సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
రాష్ట్రంలో తీవ్ర కరువు మండలాలు
అనంతపురం జిల్లా: నార్పల, అనంతపురం
శ్రీసత్యసాయి జిల్లా: తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల
అన్నమయ్య జిల్లా: గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, టి సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురుబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.
చిత్తూరు జిల్లా: పెనుమూరు, యాదమర్రి, గుడిపాల.
కరువు మండలాలు
కర్నూలు జిల్లా: కౌతాలం, పెద్దకడుబూరు
అనంతపురం జిల్లా: విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు
శ్రీసత్యసాయి జిల్లా: కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి.
చిత్తూరు జిల్లా: శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం.
Comments
Please login to add a commentAdd a comment