Drought Zone Report
-
AP: 54 కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్భిక్షం మొదలైంది. వర్షాలు లేక, పంటలు పండక ఐదు జిల్లాల్లో కరువు తాండవించినట్లు ప్రభుత్వమే తేల్చింది. రాష్ట్రంలోని 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో నంబరు 15 జారీచేసింది. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. 27 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. కలెక్టర్లు ఆయా జిల్లా గెజిట్లలో కరువు మండలాలను నోటిఫై చేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. రాష్ట్రంలో తీవ్ర కరువు మండలాలు అనంతపురం జిల్లా: నార్పల, అనంతపురం శ్రీసత్యసాయి జిల్లా: తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల అన్నమయ్య జిల్లా: గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, టి సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురుబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె.చిత్తూరు జిల్లా: పెనుమూరు, యాదమర్రి, గుడిపాల.కరువు మండలాలు కర్నూలు జిల్లా: కౌతాలం, పెద్దకడుబూరుఅనంతపురం జిల్లా: విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు శ్రీసత్యసాయి జిల్లా: కనగానిపల్లి, ధర్మవరం, నంబుల పులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి.చిత్తూరు జిల్లా: శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం. -
కనికరం ‘కరువు’
సాక్షి, అమరావతి: రైతులపై ఈ సర్కారు కాస్తయినా కనికరం చూపడం లేదు. కళ్లెదుట కనిపిస్తున్న కరువుకు పరదా కప్పేసింది. ప్రభుత్వ వాతావరణ శాఖ అధికారిక గణాంకాల ప్రకారమే 395 మండలాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. సాధారణం కంటే తక్కువ వర్షం కురిసినందున రాష్ట్రంలో 395 మండలాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తేల్చి చెబుతుండగా, ప్రభుత్వం 275 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. మిగిలిన 120 మండలాలు ‘పచ్చ’గా ఉన్నట్లు నివేదికల్లో చేర్చేసింది. కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే ఈ 120 మండలాల్లోనూ పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలనే రకరకాల నిబంధనలు పేరిట 120 మండలాలను కరువు జాబితాలో చేర్చలేదు. ఏటా ఇదే తంతు కరువు బారిన పడిన రైతాంగాన్ని ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కరువు మండలాలను పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడం, పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగ్గొట్టడం చంద్రబాబు సర్కారుకు అలవాటే. 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.2,350 కోట్ల మేర పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగవేశారు. 2015లో దుర్భిక్ష మండలాలను సగానికి కుదించారు. 2016లోనూ అలాగే చేశారు. 2017 ఖరీఫ్‌లో పంటలన్నీ ఎండిపోయినా సెప్టెంబర్, అక్టోబర్‌లో అల్పపీడనాల వల్ల కురిసిన వర్షాన్ని లెక్కలోకి తీసుకుని కరువు లేదని ప్రకటించడం ద్వారా రైతులను దగా చేశారు. 2017 రబీలో 350 మండలాల్లో వర్షపాతం లోటు ఉన్నా 121 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. పడిపోయిన సాగు విస్తీర్ణం ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్, జూలై నెలల్లో ఏడు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. ఇందులో గుంటూరు జిల్లా కూడా ఉంది. గుంటూరు జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో వర్షాభావ పరిస్థితులున్నా ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చలేదు. జూన్, జూలై నెలల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆరు జిల్లాల్లో 275 కరువు మండలాలను ప్రకటించినట్లు ప్రభుత్వం ఈ నెల 8న జారీచేసిన జీవోలో పేర్కొంది. అనంతపురం జిల్లాలో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉండగా, 44, కర్నూలు జిల్లాలో 54 మండలాలకు గాను 37, చిత్తూరులో 66 మండలాలకు గాను 58 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది లక్ష్యం కాగా.. 9.6 లక్షల ఎకరాల్లోనే సాగైంది. 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది ఇదే కాలంలో సాగు విస్తీర్ణం 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 2016తో పోల్చితే ఈ ఏడాది 5.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు తగ్గిపోవడం కరువు తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో సాధారణంగా 247.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 215.5 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. రైతాంగాన్ని ఆదుకోవాలి ‘‘రాష్ట్రంలో దుర్భిక్షం తీవ్రత కళ్లకు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కరువు మండలాలను ప్రకటించకపోవడం దారుణం. రైతాంగాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన సర్కారు ఇలా కరువును దాచేయడం ఏమాత్రం సమంజసం కాదు’’ – నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు -
పోలవరం ప్రాజెక్టు ఒక దోపిడి కార్యక్రమం : నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఎప్పుడున్నా తీవ్ర కరువు వస్తుందని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కేంద్ర కార్యలయంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉందని, వర్షపాతం మైనస్‌లో నమోదయిందని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అసలు సరిగ్గా వర్షాలే కురవలేదని తెలిపారు. కరువు మండలాల ప్రకటనలో కూడా వంచన చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు. కరువు మండలాలకు లాభం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రెయిన్ గన్ పేరుతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దోపిడీ చేశారని ఆరోపించారు. పట్టిసీమ నీళ్లు కృష్ణ డెల్టాకే సరిపోవని, రాయలసీమను పట్టి సీమతో సస్యశ్యామలం చేస్తామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవ విషయాలని రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా దోపిడి కార్యక్రమం చేపడుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించి స్పెషల్ ప్యాకేజి ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. -
కరువు మండలాల నివేదికను మా ముందుంచండి
* తెలంగాణ సర్కారుకు ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు * విచారణ రెండు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు సంబంధించి కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. అలాగే కరీంనగర్ జిల్లాలో కరువు మండలాల ప్రకటనకు అనుసరించిన విధానం ఏమిటో కూడా స్పష్టం చేయాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలో 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ చేసిన సిఫారసులను పట్టించుకోకుండా 19 మండలాలనే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. దీనిని సవాలు చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ దిలీప్ బి బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ శాశ్వత నీటి సదుపాయాలున్న కారణంతో జిల్లాలో పలు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించలేదన్నారు. జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని తాము వినతి పత్రం సమర్పించామని, దానిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందించి, కరువు మండలాల ప్రకటనకు అనుసరిస్తున్న విధానం ఏమిటని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది జీవీ భాస్కర్‌రెడ్డి సమాధానమిస్తూ కరువు మండలాల ప్రకటనకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత కమిటీ కరువు మండలాలను ప్రకటించిందన్నారు. ఇందుకు సంబంధించి కమిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఆ నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.