mandals
-
AP: 54 కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. రాష్ట్రంలో తీవ్ర కరువు మండలాలు అనంతపురం జిల్లా: నార్పల, అనంతపురం శ్రీసత్యసాయి జిల్లా: తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల అన్నమయ్య జిల్లా: గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, టి సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురుబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.చిత్తూరు జిల్లా: పెనుమూరు, యాదమర్రి, గుడిపాల.కరువు మండలాలు కర్నూలు జిల్లా: కౌతాలం, పెద్దకడుబూరుఅనంతపురం జిల్లా: విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు శ్రీసత్యసాయి జిల్లా: కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి.చిత్తూరు జిల్లా: శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం. -
అల్లూరిజిల్లా విలీన మండలాల్లో వరద బీభత్సం
-
మండల, జిల్లా, పరిషత్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: మండల, జిల్లా పరిషత్‌ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం తలసరి నిధుల్లో గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు కూడా నిధులను కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన నిష్పత్తి ఆధారంగా తొలి త్రైమాసికానికి సంబంధించిన నిధులను రాష్ట్రానికి విడుదల చేయగా.. వాటిని జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పంపిణీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.రఘునందన్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది రూ.1,847 కోట్లు ఖరారు చేయగా.. ఇందులో మొదటి విడత (తొలి త్రైమాసికం)గా రూ.308 కోట్లు విడుదల చేసింది. జెడ్పీ 5%, ఎంపీపీలకు 10% నిధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. 2014–15లో అమలు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కొరత ఏర్పడింది. కేవలం సీనరేజీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులపైనే ఆధారపడాల్సి వచ్చింది. నిధుల కటకటతో నీరసించిన జెడ్పీ, ఎంపీపీలకు కూడా కొంతమేర కేటాయించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో వీటికి ఊరట లభించింది. గ్రామ పంచాయతీలకు 75 శాతం, మండల పరిషత్‌లకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం నిష్పత్తిలో నిధులు పంచాలని నిర్ణయించింది. దీంతో తొలి త్రైమాసికానికి సంబంధించి రూ.461.75 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేసిన కేంద్రం.. టైడ్ గ్రాంట్ కింద రూ.308 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా పరిషత్‌లకు రూ.1,026.11 లక్షలు, మండల పరిషత్‌లకు రూ.2,052.20 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.27,721.67 లక్షలను నిర్దేశించింది. వీటిని సాధారణ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ల కింద వినియోగించుకోవాలని సూచించింది. ఈ నిధులతో తాగునీటి సౌకర్యాల కల్పన, వాననీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ, డోర్‌టుడోర్ చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రం, ప్లాస్టిక్ సేకరణ, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్‌రావు ఆదేశించారు. -
పల్లెల్లోకి కరోనా
సాక్షి, హైదరాబాద్ : నగరాలు, పట్టణాలను చుట్టేసిన కరోనా ఇప్పుడు పల్లెల్లోకి చొచ్చుకెళ్తోంది. మొదట్లో హైదరాబాద్ నగరం సహా కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో మాత్రమే కేసులు నమోదయ్యేవి. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా, ఆ తర్వాత మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా పాజిటివ్ కేసులు వచ్చాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉండి వచ్చిన వలస కార్మికుల ద్వారా కేసులు విస్తరించాయి. తద్వారా హైదరాబాద్ నగరం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పల్లెల నుంచి పట్టణాలు, నగరాల్లో ఉపాధి కోసం వచ్చినవారు, లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తిరిగి గ్రామాలకు వెళ్లారు. దీంతో పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 270 మండలాలు, 1,500 గ్రామాల్లోకి వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. వచ్చేనెలలో దాదాపు ఐదు వేల గ్రామాల్లో వైరస్ వ్యాప్తి జరుగుతుందని అంచనా వేసింది. సామాజిక వ్యాప్తి కారణంగా ఈ పరిస్థితి నెలకొందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ద్వితీయశ్రేణి పట్టణాలు, అన్ని మున్సిపాలిటీల్లోనూ వైరస్ వ్యాప్తి చెందిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1,100 కేంద్రాల్లో యాంటిజెన్ కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తుండటంతో కూడా పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇదిలావుంటే గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో కేసులు పెరుగుతుండటంతో ఆ మేరకు వైద్య వసతులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోనూ కరోనాకు సంబంధించిన చికిత్స కోసం అవసరమైన వైద్య వసతులు, వెంటిలేటర్లు లేక సీరియస్ కేసులను హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. కొందరు వైద్యులు కూడా బాధితులకు సీరియస్‌గా ఉంటే హైదరాబాద్‌కే పంపిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది. ఫీవర్ సర్వే... గ్రామాల్లోనూ కరోనా బాధితులు పెరుగుతుండటంతో క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి గ్రామంలో 150 వరకు కొత్త ముఖాలు ఉన్నట్లు గుర్తించారు. వారంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, ఇప్పటిదాకా ఉపాధి ఉద్యోగాల రీత్యా నగరాలకు వెళ్లి వచ్చినట్లుగా తేల్చారు. చాలా ఏళ్ల తర్వాత వారు స్వగ్రామాలకు వచ్చినట్లు తేలింది. ఫలితంగా గ్రామాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ప్రస్తుతం ద్వితీయ శ్రేణి పట్టణాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నాయని, ఆగస్టు చివరి నాటికి మరింత పెరుగుతాయని అంచనా వేశారు. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ కేసులు నమోదుకాకపోవడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ పెద్దగా దెబ్బతినలేదు. వ్యవసాయ రంగంపైనా పెద్దగా ప్రభావం పడలేదు. మున్ముందు కేసులు పెరిగితే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వైద్య వర్గాలను కలవరపెడుతోంది. అయితే పట్టణాలు, నగరాలతో పోలిస్తే పల్లెల్లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాల్లో దగ్గర దగ్గరగా ఉండి పనిచేయాల్సిన పరిస్థితి కూడా ఉండదు. దీనివల్ల వైరస్ వ్యాప్తి తక్కువగా ఉండొచ్చని అంటున్నారు. ఒకవేళ వైరస్ వ్యాపిస్తే మాత్రం వైద్య ఆరోగ్య సదుపాయాలు పట్టణాల్లో మాదిరిగా ఉండవని ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా స్థానిక వైద్యులు, ప్రైవేట్ ప్రాక్టీషనర్లపైనే ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. వైరస్‌ను సరైన సమయంలో అంచనా వేయకపోతే ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి పల్లెల్లో కేసుల నియంత్రణ, చికిత్స, ముందస్తు గుర్తింపుపై ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయాలు... ►కరోనా లక్షణాలుంటే స్థానిక ప్రైవేట్ ప్రాక్టీషనర్లు వెంటనే అప్రమత్తం అవ్వాలి. అలాగే ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వారిని గుర్తించాలి. ►అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలి. అవసరమైతే వైరస్ నిర్ధారణ పరీక్షలకు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ►దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ముందుగానే చికిత్స అందించాలి. అందుకోసం మందులను 104 సర్వీసు ద్వారా అందించాలి. ►పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులను మరింత బలోపేతం చేయాలి. అన్నిచోట్లా యాంటిజెన్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ►గ్రామాల్లో భయాందోళనలు తలెత్తకుండా వారిలో చైతన్యం తీసుకురావాలి. అందుకోసం ప్రచారం నిర్వహించాలి. కరపత్రాలు వేయాలి. స్థానిక మీడియాను ఉపయోగించుకోవాలి. ►కొత్తగా తీసుకువచ్చే వంద ‘108’ అంబులెన్స్‌లను గ్రామాల్లో కరోనా సేవలకే కేటాయించాలి. ►అత్యవసర కేసులను సమీప ఆసుపత్రికి తీసుకొచ్చేలా జిల్లా వైద్యాధికారులు, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. -
కరవు మండలాల ప్రకటన కంటితుడుపే
ప్రభుత్వాల మతిమాలిన విధానాలు రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. కరవు మండలాల ప్రకటన కంటితుడుపు చర్యే అయింది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన పెథాయ్ మిగిలి ఉన్న కాస్త పంటను తుడిచేసింది. ఎన్నికల ముంగిట అన్నదాతలను బురిడీకొట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కరవు మండలాల ప్రకటన ఏమాత్రం అక్కరకు రాలేదు. రుణాలు రీషెడ్యూల్ అవుతాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. రుణాలపై వడ్డీ మాఫీ లేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ జాడలేదు. వ్యవసాయ కూలీలకు అదనపు పనిదినాలు కల్పించలేదు. సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గత ఖరీఫ్‌లో సగానికి పైగా సాగు విస్తీర్ణం ఎండిపోయింది. మిగిలిన సగం పంటను పెథాయ్ తుడిచిపెట్టేసింది. గత ఖరీఫ్‌లో1,97,100 హెక్టార్లలో పంటలు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 1,75,782 హెక్టార్లలోనే సాగు చేయగలిగారు. అందులో 1.05 లక్షల హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా, అతికష్టమ్మీద 99,900 హెక్టార్లలో పంటలు వేయగలిగారు. దాంట్లో అధికారిక లెక్కల ప్రకారం వర్షాభావ పరిస్థితుల వల్ల 40వేల హెక్టార్లలో పంట ఎండిపోయింది. పెథాయ్ తుఫాన్ ప్రభావానికి 25వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఎకరాకు పట్టుమని 12–15 బస్తాలకు మించిదిగుబడి రాలేదు. పైగా రంగుమారిపోయి మద్దతు ధర మాట దేవుడెరుగు కనీసం గిట్టుబాటు ధర కూడా రాని దుస్థితి చోటుచేసుకుంది. ఇలా రూ.170 కోట్లకు పైగా విలువైన పంటను కోల్పోయారు. ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కరవుమండలాలు ప్రకటించాలన్న డిమాండ్ వ్యక్తమైంది. ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకతీతంగా ముక్తకంఠంతో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రెండుసార్లు జెడ్పీ సర్వసభ్యసమావేశాల్లోనూ తీర్మానాలు చేశారు. కానీ డ్రైస్పెల్స్, ఇతర నిబంధనలను సాకుగా చూపి జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరవు ప్రాంతంగా ప్రకటించ లేదు. ఖరీఫ్ దెబ్బతో రబీ సాగుకు కూడా అన్నదాతలు దూరంగా ఉన్నారు. కనీసం చేతికొచ్చిన పంటైనా ఆశించిన దిగుబడి నిచ్చిందా? అంటే అదీ లేదు. ఎన్నికల ముంగిట కరవు చాయలుకమ్ముకోవడంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపైతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృషికి తీసుకొచ్చారు. రైతన్నలను శాంతింప చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ ముందు మొక్కుబడిగా కరవు మండలాల ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వాటిలో 228 తీవ్ర కరవు మండలాలుగా, మరో 29 మోడరేట్ డ్రౌట్ ప్రాంతాలుగా పేర్కొంది. జిల్లాలో 29 మండలాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వాటిలో ఒక్కదానికీ తీవ్ర కరవుమండలాల జాబితాలో చోటు దక్కలేదు. ప్రకటించిన 29 మండలాలు మోడరేట్ డ్రౌట్ మండల్స్ జాబితాలోనే ఉన్నాయి. పైగా ప్రకటించిన 29మండలాల్లో ఎలాంటిసాగు లేని విశాఖపట్నం అర్బన్, గాజువాక, పెదగంట్యాడ, పరవాడ మండలాలతో పాటు పెద్దగా సాగు లేని ఆనందపురం, భీమునిపట్నం, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఉండడం గమనార్హం. కానరాని సాయం.. సాధారణంగా ప్రకటించిన కరవు మండలాల్లో డ్రై స్పెల్, క్రాప్ కటింగ్ ఎక్స్పరమెంట్ ప్రకారం నష్టపోయిన రైతులకు సాగు విస్తీర్ణం, పంటలను బట్టి ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) ప్రకటిస్తారు. తీసుకున్న రుణాలన్నీ రీషెడ్యూల్ అవుతాయి. పైగా రుణాలపై వడ్డీ మాఫీ ఉంటుంది. కరవు మండలాల్లో వ్యవసాయ కూలీలకు అదనంగా 50 పనిదినాలు కల్పిస్తారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తారు. కొత్తగా రుణాలు కూడా మంజూరు చేస్తారు. కానీ కంటితుడుపు చర్యగా కరవు మండలాల ప్రకటన వల్ల రైతులకు , రైతు కూలీలకు ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదు. ఖరీఫ్‌లో రూ.2371కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఏకంగా రూ.2390కోట్ల రుణాలు ఇచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు. వాటిలో 80శాతం రీషెడ్యూల్ అయినవే. వీటిపై వడ్డీ కూడా ఏటా రూ.200కోట్ల వరకు చెల్లిస్తున్నారు. కరవు మండలాల ప్రకటన వల్ల ఖరీఫ్‌లో ఇచ్చిన రుణాలన్నీ మళ్లీ రీషెడ్యూల్ అవుతాయని రైతులు ఆశించారు. కానీ ఒక్క రూపాయి కూడా రీషెడ్యూల్ కాలేదు. అంతేకాదు కనీసం తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదు. కనీసం ప్రీమియం చెల్లించిన వారికైనా బీమా సొమ్ము దక్కుతుందా అంటే అదీ లేదనే చెప్పాలి. ఇక కనీసం వ్యవసాయ కూలీలకైనా మేలు జరుగుతుందనుకుంటే అదీ లేదు. ఉపాధి హామీ పథకంలో సాధారణ మండలాల్లో ఏటా కుటుంబానికి వందరోజులు పనిదినాలు కల్పిస్తే కరవు మండలాల్లో మాత్రం కూలీలకు 150రోజులు పనిదినాలు కల్పిస్తారు. జిల్లాలో పేరుకు 29 మండలాలు కరవు మండలాలుగా ప్రకటించినా ఏ ఒక్క మండలంలో ఏ ఒక్క కూలీకి అదనంగా ఒక్క రోజు పనిదినం కల్పించలేని దుస్థితి నెలకొంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హæడావుడిగా కరవు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం కరవు సాయం మాత్రం ప్రకటించకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు నష్టపోయాను.. నేను 60 సెంట్లలో వరిపైరు వేశాను. వర్షాభావ పరిస్థితులతో పంట పూర్తిగా ఎండిపోయింది. రూ.12 వేల మేర పెట్టుబడులు నష్టపోయాను.కరవు మండలాల ప్రకటనతో ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుందని ఆశించాం. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. కరవు మండలాల ప్రకటనకంటితుడుపు చర్యగానే మిగిలింది.– చదరం మాణిక్యం, రైతు, గణపర్తి పైసా సాయం లేదు నేను 50 సెంట్ల మేర చెరకుసాగు చేపట్టాను. ఇందుకోసం రూ.18వేలకు పైగా పెట్టుబడి పెట్టా. వర్షాలు లేక చెరకుతోట ఎండిపోయింది. మూడు పాకాలకు మించి దిగుబడి రాలేదు. కరవు మండలాల ప్రకటనతో ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూశాను. కానీ పైసా సాయం అందే పరిస్థితులు కన్పించడం లేదు. – భీశెట్టి అప్పారావు, రైతు, మునగపాక -
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి, తాడూరు: గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. శాసన సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిందో లేదో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా అధికారులు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో పాటు ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో అధికారుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్ధత ఏర్పడిన తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో ఎక్కడ ఎంపీటీసీ రిజర్వేషన్లు గ్రామాల పరిధిపై చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సహితం పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఆశావహుల్లో ఉత్కంఠ ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఆశావహుల్లో ఉత్కంఠతో పాటు మరి కొంత మంది ఏ విధంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పావులు కదుపుతున్నారు. గ్రామాల పునర్విభజన చేయడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మండలంలో ఆరు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాలలో ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు కాకపోవడం, ప్రస్తుతం రిజర్వేషన్లు అయిన తర్వాత అనుకూలంగా రాకపోవడంతో ఆశవాహుల్లో కొంత మేరనిరాశ, ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నాయకులు మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లతో మంతనాలు మొదలయ్యాయి. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లు ఇలా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళకు కేటాయించగా, పది ఎంపీటీసీ స్థానాలకు సిర్సవాడ జనరల్, భల్లాన్‌పల్లి జనరల్ మహిళ, తుమ్మలసుగూరు జనరల్, చర్ల తిర్మలాపూర్ ఎస్సీ మహిళ, ఇంద్రకల్ జనరల్ మహిళ, తాడూరు బీసీ మహిళ, యాదిరెడ్డిపల్లి బీసీ జనరల్, అల్లాపూర్ ఎస్సీ జనరల్, మేడిపూర్ జనరల్, అంతారం బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. -
జిల్లాలో 40 కరువు మండలాలు
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రబీ సీజన్లో కరువు మండలాలను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 228 మండలాలను తీవ్రమైన కరువు మండలాలుగా ప్రకటించగా అందులో ప్రకాశం జిల్లాలో 40 మండలాలు ఉన్నాయి. తీవ్రమైన కరువు జిల్లాల్లో ప్రకాశం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్ కడప జిల్లా 43 తీవ్ర కరువు మండలాలతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రకాశం 40, చిత్తూరులో 37, కర్నూలు 33, అనంతపురం 32, విజయనగరంలో 22 మండలాలలో తీవ్రమైన కరువు ఉన్నట్లు ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా ఒకమోస్తరు కరువు ఉన్నట్లు 29 మండలాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డి.వరప్రసాదు బుధవారం జీఓ ఎంఎస్ నంబర్–2 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఖరీఫ్ సీజన్లో ప్రకాశం జిల్లాలోని మొత్తం 56 మండలాలనుకరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం రబీలో ఏం వర్షాలు పడి పంటలు పండాయో గాని 16 మండలాలను తాజా జాబితాలో చేర్చలేదు. వర్షపాతం కూడా పూర్తి లోటుగా ఉన్నా కరువు మండలాల ప్రకటనలో మాత్రం ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కరువు మండలాలు ఇవే.. అద్దంకి, అర్ధవీడు, బేస్తవారిపేట, సీఎస్ పురం, చీమకుర్తి, కంభం, దొనకొండ, పెదదోర్నాల, గిద్దలూరు, హనుమంతునిపాడు, గుడ్లూరు, లింగసముద్రం, కొనకనమిట్ల, కారంచేడు, కొమరోలు, కనిగిరి, కొండపి, కొరిశపాడు, కొత్తపట్నం, మార్కాపురం, మర్రిపూడి, మార్టూరు, ఒంగోలు, పామూరు, పెద్దారవీడు, పీసీపల్లి, పొదిలి, పొన్నలూరు, పుల్లలచెరువు, సంతనూతలపాడు, సింగరాయకొండ, రాచర్ల, టంగుటూరు, తర్లుపాడు, తాళ్ళూరు, ఉలవపాడు, వెలిగండ్ల, వలేటివారిపాలెం, యద్దనపూడి, యర్రగొండపాలెం. -
నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ అధికారుల తీరు ‘నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు’ అన్న చందంగా ఉంది. జిల్లా అంతటా తీవ్ర కరువు పరిస్థితులు కన్పిస్తున్నా..వారి నిర్ధారణలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కేవలం ఏడు మండలాల్లోనే కరువు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పత్తికొండ వ్యవసాయ సబ్ డివిజన్లోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, డోన్ సబ్ డివిజన్లోని ప్యాపిలి, డోన్, ఆలూరు సబ్ డివిజన్లోని కౌతాళం మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు అంచనా వేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి నివేదికల కారణంగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. రెండు నెలలుగా వరుణుడు మొహం చాటేస్తున్నాడు. ఖరీఫ్‌లో రెండు నెలలు గడిచినా.. సాగు విస్తీర్ణం మాత్రం 51 శాతానికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనం. కౌతాళం, కోసిగి, శ్రీశైలం, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, ఆదోని, హొళగుంద, దేవనకొండ, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు, కోవెలకుంట్ల, బనగానపల్లి, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, శిరివెళ్ల, రుద్రవరం, కోడుమూరు, సంజామల, సి.బెళగల్, గూడూరు తదితర మండలాల్లో లోటు వర్షపాతం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని మండలాల్లోనూ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలని రైతులు, రైతుసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొనసాగుతున్న వర్షాభావం గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో ఆశాజనకంగా వర్షాలు పడగా.. ఈసారి మాత్రం అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక జూలైలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా ఒక్క మండలంలో మాత్రమే నమోదైంది. మిగిలిన 53 మండలాల్లోనూ లోటు వర్షపాతమే. ఖరీఫ్ సీజన్లో రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో నమోదైన వర్షపాతాన్ని చూస్తే జిల్లా అంతటా కరువు పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 77.2 మి.మీ ఉండగా.. 66.5 మి.మీ, జూలైలో 117.2 మి.మీకి గాను సోమవారం నాటికి 52.9 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం. జూలైలో కేవలం హాలహర్వి మండలంలో మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది. పగిడ్యాల మండలంలో సాధారణం మేరకు వర్షాలు పడినప్పటికీ 12 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. 20 శాతం వరకు లోటు ఉన్నా.. సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. మిగిలిన 52 మండలాల్లో 93 నుంచి 30 శాతం వరకు లోటు వర్షపాతం ఉండటం గమనార్హం. ఖరీఫ్ మొదటి రెండు నెలల్లోనే డ్రైస్పెల్‌లు రెండు ఉన్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యవసాయ యంత్రాంగం ప్రస్తుతం కరువు నివేదికను సిద్ధం చేస్తోంది. కాగా..గడువు ముగిసినందున ఇక మీదట వేరుశనగ సాగు చేయకపోవడమే మంచిదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
గ్రామానికి రాకుంటే మండలానికే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రైతుల పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. గ్రామాలవారీగా రెవెన్యూ యంత్రాంగం రైతుల వద్దకు వెళ్లి పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తోంది. అయితే అవగాహన లేమితోపాటు ఎండలు, శుభకార్యాల వంటి కారణాల వల్ల స్థానికంగా నివాసం ఉండని దాదాపు 25 శాతం మంది పాస్‌పుస్తకాలు తీసుకునేందుకు రావడం లేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ నెల 10 నుంచి 19 వరకు ఆ మండలంలోని ఏయే గ్రామాల్లో ఎప్పుడు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలో రెవెన్యూ యంత్రాంగం షెడ్యూల్ రూపొందించింది. ఉదాహరణకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో ఈ నెల 10 నుంచి 19లోగా ఏదో ఒకరోజు మాత్రమే పాస్‌పుస్తకాల పంపిణీకి షెడ్యూల్ ఇచ్చింది. చాలా మంది అవగాహన లేక ఈ నెల 10 నుంచి 19 వరకు ఆ గ్రామానికి ఎప్పుడు వెళ్లినా పాస్‌పుస్తకాలు ఇస్తారనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో షెడ్యూల్ ప్రకటించిన రోజును తేలికగా తీసుకుని వెళ్లడం లేదు. అయితే అలా షెడ్యూల్ రోజు గ్రామానికి వెళ్లి పాస్‌పుస్తకాలు తీసుకోని వారికి మళ్లీ ఆ గ్రామంలో పాస్‌పుస్తకాలు ఇవ్వబోమని రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. షెడ్యూల్ రోజు గ్రామానికి వెళ్లకపోతే నేరుగా మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాతే... ఈ నెల 10 నుంచి 19 వరకు సెలవు రోజుల్లో కూడా గ్రామాలవారీ షెడ్యూల్ ఉన్నందున ఏ గ్రామంలో షెడ్యూల్ ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన పాస్‌పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. ప్రతి రోజూ ఫలానా గ్రామంలో పంపిణీ చేసిన పాస్‌పుస్తకాల వివరాలను మొబైల్ యాప్ ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులకు పంపి మిగిలిపోయిన పాస్‌పుస్తకాలను ఎమ్మార్వో కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. మొత్తం అన్ని గ్రామాల్లో పంపిణీ పూర్తయ్యాకే మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూంల నుంచి బయటకు తీస్తారు. అంటే షెడ్యూల్ మేరకు పాస్‌పుస్తకం తీసుకోని రైతులు ఈ నెల 20 తర్వాతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం కోసం వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి తమ ఖాతా నంబర్ చెప్పాలని, పాస్‌పుస్తకం, రైతు తీసుకెళ్లిన ఆధార్‌లోని ఫొటోలు సరిపోలితే అక్కడే సంతకం తీసుకుని పాస్‌పుస్తకం ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
ప్లీనరీకి తరలిన టీఆర్ఎస్ నాయకులు
మద్దూరు : హైదబాద్‌లోని కొంపల్లిలో శుక్రవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే 17వ ప్లీనరీకి టీఆర్ఎస్ మండల నాయకులు తరలివెళ్లారు. పార్టీ రాబోయే రోజుల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత నిర్ణయాలపై సీఎం ఆదేశాల మేరకు మండలంలో ప్రచారం చేయడానికి ప్లీనరీకి వెళ్తున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. ప్లీనరీకి వెళ్లిన వారిలో సలీం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు విజయభాస్కర్‌రెడ్డి, జయప్రకాష్, అనంత్‌రెడ్డి తదితరులున్నారు. కోస్గి : తెలంగాణ రాష్ట్ర సమితి హైద్రాబాద్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీకి శుక్రవారం స్థానిక నాయకులు తరలివెళ్లారు.మండల పార్టీ అధ్యక్షుడు కిష్టప్ప, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనితబాల్‌రాజ్, ఎంపీటీసీ మ్యాకల రాజేష్, రైతు సమితి మండల కన్వీనర్ హన్మంత్‌రెడ్డి, నాయకులు ఓంప్రకాష్, మధుకర్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, మల్రెడ్డి, డీకే నాగేష్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు. దౌల్తాబాద్ : హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్లీనరీకి మండలంలోని నాయకులు, శ్రేణులు వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రతిగ్రామం నుంచి ఇద్దరు నాయకులు ప్లీనరీకి వెళ్లారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. బొంరాస్‌పేట : టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి మండల టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం తరలివెళ్లారు. మండలంలోని బురాన్‌పూర్, ఏర్పుమళ్ల, తుంకిమెట్ల తదితర గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇందులో మండల నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, శేరినారాయణరెడ్డి, మహేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
కొండమల్లేపల్లి : నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, తండాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివా రం కొండమల్లేపల్లిలో రూ. 10లక్షలతో నిర్మిస్తు న్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, మండల పరిధిలోని దోనియాలలో రూ. 5లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడు తూ టీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్టీ అభివృద్ధి నిధుల నుంచి అన్ని తండాలకు బీటీ రోడ్ల నిర్మా ణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కేసాని లింగారెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్ అందుగుల ముత్యాలు, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, వస్కుల కాశయ్య, ఎలిమినేటి సాయి, అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్, కుంభం శ్రీనివా స్‌గౌడ్ పాల్గొన్నారు. మున్సిపాలిటీ అప్ గ్రేడ్‌పై హర్షం దేవరకొండ : దేవరకొండను నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడంలో కృషి చేసినందు కు నగరపంచాయతీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటిగా అప్‌గ్రేడ్ కా వడంపై హర్షం వ్యక్తం చేస్తూ దేవరకొండ అభివృద్ధికి దోహదపడుతుం దని అన్నారు. వైస్ చైర్మన్ జాన్‌యాదవ్ ఎమ్మెల్యేకు శా లువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, కౌన్సి లర్లు వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, పొట్ట సుగుణయ్య, రాజినేని వెంకటేశ్వర్రావు, నాగవరం ప్రభాకర్‌రావు, రమావత్ దస్రూ నాయక్, పస్నూరి వెంకటేశ్వరెడ్డి, ఉప్ప ల శ్రీను, మాడ్గుల యాదగిరి, రాజు, కృష్ణ, మధు, ఇద్దయ్య, మునిందర్‌రెడ్డి, సుబ్బారావు ఉన్నారు. -
ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడొద్దు
కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాట్రావులపల్లిలో పంట కాల్వ పనులు పరిశీలన గ్రామంలో హైస్కూల్ తనిఖీ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి భూమి పూజ జగ్గంపేట : ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. జిల్లాలో కాకినాడ రూరల్ నుంచి పిఠాపురం, గొల్లప్రోలు, శంకవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర మండలాలలో గురువారం ఉదయం నుంచి ప్రభుత్వ పథకాల తీరుని పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన చేసిన ఆయన మండలంలోని కాట్రావులపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామ పరిధిలో పెద్దాపురం రోడ్డును ఆనుకుని పంట కాల్వ పూడిక తీత పనులను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని సిబ్బందికి సూచించారు. ఏపీఓ ఇచ్చిన నివేదిక చూసి పనులు శాతం ఇతర మండలాల కన్నా తక్కువగా ఉందని ఎక్కువ పనులు కల్పించి కూలి ఎక్కువ వచ్చేలా చూడాలన్నారు. అనంతరం సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను ప్రశ్నించగా కొద్ది మంది మాత్రమే తిన్నట్టు తెలిపారు. హెచ్ఎం చౌదరి స్పందించి వేసవి సెలవులు తరువాత సోమవారం నుంచి బడులు తీయడంతో హాజరు తక్కువగా ఉన్నందున 20 మందికి భోజనం పెట్టామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీల గురించి ప్రశ్నించగా 24 మంది ఉన్నారని, డ్రాయింగ్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. 300 మంది విద్యార్థులు ఉన్నారని హెచ్ఎం తెలిపారు. విద్యాబోధన, గేమ్స్, విద్యార్థులకు వస్తున్న మార్కులు తదితర వాటి గురించి ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీశారు. అక్కడ నుంచి గ్రామంలోని ఎస్సీపేట చేరుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నేతిపూడి చంటి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నేతిపూడి వెంకటరమణ ఇంటిని ప్రారంభించారు. హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఈఈ వేణుగోపాలరావులను లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒక బాలుడిని ఆపి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వేశ్వరరావు, డ్వామా పీడీ రాజకుమారి, ఎంపీడీఓ వాసుదేవరావు, ఏపీఓ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
విత్తన కేటాయింపులు పూర్తి
అనంతపురం అగ్రికల్చర్ : ఈ నెల 20వ తర్వాత బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన వేరుశనగ పంపిణీ మొదలు పెట్టడానికి వ్యవసాయశాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మండలాల వారీగా విత్తన కేటాయింపులు చేశారు. మొత్తం రూ.3.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకి అనుమతులు మంజూరయ్యాయి. అందులో ఏపీ సీడ్స్ ద్వారా 1,51,600 క్వింటాళ్లు, ఆయిల్‌ఫెడ్ ద్వారా 54 వేల క్వింటాళ్లు, మార్క్‌ఫెడ్ ద్వారా 44,400 క్వింటాళ్లు, వాసన్ ఎన్జీవో ద్వారా ఒక లక్ష క్వింటాళ్లు సేకరించే బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏపీ సీడ్స్‌కు 34 మండలాలు, ఆయిల్‌ఫెడ్‌కు 15 మండలాలు, మార్క్‌ఫెడ్‌కు 13 మండలాలు, వాసన్ ఎన్జీవోకు తనకల్లు మండలం కేటాయించారు. అలాగే వాసన్‌కు మరో 43 మండలాల్లో ఎంవీకేల ద్వారా కొంత మొత్తంలో పంపిణీ చేసే బాధ్యతను అప్పగించారు. కేటాయింపుల్లో పంట విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ముదిగుబ్బ, గుంతకల్లు, కూడేరు మండలాలకు అత్యధికంగా 9,500 క్వింటాళ్ల చొప్పున, విస్తీర్ణం తక్కువగా ఉన్న తాడిపత్రి, హిందూపురం, పుట్లూరు, పెద్దపప్పూరు మండలాలకు 1,500 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఈ సారి ఒక్కో రైతుకు మూడు కాకుండా నాలుగు బస్తాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో అదనంగా మరో లక్ష క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా 85 వేల క్వింటాళ్లకు అనుమతి వచ్చినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వాటిలో అన్ని మండలాలకు అదనంగా 500 నుంచి 1,500 క్వింటాళ్ల వరకు కేటాయించనున్నారు. ఇంకా ధరలు, రాయితీలు ఖరారు కావాల్సి ఉండటంతో విత్తన పంపిణీ తేదీలపై స్పష్టత కొరవడినట్లు చెబుతున్నారు. మండలాల వారీగా కేటాయింపులు ఇలా... ––––––––––––––––––––––––––––––––––––––––– మండలం క్వింటాళ్లు మండలం క్వింటాళ్లు ––––––––––––––––––––––––––––––––––––––––– అనంతపురం 5,900 ఆత్మకూరు 7,000 బీకేసముద్రం 5,500 కూడేరు 9,500 రాప్తాడు 6,500 బత్తలపల్లి 5,800 ధర్మవరం 7,750 తాడిమర్రి 5,300 గుత్తి 7,500 గాండ్లపెంట 4,300 పెద్దపప్పూరు 1,500 యాడికి 5,150 పెనుకొండ 6,000 బెళుగుప్ప 5,900 రొద్దం 7,800 సోమందేపల్లి 3,500 తాడిపత్రి 1,500 యల్లనూరు 2,600 గుంతకల్లు 9,500 విడపనకల్ 4,500 శింగనమల 6,500 అమడగూరు 4,700 కదిరి 5,900 ఎన్పీ కుంట 2,800 నల్లచెరువు 3,900 కంబదూరు 5,000 పుట్టపర్తి 5,500 పెద్దవడుగూరు 4,700 చెన్నేకొత్తపల్లి 7,500 గార్లదిన్నె 7,000 కనగానపల్లి 9,200 రామగిరి 6,500 చిలమత్తూరు 5,000 పామిడి 5,700 గోరంట్ల 7,500 హిందూపురం 1,500 ముదిగుబ్బ 9,500 పరిగి 2,000 నల్లమాడ 6,200 ఓడీచెరువు 5,800 బ్రహ్మసముద్రం 5,500 తలుపుల 5,500 కళ్యాణదుర్గం 7,700 శెట్టూరు 6,600 అమరాపురం 4,800 అగళి 3,600 గుడిబండ 5,500 మడకశిర 7,800 బుక్కపట్టణం 5,200 రొళ్ల 4,300 కొత్తచెరువు 6,400 బొమ్మనహాల్ 2,500 లేపాక్షి 3,000 కుందుర్పి 7,200 వజ్రకరూరు 8,500 ఉరవకొండ 8,200 డి.హిరేహాల్ 4,000 గుమ్మఘట్ట 3,000 కనేకల్లు 4,500 రాయదుర్గం 4,500 నార్పల 6,500 పుట్లూరు 1,500 తనకల్లు 8,300 -
12న 3కే, 5కే రన్
– కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కర్నూలు(అర్బన్): అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 12న అన్ని మండల కేంద్రాల్లో 3కే రన్, జిల్లా కేంద్రంలో 13న 5కే రన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ డీఎస్డీఓ మల్లికార్జునుడుని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో ఈనెల 14న 125వ అంబేద్కర్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే యువతీ యువకులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేయాలన్నారు. నగరంలో 13వ తేదీ కలెక్టరేట్ నుండి కొండారెడ్డి ఫోర్ట్ వరకు 5కే రన్ నిర్వహించాలన్నారు. నర్సింగ్, మెడికల్ కళాశాల విద్యార్థులు రన్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అంబేద్కర్ సర్కిల్లో డయాస్ ఏర్పాటు, పూలమాల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగస్వాములైన వాళ్లందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, మెప్మా పీడీ రామాంజనేయులు, మైనార్టీ సంక్షేమాధికారి మస్తాన్ వలి, సాంఘిక సంక్షేమాధికారి తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
26 మండలాల్లోనే కరువు!
