– జిల్లా యంత్రాంగం ప్రతిపాదించిన మండలాలు 38
–రుద్రవరం, దొర్నిపాడుకు మొండిచేయి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా యంత్రాంగం 38 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఈనెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం రుద్రవరం, దొర్నిపాడు మండలాలను మినహాయించి మిగిలిన 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ జీఓ 9 విడుదల చేసింది. సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాలు, ఆగస్టులో వర్షాభావంతో అత్యధిక డ్రైస్పెళ్లు ఉన్న మండలాలు, సాధారణ సాగు కంటే 50 శాతం తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగైన మండలాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించింది. త్వరలోనే ఈ మండలాల్లో పంట నష్టంపై సర్వే నిర్వహించే అవకాశం ఉంది.
కరువు మండలాలు ఇవే..
పెద్దకడుబూరు, హొళగుంద, ఆలూరు, శిరివెళ్ల, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండిఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, గోస్పాడు, కోయిలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని.