంది. దేశంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రిని చూసినా అత్యంత ఎక్కువ సంఖ్యలో కేరళ నర్సులే ఉంటారు. గల్ఫ్ సంపద కేరళలో ఎంత ప్రధాన పాత్ర కలిగి ఉందంటే చాలామంది మలయాళీ కోటీశ్వరులు ఆ దేశాల్లోనే వ్యాపారం చేసి, తర్వాత మిగతా దేశాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. ముథూట్ గోల్డ్ ఫైనాన్స్ గానీ, జాయ్ అలుక్కాస్ గోల్డ్ కంపెనీ గానీ గల్ఫ్ దేశాల సంపదతో విస్తరించినవే. యూసుఫ్ ఆలీ (లూలూ గ్రూప్), షంషేర్ వయలిల్ (వీపీఎస్ హెల్త్ కేర్), సన్నీ వర్కీ (జెమ్స్ ఎడ్యుకేషన్), పి.ఎన్.సి. మీనన్ (శోభ గ్రూప్) లాంటి మలయాళీ కుబేరులంతా వ్యాపారం గల్ఫ్ దేశాల్లో చేసి ఆ తర్వాత మన దేశంలో విస్తరించినవారే. ఇప్పటికీ వారి ప్రధాన కేంద్రాలు అక్కడే ఉన్నాయని చెప్పాలి. కేరళ ప్రభుత్వానికి రెవెన్యూ ద్వారా ఒక ఏడాదికి ఎంత ధనం వస్తుందో దానికి రమారమి రెండింతలు గల్ఫ్ నుంచి వస్తుంది. గల్ఫ్ నుంచి వచ్చీ పోయే ప్రయాణీకుల కోసం కేరళలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వారి బాగోగులు చూడటానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కొచ్చి, కోజీకోడ్, మలప్పురం, కన్ననూర్ వంటి ప్రాంతాల్లో గల్ఫ్ నుంచి వచ్చే అనేక వస్తువుల్ని ధారాళంగా అమ్ముతుంటారు.గల్ఫ్ నుంచి వచ్చే ధనం వల్ల వినిమ యతత్వం బాగా పెరిగిందనే ఒక ఆరోపణ ఉన్నది. గల్ఫ్ నుంచి వచ్చిన లేదా అక్కడ పనిచేసే యువకులకు పెళ్ళి విషయంలో మంచి డిమాండ్ ఉన్నది. మరి అక్కడ విషాధ గాథలు లేవా అంటే ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఆస్తి తాకట్టు పెట్టి గల్ఫ్ వెళ్ళి అనుకున్న పని దొరక్క పడరాని పాట్లు పడేవారూ ఉన్నారు. అక్కడి పత్రికల్లోనూ, టీవీ చానెళ్ళలోనూ అలాంటివారి కోసం ప్రత్యేకంగా కొంత స్పేస్ కేటాయిస్తారు. ఇటీవల వచ్చిన ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) సినిమా అలాంటి వారి బాధల్ని చిత్రించిందన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, లక్షలాది మధ్య తరగతి ప్రజలకు ఉపాధి చూపిన గల్ఫ్ దేశాల చమురు నిల్వలు ఇంకా చాలా కాలం ఉండాలని ఆశిద్దాం.మూర్తి కెవివిఎస్వ్యాసకర్త రచయిత, అనువాదకుడుమొబైల్: 78935 41003 -
గల్ఫ్ కార్మీకులకు జీవిత బీమా..: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల తరహాలోనే గల్ఫ్ కార్మీకులకు కూడా జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తెలంగాణకు చెందిన 15 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నాయని.. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉండే తెలంగాణ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రజాభవన్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 17లోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గల్ఫ్ దేశాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే గల్ఫ్ సమస్యలపై దృష్టి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు గల్ఫ్ కార్మీకుల సమస్యలను పట్టించుకుంటాయన్న అభిప్రాయం ఉందని, కానీ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వారి హక్కులకు రక్షణ కల్పించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు. చనిపోయిన కార్మీకుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. పలు రాష్ట్రాల గల్ఫ్ విధానాలు అధ్యయనం చేసి రూపొందించిన డాక్యుమెంట్లో సవరణలు, సూచనల కోసం లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ భేటీకి గల్ఫ్ కార్మీకుల ప్రతినిధులను ఆహ్వానించి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఏజెంట్లకు చట్ట బద్ధత ఉండేలా..రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు కాకుండా ఏ కార్మీకుడినీ ఏజెంట్లు దేశం దాటించే పరిస్థితి లేకుండా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీవన్‌రెడ్డి కేంద్రమంత్రి అవుతారని భావిస్తున్నా.. ‘కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అందుకు నేనే ఉదాహరణ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. అప్పుడు నా మిత్రులు బాధపడితే శత్రువులు మాత్రం నా పని అయిపోయిందని సంతోషించారు. కానీ మూడు నెలలు తిరిగేసరికి ఎన్నికలొచ్చి ఎంపీనయ్యా. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యా. ఆ తర్వాత ముఖ్యమంత్రిని అయ్యా. జీవన్‌రెడ్డి కూడా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతారని భావిస్తున్నా. కేంద్రంలో తెలంగాణ గల్ఫ్ కార్మీకుల పక్షాన మాట్లాడేందుకు, విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపేందుకు నిజామాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిని గెలిపించాలి..’అని ముఖ్యమంత్రి కోరారు. సాయం చేసేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదు: జీవన్‌రెడ్డి గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడం ద్వారా గల్ఫ్ కార్మీకులు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చారని జీవన్‌రెడ్డి తెలిపారు. గల్ఫ్ నుంచి ప్రతి యేటా 200 వరకు శవపేటికలు వచ్చేవని, పదేళ్లలో 2 వేల మంది చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.100 కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసు రాలేదని విమర్శించారు. గల్ఫ్ గోస లేకుండా చూడండి సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గల్ఫ్ గోస లేకుండా చూడాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నారై సెల్‌ను పటిష్టం చేయాలని, గల్ఫ్ దేశాల్లోని ఎంబసీల్లో తెలుగువారిని నియమించాలని, ప్రత్యేక గల్ఫ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, కేరళ తరహా పాలసీని రూపొందించాలని కోరారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినందుకు కృతజ్ఞతగా గల్ఫ్ నుంచి తెచ్చిన ఖర్జూరాలను ముఖ్యమంత్రికి అందజేశారు. టీపీసీసీ ఎన్నారై సెల్ అంతర్జాతీయ కన్వీనర్ మంద భీంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సెల్ చైర్మన్ డాక్టర్ వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Lok sabha elections 2024: పోటీ కేరళలో.. ప్రచారం గల్ఫ్‌లో!
– ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగిది. కేరళ కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ దీన్నే గుర్తు చేస్తున్నారు. వడకర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన గల్ఫ్ దేశాల్లో ఓట్లను అభ్యరి్థస్తున్నారు. యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లో భారీగా స్థిరపడిన కేరళీయులను కలిసి భారత్‌కు వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. షార్జాలో, ఖతార్‌లో తాజాగా కేరళీయులతో సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దయచేసి వచ్చి ఓటేయాలని కోరారు. అలాగే కేరళ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు కూడా పోలింగ్ దాకా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కేరళ ఎన్నారైలు గతంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో ఈసారి వారి మద్దతు కోసం పరంబిల్ ఇలా గల్ఫ్ యాత్ర చేపట్టారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. పరంబిల్ ప్రస్తుతం పాలక్కాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రోమ్యాన్‌గా పేరొందిన ఇ.శ్రీధరన్‌పై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం సీపీఎం ఎమ్మెల్యే కేకే శైలజ, బీజేపీ అభ్యర్థి ప్రఫుల్ కృష్ణన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రచార నిమిత్తం ఇలా గల్ఫ్ బాట పట్టారు. -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్‌మ్యాన్‌గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్‌కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్‌కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్‌ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్‌కు నజీబ్‌తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్‌లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్‌లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
రూపాయిలో వాణిజ్యానికి పలు దేశాల ఆసక్తి
న్యూఢిల్లీ: పలు వర్ధమాన దేశాలు, సంపన్న దేశాలు భారత్‌తో రూపాయి మారకంలో వాణిజ్యం చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ విధానంలో లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశాలు ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘ఈ విధానాన్ని సత్వరం ప్రారంభించేలా బంగ్లాదేశ్, శ్రీలంక ఇప్పటికే మనతో చర్చలు జరుపుతున్నాయి. పలు గల్ఫ్ దేశాలు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలు తెలిసే కొద్దీ మరిన్ని దేశాలు కూడా ఇందులో చేరొచ్చు. సింగపూర్ ఇప్పటికే కొంత మేర లావాదేవీలు జరుపుతోంది‘ అని మంత్రి వివరించారు. ఈ పరిణామం భారత అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారత్ ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీలు నిర్వహిస్తోంది. యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్‌కి తొలిసారిగా రూపాయల్లో చెల్లింపులు జరిపింది. -
వలస.. ఏదీ భరోసా?
మంచిర్యాల: 'ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు వలసబాట పడుతున్నారు. ఉపాధి అవకాశంతో పాటు అధిక వేతనాలు, మరింత మెరుగైన జీవనం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం.. పల్లెల నుండి పట్టణాలకు, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరో దేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు.' నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారులు ఉజ్వల భవిష్యత్, తగిన గుర్తింపు కోసం తమ మాతృభూమిని వదిలి వేరొక దేశానికి వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 వేలకు పైగా కార్మికులు వివిధ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినట్లు గల్ఫ్ సంక్షేమ సంఘాలు పేర్కొంటున్నాయి. వీరే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన జిల్లావాసులు దాదాపు 2 లక్షల వరకు ఉంటారని ప్రవాసీమిత్ర కార్మిక సంఘాల నాయకులు పేరొంటున్నారు. జిల్లా నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వ్యక్తులకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఎక్కువ మంది కూలీలు గానే పనులు చేస్తున్నారు. తిరిగొచ్చిన తర్వాత కూడా సరైన ప్రత్యామ్నాయ, ఉపాధి మార్గాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల రమణ ఉపాధి నిమిత్తం దాదాపు 12 ఏళ్లక్రితం ఒమన్ దేశానికి వెళ్లి కొన్ని నెలలక్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడ స్వయం ఉపాధి పొందేందుకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా తనకు ఏదైనా రుణం మంజూరు చేయించాలని కొన్నిరోజులక్రితం కలెక్టరేట్, డీఆర్డీవో, తదితర కార్యాలయాల్లో విన్నవించుకున్నాడు. రుణం మంజూరు కోసం కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదని గాండ్ల రమణ పేర్కొంటున్నాడు. గల్ఫ్ నుండి వాసస్ వచ్చిన ఇలాంటి వారు ఎందరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి.. అమాయకులైన వలస కార్మికుల రక్షణకు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలతో సహా 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించిన 1983 లోని ఎమిగ్రేషన్ చట్టం యొక్క ప్రాతిపదిక ప్రకారం గల్ఫ్ బోర్డు ఏర్పా టు చేయాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టాలి. గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకం వర్తింపజేయాలి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి.. హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్ దేశాల కాన్సులేట్లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ప్రవాస భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణం కూడా చేర్చా లి. రూ.325 చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో ఇన్సూరెన్స్ ఇస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎమిగ్రేషన్ యాక్టు–1983 ప్రకారం గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్ళడానికి సర్వీస్ చార్జీగా అభ్యర్థి 45 రోజుల వేతనం (రూ.30 వేలకు మించకుండా) మాత్రమే ఏజెంటుకు చెల్లించాలి. దీనిపై 18 శాతం జీఎస్టీ రూ.5,400 చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి. ఇదీ నేపథ్యం.. వలస వెళ్తున్న పౌరులకోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే)గా ప్రకటించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఎంత స్వేచ్ఛా స్వతంత్రంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేచ్ఛగా తిరిగిరావొచ్చని సభ తీర్మానం చేసింది. ప్రధాన డిమాండ్లు! తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా అమలుకు నోచుకోవడంలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో 6 వేలకు పై గా తెలంగాణ ప్రవాసీయులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందగా రూ.5 లక్షల ఎ క్స్ గ్రేషియా కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని, రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్‌కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చే యాలని ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్, గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయిలో ఏర్పాటు చేసిన మాదిరి హైదరాబాద్‌లో ‘విదేశ్‌భవన్’ ఏర్పాటు చేయాలని, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌లో పాస్‌పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్లు ఉండాలని, ‘ప్రవాసీ తెలంగాణ దివస్’ అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. వలసదారుల సంక్షేమానికి కృషి చేయాలి.. వలస కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. కేరళ తరహా ప్రత్యేక గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయాలి. వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్ల నిధులు కేటాయించాలి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. గల్ఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి. తిరిగి వచ్చిన కార్మికులకు ఉపాధికోసం ఆయా వ్యక్తుల నైపుణ్యాలను బట్టి ప్రభుత్వాలు తగిన చేయూతనివ్వాలి. – కృష్ణ, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర నాయకుడు ఇవి చదవండి: ఆ పథకాలకు బ్రేక్? దరఖాస్తు వారిలో ఆందోళన.. -
వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శవపేటిక!
వేములవాడ: బతుకుదెరువు కోసం నెల క్రితం గల్ఫ్ వెళ్లిన ఓ యువకుడు అక్కడ జరిగిన ప్రమాదానికి బలికాగా.. వారం రోజులకు శవపేటిక ఇంటికి చేరింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన లింగంపెల్లి రాజనర్సయ్య–లచ్చవ్వ కుమారుడు లింగంపల్లి బాబు(28) నెల రోజుల క్రితం బహ్రెయిన్ దేశం వెళ్లాడు. ఈ నెల 7న అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తుండగా సెంట్రింగ్ పనికి వినియోగించే పెద్ద రాడ్ నాలుగో అంతస్తు మీదనుంచి బాబుపై పడింది. ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతిచెందినట్లు తోటి స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి రాజనర్సయ్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, తల్లి లచ్చవ్వ, భార్య శిరీష, నాలుగేళ్ల వయస్సుగల కుమారుడు ఉన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ గోలి మోహన్ అక్కడి ఇండియన్ ఎంబసీ వారితో మాట్లాడి మృతదేహం ఇంటికి చేరేందుకు కృషి చేశారు. బాబు శవపేటిక ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇవి కూడా చదవండి: 'అమ్మవారి మాల' తీసి మరీ.. భార్యను కిరాతకంగా.. -
వారి మనసంతా ఇక్కడే!
సిరిసిల్ల: విదేశాల్లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపుతున్నారు. వారంతా నిత్యం ఇక్కడ ఉన్న మిత్రులతో టచ్‌లో ఉంటున్నారు. పోలింగ్ సరళి, స్థానిక రాజకీయాలపై చర్చిస్తున్నారు. జనం ఎటు వైపు ఓట్లు వేశారు.. ఎంత పోలింగ్ జరిగింది.. ఎవరు గెలుస్తారంటూ.. ఫోన్లలో మిత్రులను ఆరా తీస్తున్నారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో శనివారం రాత్రి నుంచే మిత్రులకు, బంధువులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా అంతటా వలసలే.. కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గల్ఫ్ దేశాల్లో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా వారి కుటుంబాలకు చెందిన మరో 5 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాలకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సమయంలో వాళ్లంతా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయినా కుటుంబసభ్యులతో ఫోన్లో టచ్‌లో ఉన్నారు. ప్రతీక్షణం ఎన్నికల సరళిపై ఆరా తీశారు. ఎన్నారై పాలసీపై ఆశలు.. కేరళ తరహాలో విదేశీ విధానంపై తెలంగాణ ప్రభు త్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని గల్ఫ్ వలసజీవులు ఆశిస్తున్నారు. నిజానికి వీసా ఉండి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణవసతి కల్పించడం, గల్ఫ్ సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం, నకిలీ ఏజెంట్లను కట్టడిచేయడం, చట్టబద్ధమైన ఏజెన్సీల ద్వారా గల్ఫ్ దేశాలకు పంపడం, పొరుగుదేశాలకు వెళ్లేవారికి ఏదో ఒక రంగంలో నైపుణ్య శిక్షణనివ్వడం, అక్కడి పరిస్థితులపై ముందే అవగాహన కల్పించడం వంటి విధానాలను ఎన్నారై పాలసీలో రూపొందించాలని గల్ఫ్ వలస జీవులు కోరుతున్నారు. రూ.వంద కోట్ల బడ్జెట్‌ను ఏటా కేటాయిస్తూ గల్ఫ్ వలసజీవుల ఇబ్బందులను పరిష్కరించాలని వలస కార్మికులు కోరుతున్నారు. మనుషులు అక్కడే ఉన్నప్పటికీ మనసులు మాత్రం ఎన్నికల ఫలితాలపైనే ఉన్నా యి. తమ సొంత నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత వస్తుందని ఆరా తీస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి.. మాది వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం శివంగాలపల్లె. నేను మలేసియాలో దశాబ్దకాలంగా ఉద్యోగం చేస్తున్న. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ పరిశీలిస్తున్న. ప్రచార సభలను కూడా టీవీల్లో చూశాను. ఎన్నికల సరళి, ఎగ్జిట్ పోల్స్‌ను కూడా తెలుసుకుంటున్నాం. ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో అనే ఆసక్తి మా దగ్గర ఉండే తెలంగాణ వాసులు అందరిలోనూ ఉంది. – శివంగాల రమేశ్, మలేసియా ఏ పార్టీ గెలుస్తుందోనని.. మాది సిరిసిల్ల. ఎక్కడ ఉన్నా.. ఇండియాలో.. ప్రధానంగా మన తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని చూస్తున్నాం. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే వాటిని పరిశీలిస్తుంటాం. ఇటీవల ఇక్కడ వీకెండ్స్‌లో రాజకీయాలపైనే చర్చలు సాగుతున్నాయి. ఈసారి తెలంగాణలో ఎన్నికలు భిన్నంగా ఉన్నా యి. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఉంది. – నక్క శశికుమార్, హాంకాంగ్ గల్ఫ్‌కార్మికుల బాధలు తీరాలి మాది కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం. ఎవరు గెలిచినా గల్ఫ్ కార్మికుల బాధలు తీర్చే ప్రభుత్వం రావాలి. నిజానికి ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. గల్ఫ్ కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అమలు కాలేదు. గల్ఫ్ కార్మికులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రభుత్వాలు రావాలని ఆశిస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉంది. – ఎస్వీ రెడ్డి, దుబాయ్ -
అన్నా జర గుర్తుపెట్టుకో..
ఆర్మూర్: అన్నా మనోళ్లను మన పార్టీకే ఓటు వేయ మని ఫోన్ చేసి చెప్పన్నా అంటూ పలు రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు గల్ఫ్ దేశాల్లో ఉ పాధి కోసం వెళ్లిన వారికి ఫోన్లు చేసి చెబుతున్నారు. స్థానికంగా ఉన్న పరిచయాలను వినియోగించుకొని బంధు, మిత్రుల ఓట్లు తమ పార్టీకి రాబట్టుకొనే ప నిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొననుంది. ఆయా పార్టీల నుంచి పోటీ లో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూ సు కు పోతున్నారు. అయితే వారి గెలుపు కోసం పని చే స్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు గ్రామాల్లో నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారి వివరా ల ను సేకరిస్తున్నారు. వారికి ఫోన్లు చేసి తమ పార్టీ అ భ్యర్థి విజయం సాధిస్తే వారి కుటుంబ సభ్యులకు పింఛన్ ఇప్పిస్తామని, ఇంటికి రోడ్డు వేయిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. గల్ఫ్‌లో ఉన్న వారు గ్రామాల్లో ఉన్న సమయంలో తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మరీ వారి కుటుంబ సభ్యుల కు ఫోన్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బీ ఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువు రు ద్వితీయ శ్రేణి నాయకులు ఒక అడుగు ముందు కు వేసి గల్ఫ్ దేశాల్లో ఆర్మూర్ ప్రాంతీయులు ఉండే ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయా లని సంకల్పించారు. అందులో భాగంగా ఆ యా పార్టీలకు చెందిన పలువురు నాయకులు దు బాయి కి వెళ్లనున్నారు. అక్కడ ప్రవాస భారతీయులతో స మావేశాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న ట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సుమారు పది లక్షల మంది గ్రామీణులు గల్ఫ్ దేశా ల్లో ఉంటున్నందున వారితో చెప్పించి కు టుంబ స భ్యుల ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నాలను ముమ్మ రం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇందు కోసం ఆయా పార్టీల నాయకులు బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
గల్ఫ్ విమానాలు రన్‌వే పైకి చేరేదెప్పుడో?
ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నది కలగానే మిగిలిపోతోంది. రాష్త్ర ప్రభుత్వం దృష్టి సారించినా కేంద్ర ప్రభుత్వం కనికరించలేదు. దీంతో ఉభయ వైఎస్సార్ జిల్లా నుంచి ఎడారి దేశాలకు విమానాల్లో తిరగవచ్చుననే గల్ఫ్ వాసుల కల నెరవేరడంలేదు. రాజంపేట: రాయలసీమలో ప్రధానంగా ఉభయ జిల్లాల నుంచి ఎడారి దేశాలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. రాజంపేట, రాయచోటి, కడప, బద్వేలు, రైల్వేకోడూరుతోపాటు ఉభయ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందికి పైగా ఎడారి దేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కువైట్, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అబుదాబీ, లెబనాన్, మస్కట్ దేశాలకు ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. మరింతమంది ఉద్యోగం, విద్య రీత్యా అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు వెళ్తున్నారు. వీరు విదేశీయానం చేయాల్సి వస్తే భాష రాని వివిధ రాష్ట్రాలలోని విమానాశ్రయాల వద్ద ఇబ్బంది పడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో 60 శాతం మంది చదువు రాని వారు ఉండడంతో మోసాల పాలై జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాలకు విమానాలు ఎప్పుడో? గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు నాలుగు దశాబ్ధాల కిందట వారాలకొద్దీ సముద్రయానం చేసి ఎడారి దేశాలకు చేరుకునేవారు. గల్ఫ్ దేశాలలో పనిచేస్తే ఖరీదైన జీవితం సాగించవచ్చునని, తమ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావచ్చునని తెలియడంతో అనంతరం ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగింది. వీరంతా విమానాలపై ఆధారపడుతున్నారు. ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) అంతర్జాతీయ సర్వీసులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేఉ్తన్నాయి. తిరుపతి, రాజంపేట లోక్‌సభ సభ్యులు తమ వంతుగా విమానాలను రన్‌వే మీదకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరుపతి నుంచి విదేశీయానంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కనికరించడం లేదు. వ్యయప్రయాసలతో ప్రయాణం చైన్నె, కర్ణాటక, ముంబయి, హైదరాబాద్, ఢిల్లీ నగరాలకు వెళ్లే వారు వ్యయ ప్రయాసలతో దూర ప్రాంతాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. అనేక మంది బాష రాక ఇబ్బందిపడుతున్నారు. కొందరైతే మోసపోతున్నారు. దూర ప్రయాణంతో అనేక అవాంతరాలు ఎదురై ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేగాక విమాన టికెట్‌తోపాటు ఎయిర్‌పోర్టుకు చేరుకునే ఖర్చులు భరించాలంటే కష్టపడుతున్నారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు. కానీ ఆ స్థాయిలో కేంద్రప్రభుత్వం విమానాలను తీసుకురాలేదనే అపవాదు ఉంది. విదేశీ విమాన సర్వీసులను ప్రవేశపెట్టాలి రాయలసీమ జిల్లా వాసులకు అందుబాటులో ఉండే తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి విదేశీ విమాన సర్వీసులను ప్రవేశపెట్టాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీలు తమ వంతు కృషి చేస్తున్నారు. ఉభయ జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లాలంటే ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. త్వరలో విదేశీయానం సులభతరం చేసే బాధ్యత కేంద్రంపై ఉంది. – చొప్పా అభిషేక్‌రెడ్డి, ఈడీ, ఏఐటీఎస్, రాజంపేట గల్ఫ్ విమాన సర్వీసులు తీసుకురావాలి తిరుపతి నుంచే గల్ఫ్ విమానాల సర్వీసులు అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉంది. నిత్యం వందలాది మంది ఇతర రాష్ట్రాలలోని ఎయిర్‌పోర్టుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి తవిదేశీ విమానసర్వీసులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. – గోవిందనాగరాజు, గల్ఫ్‌కో–కన్వీనర్, రాజంపేట -
గల్ఫ్ చట్టాలు తెలియకే..
గల్ఫ్ దేశాల చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో పలువురు భారతీయులు జైళ్ల పాలవుతున్నారు. మన దేశానికి చెందిన కొన్ని రకాల మందులను గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఇది కూడా తెలియనివారు అనేకమంది ఉన్నారు.ఉపాధి కోసం ఎడారి బాట పట్టేవారిలో డిగ్రీ కూడా దాటని వారే అధికంగా ఉంటున్నారు. ఇలాంటి వారిని విడిపించడానికి మన విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది. కేంద్రం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్‌కు నిధులు కేటాయించి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయసాయం అందించాలి. –మోర్తాడ్ (బాల్కొండ)/జగిత్యాల క్రైం కొందరు ఇలా.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఒళ్లు నొప్పులు తగ్గడానికి వేసుకునే మందులతో పట్టుబడి ఆబుదాబిలోని సుహాన్ సెంట్రల్ జైలులో మగ్గుతున్నాడు. ఇది గడిచిన జనవరిలో జరగ్గా, విచారణ ఖైదీగా జైలుకు పరిమితమయ్యాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్ జాతీయభద్రత కేసులో నాలుగేళ్ల కింద అరెస్టు అయ్యాడు. అప్పటినుంచి అబుదాబి జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్, కామారెడ్డి జిల్లా కరడ్‌పల్లికి చెందిన యువకులు నిషేధిత మందులతో పట్టుబడి జైల్లోనే ఉండిపోయారు. దౌత్య, న్యాయ సాయం అందించాలి విదేశీ జైళ్లలో ఉన్న వారికి మన విదేశాంగశాఖ కార్యాలయాల ద్వారా దౌత్యసాయం అందించాలి. న్యాయసాయం అందించి విడుదల అయ్యేలా చూడాలి. రాయభార కార్యాలయాల్లో ప్యానల్ లాయర్ల సంఖ్య పెంచాలి. వలస వెళ్లే కార్మికులకు గల్ఫ్ చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి. – చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నేత రాజ్యసభలో ప్రశ్నతో.. ఇటీవల రాజ్యసభలో ఎంపీలు డాక్టర్ మనోజ్ రాజోరియా, రంజితా కోలి, సుమేధానంద సరస్వతిలు గల్ఫ్ జైల్లో మగ్గుతున్న భారతీయుల సంఖ్య ఎంత అంటూ ప్రశ్నించారు. దీనికి విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సమాధానం ఇస్తూ గల్ఫ్ దేశాల్లోని వివిధ జైళ్లలో మగ్గుతున్న వారు 4,630 మంది ఉన్నారని చెప్పారు. -
సీఎంను కలిసిన ‘గల్ఫ్ సమన్వయకర్తలు’
సాక్షి, అమరావతి: గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయకర్తలు, వైఎస్సార్సీపీ కన్వినర్లు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. గల్ఫ్ దేశాల్లోని ఏపీ వాసులకు అందిస్తున్న సాయం.. వారి సంక్షేమా చర్చించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నట్లు వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం(మైనార్టీ వెల్ఫేర్) అంజాద్ బాషా, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి, కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్లు నాయని మహేష్‌రెడ్డి, ఎంవీ నరసారెడ్డి, దుబాయ్ కోఆర్డినేటర్ సయ్యద్ నాసర్ వలీ, వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వినర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వి నర్ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్ కన్వి నర్ డి.శశికిరణ్, దుబాయ్ కన్వినర్ సయ్యద్ అక్రమ్, సౌదీ అరేబియా కన్వినర్ రెవెల్ ఆంథోని తదితరులు పాల్గొన్నారు. సీఎంకు హజ్ పవిత్ర జలం డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి హజ్ పవిత్ర జలాన్ని అందజేశారు. -
గల్ఫ్‌లో నాగసముద్రం వాసి మృతి!
మంచిర్యాల: మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన దేవ వీరయ్య(55) ఉపాధి నిమిత్తం గత కొన్నేళ్లుగా సౌదీలోని రియాజ్‌కు వెళ్లారు. ఈ నెల ఒకటో తేదీన వీరయ్య అక్కడ గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాన్ని వేడుకున్న పట్టించుకోలేదు. దీంతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నాయకులు మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించడంలో ప్రత్యేక చొరవ చూపించారు. చనిపోయిన ఐదు రోజుల్లోనే మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తెప్పించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరయ్య అంత్యక్రియల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భూమయ్య, వర్కింక్ ప్రెసిడెంట్ తిరుపతితో పాటు జన్నారం, నాయకులు పాల్గొన్నారు. -
‘గల్ఫ్’ వలసలపై ఆరా!
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాలకు కార్మికుల వలసలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం వివరాలు సేకరిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకు ఏ సంవత్సరం ఎంతమంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారనే వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్న తరుణంలో ఈ ప్రక్రియ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అధికంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై గల్ఫ్ వలసలు ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేసింది. ఆయన మరణం తర్వాత గల్ఫ్ వలస కార్మికుల గురించి పట్టించుకున్నవారు లేరని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ గల్ఫ్ వలస కార్మికుల అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ఉద్యమంలో కార్మికుల కుటుంబాలు చురుగ్గా పాల్గొన్నాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా గల్ఫ్ వలస కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేరళ తరహాలో ప్రవాసీ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మొదటి నుంచీ వినిపిస్తోంది. కాగా 2019 అక్టోబర్‌లో కూడా పంచాయతీరాజ్ శాఖ ఇదే అంశంపై వివరాలను నమోదు చేసింది. కానీ అప్పట్లో ఆ ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో మరో సారి వలస కార్మికుల లెక్కల విషయంలో సర్కారు దృష్టి సారించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వలస కార్మికుల వివరాలు సేకరిస్తున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు మంద భీంరెడ్డి తెలిపారు. ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కలు ఉంటే వలస కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఖాదర్‌పల్లె టూ గల్ఫ్.. పట్టణాన్ని తలపించేలా గ్రామం
ఖాదర్‌పల్లె.. ఈ ఊరి వాసులు కూలీలుగా ఉంటూ కష్టాలు అనుభవించారు. చాలీ చాలని డబ్బుతో ఇబ్బందులు పడ్డారు. ఇక ఇక్కట్ల జీవితం వద్దనుకున్నారు. ఇల్లు విడిచి అయినా సంపాదన పెంచుకోవాలనుకున్నారు. గ్రామం వదిలి గల్ఫ్ బాట పట్టారు. మెరుగైన ఉపాధి ఎంచుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ధీమాగా సొంతూరిలో చక్కటి ఇళ్లు కట్టుకున్నారు. అందరూ కలసి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మసీద్‌ను నిర్మించుకున్నారు. కుటుంబీకులకు ఆసరాగా ఉంటున్నారు. ఇప్పుడు ఖాదర్‌పల్లె గ్రామాన్ని పట్టణాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు చాంద్ గారి మహమ్మద్ హనీఫ్. పదేళ్లుగా సౌదీలో జీననోపాధి పొందుతున్నాడు. ఫర్నిచర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రతి మూడేళ్లకొకసారి స్వగ్రామానికి వచ్చి వెళతాడు. రూ.15 వేల వేతనంతో పనిలో చేరిన హనీఫ్‌కు ప్రస్తుతం రూ.40 వేలకుపైగా నెల వేతనం వస్తోంది. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఫోనులో కుటుంబీకులందరితో వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఆనందంగా పనులు చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ యువకుడి పేరు ఇలియాస్. రెండేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. నెలకు రూ.28 వేలు జీతం వస్తోందని.. ప్రతి ఏటా జీతం పెంచుతారని.. ఐదేళ్ల వరకూ పని చేసుకుని కుటుంబం కోసం సంపాదించుకుని వస్తానని చెబుతున్నాడు. కొత్తలో కొంచెం అయిష్టంగా ఉండేదని ఇక్కడ మా ఊరోళ్లందరూ ఉండటం వలన ప్రతి వారం కలుసుకుంటామని.. ఇప్పుడు ఆనందంగా పని చేసుకుంటున్నానని తెలుపుతున్నాడు. ఈ యువకుడి పేరు కందనూరు మహమ్మద్. కువైట్‌లోని ఓ ఆటో స్పేర్ పార్ట్స్ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వెళ్లాడు. ప్రస్తుతం నెలకు రూ.40 వేలు వేతనం పొందుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటి దేశంలో ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ఉందని, ఇక్కడ మా సీనియర్లు చాలా మంది ఉన్నారని దీంతో ఆనందంగా పని చేస్తుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. చాపాడు(వైఎస్సార్ జిల్లా) : మండల కేంద్రమైన చాపాడుకు 4 కిలోమీటర్ల దూరంలో కుందూనది ఒడ్డున ఖాదర్‌పల్లె గ్రామం ఉంది. ఈ ఊరి ప్రజలు గతంలో కూలీలుగా ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారు. మెరుగైన ఉపాధి కోసం అయినవారిని .. ఉన్న ఊరిని వదిలి గల్ఫ్ దేశాలకు పయనమయ్యారు. కువైట్, సౌదీ అరేబియా, ఖత్తర్, దుబా యి, మస్కట్ గల్ఫ్ దేశాలతో పాటు సింగ్‌పూర్ వంటి దేశాల్లో పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఈ గ్రామంలో 1499 మంది ఓటర్లు, 540 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 20 కుటుంబాలు యాదవులు కాగా మిగిలిన వారంతా ముస్లింలే ఉండడం విశేషం. ముస్లింలతోనే గ్రామం మొదలు కాగా క్రమంగా యాదవులు ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం గ్రామంలోని ప్రతి ఇంటికి ఒకరిద్దరు చొప్పున గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన వారే ఉన్నారు. మొదటి సారి వెళ్లిన వారు మూడేళ్లు ఆపై ఉండగా, ఇప్పటికే అనుభవం ఉన్న వారు ఏడాదికి రెండేళ్లకు ఒక సారి స్వ గ్రామాలకు వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో ఏడాది పొడవునా 300 మంది గల్ఫ్ దేశాల్లో ఉండగా మిగిలిన 200 మంది వచ్చి వెళుతుంటారు. 1978లో ఒక్కడితే మొదలై.. ఖాదర్‌పల్లె గ్రామానికి చెందిన మహమ్మద్ దౌలా అనే వ్యక్తి 1978లో ఉపాధి కోసం బాంబెకు వెళ్లారు. అక్కడే నాలుగేళ్లు ఉండి కువైట్ బాట పట్టాడు. ఆయనతో మొ దలైన గల్ఫ్ ప్రయాణం నేటి వరకూ కొనసాగుతోంది. చదివిన చదువుకు ఎంచుకున్న ఉద్యోగాల్లో అతి తక్కు వ మంది ఉండగా.. 90 శాతం మంది వివిధ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. బంగారు పని, అన్ని రకాలైన మెకానిక్ పనులు, ఫర్నిచర్ తయారీ, డ్రైవింగ్, టైలరింగ్, ఇంటి పనులు, బే ల్దారి పనులు ఇలా అనేక రకాలైన పనులు చేస్తున్నారు. 95 శాతం మంది పురుషులే గల్ఫ్ దేశాలకు వెళ్లగా 5 శా తం మంది మాత్రమే మహిళలు గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నారు. కూలీ పనులు చేసుకునే కుటుంబాల వా రు నేడు గల్ఫ్ దేశాల్లో నెలకు రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకూ జీతాలు పొందుతున్నారు. జీతానికి వెళ్లేవారితో పాటు అక్కడే సొంతంగా పని చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. నాడు బోద కొట్టాలతో ఉన్న ఖాదర్‌పల్లె ప్రస్తుతం ప్రతి కుటుంబం అత్యాధునికంగా మంచి బిల్డింగ్‌లను నిర్మించుకున్నారు. జీవించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 95 శాతం కుటుంబాల వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మసీద్ నిర్మాణం.. గ్రామంలో ముస్లింలందరూ డబ్బులు సమకూర్చుకుని కోటి రూపాయలతో ఇటీవల ఆదర్శంగా మసీద్‌ను నిర్మించుకున్నారు. గ్రామ ప్రజలు ఒక్కో కుటుంబం నుంచి రూ.20 వేల నుంచి రూ.5 లక్షల వరకూ మసీద్ కోసం డబ్బులు ఇచ్చారు. వీరి ఆధ్యాత్మిక బాట ఆదర్శంగా నిలుస్తోంది. మా కుటుంబంలో ముగ్గురు సౌదీకి వెళ్లారు మా కుటుంబంలో మొదట్లో నేను రెండేళ్లు సౌదిలో పని చేసి వచ్చాను. తర్వాత నా కొడుకు, తమ్ముడు, తమ్ముడి కొడుకు సౌదికి వెళ్లారు. నా కొడుకు పదేళ్లకు పైగా ఉండి వచ్చాడు. ప్రస్తుతం తమ్ముడు, తమ్ముడి కొడుకు ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్లుగా పని చేస్తున్నారు. అక్కడికి వెళ్లి రావటం వల్లనే మా కుటుంబాలు అభివృద్ధి చెందాయి. మొదట్లో కూలి పనులు చేసుకునే వాళ్లం. ఇప్పడు సంతోషంగా జీవిస్తున్నాం. – సయ్యద్ నూర్, ఖాదర్‌పల్లె వాసి, చాపాడు మండలం 18 ఏళ్లు కువైట్‌లో పని చేశా 1985లో కువైట్ వెళ్లాను. యువకుడిగా పదేళ్ల పాటు కారు డ్రైవర్‌గా పని చేశాను. తర్వాత 1996లో వెళ్లి 2008లో వచ్చాను. 18 ఏళ్ల పాటు కారు డ్రైవర్‌తో పాటు ఇతర పనులు కూడా చేశాను. 2008లో ఇండియాకు వచ్చి 2009లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. ప్రస్తుతం వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఉన్నాను. మా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారే ఉన్నారు. – బొలెరో బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖాదర్‌పల్లె గల్ఫ్ దేశాలతోనే మా గ్రామం అభివృద్ధి 1962 లో ఖాదర్ అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా వలస వచ్చి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి క్రమేపి పెరిగిన గ్రామంలో అందరూ వ్యవసాయ పనులు చేసుకుని జీవించే వారే. బతికేందుకు ఇబ్బందులు పడేవారు. అప్పట్లో 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా ఉన్న ఖాసీం పీరా గ్రామాభివృద్ధి కోసం పాటు పడ్డాడు. మహమ్మద్ దౌలా అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో 1972 నుంచి గ్రామంలోని ప్రజలు ఒక్కొక్కరుగా గల్ఫ్ దేశాల బాట పట్టారు. – వడ్ల జైనుల్లా, గ్రామ సర్పంచ్ షమీష్ భాను భర్త, ఖాదర్‌పల్లె -
దుబాయ్‌లో ఆదిలాబాద్ వాసి మృతి.. నెలల క్రితమే గల్ఫ్ బాట
సాక్షి, ఆదిలాబాద్: ఉన్న ఊరి లో సరైన పని లేక కు టుంబ పోషణకు గల్ఫ్‌బాట పట్టిన ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం కబళించింది. కుటుంబీకుల వివరాల ప్రకారం... లోకేశ్వరం మండలంలోని బామ్నికే గ్రామానికి చెందిన గొల్ల రాజు (39) కూలీ చేసుకుంటూ జీవించేవాడు. గ్రామంలో సరైన పనులు లేక కుటుంబ పోషణ కోసం అప్పు చేసి డిసెంబరు 29న దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ నివాసం ఉండే ప్రదేశం నుంచి పనిచేయడానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. రాజుకు భార్య చిన్నక్క, కుమారుడు రేవంత్ ఉన్నారు. చివరి చూపుకోసం మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
Vijayawada: గల్ఫ్ సర్వీసులకు డిమాండ్ ఫుల్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి గల్ఫ్ దేశాలకు నడుపుతున్న విమాన సర్వీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను పొందిన ఈ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ సర్వీస్‌లను కూడా విస్తరిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించేందుకు ఈ ప్రాంత ప్రయాణికులు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాలపై ఆధారపడాల్సి వచ్చేది ఇప్పుడు విజయవాడ విమానాశ్రయం నుంచి షార్జా, మస్కట్, కువైట్‌కు డైరెక్ట్ విమాన సరీ్వస్‌లు అందుబాటులోకి రావడంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు నుంచి ఐదు సర్వీస్‌లకు.. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 2018 ఆగస్టు 1న విజయవాడ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. అదే ఏడాది డిసెంబర్ నుంచి తొమ్మిది నెలలపాటు సింగపూర్–విజయవాడ మధ్య వారానికి రెండు విమాన సర్వీస్‌లు నడిచాయి. ఆ తర్వాత దుబాయ్, అబుదాబికి సర్వీస్‌లు నడపాలని భావించినా కోవిడ్ వల్ల సాధ్యం కాలేదు. అప్పట్లో కోవిడ్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలకంగా నిలిచింది. కోవిడ్ తగ్గిన తర్వాత తెలుగువారు ఎక్కువగా ఉండే కువైట్, మస్కట్, యూఏఈలోని షార్జా నుంచి విజయవాడకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐదు సర్వీస్‌లను నడుపుతోంది. వీటిలో షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు సర్వీస్‌లు, మస్కట్‌కు ఒక సర్వీస్‌ను నడుపుతుంది. కువైట్, మస్కట్ నుంచి వారంలో ఒక్కొక్క సర్వీస్‌లు ఇక్కడికి వస్తున్నాయి. ఈ సర్వీసుల్లో నెలకు 4వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. షార్జా సర్వీస్‌కు విశేష స్పందన.. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి షార్జా–విజయవాడ మధ్య ప్రారంభమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారానికి రెండు రోజులపాటు 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన 737–800 బోయింగ్ విమానాన్ని నడుపుతున్నారు. ఈ విమానం షార్జా నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో విజయవాడకు నడుస్తోంది. ఇక్కడి నుంచి షార్జాకు 70శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్ యూఏఈలోని షార్జాతోపాటు దుబాయి, అబుదాబికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల యూఏఈ నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు సులువైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా భవిష్యత్‌లో షార్జా–విజయవాడ మధ్య వారానికి నాలుగు నుంచి ఏడు సర్వీస్‌లకు పెంచేందుకు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయికి సర్వీస్‌లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్పోర్ట్ అధికారులు పౌరవిమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నూతనంగా నిరి్మస్తున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిచే అవకాశం ఉంటుంది. -
ధర వెరీ గుడ్డు.. పౌల్ట్రీ రైతుకు ఊరట
సాక్షి, అమరావతి: కోడిగుడ్డు ధర ఊహించని రీతిలో పెరుగుతోంది. ఫారమ్ గేటు వద్ద రికార్డు స్థాయిలో ఒక్కో గుడ్డు ధర రూ.5.25 పలుకుతుండగా.. రిటైల్‌గా రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ మేత, ఇతర ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి సంఖ్య తగ్గిపోగా.. రోజుకు 4.75 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలో నిత్యం 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఫారమ్ గేటు వద్ద ధర రూ.6 దాటే అవకాశం కన్పిస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7 మార్క్‌ను చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నాయి. ఎగుమతులకు ఊపు సాధారణంగా మన రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంతమేర గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. విదేశాల విషయానికి వస్తే ప్రతినెలా 2 కోట్ల గుడ్లు గల్ఫ్ దేశాలకు, 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం టర్కీ, నెదర్లాండ్స్‌లో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20 కోట్ల గుడ్లు ఎగుమతి అయ్యాయి. 50 లక్షలకు మించి ఎగుమతి కాని కతార్‌కు ప్రస్తుతం 2 కోట్లకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాలకు కూడా కోటిన్నరకు పైగా గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఫలితంగా గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రైతులకు ఊరట మొక్కజొన్న టన్ను గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.24 వేలకు చేరింది. సోయాబీన్ టన్ను గతేడాది రూ.38 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.51వేల మధ్య వరకు ఉంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) గతేడాది కిలో రూ.9 నుంచి రూ.10 ఉండగా.. ప్రస్తుతం రూ.17–18 మధ్య ఉంది. ఇలా ఊహించని రీతిలో పెరిగిన మేత ధరల వల్ల పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి రూ.300 నుంచి రూ.315 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఫారమ్ గేట్ వద్ద ఒక్కో కోడిగుడ్డు ఉత్పత్తికి రూ.4.65 నుంచి రూ.4.75 వరకు ఖర్చవుతోంది. ఫిబ్రవరి నుంచి ఇదే రీతిలో ఖర్చవుతున్నా నెల రోజుల క్రితం వరకు ఫారమ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.3.90కి మించి పలకలేదు. ఫలితంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఊహించని రీతిలో విదేశాలకు పెరిగిన ఎగుమతులు దేశీయంగా పౌల్ట్రీ రైతుకు కాస్త ఊరటనిచ్చాయి. ఎగుమతులు పెరగటం వల్లే.. చాలా రోజుల తర్వాత పౌల్ట్రీ రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమకు శుభపరిణామం. ఊహించని రీతిలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెరగడం వల్లే ఫారమ్ గేటు వద్ద రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే టర్కీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఉత్పత్తి తగ్గడం మన గుడ్డుకు కలిసొచ్చింది. – తుమ్మల కుటుంబరావు, చైర్మన్, ఎన్ఈసీఎస్, విజయవాడ జోన్ తొలిసారి గిట్టుబాటు ధర కృష్ణా జిల్లాలో 70 కోళ్ల ఫారాలు ఉన్నాయి. సుమారు కోటి కోళ్లను పెంచుతుండగా.. 75 లక్షల నుంచి 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. పెరిగిన ముడిసరుకు ధరల వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్కో కోడిపై నెలకు రూ.30 చొప్పున నష్టపోయాం. ఆ తర్వాత నెలకు రూ.10నుంచి రూ.15 మేర నష్టాలను చవిచూశాం. ప్రస్తుతం ఫారమ్ గేట్ వద్ద గుడ్డు తయారీకి రూ.4.75 వరకు ఖర్చవుతుండగా.. తొలిసారి రూ.5.25 ధర లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిలో కనీసం ఏడాది పాటు కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కగలం. – ఆర్.సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, కృష్ణాజిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (చదవండి: సీఎం జగన్ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు: బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస) -
వలస కార్మికుల హక్కులపై వర్క్‌షాప్, టీపీసీసీ నాయకులకు ఆహ్వానం
అంతర్జాతీయ కార్మిక చట్టాలపై బీడబ్ల్యుఐ సంస్థ ఈనెల 17, 18 రెండు రోజుల పాటు చెన్నైలో నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు తెలంగాణకు చెందిన ఇద్దరు యువ నాయకులకు ఆహ్వానం అందింది. చట్టపరమైన న్యాయవాద శిక్షణ - వలస కార్మికుల హక్కులు (లీగల్ అడ్వకసీ ట్రైనింగ్ - మైగ్రంట్ వర్కర్స్ రైట్స్) శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం (టీపీసీసీ ఎన్నారై సెల్) గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి హాజరవుతున్నారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యుఐ) అనే గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్ తన సభ్య యూనియన్ జగిత్యాల జిల్లాకు చెందిన 'ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్' కు ఈ ఆహ్వానం అందజేయగా ఇద్దరు యువ నాయకులను నామినేట్ చేసింది. 127 దేశాలలో 351 ట్రేడ్ యూనియన్ లతో ఒక కోటి 20 లక్షల సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిడబ్ల్యుఐ భారతదేశంలో దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నది. అంతర్జాతీయ వలసలు, గల్ఫ్ దేశాలలో వలస కార్మికుల హక్కులు అనే అంశంపై చెన్నయిలో శిక్షణ ఇస్తారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకుల జ్ఞానం పెంపొందించడానికి, నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఈ క్రింది అంశాలపై శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ వలసలను నియంత్రించే చట్టపరమైన విధాన నమూనా (పాలసీ ఫ్రేమ్ వర్క్) వ్యవస్థ భాగస్వాముల అవగాహనను విస్తరించడం. వలస కార్మికుల హక్కులను నిలబెట్టడానికి, సురక్షితమైన వలసలను ప్రోత్సహించడానికి భాగస్వామ్య సంఘాల జోక్యాలపై నవీకరణలు మరియు సురక్షిత సమాచారాన్ని సేకరించడం. కంట్రీస్ ఆఫ్ ఆరిజిన్ (కార్మికులను పంపే మూలస్థాన దేశాలు) మరియు కంట్రీస్ ఆఫ్ డెస్టినేషన్ (కార్మికులను తీసుకునే గమ్యస్థాన దేశాలు) లలో వలస కార్మికులకు అందుబాటులో ఉండి వారికి సహాయాన్ని అందించడానికి కార్మిక సంఘాలు (ట్రేడ్ యూనియన్స్) ఎలాంటి కార్యాచరణ, వ్యూహాలను కలిగి ఉండాలో చర్చిస్తారు. -
ఎడారి గోసకు.. ఏదీ భరోసా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరోసా కరువైంది. గల్ఫ్ దేశాలకు వెళ్లి జేబు నిండా డబ్బులతో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే దాదాపు పదిహేను లక్షల మంది గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రేయిన్, ఒమన్)కు వెళ్లగా, తాజాగా కొత్తతరం కూడా ఎడారి దేశాల బాటపడుతోంది. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దేశాలకు వెళుతుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి కఠినమైన పనుల్లో కుదురుతున్నారు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారోగ్యం, ఆపై మృత్యువాత పడుతున్నవారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలా గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో 1,612 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందారు. ఇంకా కూలీలుగానే తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా గల్ఫ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేక సాంకేతిక శిక్షణ లేకపోవడంతో అక్కడకు వెళుతున్న వారిలో 90 శాతం కూలీలుగానే పనిచేస్తున్నారు. నిరక్షరాస్యత, ఎడారి దేశాల్లో వ్యవహరించే తీరుపై ముందస్తు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పని ప్రదేశంలో ప్రమాదాలు – వివాదాలు, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుబాయ్ బాధలుండవని నాయకులు హామీ ఇచ్చినా పేద కార్మికులకు భరోసా విషయంలో కార్యాచరణ ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2016లో ఎన్నారై పాలసీపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, 2018 –19 బడ్జెట్లో ఎన్నారైల కోసం రూ.100 కోట్లను కేటాయించినా.. పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటించకపోవడంతో వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూరలేదు. రెండు రోజులకో మృతదేహం.. గల్ఫ్ దేశాల నుంచి రెండు రోజులకొక మృతదేహం తెలంగాణకు చేరుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 1,612 మృతదేహాలు వచ్చాయి. ఇందులో 25 నుంచి 50 ఏళ్ల లోపు వారే అత్యధికం. అక్కడి వాతావరణం, ఆహారం కారణంగా మానసిక ఒత్తిడితో గుండె, మెదడు సంబంధిత వ్యాధుల భారిన పడి మరణిస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం ఇటీవల వెల్లడించింది. కేరళ రాష్ట్రంలో భేష్ గల్ఫ్ దేశాల్లో అత్యధిక ప్రవాసీలున్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం వలస కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. గల్ఫ్‌కు వెళ్లే వారికి ముందస్తుగా నైపుణ్య శిక్షణ ఇస్తుండటంతో వాళ్లు వైట్ కాలర్ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అలాగే స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం విస్తృత స్థాయిలో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో ఉన్న వారికి న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎన్నార్టీఎస్ ఆధ్వర్యంలో ఎన్నారైల కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌తోపాటు ప్రవాసాంధ్ర భరోసా పేరుతో రూ.10 లక్షల బీమా (18–60 ఏళ్లు)తో పాటు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారు. ఇవీ కార్మికుల డిమాండ్లు.. ►గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, వార్షిక బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలి. ►గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమాదబీమా, పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి. ►గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి. ►శిక్షపడ్డ ఖైదీలకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాల నుంచి ఖైదీల మార్పిడి వెంటనే చేయాలి. ►కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి. ►ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన తరహాలో గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ►ప్రవాసి భారతీయ బీమా యోజన కింద రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండేళ్ల కాలపరిమితితో ఇన్సూరెన్స్ అమలు చేయాలి. తక్షణ కార్యాచరణ చేపట్టాలి తెలంగాణ వస్తే దుబాయ్ బాధలు తప్పుతాయనుకున్నం. కొత్త వలసలు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల సంక్షేమానికి తక్షణ కార్యాచరణను అమలు చేయాలి. –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకుడు కాన్సులేట్లు ఏర్పాటు చేయాలి దేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచే అత్యధిక కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు మరణాలు, జైలు పాలవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి, హైదరాబాద్‌లో సౌదీ, ఇతర ముఖ్య దేశాల కాన్సులేట్లను ఏర్పాటు చేస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. – పి.బసంత్‌రెడ్డి, గల్ఫ్ సోషల్ వర్కర్ కన్న బిడ్డల కోసం.. కన్నులు కాయలు కాచేలా సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే అన్నదమ్ములిద్దరూ 2004లో దుబాయ్ వెళ్లారు. పని ప్రదేశంలో నేపాల్‌కు చెందిన దిల్ బహుదూర్ అనే గార్డు హత్యకు కారమణంటూ వీరితో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అక్కడి చట్టాల మేరకు బాధితుని కుటుంబ సభ్యులు పరిహారం తీసుకుని క్షమాభిక్ష పత్రాన్ని సమర్పిస్తే శిక్షను తగ్గించటం లేదా రద్దు చేయటం సులువు. ఈ మేరకు మల్లేశం, రవి తల్లి గంగవ్వ 2012లో పరిహారం సొమ్ము కోసం తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాల్సిందిగా హెచ్ఆర్సీని కోరిన అంశం అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టి వచ్చింది. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి రూ.15 లక్షలను నేపాల్ వెళ్లి బాధిత కుటుంబానికి అందించి క్షమాభిక్షపత్రాన్ని తీసుకొచ్చారు. నేర తీవ్రత, చేసిన తీరు ఘోరంగా ఉందంటూ అక్కడి హైకోర్టు యావజ్జీవ శిక్ష(25ఏళ్లు)గా మార్చింది. ఈ విషయంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటే కానీ వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మీరైనా.. జాడ చెప్పండి ‘గల్ఫ్‌కు పోయివస్తే కష్టాలన్నీ తీరుతయన్న డు. పోయినోడు మళ్లీ రాక.. మేము దినదిన నరకం అనుభవిస్తున్నం. మా కొడుకు ఎక్కడున్నడో..ఏం చేస్తున్నడో ఎవరూ చెప్పడం లేదు’ అంటూ జగిత్యాల జిల్లా మన్నెగూడేనికి చెందిన శ్రీరాముల రాజేశ్వరి, రాజేశం తమకు ఎదురైన వారందరినీ అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. శ్రీరాముల ప్రసాద్ (42) రెండేళ్ల క్రితం గల్ఫ్ లోని క్యాంప్‌కు చేరినట్లు ఫోన్ చేశాడు. ‘వారానికి ఒకసారైనా ఫోన్ చేసేవాడు. ఏడాదిగా అది కూడా లేదు. మీరై నా నా కొడుకు జాడ చెప్పాలె’ అంటూ రాజేశం వేడుకుంటున్నారు. -
ఖతార్‌లో ‘సాకర్’.. తెలంగాణ మీద ఎఫెక్ట్!
ఊళ్లో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలెన్నో. అయినవారికి దూరంగా ఎడారి దేశాల్లో అవస్థలు పడుతున్న బాధితులెందరో. ఇన్నేళ్లు మనం చూసిన వారి గోసపై ఇప్పుడు ప్రపంచం దృష్టి పెట్టింది. గల్ఫ్ సమస్యలు, బాధితుల పరిస్థితులను యూరప్ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఫ్రాన్స్, పోలండ్, స్విట్జర్లాండ్ తదితర దేశాల మీడియా సంస్థలు కొన్ని వారాలుగా రాష్ట్రంపై ఫోకస్ పెట్టాయి. ఆయా సంస్థల జర్నలిస్టులు తెలంగాణ పల్లెల్లో పర్యటిస్తున్నారు. గల్ఫ్ కుటుంబాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి, బాధిత కుటుంబాల వ్యథను నేరుగా తెలుసుకుంటున్నారు.. దుబాయ్, ఖతార్, సౌదీ, కువైట్ తదితర గల్ఫ్ దేశాలకు నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి వెళ్తూనే ఉన్నారు. కార్మికులుగా వెళ్లి.. బాధితులుగా మారినవారూ మన రాష్ట్రం నుంచే ఎక్కువ. గ్రామీణ నేపథ్యం, నిరక్షరాస్యత, గల్ఫ్ చట్టాలపై అవగాహన లోపం, చేసే పనులకు సంబంధించి ముందస్తు శిక్షణ లేకపోవడం తదితర కారణాలతోపాటు ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది బాధితులుగా మారుతున్నారు. కొందరు ప్రాణాలనూ కోల్పోతున్నారు. జగిత్యాల జిల్లా చిట్టాపూర్‌లో ఫ్రాన్స్ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్బేస్లే.. ‘ఫుట్‌బాల్’ ఆడుకుంటున్నారు ఈనెల 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లో ఫిఫా వరల్డ్‌కప్–2022 జరగనుంది. ఈ ఆట ఆ దేశంలో ఉంటున్న మన కార్మికుల జీవితాలతో ఆడుకుంటోంది. సాకర్ వరల్డ్‌కప్ నేపథ్యంలో కొన్ని నెలల ముందు నుంచే ఖతార్‌లో నిర్మాణరంగ పనులను నిలిపివేశారు. పలు రంగాలకు ఆంక్షలు విధించారు. రాష్ట్రం నుంచి వెళ్లినవారిలో చాలామంది నిర్మాణ రంగంలోనే ఉన్నారు. ప్రపంచకప్ నేపథ్యంలో ప్రాజెక్టులు లేకపోవడంతో చాలామందిని తిప్పి పంపిస్తున్నారు. మరికొందరికి పనివేళలు, పనిగంటలు, ప్రదేశాలనూ మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, గల్ఫ్ బాధితుల కుటుంబాల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ మీడియా ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఓ జాతీయ ఇంగ్లిష్ దిన పత్రిక రాసిన కథనం కూడా ఇందుకు కారణమైంది. బాధిత కుటుంబంతో వీడియోకాల్ ద్వారా మాట్లాడుతున్న పోలాండ్ స్పోర్ట్స్ జర్నలిస్టు తెలంగాణ బాట... ప్రధానంగా యూరప్ దేశాల మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు తెలంగాణ బాట పట్టారు. ఫ్రాన్స్ 24 మీడియా సంస్థకు చెందిన ఇండియా, దక్షిణాసియా కరస్పాండెంట్ లీ డెల్ఫోలీ రెండురోజులపాటు నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాల్లో పర్యటించారు. వెల్మల్, ఢీకంపల్లి, గగ్గుపల్లి గ్రామాల్లో బాధితులతో మాట్లాడారు. ఆర్మూర్లోనూ పలువురి నుంచి సమాచారం సేకరించారు. ఫ్రాన్స్ టీవీకి చెందిన జర్నలిస్టు జెర్మైన్ బేస్లే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్‌లో బాధిత కుటుంబాలను కలిశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన వీడియో జర్నలిస్టు జోసెఫ్ జగిత్యాల జిల్లా సుద్దపల్లిలో పలు కుటుంబాలతో మాట్లాడారు. పోలండ్‌కు చెందిన డారియస్ ఫరోన్ అనే స్పోర్ట్స్ జర్నలిస్టు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన బాధిత కుటుంబాలతో వీడియోకాల్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విదేశాల నుంచి వస్తున్న జర్నలిస్టులకు, గల్ఫ్ కుటుంబాలకు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలూ గుర్తించాలి ఖతర్‌లో ఫిఫా కప్ నేపథ్యంలో కార్మికులను ఇంటికి పంపిస్తున్నారు. కొన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలువులు ఇస్తున్నాయి. కొన్ని ఇవ్వడం లేదు. విదేశీ మీడియా ప్రతినిధులు బాధిత కుటుంబాల పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కార్మికులకు అండగా నిలవాలి. – స్వదేశ్ పరికిపండ్ల, అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ . -
ఐదు రోజుల క్రితమే గల్ఫ్ నుంచి ఇంటికి.. భర్తను దూరం పెట్టడంతో..
సాక్షి, అన్నమయ్య(రాయచోటి): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త క్షణికావేశంలో కత్తితో దాడిచేసిన ఘటన రాయచోటిలో సంచలనం రేకెత్తిస్తోంది. గురువారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయచోటి అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రజినాల వెంకట రామ్మోహన్ భార్య రజినాల రాజేశ్వరి (37) 5 రోజుల కిందట గల్ఫ్ దేశం నుంచి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి అనారోగ్య రీత్యా భర్తను దగ్గరకు రానివ్వలేదు. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న రామ్మోహన్ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డివారిపల్లెలో నివాసం ఉంటున్న వెంకట రామ్మోహన్ గురువారం తెల్లవారుజామున పదునైన కత్తితో భార్య రాజేశ్వరిని పొడిచి హత్య చేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. భార్యను హత్యచేసిన అనంతరం రామ్మోహన్ పరారయ్యాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని సిఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: (చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం.. ఆ సైట్లకు బానిసై అఘాయిత్యం) -
గన్ పార్క్ వద్ద గల్ఫ్ కార్మికుని మృతదేహానికి నివాళి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు -
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
-
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా ఇక నుంచి అధికార ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు గల్ఫ్ నుంచి వచ్చిన శవపేటికలను ఉంచుతామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. ఇటీవల దుబాయిలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముల్క నాగరాజు (25) అంత్యక్రియలు ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటలో జరిగాయి. గల్ఫ్ కార్మికుల అంత్యక్రియల్లో పాల్గొని మృతుడు నాగరాజుకు రవిగౌడ్ నివాళులు అర్పించారు. పని ప్రదేశంలో (వర్క్ సైట్) లో జరిగిన ప్రమాద మరణానికి దుబాయిలో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రవిగౌడ్ అన్నారు. కార్మికులకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి తగిన శిక్షణ ఇవ్వాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం, గల్ఫ్ ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా ను తీసుకోవాలని రవిగౌడ్ కోరారు. రూ. 325 చెల్లిస్తే రెండు సంవత్సరాలు అమలులో ఉండే రూ. 10 లక్షల ప్రార్ద బీమా పాలసీ పొందవచ్చు. ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవిగౌడ్ కోరారు. -
మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం
స్టార్ హీరో మోహన్ లాల్‌కు గల్ఫ్ దేశాలు షాకిచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాన్స్టర్. మంచు లక్ష్మి కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇటీవల అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల సన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తమ దేశాల్లో మాన్స్టర్ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అయితే సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీక్యూ) కంటెంట్ ఉండడం వల్లే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే దీంతో ఈ మూవీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. -
‘గల్ఫ్ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం’
ఎర్రటి ఎండలో.. తమ రక్తాన్ని మరిగించి చెమటను చిందిస్తున్న గల్ఫ్ కార్మికులు ఒక్కొక్క చెమట చుక్క ఒక్క రూపాయి లాగా సంపాదించి పంపిన విదేశీ మారక ద్రవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పవృక్షం, కామధేనువు లాగా లాభం చేకూరుస్తుంది. అయితే కార్మికులు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా వారి బతుకులు ఎండమావులు అవుతున్నాయని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్సిటీ గురువారం తెలంగాణ గల్ఫ్ వలసలపై జాతీయ వర్చువల్ సింపోజియం (ఆన్ లైన్ చర్చ) నిర్వహించింది. పబ్లిక్ పాలసీ రీసెర్చ్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం ఈ చర్చను నిర్వహించింది. ఈ చర్చలో ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయులు నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందింది. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల జనాభా 2 కోట్ల యాభై లక్షలు. ఇందులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసించే 88 లక్షల మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం. ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నట్లు ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. ఫారెక్స్ నిల్వలు 2 సంవత్సరాల కనిష్ట స్థాయి 564 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయి విలువ అధఃపాతాళానికి జారిపోయింది. భారత ప్రభుత్వం పేద కార్మికులను విదేశాలకు పంపుతూ ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తున్నది. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం ప్రవాసులు పంపే సొమ్ముతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులు, వారు ఇచ్చే విరాళాలపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. ప్రవాస కార్మికుల బతుకులు మారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ బడ్జెట్ ను కేటాయించడం లేదు. ఒంటరి వలసలు, తక్కువ చదువు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. ఆన్ లైన్ మీటింగ్ లో పాల్గొన్న మంద భీంరెడ్డి వారు పొట్టచేత పట్టుకొని సప్త సముద్రాలు, భారత సరిహద్దులు దాటి.. ఎడారి దేశాలలో పనిచేసే తెలంగాణ వలస కార్మికులు. తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును స్వదేశానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో పంపిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక జవాన్లుగా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతంలో భాగస్వాములుగా తమ వంతు సేవ చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో పనిచేసే సైనికుల లాగా వీరు కూడా కుటుంబాలను వదిలి దూర తీరాలకు వెళ్లి మాతృభూమి రుణం తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ (లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు) పంపితే అది రూ . 14,000 కు సమానం. 15 లక్షల మంది గల్ఫ్ ప్రవాసులు నెలకు రూ. 14 వేలు పంపిస్తే రూ. 2,100 కోట్లు అవుతుంది. సంవత్సరానికి రూ. 25,200 కోట్లు అవుతుంది. తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు పంపే రూ. 25,200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వారి కుటుంబ సభ్యుల ద్వారా దేశీయంగా వినియోగంలోకి వచ్చినప్పుడు కనీసం 10 శాతం జీఎస్టీ సంవత్సరానికి రూ.2,520 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సగం వాటా కింద సంవత్సరానికి రూ. 1,260 కోట్లు లాభపడుతున్నది. ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ స్కీం (ఎగుమతి ఆధారిత యూనిట్ల పథకం) 1981లో ప్రవేశపెట్టబడింది. ఎగుమతులను పెంచడం, దేశంలో విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచడం మరియు భారతదేశంలో అదనపు ఉపాధిని సృష్టించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, బ్యాంకు రుణాలు, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు అందిస్తుంది. గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థకు ఇండస్ట్రీ స్టేటస్ (పరిశ్రమల హోదా) ఇవ్వాలి. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. మెడికల్ టెస్ట్ ఫ్లయిట్ టికెట్, నైపుణ్య శిక్షణ లాంటి వాటికి ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. గల్ఫ్ దేశాలకు కార్మికులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు లేదా 45 రోజుల జీతాన్ని ఫీజుగా తీసుకోవడానికి రిక్రూటింగ్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిక్రూట్మెంట్ ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యోగ భర్తీ చేపట్టాలనే సంకల్పానికి ప్రభుత్వాల మద్దతు అవసరం. కార్మికులను విదేశాలకు పంపే అతిపెద్ద దేశమైన భారత్‌కు ఒక మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) లేకపోవడం విచారకరం అని మంద భీంరెడ్డి అన్నారు. డా. జునుగురు శ్రీనివాస్, డా. రౌల్ వి. రోడ్రిగ్జ్, డా. జె. సంతోష్, డా. నరేష్ సుదవేని, డా. పి. వి. సత్య ప్రసాద్, వలస కార్మికుల ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షకుడు బి. ఎల్. సురేంద్రనాథ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
కలలు కల్లలు.. ఏజెంట్ చేతిలో మోసపోయి కటకటాల్లోకి కొత్తగూడెం మహిళ
భద్రాద్రి కొత్తగూడెం: గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెంట్లు అమయాక మహిళలను మోసం చేస్తున్నారు. తెలంగాణ కొత్తగూడెం జిల్లాకు చెందిన విజయలక్ష్మీ (40) అనే మహిళ కూడా ఇలాగే అమలాపురానికి చెందిన ఓ ఏజెంట్ చేతిలో మోసపోయింది. ఉద్యోగం వస్తుందని నమ్మి గల్ఫ్ దేశం ఒమన్ వెళ్లిన ఆమెను మస్కట్‌లో ఎయిర్‌పోర్టు అధికారులు ఆపారు. ఆమె వీసా నకిలీదని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కేరళలోని కొచ్చికి తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏర్నాకులం పోలీస్ స్టేషన్‌కు రిమాండ్‌కు తరలించారు. ఏజెంట్ చేతిలో ఆమె మోసపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒమన్ కేసులను వాదించే కోర్టులు ప్రస్తుతం కేరళో మూతపడ్డాయి. దీంతో విజయలక్ష్మీ జైల్లోనే మగ్గుతోంది. ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తోంది. విజయలక్ష్మి భర్త మరణించారు. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లి పూలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. తన కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతోనే విజయలక్ష్మీ గల్ప్ దేశం వెళ్లాలనుకుంది. కానీ ఏజెంట్‌ను నమ్మి మోసపోయి ఇప్పుడు జైల్లో దుర్భర జీవితం గడుపుతోంది. చదవండి: కోర్టు ముందు బోరున విలపించిన పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీ -
గల్ఫ్ దేశాల్లో 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' ఉండాలి!
ఆసియా-గల్ఫ్ వలసల కారిడార్ దేశాలలో వేతనాల చెల్లింపులపై ఉత్తమ ఆచరణపై ఖతార్ రాజధాని దోహాలో వలసలపై జరుగుతున్న సమావేశంలో మంగళవారం చర్చ జరిగింది. ముఖ్యంగా వేతనాల ఎగవేత, ఇతర వేతన సమస్యల పరిష్కార విధానాలపై చర్చ సాగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం), మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) లు సంయుక్తంగా ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఖతార్‌లో సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి ఖతార్ ప్రభుత్వం అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి, ప్రవాసి కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల ఐక్యరాజ్య సమితి ప్రవాసి కార్మికులకు వేతన రక్షణ నిధి ఏర్పాటు, వలస కార్మికులను రక్షించడానికి కార్మికులను పంపే మూలస్థాన దేశాలు ఏవైనా విధానాలు, శాశ్వత పరిష్కార వ్యవస్థలను కలిగి ఉన్నాయా? అనే ప్రశ్నించారు. నష్టపోయిన కార్మికులను, విదేశాల నుంచి వాపస్ వచ్చిన వలస కార్మికుల రక్షణకోసం మూలస్థాన దేశాలు పునరావాసం, పునరేకీకరణ కోసం ఒక విధానం, శాశ్వత యంత్రాంగం కలిగి ఉండాలని స్వదేశ్ కోరారు. 32 సంవత్సరాల క్రితం 1990-91లో ఇరాక్ - కువైట్ గల్ఫ్ యుద్ధం కారణంగా లక్షలాది మంది వలసదారులు కువైట్ నుండి వారి స్వదేశాలకు తిరిగి పంపబడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అనుబంధ సంస్థ 'ది యునైటెడ్ నేషన్స్ కంపెన్సేషన్ కమిషన్' (పరిహార కమిషన్) కువైట్‌పై ఇరాక్ దాడికి సంబంధించి 52.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చెల్లింపులను పూర్తి చేసిందని స్వదేశ్ గుర్తు చేశారు. అలాగే ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇరాక్, లిబియా, యెమెన్ లాంటి దేశాలలో యుద్ధ పరిస్థితులు, దివాళా తీసిన కంపెనీలను మూసివేయడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించి, వీసా గడువు ముగిసిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్షలు లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు 4-5 ఏళ్లకు ఒకసారి క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించడం, కోవిడ్19 మహమ్మారి లాంటి విపత్తు వలన వలస కార్మికులను బలవంతంగా ఆయా దేశాల నుండి కట్టుబట్టలతో స్వదేశీలకు పంపించివేస్తున్నారని స్వదేశ్ పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇలా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలతో సన్నద్ధంగా ఉండాలని సూచించారు ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖలో వేతన రక్షణ విభాగం అధినేత మహమ్మద్ సైద్ అల్ అజ్బా, ఖతార్ లోని ఫిలిప్పీన్ రాయబార కార్యాలయం కార్మిక అధికారి డాన్ ఆల్బర్ట్ ఫిలిప్ సి. పాన్కోగ్, ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) రీజనల్ కోఆర్డినేటర్ విలియం గోయిస్, ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ సుమన్ సొంకర్, ఖతార్‌లోని హమద్ బిన్ ఖలీఫా యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.రే జురీడిని పానెల్ ప్రవాసుల వేతన సమస్యలపై ప్రసంగించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) అరబ్ దేశాల వలస నిపుణుడు రిసార్డ్ చోలెవిన్స్కీ మోడరేటర్ గా వ్యవహరించారు. వలస కార్మికుల వేతనాలపై కోవిడ్-19 ప్రభావం, దీనిక అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలుపై ప్యానల్ వక్తలు ప్రసంగించారు. అలాగే కోవిడ్19 మహమ్మారి సంక్షోభం కంటే ముందు గమ్యస్థాన గల్ఫ్ దేశాలు కార్మికులకు 'వేజ్ ప్రొటెక్షన్ సిస్టం' (వేతనాల భరోసా రక్షణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి ప్రయోగాలు చేశాయి. వేతన చెల్లింపులను పర్యవేక్షించడం, అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేశాయని వక్తలు తెలిపారు. -
ఖతార్‌లో సాక్షి దినపత్రిక 'గల్ఫ్ జిందగీ' సావనీర్
ఖతార్: ఖతార్ లోని సిటీ సెంటర్ రొటానా హోటల్లో బసచేసిన తెలంగాణ వలస కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్లను బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఇ) సంస్థకు ఖతార్‌లో కమ్యూనిటీ లైజన్ ఆఫీసర్ (ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్) గా పనిచేస్తున్న మార్కోపోలో ఫెర్రర్ మర్యాదపూర్వకంగా సోమవారం కలుసుకున్నారు. సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు వలసలపై ఆసియా-గల్ఫ్ దేశాల చర్చల సమావేశానికి హాజరవడానికి స్వదేశ్ పరికిపండ్ల ఒకరోజు ముందు ఖతార్‌కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్వదేశ్ పరికిపండ్ల వద్ద ఉన్న సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్‌ను చూసి సంతోసం వ్యక్తం చేశారు మార్కో పోలో. తెలుగు రాకపోయినా 88 పేజీల పుస్తకాన్ని తన చేతిలోకి తీసుకొని ఫోటోల ద్వారా గల్ఫ్ వలసల గురించి సమాచారం ఉన్న పుస్తకం అని గమనించారు. దీంతో వివరాలను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి అతనికి స్వదేశ్ వివరించాడు. దాదాపు గంటన్నర సేపు ముఖ్య కథనాల సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా వినడమేకాదు, ఈ సావనీర్‌ను ఇంగ్లీష్‌లోకి అనువదించి ఒక పుస్తక రూపంలో వేయాలని మార్కో పోలో సూచించడం విశేషం. 'గల్ఫ్ జిందగీ' సావనీర్ గురించి... గల్ఫ్ వలసలు - అభివృద్ధి, కష్టాలు, సుఖాలు, హక్కులు, జీవితాలపై, సమాజంపై, ప్రభుత్వాలపై చూపించే ప్రభావం, ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం సాక్షి జిల్లా పేజీల్లో 'గల్ఫ్ జిందగీ' ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 11 నవంబర్ 2017 న ప్రారంభమైన 'గల్ఫ్ జిందగీ' పేజీ 22 నెలలుగా సెప్టెంబర్ 2019 వరకు 83 వారాలుగా ప్రచురితమైన అన్ని పేజీలను కూర్పు చేసి ఒక సావనీర్ గా రూపొందించారు. వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు 'గల్ఫ్ జిందగీ' వారధిలా ఉపయోగపడుతూ సమగ్ర సమాచారాన్ని అందిస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు ఒక భరోసానిస్తూ ముందుకెళ్లింది. మొదట్లో ప్రతీ శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరికమేరకు 15 జూన్ 2018 నుండి గల్ఫ్ దేశాలలో సెలవుదినం అయిన శుక్రవారానికి మార్చారు. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాల వివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి కుటుంబాల జీవనంపై కథనాలు ఇచ్చారు. ఇవే కాకుండా గల్ఫ్‌లో కష్టాలను జయించి మెరుగైన జీవితం గడుపుతున్న కార్మికుల సక్సెస్‌పై కూడా ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించారు. 'గల్ఫ్ జిందగీ' పేజీకి కావలసిన సమాచార సేకరణలో సహకరించిన 'మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా' సభ్య సంస్థ 'ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం' అధ్యక్షులు మంద భీంరెడ్డి గారికి కృతఙ్ఞతలు అని ఎడిటర్ సావనీర్ ముందు మాటలో రాశారు. అద్భుతమైన కథనాలు అందించిన సాక్షి గల్ఫ్ డెస్క్, విలేఖరుల బృందానికి అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ గల్ఫ్ వలసల చరిత్రలో ఈ 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ఆవిష్కరణ గుర్తుండిపోయే ఘట్టంగి నిలిచిపోయింది. సాక్షి 'గల్ఫ్ జిందగీ' సావనీర్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. (https://www.sakshi.com/sites/default/files/article_images/2019/10/4/gulf_book.pdf -
గల్ఫ్ వల.. విలవిల.. 4 నెలలుగా జైలులో మగ్గిపోతున్న మహిళలు
సాక్షి, కోనసీమ(అమలాపురం): గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి, అమాయక మహిళలపై కొందరు ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ వీసాలతో విమానాలు ఎక్కిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో ఆ అమాయక మహిళలు నకిలీ వీసాలతో పోలీసులకు పట్టుబడి జైళ్లపాలవుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో జిల్లాకు చెందిన మహిళలు ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే మరింత మంది జిల్లా మహిళలు అక్కడి జైలులో చిక్కుకున్నారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మోసపోయారిలా.. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రాంబాబు అనే ఏజెంటు గల్ఫ్‌లో ఉపాధి కల్పించే పేరుతో అమాయకులపై వల విసిరాడు. గల్ఫ్‌లో ఉపాధి పొందడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో పలువురు అతడికి రూ.లక్షలు సమర్పించుకున్నారు. అతడి ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు గత మే నెలలో గల్ఫ్‌కు బయలుదేరారు. వీరిలో మన జిల్లా మహిళలూ ఉన్నారు. వారికి ఏజెంటు రాంబాబు వీసాలు ఇచ్చి, గల్ఫ్కని చెప్పి, తొలుత హైదరాబాద్ పంపించాడు. అక్కడ రాజు అనే వ్యక్తి వారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించాడు. ఆ విమానం కేరళ రాష్ట్రం కొచ్చి ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడ చేసిన తనిఖీల్లో ఈ 30 మంది మహిళల వీసాలూ నకిలీవని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. గత మే 8వ తేదీన వారిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఆ మహిళలు అక్కడి జైళ్లలోనే మగ్గుతున్నారు. ఏజెంట్ తమను మోసగించినట్టు గుర్తించిన బాధితులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగాన్ని ఆశ్రయించారు. అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించింది. మిగిలిన 25 మంది మహిళలనూ విడిపించేందుకు చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం వైస్ చైర్పర్సన్ ఎన్.భవాని సారథ్యంలోని ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో విజ్ఞాపన అందించారు. దీనిపై కలెక్టర్ శుక్లా, జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సంబంధిత ఏజెంటుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కేరళ జైలులో ఉన్న మహిళలను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరి జిల్లాల వారే ఎక్కువ కేరళలో జైలు పాలైన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దడాల వెంకటలక్ష్మి (బందనపూడి, కాజులూరు మండలం), గీతారాణి (చల్లపల్లి, ఉప్పలగుప్తం మండలం), శాంతి (తాడికోన, అల్లవరం మండలం), లక్ష్మణరావు (ఆదుర్రు, మామిడికుదురు మండలం), రేలంగి జానకి (రామచంద్రపురం), గెల్లా మంగాదేవి (సుంకరపాలెం, తాళ్లరేవు మండలం), యలమంచిలి పార్వతి (దేవగుప్తం, అల్లవరం మండలం), గుబ్బల శ్రీలక్ష్మి (రావులపాలెం), ఇనగల శిరీష (కోరుకొండ), కోడి బేబీ (నిడదవోలు శివారు సుబ్బరాజుపేట) తదితరులున్నారు. కేరళకు అధికారుల బృందం ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, మహిళల అరెస్టు తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించుకుని, కేరళలో అరెస్టయిన మహిళలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా ఎస్పీతో కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఫోనులో మాట్లాడారు. నకిలీ వీసాల విషయమై కొన్ని కేసులు నమోదైనట్టు ఎర్నాకుళం ఎస్పీ బదులిచ్చారు. అక్కడి జైళ్లలో చిక్కుకున్న జిల్లా మహిళలను విడిపించేందుకు కోనసీమ నుంచి ఒక పోలీసు అధికారి, ఒక ఐసీడీఎస్ అధికారితో కూడిన బృందాన్ని కేరళకు ఎస్పీ పంపించారు. నిలువునా మోసపోయాం నకిలీ వీసాలతో ఏజెంటు రాంబాబు, హైదరాబాద్‌లో రాజు అనే వ్యక్తుల చేతిలో తాము నిలువునా మోసపోయామని రావులపాలేనికి చెందిన బాధిత మహిళ శ్రీలక్ష్మి వాపోయింది. కలెక్టరేట్ వద్ద ఆమె విలేకర్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కొచ్చి ఎయిర్‌పోర్టులో అరెస్టయిన 30 మంది మహిళల్లో శ్రీలక్ష్మి ఒకరు. అక్కడ జైలులో ఉండగా శ్రీలక్ష్మి భర్త చనిపోయాడు. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ బెయిల్ ఇప్పించి, విడిపించడంతో ఆమె స్వగ్రామం రావులపాలెం చేరుకుంది. కొచ్చి జైలులో తాను రెండు వారాలు ఉన్నానని.. డబ్బులు లేక.. సరైన తిండి, నిద్ర లేక నరకం చూశామని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ పడిన అవçస్థలను హ్యూమన్ రైట్స్ మహిళా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌కు శ్రీలక్ష్మి వివరించింది. ఐదుగురికి బెయిల్ ఇప్పించాం కొచ్చి విమానాశ్రయంలో నకిలీ వీసాలతో పట్టుబడి అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి బెయిల్ మంజూరయ్యేలా మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ మహిళా విభాగం కృషి చేసింది. బెయిలో పొందిన వారిలో శ్రీలక్ష్మి (రావులపాలెం), పార్వతి (అల్లవరం మండలం దేవగుప్తం), జానకి (రామచంద్రపురం), మంగాదేవి (యానాం), సౌజన్య (ఏలూరు) ఉన్నారు. ఇంకా కొంత మంది మహిళలు కేరళ రాష్ట్ర జైలులో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది. – నల్లబోతుల భవాని, ఏపీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వుమెన్ సెల్, రాజమహేంద్రవరం ఏజెంట్లపై చర్యలు గల్ఫ్‌లో ఉపాధి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేరళలో నకిలీ వీసాలతో అరెస్టయిన జిల్లా మహిళలున్నారన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ జిల్లా మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిసింది. వీరిలో ఒకరు బెయిల్‌పై వచ్చారు. మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించాం. – సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్పీ -
ఒమెన్‌లో చిక్కుకున్న సిక్కోలు యువకులు.. మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో
వజ్రపుకొత్తూరు రూరల్/కంచిలి/సంతబొమ్మాళి: దేశం కాని దేశంలో సిక్కోలు యువకులు దీనస్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లాలో సంతబొమ్మాళి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన 8 మంది యువకులు ఒమెన్ దేశంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఇక్కడి వారితో సంప్రదించి తమ బాధలు చెప్పుకున్నారు. వీరు ఈ ఏడాది మేలో విశాఖపట్నంలోని కార్తికేయ కన్సల్టెంట్ కంపెనీ ద్వారా ఒమెన్ దేశం వెళ్లారు. రెండేళ్ల పాటు వెల్డింగ్ పనులు ఉంటాయని చెప్పారని, మంచి జీతాలు వస్తాయని నమ్మించడంతో ఒక్కొక్కరం రూ. 90 వేలు నుంచి రూ.లక్ష వరకు చెల్లించామని తెలిపారు. తీరా చూస్తే దళారులు చెప్పిన కంపెనీ ఆ దేశంలోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఒంటెలకు కాపలా కాస్తూ రోజులు గడుపుతున్నామని, మూడు నెలలుగా ఉపాధి లేక కడుపు నిండా తినేందుకు తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ వద్ద ఉన్న పాస్‌పోర్డు, వీసాలు నకిలీవని పోలీసులు తీసుకెళ్లారని, భారత రాయబారి కార్యాలయానికి సంప్రదించేందుకు అవకాశం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. ఒమెన్‌లో చిక్కుకున్న వారిలో వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన తామాడ కృష్ణారావు(తోటపల్లి), కీలు మాణిక్యరావు(తేరపల్లి), కర్ని లోకనాథం (గోపీనాథపురం), కంచిలి మండలానికి చెందిన పి.రవికుమార్ (పెద్దపాలేరు), గున్నా గోపాల్(పెద్దపాలేరు), సోంపేట మండలానికి చెందిన సీల వాసుదేవరావు (బి.రామచంద్రపురం), సంతబొమ్మాళి మండలానికి చెందిన కల్గి నాయుడు (గోవిందపురం), మందస మండలానికి చెందిన తలగాన నీలకంఠం (బాలాజీపురం)లు ఉన్నారు. -
రిలీజ్‌కు ఒక్క రోజు ముందు భారీ షాక్.. అక్కడ ‘సీతారామం’ బ్యాన్!
విడుదలకు ఒక్క రోజు ముందు ‘సీతారామం’చిత్రానికి భారీ షాక్ తగిలింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. (చదవండి: సీతారామం’ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్.. టార్గెట్ సాధ్యమేనా?) ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర యూనిట్‌కి సెన్సార్ భారీ షాకిచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మతపరమైన సన్నివేశాలు ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ బోర్డ్ ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ మరోసారి సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్లనుందట. మరి సెన్సార్ బోర్డ్ నిజంగానే గల్ఫ్ దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేస్తారా? లేదా అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రిలీజ్‌కు అనుమతి ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా ప్రభాస్ రావడంతో టాలీవుడ్లో ‘సీతారామం’పై భారీ అంచనాలు ఉన్నాయి. -
భారత్‌కు వచ్చే విదేశీ కరెన్సీ తగ్గింది,ఎందుకంటే!
ముంబై: కోవిడ్–19పరమైన కారణాల నేపథ్యంలో భారత్‌కు వచ్చే రెమిటెన్సుల్లో గల్ఫ్ దేశాల వాటా గణనీయంగా తగ్గింది. 2016–17తో పోలిస్తే 2020–21లో 50 శాతం పైగా క్షీణించి, 30 శాతానికి పరిమితమైంది. అదే సమయంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్ల వాటా 36 శాతానికి చేరింది. రెమిటెన్సుల ధోరణులపై కోవిడ్ ప్రభావాల మీద నిర్వహించిన అయిదో విడత సర్వే ఫలితాలను ఉటంకిస్తూ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఒక ఆర్టికల్‌లో ఈ విషయాలు వెల్లడించింది. ఆర్బీఐలోని ఆర్థిక, పాలసీ పరిశోధన విభాగం అధికారులు దీన్ని రూపొందించారు. ఈ ఆర్టికల్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయా రచయితలవే తప్ప రిజర్వ్ బ్యాంక్ ఉద్దేశాలను ఇవి ప్రతిఫలించవని ఆర్బీఐ పేర్కొంది. వలసలు మందగించడం, ఎక్కువ మంది ప్రవాస భారతీయులు ఉపాధి పొందుతున్న అసంఘటిత రంగాలపై కోవిడ్ ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉండటం తదితర అంశాలు గల్ఫ్ దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గడానికి కారణం కావచ్చని ఆర్టికల్ అభిప్రాయపడింది. 2020–21లో వచ్చిన రెమిటెన్సుల్లో తక్కువ మొత్తాలతో కూడిన లావాదేవీల వాటా పెరిగినట్లు పేర్కొంది. అత్యధికంగా భారత్‌కు రెమిటెన్సులు వస్తున్న దేశాల జాబితాలో 23 శాతం వాటాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని అధిగమించి అమెరికా అగ్రస్థానంలో నిల్చింది. -
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం..
భవిష్యత్తుపై గంపెడాశలతో గల్ఫ్ బాట పడుతున్న వలస కార్మికులకు నీడలా కష్టాలు వెంటాడుతున్నాయి. అవగాహాన లేమి, ట్రావెల్ ఏంజెట్ల మోసాలు, పనికి పిలిపించుకున్న యజమానుల కక్కుర్తి.. వెరసి వలస కార్మికుల జీవితాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడేస్తున్నాయి. తాజాగా పాతబస్తీకి చెందిన ముగ్గురు మహిలా కార్మికులు పరాయి దేశంలో చిక్కుకుని... యజమానులు చూపించే నరకం నుంచి బయట పడేయాలంటూ మొరపెట్టుకున్నారు. - సౌదీ అరేబియాలో బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఉందంటూ భర్త చెప్పిన మాటలు విని మెహరున్నీసా విమానం ఎక్కింది. నెలకు రూ.35,000ల వరకు వేతనం వస్తుందని చెప్పడంతో సౌదీకి రెడీ అయ్యింది. రియాద్‌కి చేరుకునే సమయానికి తీవ్ర అనారోగ్యం పాలైంది. అక్కడ సరైన ఆశ్రయం, తిండి లభించకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. తనను వదిలేస్తే ఇండియాకి తిరిగి వెళ్తానంటూ చెబితే రూ.2 లక్షలు కడితే కానీ వదిలిపెట్టమంటూ యజమాని హుకుం జారీ చేశారు. దీంతో తనను కాపాడాలంటూ ఆమె వీడియో సందేశాన్ని పంపింది. - రిజ్వానా బేగం అనే మహిళ నెలకు రూ.25 వేల వేతనం మీద మెయిడ్‌గా పని చేసేందుకు గల్ఫ్‌కి వెళ్లింది. కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం, సరైన వసతి కల్పించకుండా నిత్యం నరకం చూపిస్తున్నారు యజమానులు. ఇదేంటని ట్రావెల్ ఏజెన్సీని ప్రశ్నిస్తే.. ఇండియాకు తిరిగి వెళ్లాంటే రూ.2.50 లక్షలు చెల్లించాలు చెప్పారు. దీంతో సాయం అర్థిస్తూ ఆమె ఇండియన్ ఎంబసీ అధికారులకు లేఖ రాసింది. - హసీనా బేగం వలస కార్మికురాలిగా కువైట్‌కి చేరుకుంది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వెన్నుపూసలో సమస్య తలెత్తింది. దీంతో అక్కడ ఉండలేనంటూ తనను ఇండియాకు తీసుకురావాలంటూ కుటుంబ సభ్యుల ద్వారా మొరపెట్టుకుంది. విదేశాల్లో వలస కార్మికులు పడుతున్న కష్టాలపై కేంద్రం స్పందించింది. ఆయా దేశాలకు చెందిన ఎంబసీ అధికారుకుల సమస్యలను వివరించింది. వారికి ఇబ్బంది రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అవసరం అయితే వారిని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయాలంది. చదవండి: వలస కార్మికుల మెడపై దేశ బహిష్కరణ కత్తి -
విమర్శలు-సమన్లు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు త్రీవస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తుండగా.. ఐవోసీ ఘాటు వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జెడ్డా వేదికగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (IOC) ‘‘భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు తేటతెల్లం అయ్యాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దరిమిలా భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, సంకుచిత భావంతో కూడుకుని ఉన్నాయంటూ వ్యాఖ్యానించారాయన. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. ఐవోసీలో ఇస్లాం ఆధిపత్య దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయన్నది తెలిసిందే. తమది ఇస్లాం ప్రపంచ సంయుక్త గొంతుక అని ప్రకటించుకుంటుంది ఆ వేదిక. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఐవోసీ జోక్యం చేసుకోవడం, ఆ జోక్యాన్ని భారత్ ఖండిస్తూ వస్తుండడం జరుగుతోంది. తాజాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఐవోసీకి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. దూషణపూరితమైన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసినవని, అది భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు బాగ్చీ. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్‌లపై తొలగింపు వేటు కూడా పడిందన్న విషయాన్ని బాగ్చీ గుర్తు చేస్తున్నారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. టీవీ డిబెట్లో బీజేపీ మాజీ ప్రతినిధులు మహమద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ శర్మ కామెంట్లు అవమానకరరీతిలో ఉన్నాయని, అన్ని మతాలను.. విశ్వాసాలను గౌరవించాలని అంటున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాగం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది. మరోవైపు దోహాలోని భారత దౌత్యవేత్తకు అక్కడి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తక్షణ ఖండన, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఖతర్. ఇక కువైట్ కూడా ఖతర్లాగే భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాక్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. దేశంలో వరుసగా జరుగుతున్న మత విద్వేష ఘర్షణలు, జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహమద్ ప్రవక్తను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేసి.. అది విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేసేశారు. ఈ పరిణామాల తర్వాత కాన్పూర్(యూపీ) శుక్రవారం ప్రార్థనల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు. నుపూర్, నవీన్ చేష్టల వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తగా.. బీజేపీ సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. సౌదీ అరేబియా, బహ్రైన్‌తో పాటు మరికొన్ని దేశాలు సైతం భారత ఉత్పత్తులను సూపర్మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. చదవండి: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం జరిపే ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఈ సందర్భాన్ని 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) గా నిర్వహిస్తున్నారు. చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఏర్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుండి తెలంగాణకు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2022 వరకు దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. బతుకుదెరువు కోసం ఎడారి బాట పట్టిన 15 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల కన్నీటి గాథ ఇది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందో అని ప్రవాసీ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమిని వదిలి వలస వెళ్లిన అభాగ్యులు గల్ఫ్ దేశాలలో అసువులు బాస్తున్నారు. శవపేటికల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. కొందరిని అక్కడే ఖననం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల ఆసుపత్రుల మార్చురీలలో వందలాది భారతీయుల మృతదేహాలు మగ్గుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు.. స్వరాష్ట్రంలో మొండి చేయి ఆమ్నెస్టీ కారణంగా 2007 లో యూఏఈ దేశం నుండి వాపస్ వచ్చి అప్పుల బాధతో ఉత్తర తెలంగాణ కు చెందిన 29 మంది గల్ఫ్ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ 9 మే 2008 నాడు జీఓ (నెం. 266) ను జారీ చేసింది. ఆ తర్వాతి కాలంలో గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన పేద కార్మికులకు కూడా ఆర్ధిక సహాయం చేయడం ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట ప్రభుత్వం, ఆనాటి కరీంనగర్ జిల్లాలోని 34 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ జీఓ నెం.1840 ను 24 ఏప్రిల్ 2013 న జారీ చేసింది. గవర్నర్ పాలనలో ఆరు పాత జీఓ లను రీ-వాలిడేట్ చేసి జారీ చేసిన జీఓ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వేలాదిమంది గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. అప్పటి ప్రభుత్వం 100 మందికి లోపే ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. గుండెపోటు మరణాలు అధికం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్నారైలు ఎక్కువగా హృదయ సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తున్నారు. పగలు ఎండలో.. రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు ఆకస్మిక మరణాలకు కారణాలని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. గల్ఫ్ ఆత్మహత్యలు గల్ఫ్ దేశాల్లో భారతీయుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరిఅయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, ప్రియమైన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిస అవడము లాంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కోవిడ్ కు పూర్వం విదేశాలలో మరణాలు 2014 నుండి 2019 వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 33,930 మంది ప్రవాస భారతీయులు మృతి చెందారని ప్రభుత్వం 20 నవంబర్ 2019 న లోక్ సభకు తెలిపింది. ఆరేళ్లలో సౌదీ అరేబియా (15,022), యుఏఈ (9,473), కువైట్ (3,580), ఓమాన్ (3,009), ఖతార్ (1,611), బహరేన్ (1,235) మంది ఎన్నారైలు చనిపోయారు. ఆరు గల్ఫ్ దేశాలలో 89 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా ఇందులో సగటున రోజుకు పదిహేను మంది ఎన్నారైలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉండగా 2015 నుండి 2019 వరకు అయిదు సంవత్సరాల కాలంలో 125 దేశాలలో మృతి చెందిన 21,930 మంది మృతదేహాల శవపేటికలను భారత్ కు తెప్పించామని ప్రభుత్వం 5 ఫిబ్రవరి 2020 న లోక్ సభకు తెలిపింది. వీటిలో అత్యధికం గల్ఫ్ దేశాలలో సంభవించాయి. కోవిడ్ వలన మరణాలు విదేశాలలో కోవిడ్ వలన 4,048 మంది ఎన్నారైలు మృతి చెందారని ప్రభుత్వం 3 డిసెంబర్ 2021 న లోక్ సభ కు తెలిపింది. సౌదీ అరేబియా (1,154), యుఏఈ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109) ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 3,576 మంది కోవిడ్ తో చనిపోయారు. అన్ని దేశాల మొత్తం మరణాలలో పోలిస్తే గల్ఫ్ లోనే 88 శాతం మంది కోవిడ్ తో మృతి చెందారు. ప్రమాదాల్లో విదేశాలలో ప్రమాదాల్లో మరణించిన భారతీయుల వివరాలను 3 డిసెంబర్ 2021 న ప్రభుత్వం లోక్ సభ లో వెల్లడించింది. గత మూడేళ్లలో 63 దేశాలలో 2,384 మంది ఎన్నారైలు ప్రమాదాలలో మృతి చెందారు. సౌదీ అరేబియా (683), యుఏఈ (370), కువైట్ (195), ఓమాన్ (94), ఖతార్ (60), బహరేన్ (44) ఆరు గల్ఫ్ దేశాలలో 1,446 మంది ప్రమాదాలలో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారతీయుల ప్రమాద మరణాలలో గల్ఫ్ లోనే 61 శాతం సంభవించాయి. ఇదిలా ఉండగా గత మూడేళ్లలో నేపాల్ (227), ఫిలిప్పీన్స్ (153), మలేసియా (76), సింగపూర్ (55) మంది ప్రమాదాల్లో మృతి చెందారు. విదేశాల్లో 468 ప్రమాద పరిహార కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కువైట్ (142), ఓమాన్ (127), సౌదీ అరేబియా (85), ఖతార్ (41), యుఏఈ (24) కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎడారిలో ఎండమావులు... కేసీఆర్ గల్ఫ్ హామీలు 14 ఏళ్ళ క్రితం... 2008 లో పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ ప్రసంగం యధాతదంగా (వీడియో ట్రాన్స్క్రిప్ట్): తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేలకోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు వెంటనే ప్రభుత్వం 500 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి, విడుదల చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ఎన్నారైల పిల్లలను స్థానికులుగా పరిగణించి, కేరళ ప్రభుత్వం ఏవిధంగా సాయం అందిస్తుందో అదే విధంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో చనిపోయిన , ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ఆదుకోవడంతో పాటు స్వదేశం రావడానికి, గల్ఫ్ లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. మానవ వనరుల ఎగుమతి.. ఇంధనాల దిగుమతి భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కార్మికులను (మానవ వనరులను) ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నది. ఇది మనుషులను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే పక్కా ఎగుమతి, దిగుమతి వ్యాపారం. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలు మనం వెలకట్టగలమా ? ఈ దేశం కోసం డ్యూటీలో భాగాంగా ఎడారిలో దిక్కులేని వారిగా చనిపోయిన మన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను "గల్ఫ్ అమరులు" అని పిలుచుకుందాం అని ప్రవాసీ సంఘాలు అంటున్నాయి. దేశ సరిహద్దులు దాటి అరబ్ గల్ఫ్ దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న భారత సైనికుల మాదిరిగా వలస కార్మికులు కూడా దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు 95% ఒంటరిగానే వెళుతున్నారు. తక్కువ వేతనం వలన కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళలేరు. 15 లక్షల మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వీరు ప్రతి నెలా రూ. 1,500 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కు పంపిస్తున్నారు. ఈ విదేశీ మారకద్రవ్యంతో (ఫారిన్ ఎక్స్చేంజి) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ (పెట్రోల్, డీజిల్) ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రవాసీ కుటుంబాలు ప్రతి నెల పొందుతున్న 1,500 కోట్ల రూపాయల సొమ్ము వినిమయంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నులు వసూలయినా నెలకు 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి జమ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతున్నది. ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏమైంది ? 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయింది. కేరళ, పంజాబ్ తరహా విధానాలను అవలంభిస్తామని తరుచూ చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేక ప్రవాసి మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు. ఇప్పటికీ సాధారణ పరిపాలన శాఖ (జిఏడి) లో ఎన్నారై సెల్ అని ఒక విభాగం మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ఏర్పాటు చేయాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. - మంద భీంరెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు) +91 98494 22622, mbreddy.hyd@gmail.com] చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్ -
ఈ అమరుల కుటుంబాలను ఆదుకోండి..
చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ ప్రవాసి కార్మిక సంఘాలు ప్రతి ఏటా ఏప్రిల్ 28న 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం... ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. ఈ స్మారక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ వలస కార్మికుల వెతలను బయటకి తేవడంతో పాటు వారికి చట్టపరమైన సహాయం అందేలా అనేక సంస్థలు రెండు రాష్ట్రాల్లో కృషి చేస్తున్నాయి. పదేళ్ల క్రితం... జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పాతగూడూరు కు చెందిన దుర్గం భీమయ్య అనే వలస కార్మికుడు ఓమాన్ దేశంలోని మస్కట్ లో నివసించేవాడు. ఓమాన్లో అక్రమ నివాసి (ఖల్లివెల్లి)గా ఉండటంతో ప్రతి దినం జరిమానాలు, జైలు శిక్షల భయంతో జీవించేవాడు. దీంతో ఏ భయాలు లేకుండా బతికేందుకు తిరిగి ఇండియా రావాలనుకున్నాడు. ఈ క్రమంలో ఇండియాకు చేరుకోవడానికి పక్క దేశమైన యూఏఈ (దుబాయి) ద్వారా వెళ్లిపోవడం సులభ మార్గమని ఎవరో చెప్పిన మాటను నమ్మాడు. అదే క్రమంలో కాలి నడకన మరికొందరితో కలిసి ఓమాన్ నుండి యుఏఈకి ఎడారిలో సరిహద్దు వెంబడి నడక ప్రారంభించారు. ఇంతలో 2 మే 2012 న ఓమాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించాడు. అతి కష్టం మీద శవపేటిక ఇండియాకు వచ్చింది. 1976 నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1976 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎంత మంది వెళ్లారు? ఎక్కడ పని చేస్తున్నారు ? ఎవరెలా ఉన్నారనే గణాంకాలు పట్టించుకున్న వారు లేరు. స్వతంత్ర భారత దేశంలోనూ ఇంచుమించు ఇదే ధోరణి కొనసాగింది. కానీ 90వ దశకం తర్వాత తీసిన లెక్కల్లో దుర్గం భీమయ్య కంటే ముందే గల్ఫ్ దేశాల్లో అసువులు బాసిన వలస కార్మికుల సంఖ్య 1500లకు పై మాటగానే ఉంది. ఈ తరుణంలో భీమయ్య బాధకర మరణంతో ఒక్కసారిగా గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు, వార కుటుంబాలు పడుతున్న బాధలు తెర మీదకు వచ్చాయి. దీంతో వలస కార్మికుల హక్కులు, రక్షణ కోసం పని చేయడంలో అనేక సంస్థలు శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి. సాయం అందిన తర్వాత మృతుడు దుర్గం భీమయ్య భార్య స్వప్న తన కుమారుడు శ్రవణ్, కూతురు శ్వేత వైష్ణవి లను కష్టపడి పెంచింది. ఎస్సీ కార్పొరేషన్ సహాయంతో బ్యాంక్ లోన్ తో బర్రెలను కొని పాల ఉత్పత్తి చేపట్టింది. సకాలంలో అప్పు తీర్చేసి బ్యాంకు అధికారుల మన్ననలను పొందింది. కొందరు దాతల చిరు సహాయం పిల్లల చదువుకు ఉపయోగపడింది. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీగా పని చేస్తున్నది. రోజువారీ వ్యవసాయ కూలీ, భవన నిర్మాణ కూలీగా కూడా పనిచేస్తున్నది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో 10వ తరగతి పాస్ అయిన కూతురు శ్వేత వైష్ణవికి బాల్య వివాహం చేసింది. కూతురుకు కూతురు పుట్టింది. పెళ్లి అయి కూతురు పుట్టినప్పటికీ శ్వేత వైష్ణవి ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కుమారుడు శ్రవణ్ ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి, ఇప్పుడు బీకాం ఫస్టియర్ చదువుతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. కాలగర్భంలో బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎందరో అమరులయ్యారు. కొందరి జీవితాల్లు కష్టాలు బయటకి రాగా మరెందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ భీమయ్య ఘటన తర్వాత గల్ఫ్ కార్మికుల జీవితాలు, వాటి కుటుంబ సభ్యుల బాధలపై పట్టింపు పెరిగింది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో భీమయ్య చనిపోయినా.. అతనికి కుటుంబానికి దక్కిన చిరు సాయం (ఎస్సీ కార్పోరేషన్ రుణం)తో ఆ కుటుంబం తిరిగి నిలదొక్కుకోగలిగింది. కానీ ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఇటు ప్రభుత్వాల నుంచి అటు సమాజం నుంచి ఎటువంటి సాయం అందక చితికి పోతున్నాయి. చేయూతనివ్వండి ఈ నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుదెరువు వేటలో అమరులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సాయం కోసం రెండు రాష్ట్రాల్లో సుమారు ఆరు వేల మంది గల్ఫ్ దేశాల్లో అమరులయ్యారు. వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. - మంద భీంరెడ్డి (గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు) +91 98494 22622 చదవండి: What Is ECR And ECNR: ఈసీఆర్, ఈసీఎన్నార్ పాస్‌పోర్టులు ఎందుకో తెలుసా ? -
అమెరికా అడిగినా పట్టించుకోలేదు! పుతిన్ అడగ్గానే..
ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా మాటల్ని, అధ్యక్షుడు బైడెన్ హెచ్చరికల్ని మొదటి నుంచి పెడచెవిన పెడుతున్న సౌదీ అరేబియా.. ఇప్పుడు మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా ఆయిల్ మార్కెట్ వ్యవహారాలపై చర్చలు నడిపింది. ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో.. ప్రపంచ ఆయిల్ మార్కెట్‌ను స్థిరపరిచేందుకు ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఓపెక్ప్లస్ ఉత్పత్తి గ్రూపుతో సమన్వయం కొనసాగించనున్నట్లు క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యలు మొదలయ్యాక.. పుతిన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేరుగా ఫోన్లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. అంతకు ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో.. సౌదీ అరేబియా , ఇతర ప్రధాన పర్షియన్ గల్ఫ్ దేశాలను చమురు ఉత్పత్తులు పెంచాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును అవి ప్రతిఘటించాయి.ఇందుకు అమెరికా, రష్యాపై విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమే!. అయితే పుతిన్‌తో శనివారం, చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌తో శుక్రవారం వరుస చర్చలు జరిపిన సౌదీ క్రౌన్ ప్రిన్స్.. ఆయిల్ మార్కెట్ నియంత్రణకు ప్రయత్నిస్తామన్న హామీ ఇవ్వడం విశేషం. చమురు ధరల నియంత్రణతో పాటు అమెరికాకు చిర్రెత్తిపోయేలా ద్వైపాక్షిక ఒప్పందాలకు గురించి కూడా.. సౌదీ-రష్యాల మధ్య చర్చలు జరిగినట్లు సౌదీ అధికారిక వర్గాలే ఒక ప్రకటనలో ప్రస్తావించడం గమనార్హం. -
బతుకునిచ్చే చెట్టుపైనే ఊపిరి పోయె..
సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్): కుటుంబాన్ని పోషించేందుకు 20 ఏళ్లు గల్ఫ్ బాట పట్టిన ఇంటి పెద్ద.. ఇకపై కళ్లముందే ఉంటూ, తమను కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించిన భార్యాబిడ్డల ఆశలు గల్లంతయ్యాయి. కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు అదే చెట్టుపై మరణించడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషా దం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గౌడ్ (59) బతుకుతెరువుకు 20 ఏళ్లుగా గల్ఫ్‌లో ఉన్నాడు. ఆరు నెలల క్రితమే గ్రామానికి వచ్చి కులవృత్తి చేసుకుంటూ ఉండిపోదామని నిర్ణయించుకున్నాడు. గౌడ సంఘంలో అతనికి 13 తాటి, 6 ఈత చెట్లను కేటాయించగా.. రెండు నెలలుగా కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు దిగుతుండగా మోకు జారి చెట్టుపైనే వెనక్కి వంగిపోయాడు. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. మోకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు, గ్రామస్తులు జేసీబీ సా యంతో మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దింపారు. మృతునికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు రజిత, నవ్య, కావ్య, స్వాతి, కొడుకు సాయి ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిగాయి. మూడో కూతురు హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కవల పిల్లలైన స్వాతి, సాయి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: ఆ ఇమ్యూనిటీతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది -
గల్ఫ్ గోడు వినిపించేందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా గల్ఫ్ వలస కార్మిక సంఘాలు అడుగులు వేస్తున్నాయి. తమ డిమాండ్లు సాధించుకోవాలంటే తమకంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ అవసరమని ఆయా సంఘాలు అంటున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నవారు సుమారు 15 లక్షల మంది ఉంటారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు, గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చి స్థానికంగానే ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకుంటే గల్ఫ్‌తో ముడిపడి ఉన్నవారి సంఖ్య కోటి ఉంటుందని అంచనా. వీరు రాష్ట్రంలోని 30 శాసనసభ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువమంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం వారి సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్న రాజకీయ పార్టీలు.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వీరి సమస్యలేమిటి? ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది కార్మికులు రాష్ట్రం నుంచి వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నా.. వారి సంక్షేమాన్ని పట్టించుకునే ఓ ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఉపాధిపై ఆశతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు వెళుతున్నవారు పలు సందర్భాల్లో వీసా మోసాలకు గురవుతుండటంతో పాటు, అక్కడ ఆశించిన విధంగా లేక అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాల తరఫున ఎలాంటి సాయం అందడం లేదు. కార్మికులు చనిపోతే ప్రభుత్వాలు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు. మృతదేహాలు స్వదేశం చేరుకోవడం కష్టమవుతోంది. కొన్నిసార్లు అక్కడే అంత్యక్రియలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని, ఎన్ఆర్ఐ పాలసీ లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి వినిపిస్తోంది. భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తున్నా.. విదేశాలకు వలస వెళ్లిన వారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. కేవలం గల్ఫ్ వలస కార్మికుల ద్వారానే ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేరుతోంది. అందువల్ల గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత నిధులను కేటాయించాలనే డిమాండ్ ఉంది. అయితే ఏ బడ్జెట్లోనూ నిధులు కేటాయించిన సందర్భాలు లేవు. దీంతో ఎన్నో ఏళ్లుగా విసిగి వేసారిపోయిన గల్ఫ్ వలస కార్మికులందరినీ ఒక్క తాటిపై తీసుకురావడానికి కార్మిక సంఘాలు రాజకీయాల బాట పడుతున్నాయి. తమ లక్ష్యాలను చేరుకోవాలంటే తాము సభ్యులుగా ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం తప్పనిసరి అని ముక్త కంఠంతో చెబుతున్నాయి. హుజూరాబాద్‌తో షురూ హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటడానికి గల్ఫ్ వలస కార్మికుల సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోషియేషన్ల అధ్యక్షులు స్వదేశ్ పరికి పండ్ల, నంగి దేవేందర్‌రెడ్డిల నాయకత్వంలో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కార్మికులను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మొదటగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. దశల వారీగా గల్ఫ్ వలస కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దళిత బంధు మాదిరిగానే గల్ఫ్ బంధు ను అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ముందుకు సాగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు గల్ఫ్ వలస కార్మికుల కోసం రాజకీయ పార్టీని స్థాపించడం వల్ల మంచే జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం గల్ఫ్ కార్మికులకు హామీల ఎర వేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడం లేదు. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు రాజకీయ పార్టీ ద్వారానే గుర్తింపు గల్ఫ్ కార్మికులు ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్నా రు. ఇప్పుడు వారి సమస్యలే ఎజెండాగా రాజకీయ పార్టీ స్థాపించడమనే ఆలోచన ఆహ్వానించదగ్గ పరిణామం. గల్ఫ్ కార్మికులకు గుర్తింపు లభించాలంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. – నంగి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మా సత్తా ఏమిటో చూపిస్తాం గల్ఫ్ కార్మికుల సత్తా ఏమిటో ప్రభుత్వాలకు తెలియజేయడానికే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం. కార్మికుల కుటుంబాలను ఏకం చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం. మా సత్తాను చాటి చెబుతాం. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్ -
‘గల్ఫ్‌బంధు’తో ఆదుకోండి
మోర్తాడ్ (బాల్కొండ): దళితులు ఆర్థికంగా వృద్ధి చెందడానికి అమలు చేస్తున్న దళితబంధు పథకం తరహాలోనే గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్‌బంధు పథకాన్ని అమలు చేయాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ వలస కార్మికులకు అన్ని రకాలుగా ప్రయోజనాలను కల్పించడానికి ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆచరణలో అది కార్యరూపం దాల్చలేదు. మరో పక్క గల్ఫ్‌దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అండగా ఉండటానికి గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ హామీ 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా గల్ఫ్ కార్మికుల ఆంశం చర్చకు వచ్చింది. గల్ఫ్ వలస కార్మికుల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఆర్థికంగా లాభం జరుగుతోందని, అందువల్ల వారి శ్రేయస్సు కోసం ఒక మంచి పథకాన్ని అమలులోకి తీసుకువస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు గల్ఫ్ కార్మికుల కోసం ఎలాంటి పథకం అమలులోకి రాలేదు. ఈ నేపథ్యంలో దళితుల అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్న విధంగానే గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గల్ఫ్‌బంధు అమలు చేయాలని కార్మికుల నుంచి, వారికి అండగా ఉంటున్న సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్‌బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కనీసం గల్ఫ్‌బంధు పథకం అమలు చేస్తే తెలంగాణ జిల్లాల్లో ఉన్న సుమారు 13 లక్షల గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా అండ దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేయూతనివ్వాలి – ఎస్వీరెడ్డి, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గల్ఫ్ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్‌బంధు అమలు చేయాలి. గల్ఫ్ కార్మికులలో కొందరే ఆర్థికంగా స్థిరపడ్డారు. మెజార్టీ కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. గల్ఫ్ కార్మికులకు చేయూతనివ్వడం ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవాలి – నంగి దేవేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు, గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధి గల్ఫ్ కార్మికులకు ప్రయోజనం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నోమార్లు హామీ ఇచ్చింది. ఆ హామీలను నిలబెట్టుకోవడానికి దళితబంధు తరహాలో గల్ఫ్‌బంధు లేదా మరేదైనా పథకం అమలు చేయాల్సిందే. -
వలస కార్మికులను ముంచిన గల్ఫ్ కంపెనీలు
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ వలస కార్మికుల శ్రమను గల్ఫ్ కంపెనీలు దోచుకున్నాయి. కరోనా సాకు చూపి రెండు, మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టాయి. అంతేకాదు కంపెనీల మాటలు నమ్మి స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలు రద్దు చేశాయి. కార్మికులకు మొత్తంగా రూ.200 కోట్లకు పైగా వేతనాలు కంపెనీలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. తిరిగొచ్చాక ఇస్తామని చెప్పి.. కరోనా ప్రభావంతో పనులు సరిగా సాగడం లేదని, కొన్ని నెలల పాటు సెలవులపై ఇంటికి వెళ్లాలని సౌదీ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు కార్మికులకు సూచించాయి. అప్పటికే రెండు మూడు నెలల వేతనాలు బకాయి పడిన కంపెనీలు.. గల్ఫ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వేతనాలు చెల్లిస్తామని నమ్మ బలికాయి. ఈ క్రమంలో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి వచ్చారు. పరిస్థితి చక్కబడితే తిరిగి గల్ఫ్‌కు వెళదామని ఎదురుచూస్తున్న కార్మికులకు అనేక కంపెనీలు షాకిచ్చాయి. కార్మికులకు తెలియకుండానే వారి వీసాలను రద్దు చేశాయి. కరోనా పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 50 వేల మంది కార్మికులకు వారి కంపెనీలు వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతన బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. కాగా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేశాయి. గల్ఫ్ కార్మికులకే ఎక్కువ నష్టం.. వలస కార్మికుల వేతన దోపిడీపై కేరళలో రెండ్రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కరోనా కాలంలో ఎంతో మంది భారతీయులు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. వీరిలో గల్ఫ్ వలస కార్మికులే ఎక్కువగా వేతనాలను నష్టపోయారని, ఒక్క తెలంగాణకు చెందిన కార్మికులే సుమారు రూ.200 కోట్లు కోల్పోయారని నిర్మల్‌కు చెందిన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఈ సదస్సులో వెల్లడించారు. పొరుగు దేశాల్లో వలస కార్మికులకు సహకారం కరోనా నేపథ్యంలో ఇంటి బాట పట్టిన వలస కార్మికులు ఎంత మేరకు నష్టపోయారు? వారికి అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమా? అనే అంశంపై పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ దృష్టి సారించాయి. వేతనాలు నష్టపోయిన తమ దేశానికి చెందిన వలస కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి ఆయా చర్యలు తీసుకున్నాయని తెలిసింది. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి వలస కార్మికులకు జరిగిన భారీ నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల ద్వారా న్యాయం జరిగేలా చూడాలి. దీని వల్ల వలస కార్మికులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఆదాయం లభిస్తుంది. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మానవత్వంతో వ్యవహరించాలి వలస కార్మికులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారి విషయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలి. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు -
వేతన పోరులో గెలిచిన గల్ఫ్ కార్మికులు
భారత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్) తగ్గిస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పై బుధవారం (28.07.2021) తుది విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిల ధర్మాసనం జరిపిన విచారణకు పిటిషనర్ తరఫున న్యాయవాది బి. రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు కొత్తగా ఉద్యోగానికి వెళ్లేవారితో సహా ప్రస్తుతం గల్ఫ్ లో పనిచేస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే సర్కులర్లను రద్దు చేయాలని న్యాయవాది రచనారెడ్డి తన వాదనలు వినిపించారు. వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్కులర్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదించారు. వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ 2020 లో జారీ చేసిన సర్కులర్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకున్నదని, పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయించిందని ఈమేరకు ఈనెల 15న ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వర్ రావు హైకోర్టుకు నివేదించారు. సమస్య పరిష్కారం అయినందున భీంరెడ్డి దాఖలు చేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
అదృష్టం అవకాశం ఇస్తే.. మొహమాటంతో 45 ఏళ్లు ఒంటరిగా
తిరువనంతపురం: 1976లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు భావించిన ఓ వ్యక్తి.. 45 ఏళ్ల తర్వాత.. తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ప్రమాదం జరిగిన రోజు అతడు విమానంలో లేడు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్న సదరు వ్యక్తి.. ఇంటికి వెళ్లడానికి.. బతికి ఉన్నానని చెప్పడానికి సిగ్గుపడి.. ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని రెండేళ్ల క్రితం పాత మిత్రుడు ఒకరు గుర్తించి స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమంలో చేర్చాడు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అదృష్టం కొద్ది మృత్యువు నుంచి తప్పించుకున్నప్పటికి.. మోహమాటంతో దాదాపు 45 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా.. ఒంటరిగా మిగిలిన ఆ వ్యక్తి వివరాలు.. కేరళ, కొట్టాయంకు చెందిన సాజిద్ థుంగల్ తన 22వ ఏట అనగా 1974లో జీవనోపాధి కోసం నలుగురు అక్కలు, ముగ్గురు సోదరులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి గల్ఫ్ వెళ్లాడు. అక్కడ మలయాళ సినిమాలు ప్రదర్శిస్తూ.. భారత్ నుంచి సింగర్లు, డ్యాన్సర్లును పిలిపించి సాంస్కృతిక కార్యక్రమాలు ననిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో 1976లో సాజిద్ 10 రోజుల పాటు భారత్ నుంచి వచ్చిన ప్రదర్శనకారుల బృందంతో కలిసి ఉన్నాడు. ఈ క్రమంలో ఇండియా నుంచి వచ్చిన బృందం, సిబ్బందితో కలిసి మొత్తం 95 మంది ప్రయాణీకులున్న విమానం అక్టోబర్ 12, 1976న ప్రమాదానికి గురైంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ 171 విమానం చెన్నైకి (అప్పటి మద్రాస్) ప్రయాణిస్తుండగా.. ఇంజన్లో మంటలు చేలరేగడంతో.. బొంబాయి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విమానం కూలిపోయిందని తెలిసింది. ఇదే ప్రమాదంలో ప్రముఖ మళయాళ నటి రాణి చంద్రా కూడా ప్రాణాలు కోల్పోయారు. సాజిద్ కూడా ఇదే ప్రమాదంలో మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు భావించారు. కాకపోతే ఆ రోజు అదృష్టం కొద్ది సాజిద్ ఆ విమానం ఎక్కలేదు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. బతికి ఉన్నప్పటికి సాజిద్.. తన కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారంతా తనను చనిపోయారని భావిస్తున్నారు.. ఇలాంటప్పుడు వారిని కలవాలంటే సాజిద్ సిగ్గు పడ్డాడు. దాంతో తన గురించి ఎవరికి చెప్పలేదు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత ముంబై వెళ్లి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. జీవనం సాగించాడు. 2019 లో అత్యంత దుర్బర స్థితిలో ఉన్న సాజిద్‌ను అతడి స్నేహితుడు గుర్తించాడు. అతను వెంటనే ముంబైలో పాస్టర్ కె.ఎమ్. ఫిలిప్ నడుపుతున్న ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ‘‘విమానం ప్రమాదంలో బృందం మరణించిన తరువాత సాజిద్ ‘‘నిరాశ, అపరాధం, మద్యపానం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి’’ పలు సమస్యలతో బాధపడుతున్నాడు’’ అని తెలిపాడు సాజిద్ స్నేహితుడు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్నప్పటికి సాజిద్ తన కుటుంబం గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు. కొన్ని వారాల క్రితం ఒక సీల్ సామాజిక కార్యకర్త కేరళను సందర్శించి, కొట్టాయంలోని ఒక స్థానిక మసీదులో సాజిద్ గురించి ఆరా తీయడంతో అతడి కుటుంబం గురించి తెలిసింది. మసీదు ఇమామ్ సాజిద్ కుటుంబానికి తెలుసు. అతడు సీల్ సామాజిక కార్యకర్తను సాజిద్ ఇంటికి తీసుకువెళ్ళాడు. 45 సంవత్సరాల తర్వాత సాజిద్ తన కుటుంబాన్ని మొదటిసారి చూడటానికి వీడియో కాల్ చేశారు. వారితో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లాలని నిర్ణియంచుకున్నాడు సాజిద్. "నేను ఇంటికి వెళ్ళాలి. ఇక్కడి ప్రజలు నన్ను చూసుకోకపోతే, నా కుటుంబంతో తిరిగి కలవకుండానే.. నేను చనిపోయేవాడిని” అన్నాడు సాజిద్. -
గల్ఫ్ వలస కార్మికులకు ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికుల కనీస వేతనం (మినిమమ్ రెఫరల్ వేజెస్) కుదింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకుంది. ఈ విషయంలో గల్ఫ్ దేశాలకు జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ వల్ల గల్ఫ్ వలస కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, వారి శ్రమకు తగ్గ వేతనం దక్కడం లేదని గల్ఫ్ జేఏసీ సభ్యులు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పాత వేతనాలనే భారత కార్మికులకు వర్తింప చేయాలని గల్ఫ్ దేశాలకు సూచించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ గురువారం రాజ్యసభలో స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కేంద్రం గతంలో జారీ చేసిన సర్క్యుల ర్ను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. వలస కార్మికులకు ఎప్పుడైనా వేతనాలు పెంచే విధంగానే విదేశీ వ్యవహారాల శాఖ గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలి. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు -
గల్ఫ్‌లో టీకా సర్టిఫికెట్ల తిప్పలు
ఇండియా నుంచి గల్ఫ్ కు వెళ్లే భారతీయులకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోవీషీల్డ్ టీకా తీసుకుంటే ఇబ్బంది లేదన్న ధైర్యంతో ఉన్న ప్రవాస భారతీయులకు ఊహించిన సమస్య ఎదురైంది. భారత ప్రభుత్వం కోవిన్ యాప్ ద్వారా జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ని కొన్ని గల్ఫ్ దేశాలకు చెందిన యాప్‌లు స్వీకరించడం లేదు. ఇబ్బందులు కోవిడ్ వ్యాక్సినేషన్‌కి సంబంధించి ప్రతీ దేశానికి వేర్వేరుగా యాప్‌లు ఉన్నాయి. మన ప్రభుత్వం కోవిన్ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేసింది. ఇండియాలో కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారు కొన్ని గల్ఫ్ దేశాల ఆరోగ్య శాఖ యాప్ లలో తమ ఆరోగ్య స్థితిని నమోదు చేసుకునే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి యాప్‌లు కోవిన్‌ను స్వీకరించడం లేదు. ఆర్థిక భారం గల్ఫ్ దేశాల యాప్‌లలో తలెత్తుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఢిల్లీలోని గల్ఫ్ దేశాల ఎంబసీలతో కోవిడ్ టీకా సర్టిఫికేట్ అటెస్ట్ చేసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.6,500 నుంచి రూ.8,000 ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా ‘తవక్కల్నా' యాప్‌లో ఆరోగ్య స్థితిని మోసపూరితంగా అప్డేట్ చేసినందుకు గాను అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, విదేశీ కార్మికులతో సహా 122 మంది ఇటీవల సౌదీలో అరెస్టు అయ్యారు. ఎంబసీలు చొరవ చూపితే భారతీయ టీకా డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్ పోర్టల్ ను గల్ఫ్ దేశాలు గుర్తించేలా మన ఎంబసీ అధికారులు కృషి చేయాలని గల్ఫ్‌లో ఉన్న భారతీయులు కోరుతున్నారు. కోవిన్ క్యూఆర్ స్కాన్ కోడ్ ఉపయోగించి టీకా సర్టిఫికెట్ ను నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Covaxin : కేంద్రం ప్రకటన.. గల్ఫ్ వెళ్లేవారికి భరోసా
హైదరాబాద్: కోవాగ్జిన్ తీసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న వారికి భరోసా కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కోవాగ్జిన్ టీకా కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జులై 20న రాజ్యసభలో తెలిపారు. తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కోవాగ్జిన్ గుర్తింపుపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. సందేహాలు ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలలో కోవిషీల్డ్ కే గుర్తింపు ఉంది. డబ్ల్యూహెచ్ఓ అనుమతి వస్తేనే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి గల్ఫ్ దేశాలు అనుమతించే అవకాశం ఉంది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న వారు తాము గల్ఫ్ దేశాలకు ఎప్పుడు వెళ్తామో ఏమో అనే సందేహాంలో ఉన్నారు. ఇప్పటికే నెలల తరబడి వర్క్‌కు దూరంగా ఉన్నామని,.. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులు పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కేంద్రం చేసిన ప్రకటన వారికి భరోసా కలిగించింది. ఇలాగైతే కష్టం కోవిడ్ ఫస్ట్‌వేవ్ ముగిసిన తర్వాత గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న చాలా మంది భారతీయులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు సెలవులపై ఇంటికి వచ్చారు. వీరిలో చాలా మంది డిసెంబరు నుంచి మార్చి మధ్యలో ఇండియాకు చేరుకున్నారు. అయితే ఆ తర్వాత కోవిడ్ సెకండ్‌వేవ్ మొదలవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంతలో ఏప్రిల్ 25 నుంచి భారత్ - గల్ఫ్ దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే జులై 25 నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వార్తలు వస్తుండటంతో తిరిగి పనులకు వెళ్లేందుకు గల్ఫ్ కార్మికులు సిద్ధమవుతున్నారు. -
గల్ఫ్ ఏజెన్సీపై సీబీఐ విచారణకు డిమాండ్
-
గల్ఫ్ ఏజెన్సీపై సీబీఐ విచారణకు డిమాండ్
లైసెన్సు ముసుగులో అమాయకులైన కార్మికులను గల్ఫ్ దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్న ఏజెన్సీపై తాను చేసిన ఫిర్యాదుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఒక గల్ఫ్ బాధితుడి భార్య ఈనెల 20న సమాచార హక్కు చట్టం క్రింద జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించిన సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు చెందిన తంగెళ్ల గంగారాం, తంగెళ్ల సత్యం అనే ఇద్దరు గల్ఫ్ ఏజెంట్లు కార్తీక్ ఇంటర్నేషనల్ అనే పేరుతో గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సును అడ్డంపెట్టుకొని కార్మికులను విజిట్ వీసాలతో దుబాయికి పంపిస్తూ మోసానికి పాల్పడుతున్నారని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగజల సంవత్సర కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతూ పోరాటం చేస్తున్నది. గల్ఫ్ ఉద్యోగ వీసా కోసం తమ వద్ద రూ.68 వేలు తీసుకొని తన భర్త కొక్కెరకాని పోశన్నను విజిట్ వీసాలో దుబాయికి పంపారని, పక్షవాతానికి గురై దుబాయి నుండి వాపస్ వచ్చిన పోశన్నకు ఒక లక్ష రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందకపోవడానికి ఏజెంట్ల అక్రమదందా కారణమని గంగజల ఆరోపించారు. ఇసిఆర్ పాస్ పోర్టు కలిగిన పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ, ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమా పొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు. ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
విమానాలపై గల్ఫ్ నిషేధం
మోర్తాడ్ (బాల్కొండ): కొత్త రకం కరోనా వైరస్ బ్రిటన్ సహా పలు దేశాల్లో విస్తరిస్తుండటంతో ఒమన్, సౌదీ అరేబియా, కువైట్ అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం విధించాయి. సోమవారం నుంచి వారంపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై సౌదీ, ఒమన్ నిషేధం విధించగా జనవరి 1 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కువైట్ తెలిపింది. అవసరమైతే నిషేధాన్ని మరో వారంపాటు పొడిగిస్తామని సౌదీ పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ నెలాఖరు నుంచి భారత్ నుంచి విమాన సర్వీసులను నిలిపేసిన సౌదీ... తమ దేశం నుంచి భారత్ తిరిగి వెళ్లాలనుకొనే వారికి మాత్రం అనుమతించింది. తాజాగా వాటిపైనా నిషేధం విధించింది. (చదవండి: దేశానికి ‘గల్ఫ్’ కష్టాలు) మరోవైపు ఒమన్‌లో క్షమాభిక్ష అమల్లో ఉన్న తరుణంలో విమాన సర్వీసులపై నిషేధంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఒమన్‌లో చాలా సంవత్సరాల తరువాత క్షమాభిక్ష అమలు చేస్తుండటంతో అక్కడ చట్టవిరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు క్షమాభిక్ష పొందడానికి గడువు ఉంది. ఒమన్ ఆకస్మిక నిర్ణయంతో వారు ఇప్పట్లో స్వదేశానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే ఒమన్‌లో ఉపాధి పనులకు వీసాలు పొందినవారు కూడా ఇప్పట్లో ఆ దేశానికి వెళ్లే పరిస్థితి లేదు. -
గల్ఫ్ వెళ్లే కార్మికులకు కేంద్రం షాక్!
మోర్తాడ్ (బాల్కొండ) : అవ్వ పెట్టదు అడుక్కు తిననివ్వదు.. అన్నట్లుగా ఉంది వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక దేశం విడిచి గల్ఫ్‌కు వలస వెళుతున్న మన కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన విదేశాంగ శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారత కార్మికుల శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వాలకు సూచించాల్సిన మన విదేశాంగ శాఖ, కార్మికులకు నష్టం కలిగించేలా ఉత్తర్వులను జారీ చేసిందని చెబుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ దేశాలకు సంబంధించి కార్మికుల ఇమ్మిగ్రేషన్ విధానంలో కనీస వేతనాల కుదింపుపై అక్కడి ప్రభుత్వాలకు భారత్ సమ్మతి తెలిపిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సంఘాలు వెల్లడించాయి. ఈ మేరకు గత సెపె్టంబర్ 8న ఒక ఉత్తర్వును, అదే నెలలో 21వ తేదీన మరో ఉత్తర్వును విదేశాంగ శాఖ జారీ చేసిందని చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లోనే ఈ ఉత్తర్వులు వెలువడినా గల్ఫ్ దేశాలకు ఇటీవలే మళ్లీ కార్మికుల వలసలు ప్రారంభం కావడంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో విదేశాంగ శాఖ ఉత్తర్వుల విషయం తెలిసిందని కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికులకు కనీస వేతనాన్ని కుదించవచ్చని విదేశాంగ శాఖ ఆయా ప్రభుత్వాలకు ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కె.ఆర్. సురేశ్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన మిగతా ఎంపీలు కూడా దీనిపై దృష్టిసారించాలని ఆయన కోరారు. ఖతర్, బహ్రెయిన్, ఒమన్, యునైటెడ్ అర బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు నెలకు 200 అమెరికన్ డాలర్ల వేతనం.. అంటే మన కరెన్సీలో దాదా పు రూ.15 వేలు కార్మికులకు చెల్లించవచ్చని విదేశాంగ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొందని చెబుతున్నారు. అలాగే కువైట్‌లో పనిచేసే కార్మికులకు 245 డాలర్లు, సౌదీ అరేబియాలో పని చేసేవారికి 324 డాలర్ల వేతనం చెల్లించవచ్చ ని మన విదేశాంగ శాఖ అమోదం తెలిపిందని అంటున్నారు. అయితే ఇదింకా ఎక్కువ ఉండాలని కార్మికులు చెబుతున్నారు. ఖతర్‌లో పనిచేసే వలస కార్మికులకు కనీసంగా 1,300 రియాళ్ల వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆయా కంపెనీలకు నిర్దేశించగా మన విదేశాంగ శాఖ దానిని దృష్టిలో ఉంచుకోకుండా తక్కువ వేతనానికే భారతీయ కార్మికులు పనిచేస్తారని హామీ ఇచ్చిందని తెలుస్తోంది. యూఏఈలో కార్మికులకు నెలకు రూ.16వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. విదేశాంగ శాఖ ఉత్తర్వులతో ఆ వేతనం తగ్గుతుందని అంటున్నారు. కార్మిక, కర్షకుల కష్టంతోనే దేశపురోగతి క్యాపిటలిస్టులతో దేశాభివృద్ధి జరగడం లేదని, కార్మికుల, కర్షకుల కష్టంతోనే పురోగతి సాధిస్తోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ‘ఆలిండియా కన్వెన్షన్ ఫర్ దళిత్ రైట్స్ అండ్ ఎగైనెస్ట్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్’ కార్యక్రమం జరిగింది. సదస్సుని బెజవాడ విల్సన్ ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో రైతులను, శ్రామికులను చిన్నచూపుతో చూస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 58.9 శాతం దళితులు ఇప్పటికీ భూమి లేకుండా రైతు కూలీలుగా జీవనాన్ని వెళ్లదీస్తున్నారన్నారు. దేశం లో సామాజిక, కుల వివక్షకు బీజేపీ వంటి హిందూత్వ పార్టీలే ప్రధాన కారణమని విమర్శించారు. పేదరికం కారణంగా దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంక ట్ వాపోయారు. కార్యక్రమంలో హన్నన్ మొల్ల (ఏఐకేఎస్), ఏఐఏడబ్ల్యూయూ నేత విక్రమ్ సింగ్, తెలంగాణ కార్మిక సంఘం నేత ఐలయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు, గుల్జార్‌సింగ్ గోరియా (బీకేఎంయూ), అసిత్ గంగూలీ (ఎస్కేఎస్), సంజయ్ శర్మ (ఏఐఏఆర్ఎల్ఏ), సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి వలసలు షురూ.. గల్ఫ్ పిలుస్తోంది!
మోర్తాడ్(బాల్కొండ) : కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులను గల్ఫ్ దేశాలు మళ్లీ పిలుస్తున్నాయి. తిరిగి విధుల్లోకి చేరాలంటూ కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. కరోనా సంక్షోభంతో గల్ఫ్ దేశాల్లోని అనేక కంపెనీలు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాయి. తమపై ఆధారపడిన వలస కార్మికులను ఇంటికి పంపేశాయి. ఇప్పుడిప్పుడే ఆయా దేశాల్లో లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తుండటంతో కంపెనీలు తిరిగి కార్యకలాపాల పునరుద్ధరణకు సిద్ధమవుతున్నాయి. విధుల్లో చేరాలంటూ కార్మికులకు ఫోన్లుచేసి పిలుస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియా, కువైట్ మినహా మిగిలిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, దోహా ఖతర్, ఒమన్ దేశాలకు వలసలు మొదలయ్యాయి. గత అక్టోబర్ నుంచి యూఏఈ వీసాల జారీ మొదలు కాగా, బహ్రెయిన్ నవంబర్‌లో వీసాల జారీని ప్రారంభించింది. ఒమన్ వారం నుంచి కొత్త వీసాల జారీతో పాటు గతంలో ఇంటికి వెళ్లిన వలస కార్మికులను మళ్లీ రప్పించడానికి వీసాల జారీకి అనుమతినిచ్చింది. ఖతర్‌లో 2022లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు నిర్వహించడనుండటంతో వచ్చే జనవరి నుంచి కొత్త వీసాల జారీకి భారీగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం యూఏఈకి ఎక్కువ వలసలు కొనసాగుతున్నాయి. నిర్వహణ రంగంలోనే ఉపాధి అవకాశాలు గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులకు నిర్మాణ రంగంలోనే భారీగా ఉపాధి అవకాశాలు లభించాయి. అయితే, కరోనా ఉద్ధృతికి ముందే ఈ రంగం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంది. కరోనాతో పూర్తిగా కుదేలవ్వడంతో కార్మికుల ఉపాధికి గండిపడింది. ఇప్పుడు లాక్డౌన్ ఆంక్షలు సడలించాక నిర్వహణ రంగంలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో కంపెనీల కార్యాలయాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి క్లీనర్లు, ఉద్యోగులకు సహాయపడేందుకు ఆఫీస్ బాయ్స్ వంటి పోస్టులకు ఎంపికలు సాగుతున్నాయి. యూఏఈలో ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో కార్మికుల ఎంపిక కొనసాగుతోంది. బహ్రెయిన్లోనైతే హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడంతో ఇంటికి వెళ్లిన కార్మికులను మళ్లీ పిలుచుకుంటున్నారు. ఒక్కోచోట ఒక్కోలా క్వారంటైన్ యూఏఈకి సంబంధించి దుబాయ్, షార్జాలలో పనిచేసే కార్మికులకు ఎలాంటి క్వారంటైన్ నిబంధనలను అమలు చేయట్లేదు. అబుదాబిలో మాత్రం ఇంటి నుంచి వచ్చిన వలస కార్మికులు 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంది. బహ్రెయిన్‌లో వారం రోజుల క్వారంటైన్‌తో సరిపెడుతున్నారు. ఖతర్‌లో మాత్రం కంపెనీలే వలస కార్మికులకు క్వారంటైన్ సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దుబాయ్ రమ్మని కబురొచ్చింది దుబాయ్‌లోని ఓ కంపెనీలో ప్లంబర్‌గా పనిచేశాను. లాక్‌డౌన్‌తో మూడు నెలల కింద ఇంటికి పంపేశారు. కంపెనీలు మళ్లీ తెరవడంతో పనులు ప్రారంభమవుతున్నాయి. దుబాయ్‌కి రమ్మని కంపెనీ నుంచి కబురు వచ్చింది. అప్పట్లో నాతో పాటు ఇంటికి వచ్చేసిన 20 మందినీ పిలిచారు. – నందు, మోర్తాడ్ కంపెనీ యజమాని ఫోన్ చేశాడు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులను చేసే మా కంపెనీకి కొన్ని కాంట్రాక్టులు వచ్చాయి. దీంతో నాకు యజమాని ఫోన్ చేశాడు. వీసా, విమాన టిక్కెట్‌ను కంపెనీయే పంపిస్తుంది. నాతో పాటు ఇంటికి వచ్చిన పొరుగు జిల్లాల కార్మికులకూ ఫోన్ రావడంతో దుబాయ్ వెళ్తున్నాం. – కస్ప రమేశ్, మోర్తాడ్ -
గల్ఫ్ దేశాలపై ఎలక్ట్రిక్ వాహనాల ప్రభావం!
న్యూఢిల్లీ: గత దశాబ్ద కాలంలో గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందింది. ప్రపంచ దేశాలన్నిటా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. గ్లోబల్ ఈవీ 2020 ఔట్లుక్ నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 2.1 మిలియన్లకు చేరాయి. వెరసి వీటి మొత్తం సంఖ్య 7.2 మిలియన్లను తాకాయి. దీంతో 2019లో యూరోప్ దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలపై 60 బిలియన్ యూరోలను ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. చైనాలో అత్యధికంగా 45 శాతం అంటే 2.3 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉన్నట్లు అంచనా. తదుపరి యూఎస్ 12 శాతం, యూరప్ 11 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. 2030కల్లా మొత్తం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 14 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇవి ప్రపంచ వాహనాల సంఖ్యలో 7 శాతం వాటాకు సమానమని ఆటోరంగ నిపుణులు పేర్కొన్నారు. జీసీసీ.. గల్ఫ్ ప్రాంతంలోని 6 అరబ్ దేశాలు 1981లో గల్ఫ్ దేశాల సహకార సమితి(జీసీసీ)ని ఏర్పాటు చేసుకున్నాయి. గల్ఫ్ దేశాలుగా పిలిచే జీసీసీలో బెహ్రయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సభ్యులుగా ఉన్నాయి. గల్ఫ్ దేశాల జీడీపీ 2018 అంచనాల ప్రకారం 3.655 ట్రిలియన్ డాలర్లు. ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం ఆరు దేశాల గల్ఫ్ దేశాల సహకార కూటమి(జీసీసీ) ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఐదో వంతు వాటాను కలిగి ఉంది. ప్రపంచ చమురు ఎగుమతుల్లో 36 శాతం వాటాను ఆక్రమిస్తోంది. ఐహెచ్ఎస్ మార్కిట్ అంచనాల ప్రకారం 2035 కల్లా చమురు డిమాండ్ గరిష్టానికి చేరుతుందని ఐపీవో ప్రణాళికల్లో భాగంగా గతంలో సౌదీ అరామ్కో పేర్కొంది. కాగా.. గ్లోబల్ ఆయిల్ డిమాండ్ 2041కల్లా గరిష్టానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. 1.15 కోట్ల బ్యారళ్లకు చేరవచ్చని పేర్కొంది. ఆపై డిమాండ్ క్షీణ పథం పట్టవచ్చని పరిశ్రమ నిపుణుల ద్వారా అంచనా వేసినట్లు తెలియజేసింది. జీసీసీలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ ప్రధాన చమురు ఉత్పత్తిదారులుగా నిలుస్తున్నాయి. ప్రపంచ చమురు నిల్వల్లో జీసీసీ వాటా 30 శాతంకాగా.. సౌదీ అరేబియా 15.7 శాతం, కువైట్ 6 శాతం, యూఏఈ 5.8 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ప్రభావం తక్కువే ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో చమురుపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రస్తుతం వేగం ఆధారంగా రానున్నదశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా వీటి వాటా 7 శాతానికి చేరవచ్చని తాజాగా అంచనాలు వెలువడ్డాయి. దీంతో ముడిచమురు, గ్యాస్ విక్రయాలపై అత్యధికంగా ఆధారపడే గల్ఫ్ దేశాలకు సమీప భవిష్యత్‌లో భారీ సమస్యలు ఎదురుకాకపోవచ్చని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక మందగమనం, కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల కొన్నేళ్లుగా చమురు ధరలు సగటున 40-60 డాలర్ల మధ్య కదులుతున్నట్లు తెలియజేశాయి. దీంతో కొంతకాలంగా పలు చమురు ఉత్పాదక దేశాలు రియల్టీ, టూరిజం తదితర చమురేతర ఆదాయాలపై దృష్టి పెడుతున్నట్లు తెలియజేశాయి. -
గల్ఫ్‌దేశాలకు ఆదేశాలు ఎలా ఇస్తాం?
సాక్షి, న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని కార్మికుల దుస్థితిపై తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పట్కూరి బసంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించింది. గల్ఫ్ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకోని వారికి సరైన జీతాలు చెల్లించకపోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నారని, నకిలీ ఏజెంట్లు గల్ఫ్ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ధర్మాసనానికి నివేదించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దేశ ప్రగతికి దోహదం చేస్తున్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో ఆదేశాలు ఇవ్వలేమని, భిన్నమైన దేశాల్లో భిన్నమైన చట్టాలు ఉండటం వల్ల ఆయా దేశాలకు ఆదేశాలివ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. పిటిషనర్ లేవనెత్తిన సమస్యలను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించగలమని చెప్పారు. దీనికి బదులిచ్చిన న్యాయవాది శ్రవణ్ కుమార్, తాను కేవలం గల్ఫ్ దేశాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనే కాక వాటికి కారణమైన నకిలీ ఏజెంట్లపై సీబీఐ విచారణ జరపాలని కోరుతున్నానని వివరించారు. నకిలీ ఏజెంట్ల ముఠాలు కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రతివాదులైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సీబీఐ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
గల్ఫ్ దేశాలకు నిషేధిత మందుల సరఫరా
గల్ఫ్ వెళ్తున్న అమాయకులను మాయ చేస్తున్నారు. నిషేధిత మందులను వారి చేతిలో పెట్టి విమానం ఎక్కిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీలో చిక్కి అమాయకులు బలి అవుతున్నారు. ఈ మందుల మాఫియాపై పోరుబాటకు శ్రీకారం చుట్టింది గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక. మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో నిషేధించబడిన ఎన్నో రకాల మందులను రవాణా చేయించిన మందుల మాఫియా సభ్యులు సురక్షితంగా ఉండగా అమాయకులు మాత్రం బలి పశువులవుతున్నారు. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గల్ఫ్ దేశాల్లోని పలు తెలుగు స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. కొందరు తెలంగాణ వలస కార్మికులు ఇటీవల జైళ్ల నుంచి విడుదలై ఇళ్లకు చేరుకోగా మరి కొందరు మాత్రం మాతృభూమికి రాలేక గల్ఫ్ జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అమాయకులతో ఆటలాడుకున్న మందుల మాఫియా ముఠా భరతం పట్టి వారి ద్వారా బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక నడుం బిగించింది. దుబాయ్‌లోని అల్ అవీర్ జైలులో మూడేళ్ల పది నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలై ఇంటికి వచ్చిన ఏర్గట్ల మండలం తడపాకల్ వాసి పూసల శ్రీనివాస్ దయనీయ స్థితిని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక గుర్తించింది. పూసల శ్రీనివాస్ మంచితనానికి పోయి జైలు పాలుకావడం వెనుక మందుల మాఫియా ముఠా హస్తం ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. మందుల మాఫియా ధనదాహానికి పూసల శ్రీనివాస్ బలై ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక వేదనకు గురయ్యాడని, కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో ఆ కుటుంబంపై ఆధారపడి రావడం దురదృష్టకరమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఠా సభ్యుల ఇంటివద్ద.. పూసల శ్రీనివాస్‌కు, అతని కుటుంబానికి జరిగిన నష్టానికి మందుల మాఫియా ముఠా సభ్యులు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాస్ దుబాయ్‌కు వెళ్లే ముందు అతనికి టిక్కెట్ విక్రయించిన ట్రావెల్ ఏజెంటు మందుల ప్యాకెట్ కూడా ఇచ్చాడు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన చిన్నాన్న వచ్చి మందుల పార్శిల్‌ను తీసుకుంటాడని ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. కాని దుబాయ్ ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసు అధికారులు శ్రీనివాస్ వద్ద ఉన్న మందుల పార్శిల్‌ను గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో దుబాయ్ కోర్టులో హాజరైన తర్వాత కోర్టుకు శ్రీనివాస్ జరిగిన వాస్తవాన్ని వివరించాడు. మందుల పార్శిల్ తీసుకోవాల్సిన వ్యక్తి ఆ పార్శిల్ తనదే అంటే శ్రీనివాస్‌ను కోర్టు విడుదల చేసే అవకాశం ఉండేది. కాని మందుల పార్శిల్‌ను తీసుకోవాల్సిన వ్యక్తి శ్రీనివాస్ అరెస్టు విషయాన్ని తెలుసుకుని మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి మందుల పార్శిల్‌కు సంబంధించిన ఏదైనా కేసు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చినా శ్రీనివాస్‌ను విడుదల చేస్తామని దుబాయ్ కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం నెల రోజుల గడువు ఇచ్చారు. కాని మందుల పార్శిల్‌కు సంబంధించి శ్రీనివాస్ పట్టుబడిన తర్వాత అసలు దోషులు ఎవరు కూడా పోలీసులకు చిక్కలేదు. ఫలితంగా జైలు శిక్ష అనుభవించాలని దుబాయ్ కోర్టు తీర్పు చెప్పింది. శ్రీనివాస్ లాంటి ఎంతో మంది తెలంగాణ కార్మికులు నిషేధిత మందులపై అవగాహన లేక మాఫియా ముఠా ఉచ్చులో చిక్కుకుని గల్ఫ్ దేశాలకు వాటిని తీసుకెళ్లి జైలు పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మందుల మాఫియా ముఠాపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి బాధితులైన వారికి న్యాయం జరిగేలా చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు. సంబంధం లేని నేరానికి.. మందుల పార్శిల్ తీసుకవెళ్లాలని మోర్తాడ్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్ మహేశ్ బతిమిలాడాడు. మానవత్వంతోనే మందుల పార్శిల్‌ను తీసుకవెళ్లాను. ఎయిర్‌పోర్టులో పట్టుబడటంతో శిక్ష పడింది. ఒకవేళ ఎయిర్‌పోర్టు బయట పట్టుబడి ఉంటే జీవితంలో ఇంటికి రాలేక పోయేవాడిని. నాకు సంబంధం లేని నేరానికి జైలులో నరకయాతన అనుభవించాను. – పూసల శ్రీనివాస్, బాధితుడు, తడపాకల్ న్యాయం జరిగే వరకు పోరాడుదాం.. పూసల శ్రీనివాస్‌తో మందుల పార్శిల్ పంపించిన మాఫియా ముఠా అతనికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. మందుల మాఫియా ముఠాపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. బాధితుడు శ్రీనివాస్ కుటుంబానికి అన్యాయం జరిగింది. న్యాయం జరిగేవరకు ఉద్యమంను కొనసాగిస్తాం. – కృష్ణ దొనికెన, వ్యవస్థాపక అధ్యక్షుడు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక -
‘సీ యూ సూన్’ మూవీ రివ్యూ
నెలకు నలభై వేలు వస్తాయని చెబుతారు. గల్ఫ్‌కు తీసుకువెళతారు. ముందు పాస్‌పోర్ట్ లాగేసుకుంటారు. తర్వాత ఏం పని చేయాలో చెబుతారు. అది చట్టబద్ధమైన పని అయితే సరే. లేకుంటే? అక్కడి నుంచి తమ వాళ్లకు వీడియో కాల్స్, వీడియో మెసేజెస్ మొదలవుతాయి. సహాయం కోసం అర్థింపులు, ఆక్రందనలు. గల్ఫ్‌కు వెళ్లిన భారతీయ స్త్రీల బాధను చూపిన సినిమా ఇది. లాక్డౌన్ కాలంలో తీసి ఓటిటి ద్వారా విడుదల చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న విశేషం సీయూ సూన్. గల్ఫ్ దేశాలకు వెళ్లి తమ జీవితాన్ని బాగు పరుచుకున్నవారు చాలామంది ఉన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి జీవితాలు నష్టపోయిన వారు అంతకు తక్కువగా లేరు. మగవారి కష్టాలు అక్కడ శారీరక, మానసిక పరమైనవి. స్త్రీలవి అయితే కనుక శారీరక, మానసిక, లైంగిక పరమైనవి కూడా. ఇక్కడ జరుగుబాటు లేక జానా బెత్తెడు జీతంతో విసిగిపోయి మన సభ్యులు ఎవరైనా గల్ఫ్‌కి వెళితే కుటుంబం అంతా బాగుపడుతుందని భావించేవారు నేటికీ ఉన్నారు. రేపటికీ ఉంటారు. కాని ఆ వెళ్లిన కుటుంబ సభ్యులు స్త్రీలైతే ఏమవుతుందో... ఒక్కోసారి ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పిన సినిమా ‘సీ యూ సూన్’. తాజా మలయాళ సినిమా ‘సీ యూ సూన్’ అనేది తాజా మలయాళ సినిమా. అమేజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ కథ సంగతి చర్చించే ముందు దీని నిర్మాణమే విశేషం అని తెలుసుకోవాలి. ఇది లాక్డౌన్లో అంటే ఈ సంవత్సరం జూన్‌లో రెండు వారాల కాలంలో ‘కొచ్చిన్’లో తీశారు. మలయాళ చిత్రసీమ అంతా షూటింగ్‌లు మానేసి ఉంటే ఈ సినిమా 40 మందికి పని కల్పిస్తూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేసింది. ప్రసిద్ధ మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ నటించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంకో ఇద్దరు ముఖ్యపాత్రలు పోషించారు. మనం చూసే సినిమాలలో నటులు కెమెరాకు నటిస్తారు. కాని ఈ సినిమాలో వాళ్లు కెమెరాకు నటించినా మనకు కంప్యూటర్ స్క్రీన్ మీద, ఫోన్ స్క్రీన్ మీద ఎక్కువగా కనిపిస్తారు. సరిగా చెప్పాలంటే మనం మన మిత్రులతో చాటింగ్ చేస్తూ, వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నటీనటులు ప్రేక్షకులతో అలా చేస్తున్న భావన కలుగుతుంది. ఇది వినూత్న ప్రయత్నం. అందుకే షూటింగ్‌కి రెండు వారాలే పట్టినా ఎడిటింగ్‌కి రెండు నెలలు తీసుకుంది. ఒక అమ్మాయి– అబ్బాయి కథ దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్న ఒక మలయాళ కుర్రాడు డేటింగ్ యాప్ ద్వారా దుబాయ్‌లోనే ఉంటున్న ఒక మలయాళ అమ్మాయిని ఆన్లైన్లో కలుసుకుంటాడు. ఆ అమ్మాయి దగ్గర ‘సిమ్’ ఉండదు కాని గూగుల్ ద్వారా వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఉద్యోగం కోసం ఇండియా వచ్చానని, ఇంకా పని దొరకలేదని చెబుతుంది. తన చిన్నప్పటి ఫోటోలు, కుటుంబం ఫోటోలు అన్నీ షేర్ చేస్తుంటుంది. ఇతను ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అమెరికాలో ఉంటున్న తల్లికి వీడియో కాల్ ద్వారా పరిచయం చేస్తాడు. పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని చెబుతాడు. ఈ లోపల ఆ అమ్మాయి తాను ఉన్నచోట ఇబ్బంది పడుతున్నానని, తీసుకెళ్లమని చెబుతుంది. ఆమెను అతడు తన ఫ్లాట్‌కు తెచ్చుకుంటాడు. వారం తర్వాత ఆ అమ్మాయి అదృశ్యం అవుతుంది. ఇంతకూ ఆ అమ్మాయి ఏమైంది? అనేది కథ. సమాచారం సర్వవ్యాప్తం మనం అనుకుంటాం మన మెయిల్స్, ఫేస్బుక్ చాట్స్, వాట్సప్ చాట్స్ మన కంప్యూటర్లో మనం దాచుకున్న ఫైల్స్ అన్నీ సేఫ్ అని. కాని ఇవాళ్టి సాంకేతిక పరిజ్ఞానంతో వాటన్నింటిని క్షణాల్లో ఛేదించి మన గుట్టుమట్లు తెలుసుకోవచ్చని కూడా ఈ సినిమా చెబుతుంది. అమ్మాయి అదృశ్యమయ్యాక ఆ కుర్రాణ్ణి పోలీసులు చుట్టుముడతారు. నిందితుడివి నువ్వే అంటారు. ఆ కుర్రాడు హతాశుడయ్యి కొచ్చిన్‌లో ఉంటున్న తన కజిన్‌ని సహాయం కోసం సంప్రదిస్తాడు. ఆ కజిన్ హ్యాకర్. అతడే ఆ అమ్మాయి ఏమైందో కేవలం కొచ్చిన్‌లో తన గదిలో కూచుని కనుగొంటాడు. ఇదంతా ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా మీడియమ్స్ ద్వారా జరుగుతుంది. నటులు మాట్లాడేది, కనిపించేది తక్కువ. ఎక్కువగా స్క్రీన్ల మీద నడిచే చాటింగులే కథను చెబుతాయి. పాస్‌పోర్ట్ ఎక్కడ? మన దేశంలో మనం ఎన్ని కష్టాలు పడినా కుదరకపోతే పారిపోయి ఇల్లు చేరతాం. కాని పరాయి దేశంలో పారిపోయి రావాలంటే పాస్‌పోర్ట్ ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్లినవారి పాస్‌పోర్ట్‌లు ఒక్కసారి ఎవరైనా తమ హ్యాండోవర్లో పెట్టుకున్నాక వారి చేతిలో కీలుబొమ్మలుగా మారక తప్పదు. తమను తీసుకెళుతున్నవారు ఎవరో, వారు ఎంత సరైన వారో, వారు గతంలో తీసుకెళ్లినవారు ఎలా ఉన్నారో చెక్ చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్లడం ముఖ్యంగా స్త్రీలు వెళ్లడం ఏమాత్రం క్షేమకరం కాదని ఈ సినిమా చెబుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రమాదం ఉందనే శంక ఉన్నా నిస్సహాయతతో అందులోకి తోసే పేదమనుషుల స్వభావాన్ని కూడా ఇది చూపుతుంది. ఈ సినిమాలోని యువతి తాను ప్రమాదంలో ఉందా తమ చుట్టూ ఉన్నవారిని ప్రమాదంలోకి నెట్టిందా... ఇది చాలా ఇంటెరెస్టింగ్‌గా ఉంటుంది. మెచ్చుకోళ్లు సీ యూ సూన్ స్ట్రీమ్ అవడం మొదలెట్టినప్పటి నుంచి మెచ్చుకోళ్లు నెట్లో ఎక్కువగా ఉన్నాయి. దీని ముఖ్య నటులు ఫహద్ ఫాజిల్, రోషన్ మాథ్యూ, దర్శనా రాజేంద్రన్‌లను దీని దర్శకుడు మహేశ్ నారాయణ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోట్లు ఖర్చు, పదుల సంఖ్యలో తారాగణం లేకుండా సందర్భానికి తగినట్టుగా కూడా సినిమా తీయొచ్చని వీరు నిరూపించారని అంటున్నారు. గత నాలుగైదేళ్లుగా మలయాళ రంగం కొత్త కొత్త కథలతో. నటులతో ప్రతిభ చాటుతోంది. ఈ లాక్డౌన్ సమయంలో దేశంలో చాలామంది మలయాళ సినిమాలు చూస్తున్నారు. తెలుగువారు కూడా. తెలుగులో ఈ స్థాయి స్ఫూర్తి అంతగా కనపడటం లేదని చెప్పాలి. అది పూర్తిగా తన మూస బంధనాలను తెచ్చుకోలేదు. సీ యూ సూన్లాంటి కత్తెరలు వాటిని తెగ్గోస్తాయని ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘ఇప్పటికే రూ.10 కోట్లు.. ఇంటికి పంపించండి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. దాంతో భారత్ నుంచి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఎందరో కార్మికులు తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 20 వేల మంది తెలంగాణ వాసులు హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వీరందరిని స్వస్థలాలకు పంపించకుండా హైదరాబాద్‌లోనే క్వారంటైన్లో ఉంచింది ప్రభుత్వం. ఈ క్రమంలో తొలుత వచ్చిన 5,500 మందికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించింది. అయితే జూన్ 7 ‘వందే భారత్ మిషన్’లో భాగంగా దాదాపు 14,500 వేల మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు. వీరందరికి ఉచిత క్వారంటైన్ కల్పించడం కష్టంగా భావించిన సర్కార్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 8,000 రూపాయలు వసూలు చేసి హోటల్స్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇలా ప్రభత్వం వీరి దగ్గర నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. (ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?) తాజాగా హోటల్ సిబ్బంది మరోసారి డబ్బులు కట్టాల్సిందిగా వీరిని డిమాండ్ చేస్తున్నారు. అసలే ఉద్యోగాలు కోల్పోయి స్వదేశం వచ్చారు. ఇంకా ఇళ్లకు కూడా వెళ్లలేదు. చేతిలో ఉన్న కొద్ది మొత్తం క్వారంటైన్ పేరుతో హోటల్‌కే ఖర్చయ్యింది. ప్రస్తుతం జేబులో రూపాయి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి హోటల్లో క్వారంటైన్లో ఉండలేము.. మమ్మల్ని హోం ఐసోలేషన్‌కు అనుమతించండి అంటూ గల్ఫ్ కార్మికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వలసకార్మికుల సంక్షేమ సంఘం సభ్యుడు ఎం. బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. 14,500 మంది దగ్గర నుంచి ఎనిమిది వేల చొప్పున 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి సగటున 1,000 యూఏఈ దిర్హామ్స్, సౌదీ / ఖతారి రియాల్స్ (సుమారు రూ .20,000) ’వసూలు చేశారని తెలిపారు. (క్వారంటైన్ నుంచి భార్యాభర్తల పరార్) ఈ లెక్క ప్రకారం, 20,000 మంది వలసదారులు ఉంటే ఒక వ్యక్తి నుంచి 20,000 రూపాయల చొప్పున మొత్తం 40 కోట్ల రూపాయలు వసూల చేశారని తెలిపారు బాల్‌రెడ్డి. అంతేకాక ‘కేరళ, మహారాష్ట్రల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని ‘హోం క్వారంటైన్’కు అనుమతిస్తున్నారు. ఇక ఏపీ, ఢిల్లీలో గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తోన్న పేద వలస కార్మికుల కోసం ప్రభుత్వాలే ఉచిత క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నాయి’ అని తెలిపారు బాల్‌రెడ్డి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఆగస్టు 13 వరకు 46,488 మంది ప్రయాణికులు వందే భారత్ మిషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వీరంతా 30 దేశాల నుంచి 285 విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. -
భారతీయులకు షాకిచ్చిన కువైట్
కువైట్: గల్ఫ్ దేశాల్లో ఉన్న విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ కువైట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రవాసీ కోటా డ్రాఫ్ట్ బిల్లుకు ఆదేశ జాతీయ అసెంబ్లీ కమిటీ ఆమోదం తెలిపింది. దీని ప్రభావం గల్ఫ్ దేశాలలో ఉన్న 8 లక్షల మంది భారతీయులపై పడనుంది. ఈ బిల్లు ప్రకారం గల్ప్ దేశాలలో భారతీయుల జనాభాలో 15 శాతానికి మించకూడదు. గల్ఫ్‌లో ఉన్న విదేశీయుల జనాభాలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైట్ జనాభాలో 4.3 మిలియన్లు అయితే అందులో 3 మిలియన్లకు పైగా (30 లక్షలు) ప్రవాసీయులే ఉన్నారు. అంటే దాదాపు 8 లక్షల మంది భారతీయులను కువైట్ నుంచి తిరిగి స్వదేశానికి పంపనున్నారు. (కువైట్ నుంచి సొంత రాష్ట్రానికి..) కరోనా వైరస్ కారణంగా అక్కడి ప్రధాన వ్యాపారమైన చమురు ధరల క్షీణించడంతో కువైట్‌లో ఉన్న విదేశీయుల సంఖ్యను తగ్గించాలని స్థానిక ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మద్దతు తెలపడంతో సునాయాసంగా ఆమోదం లభించింది. గత నెలలో కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా విదేశియుల జనాభాను 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. అంతేగాక కువైట్‌లో ప్రవాసియుల సంఖ్యను క్రమంగా తగ్గించాలని కోరుతూ సమగ్ర ముసాయిదా బిల్లు చట్టాన్ని తాను శాసనసభ్యుల బృందంతో కలిసి అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ మార్జౌక్ అల్-ఘనేమ్ కువైట్ పేర్కొన్నారు. ఈ బిల్లులో తాము వైద్యులను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని మాత్రమే నియమించుకుంటామని, నైపుణ్యం లేని కార్మికులను తిరిగి పంపించేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకారం.. ప్రభుత్వానికి నర్సులు, జాతీయ చమురు కంపెనీలలో వివిధ విభాగాల్లో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నవారు సుమారు 28 వేల మంది ఉన్నారు. మెజారిటీ భారతీయులు 5.23 లక్షల మంది ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు. అదనంగా, సుమారు 1.16 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారు. వీరిలో దేశంలోని 23 భారతీయ పాఠశాలల్లో 60,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. తాజా బిల్లు వీరందరి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అక్కడున్న కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
వారిని స్వదేశానికి తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ గురువారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోందని, ఇందులో భాగంగా అనేక మంది తెలంగాణవాసులను స్వదేశానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే గల్ఫ్ దేశాల్లో సుమారు 10 లక్షల మంది తెలంగాణవాసులు పని చేస్తున్నారని, వారిలో బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారంతా స్వదేశానికి రాలేక గల్ఫ్‌లోనే చిక్కుకుపోయి దీనావస్థలో ఉన్నారని తెలిపారు. దీంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా తక్షణమే మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. లేఖలను ఈమెయిల్ ద్వారా కేంద్ర మంత్రులకు పంపించారు. -
పూర్తి ‘వేతనం’తో స్వదేశానికి వచ్చే హక్కు
మాతృదేశానికి తిరిగి వచ్చిన వలస కార్మికులకు ‘పరివర్తన న్యాయవ్యవస్థ’ (ట్రాన్సిషనల్ జస్టిస్ మెకానిజం)ను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని మూలస్థాన దేశాలు, గమ్యస్థాన దేశాలకు పిలుపునిస్తూ అంత ర్జాతీయ పౌరసమాజ సంస్థలు, ప్రపంచ కార్మిక సంఘాల మహా కూటమి ఇటీవల ప్రకటన విడుదల చేశాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి భారత్‌కు వాపస్ వచ్చినవారు, రావాలనుకునే వారికి ఇందులోని విషయాలు వర్తిస్తాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 19.5 కోట్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకు పోతాయని అంతర్జా్జతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా వేసింది. గల్ఫ్ మధ్యప్రాచ్య ప్రాంతంలో 50 లక్షల మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. కరోనా ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి 3 లక్షల మందికి పైగా వలస కార్మికులను ఆసియా దేశాలకు తిరిగి పంపించారు. రాబోయే నెలల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరగనుంది. విదేశాల్లోని తమ కార్మికులు అధిక సంఖ్యలో తిరిగి వస్తారని భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఊహిస్తున్నాయి. కార్మికులు వలస వెళ్లిన దేశాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికి వేతనాలు తగ్గించడం, అసలు చెల్లించకపోవడం, వేతనం చెల్లించని సెలవు (అన్ పెయిడ్ లీవ్)పై వెళ్లాలని ఆదేశించడం జరిగింది. కార్మికులు తక్కువ పని, అసలే పనిలేక పోవడం లాంటి స్థితిలో ఉన్నారు. చాలామంది ఈ పరిస్థితుల్లో ‘వాపస్ వచ్చే హక్కు’ (రైట్ టు రిటన్)ను ఉపయోగించుకునే సందిగ్ధతలో ఉన్నారు. మరికొందరు ఎలాంటి సేవలు, మద్దతు లభించకుండా ‘క్వారంటైన్’ లలో చిక్కుకుపోయి ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. ప్రవాసీ కార్మికుల దుస్థితి గురించి ఆలోచించకుండా, వాపస్ వెళ్లడం అనివార్యం అనేలాగా వ్యవహరిస్తూ గమ్యస్థాన (కార్మికులను స్వీకరించే), మూలస్థాన (కార్మికులను పంపే) దేశాలు కార్మికులను స్వదేశానికి పంపే ప్రక్రియలను ప్రారంభించాయి. వాళ్లు ఖాళీ చేతులతో వాపస్ వచ్చి, రిక్రూట్మెంట్ ఖర్చుల కోసం చేసిన పాత అప్పులు తీర్చలేక రుణ బానిసత్వంలో మగ్గే అవకాశమున్నది. సరైన నియంత్రణ లేనందువల్ల కార్మికులను సామూహికంగా స్వదేశాలకు తిరిగిపంపే కార్యక్రమాలను యజమానులు తమకు అనుకూలంగా ఉపయోగించుకొనే అవకాశముంది. ఇదే అదనుగా కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఇవ్వాల్సిన పరిహారం, వేతనాలు, ప్రయోజనాలు చెల్లించకపోవడం జరగవచ్చు. స్వదేశాలకు వాపస్ వస్తున్న కార్మికుల మానవ హక్కులు, కార్మిక హక్కులను కాపాడటానికి కంపెనీ యాజమాన్యాలు తగిన శ్రద్ధ వహిస్తున్నాయా అని నిర్ధారించుకోవాలి. ‘వేతన దొంగతనం’ (వేజ్ థెఫ్ట్) లక్షలాది డాలర్ల మేర కార్మికులకు నష్టం కలుగజేస్తుంది. కార్మికులు సాధారణ స్థితికి చేరుకోవడానికి ప్రభుత్వాలు, బ్యాంకులు సహాయ కేంద్రం (హెల్ప్ లైన్) ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపార సంస్థలు, యాజమాన్యాలు జవాబుదారీతనం నుంచి మినహాయించబడి ప్రయోజనం పొందుతున్నాయి. లాక్డౌన్ సమయంలో న్యాయస్థానాలు, ఇతర కార్మిక వివాద పరిష్కార యంత్రాంగాలు కూడా మూసి వేయబడ్డాయి. సరైన పరిష్కార విధానం లేకుండా గమ్యస్థాన దేశాలు, మూల స్థాన దేశాలు కార్మికులను స్వదేశానికి వాపస్ పంపే ప్రక్రియలను ఆదరా బాదరాగా చేపట్టాయి. అందువల్ల పేరుకు పోయిన సమస్యలను ప్రస్తుతమున్న వివాద పరిష్కార యంత్రాంగాలు పట్టించుకోకపోవడం జరుగుతున్నది. ఈ విషయంలో మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏషియా, లాయర్స్ బియాండ్ బార్డర్స్ నెట్వర్క్, క్రాస్ రీజినల్ సెంటర్ ఫర్ మైగ్రెంట్స్ అండ్ రెఫ్యూజీస్, సౌత్ ఏషియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, సాలిడారిటీ సెంటర్ అనే సంస్థలు ఈ కింది లక్ష్యాలతో పరివర్తన న్యాయవ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి. 1. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగివచ్చిన కార్మికుల మనోవేదన, వాదనలు, కార్మిక వివాదాలను పరివర్తన న్యాయవ్యవస్థ పరిష్కరిస్తుంది. యంత్రాంగాన్ని సమర్థవంతంగా సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. 2. స్వదేశానికి వాపస్ వచ్చిన కార్మికులందరూ చట్టబద్ధమైన పరిహారం పొందడం కోసం ‘న్యాయం పొందే సౌలభ్యం’(యాక్సెస్ టు జస్టిస్) కల్పించడానికి ప్రాధాన్యమివ్వాలి. 3. కార్మిక వివాదాలకు సంబంధించిన కేసులు వీలైనంత త్వరగా పరిష్కరించాలి. వలసదారులు వాపస్ వచ్చిన తర్వాత తమ కేసులను కొనసాగించడానికి భద్రతా విధానాలు ఉండాలి. న్యాయసలహా పొందే సౌలభ్యం, మద్దతు, ‘పవర్ ఆఫ్ అటార్నీ’ విధానాలు సులభతరం చేయడం, వ్యక్తి సాక్ష్యం, ట్రిబ్యునల్ లేదా ఫిర్యాదు వ్యవస్థ ముందు హాజరు కావడం వంటి అవసరాలను తగ్గించడం చాలా ముఖ్యమైనవి. 4. యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు ‘పేరోల్’ (జీతాలు తీసుకొను ఉద్యోగుల జాబితా), ఉద్యోగుల రికార్డులను కలిగివుండేలా ప్రభుత్వాలు చూడాలి. పని గంటలతో సహా అన్ని ఉపాధి రికార్డుల ప్రతులను కార్మికులు తమతో తీసుకెళ్లడానికి అనుమతించాలి. కోవిడ్–19 కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన కార్మికుల విషయంలో మనం ‘బిల్డ్ బ్యాక్ బెటర్’ (తిరిగి బాగా నిర్మాణం) చేయాలంటే వలస కారిడార్లలో సంవత్స రాలుగా కొనసాగుతున్న ‘వేతన దొంగతనం’ సమస్యపై చూసీచూడనట్టు ఉండలేము. కరోనా మహమ్మారికి ముందు నెలలు, సంవత్సరాలుగా బకాయి ఉన్న వేతనాలను యాజమాన్యాలు ఎగవేతకు పాల్పడుతున్న పరిస్థితికి కార్మికులు రాజీపడాల్సి వస్తున్నది. తమ వీసా, నివాస హోదాను సరిగా నమోదు చేయక ఎలాంటి పత్రాలూ లేని స్థితి (అన్ డాక్యుమెంటెడ్)లోకి నెట్టివేస్తారనే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉంటున్నారు. కార్మికులను పంపేందుకు ‘మూలస్థాన’ దేశాలు కొత్త మార్కెట్లను అన్వేషిస్తూనే ఉన్నప్పటికీ, కార్మికులను స్వీకరించే ‘గమ్యస్థాన’ దేశాలు చౌకగా దోపిడీకి గురయ్యే కార్మికుల కోసం చూస్తున్నాయి. ప్రభుత్వాలు తగిన శ్రద్ధ లేకుండా వలస కార్మికులను స్వదేశానికి రప్పించడం జరుగుతున్నది. దీనివల్ల వలస దారులపై హింసకు పాల్పడే యజమానులను, నేరస్తులను బహిష్కరించడానికి, చట్టబద్ధమైన పరిహారాలు, ఫిర్యా దులకు సంబంధించిన అన్ని రికార్డులను తుడిచిపెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రతి కార్మికుడు కూడా రాబోయే తరాల మంచి భవిష్యత్తుకు మూలం అవుతాడు. కోవిడ్–19 మహమ్మారి కాలం నడుస్తున్నందున వలసదారుడి ప్రయాణ పట్టుదల, కల అణచివేయబడవద్దు. ఈ సమయంలో పరిష్కరించకపోతే, వలస నుంచి అభివృద్ధికి అనుసంధానించే నమూనాలను ఎప్పటికైనా విడదీసే ప్రమాదమున్నది. వలస కార్మికుల జీవితాల కథలు రాబోయే సంవత్సరాల్లో ఈ సామూహిక అన్యాయానికి సాక్ష్యమిస్తాయి. మంద భీంరెడ్డి వ్యాసకర్త గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు, ఫోన్: 98494 22622 -
సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఉచిత రవాణా ఖర్చులతో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్‌కుమార్ టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందడంతో గల్ఫ్ వలస కార్మికుల జీవిన విధానం మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. అదే విధంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళలతో సహా తెలంగాణ నుండి 12-15 లక్షలకు పైగా వలస కార్మికులు ఉన్నట్లు తెలిపారు. ఈ గల్ఫ్ కార్మికుల నుంచి దాదాపు ప్రతి నెల రూ .1500 కోట్ల విలువైన విదేశీ మారకం తెలంగాణ రాష్ట్రానికి పంపబడుతుందని అంచనా అని తెలిపారు. (విదేశాల నుంచి స్వదేశానికి : టికెట్లు ధరలు ఇవే) అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయని, కరోనా వైరస్ కారణంగా ఒకేసారిగా కుప్పకూలిన చమురు ధరల వల్ల అరబ్, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోయిందన్నారు. దీని కారణంగా వారి వ్యాపార కార్యకలాపాల పరిధి కూడా ఒక్కసారి తగ్గడంతో ఫలితంగా చాలా మంది కార్మికులను విధుల, ఉపాధి నుంచి తొలగించారని లేఖలో తెలిపారు. అలాగే కరోనా మహమ్మారి కొంత వరకు తగ్గినప్పటికీ, చమురు ధరలు ఒక్కసారి తగ్గడం ద్వారా తీవ్రమైన వ్యాపార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, గల్ఫ్ వలస కార్మికులు వారి ఉపాధిని మరియు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని కూడ కూడా పేర్కొన్నారు. ఫలితంగా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలలో ఉన్న కార్మికులు వారి జీవనోపాధిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ఎప్పటికీ తేలదు! వారిలో చాలా మంది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి సరైన జీవనోపాధి పొందడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వైద్య సంరక్షణ కూడా వారికీ లేదని, చాలా ప్రమాదకర పరిస్థితులలో గల్ఫ్ కార్మికులు జీవించవలసి వస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్య సహకారంతో సమన్వయం చేసుకొని, గల్ఫ్‌లో ఉన్నటువంటి కార్మికులు భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారో వారిని ఉచిత రవాణా ఖర్చులతో తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల, ప్రాంతాలలో ఉన్న కార్మికులను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల సౌకర్యాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి విమాన ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేయడం సరికాదని శ్రావన్ అన్నారు. కార్మికులు ప్రస్తుత పరిస్థితులలో వారికీ ఎలాంటి ఉపాధి, ఆదాయం లేకుండా ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుండి విమానాల ద్వారా హైదరాబాదుకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వమే కార్మికుల విమాన ఛార్జీలు చెల్లించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. అంతేగాక హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఆయా గ్రామాలకు స్థానిక రవాణా ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణకు తిరిగి వచ్చిన తరువాత, ఆ కార్మికులకు గౌరవంగా మంచి జీవన ప్రమాణాలతో వారి స్వస్థలాలలో స్థిరపడటానికి వారికి పునరావాసం, పునర్వవస్థీకరణము ప్యాకేజీని ఇవ్వాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో సహకరించిన గల్ఫ్ కార్మికుల కోసం మనం చేయగలిగిన అతి చిన్న సహాయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. -
కార్మికులను తయారుచేద్దాం!
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభంతో పాఠాలు నేర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కార్మికులను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వలస కార్మికులు స్వరాష్ట్రాలకు తరలిపో తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కరోనా కల్లోలం ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించకపోవడం, సొంత రాష్ట్రాల బాట పట్టిన శ్రమజీవులు ఇప్పట్లో తిరిగి వచ్చే సంకేతాలు లేకపోవడంతో విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కే దిశగా ఆలోచనలు చేస్తోంది. భవిష్యత్తులోనూ పూర్తిస్థాయిలో వలస కార్మికులపై ఆధారపడకుండా.. స్థానిక మానవ వనరులు ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వలస కూలీల స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి కార్మికుల రూపంలో అందుబాటులోకి తెచ్చుకోవాలని భావిస్తోంది. మనవారికీ ఉపాధి కరువు.. కరోనా విశ్వరూపంతో ముంబై, సూరత్, గల్ఫ్ దేశాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న మన కార్మికులకు కూడా ఉపాధి కరువైంది. ఆర్థిక సంక్షోభంతో ఆనేక కంపెనీలు మూత పడుతున్నాయి. మరికొన్ని పరిశ్రమలు సిబ్బందిని కుదించుకుంటున్నాయి. దీంతో లాక్డౌన్ ఎత్తేయగానే ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది తెలంగాణకు తిరిగి వస్తారని రాష్ట్ర సర్కారు అంచనా వేస్తోంది. వీరిలో అధికశాతం నైపుణ్యవంతులు కానందున.. ఇక్కడ ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి తలనొప్పి కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని సానుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వలస కూలీలు వెళ్లిపోవడంతో ఏర్పడిన లోటును భర్తీ చేసుకోవాలనుకుంటోంది. ఇందులో భాగంగా జాతీయ నిర్మాణ సంస్థ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారితో పాటు స్థానిక యువతకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదుగురితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు లాక్డౌన్ సంక్షోభం ఏయే రంగాలపై ఎంత ప్రభావం చూపుతుంది? వలస కార్మికులు అధికంగా తరలి వెళ్లిన రంగాలేంటి? ఏయే రంగాల్లో అవకాశాలున్నాయనే అంశాలపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 3 లక్షల మంది తిరుగుముఖం లాక్డౌన్ కారణంగా పనుల్లేక సుమారు 3 లక్షల మంది వలస కార్మికులు స్వస్థలాలకు తరలి వెళ్లారు. మరికొందరు ప్రజా రవాణా పునరు ద్ధరించగానే వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుం టున్నారు. ఇలా తరలివెళ్లిన వారిలో అత్యధికులు భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మికులే. రాష్ట్రంలో 16 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ సంక్షేమ మండలిలో నమోదు కాగా.. వీరికి అదనంగా మరో నాలుగైదు లక్షల మంది అనధికారికంగా పని చేస్తుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. తాజాగా లాక్డౌన్లో నిర్మాణ రంగానికి సడలింపులు ఇచ్చినప్పటికీ కార్మికుల కొరత పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అవలంభిస్తోంది. ఒకవైపు వలస కార్మికుల కొరతను అధిగమించేందుకు.. మరోవైపు గల్ఫ్, ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే వారికి ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం ద్వారా నిష్ణాతులుగా తయారు చేయాలని నిర్ణయించింది. -
లాక్డౌన్: గల్ఫ్ బాధితులకు శుభవార్త!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా లాక్డౌన్ కారణంగా గల్ఫ్ దేశాలలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా, ఇండియన్ నావీలను రంగంలోకి దించుతోంది. వివిధ గల్ఫ్ దేశాలలో దాదాపు 10 మిలియన్ల వరకు భారతీయులు ఉంటారని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించిన పక్కా సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాకుండా భారతీయులను గల్ఫ్ దేశాలనుంచి ఇండియాకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్ ఇండియా, ఇండియన్ నేవీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు సంస్థలు ఎంత మందిని తరలించగలుగుతాయో ప్రణాళికలు ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ఇండియన్ నేవీ తమకు ఉన్న మూడు యుద్ధ నౌకల ద్వారా గల్ఫ్ దేశాల పోర్ట్ సిటీలలో ఉన్న వారిలో 1500 మంది వరకు తరలిస్తామని వెల్లడించింది. ( ‘దేవుడు కోరాడనే సాధువులను చంపేశా’ ) తమ దగ్గర 500 వరకు విమానాలు సిద్ధంగా ఉన్నాయని పౌరవిమానయాన శాఖ తెలిపింది. గల్ఫ్ దేశాలలోని భారతీయులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వచ్చేనెల 3 తరువాత తరలింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నందున తరలింపు ఖర్చు ఎవరు భరించాలి అనే విషయంపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. -
గల్ఫ్ ప్రవాసీలకు ‘కరోనా’ హెల్ప్లైన్ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్ : ఉపాధి కోసం దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన లక్షలాదిమంది భారతీయులు లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. అలాంటి వారి బంధువులకు ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఫిర్యాదు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ఢిల్లీలో హెల్ఫ్‌లైన్ నంబర్లును ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ నంబరును కూడా అందుబాటులో ఉంచింది. కంట్రోల్‌రూమ్ టోల్‌ఫ్రీ నం: 1800 11 8797, టెలీఫోన్ నంబర్లు: 91 11 2301 2113/ 4104/ 7905. ఈమెయిల్: ఛిౌఠిజీఛీ19ః ఝ్ఛ్చ.జౌఠి.జీn ప్రత్యేక సహాయం కావాల్సిన వారు విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్ వ్యవహారాలు) డా.టి.వీ నాగేంద్రప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం నిరంతరం అందుబాటులో పనిచేస్తోంది. వీరిని సంప్రదించాలనుక్నునవారు. +91 11 4901 8480, +91 92050 66104కు కాల్ చేయవచ్చు. మొత్తం 85 లక్షల మంది భారతీయులు.. గల్ఫ్ దేశాల్లో భారతదేశానికి చెందిన దాదాపు 85 లక్షలమందికిపైగా వివిధ ఉద్యోగా లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే సుమారుగా 13 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. వీరికోసం సౌదీ అరేబియాకు చెందిన భారత రాయబార కార్యాలయంలో +9714 3971 222 / 333 సంప్రదించవచ్చు. అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం నంబరు: +971 2 4492700 ఫోన్ చేయవచ్చు, అలాగే యూఏఈ ప్రభుత్వ హెల్ప్లెన్ నెంబర్లు 9712 4965228, +97192083344ను ఆశ్రయించవచ్చు. వదంతులు నమ్మవద్దు.. కరోనా సందర్భంగా గల్ఫ్‌లో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలు నడుపుతామని కొందరు విమాన టికెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు పరికిపండ్ల స్వదేశ్ వెల్లడించారు. అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ జరిగి, అధికారికంగా విమాన సర్వీసుల పునరుద్ధరణ జరిగే వరకు ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. -
కరోనా వ్యాప్తి: అక్కడ తొలి మరణం
మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో సోమవారం తొలి కోవిడ్-19(కరోనా వైరస్) మరణం నమోదైంది. ఇరాన్ నుంచి వచ్చిన 65 ఏళ్ల మహిళ ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఆమె ప్రయాణం తర్వాత ఎవరినీ నేరుగా కలవలేదని.. ఐసోలేషన్ వార్డులోనే ఉన్నారు కాబట్టి.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదే విధంగా ఇప్పటిదాకా దేశంలో 214 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో తొలి కరోనా మృతిని నమోదు చేసిన దేశంగా బహ్రెయిన్ నిలిచింది. ఈ నేపథ్యంలో... ‘‘ మనం అతికష్టమైన సవాలును ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా’’ అని బహ్రెయిన్ ఆరోగ్య శాఖా మంత్రి తాఫిక్ అల్ రాబియా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. దీంతో... ‘‘ మేమంతా ఇంట్లోనే ఉంటాం అందరి శ్రేయస్సు కోసం’’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లు తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. (కరోనా అప్డేట్: 118కి చేరిన కేసుల సంఖ్య) కాగా మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సౌదీ అరేబియా, కువైట్ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా జిమ్ములు, పబ్లిక్ పార్కులు, స్పాలు మూసివేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు దిగివస్తున్న వేళ తమ మార్కెట్‌కు అండగా నిలిచేందుకు అబుదాబి సోమవారం భారీగా నిధులు కేటాయించింది. క్యాపిటల్ మార్కెట్ లిక్విడిటీని పెంచేందుకు1 బిలియన్ దీరాంలు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక కరోనా కారణంగా నష్టపోతున్న చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకునేందుకు సౌదీ అరేబియా 50 బిలియన్ రియాల్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఖతార్ సైతం కరోనాను ఎదుర్కొనేందుకు 20.5 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. -
ఆ దేశాలలో నూతన సంవత్సర వేడుకలు నిషేధం
గల్ఫ్ డెస్క్: కొత్త సంవత్సర వేడుకలపై గల్ఫ్ దేశాల్లో భిన్న విధానం అమలవుతోంది. పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉండే యూఏఈ, బహ్రెయిన్లలో నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుండగా.. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమాన్‌లలో ఈ సంబరాలపై నిషేధం అమలవుతోంది. సౌదీ అరేబియాలో మొదటి నుంచి నిషేధం ఉంది. కువైట్‌లో 2016 నుంచి నిషేధం విధించారు. ఖతార్, ఒమాన్‌లలో కూడా నిషేధం ఉన్నప్పటికీ వలస జీవులు తమ క్యాంపులలో, ఇళ్లలో వేడుకలు జరుపుకుంటారు. యూఏఈ, బహ్రెయిన్లలో వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఉన్నా.. బహిరంగంగా పెద్ద శబ్దాలు వచ్చేలా సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయడం, టపాసులు పేల్చడం లాంటివి చేయరాదు. -
చట్టబద్ధంగా.. సురక్షితంగా వెళ్లండి
గల్ఫ్ డెస్క్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాలనుకునే వారికి నిబంధనలు, విధి విధానాలపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్(పీఎంఎల్‌యూ) అవగాహన కల్పిస్తూ వలసదారుల్లో చైతన్యం పెంపొందిస్తోంది. చట్టబద్ధంగా వెళ్లండి.. సురక్షితంగా వెళ్లండి.. అనే నినాదంతో యూనియన్ ప్రతినిధులు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. గల్ఫ్ వలసలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలను సమీకరించి.. వలస వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పల్లెల్లో కొంత మంది వలసదారులు నిరక్షరాస్యత కారణంగా మోసాలకు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వారి కుటుంబ సభ్యులకు వివరించి మోసపోకుండా ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో పాఠశాలలను కూడా అవగాహన కార్యక్రమాలకు వేదికగా ఎంచుకుంటున్నారు. ప్రత్యేకంగా కరపత్రాలను ప్రచురించి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నారు. కాగా, గల్ఫ్ వలసలపై నిర్వహిస్తున్న అవగాహన సమావేశాల్లో.. పలువురు తాము మోసపోయిన తీరును, గల్ఫ్ దేశాల్లో పడిన ఇబ్బందులను ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తుండడం గమనార్హం. పాస్‌పోర్టు దరఖాస్తు మొదలుకొని.. వలస వెళ్లేవారికి తమ పాస్‌పోర్టును పొందడానికి దరఖాస్తు చేసుకునే దశ నుంచి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గతంలో అనేక మంది పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో సరైన వివరాలు అందించకుండా.. అందుబాటులో ఉన్న ఏవో కొన్ని వివరాలతో పాస్‌పోర్టులను పొందారు. దీనివల్ల వలస వెళ్లిన కార్మికులు ఇంటికి వచ్చిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు లావాదేవీల విషయంలోనూ నష్టపోయారు. కొందరు గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలను స్వస్థలానికి తీసుకువచ్చే సమయంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలకు, పాస్‌పోర్టులోని వివరాలకు పొంతన కుదరడం లేదు. దీంతో మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందువల్ల పాస్‌పోర్టు దరఖాస్తులలో తప్పుడు వివరాలు అందించవద్దని పీఎంఎల్‌యూ ప్రతినిధులు సూచిస్తున్నారు. తాము వలసవెళ్లే దేశం, కంపెనీ, పని వివరాలపై స్పష్టత ఉండాలని, ఇందుకోసం లైసెన్స్డ్ ఏజెంట్ల ద్వారానే సరైన వీసాలను పొందాలని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రవాసీ బీమాపై... తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు పొందే ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) గురించి కూడా పీఎంఎల్‌యూ సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. వలస కార్మికులు రూ.325 ప్రీమియం చెల్లిస్తే రెండు సంవత్సరాల కాలపరిమితితో రూ.10లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ పాలసీ పొంది ఇ–మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు చేసుకుని ఎమిగ్రేషన్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుంది. పీబీబీవై లేకుండా కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లవద్దని ప్రతినిధులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ పొంది.. శిక్షణ పొందిన రంగంలోనే ఉపాధి పొందడానికి వీసా కోసం ప్రయత్నించాలి. విజిట్ వీసాపై వెళ్లవద్దు. ఫ్రీ వీసా, ఆజాద్ వీసా, ఖఫాలత్ వీసా, ప్రైవేట్ వీసాలు ఏమీ లేవు. ఒక వేళ అలాంటి వీసాలు ఇచ్చినా వెళ్లకూడదు. వీసా ఇచ్చే ఏజెంటును చెల్లుబాటు అయ్యే వీసా, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టు, డిమాండ్ లెటర్, పవర్ ఆఫ్ అటార్నీ గురించి ప్రశ్నించి ఆ పత్రాలను తీసుకోవాలి. టామ్‌కామ్ అందించే ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్(ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ)ను తీసుకోవడం వల్ల వలసదారులు ఇబ్బంది పడకుండా ఉంటారు. వలస వెళ్లే ముందు వీసా, పాస్‌పోర్టు ఇతర జిరాక్సు పత్రాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. దీంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరితో జాయింట్ ఖాతాను బ్యాంకులో తీసుకోవాలి. ఇమిగ్రేషన్ యాక్టు 1983 ప్రకారం లైసెన్స్ ఉన్న రిక్రూటింగ్ ఏజెంట్‌కు 45 రోజుల వేతనం లేదా గరిష్టంగా రూ.30వేలతో పాటు అదనంగా 18 శాతం జీఎస్టీ అంటే రూ.5,400 మాత్రమే వీసా కోసం చెల్లించాలి. ఇంతకంటే ఎక్కువ చెల్లించవద్దు. వలస వెళ్లిన తర్వాత.. విదేశాలకు వలస వెళ్లిన తరువాత వీసా స్టాంపింగ్, ఐడీ కార్డు పొందిన అనంతరం ఆ దేశంలోని మన విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి పేరు నమోదు చేసుకోవాలి. దీనివల్ల వలసకు చట్టబద్ధత వర్తిస్తుంది. ఉద్యోగం చేస్తున్న దేశంలో ఆ దేశ ఆచార, సంప్రదాయాలను పాటించాలి. అక్కడి చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో అక్కడి చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు చేయడం నిషేధం. వీసా ఇచ్చిన కంపెనీ లేదా యజమాని వద్ద కాకుండా ఇతరుల వద్ద పనిచేయడం సరికాదు. ఖల్లివెల్లిగా మారిన వారు హక్కులను కోల్పోతారు. యూఏఈకి మనుషుల అక్రమ రవాణా.. కొన్ని నెలల నుంచి యూఏఈలోని పలు ప్రాంతాల్లో హాస్పిటాలిటీ, సూపర్‌మార్కెట్, బల్దియా కంపెనీల్లో ఉపాధి పేరిట మనుషుల అక్రమ రవాణా సాగుతోంది. ఆయా కంపెనీల్లో ఉపాధి కల్పిస్తున్నా నేరుగా వర్క్ వీసా ఇవ్వకుండా మొదట విజిట్ వీసాపై మనుషులను యూఏఈకి తరలిస్తున్నారు. విజిట్ కం ఎంప్లాయ్మెంట్ వీసాలను లైసెన్స్డ్ రిక్రూటింగ్ ఏజెంట్లు జారీచేస్తున్నారు. విజిట్ వీసాపై యూఏఈకి పంపించి అక్కడ వర్క్ వీసా ఇవ్వడం వల్ల కార్మికులు ఎన్నో ప్రయోజనాలను కోల్పోతున్నారు. విజిట్ వీసాలపై విదేశాలకు వెళ్లడం వల్ల మన ప్రభుత్వం రూపొందించిన ఇ–మైగ్రేట్ సిస్టంలో వలస వెళ్లిన వారి పేర్లు నమోదు కావు. దీంతో ఆపద సమయంలో విదేశాంగ శాఖ సహాయం పొందలేకపోతున్నారు. ప్రవాసీ కార్మికులకు అందిస్తున్న రూ.10 లక్షల బీమా, ప్రమాద బీమా వర్తించవు. ఎవరూ నష్టపోవద్దని మా లక్ష్యం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, ఇతర ప్రయోజనాలపై మేము నిర్వహిస్తున్న అవగాహన సదస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చట్టబద్ధంగా వెళ్లకపోతే కలిగే ఇబ్బందులు, ఎదురయ్యే నష్టాలను వివరిస్తున్నాం. అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. గల్ఫ్ వలసల వల్ల ఎవరూ నష్టపోవద్దనేదే మా ఉద్దేశం. ప్రజలు మమ్మల్ని పలు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. – స్వదేశ్ పరికిపండ్ల, అధ్యక్షుడు, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి సౌదీ అరేబియా నుంచి సిద్దిపేట జిల్లా వాసుల వినతి సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని చింతమడక, ఎన్సాన్పల్లి, ఇర్కోడ్ గ్రామాలకు చెందిన ఐదుగురు కూలీలు ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చింతమడక గ్రామానికి చెందిన అనుమగారి కోటి, స్వామి, సుతారి కనకయ్య, ఎన్సాన్పల్లి గ్రామానికి చెందిన నర్సింలు, ఇర్కోడ్ గ్రామానికి చెందిన మాట్ల రవీందర్ ఉపాధి కోసం సౌదీకి వెళ్లారు. అయితే, గార్డెనింగ్ పనులు చేయాల్సి ఉంటుందని తమకు ఏజెంట్లు చెప్పారని, కానీ తమను పెట్రోల్ బావుల్లో పనులు చేయిస్తున్నారని వారు చెప్పారు. తాము ఈ పనులు చేయమని కంపనీ యజమానికి చెప్పడంతో.. యజమాని ఒక రోజు ఎండలో నిలబెట్టినట్లు తెలిపారు. గత్యంతరం లేక అదేపని చేస్తున్నామని, కొన్ని రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఉంటున్నామని వారు సౌదీ నుంచి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి తాము ఇండియాకు వచ్చేలా చూడాలని కోరారు. –పడిగె వెంకటేశ్, సిద్దిపేట రూరల్ ప్రమాదకర పనులు చేయిస్తున్నారు గార్డెన్ పని అని చెప్పి ఇక్కడ ప్రమాదకరంగా పెట్రోల్ బావుల్లో పనిచేయిస్తున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగి కొన్ని రోజుల క్రితం 16 మంది మృతి చెందారు. బిక్కుబిక్కుమంటూ పోట్టకూటి కోసం పనిచేస్తున్నాం. నాయకులు, అధికారులు స్పందించి మమ్మల్ని మా కుటుంబం వద్దకు చేర్చాలి. –అనుమగారి స్వామి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం.. బతుకుదెరువు కోసం సౌదీకి వచ్చిన మాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రమాదకరమైన పెట్రోల్ బావుల్లో పనిచేయిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరగుతుందోననే భయంతో గడుపుతున్నాం. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము స్వదేశానికి వచ్చేలా సాయం చేయాలి. –సుతారి కనకయ్య దినదినగండంగా బతుకుతున్నాం.. ఏజెంట్లు మోసం చేయడంతో ఇక్కడ పడరాని పాట్లు పడుతున్నాం. దినదిన గండంగా బతుకుతున్నాం. ప్రమాద స్థలాల్లో పని చేయము అని చెబితే ఇబ్బందులు పెడుతున్నారు. తిండిపెట్టకుండా ఎండలో నిలబెడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ఉంటున్నాం. మాకు ఇక్కడ ఉండాలని లేదు. –నర్సింలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. మేము ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఏజెంట్‌కు చెబితే ముంబైలోని కంపనీ వారి ఫోన్ నంబర్ ఇచ్చాడు. ముంబై వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదు. మమ్మల్ని ఇండియాకు పంపాలని ముంబై కంపనీ నుంచి మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తే వెంటనే పంపిస్తారు. కానీ, వారు స్పందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నాయకులు, అధికారులు స్పందించి మేము ఇంటికి వచ్చేలా చూడాలని కోరుతున్నాం. –రవీందర్ -
గల్ఫ్ వెళ్తున్నారా.. జాగ్రత్త
సాక్షి, తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): గల్ఫ్ దేశాలు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావు సూచించారు. బుధవారం తాడేపల్లిగూడెంలోని ప్రవాసాంధ్రుల సేవా కేంద్రంలో గల్ఫ్‌హెల్ప్ కార్యక్రమం నిర్వహించారు. ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లి గ్రామానికి చెందిన బి.పుష్పవేణి కుటుంబ అవసరాల నిమిత్తం 15 నెలల క్రితం ఒమన్ దేశం వెళ్లగా అక్కడ ఆమెకు జీతం ఇవ్వకుండా శారీరకంగా హింసిస్తున్నారని ఆమె భర్త వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకురావాలని మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన డి.సీత కుటుంబ అవసరాలు నిమిత్తం ఎనిమిది నెలల క్రితం కువైట్ వెళ్లగా అక్కడ ఆమెకు జీతం ఇవ్వకుండా హింసిస్తున్నారని, సీతను స్వదేశానికి రప్పించాలని ఆమె తమ్ముడు ఎం.శ్రీనివాస్‌రావు వినతిపత్రం సమర్పించారు. పెరవలి మండలానికి చెందిన సింహాచలం జీవనోపాధి నిమిత్తం పదేళ్ల క్రితం దుబాయ్ వెళ్లగా ఈనెల 9న అనారోగ్యంతో మరణించారని, ఆయన మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరారు. వెంటనే స్పందించిన మాణిక్యాలరావు భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈనెల 21న మృతదేహం స్వదేశం రప్పించడంతో పాటు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉచిత అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. హెచ్డీఎఫ్సీ రీజినల్ మేనేజర్ వీర్రాజు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. ల్ప్‌లో వినతులు స్వీకరిస్తున్న గట్టిం మాణిక్యాలరావు -
ఎడారి దేశాలతో అనుబంధం
గల్ఫ్ దేశాలతో ఆ పల్లెవాసుల బంధం పెనవేసుకుంది. ఆ గ్రామంలో ముప్పైసంవత్సరాల క్రితం ఇద్దరితో ప్రారంభౖమైన వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వంద మందికిపైగా వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. కార్మికులుగాను,ఉద్యోగులుగాను ఉన్నారు. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారుప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. కొరుట్ల శ్రీరాములు, ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కోస్నూరుపల్లె మారుమూల గ్రామం. ఈ గ్రామానికి అనుబంధంగా నాయికపుగూడెం, పెరుమండ్ల గూడెం, కోతులగూడేలున్నాయి. మొత్తం 300 కుటుంబాలు ఉండగా.. 1480 జనాభా ఉంది. కోస్నూరుపల్లె నుంచి మొదట 1989లో గల్ఫ్‌కు వలసలు ప్రారంభమయ్యాయి. చెరుకుపల్లె మల్లారెడ్డి, మూల మోహన్‌రెడ్డిలు మొదటగా దుబాయికి వెళ్లారు. ఇప్పుడు ఈ గ్రామానికి చెందిన దాదాపు 120 మంది గల్ఫ్‌లోని వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. దుబాయి, మస్కట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ ప్రాంతాలకు మెరుగైన ఉపాధి కోసం వెళ్లా్లరు. అక్షరజ్ఞానం లేని వారు కూలీలుగాను, ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆయా దేశాల్లో ఉపాధి పొందుతున్న వారు గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొందరు గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి గ్రామంలోనే స్థిరపడి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. గల్ఫ్‌కు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డా నేను 1991లో మా స్నేహితుడు తిరుపతిరెడ్డితో కలిసి దుబాయికి వెళ్లి ఐదు సంవత్సరాలు ఓ కంపెనీలో పనిచేసిన తర్వాత మస్కట్‌లో ఐదు సంవత్సరాలు, బహ్రెయిన్‌లో ఐదు సంవత్సరాలు ఉపాధి పొంది వచ్చాను. గల్ఫ్‌లో పొందిన సంపాదనతో ఆర్థికంగా స్థిరపడ్డా. రెండు ఎకరాల భూమి కొనుక్కున్నా. ఆరోగ్యం బాగాలేక గ్రామానికి తిరిగి వచ్చాను. ఇక్కడే వ్యవసాయం చేస్తున్న. గల్ఫ్ దేశాలతో మా కుటుం» ం బాగుపడింది. – మూల మోహన్‌రెడ్డి ఇరవై సంవత్సరాలుకు పైగా పనిచేశాను 1992 నుంచి 2013 వరకు వివిధ దేశాల్లో పనిచేసిన. యూఏఈ, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ దేశాలకు వెళ్లాను. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌కు గురైన. సంపాదించిన కొద్దిపాటి సొమ్ము వైద్యానికే ఖర్చయింది. కాలు, చేయి పనిచేయక వికలాంగుడినయ్యాను. పింఛన్ ఇస్త్తలేరు. నా తల్లి పింఛన్‌పై బతుకుతున్న.– మడుప రాజరెడ్డి గ్రామానికి తిరిగి వచ్చి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను గల్ఫ్ దేశాల్లో పదిహేను సంవత్సరాలున్నా. ఎన్నో కష్టనష్టాలు అనుభవవించిన. 2007లో ఇంటికి చేరిన. వలస జీవనం వద్దని గ్రామంలోనే ఉంటూ నీటి సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన. తర్వాత గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సర్పంచ్‌గా పట్టం కట్టారు. ప్రజల సహకారంతో గ్రామాభివద్ధికి కృషిచేస్తున్నా. – ఎన్నం లక్ష్మారెడ్డి -
కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటన
సాక్షి, హైదరాబాద్ : కుటుంబాల పోషించడానికి పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలను తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన గురించి ఆయన మాటల్లోనే.. ‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మిగిలిన తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రజలు పని వెతుక్కుంటూ ఎడారి దేశాలకు పెద్ద ఎత్తున వలస వెళ్లారు. అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి జీతాలు కూడా తక్కువే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇక్కడే చేసుకోవడానికి చాలా పనుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి స్థానికంగా కార్మికులు దొరకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అందుకోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వారిని రప్పించి న్యాక్‌లో శిక్షణనిప్పించాలని నిర్ణయించాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో, బిల్డర్లతో సంప్రదించి నిర్మాణ రంగంలో వారికి పని కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదే విషయాన్ని గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలకు చెప్పడానికి స్వయంగా నేనే అక్కడికి వెళ్తున్నా’నన్నారు. పర్యటనకు ముందు వలస వెళ్లిన వారు ఎక్కువగా నివసించే నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలో కేసీఆర్ సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్నారై పాలసీ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆధార్ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళలో పర్యటించనుంది. -
గల్ఫ్‌కి మరిన్ని అమెరికా బలగాలు
వాషింగ్టన్/టెహ్రాన్: గల్ఫ్ ప్రాంతానికి మరిన్ని బలగాలు పంపుతున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు ఇరాన్ పనేనని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో మరిన్ని బలగాలు పంపించడానికి నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌పై అమెరికా తీవ్రమైన ఆర్థిక ఆంక్షల్ని విధించిన కొద్ది గంటల్లోనే బలగాలను పంపాలని నిర్ణయించడంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్న ఆందోళన నెలకొంది. గత జూన్‌లో అమెరికా నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన దగ్గర్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో కీలక చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి. ఇందుకు ఇరానే కారణమని నమ్ముతున్న అమెరికా ఆ దేశంపై గుర్రుగా ఉంది. అమెరికా ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతోందని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు బదులిచ్చిన ట్రంప్ ఇప్పటికిప్పుడే ఇరాన్లో 15 కీలక ప్రాంతాలను ధ్వంసం చేసే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని కానీ ఆ దేశంపై యుద్ధానికి దిగే ఉద్దేశం లేదన్నారు. రణరంగంగా మారుస్తాం: ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో బలగాలను మోహరించాలన్న అమెరికా ఆదేశాలపై ఇరాన్ స్పందించింది. తమపై దాడికి దిగే దేశాలను యుద్ధక్షేత్రాలుగా మారుస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ హొస్సైన్ సలామీ హెచ్చరించారు. ‘తమ దేశాన్ని ప్రధాన యుద్ధక్షేత్రంగా మార్చాలనుకుంటే అలాగే కానివ్వండి. మా భూభాగాన్ని ఆక్రమించుకోవడాన్ని అడ్డుకుని తీరుతాం. వాళ్లు మరోసారి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడతారని అనుకోవడం లేదు’అని అమెరికానుద్దేశించి వ్యాఖ్యానించారు. -
సంక్షోభంలో గల్ఫ్
మారణాయుధాల వినియోగంలో, ధ్వంస రచనలో ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు నిరూపించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆరామ్కో ఆధ్వర్యంలో తూర్పు ప్రాంతంలో ఉన్న రెండు చమురు క్షేత్రాలపై శనివారం ద్రోన్లతో దాడులు జరిపి ఆ దేశానికి భారీ నష్టం కలగజేశారు. ప్రపంచంలో ప్రధాన ముడి చమురు ఉత్పత్తి దేశంగా ఉన్న సౌదీ అరేబియా ఈ ఉదంతంతో ఒక్కసారిగా తన ఉత్పత్తిని సగానికి తగ్గించుకోవాల్సి వచ్చిందంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. సౌదీ సరిహద్దుల్లోకి తిరుగుబాటుదార్లు చొరబడి తమ సైనికుల్ని చంపేశారని ఆరోపిస్తూ నాలుగేళ్లక్రితం ఈజిప్టు, బహ్రైన్, కువైట్, జోర్డాన్, సుడాన్ తదితర పది దేశాలతో సౌదీ అరేబియా కూటమి కట్టి హౌతీ తిరుగుబాటుదార్లపై యుద్ధం ప్రారంభించింది. యుద్ధాలెప్పుడూ అనుద్దేశిత పర్యవసానాలకు దారితీస్తాయి. యెమెన్ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించి ఉత్తర యెమెన్‌లో షియా మైనారిటీ తెగ జైదీలకు చెందిన హౌతీ తిరుగుబాటుదార్ల పని పట్టాలని సంకల్పించిన సౌదీ అరేబియా చివరికిప్పుడు తన గగనతలాన్నే రక్షించుకోలేక అందరిలో నగుబాటుపాలైంది. యెమెన్‌లో అధ్యక్షుడు హదిని పదవినుంచి తప్పించాలని సంకల్పించిన హౌతీ తిరుగుబాటుదార్ల వెనక ఇరాన్ హస్తమున్నదని సౌదీ అరేబియా శంకించి ఈ పోరు ప్రారంభించింది. అసలే యెమెన్ అంతక్రితం మూడేళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతుంటే సౌదీ తగుదునమ్మా అని తలదూర్చి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇంతవరకూ ప్రపంచ దేశాలన్నీ హౌతీ తిరుగుబాటుదార్లను తేలిగ్గా తీసుకున్నాయి. నాలుగేళ్లుగా సౌదీ దాడులను తట్టుకుని నిలబ డినా వారిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజా దాడులతో వారి శక్తిసామర్థ్యాలపై అందరిలో పున రాలోచన బయల్దేరింది. ఎందుకంటే వారు పది ద్రోన్లను సౌదీపై గురిపెడితే అరేబియా ద్వీపకల్పం పొడవునా ఎవరి నిఘాకూ చిక్కకుండా ఆ ద్రోన్లు లక్ష్యాన్ని ఛేదించాయి. ఇరాన్ హస్తం లేకపోతే హౌతీలకు ఇది అసాధ్యమని సౌదీతోపాటు అమెరికా కూడా విశ్వసిస్తోంది. ఏం జరిగిందో సౌదీ స్పష్టంగా చెబితే తాము యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ద్రోన్లు ఇరాన్ భూభాగం నుంచి వచ్చాయా, ఇరాక్‌లో షియా ఆధిపత్యం ఉన్న ప్రాంతం నుంచి వచ్చాయా అన్నది అమెరికా ఇంకా తేల్చుకోలేదు. ఇలాంటి బెదిరింపుల వల్ల ఇరాన్ పాదాక్రాంతమవుతుందని, పశ్చిమాసియాపై పూర్తి పట్టు సాధించవచ్చునని అమెరికా అంచనా వేస్తే అది ఘోర తప్పిదమే అవుతుంది. ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ పోరును మరింత ఉగ్రరూపం దాల్చ కుండా ఎలా చల్లార్చడమన్నదే అందరి ధ్యేయం కావాలి. పశ్చిమాసియాలో పూర్తి స్థాయి యుద్ధమే సంభవిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయో తాజా పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుంది. ద్రోన్ దాడుల తర్వాత సౌదీ అరేబియా ఒక్కసారిగా తన దినసరి చమురు ఉత్పత్తిలో 57 లక్షల బ్యారెళ్ల కోత పెట్టాల్సివచ్చింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలో 5 శాతం కన్నా ఎక్కువే. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారి పైపైకి ఎగబాకాయి. 55 డాలర్లున్న బ్యారెల్ చమురు ధర 67 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పల్టీ కొట్టాయి. కరెన్సీ విలువలు పతనమయ్యాయి. బంగారం ధర మరోసారి భగ్గు మంది. మన దేశంపై కూడా పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు బాగా పెరిగి అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ విపత్కర స్థితిలో చిక్కుకుంటుంది. ఇప్పటికే 5శాతంగా ఉన్న వృద్ధి రేటులో మరింత కుంగుబాటు ఉంటుంది. మన చమురు అవసరాల్లో 83 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఈ దిగుమతుల్లో సౌదీ వాటాయే అధికం. తమ నుంచి వచ్చే చమురులో కోత విధించబోమని సౌదీ అరేబియా మన దేశానికి ఇప్పటికే హామీ ఇచ్చింది. వారం రోజుల్లో చమురు ఉత్పత్తి మళ్లీ యధా స్థితికి చేరుతుందని తెలిపింది. అయితే తనకు వచ్చి పడిన నష్టాలను పూడ్చుకోవడానికి ముందూ, మునుపూ ధరలు పెంచే ప్రమాదం లేక పోలేదు. అదే జరిగితే మన కష్టాలు మరింతగా పెరుగుతాయి. ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదాల గురించి ఇన్నాళ్లూ అందరిలోనూ ఉంటున్న అంచనాలు వేరు. సిరియా సంక్షోభం సకాలంలో చల్లారకపోతే అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ తలెత్తు తుందని, అది ప్రపంచ దేశాలన్నిటినీ ఆర్థికంగా కుంగదీస్తుందని అనుకున్నారు. అక్కడ సంక్షోభం యథాతథంగానే ఉన్నా అగ్రరాజ్యాలు సంయమనం పాటించాయి. అయితే అమెరికా–చైనాల టారిఫ్‌ల యుద్ధం ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాల్చి ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ఊబిలోకి నెడుతుందని ఈమధ్యకాలంలో అందరూ ఆందోళనపడ్డారు. అది కూడా ఎంతో కొంత చల్లారింది. కానీ ఊహిం చనివిధంగా తాజా ద్రోన్ దాడులు పశ్చిమాసియాలో కయ్యానికి ఆజ్యం పోశాయి. అటు సిరియా సంక్షోభమైనా, ఇటు యెమెన్ రగడైనా సౌదీ అరేబియా పుణ్యమే. 2011లో జరిగిన అరబ్ విప్లవంలో ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ ఊహించనివిధంగా పతనం కావడంతో ఇరాన్ ప్రాబల్యం పెరుగుతుందని భయపడ్డ సౌదీ... అందుకు సిరియాలో నిప్పు రాజేయడమే విరుగుడుగా భావిం చింది. అక్కడ పాలకుణ్ణి మారిస్తే అది తన చెప్పుచేతల్లోకి వస్తుందని అంచనా వేసింది. కానీ 2015లో రష్యా రంగప్రవేశంతో అది బెడిసికొట్టింది. ఆ తర్వాత సౌదీ అరేబియా యెమెన్‌లో వేలుపెట్టింది. ఈ నాలుగేళ్లలో అక్కడి ఘర్షణల్లో లక్షమంది మరణించగా, లక్షలాదిమంది శరణార్ధులుగా మారారు. ఇప్పుడు అమెరికా ఇరాన్‌పై దాడికి దిగితే అది పశ్చిమాసియాకు మాత్రమే కాదు...ప్రపంచానికే పెను ముప్పు కలిగిస్తుంది. అందుకే ప్రపంచ దేశాలూ, ఐక్యరాజ్యసమితి మొదలుకొని అన్ని ప్రపంచ సంస్థలూ పశ్చిమాసియాలో శాంతికి కృషి చేయాలి. ఏదో ఒక సాకుతో ఇరాన్‌పై ఒంటికాలిపై లేస్తున్న అమెరికాను అదుపు చేయాలి. -
ఎడారి దేశాల్లో ఆవిరి అవుతున్న కన్నీళ్లు
తణుకు పట్టణానికి చెందిన లింగాల బేబి మూడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్లింది. ఇరగవరం మండలం ఓగిడి గ్రామానికి చెందిన చిన్నబాబు, పాలకొల్లుకు చెందిన జ్యోతి ద్వారా విదేశాలకు వెళ్లింది. అక్కడ ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పిన వీళ్లు అక్కడ ఎలాంటి ఉపాధి కల్పించకపోగా కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకూ అవకాశం కల్పించడం లేదు. ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నా.. దుబాయిలో ఏజెంటుగా వ్యవహరిస్తున్న జ్యోతి నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మొగల్తూరుకు చెందిన పులిదిండి నాగలక్ష్మి గతంలో నర్సుగా పనిచేశారు. దుబాయి వెళ్లాలనే ఆశతో ఇరగవరానికి చెందిన దొండి వెంకట సుబ్బారావు (చినబాబు)ను సంప్రదించారు. అతను రూ.లక్ష తీసుకుని దుబాయి పంపాడు. అక్కడికి వెళ్లాక ఆమె వద్ద పాస్‌పోర్టు తీసేసుకుని తిండిపెట్టకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె మరికొందరితో కలిసి భారత ఎంబసీకి చేరుకున్నారు. అక్కడి నుంచి వాట్సాప్‌లో పోస్టు పెట్టడం, అది మొత్తం సర్క్యులేట్ అవ్వడంతో విషయాన్ని ‘సాక్షి’ డీజీపీ దృష్టికి తీసుకువెళ్లింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు పోలీసుశాఖ కృషి చేసింది. నాగలక్ష్మి క్షేమంగా సొంతఊరు చేరారు. సాక్షి, ఏలూరు : గల్ఫ్ అంటే అంతా కాసుల గలగల అనుకుంటారు. ఓసారి వెళ్లొస్తే సెటిలైపోవచ్చని, ఎడారి దేశానికి వెళ్లి నాలుగు రాళ్లు సంపాదిస్తే కుటుంబం బాగుపడుతుందని ఆశపడటమే వారికి తిప్పలు తెచ్చిపెడుతోంది. సొంత ఊళ్లో పనుల ద్వారా వచ్చే ఆదాయం చాలక, వ్యవసాయం కలిసి రాక.. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా పేరుకుపోతున్న అప్పులు తీర్చుకునేందుకు కష్టమైనా, నష్టమైనా అంటూ చాలామంది గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. వర్కింగ్ వీసాకు బదులుగా టూరిస్ట్ వీసాపై విదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోతున్నారు. ఆదిలోనే ఏజెంటు చేతిలో మోసపోతే.. వెళ్లాక చెప్పిన పనికి కుదరకపోతే.. పని చేసినా చేతికి చిల్లిగవ్వ ఇవ్వనని సేఠ్ మొండికేస్తే ఎడారిలో ఒంటెల మధ్య జీవితం తెల్లారిపోతోంది. జిల్లాలో 2016 నుంచి ఇప్పటి వరకూ గల్ఫ్ మోసాలపై 132 కేసులకుపైగానే నమోదు అయ్యాయి. జిల్లాలో 102 మంది వరకూ బోగస్ ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అడుగడుగునా మోసాలే ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఎందరో జీవితాలు చీకట్లో మగ్గిపోతున్నాయి. లక్షలు వెచ్చించి ఏజెంట్ల మోసాలకు గురై మధ్యలోనే ఆగిపోయేవారు కూడా ఉన్నారు. పాలకోడేరుకు చెందిన యేసురత్నం కుమారుడిని గల్ఫ్‌కు పంపాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణాజిల్లాకు చెందిన ఏజెంట్ మైలాబత్తుల రాంబాబు యేసురత్నం కొడుకును దుబాయి పంపుతానని చెప్పి రూ.80 వేలు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ పంపలేదు. ఇదిలా ఉంటే ఇంటర్వ్యూల పేరుతో ఏజెంట్లు చెప్పే మాయమాటలు నమ్మి ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడేవారు కూడా లేకపోలేదు. కొందరు మహిళలకు గల్ఫ్ తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి ఏజెంట్లు లొంగదీసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దేశంకాని దేశంలో రోదన జిల్లా నుంచి ఉపాధి కోసం వేలాది మంది కువైట్, మస్కట్, సౌదీ అరేబియా, బెహ్రాన్, దుబాయి, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. ఏజెంట్ల మోసాలకు బలై పనుల్లేక చేయని నేరానికి జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య వందల్లోనే ఉందంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇతర దేశాలకు వెళ్లి మత్యువాత పడిన వారి సంఖ్య జిల్లాలో 150మందికి పైగానే ఉంది. కువైట్, సౌదీ, ఒమన్, ఖతార్ వంటి దేశాల్లో పనివాళ్లను, కార్మికులను సప్లయి చేసే కార్యాలయాలు ఉంటాయి. అక్కడి ఏజెంట్లు ఇక్కడి ఏజెంట్ల ద్వారా ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఎక్కువ సంపాదన ఆశ చూపించి వలలో పడేస్తున్నారు. ఇక్కడి ఏజెంటు ద్వారా ఆ దేశంలో అడుగు పెట్టగానే వారి కార్యాలయాలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఎవరి ఇంట్లో పనికి కుదిరితే వాళ్లు వచ్చి తీసుకెళతారు. పని బాగుంటే పర్లేదు కానీ ఇబ్బందులు ఎదురైతే మాత్రం యజమాని తిరిగి తీసుకెళ్లిన కార్యాలయానికే అప్పగించేస్తారు. ఎవరు వచ్చి పనికి తీసుకెళతారో తెలియక ఎవరైనా వచ్చేవరకూ కార్యాలయాల వద్దే బొమ్మల్లా ఎదురు చూడాల్సిన పరిస్థితి. నకిలీ ఏజెంట్లపై నిఘా పెట్టాం జిల్లాలో నకిలీ ఏజెంట్లపై నిఘా పెట్టాం. గల్ఫ్ ఏజెంట్స్ పేరుతో జరుగుతున్న మోసాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం. దీనిపై ఒక బృందాన్ని ఢిల్లీకీ పంపాం. నకిలీ ఏజెంట్లపై చీటింగ్ కేసులకు మాత్రమే పరిమితం చేయకుండా ట్రాఫికింగ్ కేసులూ పెడుతున్నాం. – ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ -
చినబాబు అరెస్ట్, జ్యోతికి బ్లూ కార్నర్ నోటీస్!
సాక్షి, అమరావతి: విజిటింగ్ వీసాలతో మోసం చేస్తున్న ఏజెంట్ల ఏరివేతకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా మహిళలను అక్రమంగా విదేశాలకు పంపుతున్న ఏజెంట్ చినబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ‘జగనన్నా.. మమ్మల్ని కాపాడన్నా’ అని బోరున విలపిస్తూ పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు మహిళలు దుబాయ్ నుంచి వీడియో క్లిప్పింగ్ పంపిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ మీడియా దృష్టికి వచ్చిన ఆ వీడియోను డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు పంపించగా.. స్పందించిన ఆయన అలాంటి ఏజెంట్ల ఏరివేత బాధ్యతలను సీఐడీ విభాగానికి అప్పగించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆ వీడియోలో.....‘తమను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రధాన ఏజెంట్ జ్యోతి, మరో ఏజెంట్ దొండ వెంకట సుబ్బారావు (చినబాబు) ఎవరికో అమ్మేశారని బాధిత మహిళలు’ ఆరోపించడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఏజెంట్ చినబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని అతడి నుంచి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే జ్యోతి అనే ప్రధాన ఏజెంట్ దుబాయ్‌లో కార్యాలయాన్ని నడుపుతున్నట్టు తెలిసింది. ఆమెను ఇండియాకు రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయనున్నారు. దుబాయ్‌లో బాధిత మహిళలు ఎవరైనా ఉంటే రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మొగల్తూరుకు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో ఒక ఏజెంట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చదవండి: ఎడారి దేశంలో తడారిన బతుకులు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొంతమంది మహిళలు.. ఏజెంట్ల మోసంతో తాము దుబాయ్‌లో చిక్కుకుపోయామని, కాపాడాలంటూ పంపిన వీడియో వైరల్ అయిందన్నారు. పాలకొల్లుకు చెందిన చినబాబు మహిళలను ఎంపిక చేసి గల్ఫ్ దేశాలకు పంపుతున్నట్లు చెప్పారు. లైసెన్స్ లేకుండా జిల్లాలోని కొందరు ఏజెంట్లు గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. నాగలక్ష్మి అనే మహిళ వద్ద నుంచి లక్ష రూపాయలు తీసుకుని, ఆమెను టూరిస్ట్ వీసాపై నర్సు ఉద్యోగానికి దుబాయ్ పంపాడని, ఆమెతో పాటు మరో అయిదుగురు మహిళా బాధితులు ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ అక్రమ రవాణాపై జిల్లాలో రెండు, రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అయినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇక దుబాయ్‌లో ఉండే జ్యోతి అనే మహిళ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను దుబాయ్‌లో రిసీవ్ చేసుకుంటుందని తెలిపారు. ఎస్పీలను అప్రమత్తం చేశాం బాధిత మహిళల వీడియో క్లిప్పింగ్‌ను అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించాం. మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లతోపాటు మహిళలు, బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేయాలని ఆదేశించాం. మహిళలు తమ సమస్యలను 112, 181, 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. వాట్సాప్ నంబర్ 91212 11100కు సమాచారం ఇచ్చినా సహాయం అందుతుంది. -గౌతమ్ సవాంగ్, డీజీపీ -
ఎడారి దేశంలో తడారిన బతుకులు
సాక్షి, పశ్చిమ గోదావరి: జీవనోపాధి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఎందరో దళారుల వలలో చిక్కి అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబానికి ఆసరా కోసం వెళ్లిన వారిని తిండి తిప్పలు లేకుండా చేసి గదిలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు. ఇలా దుబాయ్ వెళ్లి అక్కడి విదేశీ రాయబార అధికారుల సహాయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని స్వగ్రామం తిరిగి వచ్చింది ఓ మహిళ. తనలాంటి బాధితులు పదుల సంఖ్యలో అక్కడ ఉన్నారని వారిని సీఎం జగన్మోహన్రెడ్డి కాపాడాలని ఆమె కోరుతోంది. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మొగల్తూరుకి చెందిన చెందిన పులిదిండి నాగలక్ష్మిది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. భర్త సురేష్ పొక్లయిన్ డ్రైవర్‌గా చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబం రెండేళ్ల కిత్రం మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి రాగా రెండు నెలల క్రితం మొగల్తూరుకు మకాం మార్చారు. నాగలక్ష్మికి నర్సుగా చేసిన అనుభవం ఉండటంతో దుబాయ్ వెళ్లే ఆలోచన చేశారు. ఈనేపథ్యంలో ఇరగవరం మండలం ఓగిడి గ్రామానికి చెందిన దొండి వెంకట సుబ్బారావు (చినబాబు) పరి చయం కావడంతో దుబాయ్ పంపేందుకు రూ.లక్ష ఖర్చువుతుందనడంతో అంగీకరించి అతడికి గత నెలలో సొమ్ములు ఇచ్చారు. గత నెల 13న నాగలక్ష్మిని హైదరాబాద్ తీసుకువెళ్లి విమానం ఎక్కించి దుబాయ్‌లో ఆకుమర్తి జ్యోతి అనే మహిళను కలవమని సుబ్బారావు సూచించాడు. 14న దుబాయ్‌లో విమానం దిగిన తర్వాత నాగలక్ష్మిని జ్యోతి జుల్ఫా అనే ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడి నుంచే నాగలక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి. అక్కడ వారు ఆమె పాస్‌పోర్టు తీసుకుని తిండి కూడా పెట్టకుండా ఇబ్బందులు పెట్టారు. అక్కడ తనతో పాటు మన రాష్ట్రానికి చెందిన వారు మరో పది మంది, కేరళ, చెన్నై, మహారాష్ట్రకు చెందిన వారు కూడా ఉన్నారని నాగలక్ష్మి చెప్పింది. మనిషి అందంగా ఉండి వారికి నచ్చితేనే నర్సుగా ఉద్యోగం ఇప్పిస్తారని, లేకపోతే వ్యభిచార కూపాలకు అమ్మేస్తారని నాగలక్ష్మి వాపోయింది. వ్యభిచారం చేసేందుకు ఒప్పుకోకపోతే దారుణంగా హింసిస్తారని అంటోంది. 15 రోజులపాటు ఎంబసీలోనే.. తాను ఇన్ని బాధలు అనుభవించి భర్తకు ఫోన్లో విషయం చెప్పానని.. స్వదేశానికి వచ్చేందుకు సంబంధిత ఏజెంట్ మరో రూ.50 వేలు డిమాండ్ చేశాడని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తన భర్త అప్పులు చేసి మరీ రూ.50 వేలు ఏజెంట్‌కు ఇచ్చాడని, అయినా తనను స్వదేశానికి రప్పించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంది. తాను విషయాన్ని భర్తకు తెలియజేశానని దుబాయ్‌లో ఉన్నవారికి తెలిసి తనను మరిన్ని ఇబ్బందులు పెట్టారని కన్నీటి పర్యంతమైంది. ఈక్రమంలో గతనెల 27న మరో మహిళతో కలిసి స్థానికంగా ఉన్న వారి సహకారంతో దుబా య్‌లోని భారత ఎంబసీకి చేరుకుని విషయాన్ని వివరించామని, అక్కడి అధికారులు వెంటనే స్పందించి 15 రోజులపాటు తమకు అక్కడ ఆశ్రయం కల్పించారని నాగలక్ష్మి చెప్పింది. ఈనెల 10వ తేదీన పాస్‌పోర్టు ఇచ్చి ఖర్చుల కోసం నగదు ఇచ్చి తనను స్వదేశానికి పంపించారంది. తనతో మరో మహిళ స్వదేశానికి రాగా ఎంబసీలో మరో పది మంది మహిళలు ఉన్నారని, భాష రాకపోవడం, టూరిస్ట్ వీసాతో అక్కడకు వెళ్లడం, దళారుల చేతిలో చిక్కుకోవడం వంటి కారణాలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వాపోయింది. సీఎం జగన్మోహన్రెడ్డి గల్ఫ్ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించి రక్షించాలని, మోసపూరిత ఏజెంట్లను శిక్షించాలని నాగలక్ష్మి కోరుతున్నారు. -
చివరి చూపుకు ఆర్నెల్లు పట్టింది
సాక్షి,సిరిసిల్ల : ఉన్న ఊరిలో ఉపాధిలేక 25ఏళ్ల నుంచి గల్ఫ్దేశాలు వెళ్తూ.. అక్కడ కూలీనాలీ చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్లకోసారి ఇంటికొచ్చి భార్యా,బిడ్డల బాగోగులు చూసుకుని వెళ్తున్నాడు. ఆర్నెల్ల క్రితం గల్ఫ్‌లో పనిస్థలంలో గుండెపోటుతో మరణిస్తే.. ఆ విషయాన్ని అక్కడి కపిల్ మూడు నెలల వరకు గోప్యంగా ఉంచాడు. కుటుంబసభ్యులు మూడు నెలల క్రితం వాకాబు చేయగా అంతకు మూడు నెలల క్రితమే గుండెపోటుతో చనిపోయాడని సమాచారం అందింది. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో శనివారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలకేంద్రానికి చెందిన బుడిద పోచయ్య(55) సొంత ఊరిలో ఉపాధిలేక 25ఏళ్లుగా గల్ఫ్ వెళ్తున్నాడు. రెండేళ్లకోసారి ఇంటికి వచ్చి భార్యా, పిల్లలను చూసుకునేవాడు. సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు. ఆర్నెల్ల క్రితం పనిస్థలంలో గుండెపోటుతో మరణించాడు. కపిల్ ఆ విషయాన్ని పోచయ్య కుటుంబ సభ్యులకు చెప్పలేదు. మూడు నెలలుగా పోచయ్య నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన వారి ద్వారా వాకాబు చేయగా అతడు 3నెలల క్రితం మరణించినట్లు తెలిసింది. విషయాన్ని కుటుంబసభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ తోపాటు సౌదీలోని ఇండియన్ ఎంబస్సీకి లేఖరాశారు. వెంటనే మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. జాగిత్యాల జిల్లాకు చెందిన గల్ఫ్ సోషల్ వర్కర్ శేఖ్‌చాంధ్ దగ్గరుండి మృతదేహాన్ని ఇండియాకు రప్పించి శనివారం తంగళ్లపల్లికి చేర్చారు. పోచయ్యకు భార్య లక్ష్మీ,కూతురు లత, కొడుకులు లవన్, నితిన్‌లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఎంపీపీ పడిగెల మానసరాజు, సర్పంచ్ అంకారపు అనిత, ఎంపీటీసీ కోడి అంతయ్య, టీఆర్ఎస్ నాయకులు అంకారపు రవీందర్, పడిగెల రాజు పరామర్శించారు. స్వగ్రామం చేరుకున్న మల్లేశ్ మృతదేహం దుబాయ్‌లో వారం రోజుల క్రితం మృతి చెందిన మండలంలోని సత్తెక్కపల్లివాసి మల్లేశ్ మృతదేహాం శనివారం స్వగ్రామం చేరుకుంది. ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లిన మల్లేశ్ అక్కడ భవన నిర్మాణ రంగ కార్మికునిగా పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 3న పని చేస్తున్న స్థలంలో ప్రమాదవశాత్తు క్రింద పడి మరణించాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్ సంస్థల దోపిడీ
సాక్షి, బోథ్: గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల శవపేటికల్ని స్వగ్రామానికి రవాణా చేయడానికి అంబులెన్స్ సంస్థలు అందిన కాడికి బాధితుల నుంచి దోచుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలు, ప్రమాదాలలో చనిపోయిన వలస కార్మికుల శవాలు స్వగ్రామానికి రావడానికి నెలల తరబడి వేచి చూస్తున్న కుటుంబాల బలహీనతలు ఆసరా చేసుకొని అంబులెన్స్‌ల నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటూ డబ్బుల దందా కొనసాగిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే బాధిత కుటుంబ సభ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన జలెందర్(38) ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలుజారి పడడంతో తలకు బలమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి కంపెనీ వారు ఈ నెల 3వ తేదీన జలెందర్ శవపేటికను హైదరాబాద్‌కు పంపారు. ఆధికారులు మృతుని అన్న కుమారుడు హరీష్‌కుమార్‌కు శవపేటికను అప్పగించి, ఉచిత అంబులెన్స్‌లో సాగనంపారు. హైదరాబాద్ నుంచి శవపేటికతో వెళ్లిన అంబులెన్స్‌లో నుంచి శవాన్ని గ్రామాస్థులు దించుకున్నారు. ప్రభుత్వానికి కిరాయికి సరఫరా చేసే శ్రీసాయి అంబులెన్స్ సర్వీసెస్ డ్రైవర్ జలెందర్ బంధువుల నుంచి బలవంతంగా రూ. 1500 వసూలు చేశాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న హరీష్ కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ సర్వీసు సంస్థ ప్రతినిధి గూగుల్ పేలో డబ్బు వాపస్ ఇచ్చినట్లు హరీష్‌కుమార్ తెలిపారు. -
ఆదుకునేవారేరీ
సాక్షి, బొమ్మెన భూమేశ్వర్(వరంగల్) : ఉపాధి కోసం షార్జా వెళ్లిన ఆ వ్యక్తి తోటి కార్మికునితో జరిగిన ఘర్షణలో చనిపోవడంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. అతని భార్య పెద్ద దిక్కును కోల్పోయి బాధను దిగమింగుకుంటూనే కుటుంబ భారాన్ని మోసింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌కు చెందిన గోవర్దన్, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట్‌కు చెందిన ధరూరి బుచ్చన్న ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే గదిలో నివాసం ఉండేవారు. 2001లో నివాస గదిలో ఇద్దరి మధ్య క్షణికావేశంలో జరిగిన ఘర్షణలో గోవర్దన్ మరణించాడు. గోవర్దన్ మరణానికి బుచ్చన్నను కారకునిగా గుర్తించిన షార్జా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా అతనికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. బుచ్చన్న 18 ఏళ్ల నుంచి షార్జా జైలులోనే మగ్గిపోతున్నాడు. కడసారి చూపు కూడా దక్కలేదు.. షార్జాలో మరణించిన గోవర్దన్ మృతదేహాన్ని ఆర్థిక, సాంకేతిక కారణాలతో భారత్‌కు పంపలేదు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులు కడసారి చూపునకు కూడా నోచుకోలేదు. గోవర్దన్‌పై ఆధారపడిన భార్య రాధ, కొడుకు నవీన్, కూతురు రవళిలు పెద్ద దిక్కును కోల్పోయారు. రాధ బీడీలు చుడుతూనే తన పిల్లలను పోషించింది. తన రెక్కల కష్టంతో కూతురును, కొడుకును చదివించి పెంచి పెద్ద చేసింది. వారి పెళ్లిళ్లను జరిపించి తన బాధ్యతను నెరవేర్చుకున్న ఆమె.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్ద మనసుతో క్షమాభిక్ష.. షార్జా జైలులో మగ్గుతున్న బుచ్చన్న కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. షరియా చట్టం ప్రకారం మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే బుచ్చన్న షార్జా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బుచ్చన్న సోదరులు లక్ష్మణ్, లింగన్న, మేనల్లుడు రాజేష్ ఇటీవల ముప్కాల్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దల సమక్షంలో గోవర్దన్ కుటుంబ సభ్యులను కలిసి క్షమాబిక్ష కోసం ప్రాధేయపడ్డారు. పెద్దమనసు చేసుకుని బుచ్చన్నకు క్షమాబిక్ష లేఖ ఇచ్చి, శిక్ష రద్దుకు సహకరించాలని వేడుకోగా.. ఎట్టకేలకు గోవర్దన్ భార్య రాధ ఒప్పుకుంది. పరిహారం కోసం ప్రయత్నాలు.. క్షమాభిక్ష లేఖతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జైల్లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బును షార్జా న్యాయస్థానంలో జమచేయడం గానీ, బాధిత కుటుంబ సభ్యులకు నేరుగా గానీ ఇవ్వాలి. అయితే, బుచ్చన్న కుటుంబ సభ్యులకు అంత ఆర్థిక స్థోమతలేదు. విరాళాలు సేకరించి గోవర్దన్ కుటుంబానికి చెల్లించి బుచ్చన్నను విడిపించడానికి కొన్ని దళిత సంఘాలు, కొందరు ప్రవాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వలసదారుల హక్కుల మండలి అధ్యక్షుడు పి.నారాయణ స్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం 2011 డిసెంబర్లో షార్జా జైలును సందర్శించి బుచ్చన్నను కలిసి వచ్చారు. గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, బుచ్చన్నను జైలు నుంచి విడుదల చేయాలని నారాయణ స్వామి గతంలో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. -
16 ఏండ్లకు శవమై వస్తుండు..
సాక్షి, నిర్మల్: ‘చేసేతందుకు ఇడ ఏం పనుందే. దేశం పోతే తిండికితిండి..నెలకిన్ని పైసలస్తయ్. ఊళ్లే మస్తుమంది పోయిండ్రు. ఇడ ఉండి కూడ ఏంజేయాల..’ అనుకుంటూ 16ఏళ్ల కిందట ఎడారి దేశం వెళ్లాడు. అప్పటినుంచి కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా మళ్లీ స్వదేశానికి రాలేదు. ఎప్పుడో యాదికొచ్చినప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసేవాడు. అది కూడా రెండుమూడు మాటలే మాట్లాడేవాడు. ‘ఇంటికాడ అంత మంచిదేనా..? అందరు మంచిగున్నరా..? నేను ఇడ మంచిగనే ఉన్న..’ ఎప్పుడు ఫోన్ చేసినా ఈ ముచ్చట్లే చెప్పేవాడు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా చెప్పేందుకు ఆయన లేడు ఉన్న ఊరిని, కన్నవారిని కాదనుకుని దేశం కాని దేశంలో ఏళ్లుగా ఉంటున్న ఆయన అక్కడ ఓ అనామకుడిగా తనువు చాలించాడు. ‘గాలి మోటార్ల ఎగురుకుంటపోయినోడు ఎప్పటికైనా ఇంటికి రాకుంటే యాడికిపోతడు. వాడే అస్తడు..’ అని అనుకుంటున్న ఆ కుటుంబానికి ఇన్నేళ్లకు శవపేటికలో భద్రమై.. విగతజీవిలా వస్తున్నాడు. 16ఏళ్లుగా ఇంటికి రాకుండా ఎడారిదేశంలోనే ఉండి, చివరకు అక్కడే తుదిశ్వాస విడిచాడు.. నిర్మల్ జిల్లా సోన్మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కొత్తగంటి రాజేశ్వర్(47). ఏళ్లుగా అక్కడే ఉండటంతో చివరకు ఆయన స్వస్థలం, కుటుంబం వివరాలు తెలుసుకోవడం కూడా కష్టమైంది. బతుకు దెరువు కోసం.. ఊళ్లో తెలిసిన వాళ్లందరూ వెళ్తుంటే రాజేశ్వర్ కూడా బతుకుదెరువు కోసం యుఏఈలోని అబుదా బికి వెళ్లాడు. అలా 16 ఏళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లిన రాజేశ్వర్‌కు తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉన్నా.. ప్రస్తుతం తనకంటూ భార్యాపిల్లలు ఎవరూ లేరు. దీంతో ఇప్పటివరకు స్వగ్రామానికి రాలేదు. 2003 లో అబుదాబిలోని అల్జాబర్ అనే కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. కొంతకాలం తర్వాత కంపెనీలో వేతన సమస్య తలెత్తడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ’ఖల్లివెల్లి’ (అక్రమనివాసి)గా జీవనం సాగించాడు. యూఏఈలో 2013, 2018 లలో ప్రకటించిన క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) పథకాలలోనూ రాజేశ్వర్ స్వదేశానికి రావడానికి ఇష్టపడలేదు. అక్కడే దొరికిన పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. అక్కడే అనారోగ్యంతో.. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న రాజేశ్వర్ ఇటీవల గల్ఫ్‌లోనే తుదిశ్వాస వదిలాడు. ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్లిన ఆయన వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. తన జేబులో ‘రాజేశ్వర్ కొత్తగాని, కొత్తగాని లింగన్న’ మాదాపూర్ అని ఇంగ్లిష్, అరబిక్ బాషలలో ఉన్న ఒక జిరాక్స్ పేపర్ మాత్రమే అక్కడి వారికి లభించింది. అక్కడి ఆసుపత్రి మార్చురీ (శవాగారం) విభాగం వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు ఎంతకూ ఆయన వివరాలేవి తెలియకపోవడంతో ఈ విషయాన్ని దుబాయిలోని ఒక భారతీయ సామాజిక సేవకుడికి తెలిపారు. ఆయన రాజేశ్వర్ చిరునామా తెలుసుకోవడం కోసం హైదరాబాద్‌లోని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి సహాయం కోరారు. ఇక అప్పటినుంచి స్వదేశంలో రాజేశ్వర్ చిరునామా తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు. మాదాపూర్లెన్నో ఉన్నయ్.. గల్ఫ్‌లో చనిపోయిన కొత్తగంటి రాజేశ్వర్ జేబులో దొరికిన లెటర్లో కేవలం ‘మాదాపూర్’ అని మాత్రమే ఉండటం జఠిలంగా మారింది. ఎందుకంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాలలో మాదాపూర్ పేరుతో చాలా ఊళ్లు ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో, నిజామాబాద్ జిల్లా మాక్లూర్, జక్రాన్‌పల్లి మండలాల్లో, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, తలమడుగు, నేరేడిగొండ మండలాల్లో, నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఇదే పేరుతో గ్రామాలున్నాయి. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సమన్వయకర్తలు మాదాపూర్ పేరు గల ఈ ఏడు గ్రామాలలో ఆరా తీయడం మొదలు పెట్టారు. చివరకు నిర్మల్ జిల్లా సోన్ మండలం మాదాపూర్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఇదే విషయాన్ని ఎంబసీకి తెలిపారు. ఇక్కడి వరకు చేసిన ప్రయత్నానికి మరో అడ్డంకి ఎదురైంది. రాజేశ్వర్‌కు సంబంధించి పాస్‌పోర్ట్ తదితర గుర్తింపు పత్రాలు లేనందున శవాన్ని స్వగ్రామానికి తరలించే ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆధారాలు లేక ఆలస్యం.. అబుదాబిలో చనిపోయిన రాజేశ్వర్ ఊరుపేరు తెలిసినా.. ఆయన ‘భారతీయుడు’ అనేందుకు ఆధారాలు సేకరించి పంపడం పెద్దసవాలుగా మారింది. ఆయన 16ఏళ్లుగా స్వదేశంలో లేనందున రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వంటి ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. రాజేశ్వర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు అయినప్పటికీ పిల్లలు కలుగలేదు. దీంతో భార్యలు విడాకులు తీసుకున్నారు. రాజేశ్వర్‌తో పాటు నలుగురు అన్నదమ్ములున్నారు. సోదరుల్లో ఒకరైన గంగన్న ఓ కేసులో ఓమన్ దేశంలోని మస్కట్ జైల్లో మగ్గుతుండగా,, మరొక సోదరుడు తక్కన్న కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మరో సోదరుడు శ్రీనివాస్ మాదాపూర్‌లో తల్లిదండ్రులను చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు లక్ష్మి, లింగన్నల పాతరేషన్ కార్డు ఆధారంగా ఇండియన్ ఎంబసీ రాజేశ్వర్‌ను ’భారతీయుడి’ గా గుర్తించింది. ‘ఎమర్జెన్సీ సర్టిఫికెట్–ఇసి’(ఔట్ పాస్ అనే తెల్లరంగు తాత్కాలిక పాస్‌పోర్ట్) జారీ చేసింది. దీంతో రాజేశ్వర్ మృతదేహం కలిగిన శవపేటిక శనివారం స్వగ్రామానికి చేరుకోనుంది. ఈ మొత్తం ప్రక్రియలో గల్ఫ్ బాధితులకు ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి చాలా చొరవ తీసుకున్నారు. పోయిన్నుంచి రాలే.. ఉపాధి కోసమని పోయిన అన్న పదహారేండ్లయినా ఇంటికి రాలేదు. ఎప్పుడన్న ఒక్కసారి ఫోన్ చేస్తుండే. రెండుమూడు మాటలు మాట్లాడి పెట్టేస్తుండే. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని చెప్పిండు. ఎప్పుడు ఇంటికి రమ్మని అడిగినా.. ఇడ బాగానే ఉన్న అంటుండే. – శ్రీనివాస్, రాజేశ్వర్ సోదరుడు, మాదాపూర్ -
మనవాళ్లే మోసం చేస్తున్నరు..
