సీఎంను కలిసిన ‘గల్ఫ్‌ సమన్వయకర్తలు’  | Gulf Countries YSRCP Leaders Meets CM YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన ‘గల్ఫ్‌ సమన్వయకర్తలు’ 

Published Fri, Aug 25 2023 4:23 AM | Last Updated on Fri, Aug 25 2023 4:23 AM

Gulf Countries YSRCP Leaders Meets CM YS Jagan mohan reddy - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జ్ఞాపికను అందిస్తున్న దృశ్యం 

సాక్షి, అమరావతి: గల్ఫ్‌ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సమన్వయకర్తలు, వైఎస్సార్‌సీపీ కన్వినర్లు గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం  జగన్‌ను కలిశారు. గల్ఫ్‌ దేశాల్లోని ఏపీ వాసులకు అందిస్తున్న సాయం.. వారి సంక్షేమా చర్చించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నట్లు  వివరించారు.

సమావేశంలో డిప్యూటీ సీఎం(మైనార్టీ వెల్ఫేర్‌) అంజాద్‌ బాషా, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌ ఎస్‌.మేడపాటి, కువైట్‌ ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌లు నాయని మహేష్‌రెడ్డి, ఎంవీ నరసారెడ్డి, దుబాయ్‌ కోఆర్డినేటర్‌ సయ్యద్‌ నాసర్‌ వలీ, వైఎస్సార్‌సీపీ గల్ఫ్‌ కన్వినర్‌ బీహెచ్‌ ఇలియాస్, కువైట్‌ కన్వి నర్‌ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్‌ కన్వి నర్‌ డి.శశికిరణ్, దుబాయ్‌ కన్వినర్‌ సయ్యద్‌ అక్రమ్, సౌదీ అరేబియా కన్వినర్‌ రెవెల్‌ ఆంథోని తదితరులు పాల్గొన్నారు. సీఎంకు హజ్‌ పవిత్ర జలం డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌ బాషా, హజ్‌ కమిటీ చైర్మన్‌ బీఎస్‌ గౌస్‌ గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి హజ్‌ పవిత్ర జలాన్ని అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement