కల్వర్డు, సీసీ రోడ్డుకు భూమి పూజ | YSRCP MLA anja basha Roadworks Start In YSR Kadapa | Sakshi
Sakshi News home page

కల్వర్డు, సీసీ రోడ్డుకు భూమి పూజ

Published Sat, Jul 28 2018 9:24 AM | Last Updated on Mon, Aug 20 2018 6:05 PM

YSRCP MLA anja basha Roadworks Start In YSR Kadapa - Sakshi

రోడ్డు పనులకు భూమిపూజ చేస్తున్న మేయర్‌ సురేష్‌బాబు,  ఎమ్మెల్యే అంజద్‌బాషా

కడప కార్పొరేషన్‌:  శుక్రవారం స్థానిక 24వ డివిజన్‌లో నమస్తే బోర్డు వద్ద రూ.15లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కల్వర్టుకు, రూ.7లక్షల బీపీఎస్‌ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డుకు నగర మేయర్‌ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం కడప నగరాభివృద్ధికి వెచ్చించిన నిధులు శూన్యమన్నారు.  వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే కడపను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాసులు, ఏఈలు దిల్షాద్, స్వరూప, కో ఆప్షన్‌ సభ్యురాలు బండి సరోజ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు  బండిబాబు, షఫీ, సీపీసీ అధినేత సూర్యనారాయణరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement