జిల్లా వ్యాప్తంగా వర్షాలు
Published Wed, Aug 3 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
కర్నూలు(అగ్రికల్చర్):
జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి పలు మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యలవాడ, కొలిమిగుండ్ల, చిప్పగిరి మండలాలు మిన హా 49 మండలాల్లోను వర్షాలు పడ్డాయి. జిల్లా మొత్తంగా 8.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. కొత్తపల్లి మండలంలో అత్యధికంగా 45.2 మి.మీ., అవుకులో అత్యల్పంగా 1.2 మి.మీ. నమోదైంది. ఆత్మకూరు 35.2, పాములపాడు 25.6, వెలుగోడు 22.4, బండిఆత్మకూరు 21.2, నందికొట్కూరు 20.6, జూపాడుబంగ్లా 20.6, పగడ్యాల 15.0, కర్నూలు 13.6, కల్లూరు 13.6, శ్రీశైలం 13.0, మిడుతూరు 12.4, ఓర్వకల్ 12.4, మహానంది 12.2, గడివేములలో 11.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మి.మీ. ఉండగా మొదటి రెండు రోజుల్లో 14.2 మి.మీ. వర్షం కురిసింది.
Advertisement
Advertisement