మౌలిక సదుపాయాల కల్పనకు కృషి | Foundation laid for CC Road | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

Published Mon, Mar 26 2018 11:28 AM | Last Updated on Mon, Mar 26 2018 11:28 AM

Foundation laid for CC Road - Sakshi

నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే 

కొండమల్లేపల్లి : నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు. ఆదివా రం కొండమల్లేపల్లిలో రూ. 10లక్షలతో నిర్మిస్తు న్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మండల పరిధిలోని దోనియాలలో రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడు తూ టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్టీ అభివృద్ధి నిధుల నుంచి అన్ని తండాలకు బీటీ రోడ్ల నిర్మా ణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  వైస్‌ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి,  రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ కేసాని లింగారెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్‌ అందుగుల ముత్యాలు,  పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, వస్కుల కాశయ్య,  ఎలిమినేటి సాయి, అబ్బనబోయిన శ్రీనివాస్‌ యాదవ్, వెంకటేశ్, కుంభం శ్రీనివా స్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మున్సిపాలిటీ అప్‌ గ్రేడ్‌పై హర్షం

దేవరకొండ : దేవరకొండను నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయడంలో కృషి చేసినందు కు నగరపంచాయతీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటిగా అప్‌గ్రేడ్‌ కా వడంపై హర్షం వ్యక్తం చేస్తూ దేవరకొండ అభివృద్ధికి దోహదపడుతుం దని అన్నారు. వైస్‌ చైర్మన్‌ జాన్‌యాదవ్‌ ఎమ్మెల్యేకు శా లువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, కౌన్సి లర్లు వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, పొట్ట సుగుణయ్య, రాజినేని వెంకటేశ్వర్‌రావు, నాగవరం ప్రభాకర్‌రావు, రమావత్‌ దస్రూ నాయక్, పస్నూరి వెంకటేశ్వరెడ్డి, ఉప్ప ల శ్రీను, మాడ్గుల యాదగిరి, రాజు, కృష్ణ, మధు, ఇద్దయ్య, మునిందర్‌రెడ్డి, సుబ్బారావు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement