వైఎస్‌ఆర్‌సీపీ నేతల దీక్ష భగ్నం
Published Mon, Aug 26 2013 5:43 AM | Last Updated on Wed, Jul 25 2018 6:05 PM
కడప అర్బన్, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అవినాష్‌రెడ్డి, అంజద్‌బాష, నాగిరెడ్డి, సంబటూరు ప్రసాద్, రాఘవరెడ్డిలు గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారి ఆరోగ్యం క్షీణించిందంటూ పోలీసులు బలవంతంగా వారి దీక్షను భగ్నం చేసి రిమ్స్ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తరలించారు. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్ ద్వారా ఆమరణ దీక్ష చేసి రిమ్స్‌లో చేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను పరామర్శించారు. భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా దీక్షను విరమించాలని, ప్రజా శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రిమ్స్ ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగించాలనే ఆలోచనను పక్కన బెట్టి విజయమ్మ పిలుపు మేరకు దీక్షను విరమించారు.
పండ్ల రసం ఇచ్చి దీక్షను
విరమింపజేసిన ైవె ఎస్‌ఆర్‌సీపీ నేతలు
వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజద్‌బాష, నాగిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డిలకు వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి తదితరులు పండ్ల రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ప్రభుత్వం భయపడే
దీక్షలు భగ్నం : వైఎస్ అవినా్‌ష్‌రెడ్డి
వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమానికి భయపడే దీక్షలను పోలీసుల ద్వారా భగ్నం చేయిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ పులివెందుల సమన్వయకర్త ైవె ఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. తెలంగాణా కోసం కేసీఆర్ 2009లో 5 రోజులు నకిలీ దీక్ష చేస్తే దిగి వచ్చిన ప్రభుత్వం తెలంగాణా అంశంపై ప్రకటన చేసిందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ 60 ఏళ్ల వయసులో చిత్తశుద్ధితో ఆమరణ దీక్ష చేపట్టారన్నారు. ఆరు రోజులు ఆమరణ దీక్ష చేపట్టినా కేంద్ర ప్రభుత్వం తమ తరపున అధికారులను పంపించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాల్సింది పోయి దీక్షను బలవంతంగా పోలీసుల చేత భగ్నం చేయించారన్నారు. తాను ఏడు రోజులుగా దీక్ష చేస్తునప్పటికి బలవంతంగా ఆసుపత్రికి తరలించారన్నారు.
సమైక్య రాష్ట్రం కోసం
ప్రాణాలైనా అర్పిస్తాం: అంజద్‌బాషా
సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ కడప కన్వీనర్ ఎస్‌బి అంజద్‌బాష తెలిపారు. గత ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుంటే బలవంతంగా భగ్నం చేశారన్నారు.
ఉద్యమాన్ని కొనసాగిస్తాం : నాగిరెడ్డి
దీక్ష విరమింపజేసినా తమ వంతు ఉద్యమాలను చేపట్టి సమైక్యాంధ్ర సాధన కోసం కృషి చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ నేత నాగిరెడ్డి తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
ఆందోళనను నీరుగార్చే
ప్రయత్నం : వైసీపీ నేతలు
వైఎస్‌ఆర్‌సీపీ ప్రజల పక్షాన ఉంటూ ఆందోళ న కార్యక్రమాలు, ఆమరణ దీక్షలు చేస్తుంటే వాటిని నీరు గార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రె డ్డి అన్నారు. జైల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారని వారికి సంఘీభావంగా చేపట్టాల్సిన కార్యక్రమాల దృష్ట్యా, తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు ైవె ఎస్ విజయమ్మ ఫోన్‌ద్వారా తమ నేతలను పరామర్శించారని ఆమె పిలుపు మేరకు దీక్షలను విరమింప చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి , వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ సీమాంధ్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆమరణ దీక్షలు కొనసాగిస్తుంటే ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టినట్లు లే దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్‌ను ఆదరిస్తున్న తీరును చూసి ఓర్వలేక కార్యక్రమాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
Advertisement