Anjadbasa
-
ప్రవాసీయుల సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్!
సౌదీలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మొత్తం భారతదేశంలోకెల్లా ఎక్కువగా ప్రవాసీయుల సంక్షేమానికి వైఎస్ జగన్ సర్కారే పెద్ద పీఠం వేస్తుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పెర్కోన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా భీమా పథకం విజయవంతంగా అమలవుతుందని తద్వారా అకాల మరణం పాలైన అనేక మంది ఆభాగ్యులకు ఆపన్నహస్తం లభిస్తుందని ఆయన అన్నారు. మక్కా యాత్రకు వచ్చిన అంజద్ బాషా జెద్ధాలో తనను కలిసిన ప్రవాసీయులను, సౌదీ అరేబియా తెలుగు అసోసియెషన్ (సాటా) ప్రతినిధులతో మాట్లాడుతూ.. దేశంలో ఆదర్శవంతంగా ప్రచారంలో ఉన్న కేరళ రాష్ట్రం కంటె కూడ మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలోని ఏపీ ఎన్నార్టీ సంస్ధ పని చేస్తుందని అన్నారు. కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలలో ఏపీ ఎన్నార్టీ సంస్ధ చురుక్కుగా ఉందని ఆయన అన్నారు. విదేశాలలో తెలుగు వారందరు కలిసి మెలిసి ఉండాలని, ఇక్కడ కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగుతనంతో కలుపుకోలుగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కుల,మత, ప్రాంతీయ విబేధాలకు అతీతంగా ఇక్కడ తెలుగువారు కలిసిఉండి, భారతీయ ప్రతిష్ఠను పెంపొందించాలని పిలుపునిచ్చారు. సామాజిక సేవలో సాటా పని తీరును వివరించగా ఆయన వారిని అభినందించారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శివ సైమన్ పీటర్, రాంబాబు, శాంతి, శ్రీమతి నాగరాజు, ఫైజ్, ఖాదర్ వలీలు ఉన్నారు. తన పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి సౌదీలోని దక్షిణ ప్రాంతంలోని ఆభాలో సాటా అధ్వర్యంలో జరిగిన భారతీయ సమ్మేళాన్ని కూడా వీడియో కాల్ ద్వారా సంబోధించారు. (చదవండి: యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీ నియామకం) -
రణన్నినాదం
సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రింగ్‌రోడ్డు సర్కిల్ నుంచి శివాలయం వరకు మెయిన్‌రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు ఎంతో మేలు మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖాన్ చెప్పారు. ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు. దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. పేదల బతుకుల్లో వెలుగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా చేశారన్నారు. డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. సంక్షేమ సారథి.. జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు. -
జనం.. జైత్రయాత్ర
రాష్ట్రంలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. కర్నూలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. సీఎం జగన్ పాలనలో తాము సాధించిన సాధికారతను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అవహేళన చేసి కించపరిస్తే.. జగన్ వారందరినీ చేయిపట్టి అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఎన్నడూలేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. బడుగులకు లబ్ధి చేకూర్చి వారి అభివృద్ధికి బాటలు వేశారు. పదవుల్లోనూ అధిక ప్రాధాన్యమిచ్చిన ఏకైక సీఎం జగన్’ అని వివరించారు. నందిగామ (పెనుగంచిప్రోలు): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం సాయంత్రం నందిగామలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు. యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి యాత్రకు తరలివచ్చిన వారితో పట్టణంలోని వీధులన్నీ కిటకిటలాడాయి. జై జగన్.. జగనే కావాలి అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. పట్టణంలోని గాంధీ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలి వచ్చారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుని వదిలేయగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పటంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రులు, నేతలు పిలుపునివ్వటంతో ప్రజలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. జగనన్న పాలనలో సామాజిక విప్లవం : మంత్రి మేరుగు నాగార్జున సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని కోరుకున్నారని, వారి ఆశయాలను సాధ్యం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవహేళన చేస్తూ చంద్రబాబు అన్నమాటలను ఎవరూ మరచి పోరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన లీడర్ ఒక్క జగనే అని అన్నారు. చంద్రబాబు ఒక గజదొంగ అని, చట్టాలను అనుకూలంగా మార్చుకుని బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాశారని చెప్పారు. సామాజిక సాధికారత విధానంగా...: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక సాధికారత ఒక నినాదంగా కాకుండా విధానంగా అమలు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని విధాలుగా మోసం చేశారని చెప్పారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే ఈ వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నాయన్నారు. కేబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి కేబినెట్లోనే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. శాసనçÜభలో, శాసన మండలిలో నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం రూ.2,650 కోట్లు కేటాయిస్తే, సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలోనే రూ.23,175 కోట్లు ఖర్చు చేశారన్నారు. జగనన్నను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి..: జోగి అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తిగా, పూలే ఆలోచనలను జోడించి సీఎం సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో సామాజిక న్యాయం ఒక్క జగన్ వల్లనే సాధ్యమైందన్నారు. చంద్రబాబు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆనక కనకమేడల రవీంద్రకు కేటాయించటం బడుగు, బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న వైఖరి అర్ధమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో అందరూ జగన్‌కు మద్దతు పలకాలన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, పెనమలూరు ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, సామినేని ఉదయభాను, కైలే అనిల్‌కుమార్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
మైదుకూరులో సాధికార మహోత్సవం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సోమవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఓ మహోత్సవంలా సాగింది. వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు పాదయాత్రగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి వీధివీధిలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. బాణాసంచా, డప్పు వాయిద్యాల నడుమ యాత్ర పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడ అశేష జనవాహిని మధ్య బహిరంగ సభ జరిగింది. సభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. సీఎం జగన్ పేరు విన్న ప్రతిసారీ ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అని నినాదాలు చేస్తూ సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. సామాజిక సాధికారత నినాదం కాదు మా విధానం: ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సామాజిక సాధికారత ఓ నినాదంగానే మిగిలిపోయిందని, ఆ కలను సాకారం చేసి బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి బాటలు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్‌బాషా చెప్పారు. వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతలను విధానంగా మార్చుకుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకొని, కేబినెట్ సహా అన్ని పదవుల్లో అధికభాగం ఇచ్చి, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల్లోనూ అత్యధిక భాగం ఈ వర్గాలకే ఇస్తూ ఆర్థికంగా బలం చేకూరుస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకీ మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, సీఎం జగన్ మంత్రి పదవితోపాటు నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని, నదులు, రిజర్వాయర్లు, చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. ఇటీవల జిల్లాలో చంద్రబాబు, లోకేశ్ అడుగు పెట్టగానే కరువు మొదలైందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌కు బహుజనులు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయం దక్కుతోందని, ఆకలితో ఉన్నవాడు రాజ్యమేలాలని ఆయన సంకల్పించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు. చంద్రబాబు ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడితే, అదే ఎస్సీలు తలెత్తుకొని బ్రతకాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే అగ్రవర్ణాల పిల్లల్లానే పేదల పిల్లలూ ఉన్నత స్థితికి ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని తెలిపారు. పేదలంతా చదువుకోవాలని కాంక్షిస్తూ అమ్మ ఒడి పథకం తెచ్చారన్నారు. పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్న జగన్ : మంత్రి విడదల రజిని సీఎం పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్నారని రాష్ట్ర మంత్రి విడదల రజిని అన్నారు. రాష్ట్రానికి గొప్ప నాయకత్వాన్ని అందించిన జిల్లాగా కడపలో ప్రతి గడప గర్వపడేలా వైఎస్ జగన్ పాలన సాగుతోందన్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీలు ఉండడం సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. బీసీల తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రణ నినాదం మోగుతోంది : ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్‌రావు సీఎం జగన్ ఏపీలో విప్లవాత్మక మార్పులు తెచ్చి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నారని ప్రభుత్వ సలహాదారు (సాంఘిక సంక్షేమం) జూపూడి ప్రభాకర్‌రావు చెప్పారు. స్వార్థం లేకుండా పేదల తరపున సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారన్నారు. పేదలకు భూములందించాలని అంబేడ్కర్ సంకల్పిస్తే, సీఎం జగన్ ఆచరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ ప్రసంగించారు. -
సీఎంను కలిసిన ‘గల్ఫ్ సమన్వయకర్తలు’
సాక్షి, అమరావతి: గల్ఫ్ దేశాలకు చెందిన పలువురు ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయకర్తలు, వైఎస్సార్సీపీ కన్వినర్లు గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. గల్ఫ్ దేశాల్లోని ఏపీ వాసులకు అందిస్తున్న సాయం.. వారి సంక్షేమా చర్చించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నట్లు వివరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం(మైనార్టీ వెల్ఫేర్) అంజాద్ బాషా, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్.మేడపాటి, కువైట్ ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కోఆర్డినేటర్లు నాయని మహేష్‌రెడ్డి, ఎంవీ నరసారెడ్డి, దుబాయ్ కోఆర్డినేటర్ సయ్యద్ నాసర్ వలీ, వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వినర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ కన్వి నర్ ముమ్మడి బాలిరెడ్డి, ఖతార్ కన్వి నర్ డి.శశికిరణ్, దుబాయ్ కన్వినర్ సయ్యద్ అక్రమ్, సౌదీ అరేబియా కన్వినర్ రెవెల్ ఆంథోని తదితరులు పాల్గొన్నారు. సీఎంకు హజ్ పవిత్ర జలం డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా, హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి హజ్ పవిత్ర జలాన్ని అందజేశారు. -
చంద్రబాబుకు కావాల్సిందే మారణహోమం
కడప కార్పొరేషన్: ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు ఆద్యంతం హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా విమర్శించారు. ఆదివారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో బరితెగించిన చంద్రబాబు మాటలు, ఉచ్ఛ నీచాలు మరిచి చేసిన వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతున్నాయన్నారు. అడ్డూ అదుపు లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు, గలాటాలు, అల్లర్లు రేపి విధ్వంసం సృష్టించాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై, ఆయన కుటుంబంపై కొన్ని రోజులుగా సంస్కారహీనంగా, బజారు మనిషిలాగా బాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు రెచ్చగొడుతూ చేసిన కామెంట్లతోనే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. పోలీసులు ఎంత చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినకుండా కేకలు వేస్తూ, తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారన్నారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడటం దారుణమన్నారు. వాహనాలను తగులబెట్టి పోలీసులను గాయపరచడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. అంతిమంగా చంద్రబాబుకు కావాల్సింది మారణ హోమమేనని, 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇంత రాక్షసత్వానికి పాల్పడటం దారుణమని, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయాలని అంజద్‌బాషా డిమాండ్ చేశారు. -
ఇకపై ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్ర
సాక్షి, విజయవాడ: మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికులు నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంబార్కింగ్ పాయింట్ సాధించామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మొదటి ప్లోర్లోని సీసీఎల్ఏ కాన్ఫరెన్స్ హాల్లో మైనార్టీ శాఖ సెక్రటరీ ఎ.ఎం.డి. ఇంతియాజ్, హజ్ కమిటీ ఛైర్మన్ బి.ఎస్. గౌస్ లాజమ్ ఆధ్వర్యంలో జరిగిన హజ్ కమిటీ సమన్వయ సమావేశంలో మంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుండి 1,813 మంది యాత్రికులను నేరుగా పవిత్ర హజ్ యాత్రకు పంపడం జరుగుతుందన్నారు. 7 జూన్, 2023 నుండి 19 జూన్, 2023 వరకు కొనసాగనున్న హజ్ యాత్రలో భాగంగా ప్రతి రోజూ 155 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తగా ఎంబార్కేషన్ పాయింట్ వచ్చాక వివిధ ఎయిర్ లైన్స్ ఏపీ నుండి యాత్రికులను హజ్‌కు తీసుకెళ్లి మళ్లీ హజ్ నుంచి ఏపీకి తీసుకువచ్చే విధంగా ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు. హైదరాబాద్, బెంగుళూరు ఎంబార్కేషన్ నుండి వెళ్లే ప్రతి ఒక్క యాత్రికుడి మీద రూ.80,000 అదనంగా భారం పడుతున్న పరిస్థితుల్లో సీఎం జగన్ ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింథియా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చించి హజ్ యాత్ర టికెట్ ధరను తగ్గించాలని కోరామన్నారు. తగ్గించలేని పరిస్థితుల్లో తమ రాష్ట్రం నుండి హజ్ కు వెళ్లే యాత్రికులను హైదరాబాద్, బెంగుళూరు నుండి వెళ్లే విధంగా అనుమతించాలని కోరామన్నారు. ఈ విషయమై పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు చెప్పినట్లు అంజాద్ బాషా వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ప్రతి ఏటా యాత్రికుడిపై విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చుకు అదనంగా ఒక్కొక్కరికి రూ. 80,000ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం విశేషమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కి మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ యాత్రికుల తరపున అంజాద్ బాషా కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరు వద్ద గల మదరసాలో వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాత్రికుల లగేజ్‌ను మదరసాలోనే స్కానింగ్ చేసి అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టుకు తరలించేలా ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. అదే విధంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 ఏసీ బస్సుల ద్వారా యాత్రికులను మదరసా నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు పంపించే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా మదరసా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు. హజ్‌కు వెళ్లే యాత్రికులు వసతి కేంద్రం వద్దకు 24 గంటల ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేయాలని అంజాద్ బాషా కోరారు. మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ ఇంతియాజ్ మాట్లాడుతూ 7 జూన్, 203 నుండి 19 జూన్, 2023 వరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హజ్‌కు బయలుదేరే యాత్రికుల యాత్ర సవ్యంగా సాగాలని ఆకాంక్షించారు. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, హజ్ కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం.నవాబ్ బాషా, ఎమ్మెల్సీ, హజ్ కమిటీ సభ్యులు ఇసాక్, మైనార్టీ శాఖ సలహాదారు ఎస్.ఎం. జియావుద్దీన్, ఏపీ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవాబ్ ఖాదర్ సాబ్, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, ఆర్డీవోలు, ఎయిర్ లైన్స్ అధికారులు, గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ, కస్టమ్స్, బ్యాంకర్లు, ఆర్టీసీ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్ అండ్ బీ, బీఎస్ఎన్ఎల్, ఫైర్ సర్వీసు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ జిల్లాలో ఒక్కరోజే 15 కరోనా కేసులు’
సాక్షి, కడప (వైఎస్సార్ జిల్లా) : ఫాతిమా కళాశాలలో కోవిద్ 19 వైద్యశాలను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 200 మందిని పరీక్షించగా, ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మరో 25 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పించి సిబ్బంది కొరత లేకుండా చూశామన్నారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా వినియోగిస్తామన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి వారందరికీ నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఇస్తిమాకు వెళ్లిన వారందరిని గుర్తించి క్వారంటైన్లో ఉంచామని, అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సమాచారం అందించి అధికారులకు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. ఒక్కరోజే 15 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారని, ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలను మూసివేసినట్లు తెలిపారు. ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. -
ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు
-
సీఎం జగన్ చేతికి ఎముక ఉందా?
సాక్షి, రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి నాయకుల వల్లే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. అడగకుండానే సీఎం జగన్ అన్నీ చేసేస్తున్నారని, ఆయన చేతికి ఎముక ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోందని అన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ... అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. తాను రెండుసార్లు మంత్రిగా పనిచేసినా రాయచోటిలో ఇంత అభివృద్ధి చేయలేకపోయానని, ఇందుకు సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు. ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా మొదటి ఆరు నెలల్లోనే వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. (చదవండి: రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం) -
ఇది చంద్రబాబు కడుపు మంట
పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, యువతకు ఉద్యోగాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? – టీడీపీకి ఉప ముఖ్యమంత్రుల ప్రశ్న సాక్షి, అమరావతి : చెరువులో చేప ఒడ్డున పడితే ఎలా గిలగిల లాడుతుందో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, కళత్తూరు నారాయణస్వామి, షేక్ బేపారి అంజాద్ బాషలు మండిపడ్డారు. ప్రజా రంజకంగా సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై కరపత్రం విడుదల చేసి లేని పోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అర్ధంతరంగా పారిపోయి వచ్చిన తుగ్లక్ చంద్రబాబు అని, ఆయన ప్రకటించిన చార్జిషీటులో నిజాలేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. అధికారం పోయిందన్న కడుపు మంట చంద్రబాబుకు ఎంత ఉందో వారి కరపత్రం చూస్తే తెలుస్తోందన్నారు. ‘నా ఇల్లు ముంచేశారు.. నేను కట్టిన ప్రజా వేదికను కూల్చేశారు..’ అనే రెండు మాటలే మూడు నెలలుగా చంద్రబాబు నోట వెలువడుతున్నాయన్నారు. టీడీపీ కరపత్రం మొదట్లోనే అక్రమ కట్టడాన్ని కూల్చిన ఫొటో వేశారని వారు తప్పు పట్టారు. అందులోని అంశాల వారీగా స్పందిస్తూ శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ఏడాది కూడా శ్రీశైలం, నాగా ర్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండలేదన్న నిజాన్ని కరపత్రంలో ఇవ్వకుండా దాచారని తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికులకు జగన్ ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని పేర్కొ న్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ లంచాల కోసం చంద్రబాబు విద్యుత్ సంస్థలకు దాదాపు రూ.20 వేల కోట్లు నష్టం తీసుకు వచ్చాడన్న విషయాన్ని మీడియా ఎందుకు రాయడం లేదని వారు ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లకు చంద్రబాబు ప్రభుత్వం పైసా విడుదల చేయలేదని స్పష్టీకరించారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? అమ్మ ఒడి స్కీం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఐదేళ్లలో బాబు ఏ తల్లికి అయినా రూపాయి ఇచ్చారా? అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు నిలిపివేశారన్నారే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1500 కోట్లని చెప్పిన చంద్రబాబు మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018కే గ్రావిటీపై నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట ఏమైంది? టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం నిజం కాదా? చంద్రబాబు తన అవినీతి బయటపడుతుందని రివర్స్ టెండరింగ్ విధానాన్ని వ్యతిరేకించారు. పోలవరం డ్యాం భద్రత ప్రశ్నార్థకం అయ్యిందని చార్జిషీటులో రాశారు. సిమెంటు, ఇనుముతో చంద్రబాబు పునాదుల నుంచి సవ్యంగా కడితే దాని భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదు. మరి ఆ డబ్బు తినేసి బూడిదతో కట్టారా? 2014 జూన్ 8నే రుణమాఫీ చేసేశామని చంద్రబాబు చెప్పారు కదా? రుణ మాఫీ చేసి ఉంటే బకాయిల ప్రస్తావన ఎందుకొస్తుంది? రూ.87,612 కోట్ల అప్పులను రూ.24,500 కోట్లకు కుదించి చివరకు అందులోనూ రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా? మీరు నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించడం నిజం కాదా? వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏకంగా 4.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం నిజం కాదా? అసెంబ్లీ సమావేశాలు పూర్తికాకుండానే అమెరికా పారిపోయిన చంద్రబాబు తనకు మైకు ఇవ్వలేదని ఎందుకు మాట్లాడుతున్నారు? పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన జీవోను పట్టుకుని బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేసే వ్యూహం అంటూ ప్రచారం చేయడం దిగజారుడుతనం కాదా? ఉప ముఖ్యమంత్రుల ప్రతికా ప్రకటన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అల్లాహ్ సాక్షిగా.. అంజద్‌కు డిప్యూటీ సీఎం
కడప కార్పొరేషన్: కడప శాసన సభ్యులు షేక్ బేపారి అంజద్‌బాషాను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. జిల్లా చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా ఈ పదవి అందుకున్న నేతగా అంజద్‌బాషా రికార్డు సృష్టించారు. గతంలో డా. ఖలీల్‌బాషా, హాజీ అహ్మదుల్లా మంత్రులుగా పనిచేసినా ఆపై పదవులు లభించలేదు. ప్రస్తుతం వైఎస్ కుటుంబానికి విధేయుడిగానేకాక సౌమ్యుడు, సహనశీలి, అయిన ఆయనను ముస్లిం సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ముస్లిం మైనార్టీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గం నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించినా అన్ని సమీకరణల్లోనూ అంజద్‌బాషా అగ్రస్థానంలో నిలిచి ఉప ముఖ్యమంత్రి పదవి చేజిక్కించుకున్నారు. కేబినెట్లో ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖ దక్కింది. 2014లో మొదటి సారి ఎమ్మెల్యేగా 45వేల మెజార్టీతో గెలుపొందిన ఆయన 2019లో రెండోసారి 54వేల పైచిలుకు మెజార్టీతో తన బలాన్ని పెంచుకున్నారే తప్ప తగ్గించుకోలేదు. వైఎస్ఆర్సీపీ మైనార్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలను ఏకం చేసి వారిని వైఎస్ఆర్సీపీ వైపు మళ్లించేలా చేసిన కృషికి ఇప్పుడు గౌరవం దక్కింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉంటూ జిల్లా కేంద్రమైన కడపలో పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆర్థికంగా కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. ఇదే ఆసరాగా తీసుకొని టీడీపీ ప్రభుత్వం ఆయనకు భారీ నజరానా ప్రకటించి, మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపినా తృణప్రాయంగా వదిలేశారే తప్పా ఆవైపు మొగ్గు చూపలేదు. ఇవన్నీ ప్రస్తుతం సమీకరణాల్లో కలిసొచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన అల్లాహ్ సాక్షిగా అంటూ ప్రమాణ స్వీకారం చేసి తనకున్న దైవ భక్తిని చాటుకున్నారు. -
ఉక్కు ఉద్యమంపై లాఠిన్యం
కడప సెవెన్‌రోడ్స్: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాలుగురోజులుగా జిల్లాలో పాదయాత్రలు నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. వైఎస్సార్ విద్యార్థి విభాగం, ఎన్ఎస్యూఐ సంఘీభావంగా పాల్గొన్నాయి. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులపై విరుచుకుపడి లాఠీలు ఝళిపించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఆర్ నాయక్ స్పృహ కోల్పోయారు. విద్యార్థులు ఆయనను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో మళ్లీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడమంటే కాలయాపన కోసమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంటుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయని ఓ వైపు చెబు తూనే టాస్క్ ఫోర్స్‌కు శ్రీకారం చుట్ట డం దేనికని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. అధికా రంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మోసగించిన నేరంలో ప్రధాని మోదీ ప్రథమ ముద్దాయి కాగా, చంద్రబాబు రెండవ ముద్దాయని చెప్పారు. విశాఖలో ఎలాంటి సదుపాయాలు లేకపోయినా అప్పట్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో విద్యార్థి, యువకులే ప్రధానంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడం ద్వారా మాట నిలుపుకోవాలని, లేకుంటే ప్రజలు తగిన బుద్ది చెబు తారని హెచ్చరిం చారు. స్టీల్ ప్లాంటు ఏర్పాటు విషయంలో చిత్తశుద్ది లేని టీడీపీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ రాయలసీమలోని నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు, బి. నారాయణ, పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, వైఎస్సార్ యువజన విభాగం నాయకులు చల్లా రాజశేఖర్, విద్యార్థి నాయకుడు ఖాజా రహమతుల్లా, జనసేన విద్యార్థి విభాగం నాయకుడు గంగిరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి తిరుమలేశ్, పీడీఎస్‌యూ నాయకులు అంకన్న, సీపీఎం నాయకులు రామ్మోహన్‌రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
కల్వర్డు, సీసీ రోడ్డుకు భూమి పూజ
కడప కార్పొరేషన్: శుక్రవారం స్థానిక 24వ డివిజన్లో నమస్తే బోర్డు వద్ద రూ.15లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కల్వర్టుకు, రూ.7లక్షల బీపీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డుకు నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం కడప నగరాభివృద్ధికి వెచ్చించిన నిధులు శూన్యమన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే కడపను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాసులు, ఏఈలు దిల్షాద్, స్వరూప, కో ఆప్షన్ సభ్యురాలు బండి సరోజ, వైఎస్ఆర్సీపీ నాయకులు బండిబాబు, షఫీ, సీపీసీ అధినేత సూర్యనారాయణరావు పాల్గొన్నారు. -
టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం
కడప కార్పొరేషన్: తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది శూన్యమని నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా విమర్శించారు. స్థానిక 13, 14 డివిజన్ల పరిధిలోని ప్రకాష్‌నగర్‌లో రూ.30లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన సిమెంటు రోడ్లకు వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మాటల ప్రభుత్వమే తప్పా చేతల ప్రభుత్వం కాదన్నారు. ఏ హామీలు నెరవేర్చని టీడీపీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని తెలిపారు. కడప నగరంలో అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులు, కార్పొరేషన్ సాధారణ నిధులతోనే చేపడుతున్నామని వివరించారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ప్రజల్లో వారికి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రకాష్‌నగర్‌లో కాలువలు నిర్మించి డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మహిళలు వారి దృష్టికి తీసుకొచ్చారు. డీఈ కరిముల్లాఖాన్, కార్పొరేటర్ మాచవరం రామలక్ష్మణ్‌రెడ్డి, 14వ డివిజన్ కార్పొరేటర్ కె. బాబు, నాయకులు కిరణ్, షఫీ, ఏ. బాబు, చరన్, నాయక్, సాయిరాం పాల్గొన్నారు. -
రాష్ట్రంలో హిట్లర్‌కు మించిన పాలన
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో నియంత హిట్లర్‌కు మించిన పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం బంద్ చేస్తున్న వారిని పోలీసులతో అరెస్టులు, గృహనిర్భందాలు చేయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టులు చేశారని, లాఠీలతో కొట్టారని, మహిళలని చూడకుండా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామునే తమను అరెస్ట్ చేశారని, కార్యకర్తల వాహనాలను సీజ్ చేసి, రహదారులపై పోలీసులతో కవాతు నిర్వహించి భయానక వాతావరణం సృష్టించారని ధ్వజ మెత్తారు. చంద్రబాబు కుటిల రాజకీయానికి ఈ అక్రమ అరెస్టులే పరాకాష్ట అన్నారు. ప్రయణికులు లేకపోయినా బంద్‌ను విఫలం చేసేందుకు బలవంతంగా బస్సులు నడిపి ప్రభుత్వమే ఆర్టీసీ నష్టాలకు కారణమయ్యిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం వల్ల బంద్ విజయవంతమైందన్నా రు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనే టీడీపీ, బీజేపీ రహస్య ఒప్పందాలు బహిర్గతమయ్యాయన్నారు. టీడీపీ మాకు ఇప్పటికీ మిత్రపక్షమేనని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారని, భవిష్యత్తులో కూడా కలిసే ముందుకు సాగుతామని కూడా చెప్పారని గుర్తు చేశారు. రాజ్‌నాథ్‌సింగ్ మాటలను ఏ ఒక్క టీడీపీ ఎంపీ కూడా ఖండించలేదన్నారు. హోదా కావాలని, రావాలనే ఆకాంక్ష చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాని చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదా సంజీవనా, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూటర్న్ తీసుకొని హోదా కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ సారథ్యంలో వైఎస్ఆర్సీపీ అలుపెరుగని పోరాటాలు చేసిందని, విజయవాడ వేదికగా వైఎస్ జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా 14 యువభేరిలు నిర్వహించారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఆనాడు ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ మాట్లాడితే అది ముగిసిన అధ్యాయమంటూ అవహేళన చేసిన చంద్రబాబు, మంత్రులు అవే విషయాలను నేడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్చే పార్లమెంటులో మాట్లాడించారని ఎద్దేవా చేశారు. ప్రధాని ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టంగా చెప్పిన త ర్వాత కూడా టీడీపీ ఎంపీలు పార్లమెంటు ప్లకార్డులు ప్రదర్శించడంలో అర్థం లేదని, వెంటనే వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జెండాలను, అజండాలను పక్కనబెట్టి ఉద్యమిస్తేనే హోదా సాధించుకోగలమని తెలిపారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, మైనార్టీ నగర అధ్యక్షుడు షఫీ, ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు త్యాగరాజు పాల్గొన్నారు. -
టీడీపీ మోసాలను గమనించాలి
కడప కార్పొరేషన్ : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తెలిపారు. శనివారం స్థానిక 35వ డివిజన్ నకాష్‌లో రూ.20లక్షల బీపీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లకు వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ లోతట్టు ప్రాంతమైన నకాష్‌లో వర్షాలు వస్తే అన్ని రోడ్లు, కాలువలు వరదనీటిలో మునిగిపోతుంటాయన్నారు. ఈ పరిస్థితిని గమనించి రోడ్లను ఎత్తు పెంచి నిర్మిస్తున్నామన్నారు. కడప నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా నిధులు ఇవ్వలేదని, కేంద్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ జనరల్‌ఫండ్ నుంచే పనులు చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నియంత పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలో తాగునీటి సమస్య నివారణకు అమృత్ స్కీం కింద 12 జీఎల్‌ఎస్‌ఆర్‌లు, కొత్త పైపులైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఆరు మాసాల్లోనే కడపను ఆదర్శ నగరంగా మారుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎస్ఏ షంషీర్‌బాషా, పాకా సురేష్, చైతన్య, రామలక్ష్మణ్‌రెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ, నాయకులు వీరారెడ్డి, సీహెచ్ వినోద్, డి.శివప్రసాద్, కరిముల్లా, షఫీ పాల్గొన్నారు. -
అలా కలెక్టర్ చెప్పడం దారుణం : వైఎస్సార్సీపీ
సాక్షి, కడప: పోలీసుల రక్షణలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టండని జిల్లా కలెక్టర్ చెప్పడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నేతలు సురేష్ బాబు, అమర్నాధ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది జన్మభూమి నుంచి ఇప్పటి వరకు ఒక్క అర్జీని కూడా టీడీపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పోలీసుల రక్షణ కావాలని అంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్ కార్డుకానీ, ఇళ్ల స్థలాలు, ఫించన్లు కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. జననేత జగన్ చేస్తున్న పాదయాత్రను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రతో టీడీపీ పునాదులు కదలడం ఖాయమన్నారు. -
తప్పు చేసినందుకే బాబుకు భయం
♦ రాజధాని భూ దందాపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే ♦ ఆధారాలిస్తే చర్యలు తీసుకుంటామనడం హస్యాస్పదం ♦ దొంగ చేతికి ఎవరైనా తాళాలిస్తారా...? ♦ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి ♦ మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా కడప కార్పొరేషన్ : రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాగించిన భూ ఆక్రమణపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు. వారు అక్రమాలకు పాల్పడినందుకే విచారణకు జంకుతున్నారన్నారు. శుక్రవారం ఇక్కడి వైఎస్ఆర్సీసీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్‌బాబు, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫలానా ప్రాంతంలో రాజధాని వస్తుందని తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు వారి బినామీలు భూములు కొన్న తర్వాత రాజధానిని ప్రకటించారన్నారు. బలహీన వర్గాల వారి భూములు మాత్రమే ల్యాండ్ ఫూలింగ్లోకి పోయేలా మార్కింగ్ వేశారన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తే, ఆధారాలివ్వండి చర్యలు తీసుకుంటామన్నారే తప్ప విచారణకు ముందుకు రాకపోవడం చూస్తుంటే తప్పు చేసినట్లేనన్నారు. దొంగచేతికి ఎవరైనా తాళాలిస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు. రాజధాని కోసం 25 వేల ఎకరాల ఫారెస్ట్ భూములు తీసుకున్నారని, అందుకు బదులుగా వైఎస్ఆర్ జిల్లాలో 50 వేల ఎకరాల భూములు ఇవ్వడానికి ప్రతిపాదించడం అత్యంత దుర్మార్గమన్నారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, జిల్లాకు ఉక్కు పరిశ్రమ, ఉర్దూ యూనివ ర్సిటీ వంటి వాటికి కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని చెప్పారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయిన ముఖ్యమంత్రి.. ఆ పార్టీ ఎంపీలను కూడా దీనిపై గట్టిగా ప్రశ్నించవద్దని నియంత్రిస్తున్నారని తెలిపారు. రాజధానిలో వేల ఎకరాలు భూములు కొన్న మంత్రులను తొలగించకుండా వార్తలు రాసిన పత్రిక, విలేకరులపై చర్యలు తీసుకుంటామనడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. కాలువ గట్లపై పడుకొంటేనో, గడ్డాలు పెంచితేనో నీళ్లు వస్తాయా..? కాలువ గట్లపై పడుకొంటేనో, గడ్డాలు మీసాలు పెంచితేనో గాలేరు నగరి, గండికోటకు నీళ్లు రావనే సత్యాన్ని ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు గ్రహించాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి చురకంటించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రానికి అప్పగిస్తే వారే పూర్తి చేస్తారని, అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన కమీషన్ల కోసం పాత కాంట్రాక్టర్నే కొనసాగిస్తోందని చెప్పారు. గాలేనగరి, గండికోటకు గత ఏడాది జూలై 1నాటికి నీళ్లు ఇస్తామని చెప్పారని, ఆ పనులన్నీ పూర్తి కావాలంటే రూ. 1300 కోట్లు కావాలన్నారు. ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన 348 కోట్లు ఏ మూలకు సరిపోవన్నారు. హంద్రీ-నీవాకు కేటాయించిన రూ. 504 కోట్లు కరెంట్ బిల్లులకే సరిపోతాయన్నారు. కేసీకెనాల్ ఆధునికీకరణకు కేవలం రూ.35 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏమిటో ఈ కేటాయింపులను బట్టే తెలుస్తోందని ఎద్దేవా చేశారు. డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మాఫీ చేస్తామని దారుణంగా మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులు, యువతను దగా చేశారన్నారు. ప్రజలంతా తిరగబడితే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్దిరాదని తెలిపారు. సీబీఐ విచారణ జరిపించాలి రాజధాని భూ ఆక్రమణపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించాలని కడప శాసన సభ్యుడు ఎస్బి అంజద్‌బాషా డిమాండ్ చేశారు. నూజివీడు సమీపంలో నాగార్జున యూనివర్సిటీ వద్ద రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు లీకులిచ్చి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో తుళ్లూరు వద్ద వేల ఎకరాలు కొనుగోలు చేయించారన్నారు. ఆ తర్వాతే రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు. పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లుగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 10 శాతంగా ఉన్న మైనార్టీలకు బడ్జెట్లో కేవలం రూ.710 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పార ని, బడ్జెట్లో దాని ఊసే లేదన్నారు. రైతు రుణమాఫీకి కేటాయించిన రూ.3512 కోట్లు వడ్డీలకు కూడా సరిపోవన్నారు. హౌసింగ్‌కు కేటాయించిన రూ. 1100 కోట్లు పెండింగ్ బిల్లులు ఇచ్చేందుకు కూడా చాలవని చెప్పారు. -
వైఎస్ఆర్సీపీ నేతల దీక్ష భగ్నం
కడప అర్బన్, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్సీపీ నేతలు అవినాష్‌రెడ్డి, అంజద్‌బాష, నాగిరెడ్డి, సంబటూరు ప్రసాద్, రాఘవరెడ్డిలు గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారి ఆరోగ్యం క్షీణించిందంటూ పోలీసులు బలవంతంగా వారి దీక్షను భగ్నం చేసి రిమ్స్ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తరలించారు. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్ ద్వారా ఆమరణ దీక్ష చేసి రిమ్స్‌లో చేరిన వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించారు. భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా దీక్షను విరమించాలని, ప్రజా శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు రిమ్స్ ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగించాలనే ఆలోచనను పక్కన బెట్టి విజయమ్మ పిలుపు మేరకు దీక్షను విరమించారు. పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన ైవె ఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజద్‌బాష, నాగిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డిలకు వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి తదితరులు పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం భయపడే దీక్షలు భగ్నం : వైఎస్ అవినా్ష్రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి భయపడే దీక్షలను పోలీసుల ద్వారా భగ్నం చేయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పులివెందుల సమన్వయకర్త ైవె ఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. తెలంగాణా కోసం కేసీఆర్ 2009లో 5 రోజులు నకిలీ దీక్ష చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం తెలంగాణా అంశంపై ప్రకటన చేసిందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ 60 ఏళ్ల వయసులో చిత్తశుద్ధితో ఆమరణ దీక్ష చేపట్టారన్నారు. ఆరు రోజులు ఆమరణ దీక్ష చేపట్టినా కేంద్ర ప్రభుత్వం తమ తరపున అధికారులను పంపించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాల్సింది పోయి దీక్షను బలవంతంగా పోలీసుల చేత భగ్నం చేయించారన్నారు. తాను ఏడు రోజులుగా దీక్ష చేస్తునప్పటికి బలవంతంగా ఆసుపత్రికి తరలించారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం: అంజద్‌బాషా సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వైఎస్ఆర్సీపీ కడప కన్వీనర్ ఎస్బి అంజద్‌బాష తెలిపారు. గత ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే బలవంతంగా భగ్నం చేశారన్నారు. ఉద్యమాన్ని కొనసాగిస్తాం : నాగిరెడ్డి దీక్ష విరమింపజేసినా తమ వంతు ఉద్యమాలను చేపట్టి సమైక్యాంధ్ర సాధన కోసం కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ నేత నాగిరెడ్డి తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ఆందోళనను నీరుగార్చే ప్రయత్నం : వైసీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఉంటూ ఆందోళ న కార్యక్రమాలు, ఆమరణ దీక్షలు చేస్తుంటే వాటిని నీరు గార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రె డ్డి అన్నారు. జైల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారని వారికి సంఘీభావంగా చేపట్టాల్సిన కార్యక్రమాల దృష్ట్యా, తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు ైవె ఎస్ విజయమ్మ ఫోన్‌ద్వారా తమ నేతలను పరామర్శించారని ఆమె పిలుపు మేరకు దీక్షలను విరమింప చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి , వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ సీమాంధ్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆమరణ దీక్షలు కొనసాగిస్తుంటే ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టినట్లు లే దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్‌ను ఆదరిస్తున్న తీరును చూసి ఓర్వలేక కార్యక్రమాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.