సాక్షి, సిరిసిల్ల: ఉపాధి కోసం నిరీక్షిస్తున్న యువకులకు నకిలీ గల్ఫ్ ఏజెంట్లు గాలం వేస్తున్నారు. నకిలీ వీసాలను అంటగడుతూ నిలువునా మోసం చేస్తున్నారు. లైసెన్స్ పొందిన గల్ఫ్ ఏజెంట్లు కొద్ది మందే ఉంటే.. లైసెన్స్‌లేని వాళ్లు ఊరుకొక్క రు ఉన్నారు. కొందరు లైసెన్స్ ఏజెంట్లు సైతం సబ్ ఏజెంట్లను నియమించుకుని అక్కరకు రాని వీసాలు అంటగడుతున్నారు. గల్ఫ్ దేశాలకు చెందిన వివిధ కంపెనీలు సైతం సులభతరంగా వీ సాలు ఇస్తూ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది నకిలీ ఏజెంట్లకు కాసులు కురిపిస్తోంది. వేతనం అధికమని, పనితక్కువగానే ఉం టుందని నకిలీ ఏజెంట్లు అబద్ధపు ప్రచారంతో నిరుద్యోగ యువతను రొంపిలోకి దింపుతున్నారు. ఖతర్‌లో వీసాల మోసాలు.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోయపల్లికి చెందిన ముత్తన్న కోట ఖతర్‌లో కాంట్రాక్టర్. పనులు చేయించుకునే అతడు.. వలస జీవులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడనే అపవాదు ఉంది. తాజాగా మూడు నెలలుగా పని చేయించుకుంటూ చిల్లిగవ్వకూడా ఇవ్వడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జీతం ఇవ్వకున్నా.. కనీసం బయటపని చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా వేధింపులు తప్ప మరో మార్గం కనిపించడంలేదు. ఇళ్లకు చేరిన వలస జీవులు ఏజెంట్ల మాటలతో మోసపోయిన వేములవాడకు చెందిన గొర్ల మురళి(42), కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య, కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన మొకెనపల్లి రాజయ్య ఎంబసీ అధికారులు, ఖతర్‌లోని తెలంగాణ ప్రతినిధుల సాయంతో శుక్రవారం స్వగ్రామాలకు చేరారు. అంతకుముందు పది మంది యువకులు సైతం ఇండియా చేరారు. ఇంకాచాలా మంది ఏం చేయాలో తెలియక అక్కడే మగ్గిపోతున్నారు. అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపారు. నకిలీ ఏజెంట్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో గల్ఫ్ ఏజెంట్లు వీసాల దందా మానేసిన నకిలీలు.. ఇతర పనుల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు పోలీసుల నిఘా తగ్గింది. నకిలీ ఏజెంట్లు వీసాల దందా ప్రారంభించారు. అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. ఏజెంట్‌కు ఎనభై వేలు ఇచ్చిన బావుసాయిపేటకు చెందిన ఏజంట్ అంజయ్యకు ఎనభైవేల రూపాయలు ఇచ్చి ఖతర్ పోయిన. జూలై 7వ తేదీకి నాలుగు నెలలు. అక్కడికి పోయిన కాడినుంచి పని చేయించుకున్న ఏజెంట్ జీతం ఇవ్వలేదు. నాకు భార్య సావిత్రి, ఇద్దరు కొడుకులు ఉన్నరు. అప్పు చేసి ఖతర్ పోతే.. జీతం రాక అప్పులో కూరుకపోయిన. రజని మేడమ్, సంతోష్ సార్లు సాయం చేసి ఎంబసీ అధికారుల సాయంతో మా ఇంటికి పంపించిండ్రు. – మొకెనపల్లి రాజయ్య, పల్లిమక్త జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు మనవాళ్లను మనవాళ్లే మోసం చేస్తున్నారు. ఖతర్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ మనవాళ్లే పనిచేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫోరం(ఐసీడీఎఫ్)గా ఏర్పడి ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సాయం చేయిస్తుంటాం. ఇప్పటికే చాలామందికి సాయం చేసి ఇండియా పంపించాం. ఎవరూ ఏజెంట్ల మాటలు నమ్మి మోస పోవద్దు. కంపెనీ వీసాలు, లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. – రజని, ఐసీడీఎఫ్, ప్రతినిధి -
అవగాహన లేకుంటే..చిక్కులే!
సాక్షి, కరీంనగర్: వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనపై గత శుక్రవారం కువైట్‌లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన 24మంది ప్రవాసాంధ్రులను కువైట్ నిఘా బృందాలు అరెస్టు చేశాయి. నిరసన ప్రదర్శన ఉద్దేశం మంచిదే అయినా ఆ దేశ చట్టాలకు విరుద్ధం కాబట్టి నిరసనకారులు ఇబ్బందుల్లో పడ్డారు. భారత దేశంలో పౌరులు తమ హక్కుల కోసం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్లడానికి బంద్‌లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయడం సర్వసాధారణం. భారత్‌లో పుట్టిపెరిగిన వారు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వలన చిక్కుల్లో పడుతున్నారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి రాచరిక పాలన, ముస్లిం షరియా చట్టాలు అమలులో ఉండే అరబ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి పరిస్థితులలో ఇమడలేక మానసిక సంఘర్షణ పడుతుంటారు. కొంత కాలం తర్వాత అలవాటుపడి సర్దుకుపోతుంటారు. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్ దేశాలలో అక్కడి చట్టాల ప్రకారం సమ్మెలు, నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధం. గల్ఫ్‌లో సభలు, సమావేశాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు తదితర ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా ప్రభావం గల్ఫ్‌లో ఉండే చాలా మంది ప్రవాసులు స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులతో వాయిస్ కాల్, వీడియో కాల్ మాట్లాడటానికి స్మార్ట్ ఫోన్లలో ఐఎంఓ (ఈమో), బోటిం, వాట్సాప్ లాంటి యాప్‌లను వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. స్వదేశంలో జరిగే సంఘటనలు, సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై తమ సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తున్నారు. రకరకాల విషయాలపై ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపులలో వాగ్యుద్ధాలు, తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతుంటాయి. అర్థవంతమైన, విషయాత్మక చర్చలు, విలువైన సమాచార మార్పిడి కూడా జరుగుతున్నది. వార్తలు, విశేషాల అప్డేట్స్ కోసం ప్రవాసులు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. – మంద భీంరెడ్డి, ప్రవాసీ మిత్ర. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు మంచి కోసమైనా సరే.. గల్ఫ్ దేశ నిబంధనలకు విరుద్ధంగా పొతే జైలుపాలవుతాం. ఏ కార్యక్రమం చేయాలన్నా మన దేశానికి చెందిన సీనియర్ల సలహా తీసుకుని నిర్వహించాలి. ఆ దేశ ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయకూడదు. గల్ఫ్‌లో చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుంటపోతది. వరంగల్ ఘటనపై ఆవేదనతో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. వారిని విడిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. – గోలి, శ్రీనివాస్,ఖతార్ వినతి పత్రం రూపంలో పంపాలి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మనం ఇక్కడ అతిథులం మాత్రమే. ఈ దేశాల పౌరులం కాదు. మన సమస్యలు గానీ, అభిప్రాయాలు గానీ ఏమైనా వ్యక్తం చేయాలన్నా వినతి పత్రం రూపంలో ఇండియన్ ఎంబసీకి పంపాలి. మన సమస్యలపై భారత ప్రభుత్వానికి, ఆయా శాఖలకు ఉత్తరాలు రాయవచ్చు. కానీ, గల్ఫ్‌లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడం నిషేధం. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. – షహీన్ సయ్యద్, సామాజిక కార్యకర్త, కువైట్ -
విదేశీ జైళ్లల్లో అత్యధికంగా భారతీయులే!
న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న విదేశీయులలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఈ ఏడాది మే 31 నాటికి సౌదీలోని భారతీయ ఖైదీలు 6శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో సౌదీ తర్వాత యుఏఈ, నేపాల్‌లో అత్యధిక మంది భారతీయులు అక్కడి జైళ్లలో బంధీలుగా ఉన్నారన్నారు. సౌదీ అరేబియాలో మొత్తంగా 1,811, యుఏఈలో 1,392, నేపాల్‌లో 1,160 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. ఇక అమెరికా జైళ్లలో 689, పాకిస్తాన్లో 48 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారన్నారు. పాకిస్తాన్ జైళ్లలో గత ఏడాది 471 మంది భారతీయులు ఉండగా.. ఈ ఏడాది వారి సంఖ్య బాగా తగ్గిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా బుధవారం లోక్‌సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ గణాంకాలు వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లోని చట్టాలపై సరైన అవగాహన లేకుండా అక్కడికి వెళ్తున్న కారణంగా అత్యధిక మంది ఇబ్బందుల్లో పడుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో జైళ్లలో మగ్గాల్సి వస్తుందని.. అయితే విదేశాల్లో పని చేయాలనుకునే కార్మికులు స్థానిక కాన్సులేట్ సేవలలో ముందుగానే తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని తెలిపింది. కాగా సాధారణంగా తమ దేశంలో ఉన్న ఖైదీల విషయంలో చాలా మటుకు దేశాలు వివరాలు ప్రకటించడంలో గోప్యత పాటిస్తాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దాయాది దేశాల్లో బంధీలుగా ఉన్న పౌరుల వివరాలు.. అనేక వేధింపుల తరువాత బహిర్గతమవుతాయన్న అంశం విదితమే. -
చమురు ఓడల రక్షణ మీ బాధ్యతే
వాషింగ్టన్: గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే చమురు ఓడల రక్షణ బాధ్యత ఆయా దేశాలే చూసుకోవాలని, ప్రమాదకరమైన ఆ ప్రాంతంపై తమకు అంతగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ట్రంప్ సోమవారం ట్వీట్‌చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటం, ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహించకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటున్న ఇరాన్ బెదిరింపులపై ఆయన.. ‘మా వద్ద చాలినన్ని చమురు నిల్వలున్నాయి. ఆ ప్రాంతంతో మాకు అవసరం లేదు. అక్కడ మేం రక్షణ బాధ్యతలు చేపట్టడం లేదు. గల్ఫ్‌లో ప్రయాణించే చమురు నౌకల భద్రత బాధ్యత సంబంధిత దేశాలదే’ అని పేర్కొన్నారు. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే ఉత్తర్వుపై ట్రంప్ సోమవారం సంతకం చేశారు. దీని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారుల ఆర్థిక లావాదేవీలను అమెరికా నిరోధించనుంది. మోదీ, పుతిన్‌లతో భేటీ కానున్న జిన్‌పింగ్ బీజింగ్: జి–20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో చైనా అధినేత జిన్‌పింగ్ భేటీ కానున్నారు. ఈ నెల 28, 29వ తేదీల్లో జపాన్‌లోని ఒసాకాలో జి–20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దిగుమతులపై భారీగా పన్నులు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష, రక్షణాత్మక విధానాలపై ఈ సందర్భంగా వీరు ప్రముఖంగా చర్చించనున్నారని చైనా అధికారులు తెలిపారు. భారత్, రష్యాలతోపాటు బ్రిక్స్‌లోని ఇతర సభ్య దేశాలు బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతోనూ జిన్‌పింగ్ చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. -
బైబై ఇండియా..!
భారత్‌ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితం పరిస్థితి వేరు... పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. భారత్‌కు వస్తున్నవారు తక్కువే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు. -
కేటీఆర్ చొరవతో సౌదీ నుంచి రాష్ట్రానికి..
సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన 39 మంది తెలంగాణ వాసులు.. టీఆర్ఎస్ కార్వనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో సోమవారం రాష్ట్రానికి చేరుకున్నారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు సౌదీ అరేబియాలోని ఓ నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. 2018 ఏప్రిల్ తర్వాత సదరు కంపెనీ పూర్తి స్థాయిలో మూతపడింది. దీంతో అక్కడే చిక్కుకున్న కార్మికులు ఆహారం, వసతి వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్మికులు తమ కష్టాలను ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కేటీఆర్.. వారికి సహాయం అందించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందిం చి.. కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. కార్మికుల వద్ద ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్ వీసాలను మంజూరు చేసింది. దీంతోపాటు తిరుగు ప్రయాణానికి వీలుగా విమాన టికెట్లు సమకూర్చింది. కేటీఆర్ హర్షం.. కార్మికులు సౌదీ నుంచి స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు పంపేలా ఏర్పాట్లు చేశారు. చాలా ఇబ్బందులు పడ్డాం.. కంపెనీ మూతపడటంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడాదిగా జీతాలు కూడా లేవు. మా పత్రాలు రెన్యువల్ కాకపోవడంతో బయట కూడా తిరగలేని పరిస్థితి ఎదురైంది. విదేశాంగ అధికారులు చొరవ తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఎన్నారై సెల్ వారందరూ సహకరించడంతో స్వదేశానికి వచ్చాం. – రవి, నిర్మల్ జిల్లా -
కేటీఆర్ చొరవ.. 39 మందికి విముక్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో గల్ఫ్‌లో మగ్గుతున్న 39 మంది తెలంగాణ కార్మికులకు విముక్తి లభించింది. సౌదీ అరేబియాలోని జే అండ్ పీ కంపెనీలో దాదాపు ఏడాదిన్నర కాలంగా బంధించబడ్డ కార్మికులు ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌కు చేరుకున్న వారికి ప్రయాణ ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేసింది. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది. అనేక కష్టాలు పడుతున్న కార్మికులు తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కి తెలియజేశారు. దీంతో కార్మికుల సమస్యల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు కేంద్ర విదేశాంగ అధికారుల సహాయం కూడా తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వారందరి కృషి ఫలితంగా కార్మికులు తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టారు. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు దన్యవాదాలు తెలిపారు. -
గల్ఫ్‌లో మండుతున్న ఎండలు
(ముక్కెర చంద్రశేఖర్–కోరుట్ల) :వేసవిలో మండుటెండల నుంచి కార్మికులకు ఉపశమనం కలిగేలా గల్ఫ్ దేశాల్లో తీసుకొచ్చిన చట్టాలు పకడ్బం దీగా అమలు కావడం లేదు. గల్ఫ్ దేశాల్లో సాధారణంగా ఏడాది మొత్తం ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఈ దేశాల్లో ఎండాకాలం, శీతాకాలం మాత్రమే ఉంటాయి. వర్షాకాలం ఉండదు. నవంబర్ నుంచి మార్చి వరకు శీతాకాలం, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎండాకాలం ఉంటుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎండలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. సముద్ర తీరాలు, గ్యాస్ ఉత్పాదక కంపెనీలు ఉన్నచోట ఉష్ణోగ్రత దాదాపు 54 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. దీనికి తోడు ఉక్కపోత వాతావరణంతో కార్మికులు మరింత బలహీనంగా మారుతారు. ఈ పరిస్థితుల్లో ఆరుబయట పనిచేయడం కష్టతరం. వేసవిలో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూన్, జులై, ఆగస్టు నెలల్లో పనివేళలు మారు స్తారు. ప్రతి రోజు 8 గంటల పనిచేయాల్సి ఉంటే.. తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలు మారుస్తారు. వేసవిలో మధ్యాహ్నం 12.30 గం టల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆరుబయట కార్మికులతో పనిచేయించడం చట్ట విరుద్ధం. చట్టాలకు విరుద్ధంగా పనిచేయించే కంపెనీలకు భారీగా జరిమానా విధిస్తారు. పట్టింపు అంతంతే.. జూన్, జులై, ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం పనిచేయించరాదన్న నిబంధనపై పట్టింపు అంతంత మాత్రంగానే ఉంది. గల్ఫ్‌లోని చాలా కంపెనీలు ఈ నిబంధనలను పట్టించు కోకుండా ఆరుబయట భవన నిర్మాణ కార్మికులతో పనిచేయిస్తాయని మన కార్మికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులు ఆరుబయట పనిచేస్తున్నారా.. అన్న అంశంపై హెలికాపర్ల ద్వారా అక్కడి కార్మిక శాఖ నిఘా పెడుతున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకుండాపోతోందని సమాచారం. ఒక్క ఒమన్ దేశంలోనే గత ఏడాది నిర్వహించిన తనిఖీల్లో సుమారు 771 కంపెనీలు వేసవి నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. దీంతో పాటు వేసవి వడగాలుల నుంచి కార్మికులు రక్షణ పొందేందుకు, ప్రాథమిక చికిత్సకు ఉపయోగపడే పరికరాలు, మందులు అందుబాటులో ఉంచకపోవడం శోచనీయం. నిఘా పెంచాలి గల్ఫ్ దేశాల్లో వేసవిలో మూడు నెలలు మ«ధ్యాహ్నం పనివేళలు బంద్ చేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ, అన్ని కంపెనీలూ కచ్చితంగా ఈ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ విషయంలో నిఘా మరింత పెంచితే బాగుంటుంది. వేసవిలో ఉపశమనానికి కనీస వసతులు కల్పించని కంపెనీలు కూడా ఉన్నాయి. – గుగ్గిల్ల రవిగౌడ్,బీమారం, మేడిపల్లి, జగిత్యాల జిల్లా వేడిని తట్టుకోలేం.. వేసవిలో మూడు నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి 48– 50 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడి ఉంటుంది. ఈ వేడికి.. ఉక్కపోతకు శరీరంలోని నీరంతా బయటకు పోయి నీరసం వస్తుంది. కంపెనీల్లో పనిచేసే వారికి కష్టాలు తప్పవు. భవన నిర్మాణంలో పనిచేసే కార్మికులు చాలా మంది వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. –దావేరి శ్రీనివాస్, సంగెం,కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా -
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
కువైట్‌లోని 92 కంపెనీలపై నిషేధం
కువైట్‌లో నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా కార్మికులను రోడ్డున పడేస్తున్న కంపెనీలను భారత విదేశాంగ శాఖ నిషేధించింది. ఈ కంపెనీలు కార్మికులకు పని కల్పించే పేరిట వీసాలను జారీచేసి కువైట్‌కు చేరిన తరువాత కార్మికులను పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ విధమైన 92 కంపెనీలను గుర్తించి వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ కంపెనీల జాబితాను అధికారులు విదేశాంగ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కువైట్‌లో ఉపాధి, ఉద్యోగం పొందాలనుకునేవారు తమకు వీసా జారీ చేసిన కంపెనీ విదేశాంగ శాఖ బ్లాక్‌లిస్టులో ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సి ఉంది. వీసా పొందిన వారికి ఒప్పందం ప్రకారం పని కల్పించకపోవడం, సరైన వేతనాలు, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో కార్మికులు ఇబ్బందులు పడు తున్నారు. కువైట్ రావడానికి చేసిన అప్పులు తీరకపోవడం.. స్వదేశానికి వెళ్లినా అక్కడ ఏమి చేయాలో తెలియక కార్మికులు అక్కడే ఉండిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఖల్లివెల్లిగా (అక్రమ నివాసులు) మారుతున్నారు. కొంతమంది కార్మికులు గత ఏడాది కువైట్ ప్రభుత్వం అమలు చేసిన క్షమాభిక్షతో ఇంటికి చేరుకున్నారు. -ఎన్. చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా) వీసాల దందా... కార్మికులు తక్కువ మంది అవసరమైనప్పటికీ కొన్ని కంపెనీలు లెక్కలేనన్ని వీసాలను జారీచేసి కార్మికులను పెద్ద సంఖ్యలో రప్పించుకుంటున్నాయి. ఫలితంగా నైపుణ్యం ఉన్నవారికి ఆ నైపుణ్యానికి అనుగుణంగా పని లభించకపోవడం, నైపుణ్యం లేని వారికి శక్తికి మించి పని లభించడంతో గందరగోళ పరిస్థితి ఎదురవుతోంది. వీసాల దందాను అరికట్టడానికి డొల్ల కంపెనీలను గుర్తించి మన విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులు వెబ్సైట్లో జాబితా పెట్టారు. కాగా, ఈ కంపెనీలను మన దేశం నిషేధించి నప్పటికీ ఇతర దేశాల నుంచి కార్మికులు వస్తునే ఉన్నారు. విదేశాంగ శాఖ వెల్లడించిన కంపెనీల జాబితా ఇదీ.. 1. అల్ బ్లాసీమ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 2. అషీ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 3. జెర్సెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 4. అల్ వెలియా ట్రావెల్ అండ్ టూరిజం 5. అల్ అతీక్ కంపెనీ 6. అల్ అమేర్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్ 7. సదా మసూద్ 8.అల్ సక్లవీ ఇంటర్నేషనల్ కంపెనీ 9. లండన్ గ్రూప్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ 10. ఆజాద్ అరేబియన్ జనరల్ ట్రేడింగ్అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 11.సాద్ ముత్లక్ డఖాన్ ఫర్ హోమ్ కేర్ సర్వీసెస్ కంపెనీ 12. నేషనల్ కాంట్రాక్టింగ్ కంపెనీ 13.కువైట్ ఇండస్ట్రీయల్ రిఫైనరీ మెయింటనెన్స్అండ్ ఇంజనీరింగ్ కంపెనీ (క్రేమెన్కో) 14.అల్ హజీమ్ కార్ ఎస్ట్ 15.తలాల్ ఎస్ఎఫ్ ఆల్ అలీ క్లీనిక్ 16.అల్ సబా ఫర్నీచర్ 17.వతానియా ఆఫ్టికల్స్ కంపెనీ 18.ఫస్ట్ ల్యాండ్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 19.బైత్ అల్ అకావత్ జనరల్ ట్రేడింగ్ 20.వరల్డ్ ఆఫ్ డిజైన్ కంపెనీ 21.ఇంటర్నేషనల్ సిటీ కార్ప్ కంపెనీ ఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ 22.మర్తయార్ అల్ అస్రార్ అల్ ఖాబందీ బిల్లింగ్నౌల్ స్కూల్ 23.ఎలైట్ యూనివర్సల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 24.అల్ ముస్తాస్హార్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 25.బాబర్ నసీర్ హజీ షహరాన్ అల్ ట్రేడ్ మార్క్ 26.జెంట్స్ మాస్టర్ హ్యాండ్ టైలర్స్ 27.అల్ అబ్రాక్ ట్రేడింగ్ కంపెనీ 28.అల్ అబ్రాజ్ క్లీనింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 29.అల్ ఖాందక్ సెక్యూరిటీ కంపెనీ 30.జనరల్ ట్రేడింగ్ కంపెనీ(జీటీసీ) 31.కువైట్ అల్ సాకూర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ 32.అరబ్ సెంటర్ ఫర్ కమర్షియల్ అండ్రియల్ ఎస్టెట్ కంపెనీ 33.అహ్మద్ గౌహులమ్ రెధా అష్ఖానాని కోఫర్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ డబ్ల్యూ.ఐ.ఐ 34.టీజీఎం ఇంజనీరింగ్ కంపెనీ 35.అల్ మిషైల్ సెంటర్ ఫర్ క్లోక్స్ 36.జౌహారా డోరైన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 37.గల్ఫ్ కార్ రెంటల్ కంపెనీ 38.అల్ మసా సెంటర్ లాండ్రీ కో. 39.సఫేర్ అల్ నిదా కో. 40.వాఎల్ అల్ నుసీఫ్ ట్రేడింగ్ కో. 41.బాస్కో ఇంటర్నేషనల్ కో. జనరల్ అండ్ కాంట్రాక్టింగ్ 42.ఫస్ట్ కువైట్ జనరల్ ట్రేడింగ్ కో. 43.షబా ఇంటర్నేషనల్ గ్రూప్ జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ 44.ఆక్సిజన్ హార్డ్ లైన్ కో. 45.అల్ తన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ అండ్ ఇట్స్ అసోసియేట్ మ్యాన్ టెక్ సర్వీసెస్ 46.సహారాస్ అల్ రోలా జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ కంపెనీ 47.అల్ అబ్రాజ్ క్లీనింగ్ కంపెనీ అండ్ సిటీస్ కాంట్రాక్టింగ్ కంపెనీ 48.అల్ ముదీర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ 49.అఖీలా ఫుడ్‌స్టఫ్ కంపెనీ 50.అల్ లయాలీ కార్గో ట్రాన్స్పోర్ట్ కో. 51.బ్రోన్జియా ప్రాజెక్ట్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 52.అల్ కహాల్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఈస్ట్. 53.మషాల్ లైలుబీ వాల్ బాషూట్ 54.ఖరాఫీ నేషనల్ కేఎస్సీ 55.ఖరాఫీ నేషనల్ కేఎస్సీ (మూసివేయబడినది) 56.జనరల్ ట్రేడింగ్ 57.బయాన్ నేషనల్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 58.అల్ బహార్ మెడికల్ సర్వీసెస్ కో. 59.తరీఖ్ కో. డబ్యూ.ఐ.ఐ 60.ఎస్కేఎస్ గ్రూప్ జనరల్ ట్రేడ్ అండ్ కన్‌స్ట్రక్టింగ్ కో. డబ్ల్యూ.ఐ.ఐ 61.అల్ మనార్ ఫ్యాక్టరీ ఫర్ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ సిమెంట్ 62.సబీక్ గ్లోబల్ ఫ్యాక్టరీ అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ 63.అల్ తఖీబ్ ట్రేడింగ్ కో. అల్ తఖీబ్ చాక్లేట్ కో. 64.అల్ మిషల్ కో. అబయా అండ్ బీషూట్ వర్క్‌షాప్ సెంటర్ 65.బిన్ హమ్జా జనరల్ ట్రేడింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కో. అల్ సబీల్ అల్ అలామియా ఫర్ ద రిపేయిర్ ఆఫ్ జ్యూవెలరీ అండ్ సిల్వర్ 66.ఫహాద్ అల్ సలీమ్ సన్స్ అండ్ పార్ట్నర్స్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. 67.యూఎన్ఐ సిగ్న్ అడ్వర్టైజింగ్ కో. 68.అల్ ఫూటూత ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్అండ్ కన్‌స్ట్రక్టింగ్ కంపెనీ 69.గాజ్వాన్ ట్రేడింగ్ అండ్ కన్‌స్ట్రక్టింగ్ కంపెనీ 70.ఫస్ట్ ప్రాజెక్టస్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ 71.కేర్ సర్వీసెస్ (అల్ రియా కంపెనీ ఫర్ బిల్డర్స్అండ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్) 72.అల్ రువాడీ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్కాంట్రాక్టింగ్ కంపెనీ 73.అల్ రియా కంపెనీ ఫర్ బిల్డింగ్ సిటీస్ క్లీనింగ్ కాంట్రాక్టింగ్ 74.అల ఎస్సా మెడికల్ అండ్ సైంటిఫిక్ ఎక్యూప్మెంట్ కో. 75.నసర్ గోల్డెన్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ గ్రూప్ 76.నేషనల్ రెడీమిక్స్ కాంక్రీట్ కంపెనీ 77.అల్ రకీబ్ జనరల్ బిల్డింగ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 78.రవ్నాక్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. తయాబా కిచెన్ ఫ్రమ్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ 79.హమీద్ మజ్యాద్ అలీ అల్ద్వానీ 80.నెస్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ కంపెనీ డబ్ల్యూ.ఎల్.ఎల్ 81.ఎనాస్కో జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీడబ్ల్యూ.ఎల్.ఎల్ 82.క్రిస్టియల్ హౌజ్ జనరల్ ట్రేడింగ్ కో. 83.అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీ(ఏటీసీ) 84.స్విస్ మెడికల్ సర్వీసెస్ 85.అబ్దుల్లా యూసుఫ్ అల్ రాద్వాన్ జనరల్ ట్రేడింగ్అండ్ కాంట్రాక్టింగ్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 86.స్పీడ్ యునైటెడ్ జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్. కో. 87.హైతమ్ రెస్టారెంట్ 88.అల్ అల్మియా ఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెంపర్డ్ గ్లాస్ కో. డబ్ల్యూ.ఎల్.ఎల్ 89.లాబ్‌స్టర్ లేక్ రెస్టారెంట్ 90.సకీనా బుక్ స్టాల్ సకినా ఇంటర్నేషనల్ జనరల్ ట్రేడింగ్ కో. 91.ఖుదాస్ అల్ అహిలియా కో. జనరల్ ట్రేడింగ్ 92.అల్ అహిలా జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో. తెలంగాణ కార్మికులకు విదేశాంగ శాఖ చేయూత గల్ఫ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇరుక్కుపోయిన తెలంగాణ కార్మికులను భారత విదేశాంగ శాఖ ఆదుకుంది. జెఅండ్పి కంపెనీ సౌదీ ఆరేబియాలో భవన నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఆ కంపెనీలో ఉపాధికి వెళ్లారు. అయితే, గత సంవత్సరం ఏప్రిల్ వరకు వేతనాలు చెల్లించిన కంపెనీ యజమాన్యం ఆ తరువాత నిలిపివేసింది. అంతేకాకుండా అకామ(గుర్తింపు)ను రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు అక్కడే ఉండిపోయారు. దీని కారణంగా కార్మికులు బయట పనిచేయలేకపోయారు. అలాగే స్వదేశానికి రావాలన్నా వారిని పంపించేందుకు కంపెనీ యాజ మాన్యం అంగీకరించలేదు. దీంతో కార్మికులకు సౌదీ ఆరేబియాలోని మన విదేశాంగ శాఖ అధికారులతో పాటు లేబర్కోర్టును ఆశ్రయించడంతో సౌదీ ప్రభుత్వం స్పందించింది. లేబర్‌కోర్టు సూచన మేరకు సౌదీ ప్రభుత్వం భారత్‌కు వెళ్లే కార్మికులకు విమాన టికెట్లు సమకూర్చింది. 56 మంది తెలంగాణ కార్మికుల్లో ఇప్పటికే కొంతమంది స్వదేశానికి రాగా.. మరికొంత మంది ఈనెల 17న రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దాదాపు 8 నెలలకు సంబంధించి వేతనాలు కార్మికులకు అందాల్సి ఉంది. ఆ బకాయిలు త్వరలో కార్మికులకు అందనున్నాయి. విదేశాంగ శాఖ చొరవ చూపడం.. లేబర్‌కోర్టు సానుకూలంగా స్పందించడంతో తమకు న్యాయం జరిగిందని కార్మికులు చెప్పారు. -
గల్ఫ్‌పేరుతో ఘరానా మోసం
సాక్షి, జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిరుద్యోగ యువతను ఉపాధినిమిత్తం విదేశాలకు పంపిస్తామంటూ నమ్మించి అందినకాడికి దండుకుంటున్నారు. పొంతనలేని పనులు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. మరికొంతమంది గల్ఫ్‌పేరుతో ఉద్యోగమిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్‌ఏజెంట్ మోసం చేశాడని రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ఏజెంట్ ఇంటిముందే బాధితులు ధర్నా నిర్వహించారు. కుమ్మరిపల్లిలో ఏజెంట్ మోసం చేశాడని ఓ బాధితుడు సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇలా చాలామంది బాధితులు ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో సుమారు 320మంది ఎలాంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంట్లుగా నిర్వహిస్తున్నారు. ట్రావెల్స్ పెట్టుకుని గల్ఫ్‌దేశాలకు పంపిస్తామంటూ విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారు. వీరిని నమ్మిన కొంతమంది ఇంటర్వ్యూలకు హాజరై పాస్పోర్టుతో పాటు కొంత మేరకు డబ్బు చేతుల్లో పెట్టి మోసాలకు గురవుతున్నారు. నిఘా పెట్టిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు ట్రావెల్స్‌లపై మూకుమ్మడి దాడులు చేసి పాస్‌పోర్టులు, విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేసి కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు నిఘా పెట్టినా ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు స్పీడ్ పెంచారు. గ్రహించిన గల్ఫ్ ఏజెంట్లు గత నెల రోజులుగా రహస్య ప్రాంతాల్లో పోలీసుల కళ్లుగప్పి గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిబంధనల సడలింపుతో 8 మందికే లైసెన్స్‌లు ట్రావెల్స్‌ల కోసం కేంద్ర విదేశీ వ్యవహారల శాఖ సడలింపు ఇవ్వడంతో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు 8 ట్రావెల్స్‌లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. రూ.50 లక్షలు డిపాజిట్ చేసిన ట్రావెల్స్ వారికి ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్ ఉండగా రూ.8 లక్షలు చెల్లించిన వారికి సంవత్సరానికోసారి రెన్యువల్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. మిగతా వారికి ఎవరికీ అనుమతులు లేకుండా ముంబాయ్, చెన్నై, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి గల్ఫ్ ఏజెంట్లను తెప్పించి ఇక్కడ పనిచేస్తున్న ఏజెంట్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి నుంచి ఒరిజినల్ పాస్పోర్టుతో పాటు కొంత మేరకు వీసా అడ్వాన్స్ తీసుకుంటున్నారు. పోలీసుల నజర్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై నజర్ పెట్టారు. దాదాపు ఆరునెలల కాలంలో సుమారు 72కి పైగా గల్ఫ్ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. అయినా ఏజెంట్లలో మాత్రం మార్పు రావడం లేదు. నిరుద్యోగుల నుంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. పాస్‌పోర్టులు స్వాధీనం.. వివిధ దేశాల్లో ఉద్యోగాలున్నాయని, సబ్ ఏజెంట్ల వాట్సప్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్న ట్రావెల్స్ ఏజెంట్లు ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగుల నుండి మీరు ఎంపికయ్యారని, పాస్‌పోర్టులు తీసుకుని నకిలీ వీసాలు అప్పగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుకున్న సమయానికి వీసా రాకపోవడంతో తమకు పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచితే వారి వద్ద నుండి సుమారు రూ.10వేల నుండి రూ.20వేలవరకు ట్రావెల్స్ యజమానులు వసూలు చేస్తున్నారు. మోసపోవద్దు జగిత్యాల ప్రాంతంలో చాలా మంది యువకులు గల్ఫ్‌కు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లేవారు ప్రభుత్వం గుర్తించిన సంస్తల ద్వారానే విదేశాలకు వెళ్లాలి. ఇతర ప్రయివేటు వ్యక్తులను, గల్ఫ్ ఏజెంట్లను నమ్మి యువకులు మోసపోవద్దు. చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. అనుమతి లేని గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం . – ప్రకాశ్, జగిత్యాల పట్టణ సీఐ -
ఆశలు సమాధి చేస్తూ.. బతుకులను బలి చేస్తూ..
మోసం ఎక్కడైనా ఒక్కటే. ఈ మోసం కారణంగా కొన్ని చోట్ల జీతాలు కోల్పోతుంటే.. మరికొన్ని చోట్ల జీవితాలే గాల్లో కలిసిపోతున్నాయి. గల్ఫ్‌లో ఉద్యోగాలకోసం వెళ్లిన వారి దీనగాథ ఇది. అక్కడ ఉద్యోగాల కోసం మాయావలయంలో చిక్కుకున్నవారు మన తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఉన్నారు. దళారుల చేతిలో మోసపోయినవారు, నకిలీ వీసాలతో దగాపడిన అమాయకులు, అర్ధంతరంగా ఉద్యోగాలు కోల్పోయినవారు చివరకు అన్ని దార్లూ మూసుకుపోయి స్వదేశానికి చేరుకుంటున్నారు.పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వేలాది మంది అభాగ్యులు.. అక్కడి పరిస్థితిని తట్టుకోలేక స్వదేశానికి తిరిగొచ్చాక ఎలా బతుకుతున్నారనేదానిపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం వారి కుటుంబాల్లో తీరని వ్యధను మిగుల్చుతోంది. దగాపడ్డ తెలుగుబిడ్డలు తిరిగి వెనక్కి కువైట్, సౌదీ అరేబియా, ఒమన్లలో కంపెనీలు మూసివేయడంతో భారతదేశానికి చెందిన ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీలు మూసివేస్తేనో, ఇతర కారణాల వల్లనో ఉపాధి కోల్పోయిన వేలాదిమంది వలస కార్మికులు తిరిగి భారత్‌కి చేరుకుంటున్నారు. గల్ఫ్‌లో చిక్కుకుపోయిన 90,000 మందిని ప్రభుత్వం తిరిగి వెనక్కి రప్పించగలిగింది. అయితే వారికి మూతపడిన కంపెనీల నుంచి రావాల్సిన వేతన బకాయిల విషయంలో మాత్రం న్యాయం జరగలేదు. మరోవైపు ఇలా అర్ధంతరంగా కంపెనీల నుంచి గెంటివేయబడిన వందలాది మందిని తిరిగి స్వదేశానికి రప్పించడంలో తెలంగాణలో కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆ వైపుగా తీసుకున్న చర్యలు శూన్యమే. స్వగ్రామాలు వెళ్లేందుకు సైతం డబ్బుండదు బాధితులను స్వదేశాలకు తిరిగి తీసుకురావడం వరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కానీ ఒకసారి వలస కార్మికులను స్వదేశానికి చేర్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతేమీ లేదన్నట్లుగా భావిస్తున్నాయి. దీంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. కొందరికి దగ్గర స్వగ్రామాలకు వెళ్ళేందుకు సైతం డబ్బులు లేని దయనీయమైన స్థితి. ‘వలస కార్మికులను తిరిగి వారి స్వగ్రామాలకు చేర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని మేము కోరడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ సాయం చేయడానికి ముందుకొచ్చింది’ అని వలసకార్మికుల హక్కుల కోసం పనిచేస్తోన్న మైగ్రెంట్ రైట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎం.భీంరెడ్డి తెలిపారు. స్వదేశంలో వలస కార్మికుల గతేంటి? ఆస్తిపాస్తులు అమ్ముకునో, భార్యమెడలో తాళితాకట్టుపెట్టో విదేశాలకు వెళ్ళి కట్టుబానిసలుగా బతుకుతున్నవారు, రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసినా కనీస జీతాలు దొరక్క బాధపడుతున్నవారు, దీనమైన స్థితిలో స్వదేశాలకు తిరిగొస్తున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గత 25 ఏళ్ళుగా వలస కార్మికులు వివిధ కారణాలతో ఉపాధికోల్పోయి తిరిగి వచ్చేస్తున్నారు. ఇలా వచ్చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయసహకారాలూ అందడం లేదు. వేల సంఖ్యలో వలసవెళ్లి తిరిగొచ్చిన వారి పునరావాసం కోసం ప్రత్యేక విధానమంటూ ప్రభుత్వాలకు లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. ఏటా 500 మంది అక్కడే.. విదేశాల్లో వివిధ వృత్తుల్లో ఉన్న మన దేశ కార్మికులు పెద్ద మొత్తంలోనే విదేశీ ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. ఒక్క 2017లోనే విదేశాల నుంచి మన దేశానికి 6,900 కోట్ల డాలర్ల విదేశీ ద్రవ్యం వచ్చినట్టు ప్రపంచ బ్యాంక్ అంచనా. రెండవ స్థానంలో చైనీయులు 6,400 కోట్ల డాలర్లు విదేశీ ద్రవ్యాన్ని తమ దేశానికి అందించారు. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన వలస కార్మికుల్లో.. ప్రతి ఏటా వివిధ కారణాలతో చనిపోతున్న వారి సంఖ్య 500కు పైనే. వీరికి కనీస ఎక్స్‌గ్రేషియా కూడా అందని స్థితి. రిక్తహస్తాలతో తిరుగుముఖం గల్ఫ్‌లో కంపెనీ మూసేసేముందు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో ఒట్టిచేతులతో స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. నిజానికి వలస వెళ్ళేటప్పుడు కూలీలుగానే వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఎంతోకొంత నైపుణ్యాన్ని ఒంటబట్టించుకుని వస్తున్నారు. అయినప్పటికీ వారికి తిరిగి ఇక్కడ ఉపాధి దొరకడం లేదు. ఎలక్ట్రీషియన్లుగానో, ప్లంబర్లుగానో వారికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం జరగడంలేదు. కేసుల్లో ఇరుక్కుంటే! గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అమాయకంగానో, అనవసరంగానో కేసుల్లో ఇరుక్కున్నవారికీ, లేదంటే అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సందర్భంగా మోసపోయిన వారికీ కనీసం అక్కడ లాయర్లను పెట్టుకునే పరిస్థితీ, వారికి ఫీజులు చెల్లించే ఆర్థికస్థితి ఉండదు. ఇండియన్ ఎంబసీయే కార్మికుల తరఫున లేబర్ కోర్టులో వేతనాల కోసం కేసులు వేస్తుంది. అయితే అన్నీ కోల్పోయిన కార్మికులు అక్కడే ఉండి కోర్టుల్లో న్యాయ పోరాటం చేసే పరిస్థితి ఉండదు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడేవారు చాలామందే ఉన్నారని భీంరెడ్డి వెల్లడించారు. కార్మికుల పునరావాసంపై కేరళలో.. వలస కార్మికుల పునరావాసంలో కేరళ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేరళ నుంచి అత్యధికంగా 22,00,000 మంది వలస కార్మికులున్నారు. అందులో 90% మంది గల్ఫ్ (జీసీసీ) దేశాలకు వెళ్ళిన వారే. వీరికోసం దేశంలోనే తొలిసారిగా కేరళ ప్రభుత్వం 1996లో ప్రవాస కేరళీయుల వ్యవహారాల శాఖ (నోర్కా)ను ఏర్పాటు చేసింది. స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం పునరావాస చర్యల్లో భాగంగా కేరళ ప్రభుత్వం పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎస్బీఐ, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లాంటి వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకొని వారికి రుణాల రూపేణా ఆర్థిక తోడ్పాటునందిస్తోంది. 15% క్యాపిటల్ సబ్సిడీతో 20లక్షల వరకు రుణసాయం అందిస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకుగాను నోర్కా నేతృత్వంలో ప్రత్యేక శిక్షణని కూడా ఇస్తున్నారు. వలస కార్మికులకు గుర్తింపు కార్డులు వలస కార్మికులకు నోర్కా గుర్తింపు కార్డులు ఇస్తోంది. దీని ద్వారా సదరు కార్మికులు ఏఏ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు? అలాగే విదేశాల నుంచి తిరిగి వచ్చిన వలస కార్మికులెందరు? అనే స్పష్టమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. నోర్కా వెబ్సైట్లో ఈ సమాచారమంతా నిక్షిప్తమై ఉంటుంది. ఏయే రంగాల్లో నైపుణ్యం కలిగిన వారు.. ఏయే దేశాల్లో ఎంతమంది ఉన్నారు అనే సమాచారం కూడా వెబ్సైట్లో ఉంటుంది. విదేశాల్లోగానీ, విదేశాల నుంచి తిరిగి వచ్చాక మన దేశంలోగానీ ఉద్యోగాలు ఆశిస్తున్నవారు సైతం ఈ వెబ్సైట్లో తమ పేరుని నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే 31,000 మంది ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. అందుకే అక్కడే చావోరేవో అనే భావనలో.. వలస కార్మికుల పునరావాసం, ఉపాధి కోసం దృష్టి సారిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా వాస్తవానికి వారికి అందుతున్న సాయం అంతంతే. ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఉండటంతో ప్రభుత్వం ఉపాధి కల్పించలేకపోతోంది. చదువుకున్న వారికి సాయం అందుతున్నా వలస కార్మికులకు రుణసాయం లేదా ఆర్థిక సాయం అందుతున్న దాఖలాల్లేవు. దీంతో చావోరేవో అక్కడే ఉండిపోవాలని భావిస్తు్తన్న వలస కార్మికులు వేలల్లో ఉన్నారు. దీంతో వారి కుటుంబాలు చేసిన అప్పులు తీర్చలేక, బతికుండగా తమ వారిని చూసుకోలేక దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న స్థితి రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఉంది. -
ఇరాక్‌లో నరకం అనుభవిస్తున్న ఇందూరు వాసులు!
సాక్షి, నిజామాబాద్: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన 15 మంది నిజామాబాద్ జిల్లా వాసులు ఇరాక్‌లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తానని మోసగించి వీరిని నకిలీ ఏజెంట్.. విజిట్ వీసా మీద ఇరాక్ పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన బాధితులు.. గత నాలుగున్నర నెలలుగా ఓ చిన్న గదిలో ఉంటూ.. స్వదేశానికి ఎలా చేరుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి ఇరాక్‌లో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లా వాసులను ఆదుకోవాలని, వారిని తిరిగి స్వస్థలానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధితులను మోసగించిన నకిలీ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
వలసలు బాధించాయి..
‘తెలంగాణ జిల్లాల నుంచి మొదటగా గుజరాత్, మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. అక్కడ బట్టల మిల్లుల్లో పనిచేసేవారు. ఆ తర్వాత గల్ఫ్ దేశాలకు వెళ్లడం ప్రారంభమైంది. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావనతో వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది’ అని త్రిలోక్ చందన్‌గౌడ్ చెప్పారు. ఆయన ‘గల్ఫ్ వలస కార్మికుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు’ అంశంపై పరిశోధనలను చేసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2017లో ఈయన పరిశోధన ముగిసింది. గల్ఫ్ వలస కార్మికులపై పరిశోధనలను నిర్వహించిన తొలి రిసెర్చ్ స్కాలర్‌గా గుర్తింపు పొందిన త్రిలోక్ చందన్‌గౌడ్ అనుభవాలు ఆయన మాటల్లోనే... – ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ మా స్వస్థలం సంగారెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో ఎంఏ సోషియాలజీ, ఎంఫిల్ చేశాను. పీహెచ్‌డీలో ఏ సామాజిక అంశం ఎంచుకోవాలనే విషయంలో కొంత ఆలోచించాను. అంతకుముందు ఉన్నత చదువులలో భాగంగా కొన్ని సదస్సులలో పాల్గొన్నాను. ఆ సెమినార్లలో గల్ఫ్ వలస కార్మికుల ఆంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ చర్చల సందర్భంగా కార్మికుల కష్టాలు తెలుసుకున్న నాకు కన్నీళ్లు వచ్చాయి. మా ప్రాంతంలో గల్ఫ్ వలసలు లేనప్పటికీ ఆ అంశంపై పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస ఎందుకు వెళ్తున్నారు, వలస కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగయ్యాయా అనే ఆంశంపై పరిశోధన చేయడం వల్ల వలస జీవులకు కొంతైనా ప్రయోజనం కలుగుతుందని భావించాను. అంతేకాక గల్ఫ్ వలసలపై ఇంత వరకు పరిశోధనలు జరగలేదు. నా ద్వారానే పరి శోధనలు మొదలు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నా పరిశోధనలకు అనేక మంది ప్రోత్సాహాన్ని అందించారు. పలు అంశాలపై పరిశోధన గల్ఫ్ కంటే ముందు అనేక మంది పొరుగు రాష్ట్రాల్లోని బట్టల మిల్లుల్లో ఉపాధి పొందడానికి వెళ్లేవారు. 1960–70 మధ్య కాలంలో వలసలు మొదలయ్యాయి. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి మొదట సూరత్, గుజరాత్, భీవండి, ముంబై తదితర ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో పనిచేయడానికి కార్మికులు వలస వెళ్లేవారు. తెలంగాణలో వ్యవసాయం ప్రధాన వృత్తి అయినా.. నీటి సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం లాభసాటి కాదనే భావన, ఇతర కారణాల వల్ల వ్యవసాయం రంగంపై ఆధారపడిన వారు కూడా వలస వెళ్లడం మొదలైంది. అలాగే కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ ప్రభావం అధికం కావడంతో గ్రామాల్లో యువకులను నక్సల్స్ అనే అనుమానంతో పోలీసులు అరెస్టు చేసే వారు. దీంతో యువకులు పోలీసు దాడుల నుంచి తప్పించుకోవడానికి ముంబైకి.. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు పయనమయ్యారు. అప్పట్లో గల్ఫ్ దేశాల్లో చమురు తవ్వకాలకు తోడు భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి కార్మికులు ఎంతో మంది అవసరం అయ్యారు. ముంబై కేంద్రంగా గల్ఫ్ దేశాలకు వలసలు మొదలయ్యాయి. చమురు తవ్వకాలు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారికి గల్ఫ్ దేశాల్లో ఎక్కువ వేతనం లభించడంతో వలసలు క్రమంగా పెరిగాయి. ఈ వలసలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశాను. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా వలసలు ఉన్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి పురుషుల వలసలు ఎక్కువగా ఉంటే.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మహిళలు అరబ్‌షేక్‌ల ఇళ్లలో పనిచేయడానికి వెళ్తున్నారు. ఈ అంశాలపై లోతుగా పరిశోధన చేశాను. గల్ఫ్ దేశాల్లో వీరి స్థితిగతులు ఎలా ఉన్నాయనే ఆంశంపై అధ్యయనం చేశాను. రీసెర్చిలో భాగంగా ఆ దేశాల్లో పర్యటించి కార్మికులను కలుసుకున్నాను. కార్మికుల ఆర్థిక పరిస్థితితో పాటు ఆరోగ్య పరిస్థితి, పనికి తగ్గ వేతనం, సామాజిక భద్రత తదితర అంశాలపై ఐదేళ్ల పాటు పరిశోధన నిర్వహించా. గల్ఫ్ వలసలపై పరిశోధనలు నిర్వహించిన అనుభవంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిర్వహించిన సెమి నార్లు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నాను. తాజాగా 2018 మార్చిలో నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ప్రవాసీ సంక్షేమ వేదిక తరఫున హాజరయ్యాను. ప్రపంచ వలసల సమగ్ర విధాన ప్రక్రియ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన ముసాయిదాపై నిర్వహించిన సెమినార్ లో పాల్గొని భారతీయ వలస కార్మికులు, కార్మిక సంఘాలు, సామాజిక సంస్థల అభిప్రాయాలను వినిపించాను. అలాగే ఢిల్లీ, గుజ్రాత్, కేరళ, తమిళనాడు, మహా రాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వలస కార్మికుల అంశాలపై నిర్వహించిన సెమినార్లలో పాల్గొని వలస కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కార్మికుల పక్షాన డిమాండ్లను వినిపించాను. పరిశోధనలు కొనసాగిస్తున్నా.. గల్ఫ్ వలస కార్మికుల ఆంశంపై పీహెచ్డీ పూర్తిచేసినా ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టు డాక్టర్ ఫెల్లోషిప్ పొందుతున్నాను. సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఎంతో ఉపయోగపడే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికులను గుర్తించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవడానికి మా పరిశోధనలు దోహదపడతాయని ఆశిస్తున్నాం. -
గల్ఫ్‌లో మృత్యుఘోష!
జగిత్యాల రూరల్: ఉన్న ఊరులో ఉపాధి దొరకక.. ఎడారి దేశానికి వెళ్లిన వలస జీవుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. కొంత మంది ప్రమాదవశాత్తు మృతి చెందుతుండగా మరికొంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమవారి ఆచూకీ లభ్యం కాక వేలాది మంది కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ నుంచి దుబాయ్, మస్కట్, బెహరాన్, దోహఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్, మలేసియా, సింగపూర్ వంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చెందిన సుమారు 1,523 మంది మృత్యువాత పడటం చూస్తుంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. 1,450 మంది గల్లంతు రాష్ట్రం ఏర్పడిన నుంచి గల్ఫ్ దేశాల్లో సుమారు 1,450 మంది వరకు గల్లంతయ్యారు. ఇంత వరకు తమతో సత్సంబంధాలు లేకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వీరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అక్కడున్న వారితో పాటు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా ఆచూకీ లభ్యం కావడం లేదు. కాగా, అనారోగ్యంతో పాటు రోడ్డు ప్రమాదాల్లో, ఇతర కారణాలతో మరణించిన సుమారు 453 మంది సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు వీలు లేకుండా పోయింది. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపినా సరైన ఆధారాలు లేవని అక్కడి ప్రభుత్వం తిరస్కరించడంతో అనాథ శవాలుగా మిగిలిపోయాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువు మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అందక ఆ కుటుంబాలు ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నాయి. 2009లో అప్పటి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేవారు. ప్రస్తుతం ఆ సహాయం కూడా అందకపోవడంతో చాలా కుటుంబాలు ఆర్థిక సహాయం అందక అల్లాడిపోతున్నాయి. దీంతో పాటు గల్ఫ్‌లో మృతిచెందిన వారికి లీగల్ ఎయిర్ సర్టిఫికెట్లు కూడా రెవెన్యూ అధికారులు ఇవ్వకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జైళ్లలో మగ్గుతున్న తెలంగాణవాసులు ఐదేళ్లలో సుమారు 5,435 మంది అక్కడి చట్టాలు తెలియక చేసిన నేరాలకు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ సామాజిక సర్వే అంచనా వేసింది. వీళ్లలో కొంత మంది తెలిసీ తెలియక, మరికొంత మంది క్షణికావేశంలో తప్పులు చేసినవారున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడితే గానీ వీరు స్వరాష్ట్రం రావడం కష్టంగా మారింది. కొంత మందికి అక్కడ న్యాయశాఖ సలహాలు దొరకక చిన్నపాటి నేరాలకు కూడా ఏళ్ల పాటు జైలు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇక్కడి కుటుంబీకులు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే గానీ వారి ఇంటికి చేరుకోవడం కష్టతరంగా ఉంది. నా భర్తను విడిపించండి రాయికల్ (జగిత్యాల): ‘నా భర్త సౌదీ జైల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతన్ని విడిపించాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’.. అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మర్‌పల్లికి చెందిన రాజేశ్వరి వేడుకుంటోంది. గ్రామానికి చెందిన ఓర్సు వెంకటి ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో సరైన జీతం ఇవ్వకపోవడంతో కల్లివెల్లి అయ్యాడు. ఏడు నెలల నుంచి వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్వగ్రామానికి రావాలంటే జైలుశిక్ష అనుభవించాల్సిందే. వెంకట్ అక్కడ పోలీసులను ఆశ్రయించగా ఆయనకు మూడు నెలల శిక్షను విధించారు. నెల రోజుల నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తాను జైల్లో తీవ్రంగా నరకయాతన అనుభవిస్తున్నానని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు వివరించారు. తన భర్తను సౌదీ జైలు నుంచి విడిపించాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను రాజేశ్వరి వేడుకుంటోంది. 25 ఏళ్లుగా ఆచూకీ లేదు నా భర్త ఉపాధి కోసం 30 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లి 2,3 సార్లు స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. 25 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. దుబాయ్‌లో ఉన్న మా గ్రామస్తులు కూడా ఆచూకీ కన్పించడం లేదని చెబుతున్నారు. పాతికేళ్లుగా అతని కోసం ఎదురుచూస్తున్నాం. – రాగుల ప్రమీల, పొరండ్ల, జగిత్యాల మండలం పదేళ్లుగా ఎదురుచూపులు నా భర్త 20 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో నా భర్త మృతి చెందాడని కంపెనీ వారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మృతదేహాన్ని గుర్తుపట్టలేదు. స్వగ్రామానికి పంపించలేదు. – నాదర్బేగం, మోర్తాడ్ ఆర్థిక సహాయం కరువు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి మృతి చెందిన వారికి భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోవడంతో చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో కూడా చాలా కంపెనీలు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లేదు. భారత ప్రభుత్వం గల్ఫ్ మృతులకు ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే గానీ వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందడం కష్టతరంగా మారింది. – షేక్ చాంద్ పాషా, గల్ఫ్ సామాజిక సేవకుడు, జగిత్యాల -
కూటికని పోయి ‘కాటికి’పోయిర్రు
సాక్షి, ఖానాపూర్: పొట్ట కూటి కోసం ఎడారి దేశాలకు వలస వెళ్లిన బతుకులకు భరోసా కరువైంది. ఉన్న ఊరిలో ఉపాధి కరువై.. నెర్రెలు బారిన నేలతల్లి ఆదుకోక.. ఆర్థికంగా చితికి.. అప్పు మూటతో విదేశాలకు వెళ్లిన వారిలో మోసపోయిన వారు కొందరైతే.. తిరిగిరాని లోకాలకు చేరిన వారు మరికొందరు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు గల్ఫ్ మానని గాయాలు మిగిల్చింది. అక్కడ జరిగిన పలు ప్రమాదాలతో పాటు గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు, వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాల గుండె కోత తీర్చలేనిది. ఆయా కుటుంబాలకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఎక్స్‌గ్రేషియా రాకపోవడంతో వారంతా దీనస్థితిలో ఉన్నారు. మోసపోతున్న కుటుంబాలు... గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న వలసజీవుల బాధలు చెప్పలేకుండా ఉన్నాయి. బోగస్ ఏజెంట్లు నకిలీ, విజిట్ వీసాలను కంపెనీ వీసాలుగా నమ్మిస్తే గంపెడాశతో అక్కడికి వెళ్లిన అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉండగా ఎంతో మంది పలు కారణాలతో మృత్యువాత పడుతున్నారు. వీటన్నింటిని నకిలీ ఏజెంట్ వ్యవస్థే శాసిస్తోంది. అనివార్య కారణాలతో మృతి చెందిన కుటుంబాల మృతదేహాలు సైతం స్వదేశానికి తీసుకురావడానికి ఏడాదికిపైగా బాధిత కుటుంబాలు తడారిన కళ్లతో వేచి చూడాల్సి దుస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు గల్ఫ్ సమస్యలను మేనిఫెస్టోలో చేర్చి వలస కుటుంబాలకు న్యాయం చేసేలా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇవీ నిబంధనలు... విదేశాల్లో ఉన్న ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ. 50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రిక ప్రకటన ఇవ్వాలి. స్థానికులు, అధికారుల అనుమతి పొంది ఉండాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. వీటిని పాటించని కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వారి డిపాజిట్ జప్తుతో పాటు లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే బహిరంగంగా నకిలీ ఏజెంట్లు నిర్వహించే ఇంటర్వ్యూలు, జారీచేసే ప్రకటనలపై స్థానిక పోలీసు, రెవెన్యూ విభాగాలు కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని, పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించే పేరుతో ఏర్పాటు చేసే సంస్థల్లో బోగస్‌వే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల వరకు ఇలాంటి ఏజెన్సీలు ఉన్నాయి. రెండు ప్రభుత్వ కంపెనీలైనా ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓంకాం, స్వరాష్ట్రంలో ఏర్పాటు చేసిన టాంకాంతో పాటు 29 కంపెనీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌లు ఉన్నాయి. తగ్గని గల్ఫ్ చావులు.. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని ఎంతో మంది గల్ఫ్ కార్మికులు వివిధ కంపెనీల్లో పనిచేయగా, వేలాది మంది కార్మికులు వీసాలు లేకుండా కల్లివెల్లి అవుతున్నారు. గల్ఫ్ నుంచి వచ్చిన మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు(ఫైల్) ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఆశల సౌదంలో గల్ఫ్ బాట పడుతున్న పలువురు అక్కడే మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో కొందరు మృతి చెందుతుండగా.. అధిక పనిబారం, వేతనం తక్కువ, కంపెనీల వేదింపులతో ఎంతో మంది గుండెపోటుకు గురవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్యంతో మృతి చెందడం జరుగుతుంది. ఒకే ప్రమాదంలో జిల్లాలోని ముగ్గురు మృతి దుబాయ్‌లోని అబుదాబికి 10 కిలోమీటర్ల దూరంలోఉన్న అల్రీమ్ ఐలాండ్‌లో గతేడాది అక్టోబర్ 19న జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణలోని ఐదుగురు కార్మికులు అక్కడిక్కడే కాలి బూడిద కాగా, అందులో జిల్లావాసులే ముగ్గురు ఉన్నారు. సత్తన్‌పల్లికి చెందిన ప్రకాశ్ మృతితో పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబం ఈ ప్రమాదంలో క్యాంపులోని రూం నెం.20లో గల నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సేవానాయక్ తండాకు చెందిన ఎం.ప్రకాష్ నాయక్ (29), రూం నెం.30లో మామడ మండలం పొన్కల్‌కు చెందిన గాండ్ల్ల అఖిలేష్ (22), సారంగాపూర్‌కు చెందిన మంచాల నరేష్ (29) ఉండగా.. రూం నెం.17లో గల కామారెడ్డిలోని మాచారెడ్డి చౌరస్తాకు చెందిన పిట్ల నరేష్ (25), నిజామాబాద్ జిల్లా నందిపేట్‌కు చెందిన తోట రాకేశ్ (32)లు ఆహుతయ్యారు. గల్ఫ్‌లోనూ నిబంధనలు తూచ్ .. దుబాయిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనలో సదరు కంపెనీ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. సెంచురి అనే కంపెనీకి చెందిన జిలానీ అనే క్యాంపును నిర్వాహకుల నుంచి గల్ఫ్ డ్యూమ్స్ అనే కంపెనీ అద్దెకు తీసుకుని, తన కంపెనీకి చెందిన కార్మికులకు వసతి కల్పించింది. ఈ క్యాంపు యూఏఈ ప్రభుత్వ నింబంధనల ప్రకారం లేదు. ఇది 30ఏళ్ల క్రితం నిర్మించిన రేకుల షెడ్డులో ఉంది. అక్కడి అనేక క్యాంపుల్లో గ్యాస్‌ను కాని, బయట ఆహారాన్ని గాని క్యాంపుల్లోకి అనుమతించరు. దుబాయ్‌లోని కంపెనీలో అగ్నిప్రమాద దృశ్యం(ఫైల్) అలాగే ఈ క్యాంపులో కూడా ఎలాంటి గ్యాస్ సిలిండర్లను, వంట చేసుకోవడానికి అనుమతించరు. క్యాంపునకు సమీపంలో ఉన్న మెస్‌లోనే వీరంతా భోజనం చేస్తారని అక్కడి కార్మికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి కారణం కార్బన్ మిథైల్, టోక్సిస్ గ్యాసెస్ అయి ఉంటాయని వీటికి చాలా వేగంగా మండే గుణం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ ప్రమాదానికి గ్యాస్‌సిలిండర్ అనే సమస్యే తలెత్తదని పేర్కొన్నారు. కేవలం షార్ట్‌సర్క్యూట్ కారణంతోనే కార్మికులు మృతి చెందారని సంఘటన తీరుతో తెలిసింది. -
కన్నీటి ఎడారి
గల్ఫ్ వెళ్లాక పార్వతమ్మ ఏడ్వని రోజు లేదు. మూడేళ్లు ఆమె కన్నీటితో ఎడారి తడిసింది!భర్త పోయాడు. తెలియనివ్వలేదు. తండ్రి పోయాడు. తెలియనివ్వలేదు.అత్తమ్మ పోయింది. తెలియనివ్వలేదు.కనీసం..‘నేనిక్కడ క్షేమం కాదు’ అని చెప్పేందుకు..‘అమ్మా ఎలా ఉన్నావు’ అని అడిగేందుకు.. దారే లేని దుర్భర జీవితం!!చదవండి. ఎడారి గుండెనే పిండేసే కన్నీటి వ్యథ ఇది. కుటుంబాన్ని పోషించడానికి పెద్ద దిక్కుగా మారి విదేశంలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా నరకమే ఎదురైంది. మూడు నెలలపాటు తిండి లేదు.. నిద్ర లేదు.. ఇంటిమీద బెంగతో ఓ ప్రక్క అల్లాడిపోతూనే మరో పక్క సే పెడుతున్న చిత్రహింసలను భరించింది. రాత్రి 12 గంటలకు పడుకుంటే మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేపుతారు. కేవలం నాలుగైదు గంటల నిద్రతోనే కాలం వెళ్లదీసింది. చివరికి జీతం కూడా ఆమెకు సక్రమంగా ఇవ్వలేదు. రెండేళ్లపాటు ఆమెను కుటుంబీకులతో కూడా మాట్లాడించలేదు. భర్త చనిపోయాడన్న వార్తను ఆమెకు తెలియనీయలేదు. తెలిసిన తర్వాత ఊరికి పంపించాలని బ్రతిమాలినా సే పట్టించుకోలేదు. పంపకపోతే చనిపోతానని ఏడ్చినా వినలేదు. భర్త పోయాక తాళిబొట్టు ఎందుకంటూ మెడలోని నల్లపూసల దండను సేలాగి పడేశాడు. చనిపోవాలనుకుంటే చనిపో. పార్సిల్ చేసి ఇంటికి పంపుతానని బెదిరించాడు. ఆమె సౌదీ వెళ్లిన కొద్దిరోజులకే భర్త, నాన్న, అత్తమ్మలు తనువు చాలించారని తెలిసినా ఏమీ చేయలేని స్థితిలో నలుగురు బిడ్డలను తలుచుకుంటూనే అనుక్షణం ఒకమూల కూర్చొని ప్రతిరోజు ఒక యుగంలా గడిపింది పార్వతమ్మ. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు పరిధిలోని రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ సరిగ్గా మూడేళ్ల క్రితం కుటుంబ పోషణ నిమిత్తమై సౌదీ అరేబియాకు పయనమైంది. భర్త నాగేంద్రనాయుడిని, పిల్లలను ఇక్కడ వదలి వెళ్లడం కష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో పరాయిదేశానికి పయనమైంది. 2016 ఫిబ్రవరి 13వ తేదిన సౌదీకి వెళ్లిన పార్వతమ్మకు పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. ఇక్కడ ఏజెంట్లు చెప్పిందొకటి.... అక్కడ చెయాల్సివచ్చింది మరొకటి. అక్కడ సే (రాజ్సే) తన బిడ్డను చూసుకునే పని అప్పజెప్పాడు. ఆయనకు ముగ్గురు పిల్లలైతే చివరి బిడ్డను పార్వతమ్మే చూసుకునేది. మూడేళ్లు జైలులో ఉన్నట్లే! పార్వతమ్మ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత నేరుగా వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఆరు నెలల వయస్సుగల బిడ్డను పార్వతమ్మ చేతిలో పెట్టారు. ఒక పాల బాటిల్ ఇచ్చి, బిడ్డ ఏడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్వతమ్మపై పెట్టారు. అంతేకాకుండా ఇంట్లో పనులు కూడా చేయించేవారు. బయటికి వెళ్లకుండా గేటుకు తాళం వేయడంతో ఎక్కడికీ వెళ్లడానికి ఆస్కారం లేదు. పారిపోవాలనిపించినా కాల్చి చంపుతారన్న భయంతో సే‡ ఇంటి ఆవరణలోని ఒక రూములో తలదాచుకుంటూ జీవనం సాగించింది. మూడేళ్లపాటు జైలు జీవితం కంటే అధ్వాన్నమైన పరిస్థితుల మధ్య కాలం వెళ్లదీసింది. అనుక్షణం కన్నీరే సమయానికి తిండి లేదు. కంటినిండా నిద్ర లేదు. ఎటూ వెళ్లలేక, అక్కడ ఉండలేక ఆమె అనుక్షణం రోదిస్తూనే ఉండేది. ఒక పక్క సే బిడ్డను ఏడ్వకుండా చూసుకుంటూనే మరోప్రక్క తన కన్నీళ్లను దిగమింగుకునేది. కష్టం చెప్పుకుంటే సేకొట్టడానికి వచ్చేవాడు. పైగా భాష సమస్య ఉండడంతో మూగ సైగలతోనే ఆమె మూడేళ్లు గడపాల్సి వచ్చింది.కుటుంబాన్నీ కోల్పోయిందిపార్వతమ్మ సౌదీ వెళ్లిన సంవత్సరంలోపే.. భర్త నాగేంద్రనాయుడు తనువు చాలించాడు. భార్య సౌదీ వెళ్లిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ రాకపోవడం.. క్షేమ సమాచారం తెలియకపోవడంతో మనోవేదనతోనే చనిపోయాడు. తర్వాత పార్వతమ్మ తండ్రి తాతిరెడ్డినాయుడు కూడా అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. అత్తమ్మ రామసుబ్బమ్మ 2018 జూన్‌లో మృతి చెందింది. అయితే భర్త చనిపోయినపుడు కూడా పార్వతమ్మకు కుటుంబీకులు చెప్పడానికి ఫోన్ నెంబరు తెలియని పరిస్థితి. దీంతో స్థానికంగా ఉన్న ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని భర్త చనిపోయిన మూడు నెలలకు పార్వతమ్మ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పార్వతమ్మ స్వదేశం వెళ్లాలని పట్టుబట్టినా సే నిరాకరించారు. చివరికి ఈ ఒక్కసారైనా కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడించాలని కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదు.కుటుంబం కోసం గల్ఫ్ వెళ్లిన మూడేళ్లలోనే ముగ్గురిని కోల్పోవడంతో పార్వతమ్మ వేదనకు అంతే లేకుండా పోయింది. రెండేళ్లపాటు ఒక్క ఫోన్ కాల్ లేదు గల్ఫ్ వెళ్లిన తర్వాత పార్వతమ్మకు సంబంధించిన సమాచారం కుటుంబీకులకు లేదు. ఏమైందో తెలియదు. ఎక్కడుందో తెలియదు. అసలు ఉందా, లేదా సమాచారం కూడా తెలిపే దిక్కులేదు. కారణం అక్కడికి వెళ్లిన తర్వాత కనీసం ఇక్కడికి ఫోన్ చేసుకోవడానికి ఒక్కసారి కూడా పార్వతమ్మకు అవకాశం రాకపోవడం. 2017 సంవత్సరం చివరన పార్వతమ్మ అత్త రామసుబ్బమ్మ కడప కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా అధికారులను కలిసింది. అంతకుముందు కూడా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభ్యర్థించి ఉండడంతో చలనం మొదలైంది. రెండేళ్ల తర్వాత మొదటి ఫోన్ కాల్ కుటుంబ సభ్యులకు వచ్చిందంటే ఎంతటి విపత్కర పరిస్థితిని పార్వతమ్మ అక్కడ అనుభవించిందో చెప్పకనే తెలిసిపోతోంది. ‘కనీసం నా బిడ్డలతో ఒక్కసారైనా మాట్లాడించండి.. మీ బిడ్డను ఇంత బాగా చూసుకుంటున్నా... కనికరించండి’ అని మొత్తుకున్నా సేuŠ‡ పట్టించుకోలేదని పార్వతమ్మ బోరున విలపించింది. ఇక్కడ ఆమె నలుగురు పిల్లలు వనజ, రెడ్డి నాగ శంకర్ నాయుడు, శైలజ, సునీల్‌కుమార్, మామ అనుక్షణం ఆమె క్షేమ సమాచారం కోసం పరితపిస్తూనే ఉన్నారు. ఏం చేయాలో పాలుపోక కనిపించిన ప్రతి అధికారిని కలిసి వేడుకోవడం మొదలు పెట్టారు. స్థానిక ఎస్ఐ మంజునాథ్ లోకల్‌గా ఉండి పార్వతమ్మను గల్ఫ్‌కు పంపిన ఏజెంట్లను పిలిపించి.. ‘పార్వతమ్మ అత్త చనిపోయింది, 45 రోజుల్లోపు రప్పించాల్సిందే’నని గట్టిగా మందలించడం.. సాక్షి టాబ్లాయిడ్లో వరుసగా కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో చివరికి సెప్టెంబరులో పార్వతమ్మకు విముక్తి లభించింది. అక్కడి నుంచి స్వదేశానికి పంపించారు. మూడేళ్లు గడిచినా జీతం లేదు ఏజెంట్లు ఏం మాట్లాడుకున్నారో ఏమో.. సే మాత్రం ఈ మూడేళ్లలో ఒక్క నెల కూడా జీతం ఇవ్వలేదని పార్వతమ్మ ‘సాక్షి’తో తన గోడు వెళ్లబోసుకుంది. ‘పిల్లలు ఉన్నారు, కుటుంబం ఇబ్బంది పడుతోంది.. జీతం ఇవ్వండి’ అని ఎన్నిమార్లు అడిగినా పలకనే పలకలేదని వాపోయింది. చివరకు ఊరికి వచ్చేటపుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, సౌదీ నుంచి దుబాయ్ వచ్చి అక్కడి నుంచి నేరుగా స్వదేశానికి వచ్చానని పార్వతమ్మ తెలిపింది. – బీవీ నాగిరెడ్డి, సాక్షి, వైఎస్సార్ జిల్లా మా కోడలు మాకు దక్కుతుందని అనుకోలేదు మా కోడలు పార్వతమ్మ మాకు దక్కుతుందని అసలు ఊహించలేదు. సౌదీ అరేబియా వెళ్లిన నాటి నుంచి రెండేళ్ల వరకు జాడ తెలియక మేము పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుస్టేషన్ మొదలుకొని రాజకీయ నాయకులు, జిల్లా పోలీసు అధికారులు, కలెక్టర్, ఏజెంట్లు, ఇలా అందరినీ అడిగాను. కానీ ఎవరిని అడిగినా కోడలి అడ్రస్ దొరకలేదు. నేను నా భార్య, మనవళ్లు, మనవరాళ్లతో అన్నిచోట్లకు తిరిగి అమ్మతో మాట్లాడించాలని కోరాం. ఏజెంట్లను బ్రతిమాలాము. సాక్షి పత్రిక వారు మా బాధను అర్థం చేసుకుని ఆరేడుసార్లు పేపరులో రాశారు. మాకైతే ఒకరకంగా ఆమెపై ఆశే లేదు. ఎందుకంటే వెళ్లినప్పటి నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలు ఉందో, లేదో తెలియదు. భాష రాని చోట ఏమైందో అన్న బెంగతోనే భయపడుతూ రెండేళ్లు గడిపాం. చివరకు కొడుకును, వియ్యంకుడిని, భార్యను పోగొట్టుకున్న సందర్బంలోనూ కోడలికి తెలియజేసే ప్రయత్నం ఏజెంట్ల ద్వారా చేసినా తెలిసిందో, తెలియదోనన్న బెంగ వెంటాడింది. కుటుంబీకులు చనిపోయినపుడే పార్వతమ్మను స్వదేశానికి పంపని సేuŠ‡లు ఆ తర్వాత ఏం పంపిస్తారని అనుకున్నాం. దేవుని దయవల్ల పోలీసులు, సాక్షి పేపరోళ్ల పుణ్యమా అని మా కోడలు ఇంటికి రావడంతో పిల్లలు అనాథలు కాకుండా మిగిలారు! – వెంకట రమణ నాయుడు, పార్వతమ్మ మామ -
అంట్లు తోమాడు.. అడుక్కున్నాడు
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్: దుబాయ్‌లో మంచి పనిలో చేర్పిస్తానని ఆ యువకుడిని ఓ గల్ఫ్ ఏజెంట్ నమ్మించి రూ.లక్షన్నర తీసుకుని దుబాయ్ పంపించాడు. అక్కడ రోడ్డు చెంత హోటల్లో కప్పులు, ప్లేట్లు కడిగే పనిలో చేర్చాడు. ఆ పనులు చేస్తే వచ్చే అరకొర జీతంలో కొంత మొత్తాన్ని అక్కడే ఉన్న ఏజెంట్ మరదలు లాక్కునేది. ఐటీఐ చదువుకుని బతుకు తెరువు కోసం ఎన్నో ఆశలతో వెళ్లిన ఆ యువకుడు అడుగడుగునా అష్టకష్టాలు పడ్డాడు. మండలంలోని బండార్లంక గ్రామానికి చెందిన పిల్లి నాగేంద్ర దీన గాథ ఇది. నాగేంద్ర తండ్రి హేమసుందరరావు గతంలో బండార్లంకలో ఓ చిరు వ్యాపారంతో జీవించేవాడు. బతుకు తెరువు కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి హేమసుందరరావు కుటుంబం ఇటీవల వలస వెళ్లింది. అక్కడే నభీఖాన్ అనే గల్ఫ్ ఏజెంట్ పరిచయయ్యాడు. అప్పటి దాకా తనకు వచ్చిన మెకానిక్ పనితో కష్టపడుతూ తండ్రికి తోడై కాస్త సంపాదనలో ప డ్డాడు. ఏజెంట్ అరి చేతిలో వైకుంఠాన్ని చూపించి అతడిని దుబాయ్ పంపించే ఏర్పాట్లు చేశాడు. దుబాయ్‌లో తన మరదలు ఉంటుందని..అక్కడ అంతా ఆమె చూసుకుంటుందని ధైర్యం చెప్పాడు, నాగేంద్ర వద్ద రూ.లక్షన్నర తీసుకుని విజిట్ వీసాతో ఈ ఏడాది మే 29న విమానం ఎక్కించాడు. అంట్లు తోమే పనిఅప్పగించారు దుబాయ్‌లో దిగాక ఏజెంట్ మరదలు తొలుత రోడ్డు చెంత ఓ గ్యారేజ్‌లో హెల్పర్‌గా చేర్పించింది. అక్కడి పాకిస్తాన్ యువకుల వేధింపులు తాళ లేకపోయాడు. తర్వాత ఆమె రోడ్డు చెంత హోటల్ సర్వర్–కమ్–పాత్రలు శుభ్రం చేసే పనిలో పెట్టింది. విజిట్ వీసాతో పంపించినా అక్కడ పర్మినెంట్ వీసా ఇప్పిస్తానన్న ఏజెంట్ పట్టించుకోలేదు. వీసా గడువు ముగిసిపోయే పరిస్థితిలో.. చేసేది లేక పోలీసుల కంట పడకుండా భిక్షగాడి అవతారమెత్తాడు. కొంత సొమ్ము సమకూరాక వీసాను పొడిగించుకున్నాడు. తండ్రి చొరవతో స్వదేశానికి.. కొడుకు దీనస్థితిని చూసి నాగేంద్ర తండ్రి హేమసుందరరావు చలించిపోయాడు. అప్పు చేసి విమా నం టికెట్ తీయించి కొడుకు క్షేమంగా స్వదేశానికి వచ్చేలా చేసుకున్నాడు. సత్తుపల్లిలో ఏజెంట్‌ను తండ్రిని పదే పదే తన కొడుకుని తిరిగి స్వదేశం వచ్చేలా చేయమని ఒత్తిడి తెచ్చినప్పుడు అతడిపై దాడి కూడా చేశాడు. అక్కడ న్యాయం జరగదేమోనన్న భయంతో సొంతూరు బండార్లంక వచ్చి అమలాపురం రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాడు చేశాడు. అయితే ఏజెంట్‌ది సత్తుపల్లి కాబట్టి అక్క డ ఫిర్యాదు చేయమని ఎస్సై గజేంద్రకుమార్ చె ప్పారు. దీంతో సత్తుపల్లి పోలీసుస్టేషన్లోనే ఫిర్యా దు చేయనున్నట్టు బాధితుడు నాగేంద్ర తెలిపాడు. -
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి కోనరావుపేటవాసి ఆత్మహత్య
కోనరావుపేట (వేములవాడ): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన ఓ యువ కుడు అక్కడ సరైన పనిలేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చెన్నమేని అంజయ్య–ఎల్లవ్వ దంపతుల ఏకైక కుమారుడు సతీశ్(30). తండ్రీకొడుకులు గతంలో మూడుసార్లు ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి సరైన పని దొరకక ఇంటికి తిరిగొచ్చారు. అంజయ్య అప్పులు చేసి కూతురు పెళ్లి చేశాడు. మొత్తంగా అప్పు రూ.12 లక్షలకు చేరింది. అప్పుచేసి ఆరునెలల క్రితం సతీశ్ బహ్రెయిన్ వెళ్లగా, తండ్రి దోహాఖతార్ వెళ్లాడు. తండ్రి కూడా తక్కువ వేతనానికే పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీరుతాయని తల్లి, భార్యకు తరచూ ఫోన్ చేసి మథనపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీడియో(ఐఎంవో)కాల్ చేసి తల్లి, భార్య రాజ మణి, ఇద్దరు కొడుకులు చూస్తుండగానే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. వారు వద్దని వారించినా వినలేదు. కళ్లెదుటే ఆత్మహత్య చేసుకుంటున్న సతీశ్‌ను ఎలా కాపాడాలో తెలియక కుటుంబం రోదిస్తూ ఉండిపోయింది. -
యూఏఈ నుంచి కేరళకు భారీగా రెమిటెన్స్‌లు
న్యూఢిల్లీ : భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలతో కొట్టుమిట్టాడుతున్న కేరళను ఆదుకోవడం కోసం యూఏఈ రూ.700 కోట్ల విరాళం ప్రకటించిందని.. దాన్ని కేంద్రం తిరస్కరించిందని.. కానీ అసలు యూఏఈ విరాళమే ప్రకటించలేదని... ఇలా వార్తలు మీద వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వరదల సమయంలో వచ్చిన ఈ విరాళం పక్కన పెడితే, కేరళకు యూఏఈ నుంచి భారీ ఎత్తునే సంపద వస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? రెమిటెన్స్‌ల రూపంలో. కేరళకు, యూఏఈకు చాలా ఏళ్ల నుంచే అవినాభావం సంబంధం ఉంది. కేరళ నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువగా యూఏఈలోనే స్థిరపడ్డారు. అక్కడ సేవా రంగంలో కేరళ వారిదే ఆధిపత్యం. కేరళ మైగ్రేషన్ సర్వే రిపోర్టు ప్రకారం 36 లక్షల మందికి పైగా కేరళవాసులు యూఏఈలో నివసిస్తున్నట్టు తెలిసింది. యూఏఈలో మాత్రమే కాక, అటు ఖతర్‌లోనూ కేరళవాసులు నివసిస్తున్నారు. యూఏఈలో 41.5శాతం, ఖతర్‌లో 8.5 శాతం కేరళవాసులే. దీంతో విదేశాల నుంచి కేరళకు భారీ ఎత్తునే రెమిటెన్స్‌లు వస్తున్నాయి. కేరళకు, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థకు రెమిటెన్స్‌లు ఎంతో కీలకం. మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్పై వరల్డ్ బ్యాంక్ రూపొందించిన రిపోర్టులో, 2017లో ఇన్వర్డ్ రెమిటెన్సస్(దేశానికి వస్తున్న చెల్లింపుల్లో)లో ప్రపంచంలోనే భారత్ టాప్‌లో ఉందని వెల్లడైంది. 2017లో దాదాపు 69 బిలియన్ డాలర్లు అంటే రూ.4,82,827 కోట్ల రెమిటెన్స్‌లో భారత్‌కు వచ్చాయి. ఇవే భారత జీడీపీలో 3 శాతంగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కూడా కేరళకే వచ్చాయని బిజినెస్ టుడే నివేదించింది. కేరళకు మొత్తం రెమిటెన్స్‌లో 40 శాతం రాగ, ఆ తర్వాత పంజాబ్‌కు 12.7 శాతం, తమిళనాడుకు 12.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 7.7 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 5.4 శాతం రెమిటెన్స్‌లు వచ్చినట్టు తెలిసింది. రీసెర్చ్ పేపర్ ప్రకారం, కేరళకు వచ్చే రెమిటెన్స్‌లు ఆ రాష్ట్ర జీడీపీలో 36 శాతం ఉన్నట్టు వెల్లడైంది. మొత్తం కేరళకు వచ్చే రెమిటెన్స్‌ల విలువ సుమారు రూ.90వేల కోట్లని తెలిసింది. ఇవన్నీ గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయని రిపోర్టులు తెలిపాయి. కేరళ నుంచి వలసపోయి యూఏఈలో నివసించే బ్లూకాలర్ వర్కర్లు, ప్రొఫిషినల్స్ నుంచి ఇవి ఎక్కువగా వస్తున్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతేకాక, విదేశాల్లో నివసించే కేరళవాసులు ఎక్కువగా ఇక్కడ బంగారం, భూమిపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. ప్రవాస మలయాళీల డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్లకు పైమాటేనని తెలిసింది. రెమిటెన్స్ రూపంలో కేరళ పొందే మొత్తంలో 20 శాతం, బ్యాంక్ అకౌంట్లలోకి డిపాజిట్లు, సేవింగ్స్ రూపంలో వస్తున్నాయని ఆర్బీఐ సర్వే రిపోర్టు కూడా వెల్లడించింది. దేశంలో అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి కలిగిన రాష్ట్రంగా ఉన్న కేరళకు, అధిక ఆదాయం యూఏఈ, గల్ఫ్ దేశాల నుంచే వచ్చే రెమిటెన్స్‌ల రూపంలోనే వస్తుందని పలు రిపోర్టులు వెల్లడించాయి. అత్యధిక నిరుద్యోగ నిష్పత్తి ఉన్నప్పటికీ, కేరళ తలసరి ఆదాయం సుమారు 60 శాతం అధికంగా ఉంటుంది. ఇదంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆదాయం మహిమనే అని చెప్పుకోవాలి. -
ఖల్లివెల్లి కార్మికుడి నుంచి..కంపెనీ యజమానిగా..
సిద్దిపేట రూరల్ : బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన ఆ యువకుడికి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ఏజెంట్ విజిట్ వీసా అంటగట్టడంతో కొద్ది రోజులకే గడువు ముగిసింది. స్వదేశం రాలేక అక్కడే తలదాచుకున్నాడు. ఖల్లివెల్లిగా (అక్రమ నివాసి) మారి చిన్నచిన్న కంపెనీల్లో పనిచేశాడు. ఆ తర్వాత స్వశక్తితో కంపెనీ ఏర్పాటు చేసి ఎందరో వలస కార్మికులకు ఉపాధి చూపుతున్నాడు. అంతేకాకుండా ఖల్లివెల్లి కార్మికులకు అండగా నిలిచి సేవలు అందిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామానికి చెందిన గుండెల్లి నర్సింలు కుటుంబం అతని బాల్యంలో నిజామాబాద్‌కు వలస వెళ్లింది. నర్సింలు తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకున్న నర్సింలు కొన్ని రోజులు తాపీ మేస్త్రీగా పనిచేశాడు. ఒక రోజు అతని తండ్రి కట్టెకోత మిషన్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మొద్దు అతని భుజంపై పడడంతో గాయపడ్డాడు. ఇదే సమయంలో నర్సింలు తల్లి కూడా అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో నర్సింలు గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రూ.70 వేలు అప్పుచేసి 2004 సంవత్సరంలో దుబాయికి వెళ్లాడు. అయితే, అతనిని దుబాయికి పంపిన ఏజెంట్ కంపెనీ వీసా ఇప్పిస్తానని మోసం చేశాడు. దుబాయికి వెళ్లిన తర్వాత నర్సింలు ఆ ఏజెంట్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో నర్సింలు సరైన గూడు లేక చెట్ల కింద, లారీల కింద, పాడుబడ్డ భవంతుల వద్ద తలదాచుకుని దొరికిన పని చేసుకుంటూ రోజులు గడిపాడు. సంవత్సరం తర్వాత ఒక కంపెనీలో నెలకు 700 దిర్హమ్స్ జీతానికి పనికి కుదిరాడు. అప్పడు భారత కరెన్సీలో నెలకు రూ.10 వేలు. ఇలా పనిచేసి సంపాదించి అప్పు తీర్చాడు. నర్సింలు నాలుగు సంవత్సరాలకు పైగా ఖల్లివెల్లిగా (అక్రమ నివాసిగా) పనిచేశాడు. సాయంత్రం వరకు కంపెనీలో పనిచేసి సాయంత్రం సమయంలో పార్కింగ్‌లో కార్లును కూడా కడిగేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ కారు ఓనర్ అయిన సీఐడీ విభాగంలో పనిచేసే అధికారితో నర్సింలుకు పరిచయం ఏర్పడింది. ఆ అధికారిని అక్కడి వారు అర్బాబ్ (అరబ్బీలో యజమాని, ప్రభువు అనే బిరుదు) అని పిలిచేవారు. ఆయన సహాయంతో నర్సింలు 2008లో దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. మళ్లీ దుబాయికి ప్రయాణం.. తోర్నాలకు చేరుకున్న నర్సింలు పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు సొంత ఊరిలోనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత.. దుబాయిలో పరిచయ మైన సీఐడీ అధికారి తన సొంత కారు డ్రైవర్‌గా పనిచేయడానికి వీసా పంపగా నర్సింలు తిరిగి మళ్లీ దుబాయికి వెళ్లాడు. అక్కడే కారు డ్రైవింగ్ నేర్చుకొని ఆయన సహాయంతో లైసెన్సు పొందాడు. ఆ అధికారి కారు నడుపు తూనే సొంతంగా కారును కొనుగోలు చేసి నడుపుకున్నాడు. దీంతో పాటు అక్కడే ఇంటర్నెట్ పెట్టాడు. అందులో మొబైల్ రీచార్జ్ కార్డులు కూడా విక్రయించాడు. 2013లో సొంతంగా కంపెనీ ఏర్పాటు.. అందరితో పరిచయాలు పెంచుకున్న నర్సింలు అక్కడి వారి భాగస్వామ్యంతో 2013 సంవత్సరంలో ‘ఎస్‌ఆర్‌జి టెక్నికల్ సర్వీసెస్ అండ్ బిల్డింగ్ క్లీనింగ్ ఎల్ఎల్సీ’ అనే కంపెనీని స్థాపించాడు. పెద్ద ఎత్తున కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు. తన కంపెనీ నుంచి మంచి వేతనం, వసతులు కల్పిస్తున్నాడు. దీనితో పాటు ఆయనకు మరో కంపెనీలో భాగస్వామ్యం లభించింది. ఇమ్మిగ్రేషన్‌కు ఉచితంగా బస్సు సౌకర్యం యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్షమాభిక్షను ఖల్లివెల్లి కార్మికులు ఉపయోగించుకునేందుకు నర్సింలు సహాయపడుతున్నాడు. ఇమ్మిగ్రేషన్ పనుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాడు. ఖల్లివెల్లిలకు ఈ ఖర్చు లేకుండా నర్సింలు ఉచితంగా టాక్సీలు, మినీ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నాడు. అదేవిధంగా సుమారు 100 మందికి పైగా భారత వలస కూలీలకు ఔట్ పాస్‌లు రావడంతో ఈ నెల 22 నుంచి వారిని స్వదేశానికి పంపిస్తున్నానని చెప్పాడు. సహాయం కావాల్సిన వారు తన సెల్ నంబర్ +97155 9346999 కు ఫోన్ చేయవచ్చని, తక్షణ సహాయం చేస్తామని నర్సింలు చెబుతున్నాడు. ఆమ్నెస్టీకి తెలంగాణ ప్రభుత్వ హెల్ప్‌లైన్ యూఏఈ దేశం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఆమ్నెస్టీ కాలంలో ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయం కావాలంటే హెల్ప్‌లైన్ నెంబర్ +9194408 54433 లేదా ఇ–మెయిల్ so_nri@telangana.gov.in ను సంప్రదించాలని కోరారు. తిరిగి వచ్చే వారి కోసం ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖ యూఏఈ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తున్నదని మంత్రి తెలిపారు. దుబాయి ఇండియన్ కాన్సులేటులోని హెల్ప్ డెస్క్ నంబర్ +97156 5463903 లేదా Indiaindubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. ఏడు రాజ్యాలలో వేర్వేరు నిబంధనలు యూఏఈలోని ఏడు రాజ్యాలలో (ఎమిరేట్స్) వేర్వేరు నిబంధనలు ఉండటం వలన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ఉపయోగించుకునేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుబాయిలో నిబంధనలు కొంతవరకు ఈజీగా ఉన్నాయి. కేటీఆర్ దుబాయికి రావాలి, ఖల్లివెల్లీలను ఆదుకోవాలి. వాపస్ వచ్చినవారికి తెలంగాణ ప్రభుత్వం డబుడ్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలి. ఉపాధి కల్పించాలి. – దొనకంటి శ్రీనివాస్, అబుదాబి రూ.50 కోట్లు కేటాయించాలి యూఏఈ క్షమాభిక్ష పథకంలో వలస కార్మి కులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వం అధికారుల బృందాన్ని యూఏఈకి పంపి ప్రవాసుల సమస్యలను అధ్యయనం చేయాలి. ఆమ్నెస్టీ పొందేవారిని ఆదుకోవాలి. భారత రాయబార కార్యాలయాల్లో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలి. ప్రస్తుతం దుబాయి లోని లేబర్ క్యాంపుల్లో కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాను. – ఎన్. దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు యూఏఈ ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటించడం హర్షించదగిన విషయం. క్షమాభిక్షకు అర్హులైన వారు ఇండియన్ ఎంబసీ నుంచి సహాయం పొందవచ్చు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు సహాయం చేస్తామని ప్రకటించడం మంచి పరిణామం. అలాగే ఏవైనా సమస్యలుంటే యూఏఈలోని తెలంగాణ జాగృతి వలంటీర్లు అవసరమైన సహాయం చేస్తారు. – నవీన్ ఆచారి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి విమాన టికెట్లకు దాతల సాయం ఆమ్నెస్టీ పథకంలో దుబాయి నుంచి స్వస్థలాలకు వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికులకు కొందరు దాతలు ఉచిత విమాన ప్రయాణ టికెట్లు సమకూర్చారు. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసి యశ్ బొద్దులూరి రెండు టికెట్లు, ఆయన సోదరులు మరో మూడు టికెట్లు ఉచితంగా ఇచ్చారు. మరికొందరు దాతల సహకారంతో కయిలోతు రాజం, కెలోప్త్ మోహన్ (ఎల్లారెడ్డిపేట), భూక్యా గోవర్దన్, మలావత్ మహిపాల్ (సిరికొండ), అంబుగోత్ రతన్ (మాచారెడ్డి), మంగళపల్లి భారత్ కుమార్ (దోమకొండ), సబావత్ మోహన్ (పాకాల, సిరికొండ), భూక్యా అశోక్ (తూముపల్లె, సిరికొండ), బానోత్ జగన్ (మహ్మదాబాద్, మెదక్), బక్కోల్ల లక్ష్మినారాయణగౌడ్, సంపంగి శ్రీకాంత్, రంగబోయిన నవీన్‌లకు ఉచిత టికెట్లు పంపిణీ చేశారు. డాక్టర్ గోపాలకృష్ణ రూ.2లక్షలు, డాక్టర్ పవిత్ర మరికొన్ని టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌కు యూఏఈ ప్రభుత్వ ఆహ్వానం తెలంగాణ ఎన్నారై మంత్రి కె.టి.రామారావును తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈనెల 5న ఒక లేఖ రాశారు. విద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో యూఏఈతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి రావాలని కోరారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా తనకు లభించిన ఆతిథ్యానికి షేక్ అబ్దుల్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ తన పర్యటన సందర్భంగా యూఏఈలోని తెలంగాణ ప్రవాస కార్మికుల సమస్యలతో పాటు, ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఉపయోగించుకునేవారికి సహాయం చేస్తారని అక్కడి తెలంగాణ వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
మెతుకు లేక.. బతుకు వలస
ఉన్న ప్రాంతంలో మెతుకు పుట్టదు.. ఎంత పనిచేసినా బతుకు మారదు. పేరుకు ఉద్యానవనం. కానీ పచ్చదనం కోల్పోయి చాలాకాలమవుతోంది. ఉద్దానం బిడ్డలు ఇప్పుడు బతుకు వెతుక్కుంటూ వేరే దేశాలకు వెళ్తున్నారు. కేవలం కూలి పనుల కోసం కుటుంబాలను వదిలి సరిహద్దులు దాటుతున్నారు. అంతదూరం వెళ్తున్నా వారి జీవితాలు మారడం లేదు. బ్రోకర్ల చేతిలో మోసపోవడం.. ప్రమాదాల్లో చిక్కుకోవడం వంటి సంఘటనలు వారి కుటుంబ సభ్యులను కలవర పెడుతున్నాయి. టెక్కలి డివిజన్ పరిధిలో ఉద్దానం ప్రాంతంగా పిలిచే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. దీంతో చదువుకొని.. నిరుద్యోగులుగా ఉన్న యువకులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి కోసం వలస వెళుతూ , అక్కడ భద్రత లేని ఉద్యోగాల్లో చేరి అవస్థలు పాలవుతున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అయినా సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాకుళం / కంచిలి: ఉద్దానం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో చాలామంది నిరుద్యోగులు, యువకులు దూర ప్రాంతాలకు సైతం వెళ్లేందుకు వెనుకాడడం లేదు. ఈ అవకాశాన్నే కొంతమంది బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. గ్రామాల్లో తిరుగుతూ యువకుల్ని ఆకర్షిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశలు చూపి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత ఏదో విధంగా బయట దేశానికి వెళ్లి.. నాలుగు రూపాయలు సంపాదించాలని ఆశిస్తున్నారు. అయితే అలాంటి ప్రయాణాలు సక్రమంగా సాగడం లేదు. ఇక్కడి నుంచి పంపే బ్రోకర్లు సరైన పద్ధతిలో పంపించకపోవడం, టూరిస్టు వీసాలతో అక్కడికి పంపిన తర్వాత పట్టించుకోకపోవడంతో దేశంకాని దేశంలో ఉద్దానం వాసులు అవస్థలు పడిన సందర్భాలు కోకొల్లలుగా ఇటీవల వెలుగు చూశాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే ఉద్దానం యువతకు ఈ దుస్థితి ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాదిలో జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. టెక్కలి డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన యువకులు సౌదీ అరేబియాలో ఇటీవల చిక్కుకున్నారు. అక్కడి నుంచి బాధితులు నేరుగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. అక్కడ వారు పడుతున్న అగచాట్లకు సంబంధించిన ఫొటోలు పంపించారు. ఒడిశా రాష్ట్రం గంజాం, జయంతిపురం గ్రామాల పరిధిలో గల యువకులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పది మంది బాధితులు గల్ఫ్‌లో చిక్కుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఒడిశాలోని బరంపురం, ఇచ్ఛాపురం, టెక్కలిలో గల ఏజెంట్ల ద్వారా పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లారు. అప్పట్లో చిక్కుకున్న వారిలో శ్రీకాకుళానికి చెందిన కిలుగు రామారావు రెడ్డి (ఇచ్ఛాపురం మున్సిపాలిటీ బెల్లుపడ కాలనీ), దుంప బైరాగి (ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి), దూపాన ప్రకాష్ రెడ్డి (కంచిలి మండలం అంపురం), కల్లేపల్లి కార్తీక్ (సోంపేట మండలం తాళపధ్ర), రాజాం రామారావు (పూండి, తోటపల్లి), గొరకల హేమారావు( పూండి ముల్లారిపురం), బయా పెంటయ్య (బావనపాడు)తో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మద్ది బృహస్పతి(ఒడిశా గుడ్డిపద్ర), కోళ హరికృష్ణ (ఒడిశా బొరివాడ), గణేష్ పాత్రో జంకల, శిలవలస గోపాల్, పూదరి శ్రీనివాస్, నీలమ్ రాజకుమార్, గలిపెల్లి మధు, సౌదా బత్తుల ఉమామహేశ్వరావు, ఉమాశంకర్ సాహూ, సిలవలస వాసుదేవ్, సుధామ చంద్ర సాహూ, పెదిని తారేసు, పందిరి విజయ్‌కుమార్, లోచన బెహరా, ముడిలి ప్రహ్లాద్, సిలివలస గోపాల్, దకుయా గోవింద్‌లు ఇబ్బందులు పడ్డారు. ఏజెంట్ల మాయలో... విదేశా>ల్లో ఉద్యోగం...చేతి నిండా సొమ్ము...ఐదేళ్లు పాటు విదేశాల్లో ఉంటే కోటీశ్వరులవుతారంటూ నిరుద్యోగ యువకులకు గాలం వేసే ఏజెంట్లు జిల్లాలో కోకొల్లాలు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నుంచి బరంపురం వెళ్లే రహదారుల్లో పుట్టగొడుగుల్లా ఇనిస్టిట్యూట్లు వెలిశాయి. కేవలం నిరుద్యోగులకు వల విసిరి వారి వద్ద భారీగా నగదు దోచుకోవడం అలవాటు పడ్డారు. ఇచ్ఛాపురం పురపట్టణంలోనే ఐదు, కంచిలి మండలంలో రెండు ఇనిస్టిట్యూట్లున్నాయి. సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో పలు గ్రామాల్లో బ్రోకర్లు కూడా ఉండి నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. నామమాత్రం శిక్షణతో.. బ్రోకర్లు ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్‌లో వెల్డింగ్, ఫిట్టర్ వంటి శిక్షణలు తూతూ మంత్రంగా ఇస్తూ విదేశాలకు పంపించాలంటే సుమారు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్నకు చెందిన అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ ప్రతినిధి ఉద్యోగాలిప్పిస్తానంటూ ఎంతో మంది అమాయక యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి ఉద్యోగాలిప్పించకపోవడంతో వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇటీవల పలాస పట్టణానికి చెందిన ఒక బ్రోకర్ 30 మంది నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసిన వైనం బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మందస మండలంలో కూడా ఇటువంటి సమస్య బయటపడింది. ఇలా ఉద్దానం ప్రాంతంలో చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్ల అవతారమెత్తి నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు. అయినా నిరుద్యోగులు కూడా ఇవేమీ పట్టించుకోకుండా వేలాది రూపాయలు చెల్లించి విదేశీ ఉద్యోగాలపై ఆశతో బ్రోకర్ల చేతిలో డబ్బులు పెడుతూ మోసం పోవడం.. లేదా విదేశాలు వెళ్లి అక్కడ అవస్థలు పడడం జరుగుతున్నాయి. ఉద్దానం ప్రాంతం నుంచి ఏడాదికి సగటున 2వేల మంది వరకు యువకులు విదేశాలకు వలస వెళుతున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులు చేసి పొట్టనింపుకోవడానికి మన దేశంలోని తమళనాడు, బెంగళూరు, గుజరాత్, ముంబాయి తదితర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు కూడా ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న వారు పనులు చేసే క్రమంలో ప్రమాదాలబారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలంటూ తీసుకెళ్లే బ్రోకర్లు, వివిధ కంపెనీలు ఇక్కడ చెప్పేదొక ఉద్యోగం అయితే .. అక్కడ బాత్రూంలు, లెట్రిన్లు శుభ్రపరిచే పనులను కూడా అప్పగించే సందర్భాలు ఉనాయి. ఆ పనిలో కూడా భద్రత లేకపోవడంతో తమ దుస్థితిని తెలియజేస్తూ అక్కడ ఇబ్బందులు పడేవాళ్లు మనసు చంపుకొని ఆ ఫొటోలను ఇక్కడికి పంపి, కాపాడమని వేడుకున్న సందర్భాలు కూడా ఇటీవల వెలుగు చూశాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు గానీ.. సర్కార్ గాని పట్టించుకోకపోవడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకహోదాతోనే పారిశ్రామికాభివృద్ధి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వలసల రాష్ట్రం. అందులో శ్రీకాకుళం జిల్లా వలసల్లో ప్రథమస్థానంలో ఉంది. ఉద్దానం పరిస్థితి అయితే మరింత ఘోరం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే పారిశ్రామిక ప్రగతి జరిగి, ఉన్న ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు జరిగి యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆయన వస్తే పరిశ్రమలు వస్తాయని ఆశించిన యువత తీవ్రమైన మోసానికి గురైంది. నిరుద్యోగులు దగాపడ్డారు. –డాక్టర్. సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెనుకబాటు తనంతోనే వలసలు ఉద్దానం ప్రాంతంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక వెనుకబాటులో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, పంటలు కూడా పూర్తిస్థాయిలో పండకపోవడంతో ఇక్కడి యువకులుతోపాటు అన్ని వయస్సుల వారు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఉద్యోగాలు కల్పిస్తారని ఆశించిన యువతకు నిరాశే మిగిలింది. – పిరియా సాయిరాజ్, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త వలస బతుకులు దుర్భరం స్థానికంగా ఉద్యోగావకాశాలు లేక కుటుంబాలను ఇక్కడ విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నార. తీరా అక్కడ పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయి. నేను కూడా కుటుంబాలను పోషించాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే తలంపుతో ఇతర ప్రాంతానికి వెళ్లాను. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి వచ్చేసి, ఇక్కడ ఆటో నడుపుకొని జీవిస్తున్నాను. –నారద భీమారెడ్డి, నరసన్నముకుందాపురం గ్రామం, కంచిలి మండలం ఉద్యోగాల్లేక అల్లాడుతున్నాం రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగాల కల్పన చేపట్టకపోవడంతో డిగ్రీలు, పీజీలు చేసి అల్లాడుతున్నాం. మా లాంటి ఎంతో మంది యువకులు చదువుకున్నవారు సైతం స్థానికంగా ఉద్యోగాలు లేకపోవడంతో అప్పులు చేసి మరీ విదేశాలకు వెళుతున్నాం. అక్కడ ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. –తరిపిల మురళి, పోస్టు గ్రాడ్యుయేట్, గోకర్ణపురం, కంచిలి మండలం -
‘నైటీల’ చరిత్ర ఇంతింత కాదయా!
సాక్షి, న్యూఢిల్లీ : నైటీలంటే రాత్రిపూట మహిళలు వేసుకునే దుస్తులు అని అందరికి తెల్సిందే. కానీ వాటిని ఇప్పుడు రాత్రులందే కాకుండా పగటి పూట పనులందూ వేసుకుంటున్నారు. ఎందుకంటే అవి అందుకు ఎంతో అనువుగా ఉంటాయికనుక. భారత దేశంలో ఈ నైటీలకు బహుళ ప్రాచుర్యం తీసుకొచ్చిందీ మాత్రం కేరళకు చెందిన భార్యాభర్తలు. వారే బెన్నీ ఎన్ఏ, షెర్లీ బెన్నీలు. షెర్లీ బెన్నీ కథనం ప్రకారం 1987లో బెన్నీ ఎన్ఏ వద్ద మూడు వేల రూపాయల మిగులు రూపాయలున్నాయట. అందరిలాగా ఆయన వాటిని బ్యాంకులో దాచుకోకుండా ఏదో వ్యాపారం చేయాలనుకున్నాడట. ఆడవారికి అనువైన దుస్తులు తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందీ ఆయనకు ఓనాడు. కేరళలో మహిళలు ఎక్కువగా కష్టపడతారుకనుక వారికి అనువైన, అంతగా అందుబాటులో లేని అరుదైన దుస్తులను తయారుచేసి అమ్మితే లాభసాటిగా ఉంటుందని భావించారట. కేవలం నైటీలనే మాత్రమే తయారు చేయాలనుకొని కేవలం 300 చదరపు అడుగుల స్థలంలో ‘ఓరియన్స్ క్రియేటర్స్’ పేరిట ఓ ముగ్గురు పనివాళ్లతో ఓ కుట్టుమిషన్ కేంద్రాన్ని బెన్నీ ఏర్పాటు చేశారు. కొచ్చీకి గంటన్నర దూరంలోని పిరవోమ్లో ముగ్గురు కార్మికులతో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పుడు 600 మంది కార్మికులు పనిచేసే ‘ఎన్‌స్టైల్’ ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్‌ని సంపాదించుకున్న ఈ ఎన్స్టైల్కు ఇప్పుడు కేరళ వ్యాప్తంగా 400 రిటేల్ షాపులున్నాయి. ముందు కేరళ, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ నైటీలకు ఎంతో ఆదరణ లభించింది. ఇప్పుడు ఎన్స్ట్ల్కు ఫాషన్ డిజైనర్‌గా, సీఈవోగా బెన్నీ భార్య షెర్లీ బెన్నీ వ్యవహరిస్తున్నారు. భర్త మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. 1980 దశకంలో దేశవ్యాప్తంగా నైటీలు ప్రాచుర్యం కావడానికి ఈ కంపెనీ ఉత్పత్తులే కారణమని చెబుతారు. 90 శాతం కాటన్, పది శాతం పాలిస్టర్‌తో తయారు చేసిన ఈ నైటీలు మార్కెట్లో 200 రూపాయల నుంచి 800 రూపాయల మధ్య లభిస్తాయి. గల్ఫ్ దేశాల్లో మహిళలు ఎక్కువగా నైటీలు ధరిస్తారని, కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు పనికోసం ఎక్కువగా వెళ్లే మగవాళ్లు, తమ భార్యల కోసం అక్కడి నుంచి నైటీలు తెచ్చేవారని, అలా కేరళ మహిళల్లో నైటీలకు ఆదరణ మొదలైందని స్థానికులు చెబుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే బెన్నీలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారని కూడా వారంటున్నారు. వాస్తవానికి భారత దేశంలో విక్టోరియా రాణి కాలం నుంచి మహిళలకు నైటీలు పరిచయం. ఇంగ్లాండ్ రాజవంశానికి చెందిన మహిళలు, బ్రిటీష్ ఉన్నతాధికారుల భార్యలు నైటీలు ధరించేవారు. వారు కేవలం పడుకునేటప్పుడు మాత్రమే ధరించే వీటిని నైట్ గౌన్లు అని పిలిచేవారు. వారిని చూసి భారతీయ కులీన వర్గానికి చెందిన మహిళలు కూడా నైటీలు ధరించడం మొదలు పెట్టారు. 1960వ దశకాల్లో మన బాలీవుడ్ తారలు సినిమాల్లో నైటీలతో దర్శనమిచ్చారు. ‘అందాజ్’ బాలివుడ్ సినిమాలో నర్గీస్, ‘అన్బె వా’ తమిళ చిత్రంలో సరోజా దేవీ, ‘కలివీడు’ మలయాళం చిత్రంలో ప్రముఖ నటి మంజూ వారియర్లు నైటీలు ధరించారు. ముంబైలో 1980వ దశకంలోనే మరాఠీ, గుజరాతీ మహిళలు నైటీలు ధరించడం ప్రారంభించారు. బ్రిటీష్ పాలకులకు ముందే అంటే, ప్రాచీన ఈజిప్టు, రోమన్ల ద్వారా మనకు నైటీలు పరిచయమయ్యాయని బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ స్లైలిస్ట్, కొరియాగ్రాఫర్ ప్రసాద్ బిడప తెలిపారు. స్కర్టులు, ప్యాంట్లు ఎక్కువగా ధరించే అమెరికా మహిళలు కూడా ఇప్పుడు నైటీల వెంట పడుతున్నారట. అక్కడి నైటీల మోజుపై ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత జూలై నెలలో ‘వియర్ యువర్ నైటీ అవుట్’ శీర్షికన ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఒకప్పుడు రాత్రిపూట వేసుకునేందుకే పరిమితమైన నైటీలు ఇప్పుడు ఇంట్లో ఉన్నంత సేపు వేసుకునే దుస్తులుగా మారిపోయాయి. అంతేకాకుండా పలు నగరాల్లో తల్లులు నైటీలపైనే తమ పిల్లలను కాన్వెంట్లలోనూ, స్కూళ్లలోనూ దించొస్తున్నారు. అలా తల్లులు నైటీలపై వస్తున్నందుకు 2013లో చెన్నైలోని ఓ స్కూల్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకముందు అలా వస్తే పిల్లలను స్కూల్లోకి అనుమతించమని బెదిరించింది. నవీ ముంబైలో ఓ మహిళా సంఘం నైటీలపై బయట తిరిగే మహిళలకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించేందుకు ప్రయత్నించింది. ఈ రెండు సంఘటనల్లోనూ న్యాయ పోరాటంలో నైటీలే గెలిచాయి. కార్మికుల సమ్మె, యూనియన్ల గొడవల కారణంగా ‘ఓరియన్స్ క్రియేటర్స్’గా మూడు దశాబ్దాలు ‘ఎన్‌స్టైల్’గా రెండు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన తమ ఉత్పత్తి కేంద్రాన్ని అహ్మదాబాద్‌కు మార్చాలని బెన్నీ దంపతులు నిర్ణయించారు. అక్కడ చాలా చౌకగా కార్మికులు లభించడమే అందుకు కారణం. -
కష్టాలు మాఫీ
కంటికి కనిపించే భౌగోళిక సరిహద్దుల్ని దాటడం సులువే. కానీ కనిపించని భాషా సరిహద్దును దాటడమే కష్టం. బతుకు బాట వేసుకోవడానికి గల్ఫ్ దేశాల దారి పట్టిన శ్రామికులలో చాలామంది భాష తెలియక అక్కడి చట్టాల ఉల్లంఘన జాబితాలో చేరిపోతుంటారు. అలాంటి వారి కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏటా ఓ ‘మన్నింపు’ అవకాశం ఇస్తుంటుంది. ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ చివరి వరకు ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’ పేరుతో కష్టాలను మాఫీ చేసేందుకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇండియా, బంగ్లాదేశ్, చైనా, ఇథియోపియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, కెన్యా, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు ఇప్పటికే తమ ప్రతినిధులను ఎమిరేట్స్‌కు పంపేశాయి. అయితే ఇండియా నుంచి వెళ్లిన ప్రతినిధుల్లో ఒక్క తెలుగు అధికారి కూడా లేకపోవడంతో.. గతంలో అరబ్ ఎమిరేట్స్ ఎంబసీలో ఉద్యోగం చేసి, అక్కడ.. చదువు సరిగ్గా రాని తెలుగు వాళ్లు పడే ఇబ్బందులు స్వయంగా చూసిన నంగి దేవేందర్ రెడ్డి తన వంతుగా ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’లో ఒక స్టాల్ పెట్టించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... పేరు తప్ప ఇంకేం చదవలేరు ‘‘ఇండియా నుంచి వెళ్లిన అధికారులు ఇంగ్లిష్, హిందీలోనే మాట్లాడతారు. ‘తెలుగు వచ్చిన అధికారి ఒక్కరైనా ఉండేటట్లు చూడండి’ అని అడిగాం. అయినా పట్టించుకున్న వాళ్లు లేరు. భారత దేశం అంటే హిందీ మాట్లాడే ప్రజలుండే దేశమేననే అపోహలో ఉండే కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణ రాష్ట్రాల మీద పెద్ద పట్టింపు ఉండదు. ‘కనీసం మాకు ఒక స్టాల్ పెట్టుకునే అవకాశమైనా ఇవ్వండి’ అని వేడుకుంటే ఆ మొరను మాత్రం ఆలకించారు. ఆగస్టు 1 నుంచి మొదలౌతున్న ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’లో ‘నవ తెలంగాణ సమితి’ పేరు మీద స్టాల్ పెట్టాం. పేరుకిది తెలంగాణ సమితి అయినప్పటికీ తెలుగువాళ్లందరికీ మా బృందం సేవలు అందిస్తుంది. మన దేశం నుంచి గల్ఫ్‌కి వెళ్లే వాళ్లలో మలయాళం, తెలుగు వాళ్లే ఎక్కువ. మలయాళీయులు బాగా చదువుకుని వైట్ కాలర్ జాబ్స్ చేసుకుంటున్నారు. తెలుగు వాళ్లు.. ముఖ్యంగా తెలంగాణ వాళ్లు మాత్రం భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తున్నారు. వాళ్లలో తమ పేరు తప్ప ఇంగ్లిష్‌లో మరే పదాన్ని కూడా చదవలేని వాళ్లే ఎక్కువ. ఆమ్నెస్టీ పీరియడ్ గురించి తెలుసుకుని అప్లయ్ చేసుకోవడం కూడా తెలియదు. అసలు ఆమ్నెస్టీ అనే పదం కూడా తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా ‘అవుట్ పెట్టినారంట. వీసా గడువు తీరిపోయిన వాళ్లను, కలివెలి వీసా (రాంగ్ వీసా) తో వెళ్లిన వాళ్లను అవుట్లో ఇండియాకి పంపించేస్తార’ని మాత్రమే. వేడికి అన్నం పాచిపోయేది గల్ఫ్‌లో భవన నిర్మాణరంగంలో పని చేసే వాళ్లు రోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి వండుకుని, బాక్స్ సర్దుకుని, ఇతర పనులన్నీ చేసుకుని ఐదున్నరకంతా సైట్కెళ్లే వెహికల్ ఎక్కాలి. తిరిగి బసకొచ్చేసరికి రాత్రి ఎనిమిది– తొమ్మిదవుతుంది. పగలంతా ఎర్రటి ఎండలో పని చేయాలి, ఉదయం వేడిగా ఉన్నప్పుడే బాక్సులో పెట్టుకున్న అన్నం అక్కడి ఎండలకు ఒక్కోసారి పాచిపోతుంది కూడా. అలాగే తింటే ఆరోగ్యాలు పాడవుతాయి. 45 డిగ్రీల ఎండల్లో చెమట రూపంలో రెండు లీటర్ల నీరు పోతుంది. రోజుకి పది లీటర్లకు తక్కువ కాకుండా నీళ్లు తాగితే తప్ప బతికి బట్ట కట్టడం కష్టం. ఇదేమీ తెలియక పనులు చేసుకుంటూ కొన్నాళ్లకే బీపీ, షుగర్ల బారిన పడుతుంటారు. హఠాన్మరణాలన్నీ హార్ట్ ఎటాక్‌లే. వర్క్ ప్రెషర్ ఎక్కువై గుండె ఆగిపోయేవాళ్లు కొందరైతే, బాడీ డీ హైడ్రేట్ అయి లోబీపీతో గుండె ఆగిపోయేవాళ్లు కొందరు. రోజంతా ఎండలో పని చేసి గదికొచ్చి స్నానం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వాళ్లెందరో. వీటన్నింటి మీద వారిలో చైతన్యం కలిగిస్తే కనీసం తగినంత నీళ్లయినా తాగుతారనేది మా ప్రయత్నం. గల్ఫ్‌లో మంచి ఉద్యోగాల్లో ఉన్న తెలుగు వాళ్లందరం కలిసి మెడికల్ క్యాంపులు పెట్టి మందులిప్పించాం. ఇప్పటికీ ఇప్పిస్తున్నాం. నెలకు ఐదారు మరణాలు నేను 2010 నుంచి ఐదేళ్ల పాటు బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీలో ఉద్యోగం చేశాను. కనీసం నెలకు ఐదారు మరణాలుండేవి. గడచిన నాలుగేళ్లలో ఒక్క తెలంగాణలోనే 800 గల్ఫ్ మరణాలు సంభవించాయి. ఇవన్నీ చూస్తుంటే మనకు గల్ఫ్ అంటే భూతల నరకమేమో అనిపిస్తుంది. అయితే పనిలో నైపుణ్యం పెంచుకుని, ప్రభుత్వ ఆథరైజ్డ్ సంస్థ ద్వారా, ఒరిజినల్ వీసాతో వెళితే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. రహదారి సరిగ్గా లేనప్పుడే పక్కదారులు డెవలప్ అవుతాయి. పొరపాట్లు జరుగుతున్నది అక్కడే. ముందే ట్రైనింగ్ తీసుకోవాలి మనకు హైదరాబాద్‌లో 45 ఎకరాల ట్రైనింగ్ సెంటర్ ‘న్యాక్’ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) ఉంది. తాపీ పని నుంచి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి భవన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల్లోనూ ఇంజనీరింగ్ స్కిల్స్‌లో ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. నెలకు వెయ్యిమందికి శిక్షణ ఇవ్వగలిగిన సంస్థ మన దగ్గర ఉన్నప్పటికీ ఆ విషయం మన గ్రామాల్లోని యువకులకు తెలియడం లేదు. గ్రామాల్లో వేలాది మంది పని లేక, పని చేయడం చేతకాక ఉన్నారు. కనీసం గల్ఫ్ వంటి చోట్లకు వెళ్లే వాళ్లయినా న్యాక్‌లో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్, వర్క్ పర్మిట్‌తో వెళ్తే.. ఉద్యోగ భద్రత ఉంటుంది. ‘ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ నినాదంతో ఇవాళ్టి నుంచి మొదలౌతున్న ‘యుఏఈ ఆమ్నెస్టీ 2018’ లో అక్కడున్న మనవాళ్లు తప్పు దిద్దుకోవడానికి రెండు అవకాశాలున్నాయి. అక్కడే ఉండాలంటే ఇల్లీగల్ వీసాను లీగలైజ్ చేసుకుని కొనసాగవచ్చు. వచ్చేయాలనుకుంటే ఇండియాకి వచ్చేయవచ్చు. ఎలాంటి సహకారం కావాలన్నా టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలి. ‘క్షమాభిక్షకు అవకాశం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకు ఉంటుంది’’ అని వివరించారు దేవేందర్. ‘అవుట్’ పెట్టినట్లే తెలీదు! ఆమ్నెస్టీ వార్తలు గల్ఫ్‌లో అరబిక్, ఇంగ్లిష్ పత్రికల్లో ప్రచురితమవుతాయి. వాటిని మనవాళ్లు చదవలేరు. నగరాల్లో ఉద్యోగం చేసే ఏ కొందరికో తెలుస్తుంది. వాళ్లు సాధ్యమైనంత వరకు ఇతర తెలుగువాళ్లకు చేరవేస్తుంటారు. కానీ మనవాళ్లు పని చేసే వర్క్సైట్లు నగరాలకు 30–40 కిలోమీటర్ల దూరాన ఉంటాయి. వాళ్లకు అవుట్ (ఆమ్నెస్టీ) పెట్టినట్లే తెలియదు. కనీసం మన తెలుగు పత్రికలైనా విస్తృతంగా ప్రచురిస్తే... గల్ఫ్ వెళ్లిన వాళ్ల కుటుంబీకులు ఇక్కడ చదివి, వారానికో–నెలకో ఫోన్లో దొరికినప్పుడు సమాచారమిస్తారనేది నా ప్రయత్నం. – నంగి దేవేందర్ రెడ్డి, కన్వీనర్, టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్‌లో పనిచేసే భారతీయులు అనేక కారణాలతో వెనక్కి వచ్చేయాల్సి వుంటుంది. ప్రభుత్వాలు ‘ప్రకృతి విపత్తు నిర్వహణ’ కోసం ఏర్పాటు చేసినట్లే – గల్ఫ్ బాధితుల కోసం కూడా శాశ్వత పథకాన్ని పెట్టాలి. ‘ప్రవాసి మిత్ర’ ద్వారా మేము ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నాం. బాధితులకు పునరావాసం కూడా కల్పించాలి. – భీంరెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షులు సహాయం కోసం టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు: దుబాయ్‌లోని భారత్ కాన్సులేట్, అబుదాబి లోని భారత రాయభార కార్యాలయాల్లో సహాయ కేంద్రాలున్నాయి. దుబాయ్ వాళ్లు సంప్రదించాల్సిన ఫోన్ నంబరు :0097150565463909 లేదా indianindubai.amnesty@gmail.com అబుదాబిలో ఉన్న వాళ్లు... 00917508995583 లేదా indemb.uaeamnesty18@gmail.com యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తెలుగు వారికి సేవలందిస్తున్న వారు: టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కో ఆర్డినేటర్ మారుతి ముత్యాల: 00971566670013; కేవీఎస్ రెడ్డి: 00971527714549 గమనిక: క్రిమినల్ కేసులున్న వాళ్లకు ఈ సహాయం వర్తించదు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నా కొడుకు ఎట్లున్నడో..