తేల్చిన అధికారులు - ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలు 36 - 10 మండలాల్లో ఆ ఛాయలు లేవంటున్న అధికార యంత్రాంగం - రూ.327.08 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి నివేదిక - 2,51,578.50 హెక్టార్లలో పంట నష్టం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కేవలం 26 మండలాల్లోనే కరువు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం 36 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా 10 మండలాల్లో పంటలు బాగా పండాయని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, అవుకు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, గోస్పాడు, శిరువెల్ల, కొత్తపల్లి, బండిఆత్మకూరు మండలాల్లో కరువు లేదని రిపోర్టు ఇవ్వడంతో ఎన్యూమరేషన్ జరుగలేదు. దీంతో రైతులు ఇన్పుట్ సబ్సిడీకి దూరమయ్యారు. 26 మండలాల రైతులకే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు జిల్లా యంత్రాంగం నివేదిక సిద్ధం చేసింది. 26 మండలాల్లో ఎన్యూమరేషన్ పూర్తయింది. ఇన్పుట్ సబ్సిడీకి తుది జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 3,08,455 మంది రైతులు 2,51,578.50 హెక్టార్లలో వివిధ పంటలను కోల్పోయారు. వీరికి ఇన్పుట్ సబ్సిడీ రూ.327కోట్ల విడుదలకు జిల్లా యంత్రాంగం నివేదిక సిద్ధం చేసింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. -
కరవు మండలాలు ప్రకటిస్తే సరిపోదు
సాక్షి, అమరావతి: కరవు మండలాలు ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదని.. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల పేరిట పీసీసీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోడుమూరులో శనివారం పెద్ద ఎత్తున రైతు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామన్నారు. అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ పేరుతో కోట్లాది రూపాయల ఖర్చు చేసి లక్షలాది ఎకరాల పంటను కాపాడినట్లు ప్రచారం చేసుకున్న ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రెయిన్ గన్స్ పేరిట ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాన్ని త్వరలో రైతులే నిలదీస్తారన్నారు. కోడుమూరులో నిర్వహించే రైతు సభ ద్వారా.. రైతులకు మనోధైర్యం నింపడంతో పాటు పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. -
జిల్లాలో నాలుగు కొత్త అర్బన్ మండలాలు
– ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రెవెన్యూ అధికారులు – కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్లు అర్బన్ మండలాలుగా మార్చేందుకు కసరత్తు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఈ దిశగా జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, అర్బన్ మండలాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. తాజాగా కొత్తగా నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని తలపెట్టారు. తాను ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త డివిజన్లు, ఆర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేఈ కృష్ణమూర్తి ఉన్నారు. కర్నూలు నగరం, నంద్యాల, ఆదోని, డోన్ పట్టణాలను అర్బన్ మండలాలుగా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. అర్బన్, రూరల్ ప్రాంతాలు కలిపి ఒకే మండలంగా ఉండటం వల్ల పరిధి పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడుతోంది. సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లపై పని ఒత్తిడి పెరిగిపోతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నాలుగు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయలనే నిర్ణయానికి వచ్చారు. కర్నూలు నగరాన్ని అర్బన్ మండలం చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. ప్రభుత్వం కూడా దీనిని ఆమోదించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా కర్నూలుతో పాటు మరో మూడు అర్బన్ మండలాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇవి ఏర్పాటయితే జిల్లాలో మండలాల సంఖ్య 58కి చేరనుంది. -
జిల్లాలో 36 కరువు మండలాలు
– జిల్లా యంత్రాంగం ప్రతిపాదించిన మండలాలు 38 –రుద్రవరం, దొర్నిపాడుకు మొండిచేయి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా యంత్రాంగం 38 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఈనెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం రుద్రవరం, దొర్నిపాడు మండలాలను మినహాయించి మిగిలిన 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ జీఓ 9 విడుదల చేసింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు, ఆగస్టులో వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెళ్లు ఉన్న మండలాలు, సాధారణ సాగు కంటే 50 శాతం తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగైన మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించింది. త్వరలోనే ఈ మండలాల్లో పంట నష్టంపై సర్వే నిర్వహించే అవకాశం ఉంది. కరువు మండలాలు ఇవే.. పెద్దకడుబూరు, హొళగుంద, ఆలూరు, శిరివెళ్ల, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండిఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, గోస్పాడు, కోయిలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని. -
జిల్లాలో 38 కరువు మండలాలు
– ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నివేదిక కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 38 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ సంస్థకు నివేదిక పంపారు. వర్షాలు అతి తక్కువగా పడటం, సాగు 50శాతం కంటే తక్కువ ఉండటం, వర్షానికి, వర్షానికి ఉన్న వ్యవధిని బట్టి 38 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. ప్రభుత్వం ఇటీవల కరువు ప్రాంతాలను ప్రకటించేందుకు ప్రతిపాదనలు పంపాలని మార్గదర్శకాలు పంపింది. ఈ నెల7వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగన్ని ఆదేశించింది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో సాధరణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే 50 శాతం కంటే తక్కువ సాగైన మండలాలు మూడు ఉన్నాయి. వరుసగా 28 రోజుల పాటు వర్షాలు పడని మండలాలు 26 ఉన్నాయి. కరువు ప్రాంతాలుగా ప్రతిపాదించిన మండలాలు ఇవే... పెద్దకడుబూరు, హొళగొంద, ఆలూరు, శిరివెళ్ల, రుద్రవరం, దొర్నిపాడు, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండిఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యలవాడ, గోస్పాడు, కోవెలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని. -
మార్పులు చేర్పులు
సిరిసిల్ల జిల్లా భౌగోళిక స్వరూపంపై హైపవర్ కమిటీకి నివేదిక సెస్ లేదా ఆర్డీవో కార్యాలయంలో కలెక్టరేట్‌ను ఓకే చేసే అవకాశం రత్నాపూర్, పాలకుర్తి, పలిమెల, హుస్నాబాద్‌రూరల్ మండలాలపై సానుకూలత! సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : దసరా పండగకు సమయం దగ్గర పడుతోంది. కొత్త జిల్లాల్లో మార్పులు చేర్పుల కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో నాలుగు కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ జిల్లా అధికారయంత్రాంగం రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆధ్వర్యంలోని హైపవర్ కమిటీకి నివేదించింది. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా భౌగోళిక స్వరూపం, జనాభా, కొత్త మండలాలు, కలెక్టరేట్ ఏర్పాటు వంటి అంశాలపై రూపొందించిన ప్రతిపాదనను కూడా హైపవర్ కమిటీకి పంపింది. సిరిసిల్ల కలెక్టరేట్ భవనాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాన్ని బుధవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మంత్రి పర్యటన వాయిదాపడింది. సెస్ లేదా ఆర్డీవో కార్యాలయంలో కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసే అవకాశముంది. మరోవైపు హుస్నాబాద్, కోహెడ, కోరుట్లలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని మంగళవారం హుస్నాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుట్లలో ఆందోళన కొనసాగించారు. తాజాగా కమలాపూర్ మండలాన్ని కూడా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి విడదీయొద్దని అధికార పార్టీ ఆధ్వర్యంలోనే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఆ నాలుగు ఖాయం... జిల్లా అధికారయంత్రాంగం కొత్తగా ప్రతిపాదించిన నాలుగు మండలాల ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. కమాన్‌పూర్ మండలంలోని రత్నాపూర్, రామగుండంలోని పాలకుర్తి, మహదేవపూర్‌లోని పలిమెల, హుస్నాబాద్‌రూరల్ మండలాలను ఏర్పాటు చేయాలని పంపిన ప్రతిపాదనలకు హైపవర్ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు సమాచారం. మరోవైపు హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ గతనెలలో సూచించినప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కసరత్తు ప్రక్రియ ఈనెల 7వరకు కొనసాగనుండటంతో ఇంకా మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ స్వస్థలమైన కమలాపూర్ మండలాన్ని కూడా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో దీనిపైనా హైపవర్ కమిటీ దష్టి సారించినట్లు తెలుస్తోంది. హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కలపాలని తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో వీటిపై ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగుల విభజన.. ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఉద్యోగులను విభజించారు. తాజాగా సిరిసిల్ల జిల్లాకు ఉద్యోగులను సర్దుబాటు చేయాల్సి వస్తోంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులో మార్పులు చేయకుండా.. కరీంనగర్ జిల్లాకు కేటాయించిన వారి నుంచే సిరిసిల్లకు సర్దుబాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలకు ఉద్యోగుల విభజనపై నేడు లేదా రేపటి వరకు స్పష్టవచ్చే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. సిరిసిల్ల జిల్లా స్వరూపమిదే... జిల్లాలో పాత, కొత్త మండలాలు కలిపి మొత్తం 14 ఉన్నాయి. ప్రస్తుతానికి 179 గ్రామాలతో కొత్త జిల్లాను ప్రతిపాదిస్తూ అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండంలోని కొన్ని గ్రామాలను సిరిసిల్ల జిల్లాలో కలిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నాను. దీనిని నిరసిస్తూ అక్కడి గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిపాదిత సిరిసిల్ల జిల్లా జనాభా 5.65 లక్షలు. ఈ జిల్లాలోని మండలాల్లో సగటు గ్రామాల సంఖ్య 12. వీర్నపల్లి అతి చిన్న మండలం. 15 వేల జనాభాతో మండలాన్ని ప్రతిపాదించారు. 92 వేల జనాభాతో అతిపెద్ద మండలంగా సిరిసిల్ల అర్బన్ అవతరించనుంది. -
మండలాల కోసం లొల్లి
మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మానుకోట నాయకుల డిమాండ్ ప్రభుత్వంపై ఒత్తిడికి సన్నద్ధం మహబూబాబాద్ : మానుకోట జిల్లా కోసం తీవ్రస్థాయిలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ముసాయిదా లో మానుకోట పేరు ప్రకటించగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ పలు గ్రామాల ను మండలాలు చేయాలని, రెవెన్యూ డివిజన్లు చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఆయా డిమాండ్ల సాధనకు నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. మానుకోట జిల్లా 12 మండలాలతో ఏర్పాటు కానుంది. ఇందు లో మానుకోట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, డోర్నకల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, ములుగు డివిజన్లోని కొత్తగూడ మండలాలు ఉన్నాయి. 7,54, 845 జనాభా, 3463.89 కిలోమీటర్ల విస్తీర్ణంతో జిల్లా ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైంది. పాత రెవెన్యూ డివిజన్లో 16మండలాలు ఉన్నాయి. ఇప్పుడు మండలాలు తగ్గించారు. అయితే మండలాల సంఖ్య కనీసం 16కు పెంచాలని, మానుకోట తోపాటు మరో రెవె న్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రాజ కీయ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తొర్రూరు రెవెన్యూ డివిజన్ కోసం... కేసముద్రం మండలం ఇనుగుర్తి, మరిపెడ మండలం చిన్నగూడూరు గ్రామాలు మండలాలుగా, తొర్రూరును రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, పారిశ్రామికవాడగా మార్చేందుకు ఇల్లందును కూడా మానుకోటలో చేర్చాలంటూ మానుకోట జిల్లా సాధన కమిటీ తాజా గా డిమాండ్ చేస్తోంది. కొత్తగూడెం నుంచి బయ్యారం, ఇల్లందు మధ్య సుమారు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజ సంపద ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లందును మానుకోట జిల్లాలోనే కలపాలని డిమాండ్ వస్తోంది. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా చేయాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు జిల్లా సాధన కమిటీ నాయకులు మద్దతు తెలిపారు. ఇల్లందు కలపాలని... జిల్లాల పునర్విభజన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ మానుకోటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మరుసటి రోజు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇల్లందును మానుకోట జిల్లాలోనే కలపడంతోపాటు రెవెన్యూ డివిజన్‌గా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్నగూడూరును మండలకేంద్రంగా, మరిపెడను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ మండలఅధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు మానుకోట మండలం వీఎస్.లక్ష్మీపురం, జంగిలిగొండ, సింగారం గ్రామాలను ఇతర మండలాల్లో కలిపే ప్రయత్నాలు చేశార ని ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రామాలు మానుకోట మం డలంలోనే ఉండటంతో ఆందోళన విరమించారు. డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్నగూడూరును మండలకేంద్రం చేసి దాశరథి పేరు పెట్టాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా చేస్తే మానుకోట మండలంలోని కొన్ని గ్రామాలు కలిపే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ఆయా గ్రామాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలవుతాయి. మానుకోట జిల్లా ఏర్పాటులో తొర్రూరు రెవెన్యూ డివిజన్‌గా చేయాలని అన్నిపార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇల్లందును మానుకోట జిల్లాలో కలపాలనేది అందరికీ ఆమోదంగానే ఉంది. -
హన్మకొండ నాలుగు ముక్కలు
పది గ్రామాలతో కాజీపేట మండలం హన్మకొండలో మిగులనున్న ఆరు గ్రామాలు హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేసింది. దాదాపు రాత్రి 11గంటల వరకు డీఆర్వో శోభ, పలువురు తహశీల్దార్లు ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మొత్తంగా సోమవారం వెలువడనున్న ముసాయిదా ప్రకటనలకు కసరత్తు పూర్తి చేశారు. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా హన్మకొండ మండలంలోని పలు గ్రామాలతోపాటు ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ గ్రామాన్ని కలిపి కొత్తగా కాజీపేట కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. చుట్టుపక్కల ఉన్న 10 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటుకానుంది. 10 గ్రామాలు... 1.52లక్షల జనాభా కొత్తగా ఏర్పడబోయే కాజీపేట మండలంలో గతంలో ప్రసుతం హన్మకొండ మండలంలో ఉన్న న్యూశాయంపేట, కాజీపేట, సోమిడి, మడికొండ, తరాలపల్లి, భట్టుపల్లి, కొత్తపల్లి, అమ్మవారిపేట, కడిపికొండ గ్రామాలతో పాటు ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ గ్రామాన్ని కూడా కలుపుతున్నారు. ఆయా పది గ్రామాల మొత్తం జనాభా 1.52,372గా ఉంది. ప్రస్తుతం అధికారులు 2011నాటి జనాభా లెక్కల ప్రకారం మండలాల ఏర్పాటుకు కసరత్తు చేపట్టారు. అయితే, తాజా లెక్కల ప్రకారం జనాభా ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఖిలా వరంగల్‌కు మూడు గ్రామాలు... ప్రస్తుతం హన్మకొండ మండంలోని పైడిపల్లి, ఏనుమాముల, కొత్తపేట రెవెన్యూ గ్రామాలు ప్రస్తుతం ఉన్న వరంగల్ మండలంలో కలుపుతున్నారు. వాస్తవానికి పరిపాలనా పరంగా ఈ గ్రామాలు వరంగల్ మండలానికి సమీపంలో ఉంటాయి. ఈ మూడు గ్రామాల్లో జనాభా సుమారు 30వేల వరకు ఉంటుంది. అలాగే, హన్మకొండ మండలంలోని మామునూరు, నక్కలపల్లి, తిమ్మాపూర్, అల్లీపూర్ గ్రామాలను కొత్తగా ఏర్పడబోయే ఖిలావరంగల్ మండలంలో కలపాలని ప్రతిపాదించారు. ఈ గ్రామాల జనాభా సుమారు 20వేల వరకు ఉంటుంది. ఇక వర్ధన్నపేట మండలం నుంచి కొత్తగా ఏర్పడనున్న ఐనవోలు మండలంలో హన్మకొండ మండలం నుంచి కొండపర్తి, వనమాల కనపర్తి గ్రామాలు కలుపనున్నారు. ఈ రెండు గ్రామాల్లో జనాభా 8,481 ఉంది. అంతేకాకుండా హన్మకొండ మండలంలోని 24 రెవెన్యూ గ్రామాలకు గాను కొత్తగా ఏర్పడబోయే కాజీపేటకు తొమ్మిది గ్రామాలు, ఖిలా వరంగల్‌లోకి నాలుగు, ఐనవోలులోకి రెండు, పాత వరంగల్‌కు మూడు గ్రామాలు కలుపుతున్నారు. దీంతో హన్మకొండ పాత మండలంలో కేవలం ఆరు రెవెన్యూ గ్రామాలు మాత్రమే మిగులుతాయి. ఇలా హన్మకొండ మండలం నాలుగు ముక్కలు కానుంది. అయినా 2.32 లక్షల జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం హన్మకొండ మండల జనాభా 4.32లక్షలుగా ఉంది. అయితే, మండల ఏర్పాటు, విభజనలో మండలంలోని 24 గ్రామాల నుంచి 18 గ్రామాలు విడిపోతాయి. ఇవిపోను హన్మకొండ, వడ్డేపల్లి, కుమార్‌పల్లి, గోపాలపురం, లష్కర్‌సింగారం, పలివేల్పుల రెవెన్యూ గ్రామాలతో హన్మకొండ మండలం మిగులుతుంది. అయినప్పటికీ ఆరు గ్రామాలు, 2.32లక్షల జనాభాతో పాత, కొత్త మండలాల్లో కలిపి జనాభాపరంగా జిల్లాలో హన్మకొండ పెద్ద మండలంగా మిగలనుంది. -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి పలు మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యలవాడ, కొలిమిగుండ్ల, చిప్పగిరి మండలాలు మిన హా 49 మండలాల్లోను వర్షాలు పడ్డాయి. జిల్లా మొత్తంగా 8.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొత్తపల్లి మండలంలో అత్యధికంగా 45.2 మి.మీ., అవుకులో అత్యల్పంగా 1.2 మి.మీ. నమోదైంది. ఆత్మకూరు 35.2, పాములపాడు 25.6, వెలుగోడు 22.4, బండిఆత్మకూరు 21.2, నందికొట్కూరు 20.6, జూపాడుబంగ్లా 20.6, పగడ్యాల 15.0, కర్నూలు 13.6, కల్లూరు 13.6, శ్రీశైలం 13.0, మిడుతూరు 12.4, ఓర్వకల్ 12.4, మహానంది 12.2, గడివేములలో 11.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా మొదటి రెండు రోజుల్లో 14.2 మి.మీ. వర్షం కురిసింది. -
32 మండలాల్లో తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం 32 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి, పెద్ద్పపప్పూరు, శింగనమల, పామిడి, ఆత్మకూరు, విడపనకల్, కణేకల్లు, బెళుగుప్ప తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. -
తెలంగాణలో 231కరువు మండలాలు
హైదరాబాద్: కరువు మండలాల నివేదికను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి మంగళవారం పంపింది. తెలంగాణలో మొత్తం 231 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్ మండలాల్లో వర్షాపాతం ఆశాజనకంగానే ఉన్నందున ఆ జిల్లాల్లో పెద్దగా కరువు ఏర్పడలేదని, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పూర్తిగా కరువు పరిస్థితులుండగా కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పాక్షింగా కరువు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం రాష్ట్రానికి వెయ్యి కోట్ల రూపాయల సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాను పూర్తి కరువు జిల్లాలుగా నివేదికలో పేర్కొన్నారు. కరువు మండలాల సంఖ్య జిల్లాలవారీగా: మహబూబ్‌నగర్ 66, మెదక్ 46, నిజామాబాద్ 36, రంగారెడ్డి 33, కరీంనగర్19, నల్లగొండ 22, వరంగల్ 11