cc road works
-
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నల్లకుంట: నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని డివిజన్లలోని బస్తీలు, కాలనీలకు సమాన ప్రాధాన్యతది ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో అన్ని డివిజన్ల పరిధిలోనూ నూతన సీవరేజీ, డ్రైనేజీ పైప్‌లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. బుధవారం నల్లకుంట డివిజన్ యాక్సిస్ బ్యాంక్ లేన్‌లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, సాయికిరణ్, బీజేపీ నాయకులు శ్యామ్‌రాజ్, లక్ష్మణ్‌కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. రోడ్ల సమగ్రాభివృద్ధికి కృషి.. అంబర్‌పేట: నియోజకవర్గంలో రోడ్ల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ శ్రీనివాసకాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిరి్మంచనున్న సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ బీ.పద్మావెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను సైతం ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బీ.వెంకట్‌రెడ్డి, స్థానిక బీజేపీ, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
పచ్చ తమ్ముళ్ల అక్రమాలు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లలో జిల్లాలోని ‘పచ్చ’తమ్ముళ్లు గత ఐదేళ్లలో రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పనులకు వాడవాడలా ‘చంద్రన్న బాట’ పేరుతో ‘షో’ చేస్తూ ఈ అవినీతికి తెరదీశారు. అధికార పార్టీ నేతలు నామినేటెడ్ పద్ధతిలో పనులు దక్కించుకొని, నాసిరకంగా పనులు చేపట్టి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. దీంతో ఈ రోడ్లలో నాణ్యత నేతి బీరకాయలో నెయ్యి చందంగా తయారైందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జన్మభూమి కమిటీ అండదండలతో.. సీసీ రోడ్లు ‘పచ్చ’నేతలకు కాసులు కురిపించాయి. జన్మభూమి కమిటీల ముసుగులో వారు చెలరేగిపోయారు. సీసీ రోడ్ల పనులన్నీ నామినేటెడ్ పద్ధతిలో టీడీపీ నేతలకే కట్టబెట్టడంతో ఇష్టారీతిన దోచుకుతిన్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీసీ రోడ్ల నాసిరకం పనులపై లోకాయుక్తకు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు, పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ విభాగానికి, కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు స్పందిస్తూ విచారణ జరిపాక నిధులు రికవరీ కూడా చేశారు. తమ పంటపొలాలకు, లే అవుట్లకు, ప్రభుత్వ నిధులతో సీసీరోడ్లను వేసి ఆ పరిసర ప్రాంత భూములకు ధరలు పెంచడానికే ఈ నాలుగేళ్లు కృషి చేశారన్న విమర్శలున్నాయి. బెర్ములు వేయకుండానే రూ.40 కోట్లు స్వాహా.. చంద్రన్న బాటలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేసిన సీసీ రోడ్లకు బెర్ములు వేయడం లేదు. వాటి కోసం ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని నామినేటెడ్ పద్ధతిలో పనులు చేపడుతున్న టీడీపీ నేతలు మింగేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్ల పక్కన నిర్మించాల్సిన బెర్ముల విషయంలో అక్రమాలు జోరందుకున్నాయి. నిబంధనల ప్రకారం సీసీ రోడ్లకు ఇరువైపులా బెర్ములను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఎత్తు రోడ్డు నుంచి వాహనం సురక్షితంగా కిందకు దిగుతుంది. ఈ బెర్ములు పటిష్టంగా ఉండాలని విధిగా కంకరతో కూడిన గ్రావెల్‌తో రోడ్డుకు ఇరుపక్కలా నిర్మిస్తారు. కిలోమీటర్ మేర సీసీ రోడ్డుకు రెండుపక్కలా గ్రావెల్‌తో బెర్ములు వేయడానికయ్యే ఖర్చు అంచనా వ్యయంతో కలిపి ఉంటుంది. సరాసరి రహదారి అంచనా వ్యయంలో 10 శాతం బెర్ముల కింద ఖర్చు పెట్టాలి. బెర్ములు వేసిన తర్వాతే ఆ రోడ్లకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించాలి. కానీ, సీసీ రోడ్లు వేసిన తర్వాత బెర్ములు నిర్మించకుండా వదిలేస్తున్నారు. మరికొన్నిచోట్ల బురద కాలువల్లో పూడిక తీసిన మట్టి, భవనాలు తొలగించిన మట్టి వేసి చేతులు దులుపుకొంటున్నారు. ఎక్కువ శాతం బెర్ములు వేయకుండానే అడ్డగోలుగా బిల్లులు డ్రా చేసేస్తున్నారు. కాంట్రాక్టర్ల అవతారమెత్తిన టీడీపీ నేతలు గ్రామాల్లో కేవలం సిమెంటు రహదారులు నిర్మించి ఊరుకుంటున్నారు. ‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉపాధి హామీ పథకం నిధుల్ని తన పేరు పెట్టుకుని చంద్రబాబు ఖర్చు పెట్టారు. జిల్లాలో రూ.400 కోట్లతో 1,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. ఈలెక్కన రూ.40 కోట్లతో బెర్ముల కింద ఖర్చు పెట్టాలి. కానీ, జిల్లాలో వేసిన సీసీ రోడ్లలో 20 శాతానికి మాత్రమే బెర్ములు వేసినట్టు తెలుస్తోంది. మిగతా వాటికి వేయకపోవడంతో వాటికోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. బెర్ములు లేకపోవడంతో ప్రమాదాలు రహదారి నిర్మాణంతో పాటు వాటికిరువైపులా కంకర వేసి, షోలర్లు నిర్మించాలి. సిమెంట్ రోడ్లు ఎత్తుగా ఉండటంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు పక్కకు వెళ్లాలంటే రోడ్డు దిగాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా వాహనం సురక్షితంగా దిగడానికి వీలుగా ఇరువైపులా షోల్డర్ ఉండాలి. కానీ చంద్రన్నబాట కింద నిర్మిస్తున్న సిమెంటు రోడ్లకు మాత్రం ఇవేవీ ఉండటం లేదు. బెర్ములు లేని రహదారులు పలు గ్రామాల్లో ప్రమాదకరంగా తయారయ్యాయి. వాహనదారులు ఆయా రోడ్లలో రోజూ ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు ప్రయాణించే సమయంలో ఒకసారి సిమెంటు రోడ్డు దిగితే మళ్లీ ఎక్కించడం కష్టంగా మారుతోంది. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు దిగేందుకు సహితం వీలుపడటం లేదు. ఒక్కోసారి ‘నువ్వు వెనక్కి వెళ్లంటే.. నువ్వు వెనక్కి వెళ్లంటూ’ గొడవలు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రిళ్లు ద్విచక్ర వాహనదారులు, ఆటోల వంటివి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలున్నాయి. జిల్లాలో జరిగిన ప్రమాదాలు ఇలా... వడ్లమూరు వెళ్లే సీసీ రహదారికి బెర్మ్ లేకపోవడంతో ద్విచక్ర వాహనంతో కిందికి దిగి పైకి ఎక్కుతుండగా లారీ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం రోడ్డులో ఎదురుగా ట్రాక్టర్ రావడంతో భార్య, పిల్లలతో కలిసి మోటార్ బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. బెర్మ్ లేకపోవడంతో కిందికి దిగలేకపోతున్న సమయంలో నేరుగా ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. -
రహదారి విస్తరణ
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ మున్సిపా లిటీ పరిధిలోని పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. టీచర్స్ కాలనీ నుంచి తిర్పెల్లి సీసీఐ క్రాస్ రోడ్డు వరకు సుమారు 3.5 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ స్థలంలో నిర్మించుకున్న భవనాలు తొలగించనున్నారు. జాతీయ రహదారి మధ్యలో నుంచి ఇరువైపులా 75 ఫీట్ల స్థలం ఉండాలి. కానీ ప్రస్తుతం అందులో సగం స్థలం కూడా లేదు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నందున అధికారులు సోమవారం కొలతలు చేశారు. సుమారు 65 ఇళ్ల వరకు ఆర్ అండ్ బీ రోడ్డు స్థలంలో అక్రమంగా భవనాలు నిర్మించుకున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు స్థలంలో టీన్ షెడ్లు అధికంగా వేసుకు న్నారు. వారిని తొలగించుకోవాలని సూచించినట్లు తెలిపారు. సుందరీకరణకు చర్యలు.. పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా ఆదిలాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. రోజు రోజుకు పట్టణ జనాభా పెరుగుతుండడంతో ట్రాఫిక్ సైతం పెరుగుతోంది. మావల సమీపంలోని జాతీయ రహదారి 44 నుంచి చాందా(టి) శివారు ప్రాంతాంలో గల గాయత్రి గార్డెన్ వరకు పనులు చేపట్టనున్నారు. టీచర్స్ కాలనీ నుంచి తిర్పెల్లి సీసీఐ క్రాస్ రోడ్డు వరకు ప్రస్తుత పాత జాతీయ రహదారి 7 వెడల్పు ఇరువైపులా 25 ఫీట్లు మాత్రమే ఉంది. దీంతో పట్టణ ప్రజలకు ప్రతీ రోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 25 ఫీట్ల రోడ్డును ఇరువైపులా రోడ్డు మధ్యలో నుంచి 75 ఫీట్లకు రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ సమీపం నుంచి తిర్పెల్లి సీసీ క్రాస్ రోడ్డు వరకు 3.5 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు వెడల్పు పనులను చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు రోడ్డు అందంగా మారనుంది. తొలగిపోనున్న ఆక్రమణలు గత కొన్నేళ్ల కిందట పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా ఆర్ అండ్ బీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని సుందరమైన భవనాలను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల్లో వివిధ రకాల షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రోడ్డు వెడల్పు కోసం నిధులు విడుదల చేయడంతో కొన్నేళ్ల కిందట నిర్మించుకున్న భవనాలు కూల్చి వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే సోమవారం అక్రమంగా నిర్మించుకున్న భవనాల వారి వద్దకు వెళ్లి ఏవైనా వస్తువులు ఉంటే తొలగించాలని సూచించారు. ఆర్ అండ్ బీ స్థలం నిర్మించుకున్న భవనాలను మంగళవారం రోజున కూల్చివేస్తామని ఆర్ అండ్ బీ ఈఈ వెంటకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, కమిషనర్ మారుతిప్రసాద్‌తోపాటు ఇతర అధికారులు షాపుల వద్దకు వెళ్లి చెప్పారు. రూ.44 కోట్లు వ్యయం పట్టణ సుందరీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులతోపాటు రోడ్డుకు మధ్యలో 2 ఫీట్ల వెడల్పులో సెంట్రల్ లైటింగ్(స్ట్రీట్ లైట్లు) ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 9.6 కిలోమీటర్ల పొడవున ఈ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలను నిర్మించనున్నారు. జాతీయ రహదారి పక్కన వాహనాల ను పార్కింగ్, మొక్కలను నాటేందుకు 28 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు విస్తీర్ణం పెరగడంతో ట్రాఫిక్ సమస్య సైతం తీరనుంది. రూ.26 కోట్ల వ్యయంతో రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టులు, రూ.3.25 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైటిం గ్, మరో రూ.5.50 కోట్ల వ్యయంతో సిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతోపాటు తదితర పనులను చేపట్టనున్నారు. మరిన్ని పనులకు ఆర్ అండ్ బీ శాఖ రూ.44.30 కోట్లు మంజూరు చేసింది. మొదలైన గుబులు.. గత కొన్నేళ్ల కిందట ఆర్ అండ్ బీ రోడ్డుకు సంబంధించిన స్థలంలో మాలీగీలు నిర్మించుకొని దర్జగా వ్యాపారం కొనసాగిస్తున్న వారికి భవనాలను కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో వారిలో గుబులు మొదలైంది. వందలాది ఇళ్లు కూలనున్నాయి. రోడ్డు పనులు ఇంతవరకు వస్తాయా అనే ధీమాతో లక్షలాది రూపాయలు వెచ్చించుకొని వారి.. వారి ఇంటి ఎదుట ఉన్న స్థలాల్లో మంచి.. మంచి భవనాలను నిర్మించుకొని అద్దెకు ఇస్తున్నారు. వాటిని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో తాము ఎవరిని సంప్రదిస్తే కూల్చివేతలు నిలిచిపోతాయని ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఏదేమైనా హైదరాబాద్ నగరంలో అటువంటిది రోడ్డు స్థలాల్లో నిర్మించుకున్న భవనాలను ప్రభుత్వం కూల్చి వేసింది. ఇక్కడ కూడా ఎట్టిపరిస్థితిల్లో వాటిని ఉంచే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు పనులు ప్రారంభం కానుండడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణలు తొలగించిన వెంటనే పనులు పాత జాతీయ రహదారి 7 రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయి. 3.5 కిలోమీటర్ల మేర ఈ పనులను చేపట్టనున్నాం. అలాగే 9.6 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేయడంతోపాటు డ్రైనేజీ, కల్వర్టులు, తదితర వాటిని నిర్మించునున్నాం. మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణలు తొలగించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – వెంకట్‌రెడ్డి, ఈఈ, ఆర్ అండ్ బీ, ఆదిలాబాద్ రెండు, మూడు రోజుల్లో తొలగిస్తాం పట్టణ అభివృద్ధిలో భాగంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా అక్రమంగా నిర్మించుకున్న భవనాలను తొలగించనున్నాం. రెండు మూడు రోజుల్లో వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశాం. అందులో భాగంగానే ఆర్ అండ్ బీ స్థలంలో భవనాలు నిర్మించుకున్న వారికి ముందుగా చెప్పడం జరిగింది. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
సీసీ రోడ్డు పనుల నిలిపివేత
విజయనగరం , కొత్తవలస: మండలంలోని అర్దానపాలెం ఏపీ మోడల్ స్కూల్‌కు సమీపంలో ఉన్న కోహినూర్ హిల్స్ రియల్‌ఎస్టేట్‌కు లబ్ధి చేకూరేలా నిర్మిస్తున్న సీసీ రోడ్డుతో పా టు కొత్తవలస – ఎస్.కోట రహదారిలో ప్రాంతీయ పశువుల చికిత్సాలయం సమీపంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న మదు ము పనులను వెంటనే నిలిపివేయాలని అధికా రులు ఆదేశాలు జారీ చేశారు. ‘ఎవడరూ అడగర నే కదా..’ శీర్షికన సాక్షిలో ఆదివారం ప్రచురితమై న కథనానికి అధికారులు స్పందించారు. ఇదిలా ఉంటే కంటకాపల్లిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ ఎస్.కోట నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ, కోహినూర్ హిల్స్‌కు ఉపయోగపడేలా రూ. 40 లక్షలతో 500 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మిస్తున్నారన్నారు. అలాగే మరో రియల్‌ఎస్టేట్‌కు ఉపయోగపడేలా మదుము నిర్మిస్తున్నారని..ఈ పనులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కడ చేపట్టాలో ఎమ్మెల్యేకు తెలియకపోవడం శోచనీ యమన్నారు. మోడల్ స్కూల్, గిరిజన యూనివర్శిటీకి రోడ్డు నిర్మాణం పేరిట నిర్మిస్తున్న ప్రాం తంలో ఒక్క ఇల్లైనా ఉందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పెత్తందారులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలి... గిరిజన యూనివర్శిటీకి రోడ్డు నిర్మిస్తున్నామం టూ కోహినూర్ హిల్స్‌కు రూ. 40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం దుర్మార్గమని..ఎమ్మెల్యే లలితకుమారి ఈ పనులను ప్రోత్సహించడం ఆమె స్వార్థానికి ఒక ఉదాహరణని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాక్షుడు కె.సన్యాసిపాత్రుడు అన్నా రు. వెంటనే పనులు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో మెరపల సత్యనారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు తూర్పాటి వరలక్ష్మి, బొం తల వెంకటరావు, వై. మాధవరావు, ద్వారపూడి అర్జునరావు, వేలమూరి బాబీ, మదిన అప్పలరమణ, వెలగల వెంకటరమణ, పీఎస్ఎన్ పాత్రు డు, బూసాల రమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శంగా ఉంటేనే మార్పు
నర్సాపూర్: నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మీరు గ్రామంలో పది మందికి ఆదర్శంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సర్పంచులకు సూచించారు. స్థానిక మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో శుక్రవారం సాయంత్రం ఆయన పాల్గొని మాట్లాడారు. మీ హయాంలో మీమీ గ్రామాలలో ప్రభుత్వ పరంగా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై మీ పేర్లు ఎలా శాశ్వతంగా ఉండాలని ఆశిస్తారో పనులలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా శ్రద్ద తీసుకుంటేనే పనులు నాణ్యతగా ఉండటంతోపాటు మీకు మంచి పేరు వస్తుందని కలెక్టర్ సూచించారు. పలు గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లు త్వరలోనే పాడవుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. అందుకు పనులలో నాణ్యత లోపించడంతోపాటు వాటిపై నుంచి కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు తిప్పడం మరో కారణమని ఆయన అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో గ్రామ సర్పంచ్‌లు బాధ్యతగా వాటిని పర్యవేక్షించినపుడే పనులలో నాణ్యత సాధ్యమని ఆయన వివరించారు. చెట్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ చెప్పారు. మొక్కలు పెంపకాన్ని బాధ్యతగా తీసుకోండి జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద గతంలో వంద నర్సరీలు ఏర్పాటు చేసి కోటి నుంచి కోటీ 30లక్షల మొక్కలు పెంచగా.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 450 నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు నాలుగు కోట్ల మొక్కలు పెంచుతున్నామని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఇప్పటికే చెట్లను నరకడంతో అడవుల విస్తీర్ణం తగ్గి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు హరితహారం కార్యక్రమం పట్ల అందరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కలు నాటి కాపాడేందుకు చర్యలు తీసుకున్నపుడే హరితహారం విజయవంతం అవతుందని ఆయన చెప్పారు. ఇండ్ల నుంచి పొడి, తడి చెత్తను వేరుగా సేకరించేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయన చెప్పారు. అందుకుగాను ప్రజలలో చైతన్యం తేవాలని చెప్పారు. ప్లాస్టిక్‌తో భూమి ఎంత కలుషితమవుతుందో ప్రజలకు తెలియచేయాలని ఆయన చెప్పారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేయించాలని చెప్పారు. కాగా గతంలో ఆదర్శ గ్రామాలుగా ఎంపికైన గ్రామాలకు మిమ్మల్ని తీసుకుపోయి అక్కడి పనులను మీకు చూపిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీపీఓ హనూక్, కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్ మండల తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీఓ శ్రవన్‌కుమార్, డీఏఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి నిదర్శనం..!
గోదావరిఖనిటౌన్: అభివృద్ధి పేరిట చేసే ఏ పని అయినా, ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినపుడే అది అభివృద్ధి అనిపించుకుంటుంది. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా చేసే పనులు ఏవైనా సబబు కాదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీల్లో పలురకాల అభివృద్ధి పనుల కోసం కార్పొరేషన్ అధికారులు ఇటీవల వేసిన సీసీ రోడ్లను తవ్వారు. అయితే నెలలు గడిచినా ఇప్పటికీ మరమ్మతు చేయక పోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాగు నీరు, మరుగు దొడ్లు, రోడ్డు వెడల్పు, ఇతర పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి పునః నిర్మాణం చేయడంలో విఫలమయ్యారు. దీంతో ప్రతినిత్యం రోడ్ల వెంబడి నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధుల దుర్వినియోగం.. అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి రెండు నెలల్లో పూర్తి చేసి యథావిధిగా ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యవంతంగా నిర్మించాలి. అయితే సంవత్సరాలు గడిచినా పునః నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతీ నిత్యం నడవడానికి, వాహనాలను తీసుకుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామని ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులను ముందే ఆలోచించి నిర్మించకపోవడంతో కోట్ల రూపాలయతో వేసిన రోడ్డు మధ్యంతరంగా చెరిపి తిరిగి వేయడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెగుతున్న ఇంటర్నెట్ తీగలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లను తవ్వడంతో రోడ్డు క్రింద ఉన్న ఇంటర్నెట్, బీఎస్ఎన్ఎల్ వైర్లు తెగి నెట్ వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు, విద్యార్థులు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉద్యోగాల కోసం, విద్యాపరంగా ఉండే అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నామని పేర్కొంటున్నారు. తాగునీటిలో మలిన పదార్థాలు.. అయితే రోడ్లను తవ్వే సమయంలో వాటి కింద ఉండే తాగు నీటి పైపులు పగిలి నీటిలో మట్టి, ఇసుక, ఇతర మలిన పదార్థాలు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లను బాగు చేయాలి స్థానికంగా వివిధ అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి. ఇంటి ఎదుట నుంచి నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. వర్షాకాలంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించాలి. – నరేశ్, స్థానికుడు కలుషితం అవుతున్న తాగునీరు మరమ్మతుల కోసం రోడ్లను తవ్వడంతో తాగు నీటి పైపులు పగలడంతో తాగు నీరు కలుషితం అవుతోంది. దీంతో వ్యాధుల బారిన పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగు నీరు కలుషితం కాకుండా చూడాలి. – మురళి, స్థానికుడు -
నత్తే నయం!
పల్లె రోడ్లకు గ్రహణం వీడడం లేదు. నిధులొచ్చినా మహర్దశ పట్టడం లేదు. సర్కారు అశ్రద్ధ, అధికారుల అలసత్వం మూలంగా అలాగే ఉండిపోతున్నాయి. ఎప్పటికి బాగుపడతాయో తెలియక గ్రామీణులు నిట్టూరుస్తున్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ రోడ్ల నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాల్సిన పనులు తీవ్ర ఆలస్యం కావడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రగతి ఏకంగా 11వ స్థానానికి పడిపోయింది. కర్నూలు(అర్బన్): గ్రామీణ రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నిధులు రావడంతో రోడ్లు బాగుపడతాయని ఆశించిన పల్లెవాసులకు నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని పంచాయతీరాజ్ సబ్ డివిజన్లలో రూ.51.22 కోట్ల వ్యయంతో 225 కిలోమీటర్ల (కి.మీ) మేర సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు రూ.31.14 కోట్ల వ్యయంతో 103.80 కి.మీ. మేర మాత్రమే నిర్మించారు. గతంలో ఇచ్చిన 225 కి.మీ. లక్ష్యానికి అదనంగా ఈ నెల 24వ తేదీన మరో 139 కి.మీ. మేర సీసీ రోడ్లను నిర్మించాలని పంచాయతీ రాజ్ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో సీసీ రోడ్ల నిర్మాణాల్లో జిల్లా ప్రగతి చివరి స్థానానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక బీటీ రోడ్ల నిర్మాణాల్లోనూ ఎనలేని జాప్యం చోటు చేసుకుంటోంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.132 కోట్ల వ్యయంతో 221 కి.మీ. మేర బీటీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.66.39 కోట్ల వ్యయంతో 110.65 కి.మీ. మేర మాత్రమే పూర్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పార్లమెంట్ సభ్యుల నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్స్ తదితర మ్యాచింగ్ గ్రాంట్లతో ఈ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటి ప్రగతిలో జిల్లా స్థానం 11కు పడిపోవడంతో కలెక్టర్ సత్యనారాయణ పీఆర్ ఎస్ఈపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనుల్లో వేగం పెంచాలంటూ ఇటీవల జరిగిన సమీక్షలో పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడుకు నోట్ కూడా పంపినట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 13 పీఆర్ సబ్ డివిజన్లు ఉన్నాయి. నాలుగింటిలో సీసీ రోడ్ల నిర్మాణాలు తీవ్ర జాప్యం అవుతున్నాయి. కోడుమూరు సబ్ డివిజన్లో 17.50 కి.మీ మేర సీసీ రోడ్లు వేయాల్సి ఉండగా.. కేవలం 6.16, పత్తికొండ సబ్ డివిజన్లో 18.31 కి.మీకి గాను 6.25, నందికొట్కూరులో 17.50 కి.మీకి గాను 6.94, ఆదోని సబ్ డివిజన్లో 8.20 కి.మీకి గాను కేవలం 1.67 కి.మీ మేర మాత్రమే రోడ్లు వేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేగం పెంచేందుకు చర్యలు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పలు ప్రాంతాల్లో మెటల్ లభించడం కొంత కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత ఇంజినీర్లు మా దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని కింది స్థాయి ఇంజినీర్లను ఆదేశించాం. దీంతో రెండు రోజుల్లోనే ఏడు కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. నిర్ణీత సమయంలోగా అన్ని పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. – కేవీ సుబ్బరాయుడు, పీఆర్ ఎస్ఈ -
దొందూ.. దొందే!
సాక్షి ప్రతినిధి కడప: వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వర్గీయులు సైతం నేతలకు తగ్గట్లుగా వ్యవహరించేవారు. అధికారం కోసం ఛీ కొట్టిన పంచన చేరిన నేత ఒకరైతే. అవమానాలు భరిస్తూ నే అదే పార్టీలో కొనసాగుతోన్న నేత మరొకరు. పరస్పర విరుద్ధ వైఖరితో ఉన్న వారు కాంట్రాక్టు పనుల కోసం భాయి.. భాయి అంటూ పంపకాలు చేసుకున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింతలకు పాల్పడుతోన్న వైనమిది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కాంట్రాక్టు పనుల కోసం టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. పరస్పర దాడులు చేసుకున్నారు. ఈక్రమంలో టీడీపీ పెద్దల జోక్యం అనివార్యమైంది. కాంట్రాక్టు పనులు పంపకాలు చేపట్టారు. ఈ క్రమంలోనే జమ్మలమడుగు మున్సిపాలిటీలో డ్రైనేజీ, సీసీరోడ్లు, పైప్‌లైన్ మరమ్మత్తుల పేరుతో14 పనులకు టెండర్లకు పిలిచారు. రూ.1.56కోట్లతో చేపట్టిన ఈ పనులు ఇరువర్గాలకు పంపకాలు చేశారు. ఆమేరకు శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో ఓవర్గం, ఎం.బాలపుల్లారెడ్డి పేరుతో మరో వర్గం ముందస్తుగా నిర్ణయించుకున్న పనులకు సింగిల్ టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్లును ఆమోదించేందుకు మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చా లేకుండానే సమావేశానికి ముగింపు పలికారు. శ్రీనివాస ఇన్ప్రాస్టక్చర్ రూ.79 లక్షలు, ఎం.బాలపుల్లారెడ్డి రూ.77 లక్షల విలువ గల పనులకు మున్సిపల్ కౌన్సిల్ అమోదం తెలిపింది. వర్గాలు వేరైనా విరుద్ధభావాలు వ్యక్తమైనా కాంట్రాక్టు పనులు కోసం ఏకం అవుతోన్న ఆ ఇరువురు నేతలు మరోవైపు గ్రామస్థాయిలో ఆధిపత్యం కోసం ఆరాటం ప్రదర్శిస్తున్నారు. ఈక్రమంలోనే చిన్నకొమెర్ల ఘటన ఇటీవల తెరపైకి వచ్చింది. అదే కోవలోనే చిన్నదుద్యాల, పెద్దదండ్లూరు, శిరిగేపల్లె, కొండాపురం ఘటనలు తలెత్తాయి. ఆదాయం కోసం అంతర్గత ఒప్పందాల మేరకు పనులు పంచుకోనే నేతలు, గ్రామాలల్లో ఘర్షణలను కూడా నియంత్రించాల్సిన నైతిక బాధ్యత ఉందని పలువురు అభిప్రాయ పడుతుండటం విశేషం. -
కల్వర్డు, సీసీ రోడ్డుకు భూమి పూజ
కడప కార్పొరేషన్: శుక్రవారం స్థానిక 24వ డివిజన్లో నమస్తే బోర్డు వద్ద రూ.15లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కల్వర్టుకు, రూ.7లక్షల బీపీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డుకు నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం కడప నగరాభివృద్ధికి వెచ్చించిన నిధులు శూన్యమన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే కడపను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాసులు, ఏఈలు దిల్షాద్, స్వరూప, కో ఆప్షన్ సభ్యురాలు బండి సరోజ, వైఎస్ఆర్సీపీ నాయకులు బండిబాబు, షఫీ, సీపీసీ అధినేత సూర్యనారాయణరావు పాల్గొన్నారు. -
కమీషన్ల బాట
హిందూపురం అర్బన్: ఎద్దు ఈనింది అంటే గాటికి కట్టెయ్ అన్న చందంగా నిధులు వచ్చాయంటే చాలు అవసరం ఉన్నా లేకున్నా వ్యక్తిగత ప్రయోజనం కోసం ఖర్చుచేసే విధంగా తయారైంది హిందూపురం పాలకవర్గం నైజం. అధికారులు కూడా అన్నింటికీ ఊ.. కొడుతుండటంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. హిందూపురం– బెంగళూరు తారురోడ్డు హౌసింగ్‌బోర్డు ఏరియాల్లో బ్రహ్మండంగా ఉంది. బాగున్న రోడ్డు కంట్రాక్టర్ జేసీబీలతో తొలగించి ఆ స్థలంలో కొత్త సీసీ రోడ్డు వేస్తున్నారు. బెంగళూరు రహదారిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ వాల్మీకి సర్కిల్ 2017–18 కోర్నెట్ నిధులు కింద రూ.7.2కోట్లు నిధులు మంజూరు చేసింది. సుమారు 2.5 కిలోమీటర్ల మేరకు కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. చిన్నమార్కెట్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు తారు రోడ్డు బాగుంది. అయితే ఈ మార్గంలో రోడ్డు పనులకు నిధులు మంజూరు కావడంతో మున్సిపల్ చైర్పర్సన్ వార్డు నుంచి రహదారి పనులు చేపడుతున్నారు. వాస్తవంగా పరిగి బస్టాండు నుంచి చిన్నమార్కెట్ వాల్మీకి సర్కిల్ వరకు రోడ్డు బాగా ఇరుకుగా ఉంది. ఈరహదారిలో ఎదురెదురుగా వాహనాలు వస్తే ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి ఉంది. రోడ్డు వెడల్పు చేసి నిర్మిస్తే అనుకులంగా ఉండేది. అలా కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి అవసరం లేని చోట్ల పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి రోడ్డు నిర్మించాల్సి వస్తోందని ఓ అధికారి చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు సూగురు నుంచి పాదయాత్ర చేపట్టిన సమయంలో పట్టణంలోరోడ్లు వెడల్పు చేయాలని స్థానికులు కోరారు. దీనికి సంబంధించి ఇప్పుడు నిధులు మంజూరు కావడంతో బాగున్న రోడ్డుపైనే రోడ్డు వేయడానికి వెచ్చిస్తునట్లు సమాచారం. అసంపూర్తిగా బైపాస్‌రోడ్డు హిందూపురం పట్టణంలోని పట్టుగూళ్ల మార్కెట్ వద్ద నుంచి రహమత్‌పురం సర్కిల్ గుండా బెంగళూరును కలుపుతూ ఏర్పాటు చేసిన బైపాస్‌రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే నిలిచిపోయింది. పట్టణంగా గుండా భారీవాహనాలు శివారు నుంచి ప్రయాణించే వీలుగా అప్పటి ప్రభుత్వం రూ.5,38కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో నిర్మించిన బైపాస్‌రోడ్డును ఐదేళ్లు అవుతున్నా పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. రహమత్‌పురం సర్కిల్ నుంచి పాల డెయిరీ వరకు ఇంకా ఒకవైపు రోడ్డు నిర్మాణం ఇంతవరకు చేపట్టక పోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈరోడ్డు నిర్మాణం కంట్రాక్టు జిల్లా మంత్రికి చెందిన కంపెనీ కావడంతో అర్అండ్బీ అధికారులు ఇన్నేళ్లయినా ఒత్తిడి చేయలేకపోతున్నారు. దీంతో రహమత్‌పురం నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు వరకు ఒక వైపు రోడ్డులోనే రాకపోకలు సాగుతున్నాయి. పెద్ద వాహనాలు వెళ్తున్న సమయంలో ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. బైపాస్‌రోడ్డు పూర్తిస్థాయి నిర్మాణం కాకపోవడంతో వాహనాలు ఇటూ ప్రయాణం చేయకుండా పరిగిరోడ్డు, సద్భావన సర్కిల్ దారిగుండానే వెళ్తున్నాయి. భూమిపూజ చేసి ఏడాదైనా అసంపూర్తిగా ఉన్న బైపాస్‌రోడ్డు నిర్మాణానికి రూ.4.20కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే బాలకృష్ణ గత ఏడాది భూమిపూజ చేశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగలేదు. కేవలం ఆటోనగర్ ప్రాంతంలో రోడ్డు మధ్యన పొడవుగా డిౖవైడర్లు ఏర్పాటు చేశారే గానీ పనులు మాత్రం పూర్తి చేయలేదు. అంతేగాక పట్టణంలోని చాల ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న రోడ్డు గురించి పాలకులు అర్అండ్బీ అధికారులు పట్టించుకోవడంలేదు. పెరుగున్న జనాభాతో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్ రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అలాగే కేఎల్రోడ్డు, ఎంఎఫ్రోడ్డు పునరుద్ధరణపై ఎలాంటి దృíష్టి సారించడంలేదు. ప్యాచులు పడుతున్నాయని సీసీ రోడ్డు వేస్తున్నాం తరుచూ ప్యాచులు పడుతున్నాయి. మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతోంది. దీంతో పూర్తిగా సీసీరోడ్డు వేయాలని ప్రతిపాదించి రోడ్డు పనులు చేస్తున్నాం. అలాగే బైపాస్‌రోడ్డు పనులు ఈనెలలో ప్రారంభిస్తాం. రహమత్‌పురం వద్ద కొన్ని అక్రమణలు ఉన్నాయి. వాటిని తొలగిస్తున్నాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. త్వరలోనే పూర్తిచేయిస్తాం. – సునిత, ఏఈ, ఆర్అండ్బీ -
గడువు గండం
సాక్షి, వనపర్తి : గడువు గండం ఉండడంతో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.750కోట్లు కేటాయించి కేవలం స్వల్ప కాల వ్యవధిలోనే రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలో రూ.60కోట్ల వ్యయంతో 1,642 సీసీరోడ్ల పనులకు అనుమతిచ్చింది. మార్చి 31లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కాంట్రాక్టర్లు, నిర్మాణదారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. వాగుల నుంచి తెచ్చిన ఇసుకకు బదులు మట్టి, రాతిపొడిని వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్క్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత పాటించడం లేదు. ఫలితంగా సుమారు 20ఏళ్ల పాటు మన్నిక ఉండాల్సిన సీసీరోడ్లు ఏడాది కూడా పటిష్టంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం 758 పనులు మాత్రమే పూర్తి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శనివారం నాటికి సీసీరోడ్ల నిర్మాణానికి ఇచ్చిన గడువు ముగిసింది. జిల్లాలో ఇప్పటివరకు 758 రోడ్ల నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మంజూరైన 1642లో 884రోడ్లు ఇంకా నిర్మాణానికి నోచుకోలేదు. కేవలం రూ.24కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ప్రభుత్వం నుంచి గడువు పెంచుతున్నట్లు ఉత్తర్వులు వెలువడితే తప్ప పనులు కొనసాగే అవకాశం లేదు. లేదంటే మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంది. నిర్మాణ పనులకు సంబంధించి వారం పదిరోజుల్లో ఓ స్పష్టత వస్తుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక నేతలే.. గ్రామీణాభివృద్ధిశాఖ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఈ సిమెంట్, కాంక్రిట్ రోడ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించింది. రోడ్ల పనులను గ్రామాల్లో సర్పంచ్‌లు, స్థానిక నాయకులు కాంట్రాక్టర్లుగా పనులు చేపడుతున్నారు. పనులను హడావుడిగా చేపట్టడంతో నాణ్యత దెబ్బతిన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశీలనలో కొన్ని.. చిన్నంబావి మండలం పెద్దమారులో రూ.90లక్షలతో చేపడుతున్న రోడ్డు శనివారం సాయంత్రం వరకు కూడా పూర్తికాలేదు. కాంట్రాక్టర్ గడువులోగా పూర్తిచేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నాడు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలనే ఆతృతతో రేవల్లి మండలం చీర్కపల్లి శివారులో ఓ రైతు పొలం నుంచి తీసుకువెళ్లిన మట్టితో కూడిన ఇసుకను వాడుతున్నారు. వనపర్తి మండలం అప్పాయిపల్లిలో ఇసుకకు బదులుగా మట్టిని వాడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీపనగండ్ల మండలం వల్లాభాపురంలో నిబంధనల ప్రకారం వేయాల్సిన మందంలో రోడ్డు నిర్మాణం చేపట్టడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ఇవ్వాలి మా గ్రామానికి రూ.1.40కోట్లు మంజూరయ్యాయి. దీనిలో రూ.40లక్షల వ్యయంతో నేను పని తీసుకున్నాను. జిల్లావ్యాప్తంగా ఒకేసారి పనులు జరుగుతుండటంతో కూలీలు, మిషన్ల కొరతతో పనులు సగం కూడా పూర్తి కాలేదు. మరో వారం రోజలు అయినా పొడిగిస్తే పనులు పూర్తవుతాయి. లేదంటే నిధులు వెనక్కి వెళ్తాయి. – గోవింద శ్రీధర్‌రెడ్డి, పెద్దమారు నాణ్యతకే ప్రాధాన్యం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం ఆలస్యమైంది. వచ్చిన వెంటనే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాం. అయినప్పటికీ గడువు లేకపోవడంతో జిల్లాలో 50శాతం కూడా పూ ర్తికాలేదు. పనులు నెమ్మదించినా సరే నా ణ్యత విషయంలో తేడావస్తే బిల్లులు మం జూరుచేయబోం. ప్రభుత్వం గడువు పెంచుతుందా? లేదా? అనే విషయం త్వరలోనే తేలనుంది. – శివకుమార్, పీఆర్ ఈఈ, వనపర్తి జిల్లా -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
కొండమల్లేపల్లి : నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివా రం కొండమల్లేపల్లిలో రూ. 10లక్షలతో నిర్మిస్తు న్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మండల పరిధిలోని దోనియాలలో రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడు తూ టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్టీ అభివృద్ధి నిధుల నుంచి అన్ని తండాలకు బీటీ రోడ్ల నిర్మా ణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కేసాని లింగారెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్ అందుగుల ముత్యాలు, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, వస్కుల కాశయ్య, ఎలిమినేటి సాయి, అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్, కుంభం శ్రీనివా స్‌గౌడ్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ అప్ గ్రేడ్‌పై హర్షం దేవరకొండ : దేవరకొండను నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడంలో కృషి చేసినందు కు నగరపంచాయతీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటిగా అప్‌గ్రేడ్ కా వడంపై హర్షం వ్యక్తం చేస్తూ దేవరకొండ అభివృద్ధికి దోహదపడుతుం దని అన్నారు. వైస్ చైర్మన్ జాన్‌యాదవ్ ఎమ్మెల్యేకు శా లువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, కౌన్సి లర్లు వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, పొట్ట సుగుణయ్య, రాజినేని వెంకటేశ్వర్రావు, నాగవరం ప్రభాకర్‌రావు, రమావత్ దస్రూ నాయక్, పస్నూరి వెంకటేశ్వరెడ్డి, ఉప్ప ల శ్రీను, మాడ్గుల యాదగిరి, రాజు, కృష్ణ, మధు, ఇద్దయ్య, మునిందర్‌రెడ్డి, సుబ్బారావు ఉన్నారు. -
‘ఛీఛీ’ రోడ్లు..!
పెంట్లవెల్లి : మండలంలోని ఎంగంపల్లి, మంచాలకట్ట, మాధవస్వామినగర్, కొండూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు తిరిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు.. కానీ గ్రామాల్లో సీసీరోడ్లు మాత్రం ఇప్పటికీ వేయడంలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికాలనీలో సీసీరోడ్లు వేయిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు వేయలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడిప్పుడంటూ కాలయాపన సీసీరోడ్లు నిర్మిస్తే ప్రయాణికులకు, గ్రామస్తులకు ఇబ్బందులు తొలగుతాయని, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరితే మంజూరవుతాయి.. అప్పుడిప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని.. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. రోడ్లు వేయలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు బహిరంగ సభలలో ఎన్నో హామీలిస్తారు కానీ ఎక్కడో ఒకటి రెండు తప్ప మిగతా చోట్ల న్యాయం చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కాలనీల్లో సీసీరోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీసీరోడ్లు నిర్మించండి మాధవస్వామినగర్‌లో సీసీరోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాత్రివేళ మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. సర్పంచ్, అధికారులు స్పందించి సీసీరోడ్డు నిర్మించేలా చూడాలి. – రాజేందర్, మాధవస్వామినగర్ ఏళ్లు గడుస్తున్నా.. మల్లేశ్వరం గ్రామంలో ఎన్నికల ముందు పలు హామీలిచ్చిన నాయకులు ప్రస్తుతం అడిగితే మాట మారుస్తున్నారు. ఇప్పటికైనా మా కాలనీల్లో సీసీ రోడ్ల కల నెరవేర్చాలి. – కుర్మయ్య, మల్లేశ్వరం -
పల్లెకు సీసీ కళ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పల్లెల్లో అంతర్గత దారుల ముఖచిత్రం సమూలంగా మారనుంది. మురుగు నీరు, చెత్తాచెదారంతో కంపుకొడుతున్న గ్రామాల్లో సీసీ రోడ్లు వేసేందుకు కసరత్తు మొదలైంది. మండలాల వారీగా సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 602 పనులకుగాను కలెక్టర్ రఘునందన్‌రావు తాజాగా ఆమోదం తెలిపారు. వీటిని నిర్మించేందుకు రూ.21.55 కోట్లు కేటాయించారు. ఆరు నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ఏడాది మార్చి 31లోపు పనులు పూర్తి చేయాలని యంత్రాంగం లక్ష్యం నిర్దేశించుకుంది. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందుగానే నిర్మాణ పనులను ముగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. 90 శాతం ‘ఉపాధి’ నిధులు కేటాయించిన నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద 90 శాతం నిధులను గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారానే విడుదల చేయనున్నారు. కూలీల వేతనాలు, సిమెంట్, ఇసుక, కంకర తదితర నిర్మాణ సామగ్రికి ఉపాధి నిధులు చెల్లించనున్నారు. మిగిలిన పది శాతం నిధులను నియోజకవర్గ అభివృద్ధి ప్రోగ్రాం (సీడీపీ), ఎంపీలాడ్స్, జెడ్పీ నుంచి ఖర్చు చేయనున్నారు. నియోజకవర్గం మంజూరైన పనులు కేటాయింపులు (రూ.కోట్లలో) చేవెళ్ల 105 2.67 ఇబ్రహీంపట్నం 184 6.67 మహేశ్వరం 52 2.22 షాద్‌నగర్ 140 5.55 రాజేంద్రనగర్ 15 1.11 కల్వకుర్తి 106 3.33 -
పనిపైనే పని.. ఇదేం పని..?
మేయర్... కమిషనర్... భారీ యంత్రాంగం... ఇంజినీరింగ్ బృందం. వీరికితోడు 50 మంది కార్పొరేటర్లతో పాలకవర్గం. వీరితోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములై సమావేశాల మీద సమావేశాలు పెట్టి... మేధో మధనం చేసి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పదిహేను రోజుల కిందటే ప్యాచ్ వర్క్‌లు చేసిన రహదారికే మళ్లీ సుమారు అరకోటి కేటాయించి సీసీ రోడ్డేమిటీ అని విస్తుపోతున్నారా... అది వారి సొంతపనైతే ఆలోచించేవారు...కానీ ఇది ప్రజల సొమ్ముతో చేస్తున్న పనులు కదా.. అందుకే ఈ ‘కథ’ంతా... అసలు కథేమిటో తెలుసుకోవాలని ఉందా... సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల డబ్బును రూపాయి కూడా వృథాగా పోనివ్వమంటూ నెల రోజుల కిందట రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేష సాయి విలేకర్ల సమావేశంలో చెప్పిన మాటలు. పాలక మండలి మాటలకు చేతలకు ఎక్కడ పాంతనలేకుండా పాలన సాగుతోందని తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. ‘మనది కాదు.. పోయేది ప్రజల డబ్బే’ కదా అన్నట్లు నగరపాల సంస్థ లక్షల రూపాయలు వృథా చేస్తోంది. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డును పుష్కరాల సమయంలో వేశారు. ఏడాది తిరగకుండానే రోడ్డు ధ్వంసమైంది. ప్యాచ్ వర్కులు చేశారు. తిరిగి మూడు నెలల కిందట కురిసిన కొద్దిపాటి వర్షాలకు రోడ్డులోని పల్లపు ప్రాంతంలో గుంతలు పడ్డాయి. ఈ విషయంపై ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో చర్చించారు. నగరంలో అవసరమైన చోట ఇకపై సీసీ రోడ్లు వేయాలని పాలక మండలి, యంత్రాంగం నిర్ణయించింది. నిర్ణయం బాగానే ఉన్నా అమలులో ఇందుకు భిన్నంగా జరిగింది. ఏవీ అప్పారావు రోడ్డులో ప్యాచ్ వర్కులంటూ రూ.30 లక్షలతో రూపాందించిన అంచనాలను స్థాయీ సంఘం ఆమోదించింది. ఏవీ అప్పారావు రోడ్డు ఉత్తరం వైపున పల్లపు ప్రాంతంలో ప్యాచ్ వర్కులు చేశారు. ఈ పనులు జరిగి 15 రోజులు కూడా కాకుండానే తిరిగి అదే ప్రాంతంలో రూ.49.90 లక్షలతో సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీశేష సాయి, ఎంపీ మాగంటి మురళీ మోహన్, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇదేమి చోద్యం... 15 రోజులపాటు గుంతలు లేకుండా చేయడానికి రూ.30 లక్షల ఖర్చు పెట్టిన నగరపాలక సంస్థ పాలక మండలి తీరు తీస్తున్న నగరప్రజలు విస్తుబోతున్నారు. రెండు నెలలపాటు గుంతల రోడ్డులోనే ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించారు. హడావుడిగా అంచనాలు రూపాందించి స్థాయీ సంఘంలో ఆమోదింపజేసి రూ.30 లక్షల రోడ్డుపాలు చేశారని నగర ప్రజలు మండిపడుతున్నారు. తిరిగి 15 రోజుల్లోనే రూ.49.90 లక్షలతో సీసీ రోడ్డు వేయడంతో పదిహేను రోజుల కిందట ప్యాచ్ వర్కుల కోసం ఖర్చు పెట్టిన రూ.30 లక్షలు రోడ్డుపాలయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు. గుంతలు పడుతున్నందుకే... వర్షం వచ్చిన ప్రతిసారీ ఏవీ అప్పారావు రోడ్డులోని పల్లపు ప్రాంతంలో నీరు నిలుస్తుండడంతో గుంతలు పడుతోంది. అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు సిమెంట్ రోడ్డు వేస్తున్నాం. 15 రోజుల కిత్రం వేసిన బీటీ రోడ్డుపైనే సీసీ రోడ్డు వేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. పూర్వాపరాలు అధికారులను అడిగి తెలుసుకుంటాం. – పంతం రజనీశేషసాయి, మేయర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
సదుం: సదుం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, సర్పంచ్ సయ్యద్‌బాషాకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి సూచిం చారు. ఎర్రాతివారిపల్లెలోని స్వగృహంలో ఉన్న ఆయన్ను శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కలిశారు. సదుంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీ పలు సూచనలు చేశారు. ఆర్టీసీ బస్టాండు నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నా రు. షాదీమహల్ పునర్నిర్మాణ పనుల పై అధికారులతో ఫోన్లో చర్చించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఆ నిధులతో పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నూతన తాగునీటి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటుపై చర్చించారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆరా తీశారు. అభివృద్ధిలో సదుం పంచాయతీని ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఖాజాపీర్, రమేష్, ఖమ్రుద్దీన్, విద్యార్థి విభాగం నాయకులు బావాజీ, మదన్, వంశీ, పీలేరు కో-ఆప్షన్ మెంబరు హబీబ్, పులిచర్ల వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ మురళీరెడ్డి, ధనశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికార దుర్వినియోగం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పాతపట్నంలోని కిమిడి-కళింగ రోడ్డు నుంచి శాఖా గ్రంథాలయం పక్క నుంచి హౌసింగ్ బోర్డుకాలనీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నెలరోజుల క్రితం ఓ సీసీ రోడ్డు వేశారు. ఈ వీధిలో పట్టుమని పది ఇళ్లు కూడా లేవు. అక్కడ ఓ టీడీపీ నేత భారీ భవంతి ఉంది. ఆ ఇంట్లో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం కూడా నడుస్తోంది. పాతపట్నం మేజర్ పంచాయతీలో సుమారు 50 రోడ్లు ఉన్నాయి. వీటిలో 30 రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వీటి బాగు పట్టని ఇంజినీరింగ్ అధికారులు పార్టీ కార్యాలయం ఉన్న వీధిపై అవ్యాజమైన ప్రేమ చూపడంపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏలోని ఎన్ఆర్ఈజీఎస్ విభాగం నుంచి సుమారు రూ.7లక్షలు మంజూరు చేసి ఈ రోడ్డు వేశారని తెలిసింది. అయితే తమకేమీ తెలియదని, ఊర్లో చాలా ప్రాంతాల్లో రోడ్లు మంజూరయ్యాయని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఇక్కడ రోడ్డు వేశామని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. సుమారు 60 మీటర్ల సీసీ రోడ్డు పనులు పూర్తి కాగా మరో 90మీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్టీలు లేని ఊర్లో ఎస్టీ గ్రాంట్లు ఇదిలా ఉంటే గ్రామంలో రోడ్ల పనుల నిమిత్తం ఐటీడీఏలోని ఎస్టీ గ్రాంట్ల నిధుల నుంచి సొమ్ము ఖర్చుచేసినట్టు తెలిసింది. అసలు ఎస్టీలే లేని ఆ ప్రాంతంలో ఎస్టీ నిధులు ఎలా వినియోగిస్తారన్నది మరో ప్రశ్న. ఓ ప్రైవేట్ వ్యక్తికి సంబంధించి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పేరిట రోడ్డు వేయడం ఓ ఎత్తయితే ఇదేమీ తమకు తెలియదని, ఈ రోడ్డు కోసం తామేమీ నిధులు ఖర్చుచేయలేదని ఇంజినీర్లు చెబుతుండడం మరో ఎత్తు. ఆ ప్రాంతం పూర్తిగా థ్వంసం కావడంతో రోడ్డు వేశామని చెబుతున్నా గ్రామంలో ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మరివాటి మాటేమిటో అధికారులే చెప్పాలి. అధికారులే దగ్గరుండి వేయించారు టీడీపీ కార్యాలయానికి అనుబంధంగా అధికారులే దగ్గరుండి సీసీ రోడ్డు పనులు చేయించారు. పంచాయతీకి సంబంధించి నిధులేవీ ఖర్చుచేయలేదు. హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వేయాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. పాతపట్నం పరిధిలో చాలా రోడ్లకు డ్రైనేజీ సౌకర్యం లేదు. అలాంటప్పుడు ఏ విభాగం నుంచి నిధులు ఖర్చుచేశారన్నది అంతులేని ప్రశ్నగా మిగిలిపోతోంది. మహిళా సమాఖ్య భవనం నుంచి అనుబంధ(అప్రోచ్) రోడ్డుకు, ఇతర రోడ్లకు సంబంధించి వాస్తవానికి ఎక్కడ రోడ్డు పనులు మంజూరయ్యాయన్నది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదే విషయమై ఐటీడీఏ ఏఈ సింహాచలాన్ని వివరణ కోరగా రోడ్డు పనులు మంజూరు కావడం వాస్తవమేనని, అయితే టీడీపీ కార్యాలయానికి తామే రోడ్లు వేయించామన్నది అవాస్తవమన్నారు. ఖర్చెవరిది? గ్రామంలో రోడ్లు వేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ మిగతా రోడ్లపై లేని ప్రేమ టీడీపీ కార్యాలయంపైనే ఎందుకుందన్నది అనుమానం. ఎస్టీ గ్రాంట్ల నుంచి నిధుల్ని ఎస్టీలు లేని ప్రాంతంలో ఎలా ఖర్చుచేశారు. పోనీ అక్కడ వేసిన సీసీ రోడ్డుకు ఎవరు నిధులు మంజూరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయన్నది తక్షణమే వెల్లడించాలి. - కలమట వెంకటరమణ మూర్తి, ఎమ్మెల్యే, పాతపట్నం. -
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
వరంగల్: వరంగల్ మండలంలోని శ్రీసాయినగర్‌కాలనీలో సీసీ రోడ్డు పనులను స్థానిక వర్ధన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల విలువైన రోడ్డు పనులను విడుదల చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా కాలనీలో నిర్వహించిన ముగ్గులు పోటీలు, ఆటల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో స్థానిక జడ్పీటీసీ నాయకులు పాల్గొన్నారు. (రంగశాయిపేట)