కామారెడ్డి: ‘నాలుగు పైసలు సంపాదిస్తానని దేశంగాని దేశం బోయిన కొడుకు చెయ్యని నేరానికి జైలు పాలైండు. జైలులో ఎట్లున్నడో ఏమో’ అంటూ కొడుకు కోసం ఆ తల్లి తపిస్తోంది. కొడుకును విడిపించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడు కుంటోంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన ఎట్టం సంజీవులు (26) అనే యువకుడు రెండున్నరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఒమన్ దేశానికి వెళ్లాడు. మస్కట్‌లో ఒమన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సంబందించిన హోటల్లో వెయిటర్‌గా పనికి కుదిరాడు. ఆరు నెలల పాటు బాగానే ఉందని తల్లితో ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి డబ్బులు పంపించాడు. కాగా, సంజీవులు పనిచేసే హోటల్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. ఆ కేసులో సంజీవులును పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలిసిన తల్లి కన్నీరుమున్నీరైంది. ఏడాది పాటు కోర్టు కేసు విచారణ కొనసాగింది. గత యేడాది అక్టోబర్‌లో సంజీవులుకు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పుచెప్పింది. కొడుకుకు జైలు శిక్ష పడినప్పటి నుంచి తల్లి మనోవేదనకు గురవుతోంది. సంజీవులు తండ్రి సాయన్న చనిపోయినప్పటి నుంచి తల్లే సంజీవులును పెద్ద చేసింది. కొడుకు కోసం ఎంతో కష్టపడింది. జైలులో ఉన్న సంజీవులును విడిపించ డానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అప్పట్లోనే బంధువులు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. అయినా లాభం లేకుండాపోయింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని తెలిసిన బంధువులు ఇటీవల బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డిని కలిసి సాయం అందించాలని వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారని సంజీవులు బంధువులు తెలిపారు. -
గల్ఫ్ గోస; ఓ భారతీయురాలి దీనగాథ
సాక్షి, న్యూఢిల్లీ : అరబ్ దేశమైన ఓమన్ రాజధాని మస్కట్ నగరంలో మే నాలుగవ తేదీన ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న 38 ఏళ్ల శీజా దాస్ తన యజమానురాలు పెడుతున్న చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా రెండంతస్తుల మేడ మీది నుంచి దూకేశారు. దాంతో ఆమెకు వెన్నుముకతోపాటు రెండు కాళ్లు విరిగాయి. ఎడమ వైపు నడుము నుంచి పాదం వరకు శరీరం పూర్తిగా చచ్చుపడి పోయింది. ఓమన్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం ఆమెను మే 26వ తేదీన భారత్‌లోని కేరళకు పంపించారు. ఆమె ప్రస్తుతం తిరువనంతపురం జిల్లా, చిరాయింకీజు గ్రామంలోని చిన్న ఇంటిలో జీవచ్చవంలా రోజులు లెక్కపెడుతోంది. కదలలేని మెదలలేని పరిస్థితిలో ఉన్న ఆమెకు ఆమె భర్త బిజుమన్ సదాశివన్ సపర్యలు చేస్తున్నారు. శీజా దాస్ ఇంతటి దుస్థితికి కారణమైన ఆమె యజమానురాలి నుంచి మాత్రం ఆమెకు నష్టపరిహారంగా ఒక్క పైసా రాలేదు. అందుకు ప్రస్తుత భారత ప్రభుత్వం కారణమవడం బాధాకరం. నేడు శీజా దాస్‌కు జరిగిన అన్యాయం.. 2015లో తమిళనాడుకు చెందిన 58 ఏళ్ల కస్తూరి మునిరత్నంకు సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఎదురైన దారుణాన్ని గుర్తుచేస్తోంది. అతి తక్కువ డబ్బులకు తనతో అరవచాకిరి చేయిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు యజమాని ఇంటి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినందుకు 2015, అక్టోబర్ 8వ తేదీన ఆమె కుడిచేతిని ఇంటి యజమాని నరికేశారు. ఈ సంఘటనపై నాడు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వార్త తెల్సిన మరుక్షణమే ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఆమె అక్టోబర్ 9వ తేదీన తొమ్మిది గంటల ప్రాంతంలో ట్వీట్ చేశారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే: ‘గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ కంట్రీస్’గా పిలిచే ఓమన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు పని మనుషులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారిలో శీజా దాస్, మునిరత్నంలాంటి బాధితులు కూడా వేలల్లో ఉంటారని అక్కడి భారతీయ సామాజిక కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని, ప్రాణాలకే ముప్పు ముంచు కొస్తోందనే భయంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయరని వారు చెబుతున్నారు. పస్తులు, వీపు దెబ్బలు శీజా దాస్ 2016వ సంవత్సరం నుంచి మస్కట్‌లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో పనిచేస్తున్నారు. అదే యజమాని కింద 2013 నుంచి ఆమె భర్త శివదాసన్ పనిచేస్తుండడంతో తన జీవితానికి ఎలాంటి ఢోకా ఉండదని శీజా భావించారు. ఇద్దరి జీతాల నుంచి కూడ బెట్టుకున్న సొమ్ముతో ఓ చిన్న ఇల్లు కూడా కట్టుకోవచ్చని వారు కలలుగన్నారు. గత వేసవి సెలవుల్లో వారు తమ ఇద్దరు పిల్లల (13 ఏళ్ల శ్రీరప్, రెండేళ్ల శోభిత్)ను తీసుకొని మస్కట్ వెళ్లారు. ఎంత పనిచేసినా సరిగ్గా పనిచేయడం లేదంటూ ఇంటి యజమానురాలు కర్రతో ఎప్పుడూ శీజా వీపుపై బాదేదట. పస్తులు ఉంచేదట. మే నాలుగవ తేదీన ఏదో సాకుతో చితకబాదడం మొదలు పెట్టిందట. ఎంత వేడుకున్నా వదిలి పెట్టలేదట. తరిమి తరిమి కొట్టిందట. ఆ దెబ్బలను తప్పించుకునేందుకు రెండో అంతస్తు మేడ మీదకు పరుగెత్తిందట. అయినా వెంటపడడంతో తప్పించుకునేందుకు మరో మార్గం లేక కిందకు దూకేసిందట. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మస్కట్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించారట. మస్కట్‌కు రాకముందు తన భార్య శీజా 48 కిలోల బరువు ఉండేదని, ఆస్పత్రిలో చేరనాటికి ఆమె బరువు 30 కిలోలే ఉందని భర్త శివదాసన్ తెలిపారు. తన భార్యకు నెలకు 50 ఓమన్ రియల్స్ (8,750 రూపాయలు) ఇస్తానన్న హామీతో పనిమనిషిగా ఉద్యోగంలో పెట్టుకున్నారని, యజమాని ప్రతి నెల ఆమె బ్యాంక్ ఖాతాలో ఆ జీతం మొత్తాన్ని జమచేసి మళ్లీ అదే రోజు విత్‌డ్రా చేయించి తీసుకునే వారని ఆయన తెలిపారు (అక్కడ పని మనుషుల జీతాలను తప్పనిసరిగా బ్యాంకుల ద్వారానే చెల్లించాలి). అంతా కలిపి మళ్లీ భారత్‌కు తిరిగి వెళ్లేటప్పుడు ఇస్తానని చెప్పేవారని, అనుమానం ఉన్నా చేసేదేమీ లేక ఊరుకున్నామని ఆయన చెప్పారు. తనకు మాత్రం నెలకు 17,500 రూపాయలు వచ్చేదని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన తన భార్యకు నష్టపరిహారం చెల్లించకపోగా, జీతంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. భారత్‌కు పంపించేందుకు తన భార్య శీజాకు మాత్రమే తమ యజమాని విమాన టిక్కెట్టు కొన్నారని, తనకు, తమ పిల్లలకు కొనలేదని శివదాసన్ తెలిపారు. వీరి పరిస్థితి గురించి ఓమన్‌లో సామాజిక, సాంస్కతి సంస్థగా రిజిస్టర్ అయిన ‘ఇండియన్ సోషల్ క్లబ్’ అధ్యక్షుడు, ‘కేరళ నాన్ రెసిడెంట్ కేరలైట్స్ వెల్ఫేర్ బోర్డ్’ డైరెక్టరయిన పీఎం జబీర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు. ఆమె ఆదేశం మేరకు మస్కట్‌లోని భారతీయ ఎంబసీ జోక్యం చేసుకొని బిజూమన్, ఇద్దరు పిల్లలకు కూడా విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసి భారత్‌కు పంపించారు. ఒక్క నయాపైసా కూడా యజమాని నుంచి శీజాకు రాలేదు. చట్టాలు ఏమి చెబుతున్నాయి? విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం కోసం 2011లో విదేశాల్లో భారతీయుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో షరతులు, మార్గదర్శకాలు ఉన్నాయి. భారతీయులను పని మనిషిగా పెట్టుకునే విదేశీ యజమానికి నెలకు కనీసం 2,600 డాలర్ల ఆదాయం ఉండాలి. సదరు యజమాని ఒక్కో పని మనిషికి 2,850 డాలర్ల (దాదాపు రెండు లక్షల రూపాయలు) చొప్పున భారత అంబసీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. దీన్ని అంబసీ సెక్యూరిటీ డిపాజిట్‌గా పరిగణిస్తుంది. యజమాని జీతాలు చెల్లించనప్పుడు, న్యాయపరమైన పోరాటం అవసరమైనప్పుడు, నష్టపరిహారం కోసం బాధితుడికి అంబసీ ఈ సొమ్మును ఖర్చు పెడుతుంది. ఇక నెలకు కనీస జీతాన్ని 280 డాలర్లు (దాదాపు 18,800 రూపాయలు)గా నిర్దేశించింది. అంతేకాకుండా యజమాని ఉచిత భోజన సౌకర్యంతోపాటు ఉచిత వసతి కూడా కల్పించాలని షరతు విధించింది. ప్రీ పెయిడ్ సిమ్ కార్డుతో మొబైల్ ఫోన్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఏడాదికోసారి భారత్ వచ్చిపోయేందుకు ప్రయాణ ఖర్చులు భరించాలి. 2015లో భారత ప్రభుత్వం ఈమ్రైగ్రేషన్ వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది. పని మనుషులకు సంబంధించిన అన్ని వీసా కార్యకలాపాలు ఈ వెబ్సైట్ ద్వారానే నిర్వహించాలి. నష్టపరిహారం ఎత్తివేశారు విదేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండంతో భారతీయ అంబసీ కోరుతున్న బ్యాంక్ గ్యారంటీ అందుకు కారణం అవుతుందని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో గల్ఫ్‌తోపాటు మొత్తం 18 దేశాల్లో ఈ షరతు ఎత్తివేసింది. పర్యవసానంగా నేడు శీజా దాస్‌కు నష్టపరిహారం అందకుండా పోయింది. ‘ఇంటి కల ఎలాగు చెదిరిపోయింది. నా వైద్యానికి ఉన్నదంతా ఖర్చయిపోయింది. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇక నేనా లేవలేను. నేను ఎప్పుడు కన్నుమూసినా ఫర్వాలేదు. కానీ ఇద్దరు పిల్లలను పోషించాల్సిన బాధ్యత, బరువు నా భర్తపై పడింది. ఎలా నెట్టుకొస్తాడో ఏమో’ అంటూ ఆమె మీడియాతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారతీయ పని మనుషులకు సరైన భద్రత కల్పించాలి. లేకపోతే శీజా లాంటి కథలు వింటూనే ఉంటాం’ అని పీఎం జబీర్ వ్యాఖ్యానించారు. -
మెరుగైన ఉపాధికి అడ్డా.. ఖతార్
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) : గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతార్ వలస కార్మికుల ఉపాధికి పెద్దపీట వేస్తోంది. ఒకప్పుడు వలస కార్మికులకు ఎంతో ఉపాధి కల్పించిన సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, దుబాయ్, ఒమన్, ఇరాక్ దేశాలు ఆర్థిక సంక్షోభం కారణంగా కార్మికులను క్రమంగా తిరుగు ముఖం పట్టిస్తున్నాయి. ఖతార్ మాత్రం ఆర్థిక సంక్షోభాన్ని దరిచేరనీయకుండా.. వలస కార్మికుల ఉపాధికి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. 2022లో ఖతర్ వేదికగా నిర్వహించనున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం అధునాతనమైన స్టేడియాలు, ఇతర సౌకర్యాల కోసం నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయి. దీనికి తోడు యూరప్ దేశాల్లోని మాదిరిగా మెట్రో రైలు సర్వీసు కోసం జోరుగా పనులు సాగుతున్నాయి. ఖతార్‌లోని దోహా, అల్ రయ్యన్, అల్ వక్రా, అల్ ఖోర్, రస్ లఫన్ ఇండస్ట్రియల్ సిటీ(ఆర్ఎల్ఐసీ) తదితర పట్టణాల్లో జోరుగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. దీంతో కార్మికులకు చేతినిండా పని ఉంది. స్టేడియంల నిర్మాణ పనులకు కార్మికులను సరఫరా చేసే లైసెన్స్‌లను పొందిన వారిలో తెలంగాణ జిల్లాలకు చెందినవారే ఉన్నారు. అయితే మనవారు ఈ పనుల కోసం బంగ్లాదేశ్, నేపాల్ కార్మికులను ఖతార్‌కు తరలిస్తుండటం గమనార్హం. క్రూడ్ ఆయిల్ ప్రధాన వనరు... ఖతార్‌కు ప్రధానమైన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్. ఇతర గల్ఫ్ దేశాల్లోనూ ఆయిల్ ఉత్పత్తి భారీగానే ఉన్నా ఖతార్‌లో పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంది. తమ పొరుగు దేశాల మాదిరిగా కాకుండా క్రూడ్ ఆయిల్ విషయంలో ఖతార్ కొన్ని నియమాలను పాటిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ధరల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుందనే పేరు ఉంది. దీనికి తోడు అక్కడి ప్రభుత్వం తమ దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా మొదటి నుంచీ పొదుపు మంత్రం పాటించడంతో గల్ఫ్ దేశాల్లో ఖతార్ ప్రత్యేకత సంతరించుకుంది. పొరుగు దేశాలతో పేచీ ఉన్నా... తీవ్రవాద దళాలకు సహకారం అందిస్తుందనే కారణంతో ఖతార్‌ను ఇతర గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఖతార్‌కు తమ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు లేకుండా కట్టడి విధించాయి. అంతేకాక తమ విమానాలను కూడా ఖతార్ గగనతలం నుంచి నడపకుండా, అలాగే ఖతార్ విమానాలు తమ దేశాల గగనతలంపై విహరించకుండా చర్యలను తీసుకున్నాయి. అయితే తమ భాగస్వామ్య దేశాలతో పేచీ ఉన్నా ఆ ప్రభావం ఏమాత్రం తమ దేశంలోని పౌరులు, విదేశీ కార్మికులపై పడకుండా ఖతార్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. ఖతర్‌పై నిషేధం విధించిన తొలినాళ్లలో కొంత ఇబ్బందులు ఏర్ప డినా వేగవంతమైన ఏర్పాట్ల వల్ల నిషేధం వల్ల ఏర్పడిన ప్రభావం తొలగిపోవడం గమనార్హం. వ్యాపారాలకు అనువైన దేశం... సొంతంగా వ్యాపారం నిర్వహించుకోవాలనుకునే వారికి ఖతార్ మంచి అవకాశం కల్పిస్తోంది. గల్ఫ్ దేశాల్లో సొంత ఉపాధి కోసం లైసెన్స్‌లు విస్తృతంగా జారీచేసే దేశంగా దుబాయ్ ముం దుంది. అయితే దుబాయ్‌లో ఎక్కువగా సప్లయింగ్ కంపెనీలకే అవకాశం ఉంది. ఖతార్‌లో మాత్రం సూపర్ మార్కెట్ల నిర్వహణ, రైస్ అమ్మకాలు, ఇతర వ్యాపారాల నిర్వహణకు లైసెన్స్‌లను జారీచేస్తారు. ఇప్పటికే కోరుట్ల రైస్ పేరిట ఖతార్‌లో ఎంతో మంది బియ్యం అమ్మకాలను సాగిస్తున్నారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్‌కు చెందిన పోలీసు విద్యాసాగర్ అతని సోదరులు రాధాకిషన్, రమేష్‌లు బియ్యంతో పాటు ఖర్జూరం, చీపుర్లు, బుట్టలు, ఇతర గృహ అలంకరణ సామగ్రి వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వీరు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఖతార్‌లో సొంత వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తాజాగా పశువుల దాణాను సొంతూళ్లో ఉత్పత్తి చేసి ఖతార్‌కు ఎగుమతి చేస్తున్నారు. అలాగే భీమ్‌గల్, నిజామాబాద్‌లకు చెందిన వారు కూడా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లా కథలాపూర్, తాండ్రా వాసులు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకంటే ఖతార్‌లో నిబంధనలు అంత కఠినంగా లేకపోవడం మనవారికి కలిసి వచ్చే ఆంశం. మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ దుబాయి, షార్జాలలోని ఇండియన్ వర్కర్స్ రీసోర్స్ సెంటర్ వారు వలస కార్మికుల మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. యూఏఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు మానసిక ఒత్తిడికి గురైన సందర్భంలో ‘ఐడబ్ల్యూఆర్సీ’ వారి 24 గంటల హాట్‌లైన్ నంబర్ 800 46342కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సహాయం పొందవచ్చు. తమ సమస్యలను ఇ–మెయిల్ ఐడి help@iwrcuae.inకు గానీ, మొబైల్ నంబర్ 00971 55 870 3725కు ఎస్ఎంఎస్ ద్వారా తెలుపుకోవచ్చు. ఖతార్‌లో ఉద్యోగాలకు ఆటంకం లేదు ఖతార్‌లో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నేను డిప్లోమెట్ క్లబ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇతర గల్ఫ్ దేశాలతో పోల్చితే ఖతార్‌లో పరిస్థితి బాగుంది. 2022 ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం విస్తృతమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. కార్మికులకు పని బాగుంది. ఆఫీస్ బాయ్స్, క్లీనింగ్ సెక్షన్లలో మాత్రం పాతవారే కొనసాగుతున్నారు. – ఏశాల నర్సారెడ్డి, ఖతర్ (తొర్తి వాసి) సొంత వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నాం నేను ఎంబీఏ పూర్తి చేశాను. బంధు, మిత్రుల సహకారంతో ఖతార్‌లో సొంతంగా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రెండు నెలల క్రితం ఆ దేశానికి వెళ్లి వచ్చాను. మిగతా గల్ఫ్ దేశాల కంటే ప్రస్తుతం ఖతార్‌లో ఉపాధి అవకాశాలు బాగున్నాయి. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ఖతార్ అనువైన ప్రదేశం. – ఉప్పగండ్ల వెంకటేష్, వేంపేట్ (జగిత్యాల జిల్లా) కంపెనీల్లో చేసే వారికి వేతనాలు బాగున్నాయి ఖతార్‌లోని కంపెనీలలో పని చేసేవారికి వేతనాలు బాగున్నాయి. హౌస్ డ్రైవర్ చేసేవారికి పని బాగా లేదు. యజమాని ఆర్థిక స్థోమత బాగుంటేనే డ్రైవర్లకు మంచి వేతనాలు ఇస్తున్నారు. కొంత మందికి మెరుగైన వేతనం ఉంది. కొంత మందికి మాత్రం తక్కువ జీతం ఉంది. పొరుగు దేశాలతో పోల్చితే ఖతార్‌లో మాత్రం కార్మికులకు అనుకూలమైన వాతావరణం ఉంది. – కొట్టూరి రాకేష్, ఖతార్ (తొర్తి వాసి) -
అరబ్ పంజరం
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరిట కామాంధులైన అరబ్ షేక్‌ల దాష్టీకానికి నగర అమ్మాయిలు ఎందరో సమిధలవుతూనే ఉన్నారు. అరబ్ షేక్‌లు నగరానికి రాకుండా ఇక్కడి అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో అక్కడికి పిలిచి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఈ అక్రమ రవాణాలో ట్రావెల్ ఏజెంట్లు దళారులుగా వ్యవహరించి నిండు జీవితాలను బలిచేస్తున్నారు. ఉపాధి పేరుతో నగర అమ్మాయిల అక్రమ రవాణాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.... నెలకు 20 మంది రవాణా.. కాంట్రాక్ట్ మ్యారేజ్లు, ఖాజీలపై పోలీసుల ఉక్కుపాదంతో అరబ్ షేక్‌లతో అమ్మాయిల పెళ్లిళ్లు తగ్గాయి. కానీ ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను అరబ్ దేశాలకు తరలించడం ఇంకా సాగుతూనే ఉంది. బ్యూటీషియన్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, సేల్స్‌గర్ల్, రిసెప్షనిస్టు, ఇంటి పనులు తదితర వీసాలపై అమ్మాయిలను ఏటా వందల సంఖ్యలో గల్ఫ్ దేశాలకు తీసుకెళ్తున్నారు. ట్రావెల్ ఏజెంట్లు అక్కడి దళారులతో కుమ్మక్కై అమ్మాయిలు, వారి తల్లిదండ్రులకు ఉద్యోగాల ఎర వేస్తున్నారు. ఇక్కడైతే ఐదారువేలే సంపాదించవచ్చని.. అరబ్ దేశాల్లో రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్జించవచ్చని మాయ మాటలు చెప్పి వారిని నమ్మిస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కొందరు మహిళలను ప్రతినిధులుగా నియమిస్తున్నారు. చెప్పేదొకటి.. జరిగేది ఇంకోటి.. దళారులు, ఏజెంట్లు ఇక్కడి నుంచి అమ్మాయిలను జాబ్ వీసాపై పంపిస్తారు. అక్కడి వెళ్లిన తరువాత వీసా జారీ చేసిన షేక్‌కు వారిని అమ్మేస్తారు. పెళ్లి కాని అందమైన అమ్మాయిని రూ.5 లక్షలు, పెళ్లి అయిన మహిళని రూ.3 లక్షలు, వయసు ఎక్కువున్న మహిళను రూ.లక్షకు కొంటున్నారు. కొందరు అక్కడి నరకం భరించలేక బయటికొచ్చి చెప్పుకుంటున్నారు. మరి కొందరు అదే నరకంలో ఉండిపోతున్నారు. నరకం అనుభవించా.. సేల్స్‌గర్ల్ ఉద్యోగం ఉందని నమ్మించి ఏజెంట్లు నన్ను దుబాయికి పంపించారు. షార్జా ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తర్వాత ఏజెంట్ వచ్చి ఓ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. ఒక్కో షేక్ వచ్చి శరీరాన్నంతా తడిమి ఎంపిక చేసుకొని తీసుకెళ్లేవాడు. రోజుకో షేక్ రావడం తీసుకెళ్లడం.. నేను వెళ్లనని చెబితే తీవ్రంగా కొట్టేవారు. రూ.3.5 లక్షలకు విక్రయించామని ఏజెంట్ చెప్పాడు. ఆ నరకం భరించలేక మా అమ్మకు విషయం చెప్పాను. దీనిపై కేంద్రానికి ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ లేఖ రాయడంతో భారత రాయబార కార్యాలయ అధికారులు నన్ను విడిపిం చారు. – అస్మా బేగం, హబీబ్‌నగర్ నా కూతురిని విడిపించండి బ్యూటీషియన్ వీసా ఉందని నమ్మించి ఏజెంట్ నా కూతుర్ని దుబాయికి పంపాడు. అక్కడికి వెళ్లిన తరువాత నా కూతురిని షేక్ అమ్మేయడంతో, ఇంటి పనితో పాటు పడక పని చేయిస్తున్నారు. నాకు ఫోన్ చేసి.. ఈ నరకం నుంచి రక్షించండి అని వేడుకుంది. – హలీమ్ ఉన్నీసా తల్లి హబీబ్ ఉన్సీసా, వట్టేపల్లి ఎందరినో రక్షించాం ఇమిగ్రేషన్ అధికారుల నిర్లక్ష్యంతో అమ్మాయిల అక్రమ రవాణా సాగుతోంది. ఏజెంట్ల మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. అలాంటి దుర్మార్గులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తేనే అమ్మాయిల రవాణాకు అడ్డుకట్టపడుతుంది. అలాగే ప్రజల్లోనూ ఇలాంటి ఉద్యోగాలపై అవగాహన కల్పించాలి. – అంజదుల్లాఖాన్,ఎంబీటీ అధికార ప్రతినిధి -
76 దేశాల జైళ్లలో భారతీయ ఖైదీలు..
2017 డిసెంబర్ 28 వరకు తమవద్ద ఉన్న సమాచారం మేరకు 76 దేశాలలోని జైళ్లలో 7,985 మంది భారతీయులున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ జనవరి 3న లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల స్థితిగతుల గురించి లోక్‌సభ సభ్యులు నినాంగ్ ఎరింగ్, కైలాష్ ఎన్ సింగ్ దేవ్, జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్)లు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని గోప్యతా చట్టాల వల్ల జైళ్లలో ఉన్నవారి వివరాలు తెలియడం లేదు. ఆరు అరబ్ దేశాల గల్ఫ్ సహకార మండలి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ – జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియాలో 2,229, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 1,628, కువైట్‌లో 506, ఖతార్‌లో 196, బహ్రెయిన్‌లో 77, ఒమన్‌లో 60 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాల జైళ్లలోనే 58 శాతానికి పైగా 4,696 మంది ఉన్నారు. మలేషియాలో 341, సింగపూర్‌లో 115, నేపాల్‌లో 859, పాకిస్తాన్లో 395, థాయిలాండ్‌లో 47, యూకేలో 376, యఎస్‌లో 343 మంది జైళ్లలో ఉన్నారు. వీరిలో శిక్షా కాలం పూర్తయిన వందలాది మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. జరిమానాలు చెల్లించనందున కొందరు, సాంకేతిక కారణాల వలన మరి కొందరు జైళ్లలో, డిటెన్షన్ సెంటర్ల (నిర్బంధ కేంద్రాలు)లో మగ్గుతున్నారు. పరాయిదేశం, తెలియని భాష, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో తప్పులుచేసి జైలు పాలైనవారు కొందరున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశంలో ప్రమాదాలకు కారకులైనవారు, గొడవలు, ఆర్థికపరమైన మోసాలు, ఇతర మోసాలు, మద్యం సేవించడం, మద్యం వ్యాపారం, జూదం, లంచం, వీసా నిబంధనలు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, ఫోర్జరీ లాంటి కేసులలో కొందరు జైళ్లలో మగ్గుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణా, సెక్స్, వ్యభిచార నిర్వహణ, దొంగతనాలు, హత్యలు లాంటి తీవ్రమైన నేరాలలో జైలు పాలైన వారూ ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేవారు, తాము ఏ దేశానికి, ఏం పనిపై వెళుతున్నారు, ఆ దేశ చట్టాలు, ఆచార వ్యవహారాలూ, పద్ధతులు తెలుసుకొని అవగాహనతో వెళ్లడం మంచిది. ఆయా దేశాల చట్టాల ప్రకారం శిక్షలు ఖరారు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మెలగాలి. గల్ఫ్ నుంచి భారత్‌కు బదిలీకి ఎదురుచూస్తున్న ఖైదీలు ఖైదీలను స్వదేశానికి తీసుకువచ్చే చట్టం 2013 (రిపాట్రియేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 2013) ప్రకారం ఇప్పటివరకు 170 దరఖాస్తులు వచ్చాయని 62 మంది విదేశీ జైళ్ల నుంచి భారత్ జైళ్లకు బదిలీ అయ్యారని మంత్రి తెలిపారు. భారత్ ఇప్పటివరకు 30 దేశాలతో ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకున్నదని అన్నారు. ఇవికాకుండా ఇంటర్ అమెరికన్ కన్వెన్షన్‌ను ఆమోదించిన సభ్య దేశాలతో భారతదేశం ఖైదీల బదిలీకి అభ్యర్థనలు పంపడానికి, స్వీకరించడానికి అర్హత కలిగి ఉన్నది. యూఏఈ, భారత్ మధ్య 2011 నవంబర్ 2న ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. అప్పటి భారత హోంమంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, హోం మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహయాన్‌లు ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు చేశారు. 2015 మార్చి 25న ఖతార్‌తో కూడా ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. ఈ రెండు గల్ఫ్ దేశాల ఒప్పందాలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్ అనే ఏడు రాజ్యాలలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న 1,628 మందిలో శిక్షపడిన వందలాది మంది భారతీయ ఖైదీలతో పాటు ఖతార్‌లోని 196 మందికి ఈ ఒప్పందం వలన లాభం కలుగుతుంది. వీరు మిగిలిన శిక్ష కాలాన్ని తమ ఇష్ట ప్రకారం భారత్ జైళ్లలో పూర్తిచేసుకోవచ్చు. వీరిలో 40 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. భారత్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒకే ఒక్క యూఏఈ పౌరుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భారతీయ ఖైదీలు తమ స్వదేశానికి బదిలీ అయితే తమ కుటుంబ సభ్యులను కలుసుకొని స్వాంతన పొందే అవకాశం ఉంది. విదేశీ జైళ్లలో మగ్గుతున్న పేద ప్రవాసీ కార్మికులకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయం అందించాలి. చిన్నపాటి జరిమానాలను చెల్లించి వారి విడుదలకు కృషి చేయాలి. గల్ఫ్ జైళ్లలో ఉన్న మలయాళీలను విడిపించడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతేక నిధిని కేటాయించింది. సంవత్సరాల తరబడి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. నొప్పి నివారణ మాత్రలు, గసగసాలు కలిగి ఉన్నందుకు 24 ఏళ్ల జైలు శిక్షకు గురై దుబాయి జైలులో మగ్గుతున్న తెలుగువారు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మన కార్మికులకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. –మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com -
గల్ఫ్‌లో ఆగినగుండెలు
బుగ్గారం/మేడిపల్లి: ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో గల్ఫ్‌బాట పట్టిన వలసకార్మికులను గుండెపోటు కబళించింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చిన్నకట్ట శంకరయ్య (45), మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన దౌడ భూమగంగారాం (40) గల్ఫ్‌లో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బుగ్గారం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన చిన్నకట్ట శంకరయ్య స్థానికంగా ఉపాధి లభించకపోవడంతో ఆరేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లాడు. రెండునెలల క్రితం వచ్చి కూతురుకు వివాహం జరిపించి తిరిగి వెళ్లాడు. అక్కడ పనిఒత్తిడి పెరిగిపోవడంతో నిత్యం మదనపడుతున్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో మంగళవారం చనిపోయినట్లు ఇక్కడి కుటుంబసభ్యులకు అక్కడి కార్మికులు సమాచారం చేరవేశారు. దీంతో మృతుడి భార్య గంగవ్వ, ఇద్దరు కుమారులు రంజిత్(16), రోహిత్ (12), కూతురు రస్మిత, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. శంకరయ్య మృతివార్త తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. వెళ్లిన 15 రోజులకే.. మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన దౌడ భూమగంగారాం (40) భార్య లక్ష్మి, కొడుకు రమేశ్, కూతుళ్లు రమ్య, రుచిత ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఫట్టర్ పనిచేసిన ఆయన కుటుంబ పోషణభారం కావడంతో 12 ఏళ్ల క్రితం దుబాయికి వలసబాట పట్టాడు. అప్పటినుంచి వస్తూపోతూ ఉన్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కొడుకు రమేశ్‌ను సైతం దుబాయి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం ఇంటికొచ్చిన గంగారాం.. కొడుకుకు పాస్‌పోర్టు సైతం తీయించాడు. డిసెంబర్ 30న తిరిగి దుబాయి వెళ్లిన ఆయన.. కొడుకును ఈనెల 9న దుబాయ్‌కి రప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 15న తను ఉంటున్న గదిలో పనిచేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడని, ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడని అక్కడి కార్మికులు ఇక్కడకు సమాచారం చేరవేశారు. దీంతో కుటుంబసభ్యులు బోరుమన్నారు. గంగారాం భార్య లక్ష్మి కూలీపనులు చేస్తోంది. పెద్ద కూతురు రమ్య ఇంటర్ ప్రథమ సంవత్సరం, చిన్నకూతురు రుచిత ఏడోతరగతి చదువుతున్నారు. గంగారాం మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
నెల రోజుల్లో రిజిస్టర్ చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపే ఏజెంట్లందరూ నెలలోగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ‘ఈ– మెగ్రేట్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే అక్రమ ఏజెంట్లుగా గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా పదేపదే వీసా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై పీడీ యాక్ట్ ప్రయో గించాలని వారు పోలీసు శాఖను ఆదేశించారు. ఎన్ఆర్ఐ శాఖ వ్యవహారాలపై మంత్రులిద్దరూ శనివారం సచివాలయంలో పోలీసు, హోం, ఎన్ఆర్ఐ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం ఢిల్లీలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో జరిగిన భేటీలో చర్చించిన వివిధ అంశాల అమలుకు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచ నలు జరిపారు. బతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లేవారిని మోసం చేస్తున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఏజెంట్లపై చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రులిద్దరూ అధికారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నకిలీ ఏజెంట్లపై చర్యలకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. దీనికి ప్రజలు పోలీసులకు సహకరించాలని మంత్రులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టామ్‌కాం కంపెనీ ద్వారా చట్టపరంగా విదేశాలకు వెళ్లాలని నిరుద్యో గులకు సూచించారు.రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలన్నారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్ నిర్మాణానికి ఫిబ్రవరి రెండో వారంలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నారై శాఖాధికారులను ఆదేశించారు. అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలి.. గల్ఫ్ దేశాలకు మహిళల అక్రమ రవాణా, మోసపూరిత వివాహాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను మంత్రి అభినందించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో మైనార్టీ సంక్షేమ శాఖ, కార్మిక, ఎన్నారై, పోలీస్ శాఖలు ఉమ్మడిగా బృందాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పాస్‌పోర్టు కార్యా లయ అధికారుల సహకారం తీసుకోవాలన్నా రు. ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఎన్నారై, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిర్దిష్ట విధానం కావాలి..
ఉపాధి వేటలో ఎడారి దేశాల బాటపడుతున్న నిరుద్యోగ యువత కొందరు నకిలీ ఏజంట్ల చేతుల్లో మోసపోయి నష్టపోతుంటే.. మరికొందరు జీతాలు సరిగా రాక.. అప్పులు తీరక.. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారికి స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడంతో ఎక్కువ శాతం కూలీ పనులే చేస్తున్నారని అన్నారు. గల్ఫ్ బాధితుల పక్షాన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా పోరాటాలు చేస్తున్న నర్సింహనాయుడు తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – ఆర్మూర్ ఆర్మూర్: గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఇజ్రాయిల్, సింగపూర్ తదితర దేశాలకు తెలంగాణ నుంచి యువత ఉపాధి కోసం వెళ్తున్నారు. కానీ నిరక్ష్యరాస్యులు, శిక్షణ లేనివారు కావడంతో 90 శాతం మంది కూలీలుగానే వెళ్తున్నారు. కేరళ రాష్ట్రీయులు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు పూర్తి చేసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మనవారికి సరైన శిక్షణ లేక పనులు సరిగా దొరకడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరక స్వదేశానికి వచ్చిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని మృతదేహాలను స్వదేశాలకు తరలించడానికి నెలల తరబడి ఎదురు చూసే దయనీయ స్థితిని చూశాము. 2013లో ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదికను ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ప్రతి నెల 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారాన్ని అందజేసేవారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిహారా న్ని ఐదు లక్షల రూపా యలకు పెంచు తామని ఎన్నికల సమయంలో ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు. అంతే కాదు.. గత ప్రభుత్వాలు ఇచ్చిన తరహాలో లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2 జూన్ 2014 నుంచి 2 అక్టోబర్ 2017 నాటికి 431 మంది తెలంగాణ ప్రజలు గల్ఫ్‌లో మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ధృవీకరించిం ది. వీరిలో ఒక్క కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయమూ అందజేయలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని మృతదేహాలను వెంటనే స్వగ్రామాలకు చేర్చుతున్నప్పటికీ వారి కుటుంబాలకు భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రత్యేక విధానం లేదు.. గల్ఫ్ దేశాల్లో సంక్షోభం గురించి తెలియక ఉపాధి వేటలో ఏడారి దేశాలకు వెళ్లి కష్టాలపాలవుతున్న రాష్ట్ర నిరుద్యోగులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకౖ విధానమంటూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం, ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల నిధిని కేటాయించడం లాంటి చర్యలు తీసుకోవాలి. నకిలీ ఏజంట్లను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రత్యేక వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే విదేశాల్లో ఉద్యోగావకాశాలను తెలియప రచాలి. యువతకు అందుకు తగ్గ శిక్షణ ఇచ్చి ఉపాధి కోసం విదేశాలకు పంపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం, ఉద్యోగపరంగా సమస్యలతో నష్టపోయి తిరిగి స్వదేశానికి వచ్చిన వారికి పావలా వడ్డీతో రుణాలు అందజేసి స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించి వారి జీవితాలకు భరోసా కల్పించాలి. గల్ఫ్ దేశాలలో సంపాదించి తెలంగాణ రాష్ట్రానికి మన వాళ్లు ప్రతీ నెల పంపిస్తున్న డబ్బుపై పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. గల్ఫ్ మృతులు కుటుంబాలకు పింఛన్‌ను అందజేయాలి. -
వైద్యం అందని దైన్యం
ఉన్న ఊర్లో పనుల్లేక పొట్ట చేతబట్టుకుని పోయిన బడుగు జీవి అక్కడ పనికోసం ఎన్నో అవస్థలు పడ్డాడు. ఏదో ఒక పనిలో కుదిరిన ఆయనను విధి వెంటాడింది. నిచ్చెన జారి కిందపడిపోయాడు. ఆ ప్రమాదంలో కాలు విరిగితే పనిలో పెట్టుకున్న కంపెనీ కనీసం వైద్యం కూడా చేయించలేదు. దూర దేశంలో పడిన కష్టాలు ఆయన మాటల్లోనే.. సిరిసిల్లటౌన్: నా పేరు చిలుముల చంద్రశేఖర్. మాది సిరిసిల్ల పట్టణం బీవైనగర్. స్వర్ణకారుడిగా పనిచేస్తూ నా భార్య అరుణ, కొడుకులు సాయికుమార్, తేజలను పోషించుకునే వాడిని. పదేళ్ల క్రితం కులవృత్తికి పనులు తక్కువయ్యాయి. పిల్లల భవిష్యత్తు కోసం దుబాయ్ పోయి సంపాదించాలనుకున్న. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన ఓ ఏజెంటు రూ.1.30లక్షలను తీసుకుని దుబాయ్‌కి పంపిండు. అక్కడ ఆంధ్రాకు చెందిన అన్లైసెన్స్డ్ ఏజెంటు నన్ను మూడు నెలలు ఏ పనీ లేకుండా తిప్పిండు. చేతిల డబ్బుల్లేకుండా అక్కడ చాలా రోజులు పస్తులుంటూ.. తెలుగు వారి వద్ద తలదాచుకునేటోన్ని. ఆ తర్వాత ఏమైందో గానీ అతని ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎక్కడికో పారిపోయిండు. అక్కడ మనవాళ్లకు నా పరిస్థితి తెలుసుకుని ఎక్కడైనా పని ఉంటే చెప్పేటోళ్లు. లేకుంటే రూములోనే ఉండేటోన్ని. కొద్ది రోజులకు మన తెలుగోళ్ల సాయంతో ఓ కంపెనీలో చేరాను. మూడున్నర సంవత్సరాలు కార్పెంటర్ పనిచేసిన. యజమానులు జీతం సరిగా ఇవ్వక పోయేటోళ్లు. కంపెనీలో చేరేటప్పుడు నెలకు రూ.1200 దర్హమ్లు ఇస్తానన్నరు. కానీ నాలుగు నెల్లకోసారి కూడా జీతం ఇచ్చేటోళ్లు కాదు. తర్వాత ఖల్లవెళ్లి వీసాతో కార్పెంటర్ పనులే చేసేటోన్ని. నన్ను అక్కడ పనిలో పెట్టిన ఏజెంటు నాకు డబ్బులు సరిగా ఇచ్చేటోడు కాదు. కచ్చితంగా జీతం ఇవ్వాలని నిలదీస్తే.. జైలుకు పంపుతాని బెదిరించిండు. ఇట్లా నేను అక్కడ ఏజెంట్ల వద్ద రూ.23వేల దర్హమ్స్ మునిగాను. డిసెంబర్ 5న ఓ భవనంలో సీలింగ్ పనులు చేస్తూ నిచ్చెన జారీ కిందపడిపోయాను. ఏజెంటు ఆసుపత్రికి తీసుకుపోయిండు. కేవలం మందులు మాత్రమే ఇప్పించిండు. కాలి ఎముక మూడుముక్కలైందని అక్కడి డాక్టర్లు చెప్పగా..రూ.10 వేల దర్హమ్స్ ఖర్చయితాయన్నరు. చేసేది లేక నా పరిస్థితిని ఇంటివాళ్లకు చెప్పుకున్నా. పొత్తూరుకు చెందిన రవీందర్‌రెడ్డికి మావాళ్లు చెబితే.. ఆయన గల్ఫ్ బాధితుల సెల్ కోఆర్డినేటర్లు అడవి పదిరకు చెందిన మహేందర్‌రెడ్డి, ముస్తాబాద్‌కు చెందిన జనగామ శ్రీనివాస్, గిరీష్పంథ్కు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో ఎంబసీకి పోయి నా పరిస్థిని వివరించగా.. నాకు రూ.1400 దర్హమ్స్ జరిమానా వేశారు. సిరిసిల్ల నుంచి నా భార్య రూ.40వేలు అప్పుచేసి పంపగా.. వాటితో ఇంటికి తిరిగి వచ్చాను. కాలికి ఆపరేషన్ చేయించుకోవాలంటే చేతిలో చిల్లిగవ్వలేదు. మంచం పట్టిన నాకు భార్య, పిల్లలు సేవలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్లా నడిచి వారిని సాదుకోవాలి. కరీంనగర్ ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ ఈ ఆపరేషన్‌కు వర్తించదన్నారు. రూ.80వేలు ఖర్చవుతుందట. ప్రభుత్వం ఆదుకోవాలి. గల్ఫ్‌లో 87,64,829 మంది భారతీయులు గల్ఫ్ దేశాల సహకారమండలిలోని(గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల –జీసీసీ) ఆరు దేశాలలో ప్రవాస భారతీయుల జనాభా 87 లక్షల 64 వేల 829కు చేరిందని లోక్ సభలో జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ డిసెంబరు 27న లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సౌదీ అరేబియాలో 32,53,901 మంది, యుఏఈలో 28 లక్షలు, కువైట్‌లో 9,17,970, ఒమన్‌లో 7,83,040, ఖతార్‌లో 6.97 లక్షలు, బహరేన్లో 3,12,918 మంది ప్రవాస భారతీయులు ఉన్నారని తెలిపారు. ఆరు గల్ఫ్ దేశాలలో 11,774 మంది భారత సంతతి ప్రజలు ఉన్నట్టు చెప్పారు. ప్రపంచంలోని 208 దేశాలలో ఎన్నారైలు, పీఐఓలు కలిపి 3 కోట్ల 12 లక్షల 33 వేల 234 మంది భారత ప్రవాసులున్నారని ప్రకటించారు. ఇందులో కోటి 33 లక్షల 27 వేల 438 మంది ప్రవాస భారతీయులు, కోటి 79లక్షల 5వేల 796 మంది భారత సంతతి ప్రజలు ఉన్నారని వివరించారు. ప్రవాసీ భారతీయ దివస్‌కు భారతి సంతతి పార్లమెంటేరియన్లు జనవరి 9న ఢిల్లీలో నిర్వహించనున్న ప్రవాసీ భారతీయ దివస్‌కు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారత సంతతికి చెందిన 285 మంది పార్లమెంటేరియన్లను భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఇప్పటివరకు 125 మంది పార్లమెంటేరియన్లు తమ సమ్మతిని తెలియజేశారని విదేశాంగ శాఖలోని ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ కార్యదర్శి జ్ఞానేశ్వర్ మూలే తెలిపారు. భారత ప్రభుత్వం దౌత్యాన్ని ప్రజాపక్షం చేసిందని, భారత సంతతితో పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం, మాతృభూమితో వారి బంధాన్ని దృఢపరచడం తమ లక్ష్యమని అయన అన్నారు. విదేశాల్లోని భారతీయుల కొరకు తక్షణం స్పందించే ఆన్లైన్ వ్యవస్థ ’మదద్’ (కాన్సులర్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా 26 వేల ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 21 వేలు పరిష్కరించామని వివరించారు. ఖతార్‌లో ఎన్నారైలకు దౌత్య సేవలు ఖతార్ దేశ రాజధాని దోహాలోని ఇండియన్ ఎంబసీ (భారత దౌత్య కార్యాలయం) అధికారులు ఈనెల 12న శుక్రవారం అల్ బనూష్ క్లబ్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాన్సులర్ క్యాంపు (దౌత్య సేవల శిబిరం) నిర్వహిస్తారు. ఎన్నారైలు వారి పాస్‌పోర్ట్, దౌత్య సంబంధ సేవలు గురించి, వేతనాలు తదితర సమస్యల గురించి అధికారులకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్ +974 5580 8254 ఇ–మెయిల్: labour.doha@mea.gov.inకు సంప్రదించవచ్చు. సౌదీలో ‘ప్రవాసీ ప్రజావాణి’ సౌదీ అరేబియాలోని జిద్దా ఇండియన్ కాన్సులేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 12న శుక్రవారం ’కాన్సులేట్ ఎట్ యువర్ డోర్’ (మీ ముంగిట్లోకి దౌత్య కార్యాలయం) కార్యక్రమాన్ని భారత దౌత్య అధికారులు నిర్వహిస్తున్నారు. అభాలోని ఖమీస్ ముషాయిత్‌లో 054 6722909, మక్కాలోని ఇండియన్ హజ్ మిషన్‌లో 012 5603580, నజరాన్లో 017 5221949 నంబర్లలో సంప్రదించవచ్చు. సేకరణ: మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ప్రవాసీ మిత్ర -
‘గల్ఫ్ కార్మికులపై ప్రభుత్వాల చిన్నచూపు’
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పటివరకు ఫిలిప్పీన్స్, మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేసియా, ఈజిప్టు, లిబియా, సిరియా, టర్కీ లాంటి 49 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించి అమలు చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు భారతదేశం గానీ, గల్ఫ్ దేశాలు గానీ ఈ తీర్మానాన్ని 27 ఏళ్లయినా ఆమోదించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిప్పీన్స్, భారత దేశంలో కేరళ రాష్ట్రం అత్యుత్తమ వలస విధానాలతో ప్రవాసులకు పలు సౌకర్యాలు కల్పిన్నాయి. వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉన్నది. మానవ వలస అనేది ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్వస్థలాల నుంచి వేరేచోటికి తరలివెళ్లే వారి సంఖ్య 45.36 కోట్లు. ఇది క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా కోటి 40 లక్షల మంది ఉన్న చోటు వదిలి వేరే చోట్లకు తరలిపోతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. 1979లో అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం వచ్చింది. వేతనాలు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు మెరుగుపరచడం, శ్రమ దోపిడీని నిరోధించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు. అత్యధిక విదేశీ మారకం పొందుతున్న భారత్ ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో మూడు కోట్ల మంది ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2015లో ప్రపంచంలోనే అత్యధికంగా 68.91 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశం పొందింది. ఇందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే. తెలంగాణ ప్రాంతం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది. ఇక్కడ బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులు తమ కష్టార్జితాన్ని తమ సొంత కుటుంబాలకే పంపుతున్నారు కానీ.. ఆ రూపంలో వాళ్ళు స్వదేశానికి అపారమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న పది లక్షల మంది తెలంగాణ వాసులు నెలకు ఒక వెయ్యి కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని పంపిస్తున్నారు. ఇలా మనదేశానికి పంపిస్తున్న విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. కార్మిక శక్తిని ఎగుమతి చేసి, ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరి సంక్షేమానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గల్ఫ్‌లో 85 లక్షల మంది భారతీయులు భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు అత్యధికంగా వలస వెళ్తున్న రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్ ఉన్నాయి. తెలంగాణలోని పాత జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు హైదరాబాద్ పాత నగరం నుంచి ఎక్కువగా వలస పోతున్నారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సుల్తానేట్ అఫ్ ఒమన్, బహరేన్, కువైట్, ఖతార్, సింగపూర్ మలేసియా తదితర దేశాలకు వెళ్తున్నారు. గల్ఫ్‌తో సహా 18 ఈసీఎన్ఆర్ (ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డు) దేశాలలో 85 లక్షల మంది భారతీయులున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన కార్మికులు 10 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా. గల్ఫ్ కార్మికులపై ప్రభుత్వాల చిన్నచూపు కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) తెస్తామన్న తెలంగాణ ప్రభుత్వ హామీ అటకెక్కింది. అమెరికా, యూరప్ దేశాలలోని విద్యావంతులైన, ధనవంతులైన ప్రవాస భారతీయులకు తగిన గౌరవం దక్కుతుండగా, గల్ఫ్ ఎన్నారైలు వివక్షకు గురవుతున్నారు. గల్ఫ్ దేశాలలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. అక్కడ ఏ సంక్షోభం వచ్చినా ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నేరుగా మన పల్లెలపై, ప్రవాసీ కుటుంబాలపై కనిపిస్తున్నది. ఇలాంటి సందర్భాలలో మనవారు ఉద్యోగాలు కోల్పోయి అర్ధంతరంగా ఇంటికి చేరుతున్నారు. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి.. మనవారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ముందస్తు ప్రణాళికలు ఉండవు. ఏజెంట్ల మోసాలు, యజమానుల హింసలు, జీతాలు ఇవ్వకపోవడం, దుర్భర పరిస్థితులలో అక్కడ చిక్కున్నవారిని రక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ లేదు. ప్రవాసుల పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించడం వలన పలు సామాజిక పథకాలకు అర్హత కోల్పోతున్నారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న మనవారికి న్యాయ సహాయం కావాలి. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వారి కోసం పునరావాసం, పునరేకీకరణ కార్యక్రమాలు చేపట్టాలి. మంద భీంరెడ్డి గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు -
గల్ఫ్ కన్నీళ్లు ఇంకెన్నాళ్లు?
తెలంగాణలో గల్ఫ్ మాయాజాలం మళ్లీ మొదలైంది. పొట్టచేతబట్టుకొని ఎడారి దేశాలకు వెళ్లి మోసపోతున్న వలస జీవుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. బోగస్ ఏజెంట్లు.. నకిలీ వీసాలు, విజిట్ వీసాలు అంటగట్టి ఎన్నో కుటుంబాలను నట్టేట ముంచుతున్నారు. గల్ఫ్ బాధితులకు అండగా ఉండేందుకు ప్రత్యేక ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించినా ఆ దిశగా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా గల్ఫ్ కన్నీటి గాథలు రోజుకోచోట వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు పది లక్షల మంది తెలంగాణవాసులు గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అనధికార లెక్కలున్నాయి. వీరికి తోడు.. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఆ దేశాలకు పయనమవుతున్నారు. ఉన్న ఊరిలో పని దొరక్కపోవటం.. అక్కడికి వెళ్తే ఏదో ఓ పని చేసుకోవచ్చనే మొండి ధైర్యం.. ఇక్కడ ‘రూపాయి’ కష్టానికి అక్కడ పది రూపాయలొస్తాయనే ఆశలు.. తెలంగాణ యువతను గల్ఫ్ బాట పట్టేలా ప్రేరేపిస్తున్నాయి. వీరి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ నకిలీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిపోతున్న వీరి ఆగడాలు, ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు, ఎన్ఆర్ఐ పాలసీపై ఫోకస్... – బొల్గం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి గల్ఫ్ దేశాల్లో ఉపాధితోపాటు పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించేందుకు తెలంగాణలో దాదాపు 2,800 మంది ఏజెంట్లున్నారు. వీరిలో 2,772 మంది బోగస్ ఏజెంట్లే. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్డ్ కంపెనీలు కేవలం 28. అందులో రెండు ప్రభుత్వ ఏజెన్సీలే. అవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (ఓమ్కాం), తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కాం). వీటితోపాటు మరో 26 కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉన్న కంపెనీలను మాత్రమే ఆశ్రయించాలనే ప్రచారం లేకపోవటంతో వలస జీవులు బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. చిన్న చిన్న కంపెనీలు పంపే వీసాలు, విజిట్ వీసాలు చూపించి ఏజెంట్లు అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ‘విజిట్ వీసాలతో వెళ్తే.. అక్కడేదైనా పని వెతుక్కోవచ్చు.. తిరిగి వచ్చేటప్పుడు రెండుమూడు రోజులు జైల్లో ఉంటే వాళ్లే పంపిస్తారు..’ అని మాయమాటలు చెప్పి సాగనంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వీసాలు చెల్లక.. పని దొరక్క.. దొరికినా ఇక్కడ ఏజెంట్లు చెప్పిన జీతానికి అక్కడ ఇచ్చే జీతానికి పొంతన లేక వలసజీవులు చిత్తవుతున్నారు. తిరిగి సొంత దేశానికి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. లైసెన్స్ ఉంటే పక్కాగా.. విదేశాల్లో ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. వీటిని పాటించని కంపెనీలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం వాళ్ల డిపాజిట్‌ను జప్తు చేస్తుంది. లైసెన్స్ రద్దవుతుంది. కానీ స్థానికంగా పోలీసు, రెవెన్యూ విభాగాలు నకిలీ ఏజెంట్లు బహిరంగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా, ప్రకటనలు జారీ చేస్తున్నా కఠినంగా వ్యవహరించటం లేదు. సిరిసిల్ల జిల్లా ఒక్కటే ఆదర్శం గల్ఫ్ మోసాలు, బాధితుల సంఖ్య పెరిగిపోవటంతో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం బోగస్ ఏజెంట్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. అందుకే లైసెన్స్ లేని ఏజెంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అక్కడి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో సిరిసిల్ల జిల్లాలో పోలీసు యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. లైసెన్స్ లేని ఏజెంట్లందరినీ బైండోవర్ చేసి.. గల్ఫ్ వీసాలు ఇప్పించే ట్రావెల్ ఏజెన్సీలన్నీ మూసేయించింది. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ ముందుకుసాగలేదు. దీంతో క్రమంగా ఈ చర్య అడ్డదారులకు తావిచ్చింది. ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలోని ఏజెంట్లు ఇతర జిల్లాలకు వెళ్లి వీసాలు అమ్ముకుంటూ తమ దందాను ఎప్పట్లాగే కొనసాగిస్తున్నారు. కేటీఆర్‌పైనే ఆశలు.. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాని బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించింది. దీంతో గల్ఫ్‌లో ఉన్న తెలంగాణవాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నకిలీ ఏజెంట్లను అరికట్టడంతోపాటు మృతదేహాల తరలింపు, పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలతో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ పాలసీ రూపొందిస్తామని మంత్రి ప్రకటించారు. గల్ఫ్‌లో తెలంగాణవారి సంక్షేమానికిపాటు పడే సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా తయారీకి గతేడాది జూలై 27న ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. కానీ ఇప్పటికీ ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోగా.. సదస్సులో వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు. పత్రికల్లో వచ్చే వార్తలు, బాధితుల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారు, మృతదేహాలను స్వదేశాలకు రప్పించేందుకు పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవటం తప్ప.. విధాన ప్రకటన దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెల్లకార్డుకు మృతదేహానికి లింక్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌తోపాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు, వివిధ కారణాలతో ఏటా దాదాపు 200 మందికిపైగా తెలంగాణవాసులు చనిపోతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గల్ఫ్ దేశాలలో దాదాపు 540 మంది చనిపోయారు. వారిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించగా.. స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని మృతదేహాలు నెలల తరబడి నిరీక్షించిన తర్వాత స్వదేశానికి చేరాయి. మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కొంతకాలంగా బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదు. విదేశాల నుంచి వచ్చే మృతదేహాలను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుతో ముడిపెట్టింది. ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ నిబంధనను సడలించి అందరికీ అంబులెన్స్ సదుపాయం కల్పించాలని, ఎయిర్‌పోర్ట్‌లో గల్ఫ్‌కు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వివిధ సంఘాలు విజ్ఞప్తి చేసినా అమలుకు నోచుకోలేదు. కామ్‌గా.. టామ్‌కాం నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని యువతను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రెండేళ్ల కిందట టామ్‌కాం ఏజెన్సీని ఏర్పాటు చేసింది. గల్ఫ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టామ్‌కాం క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. జిల్లాల్లోని ఉపాధి కల్పన కేంద్రాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు టామ్‌కాం ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వీసాలు ఇప్పించాలి. దాదాపు 30 వేల మంది యువకులు ఇప్పటికే టామ్కాంలో రిజిస్టర్ చేసుకున్నారు. అయితే సంస్థ క్రియాశీలంగా వ్యవహరించకపోవటంతో నకిలీ ఏజెంట్లు చెలరేగిపోతున్నారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 2 వేల మందిని గల్ఫ్‌కు పంపించినట్లు ఈ ఏజెన్సీ చెబుతున్నా.. వారిని కూడా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే పంపించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైట్‌ను సైతం అప్డేట్ చేయలేదు. ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన బోయపల్లి రంగారెడ్డిని ప్రభుత్వం టామ్‌కాంకు చైర్మన్‌గా నియమించింది. గల్ఫ్ వలసలు తక్కువగా ఉండే ప్రాంతం నుంచి ఈ నియామకం చేపట్టడం కూడా గల్ఫ్ బాధిత వర్గాల్లో చర్చకు తెరదీసింది. గల్ఫ్‌లో ఉన్నవారెందరు? తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారెందరన్న వివరాలు ప్రభుత్వం దగ్గర కూడా పక్కాగా లేవు. దాదాపు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది ఉన్నట్లు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చర్ అసోసియేషన్‌తోపాటు గల్ఫ్‌లో తెలంగాణవాసుల సంక్షేమానికి పని చేసే సంఘాలు చెబుతున్నాయి. పలు ఏజెన్సీల లెక్క కూడా ఇంచుమించు ఇంతే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 97 వేలు మాత్రమే అని తేలింది. ఓటుహక్కు, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు కత్తిరిస్తారనే భయంతో గల్ఫ్‌కు వెళ్లిన వారి కుటుంబీకులు సర్వేకు వచ్చిన బృందాలకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఈ సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందనే వాదనలున్నాయి. అందుకే రాష్ట్రం నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించడానికి మరో సమగ్ర సర్వే నిర్వహించాల్సి ఉంది. ఈ సర్వే ఖర్చులో సగం భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ సర్వేతో వలసకు కారణాలు, సామాజిక, ఆర్థిక కోణం, వలస వెళ్ళిన వారి సంఖ్య, వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, వయసు, ఏయే దేశాలకు ఏయే జిల్లాల వారు వెళ్తున్నారనే విషయాలు తెలుస్తాయి. ఈ సర్వే ఆధారంగా ఎన్ఆర్ఐ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు పక్కాగా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి గల్ఫ్‌లో విపత్కర పరిస్థితులున్నాయి. తెలంగాణ వచ్చాక తమకు భరోసా ఉంటుందనే ధీమా ప్రవాసీయుల్లో సడలుతోంది. ఇటీవల ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య పెరిగిపోయింది. 2009లో ఇలాంటి పరిస్థితి ఉండేది. క్యాంపులకు వెళ్లి కౌన్సెలింగ్ చేస్తున్నాం. ఇటీవలే ఇద్దరు సిరిసిల్ల ప్రాంతానికి చెందిన యువకులు కంపెనీ వీసా అని మోసపోయి విజిట్ వీసాతో గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. గత నెలలోనే 14 మంది జగి త్యాలæ ప్రాంత వాసులు ఓ ఏజెంట్‌ను నమ్మి కంపెనీ వీసా ఇప్పిస్తామంటే దుబాయ్‌కి విజిట్ వీసాపై వెళ్లారు. అక్కడికెళ్లాక ఇరుకైన గదిలో ఉంచి ఇబ్బందుల పాల్జేశారు. తిరిగి వెళ్దామంటే వీసా టైం అయిపోయింది. రిటర్న్ టికెట్ లేదు. పాస్‌పోర్టు లేదు. విజిట్ వీసాలు వేరు. ఉద్యోగ వీసాలు వేరు. ఏజెంట్ల మాయమాటలు నమ్మకండి. లెసైన్స్డ్ ఏజెన్సీలు నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా వెళితే ఉపాధికి గ్యారంటీ ఉంటుంది. లైసెన్స్ లేని ఏజెంట్లను పోలీసులకు పట్టించండి. గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అండగా ఉండేలా ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని రూపకల్పన చేయాలి. ఏటా బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలి. టామ్‌కాం కార్యకలాపాలను విస్తరించి నిరుద్యోగులకు చేరువ చేయాలి – జువ్వాడి శ్రీనివాసరావు, తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రోకర్లను నియంత్రిస్తాం గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కొన్ని ఏజెన్సీలు పెద్ద మొత్తంలో దండుకుంటున్నాయి. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పుచ్చుకుని విదేశాలకు పంపుతున్నాయి. అక్కడ ఉద్యోగం దొరి కిందా సరే.. లేకుంటే అంతే సంగతి. బ్రోకర్ సంస్థల ఆటలను కట్టడి చేసేందుకే టామ్‌కాం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తర ఫున ఎంపికై వెళ్లడమే శ్రేయస్కరం. త్వరలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నాం. – బోయపల్లి రంగారెడ్డి, టామ్‌కాం చైర్మన్ త్వరలో ప్రత్యేక వెబ్సైట్ ఓవర్సీస్లో పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి డిమాండ్ ఉన్నా రిజిస్ట్రేషన్ పెరగడం లేదు. ప్రస్తుతం టీఎస్ ఆన్లైన్ కేంద్రా ల్లోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. త్వరలో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటివరకు 79 మందికి గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగం పొందడమే మంచిది. టామ్‌కామ్ సంస్థపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తాం. ఈ మేరకు జిల్లాల్లో ఉన్న ఉపాధి కల్పన అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రతి జిల్లాలో మైగ్రేట్ రిసోర్స్ కేంద్రాలను తెరుస్తాం. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి వివరాలను అందులో నమోదు చేస్తాం. అక్కడ డిమాండ్ ఉన్న కొలువులకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నాం. – కేవై నాయక్, టామ్‌కాం మేనేజింగ్ డైరెక్టర్ నకిలీ వీసాతో మోసం నేను డిగ్రీ వరకు చదువుకున్న. భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. ఊళ్లో భూమి లేదు. కొన్నేళ్లుగా కూలీ పనులు చేసి బతుకుతున్న. వచ్చే కూలీతో మా కుటుంబం గడవడం కష్టంగా మారింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింహులపల్లెలో ఓ మహిళా ఏజెంట్ పరిచయమైంది. ఖతార్‌లో మంచి పని, వేతనం ఉందని చెప్పింది. నా తల్లి, భార్య వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలు తెచ్చి కట్టిన. 15 రోజుల్లోగా ఖతార్‌కు పంపిస్తానని చెప్పి నకిలీ వీసా, నకిలీ ఫ్లైట్ టికెట్ ఇచ్చి మోసం చేసింది. డబ్బులు, పాస్‌పోర్టు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. – వంగపెల్లి భూపతి, కనగర్తి, కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా డబ్బులు మిత్తికి తెచ్చిన.. నేను తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన. కూలీకి పోతే కుటుంబం గడుస్తలేదు. అందుకే గల్ఫ్ పోదామనుకున్న. మా గ్రామానికి చెందిన మల్లేశం ద్వారా ప్రమీల అనే ఏజెంట్‌కు డబ్బులు కట్టిన. ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తమన్నరు. రెండ్రూపాయల మిత్తికి రూ.70 వేలు తెచ్చి ముట్టజెప్పిన. పాస్‌పోర్టు కూడా ఇచ్చిన. కానీ నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశారు. ఇప్పుడు ఏజెంట్, మధ్యవర్తి తప్పించుకు తిరుగుతుండ్రు. – రావులపెల్లి మల్లారెడ్డి, కనగర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా గల్ఫ్ బాధితుల విజ్ఞప్తులివీ.. కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. విదేశాలకు వెళ్లే కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి విదేశాలకు వలస వెళ్లే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రవాసీ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వలస వెళ్లే కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి మోసపోయి తిరిగొచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వారి అనుభవాన్ని, వృత్తి నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలను బలోపేతం చేయాలి. నైపుణ్య శిక్షణా కేంద్రాలను ప్రతి సబ్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి సచివాలయంలోని ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి వలసవెళ్లిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించొద్దు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి. రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి. ఏజెంట్లను నియంత్రించాలి. విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి, వారి విడుదలకు కృషి చేయాలి విదేశాల్లోని భారతీయుల కోసం తక్షణం స్పందించే ఆన్లైన్ వ్యవస్థ ’మదద్’ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం) ఉంది. ఇదే తరహాలో గల్ఫ్ కుటుంబాలకు సాయమందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్)లో ప్రవాస భారతీయులందరూ చేరవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలి. -
ఉద్యోగం పోయింది..!
-
ఖతర్‌కు మరో 48 గంటల గడువు
-
ఖతర్‌కు మరో 48 గంటల గడువు
సౌదీ: తమ డిమాండ్లపై స్పందించడానికి సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాలు ఖతర్‌కు మరో 48 గంటల గడువు ఇచ్చాయి. ఈ షరతులను అంగీకరించకపోతే వెలివేస్తామని ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాతో పాటు ఈజిప్ట్, యూఏఈ, బహ్రయిన్ దేశాలు ఖతర్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నాయి. అల్‌జజీరా ఛానల్‌ను మూసివేత, టర్కీ సాయుధ దళాలను తొలగించడం, ఇరాన్‌తో బంధాలను తెంచుకోవడం, ఐసిస్, అల్‌కాయిదా వంటి పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను తెంచుకోవడం వంటి 13 డిమాండ్లను అంగీకరించాలని కోరాయి. ఈ మేరకు ఇచ్చిన పది రోజుల గడువు సోమవారం ముగియడంతో దానిని బుధవారం దాకా పొడిగించాయి. ఉగ్రవాదులకు సహకరిస్తుందన్న ఆరోపణలపై ఖతర్‌తో అరబ్ దేశాలు దౌత్య, ఆర్థిక, భౌగోళిక సంబంధాలను తెంచుకోవడం తెలిసిందే. ప్రస్తుతం అరబ్ దేశాల మధ్య తీవ్ర దౌత్య, ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఖతర్ విదేశాంగ మంత్రి మిగతా అరబ్ నేతలతో భేటీ కానున్నారు. ఖతర్ పాలకుడి విజ్ఞప్తి మేరకే గడువును పొడగిస్తున్నట్టు ఈ ఆదేశాలు ప్రకటించాయి. అయితే ఈ డిమాండ్లపై ఖతర్ విదేశాంగమంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ తనీ స్పందిస్తూ వీటిని అంగీకరించడం సాధ్యం కాదని, ఎటువంటి పర్యవసనాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆదివారం రోమ్‌లో అన్నారు. అయితే దౌత్యసంబంధాలను తెంచుకున్న దేశాలతో చర్చించేందుకు ఖతర్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. -
ఖతార్ చేసిన తప్పేంటి?
నిత్యం రాజకీయ అస్థిరత తాండవించే పశ్చిమాసియాలో మరో సంక్షోభం ముదురుతోంది. అయితే.. ఇది ఈ సారి అత్యంత సంపన్న దేశం ఖతార్ కేంద్రంగా రాజుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం గల ఈ దేశం మీద ఇప్పుడు పొరుగు దేశాలు ఎందుకు కత్తులు నూరుతున్నాయి? ఖతార్ చేసిన తప్పేంటి? ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఖతార్. ఈ దేశ విస్తీర్ణం హైదరాబాద్ విస్తీర్ణానికి రెట్టింపులో ఉంటుంది. జనాభా మాత్రం హైదరాబాద్‌లో సగమే ఉంటుంది. మొత్తం జనాభాలో 12 శాతం మాత్రమే ఖతార్ పౌరులు. మిగతా వాళ్లంత వలసదారులే. దేశ జనాభాలో దాదాపు మూడో వంతు భారతీయులే. మతం రీత్యా చూస్తే ముస్లింలు, క్రైస్తవుల తర్వాత మూడో స్థానంలో హిందువులున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు అధికం. అందుకే ఇతర దేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఖతార్‌కు గత వారం కష్టకాలం మొదలైంది. జిహాదీ, ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ, మద్దతిస్తోందంటూ అరబ్ దేశాలు ఖతార్‌పై భగ్గుమన్నాయి. సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టులు ఈ నెల ఐదో తేదీన ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. రవాణా మార్గాలన్నిటినీ మూసివేశాయి. తమ తమ దేశాల్లోని ఖతార్ పౌరులు 14 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలనీ అల్టిమేటం జారీచేశాయి. పొరుగు దేశాల సహాయ నిరాకరణతో ఖతార్ విలవిలలాడిపోయింది. అరేబియా ద్వీపకల్పంలోని చిన్న దేశమైన ఖతార్‌కు మూడువైపుల సముద్రం ఒక వైపు సౌదీ అరేబియాతో భూసరిహద్దులు ఉన్నాయి. ఖతార్‌కు వచ్చే పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఆహార పదార్థాలు సౌదీ నుంచి రావాల్సిందే. ఈ మార్గాన్ని సౌదీ మూసివేయడంతో ఖతార్‌లో నిత్యావసర వస్తువులకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. చాలా విమానయాన సంస్థలు ఖతార్ నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశాయి. మిగతా పొరుగు దేశాలు కూడా రవాణా మార్గాలను మూసివేయడంతో ఆహార పదార్థాల కొరత పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ముందుజాగ్రత్తగా ఆహారం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడానికి మార్కెట్లకు వెల్లువెత్తుతున్నారు. ఆరు సభ్యదేశాలున్న గల్ఫ్ సహకార మండలిలో కువైట్, ఒమన్ మాత్రమే ఖతార్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. తాజా వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించడానికి కువైట్ ముందుకు వచ్చింది. ఇక ఇరాన్ నౌకలు, విమనాల ద్వారా ఆహార పదార్థాలను ఖతార్‌కు పంపిస్తోంది. రష్యా కూడా సాయం చేసేందుకు అంగీకరించింది. కొన్ని దేశాల్లో అస్థిర పరిస్థితులు నెలకొన్న సమయంలో అక్కడ నివసిస్తున్న విదేశీయులను విమానాలు లేదా నౌకల ద్వారా వారి స్వదేశాలకు తరలిస్తుంటారు. ఖతార్ ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు. పొరుగు దేశాల సహాయ నిరాకరణతో దేశం సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ స్థైర్యం కోల్పోకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దేశీయ వినియోగానికి అవసరమైన పాల ఉత్పత్తుల కోసం 4 వేల ఆవులను 60 విమానాల్లో తీసుకురావాలని నిర్ణయించింది. ఖతార్‌కు చెందిన పారిశ్రామికవేత్త మౌతాజ్ అల్ ఖయ్యత్ ఆస్ట్రేలియా నుంచి ఆవులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాడు. సెప్టెంబరు కల్లా దేశీయంగా పాల దిగుబడి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆవుల రాకతో ఈ నెలాఖరు నుంచే పాల ఉత్పత్తిని ప్రారంభించాలని నిర్ణయించారు. 2022లో ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్రీడలను ఖతార్‌లో నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఇలాంటి సవాళ్లు ఎదురుకావడంతో వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. -
గల్ఫ్‌లో ఇద్దరు మహిళల విక్రయం!
హైదరాబాద్ ముఠా సభ్యులను విచారణ చేస్తున్న పోలీసులు ఇబ్రహీంపట్నం (మైలవరం): ఉపాధి చూపుతామని ఆశ చూపి గల్ఫ్ దేశాలకు తీసుకెళ్లిన ఇద్దరు మహిళలను ఓ ముఠా అక్కడి సేట్లకు విక్రయించారని కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలో మంగళవారం కలకలం రేగింది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఓ ముఠా సభ్యులు తొమ్మిది నెలల క్రితం ఐదుగురు మహిళలకు మస్కట్ దేశంలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. మైలవరం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ద్వారా ఆ సభ్యులు మహిళల నుంచి డబ్బులు గుంచి ఇద్దరిని తొలివిడతగా మస్కట్ పంపించారు. అక్కడ వారు కష్టాలు భరించలేక తిరిగి గ్రామానికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మిగిలిన ముగ్గురు మహిళలను తీసుకెళ్లేందుకు కొండపల్లి వస్తున్నట్లు హైదరాబాద్ నుంచి ముఠా సభ్యులు మంగళవారం స్థానిక మహిళకు సమాచారం ఇచ్చారు. ముందుగా మస్కట్ వెళ్లిన మహిళలను అక్కడి సేట్‌కు విక్రయించారని, దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న స్థానికులు ముఠా వివరాలను పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో విజయవాడకు చేరుకున్న పదిమంది సభ్యుల్లో ఇద్దరిని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అనంతరం వారిని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారని సమాచారం. -
వారి దేహాలను తీసుకురావడానికి ఏం చేస్తున్నారు?
గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల గురించి ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చే విషయంలో ఏం చర్యలు తీసుకుం టున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 2కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గల్ఫ్ దేశాల్లో మరణించిన భారతీయుల మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదంటూ హైదరాబాద్, ప్రగతినగర్‌కు చెందిన న్యాయవాది శ్రీధర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్నెల్లుగా శవాగారాల్లోనే మృతదేహాలు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ, ఉభయ రాష్ట్రాలకు చెందిన సుమారు 150 మంది గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాల వల్ల మృత్యువాత పడ్డారని, వారి మృతదేహాలు గత ఆరు నెలలుగా శవాగారాల్లో ఉన్నాయని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘ఈ వ్యవహారాన్ని ఆయా రాష్ట్రాలకే పరిమితం చేయవద్దు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వివరణలతో కౌంటర్లు దాఖలు చేస్తాయి’అని కేంద్రానికి స్పష్టం చేసింది. విచారణను జనవరి 2కు వాయిదా వేసింది. -
గల్ఫ్ లో ఉద్యోగాలు: ముఠా అరెస్ట్
హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ నార్త్‌జోన్ పరిధిలో కన్సల్టెన్సి కార్యాలయం నిర్వహిస్తూ.. దుబాయ్ పంపిస్తామని డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు చేసి ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
దూసుకెళ్తున్న టామ్‌కామ్
తాజాగా గల్ఫ్ దేశాల్లో డాక్టర్ల రిక్రూట్మెంట్కు ఒప్పందం సాక్షి, హైదరాబాద్: విదేశీ ఉద్యోగ కల్పనలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) దూసుకెళ్తోంది. గల్ఫ్ దేశాలలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాలలో ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. ఇప్పటి వరకు అన్‌స్కిల్డ్ రంగాలకు సంబంధించి దాదాపు 750 మందిని వివిధ కంపెనీల కోసం నియామకాలు చేసి, గల్ఫ్ దేశాలకు పంపిన విషయం తెలిసిందే. అలాగే మరో 156 మంది పారా మెడికల్ సిబ్బంది రిక్రూట్మెంట్కు సంబంధించి కూడా గల్ఫ్ దేశాలలోని ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంది. తాజాగా కొన్ని విభాగాలలో డాక్టర్ల నియామకాలు కూడా చేయడానికి టామ్కామ్కు అనుమతి లభించింది. మొదటి విడుతలో భాగంగా సౌదీఅరేబియాలో పనిచేయడానికి 12 డాక్టర్ పోస్టులకు నియామకాలు జరపనున్నారు. ప్రారంభ వేతనం భారత కరెన్సీ ప్రకారం నెలకు రూ.6 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఉంటుంది. అయితే రెండేళ్ల పాటు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఏడాదికి నెల రోజుల పాటు సెలవులు. విమాన చార్జీలు, సౌదీలో రవాణా, మెడికల్ సదుపాయం సంబంధిత కంపెనీయే భరిస్తుంది. ఆసక్తిగల వారు ఆన్లైన్ ద్వారా ఈ నెల 13 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా టామ్‌కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్ తెలిపారు. డాక్టర్ల నియామకానికి సంబంధించి కార్డియాలజిస్ట్(2), ఈఎన్టీ(2), పిడియాట్రిక్ (2), గైనకాలజిస్ట్(మహిళ) (2), డెర్మటాలజిస్ట్(2), న్యూరోసర్జరీ స్పెషలిస్ట్(1) విభాగాల్లో ఖాళీలున్నాయి. పారామెడికల్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు పారామెడికల్ సిబ్బంది నియామకాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 5 నుంచి 13కు పొడిగించినట్టు నాయక్ చెప్పారు. గల్ఫ్ దేశాలలో వివిధ విభాగాలల్లో దాదాపు 156 మంది పారామెడికల్ సిబ్బంది నియమకాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 156 పోస్టులకు గాను దాదాపు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఎంప్లాయిమెంట్ కార్డు గడువు ముగిసిన వారు రెన్యూవల్ చేసుకోవడానికి డెరైక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అవకాశం కల్పించింది. వీరందరూ జిల్లాలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రెన్యూవల్ చేసుకోవచ్చని నాయక్ చెప్పారు. -
సౌదీ అరేబియాలో 156 పారామెడికల్ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ ద్వారా 156 పారామెడికల్ పోస్టుల భర్తీకి అనుమతి లభించిందని కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం సచివాలయం లో మాట్లాడుతూ.. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఆస్పత్రుల్లో నర్సింగ్, పారామెడికల్ ఉద్యోగాలకు అర్హులు http://www.tomcom.telangana.gov.in ద్వారా అక్టోబర్ 5లోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా కూడా విద్యార్హతలు, అనుభవం, పాస్‌పోర్ట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజి యోథెరపిస్ట్ ఉద్యోగాలకు అర్హతలు, అనుభవాన్ని బట్టి రూ.50 వేలకు తగ్గకుండా నెల వేతనం లభిస్తుందన్నారు. పారామెడికల్ పోస్టులే కాక ఇతర ఉద్యోగాలకూ టామ్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, అవకాశాలుంటే వారికి సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంస్థ యాజమాన్యంతో హైదరాబాద్ నుంచే నేరుగా ఇంటర్వ్యూను టామ్‌కామ్ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి యాజమాన్యాలే ఉచిత వసతి, ప్రయాణ ఖర్చులు భరిస్తాయని నాయిని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23342040, 8886882040లో టామ్‌కామ్ ప్రతినిధులను సంప్రదించవచ్చన్నారు. -
గల్ఫ్ దేశాల్లో పనిచేయడం మనకు ప్రత్యక్ష నరకం
న్యూఢిల్లీ: పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాల బాట పట్టిన భారతీయులు ఆ దేశాల్లో అనుభవిస్తున్న బాధలు అంతా ఇంతా కాదు. కొంత మంది ఉద్యోగాలు ఊడిపోయి ఆకలి మంటలతో అలమటిస్తుండగా, మరికొంత మంది అక్రమంగా జైల్లో మగ్గిపోతున్నారు. ఇంకొందరు అకాల మరణాలకు గురవుతున్నారు. సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఓమన్, బహ్రెయిన్ గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు ఏడాదికి 69 మంది అకాల మరణం పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల మృతిసంఖ్య సగటున ఏడాదికి 26 ఉండగా, గల్ఫ్‌లోనే అత్యధికంగా ఉంది. అమెరికాలో జీవిస్తున్న భారతీయ కార్మికులతో పోలిస్తే సౌదీ అరేబియా, కువైట్‌లో చనిపోయే ప్రమాదం పది రెట్లు ఎక్కువగా ఉందని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. సౌదీ, ఓమన్, కువైట్, యూఏఈ నివేదికల ప్రకారం ఆయా దేశాల్లో ప్రతి లక్ష మంది కార్మికుల్లో 65 నుంచి 75 మంది భారతీయులు మరణిస్తున్నారు. పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాల వల్ల, పని ఒత్తిడిని తట్టుకోలేక వచ్చే గుండెపోటు వల్ల, ఉన్న ఉద్యోగం ఊడిపోయి రోడ్డునపడి పస్తులుండడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఆరు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల్లో 87 శాతం మంది తమ దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నామంటూ ఆయా దేశాల్లోని భారతీయ అంబసీలకు ఫిర్యాదు చేశారంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖతార్‌లోని భారతీయ అంబసీకి 13,624 ఫిర్యాదులు, సౌదీ అరేబియాలో 11,195 ఫిర్యాదులు, కువైట్‌లో 11,103 ఫిర్యాదులు అందయాని భారత విదేశాంగ శాఖే ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. జీతాలు చెల్లించక పోవడం, చెల్లించినా రావాల్సిన దానికన్నా తక్కువ చెల్లించడం, చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడం, ఎక్కువ పని గంటలు ఉండడం, ఎలాంటి సదుపాయాలులేని దుర్భర పరిస్థితుల్లో జీవించడం, భౌతికంగా హింసించడం, సకాలంలో వీసాలు, వర్క్ పర్మిట్ కార్డులు రిన్యువల్ చేయకపోవడం, వైద్య ఖర్చులు చెల్లించకపోవడం, కాంట్రాక్టు పీరియడ్ ముగిశాక మాతృదేశానికి విమాన టిక్కెట్లు ఇవ్వకపోవడం తదితర అంశాలపై ఈ ఫిర్యాదులు అందాయి. ప్రపంచవ్యాప్తంగా 7,213 మంది భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతుండగా, ఒక్క సౌదీ అరేబియాలోనే 1,697 మంది మగ్గిపోతున్నారు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 1,143 మంది భారతీయులు జైళ్లలో మగ్గిపోతున్నారు. సకాంలో వీసాలను రిన్యువల్ చేయక పోవడం వల్ల, తిరుగు ప్రయాణంలో విమాన టిక్కెట్లు కొనుగోలుచేసే శక్తి లేకపోవడం వల్ల పని ఒత్తిడి తట్టుకోలేక కంపెనీ నుంచి పారిపోవడం తదితర కారణాల వల్ల భారతీయ కార్మికులు జైళ్లలో మగ్గిపోతున్నారు. -
సౌదీలో భారతీయుల బతుకు ఎంత కష్టం
-
ఎడారి బతుకులు
అయినవాళ్లనూ, ఉన్న ఊళ్లనూ వదిలి పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలస పోయినవారు ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న వేలాదిమంది భారతీయ కార్మికులు పలు సంస్థలు బయటకు నెట్టడంతో దిక్కు తోచక వీధినబడ్డారు. మూడురోజులపాటు వారంతా పస్తులున్నారు. సౌదీలోని మన దౌత్య కార్యాలయం ఈ సంగతి తెలిశాక ఆ కార్మికులకు భోజన, వసతి సౌక ర్యాలు కల్పించిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. వారందరికీ ఎగ్జిట్ వీసాలు లభించేలా చర్యలు తీసుకుని స్వదేశానికి తీసుకొస్తున్నామని తెలిపింది. నిజానికిది సౌదీ అరేబియా దేశానికి పరిమితమైన సమస్య కాదు. చమురు ధరలు అంత ర్జాతీయ మార్కెట్లో పతనం కావడం మొదలయ్యాక గల్ఫ్ దేశాలన్నిటా ఆర్ధిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా యెమెన్‌లో సైనిక జోక్యం చేసుకున్నాక పరిస్థితి మరింత క్షీణించింది. పర్యవసానంగా అసలే అంతంతమా త్రంగా ఉండే వలస కార్మికుల జీవితాలు అధోగతికి చేరుకున్నాయి. సిబ్బందిని తగ్గించుకుని ఉన్నవారిపై పనిభారాన్ని పెంచడం, జీతాలు ఆలస్యం చేయడం, ఎగ్గొ ట్టడం పెరిగింది. ఇదంతా గమనించి కొంతమంది అక్కడినుంచి వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఏర్పడిన సంక్షోభం సమసిపోకపోతుందా అని ఆశించి చావుకు తెగించి ఎదురుచూస్తూ ఉండిపోయినవారే అధికం. గల్ఫ్‌లో దాదాపు 70 లక్షలమంది ప్రవాస భారతీయులున్నారని అంచనా. వీరిలో ఒక్క సౌదీలోనే 30 లక్షలమంది వరకూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలనుంచి వెళ్లినవారు ఇందులో లక్షన్నరమంది ఉంటారు. వలసలను అరికట్టడం కోసం, స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం మూడేళ్లక్రితం నితాఖత్ చట్టం తీసుకురా వడంవల్ల సౌదీలో గతంతో పోలిస్తే ప్రవాస భారతీయుల సంఖ్య తగ్గింది. గల్ఫ్‌కు వెళ్లేవారిలో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేసి ఎన్నో అగ చాట్లు పడి అక్కడికి చేరుకున్నవారే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లేవారు చదువుల కోసమో, కెరీర్లో మరింత ఉన్నత స్థితికి ఎదగాలనో కోరుకుని వలస పోతుంటే...గల్ఫ్ దేశాలకు మాత్రం కేవలం ఆకలి బాధనుంచి, నిరుద్యోగ భూతం నుంచి తప్పించుకోవడానికి చాలామంది వెళ్తారు. గల్ఫ్ పరిస్థితి బాగులేదని ఏణ్ణర్ధం నుంచి తెలుస్తూనే ఉంది. చమురు ధరలు, యుద్ధం తదితర పరిస్థితుల వల్ల ఆర్ధిక మాంద్యం ఏర్పడి నిజవేతనాలు పడిపోయాయి. చాలా కంపెనీలు మూతబడ్డాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో దాదాపు 2 లక్షలమందికి ఉపాధి కల్పించే ప్రముఖ నిర్మాణ సంస్థ బిన్‌లాడెన్ గ్రూప్ ఈ ఏడాది మొదట్లో 50,000మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇలా తొలగించినవారందరికీ ఆ సంస్థ ఎగ్జిట్ వీసాలు మంజూరు చేసినా గల్ఫ్ దేశాల్లో ఉండే సంక్లిష్ట వ్యవస్థ కారణంగా దానికి అనుబం ధంగా కంపెనీనుంచి వివిధ రకాల పత్రాలు లేనిదే దేశంనుంచి బయటికెళ్లేందుకు అనుమతించరు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడినా యాజమాన్యం ఈ విషయంలో చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన కార్మికులు మక్కాలో ఉద్యమానికి దిగారు. బిన్‌లాడెన్ గ్రూపు సంస్థ ఎదుట బస్సులకు నిప్పంటించారు. ఆ దేశంలో అసమ్మతిని ఏమాత్రం సహించరని, అత్యంత కఠినంగా శిక్షిస్తారని తెలిసినా వీరు ఉద్యమానికి తెగించారంటే పరిస్థితులు ఎంత దుర్భరంగా మారి ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇటీవల కొన్నేళ్లుగా సౌదీ అరేబియా, బహ్రైన్, ఒమన్ తదితర దేశాల్లో ఆర్ధిక లోటు అపారంగా పెరిగింది. ఒక్క సౌదీ విషయమే తీసుకుంటే నిరుడు ఆ దేశం ఆర్ధిక లోటు 9,800 కోట్ల డాలర్లు. నిర్మాణ రంగ పరిశ్రమ గణనీ యంగా కుంచించుకుపోయింది. తమ పౌరులకే ఉపాధి కల్పించడం సాధ్యంకాని వర్తమాన పరిస్థితుల్లో ఆ దేశాలన్నీ వలసవచ్చినవారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. అసలు గల్ఫ్ దేశాలకెళ్లినవారి బాగోగులు చూడటంలో, వారి ఇబ్బందులను తొలగించడంలో మన ప్రభుత్వాలు మొదటినుంచీ నిర్లిప్తంగానే వ్యవహరిస్తు న్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులపై చూపే ప్రేమలో కాస్తయినా గల్ఫ్ దేశాలవారి యోగక్షేమాలపట్ల చూపడం లేదు. వలస కార్మికులు గల్ఫ్ నుంచి ఇక్కడి తమ కుటుంబాలకు పంపే డబ్బు ఏటా 3,300 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,20,000 కోట్లు) ఉంటుందని తాజా గణాం కాలు చెబుతున్నాయి. కానీ అందుకు ప్రతిఫలంగా వారి బాగోగుల విషయంలో ఎంత శ్రద్ధ పెడుతున్నామన్నది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మన ఇంధన అవసరాలను తీర్చడంలో గల్ఫ్ దేశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందువల్లే మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ... కంపెనీలు, వ్యక్తులు సాగిస్తున్న మోసాలపైనా అక్కడి ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా మాట్లాడలేకపో తున్నదన్న అభియోగముంది. సౌదీలో ప్రవాస భారతీయ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని తెలిశాక కేంద్రం చురుగ్గా కదిలిందనడంలో సందేహం లేదు. కానీ గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు సరిగా లేవని తెలిసినప్పుడే వారిని రప్పించడానికి కృషి చేయాల్సింది. రప్పించడమంటే కేవలం విమాన సౌకర్యం కల్పించి తీసుకురా వడం కాదు...అలా వచ్చేవారికి ఇక్కడ ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడంపై దృష్టి సారించాలి. ఆ కార్మికుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసిన ఏజెంట్ల భరతం పట్టి వారి డబ్బు ఇప్పించాలి. అలాగే ఇకపై ఈ స్థితి ఏర్పడకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడం, అక్కడి పరిస్థితులపై అవ గాహన కల్పించడం, ఏజెంట్ల నియంత్రణకు అవసరమైన చట్టాలు తీసుకురావడం వంటివి చేయాలి. ప్రవాస తెలంగాణ వ్యవహారాల కేంద్రం(సెంటా) ఏర్పాటుచేసి రాష్ట్రంనుంచి వలసపోయేవారి యోగక్షేమాలకు అవసరమైన చర్యలు తీసుకోబోతు న్నట్టు ఈమధ్యే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అనధికార ఏజెంట్లనూ, కన్సల్టెన్సీలనూ నియంత్రిస్తామని తెలిపింది. అక్కడివారు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నది. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి రావాలి. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ఈ మాదిరి చర్యలకు ఉపక్రమించాలి. -
'అబుదాబిలో ఇండియన్స్ అష్టకష్టాలు'
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలను భారత ప్రభుత్వం పట్టించుకోవాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేత ఎన్ కే ప్రేమచంద్రన్ డిమాండ్ చేశారు. కొంతమంది భారతీయ పౌరులు అబుదాబిలో అష్టకష్టాలు పడుతున్నారని, వారంతా రువాయిస్ అనే క్యాంపులో ఉంటూ నానా కష్టాలు పడుతున్నారని చెప్పారు. గత ఎనిమిది నెలలుగా ఆ కంపెనీ కేవలం పనిమాత్రమే చేయించుకుంటుందని, వారికి జీతభత్యాలు చెల్లించడం లేదని, కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని వెంటనే కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకొని పరిష్కరించాలని అన్నారు. అక్కడి అధికారులకు ఫిర్యాదుచేసినా, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన మంగళవారం ఈ అంశాన్ని లేవనెత్తారు. -
గల్ఫ్ దేశాల్లో విశాఖ గంజాయి..
అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను కేంద్రాలుగా విశాఖ గంజాయిని గల్ఫ్ దేశాలకు అక్రమరవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను కడప పోలీసులు పట్టుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట ఓఎస్డీ(ఆపరేషన్స్) సత్య ఏసుబాబు వెల్లడించిన వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన కంచు సూరిబాబు, తాకాసి వెంకటేశ్వర్లు విశాఖ ఏజెన్సీ నుంచి రాజంపేటకు గంజాయిని దొంగతనంగా తరలించేవారు. దానిని రాజంపేట ప్రాంతానికి చెందిన తల్లిశెట్టి సాయిప్రతాప్ ఉరఫ్ తపన హరి, చంద్ర సుబ్రమణ్యం, రొంపిచెర్ల హరి, రొంపిచెర్ల లక్ష్మీకర్, రొంపిచెర్ల నాగభూషణం, షేక్ అక్బర్, నాగిరెడ్డి మదన్‌మోహనరెడ్డి, తిరుచానూరుకు చెందిన శ్రీనువాసులరెడ్డి, ఇంకా మరికొందరు కలిసి గల్ఫ్‌కు వెళ్లేవారిని గుర్తించి వారిద్వారా తరలించేవారు. ఎగుమతి సాగేదిలా.. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువమంది జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వె ళుతుంటారు. ఎవరెవరు వెళ్తున్నారో ముందుగా ఈ ముఠా గుర్తిస్తుంది. చెన్నై, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు చేరుకుని వారి కోసం అక్కడ కాపుకాస్తారు. అందులో అమాయకంగా కనిపించేవారిని ఎంచుకుని మాటల్లోకి దించుతారు. తమ బంధువులు కువైట్, దుబాయిలో ఉన్నారని, వారికి ఈ ప్యాకెట్ అందజేయాలని అంటగడతారు. దీంతో వారెవరో తమకు తెలియకపోయినా సీల్డు కవర్లలో ప్యాక్ చేసిన వాటిని తమ వెంట తీసుకెళ్తుంటారు. అంతా సాఫీగా సాగితే అక్కడి స్మగ్లర్లకు సరుకు చేరుతుంది. అలాకాకుండా ఎయిర్‌పోర్టు అధికారుల తనిఖీలో పట్టుబడితే మాత్రం అమాయకులు జైలుపాలయ్యేవారు. ఇలా చాలామంది అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు కూడా. ఇలా ఈ ముఠా సభ్యులు గంజాయిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. ముఠా సభ్యుల్లో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గురువారం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద పదిమందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఇద్దరు తప్పించుకోగా వారి కోసం గాలింపుచేపట్టారు. -
జాబ్స్ అబ్రాడ్.. గల్ఫ్
జాబ్స్ అబ్రాడ్ అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల పేర్లు గుర్తొస్తాయి.. అయితే సంఖ్యా పరంగా చూస్తే అధిక శాతం మంది గమ్యం గల్ఫ్ దేశాలే! భారత విదేశీ మంత్రిత్వ శాఖ నివేదిక (2014-15) ప్రకారం వివిధ దేశాల్లో 50 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తుంటే.. వారిలో 90 శాతానికి పైగా గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల విధానాలు కూడా విదేశీ ఉద్యోగార్థులకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలు తదితరాలపై ఫోకస్.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అంటే డొమెస్టిక్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్, చమురు శుద్ధి కర్మాగారాల్లో కింది స్థాయి ఉద్యోగాలు- అనేది ఎక్కువ మందిలో ఉండే అభిప్రాయం. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్‌లో అర్హతలను బట్టి అవకాశాలు అందుకోవచ్చు. ఏటా 8 లక్షల మంది.. ఉద్యోగావకాశాల కల్పనలో జీసీసీ (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్) కంట్రీస్‌గా పేర్కొనే కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ముందంజలో ఉన్నాయి. భారత్ నుంచి ఏటా దాదాపు 8 లక్షల మంది జీసీసీ దేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ దేశాల్లోని విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మంది భారత్ నుంచి వెళ్లినవారే. భారత్ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పరంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు గత నాలుగైదేళ్లుగా మొదటి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి. 2010-15 మధ్యకాలంలో ఏటా సగటున 1.10 లక్షల మంది తెలుగు వారు గల్ఫ్ దేశాల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ నుంచి ఎనర్జీ సెక్టార్ వరకు; నిర్మాణ రంగం నుంచి ఆయిల్ రిఫైనరీస్ వరకు.. వివిధ రంగాలు ఆకర్షణీయ కెరీర్‌కు అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉత్పత్తి, సేవారంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. కువైట్ నిర్మాణం, ఆస్పత్రులు, ఆతిథ్య రంగాల్లో నియామకాల సంఖ్య అధికంగా ఉంది. దీనికి కారణం.. కువైట్ ప్రభుత్వం కీ డెవలప్మెంట్ ప్లాన్ 2010-15 పేరుతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడమే. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఐటీఐ, డిప్లొమా; నర్సింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్; హోటల్ మేనేజ్మెంట్, హౌస్‌కీపింగ్ వంటి విభాగాల్లో సర్టిఫికెట్లు ఉంటే కువైట్‌లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఖతార్ ఆయిల్ రిఫైనరీలతో పాటు సేవా రంగం, హోటల్ పరిశ్రమ, హౌస్ కీపింగ్, మెయింటనెన్స్ విభాగాల్లో అవకాశాలు ఎక్కువ. వీటితోపాటు 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఖతార్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఉత్పత్తి, సేవా రంగాల్లో వలస ఉద్యోగులకు డిమాండ్ పెరగనుంది. సౌదీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధాన ఉపాధి రంగం. ఇక్కడి ప్రభుత్వం ఎకనామిక్ సిటీస్, ఇంధనేతర తయారీ రంగాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. సౌదీలో హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలు ఇతర ముఖ్య ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి. యూఏఈ నిర్మాణం, రిటైల్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలు టాప్ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి. వరల్డ్ ఎక్స్పో-2020 పేరిట యూఏఈ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంతో వచ్చే అయిదేళ్లలో అవకాశాలు మరింత పెరగనున్నాయి. అర్హతను బట్టి ఉద్యోగాలు ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు చేసిన వారు సెమీ స్కిల్డ్ హోదాలో ఉద్యోగాలు అందుకోవచ్చు. వీటినే బ్లూ కాలర్ జాబ్స్‌గా పేర్కొంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు ఉంటే స్కిల్డ్ వర్కర్స్ హోదాలో సూపర్వైజర్స్, ఆఫీస్ మేనేజర్స్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ పీజీలు, ఎంటెక్/ఎంఈ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. స్కిల్స్ వారీగా చూస్తే లో స్కిల్: 500-100; సెమీ స్కిల్డ్: 1200-1500; స్కిల్డ్ (ప్రొఫెషనల్): 3500-4000. (ఆయా దేశాల కరెన్సీల్లో..) ఔత్సాహికులకు భరోసా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్ విషయంలో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. స్వర్ణ ప్రవాస్ యోజన పేరుతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న రంగాల్లో భారత అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మన దేశంలో అందించే వృత్తి విద్యా కోర్సులు, టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగార్థుల కెరీర్‌కు భరోసా కల్పించే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైంది మినిమల్ రిఫరల్ వేజెస్ మొత్తాన్ని 800 రియాల్స్ నుంచి 1500 రియాల్స్‌కు పెంచడం. అంటే.. ఒక అభ్యర్థిని నియమించుకోవాలనుకునే గల్ఫ్ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు ప్రతి అభ్యర్థికి కనీసం 1500 రియాల్స్ చెల్లించాలని పేర్కొనడం. వీటితోపాటు రిక్రూటర్ల ప్రామాణికత, ఏజెంట్లకు సంబంధించిన సమాచారంపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రిక్రూట్మెంట్ ఏజెంట్లు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సిన నగదు మొత్తాన్ని కూడా భారీగా పెంచింది. అంతా ఆన్లైన్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. గల్ఫ్ ఉద్యోగ ఔత్సాహికుల కోసం ఆన్లైన్ సేవలు అందిస్తోంది. ఈ శాఖ.. రిక్రూటర్స్, జాబ్ సీకర్స్, రిక్రూటింగ్ ఏజెంట్స్ తమ దరఖాస్తులను ఆన్లైన్లో అందించే సదుపాయం కల్పిస్తోంది. ఈ మూడు వర్గాల వారు అనుసరించాల్సిన విధివిధానాలు, కొత్త మార్పులపై సమాచారం కూడా అందిస్తోంది. కఫాలా.. తప్పనిసరి గల్ఫ్ దేశాల ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. అవసరమైన డాక్యుమెంట్లు ఇమిగ్రేషన్ చెక్ పూర్తిచేసుకుని.. వీసా పొంది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాల్లో అడుగుపెట్టాలనుకునే వారికి దరఖాస్తుతోపాటు అందించాల్సిన డాక్యుమెంట్లు.. ఎంప్లాయర్ అందించే స్పాన్సర్ లెటర్ (కఫాలా), పాస్‌పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, నిర్ణీత మొత్తంలో నగదు డిపాజిట్. గల్ఫ్ దేశాల్లోని అవకాశాలతో పాటు ప్రైవేటు నియామక ఏజెంట్ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ పేరిట సంస్థను నెలకొల్పడం జరిగింది. ఔత్సాహికులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవసరమైన సమాచారం అందిస్తాం. వీసా విధివిధానాలను వివరిస్తాం. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవడం వల్ల ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్‌లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. - కె.భవాని, జీఎం-హెచ్ఆర్, టామ్‌కామ్. -
ఉపాధి లేక.. గల్ఫ్ బాట!
కరువు దెబ్బకు గల్ఫ్ పయనం ఒట్టి చేతులతో ఇంటిముఖం ఏజెంట్ల మోసం అప్పులు కుప్పలు వీర్నపల్లివాసుల వెతలు ఉన్న ఊళ్లోనే ఉపాధికోసం నిరీక్షణ జిల్లా అంతటా ఇదే పరిస్థితి కరువు ఉరిమింది. ఉన్న ఉళ్లో ఉపాధి కరువైంది. బతుకుదెరువుకు చేసిన అప్పు వడ్డీలతో కలిపి కుప్పయింది. అప్పు తీర్చే మార్గం లేక గల్ఫ్ దేశాలకు వెళితే రాత్రింబవళ్లు పని చేయించుకున్న యాజమాన్యం జీతమడిగే సరికి కొంతమేర విదిల్చింది. ఆ జీతం తిండికే సరిపోని పరిస్థితి. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడితే... అంతే సంగతులు. ఇట్లయితే అప్పు తీరేదెలా? ఇల్లు గడిచేదెలా? అని బెంగపట్టుకుంది. ఇక లాభం లేదనుకుని యాజమాన్యాన్ని ఎదిరించి స్వదేశానికి తిరిగొస్తుంటే పాస్‌పోర్టు లాక్కుని జైళ్లో వేయించింది. నాలుగు నెలలు జైళ్లో గడిపి ఎలాగోలా ఇంటికి చేరుకుంటే... ఊళ్లో పరిస్థితి మళ్లీ భయపెడుతోంది. ఎటు చూసినా కరువే... ఏ పనీ లేదు. ఇంటిని ఎట్లా నెట్టుకురావాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రధానమంత్రి సంసద్ గ్రామీణ యోజన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిలో యువకుల దుస్థితి ఇది. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీర్నపల్లిలో జనాభా 3684 మంది. 99 శాతం ప్రజలు దళిత, గిరిజన, వెనుకబడిన సామాజికవర్గాలవారే. 8 తండాలున్న ఈ పంచాయతీలో 42 శాతం ఎస్టీ, 22 శాతం ఎస్సీ, 35 శాతం బీసీ జనాభా ఉన్నారు. మిగిలిన ఒకే ఒక్క శాతం జనాభాలో ఒక వెలమ, 10 వైశ్య సామాజిక కుటుంబాలు నివసిస్తున్నాయి. పురుష, మహిళా నిష్పత్తిలో మహిళలే అధికంగా ఉన్న పల్లె ఇది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామమిదే. గతంలో పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల బూట్ల చప్పుళ్లు, నక్సలైట్ల తూటాల పహారాలో నలిగిన గ్రామమిది. గత పదేళ్లలో పోలీసులు, నక్సల్స్ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పల్లె కావడంతో... వీర్నపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎంపీ వినోద్‌కుమార్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నరలో ఈ గ్రామంలో చాలా మార్పులే వచ్చాయి. వయోజన విద్య కార్యక్రమంగా పకడ్బందీగా అమలు చేయడంతో నూరు శాతం అక్షరాస్యత సాధించారు. గ్రామీణ బ్యాంకు ఏర్పాటైంది. ఒకప్పుడు ఇంటింటికీ గుడుంబా తయారు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి చాలా మేరకు మారింది. కానీ, చేయడానికి పనుల్లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బతుకుదెరువుకు వెళ్లి... మోసపోయి ఇల్లు చేరి.. బతుకుదెరువు కోసం ఈ ఊరి నుంచి 1200 మందికిపైగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. లక్షలకు లక్షలు సంపాదించవచ్చన్న ఏజెంట్లు మాటలు నమ్మి చేతిలో డబ్బుల్లేకపోయినా ఇల్లు, పొలం కుదవపెట్టి అప్పు చేసి మరీ వెళ్లినవాళ్లే ఎక్కువ. తీరా అక్కడికి వెళ్లాక పెద్ద జీతం సంగతి దేవుడెరుగు... బతుకే నరకంగా మారడంతో... ఉండలేక ఒట్టి చేతులతో తిరిగొస్తున్నారు. ఇలా 225 మందికిపైగా యువకులు తిరిగి వీర్నపల్లి రావడం గమనార్హం. ‘సార్... రోజూ 8 గంటలు పని. నెలకు లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి అక్కడికి వెళ్తే తెలిసింది... దూరపు కొండలు నునుపు అని’ అంటూ వాపోయాడు వీర్నపల్లికి చెందిన మల్లారపు రవి. ఇదే గ్రామానికి చెందిన రాజంది సైతం ఇదే పరిస్థితి. ‘అప్పు చేసి దుబయ్ పోతే వాళ్లిచ్చే జీతం తిండికే సరిపోలేదు. జ్వరమొస్తే ఆసుపత్రిలో కూడా చూపించలేదు. ఫోర్‌మెన్ ఉద్యోగమని తీసుకెళ్లి అడ్డాకూలీ పని చేయించిండ్రు. రోజుకు 12 గంటలు పనిచేయించుకున్నరు. కోపమొచ్చి వద్దామంటే పాస్‌పోర్టు గుంజుకుని జైల్లో పెట్టించిండ్రు’ అని అని జి.రాములు వాపోయాడు. దుబయ్ వెళ్లిన వాళ్లలో నూటికి 80 శాతం మంది దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని వారు చెబుతున్నారు. ఆ బాధలు పడలేక తిరిగొచ్చిన వాళ్లు కొందరైతే... ఉన్న ఊరుకొచ్చినా ఉపయోగం లేదనే భావనతో అక్కడే బతుకీడస్తున్న వారు మరికొందరున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లి నుంచి వెళ్లిన 50 మంది యువకుల్లో ఏడాది తిరగకముందే అందులో 10 మంది తమవల్ల కాదు ఆ బతుకు అంటూ తిరిగొచ్చారు. ఉన్న ఊళ్లోనే శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తే భార్యాపిల్లలతో హాయిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడే బతుకుతామంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కోరుట్ల, జగిత్యాల, వేములవాడలోనూ ఇదే పరిస్థితి! కరువు దెబ్బకు జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఊరు విడిచి దుబయ్ వలస వెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సగటున ఊరికి పది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారే. కొందరు యువకులు ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయి రాగా... మరికొందరు ఎంత కష్టమైనా, నష్టమైనా కూలీనాలీ చేసుకుంటూ విదేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ఆయా యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి శిక్షణ ఇస్తే జిల్లాలోనే ఉపాధి పొందుతూ కుటుంబంతో హాయిగా ఉంటామని చెబుతున్నారు. నరకం చూసిన.. సార్.. ఇంట్ల ఎల్లక 2 లక్షలు అప్పు చేసిన. దుబాయ్ పోతే అప్పు తీర్చి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఏజెంట్ చెబితే మరో లక్ష అప్పు చేసి గత జూన్‌లో దుబాయ్ పోయిన. అక్కడి కరెన్సీ ప్రకారం నెలకు రూ.1200 దిర్హమ్స్(రూ.21,600) జీతం ఇస్తామని ఆశపెడితే పోయిన. తీరా ఆడికిపోతే నెలకు 600 దిర్హమ్స్ ఇచ్చిండ్రు. 8 గంటలకు బదులు రోజు 12 గంటల పనిచేయించుకున్నరు. పని ఒత్తిడికి ఆరోగ్యం కరాాబైంది. వచ్చిన డబ్బులు తిండికి, నా మందులకే సరిపోయినయ్. ఆడ ఉన్నన్ని రోజులు నరకం చూసిన. ఎలాగోలా ఇక్కడికి వచ్చి ఉపాధి కూలీకి పోతున్న. అప్పులెట్లా తీర్చుడో అర్థమైతలేదు. మాలోంటోళ్లకు ప్రభుత్వం ఏదైనా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తే సర్కారు రుణం తీర్చుకుంటం. - నర్మెట శంకర్, వీర్నపల్లి మోసపోయిన.. మా ఊరినుంచి దుబాయ్ పోయినోళ్లంతా నానా కష్టాలు పడుతుండ్రు. ఈడ ఏజెంట్లు చెప్పేదొకటి, ఆడ జరిగేదొకటి. ఫోర్‌మెన్ ఉద్యోముంది... నెలకు 2 వేల దిర్హమ్స్ జీతం (రూ.36 వేలు) ఇస్తారని ఏజెంట్లు ఆశపెడితే నిజమేనని నమ్మి లక్ష రూపాయలు అప్పు చేసి దుబాయ్ పోయిన తీరా ఆడికిపోతే లేబర్ కూలీకి పెట్టిండ్రు. అందులో సగం జీతం కూడా సరిగా ఇయ్యలేదు. ఆ జీతం అక్కడ తిండికి కూడా సరిపోలేదు. మోసపోయిన. ఇక లాభం లేదని ఇంటికి పోదామనుకుంటే నా పాస్‌పోర్టు తీసుకుని నన్ను జైల్లో పెట్టించిండ్రు. మూడు నెలలు జైల్లోనే ఉండి ఎట్లాగోలా మా ఊరికొచ్చిన. ఉప్పరి పనిజేసి బతుకీడుస్తున్న. మాలాంటోళ్లకు ఏదన్నా దారి చూపాలె. - జి.రాములు, వీర్నపల్లి -
రూ. 7 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్ స్వాధీనం
అక్రమంగా విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్న 720 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట నుంచి గల్ఫ్ దేశాలకు నల్లమందు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం సాయంత్రం పాత బస్టాండ్‌లో తనఖీలు నిర్వహించి బ్రౌన్‌షుగర్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ఓ మహిళ కన్నీటి కథ
-
ఆర్థిక మాంద్యంలో గల్ఫ్ దేశాలు
-
ఆర్థిక మాంద్యంలో గల్ఫ్ దేశాలు
రాయికల్ : ఆయిల్ నిల్వల్లో ప్రపంచాన్నే శాసిస్తున్న యూఏఈ, ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యం నెలకొంది. గత రెండుమూడు నెలల నుంచి ఆ దేశాలు ఆర్థికమాంద్యంలో కొట్టమిట్టాడుతున్నాయి. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న ఈ దేశాల్లో 2008 నాటి ఆర్థికమాంద్యం మళ్లీ పునరావృతం అవుతోంది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా, అలీన్, అజ్మాన్, రసల్ఖన స్టేట్స్‌తోపాటు ఖతర్, కువైట్, ఒమన్ దేశాల్లోని చమురు కంపెనీలు తమ భవిష్యత్ ప్రణాళికలను కొంతకాలం రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆయూ కంపెనీలపై ఆధారపడిన పరిశ్రమలకు సమస్యలు చుట్టుముట్టాయి. చమురుపై ఆధారపడిన ఆయా దేశాల్లో నిర్మాణరంగం, ఫుడ్సప్లై, ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, టూరిజం తదితర రంగాల్లోని పరిశ్రమలపై ఆర్థికమాంద్యం ప్రభావం అధికంగా ఉంది. చమురు ధరలు తారాస్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్న సమయంలో గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికులు ప్రస్తుతం వేతనాలు తగ్గడంతో తమ జీవన సరళిని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దుబాయ్ పెట్రోలియం వంటి పెద్ద కంపెనీలు ఎటువంటి నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం, జీతాలు తగ్గించడంతో కార్మికులు దినదినగండంగా రోజులు వెల్లదీస్తున్నారు యూఏఈలో గత కొన్నేళ్లుగా స్థిరపడ్డ ఉద్యోగులు తమకు వస్తున్న జీతాల ఆధారంగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకున్నారు. హఠాత్తుగా జీతాలు తగ్గిపోవడంతో తీసుకున్న లోన్లు ఎలా చెల్లించాలో తెలియక క్షోభకు గురవుతున్నారు. చమురు కంపెనీలతో పాటు వాటిపై ఆధారపడిన మిగతా కంపెనీలు సైతం కార్మికులకు గత రెండుమూడు నెలలుగా జీతాలివ్వకపోవడంతోపాటు, ఉద్యోగాల నుంచి తొలగించడంతో ఆందోళనకు గురవుతున్నారు. బ్యాంకర్లు సైతం ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో కంపెనీలకు రుణాలు మంజూరు చేయకపోవడం మరొక కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.. ఖర్చులను నియంత్రించి ప్రణాళికలు వేసుకుని 2016లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను కొంతవరకు ఎదుర్కోవాలంటే చిన్నతరహా పరిశ్రమలకు మరో ఏడాదిపాటు గడ్డు పరిస్థితి తప్పదని చెబుతున్నారు. కాగా, చిన్నతరహా పరిశ్రమల్లో ఉన్న కార్మికులను సెలవులపై వెళ్లాల్సిందిగా అక్కడి రాజు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. యూఏఈలో 8 లక్షల మందికిపైగా కార్మికులు ఉన్న ఊరులో ఉపాధి కరువై లక్షల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాలకు చెందిన ఎనిమిది లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. అక్కడ ఆర్థికమాంద్యం ఏర్పడడంతో కంపెనీలు సరైన జీతాలు ఇవ్వకపోవడంతో పాటు పనిలోంచి తొలగించడంతో చేసిన అప్పులు తీర్చలేక స్వగ్రామాలకు తిరిగి రాలేక ఆందోళనకు గురవుతున్నారు. వెనక్కు వచ్చే కార్మికులకు రాష్ట్ర ఉపాధి కల్పించాలని దుబాయ్‌లోని గల్ఫ్ తెలంగాణ సంఘం సభ్యులు జువ్వాడి శ్రీనివాసశర్మ, రాజశ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరిస్థితులు బాగా లేవు ఆర్థికమాంద్యం కారణంగా యూఏఈలో గత రెండుమూడు నెలల నుంచి పరిస్థితులు బాగా లేవు. పెద్దపెద్ద కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. - రాజశ్రీనివాసరావు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి ఆర్థికమాంద్యం వల్ల తెలంగాణకు చెందిన కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ చొరవచూపి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. - శ్రీనివాసశర్మ, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం ఫౌండర్ మెంబర్ ఏజెంట్లను నమ్మి రావద్దు యూఏఈ, ఖతర్, ఒమన్ దేశాల్లో ఆర్థికమాంద్యంతో ఉద్యోగాలు ఊడుతున్నారుు. తెలంగాణ నుంచి నిరుద్యోగులు ఏజెంట్ల మాయమాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు రావద్దు. - శ్రీనివాసరావు, గల్ఫ్ తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
సరిహద్దులు మూసేస్తాం..
- సోదర దేశాలుగా మీకు బాధ్యత లేదా? - సిరియా శరణార్థుల అంశంలో గల్ఫ్ దేశాలపై ఫ్రాన్స్ మండిపాటు - శీతాకాలంలో ఈయూ ద్వారాలు మూసేస్తామని వెల్లడి పారిస్: సిరియా శరణార్థుల విషయంలో గల్ఫ్ దేశాలపై ఫ్రాన్స్ మండిపడింది. ఇప్పటికే లెక్కకు మించి శరణార్థులకు ఐరోపా దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయని, ఇకపై ఆ బాధ్యతను గల్ఫ్ దేశాలు పంచుకోవాలని సూచించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుల్ వాల్స్ శుక్రవారం రాత్రి పారిస్‌లో మీడియాతో మాట్లాడుతూ సిరియాకు సమీపంగా ఉండే సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాలు శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో అలసత్వం వహించాయని, ఇప్పటికైనా ఆ దేశాలు వాటి బాధ్యత నిర్వర్తించాలన్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాల్లో దాదాపు 8 లక్షల మంది సిరియన్లు ఆశ్రయం పొందుతున్నారని, వారందరికీ వసతులు కల్పించడం ఎలాంటి దేశానికైనా సవాలేనని, శీతాకాలంలో ఆ పని మరింత కష్టసాధ్యమని వాల్స్ అన్నారు. నిరోధించలేని విధంగా శరణార్థులు వస్తుండటంతో సరిహద్దులు మూసివేయాలని ఈయూ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వాల్స్ తెలిపారు. ' నేను మళ్లీ మళ్లీ ఇదే చెప్తున్నా. ఇకపై యూరప్ లోకి శరణార్థులను అనుమతించబోం. అన్ని దేశాలు.. ప్రధానంగా గల్ఫ్ దేశాలు శరణార్థుల బాధ్యత పంచుకోవాలి. ఈ మేరకు కొద్ది రోజుల్లోనే సరిహద్దులు మూసేస్తాం' అని వాల్స్ స్పష్టం చేశారు. సిరియాలో శాంతి స్థాపన ఒక్కటే ఈ సంక్షోభానికి పరిష్కారమని, ఆ దేశంలో రాజకీయ సుస్థిరతకు ప్రపంచం సహకరించాలని వాల్స్ పిలుపునిచ్చారు. -
తెరపై గల్ఫ్ గాథలు
పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి అక్కడ నానా కష్టాలు ఎదుర్కొంటున్న భారతీయుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గల్ఫ్’. పి.సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గల్ఫ్ దేశాల్లో చాలా మందిని కలిసి వారి నుండి సమాచారాన్ని సేకరించాను. 500 కేస్ స్టడీస్‌తో యథార్థ ఘటనల ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నాను. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. దుబాయ్, కడప, సిరిసిల్ల ప్రాంతాల్లో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం. థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘శ్రావ్య ఫిలింస్ బ్యానర్లో మేం రూపొందిస్తున్న 14వ సినిమా ఇది. సునీల్ కుమార్ అహర్నిశలూ కష్టపడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను తయారు చేశారు. ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో మైగ్రెంట్ అసోసియేషన్ ప్రతినిధి భీంరెడ్డి, లాయర్ అనురాధ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి.బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరామ్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి. -
విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో కేటీఆర్ భేటీ
న్యూఢిల్లీ: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వాసుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ .. విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులను కోరారు. శుక్రవారం కేటీఆర్.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను కలిశారు. గల్ఫ్ లో తెలంగాణ వాసుల కష్టాల గురించి చర్చించారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నవారికి క్షమాభిక్ష ప్రసాదించి, వారు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టు కేటీఆర్ చెప్పారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి వివరాలతో ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. -
గల్ఫ్ నకిలీ ఏజెంట్ల అరెస్టు
మెట్పల్లి(కరీంనగర్): ముగ్గురు గల్ఫ్ నకిలీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలో పలువురి నుంచి వేల రూపాయలు వసూలు చేసిన వీరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వీరిని ఈ రోజు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 266 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాహుబలికి షాక్ ఇచ్చిన బ్రూస్లీ